AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 20 January 2022

కరోన Corona

 *అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.*  

*'వైరస్' వల్ల వస్తున్నది'*


*'మరి వైరస్ అందర్నీ కాటేయడం లేదేంటి?'*

*'ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'*

 

*'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా ?'*

*'గాలిలో వస్తోంది'*


*అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?*

*రోగ నిరోధక శక్తి లేనివాడికి వస్తోంది*


*'రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతోంది?*

*'తెలియదు'*


*ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం.*


*'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'*

*మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్న వాడికి ఎందుకని రావడం లేదు?*

*నో ఆన్సర్*


*'మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ అంటించుకున్నాడు'*

*మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్న వాడికి ఎందుకని రాలేదు?'*

*మళ్ళీ నో ఆన్సర్*


*'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'*

*'రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?'*

*మళ్ళీ నో ఆన్సర్*


*చివరకు ఇలా జవాబు వస్తుంది.*


*కాయకష్టం చేసేవాళ్లకు రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు*


*ఏతావాతా తేలిందేమిటి?* *ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు. ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు*


*ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో చెప్పారు.*


*వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడ నుభవిస్తాడు? మంచి చెప్పినా ఎవడూ వినడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు.* 


*ఇప్పుడు విషయంలో కొద్దాం.*


*నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని తెలిసింది గనుక.*


*నేనమెరికాలో ఉన్నపుడు ఒక విషయం గ్రహించాను. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ.*

*ఎందుకని?*

*వినండి మరి.*


*స్టోర్స్ లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది. దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసెసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది.  ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది?* 


*ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.* 


*చనిపోయిన దేహాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి?*


*ఈరోజుల్లో, ఏ పూటకా పూట, ఏ రోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు?*


*చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంట మీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు.*


*సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు.*


*ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యదానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.*


*జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు ెలుసా?*


*ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్ స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు.*


*ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?*


*ప్రతిరోజూ చెమటపట్టేలా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు?*


*ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్మువ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాది పాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి.* 


*మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?*


*అసలు కనీస వ్యాయామ మంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు.*


*పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ  ఉండటం.*

*టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం.*

*లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం. ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?*


*"ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం.*

*అక్కడకూడా డబ్బులు పారేసి పెద్దఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం.* 

*అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం.*

*దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.*


*వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను.*


*ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన  శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనం మీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ.* 


*బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే.*


*సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు vari arogyamnu vare నాశనం అవుతున్నారు.* 


*అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా?*

*మనకు ఓవెన్లెందుకు? అవసరమా?* 

*మనకు జొమాటోలెందుకు? అవసరమా?*

*రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా?* *అర్ధరాత్రిళ్ళు, తెల్లవారు ఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా?*


*ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజమైన, ప్రకృతి విరుద్ధమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?*


*పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా? ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే  ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.*


*ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలేబాగుంది' అనుకుంటూ   బ్రతుకుతున్న  ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.*


*ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?*

*మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులున్నాయి.* 


*బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు.* 


*ఏ ఒక్కటీ కాదనలేని వాస్తవం. ఈ మెసేజ్ వల్ల కొందరైనా, కొంతైనా మారాలని, కనీసం మారే ప్రయత్నం చెయ్యాలని ఆశిద్దాం 👍*