AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 15 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 15


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 15🌎*
                                                                *◼నవంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరములో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.*◼

  *⏱సంఘటనలు*⏱

*♦1937: కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).*

*♦1954: టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ 15 వరకు)*

*♦1954: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 28 వరకు).*

*♦1993: ఇండియన్ ఎయిర్‌లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు*

*♦2000: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.*

*♦2000: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.*

  *❤జననాలు*❤

*🔥1738: విలియం హెర్షెల్, వరుణ (యురేనస్‌) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (మ.1822)*

*🔥1883: ఓలేటి వేంకటరామశాస్త్రి, ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (మ.1939)*

*🔥1898: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (మ.1992)*

*🔥1902: గోరా, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (మ.1975)జి సైదేశ్వర రావు*

*🔥1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు సాహితీవేత్త.*

*🔥1935: తెన్నేటి హేమలత, నవలా రచయిత్రి.*

*🔥1949: మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలుగు రచయిత.*

*🔥1986: సానియా మీర్జా, భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.*

*🍃మరణాలు*🍃

*🌷1630: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (జ.1571)*

*🌷1949: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (జ.1910)*

*🌷1949: నారాయణ్ ఆప్తే, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త మరియు గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు.*

*🌷1982: వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1895)*

*🌷2012: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)*

*🔥అజంతా ఎల్లోరా  మహారాష్ట్రలోని ఆలయాలు🔥*

అజంతా-ఎల్లోరా గుహలు మహారాష్ట్ర ఔరంగాబాద్ నగరానికి సమీపంలో ఉన్నాయి. ఈ గుహలు పెద్ద రాళ్ళు కట్టడం ద్వారా తయారు చేస్తారు. 

అజంతాలో 29 గుహలు ఉన్నాయి, 34 గుహలు ఎల్లోరాలో ఉన్నాయి. ఈ గుహలు ప్రపంచ వారసత్వ రూపంలో భద్రపరచబడ్డాయి. వారు రాష్ట్రాకుట్ రాజవంశం పాలకులు నిర్మించారు. 

ఈ గుహల మిస్టరీ ఇప్పటికీ పరిశోధనలో ఉంది. ఇక్కడ సేజ్-మున్నీ మరియు ఆకలి లోతైన ధ్యానం మరియు ధ్యానం చేయటానికి ఉపయోగిస్తారు.
సహ్యాద్రి కొండలపై ఉన్న 30 గుహలు, సుమారు 5 ప్రార్థన భవన్ మరియు 25 బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. 

గుర్రపు ఆకారంలో నిర్మించిన ఈ గుహలు పురాతనమైనవి మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగినవి. 

ఇవి బౌద్ధ మతంలో 200 BC నుండి 650 AD వరకు చిత్రీకరించబడ్డాయి. ఈ గుహలలో, హిందూ, జైన మరియు బౌద్ధ మతాలు వైపు చూపించిన విశ్వాసం యొక్క త్రైనియల్ సంగమం యొక్క ప్రభావం కనుగొనబడింది. 

బౌద్ధమతం యొక్క దక్షిణాన ఉన్న 12 గుహలు (మహాయాన శాఖ ఆధారంగా), కేంద్ర హిందూ మతం యొక్క 17 గుహలు మరియు ఉత్తరాన 5 గుహలు జైనమతం ఆధారంగా ఉన్నాయి.

ఈ రోజు జికె 

*1)👉 చైనాలో ఇటీవల ప్రారంభించబడిన వేగవంతమైన బుల్లెట్టు  రైలుపేరేమిటి?*

A: *ఫక్సింగ్.*

*2)👉 ఇటీవల మరణించిన "దేశ బందు గుప్తా" ఏ రంగంలో ప్రసిద్ధుడు?*

A: *ఔషదరంగం.*

*3)👉 "రాయల్ సొసైటీ-2017" పురస్కారం పొందిన భారతీయుడు ఎవరు?*

A: *పీసపాటి వెంకటేశ్వర్లు.*

*4)👉 మహిళా వన్డే క్రికెట్ లో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన బ్యాట్స్ విమెన్ గా రికార్డు సృష్టించిన భారతీయ క్రికెటర్ ఎవరు?*

A: *మిథాలీరాజ్*

*5)👉తెలంగాణ మీడియా  అకాడమీ పేరు MATS" గా మార్చారు. దీని పూర్తి రూపం ఏమిటి?జి సైదేశ్వర రావు*

A: *మీడియా  అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్.*

*6)👉 "GST" యొక్క  పూర్తి రూపం ఏమిటి?*

A: *గూడ్స్ ఆండ్ సర్వీస్ టాక్స్.*

*7)👉 "తెలంగాణ సారస్వత పరిషత్తు" అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?*

A:  *ఎల్లూరి శివారెడ్డి.*

*8)👉 ఏ రాష్ట్రప్రభుత్వం అమలు చేసిన *" కన్యశ్రీ ప్రకల్ప*" పథకానికి ఐక్యరాజ్య సమితి అవార్డు లభించింది?*

A: *పశ్చిమ బెంగాల్.*

*9)👉 ఆఫ్రికాలో అత్యధికి జనాబా కలిగిన దేశం?*

A: *నైజీరియా.*

*10)👉 "సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్" (SPI) లో భారత్ ర్యాంక్ ఎంత?*

A: *93 వ ర్యాంక్.*

*🔥కరెంట్ అఫైర్స్ బిట్స్*🔥

నవ్యాంధ్రలో తొలిసారి ఎక్కడ బాలోత్సవం నిర్వహించబడుతోంది...
విజయవాడ 
గుంటూరు ✅
తిరుపతి 
విశాఖపట్నం

అంతర్జాతీయ వేదం సదస్సు ఎక్కడ నిర్వహించబడుతుంది ...
అమరావతి 
తిరుపతి 
పుట్టపర్తి ✅
మంత్రాలయం

2017 లో ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అధ్యక్షుడు ఎవరు ...
కేంద్ర పర్యాటకశాఖా మంత్రి 
కేంద్ర హోంమంత్రి ✅
కేంద్ర ఆర్థికశాఖా మంత్రి 
ప్రధానమంత్రి

ఫారిన్ ఎక్చేంజ్ మేనేజ్ మెంట్ ఆక్ట్ ఎప్పడు చేయబడింది ..
1996
1997
1998
1999✅

లేపిదోకిలస్ ఆలివేసియా దేని శాస్త్రీయ నామం ...
ఆలివ్ రిడ్ల తాబేలు ✅
ఆలివ్ మొక్క 
ట్యూనా  చేప 
టులిప్ మొక్క

ఇటీవల భారతదేశం ఏ ఐక్యరాజ్యసమితి అంగం యొక్క ఎక్జిక్యూటివ్ మెంబర్ అయింది ...
UNO
UNESCO✅
UNDP
2&3

ఆంధ్రప్రదేశ్ లోని క్రీడా వికాస కేంద్రాలకు ఎవరి పేరు పెట్టాలని సూచించడం జరిగింది ...
నాగేశ్వరరావు 
ఎన్టీయార్ ✅
అమితాబ్ బచ్చన్ 
ఎవరూ కాదు

బిడౌ నావిగేషన్ శాటిలైట్ సిస్టం అనేది ఏ దేశం యొక్క సొంత నావిగేషన్ సిస్టం ...
జపాన్ 
దక్షిణ కొరియా 
ఇజ్రాయిల్ 
చైనా✅

2017 ప్రపంచ యువ ఫోరం ఎక్కడ నిర్వహించబడుతుంది ...
ఈజిప్ట్ ✅
సౌదీ 
కజకిస్థాన్ 
బంగ్లాదేశ్

గాంధీజీ ఆన్ ఇలస్ట్రేటడ్ బయోగ్రఫీ అను పుస్తకాన్ని రాసింది ఎవరు ...
ప్రమోద్ కపూర్ ✅
క్రిస్టోఫర్ 
బిమర్ ఒలంగ్ 
చిత్తజల్లు వరహాల రావు


*🔥GK BITS🔥*

*1.అధికార భాష గురించి భారత రాజ్యాంగంలో ఏ అధికరణల్లో ప్రస్తావించారు?*

*జ: 343-351*

*2.Hicklin(హికిలిన్) పరీక్ష దేనికి సంబదించింది?*

*జ: .అశ్లీలత*

*3.విద్యాహక్కును ప్రాధమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా21(ఎ)నిబంధనలో చేర్చారు?*

*జ: .86 వ రాజ్యాంగ సవరణ-2002*

*4.మొట్ట మొదటి లోక్ సభ ఎప్పుడు ప్రారంభమైంది?*

*జ: 17 ఏప్రిల్  1952*

*5.జాతీయ గీతాన్ని ప్రచార సాధనాలలో ఉపయోగించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?జి సైదేశ్వర రావు*

*జ: శ్యామ్ నారాయణ్ చౌక్సి*

*6.ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?*

*జ: ఉత్తరప్రదేశ్*

*7.స్పాయిల్ సిస్టం ఏ దేశంలో అమల్లో ఉంది?*

*జ: అమెరికా*

*8.తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం ఎప్పుడు రూపొందించారు?*

*జ: 2007*

*9.ఆంధ్రప్రదేశ్ లో లోకాయుక్త వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?*

*జ: .1983*

*10.నేషనల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే ధ్రువపత్రం*

*జ: ఆధార్ కార్డ్*


🇮🇳 ఈ రోజు జికె 

1.ఎంటరిక్ జ్వరం అని ఏ జ్వరాన్ని అంటారు?
2.టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్ష?
3.అమరనాధ్ దేవాలయం ఎక్కడ ఉంది?
4.ఇడుక్కి జలవిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
5.గరం పానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
6.భగవద్గీతను మొట్ట మొదటిసారిగా ఆంగ్లంలో కి అనువదించన వారు?
7.ప్రముఖ నాయకులంతా అరెస్ట్ అయిన సమయంలో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించనవారు ఎవరు?
8.తెలంగాణ *కోటి రతనాల వీణ* అని సగర్వముగా ప్రకటించిన వ్యక్తి?
9.ముల్కి ఉద్యమం 1952 లో తెలంగాణలో ఎక్కడ ప్రారంభమైంది?
10.2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ, పురుషుల నిష్పత్తి
   🇮🇳🥇జవాబులు
1.టైఫాయిడ్
2.వైడల్ టెస్ట్
3.జమ్మూ కాశ్మీర్
4.కేరళ
5.అస్సాం
6.చార్లెస్ విల్కిన్సన్
7.అరుణాసఫలి
8.దాశరధి కృష్ణమాచార్యులు
9.వరంగల్
10.943/1000
ప్రతి వెయ్యిమంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు.

🇮🇳 *Current Affairs 

*రాష్ట్రీయం*
1) ప్రపంచ తెలుగు మహాసభల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఏది ?
జ: www.telangana.gov.in
2) తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: అనూప్ సింగ్ ( IFS అధికారి)
3) దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాగా హైదరాబాద్ సంజీవయ్య పార్క్ లోని జాతీయ జెండాను గుర్తించిన సంస్థ ఏది ?
జ: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
4) ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి భారత జట్టు తరపున ఎంపికైన తెలంగాణ అమ్మాయి ఎవరు ?
జ: గోనెళ్ళ నిహారిక

🎾 *జాతీయం*
5) ప్రధాని నరేంద్రమోడీ చతుర్భుజ కూటమిపై మనీలాలో వివిధ దేశాలతో చర్చలు జరిపారు. చతుర్భుజ కూటమిలో ఏయే దేశాలు ఉన్నాయి ?
జ: భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
6) న్యాయాధికారుల విభజన కేసులో విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ఎవరు ?
జ: జస్టిస్ జాస్తి చలమేశ్వర్
7) బీఎస్ఈ కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సేతు రత్నం ( ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ )
8) క్యాన్సర్ కి కూడా కవరేజ్ వచ్చేలా ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టిన బీమా సంస్థ ఏది ?
జ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
9) ఏసియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ సదస్సు ఏ నగరంలో జరగనుంది ?
జ: ముంబై
10) 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF-2017) కు ఏ దేశం భాగస్వామిగా వ్యవహరిస్తోంది ?
జ: వియత్నాం
(నోట్: స్టార్టప్ ఇండియా – స్టాండప్ ఇండియా థీమ్ తో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నవంబర్ 14 నుంచి 14 రోజుల పాటు జరుగుతోంది )
11) దేశంలో మొట్టమొదటి గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సు- 2017 ఏ రాష్ట్రంలో జరుగుతోంది ?
జ: ఛత్తీస్ గఢ్
(నోట్: నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో దంతెవాడలో ఈ సదస్సు జరిగింది. )
12) రసగుల్లా ఏ రాష్ట్రానికి చెందినది అని ప్రపంచ వాణిజ్యం సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపును ఇచ్చింది ?
జ: పశ్చిమబెంగాల్
13) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలకు ఎవరు ఎంపికయ్యారు ?
జ: 2014 – కమల్ హాసన్ , 2015- కె.రాఘవేందర్ రావు, 2016- రజనీకాంత్
14) భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
జ: కెన్నెత్ జస్టర్
15) ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమ్మిట్ 2017 (అగ్రి హ్యాక్థాన్ ) పేరుతో అంతర్జాతీయ సదస్సు ఏ నగరంలో జరుగుతోంది ?
జ: విశాఖ పట్నం
16) బుక్సా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: పశ్చిమ బెంగాల్ (అలిపుర్దౌర్ జిల్లాలో)
🎾 *అంతర్జాతీయం*
17) అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జి పదవికి పోటీ పడుతున్న భారతీయుడు ఎవరు ?
జ: దల్వీర్ భండారీ
18) అమెరికాలో క్యాన్సర్ నివారణకు సూదిమందును విడుదల చేసిన భారతీయ కంపెనీ ఏది ?
జ: డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ (మందు పేరు క్లోఫరాబైన్ )
19) ఓ క్రీడా సాధనంగా యోగా సాధన చేసేందుకు అనుమతించిన అరబ్ దేశం ఏది ?
జ: సౌదీ అరేబియా
20) 10వ దక్షిణాసియా ఆర్థిక సదస్సు (SAES-2017) ఏ దేశంలో జరగనుంది ?
జ: నేపాల్
21) ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం (నవంబర్ 14) యొక్క థీమ్ ఏంటి ?

జ: Women and diabetes – our right to a healthy future