AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 8 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 8


*🌍చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 08🌍*

*👮‍♀హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవం👮‍♂*

*⛲జలాంతర్గాముల దినోత్సవం⛲*

*🌳సంఘటనలు🌳*

🛸1946 : భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైంది.

🛸2009 : డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది.

*🌳జననాలు🌳*

🏮1721 : బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10వ పీష్వా (మ.1761).

🏮1932 : చలసాని ప్రసాద్ , విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015).
1978 :

*🌳మరణాలు🌳*

🎭1991 : చతుర్వేదుల నరసింహశాస్త్రి, ప్రసిద్ధులైన సాహిత్యవేత్త. (జ.1924)

🎭2002 : భగవాన్ (చిత్రకారుడు) , మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939)

🎭2004 : చిత్తజల్లు శ్రీనివాసరావు , సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు. (జ.1924)

🎭2010 : నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926)

🎭2014 : పిరాట్ల వెంకటేశ్వర్లు , పత్రికా సంపాధకుడు మరియు రచయిత. (జ.1940)

🎭2014 : నేదునూరి కృష్ణమూర్తి , ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927)

*🍋🛍⛲🍄STUTS🍄⛲🛍🍋🎈*

*✡శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలి*

*----జనగామ*
 🔵 : చదువుతోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్ధులు పరిజ్ఞానాన్ని పెంచుకొని భావి సైంటిస్టులుగా దేశానికి సేవ చేయాలని *జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వనజాదేవి* కోరారు.

 జనగామలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో రెండురోజులపాటు జరిగిన *45వ జవహర్లాల్ నెహ్రు సైన్స్ఫెయిర్-* ముగింపు వేడుక గురువారం సాయంత్రం జరిగింది.

 *డీఈవో యాదయ్య* అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్ధులు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలను ఆకలింపు చేసుకొని, ప్రాధమిక దశ నుంచే సైన్స్పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రపంచ దేశాలకు దీటుగా మన దేశం శాస్త్ర, సాంకేతిక రంగంలో ఆనేక సరికొత్త ప్రయోగాలు చేసి సఫలీకృతం అయ్యిందని, దీనికి శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందన్నారు.

విద్యార్ధులు ప్రాధమిక దశలోనే సైన్స్ అంశాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకుంటే పైస్థాయిలో నూతన ప్రయోగాలకు అవకాశం ఉంటుందన్నారు.

 జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులతోపాటు దేశానికి గొప్పశాస్త్ర వేత్తలను అందించాల్సిన దేవాలయం పాఠశాల అని ఆమె పేర్కొన్నారు. ఎంతోమంది గొప్ప మేధావులు ప్రభుత్వ పాఠశాలల్లో చెట్ల కింద, వీధిదీపాల వెలుతురులో చదువుకొని దేశానికి ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తెచ్చారన్నారు.

 జిల్లాలో ప్రతిభచూపి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్ధులు జాతీయ స్థాయిలో రాణించే విధంగా తమ మేథస్సుకు పదను పెట్టుకోవాలని కోరారు.

 రెండోరోజు సైన్స్ఫెయిర్ను తిలకించేందుకు *జిల్లా వ్యాపితంగా 100 పాఠశాలల నుంచి 10,676 మంది విద్యార్ధులు* పాల్గొన్నారు. ఆరు అంశాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో *సీనియర్ భాగంలో ఆరు, జూనియర్ విభాగంలో ఆరు చొప్పున మొత్తం 12 ప్రదర్శనలకు మొదటి, రెండో స్థానంగా ప్రకటించి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు*.


వీరికి *జాయింట్ వనజాదేవితోపాటు పాఠశాల విద్యాశాఖ ఆర్జీడీ పి.రాజీవ్, డీఈవో ఎస్.యాదయ్య*, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు పెద్ది వెంకటనారాయణ గౌడ్, *ఎస్వో శ్రీనివాస్, ఏసీజీ రామచంద్రారెడ్డి, డీఎస్వో గౌసియాబేగం* బహుమతులు ప్రదానం చేశారు. 

కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చలపతిరావు, గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

 *☸దేవరుప్పుల మండలం బాలయేసు పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్ధి ఎం.సౌమ్య తయారు చేసిన బార్డర్ సెక్యూరిటీ సిస్టమ్కు ప్రధమ స్థానం* రాగా, *అదే పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్ధి బి.స్వాతి తయారు చేసిన స్మార్ట్ట్రైన్కు ద్వితీయస్థానం లభించింది*. 

ఈరెండు ఎగ్జిబిట్లు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. 

✡ఎం అఖిల (జడ్పీస్కూల్ శివునిపల్లి), 

బీ రాజు (జడ్పీస్కూల్ కొడకండ్ల), 

బీరక్షిత (జ్యోతి నికేతన్-మల్కాపూర్),

ఎం. రాజు (ఎంపీయూపీఎస్-నాగిరెడ్డిపల్లి),

 బీ లావణ్య (శ్రీఅరబిందో-జనగామ), 

జీవన్ (సోషవ్ వేల్ఫేర్-జనగామ), 

బీ అఖిల (యశ్వంతపూర్),
ఎం సాయి గీతిక 
(ఏకశిల పబ్లిక్స్కూల్-జనగామ), 

స్పందన (సెయింట్ మేరీస్-జనగామ), 

ఆర్.శరణ్య (సెయింట్ థామస్-ఘన్పూర్),

 ఆర్.రసజ్ఞ (సోషల్వెల్ఫేర్-కొడకండ్ల), 

పి.సాయిఫృద్వీ (ఎస్పీఆర్-నెల్లుట్ల), 

ఎ.సుదీప్తి (సెయింట్పాల్స్-జనగామ),

 బీస్వాతి(బాలయేసు-దేవరుప్పుల), 

ఎం.రవళి (న్యూసన్సైన్-జాఫర్గడ్), 

కె.కీర్తన్రెడ్డి (జ్యోతినికేతన్-మల్కాపూర్), 

ఎం.సౌమ్య (బాలయేసు-దేవరుప్పుల), 

యూసఫ్ (సెయింట్పాల్స్-జనగామ), 

వీ స్పందన (జెడ్పీస్కూల్ ఇప్పగూడెం), 

బీ సందీప్(ఆగాపేస్కూల్-జనగామ), 
పీ శరణ్య (ఏకశిల పబ్లిక్స్కూల్-జనగామ), 

కే పూజిత (జెడ్పీస్కూల్ చిల్పూర్), 

సీహెచ్.ధనలక్ష్మి (జెడ్పీస్కూల్ స్టేషన్ఘన్పూర్) ఎంపికయ్యారు.✡🔯🔯🔯🔵🛑🔯🔵🔵

*🔵విద్యార్థులకు యాత్రలు..*

*-విద్యార్థులను ఎడ్యుకేషన్ టూర్కు పంపాలని ప్రభుత్వం నిర్ణయం*

*-ప్రభుత్వ పాఠశాలల్లోని 9,10 తరగతి విద్యార్థులకు అవకాశం*

*-ప్రతి విద్యార్థికి రూ.200 చెల్లించనున్న ప్రభుత్వం*

-జిల్లాకు రూ.1.64 కోట్లు మంజూరు

-ఇప్పటికే పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో నిధులు జమ

-హర్షం వ్యక్తం- చేస్తున్న విద్యార్థులు

*🔵యాదాద్రి భువనగిరి*

 : 🅾చదువుతోపాటు విద్యార్థులకు విజ్ఞానం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎడ్యుకేషన్ టూర్ పేరిట విజ్ఞాన యాత్రలకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కనీసం వంద మంది విద్యార్థులున్న పాఠశాలలను ఇందుకు ఎంపిక చేయనుంది. 

9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను మాత్రమే విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లాలని.. రాష్ట్రం దాటి వెళ్లకుండా జనవరి 10లోపు ఈ యాత్రలను ముగించేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించింది. విహారయాత్రలకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 200ల చొప్పున ప్రభుత్వమే చెల్లించనుంది. జిల్లావ్యాప్తంగా 9, 10 తరగతులు చదివే విద్యార్థులు 13,734 మంది ఉండగా వీరి కోసం ఇప్పటికే 1.64 కోట్లు మంజూరు చేసి.. ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో వేసేసింది.
విద్యార్థులకు చదువే ముఖ్యం కాదు. లోక పరిజ్ఞానం కూడా అత్యంత అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఎడ్యుకేషన్ టూర్ పేరిట ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులను విహార యాత్రలకు తీసుకువెళ్లేందుకు నిర్ణయించింది. ప్రభుత్వం విహార యాత్రలకు వెళ్లేవారి కోసం రూ. 1.64 కోట్లు మంజూరు చేసింది. దీంతో జిల్లాలోని 156 పాఠశాలలు విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లడానికి అర్హత కలిగి ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 9వ తరగతిలో 6, 874, పదవ తరగతిలో 6, 860 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఓ చోట వెళ్లి ఎంజాయ్ చేద్దామన్న విద్యార్థులకు అధికారులు ఎన్నో ఆంక్షలు విధించేవారు. కానీ ఇక ఆ బాధలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో విహార యాత్రలకు తీసుకెళ్లనుంది. పాఠశాలల్లో కనీసం వంద మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల వారు మాత్రమే యాత్రలకు వెళ్లాలని, రాష్ట్రం దాటిపోవద్దని, జనవరి 10లోపు పూర్తి చేయాలనే నిబంధనలు విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో జోష్ కనిపిస్తోంది. పలు పాఠశాలలు అనుమతి కోసం ఎంఈవోలకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తి పెరగాలన్నా, మేదస్సుకు మరింత పదును పెట్టాలన్నా బాహ్య ప్రపంచంపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా చారిత్రాత్మక విషయాలపై పరిజ్ఞానం ఎంతో అవసరం. ఇందుకోసం పాఠశాలల్లో విద్యార్థులను ప్రతి సంవత్సరం విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లడం పరిపాటిగా వస్తున్నది.

*🔵9, 10 తరగతుల విద్యార్థులకు...*

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల్లో 100 కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు ఈ అవకాశం కల్పించారు. 

దీంతో జిల్లాలోని 156 పాఠశాలలు విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లడానికి అర్హత కలిగి ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 9వ తరగతిలో 6, 874, పదవ తరగతిలో 6, 860 మంది విద్యార్థులు విహార యాత్రకు వెళ్లనున్నారు. 

9, 10 తరగతుల నుంచి ఒక్కో పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు.

*☸పాఠ్యాంశాలకు అనుబంధంగా ఉన్న ప్రదేశాలు..*

విద్యార్థులను పాఠ్యాంశాలకు అనుబంధంగా ఉన్న ప్రదేశాలకే విహార యాత్రకు తీసుకెళ్లనున్నారు. 
కేవలం తెలంగాణ రాష్ట్రంలోని ప్రదేశాలు మాత్రమే చూపిస్తారు. ఇందుకోసం చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలు, సైన్స్కు సంబంధించిన ప్రాజెక్టుల్లోని ప్రదేశాలకు తీసుకెళ్తారు. దీంతో విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందనుంది. విహారయాత్రల వల్ల 9, 10 తరగతి విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. తరగతి గదుల్లో చెప్పే పాఠ్యాంశాల కంటే వారిని విహారయాత్రలకు తీసుకెళ్లి విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా అక్కడ ఉండే అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించి అక్కడ గల గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలి. తద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పొందే అవకాశం లభిస్తున్నది.

*🅾విహారయాత్ర సూచనలివే..*

విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లే ప్రభుత్వ పాఠశాలలు ముందుగా జిల్లా విద్యాధికారి అనుమతి పొందాలి. 

18 మంది విద్యార్థులకు ఒక టీచర్ గైడ్గా వ్యవహరించాలి.

 ఫిట్నెస్తో కూడిన ప్రభుత్వ గుర్తింపు ఉన్న బస్సుల్లో మాత్రమే విద్యార్థులను తీసుకెళ్లాలి. 

*కేవలం ఈ విహార యాత్ర ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ముగించుకుని తిరిగిరావాలి.*

 *రాత్రి సమయంలో విహార యాత్రలకు అనుమతి లేదు.*

*🅾గతంలో అనధికార అనుమతులు...*

గతంలో విజ్ఞాన విహార యాత్రలు అనధికారికంగా కొనసాగేవి. పాఠశాల విద్యాకమిటీ ఆమోదం లేదా ఔత్సాహికులైన కొంతమంది ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత పూచీపై ఎంఈవోలతో మౌఖిక అనుమతులు తీసుకుని విద్యార్థులను యాత్రలకు తీసుకెళ్లేవారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం, అనుమతి ఉండేది కాదు. ప్రభుత్వం తాజాగా పాఠశాల విద్యా కమిటీ, అధికారుల అనుమతితో విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. 

*🅾పాటించాల్సిన షరతులు*

*- రాష్ర్టాలకు వెళ్లవద్దు.*

*- మన రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు, దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, పేరొందిన ప్రదేశాలకు వెళ్లాలి.*

*- జనవరి 10లోపు యాత్రలను పూర్తి చేయాలి.*

*- విద్యార్థులు ఉన్న పాఠశాలలు మాత్రమే వెళ్లాలి.*

*- 9,10వ తరగతి విద్యార్థులనే తీసుకెళ్లాలి.*

*- పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులకే అనుమతి.*

*- మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు టీం లీడర్గా ఉండాలి.-*

*- విద్యార్థినులు ఉంటే మహిళా ఉపాధ్యాయులు వారి వెంట వెళ్లాలి.*

*- విద్యార్థికి రూ. 200 చొప్పున ఖర్చు చేయొచ్చు.*

*🔵ఆర్ఎంఎస్ఏ నిధుల నుంచి జమ..*

🛑ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ) పథకం రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 156 పాఠశాలల్లోని ఎస్ఎండీసీ ఖాతాల్లో ఒక్కో పాఠశాలకు రూ. 8, 400 చొప్పున జమచేసినట్లు సమాచారం. ప్రతి పాఠశాల నుంచి 9, 10 తరగతుల విద్యార్థులను తీసుకెళ్లనున్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 200 చొప్పున కేటాయిస్తారు.

*🔯టూర్ అంటే చాలా ఇష్టం*
ఎప్పుడూ చదువుతూ ఉండే మనసుకు టూర్తో కొంత విరామం లభిస్తున్నది. తరగతుల్లో ఉన్నవారు అందరం కలిసి చారిత్రాత్మక ప్రదేశానికి, దేవాలయాలకు వెళ్లడం ఆ అనుభూతి మాటల్లో చెప్పరానిది.

*- పి.హరిక, టెన్త్, జెడ్పీహెచ్ఎస్ యాదగిరిగుట్ట*

*☸మంచి నిర్ణయం*
ఉన్నత పాఠశాలల్లోని 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఎడ్యుకేషన్ టూర్ పేరిట విహార యాత్రలకు తీసుకెళ్లడం చాలా మంచి నిర్ణయం. బాహ్యా ప్రపంచంతో పాటు ఇతర పరిజ్ఞానం కూడా విద్యార్థుల్లో పెంపొందుతుంది.

🌞🌞🌞🌞#సౌర_కుటుంబం🌞🌞🌞🌞🌞
☀🌡🌜🌛🌚🌓🌔🌖🌗🌘🌙⛅⛈🌤🌠

🌞విశ్వం గురించి అధ్యయనం చేయు శాస్త్రం 
📌కాస్మాలజీ

🌞భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త 📌టాలెమీ

🌞సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త 📌కోపర్నికస్

🌞జాగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు 
📌ఎరటోస్తనీస్

🌞మొట్టమొదటిసారిగా భూమిని 360 డిగ్రీలుగా విభజించారు 
📌హిప్పార్కస్

🌞తొలి ప్రైవేట్ అంతరిక్ష నౌక పేరు
📌డ్రాగన్

🌞అనేక కోట్ల నక్షత్రాలు సముదాయాని ఏమని పిలుస్తారు 
📌నక్షత్ర మండలం/ గెలాక్సీ

🌞విశ్వంలో అతిపెద్ద గెలాక్సీగా దీనిని పేర్కొంటారు 
📌హైడ్రా

🌞మన నక్షత్ర మండలం పేరు ఏమిటి 
📌పాలపుంత /ఆకాశగంగ

🌞వీటినీ నక్షత్రాల యొక్క జన్మస్థానాలు గా పేర్కొంటారు 
📌నిహారికలు

🌞విశ్వంలో అతిపెద్ద నక్షత్రంగా దీనిని పేర్కొంటారు
📌జటిల్ గ్లక్స్

🌞విశ్వంలో రెండవ అతిపెద్ద నక్షత్రం ఏది 
📌ఎప్సిలాన్ అరిగా

🌞సూర్యుని తరవాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం  📌ఫ్రాక్సిమా సెంటారీ

🌞నక్షత్రాల యొక్క వయసు ఈ పరికరంతో కొలుస్తారు
📌కాస్మోక్రోనో మీటర్

🌞నక్షత్రాలను ఉష్ణోగ్రతను కొలిచే పరికరం పేరు 📌ఆప్టికల్ ఫైరో మీటర్

🌞వాయిభరిత పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు 
📌ఇమాన్యుయల్ కాంట్

🌞నిహరిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు 
📌లాప్లెస్

🌞టైడల్ పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు
📌జీన్స్ మరియు జాఫ్రీ

🌞నోవా పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు
📌హాయిల్

🌞సూర్యునిలో శక్తి జనకానికి కారణమైన చర్య పిలుస్తారు
📌కేంద్రక సంలీనం

🌞సూర్యునిలో ఎక్కువ శాతం విస్తరించి ఉన్న వాయువు
📌హైడ్రోజన్

🌞సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత
📌8 నిమిషాల ఇరవై సెకన్లు

🌞సూర్యుని కిరణాలు భూమి కి ఏ రూపంలో చేరతాయి 
📌హ్రస్వ తరంగాల రూపంలో

🌞సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత డిగ్రీలు ఉంటుంది
📌6000 డిగ్రీలు

🌞సూర్యుని కేంద్రంలో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది
📌100000 డిగ్రీలు

🌞సూర్యుని ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది
📌28రెట్లు

🌞సూర్యుడు తన చుట్టూ తాను తిరగటానికి ఎంత సమయం పడుతోంది
📌25.9 రోజులు

🌞సూర్యుడు తన నక్షత్ర మండలం చుట్టూ ఒకసారి పరిభ్రమించుటకు ఎంత సమయం పడుతుంది
📌250 మిలియన్ సం.

🌞సూర్యుడులో ఎన్ని పొరలు ఉన్నాయి
📌3

📍ఫోటో ఆవరణం

📍క్రోమో ఆవరణం

📍కరోనా

🌞ఫోటో ఆవరణంలో కనిపించే మచ్చలను ఏమని పిలుస్తారు
📌సన్ స్పాట్స్

🌞సూర్యునిలో అధిక ఉష్ణోగ్రత కలిగి ఉండే పొర
📌కరోనా

🌞ఏ రోజున ఉత్తరార్థ గోళంలో అత్యధిక పగలు ఉంటుంది
📌జూన్ 21

🌞ఏ రోజున దక్షిణ అర్ధగోళంలో అత్యధిక పగలు ఉంటుంది 
📌డిసెంబర్ 22

🌞ప్రపంచమంతటా పగలు రాత్రి సమానంగా ఉండటం ఏమని పిలుస్తారు
📌విషవత్తులు

🌞వసంతకాల విషవత్తు ఏ తేదీన ఏర్పడుతుంది 📌మార్చి 21

🌞శరత్ కాలం విషవత్తు ఏ తేదీన ఏర్పడుతుంది 
📌సెప్టెంబర్ 23

🌞సూర్యునికి భూమికి మధ్య దూరం ఎక్కువగా ఉండటాన్ని ఏమని పిలుస్తారు 
📌అపహేళి /రవి ఉచ్చ స్థితి

🌞అపహేళి ఏ తేదీన సంభవిస్తుంది 
📌జూలై 4

🌞సూర్యునికి భూమికి మధ్య దూరం తక్కువగా ఉండటాన్ని ఏమని పిలుస్తారు
📌పరిహేళి /రవి నీచ స్థితి

🌞పరిహేళి ఏ తేదీన సంభవిస్తుంది 
📌జనవరి 4

🌞సూర్యునికి భూమికి మధ్య గల సగటు దూరం ఎంత
📌149.8 మిలియన్.కి.మీ

🌞సూర్యుని కిరణాలు మొట్టమొదట జపాన్ లోని ఏ ప్రాంతంపై పడతాయి 
📌టుంగా దీవులు

🌞సూర్యుని కిరణాలు భారతదేశంలో మొదటగా అరుణ‌చల్ ప్రదేశ్ లో ఏ ప్రదేశం పై పడాతాయి
📌డాంగ్ అనే ప్రదేశం

🔲 సూక్తులు

🔻జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.

🔻జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.

🔻జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.

🔻జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు సాధించిన సత్కార్యాలు.

        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" ఉసరవేల్లి ఆపదలో మాత్రమే
రంగులు మారుస్తుంది కానీ
మనుషులు అవసరాన్ని బట్టి
రంగులు మారుస్తారు. "
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" ప్రపంచంలో అతి ఖరీదైన
 వస్తువు నమ్మకం
సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది
పోగొట్టుకోవడానికి సేకను
 మాత్రమే పడుతుంది."

        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" లోకంలో అన్నింటికంటే తేలికైన పని
సలహాలివ్వడం...
ఒక్కటి ఆడిగితే వెయ్యి చెబుతారు.

అన్నింటికంటే కష్టమైనది..
సహాయం చేయడం.
వెయ్యిమందిని అడిగితే ఒక్కరు చేస్తారు. "
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" మనస్తత్వం కలసిన వారిని
వదులుకోకూడదు
మానవత్వం తెలియని వారిని
కలుపుకోకూడదు. "

❇❇❇❇❇❇❇❇❇❇❇❇

 *💎 నేటి ఆణిముత్యం 💎*

అందుబాటులో నున్నట్టి వన్ని తినుచు
తృప్తి చెందుచు బ్రతికెడి తీరు వలదు;
భుక్తి కోసము బ్రతుకుట ముక్తి గాదు
బ్రతుకుట కొరకు తినుటయే భావ్యమగును

*భావము ;*

చేతికందిన ప్రతి దాన్ని తింటూ తినటానికే జీవించే పద్దతి మంచిది కాదు. బ్రతుకుటకు తగినంత తింటే చాలు.

❇❇❇❇❇❇❇❇❇❇❇❇

 *🤘 నేటి సుభాషితం🤘*

*శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది.*

❇❇❇❇❇❇❇❇❇❇❇❇

 *👬 నేటి చిన్నారి గీతం 👬*

*ఎన్ని కోరికలో*

ఎన్ని కోరికలో 
నా మనసు నిండా,
అమ్మకు చెప్పాలి 
నాన్నకు చెప్పాలి...
అందాల చంద్రుణ్ణి
అందుకోవాలి 
వెలిగేటి చుక్కల్ని
చూసి రావాలి
ముసిరేటి మబ్బుల్ని 
పలకరించాలి 
ఉదయించు సూర్యుడికి 
ముద్దు పెట్టాలి...
తిరిగేటి పక్షులకు 
తిండి పెట్టాలి 
ఎగిరే విమానాన్ని 
ఎక్కి తీరాలి
నీలి ఆకాశాన్ని 
చుట్టి రావాలి 
అక్కడే ఎన్నేన్నొ
ఆట లాడాలి...
ఆట లన్నీ ఆడి
అమ్మ ఒడి దూరాలి
ఊసు లన్నీ నాన్న 
చెవిలోన పోయాలి

❇❇❇❇❇❇❇❇❇❇❇❇

 *✍🏼 నేటి కథ ✍🏼*

*తొందరపాటు*

ఒక అరణ్యంలో జింక ఒకటి ఉండేది. దానికి తొందర పాటుతనం ఎక్కువ. అది పసికట్టి వాళ్ళమ్మ ''నీ ప్రవర్తన వల్ల నువ్వు ఒకరోజు ఏ వేటగాడి చేతిలోనో ఇరుక్కుంటావు!'' అని ఎప్పుడూ హెచ్చరించేది. కానీ తల్లి మాటలు ఈ జింకపిల్ల ఏ రోజూ పట్టించుకునేది కాదు. చాలా నిర్లక్ష్యంగా తల్లి మాటల్ని కొట్టిపారేసేది. తన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించేది కాదు.

ఒకరోజు కొందరు వేటగాళ్లు ఒక జింకను తరమడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తి ఆ జింక చెట్ల పొదల వెనుక దాక్కుంది. ఆ వేటగాళ్ళు దానికోసం వెతికారు. కానీ అది ఎక్కడా కనిపించలేదు. వారు అలాగే ఆలోచిస్తూ నిలబడ్డారు. వారు వెళ్ళిపోయారనుకున్న జింక అక్కడ చెట్లకున్న లేత ఆకులను కొరికి తినడం ప్రారంభించింది.

దానితో ఆ చెట్టుకొమ్మలు కదిలాయి. ఆలోచిస్తూ నిలబడ్డ వేటగాళ్ళలో ఒకరి దృష్టి కదిలే కొమ్మలపై పడింది.

వెంటనే అతడికి విషయం అర్థమైంది. ఇంకేం! తన విల్లు తీసి ఎక్కుపెట్టి బాణం వేశాడు. పాపం! జింక ప్రాణాలు కోల్పోయింది. దాని తొందరపాటే దాని ప్రాణాలు మీదకు తెచ్చింది. 

❇❇❇❇❇❇❇❇❇❇❇❇

 *✅ తెలుసుకుందాం ✅*

*⭕చలికాలములో కొబ్బరి నూనె గడ్డకడుతుందెందుకు?*

✳ఇళ్ళ లో పలురకాల నూనెలు వాడుతుంటాం ... వీటిలో ముఖ్యమైనది తలమీద రాసుకునే కొబ్బరి నూనె , వంటలకు ఉపయోగించే శనగనూనె . వీటిలో కొబ్బరి నూనె చలికాలములో గడ్డకడుతుంది. కారణము అయా నూనెలలో ఉండే కొవ్వు ఆమ్లాలు. కొబ్బరి నూనె లో సంతృప్త కొవ్వు ఆమ్లాలు 90 శాతము వరకు ఉన్నందున ఉష్ణోగ్రత తగ్గగానే గడ్డకడుతుంది. శనగ నూనె లో అసంతృప్త కొవ్వులు అధికము కాబట్టి గడ్డకట్టవు . అసంతృప్త కొవ్వులకు తక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండగా సంతృప్త కొవ్వులకు ఎక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండును . నూనెలలో ఈ తేడా కనిపిస్తుంది. 

❇❇❇❇❇❇❇❇❇❇❇❇

 *📖 మన ఇతిహాసాలు 📓*

*సంజయుడు*
(మహాభారతంలో పాత్ర)

సంజయుడు హిందూ పురాణమైన మహాభారతంలో ఒక పాత్ర. ధృతరాష్ట్రుని కొలువులో సలహాదారు మరియు ఆయనకు రథసారథి. కురుక్షేత్రంలో ప్రాణాలతో మిగిలినవాళ్ళలో ఇతనొకడు. ధృతరాష్ట్ర దంపతులకు సేవలు చేసాడు. చేదోడు వాదోడుగా వున్నాడు. పాండవుల అజ్ఞాత వాసం ముగిసిన సందర్భంలో ధృతరాష్ట్రుని తరుపున రాయబారిగా వెళ్ళాడు. యుద్ధము వద్దని మంచి మాటలతో ఒప్పించాలని చూసాడు.

మహాభారత యుద్ధ సమయంలో కన్నులు లేని కౌరవరాజు ధృతరాష్ట్రునికి తన దివ్యదృష్టి ద్వారా సంజయుడు వివరించి చెబుతాడు. యుద్ధంలో ఒక్కో రోజు ధృతరాష్ట్రునికి తన నూరుగురు కుమారులు భీముని చేతిలో ఎలా చనిపోయారో ఆయనకు వివరించాల్సి వస్తుంది. ఈ కష్ట సమయంలో సంజయుడే ధృతరాష్ట్రునికి సాంత్వన చేకూరుస్తాడు. సంజయుడికి ధృతరాష్ట్రుని మీద ఎంత భక్తి ఉన్నా యుద్ధంలో జరిగే భీభత్సాన్ని మాత్రం ఉన్నదున్నట్టుగా వివరించాడు. ఈ వరం వ్యాసుడు అనుగ్రహిస్తాడు.

కొడుకుల్ని కోల్పోయిన తరువాత గాంధారి ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళ్ళాడు. ఆలనపాలనా చూసాడు. అయితే ఒకరోజు అడవిని కార్చిచ్చు కాల్చేస్తున్న సమయంలో గాంధారీ ధృతరాష్ట్రుని బలవంతంతో ప్రమాదం నుండి తప్పించుకొని వేరే దారిన వెళ్ళి చివరకు హిమాలయాలకు చేరుకున్నాడు.

భగవద్గీత మొత్తం కృష్ణుడు అర్జునునికి భోదిస్తున్నట్లుగా సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. (సంజయ ఉవాచ)

మహాభారతం లో అధర్మ పక్షంలో ఉంటూ తమ పక్షం వారు అధర్మం చేస్తున్నారని అందువల్ల వినాశనం తప్పదని తమవారికే చెప్పగలిగిన ధైర్యశాలి సంజయుడు.

రామాయణంలో విభీషణుడు కూడా రావణునికి బుద్ది మాటలు చెప్పాడు. రావణుడు వినకపోతే అక్కడనుండి రాముని దగ్గరకు వెళ్ళిపోయాడు. అలాగే భారతంలో తాము చేస్తున్నది అధర్మమని భీష్మాది వీరులకి తెలుసు.అసలు అధర్మాచరణకు మూలకొమ్మయైన ధృతరాష్ట్రునికీ తెలుసు. కానీ ఎంత తెలిసున్ననూ వారు పుత్ర వ్యామోహంతోనో ప్రతిజ్ఞబంధంతోనో స్వధర్మాచరణ అనే ముడితో చాలామంది అధర్మపక్షంలోనే ఉండిపోయారు.కానీ ఎక్కడైనా సరే ఏ అవస్థ లోనైనా సరే ధర్మాన్ని విజయలక్ష్మి వరిస్తుందనేది నిక్కం.

ఎన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ధర్మం తప్పకుండా పనులు చేస్తూ అసత్యాన్ని పలకకుండా ఉండడమే నేర్పరితనం. ఆ నేర్పరితనంలో దిట్ట సంజయుడు.

సంజయుడు కురు పాండవుల్లోని ఇరుపక్షాల బలాలు బలహీనతలు సమగ్రంగా తెలిసినవాడు. కనుకనే రాయబారానికి ధృతరాష్ట్రుడు పంపినపుడు పాండవుల దగ్గర సంజయుడు వారి బుద్ధి వైశిష్ట్యాన్ని పొగిడాడు. లోకంలో ఎవరైనా పొగడ్తల కు లోబడేవాళ్లే. అది ఎంతవరకు అన్నది వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది.కానీ కాసేపైనా ఆ మత్తులో ఉంటారు. అందుకే సంజయుడు కౌరవులు చేసింది చేస్తున్నది ఇప్పుడు చేయబోయేది అధర్మమని తెలిసినప్పటికీ తాను చెప్పేది సరియైనది కాదు అని తెలిసినా కూడా ధర్మరాజుని నీవు పుణ్యశాలివీ నీవు రక్తపుటేరులతో పండిన అన్నాన్ని తినలేవు ఐనా నీకు పరమశివుని దగ్గర అస్త్రాలను గైకొన్న వీరాధివీరులైన తమ్ములున్నారు అనీ సామంతో లొంగదీసుకునే ప్రయత్నం చేసాడు.

ఇది రాజనీతి అది సరికాకపోయినా దానిలో అసత్యం లేదు అదే సమయంలో కౌరవుల్లో మహాభయాంకరులైన యుద్ధ పిపాసులైన భీష్మ ద్రోణ కృపాచార్యులతో పాటుగా దుశ్శాసనాది వీరులు మహా పరాక్రమవంతులైన వారి సంతానం ఉన్నారని చెప్పి వారిని ఎదిరించటానికి పరమశివుడు కూడా సంశయిస్తాడని అంటాడు. 

అంటే మీరు ఉత్తములని చెప్తూనే మీ ఎదుటివారు సైతం సామాన్యులు కారు, వారిని జయించడానికి ఎవరైనా వెనుకంజ వేస్తారనే విషయాన్ని వెల్లడిస్తాడు.

ఇలా ఎన్నో సామదానదండోపాయాలను ఉపయోగించి వారిని యుద్ధ విముఖులను చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయితే చివరకు సంజయ రాయబారం శుష్కప్రియాలు శూన్యహస్తాలు మిగిల్చిందన్నది వాస్తవం.

ధర్మరాజాది వీరులకు ఎలా యుద్ధాన్ని విరమించుకోవాలో కౌరవుల వల్ల జరిగే కీడుని దూరం చేసుకోడానికి ఎంత నిశిత బుద్ది కలిగి ఉండాలో విడమరిచి చెప్పాడు. అలానే తన పుత్రులు పాండవాగ్నిలో శలభాల్లా మాడి మసవుతారనే చింతలో ఉన్న ధృతరాష్టునికి మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటూ చిన్ననాడే దుర్యోధనుని అదుపులో పెడితే ఈరోజు ఇలా చింతించాల్సిన అవసరం ఉండేది కాదు అని చెపుతాడు. పాండవులకు అన్యాయం చేసినపుడు చూస్తూ కూర్చున్నావు గనుకనే నేడు నీవారి వినాశనాన్ని కూడా మౌనంగా భరించవలసిందే అని అనగలిగిన వారిలో సంజయుడే ప్రథముడుగా కనిపిస్తాడు.

ధృతరాష్ట్రా! కృష్ణుడు కేవలం ధర్మ సంస్థాపనకై జన్మిoచినవాడు ధర్మనందనులైన పాండుపుత్రుల విజయానికి శ్రీ కృష్ణుడే మూలకారణం అవుతాడు. సత్య దర్మాల పక్షం వహించే శ్రీ కృష్ణుడు పాండవ పక్షపాతి అన్న ఖ్యాతి పొందినవాడన్న నిజాన్ని నీవు అందుడివైనా చూడాల్సిందేనని కష్టమైన మాటల్ని కూడా సూటిగా చెప్పగలిగిన దీముడు సంజయుడు.

ఇంతటి విచక్షణా జ్ఞాని గనుకే వేదవ్యాసుడు సంజయునికి కదన రంగంలో జరిగే పరిణామాలను చూడగలిగే నేర్పునే కాదు వీరుల మనస్సుల్లో రగిలే జ్వాలలను వారి మనసుల రీతిని కూడా చూడగల నైపుణ్య శక్తినిచ్చాడు. దానివల్లనే సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర మహా యుద్ధంలో జరిగే యుద్ధరీతిని అక్కడున్న వారి మనస్థితులని కూడా విపులంగా చెప్పాడు. అటువంటి సంజయుని హితోక్తులను మనము మననం చేసుకొని తీరాలి. సంజయుడు మాట్లాడిన వాటిల్లోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకొని, నిత్య జీవితంలో ఆచరణలో పెడితే అన్నింటా విజయం వరిస్తుంది. అంతేకాదు నిజం మాట్లాడడమెలాగో, నిష్టూరమైననూ అధర్మం నుంచి ఎలా పక్కకు తప్పుకోవాలో, ఒకవేళ అక్కడే ఉన్నా అధర్మపు ఛాయ అంటకుండా ఎలా ఉండాలో తెల్సుకోవచ్చు.

❇❇❇❇❇❇❇❇❇❇❇❇

 *👸🏻👩🏻‍⚖ స్ఫూర్తినిచ్చే మగువలు👩🏻‍✈👩🏻‍🎓*

*నాయకురాలు నాగమ్మ*

ప్రపంచంలోనే తొలి మహిళా మంత్రి. వితంతువైనా స్వశక్తితో అత్యున్నత స్థాయికి ఎదిగిన ధీరోదాత్త వనిత నాగమ్మ.ఒక మహిళ అయి ఉండి మహా మంత్రిణి అయి, రాజ్యాన్ని, రాజును నడిపించి, యుద్దానికి సారధ్యం వహించి, గెలుపు సాధించిపెట్టిన అపర చాణక్య మేధా సంపన్నత నాగమ్మ సొంతం.నాగమ్మ తండ్రి రామిరెడ్డి కరీంనగర్‌ జిల్లా, పెగడపల్లి మండలం, అరవెల్లి గ్రామం నుండి తనబావమరిది మేకపోతుల జగ్గారెడ్డి వుంటోన్న పల్నాడులోని జిట్టగామాలపాడు గ్రామంకు వచ్చాడని చరిత్ర చెబుతుంది.11వ శతాబ్ధకాలంలో ఆనాటి సామాజిక పరిస్థితుల్లో సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఒక సాధారణ స్త్రీ పైగా బాల వితంతువు. మంత్రిస్థాయికి ఎదగడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సమర్ధపాలన యుద్ధనైపుణ్యాలతో స్త్రీజాతికే మణిదీపంలా బాసించింది. 
      గోపన్న మంత్రి పర్యవేక్షణలో నాగమ్మ చదువుతో పాటు సాముగరిడీలు, ధనుర్విద్య, అశ్వ శిక్షణలో ప్రావీణ్యం పొంది, సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషలలో పాండిత్యం సాధించింది. రాజనీతి, తత్వశాస్త్రాలని కూడా అధ్యయనం చేసింది. రామిరెడ్డి మేనల్లుడైన సింగారెడ్డితో నాగమ్మ వివాహం జరిగింది. వివాహమైన మూడు రోజులకే సింగారెడ్డి మరణించడంతో నాగమ్మ వితంతువు అవుతుంది. కొంతకాలం తర్వాత రామిరెడ్డి భూమిలో చెరువు తవ్వించే ప్రయత్నం చేస్తాడు అనుగురాజు. రామిరెడ్డి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో, బ్రహ్మనాయుడు ఆగ్రహించి ఓ రోజు నిద్రలో ఉన్న రామిరెడ్డిని తాళ్ళతో మంచానికి కట్టివేసి పొందుగుల అడవుల్లోకి తీసికెళ్ళి హత్య చేయిస్తాడు.ఇలా యుక్తవయస్సు నాటికే తండ్రినీ, నిలువ నీడ నిచ్చిన మేనమామను, (అప్పటికే) భర్తను కోల్పోయిన నాగమ్మ గుండెను రాయి చేసుకుని బతుకీడ్చింది. 
     స్థానికుల తలలో నాలుకలా మెలగుతూ, వారి మధ్య తగాదాలు పరిష్కరిస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందింది. ఓ రోజు నల్లమల అడవుల్లో వేటకు వెళ్లిన అనుగురాజు, ఆయన సేన, పరివారం తిరుగు పయనమైనారు. నాగమ్మ వారికి స్వయంగా జిట్టగామాలపాడులో సేద దీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. తాగునీరు, భోజన వసతి కల్పించింది. అనుగురాజు ఆనందించి, ఏదైనా వరం కోరుకోమన్నాడు. ‘ప్రజల కోసం ఏదైనా చేయవచ్చనే ఉద్దేశ్యం’తో ‘ఏడు ఘడియలపాటు మంత్రి పదవి ఇమ్మని’ అడుగుతుంది. ‘సరేనన్న’ అనుగురాజు నాగమ్మకు ఇష్టమైన సమయంలో మంత్రి పదవి స్వీకరించే అవకాశం కల్పిస్తూ ‘రాజపత్రం’ రాసి ఇచ్చి వెళ్తాడు.

*_✍ఆధార్ లింక్ గడువును మార్చి 31వరకు పొడిగిస్తాం..!_*

*❇న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్, బ్యాంకు అకౌంట్లు, ఇతర సేవలతో ఆధార్ అనుసంధానం చేసే గడువును మార్చి 31వరకు పొడిగిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆధార్ లింక్ చేయడంపై గడువు ముగియనున్న నేపథ్యంలో.. తాత్కాలిక ఉపశమనం కోసం గడువును పొడిగించాల్సిందిగా పిటిషనర్లు కోరుతున్నారని వారి తరుపు న్యాయవాది శ్యామ్ దివన్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ లింక్ గడువును పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది కేకే వేణుగోపాల్ త్రిసభ్యధర్మాసనం ముందు వెల్లడించారు. మొబైల్ వినియోగదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6లోగా తమ మొబైల్ ఫోన్ నంబర్లు ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.*

*_🌸STUTS :_*🌸

_*✍మోడల్ స్కూల్స్ నిర్వహణకు ఏటా 200 కోట్లు ఖర్చు: మంత్రి కడియం*_

*❇హైదరాబాద్: మోడల్ స్కూల్స్ నిర్వహణకు ఏటా 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. కూకట్ పల్లిలోని జేఎన్టీయు హైదరాబాద్ క్యాంపస్ లో కేజీబీవీల స్కూల్ లీడర్స్ కాన్ఫరెన్స్-17 సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. మన కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ)లను దేశంలోనే గొప్ప కేజీబీవీలుగా మారుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత రెండేండ్లుగా కేజీబీవీలలో వసతుల కోసం వంద కోట్లు ఖర్చు చేశామన్నారు.*

*❇ఇతర గురుకులాలకు సమానంగా కేజీబీవీలలో భోజనం మెనును రూపకల్పన చేశామన్నారు. జనవరి 1, 2018 నుంచి కొత్త మెనూను అమలు చేస్తామన్నారు. కేజీబీవీలలో విద్యార్థినిల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. బాలికల ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్య కిట్‌లు అందించే ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేజీబీవీలను ఎనిమిదో తరగతి నుంచి 12 వరకు విస్తరించాలని కేంద్రానికి విన్నవించినట్లు మంత్రి గుర్తు చేశారు. విద్యా రంగానికి కేంద్రం నిధులు పెంచాలని కోరుతామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో పథకం కింద కేజీబీవీలను 12 వ తరగతి వరకు పొడిగించాలని కోరనున్నట్లు మంత్రి తెలిపారు.*

*👉తల్లిదండ్రులను, పిల్లలను ఫీజుల పెంపుతో ఇబ్బంది పెట్టవద్దు*

*❇ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులను కాదని కోర్టులకెళ్లి ఫీజులను పెంచడంపై ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటుందని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ సమయంలో ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులను తీసుకునేందుకు అంగీకరించి, కౌన్సిలింగ్ లో పాల్గొన్న కాలేజీలు విద్యా సంవత్సరం మధ్యలో కోర్టులకెళ్లి ఫీజులను పెంచడం భావ్యం కాదన్నారు.* 

*❇ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను ప్రతి ఏటా కాలేజీ అడ్మిషన్లకు ముందే ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయిస్తుందని కడియం శ్రీహరి అన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి, సమావేశాలు నిర్వహించిన తర్వాతే ఫీజుల నియంత్రణ కమిటీ ఆయా కాలేజీల ఫీజులను నిర్ధారించిందన్నారు. ఈ నిర్ధారించిన ఫీజులకు ఆయా కాలేజీలు అంగీకరించిన తర్వాత ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీనిని చూసే విద్యార్థుల తల్లిదండ్రుల ఆయా కాలేజీల్లో తమ పిల్లలను చేర్పించారని చెప్పారు.*

*❇అయితే విద్యా సంవత్సరం మధ్యలో కాలేజీల యాజమాన్యాలు కోర్టుకెళ్లి ఫీజులను పెంచుతూ అనుమతి తెచ్చుకున్నారని, దీనికనుగుణంగా ప్రభుత్వం వద్దకు జీవో ఇవ్వాలని కోరారని చెప్పారు. అయితే ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన దానికి భిన్నంగా, కాలేజీ మధ్యలో ఫీజులు పెంపు తల్లిదండ్రులకు భారం అవుతుందనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యాల ఫీజుల పెంపు అంశాన్ని తాము తిరస్కరించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకు తెలిపారు.*

*❇ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచుకోవాలంటే వచ్చే ఏడాది నుంచి ఫీజు నియంత్రణ కమిటీ ఆమోదం పొంది వాటిని పెంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. 1,13,000 ఫీజును ఏకంగా 2,00, 000 పెంచుతూ అనుమతి తెచ్చుకుని ఆ మొత్తాన్ని కట్టాలని ఇప్పుడు అనడం వల్ల తల్లిదండ్రులు, పిల్లలను ఇబ్బంది పడుతున్నారన్నారు. కాలేజీలో అడ్మిషన్ల సమయంలోనే విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఫీజుల పెంపునకు సంబంధించి అఫిడవిట్లు తీసుకున్నామనే అంశం ప్రభుత్వ దృష్టిలో లేదన్నారు. ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన దానికి భిన్నంగా తల్లిదండ్రుల వద్ద అఫిడవిట్లు తీసుకోవడానికి వీలు లేదన్నారు.*

*❇ఇంజనీరింగ్ కాలేజీలు కోర్టు నుంచి తెచ్చుకున్న అనుమతి ద్వారా పెంచిన ఫీజుల పెంపుపై నేడు ఫీజుల నియంత్రణ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఫీజుల పెంపుకు సంబంధించిన కోర్టు ఆదేశాలపై వెకేట్ పిటిషన్ ఇప్పటికే వేశారని అన్నారు. ఈ రోజు సమావేశమై అప్పీల్ కు వెళ్లడంపై చర్చిస్తారని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందన్నారు.*

*✍U- DISE form పూరించుటకు సాధారణ సూచనలు*

 U-DISE పత్రంలో పొందపరచిన వివరాలు *30 సెప్టెంబర్* వ తేదీ నాటికి సంబంధించినవిగా ఉండవలెను..

 ప్రతీ CWSN పిల్లల వివరాలను సంబంధిత/ దగ్గరలోని పాఠశాలలో తప్పకుండా నమోదు చేయాలి..
  
తరగతి వారిగా వున్న section లను సూచించాలి..
( ఒక తరగతికి వేరువేరుగా హాజరుపట్టికలను వినియోగిస్తే వాటిని సెక్షన్లుగా భావించాలి)

 SMC కి సంబంధించిన table లో SMC సభ్యుల సంఖ్య a=b+c కావాలి..

 విద్యాసంవత్సరం మార్చ్ నుండి ప్రారంభం అయింది కావున మార్చ్ వ్రాయాలి..

  Physical facilities లో
పాఠశాల భవనం పూర్తి తరగతి గదులు కూలిపోయే స్థితిలో ఉంటే Dilapidated(6)
 గా సూచించాలి..

  విద్యావాలంటీర్లను, CRT లను, fixed వేతనం తీసుకుంటున్న వారి వివరాలను contract teacher లో చూపాలి

 table C లో ఉపాధ్యాయుల వివరాలతో పాటు Contract Teachers (విద్యావాలంటీర్ల)ల పూర్తి వివరాలు కూడా వ్రాయాలి..

 ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేసినా వేతనం తీసుకుంటున్న పాఠశాలలోనే చూపాలి..

ఆధార్ , సెల్ నంబర్ మరియు ఈ మెయిల్ స్థానంలో *** గుర్తులున్నప్పటికీ మరల వారి నంబర్లను పూర్తిగా నమోదు చేయాలి..

 table C లో SGT లు Appointed for Subject సంబంధించి 1- All subjects గా నమోదు చేయాలి..

Table E లో పాఠశాలలో వున్న అన్ని మాధ్యమాలు మరియు సెక్షన్ లలో వున్న అందరి విద్యార్థుల సంఖ్యను  నమోదు చేయాలి

  పిల్లల వయస్సు 31-08-2017 నాటికి లెక్కించాలి. 31-08-2017 నాటికి పూర్తయిన సంవత్సరాలనే వయస్సుగా నమోదు చేయాలి..
ఉదా: విద్యార్థి వయస్సు  31-08-2017 నాటికి 9 సంవత్సరాల 11 నెలలు అయితే 9 సంవత్సరాలు గానే పరిగణలోనికి తీసుకోవాలి.
👉U Diseలో ఓబీసీ లో అందరు BC మరియు MINORITY వారి వివరాలు కలిపి నమోదు చేయాలి
👉 దానిక్రింద టేబుల్ లో minority వారి వివరాలు వేరుగా నమోదు చేయాలి..

 Table E లో తరగతి వారిగా నమోదుచేసిన విద్యార్థుల వివరాలనుTable G లో ఆయా మాధ్యమాలుగా విభజించి రాయాలి..
ఇది రాసేటప్పుడు A లోని 27లో రాసిన బోధనా మాధ్యమాల వరుస క్రమాన్నే G table లో పాటించాలి..

                   *శాలసిద్ది*

U-DISE లో శాలసిద్ధికి సంబందించిన వివరాలు నమోదుచేయాలి...

👉 దీనిలో పాఠశాలలోని అన్ని మాధ్యమాలలో వున్న మొత్తం విద్యార్థుల వివరాలను సామాజిక వర్గాలవారిగా నమోదు చేయాలి..
ఇక్కడ OBC లో Minority వారిని కలిపి చూపకూడదు వారికి సంబందించిన box లో వేరుగా నమోదు చేయాలి..

👉 విద్యార్థుల హాజరుశాతాన్ని  తరగతుల వారిగా బాలబాలికలకు వేరుగా సూచించాలి...
ఉదా: తరగతిలో 5 మంది బాలురు ఉంటే వారి శాతాన్ని క్రిందివిధంగా లెక్కించాలి..

విద్యార్థుల మొత్తం హాజరు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ × 100
              పనిదినాలు
👉 ఉన్నత పాఠశాలలలోని విద్యార్థుల ఫలితాలను సంబంధిత విషయాలవారిగా A,B,C,D మరియు E గ్రేడ్ లలో వున్న వారి శాతాన్ని నమోదు చేయాలి..
Note:
(Subjects with consistent low performance ) లో
 A,B,C,D మరియు E గ్రేడ్ లలో ఏది తక్కువ శాతం ఉంటే దానిని వ్రాయాలి..

👉 పాఠశాలలో పనిచేస్తున్న అందరు అనగా ఉపాధ్యాయులు మరియు విద్యావాలంటీర్ల వివరాలను  అందరివి శిక్షణ పొందిన వారిని, పొందనివారిని నమోదు చేయాలి...
👉
Domain లలోని levels లను శాలసిద్ది మాడ్యులే చదివి నమోదు చేయాలి...

*_🌸STUTS :_*🌸

*✍రాష్ట్రస్థాయి వ్యాస రచన పోటీల్లో విజేతలు*

*❇హైదరాబాద్: తెలంగాణ భాషా, సాహిత్యం, సంస్కృతి అంశాల్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు.*

 *👉ప్రథమ బహుమతి బాసన సురేశ్(వరంగల్),*

*👉ద్వితీయ బహుమతి రాఘవరావు(కరీంనగర్),*

 *👉తృతీయ బహుమతి బడుగుల వనిత(మహబూబ్ నగర్),*

 *❇ప్రోత్సాహక బహుమతి కె. రసజ్ఞ(నిజామాబాద్)తో పాటు మరో 10 మందికి ప్రోత్సాహక బహుమతులకు ఎంపికైనట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు.*

*_🌸STUTS :_*🌸

*✍22వ తేదీ నుంచి ఓయూ పీజీ పరీక్షలు*

*❇హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.*

*👉ఓయూ డిగ్రీ పరీక్షలు యధాతథం*

*❇హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలు ఎలాంటి వాయిదా లేకుండా యధాతథంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ముందుగా ప్రకటించినట్లుగా ఈ నెల 14వ తేదీ నుంచి అన్ని డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, దానిని విద్యార్థులు నమ్మవద్దని చెప్పారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. విద్యార్థులు వివరాలకు ఓయూ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని పేర్కొన్నారు.*

*_🌸STUTS :_*

*✍రాష్ట్రంలో మరో 200 ఎంబీబీఎస్‌ సీట్లు*

*❇సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఏడాది వైద్య విద్య సీట్లు పెరగనున్నాయి. సిద్దిపేటలో ప్రభుత్వం నిర్మిస్తున్న వైద్య కాలేజీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. 200 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతి వచ్చేలా ఈ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇప్పటికే ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసింది. త్వరలోనే అడ్మిషన్లపై అధికారిక ప్రకటన చేయనుంది.*

*❇ఇది ప్రభుత్వ కాలేజీ కావడంతో మొత్తం సీట్లను కన్వీనర్‌ (ఏ కేటగిరీ) కోటాలోనే భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,250 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఇందులో ఆరు ప్రభుత్వ కాలేజీల్లో కలిపి 1,000 సీట్లు ఉన్నాయి. సిద్దిపేట కాలేజీతో కలిపి ఈ సంఖ్య 1,200కు పెరగనుంది. ఇక బీడీఎస్‌ కోర్సులో రాష్ట్రవ్యాప్తంగా 1,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్‌) ఆధారంగా వైద్య విద్య అడ్మిషన్లు చేపడతారు. వచ్చే ఏడాది మే 10న నీట్‌ పరీక్ష నిర్వహించాలని సీబీఎస్‌ఈ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.*

*👉కన్వీనర్‌ కోటా పెంపు..*

*❇వైద్యవిద్య సీట్లపై ఉమ్మడి హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. వచ్చే ఏడాది సీట్ల భర్తీ స్వరూపం మారనుంది. మైనారిటీ అన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లోని 60 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలోనే భర్తీ చేయనున్నారు. అయితే ఇంతకుముందు కూడా 60 శాతం కన్వీనర్‌కోటా ఉన్నా.. ప్రస్తుత విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ముందు దీనిని 50 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.*

*❇కానీ ఆ ఉత్తర్వులను కోర్టు కొట్టివేయడంతో తిరిగి 60 శాతం కన్వీనర్‌ కోటా అమలుకానుంది. మిగతా సీట్లలో 25 శాతం బీ కేటగిరీలో, 15 శాతం సీ కేటగిరీలో భర్తీ చేస్తారు. రాష్ట్రంలో మూడు మైనారిటీ వైద్య కాలేజీలు, ఒక దంత వైద్య కాలేజీకి కలిపి 500 సీట్లు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుత ఏడాది 250 సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయగా.. వచ్చే ఏడాది అవి 300కు పెరుగుతాయి.*

 *తెలంగాణ న్యూస్*

*🌻ఒకట్రెండు రోజుల్లో టీఆర్టీ నోటిఫికేషన్!*

 పదిజిల్లాల ప్రాతిపదికన టీఆర్టీ నోటిఫికేషన్ విడుదలకు టీఎస్‌పీఎస్సీ చేసిన కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సమాచారం.

 ఒకట్రెండు రోజుల్లో పాతజిల్లాల రోస్టర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిసింది. 8,792 ఉపాధ్యాయ కొలువుల భర్తీ కోసం అక్టోబర్ 21 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 పాత పదిజిల్లాల ప్రకారమే టీఆర్టీ నిర్వహించాలని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం పదిజిల్లాల మేరకే టీఆర్టీ నిర్వహించేలా మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. 

*మరోసారి పీజీటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన*
తెలంగాణ గురుకులాల్లోని పీజీటీలో పలు క్యాటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లేనందున మరోమారు 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

అక్టోబర్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) ఇంగ్లిష్, హిందీ, గణితం, బయోలాజికల్ సైన్సెస్ విభాగాల అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించినా అర్హులు లేనందున మరోమారు ఆ ప్రక్రియ చేపట్టనున్నట్టు కమిషన్ కార్యదర్శి తెలిపారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

ఈ రోజు ప్రశ్న

ప్రశ్న: దాగి ఉన్న లోహాల్ని కనిపెట్టే మెటల్‌ డిటెక్టర్లు ఎలా పనిచేస్తాయి?

జవాబు: భూమిలో కంటికి కనబడకుండా దాగి ఉన్న లోహాలను, ఉగ్రవాదులు రహస్య ప్రదేశాల్లో అమర్చిన బాంబుల్లాంటి వాటిని కనుగొనడానికి మెటల్‌ డిటెక్టర్లను ఉపయోగిస్తారు. అది అయస్కాంత ఉత్ప్రేరకత(మేగ్నటిక్‌ ఇండక్షన్‌) అనే సూత్రంపై పనిచేస్తుంది.
మెటల్‌ డిటెక్టర్‌లో సన్నగా పొడవుగా ఉండే లోహపు కడ్డీ ఉంటుంది. దాని కింద భాగంలో ఉండే అయస్కాంత తీగల చుట్టలు ఒకదాని చుట్టూ మరోటి ఉంటాయి. బయట వైపునకు ఎక్కువ వ్యాసార్థంతో ఉండే చుట్టను ‘టాన్సి్మటర్‌ కాయిల్‌’ అంటారు. ఈ తీగ చుట్ట చుట్టూ సెకనుకు అనేక వేలసార్లు దిశను మార్చుకోగల అయస్కాంత క్షేత్రం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. 
అయస్కాంత క్షేత్రం నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు భూమిలోగానీ, భూమి బయటగానీ నిక్షిప్తమై ఉండే లోహపు భాగాలపై పడ్డాయనుకోండి. అద్దంలో మనం మన ప్రతిబింబాన్ని చూసినట్లు ఆ లోహపు భాగాల నుంచి ఉత్ప్రేరకమైన అయస్కాంత క్షేత్ర తరంగాలు వెనుతిరిగి వచ్చి డిటెక్టర్‌లోని తీగచుట్టల్ని చేరుకుంటాయి. అప్పుడు ఆ తీగ చుట్టలో అయస్కాంత తరంగాల వల్ల ఉత్పన్నమయ్యే ధ్వనితో కూడిన సిగ్నెళ్లు పనిచేస్తాయి. మెటల్‌ డిటెక్టర్‌కి అనుసంధానించి ఉండే హెడ్‌ఫోన్స్‌ పెట్టుకున్న వ్యక్తికి ఆ సమాచారం అందుతుంది. దీంతో ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఏదో లోహ సంబంధమైన పదార్థం ఉందని గుర్తిస్తాడు.

*🌷అజంతా ఎల్లోరా  మహారాష్ట్రలోని ఆలయాలు*🌷

అజంతా-ఎల్లోరా గుహలు మహారాష్ట్ర ఔరంగాబాద్ నగరానికి సమీపంలో ఉన్నాయి. ఈ గుహలు పెద్ద రాళ్ళు కట్టడం ద్వారా తయారు చేస్తారు. 

అజంతాలో 29 గుహలు ఉన్నాయి, 34 గుహలు ఎల్లోరాలో ఉన్నాయి. ఈ గుహలు ప్రపంచ వారసత్వ రూపంలో భద్రపరచబడ్డాయి. వారు రాష్ట్రాకుట్ రాజవంశం పాలకులు నిర్మించారు. 

ఈ గుహల మిస్టరీ ఇప్పటికీ పరిశోధనలో ఉంది. ఇక్కడ సేజ్-మున్నీ మరియు ఆకలి లోతైన ధ్యానం మరియు ధ్యానం చేయటానికి ఉపయోగిస్తారు.
సహ్యాద్రి కొండలపై ఉన్న 30 గుహలు, సుమారు 5 ప్రార్థన భవన్ మరియు 25 బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. 

గుర్రపు ఆకారంలో నిర్మించిన ఈ గుహలు పురాతనమైనవి మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగినవి. 

ఇవి బౌద్ధ మతంలో 200 BC నుండి 650 AD వరకు చిత్రీకరించబడ్డాయి. ఈ గుహలలో, హిందూ, జైన మరియు బౌద్ధ మతాలు వైపు చూపించిన విశ్వాసం యొక్క త్రైనియల్ సంగమం యొక్క ప్రభావం కనుగొనబడింది. 

బౌద్ధమతం యొక్క దక్షిణాన ఉన్న 12 గుహలు (మహాయాన శాఖ ఆధారంగా), కేంద్ర హిందూ మతం యొక్క 17 గుహలు మరియు ఉత్తరాన 5 గుహలు జైనమతం ఆధారంగా ఉన్నాయి.

*♦నేటి జీ కె:*

1) *మానవ నేత్రం ఏ కటకంలా పని చేస్తుంది?*

    *కుంభాకార కటకం*

2. *అతినీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?*

      *రిట్టర్*

3. *కండరాల నొప్పి, పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు?*

      *పరారుణ కిరణాలు*

4. *నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?*

       *అతినీలలోహిత కిరణాలు*

5. *వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?*

      *ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్*


6. *రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు?*

         *మైక్రో తరంగాలు*

7. *కనిష్ట తరంగదైర్ఘ్యం ఉన్న కిరణాలు?*

           *x - కిరణాలు*

🔲ప్రశ్న: మంచు తెల్లగానే ఎందుకు ఉంటుంది?

జవాబు: తెలుపు ఓ నిర్దిష్ట వర్ణం (specific colour) కాదు. ఇది ఎన్నో వర్ణాల కలయిక. సాధారణంగా ఏదైనా పదార్థంలోని అణువులు (molecules)లేదా పరమాణువులు (atoms) దృశ్య కాంతిలో ఉన్న ఏ రంగు కాంతినీ శోషించుకోలేనట్లయితే ఆ పదార్థం తెల్లగా గానీ, పూర్తి పారదర్శకంగాగానీ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి పదార్థంలో ఉన్న పరమాణువులు స్వచ్ఛమైన స్ఫటికాకృతిలో (crystal structure) ఉన్నా, అణువులు లేదా పరమాణువుల మధ్యన ఖాళీ ప్రదేశం (ద్రవాలు, అణువులలో లాగా) బాగా ఎక్కువగా ఉన్నా ఆ పదార్థాలు పారదర్శకం (transparent) గా ఉంటాయి. కానీ అదే పదార్థంలో ఉన్న అణువులు, పరమాణువులు చిందరవందరగానో, శకలాల్లాగానో (polycrystalline or defective crystalline)ఉన్నట్లయితే ఆ పదార్థాల మీద పడ్డ తెల్లని కాంతి అన్ని వైపులకు పరావర్తనం (reflection) లేదా వ్యాపనం (diffusion) లేదా పరిక్షేపణం (scattering)అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఏ వైపు నుంచి చూసినా మనకు అంతో ఇంతో తెలుపు కాంతి కంటికి చేరడం వల్ల ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. సాధారణంగా మంచుగడ్డలు నిర్దిష్ట స్ఫటికాకృతిలో కాకుండా చెల్లా చెదురుగా ఏర్పడ్డ బహుస్పటిక శకలాలు (poly crystalline segments)గా ఉంటుంది. ఇటువంటి శకలాలమీద పడ్డ కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆ మంచు ముక్కలు తెల్లగా అగుపిస్తాయి.

*✅ తెలుసుకుందాం ✅*

*⭕చలికాలంలో బ్యాటరీలు సరిగా పనిచేయవు-ఎందుకని?*

✳బ్యాటరీలో ఉండే రెండు లోహపు పలకల మధ్య రసాయనిక చర్యల ద్వారా ఎలక్ట్రాన్లు ప్రవహించే తీరును బట్టి అది ఉత్పత్తి చేసే విద్యుత్‌ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాటరీలలో జింకు, రాగి లోహపు పలకలను వాడతారు. వీటిని ఎలక్ట్రాన్లు సులువుగా ప్రవహించే ద్రవంలో ఉంచుతారు. వీటి మధ్య జరిగే రసాయనిక చర్యల ఫలితంగా ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలై ఎక్కువ మోతాదులో రాగి పలకపైకి చేరుకుంటాయి. ఇవే బ్యాటరీని అనుసంధానం చేసిన విద్యత్‌ వలయంలో కూడా ప్రవహిస్తాయి. చలికాలంలో, వర్షాకాలంలో వాతవతరణంలో ఉండే చల్లదనం వల్ల ఉష్ణోగ్రత తగ్గి రసాయనిక చర్య వేగం మందగించడంతో బ్యాటరీలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వాటిని కొంచెం వేడి చేస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. చలికాలంలో మోటారు వాహనాలు వెంటనే స్టార్ట్‌ కాకపోవడానికి కూడా ఇదే కారణం. 

📖మోడల్ స్కూల్👍🌍⏰

తరగతి-5         అంశం-EVS
1.అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం ఉండాలి-33%
2.అడవుల మన భూమి మీద ఎంత శాతం ఉంది-21%
3.మనం పీల్చే గాలి-ఆక్సిజన్(0)
4.మనం విడిచే గాలి-కార్బన్ డై ఆక్సైడ్(CO2)
5.ఉత్పత్తి దారులు అని వేటిని అంటారు-మొక్కలు
6.బోన్సాయ్ మొక్కల పెంపకం ఏ దేశం యొక్క సాంప్రదాయ కళ-జపాన్
7.పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయo అందించే సంస్థ-కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్.
8.ఏ చెట్టును uno శతాబ్ద వృక్షంగా ప్రకటించింది-వేప
9.వనప్రేరణ ఉద్యమంలో భాగంగా ఒకే రోజు ఎన్ని మొక్కలు నాటారు-2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు.
10.నగరాలలో ఎంత శాతం మంది నివసిస్తున్నారు-67%

✅Let's improve our knowledge

🔎ఉల్కలు అంటే ఏమిటి?:

దాదాపు 10 టన్నుల బరువున్న ఉల్క భూమి వాతావరణంలోకి ప్రవేశించి ముక్కలుగా పేలిపోయి రష్యాలోని ఒక పట్టణంపై పడిన సంగతి తెలిసిందే. రాత్రివేళల్లో ఆకాశంకేసి చూస్తే కొన్ని నక్షత్రాలు రాలి పడినట్టు కనిపిస్తుంది. అయితే ఇవి నక్షత్రాలు కావు. వాటిని ఉల్కలు (మెటియర్స్‌) అంటారు. గ్రహాలు ఏర్పడిన తొలిరోజుల్లో గ్రహాల ఆకర్షణకు లోనుకాని కొన్ని శిలలు, ధూళికణాలు గ్రహాలతోపాటు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే అంగారక గ్రహం నుంచి, చంద్రుని నుంచి వెలువడిన ధూళి కణాలు కూడా అంతరిక్షంలో ఉంటాయి. అంతరిక్షంలో తిరిగే వీటిని 'మెటియోరైడ్స్‌' అంటారు. 

భూమి తన కక్ష్యలో తాను తిరుగుతూ, ఈ మెటియోరైడ్స్‌ ఉండే ప్రాంతంలోకి వచ్చినపుడు వీటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తి వలన భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయి. గంటకు సుమారు 30,000 కిలోమీటర్ల వేగంతో ఇవి భూవాతావరణంలోకి ప్రవేశించడంతో వాటి ఉష్ణోగ్రత విపరీతంగా 1650 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరిగి కాంతిని వెదజల్లుతూ పడిపోతాయి. వాటిని మెటియర్స్‌ అంటారు.

భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్కలు (మెటియర్స్‌) చాలావరకు భూమి మీద పడకుండానే ఆవిరి గానూ, ధూళి కణాలుగానూ మారిపోతాయి. ఇవి మనకేమాత్రం హాని చేయకపోగా, వాటి చుట్టూ చిన్న నీటి బిందువులు ఏర్పడి వర్షాలు కురియడానికి కూడా సహాయ పడతాయి. కానీ కొన్ని పెద్ద ఉల్కలు భూమి వాతావరణంలో ప్రవేశించాక మండిపోతూనే ప్రయాణించి భూమి ఉపరితలాన్ని 'ఢీ' కొంటాయి. వీటిని 'మెటియోరైట్స్‌' అంటారు. ప్రతి సంవత్సరం సుమారు 500 మెటియోరైట్స్‌ భూమిపై పడతాయి. ఇనుము, నికెల్‌లాంటి ఖనిజాలను కలిగి ఉండే వీటి మొత్తం బరువు 100 టన్నులు పైగా ఉంటుంది. ఇవి భూమిని తాకిన చోట లోతైన గోతులు ఏర్పడతాయి. 

యాభైవేల సంవత్సరాల క్రితం అమెరికాలోని అరిజోనా ఎడారిలో 10,000 టన్నుల బరువైన ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొన్నది. నేటికీ అక్కడ 18 టన్నుల ఇనప ఖనిజం ఉంది. 1980లో సైబీరియాలో ఎనిమిదిన్నర టన్నుల ఉల్క వాతావరణం లో పేలి భూమిపై పడటంతో సుమారు 200 కి.మీ.ల విస్తీర్ణం లో చెట్లు నేల మట్టమయ్యాయి.
   ఒకేసారి వందలాది ఉల్కలు భూమిని చేరుతాయి. 1837 నవంబర్ 13న ఒక్క గంటలో 30,000వేల ఉల్కలు భూమిని చేరాయి.

*QUIZ BITS*

*1) క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ అని దేన్ని పిలుస్తారు?*

*జ: కొచ్చిన్*

*2) సూర్యకేంద్ర సిద్దాంతాన్ని ప్రతిపాదించింది?*

*జ: కొపర్నికస్*

*3) మిష్మి కొండల ఏ రాష్ర్టం లో కలవు?*

*జ: అరుణాచల ప్రదేశ్*

*4) భూమి ఏ ఏ గ్రహాలమద్య ఉంది?*

*జ: శుక్రుడు -- అంగారకుడు*

*5) స్ధానిక స్వపరిపాలనా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు.?*

*జ: లార్డ్ రిప్పన్*

*6) 2019 లో 12 వ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు ఎక్కడ జరుగుతాయి.?*

*జ: ఇగ్లాండ్*

*7) హైదరాబాద్ సంస్ధానం స్వతంత్ర భారతదేశంలో ఏ రోజున విలీనమయ్యింది?*

*జ: 1948 సెప్టెంబర్ 17*

*8) కాంగో పరివాహ ప్రాంతంలో నివసించే జాతి?*

*జ: పిగ్మీలు*

*9) బైశాఖి అనే పండుగ/ ఉత్సవం ఏ రాష్ర్టంలో జరుగుతుంది?*

*జ: పంజాబ్*

*10) మోహినీ అట్టం ఏ రాష్ర్టంలో ప్రసిద్ది*

*జ: కేరళ*

✍ *_అష్ట దిగ్గజ కవులు శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో ఉండేవారు. వారి పేర్లు గుర్తుంచుకోవడం కోసం బండ గుర్తు..._*

*NTR PADMA (ఎన్ టి ఆర్ పద్మ)*

 *N-నండి తిమ్మన*

*T-తెనాలి రామకృష్ణ*

 *R -రామరాజు భూషణుడు*

 *P-పింగళి సూరన*

*A-అల్లసాని పెద్దన*

 *D-దూర్జటీ*

*M-మాదయగారి మల్లన*

*A-అయ్యలరాజు రామభద్రుడు*  

ఈ రోజు జికె 

*1)భారత దేశానికి వాయువ్యంగా ఉన్న సరిహద్దు దేశం?*

*జ.పాకిస్తాన్* 

*2)భారతదేశం లో అతి పెద్ద ద్వీపం?*

*జ.గ్రేట్ నికోబార్*

*3)ఋతు పవనాలు మొదట ఏ రాష్ట్రాన్ని తాకుతాయి?*

*జ.కేరళ* 

*4)ప్రాచీన ఒండలి మైదానాన్ని ఏమంటారు?*

*జ.బంగర్* 

*5)దక్కన్ పీఠభూమి ఏ వైపుకు వాలి ఉంది?*

*జ.తూర్పు* 

*6)రాష్ట్రపతి ఏ సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు?*

*జ.లోకసభ*

*7)సతీ సహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్?*

*జ.విలియం బెంటిక్* 

*8)బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది?*

*జ.వారన్ హెస్టింగ్స్* 

*9)డ్యూరాడ్ రేఖ భారత దేశానికి ఏ దేశానికి మధ్య ఉన్నది?*

*జ.ఆప్గనిస్తాన్*

*10)భారత దేశం లో మొత్తం దీవుల సంఖ్య?*

*జ.247* 

*నేటి జీ కె:*

1) *ఇటీవల 12వ G-20 సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?*

 *హాంబర్గ్ జర్మనీ*

2) *బంగారు  ఆభరణాలకు హాల్ మార్కింగ్ను ఎప్పటి నుండి తప్పనిసరిగా ముద్రించాలని కేంద్రం ఆదేశించింది?*

 *జనవరి 2018 నుండి*

3) *నోట్లో 459 స్ట్రా లు పెట్టుకుని గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కిన ఒడిశా వాసి ఎవరు?*

 *మనోజ్ కుమార్ మహారాణా*

4) *ఇటీవల ఏ వస్తువును మేథో సంపత్తి గా గుర్తించడం జరిగింది?*

 *మదర్ థెరిస్సా దరించిన నీలి అంచు  చీర*

5) *దేశంలో తొలిసారిగా సంఘ బహిష్కరణకు నిషేధిస్తూ చట్టం చేసిన రాష్ట్రం ఏది?*

 *మహారాష్ట్ర*

ఈ రోజు జికె 

1)👉దేశంలో తొలి సైక్లింగ్ పార్క్ ఇటీవల ఏ నగరంలో  నిర్మించబడింది?
A: *హైదరాబాద్(పాలపిట్ట సైక్లింగ్ పార్క్)*

2)👉 ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్ లలో 50 సెంచరీలు పూర్తిచేసి ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా అవతరించిన క్రికెటర్ ఎవరు?
A: *విరాట్ కోహ్లీ*

3)👉 రాజధాని ఎక్స్ ప్రెస్ కోసం రైల్వేశాఖ ఇటీవల ఆవిష్కరించిన అధునాతన రైలు పెట్టెల పేరేమిటి?
A: *స్వర్ణ*

4)👉యూకే-భాంక్రా అవార్డుల వేడుకలో ప్రపంచ ఉత్తమ కళాకారిణిగా ఎంపికైన పంజాబీ గాయని ఎవరు?
A: *అనితా  హజోర్త్ లిర్చ్*

5)👉ఎన్ని టెస్టుల్లో 300 వికెట్లు తీసి రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు?
A: *54 టెస్టులు*

🇮🇳💂➖➖➖➖➖➖➖➖➖
*నేడు భారతీయసైనికదళాల పతాక దినం*
➖➖➖➖➖➖➖➖🌸🌸🍃
*¤ సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి మరియు*
*శత్రువుల బారి నుండి దేశాన్ని రక్షిస్తూ*
*వారు చేసిన త్యాగాలు గుర్తుచేసు కుంటూ వారు మరియు వారి కుటుంబా లకు* 
*మనము అండగా ఉన్నట్లు తెలియ చేయుట ఈనాటి ప్రత్యేకత.*

*¤ మన భారత సైన్యం, వైమానిక దళం మరియు నావికా దళం దేశ సరిహద్దు లను కాపాడటమే కాకుండా దేశంలోని అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్తితులను చక్కదిద్దడం లో ముఖ్య పాత్ర పోషిస్తూ ...*

*¤ దేశ ప్రజల ధన, మాన ప్రాణాలను రక్షించడంలో సాయుధ ధళాలు ముందు వరసలో ఉంటాయన్న విషయం మనందరికి తెలుసు.*

*¤ విభిన్న రాష్ట్రాలలో వచ్చిన వరదలు, భూకంపాలలో వేలమంది ప్రజలు కొండలు, గుట్టల్లో చిక్కుకున్నపుడు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండ వారిని కాపాడి సురక్షిత స్థలాలకు చేర్చిన సంగతి మనకి విదితమే.*

*¤ ఇంతే కాకుండా పలుచోట్ల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టుచూ వేలమంది ప్రజలను రక్షిస్తూ వీరమరణం పొందిన విషయం కూడా మనందరికీ తెలుసు.*

*¤ సైనిక సంక్షేమశాఖ అమరవీరుల కుటుంబాలు,  మాజీ సైనికులు మరియు వారి కుటుంబాల సంక్షేమం కొరకు ప్రత్యేకముగా స్థాపించబడినది. ఈ శాఖ రాష్ట్రములో హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వము తరుపున అందించే అన్ని రాయితీలను వారికి సక్రమముగా చేర్చుట కొరకు ఈ శాఖ ప్రత్యేకముగా కృషిచేస్తుంది.*

*🗣ఈ సందర్భంగా మన ఆర్మీ గురించి కొన్నివిశేషాలు!* 
¤ హిట్లర్‌కు ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాల మీద విపరీతమైన నమ్మకం.

¤ ఒక సందర్భంలో ఆయన మన ‘గూర్ఖా’ దళం సహాయాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేశారట. గూర్ఖా సైనికులు తన దగ్గర ఉంటే మొత్తం ఐరోపా ఖండాన్నే తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవచ్చని ఆయన తలపోశారట! జర్మనీ సైనికుల కు దీటైన శక్తి ప్రపంచంలో గూర్ఖా దళం ఒక్కటే అని హిట్లర్ అన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అతి పెద్ద సైనిక దళం భారత్‌కే ఉంది.

¤ ఖండాంతర క్షిపణి అగ్ని-5 ని తన అమ్ములపొదిలో చేర్చుకోవడం ద్వారా భారత్… యు.ఎస్. ఫ్రాన్స్, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన చేరింది.

¤ ప్రపంచంలోనే అతి ఎతైన ప్రదేశంలోని యుద్ధక్షేత్రం భారత్ నియంత్రణలో ఉంది. సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తు లో ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో మన సైనికులు గస్తీ కాస్తున్నారు.

¤ అతిపెద్ద వలంటీర్ ఆర్మీ.. ప్రపంచంలో ఒక్క భారత్‌కే ఉంది. నిర్బంధంగా కాకుండా, స్వచ్ఛందంగా సైన్యంలో చేరిన వారిని వలంటీర్ ఆర్మీ అంటారు.

¤ ఇంత ఘనతభారతీయ సైనిక దళంలో పనిచేస్తున్న వారి కుటుంబాల సంక్షేమం కోసం నిధులను సమీకరించే ఉద్దేశంతో ..1949 నుండి ఏటా డిసెంబర్ 7న మనం ‘ఫ్లాగ్ డే’ జరుపుకుంటున్నాం. త్రివిధ దళాల సైనికుల గౌరవార్థం నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. 

¤ ఇలాంటి వీర సైనికుల సంక్షేమం చూడటం మనవంతు భాద్యత వారికి మరియు వారి కుటుంబాలకు   సహాయం చేయడం మన ప్రజల కర్తవ్యం. ఇందుకోసంగాను “సాయుధ ధళాల పతాక దినోత్సవ నిధిని” ప్రభుత్వము ఏర్పాటు చేసినారు.

¤ఈ నిధికి గౌరవనీయ గవర్నర్ గారు చైర్మన్ గా,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్ గా, సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ వారు సెక్రటరీ గా ఇంకా అనేకమంది సైనిక అధికార్లు, ప్రభుత్వఅధికార్లు మెంబర్లు గా వ్యవహరిస్తారు.   ఈ నిధి నుండి మాజీ సైనికులకు మరియు వితంతువులకు మరియు వారిపై ఆధారపడిన వారికి ఆర్ధిక సహాయం అందిస్తారు.   

¤ ఇందుకోసం సాయుధ దళాల పతాక దినోత్సవం డిసెంబరు మాసంలో జరుపుకొని సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ప్రజల వద్దనుండి సేకరిస్తాము.  ఇందుకోసంగాను స్టిక్కర్ ఫ్లాగ్ మరియు కార్ ఫ్లాగ్ లను ప్రజలకు అందచేసి వారినుండి విరాళాలను సేకరిస్తుంది మరియు కొన్ని హుండీ డబ్బాలను వివిధ విద్యాలయాలకు, కార్యాలయాలకు పంపి వాటి ద్వారా కూడా విరాళాలు స్వీకరిస్తాము.  

¤ కావున ప్రజలందరూ ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా స్వచ్ఛంద౦గా  పెద్దమొత్తాలలో విరాళాలు సాయుధ దళాల పతాక నిధికి అందచేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
*ఇది మన కర్తవ్యం! జై జవాన్!!*

*🇮🇳నేడు జలాంతర్గాముల దినోత్సవం..*🛥

*🔹 ప్రపంచంలోని మొత్తం అణ్వస్త్రాల్లో దాదాపు సగం.. అణ్వస్త్ర సామర్థ్య జలాంతర్గా ము (S.S.B.N)ల్లోనే ఉన్నాయి.రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన నౌకాదళాల్లో జలాంత ర్గామి సిబ్బంది సంఖ్య 1.6 శాత మే. అయితే 55 శాతం మేర శత్రు యుద్ధనౌకలను జలాంతర్గా ములే నాశనం చేశాయి. వీటి సామర్థ్యానికిఇదిమచ్చుతునక.*

*🔹భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపచేస్తూ.. దేశ తొలి స్వదేశీ నిర్మిత అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ (శత్రు నాశని) నౌకా దళంలో చేరింది. ఈ జలాంత ర్గామి ప్రవేశంతో భారత్‌కు నేల, నింగి, జల మార్గాల గుండా అణ్వస్త్ర దాడి చేయగలిగిన సామర్థ్యం ఒనగూరింది.అణు జలాంతర్గామిని నిర్మించి, నిర్వహించే సామర్థ్యం కలిగిన ఐదు దేశాల సరసన భారత్‌ చేరింది.*

¤ శక్తిమంతమైన ఆయుధం .
జలాంతర్గాములు గోప్యంగా సాగరాల్లో సంచరిస్తూ శత్రువుల గుండెల్లో నిద్రపోతుంటాయి. భారీ యుద్ధనౌకలను కూడా ఇవి ధ్వంసం చేయగలవు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500కుపైగా జలాంతర్గాములు సాగర గర్భాల్లో గస్తీ తిరుగుతున్నాయి. సంప్రదాయ జలాంతర్గాములు డీజిల్‌-ఎలక్ట్రిక్‌ ఇంధనంతో పనిచేస్తాయి. బ్యాటరీలను రీఛార్జి చేసుకోవడానికి ఇవి సముద్ర ఉపరితలంపైకి రావాల్సి ఉంటుంది. అణు ఇంధనంతో నడిచే జలాంతర్గాములు మాత్రం నెలల తరబడి నీటి అడుగునే ఉండగలవు. వీటికి ఒక్కసారి ఇంధనం నింపితే దాదాపు పదేళ్ల వరకూ పనిచేస్తాయి. ఒక్క నిమిషంలోనే నీటి కిందకు వెళ్లిపోగలవు. అందువల్ల అణ్వస్త్రదాడికి ఇవి చాలా అనుకూలమైనవి.

¤ నేల నుంచి ప్రయోగించేందు కు అగ్ని బాలిస్టిక్‌ క్షిపణులు భారత్‌ వద్ద ఉన్నాయి. వాయు మార్గంలో అణు దాడి చేయడా నికి మిరాజ్‌-2000 వంటి యుద్ధవిమానాలు ఉన్నాయి.ప్రస్తుతం భారత్‌ వద్ద రష్యా నుంచి లీజుకు తీసుకున్న ఐఎన్‌ఎస్‌ చక్ర అనే అణు జలాంతర్గామి మాత్రమే ఉంది. ఇందులో అణ్వస్త్రాలను మోహరించలేదు. దీంతో నీటి నుంచి అణు దాడి చేసే సామర్థ్యం మనదేశానికి ఇప్పటివరకూ లేదు. అరిహంత్‌ రాకతో ఆ కొరత తీరింది. అయితే జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్‌ క్షిపణుల (ఎస్‌ఎల్‌బీఎం)ను అరిహంత్‌తో పూర్తిస్థాయిలో అనుసంధానించడానికి ఇంకొంత సమయం పడుతుంది.

*▪రెండు రకాలు..*

*▪ అణు జలాంతర్గాముల్లో రెండు రకాలు న్నాయి. ఒకటి దీర్ఘశ్రేణి అణువార్‌హెడ్లను మోసుకెళ్లగ లిగే *S.S.B.Nలు,*సాధారణ దాడులకుఉపయోగించే *S.S.Nలు* ఉంటాయి. ఎస్‌ఎస్‌ఎన్‌లతో పోలిస్తే ఎస్‌ఎస్‌బీఎన్‌లు గోప్యంగా, పరిమాణంపరంగా పెద్దగా ఉంటాయి. శత్రు దేశం అణుదాడికి దిగితే.. ప్రతిదాడి చేయడానికి ఎస్‌ఎస్‌బీఎన్‌లు అనువైనవి. అరిహంత్‌ కూడా భీకరమైన ఎస్‌ఎస్‌బీఎన్‌ తరగతి జలాంతర్గామే.

*కారణమిదీ..*

¤ 1971 భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా నౌకాదళం బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో భారత విజ్ఞప్తి మేరకు రష్యాకు చెందిన అణు జలాంతర్గాములు వ్లాదివోస్తోక్‌ నౌకా స్థావరం నుంచి వచ్చి.. అమెరికా నౌకాదళాన్ని అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి అద్భుత సామర్థ్యాన్ని పరిశీలించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. దేశీయంగా అణు జలాంతర్గాముల నిర్మాణానికి ఆదేశించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 1974లో దీనికి సంబంధించిన కసరత్తు మొదలైంది.

*భారత నౌకాదళంలోకి ‘అరిహంత్‌’*
*ఇనుమడించిన దేశ రక్షణ సామర్థ్యం*

*🔹విశాఖలో నిర్మాణం..*

¤ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెహికిల్‌ (ఏటీవీ) పేరుతో అణు జలాంతర్గామి నిర్మాణాన్ని భారత్‌ చేపట్టింది. విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రంలో అత్యంత గోప్యంగా, ప్రధాన మంత్రి కార్యాలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు సాగింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పర్యవేక్షణలో ఈ జలాంతర్గామి నిర్మాణం జరిగింది. నౌకాదళంతోపాటు ఎల్‌అండ్‌ టీ, టాటా పవర్‌ వంటి ప్రైవేటు సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకున్నాయి.

●1974లో ప్రాజెక్టు ప్రారంభం. 
●1984లో డిజైన్‌కు ఆమోదం. 
●1998లో అరిహంత్‌ నిర్మాణం ప్రారంభం. 
●2009లో జలప్రవేశం. 
●2013లో ఈ జలాంతర్గామిలోని అణు రియాక్టర్‌ పనిచేయడం ప్రారంభించింది. 
●2014 డిసెంబర్‌లో అరిహంత్‌ సముద్ర పరీక్షలకు బయలుదేరింది. 
●2016లో నౌకాదళంలో చేరిక.*
●పది మీటర్ల వెడల్పు కలిగిన ఈ జలాంతర్గామిలో పట్టేలా అణు రియాక్టర్‌ను రూపొందించారు. రష్యా సహకారంతో బాబా అణుపరిశోధన సంస్థ దీన్ని తయారుచేసింది. 
●అణుజలాంతర్గాముల కోసం విశాఖపట్నాని కి చేరువలోని రాంబిల్లిలో ‘ఐఎన్‌ఎస్‌ వర్ష’ పేరుతో కొత్త స్థావరాన్ని నౌకాదళం నిర్మిస్తోంది. గోప్యత కోసం ఇందులో నేలమాళిగ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. 

*♦ జలాంతర్గాములతో రహస్యంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి నౌకాదళం.. తమిళనాడులోని ఐఎన్‌ఎస్‌ కట్టబొమ్మన్‌ స్థావరంలో కొత్తగా వెరీ లో ఫ్రీక్వెన్సీ ప్రసార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.*
పరీక్షలన్నీ విజయవంతం..
సముద్ర పరీక్షల్లో భాగంగా అరిహంత్‌ నుంచి ఏడుసార్లు ‘కె’ శ్రేణి క్షిపణులను ప్రయోగించారు. డైవింగ్‌ పరీక్షలు సాఫీగా సాగాయి. పరీక్షల్లో రష్యాకు చెందిన ఎప్రాన్‌ అనే జలాంతర్గామి సహాయక నౌక దీనికి తోడుగా వచ్చింది.*

*మరో మూడు..*

*🌷అరిహంత్‌తోపాటు మరో మూడు జలాంతర్గాములను నిర్మించడానికి భారత్‌ కసరత్తు చేస్తోంది. రెండో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిధమన్‌ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. 2018లో ఇది నౌకాదళానికి అందుతుందని అంచనా.*

*🔹అరిహంత్‌ వివరాలివీ..*

*బరువు: 6వేల టన్నులు*

*శక్తి: 83 మెగావాట్ల ప్రెజరైజ్డ్‌ వాటర్‌ రియాక్టర్‌*
*నీటిలోపల వేగం: 24 నాట్లు*
*వ్యయం: 290 కోట్ల డాలర్లు (ఈ ప్రాజెక్టు కింద కొన్ని నిర్మాణ కేంద్రాల ఏర్పాటు వ్యయం కూడా ఇందులో ఉంది.)*

*🔥ఆయుధ సామర్థ్యం:*

*▪నాలుగు కె-4 జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్‌ క్షిపణులు (పరిధి: 3500 కిలోమీటర్లు) లేదా పన్నెండు కె-5 క్షిపణులు (పరిధి: 700 కిలోమీటర్లు)*

*▪అరిహంత్‌లోని క్షిపణి ప్రయోగ గొట్టాలను.. నిర్భయ్‌, బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణులను కూడా మోసుకెళ్లేలా రూపొందించారు.*

*▪ పలురకాల టోర్పిడోలు, నౌకా విధ్వంసక క్షిపణులను కూడా మోసుకెళుతుంది.