AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 21 January 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 5 2018

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅జనవరి 5 2018🌅*

*🏞సంఘటనలు*🏞

1896: విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.

1940: FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది.

1914: ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్, తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు.

1957: భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.

1971: మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.

2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.

*🌻🌻జననాలు*🌻🌻

1592: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (మ.1666)

1893: పరమహంస యోగానంద, భారతదేశంలో ప్రముఖ గురువు. (మ.1952)

1902: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)

1927: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002)

1936: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)

1942: వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత. (మ.2011)

1955: మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.

1973: ఉదయ్ చోప్రా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.

1986: దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి.

*🌹🌹మరణాలు*🌹🌹

1531: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483)

1985: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)

2007: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)

2015: గణేష్ పాత్రో, ప్రముఖ నాటక, సినీ రచయిత. (జ.1945)

*🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷

🔻(అమెరికా) జాతీయ పక్షి దినోత్సవం.

 *🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  5, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(నిన్న రాత్రి 9 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 6 ని॥ వరకు)
నక్షత్రం : మఖ
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 56 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 18 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : బవ
వర్జ్యం :
(ఈరోజు సాయంత్రం 3 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 36 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం :
(ఉదయం 9 గం॥ 0 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 44 ని॥ వరకు)(ఉదయం 12 గం॥ 42 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 26 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 10 గం॥ 57 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 20 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 8 గం॥ 10 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 33 ని॥ వరకు)
యమగండం :
(సాయంత్రం 3 గం॥ 7 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 47 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : సింహము
విశేషం : ఏకాదశి ఉపవాసం

*🤘 నేటి సుభాషితం🤘*

*ఆశించి జీవించే వ్యక్తి లో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తి లో ఆత్మీయత ఉంటుంది.*

*💎 నేటి ఆణిముత్యం 💎*

సన్నుత కార్యదక్షుఁ డొకచాయ నిజప్రభ యప్రకాశ మై
యున్నపుడైన లోకులకు నొండొక మే లొనరించు సత్వసం
పన్నుఁడు భీముఁ డాద్విజుల ప్రాణము కావఁడె ఏకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా! 

*భావం:*

గొప్పబలము గల కార్యశూరుడు స్వాభావికమైన తన తేజము తరిగి ఒకచోట ఉన్ననూ, పరోపకారము గల పనులలో వెనకడుగు వేయడు. పూర్వము ఎకచక్రపురమున తన క్షాత్రధర్మమును వదలి బిచ్చమెత్తుకొని తినుచుండియూ భీముడు బకాసురుని చంపి, ఆ ఊరి బ్రాహ్మణులకు మేలు చేకూర్చెను కదా!

 *✍🏼 నేటి కథ ✍🏼*

*డాం డాం డాం*

 చిత్తూరుజిల్లా యాసలో ఉన్న ఈకథను మీరూ ఇష్టపడతారని భావిస్తూ....

ఒక ఊళ్ళో ఒక కోతంట. ఆ కోతి కొండమీదికి ఎక్కుతావుంటే తోకలోకి ఒక ముల్లు గుచ్చుకుందంట. అప్పుడా కోతి ఊళ్ళోకి వచ్చిందంట. అప్పుడొక వేటగాడు ఒక కత్తి ఎత్తుకుని పోతావుంటే, ఆ కోతి వేటగాడి దగ్గరకిపోయి "నాకు ముల్లు తీయవా?" అని అడిగిందంట.

అప్పుడు వాడు ముల్లు తీసెయ్యడానికని ప్రయత్నిస్తే, దాని తోక తెగిపోయిందంట. అప్పుడా కోతి, వేటగాడితో "నాకు నా తోకిస్తావా, లేక నీ కత్తిస్తావా?" అని అడిగిందంట. అప్పుడు ఆ వేటగాడు కత్తినిచ్చేశాడంట.

కోతి, కత్తెత్తుకుని పోతావుంటే, ఒక అక్క చేత్తోనే కట్లించుతా కనబడిందంట. "ఎందుకక్కా కట్టెలను చేత్తో ఇంచుతావున్నావు?. కత్తుంది ఇద్దో తీసుకో. తీసుకొని దీంతో‌ కట్లు నరుక్కో" అని కత్తిచ్చిందంట.

ఆ అక్క కత్తితో కట్లు నరుకుతావుంటే కత్తిశీల పూడ్చిందంట.
అప్పుడు కోతి ఆ అక్కతో "నా కత్తిస్తావా, లేక నీ కట్లిస్తావా?" అని అడిగిందంట.
అప్పుడా అక్క కోతికి కట్లిచ్చేసిందంట.

కోతి ఆ కట్టెలను తీసుకొని పోతావుంటే, ఒక అవ్వ పొయ్యిలో కాగితాలుపెట్టి దోసలు కాలుస్తా కనబడిందంట. చూసిన కోతి, "ఎందుకవ్వా కాగితాలు పెట్టి కాలుస్తున్నావు? ఇవిగో ఈ కట్లు తీసుకుని కాల్చుకో" అని కట్లిచ్చిందంట.

ముసలమ్మ దోసెలన్నీ కాల్చేపాటికి కోతి తనకిచ్చిన కట్టెలన్నీ అయిపోయాయంట. అప్పుడు కోతి ఆ అవ్వతో, "నా కట్లిస్తావా? లేక నీ దోసెలిస్తావా?" అని అడిగిందంట.

అవ్వ కోతికి దోసెలు ఇచ్చిందంట.
దోసెలు తీసుకుని పోతున్న కోతికి మడకను దున్నే ఒక అన్న ఆకలిగొని నీరసంగా కనిపించాడంట. "ఇవిగో ఇవి తినన్నా" అని ఆ కోతి అతనికి దోసెలిచ్చిందంట. అతనేమో ఆకలితో ఉండి దోసెలన్నీ తినేశాడంట.
అప్పుడు కోతి "నా దోసెలిస్తావా, లేక నీ మడకిస్తావా?" అని ఆ అన్నను అడిగిందంట.

అన్న మడకిచ్చేసినాడంట. మడకను తీసుకుని ఒకచోట పెట్టిందంట కోతి. దావంట బొయ్యే చాకలాయన దొందురుకుని పడితే, మడక ఇరిగిపోయిందంట. "నా మడకనిస్తావా, లేక నీ తొట్టిబాననిస్తావా?" అని అడిగిందట. "సరే, నీతో నాకెందుకు?" అని చాకలాయన దానికి బాననిచ్చేశాడంట.

తొట్టిబాననుకూడా తీసుకుని పోతావుంటే దానికి ఒకచోట చేతుల్తో పూలతోటకు నీళ్లుపోస్తున్న మనుషులు కనిపించారంట. అప్పుడది "ఎందుకన్నా, చేతుల్తో నీళ్లు పోస్తున్నారు? ఇదిగో ఈ బానతో పోసుకోండ"ని వాళ్లకు ఆ బానను ఇచ్చిందంట.

బాన తీసుకుని పూల తోటకునీళ్ళు పోస్తుంటే ఆ బానకు చిల్లు పూడ్చిందంట. అప్పుడు కోతి నాబానిస్తావా లేక నీ పూలిస్తావా?" అని అడిగిందంట.
"పూలే తీసుకొమ్మ"ని కాసిన్ని పూలిచ్చారంట వాళ్లు.

పూలను తీసుకుని పోతున్న కోతికి , తలలో పూలు లేకుండా పోతున్న ఒక పెళ్లి కూతురు కనిపించిందంట. అప్పుడు కోతి "ఓ పెళ్లికూతురా! ఎందుకట్లా పూలు పెట్టుకోకుండానే పోతున్నావు, ఇవిగో పూలు తీసుకో"మని ఆమెకు పూలిచ్చిందంట. పెళ్లికూతురు పూలు పెట్టుకున్నాక ఆ పూలన్నీ వాడిపోయాయంట.
అప్పుడా కోతి, అక్కడే ఉన్న డప్పునెత్తుకొని,

*"కాలు పోయి కత్తొచ్చె డాం డాం డాం!*
*కత్తిపోయి కట్లొచ్చె డాం డాం డాం!*
*కట్లు పోయి దోసెలొచ్చె డాం డాం డాం!*
*దోసెలు పోయి మడకొచ్చె డాం డాం డాం!*
*మడకా పోయి తొట్టిబానొచ్చె డాం డాం డాం!*
*తొట్టిబాన పోయి పూలొచ్చె డాం‌ డాం డాం!*
*పూలు పోయి పెళ్లికూతురొచ్చె డాం డాం డాం!!!*అని పాడిందంట. 

*📖 మన ఇతిహాసాలు 📓*

*జనమేజయుడు & పరీక్షిత్తు*

*జనమేజయుడు*

వైశంపాయనుడు, భారత కథను జనమేజయునికి వినిపించాడు. అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి పాముకాటు వల్ల మరణించాడన్న సంగతి తెలుసుకున్న జనమేజయుడు సర్పజాతిని నిర్మూలించాలనే ధ్యేయంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. సర్పయాగం చేస్తున్న సమయంలో పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి కాలిపోతుంటాయి. అలా సర్పజాతిని నిర్మూలించాలనుకుంటాడు జనమేజయుడు. అయితే సృష్టిలో సర్పజాతి అంతం కారాదనే ఉద్దేశంతో కొందరు జరత్కారువు అనే ముని వద్దకు వెళ్ళి, ఈ యాగం ఆగిపోయే ఉపాయం ఆలోచించమని కోరతారు. జరత్కారువు తన కుమారుడు ఆస్తీకుని జనమేజయుని వద్దకు పంపగా, అతడు జనమేజయుని వద్దకు వచ్చి, తన విద్యా నైపుణ్యం చూపించి, సర్పయాగం మంచిది కాదని నచ్చజెప్పి, ఆ యాగాన్ని ఆపు చేయిస్తాడు.

*పరీక్షిత్తు*

పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్ధామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించినప్పుడు, ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును బాధించింది.

గర్భస్థ శిశువు వల్ల కలిగిన బాధకు తాళలేక ఉత్తర శ్రీ కృష్ణుని ప్రార్థించినప్పుడు, అతడు పరీక్షిత్తును కాపాడాడు. గర్భంలో తనకు కనిపించిన దైవము ( శ్రీకృష్ణుడు) లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది.

ఉత్తరుని కుమార్తె ఐరావతిని పరీక్షిత్తు వివాహమాడాడు. ఒకసారి ఇతడు వేటకు వెళ్ళి, ఒక మృగాన్ని వేటాడుతూ ఒక ముని ఆశ్రమానికి చేరతాడు. అక్కడ తపస్సమాధిలో ఉన్న మునిని చూసి, తను వెన్నాడి వచ్చిన మృగమేదని అడుగుతాడు.

తపస్సులో ఉన్న ఆ ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు, అక్కడ చచ్చి పడి ఉన్న పాము కళేబరాన్ని ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ముని కుమారుడు వచ్చి, తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండటం చూసి, ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పామువల్ల మరణిస్తాడు. అని శపిస్తాడు.

చివరకు తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని, పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, తన కుమారుడిచ్చిన శాపం గురించి చెబుతాడు. పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందని తెలుసుకున్న పరీక్షిత్తు, ఒక దుర్భేద్యమైన గృహంలో ఉండిపోతాడు.

ఏడవరోజు పాములు మానవరూపంలో వచ్చి, పరీక్షిత్తుకు పండ్లు ఇస్తారు. అందులోని ఒక పండులో ఉన్న తక్షకుడు అనే పాము బయటకు వచ్చి పరీక్షిత్తును కాటు వేయడంతో అతను మరణిస్తాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు.

*✅ తెలుసుకుందాం ✅*

*నీళ్ళలో గ్లూకోజ్  కలిపితే నీళ్ళు చల్లగా మారతాయి ఎందుకో తెలుసా.*

✳గ్లూకోజ్ కలిపిన నీళ్ళు ఒక ద్రావణం. ద్రవం ద్రావణం గా మారటానికి ఘనపదార్ధాన్ని కలపాలి. అది భౌతిక రసాయనిక ప్రక్రియ.   అలా కలిసినప్పుడు పదార్ధాలమధ్య  అణుస్థాయిలో జరిగే పరస్పర చర్యల వల్ల ఊష్ణ శక్తి  లో మార్పు( ఊష్ణ శక్తి గ్రహించటం  లేదా  విడుదల చేయటం) జరుగుతుంది.
స్ఫటిక నిర్మాణంలో ఉన్న గ్లూకోజ్ నీటిలో కలిసినప్పుడు అది విచ్చిన్నమౌతుంది. వాటి అణువుల మధ్యౌన్న బంధం విడదీయటానికి కొంత శక్తి అవసరం. ఈ శక్తి నీటి ద్వార గ్రహించటం వల్ల నీరు చల్లగా మారుతుంది.

*🛑ట్రాఫిక్ లో ఆగండి అనే  సిగ్నల్ కి మరియు డేజంర్ సిగ్నల్ కి ఎరుపురంగే ఎందుకు!*

✳ఎరుపురంగుకి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది. దాని కాంతి ఎక్కువ వేగాన్ని కలిగిఉంటుంది. దాని పరిక్షేపణ సామర్ధ్యం తక్కువ అందువల్ల  ఎక్కువ దూరం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గుణాలవల్ల ఎరుపు రంగు వాడుతారు.

*మీకు తెలుసా*

1). జిరాఫీ మెడపొడవు దాదాపు రెండు మీటర్లు.  దాని మెడలో ఉండేవి ఏడు ఎముకలు మాత్రమే. మనిషి మెడలో ఉండే ఎముకలు కూడా ఏడు.

2) 1405  ఫారన్‍హీట్ డిగ్రీలదాకా వేడిచేస్తే వజ్రం ఆవిరిగా మారుతుంది.

౩) చింపాజీలకు మనుషులకు డీ ఎన్ ఏ లో ఒక్క శాతమే తేడా. రక్తం, మూత్రపిండాలు మార్పిడి చేసుకోవచ్చట.

*🔥GK BITS🔥*

1)ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,?

సయ్యద్ అక్బరుద్దీన్

2)రెండు న్యూట్రాన్లు నక్షత్రాల విలీన ప్రక్రియనే ర్యాపిడ్ ప్రాసెస్ అంటారు.

3)అణ్వాయుధ నిషేధ వొడంబడిక పై 50 దేశాలు సంతకాలు చేశాయి. తొలి సంతకం చేసిన దేశం ఏది ?

బ్రెజిల్ 

4)ఇటీవల unesco నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన దేశాలు ఏవి?

అమెరికా, ఇజ్రాయిల్

5)వరుసగా నాలుగవసారి జర్మనీ ఛాన్సలర్గా అర్హత సాధించిన ఎవరు?

ఏంజిలా మెర్కెల్

6)శ్రీలంక ప్రధాని ఎవరు?

రనిల్ విక్రమ్ సింగ్

7)ప్రపంచంలో మూడవ ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యవస్థ ఉన్న దేశం ఏది?

జపాన్

8)భారత్ శ్రీలంక దేశాలు ఇటీవల సంయుక్త సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి?

మహారాష్ట్రలోని పూణే

9)ప్రపంచంలో ప్రపంచంలో సొంత దేశం లేని అతిపెద్ద జాతి ఏది?

కుర్ధులు.

*🎈జనవరి 5 నుంచి గేట్-2018 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్🎈*

*🌵🥀 గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2018 అడ్మిట్ కార్డులు జనవరి 5నుంచి ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.🏖*

*🌹ఐఐటీజీ వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి కార్డును పొందవచ్చు. ఇందులో అభ్యర్థుల పేరు, రోల్ నెంబరు, పరీక్ష తేదీ, సమయంతోపాటు పరీక్ష కేంద్రం వివరాలూ ఉంటాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌కార్డుతోపాటు ఏదైనా గుర్తింపు ధ్రువపత్రం(పాస్‌పోర్ట్/ఆధార్ కార్డ్/ పాన్ కార్డ్/ ఓటర్ ఐడీ/ డ్రైవింగ్ లెసైన్స్) తప్పకుండా తీసుకురావాలి. లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. www.gate.iitg.ac.in వెబ్‌సైట్నుంచి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్చేసుకోవచ్చు.🥀🌵*

*💥మధ్యాహ్న భోజనంలో సోయా మిల్‌మేకర్ బిర్యానీ*

🔷విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం పాలు

🔷కేంద్రం ప్రతిపాదనలు

♦ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సోయా మిల్‌మేకర్ బిర్యానీ లేదా పీస్ పలావ్, కిచిడీ, టమాట రైస్, పెసరపప్పు, దేశవాళీ చిక్కుడుకాయ కూర వంటి పదిరకాలతో వారంతో ఒక స్పెషల్ రైస్‌ను పెట్టాలని కేంద్ర, రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన జాయింట్ రివ్యూ మిషన్ (జేఆర్‌ఎం) ప్రతిపాదించింది.

♦ గత ఏడాది నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, వరంగల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జేఆర్‌ఎం సభ్యులు పరిశీలించారు. 

♦అనంతరం కొన్ని ప్రతిపాదనలను చేశారు. పాఠశాలలు కొనసాగే ఆరురోజుల్లో మూడురోజులు కూరగాయలతోపాటు గుడ్డు అందజేయాల్సి ఉంటుంది. ఒకరోజు ఆకుకూరలతో తయారు చేసిన పప్పు, ఇంకోరోజు కూరగాయలతో సాంబర్, మరోరోజు స్పెషల్ రైస్ అందించాలని సిఫారసు చేశారు. జేఆర్‌ఎం చేసిన సిఫారసుల అమలు సాధ్యమైతే ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ, జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు విజ్ఞప్తి చేశారు. 

♦స్థానిక పరిస్థితులు, వంట కార్మికుల సామర్థ్యాలను బట్టి వారంలో ఒకరోజు విద్యార్థులకు స్పెషల్ రైస్‌ను అందించాలన్నారు. 25 లక్షల మంది విద్యార్థుల్లో 80 శాతానికి పైగా మధ్యాహ్న భోజనం తింటున్నారని పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.

♦ రోజూ ఉదయాన్నే స్కూల్‌కు వస్తున్న విద్యార్థులకు 250 మిల్లీలీటర్ల పాలను ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని పేర్కొన్నారు.

*🍀ఫీజులు పెంచొద్దు*

🔷వచ్చే విద్యాసంవత్సరానికి పాతవే వర్తింపు

🔷ప్రైవేటు స్కూళ్లకు విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య ఆదేశాలు 

🔷ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫార్సులను ఇంకా పరిశీలించాల్సి ఉన్నదని వెల్లడి

🔷విద్యాశాఖ నిర్ణయంతో విద్యార్థుల తల్లితండ్రులకు ఊరట

🔷సంతోషం వ్యక్తంచేసిన స్కూల్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్

🔷ఫీజుల పెంపుదలకు అనుమతించండి: ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల సంఘం

♦ ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు, తల్లితండ్రులకు కాస్త ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు స్కూల్ ఫీజులు పెంచొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

♦ రాష్ట్రంలోని అన్నిరకాల ప్రైవేటు పాఠశాలల్లో పాత ఫీజులనే (2017-18) వచ్చే విద్యా సంవత్సరంలో (2018-19) కూడా కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని స్టేట్ సిలబస్ పాఠశాలలతోపాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ బోర్డుల నుంచి అఫిలియేషన్ పొందిన ప్రైవేట్‌స్కూళ్లకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టంచేసింది. ఈ మేరకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆదేశించారు. ప్రాంతీయ విద్యాధికారులకు, జిల్లా విద్యాధికారులకు ఆదేశాలను జారీచేయాలని సూచించారు.

♦ వాస్తవానికి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫారసుల ప్రకారం ఫీజులు పెరుగుతాయని తల్లితండ్రుల సంఘాలు, విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే, ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉన్నదని.. ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున పాత ఫీజులనే కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు జీ కిషన్ తెలిపారు. 

♦ప్రస్తుతం రాష్ట్రంలోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేశామని, దీంతో ప్రతి పాఠశాల యాజమాన్యం ఫీజుల వివరాలను తమ స్కూల్ నోటీసుబోర్డు, వెబ్‌సైట్‌లో వెల్లడించాలని ఆయన స్పష్టంచేశారు.

♦ వచ్చే విద్యా సంవత్సరంలో కూడా పాత ఫీజులనే కొనసాగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తల్లితండ్రులకు, విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగిస్తుందని హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో తాము జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు.

♦ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫారసుల ప్రకారం ఫీజులు పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కోరారు. అవసరమైతే పెంచిన ఫీజులకు లెక్కలు చూపించటానికి స్కూల్ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు, ఇతర బిల్లుల చెల్లింపు భారంగా మారుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని స్కూల్ ఫీజులను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. లాభాలు లేకుండా ఫీజులను నిర్ణయించటం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
 🏦➖➖➖➖➖➖➖➖➖➖
*రాజ్యసభలో 15 ఏళ్ల తర్వాత మొత్తం ప్రశ్నలకు అవకాశం..*
➖➖➖➖➖➖➖🌸🌸🍃
¤ రాజ్యసభలో 2018 జనవరి 2న అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.. 15 ఏళ్ల తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో మొత్తం ప్రశ్నలకు అవకాశం దక్కింది. 

¤ దీంతోపాటు జీరో అవర్‌, ప్రత్యేక ప్రస్తావనల సమయంలోనూ అవకాశం లభించిన ప్రతిఒక్కరూ మాట్లాడారు. రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు చొరవ సభ్యుల సహకారంతో పెద్దలసభ ప్రశాంతంగా, పరిపూర్ణంగా సాగింది. 

¤ చివరిసారి 2002లో జరిగిన 197వ సమావేశంలో ప్రశ్నోత్త రాల జాబితాలోని అన్ని ప్రశ్నల నూ సభలో ప్రస్తావించే అవకాశం దక్కింది. అప్పట్లో ప్రశ్నలువేసిన 20మందిలో 10మంది హాజరుకాకపోవడంతో అది సాధ్యమైంది. 

¤ 2018 జనవరి 2 నాటి సభలో కొందరు సభ్యులు హాజరుకాకపోయినా వారి స్థానంలో మరికొందరికి అవకాశం కల్పించి మొత్తం 18 మందితో మాట్లాడించారు. ప్రశ్నోత్తరాలల్లో సభ్యులు పలు కీలకాంశాలపై ప్రశ్నలు వేశారు. అమరావతికి ప్రపంచబ్యాంకు రుణం, జీఎస్‌టీ ఫైలింగ్‌, భారతీయ సంప్రదాయేతర ఇంధనసంస్థ పనితీరు, బిట్‌కాయిన్‌.. దాని నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, మొండి బకాయిలు తదితర అంశాలపై చర్చించారు. 

¤ సంతాప తీర్మానాలు చదివేటప్పుడు సభ్యులు మాట్లాడొద్దని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. 

¤ రాజ్యసభ సిబ్బంది అశోక్‌ కుమార్‌ హత్యపై నివేదిక సమర్పించాలని హర్యానా ప్రభుత్వాన్ని వెంకయ్యనాయుడు నివేదిక కోరారు. 

¤ 2017 డిసెంబర్‌ 30న బహదూర్‌గఢ్‌లో అశోక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.  
         🍃🌸🤗🌸🍃
 🚀🇨🇳➖➖➖➖➖➖➖➖➖
*భూవాతావరణంలో కూలనున్న చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్‌-1..*
➖➖➖➖➖➖➖➖🌸🌸🍃
¤ చైనా తొలి అంతరిక్ష ప్రయోగ శాల తియాంగాంగ్‌-1 కొద్ది నెలల్లో భూ వాతావ రణంలో కూలిపోనుంది. అయితే దీనిపై ఆందోళన వద్దని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. వాటి శకలాలు ఒక మనిషిని తాకే ప్రమాదం చాలా తక్కువని చెబుతున్నారు. 

¤ తియాంగాంగ్‌-1 అనే ఈ రోదసి ప్రయోగ శాలను 2011లో రోదసిలోకి పంపారు. 

¤ రెండేళ్ల పాటు సేవలు అందించేలా దీన్ని రూపొందించారు. మరిన్ని ప్రయోగాలు నిర్వహించడం కోసం దీని జీవితకాలాన్ని రెండున్నరేళ్లకు పెంచారు. 

¤ 2016 నుంచి ఈ ప్రయోగశాల క్రమంగా భూ వాతావరణంలోకి జారిపోతోంది. 

¤ ఇది 2018 మార్చి మధ్యలో భూవాతా వరణంలోకి ప్రవేశిస్తుందని కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌ సంస్థ పేర్కొంది. 

¤ వాతావరణ రాపిడి కారణంగా ఇది మండిపోతుంది. 

¤ అయితే కొన్ని భాగాలు నేల మీదపడే  అవకాశం ఉంది. ఏ ప్రాంతంలో పడతాయన్నది ఇప్పుడే ఊహించడం కష్టమైనప్పటికీ.. తియాంగాంగ్‌-1 వాలు వంటి వివరాల ఆధారంగా అది 43 డిగ్రీల ఉత్తర, 43 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య ప్రదేశంలో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఏరోస్పేస్‌ సంస్థ వివరించింది. ఆ ప్రాంతంలో ఎక్కువగా సముద్రం ఉందని పేర్కొంది. 

¤ ఉపగ్రహాలు, వ్యోమనౌకలు భూవాతా వరణంలోకి తిరిగి ప్రవేశించడం సర్వసాధారణమే అయినప్పటికీ వాటి వల్ల భూమిపై మానవులు గాయపడటం కానీ ఆస్తి నష్టం జరగడం కానీ చాలా అసాధారణం. 

¤ 1997లో అమెరికాలోని ఓక్లహామాలో రాష్ట్రంలోని టుస్లాలో వ్యాహ్యాళికి వెళుతున్న లోటీ విలియమ్స్‌ అనే మహిళ భుజంపై 6 అంగుళాల పొడవున్న ఒక లోహపు వస్తువు పడిరది. దీనివల్ల ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. 

¤ ఆ శకలం పడిన సమయం, ప్రదేశాన్ని పరిశీలించిన అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అది డెల్టా రాకెట్‌కు సంబంధించిన రెండో దశలోని ఒక భాగమని నిర్ధరించింది. అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్సాస్‌లో దీని ప్రధాన శకలాన్ని గుర్తించింది. 

¤ రోదసి పరిశోధనల చరిత్రలో లోటీ విలియమ్స్‌ మినహా అంతరిక్ష వ్యర్థం మరెవరినీ తాకలేదు. 

¤ ఇప్పటివరకూ భూవాతావ రణంలోకి ప్రవేశించిన అతిపెద్ద మానవనిర్మిత వస్తువు రష్యాకు చెందిన మిర్‌ అంతరిక్ష కేంద్రం. దీని శకలాలు న్యూజిలాండ్‌కు తూర్పున పసిఫిక్‌ మహాసముద్రంలో పడిపోయింది. ఈ అంతరిక్ష కేంద్రం బరువు 1.2 లక్షల కిలోలు. తియాంగాంగ్‌-1 బరువు 8,500 కిలోలు. 
           🍃🌸🤗🌸🍃
🙋🏻‍♀🌷🍃➖➖➖➖➖➖
*#NARI WEB PORTAL*..గురించి
➖➖➖➖➖➖🌷🌷🍃
• మహిళా ప్రభుత్వ పథకాలు మరియు మహిళలకు ప్రోత్సాహకాలపై సమాచారం సులభంగా లభిస్తుంది.

• ఇ-సంవద్ పోర్టల్ కూడా అభివృద్ధి చేయబడింది, ఇది మహిళల మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పరస్పరం చర్చించడానికి NGO లు మరియు సివిల్ సొసైటీలకు వేదికను అందిస్తుంది.

NARI పోర్టల్ 350 ప్రభుత్వ పథకాలు మరియు మహిళల ప్రయోజనం కోసం ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సమగ్రంగా ఉంచుతుంది.

• ఈ పథకాలను అందించే మంత్రిత్వశాఖలు, విభాగాలు మరియు స్వయంప్రతిపత్తిగల సంస్థలకు లింకులను అందిస్తుంది, అలాగే ఆన్లైన్ దరఖాస్తులకు మరియు ఉపద్రవములకు దారి తీయవచ్చు.

• *NARI* వారి జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై మహిళలకు సమాచారం అందిస్తుంది.

• ఇది వారి జీవిత నైపుణ్యాలను నిర్మించడానికి మరియు వాటిని ప్రభుత్వం అందించిన సేవల పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి వారికి శక్తిని అందించే శక్తిని ఇది అందిస్తుంది.

*ఇ-సంవద్ పోర్టల్*

• ఇ-సంవద్ పోర్టల్ ద్వారా, ఎన్జిఓలు మరియు పౌర సమాజాలు తమ అభిప్రాయాలను, సలహాలను,  చేరచవచ్చు. MWCD లో ఉన్న సీనియర్ ఆఫీసర్లు తమ సంబంధిత అంశాల ప్రాంతాలకు అందుకున్న ఇన్పుట్స్ / సలహాలను వీక్షించగలుగుతారు మరియు NGO లకు సముచితంగా స్పందిస్తారు.

• మహిళల మరియు పిల్లల సంక్షేమ కోసం సమర్థవంతమైన విధానాలు మరియు చర్యలను రూపొందించడంలో ఇది దోహదపడుతుంది.

*ఇతర వివరాలు*

• కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలలో సమానమైన హక్కులు, ఆర్ధిక అవకాశాలు, సాంఘిక మద్దతు, చట్టపరమైన సహాయం, గృహ సదుపాయాలు మొదలైన వాటిని అందించడానికి మహిళలకు అనేక పథకాలు మరియు చట్టాలను అమలుచేసింది.

• అయితే, ఈ నియమాలు మరియు వారి ప్రయోజనాలను పొందడంలో ఇబ్బందులు గురించి తరచుగా అవగాహన లేదు.

ఉదాహరణకు, ఒక స్థిరమైన పరిస్థితుల్లో మహిళలకు 168 జిల్లాల్లో ఒక స్టాప్ సెంటర్స్ లభిస్తుందని చాలామందికి తెలియదు. మహిళల పేరిట గృహాల రిజిస్ట్రటన్కు ప్రధాని ఆవాస్ యోజన ప్రాధాన్యత ఇస్తారు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్యకు ఆర్థిక మద్దతును అందిస్తున్నాయి. .

• మహిళా సెంట్రిక్ పథకాలు / చట్టాలకు సంబంధించిన ఈ సమాచారం వివిధ వెబ్సైట్లు / పోర్టల్స్ లో చెల్లాచెదురుగా ఉన్నాయి.

• ఈ సమాచారాన్ని మరింత సులభంగా ఒకే చోట అందుబాటులో ఉంచడానికి, NARI పోర్టల్ 350 ప్రభుత్వ పథకాలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని మహిళల ప్రయోజనం కోసం సంక్షిప్తీకరిస్తుంది.

• ఈ పథకాలను అందించే మంత్రిత్వశాఖలు, విభాగాలు మరియు స్వయంప్రతిపత్తిగల సంస్థలకు లింకులను అందిస్తుంది, అలాగే ఆన్లైన్ దరఖాస్తులకు మరియు ఉపద్రవములకు దారి తీయవచ్చు.

• మహిళల మరియు పిల్లల సాధికారత మరియు సంక్షేమ ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యత, నార్ మరియు ఇ-సంవద్ పోర్టల్ ఈ దిశలో చొరవలు.
            🍃🌷🤗🌷🍃

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

*🌷సుభాషిత వాక్కు🌷*

*"కోపం తెర లాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ గాయంలాంటిది మానిపోయినా మచ్చ అలాగే ఉంటుంది"*

*"I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel."*

  *♦మంచి పద్యం*

*ఏమి గొంచు వచ్చె తానేమి గొనిపోవు*
*బుట్టువేళ నరుడు గిట్టువేళ*
*ధనములెచటికేగు దానెచ్చటికేగు*
*విశ్వదాభిరామ వినురవేమ!*

*❗భావం :*

*మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకునిరాడు, చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుని పోలేడు. సంపదలెటుపోతాయో, తానెటుపోతాడో కదా!*

*నేటి జీ కె*

*దేశాలు అధికారిక పుస్తకాలు*

1. *ఆరెంజ్ బుక్స్-నెదర్లాండ్స్*

2. *ఎల్లో బుక్స్-ఫ్రాన్స్*

3. *గ్రీన్ బుక్స్-ఇటలీ,ఇరాన్*

4. *బ్లూ బుక్స్-బ్రిటన్*

5. *వైట్ బుక్స్-పోర్చుగీస్,చైనా*

6. *గ్రే బుక్స్-జపాన్,బెల్జియం*

7. *శ్వేతపత్రం-ఇండియా,ఇతర దేశాలు-*

 Slang of the Day

💥zero

✍🏾Meaning:
a worthless person, someone who's done nothing worthwhile in life

❕For example:

🔺Clive is such a zero. He's spent his whole life stacking shelves in his father's shop during the day, and watching television in his room at night.

🔺Those neighbourhood gangsters think they're heroes, but as far as we're concerned they're nothing but zeroes.
━━━━━━━━━━━
#Slang_of_the_day

ఈ రోజు జికె 

1)👉 ప్రస్తుత గుజరాత్ గవర్నర్ ఎవరు?
A: *ఓం ప్రకాశ్ కోహ్లీ*

2)👉 అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరు?
A: *B.D.మిశ్రా*

3)👉 నిర్భయ్ శర్మ ఏ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు?
A: *మిజోరాం*

4)👉 కర్ణాటక ప్రస్తుత ముఖ్య మంత్రి ఎవరు?
A: *సిద్ధరామయ్య*

5)👉 "వసుంధర రాజే"  ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు?
A: *రాజస్థాన్*
               
🐧🐧🐧🐧🐧🐧🐧🐧🐧🐧

SENIOR INTER CHEMISTRY 100% PASS GUARANTEE GSQB

SENIOR INTER CHEMISTRY 100% PASS GUARANTEE GSQB