AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

అవార్డులు ఫిబ్రవరి 2014

అవార్డులు ఫిబ్రవరి 2014
విష్ణు నార్లికర్‌కు నాయుడమ్మ అవార్డుప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ జయంత్ విష్ణు నార్లికర్ 2013 నాయుడమ్మ అవార్డుకు ఎంపికయ్యారు. ఇతర గ్రహాల్లో జీవుల ఉనికిని, అంతరిక్ష రహస్యాలను కనుక్కోవడానికి ఆయ న చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు గుంటూరులోని నాయుడమ్మ ట్రస్ట్ ఫిబ్రవరి 22న ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన విష్ణు నార్లికర్‌ను 1965లో పద్మభూషణ్, 2004లో పద్మ విభూషణ్‌తో భారత ప్రభుత్వం గౌరవించింది.

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు64వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 ఫిబ్రవరి 15న బెర్లిన్‌లో ముగిసింది. 11 రోజులపాటు సాగిన ఈ చిత్రోత్సవంలో 400 చిత్రాలను ప్రదర్శించారు. ఇందులో కాంపిటీషన్ కేటగిరీలో 23 చిత్రాలు ఉన్నాయి. 

  • గోల్డెన్ బేర్ అవార్డు గెలుచుకున్న ఉత్తమ చిత్రం: బాయ్ రి యాన్ హూ (బ్లాక్ కోల్, థిన్ ఐస్) చైనా చిత్రం 
  • సిల్వర్ బేర్ అవార్డు పొందిన చిత్రం: గ్రాండ్ బుదాఫెస్ట్ 
    హోటల్ ఆడియన్స్ అవార్డు: డి ఫ్రెట్ (ఇథియోపియా చిత్రం)
  • ఉత్తమ నటుడు: లియావో ఫాన్ (చిత్రం - బ్లాక్ కోల్, థిన్ ఐస్)
  • ఉత్తమ నటి: హరూ కురోకి (జపాన్ చిత్రం - ద లిటిల్ హౌస్)
ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన చిత్రం హైవే కూడా ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.

చక్రపాణికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పురస్కారంశాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణిని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ (జీజీఎఫ్) గౌరవ మెడల్‌తో సత్కరించింది. ఫిబ్రవరి 2న శాసనమండలి ఆవరణలోని కమిటీ హాల్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్పీ వర్మ చేతులమీదుగా చక్రపాణికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

అవార్డులు జనవరి 2014

అవార్డులు జనవరి 2014
పద్మ అవార్డులు
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి ఈ అవార్డులను అందించనున్నారు. ఈ పురస్కారాల్లో రెండు పద్మవిభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారు.. డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్-మహారాష్ట్ర), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా-మహారాష్ట్ర). ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికీ పద్మభూషణ్, ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వివరాలు: పద్మభూషణ్- దివంగత అనుమోలు రామకృష్ణ (సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్ (క్రీడలు- బ్యాడ్మింటన్). పద్మశ్రీ- మొహ్మద్ అలీ బేగ్ (ఆర్ట్-థియేటర్), డాక్టర్ రామారావు అనుమోలు (సోషల్ వర్క్) డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ (సైన్స్, ఇంజనీరింగ్), డాక్టర్ గోవిందన్ సుందరరాజన్ (సైన్స్, ఇంజనీరింగ్) , రవికుమార్ నర్ర (ట్రేడ్ ఇండస్ట్రీ), డాక్టర్ సరబేశ్వర్ సహార్య (వైద్యం, సర్జరీ), ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ (సాహిత్యం, విద్య). పద్మభూషణ్ అవార్డు లభించిన ఇతర ప్రముఖుల్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్, దివంగత న్యాయమూర్తి జె.ఎస్.వర్మ, ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయని బేగం పర్వీన్ సుల్తానా, సాహితీవేత్త రస్కిన్ బాండ్, తమిళ రచయిత వైరముత్తు తదితరులున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, సీనియర్ నటుడు పరేశ్‌రావల్, క్రికెటర్ యువరాజ్ సింగ్, సినీ రంగానికి చెందిన సంతోష్ శివన్, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ .. తదితరులను పద్మశ్రీ వరించింది. ప్రవాసాంధ్రుడు డాక్టర్ వంశీ మూట (మెడిసిన్- బయోమెడికల్ రీసెర్చ్)కు ఎన్‌ఆర్‌ఐ విభాగంలో పద్మశ్రీ లభించింది.
59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (2013) విజేతల వివరాలు: ఉత్తమ నటుడు: ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్కా భాగ్); ఉత్తమ నటి: దీపికా పదుకొణే (గలియోంకా రాస్‌లీలా రామ్‌లీలా); ఉత్తమ దర్శకుడు: రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా (భాగ్ మిల్కా భాగ్); జీవితసాఫల్య అవార్డు: తనూజ; ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (తుమ్‌హీ హో-ఆషిఖీ-2); ఉత్తమ గాయని: మోనాలీ ఠాకూర్ (సావర్‌లూన్- లుటేరా); ఉత్తమ గీతం: ప్రశూన్ జోషి (జిందా- భాగ్ మిల్కా భాగ్) 
ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌బాబుకు అశోకచక్రఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్ ఇన్‌స్పెక్టర్ కె.ప్రసాద్‌బాబుకు 65వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరణానంతరం అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అశోకచక్రతో భారత ప్రభుత్వం గౌరవించింది. ఈ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసాద్‌బాబు తండ్రి కె.వెంకటరమణకు అందించారు. 2013 ఏప్రిల్ 16న ఆంధ్ర-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రసాద్‌బాబుతో పాటు 9 మంది మావోయిస్టులు మరణించారు. 
బయోకాన్ ఎండీ కిరణ్ షాకు ఆథ్‌మర్ గోల్డ్ మెడల్బయోకాన్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ కిరణ్ మజుందార్‌షా 2014 ఆథ్‌మర్ గోల్డ్‌మెడల్ పురస్కారానికి ఎంపిక య్యారు. అమెరికాకు చెందిన కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అత్యున్నత అవార్డును అందజేస్తుంది. 
సి.ఎస్.ఎస్.ఎస్‌కు జాతీయ మత సామరస్య అవార్డుముంబైలోని ‘ సెంటర్ ఫర్‌స్టడీ ఆఫ్ సొసైటీఅండ్ సెక్యులరిజమ్’ (సి.ఎస్.ఎస్.ఎస్) సంస్థల కేటగిరీలో 2013 సంవత్సరానికి జాతీయ మత సామరస్యఅవార్డుకు ఎంపికైంది. వ్యక్తులకేటగిరీలో ఢిల్లీకి చెందిన మొహిందర్ సింగ్, కేరళకు చెందిన ఎన్.రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. డాక్టర్ మొహిందర్‌సింగ్ మైనారిటీ విద్యాసంస్థల జాతీయకమిషన్ సభ్యులు. డాక్టర్ రాధాకృష్ణన్ ప్రముఖ విద్యావేత్త, గాంధేయవాది. కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖకు చెందిన మతసామరస్య జాతీయ ఫౌండేషన్ 1996లో జాతీయ మతసామరస్య అవార్డులనుఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతోపాటు వ్యక్తులకైతే రూ. 5లక్షలు, సంస్థలకైతే రూ. 10 లక్షలు బహుకరిస్తారు. సి.ఎస్.ఎస్.ఎస్.ను ముంబేలో 1996లో ఏర్పాటు చేశారు.

పాక్ బాలుడికి అంతర్జాతీయ సాహస అవార్డు
తన ప్రాణాలొడ్డి పాఠశాలలోని వేల మంది విద్యార్థులను కాపాడిన 14 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు ఐత్‌జాజ్ హసన్‌కు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ అంతర్జాతీయ సాహస అవార్డును ప్రకటించింది. అలాగే పాక్ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత సాహస అవార్డుల్లో ఒకటైన సితారా ఎ సుజాత్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.జనవరి 6న పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్యా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో మానవబాంబుతో ప్రవేశిస్తున్న ఉగ్రవాదిని హసన్ అడ్డుకున్నాడు. ఆ పేలుడులో ఇద్దరూ చనిపోయారు. 

ఆర్టీసీకి మూడు జాతీయ పురస్కారాలు ఏపీఎస్‌ఆర్టీసీకి మూడు పురస్కారాలు లభించాయి. అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్),అర్బన్ సర్వీసుల్లో అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్), భద్రత అంశాల్లో అతి తక్కువ ప్రమాదాలు కలిగి ఉండటంతో అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) న్యూఢిల్లీ నుంచి పురస్కారాలు దక్కించుకుంది. ఇంధన పొదుపులో ఇప్పటికి 39వసారి ఆర్టీసీ అవార్డును గెలుచుకుంది.

జాన్ ఐపేకు భారత్‌గౌరవ్ పురస్కారంబహ్రెయిన్‌లో ఉన్న ప్రవాస భారతీయుడు జాన్‌ఐపే (63) ప్రతిష్ఠాత్మక భారత్ గౌరవ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ ప్రకటించింది. నాలుగుదశాబ్దాల పాటు బహ్రెయిన్‌లో నివశిస్తున్న ఐపే...14 ఏళ్లుగా ప్రవాస భారతీయుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తీరుకు ఈ అవార్డు వరించింది. ఇప్పటివరకు ఈ అవార్డును మదర్‌థెరిసా, క్రికెటర్ గవాస్కర్, నటులు షమ్మీకపూర్, రాజేశ్‌ఖన్నా, దేవానంద్ అందుకున్నారు.

ఖేమ్కాకు డామేహుడ్ అవార్డు
 
భారతసంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్త ఆశాఖేమ్కా బ్రిటన్ ప్రతిష్టాత్మక డామే కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ (డి.బి.ఇ-డామేహుడ్) అవార్డుకు ఎంపికయ్యారు. 1917 లో బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. బీహార్‌లో జన్మించిన ఆశాఖేమ్కా 1975లో బ్రిటన్ వెళ్లారు. టీవీలో బోధన కార్య క్రమాలు చేపట్టిన ఆమె-అక్కడి యువతకు విద్య, ఉపాధి, శిక్షణను అందిస్తున్నారు. బ్రిటన్‌లోని 33 కళాశాలలను భారత్‌లోని కళాశాలలతో అనుసంధానించి ఇరుదేశాలకు చెందిన విద్యార్థులలో నైపుణ్యాల అభివృద్ధికి ఆమె కృషి చేస్తున్నారు. కాగా 83 ఏళ్ల తర్వాత ఈ అవార్డు భారత సంతతికి దక్కింది. ఇంతకుముందు 1931లో మహారాణి లక్ష్మీదేవి భాయ్ సాహిబాకు ఈ గౌరవం లభించింది.

అవార్డులు డిసెంబరు 2013

అవార్డులు డిసెంబరు 2013
2012-13 సంవత్సరానికి బీసీసీఐ అవార్డులు
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) 2012-13 సంవత్సరానికి 7వ వార్షిక అవార్డులు 2013 డిసెంబర్ 26న ప్రకటించింది.
విజేతలు:
సి.కె.నాయుడు అవార్‌‌డ (లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు):
 కపిల్‌దేవ్ (రూ. 25 లక్షల బహుమతి)
పాలిఉమ్రిగర్ పేరిట ఇచ్చే ‘బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్’: ఆర్. అశ్విన్ (రూ. 5 లక్షల బహుమతి)
రంజీట్రోఫీలో ఉత్తమ ఆల్ రౌండర్‌కిచ్చే ‘లాలా అమర్‌నాథ్ అవార్డు’: అభిషేక్ నాయర్
ఉత్తమ అంపైర్: శంషుద్దీన్ (హైదరాబాద్)
క్రికెట్‌కు అత్యుత్తమ సేవలందించినందుకు బహుమతి: ఆర్‌జీ నాదకర్ణి, ఫరూక్ ఇంజనీర్, దివంగత సోల్కర్ (ఒక్కొక్కరికి రూ. 15 లక్షల బహుమతి)

కాత్యాయని విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే 2013 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం - స్త్రీల అస్తిత్వ సాహిత్యం, కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథానికిగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ పురస్కారానికి ఎంపికైన 22 భాషలకు చెందిన రచయితల పేర్లను డిసెంబర్ 18న కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. అవార్డును 2014, మార్చి 11న గ్రహీతలకు ప్రదానం చేస్తారు. అవార్డు కింద జ్ఞాపిక, ప్రశంసపత్రం, రూ. లక్ష నగదు బహూకరిస్తారు.

ఇఫి చిత్రోత్సవం అవార్డులు44వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు (ఇఫి) పనాజీలో నవంబర్ 30న ముగిశాయి. 
అవార్డులు: 
  • ఉత్తమ చిత్రానికిచ్చే బంగారు నెమలి: తూర్పు తైమూర్ నిర్మించిన తొలి చిత్రం ‘బీట్రిజ్ వార్’కు దక్కింది. దీనికి బెటిరీస్ దర్శకత్వం వహించారు. ఈ అవార్డు కింద రూ.40 లక్షలు బహూకరించారు.
  • వెండి నెమలి అవార్డు: మెగే దాకా తారా 
    (బెంగాలీ, దర్శకత్వం: కమలేశ్వర్ ముఖర్జీ)
  • ఉత్తమ దర్శకుడు: కౌశిక్ గంగూలీ 
    (చిత్రం: అపూర్ పాంచాలి)
  • ఉత్తమ నటుడు: అలోన్ మోని అబేత్‌బేల్ 
    (చిత్రం: ఎ ప్రెస్ ఇన్ హెలెన్)
  • ఉత్తమ నటి: మగ్దలెనా బోక్‌జరాస్కా
    (చిత్రం: ఇన్‌హైడింగ్)
డా.సుబ్బన్న అయ్యప్పన్‌కు నాయుడమ్మ అవార్డుప్రముఖ శాస్త్రవేత్త ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్‌‌చ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్‌కు ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డు 2014ను అందజేయనున్నట్లు నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ డెరైక్టర్ డాక్టర్ ఎ.జగదీష్ డిసెంబర్ 2న తెలిపారు. 

అవార్డులు నవంబరు 2013

అవార్డులు నవంబరు 2013
అంజోలీ మీనన్‌కు దయావతి మోడీ అవార్డు
ప్రముఖ కళాకారిణి అంజోలీ ఏలా మీనన్ (73)కు దయావతి మోడీ అవార్డు లభించింది. భారత కళలు, సంస్కృతికి ఆమె చేసిన సేవకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును నవంబర్ 18న ఆమెకు ప్రదానం చేశారు. ప్రతి ఏటా దయావతి మోడీ ఫౌండేషన్ కళలు, సంస్కృతి, విద్యా రంగాల్లో కషిచేసినవారికి ఈ అవార్డును అందిస్తోంది. ఈ అవార్డు కింద రూ.2.51 లక్షలు బహూకరిస్తారు.

ఏంజెలా మెర్కల్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి
జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్ 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతికి ఎంపికయ్యారు. ఐరోపాలో, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ జర్మనీని అభివృద్ధి వైపు నడిపించినందుకు మెర్కల్‌ను ఎంపిక చేసినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ నవంబర్ 19న ప్రకటించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఎంపిక కమిటీ మెర్కల్‌కు బహుమతి అందించాలని నిర్ణయించింది. 2012లో ఈ బహుమతిని లైబీరియా అధ్యక్షురాలు జాన్సన్ సర్లీఫ్‌కు బహూకరించారు. ఈ అవార్డును 1986లో ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబర్ 19న దీన్ని ప్రకటిస్తారు. అవార్డు కింద రూ.25 లక్షల నగదు, ప్రశంస పత్రం అందిస్తారు.

సంగీత నాటక అకాడమీ అవార్డులుప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు డి.రాఘవాచారి, టి.శేషాచారి ఈ ఏడాది సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపికయ్యారు. హైదరాబాద్ బ్రదర్స్‌గా వీరు సుపరిచితులు. వీరు గత 45 ఏళ్లుగా కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తున్నారు. 2013 సంవత్సరానికి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (అకాడమీ రత్న), అకాడమీ అవార్డు (అకాడమీ పురస్కార్)లను నవంబర్ 25న ప్రకటించింది. ఇదే సంవత్సరానికి సంగీతం, నృత్యం, రంగ స్థలం, తోలు బొమ్మలాట విభాగాల్లో 38 మందిని అకాడమీ అవార్డు (పురస్కార్)కు సంగీత నాటక అకాడమీ ఎంపిక చేసింది. రంగ స్థల కళాకారులు కనక్ రేలె, ఆర్.సత్యనారాయణ, మహేశ్ ఎల్.కుంచార్‌లను అకాడమీ రత్న (ఫెలోషిప్)కు ఎంపిక చేశారు. ఫెలోషిప్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా, అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇప్పటివరకు 40 మంది మాత్రమే ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద తామ్ర పత్రం, అంగ వస్త్రంతోపాటు అకాడమీ ఫెలోషిప్‌నకు రూ.3,00,000, అకాడమీ అవార్డుకు రూ.లక్ష బహూకరిస్తారు.

సచిన్, సీఎన్‌ఆర్ రావులకు భారతరత్న
క్రికెట్ కీడాకారుడు సచిన్ టెండ్కూలర్ (40), ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు (79)లను ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డులకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 16న ప్రకటించింది. దీన్ని చివరిసారిగా 2009లో పండిట్ భీమ్‌సేన్ జోషికి ప్రదానం చేశారు. ఇంతవరకు ఈ అవార్డును మొత్తం 41 మంది అందుకున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 1954లో ఏర్పాటు చేశారు. సర్ సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత భారతరత్నకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు. ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు, అతి పిన్న వయస్కుడుగా సచిన్‌కు గుర్తింపు దక్కింది. 

సచిన్ టెండూల్కర్: 24 ఏళ్లుగా క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ తన 200వ టెస్టుతో నవంబర్ 16న ఆట నుంచి వైదొలిగారు. అదేరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన రాయబారి టెండ్కూలర్ అని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది. 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌పై కరాచీలో 1989, నవంబర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో సచిన్ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. టెస్టుల్లో మొత్తం 15,921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 248 నాటౌట్. అదేవిధంగా 1989, డిసెంబర్ 18న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌లో కాలుమోపారు. వన్డేల్లో మొత్తం 463 మ్యాచ్‌లు ఆడి, 18,426 పరుగులు చేశారు. ఇందులో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 200 నాటౌట్.

ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు: పూర్తిపేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. 2005 నుంచి ప్రధానమంత్రి శాస్త్ర సలహామండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సీఎన్‌ఆర్ రావును కేంద్రం రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఆయన సాలిడ్ స్టేట్, మెటీరియల్స్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన శాస్త్రవేత్త. నాన్ మెటీరియల్స్, గ్రాఫీన్‌లపై రెండు దశాబ్దాలుగా విస్తత పరిశోధనలు చేస్తున్నారు. ఆయన దాదాపు 1400 పరిశోధన పత్రాలు, 45 పుస్తకాలు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సీఎన్‌ఆర్ రావు 1934, జూన్ 30న బెంగళూరులో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేశారు. అమెరికాలోని పర్డ్యు యూనివర్సిటీ నుంచి 1958లో పీహెచ్‌డీ అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో రసాయనశాస్త్ర అధిపతిగా 13 ఏళ్లు పనిచేశారు. 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు 2005లో నోబెల్ బహుమతితో సమానమైన పది లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రై జ్ లభించింది.
సతీశ్‌రెడ్డికి హోమీ జే బాబా అవార్డు
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన క్షిపణి అభివద్ధి కేంద్రం ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’ డెరైక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీశ్‌రెడ్డి ఈ ఏడాది ప్రతిష్టాత్మక హోమీ జే బాబా స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. జమ్మూలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 03న జరగనున్న 101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా స్మారకార్థం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1989 నుంచి ఏటా ఈ అవార్డును అందిస్తోంది.

స్వామినాథన్‌కు ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు 2012 ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అక్టోబర్ 31న ప్రదానం చేశారు. వ్యవసాయ శాస్త్రంలోనూ, దేశం ఆహార ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడంలోనూ చేసిన కృషికిగాను స్వామినాథన్‌కు ఈ అవార్డు లభించింది.

మిస్ ఆసియా పసిఫిక్ వరల్డ్‌గా శ్రేష్టి రాణాహర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన శ్రేష్టి రాణా (21) ఆసియా పసిఫిక్ వరల్డ్ - 2013గా ఎంపికైంది. అక్టోబర్ 30న సియోల్‌లో జరిగిన పోటీల్లో మొత్తం 49 మందిలో ఆమె విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో మన దేశానికి చెందిన యువతి కిరీటం దక్కించుకోవడం ఇది రెండోసారి. ఈజిప్ట్‌కు చెందిన మెరియం జార్జి రెండో స్థానం, కజికిస్థాన్‌కు చెందిన ఎవజినియా క్లిషిన మూడో స్థానం సాధించారు.

అవార్డులు అక్టోబరు 2013

అవార్డులు అక్టోబరు 2013
జెన్‌కో ఎండీ విజయానంద్‌కు ఇండియన్ పవర్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో) మేనేజింగ్ డెరైక్టర్ కె.విజయానంద్‌కు ఇండియన్ పవర్ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో చూపిన ప్రతిభకుగాను ఆయన 2013 ఉత్తమ సీఈఓగా ఎంపికయ్యారు. ‘ఇండియన్ పవర్’ అవార్డులను ఏటా కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్ సంస్థ ప్రకటిస్తుంది.

అమెరికన్లకు అర్థ శాస్త్రంలో నోబెల్ఆస్తుల ధరలపై అవగాహన కలిగించే విధానాన్ని రూపొందించినందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఈజెన్ ఫామా, లార్స్ పీటర్స్ హాన్సన్, రాబర్ట్ షిల్లర్‌లకు అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈజెన్ ఫామా, పీటర్స్ హాన్సన్‌లు షికాగో యూనివర్సిటీలో, రాబర్ట్ షిల్లర్ యేల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. షేర్లు, బాండ్ల ధరల తీరు రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అనే విషయాన్ని అనుభవపూర్వకంగా, విశ్లేషణ ద్వారా అంచనా వేయవచ్చని వారు ప్రతిపాదించారు. షేర్లు, నగదు, బ్యాంకు డిపాజిట్లు వంటివాటి రూపంలో పొదుపు చేయాలనేది వ్యక్తుల అంచనాలపై ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఎలీనర్ కాటన్‌కు బుకర్ ప్రై జ్న్యూజిలాండ్‌కు చెందిన ఎలీనర్ కాటన్ (28)కు 2013 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రై జ్ లభించింది. ఈ బహుమతి పొందిన అత్యంత పిన్న వయస్కురాలు కాటన్. ఆమె రాసిన ‘ద లూమినరీస్’ అనే నవలకు ఈ బహుమతి లభించింది. 19వ శతాబ్దిలో సాగిన బంగారం అన్వేషణ ఇతివత్తంతో కూడిన మర్డర్ మిస్టరీ నవల ఇది. బహుమతి కింద 50 వేల పౌండ్లు లభిస్తాయి. భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి నవల ‘ద ల్యోలాండ్’ చివరి వరకు పోటీపడ్డా బహుమతి లభించలేదు. ఈ బహుమతిని కామన్‌వెల్త్ దేశాలు, ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందిన వారి ఆంగ్ల రచనలకు మాత్రమే అందిస్తారు.

భారతీయ యువతికి కామన్‌వెల్త్ యూత్ అవార్డుభారత్‌లో పర్యావరణ మార్పు సమస్య నివారణకు కషిచేస్తున్న భారత మహిళ ప్రీతీ రాజగోపాలన్(23) ఈ ఏడాది కామన్‌వెల్త్ యూత్ అవార్డును గెలుపొందారు. అక్టోబర్ 12న లండన్‌లోని కామన్‌వెల్త్ ప్రధాన కార్యాలయంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద 5000 పౌండ్లు లభిస్తాయి. పర్యావరణ మార్పుపై స్థానిక సమాజాలు, ప్రభుత్వాలతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించి మిత్రులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. భారత్‌లో 200 పాఠశాలలు, 40 విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆమె శిక్షణ అందిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆమె ప్రాజెక్టుకు నిధులు అందిస్తోంది.

నోబెల్‌ బహుమతులు-2013శాంతి: ప్రపంచవ్యాప్తంగా రసాయన ఆయుధాల నిర్మూలనకు వృషి చేస్తున్న ఆర్గనైజేషన్‌ ఫర్‌ ది ప్రొహిబిషన్‌ ఆఫ్‌ కెమికల్‌ వెపన్స్‌ (ఓపీసీడబ్ల్యూ)కు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఈ సంస్థ సిరియా సంక్షోభంలో బాగా ప్రాచుర్యం పొందింది. సిరియాలో ఆగస్టులో సైన్యం సరిన్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో 1400 మంది మరణించారు. దీంతో ఐక్యరాజ్యసమితి తోడ్పాటుతో సిరియాలో రసాయన ఆయుధాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఓపీసీడబ్ల్యూ చేపట్టింది. ఐక్యరాజ్యసమితి మద్దతుతో స్వతంత్రంగా వ్యవహరించే ఈ సంస్థ 1997లో ఏర్పడింది. హేగ్‌ కేంద్రంగా తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 1993 జనవరి 13న కుదిరిన రసాయన ఆయుధాల నిర్మూలన ఒప్పందాన్ని అమలుచేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఏర్పడినప్పటి నుంచి 86 దేశాల్లో 57000 టన్నుల రసాయన ఆయుధాలను ఓపీసీడబ్ల్యూ ధ్వంసం చేసింది. ఇది విధించిన రసాయన ఆయుధాల నిషేధంలో 189 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. 1901 నుంచి 2013 వరకు నోబెల్‌ శాంతి బహుమతిని 94 సార్లు 125 మందికి బహూకరించారు. ఈ బహుమతి వంద మంది వ్యక్తులకు, 25 సంస్థలకు దక్కింది. 2012 శాంతి బహుమతి యూరోపియన్‌ యూనియన్‌కు లభించింది.

ఫిజిక్స్‌: భౌతిక శాస్ర్తానికిచ్చే నోబెల్‌ బహుమతి దైవకణం (హిగ్స్‌బోసాన్‌)పై కీలక పరిశోధనలు చేసినందుకు బ్రిటన్‌కు చెందిన పీటర్‌ హిగ్స్‌ (84), బెల్జియంకు చెందిన ఫ్రాంకోయిస్‌ ఎంగ్లెర్ట్‌ (80)లకు లభించింది. ఎడిన్‌బరో యూనివర్సిటీలో పీటర్‌హిగ్స్‌, యూనివర్సిటీ లిబర్‌ డీ బ్రక్సెల్స్‌లో ఎంగ్లెర్ట్‌ గౌరవ ప్రొఫెసర్లుగా ఉన్నారు. వీరు విశ్వంలో అన్ని రకాల పదార్థాలకు ద్రవ్యరాశిని సమకూరుస్తుందని భావిస్తున్న దైవ కణంపై 1964లో కీలక పరిశోధనలు చేశారు. ఈ కణం వల్ల స్వల్ప రేణువు నుంచి గ్రహాలు, నక్షత్రాల వరకు సమస్త పదార్థానికి ద్రవ్యరాశి చేరుతోందని తెలిపారు. దీనినే హిగ్స్‌బోసన్‌ అని పిలిచారు. హిగ్స్‌ అంటే విశ్వంలో అదశ్యంగా ఉన్న క్షేత్రం కాగా, బోసాన్‌ అంటే అన్ని ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశిని ఇచ్చే కణం. స్విట్జర్లాండ్‌లోని సెర్న్‌ ప్రయోగశాల శాస్తవ్రేత్తలు 2012లో లార్జ్‌ హాడ్రాన్‌ కొల్లయిడర్‌ ప్రయోగం ద్వారా దైవ కణం ఉనికి నిజమేనని తెలిపారు.

రసాయన శాస్త్రం: అమెరికా శాస్తవ్రేత్తలు మార్టిన్‌ కార్‌ప్లస్‌ (83), మైకేల్‌ లెవిట్‌ (66), ఆరీ వార్షెల్‌ (72)లకు రసాయనశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. అతి క్లిష్టమైన రసాయన ప్రక్రియలను అణు స్థాయిలో వివరించేందుకు ఉపయోగపడే కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌ను రూపొందించినందుకు వారికి ఈ బహుమతి దక్కింది. వీరు నిత్య జీవితంలో కీలకమైన రసాయన ప్రక్రియలకు కంప్యూటర్‌ అనుకరణలు రూపొందించారని, వాటి సాయంతో అన్ని రకాల ప్రక్రియలను అత్యంత సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకోవడానికి, వాటి చర్యల క్రమాన్ని ఊహించడానికి వీలైందని నోబెల్‌ బహుమతి జ్యూరీ తెలిపింది. వీరి ఆవిష్కరణ వల్ల ఔషధ పరిశ్రమలో సమస్యలను పరిష్కరించేందుకు, మనిషి శరీరంలో జరిగే రసాయన మార్పును బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. 1960, 70లలో వీరు ఈ పరిశోధనలు నిర్వహించారు.

సాహిత్యం: కెనడా రచయిత్రి ఆలిస్‌ మన్రో (82)కు నోబెల్‌ సాహిత్య బహుమతి దక్కింది. కెనడియన్‌ చెహోవ్‌గా పిలిచే మన్రో తన కథా రచనల్లో సమకాలీన పరిస్థితులను, మానవ సంబంధాలను మేళవించి పాఠకులకు అందించారు. ఆమె కథల్లోని పాత్రలు ఎదుర్కొనే సంఘటనలు, మనస్తత్వాల విశ్లేషణలు, వాటి ద్వారా మానవీయ కోణాలను తెలిపే తీరు మహోన్నతంగా ఉంటాయని నోబెల్‌ కమిటీ తెలిపింది. ఆమె రాసిన డాన్స్‌ ఆఫ్‌ ది హ్యాపీ షేడ్స్‌ అనే 1968 నాటి కథా సంపుటి ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. 2009లో మ్యాన్‌బుకర్‌ బహుమతి దక్కింది. ఆలిస్‌ మన్రో సాహిత్యంలో నోబెల్‌ బహుమతి పొందిన 13వ మహిళ. కెనడాకు చెందిన తొలి మహిళ కూడా. 

మలాలాకు ఈయూ సఖరోవ్‌ ప్రై జ్‌పాకిస్థాన్‌ విద్యాహక్కుల ప్రచారకర్త మలాలా యూసుఫ్‌జా (16)కు ప్రతిష్టాత్మకమైన సఖరోవ్‌ మానవహక్కుల బహుమతి అందుకుంది. అక్టోబర్‌ 10న యూరోపియన్‌ పార్లమెంట్‌లో ఈ అవార్డును బహూకరించారు. మలాలా 2013 నోబెల్‌ శాంతి బహుమతికి కూడా నామినేట్‌ అయింది. ఆమె తాలిబన్‌ దాడిలో గాయపడి కోలుకున్నప్పటి నుంచి పిల్లలు బడికెళ్లడం హక్కుగా చేపట్టే కార్యక్రమాల ప్రపంచ రాయబారిగా మారారు.

వరుణ్‌ అరోరాకు ఐక్యరాజ్యసమితి అవార్డుభారత యువ పారిశ్రామిక వేత్త అరుణ్‌ అరోరాకు ఐక్యరాజ్యసమితి అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి సహకారంతో ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) యంగ్‌ ఇన్నోవేటర్స్‌ కాంపిటీషన్‌ నిర్వహించింది. ఈ పోటీలో 88 దేశాల నుంచి 600 మంది పాల్గొనగా వారిలో 10 మందిని అవార్డుకు ఎంపిక చేశారు. ఈ పదిమందిలో వరుణ్‌ అరోరా ఒకరు. ఆయన పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠ్యాంశాలన్నింటిని ఆన్‌లైన్‌లో ఓపెన్‌ కరిక్యులంను సష్టించారు.

శివేంద్ర సింగ్‌కు బీమల్‌రాయ్‌ అవార్డుచిత్ర దర్శకుడు శివేంద్ర సింగ్‌ దుంగార్పూర్‌కు 2013 సంవత్సరానికి బీమల్‌రాయ్‌ మెమోరియల్‌ ఎమర్జింగ్‌ టాలెంట్‌ అవార్డు దక్కింది. ఆయన చిత్రించిన డాక్యుమెంటరీ ‘సెల్యులాయిడ్‌ మ్యాన్‌’కు ఈ అవార్డు లభించింది. ఈ డాక్యుమెంటరీని 2012లో ప్రముఖచిత్ర ఆర్చివిస్ట్‌, నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్చివ్‌ ఆఫ్‌ ఇండియా స్థాపకుడు పి.కె.నాయర్‌ జీవితంపై తీశారు. 150 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా 47 చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఈ అవార్డును బీమల్‌రాయ్‌ మెమోరియల్‌ సొసైటీ 1997 నుంచి అందిస్తోంది. గతంలో రీతుపర్ణోఘోష్‌, అషుతోష్‌ గోవారికర్‌, సుజిత్‌ సర్కార్‌, సబీహా సుమీర్‌, విక్రమాదిత్య మొత్వానే వంటివారికి బహూకరించారు. 

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌వైద్యశాస్త్రంలో చేసిన కషికిగాను అమెరికా, జర్మనీలకు చెందిన ముగ్గురు శాస్తవ్రేత్తలు ఉమ్మడిగా ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. శరీర కణాల్లో అంతర్గతంగా, కణాల మధ్య రవాణా వ్యవస్థపై పరిశోధన చేసిన.. అమెరికాకు చెందిన జేమ్స్‌ రోత్‌మాన్‌, రాండీ షెక్‌మాన్‌తోపాటు జర్మనీ సంతతి శాస్తవ్రేత్త థామస్‌ స్యూదోఫ్‌లను నోబెల్‌కు ఎంపిక చేసినట్లు నోబెల్‌ జ్యూరీ ప్రకటించింది. ఈ బహుమతి కింద దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలను ముగ్గురు శాస్తవ్రేత్తలు అందుకోనున్నారు. డిసెంబర్‌ 10న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అందజేస్తారు. 
సైనా నెహ్వాల్‌కు ‘స్పోర్ట్స్‌ ఇలస్ట్రేటెడ్‌’ పత్రిక అవార్డుభారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు స్పోర్ట్స్‌ పత్రిక ‘స్పోర్ట్స్‌ ఇలస్ట్రేటెడ్‌’ అవార్డు లభించింది. 2012 సంవత్సరానికి ఉత్తమ క్రీడాకారిణిగా ఆ పత్రిక సైనాను ఎంపిక చేసింది. ఈ అవార్డు రావడం ఆమెకు ఇది రెండోసారి. 2009లో అవార్డు ప్రారంభించినప్పుడు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ కోచ్‌గా పుల్లెల గోపీచంద్‌ను పత్రిక ప్రకటించింది. ఉత్తమ యువ ఆటగాడిగా ఉన్ముక్త్‌ చంద్‌ (క్రికెట్‌), ఉత్తమ క్రీడాకారుడిగా విరాట్‌ కోహ్లి (క్రికెట్‌) ఎంపికయ్యారు. రాహుల్‌ ద్రావిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లకు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది.

కరణ్‌ థాపర్‌కు ఐపీఐ పురస్కారంసమకాలీన అంశాలపై, వివిధ రంగాల్లో ప్రముఖులతో టీవీ ఇంటర్వ్యూలు నిర్వహించడంలో పేరొందిన కరణ్‌ థాపర్‌ ‘ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐపీఐ)-ఇండియా అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ జర్నలిజం ఫర్‌ 2013’కు ఎంపికయ్యారు. సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ చానల్‌లో ‘డెవిల్స్‌ అడ్వొకేట్‌’ కార్యక్రమం ద్వారా 2012లో ప్రజా సంబంధిత అంశాలపై విధాన నిర్ణేతలను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా వాటిపై దష్టి సారించేలా కషి చేసినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐపీఐ-ఇండియా శాఖ అక్టోబర్‌ 7న తెలిపింది. 

అవార్డులు సెప్టెంబరు 2013

అవార్డులు సెప్టెంబరు 2013
కత్వారీకి కవనాగ్ కవితా పురస్కారం
భారతీయ అమెరికన్ కవి రఫీక్ కత్వారీ ప్రతిష్టాత్మక ఐరిష్ అంతర్జాతీయ ప్యాట్రిక్ కవనాగ్ పొయెట్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన కవితా సంపుటి ‘ఇన్ అనదర్ కంట్రీ’కి 2013 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రకటించారు. 41 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ఐరిష్ జాతీయేతర వ్యక్తికి ప్రకటించడం ఇదే తొలిసారి.
‘క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డులు’
భారత పర్యావరణ వేత్త బంకర్ రాయ్, పాకిస్థాన్ విద్యా హక్కుల కార్యకర్త మలాలాలు 2013 సంవత్సరానికి క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డులు అందుకున్నారు. వీరికి న్యూయార్క్‌లో సెప్టెంబర్ 25న ఈ అవార్డులు ప్రదానం చేశారు. బంకర్ రాయ్ బేర్‌పుట్ కళాశాల వ్యవస్థాపకుడు. ఆయన గత 40 ఏళ్లుగా గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థ ద్వారా కషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా ప్రాంతాల్లో 2.39 లక్షల మందికిపైగా విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకుగాను 10 లక్షల లీటర్ల వర్షపు నీటిని వాడకంలోకి తెస్తున్నారు. పాకిస్థాన్‌లో విద్యాహక్కులకు పోరాడుతున్న మలాలా (16) తాలిబన్ల దాడికి గురైంది. ఆమె మలాల నిధి పేరిట తన కషిని కొనసాగిస్తోంది.

సర్లీఫ్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి
2012 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతి (2011) గ్రహీతైన సర్లీఫ్ ఆఫ్రికా ఖండంలోని ఓ దేశానికి ప్రజాయుతంగా ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు కావడం విశేషం. ఈ అవార్డును భారత ప్రభుత్వం అంతర్జాతీయ శాంతి, అభివృద్ధిలో కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అందిస్తోంది. ఈ అవార్డు కింద * 25 లక్షలు బహూకరిస్తారు. ఈ అవార్డు 2011లో ఇలాభట్‌కు లభించింది. ఆమె సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉమెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సేవా) అనే సంస్థను నిర్వహిస్తున్నారు.

అమితాబ్‌కు గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు 2013 గ్లోబల్ డైవర్సిటీ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 12న లండన్‌లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అమితాబ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. తన నాలుగు దశాబ్దాల నట జీవితంలో 180కు పైగా భారతీయ చిత్రాల్లో నటించిన అమితాబ్ భారతీయ చలనచిత్ర రంగాన్ని అత్యంత ప్రభావితం చేయగల వ్యక్తి అని ప్రశంసపత్రంలో పేర్కొన్నారు. కాగా అమితాబ్‌కు ఇంతకుముందు కూడా పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. బీబీసీ 1999లో నిర్వహించిన పోల్‌లో ‘మిలీనియంలోనే గొప్ప నటుడు’గా అమితాబ్ ఎంపికయ్యారు. 2003లో ఫ్రెంచ్ పట్టణం డీవిల్లే నుంచి గౌరవ పౌరసత్వం పొందారు. ఫ్రాన్స్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘నైట్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్’తో కూడా ఆ దేశ ప్రభుత్వం అమితాబ్‌ను సత్కరించింది. 

యూరోపియన్ పార్లమెంట్ ప్రైజ్‌కు స్నోడెన్ ఎంపికఅమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ 2013 సంవత్సరానికి యూరోపియన్ పార్లమెంట్ ప్రతిష్టాత్మక అవార్డు ‘సఖరోవ్ మానవ హక్కుల బహుమతి’కి ఎంపికయ్యాడు. ఆయన అమెరికా ప్రభుత్వ గ్లోబల్ ఎలక్ట్రానిక్ నిఘా కార్యక్రమాలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. స్నోడెన్ అమెరికా విడిచి రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు.

అవార్డులు ఆగష్టు 2013

అవార్డులు ఆగష్టు 2013
రంజన్సోధికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్నఈ ఏడాదికి సంబంధించిన క్రీడా అవార్డులను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆమోదించింది. ప్రతిష్టాత్మక క్రీడా అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర ట్రాప్ షూటర్ రంజన్ సోధికి దక్కింది. సోధి 2010 కామన్వెల్త్ గేమ్స్లో రెండు రజత పతకాలు, 2012 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాడు. 

అర్జున అవార్డులు:
 
పేరుక్రీడ
విరాట్ కోహ్లీక్రికెట్
చక్రవోల్ సువురోఆర్చరీ
రంజిత్ మహేశ్వరిఅథ్లెటిక్స్
పి.వి. సింధుబ్యాడ్మింటన్
కవితా చాహల్బాక్సింగ్
రూపేశ్ షాస్నూకర్
గగన్జిత్ బుల్లర్గోల్ఫ్
సాబా అంజుమ్హాకీ
రాజ్కుమారీ రాథోర్షూటింగ్
జోత్స్న చినప్పస్క్వాష్
మౌమా దాస్టేబుల్ టెన్నిస్
నేహా రాతీరెజ్లింగ్
ధర్మేంద్ర దలాల్రెజ్లింగ్
అభిజిత్ గుప్తాచెస్
అమిత్కుమార్ సరోహాప్యారాస్పోర్ట్స్

ఏపీ పోలీసుకు అశోక్ చక్రశాంతి సమయంలో ధైర్యసాహసాలకిచ్చే రెండో అత్యున్నత అవార్డు అశోక్ చక్ర మరణానంతరం ఆంధ్రప్రదేశ్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఎన్.వి.ప్రసాద్ బాబుకు దక్కింది. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. మరో ముగ్గురికి కీర్తి చక్ర లభించింది. ఇవే కాకుండా 10 సౌర్య చక్ర అవార్డులతోపాటు మొత్తం 43 గ్యాలెంటరీ అవార్డులను రాష్ట్రపతి ప్రకటించారు.

దర్శకుడు కమల్‌కు గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు
గొల్లపూడి శ్రీనివాస్ 16వ జాతీయ అవార్డును దర్శకుడు కమల్ కె.ఎం.కు చెన్నైలో ఆగస్టు 12న ప్రదానం చేశారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘ఐడి’ చిత్రాన్ని నిర్మించినందుకు ఈ అవార్డు ఆయనకు దక్కింది. ఈ అవార్డు కింద రూ. 1.50 లక్షలు బహూకరించారు. తొలి చిత్ర దర్శకులకు ఈ అవార్డును అందిస్తారు. 

అమ్జాద్ అలీఖాన్‌కు రాజీవ్ సద్భావన అవార్డుప్రముఖ సరోద్ విద్వాంసుడు అమ్జాద్ అలీఖాన్ 21వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు ఎంపికయ్యారు. మత సామరస్యం, శాంతి, సౌభ్రాతత్వం కోసం చేసిన కషికి గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నట్లు జూలై 30న ఏఐసీసీ తెలిపింది. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 20న ఈ అవార్డును బహూకరిస్తారు. అవార్డు కింద రూ.5 లక్షల నగదుతోపాటు ప్రశంసాపత్రం అందిస్తారు. 

అవార్డులు జూన్ 2013

అవార్డులు జూన్ 2013
రామన్ మెగసెసే అవార్డులు -2013వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఇచ్చే రామన్ మెగసెసే అవార్డులను జూలై 24న ప్రకటించారు. ఈ అవార్డు పొందినవారిలో ఆప్ఘన్ మహిళ హబిబా సరాబీ (55)తోపాటు మయన్మార్కు చెందిన లాహ్పేయ్ సెంగ్ రా, ఫిలిప్పైన్స్కు చెందిన ఎర్నెస్టో డొమింగో (76), నేపాల్కు చెందిన మనుషుల అక్రమ రవాణా నిరోధక సంస్థ, ఇండోనేషియాకు చెందిన అవినీతి వ్యతిరేక సంస్థలకు ఈ అవార్డులు దక్కాయి.
హబిబా సరాబీ: ఈమె ఆప్ఘన్ రాష్ట్రం బయేయాన్ గవర్నర్. ఆప్ఘన్లో తొలి ఒకే ఒక మహిళా గవర్నర్. సరాబీ మహిళా హక్కులు, విద్య కోసం పోరాటం చేస్తున్నారు.

లాహ్పాయ్ సెంగ్ రా: మయన్మార్కు చెందిన సామాజిక కార్యకర్త. మయన్మార్లోని అతిపెద్ద పౌర సమాజ గ్రూప్ వ్యవస్థాపకురాలు. ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, శాంతి కార్యక్రమాలు చేపడుతుంది. 64 ఏళ్ల సెంగ్రా సేవలను ప్రభుత్వం, తిరుగుబాటుదారులు కొనియాడుతున్నారు.

ఎర్నెస్టో డొమింగో: వైద్య పరిశోధకుడు. ఫిలిప్పైన్స్లో అందరికీ ఆరోగ్యం అందించడానికి కృషి చేస్తున్నారు. ఆ దేశంలో ఆరోగ్యానికి ప్రభుత్వ నిధులు చాలా తక్కువగా అందుతున్నాయి.

శక్తి సమూహ: నేపాల్కు చెందిన ఈ సంస్థను మానవుల అక్రమ రవాణాలో బయటపడ్డవారు నెలకొల్పారు. ఈ సంస్థ సహచర బాధితులకు గృహాలు, అత్యవసర ఆవాసాలు కల్పించి సహాయం చేస్తోంది.

కరెప్షన్ ఎరాడికేషన్ కమిషన్: ఇండోనేషియాకు చెందిన అవినీతి నిర్మూలన కమిషన్. ఈ సంస్థ 2004-10 మధ్యలో 169 అవినీతి కేసుల్లో 100 శాతం శిక్ష పడేందుకు పోరాడింది.

మనీలా (ఫిలిప్పైన్స్)లోని రామన్ మెగసెసే ఫౌండేషన్ ఈ అవార్డులను అందిస్తోంది. విమాన ప్రమాదంలో మరణించిన ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు మెగసెసే పేరుతో ఈ అవార్డును 1957లో ఏర్పాటు చేశారు. ఆసియాలో సామాజిక మార్పుకు కృషి చేస్తున్న వ్యక్తులు, గ్రూపులకు ఈ అవార్డును బహూకరిస్తారు.

అజీమ్ ప్రేమ్జీకి ఏషియన్ బిజినెస్ లీడర్ అవార్డ్ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ (68)కి ఈ ఏడాది ఏషియన్ బిజినెస్ లీడర్ అవార్డు లభించింది. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏషియా హౌస్ ఈ అవార్డును అందజేస్తోంది. ఆయన వ్యాపార కృషి, సమాజ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. గతంలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటాకు ఈ అవార్డు లభించింది. 

కిరణ్‌బేడీకి నోమురా అవార్డ్‌మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌బేడీ మానవతా సేవలకు గుర్తింపుగా సింగపూర్‌లో ఆమెకు నోమురా అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డ్‌ కింద 10 వేల యూఎస్‌ డాలర్లు అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్‌బేడీ మాట్లాడుతూ అవార్డు కిందొచ్చిన మొత్తం సొమ్మును ఖైదీల పిల్లల విద్యాభివద్ధికి అందజేస్తానని తెలిపారు. భవిష్యత్‌ తరాల మెరుగు కోసం కషి చేస్తున్న వారికోసం జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నోమురా గ్రూప్‌ ఈ అవార్డులను ఇస్తుంది.

అవార్డులు మే 2013

అవార్డులు మే 2013
లిడియా డేవిస్‌కు బుకర్‌ప్రై జ్ప్రతిష్టాత్మక బుకర్ ప్రై జ్ అమెరికా రచయిత్రి లిడియా డేవిస్‌ను వరించింది. ఈ పోటీలో భారత్‌కు చెందిన ప్రఖ్యాత కన్నడ రచయిత యూఆర్.అనంతమూర్తి తుదివరకు పోటీలో ఉన్నా బహుమతి మాత్రం డేవిస్‌కే దక్కింది. సృజనాత్మకతతో కూడిన రచనలు చేయడంలో తనకుతానే సాటిగా పేరొందిన ఆమె బుకర్ ప్రైజ్ కింద 60 వేల పౌండ్లను (సుమారు రూ. 50 లక్షలు) సొంతం చేసుకున్నారు.

అబ్దుల్ కలాంకు అమెరికా వాన్‌బ్రాన్ అవార్డుభారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ప్రతిష్టాత్మకమైన వెర్నర్‌వాన్ బ్రాన్ మెమోరియల్ అవార్డును మే 25న ప్రదానం చేశారు. ఈ అవార్డును రోదసీ సంబంధ పరిశోధనల్లో కృషి చేసిన వారికి అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ అందిస్తుంది.

కేరళ ముఖ్యమంత్రి చాందీకి యూఎన్ అవార్డుకేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఐక్యరాజ్యసమితి ప్రజా సేవ అవార్డును ప్రకటించింది. రాష్ట్రంలో ప్రజల వద్దకు ప్రత్యక్షంగా వెళ్తూ వారి సమస్యలను పరిష్కరిస్తుండటంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది. 2003 నుంచి ప్రజా సేవా దినం (జూన్ 23) సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఐదుగురికి ఈ అవార్డులు ఇస్తోంది. వీటిలో ఈ ఏడాది ఆసియా - పసిఫిక్ జోన్ కింద ఊమెన్ చాందీకి అవార్డు దక్కింది. చాందీ ప్రజలను కలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 5.5 లక్షల ప్రజల వినతులను అందుకోగా వాటిలో మూడు లక్షల వినతులను పరిష్కరించారు. ఇందుకోసం 22.68 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 

మలాలాకు గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డుపాకిస్థాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్.. 2013కుగాను గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. బాలికల విద్య, సాధికారతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది. యూఎన్ ఫౌండేషన్, యునెటైడ్ నేషన్స్ అసోషియేషన్ ఆఫ్ ది యూఎస్‌ఏ.. ఈ అవార్డును నవంబరు 6న మలాలాకు ప్రదానం చేస్తుంది. బాలికల విద్యపై ప్రచారం చేస్తున్న మలాలాపై గతేడాది తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.

మిస్ ఇండియా వరల్డ్‌వైడ్‌గా నేహాల్భారత సంతతికి చెందిన బ్రిటన్ వనిత నేహాల్ బొగైటా ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్’గా ఎంపికైంది. ఈ టైటిల్‌ను సాధించిన మొదటి బధిర యువతిగా ఆమె రికార్డు సష్టించింది. ఏప్రిల్ 27న మలేిషియా రాజధాని కౌలాలంపూర్‌లో ముగిసిన ఈ పోటీల్లో తొలి రన్నరప్‌గా జస్వీర్‌కౌర్ సంధు (మలేసియా), రెండో రన్నరప్‌గా సుర్బీ సచ్‌దేవ్ (ఒమన్) నిలిచారు. కిరీటం కోసం ఒక బధిర అభ్యర్థిని పోటీలో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి.

అపరాజితా దత్తాకు వైట్‌లీ అవార్డుగ్రీన్ అస్కార్‌గా వ్యవహరించే ‘వైట్ లీ అవార్డు’ పక్షి సంరక్షకురాలు అపరాజితా దత్తాకు దక్కింది. అరుణాచల్ ప్రదేశ్‌లో అంతరించి పోయే ప్రమాదంలో ఉన్న హార్‌‌నబిల్ పక్షులను కాపాడేందుకు చేసిన విశేష కషికి గుర్తింపుగా దత్తాకు ఈ పురస్కారం లభించింది. లండన్ రాయల్ జియోగ్రఫికల్ సొసైటీలో మే 3న ఈ అవార్డును ప్రదానం చేశారు. తూర్పు హిమాలయాల్లో హార్న్‌బిల్ పక్షుల సంరక్షణ కార్యక్రమానికి దత్తా నాయకత్వం వహించారు. 

భారతీయ వైద్యుడికి అవార్డుపొగాకు పదార్థాల నియంత్రణకు కషి చేసినందుకుగాను ముంబైలోని టాటా స్మారక ఆసుపత్రి క్సాన్సర్ వైద్య నిపుణుడు పంకజ్ చతుర్వేది ప్రతిష్టాత్మక ‘జ్యూడీ వికెన్‌ఫెల్డ్’ పురస్కార్నాన్ని మే 2న వాషింగ్టన్‌లో అందుకున్నారు.

వంశీ వకులాభరణంకు అమర్త్యసేన్ అవార్డు హైదరాబాద్ యూనివర్సిటీ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ వంశీ వకులాభరణం ప్రొఫెసర్ అమర్త్య సేన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది నుంచి అందించే ఈ అవార్డును ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఏర్పాటు చేసింది. 10 విభాగాల్లో సామాజిక శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు.

అవార్డులు ఏప్రిల్ 2013

అవార్డులు ఏప్రిల్ 2013
ఏనుగు శ్రీనివాసులు రెడ్డికి దక్షిణాఫ్రికా ‘నేషనల్ ఆర్థర్’ సత్కారందక్షిణాఫ్రికా ప్రభుత్వం అత్యున్నత జాతీయ పురస్కారం ‘నేషనల్ ఆర్థర్’ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏనుగు శ్రీనివాసులు రెడ్డికి లభించింది. మరో ఆరుగురు భారత సంతతి వ్యక్తులతో కలుపుకొని 38 మంది దేశ, విదేశీయులకు కూడా ఈ అవార్డును బహూకరించారు. ఈ సత్కారాన్ని దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం ఏప్రిల్ 27న ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ ప్రదానం చేసారు. దౌత్యవేత్త అయిన శ్రీనివాసులు రెడ్డి 1963 నుంచి జాతివివక్ష వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. 

సైనా నెహ్వాల్‌కు ‘యుధ్‌వీర్’ అవార్డుబ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు 2013 సంవత్సరానికి గానూ ‘యుధ్‌వీర్’ అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సాధించిన ఘనతకు సైనాకు ఈ అవార్డు దక్కింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు యుధ్‌వీర్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. 1992 నుంచి ప్రతి ఏటా వివిధ రంగాల్లో కషి చేసిన వారికి ‘యుధ్‌వీర్’ స్మారక ఫౌండేషన్ ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు కింద ’ 50,000 నగదు అందజేస్తారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, డాక్టర్ అంజిరెడ్డి, శ్యామ్ బెనగల్, శాంతా సిన్హా తదితరులకు గతంలో ఈ అవార్డును బహూకరించారు.

రావూరికి జ్ఞానపీఠ్ప్రముఖ రచయిత రావూరి భరద్వాజకు 2012 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డు (48వ) దక్కింది. ఆయన రాసిన ‘పాకుడురాళ్లు’ నవలకుగాను ఈ పురస్కారం లభించింది. తొలిసారి తెలుగు వచన రచనకు ఈ అవార్డు దక్కింది. తెలుగులో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని దక్కించుకున్న మూడో వ్యక్తి భరద్వాజ. ఇంతకు ముందు 1970లో విశ్వనాథ సత్యనారాయణ, 1988లో సి.నారాయణ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రావూరి 1968, 1983లో రాష్ర్టసాహిత్య అకాడమీ అవార్డు, 1983లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1987లో రాజాలక్ష్మీ అవార్డులను అందుకున్నారు. 37 కథా సంపుటాలు, 17 నవలలు, బాలల కోసం 6 నవలలు, 5 కథా సంకలనాలు, 3 వ్యాసాలు, 8 నాటకాలు రాశారు. కాదంబరి, పాకుడు రాళ్లు, జీవన సమరం, ఇనుపతెర వెనుక, కౌముది వంటి రచనలు భరద్వాజకు మంచి పేరు తెచ్చాయి. భారత ప్రభుత్వం అందజేసే అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్. ఈ అవార్డు కింద ప్రశంసపత్రం, రూ.7 లక్షల నగదు బహూకరిస్తారు. 2011 సంవత్సరానికి ఒడిశా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్‌కు ఈ పురస్కారం లభించింది.

న్యూయార్క్ టైమ్స్‌కు పులిట్జర్ అవార్డులున్యూయార్క్ టైమ్స్ పత్రికకు నాలుగు పులిట్జర్ అవార్డులు లభించాయి. పులిట్జర్ ఫిక్షన్ పురస్కారం రచయిత అడమ్ జాన్సన్‌కు దక్కింది. ‘ది ఆర్ఫాన్ మాస్టర్స్ సన్’ నవలకుగాను ఈ అవార్డు దక్కింది.

ఈక్రోలినీకి గోల్డ్‌మ్యాన్ ప్రెజ్పర్యావరణవేత్త రోసానో ఈక్రోలినీ 2013 గోల్డ్‌మ్యాన్ ప్రెజ్‌కు ఎంపికయ్యాడు. ఇటలీలో జీరో వేస్ట్ మూవ్‌మెంట్ దిశగా చేసిన కషికిగాను ఈక్రోలినీకి ఈ అవార్డు దక్కింది. పర్యావరణ రంగంలో గోల్డ్‌మ్యాన్ ప్రెజ్‌ను ఆస్కార్స్‌తో సమానంగా భావిస్తారు. 

సిక్కింకు ప్రధాని గ్రామీణాభివద్ధి అవార్డుప్రతిష్టాత్మక ప్రధానమంత్రి గ్రామీణాభివద్ధి అవార్డు 2011-12 సంవత్సరానికి సిక్కిం గ్రామీణాభివద్ధి నిర్వహణ, అభివద్ధి శాఖకు లభించింది. ఈ అవార్డును ఏప్రిల్ 21న ‘సివిల్ సర్వీస్ డే’ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బహూకరించారు. ప్రజాపాలనకు సంబంధించి వివిధ అంశాల్లో కషి చేసిన అధికారులకు కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి పుర స్కారాలు అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతెవాడ జిల్లాలో విద్యావ్యాప్తికి చేసిన కషికిగానూ ఐఏఎస్ అధికారి ఓపీ చౌదరి ప్రధానమంత్రి పురస్కారం అందుకున్నారు. 

రాజ్ చెట్టికి జాన్ బేట్స్ క్లార్క్ పురస్కారం భారత సంతతికి చెందిన అమెరికా ఆర్థికవేత్త రాజ్‌చెట్టి (33)కి ప్రతిష్టాత్మక ‘జాన్‌బేట్స్ క్లార్క్’ పురస్కారం లభించింది. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి తర్వాత అత్యంత విశిష్ట పురస్కారం ఇదే. ఈ అవార్డు పొందిన ప్రతి ముగ్గురిలో ఒకరికి నోబెల్ బహుమతి లభిస్తుందని భావిస్తారు. అందువల్ల ఈ అవార్డును ‘బేబీ నోబెల్’గా పిలుస్తారు. ఆర్థిక రంగంలో విశేష కషి చేసిన 40 ఏళ్లలోపు అమెరికన్లకు అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఈ బహుమతి అందజేస్తుంది. 

గోపాల్ గురుకు మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డుజవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ గోపాల్ గురుకు 2013-14 సంవత్సరానికి మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు దక్కింది. డవలప్‌మెంట్ స్టడీస్‌లో ఆయన చేసిన కషికిగాను ఈ పురస్కారాన్ని చెన్నైలోని మాల్కోమ్ ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ఏప్రిల్ 18న ప్రకటించింది. 

ప్రాణ్‌కు ఫాల్కే అవార్డు
ఒకనాటి బాలీవుడ్ నటుడు ప్రాణ్ కిషన్ సికంద్(93)కు 2012 సంవత్సరానికి గానూ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. ఇది దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, రూ.10 లక్షల నగదు బహూకరిస్తారు. ఈ అవార్డు అందుకున్నవారిలో ప్రాణ్ 44వ పురస్కారగ్రిహీత. మే 3వ తేదీన జరిగే ఒక కార్యక్రమంలో ప్రాణ్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో ఈ అవార్డును 1969లో ఏర్పాటు చేశారు. తొలి అవార్డును నటి దేవికా రాణికి బహూకరించారు. ప్రాణ్ తన 60 ఏళ్ల చలన చిత్ర జీవితంలో 400పైగా చిత్రాల్లో నటించారు. విలన్, సహాయనటుడు పాత్రలు పోషించారు.‘ఆజాద్’ ‘దేవదాస్’, ‘మధుమతి’, ‘జంజీర్’ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

డెస్మండ్ టూటుకు టెంపుల్టన్ ప్రెజ్దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, కేప్‌టౌన్ మాజీ ఆర్చ్ బిషప్ డెస్మండ్ టూటుకు (81) 2013 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక టెంపుల్టన్ ప్రెజ్ లభించింది. ప్రేమను పంచడం, తప్పులను మన్నించడం అనే క్రెస్తవ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నందుకు, దీనికోసం జీవితాన్ని అంకితం చేసినందుకు ఆయన్ను ఈ ప్రెజ్‌కు ఎంపిక చేసినట్లు టెంపుల్టన్ ఫౌండేషన్ తెలిపింది. లండన్‌లోని గిల్డ్‌హాల్‌లో మే 21న జరిగే కార్యక్రమంలో టూటుకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

టెమ్స్ ఆఫ్ ఇండియా సినీ అవార్డులుటైమ్స్ ఆఫ్ ఇండియా తొలిసారిగా సినీ అవార్డులను ఇవ్వడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఏప్రిల్ 6న వాంకోవర్ (కెనడా)లో జరిగింది. వివరాలు.. ఉత్తమ చిత్రం- బర్ఫీ; ఉత్తమ దర్శకుడు- అనురాగ్ బసు(బర్ఫీ) ; ఉత్తమ నటుడు-రణబీర్ కపూర్(బర్ఫీ); ఉత్తమ నటి - ప్రియాంక చోప్రా(బర్ఫీ); ఉత్తమ నూతన నటీ- ఇలియానా (బర్ఫీ) ; ఉత్తమ నూతన నటుడు -ఆయుష్మాన్ ఖురానా (వికీ డోనర్) ; ఉత్తమ విలన్ - రిషికపూర్ (అగ్నిపథ్); ఉత్తమ హస్యనటుడు - అభిషేక్ బచ్చన్ (బోల్ బచ్చన్); ఉత్తమ సంగీత దర్శకుడు - అజయ్ అతుల్ (అగ్నిపథ్). 

అవార్డులు మార్చి 2013

అవార్డులు మార్చి 2013
డా. ఎం.వై.ఎస్. ప్రసాద్‌కు నాయుడమ్మ అవార్డుసతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) డెరైక్టర్ ఎం.వై.ఎస్ ప్రసాద్‌కు 2013 నాయుడమ్మ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని నెల్లూరులో 2013 మార్చి 30న ప్రదానం చేశారు. నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌ఆల్టర్నేటివ్స్, తమిళనాడులోని ఆర్.ఎం.కె. ఇంజనీరింగ్ కళాశాల ఈ అవార్డును అందిస్తున్నాయి.

సుగతా కుమారికి సరస్వతీ సమ్మాన్మలయాళ కవయిత్రి సుగతా కుమారికి 2012 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ‘సరస్వతీ సమ్మాన్’ అవార్డు లభించింది. ఆమె రాసిన కవితా సంపుటి ‘మన వెజుతు’ కు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డును కె.కె. బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద రూ. 10లక్షల నగదు, ప్రశంసాపత్రం బహూకరిస్తారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలన చిత్ర అవార్డులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011 సంవత్సరానికిగాను చలన చిత్ర అవార్డులను మార్చి 24న ప్రకటించింది. వివరాలు..
 
  1. ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు - అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ నటుడు).
  2. బీఎన్‌రెడ్డి ఆత్మీయ అవార్డు - శ్యాంబెనగల్ (దర్శకుడు)
  3. నాగిరెడ్డి - చక్రపాణి జాతీయ అవార్డు - జి.ఆదిశేషగిరిరావు (నిర్మాత, పద్మాలయ స్టూడియో అధినేత)
  4. రఘపతి వెంకయ్య అవార్డు - కైకాల సత్యనారాయణ (నటుడు)
  5. ఎన్టీఆర్ అవార్డు కింద రూ. ఐదు లక్షలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, మిగిలిన అవార్డుల కింద రూ. రెండు లక్షలు, జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేస్తారు.
పీర్రే డెలిగ్నేకు అబెల్ ప్రెజ్బెల్జియం గణిత శాస్త్రవేత్త పీర్రే డెలిగ్నేకు 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ’అబెల్ ప్రెజ్’ లభించింది. ఆల్జీబ్రా, జియోమెట్రీ, నెంబర్ థియరీ, రిప్రజెంటేషన్ థియరీ వంటి అంశాలకు సంబంధించి ఆయన చేసిన కషికిగాను ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డును 2002లో నార్వే అకాడమీ ఆఫ్ సెన్సైస్ అండ్ లెటర్స్ ఏర్పాటు చేసింది. దీన్ని నోబెల్ బహుమతితో సమానంగా పరిగణిస్తారు (గణితశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి లేదు). పురస్కారం కింద మిలియన్ డాలర్లను బహూకరిస్తారు. ఈ అవార్డును మే 21న ఓస్లాలో ప్రదానం చేస్తారు. జాతీయ చలనచిత్ర అవార్డులు
ప్రముఖ దర్శకుడు బాసు ఛటర్జీ నేతత్వం లోని జ్యూరీ మా ర్చి 18న 2012 సంవత్సరానికి గాను 60వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల పేర్లు ప్రకటించింది. వివరాలు.. 
ఉత్తమ చిత్రం: పాన్ సింగ్ తోమర్ (హిందీ-దర్శకుడు: తిగ్మాంషూ ధూలియా)
ఉత్తమ నటుడు: 
ఇర్ఫాన్ ఖాన్ (హిందీ చిత్రం ‘పాన్ సింగ్ తోమర్’), విక్రమ్ గోఖలే(మరాఠీ చిత్రం ‘అనుమతి’) లకు సంయుక్తంగా.
ఉత్తమ నటి: ఉషా జాదవ్ (మరాఠీ చిత్రం ‘ధాగ్’)
ఉత్తమ దర్శకుడు: శివాజీ లోతన్ పాటిల్ (మరాఠీ చిత్రం ‘ధాగ్’)
ఉత్తమ జనరంజక చిత్రాలు: ‘విక్కీ డోనర్’ (హిందీ), ‘ఉస్తాద్ హోటల్’(మలయాళం)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం: ఈగ
తెలుగులో ఉత్తమ చిత్రం: ఈగ
ఉత్తమ సహాయ నటుడు: అనూ కపూర్ (విక్కీ డోనర్)
ఉత్తమ సహాయ నటి: డాలీ అహ్లూవాలియా(విక్కీ డోనర్), కల్పన (మలయాళ ‘తనిచల్లాంజన్’)
ఉత్తమ గాయకుడు: శంకర్ మహదేవన్(హిందీ చిత్రం ‘చిట్టగాంగ్’లోని బోలో నా.. పాట)
ఉత్తమ గాయని: ఆర్తీ అంక్లేకర్ తకేకర్ (మరాఠీ ‘సంహిత’లో పలకేనీ పాట)
ఉత్తమ బాల నటుడు/నటి: వీరేంద్ర ప్రతాప్ (‘దేఖ్ ఇండియన్ సర్కస్’), మైనన్ (‘101 చోడియంగల్’)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుధీర్ పల్సానే (కో:యాద్ చిత్రానికి)
ఉత్తమ సంగీత దర్శకత్వం: శైలేంద్ర బార్వే (మరాఠీ ‘సంహిత’)
ఉత్తమ నేపథ్య సంగీతం: బిజిబాల్(మలయాళ ‘కలియాచన్’)
ఉత్తమ గేయ రచయిత: ప్రసూన్ జోషీ (చిట్టగాంగ్‌లోని ‘బోలో నా’ పాటకు)

రాష్ట్రానికి జాతీయ పర్యాటక అవార్డులు2011-12 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారాలను కేంద్ర పర్యాటక శాఖ మార్చి 12న ప్రకటించింది. మొత్తం 36 విభాగాల్లో 87 అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను మార్చి 18న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. అందులో మన రాష్ట్రానికి ఏడు పురస్కారాలు లభించాయి.

వాటి వివరాలు...సమగ్ర పర్యాటకరంగ అభివద్ధి (రెస్ట్ ఆఫ్ ఇండియా విభాగంలో) - ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది; ఉత్తమ వారసత్వ నగరం - వరంగల్; ఉత్తమ విమానాశ్రయం (‘క్లాస్ టెన్ సిటీ’ విభాగంలో)- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్); ఉత్తమ విమానాశ్రయం (రెస్ట్ ఆఫ్ ఇండియా)- విశాఖపట్నం ఎయిర్‌పోర్టు; ‘మెడికల్ టూరిజం ఫెసిలిటీ’ అవార్డు-అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్; ఉత్తమ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్- హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్; బెస్ట్ సివిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డెస్టినేషన్ కేటగిరీ ‘ఎ’ సిటీ - గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).

ప్రణబ్‌కు బంగ్లా పురస్కారంభారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 3 నుంచి మూడు రోజులపాటు బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో మార్చి 4న ప్రణబ్‌ను.. బంగ్లా ప్రభుత్వం ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. 1971 నాటి దేశ స్వాతంత్య్రానికి చేసిన కషికిగాను ‘బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాట గౌరవ పురస్కారా’న్ని ఆయనకు బహూకరించింది. అదే రోజున ప్రణబ్ ఢాకా యూనివర్సిటీ నుంచి గౌరవ న్యాయ శాస్త్ర పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఢాకా యూనివర్సిటీని ‘ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ (తూర్పు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ)’ గా అభివర్ణించారు. 

ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు2010, 2011, 2012 సంవత్సరాలకు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాలను లోక్‌సభ స్పీకర్ కార్యాలయం మార్చి 6న ప్రకటించింది. వివరాలు..
2010-అరుణ్ జైట్లీ (బీజేపీ)
2011-కరణ్ సింగ్ (కేంద్ర మాజీ మంత్రి)
2012- శరద్ యాదవ్ (జనతాదళ్ -యు)
1995 నుంచి ఏటా ఒక పార్లమెంట్ సభ్యుడికి ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు.

నిర్భయకు అమెరికా పురస్కారంఢిల్లీ ధీర వనిత ‘నిర్భయ’ను ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ సాహస వనిత’ పురస్కారంతో అమెరికా ప్రభుత్వం గౌరవించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధైర్యసాహసాలు కనబరిచిన మహిళలతోపాటు మహిళా హక్కులు, సాధికారత కోసం సాహసోపేతంగా పోరాడే ధీరవనితలకు అమెరికా ప్రభుత్వం 2007 నుంచి ఏటా ‘అంతర్జాతీయ సాహస వనిత (ఉమెన్ ఆఫ్ కరేజ్)’ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ‘నిర్భయ’తోపాటు మరో తొమ్మిది మందిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వారిలో మలాలై బహదురి (అఫ్ఘానిస్థాన్), సమీరా ఇబ్రహీం (నో యువర్ రైట్స్ కో ఆర్డినేటర్, ఈజిప్ట్), జులియెటా కాస్టెల్లెనాస్ (రెక్టార్, నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ హొండూరస్, హొండూరస్), డాక్టర్ జోసెఫిన్ ఒబియాజుల ఒడుమాకిన్ (క్యాంపెయిన్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు, నైజీరియా), ఇలేనా మిలాషినా (మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్, రష్యా), ఫర్తున్ అదాన్ (ఇలామ్ శాంతి, మానవ హక్కుల కేంద్రం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సోమాలియా), టిజరింగ్ ఓయిసర్ (టిబెటిన్ రచయిత్రి, బ్లాగర్, చైనా), రజన్ జీతునాహ్ (స్థానిక సమన్వయ కమిటీల వ్యవస్థాపకురాలు, మానవ హక్కుల లాయర్, సిరియా), తా ఫోంగ్ తన్ (బ్లాగర్, వియత్నాం) ఉన్నారు. 

స్త్రీశక్తి పురస్కారాలుఢిల్లీ ధీర వనిత ‘నిర్భయ’ను మార్చి 8న (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) కేంద్ర ప్రభుత్వం ‘రాణి లక్ష్మీ బాయి-స్త్రీ శక్తి’ అవార్డుతో గౌరవించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నిర్భయ తల్లి ఈ అవార్డును స్వీకరించారు. సామాజిక అభివద్ధి రంగంలో మహిళలు సాధించిన విజయానికి గుర్తింపుగా ప్రతి ఏటా మహిళాదినోత్సవం సందర్భంగా ప్రఖ్యాతి చెందిన మహిళల పేరు మీదుగా కేంద్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కారాలను అందిస్తోంది. ఈ అవార్డు కింద రూ.3 లక్షల నగదు అందిస్తారు. ఈ ఏడాది ఈ పురస్కారాలకు నిర్భయతోపాటు ఎంపికైన వారి వివరాలు.. రాణి రుద్రమ దేవి అవార్డు- ప్రణీత తాలుక్‌దార్ (అసోం); రాణి గైదిన్లీ జీలియంగ్ అవార్డు-ఒమనా టి.కె. (కేరళ); మాతా జిజాబాయ్ అవార్డు-సోనికా అగర్వాల్ (ఢిల్లీ); దేవి అహల్యాబాయ్ హోల్కర్ అవార్డు- ఓల్గా డి.మెల్లో (మహారాష్ట్ర); కన్నగి అవార్డు- గురమ్మా హెచ్.సంకిన (కర్ణాటక).

రవి శంకర్‌కు ఠాగూర్ అవార్డు తొలిసారిగా ప్రదానం చేస్తున్న ఠాగూర్ అంతర్జాతీయ సాంస్కతిక, సామరస్య పురస్కారం సితార్ విద్వాంసుడు స్వర్గీయ పండిట్ రవిశంకర్‌కు లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 7న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రవిశంకర్ భార్య సుకన్యా శంకర్‌కు ఈ అవార్డును బహూకరించారు.

అవార్డులు ఫిబ్రవరి 2013

అవార్డులు ఫిబ్రవరి 2013
85వ ఆస్కార్ అవార్డులు 85వ ఆస్కార్ అవార్డులను అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఫిబ్రవరి 25న ప్రదానం చేశారు. భారతీయ కథా నేపథ్యంలో రూపొందిన ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రం నాలుగు ఆస్కార్లను సొంతం చేసుకుంది. వివరాలు..
ఉత్తమ చిత్రం-ఆర్గో, ఉత్తమ దర్శకుడు - ఆంగ్ లీ (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ నటుడు-డేనియల్ డే లూయిస్(లింకన్), ఉత్తమ నటి - జెన్నిఫర్ లారెన్స్ (సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్), ఉత్తమ సహాయనటుడు-క్రిస్టఫో వాల్ట్స్(జాంగో అన్‌చైన్డ్), ఉత్తమ సహాయ నటి - అన్నె హథవే (లెస్ మిసరబుల్స్), ఉత్తమ యానిమేషన్ చిత్రం - (బ్రేవ్), ఉత్తమ ఛాయాగ్రాహకుడు - క్లాడియో మిరండా (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - మైఖెల్ డానా (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - ఆడ్లె అడ్‌కిన్స్, పాల్ ఎప్‌వర్త్ (స్కైఫాల్), ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - క్వెంటిన్ టరాంటినో(జాంగో అన్‌చైన్డ్),ఉత్తమ అడాప్టడ్ స్క్రీన్‌ప్లే - క్రిస్ టెర్రియో (ఆర్గో), ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం - సెర్చింగ్ ఫర్ సుగర్‌మ్యాన్, ఉత్తమ లఘుచిత్రం- కర్ఫ్యూ; ఉత్తమ సంక్షిప్త చిత్రం - ఇన్నోసెంట్, ఉత్తమ విదేశీ చిత్రం - ఆమర్; ఉత్తమ ఎడిటింగ్ - విలియమ్ గోల్డెన్ బర్గ్(ఆర్గో), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - లైఫ్ ఆఫ్ పై, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - ఆండీ నెల్సన్, మార్క్ ప్యాటర్సన్, సైమన్ హేస్ (లెస్ మిసరబుల్స్), ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ - పర్ హాల్‌బర్గ్, కరెన్ బేకర్ ల్యాండర్స్ (స్కైఫాల్ ), పాల్ ఎన్ జె ఓట్టోస్సాన్ (జీరో డార్క్ థర్టీ)

టాటాకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అవార్డుటాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాను ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డుతో సత్కరించింది. ఫిబ్రవరి 21న ముంబైలో రతన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2012వ సంవత్సరానికి ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ ’ అవార్డు గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్‌కు లభించింది. ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసు కంపెనీల్లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఒకటి. 140 దేశాల్లో ఈ సంస్థ విధులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది.

బ్రేక్ త్రూ ప్రెజ్ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించనంత భారీ మొత్తంలో రూ.15 కోట్లతో (నోబెల్ బహుమతి కంటే రెండింతలు ఎక్కువ) ‘బ్రేక్ త్రూ ప్రెజ్’ అనే సైన్స్ బహుమతిని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుగెర్‌బర్గ్, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్‌లు నెలకొల్పారు. లైఫ్ సెన్సైస్‌లో విశేష కషి చేసిన వారికి ఈ అవార్డును బహూకరిస్తారు. ప్రారంభ సంవత్సరానికిగాను క్యాన్సర్, జెనెటిక్ పరిశోధనల్లో విశేష కషి చేసిన 11 మంది శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద గరిష్టంగా ఒక్కొక్కరికి 3 మిలియన్ డాలర్లు బహూకరిస్తారు. 

నరేంద్ర కోహ్లీకి వ్యాస సమ్మాన్ప్రముఖ హిందీ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ 2012 వ్యాస సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘నభూతో నభవిష్యతీ’ నవలకుగాను ఈ అవార్డు దక్కింది. కె.కె.బిర్లా ఫౌండేషన్ 1991లో వ్యాస సమ్మాన్ అవార్డును ఏర్పాటు చేసింది. పురస్కారం కింద 2.5 లక్షల నగదు అందజేస్తారు.

పండిట్ రవిశంకర్‌కు బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ అవార్డుసితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు మర ణాంతరం బెస్ట్ వరల్డ్ మ్యూ జిక్ అవార్‌‌డ లభించింది. లాస్‌ఏంజిల్స్‌లో ఫిబ్రవరి 11న 55వ గ్రామీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన కుమార్తె సితార్ విద్వాంసురాలు అనౌష్క శంకర్ అందుకున్నారు. పండిట్ రవిశంకర్ సంగీత మాలిక ది లివింగ్ రూం సెషన్‌‌స పార్‌‌ట-1కు ప్రపంచ ఉత్తమ సంగీతఆల్బం అవార్‌‌డ దక్కింది.

షార్ డెరైక్టర్ ప్రసాద్‌కు నాయుడమ్మ అవార్డుప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డు 2013 కుగాను షార్ డెరైక్టర్ డా’’ఎం.వై.ఎస్. ప్రసాద్‌కు లభించింది. పశ్చిమగోదావరికి చెందిన ప్రసాద్ గత 37ఏళ్లుగా ఇస్రోలో అనేక విభాగాల్లో పనిచేశారని నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్‌‌స సంస్థ తెలిపింది.

పాల్ హన్‌సేన్‌కు వరల్డ్ ప్రెస్ ఫొటోగ్రఫీ అవార్డుస్వీడన్ ఫొటో జర్నలిస్ట్ పాల్ హన్‌సేన్ 2012 ఏడాదికిగాను వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రఫీ అవార్‌‌డ గెలుచుకున్నాడు. ఇది ఫొటో జర్నలిస్టులకిచ్చే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం. 2012లో గాజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో చిన్నపిల్లలు మతిచెందిన దశ్యాన్ని చిత్రీకరించిన పాల్‌కు ఈ అవార్‌‌డ దక్కింది.

ఇలాభట్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రదానంప్రముఖ సంఘసేవకు రాలు ఇలా భట్‌కు 2011 ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ అభివద్ధి బహుమతిని ఫిబ్ర వరి 18న న్యూఢిల్లీ లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్‌‌స అసోసియేషన్ (సెవా) సంస్థను ఆమె స్థాపించారు. భారత ప్రభుత్వం అందచేసే ఈ బహుమతి కింద ఆమెకు ’25 లక్షలు బహూకరించారు. 2012 సంవత్సరానికి ఈ అవార్డుకు సైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ ఎంపికయ్యారు.
2013 ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతిదక్షిణ సూడాన్‌కు చెందిన బిషప్ ఎమిరైటస్ పరైడ్ తబన్‌కు 2013 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతి దక్కింది. ఈ బహుమతిని ‘సెర్గియా వియోరా డి మెల్లో’గా పిలుస్తారు. అంతర్గత ఘర్షణలతో దెబ్బతిన్న ప్రాంతంలో జాతుల మధ్య పరస్పర విశ్వాసం నెలకొల్పడానికి చేసిన కషికి గాను తబన్‌కు శాంతి బహుమతి లభించింది. దక్షిణ సూడాన్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న కురోన్‌లో 2005లో తబన్ ఏర్పాటు చేసిన ‘హోలీ ట్రినిటీ పీస్ విలేజ్’ పలు తెగలు, జాతుల మధ్య సయోధ్య, సామరస్యం నెలకొనేందుకు కషి చేస్తోంది. ఈ బహుమతిని మార్చి 1న జెనీవాలో తబన్‌కు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ బహూకరిస్తారు. 2003లో ఇరాక్‌లో బాంబు దాడిలో మరణించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం అధిపతి సెర్గియో వియోరా డీ మెల్లో (బ్రెజిల్) పేరిట ఈ బహుమతిని అందజేస్తున్నారు. ఈ బహుమతి కింద 5,500 డాలర్లు బహూకరిస్తారు.

భారత సంతతి మహిళకు ఆస్ట్రేలియా మెడల్భారత సంతతికి చెందిన కష్ణ అరోరా (85) అలియాస్ 
ఆంటీజీకి 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెడల్’ లభించింది. ఆస్ట్రేలియాలో ఆమె చేసిన స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. గతేడాది ఈ పురస్కారం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు దక్కింది.

నోబెల్‌కు మలాలా నామినేట్తాలిబన్ల కాల్పుల్లో గాయపడిన పాకిస్థాన్ బాలిక మలాలా యూసుఫ్ జాయ్ పేరు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయింది. ఫ్రాన్స్, కెనడా, నార్వేలకు చెందిన ఎంపీలు ఈమె పేరును ప్రతిపాదించారు. ఫిబ్రవరి 1తో నోబెల్ బహుమతుల నామినేషన్ల ఘట్టం పూర్తయింది. అవార్డులను అక్టోబర్‌లో ప్రకటించనున్నారు. బాలికల విద్యపై తాలిబన్ల ఆంక్షలను వ్యతిరేకించిన కారణంగా గత ఏడాది అక్టోబర్ 9న స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న మలాలాపై తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మలాలాతోపాటు బెలారస్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త అలెస్ బెల్యాత్‌స్కీ, రష్యాకు చెందిన ల్యుద్‌మిలా అలెక్సీయేవా పేర్లు కూడా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాయి. నోబెల్ శాంతి బహుమతికి అర్హుల పేర్లను వివిధ సంస్థలు, వ్యక్తులు నామినేట్ చేయొచ్చు. ఆయా దేశాల జాతీయ చట్ట సభలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ కోర్టుల జడ్జీలు, యూనివర్సిటీల రెక్టార్లు, సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్లు, గతంలో ఈ అవార్డు పొందిన వ్యక్తులు, సంస్థలు నామినేట్ చేయొచ్చు. అలాగే నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రస్తుత, మాజీ సభ్యులు, మాజీ సలహాదారులు నామినేట్ చేసినా కూడా ఎంపిక కమిటీ పరిశీలిస్తుంది.

భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు అత్యున్నత అవార్డుభారతీయ అమెరికన్ శాస్త్రవేత్త రంగస్వామి శ్రీనివాసన్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మక ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డుతో సత్కరించారు. లేజర్ కిరణాలతో చేసిన పరిశోధనకుగాను శ్రీనివాసన్‌కు ఈ పురస్కారం దక్కింది. శామ్యూల్ బ్లమ్, జేమ్స్ విన్నే అనే మరో ఇద్దరు సహ ఆవిష్కర్తలతో కలిసి శ్రీనివాసన్ ఈ అవార్డును అందుకున్నారు. దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే. 1980లో ఈ అవార్డును ఏర్పాటు చేయగా.. 1985 నుంచి ప్రదానం చేస్తున్నారు.

ఈ-పాలనలో రాష్ట్రానికి రెండు అవార్డులుఆంధ్రప్రదేశ్‌కు ఈ-పాలనలో రెండు జాతీయ అవార్డులు లభించాయి. ‘వినియోగదారుల ప్రయోజనార్థం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ)ని ప్రభుత్వ రంగ సంస్థలు సజనాత్మకంగా ఉపయోగించడం’ అనే కేటగిరీలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్‌కు చెందిన ఈపీఐఎంఆర్‌ఎస్ ఐటీ విభాగానికి రజతం, ‘ఎగ్జెంప్లరీ రీ యూజ్ ఆఫ్ ఐసీటీ బేస్డ్ సొల్యూషన్స్’ కేటగిరీలో గురుకుల విద్యాసంస్థల్లో ఐటీ సేవలకుగాను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు కాంస్య పతకాలు లభించాయి. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో జైపూర్‌లో జరిగే ఈ-పాలన 16వ జాతీయ సదస్సులో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 

విశాఖ జిల్లాకు జాతీయ పురస్కారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై ఎనిమిదో జాతీయ సదస్సును ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ సామాజిక సమానత్వాన్ని పెంపొందించినందుకుగాను విశాఖ జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా విశాఖ జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి అందుకున్నారు.

డాక్టర్ లాల్జీ సింగ్‌కు నాయుడమ్మ అవార్డు2012 నాయుడమ్మ అవార్డుకు ప్రముఖ జీవ శాస్త్రవేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ లాల్జీ సింగ్ ఎంపికయ్యారు. డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, వన్యప్రాణి సంరక్షణ, బయో ఇన్ఫర్మేటిక్స్ పరిశోధనల్లో చేసిన కషికి గుర్తింపుగా లాల్జీ సింగ్‌కు ఈ పురస్కారం దక్కింది.

తల్లూర్‌కు స్కోడా ఆర్ట్ ప్రెజ్కర్ణాటకకు చెందిన చిత్రకారుడు ఎల్.ఎన్.తల్లూర్‌కు 2012 స్కోడా ఆర్ట్ ప్రెజ్‌ను ఫిబ్రవరి 1న ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, స్కోడా ట్రోఫీ బహూకరించారు.

అవార్డులు జనవరి 2013

అవార్డులు జనవరి 2013
సీఎన్‌ఆర్ రావుకు చైనా అవార్డు2012 సంవత్సరానికి ‘చైనా అకాడెమీ ఆఫ్ సెన్సైస్’ అవార్డుకు ప్రముఖ శాస్త్రవేత్త, భారత ప్రధానమంత్రి శాస్త్ర సలహా మండలి చైర్మన్, జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(బెంగళూరు) గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సీఎన్‌ఆర్ రావు ఎంపికయ్యారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కషి చేసిన శాస్త్రవేత్తలకు ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని చైనా ప్రదానం చేస్తుంది. సీఎన్‌ఆర్ రావుతోపాటు జర్మన్ జీవ శాస్త్రవేత్త హెర్బర్ట్ జాకల్, రష్యన్ అంతరిక్ష శాస్త్రవేత్త జి.ఎ.జెరెబ్‌త్సోవ్‌లకు కూడా ఈ అవార్డు లభించింది. రసాయనిక శాస్త్రవేత్త అయిన సీఎన్‌ఆర్ రావు పూర్తిపేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. 

పద్మ అవార్డులుకేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డులను జనవరి 25న ప్రకటించింది. మొత్తం 108 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. నలుగురికి పద్మవిభూషణ్, 24 మందికి పద్మభూషణ్, 80 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వీరిలో 24 మంది మహిళలు ఉన్నారు. వివరాలు..

పద్మవిభూషణ్: రఘునాథ్ మహాపాత్ర (ప్రఖ్యాత శిల్పి, ఒడిశా); ఎస్.హైదర్ రజా (చిత్రకారుడు, ఢిల్లీ); ప్రొఫెసర్ యశ్‌పాల్ (భౌతిక శాస్త్రవేత్త, ఉత్తరప్రదేశ్); ప్రొఫెసర్ రొద్దం నరసింహ (అంతరిక్ష శాస్త్రవేత్త, కర్ణాటక)
పద్మభూషణ్: డాక్టర్ కనక్ రేలే (ఆర్ట్- మహారాష్ట్ర), షర్మిలా టాగూర్ (ఆర్ట్- ఢిల్లీ), రాజేశ్‌ఖన్నా (మరణానంతరం-ఆర్ట్, మహారాష్ట్ర), జస్పాల్ భట్టీ (మరణానంతరం-ఆర్ట్, పంజాబ్), డాక్టర్ ఎ.శివథాను పిళ్లె (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఢిల్లీ), డాక్టర్ విజయ కుమార్ సారస్వత్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఢిల్లీ), ప్రొఫెసర్ సత్య ఎన్. అట్లూరి (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- యూఎస్‌ఏ), ప్రొఫెసర్ జోగేష్ చంద్రపతి (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- యూఎస్‌ఏ), రాహుల్ ద్రావిడ్ (క్రీడలు-కర్ణాటక), మేరీకామ్ (క్రీడలు-మణిపూర్).
పద్మశ్రీ: నానా పటేకర్ (ఆర్ట్-మహారాష్ట్ర), అవినాష్ చందర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఢిల్లీ), ప్రొఫెసర్ సంజయ్ గోవింద్ ధాండే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఉత్తరప్రదేశ్), ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ కుమార్ పాల్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- పశ్చిమ బెంగాల్) తదితరులు.
మన రాష్ట్రం నుంచి పద్మ అవార్డులు పొందిన వారు: పద్మభూషణ్: డి.రామానాయుడు (సినీ నిర్మాత). పద్మశ్రీ: గజం అంజయ్య (ఆర్ట్), రేకందర్ నాగేశ్వరరావు అలియాస్ సురభి బాబ్జీ (ఆర్ట్), డాక్టర్ ముదుండి రామకష్ణరాజు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), డాక్టర్ జయరామన్ గౌరీశంకర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్ అలియాస్ చిట్టా వెంకట సుందర రామ్ (వైద్యం), డాక్టర్ రాధిక హర్జ్‌బెర్గర్ (సాహిత్యం, విద్య). వీరుగాక.. రాష్ట్రానికి చెందిన సినీ ప్రముఖులు ఎస్.జానకి (తమిళనాడు- పద్మభూషణ్, ఈమె పురస్కారాన్ని తిరస్కరించారు), బాపు (తమిళనాడు-పద్మశ్రీ), శ్రీదేవి (మహారాష్ట్ర-పద్మశ్రీ)లకు ఇతర రాష్ట్రాల కోటాలో పద్మ అవార్డులు లభించాయి.

మేజర్ అనూప్‌కు కీర్తి చక్రఅత్యున్నత శౌర్య పతకాల్లో రెండోదైన ‘కీర్తి చక్ర’ పురస్కారం ఈ ఏడాది మేజర్ అనూప్ జోసఫ్ మంజలీకి లభించింది. జమ్మూకాశ్మీర్‌లో దేశరక్షణ కోసం వీరోచితంగా పోరాడినందుకు ఈ అవార్డు దక్కింది. విధి నిర్వహణలో అమరులైన నలుగురు జవాన్లు సహా 11 మందిని ‘శౌర్య చక్ర’ పతకానికి ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన అమర జవాన్లలో గత ఏడాది కాశ్మీర్‌లోని కుప్వారా వద్ద భారత చెక్‌పోస్ట్‌పై దాడిని తిప్పికొట్టిన రాజేశ్వర్ సింగ్, అనిల్‌కుమార్, సహాయకచర్యల్లో ప్రాణత్యాగం చేసిన ఎ.రాహుల్ రమేశ్, కాంగోలో తిరుగుబాటుదారులతో పోరాడి అమరుడైన క్రిషన్ కుమార్ ఉన్నారు. ఈ ఏడాది అత్యున్నత శౌర్యపతకం ‘అశోక చక్ర’కు ఎవరూ ఎంపిక కాలేదు. 

ఎన్నికల సంఘం అవార్డులుఉత్తమ ఓటర్ల విధానాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన కషికిగాను గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు 2012 సంవత్సరానికి ఎన్నికల సంఘం అవార్డులు దక్కాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.

ఆసియా నోబెల్ ప్రెజ్ ఏర్పాటుతైవాన్ వ్యాపారవేత్త సామ్యూల్ ఇన్ ఆసియా నోబెల్‌గా పేర్కొనే ‘ట్యాంగ్ ప్రెజ్’ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఈయన 101 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. 2014లో ప్రారంభమయ్యే ఈ బహుమతిని ప్రతి రెండేళ్లకోసారి ఇస్తారు. ‘నిరంతర అభివద్ధి’, ‘జీవ ఔషధ తయారీ’, ‘చైనా భాష చరిత్ర అధ్యయనం’, ‘చట్టబద్ధ పాలన’ అనే నాలుగు విభాగాల్లో జాతీయతతో సంబంధం లేకుండా ఎవ్వరికైనా అందజేస్తారు. ప్రతి కేటగిరీలో విజేతకు 1.7 మిలియన్ డాలర్లు ఇస్తారు. ప్రస్తుతం నోబెల్ విజేతలకు 1.2 మిలియన్ డాలర్లు ఇస్తున్నారు.

రాష్ట్ర మహిళా రైతుకు అంతర్జాతీయ అవార్డుతూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని మాచవరం పంచాయతీ పరిధి కోఠివారి అగ్రహారానికి చెందిన గరిమెళ్ల మైథిలి అంతర్జాతీయ స్థాయి మహిళా రైతు అవార్డుకు ఎంపికయ్యారు. సేద్యంలో ‘విస్తరణ ప్యూహాలు, జీవన విధానం పెంపుదల’ అంశం ఆధారంగా మైథిలిని నాగపూర్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి నలుగురు ఈ అవార్డుకు ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా రైతు విభాగంలో మైథిలి మాత్రమే ఎంపికయ్యారు. 

గుళ్లపల్లికి నౌమన్ అవార్డుఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావును ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్తమాలజీ ‘జీ ఓ హెచ్ నౌమన్’ అవార్డుతో సత్కరించింది. జనవరి 19న గుళ్లపల్లి ఈ అవార్డును స్వీకరించారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్తమాలజీ మాజీ అధ్యక్షుడు, ప్రఖ్యాత జర్మనీ నేత్ర వైద్యుడు నౌమన్ పేరుతో ఇచ్చే ఈ పురస్కారాన్ని నేత్ర సంరక్షణలో అత్యుత్తమ కషికి గుర్తింపుగా గుళ్లపల్లి ఎన్ రావుకు అందించారు.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు2013 సంవత్సరానికి 58వ ఫిల్మ్ ఫేర్ అవార్డులను జనవరి 21న ముంబైలో ప్రదానం చేశారు. వివరాలు..ఉత్తమ చిత్రం-బర్ఫీ
ఉత్తమ నటుడు-రణ్‌బీర్ కపూర్ (చిత్రం: బర్ఫీ)
ఉత్తమ నటి-విద్యాబాలన్ (చిత్రం: కహానీ)
ఉత్తమ దర్శకుడు- సుజోయ్ ఘోష్ (చిత్రం: కహానీ)
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- యశ్ చోప్రా (మరణానంతరం).

కృషి కర్మన్ అవార్డులుఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 15న ‘కషి కర్మన్’ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు పొందిన రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, నాగాలాండ్, మణిపూర్. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచినందుకు ఉత్తరప్రదేశ్ (తణధాన్యాలు), బీహార్ (ధాన్యం), జార్ఖండ్ (పప్పు ధాన్యాలు), హర్యానా (గోధుమ) బహుమతులు పొందాయి. తమిళనాడుకు చెందిన టి. అమలరాణి, పి. సొలైమలైకు ఉత్తమ రైతు అవార్డులు దక్కాయి.

మలాలాకు ఫ్రాన్స్ పురస్కారంపాకిస్థాన్ సాహస బాలిక, మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జై (15)కు ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక పురస్కారం ‘సైమన్ డీ బేవియర్’ దక్కింది. జనవరి 9న ప్యారిస్‌లో మలాలా తరపున ఆమె తండ్రి జియావుద్దీన్ యూసుఫ్‌జై ఈ అవార్డును అందుకున్నారు. బాలికల చదువు కోసం ప్రచారం చేస్తున్న మలాలాపై గతేడాది పాకిస్థాన్‌లో తాలిబన్లు కాల్పులు జరిపారు.

బెనగల్‌కు అక్కినేని అవార్డు ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ‘2012 అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు’కు ఎంపికయ్యారు. సామాజిక స్పృహ, మానవ హక్కుల నేపథ్యంలో అంకుర్, భూమిక, త్రికాల్, నిషాన్ వంటి ఎన్నో విలువైన చిత్రాలను ఈయన రూపొందించారు. 2005లో నెలకొల్పిన ఈ అవార్డును తొలిసారి ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు ప్రదానం చేశారు. 2011లో బాలీవుడ్ నటి హేమమాలినికి ఈ పురస్కారాన్ని అందజేశారు.

ముత్తునాయగం, సారస్వత్‌లకు ‘ఆర్యభట్ట’ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు 2010, 2011 సంవత్సరాలకు వరుసగా.. ప్రముఖ శాస్త్రవేత్తలు ఏఈ ముత్తునాయగం, వీకే సారస్వత్‌లకు లభించింది. ముత్తునాయగం కేంద్ర సముద్ర అభివద్ధిశాఖ కార్యదర్శిగా, ఇస్రోలో ద్రవీకత ఇంధన వ్యవస్థ కేంద్రం డెరైక్టర్‌గా సేవలందించారు. సారస్వత్ ప్రస్తుతం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) డెరైక్టర్ జనరల్‌గా, రక్షణ శాఖ ప్రధాన శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున్నారు. 

అవార్డులు డిసెంబరు 2012

అవార్డులు డిసెంబరు 2012
ప్రతిభా రేకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
ప్రముఖ ఒరియా నవలా రచయిత్రి, విద్యావేత్త ప్రతిభా రే.. 2011 సంవత్సరానికి ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.7 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. 1943లో జన్మించిన రే ఈ పురస్కారాన్ని అందుకోబోయే 47వ రచయిత్రి. ఈమె 20కి పైగా నవలలు, మరెన్నో యాత్రా కథనాలు, చిన్న కథలు, కవితలు, వ్యాసాలు రచించారు. 

శ్రీనివాసన్‌కు అమెరికా టెక్నాలజీ అవార్డుఅమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఇన్నోవేషన్’ అవార్డుకు భారత అమెరికన్ రంగస్వామి శ్రీనివాసన్ ఎంపికైయ్యారు. శ్రీనివాసన్ 1981లో అతి నీలలోహిత ఎక్సెమల్ లేజర్‌ను అభివద్ధి చేశారు. ఇది లాసిక్ శస్త్రచికిత్సలకు తోడ్పడుతుంది.

షాహబ్ గనేమ్‌కు ఠాగూర్ శాంతి బహుమతియుఏఈకి చెందిన ప్రముఖ కవి షాహబ్ గనేమ్‌కు ఠాగూర్ శాంతి బహుమతి లభించింది. కవిత్వం, శాంతి, ప్రేమలతో మానవ అవగాహనను అభివద్ధి చేసినందుకుగాను గనేమ్‌ను ఈ పురస్కారం దక్కింది. ఈయన భారతీయ కవిత్వాన్ని అరబిక్ బాషలోకి అనువదించారు. ఈ ఏడాది మే 6న కోల్‌కతాలో గనేమ్‌కు ఈ అవార్డును బహూకరిస్తారు.

ఈ పురస్కారాన్ని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదినోత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి రెండేళ్లకోసారి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

ఇళయరాజాకు సంగీత నాటక అకాడమీ అవార్డుప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతోపాటు మరో తొమ్మిది మందికి 2012 సంవత్సరానికి సంగీత అకాడమీ అవార్డు లభించింది. సంగీతం, నత్యం, రంగస్థల రంగాల్లో మొత్తం 36 మంది ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. అవార్డు కింద లక్ష నగదు, తామ్రపత్రం బహూకరిస్తారు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌నకు ముగ్గురు మాత్రమే ఎంపికయ్యారు. వారు వాయిద్య కళాకారుడు టీహెచ్ వినాయకరమ్, నాటక రచయిత రతన్ థియామ్, వయోలిన్ కళాకారుడు ఎన్. రాజం ఉన్నారు. వీరికి రూ. 3 లక్షలు బహూకరిస్తారు. ఇప్పటి వరకు 40 మంది మాత్రమే అకాడమీ ఫెలోషిప్ పొందారు.

హాకింగ్‌కు రూ.16.5 కోట్ల పురస్కారంప్రపంచంలోనే అత్యంత విలువైన సైన్స్ ‘యూరీ మిల్నర్ ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రెజ్ ఫౌండేషన్’పురస్కారం ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు దక్కింది. అవార్డు కింద ఆయనకు 30 లక్షల డాలర్లు (దాదాపు 16.5 కోట్ల రూపాయలు) మొత్తం లభించనుంది. విశ్వ రహస్యాలను తెలుసుకోవటానికి కషి చేస్తున్న లార్జ్ హాడ్రాన్ కొలైడార్ (ఎల్‌హెచ్‌సీ)కి చెందిన ఏడుగురు శాస్త్రవేత్తలకు కూడా ఈ పురస్కారం లభించింది. కష్ణ బిలాల నుంచి రేడియో ధార్మికత విడుదలవుతోందని కనుగొనటమే కాకుండా క్వాంటం గురుత్వశక్తి, తొలి నాళ్ల విశ్వంపై చేసిన పరిశోధనలకుగాను హాకింగ్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. యూరీ మిల్నర్ రష్యాకు చెందిన వ్యాపారవేత్త. భౌతికశాస్త్రంలో చేస్తున్న పీహెచ్‌డీని మధ్యలో వదిలేసి.. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సంస్థల్లో పెట్టుడులు పెట్టి పెద్ద ఎత్తున సంపాదించాడు. సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో పరిశోధనలను ప్రోత్సహించటం కోసం తన పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి అవార్డులు అందజేస్తున్నాడు.

గ్రామీ జీవిత సాఫల్య పురస్కారం: ప్రపంచ ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు దివంగత పండిట్ రవిశంకర్‌కు ‘గ్రామీ జీవిత సాఫల్య అవార్డు’ లభించింది. 2013కి గాను మరణానంతరం ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం పొందిన తొలి భారతీయుడు రవిశంకరే కావడం విశేషం.

ముల్కనూర్ డెయిరీకి జాతీయ అవార్డుకరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా స్వకృషి డెయిరీకి ఉత్తమ జాతీయ సహకార సంఘం అవార్డు లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్ 8న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ అవార్డును ప్రదానం చేశారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) స్వర్ణోత్సవ ఏడాది సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రతిభ సహకార సంస్థలకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. అందులో భాగంగానే ముల్కనూర్‌తోపాటు రాంపూర్ గావ్ పంచాయత్ సమాబే సమితి లిమిటెడ్ (అసోం), సమర్థ్ సహకారీ సఖర్ కార్ఖానా లిమిటెడ్ (మహారాష్ట్ర) లకు పురస్కారాలు అందజేశారు.

తాన్‌సేన్ సమ్మాన్’ పురస్కారాలుప్రతిష్టాత్మక ‘జాతీయ తాన్‌సేన్ సమ్మాన్’ పురస్కారానికి ప్రముఖ గాయక ద్వయం రాజన్, సాజన్ మిశ్రాలు ఎంపికయ్యారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సేవ చేసినందుకుగానూ 2011-12కు వారికి ఈ పురస్కారం లభించింది.

భారతీయులకు రోలెక్స్ పురస్కారాలుప్రతిష్టాత్మక రోలెక్స్ అంతర్జాతీయ పురస్కారాలకు ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఐదుగురు ఈ గౌరవానికి అర్హత సాధించగా.. మన దేశం నుంచి పర్యావరణవేత్త అరుణ్ కృష్ణమూర్తి, ఇంజనీర్ సుమిత్ దగార్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సుమారు 900 మంది విద్యార్థులతో కలిసి చెన్నైలోని కిల్కత్తలై సరస్సు బాగుకు చేస్తున్న కృషికిగాను అరుణ్‌కు ఈ పురస్కారం దక్కింది.

శ్రీలంక తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనాశ్రీలంకకు చెందిన తొలి ఉపగ్రహాన్ని చైనా నవంబర్ 27న ప్రయోగించింది. సూపర్‌శాట్ అనే ప్రైవేట్ కంపెనీకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని చైనా ప్రభుత్వ సంస్థ గ్రేట్ వాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్.. జీచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించింది. ఈ ప్రయోగంలో శ్రీలంక ప్రభుత్వం పాల్పంచుకోలేదు.

ఐరాసలో పాలస్తీనాకు పరిశీలక హోదాఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లేని పరిశీలక దేశం హోదా పాలస్తీనాకు దక్కింది. ఈ హోదాను కల్పించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నవంబర్ 30న ఆమోదం తెలిపింది. ఈ సర్వసభ్య సమావేశంలో 193 సభ్య దేశాలకుగాను భారత్ సహా 138 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా, ఇజ్రాయెల్, కెనడా, చెక్ రిపబ్లిక్ సహా తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి. బ్రిటన్ సహా 41 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. పాలస్తీనా స్థాయి పెరగటం వల్ల.. హత్యాకాండ, యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిపై విచారణ జరిపే హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ స్థానం వంటి సంస్థల సేవలు ఇకపై ఆ దేశానికి అందుబాటులోకి వస్తాయి. ‘పాలస్తీనా స్ప్రింగ్’ పేరుతో పాలస్తీనాను గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా అథారిటీ 2011లో తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. 2011 నవంబర్‌లో యునెస్కో లో పాలస్తీనాకు సభ్యత్వం లభించింది.

భారతీయ అమెరికన్‌కు కీలక పదవిభారత సంతతికి చెందిన అంధుడైన అమెరికన్ సచిన్‌దేవ్ పవిత్రన్‌కు ఒబామా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. అమెరికాలో వికలాంగులకు సేవలందించే స్వతంత్ర సంస్థ ఆర్కిటెక్చరల్, ట్రాన్స్‌పోర్టేషన్ బారియర్స్ కంప్లయన్స్ బోర్డులో సచిన్‌దేవ్‌ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు.

అవార్డులు నవంబరు 2012

అవార్డులు నవంబరు 2012
నారంగ్‌కు మూర్తి దేవి అవార్డుప్రముఖ ఉర్దూ రచయిత గోపీచంద్ నారంగ్‌కు 2010 మూర్తి దేవి అవార్డు లభించింది. నవంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ, నారంగ్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు.

లైబీరియా అధ్యక్షురాలికి ఇందిరా బహుమతిసామాజిక అశాంతి, అంతర్యుద్ధంతో తల్లడిల్లిన లైబీరియాలో శాంతి, ప్రజాస్వామ్యాలను పునరుద్ధరించి మహిళాలోకానికి ఆదర్శంగా నిలిచిన ఆ దేశాధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. లైబీరియాలో శాంతి, ప్రజాస్వామ్యం, అభివృద్ధి, భద్రతలను తిరిగి గాడిన పెట్టి, ఆఫ్రికా మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నందుకు ఆమెను ఈ ఏడాదికి గాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ నవంబర్ 19న వెల్లడించింది. సిర్లీఫ్ ఆఫ్రికా ఖండంలో ఒక దేశాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ స్మారక ట్రస్టు 1986లో ఏర్పాటు చేసిన ఈ అవార్డును ప్రతి సంవత్సరం ఇందిరా గాంధీ జన్మదినమైన నవంబర్ 19న ప్రకటిస్తారు. 2011లో ఈ అవార్డును సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు ఎలా బట్‌కు అందజేశారు. 

మాధవ్ చవాన్‌కు ‘వైజ్’ అవార్డుపేదలకు అతి తక్కువ ఖర్చుతో విద్యనందించి ముంబై మురికివాడల్లో విద్యా కుసుమాలు పూయించిన భారతీయ విద్యావేత్త, స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్’ సహ వ్యవస్థాపకుడైన మాధవ్ చవాన్‌కు ప్రతిష్టాత్మక ‘వైజ్ (WISE- The World Innovation Summit for Education)' అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని విద్యారంగంలో నోబెల్ బహుమతితో సమానంగా భావిస్తారు. ఖతర్ రాజధాని దోహలో జరిగిన నాలుగో వైజ్ సదస్సు సందర్భంగా చవాన్‌కు ఈ అవార్డును అందజేశారు. పురస్కారం కింద సుమారు రూ.2.74 కోట్ల నగదుతోపాటు బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. అమెరికాలో పీహెచ్‌డీ పూర్తి చేసిన అనంతరం చవాన్ 1986లో భారత్‌కు తిరిగి వచ్చి ముంబై యూనివర్సిటీలో రసాయనశాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. మురికివాడల్లో చిన్నారుల దుస్థితిని చూసి చలించిపోయారు. చదువే దీనికి నివారణగా భావించి వారిలో విద్యావ్యాప్తి కోసం శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించారు. యునిసెఫ్‌తోపాటు ప్రభుత్వ సహకారం తీసుకుని దేవాలయాలు, కార్యాలయాల వద్ద స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో విద్యాబోధన నిర్వహించారు.

గాయ్రత్రికి క్వోటో ప్రైజ్ప్రముఖ సాహితీ విమర్శకురాలు, విద్యావేత్త గాయత్రి చక్రవర్తి స్వివాక్‌కు ప్రతిష్టాత్మకమైన క్వోటో ప్రైజ్‌ను నవంబర్ 10న టోక్యోలో ప్రదానం చేశారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గాయత్రికి ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ విభాగంలో ఈ అవార్డు దక్కింది. అమెరికా కంప్యూటర్ శాస్త్రవేత్త ఇవాన్ సూథర్లాండ్‌కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ విభాగంలో, జపాన్ మాలిక్యులర్ బయోలజిస్ట్ యోషి నోరి ఒసుమికి బేసిక్ సెన్సైస్‌లో అవార్డు లభించింది.

భారత్ ఫోర్జ్ కళ్యాణికి జర్మనీ పురస్కారంభారత్ ఫోర్జ్ సీఎండీ, బాబా ఎన్. కళ్యాణికి జర్మనీ అత్యున్నత పురస్కారం ‘క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్’ లభించింది. ముంబైలో నవంబర్ 8న జరిగిన ఒక కార్యక్రమంలో జర్మనీ రాయబారి మైకేల్ స్టీనర్ ఈ అవార్డును ప్రదానం చేశారు. జర్మనీలో వ్యాపార కార్యకలాపాల ఏర్పాటుకు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి జర్మనీ యూనివర్శిటీలకు ఇతోధిక సహకారం అందించినందుకుగాను కళ్యాణికి ఈ పురస్కారం దక్కింది. 

ఇండియా టుడే అవార్డులు
ప్రముఖ ప్రచురణ సంస్థ ఇండియా టుడే నవంబర్ 1న ప్రతి ఏటా అందజేసే వార్షిక అవార్డుల జాబితాను ప్రకటించింది. ఇందులో పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక పురోగతి సాధించిన రాష్ట్రంగా గుజరాత్ వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. చిన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఈ ఘనత దక్కించుకుంది. గడిచిన ఏడాది కాలంలో సాధించిన పురోగతి ఆధారంగా, ఇండికస్ అనలైటిక్స్ అనే సంస్థతో కలిసి ఇండియాటుడే ఈ అవార్డులను ప్రకటించింది. వ్యవసాయం, ప్రాథమిక విద్య, వినియోగదారుల మార్కెట్, ప్రాథమిక ఆరోగ్యం, పరిపాలన, మౌలిక వసతులు, పెట్టుబడులు, స్థూల ఆర్థిక వ్యవస్థ అనే ఎనిమిది విభాగాల్లో సాధించిన పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. 

ఢిల్లీ మెట్రోకు జపాన్ పురస్కారంఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ)కు జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అవార్డు లభించింది. మానవ వనరుల అభివృద్ధి, భారత్-జపాన్ మధ్య సంబంధాల మెరుగుకు చేసిన కృషికిగాను డీఎంఆర్‌సీకి ఈ పురస్కారం దక్కింది.

ఐశ్వర్యారాయ్‌కు ఫ్రాన్స్ పురస్కారంముంబైలో నవంబర్ 1న జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఫ్రాన్స్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారమైన ‘ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ను స్వీకరించారు.

పీపుల్స్ హీరోగా సూపర్ 30 ఆనంద్నిరుపేద విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ పరీక్షలో ఉచితంగా శిక్షణ ఇస్తున్న సూపర్-30 ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్‌ను పీపుల్ మ్యాగజీన్ పీపుల్స్ హీరోగా గుర్తించింది. టైమ్ మేగజీన్ గ్రూప్‌నకు చెందిన పీపుల్స్ మ్యాగజీన్ తాజా సంచికలో ఆనంద్‌పై పూర్తి స్థాయి కథనం ప్రచురించింది. ఈ పత్రిక సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను పీపుల్స్ హీరోగా గుర్తించడం పరిపాటి. విద్యా రంగానికి చెందిన వ్యక్తికి ఈ హోదా కల్పించడం ఇదే మొదటి సారి.

రుచిర్ శర్మకు టాటా సాహిత్య అవార్డున్యూయార్క్‌కు చెందిన బ్యాంకర్ రుచిర్ శర్మకు ‘టాటా లిటరేచర్ ఫస్ట్ బుక్’ అవార్డును నవంబర్ 4న బహూకరించారు. ఆయన రాసిన ‘బ్రేక్ అవుట్ నేషన్స్: ఇన్ పర్స్యూట్ ఆఫ్ దినెక్ట్స్ ఎకనాబిక్ మిరాకిల్స్’ నవలకుగాను ఈ పురస్కారం దక్కింది.

జగ్జీవన్ రామ్‌కు బంగ్లా పురస్కారంభారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్‌కు మరణానంతరం బంగ్లాదేశ్ ప్రభుత్వం ‘ఫ్రెండ్స్ ఆఫ్ లిబరేషన్ వార్ హానర్’ అవార్డును ప్రకటించింది. 1971 బంగ్లా విముక్తి యుద్ధం సందర్భంగా ఆయన అందించిన సేవలకు గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. అప్పుడు ఆయన భారత రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా మోహన్ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) బోర్డులో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా డాక్టర్ రాకేశ్ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారత్‌తోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌లకు కూడా బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేశ్ గతంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పని చేశారు.