AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 27 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 27


*🌎చరిత్రలో ఈరోజు/అక్టోబర్ 27*🌎

*▪అక్టోబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 300వ రోజు (లీపు సంవత్సరములో301వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 65 రోజులు మిగిలినవి.▪*

*🕘సంఘటనలు*🕘

*🌹1920: భారత పదవ రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ కేరళ లోని ఉఝవూరులో జన్మించాడు*

*🌹.1961: అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది1971: కాంగో దేశం పేరు "రిపబ్లిక్ ఆఫ్ జైర్"గా మార్చబడింది.*

*❤జననాలు❤*

*♦1542: అక్బర్‌, మొఘల్ చక్రవర్తి. (మ.1605)*

*♦1728: ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జన్మించాడు*

*♦.1858: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919)*

*♦1904: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర్య సమరయోధుడు మరియు విప్లవవీరుడు. (మ.1929)*

*♦1920: కె.ఆర్. నారాయణన్, భారత రాష్ట్రపతి. (మ.2005)*

*♦1936: పర్వతనేని ఉపేంద్ర, ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చేపట్టి (1989 - 1990) సమర్ధవంతంగా నిర్వహించాడు.*

*♦1939: చలసాని ప్రసాదరావు, ప్రముఖ రచయిత, చిత్రకారుడు. (మ.2002)*

*🍃మరణాలు🍃*

*🌷1795: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (జ.1774)*

*🌷1914: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు,   కవీంద్రుడు ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి.*

*🌷1940: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ1901)*

*🌷1986: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (జ.1905)*

*🌹పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*♦పదాతి దళ దినోత్సవం*

*♦.శిశు దినోత్సవం.*

*♦GK BITS*♦

*1.1885 లో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఏ కళాశాలలో జరిగింది?*
*2.ఎప్సమ్ రసాయన నామం?*
*3.పింగాణీ వస్తువుల గురించివివరించే శాస్త్రాన్ని ఏమంటారు?*
*4.ముందుకు వెనుకకు ఎగరగల ఒకేఒక పక్షి?*
*5.కాంతి వేగాన్ని ఎవరు కనుగొన్నారు?*
*6.టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడు ఎవరు?*
*7.ప్రపంచంలో పొడవైన నదీ వంతెన ఏది?*
*8.మనదేశంలో అతి పెద్ద బ్యాంక్ ఏది?*
*9.మొక్కలకు కూడా ప్రాణం ఉందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు?*
*10.మొక్కల పెరుగుదలను గుర్తుంచే పరికరం పేరు?*

*జవాబులు.*

1.గోకులదాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాల (ముంబై)
2.మెగ్నీషియం సల్ఫేటు(MG SO4 7H20)
3.సిరామిక్స్
4.హమ్మింగ్ బర్డ్
5.ఎ ఎ మిచెల్ సన్
6.హర్భజన్ సింగ్
7.పాట్నా వద్ద గంగానది పై నిర్మించిన మహాత్మాగాంధీ సేతు
(5.57km)
8.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
9.జగదీష్ చంద్రబోస్
10.క్రేస్కోగ్రాఫ్.

*చక్రవాతాలు (లేదా) తుపానులు*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ట్రోపో ఆవరణంలో సంభవించే అతి తీవ్రమైన వాతావరణ అలజడులనే చక్రవాతాలు లేదా తుపానులు అంటారు. ఇవి ఏర్పడే ప్రాంతాలను బట్టి, వీటిని రెండు రకాలుగా విభజిస్తారు. అవి.. ఆయనరేఖా చక్రవాతాలు. సమశీతోష్ణ మండల లేదా వాతాగ్ర చక్రవాతాలు. ఆయనరేఖా చక్రవాతాలు.. ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో 5 నుంచి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య సముద్ర ప్రాంతాల్లో సంభవిస్తాయి. సమశీతోష్ణ మండల చక్రవాతాలు.. 40 నుంచి 60 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో ఖండ, సముద్ర భాగాలపై ఏర్పడతాయి. సముద్రాలపై ఏర్పడిన ఆయనరేఖా చక్రవాతాలు తీరాన్ని దాటి, ఖండాల మీదకు ప్రయాణించినప్పుడు వేగంగా బలహీన పడతాయి. ఆయనరేఖా చక్రవాతాలతో పోల్చితే సమశీతోష్ణ మండల చక్రవాతాల విస్తీర్ణం చాలా ఎక్కువ. ఇవి 400 నుంచి 1000 కిలోమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. సమశీతోష్ణ మండల చక్రవాతాలు.. పశ్చిమ పవనాల ప్రభావం వల్ల పశ్చిమం నుంచి తూర్పునకు ప్రయాణిస్తాయి. నిర్దిష్టమైన గమన మార్గాలుండటం వల్ల సమశీతోష్ణ మండల చక్రవాతాలను తేలికగా పసిగట్టవచ్చు. ఇవి ప్రధానంగా అమెరికా, వాయువ్య, పశ్చిమ ఐరోపాల శీతోష్ణస్థితిని విశేషంగా ప్రభావితం చేస్తాయి. ఇవి ఏడాదంతా ఏర్పడినప్పటికీ.. శీతాకాలంలో మాత్రం బలంగా ఉంటాయి. అందువల్ల అమెరికా, వాయవ్య ఐరోపాలో శీతాకాలం శీతోష్ణస్థితి సంక్షుభితంగా ఉంటుంది.
ఆయనరేఖా చక్రవాతాలు:
ఆయనరేఖా చక్రవాతాల పవనాలు గంటకు 120 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. వీటికి నిర్దిష్ట గమన మార్గాలుండవు. కాబట్టి వీటిని పసిగట్టడం చాలా కష్టం. ఉదాహరణకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆయనరేఖా చక్రవాతాలు వివిధ దిశల్లో ప్రయాణిస్తాయి. నాగపట్నం వద్ద తీరాన్ని దాటుతుందనుకున్న వాయుగుండం..వేగంగా దిశను మార్చుకుంటూ..ఒడిశా, పశ్చిమ బెంగాల్‌వైపు ప్రయాణించి చివరకు బంగ్లాదేశ్ తీరాన్ని దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనరేఖా చక్రవాతాలను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు అవి...
కరేబియన్ సముద్రం
- హరికేన్లు
దక్షిణ చైనా సముద్రం - టైఫూన్లు
ఆస్ట్రేలియా తీరం - విల్లీ విల్లీ
ఫిలిప్పైన్ సముద్రం - బాగీలు
జపాన్ సముద్రం - కైఫూలు
బంగ్లాదేశ్ తీరం - గురింద్‌లు
భారత తీరం - తుపానులు/చక్రవాతాలు

వాతాగ్ర చక్రవాతాలు:
ఆయనరేఖా, సమశీతోష్ణ మండల చక్రవాతాల నిర్మాణం, ఆవిర్భావ ప్రక్రియలో గుణాత్మక వ్యత్యాసం ఉంది. ఉన్నత అక్షాంశాల్లో వీచే శీతల, శుష్క తూర్పు పవనాలు.. మధ్య అక్షాంశాల్లో వీచే కహోష్ణ, ఆర్థ్ర పశ్చిమ పవనాలతో అభిసరణం చెందటం వల్ల సరిహద్దు మండలాల్లో వాతాగ్రాలు ఏర్పడతాయి. ఈ వాతాగ్ర మండలం వెంబడి శీతల తూర్పు పవనాలు-కహోష్ణ పశ్చిమ పవనాల మధ్య శక్తి మారకం జరుగుతుంది. శక్తి మారకం సందర్భంగా వాతాగ్రాల వెంబడి చక్రవాతాలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని వాతాగ్ర చక్రవాతాలని కూడా పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రత, ఆర్థ్రత కలిగిన వాయురాశులు.. చాలినంత కొరియాలిస్ బలం ఉన్న ప్రదేశాల్లో.. ఆయనరేఖా చక్రవాతాలు ఏర్పడతాయి. కనీసం 20 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత ఉన్న ఆయనరేఖా సముద్ర వాయురాశుల వల్ల ఈ చక్రవాతాలు సంభవిస్తాయి. భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల ఉత్తర-దక్షిణ అక్షాంశాల ప్రాంతంలో సముద్ర భాగాలపై ఆర్థ్ర వాయురాశులున్నప్పటికీ... కొరియాలిస్ బలాలు చాలినంతగా లేకపోవడంతో చక్రవాతాలు ఏర్పడవు. 30 డిగ్రీల ఆవలి ప్రాంతాల్లో.. ఉష్ణోగ్రత చాలినంతగా లేకపోవడం, వాయురాశుల ఆర్ధ్రత తక్కువగా ఉండటంతో చక్రవాతాలు సంభవించవు.
బలమైన గాలులు:
చక్రవాతాలను నిర్మాణపరంగా పరిశీలిస్తే.. సమశీతోష్ణ మండల చక్రవాత ప్రాంతమంతా అలజడితో కూడిన వాతావరణం ఉంటుంది. అధిక వర్షపాతం, బలమైన గాలులు వలయాకారంలో వీస్తుంటాయి. ఆయనరేఖా చక్రవాతాల కేంద్ర భాగాన్ని ‘నేత్రం’ (eye) అని అంటారు. నేత్ర భాగంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బాహ్య నేత్రకుడ్య ప్రాంతంలో వాతావరణం అత్యంత సంక్షుభితంగా ఉంటుంది. క్షితిజ సమాంతర తలంలో ఆయనరేఖా చక్రవాతం శంఖం రూపంలో ఉంటుంది. ఇది సముద్రమట్టం నుంచి సుమారు 7 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది.
వర్షాలు.. విధ్వంసం:
బంగాళాఖాతంలో స్థానికంగా ఏర్పడే అల్పపీడన ద్రోణులు.. క్రమంగా బలపడి, వాయుగుండాలుగా మారి.. చివరకు చక్రవాతాలవుతాయి. నవంబర్, డిసెంబర్‌లలో సగటున 4-5 తుపానులు భారతదేశ తూర్పు తీరాన్ని తాకుతాయి. వీటి ప్రభావం వల్ల తూర్పు తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. విధ్వంసాన్నీ సృష్టిస్తాయి. భారతదేశం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాల్లో.. ఆయనరేఖా చక్రవాతాలు ముఖ్యమైనవి. చక్రవాతం ఒక ప్రాంతాన్ని సమీపిస్తున్నప్పుడు.. ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా పీడనం క్షీణిస్తుంది. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఒక్కసారిగా పవన దిశలు మారిపోతాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణులు.. క్రమంగా వాయుగుండాలు, చక్రవాతాలుగా రూపొందటాన్ని.. ఇన్‌శాట్ ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. వాతావరణ నిపుణులు వీటి గమన దిశలను నిరంతరం అంచనా వేస్తూ... ఇవి ఎక్కడ, ఎప్పుడు తీరాన్ని  దాటే అవకాశముందో వివరిస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తారు....

ఈ రోజు జికె

*1⃣ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నేపాల్‌కు 340 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన దేశం ఏది..?*

✅ *భారత్ (ఈ రుణంతో నేపాల్‌లో మహాలాకీ వంతెనతో పాటు 15 కొత్త రోడ్లను నిర్మిస్తారు)*

*2⃣ ప్రసూతి, నవజాత శిశువుల మరణాలు తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన కార్యక్రమంలో ఇటీవల చేరిన దేశం ఏది..?*

✅ *భారత్ (ప్రసూతి, నవజాత శిశువుల మరణాలు తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 2030 నాటికి ఈ తరహా మరణాల్లో నివారించగలిగే వాటిని పూర్తిగా అడ్డుకోవాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. కాగా ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు మరో 9 దేశాలు చేరాయి)*

*3⃣ వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రైలుని ఎక్కడ ప్రారంభించారు..?*

✅ *న్యూఢిల్లీ (న్యూఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి సైన్స్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక రైలుని ప్రారంభించారు. ఇది 7 నెలల పాటు దేశమొత్తం తిరిగి వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది)*

*4⃣ ఇండియన్ సీడ్ కాంగ్రెస్ - 2017 ఎక్కడ జరిగింది..?*

✅ *కోల్‌కత్తా (సీడ్ ఆఫ్ జాయ్ అనే థీమ్‌తో కోల్‌కత్తాలో ఇండియన్ సీడ్ కాంగ్రెస్ 2017ను కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ నిర్వహించాయి)*

*5⃣ పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది..?*

✅ *కేరళ (పెరియార్ టైగర్ రిజర్వ్‌లోని శబరిమలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుని ఏర్పాటు చేయనున్నారు)*

*6⃣ భారతీయ పనోరమ చిత్రోత్సవాలను ఎక్కడ నిర్వహించారు..?*

✅ *పోర్ట్ బ్లెయిర్(పోర్ట్ బ్లెయిర్‌లో ఫిబ్రవరి 15 నుంచి ఐదు రోజుల పాటు భారతీయ పనోరమ చిత్రోత్సవాలు జరిగాయి. అండమాన్ అండ్ నికోబార్ టూరిజం శాఖ, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించాయి)*

*7⃣ ఇటీవల ఏ రాష్ట్రంలో కాలిమ్ పోంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు..?*

✅ *పశ్చిమ బెంగాల్ (పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాను విభజించి కాలిమ్ పొంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా అభివృద్ధి కోసం రూ.220 కోట్లతో కాలిమ్ పోంగ్ నుంచి సిక్కింకు రహదారిని నిర్మించనున్నారు)*

*8⃣ ఇటీవల ఏ రాష్ట్రం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించింది..?*

✅ *హర్యానా (పంజాబ్ ఎక్సైజ్ చట్టం 1914 ప్రకారం హర్యానాలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానాన్ని నిషేధించారు)*

*9⃣ యునెస్కో ప్రకృతి ఉత్సవాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు..?*

✅ *హిమాచల్ ప్రదేశ్ (యునెస్కో, వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో హిమాచల్ ప్రదేశ్‌లోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కులో ఫిబ్రవరిలో ప్రకృతి ఉత్సవాలను నిర్వహించింది).