చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి 2018 నెల మొత్తం
ఫిబ్రవరి 1 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
భారత తీర రక్షక దళం ఏర్పాటు. | 1977 | భారత తీర రక్షక దళం ఏర్పాటయింది. ఈరోజున భారత తీర రక్షక దళ దినోత్సవం జరుపుకుంటారు. |
అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. | 2003 | అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
జువ్వాడి గౌతమరావు | 1929 | భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012) |
వెల్చేరు నారాయణరావు, | 1933 | ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు మరియు పండితుడు. |
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె | 1936 | ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (మ.2016) |
బొజ్జి రాజారాం | 1945 | కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్తగా ప్రసిద్ధుడు. |
సుధాకర్ | 1956 | ప్రముఖ తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత. |
బ్రహ్మానందం, | 1956 | ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు. |
నాగసూరి వేణుగోపాల్, | 1961 | సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది. |
అంథోనీ పీటర్ కిశోర్ | 1965 | అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు. |
అజయ్ జడేజా | 1971 | భారత క్రికెట్ క్రీడాకారుడు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
కల్పనా చావ్లా. | 2003 | ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962) |
రణబీర్ సింగ్ హుడా | 2009 | భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు. |
జోలెపాళ్యం మంగమ్మ | 2017 | ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (జ.1925) |
ఫిబ్రవరి 2 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
ఆంధ్ర ప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ | 1970 | ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. |
వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం | ---- | తొలిసారిగా ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని 1997 లో ఫిబ్రవరి 02 న జరిపారు.నాటి నుండి ప్రతియేటా ఈ దినోత్సవం జరుగుతోంది . ఒక్కొక్క సంవత్సరము ఒక కొత్త అంశం మీద దృష్టి పెడుతూ ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి | 1863 | ప్రముఖ తెలుగు రచయిత. (మ.1940) |
మోటూరి సత్యనారాయణ | 1902 | దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు |
గిడుగు లక్ష్మీకాంతమ్మ | 1903 | లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు |
కుంటిమద్ది శేషశర్మ | 1913 | ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు |
తిక్కవరపు పఠాభిరామిరెడ్డి | 1919 | ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత. (మ.2006) |
తిమ్మావజ్జల కోదండ రామయ్య | 1925 | మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు, పరిశోధన పత్రిక సంపాదకత్వం, |
బి. రాధాబాయి ఆనందరావు | 1930 | భారత పార్లమెంటు సభ్యురాలు. |
ఎస్. వి. రామారావు | 1940 | ప్రముఖ తెలుగు సినీ రచయిత. |
జె.భాగ్యలక్ష్మి | 1940 | ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
రావాడ సత్యనారాయణ | 1911 | ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు |
ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి | 1916 | ప్రముఖ కవి, పండితులు. |
కోపల్లె హనుమంతరావు | 1922 | జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880) |
వేదుల సూర్యనారాయణ శర్మ | 1999 | ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు |
అట్లూరి పుండరీకాక్షయ్య | 2012 | తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925) |
ఫిబ్రవరి 3 2018
సంఘటనలు
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
తమ్మర గణపతిశాస్త్రి. | 1923 | నిజాం విమోచనోద్యమకారుడు |
ద్యుతీ చంద్ | 1994 | భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
ఉడ్రోవిల్సన్. | 1924 | అమెరికా మాజీ అధ్యక్షుడు |
విలియం డి.కూలిడ్జ్ | 1975 | అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873) |
కె. చక్రవర్తి | 2002 | ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936) |
బలరామ్ జక్కర్ | 2016 | ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923) |
ఫిబ్రవరి 4 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్. | 2007 | భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది. |
వరల్డ్ క్యాన్సర్ డే, | ---- | కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి మరియు దాని నివారణ, గుర్తింపును మరియు చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4 న ప్రపంచ క్యాన్సర్ రోజుగా గుర్తించారు.ప్రపంచ క్యాన్సర్ దినం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) చే స్థాపించబడింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
మాడభూషి అనంతశయనం అయ్యంగారు | 1891 | స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు |
మఖ్దూం మొహియుద్దీన్ | 1908 | ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969) |
బెళ్లూరి శ్రీనివాసమూర్తి | 1910 | సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు |
బిర్జూ మహరాజ్. | 1938 | కథక్ కళాకారుడు |
రాకేష్ శుక్లా | 1948 | భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు |
డాక్టర్ రాజశేఖర్ | 1962 | ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు |
శేఖర్ కమ్ముల | 1972 | ప్రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
మునిమాణిక్యం నరసింహారావు | 1973 | తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది |
డి.ఎస్.కొఠారి. | 1993 | ప్రముఖ భారత విద్యావేత్త |
ఫిబ్రవరి 5 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం | 1884 | హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం ఈరోజున జరిగింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
గరికపాటి రాజారావు | 1915 | ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963) |
షేక్ నాజర్ | 1920 | "బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ (ఫిబ్రవరి 5, 1920 - ఫిబ్రవరి 22, 1997) బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకులముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5 వ తేదీన షేక్ మస్తాన్, బీబాబీలకు దంపతులకు జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి".ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు. |
ఏ.సి.జోస్ | 1937 | మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ అసెంబ్లీ స్పీకర్. (మ.2016) |
కోదండరాం | 1955 | విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్ | 1679 | డచ్ కవి మరియు నాటక రచయిత. (జ.1587) |
వట్టికోట ఆళ్వారుస్వామి | 1961 | ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915) |
బెళ్లూరి శ్రీనివాసమూర్తి | 1988 | రాయలసీమ కవికోకిలగా ప్రసిద్ధి చెందిన కవి. (జ.1910) |
ఎ.జి.కృష్ణమూర్తి | 2016 | ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (జ.1942) |
ఫిబ్రవరి 6 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
సింగపూరు పట్టణాన్ని కనుగొన్న సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్. | 1819 | సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు. |
యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించిన ఎలిజబెత్ II | 1952 | విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది. |
ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్. | 2000 | ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ | 1890 | బాద్షా ఖాన్ గా సరిహద్దు గాంధీ గా పేరుగాంచాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. భారతరత్న పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు. "ఎర్రచొక్కాల ఉద్యమం" ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను "ఖుదాయీ ఖిద్మత్‌గార్" (భగవత్సేవకులు) అని పిలిచేవారు. ఇతను పష్తో లేదా పక్తూనిస్తాన్ కు చెందిన రాజకీయ మరియు ధార్మిక నాయకుడు.భారత విభజనకు తీవ్రంగా వ్యతిరేకించినవాడు. భారత రాజకీయనాయకులతో కలసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. భారతదేశ రాజకీయనాయకులతో మరీ ముఖ్యంగా గాంధీ నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీతో కలసి పోరాటం సలిపాడు |
విలియం పి. మర్ఫీ | 1892 | రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయాకు చికిత్సకు కనుగొన్న శాస్త్రవేత్త. |
జే.రామేశ్వర్ రావు | 1923 | వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు. (మ.1998) |
భమిడిపాటి రామగోపాలం | 1932 | ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010) |
కె.వి.కృష్ణకుమారి | 1947 | ప్రముఖ రచయిత్రి. |
కావలి ప్రతిభా భారతి | 1956 | రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
జోసెఫ్ ప్రీస్ట్‌లీ | 1804 | జోసెఫ్ ప్రీస్ట్‌లీ (మార్చి 13, 1733 — ఫిబ్రవరి 6, 1804) 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్ ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. కార్బన్ డయాక్సైడు ను కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్ మోనాక్సైడు, నైట్రస్ ఆక్సైడు (లాఫింగ్ గ్యాస్) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. |
శ్యామశాస్త్రి | 1827 | ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (జ.1762) |
సూరి భగవంతం | 1889 | ప్రముఖ శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (జ.1909) |
దామెర్ల రామారావు | 1925 | ప్రముఖ చిత్రకారుడు |
మోతిలాల్ నెహ్రూ | 1931 | మోతీలాల్ నెహ్రూ(మే 6, 1861 – ఫిబ్రవరి 6, 1931). భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఇతను, బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు.మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలో పుట్టాడు, తండ్రి 'గంగాధర్' ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబీకుడు.నెహ్రూ, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు నుండి బారిష్టరు డిగ్రీను పొందాడు. భారత జాతీయ కాంగ్రస్ కు చెందిన మధ్యేయవాద, ధనిక నాయకుడు. మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాడు. మోతీలాల్, స్వరూప్ రాణీని వివాహమాడాడు. |
ప్రతాప్ సింగ్ ఖైరాన్ | 1965 | పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. |
దీవి రంగాచార్యులు | 1976 | సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (జ.1898) |
కల్పనా రాయ్ | 2008 | తెలుగు హాస్యనటి. (జ.1950) |
ఆత్మారాం భెండే | 2015 | ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు |
ఫిబ్రవరి 7 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. | 1992 | ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో ఈరోజునే చేరింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
చార్లెస్ డికెన్స్ | 1812 | ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత. |
వేటూరి ప్రభాకరశాస్త్రి | 1888 | ప్రసిద్ధ రచయిత. (మ.1950) |
కప్పగల్లు సంజీవమూర్తి | 1894 | తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962) |
పి.సుదర్శన్ రెడ్డి | 1925 | స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
ఎలిహూ రూట్ | 1937 | అమెరికన్ దౌత్యవేత్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు. |
ఆమంచర్ల గోపాలరావు | 1969 | స్వాతంత్ర్య సమరయోధులు,చరిత్రకారులుచలనచిత్ర దర్శకులు. [జ.1907] |
ఫిబ్రవరి 8 2018
సంఘటనలు
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
జాకీర్ హుస్సేన్ | 1897 | భారత 3వ రాష్ట్రపతి (మే 13 1967 నుండి 1969 మే 3 న మరణించినంతవరకు).అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది. |
ఆండ్ర శేషగిరిరావు | 1902 | సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు. (మ.1965) |
పొత్తూరి వెంకటేశ్వర రావు | 1934 | తెలుగు పత్రికారంగ ప్రముఖుడు. |
జగ్జీత్ సింగ్ | 1941 | ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (మ.2011) |
ముహమ్మద్ అజహరుద్దీన్ | 1963 | భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
కె.ఎం.మున్షీ | 1971 | నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశాడు (జ.1887). |
మంచికంటి రాంకిషన్ రావు | 1995 | వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు. |
ఫిబ్రవరి 9 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసిన జంబో జెట్ బోయింగ్ 747. | 1961 | జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
విలియం హెన్రీ హారిసన్. | 1773 | అమెరికా మాజీ అధ్యక్షుడు. |
ఉమ్మెత్తల కేశవరావు | 1910 | ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992) |
ముదిగొండ సిద్ద రాజలింగం | 1919 | స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. |
రావిపూడి వెంకటాద్రి | 1922 | హేతువాది మాసపత్రిక సంపాదకుడు. |
బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి | 1936 | స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు. |
అడబాల | 1936 | రంగస్థల నటుడు, రూపశిల్పి. (మ.2013) |
బండి రాజన్ బాబు | 1939 | ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (మ.2011) |
సుమంత్ | 1975 | తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
మురళీధర్ దేవదాస్ ఆమ్టే | 2008 | బాబా ఆమ్టే. మెగసెసె అవార్డు గ్రహీత(డిసెంబర్ 26, 1914 - ఫిబ్రవరి 9, 2008) సంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి 2008, ఫిబ్రవరి 9న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి. |
దాస్తొయెవ్‌స్కీ | 1881 | ప్రముఖ రష్యన్ రచయిత. క్రైమ్ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల ద్వారా ప్రసిద్ధుడు. (జ.1821) |
దొంతులమ్మ | 1932 | ఆంధ్ర యోగిని మరియు అవధూత. |
వీణాపాణి, | 1996 | ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (జ.1936) |
షేక్ అబ్దుల్లా రవూఫ్ | 2014 | నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు. (జ.1924) |
సుశీల్ కొయిరాలా | 2016 | నేపాల్ మాజీ ప్రధాని. (జ.1939) |
టప్ప రోషనప్ప | 2017 | భారత స్వాతంత్ర్యసమరయోధుడు. |
ఫిబ్రవరి 10 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలు. | 1911 | భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయినరోజు. |
కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడినరోజు. | 1931 | కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది. |
జననాలు
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ | 1923 | ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు (రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు (రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి.విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - 1923 ఫిబ్రవరి 10) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబరు 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందారు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు. |
కె.ఎన్.రాజ్ | 2010 | భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు. |
ఫిబ్రవరి 11 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా మార్గరెట్ థాచర్. | 1975 | మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది. |
జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించింది. | 1990 | 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించినరోజు |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
థామస్ ఆల్వా ఎడిసన్ | 1847 | థామస్ అల్వా ఎడిసన్ (ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931) మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.ఆయన 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు. |
పానుగంటి లక్ష్మీ నరసింహారావు. | 1865 | ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత. (మ.1940) |
గురజాడ రాఘవశర్మ. | 1899 | ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987) |
తరిమెల నాగిరెడ్డి | 1917 | ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976) |
పెన్మెత్స సుబ్బరాజు | 1958 | బైబిల్ పై అనేక విమర్శనా గ్రంథాలు రాశారు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
లీయాన్ ఫోకాల్ట్ | 1868 | ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1819) |
జమ్నాలాల్ బజాజ్ | 1942 | ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు. (జ.1889) |
ఘంటసాల వెంకటేశ్వరరావు | 1974 | ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. (జ.1922) |
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ | 1977 | భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905) |
ఆలపాటి రవీంద్రనాధ్ | 1996 | జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (జ.1922) |
లక్ష్మీదేవమ్మ | 2010 | ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ. |
ఫిబ్రవరి 12 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడినరోజు. | 1961 | శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
చార్లెస్ డార్విన్ | 1809 | జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882) |
అబ్రహం లింకన్ | 1809 | అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865) |
స్వామి దయానంద సరస్వతి | 1824 | ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883) |
జగపతిబాబు | 1962 | తెలుగు సినిమా నటులు. |
ఆశిష్ విద్యార్థి | 1962 | తెలుగు సినిమా ప్రతినాయకుడు. |
అశోక్ తన్వర్ | 1976 | భారతదేశ రాజకీయ నాయకుడు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
జహందర్ షా | 1713 | మొఘల్ చక్రవర్తి. (జ.1661) |
ఇమ్మాన్యుయెల్ కాంట్ | 1804 | ప్రముఖ జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724) |
అలెక్సాండర్ డఫ్ | 1878 | స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806) |
టేకుమళ్ళ అచ్యుతరావు | 1947 | ప్రముఖ విమర్శకులు మరియు పండితులు. (జ.1880) |
పువ్వుల సూరిబాబు | 1968 | తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త. (జ.1915) |
అరుణ్ సాగర్ | 2016 | సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (జ.1967) |
ఎం.ఎల్.నరసింహారావు | 2016 | ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత మరియు సాహితీవేత్త. (జ.1928) |
ఇరిగినేని తిరుపతినాయుడు | 2017 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937) |
ఫిబ్రవరి 13 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయామకం. | 1931 | న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
సరోజినీ నాయుడు. | 1879 | సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి .సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా |
గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి | 1880 | సుప్రసిద్ధ పండితులు. (మ.1997) |
మాదాల నారాయణస్వామి | 1914 | సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013) |
నూతి శంకరరావు | 1930 | ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు. |
నూనె శ్రీనివాసరావు | 1972 | సామాజిక శాస్త్రవేత్త. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
బాలు మహేంద్ర | 2014 | దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. (జ.1939) |
పి. కేశవ రెడ్డి | 2015 | ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1946) |
ఎస్.మునిసుందరం కవి | 2015 | నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937) |
ఫిబ్రవరి 14 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
ప్రేమికుల దినోత్సవం | ---- | ప్రేమికుల రోజు లేదా సెయింట్ వాలెంటైన్స్ డే అనేది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జరుపుకునే సెలవుదినం. ఆంగ్ల భాష మాట్లాడే దేశాల్లో, వాలెంటైన్స్ కార్డులు పంపడం, పువ్వులు బహూకరించడం లేదా మిఠాయిలు ఇవ్వడం ద్వారా ప్రేమికులు ఒకరికిఒకరు ఈ రోజున ప్రేమను వ్యక్తపరుచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. |
ఇంటర్ నేషనల్ కండోమ్ డే | ---- | ప్రపంచ వ్యాప్తంగ ఈరోజున ఇంటర్ నేషనల్ కండోమ్ డే జరుపుకుంటారు. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
దిగవల్లి వేంకటశివరావు | 1898 | స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992) |
దామోదరం సంజీవయ్య | 1921 | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972) |
సుష్మాస్వరాజ్ | 1952 | భారతీయ జనతా పార్టీ ప్రముఖ మహిళా నాయకురాలు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
జేమ్స్ కుక్ | 1779 | ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (జ.1728) |
యెర్రగుడిపాటి వరదరావు | 1973 | తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. (జ.1903) |
రాజబాబు | 1983 | ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935) |
సి.హెచ్. నారాయణరావు | 1984 | తెలుగు సినిమా నటుడు. (జ.1913) |
డిక్ ఫ్రాన్సిస్. | 2010 | ప్రముఖ నవలా రచయిత |
ఫిబ్రవరి 15 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం ప్రచురణ. | 2001 | మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
గెలీలియో | 1564 | ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త. |
ఫ్రాంసిస్ ప్రాట | 1827 | ప్రాట్ & విట్నీ స్థాపకుడు. |
ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె | 1931 | క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు |
అట్లూరి పూర్ణచంద్రరావు | 1938 | ప్రముఖ చలనచిత్ర నిర్మాత. |
పొన్నాల లక్ష్మయ్య | 1944 | నాలుగురు ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు |
రావులపల్లి గుర్నాథరెడ్డి | 1944 | 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. |
రాధా రెడ్డి | 1952 | కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు. |
డెస్మండ్ హేన్స్. | 1956 | వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. |
మరణాలు
ఫిబ్రవరి 16 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ని సందర్శించినరోజు. | 1915 | గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ని సందర్శించాడు. |
క్యోటో ఒప్పందం అమలు. | 2005 | ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
నోరి గోపాలకృష్ణమూర్తి | 1910 | ప్రముఖ ఇంజనీర్, పద్మవిభూషణ్ పురస్కారగహీత. (మ.1995) |
మైకెల్ హోల్డింగ్ | 1954 | వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. |
లగడపాటి రాజగోపాల్ | 1964 | పారిశ్రామికవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు, లాన్కో గ్రూపు (LANCO) విద్యుతుత్పత్తి మరియు చిత్ర నిర్మాణం మరియు ఇతర రంగాలలో కృషిచేస్తున్నది. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
దాదాసాహెబ్ ఫాల్కే | 1944 | భారతీయ చలనచిత్ర పితామహులు. (జ.1870) |
మేఘనాధ్ సాహా | 1956 | భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. (జ.1893) |
వాసిరెడ్డి శ్రీకృష్ణ | 1961 | ఆర్థిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు. (జ.1902) |
నార్ల వేంకటేశ్వరరావు | 1985 | ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం. (జ.1908) |
విజయ కుమారతుంగా | 1988 | ప్రముఖ శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (జ.1945) |
ఫిబ్రవరి 17 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000ను విడుదల చేసింది | 2000 | మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
పారిస్ హిల్టన్ | 1981 | గాయని. |
కల్వకుంట్ల చంద్రశేఖరరావు | 1954 | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
వాసుదేవ బల్వంత ఫడ్కే | 1883 | బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1845) |
పాలగుమ్మి పద్మరాజు | 1983 | ప్రముఖ తెలుగు సినీ రచయిత. (జ.1915) |
జిడ్డు కృష్ణమూర్తి. | 1986 | సుప్రసిద్ధ భారతీయ తత్త్వవేత్త. (జ.1895) |
ఫిబ్రవరి 18 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు విమానాన్ని నడిపాడు. | 1911 | భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు. |
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లుకు భారతదేశ లోక్‌సభ ఆమోదం. | 2014 | ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును భారతదేశ లోక్‌సభ ఆమోదించింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
చైతన్య మహాప్రభు | 1486 | రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (మ.1534) |
అలెస్సాండ్రో వోల్టా | 1745 | బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (మ.1827) |
రామకృష్ణ పరమహంస | 1836 | ఆధ్యాత్మిక గురువు. (మ.1886) |
గురు గోల్వాల్కర్ | 1906 | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్‌సంఘ్‌చాలక్. |
సజిద్ నడియాద్వాల | 1966 | భారతీయ చలన చిత్ర నిర్మాత. |
ఎం.ఎస్. చౌదరి | 1978 | తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు, రచయిత, దర్శకులు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
మైఖేలాంజెలో | 1564 | ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు. (జ.1475) |
భాగ్యరెడ్డివర్మ | 1939 | ఆంధ్ర సభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888) |
గోపీకృష్ణ | 1994 | భారతీయ నృత్యకారుడు, నటుడు మరియు నృత్య దర్శకుడు. (జ.1933) |
దగ్గుబాటి రామానాయుడు | 2015 | తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936) |
ఫిబ్రవరి 19 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
టిన్ టైప్ కెమెరాకి పేటెంట్ పొందినరోజు. | 1856 | టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ పేటెంట్ పొందాడు. |
ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందినరోజు. | 1878 | థామస్ ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందాడు |
క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా. | 2008 | 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా చేశారు. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
నికోలస్ కోపర్నికస్ | 1473 | సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1543) |
గెలీలియో గెలీలి | 1564 | భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. (మ.1642) |
ఛత్రపతి శివాజీ | 1630 | ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. |
బల్వంతరాయ్ మెహతా | 1899 | గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. |
వెంపటి సదాశివబ్రహ్మం | 1905 | పేరుపొందిన చలనచిత్ర రచయిత. |
ఆలపాటి లక్ష్మి | 1952 | ప్రముఖ రంగస్థల, సినిమా, ధారావాహిక నటి. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
గోపాలకృష్ణ గోఖలే, | 1915 | భారత జాతీయ నాయకుడు. (జ.1866) |
జయంతి రామయ్య పంతులు | 1941 | ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. (జ.1860) |
డెంగ్ జియావోపింగ్ | 1997 | చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త. |
నిర్మలమ్మ | 2009 | ప్రముఖ తెలుగు సినిమా నటి. |
వనం ఝాన్సీ | 2011 | భారతీయ జనతా పార్టీ నాయకురాలు. |
రాగతి పండరి | 2015 | తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965) |
ఫిబ్రవరి 20 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. | 1956 | న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న ఉన్నారు. |
13వ అలీన దేశాల సదస్సు ప్రారంభమైనరోజు. | 2003 | 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైనది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
మల్లాది సూర్యనారాయణ, | 1880 | సంస్కృతవాజ్మయచరిత్ర రాశారు. |
రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు | 1901 | బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు. |
గొల్లకోట బుచ్చిరామశర్మ | 1915 | జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు |
గిరిజాప్రసాద్ కొయిరాలా. | 1925 | నేపాల్ మాజీ ప్రధానమంత్రి |
నేదురుమల్లి జనార్థనరెడ్డి. | 1935 | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
టి.వి.రాజు | 1973 | తెలుగు, తమిళ, కన్నడసినిమా సంగీత దర్శకుడు. (జ.1921) |
బి.పద్మనాభం | 2010 | తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931) |
మట్టపల్లి చలమయ్య. | 2017 | పారిశ్రామికవేత్త మరియు ప్రముఖ దాత. (జ.1923). |
ఫిబ్రవరి 21 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించినరోజు. | 1804 | స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది. |
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. | ---- | ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజును జరుపుకుంటారు. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
శాంతిస్వరూప్ భట్నాగర్. | 1894 | శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894 – జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది. |
ఎం.ఆర్.రాధా | 1907 | ప్రముఖ తమిళ సినిమా మరియు రంగస్థల నటుడు |
వసంతరావు వేంకటరావు | 1909 | ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి. |
సత్యపదానంద ప్రభూజీ | 1939 | హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015) |
సుధీర్ నాయక్ | 1945 | భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు |
డా.దేవరాజు మహారాజు | 1951 | బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు |
కీత్ ఆథర్టన్ | 1965 | వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు . |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
ఫ్రెడరిక్ బాంటింగ్ | 1947 | కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత |
స్థానం నరసింహారావు | 1971 | ప్రసిద్ధ రంగస్థల నటుడు. (జ.1902) |
చామర్తి కనకయ్య | 2010 | కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933) |
ఎమ్.పీతాంబరం | 2011 | తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు |
ఫిబ్రవరి 22 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసినరోజు. | 1847 | ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది. |
కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించినరోజు. | 1922 | పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు. |
కవలల దినోత్సవం | ---- | కవలల దినోత్సవం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 22 న జరుపుకుంటారు.ప్రపంచం లో మొట్టమొదట సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్ వారు 1976లో నిర్వహించారు. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
జార్జి వాషింగ్టన్ | 1732 | అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1799) |
కొండా వెంకటప్పయ్య | 1866 | ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (మ.1949) |
రావాడ సత్యనారాయణ | 1911 | తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. (మ.1980) |
పువ్వుల సూరిబాబు | 1915 | తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త. (మ.1968) |
చకిలం శ్రీనివాసరావు | 1922 | నల్గొండ లోకసభ సభ్యులు. (మ.1996) |
పుష్ప మిత్ర భార్గవ | 1928 | భారతీయ ప్రముఖ శాస్రవేత్త."సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు.(మ.2017) |
తాతినేని చలపతిరావు | 1938 | ప్రముఖ సంగీత దర్శకులు. |
కలువకొలను సదానంద | 1939 | ప్రముఖ బాల సాహిత్య రచయిత. |
తేజ | 1966 | ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు మరియు రచయిత. |
అలియా సబూర్ | 1989 | ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన వ్యక్తి. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి | 1847 | బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870) |
కన్నెగంటి హనుమంతు | 1922 | పుల్లరి సత్యాగ్రహ నాయకుడు. |
మౌలానా అబుల్ కలాం ఆజాద్ | 1958 | ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888) |
బొడ్డేపల్లి రాజగోపాలరావు | 1992 | ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు. (జ.1923) |
షేక్ నాజర్ | 1997 | బుర్రకథ పితామహుడు. (జ.1920) |
రామణ్ లాంబా | 1998 | భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960) |
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | 2011 | ప్రముఖ నటుడు మరియు రచయిత . (జ.1916) |
కస్తూర్భా గాంధీ | 1944 | కస్తూరిబాయి గాంధీ (11 ఏప్రిల్ 1869 – 22 ఫిబ్రవరి 1944) మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భార్య. ఆమె 1883లో ఆయనను పెద్దలు కుదిర్చిన బాల్య వివాహం చేసుకుంది. |
ఫిబ్రవరి 23 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
ఏ.ఆర్.రెహమాన్కు రెండు ఆస్కార్ అవార్డులు. | 2009 | 91వ ఆస్కార్ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
బాబర్ | 1483 | మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (మ.1531) |
నూజిళ్ళ లక్ష్మీనరసింహం | 1931 | వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు |
కింజరాపు ఎర్రన్నాయుడు | 1957 | తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012) |
కరణ్ సింగ్ గ్రోవర్ | 1982 | భారతీయ టెలివిజన్ నటుడు మరియు మోడల్. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
అన్నమయ్య | 1503 | మొదటి వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు. |
జాన్ కీట్స్ | 1821 | బ్రిటీష్ రచయిత (జ 1795). |
జాన్ క్విన్సీ ఆడమ్స్. | 1848 | అమెరికా మాజీ అధ్యక్షుడు |
తవనం చెంచయ్య | 2014 | సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు |
ఫిబ్రవరి 24 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు. | 1582 | నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది. |
మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించినరోజు. | 1938 | నైలాన్ దారంతో మొదటిసారిగా టూత్ బ్రష్ను న్యూజెర్సీ లోని ఆర్లింగ్టన్లో తయారు చేసారు. మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించటం మొదలైన రోజు. |
వాయిస్ ఆఫ్ అమెరికా ఆవిర్బవించిన రోజు. | 1942 | వాయిస్ ఆఫ్ అమెరికా (అమెరికా షార్ట్ వేవ్ రేడియో సర్వీసు) ఆవిర్బవించిన రోజు. |
సెంట్రల్ ఎక్సైజ్ వ్యవస్థాపక దినోత్సవము. | 1944 | సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య పదవీ విరమణ. | 1982 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ ముఖ్యమంత్రిగాటంగుటూరి అంజయ్య పదవీ విరమణ చేసినరోజు. |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం. | 1982 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిదవ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం చేసినరోజు. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
పిలకా గణపతిశాస్త్రి | 1911 | కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (మ.1983) |
జాయ్ ముఖర్జీ | 1939 | భారతీయ చలనచిత్ర నటుడు. |
జయలలిత | 1948 | తమిళనాడు ముఖ్యమంత్రిణి. |
నానీ | 1981 | తెలుగు సినిమా నటుడు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
హెన్రీ కేవిండిష్ | 1810 | బ్రిటిష్ తత్వవేత్త మరియు సైద్ధాంతిక రసాయన మరియు భౌతిక శాస్త్రవేత్త. (జ.1731) |
కట్టమంచి రామలింగారెడ్డి | 1951 | సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (జ.1880) |
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ | 1967 | హైదరాబాదు చివరి నిజాము. (జ.1886) |
ఈలపాట రఘురామయ్య | 1957 | సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. (జ.1901) |
దేవులపల్లి కృష్ణశాస్త్రి | 1980 | ప్రసిద్ధ తెలుగు కవి. (జ.1897) |
న్యాయపతి రాఘవరావు | 1984 | రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905) |
రుక్మిణీదేవి అరండేల్ | 1986 | ప్రముఖ కళాకారిణి. (జ.1904) |
జెట్టి ఈశ్వరీబాయి | 1991 | భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (జ.1918) |
ముకురాల రామారెడ్డి | 2003 | మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి మరియు రచయిత. (జ.1929) |
ముళ్ళపూడి వెంకటరమణ | 2011 | తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931) |
షేక్ సాంబయ్య | 2013 | ప్రముఖ క్లారినెట్ విద్వాంసుడు. (జ.1950) |
ఫిబ్రవరి 25 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
క్యూబా అధ్యక్షుడిగా రాల్ క్యాస్ట్రో ఎన్నిక. | 2008 | క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
సుబ్రతా బోస్ | 1932 | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016) |
డానీ డెంజోంగ్ప | 1948 | సుప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నటుడు. |
దివ్యభారతి | 1974 | ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి (మ.1993) |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి | 1961 | ప్రముఖ రచయిత |
ఏల్చూరి సుబ్రహ్మణ్యం | 1995 | ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1920) |
డోనాల్డ్ బ్రాడ్‌మాన్ | 2001 | అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908) |
బి.నాగిరెడ్డి | 2004 | తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1912) |
జస్టిస్ హంస్‌రాజ్ ఖన్నా | 2008 | సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. |
కాటం లక్ష్మీనారాయణ | 2010 | స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (జ.1924) |
ఆచ్చి వేణుగోపాలాచార్యులు | 2016 | ప్రముఖ సినీ గీత రచయిత. (జ.1930) |
ఫిబ్రవరి 26 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం ప్రారంభం. | 1975 | భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్రను అహ్మదాబాదులో ప్రారంభం. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
విక్టర్ హ్యూగో | 1802 | సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త. (మ.1885) |
లెవీ స్ట్రాస్ | 1829 | బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు జననం. |
హేమలతా లవణం | 1932 | ప్రముఖ సామాజిక సేవకురాలు జననం. |
ఎలకా వేణుగోపాలరావు | 1982 | ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
అఫ్జల్ ఉద్దౌలా | 1869 | నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. (జ.1827) |
ఆనందీబాయి జోషి | 1887 | పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. (జ.1865) |
అయ్యదేవర కాళేశ్వరరావు | 1962 | ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1882) |
శంకర్‌రావు చవాన్ | 2004 | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. |
ఫిబ్రవరి 27 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగినరోజు. | 1803 | ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
వేగె నాగేశ్వరరావు | 1932 | సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త. |
బి.ఎస్.యడ్యూరప్ప | 1943 | కర్ణాటక ముఖ్యమంత్రి. |
శివాజీ రాజా | 1972 | ప్రముఖ తెలుగు నటుడు. |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
మొదటి బహదూర్ షా | 1712 | భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643) |
చంద్రశేఖర్ ఆజాద్ | 1931 | భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906) |
జి.వి.మావలాంకర్ | 1956 | లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888) |
ఆకురాతి చలమయ్య | 1985 | ప్రముఖ తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. |
పి. శివశంకర్ | 2017 | తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీమంత్రి. (జ.1929) |
ఫిబ్రవరి 28 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ | 1719 | 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు. |
బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు. | 1948 | ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు. |
జాతీయ విజ్ఞాన దినోత్సవము | ---- | 1929 వ సంవత్సరము ఫిబ్రవరి 28 వ తేదిన నోబెల్ బహుమతి గ్రహీత అయిన తొలి బారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ C .V . రామన్ తన రామన్ ఎఫ్ఫెక్ట్ ను కనుక్కున్న రోజు. ఈరోజును నేషనల్ సైన్సు డే గా జరుపుకుంటున్నారు. 1986 నుండి జరుపుకొంటున్నాం.సమాజం లో శాస్త్రీయ దృక్పదాన్ని, విజ్ఞనాన్ని పెపొందించ టానికి ఇది దోహదపడుతుందన్న ఉద్దేశం తో ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం ను జరుపుకుతున్నాం. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
రాచమల్లు రామచంద్రారెడ్డి | 1922 | తెలుగు సాహితీవేత్త. (మ.1988) |
తుమ్మల వేణుగోపాలరావు, | 1928 | ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు[,మ.2011] |
కర్సన్ ఘావ్రి | 1951 | భారత మాజీ క్రికెట్ ఆటగాడు. |
పాల్ క్రుగ్మాన్ | 1953 | అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త మరియు రచయిత |
రాజేంద్ర ప్రసాద్ | 1956 | తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు |
ఉప్పలపు శ్రీనివాస్ | 1969 | ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (మ.2014) |
సునీల్ | 1973 | తెలుగు సినిమా నటుడు. |
అలీ లార్టర్ | 1979 | అమెరికన్ నటి మరియు ఫ్యాషన్ మోడల్ |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
బాబూ రాజేంద్ర ప్రసాద్ | 1963 | మొదటి రాష్ట్రపతి. (జ.1884) |
జానమద్ది హనుమచ్ఛాస్త్రి. | 2014 | సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926) |
ఫిబ్రవరి 29 2018
సంఘటనలు
సంఘటన | సంవత్సరం | వివరాలు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి | 1964 | ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవిని చేపట్టినరోజు. |
జననాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
మొరార్జీ దేశాయి | 1896 | భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి. |
రుక్మిణీదేవి అరండేల్ | 1904 | ప్రముఖ కళాకారిణి. (మ.1986) |
మరణాలు
వ్యక్తి | సంవత్సరం | వివరాలు |
గాడిచర్ల హరిసర్వోత్తమ రావు | 1960 | ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (సెప్టెంబర్ 14, 1883 - ఫిబ్రవరి 29, 1960) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. |