AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday, 19 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 18


*🌎చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 18*🌎

*▪డిసెంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 352వ రోజు (లీపు సంవత్సరములో353వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 13 రోజులు మిగిలినవి.◾*

*🕘సంఘటనలు*🕘

*🍒1948: జాగృతి  తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.*

*🍒1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.*

*🍒1989: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరాం జక్కర్పదవీ విరమణ.*

*🍒2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ.*

*🍒2014: భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.*

*🍃జననాలు*🍃

*🍒1824: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892)*

*🍒1878 : రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత మరియు అధ్యక్షుడు స్టాలిన్జననం (మ.1953).*

*🍒1883 : ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధిచెందిన శారదా దేవి జననం (మ.1920).జి సైదేశ్వర రావు*

*🍒1913: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ (మ.1992).*

*🍒1937: కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్‌ ఆర్టిస్టు.*

*🍒1938: తాడిపర్తి సుశీలారాణి, ప్రముఖ రంగస్థల నటి మరియు హరికథ కళాకారిణి.*

*🍒1946: స్టీవెన్ స్పీల్‌బెర్గ్, సుప్రసిద్ధ దర్శకుడు.*

*🍒1947: ఎన్.ఎస్. ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973).*

*🍒1961 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాల్‌చంద్ రాజ్‌పుత్ జననం.*

*🍒1963 : అమెరికాకు చెందిన నటుడు మరియు చలన చిత్ర నిర్మాత బ్రాడ్ పిట్జననం.*

*🍒1971: బర్ఖాదత్, సుప్రసిద్ధి టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.*

*🍒1973: డిబి చారి, తెలుగు చలనచిత్ర గేయ మరియు సంభాషణల రచయిత.*

*మరణాలు*

*🍒1829: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (జ.1744)*

*🍒1948: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906)*

*🍒1952: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)*

*🍒2000: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922)*

*🍒2015: చాట్ల శ్రీరాములు, ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణుడు మరియు సినిమా నటుడు. (జ.1931)*

*🌷జాతీయ దినాలు*🇮🇳

*🍒అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.*

*🍒మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.)*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

*🌷సుభాషిత వాక్కు*

*"సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది"*

*"The Road to Success and Greatness is always paved with consistent hard work. Outwork your competitors, Be Authentic and above all else..Chase your Greatness.."*

    *🔹మంచి పద్యం*

*పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు*
*పట్టెనేని బిగియఁ బట్టవలయు*
*పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు*
*విశ్వదాభిరామ వినురవేమ!*

*❗తాత్పర్యము :*

*పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ ఏదైనా ఒక పనిని మొదలుపెడితే... సాధ్యం కాకపోయినప్పటికీ చివరివరకు పట్టుదలతో దానిని పూర్తిచేయాలి. పట్టుదలను వదలడం కంటే.. ప్రాణాలను వదలడం మేలు.*

*♦నేటి జికె♦*

*1) .UPI పూర్తి రూపం ఏమిటి ?*

*జ: యూనిఫైడ్ చెల్లింపు ఇంటర్ఫేస్*

*2) .14 నవంబర్ _ గా జరుపుకుంటారు?*

*జ: డయాబెటిస్ డే*

*3). ICAN యొక్క ప్రధాన కార్యాలయం ఏమిటి?*

*జ: జెనీవా, స్విట్జర్లాండ్*

*4). ICAR యొక్క ప్రధాన కార్యాలయం ఏమిటి?*

*జ: న్యూ ఢిల్లీ*

*5) .ఏ సాహిత్యం కోసం నోబెల్ బహుమతి వచ్చింది?*

*జ: కజో ఇషిగురో*

*6) .చిన్న ఫైనాన్స్ బ్యాంకు కోసం కనీస పెట్టుబడి అవసరం ఏమిటి?*

*జ: 100 Cr*

*7) .10th BRICS సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది?*

*జ: జోహన్నెస్బర్గ్, దక్షిణ ఆఫ్రికా*

*8) రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది?*

*జ: అస్సాం*

*9) .ముద్ర లో M యొక్క అర్ధం ఏమిటి?*

*జ:-మైక్రో*

*10). సముద్ర జాతీయ పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు?*

*జ:-గోవా*

*🔥AP TET గురించి వివరంగా*

*🌻 ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ‘టెట్‌’ విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం జీఓ నెంబర్‌ 91 జారీ చేసింది. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.*

*🌻టెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1 నుంచి 5వ తరగతి టీచర్‌ పోస్టుల కోసం పేపర్‌ 1 పరీక్ష జరుగుతుంది. 6 నుంచి 8వ తరగతి టీచర్‌ పోస్టులకు పేపర్‌ 2లో అర్హత సాధించాలి.*

*👉టెట్‌ పేపర్‌ 1 అర్హతలు ఇవీ*

*🌻పేపర్‌ 1కు దరఖాస్తు చేసే వారు ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. రెండేళ్ల డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈడీ) లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (బీ.ఇఎల్‌.ఈడీ), లేదా రెండేళ్ల డిప్లొమో ఇన్‌ ఎడ్యుకేషన్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యాహక్కు చట్టం– 2010 కన్నా ముందు ఇంటర్మీడియెట్, డీఎడ్‌ వంటి పరీక్షలు రాసిన వారికి మాత్రం అర్హత మార్కుల్లో కొంత మినహాయింపు ఉంటుంది. వీరికి ఇంటర్‌లో 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులలకు 40 శాతం మార్కులతో పాటు డీఎడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.*

*👉టెట్‌ పేపర్‌ 2 అర్హతలు ఇవీ*

*🌻టెట్‌ పేపర్‌ 2కు దరఖాస్తు చేసుకునేవారు బీఏ, బీఎస్సీ, బీకాంలలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులుండాలి. దీంతోపాటు బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యాహక్కు చట్టం– 2010 కన్నా ముందు బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈడీ లాటి పరీక్షలు రాసిన వారికి మాత్రం అర్హత మార్కుల్లో కొంత మినహాయింపు ఉంటుంది. వీరిలో బీఏ, బీఎస్సీ, బీకాం చదివిన ఓసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండడంతో పాటు బీఈడీ తదితర శిక్షణ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా నాలుగేళ్ల బీఏ (ఈడీ), బీఎస్సీ (ఈడీ) కోర్సుల్లో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 45 శాతం మార్కులు వస్తే చాలు. లాంగ్వేజ్‌ టీచర్లకు సంబంధించి  బ్యాచులర్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ లాంగ్వేజెస్, సంబంధిత లాంగ్వేజెస్‌లో గ్రాడ్యుయేషన్, పండిట్‌ ట్రయినింగ్, లాంగ్వేజ్‌లో బీఈడీ (సంబంధిత సబ్జెక్టులో మెథడాలజీతో కూడి ఉండాలి.*

*👉ఫైనల్‌ పరీక్షలకు హాజరయ్యే వారూ అర్హులే*

*🌻ప్రస్తుతం బీఈడీ, డీఈడీ తదితర కోర్సులు అభ్యసిస్తూ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత షరతులకు లోబడి డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేలా వారికి అవకాశం కల్పించనున్నారు.*

*👉అర్హత మార్కులు తప్పనిసరి*

*🌻డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్‌లో కనీస అర్హత మార్కులు తప్పనిసరిగా సాధించి ఉండాలి. జనరల్‌ అభ్యర్ధులు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్‌ రాసిన వారికి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డిజిటల్‌ ఫార్మాట్‌లో ధ్రువపత్రాలు జారీ చేస్తుంది. ఈ ధ్రువపత్రానికి ఏడేళ్ల చెల్లుబాటు ఉంటుంది. ఈలోపల ప్రకటించే డీఎస్సీలన్నిటికీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అర్హత ఉంటుంది.*

*👉ఏటా రెండుసార్లు టెట్‌..*

*🌻టెట్‌లో సాధించిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉంటుంది. టెట్‌ మార్కులకు 20 శాతం, డీఎస్సీలో వచ్చిన మార్కులకు 80 శాతం చొప్పున వెయిటేజీని పరిగణనలోకి తీసుకుని ఎంపిక జాబితాను రూపొందిస్తారు. టెట్‌ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఛైర్మన్‌గా, జాయింట్‌ డైరక్టర్‌ (టెట్‌) సభ్యకన్వీనర్‌గా మరో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తారు.*

*🌻ఈ కమిటీ టెట్‌ షెడ్యూల్‌ ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. జూన్‌/జులైలో ఒకసారి అక్టోబర్‌/నవంబర్‌లో మరోసారి టెట్‌ పరీక్ష ఉంటుంది. అభ్యర్ధులు ఎన్నిసార్లైనా వీటికి హాజరుకావచ్చు.*

*👉టెట్‌ పరీక్షా విధానం ఇలా...*

*🌻టెట్‌ పరీక్షను కంప్యూటర్‌ ఆధారంగా బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలతో నిర్వహించనున్నారు.*
*ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు.*
*నెగిటివ్‌ మార్కుల విధానం లేదు.*
*అభ్యర్ధులు పేపర్‌1 లేదా పేపర్‌2లకు వేర్వేరుగా హాజరుకావచ్చు.*

*🌻రెండు పేపర్లనూ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది.*

*ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలుంటాయి.*

*పరీక్ష రాయడానికి రెండున్నర గంటల సమయం ఇస్తారు.*
*అంశాలవారీగా ప్రశ్నలను జీఓలో పొందుపరిచారు*


చరిత్రలో ఈ రోజు డిసెంబరు 19


*🌹చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 19🌹*  

  *◼డిసెంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 353వ రోజు (లీపు సంవత్సరములో354వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 12 రోజులు మిగిలినవి.*◼

 *⏱సంఘటనలు*⏱

*♦1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.*

*♦1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి*

*♦1978: ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు*

*♦1985: భారత లోక్‌సభ స్పీకర్‌గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడుజి సైదేశ్వర రావు*

*♦2009: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు.*

*🌸జననాలు*🌸


*💚1903: కె.వి. గోపాలస్వామి, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్. (మ.1983)*

*💚1918: భాస్కరభట్ల కృష్ణారావు, రచయిత. (మ.1966])*

*💚1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత.*

*💚1929: నిర్మలా దేశ్ పాండే, ప్రముఖ గాంధేయవాది. (మ.2008)1977: హేమ. ఎమ్, రంగస్థల నటి.*

*🍃మరణాలు*🍃

*🌷1953: వనారస గోవిందరావు, శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.*

*🌷1967: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893)*

*🌷2015: రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🔹గోవా విముక్తి దినోత్సవం.*

ఈ రోజు జికె 

*నియమకాలు*

*1. బీహార్ కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు?*

*2. అస్సాం కొత్త గవర్నర్గా నియమితులయ్యారు ఎవరు?*

*3. కొత్త ఎన్నికల కమీషనర్గా ఎవరు నియమితులయ్యారు?*

*4. పాకిస్తాన్కు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?*

*5. భారత వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు ఎవరు?*

*6. రైల్వే బోర్డ్ యొక్క కొత్త ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యార*

*7. కజాఖ్స్తాన్ రిపబ్లిక్ కు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?*

*8. భారతదేశ 45 వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఎవరు?*

*9. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) చీఫ్గా నియమితులయ్యారు ఎవరు?*

*10. ఇండోనేషియాకు భారత రాయబారిగా నియమితులయ్యారు ఎవరు?*

*11. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ (ఐటిబిపి) ఎవరు?*

*12. భారత అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు?*

*13. NITI అయోగ్ వైస్ ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?*

*14. ఫేస్బుక్ ఇండియా MD గా ఎవరు నియమిస్తారు?*

*15. సీబీఎస్ఈ యొక్క కొత్త ఛైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు?*

*16. ఫిల్మ్ & టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?*

*17. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?*

*18. టాటా కాపిటల్ యొక్క MD & CEO గా నియమితులయ్యారు ఎవరు?*

*19. జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ కొత్త సిఈఓగా నియమితులయ్యారు ఎవరు?*

*20. SIDBI యొక్క సిఎండిగా నియమితులయ్యారు ఎవరు?*

*🔹జవాబులు🔹*

*1. సత్య పాల్ మాలిక్*

*2. ప్రొఫెసర్ జగదీష్ ముఖి*

*3. సునీల్ అరోరా*

*4. అజయ్ బిసారీ*

*5. వెంకయ్య నాయుడు*

*6. అశ్వని లోహని*

*7. శ్రీ ప్రభాత్ కుమార్*

*8. జస్టిస్ దీపాక్ మిశ్రా (J S ఖేహార్ స్థానంలో)*

*9. సంజయ్ కుమార్*

*10. ప్రదీప్ కుమార్ రావత్*

*11. శ్రీ ఆర్ కె పచ్నంద*

*12. కే కె వేణుగోపాల్ (భర్తీ ముకుల్ రోహత్గి)*

*13. ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ (అరవింద్ పనగారియా స్థానంలో)*

*14. సందీప్ భూషణ్*

*15. అనితా కర్వల్ (రాజేష్ కుమార్ చతుర్వేది స్థానంలో)*

*16. అనుపమ్ ఖేర్ (గజేంద్ర చౌహాన్ స్థానంలో)*

*17. వివేక్ గోయెంకా (భర్తీ రియాద్ మాథ్యూ)*

*18. రాజీవ్ సభర్వాల్*

*19. వినయ్ డుబే*

*20. మొహమ్మద్ ముస్తఫా*