AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 14 January 2022

Off line Antava Online Antava Baby

ఊ అంటావా మావ ఊహు అంటావా మావ పేరడీ పాట 
ఆన్ లైన్ అంటావా మావ ఆఫ్ లైన్ అంటావా మావ  

 

మన పల్లెలు మనకు నేర్పిన జీవిత పాఠాలు

 😘మన పల్లెలు మనకు నేర్పిన జీవిత పాఠాలు..🥰


   😊పొలం గట్లపై నడిపించి, తడబడకుండా      నిలదొక్కుకోవటం  నేర్పింది.


  👉 అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు  పాడై పోతే, నష్టాలకు నిలదొక్కుకునే స్థైర్యం నేర్పింది.


🙏వాగు పక్కన నీటి  చెలిమలు తీయించి,

శోధించే తత్వం నేర్పింది.


👉సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,

అన్వేషణ నేర్పింది.


👏తుమ్మ ముల్లు, పల్లేరు గాయల గుచ్ఛులతో,

జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.


👏వేరుశనగ కాయ కొట్టించి, సోలెడు పల్లీలు  తీయించి, ఐదు పైసల సంపాదన నేర్పింది.


🐂ఆవులతో, 🐃గేదెలతో, 🐓కోళ్లతో స్నేహం🐔 చేయించి,

😘ప్రాణికోటి పై బాధ్యత పెంచింది,  

                 ప్రేమతత్వాన్ని నేర్పింది.


👏రాగడి  మట్టితో బండి గిర్రలు చేయించి, 

మొక్కజొన్న సొప్ప బండ్లకు తొడిగించి,

పనితనం నేర్పింది.


👉వేలాడే పిచ్చుక గూళ్ళు, చెట్ల కొమ్మల పంగల మధ్య కొంగ గూళ్ళు చూపించి

బొమ్మరిల్లు కట్టించి, చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పింది.🕊️


🙋బతుకమ్మ తంగేడు, గానుగు పూల కోసం,

తెల్లవారుతూనే  పొలం బాట పట్టించి,

ఇంటి ఆడబిడ్డల బాధ్యతను నేర్పింది.


🤗పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే,

నల్లాలం  ఆకు పసరు పోయించి,

చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది.


👌చెట్టుమీద మామిడికాయ

గురిచూసి కొట్టడం,  లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది.


 👉నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి, జీవితమంటే బరువు కాదు,

 బాధ్యత అని నేర్పింది.


👉బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి,

బాలన్స్ గా బరువు లాగటం నేర్పింది.


😘ఇంటి ముంగిటకు  అతిథి దేవతలు

హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,

ఉన్న దాంట్లో కొంత  పంచుకునే గుణం నేర్పింది,


👉ఇసుకలో పిట్ట గూళ్ళు కట్టించి,

ఒక ఇంటి వాడివి కావాలి అనే స్పృహను నింపింది.


👏పచ్చపచ్చని నిగనిగలాడే మోదుగాకుల  విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే ఒద్దికను నేర్పింది.


😋మోదుగాకులు తెంపించి, ఎండబెట్టించి, 

కట్టలు కట్టించి, విస్తరాకులు కుట్టించి,

అతిథులకు ఎంగిలి కాని పాత్రల్లో భోజనం వడ్డించడం నేర్పింది.


😊ఉన్న ఒక్క పిప్పర్మెంట్ ను, అంగీ బట్ట వేసి, కొరికి ముక్కలు చేసి, కాకి ఎంగిలి పేరుతో దోస్తులతో పంచుకోవటం నేర్పింది.


👉ముళ్ళు గుచ్చుకోకుండా,  ఒక్కటొక్కటిగా రేగ్గాయలు తెంపే ఓర్పును నేర్పింది.


🤗ఎండా కాలంలో తుమ్మ చెట్ల బంక సేకరణ,

స్వయం సంపాదన ధోరణి నేర్పింది.


💕గోరింటాకు ని తెంపించి, దంచించి, చేతులకు అద్దించి, వికసించడం చూపించింది.


🤗వాయిలి బరిగెలతో, సుతిలి దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ మెళకువలు నేర్పింది.


😘అత్తా, మామా, అన్నా  వదినా,  అమ్మమ్మా, నాయినమ్మా, తాతయ్యా వరుసలతో, ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.


🙏ధైర్యంగా  బ్రతికే  పాఠాలను నేర్పిన

మా ఊరుకు పల్లెకు మేము జీవితాంతం బుుణపడి ఉంటాం.


😘నేను గ్రామం లో (పల్లెలో) పుట్టి పెరిగాను అని చెప్పటానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా......

Friday, 23 April 2021

తెలుగు జోక్స్ Telugu Jokes 😂😂😂😂😂😂

AIMS Q FREE Study Materials


https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1


https://t.me/AIMSDARETOSUCCESS


www.aimsdaretosuccess.blogspot.com


www.aimsdts.blogspot.com


aimsdts.teachmint.in


aimsdaretosuccess@gmail.com


😂😂😂😂😂😂తెలుగు జోక్స్ Telugu Jokes 😂😂😂😂😂😂









సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు,కానీ మనం(జింకలు) 21రోజులు బ్రతకగలం.

అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి..
సింహం ఒకసారి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం.అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .

కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి. చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .

పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .

అయితే ఆ జింకల్లో తెలివైన కుర్ర జింక ఒకటుంది. 
దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.

జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.
ఎటు ఆలోచించినా. ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.

ఈ సింహం ఆహారం లేకుండా
14 రోజులు మాత్రమే బ్రతక గలదు. 
కానీ మనం 21రోజులు బ్రతకగలం.

కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.

ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.

జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.

పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది. ఇందులో ఉన్న #నీతి ఏంటి
కొంతకాలం వరకు మనము జాగ్రత్తలు పాటిస్తు ఇంట్లోనే ఉంటే కరోనా రక్కసి నుండి
సురక్షితంగా ఉంటాము. అందరం అనందంగా జీవించవచ్చు.

ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా.. 
అందుకే..
మాస్క్ ధరించండి
ఇంట్లోనే ఉండండి
అదే నీకు శ్రీరామ రక్ష

మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా...???
Please stay home stay safe.  🙏🏻🙏🏻






🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒


నిన్న రాత్రి కరెంట్ పోయిందని కొవ్వొత్తి🕯️ వెలిగించా...

కొంచెం సేపు తరువాత, కరెంట్💡 వచ్చింది కదా అని ఉఫ్ ఉప్ అని మూడుసార్లు ఊదాను... ఎంత ఊదినా కొవ్వొత్తి🕯️ ఆరలేదు...


ఒక్కసారిగా ఉద్రిక్తతకు లోనయ్యాను... "ఓరి బాబోయ్... Oxigen💨 levels పడిపోయాయా" అని...?


కిచెన్ లోనుండి హాల్ లోకి వచ్చిన మా ఆవిడ🤦‍♀️ " ముందు మూతికి ఉన్న మాస్క్ తీయండి మహాప్రభో"....👩‍🍳 అంది....😜