AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday, 2 January 2018

జాతీయం National భారతదేశ అణు పరీక్షలు.. అణు విద్యుత్

భారతదేశ అణు పరీక్షలు.. అణు విద్యుత్

ప్రతి పోటీ పరీక్షల్లోనూ భారతదేశ అణు పరీక్షలు, మన దేశంలో ఉన్న వివిధ అణు విద్యుత్ కేంద్రాలు, వాటిని ఏ దేశాల సహాయంతో నిర్మించారు? వాటి సామర్థ్యం ఎంత? సంబంధిత కేంద్రాలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు చేశారు? వంటి వాటిపై ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాకుండా అణు విద్యుత్‌కు ప్రాధాన్యం పెరగడంతోపాటు ఇటీవల కాలంలో వివాదాస్పదం అవుతోంది. భారతదేశ అణు పరీక్షలు, అణు విద్యుత్ సంబంధిత అంశాలు ఈ వారం జీకే...

భారతదేశంలో అణుశక్తి విభాగాన్ని 1954లో ఆగస్టు 3న ముంబై ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. భార త అణుశక్తి సంఘాన్ని 1948లో నెలకొల్పారు. ప్రస్తుత చైర్మన్ రతన్‌కుమార్ సిన్హా. ఈ సంఘం అణుశక్తి విభాగం కింద విధులు నిర్వహిస్తోంది. అణుశక్తి నియంత్రణ బోర్డు (అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్)ను ముంబైలో 1983లో ప్రారంభించారు. ఈ బోర్డు ప్రధాన ఉద్దేశం భారతదేశంలో అణుశక్తి వల్ల మానవులకు, పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడటం. అణు పరిశోధనల కోసం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)ను 1954లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం కూడా ముంబైలోని ట్రాంబేలో ఉంది. ప్రస్తుత బార్క్ డెరైక్టర్ శేఖర్ బసు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం బార్క్ ముఖ్య ఉద్దేశం. భారత అణు కార్యక్రమ పితామహుడైన హోమీ జహంగీర్ బాబా పేరిట బార్క్‌ను నెలకొల్పారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)ను కూడా ఆయనే స్థాపించారు.

భారతదేశంలో థర్మల్, జల విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన వనరుల తర్వాత అణుశక్తిని నాలుగో అతిపెద్ద విద్యుత్ శక్తి వనరుగా పరిగణిస్తారు.

మహారాష్ర్టలోని రత్నగిరి జిల్లాలో జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును ఫ్రాన్‌‌సలోని ఎరీవా కంపెనీ సహాయంతో నిర్మించాలని తలపెట్టారు. దీని సామర్థ్యం 9,900 మెగావాట్లు. అయితే ఇది 2021లో ప్రారంభం అవుతుంది అని ఎరీవా కంపెనీ చెబుతోంది. జైతాపూర్‌లో మొత్తం ఆరు యూనిట్లు ఉంటాయి.

భారత్, అమెరికా దేశాలు పౌర అణు ఒప్పందంపై 2008లో సంతకాలు చేశాయి. దీంతో భారతదేశానికి విదేశాలు 1974 తర్వాత తిరిగి యురేనియాన్ని సరఫరా చేయడానికి మార్గం సుగమం అయింది. ఎన్‌పీటీపై సంతకం చేయకున్నా భారతదేశానికి ఎన్‌ఎస్‌జీ దేశాలు యురేనియం, అణు సాంకేతిక సరఫరాను తిరిగి ప్రారంభించాయి. అమెరికా తర్వాత మనదేశం వివిధ దేశాలతో పౌర అణు ఒప్పందాలను కుదుర్చుకుంది. అవి.. రష్యా, ఫ్రాన్‌‌స, కజకిస్థాన్, మంగోలియా, నమీబియా, అర్జెంటీనా దేశాలు. ఇవి కాకుండా 2010లో కెనడాతో అణు ఒప్పందంపై సంతకం చేసింది. యురేనియాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో కెనడా కూడా ఒకటి. 2010లోనే బ్రిటన్‌తో కూడా పౌర అణు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఇటీవల దక్షిణ కొరియాతో అణు ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక యురేనియం నిక్షేపాలు (31 శాతం) ఆస్ట్రేలియాలో ఉన్నాయి.

భారత్‌లో యురేనియం:
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యురేనియం గనుల తవ్వకాలు జరుగుతాయి. ఈ సంస్థ జార్ఖండ్‌లోని సింగ్భమ్‌లో ఉంది. యురేనియం కార్పొరేషన్‌ను 1967లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అణుశక్తి విభాగం కింద పనిచేస్తోంది. యురేనియం నిక్షేపాలు జార్ఖండ్‌లోని జాద్రగడ, భాతిన్, భాగ్‌జాతా, నర్వాపహార్, తురామ్‌దీ, బందూరంగ్ ప్రాంతాలలో ఉన్నాయి. ఇటీవల యురేనియం నిక్షేపాలను ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా తుమ్మలపల్లెలో కనుగొన్నారు. ఇక్కడ 49,000 టన్నుల యురేనియం ఉండొచ్చని అంచనా. అణుశక్తి సంఘం మాజీ చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ తుమ్మలపల్లెలో 1,50,000 టన్నుల వరకు కూడా యురేనియం నిక్షేపాలు ఉండొచ్చని చెప్పారు.

అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ: 
అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ 1957లో వియన్నా (ఆస్ట్రియా రాజధాని)లో ఏర్పడింది. ప్రస్తుత డెరైక్టర్ జనరల్ జపాన్‌కు చెందిన యుకియా అయానో. ఆయన 2009 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఈ సంస్థకు, మాజీ డెరైక్టర్ జనరల్ మహ్మద్ ఎల్‌బరాదీకి సంయుక్తంగా 2005 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఎల్‌బరాదీ ఈజిప్ట్‌కు చెందిన వ్యక్తి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థలో 159 సభ్యదేశాలున్నాయి. భారతదేశం కూడా ఒక సభ్యదేశమే.

భారత అణు పరీక్షలు

పోఖ్రాన్-1: 
భారతదేశం తన తొలి అణు పరీక్షను 1974లో మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించింది. దీన్నే ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తారు. బార్‌‌క డెరైక్టర్ రాజారామన్న ఈ అణుబాంబు ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ఈ బాంబు తయారు చేసిన వ్యక్తి పి.కె. అయ్యంగార్. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. భారతదేశం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేయని అతికొద్ది దేశాలలో ఒకటి. పోఖ్రాన్-1 అణు పరీక్ష ఫలితంగా న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ) 1974లో ఏర్పడింది. ఈ దేశాలు భారత్‌కు అణు సరఫరాను నిలిపివేశాయి.

పోఖ్రాన్-2: 
మే, 1998లో భారతదేశం రెండో అణు పరీక్షలను పోఖ్రాన్‌లో నిర్వహించింది. వీటినే పోఖ్రాన్-2 అంటారు. 1998లో మే 11న మూడు, మే 13న రెండు మొత్తం ఐదు అణు పరీక్షలను పరీక్షించారు. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. ఈ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌లుగా ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించిన ఎపిజె అబ్దుల్ కలామ్, అణుశక్తి సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్.చిదంబరం వ్యవహరించారు. పోఖ్రాన్-2కు మరోపేరు ఆపరేషన్ శక్తి. మే 11న జాతీయ సాంకేతిక దినంగా జరుపుకొంటారు.

భారతదేశంలో అణు రియాక్టర్లు..
మన దేశంలో మొత్తం 21 అణు రియాక్టర్లు ఉన్నాయి.
తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం: ఇది మహారాష్ట్రలో ఉంది. మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయి. మొదటి యూనిట్‌ను 1969, అక్టోబర్ 28న ప్రారంభించారు. దేశంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇదే. మొత్తం 1400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.
రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం: రాజస్థాన్‌లో రావత్‌భట్‌లో ఉంది. ఆరు యూనిట్లు ఉన్నాయి. 1180 మెగావాట్ల సామర్థ్యం ఉంది.
మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం: ఇది తమిళనాడులోని కల్పక్కంలో ఉంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి పవర్ స్టేషన్. రెండు యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్ సామర్థ్యం 220 మెగావాట్లు.
కైగా జనరేటింగ్ స్టేషన్: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 220 మెగావాట్లు.
నరోరా అణు విద్యుత్ కేంద్రం: ఇది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఉంది. 220 మెగావాట్ల సామర్థ్యం చొప్పున రెండు యూనిట్లు ఉన్నాయి.
కాక్రపార్ అణు విద్యుత్ కేంద్రం: ఇది గుజరాత్‌లోని సూరత్ సమీపంలోఉంది. రెండు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 220 మెగావాట్లు.
కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉంది. ఇది మన దేశంలో 21వ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. దీనిలో ఒక యూనిట్ ఉంది. సామర్థ్యం 1000 మెగావాట్లు. 2002లో మార్చి 31న ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 22న విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిని రష్యా సహాయంతో నిర్మించారు. యూనిట్‌లో తయారయ్యే 1000 మెగావాట్ల విద్యుత్‌లో తమిళనాడుకు 562.5 మెగావాట్లు, కర్ణాటకకు 221 మెగావాట్లు, కేరళకు 133 మెగావాట్లు, పుదుచ్చేరికి 33.5 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయిస్తారు. ఎవరికీ కేటాయించకుండా 50 మెగావాట్ల విద్యుత్‌ను ఉంచుతారు. కూడంకుళంలో రెండో న్యూక్లియర్ రియాక్టర్ నిర్మాణంలో ఉంది. దీనిని వచ్చే ఏడాది (2014)లో ప్రారంభించనున్నారు. దీని సామర్థ్యం 1000 మెగావాట్లు. ఇవేకాకుండా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కాక్రపార్ అణు విద్యుత్ కేంద్రంలో మరో రెండు రియాక్టర్లు నిర్మిస్తోంది. వీటితోపాటు రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రంలో మరో రెండు యూనిట్లను ప్రారంభించనుంది.
సంబంధిత సంస్థలు..
IGCAR ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ - కల్పక్కం
RRCAT రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ - ఇండోర్
ECIL ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - హైదరాబాద్
IREL ఇండియన్ రేర్ ఎర్‌‌త్స లిమిటెడ్ - ముంబై
UCIL యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - సింగ్భమ్
NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - ముంబై
HWB హెవీ వాటర్ బోర్డ్ - ముంబై
NFC న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్ - హైదరాబాద్
TIFR టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ - ముంబై
SINP సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ - కోల్‌కతా
IPR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ - గాంధీనగర్
ఏపీపీఎస్సీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
అణు రియాక్టర్‌లో ఇంధనంగా వాడేది?
40 ఏళ్ల తర్వాత ఇటీవల ఏ దేశం భారత్‌తో అణు వ్యాపారం కొనసాగించాలి అని నిర్ణయించుకుంది?
కల్పక్కం ఎక్కడ ఉంది?
తారాపూర్ ఉన్న రాష్ర్టం ఏది?
కూడంకుళం అటామిక్ పవర్ ప్రాజెక్టును తమిళనాడులో ఏ దేశ సహాయంతో ఏర్పాటు చేశారు?
అణుశక్తి క మిషన్ అధ్యక్షుడు?
ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రం ఉన్న చోటు?
అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఇండియాలో ఏర్పాటైన తొలి అణు యంత్రాగారం?
భారత అణుశక్తి పితామహుడు?
సమాధానాలు: 1. యురేనియం; 2. కెనడా; 3. తమిళనాడు; 4. మహారాష్ర్ట; 5. రష్యా; 6. రతన్ 
కుమార్ సిన్హా; 7. కల్పక్కం; 8. వియన్నా; 9. తారాపూర్; 10. హెచ్.జె.బాబా 


జాతీయం National భారతదేశ రక్షణ వ్యవస్థ

భారతదేశ రక్షణ వ్యవస్థ

భారత రక్షణ దళాల అధిపతి రాష్ర్టపతి. భారత రక్షణ దళాలు కేంద్ర రక్షణ శాఖా మంత్రి అధీనంలో ఉంటాయి. ప్రస్తుత రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ. మనదేశ రక్షణ వ్యవస్థలో దాదాపు 47 లక్షల మంది పనిచేస్తున్నారు. డిసెంబర్ 7వ తేదీని రక్షణ దళాల ఫ్లాగ్‌డేగా నిర్వహిస్తారు. రక్షణ దళాల ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

త్రివిధ దళాల అధిపతులు
సైనిక దళాల అధిపతి - జనరల్ బిక్రమ్‌సింగ్
నౌకాదళ అధిపతి - అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి
వాయుసేనాధిపతి - ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహ

స్వాతంత్య్రం తర్వాత భారతదేశం పాకిస్థాన్‌తో నాలుగు యుద్ధాలు చేసింది. అవి.. 1947, 1965, 1971, 1999. భారతదేశం 1971లో పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. 1962లో చైనాతో యుద్ధం చేసింది.

భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర. దీని తర్వాత మహావీర చక్ర, వీరచక్ర వరుసగా అత్యున్నత సైనిక పురస్కారాలు. దేశ రక్షణ కోసం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఈ శౌర్య పతకాలను బహూకరిస్తారు. యుద్ధంలేని సందర్భంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అశోక్ చక్ర, కీర్తిచక్ర, శౌర్యచక్రలను ఇస్తారు.

భారత క్షిపణి వ్యవస్థ:
భారత రక్షణ దళాలు ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసే భూమికను డిఫెన్‌‌స రీసెర్‌‌చ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పోషిస్తుంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అవినాశ్ చందర్ ప్రస్తుత డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్. అంతేకాకుండా రక్షణ శాఖా మంత్రికి శాస్త్రీయ సలహాదారు. అవినాశ్‌కు 2013లో పద్మశ్రీ లభించింది.
ఈ సంస్థ మాజీ డెరైక్టర్ జనరల్ విజయ్‌కుమార్ సారస్వత్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత.
సాగరిక: దీన్నే కె-15 క్షిపణి అంటారు. దీన్ని జలాంతర్గామి నుంచి ప్రయోగిస్తారు. పరిధి 700 కి.మీ.
బ్రహ్మోస్: ఇది సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ధ్వనికంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, భూమిపై కదిలే వాహనాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీన్ని భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి. భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కోవా నది పేర్ల మీద బ్రహ్మోస్ పేరును పెట్టారు. ఈ క్షిపణి పరిధి 290 కి.మీ. ఇది 2.5 నుంచి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది.
నిర్భయ్: ఇది సబ్‌సోనిక్ క్షిపణి. ధ్వని వేగం (1 మ్యాక్) కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. పరిధి 1,000 కి.మీ. అమెరికాలో టోమహాక్, పాకిస్థాన్‌లో బాబర్ క్షిపణులు కూడా సబ్‌సోనిక్ క్షిపణులే.

మెయిన్ బ్యాటిల్ ట్యాంక్‌లు:
అర్జున్: ఇది మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. దీన్ని డీఆర్‌డీవో తయారు చేసింది. దీన్ని కంచన్ అనే లోహ కవచంతో తయారు చేశారు.
టీ-90: రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. టీ-72 ట్యాంకును ఆధునీకరించి టీ-90ను తయారు చేశారు. వీటినే భీష్మ అంటారు. 
టీ-72 అజేయ:
దీన్ని కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు.
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన మల్టిపుల్ రాకెట్ లాంచర్ పేరు పినాకా. దీన్ని కార్గిల్ యుద్ధంలో విస్తృతంగా వాడారు.
నావికాదళం: భారత నావికాదళంలోని కమాండ్లు
పశ్చిమ కమాండ్ - ముంబై
తూర్పు కమాండ్- విశాఖపట్నం
దక్షిణ కమాండ్ - కొచ్చి

అణు జలాంతర్గాములు
1. ఐఎన్‌ఎస్ చక్ర
- దీన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు.
2. ఐఎన్‌ఎస్ అరిహంత్ - స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి అణు జలాంతర్గామి.

వైమానిక దళం 
తేజస్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం పేరు తేజస్. ఇది ఎల్‌సీఎ (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)
లక్ష్య: పైలట్ రహిత టార్గెట్ ఎయిర్‌క్రాఫ్ట్. దీన్ని హెచ్‌ఏఎల్ తయారు చేసింది.
నిశాంత్: ఇది మానవరహిత విమానం అన్‌మ్యాన్‌‌డ ఏరియల్ వెహికిల్ (యూఏవీ). 
ద్రువ్: హెచ్‌ఏఎల్ తయారుచేసిన హెలికాప్టర్. 
రుద్ర: ధ్రువ్ హెలికాఫ్టర్‌ను ఆధునీకరించి రుద్ర అనే అటాక్ హెలికాప్టర్‌ను తయారు చేశారు.

ఇతర రక్షక దళాలు 
అస్సాం రైఫిల్స్:1835లో ప్రారంభమైన అత్యంత ప్రాచీన పారామిలిటరీ దళం. ప్రధాన కార్యాలయం షిల్లాంగ్‌లో ఉంది.
స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్‌‌స (ఎస్‌ఎఫ్‌ఎఫ్):1962లో ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని చక్రతాలో ప్రధాన కార్యాలయం ఉంది.
ఇండియన్ కోస్ట్‌గార్‌‌డ:1978లో ఏర్పాటైంది. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పని చేస్తుంది. భారత తీరరేఖని సంరక్షిస్తుంది. 
సెంట్రల్ రిజర్‌‌వ పోలీస్ ఫోర్‌‌స (సీఆర్‌పీఎఫ్):1939లో ఏర్పాటైంది. ప్రస్తుత డెరైక్టర్ జనరల్ దిలీప్ త్రివేది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్‌‌స (బీఎస్‌ఎఫ్):1965లో ఏర్పాటైంది.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ):1962లో ఏర్పాటు చేశారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్‌‌స (సీఐఎస్‌ఎఫ్): 1969లో ఏర్పాటైంది.
రాష్ట్రీయ రైఫిల్స్: తీవ్రవాద నిరోధక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. 1990లో ఏర్పాటైంది.
నేషనల్ సెక్యూరిటీ గార్‌‌డ్స (ఎన్‌ఎస్‌జీ): 1984లో ఏర్పాటైంది.

ప్రధాన సైనిక శిక్షణా కేంద్రాలు
1. నేషనల్ డిఫెన్‌‌స అకాడమీ- ఖడక్ వాస్లా (పుణె)
2. ఇండియన్ మిలిటరీ అకాడమీ- డెహ్రాడూన్
3. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్- డెహ్రాడూన్
4. ఆర్మీవార్ కాలేజ్ (కాలేజ్ ఆఫ్ కంబాట్)- మౌ (మధ్యప్రదేశ్)
5. ఇన్‌ఫాంట్రీ స్కూల్- మౌ
6. ఆఫీసర్‌‌స ట్రైనింగ్ అకాడమీ- చెన్నై
7. హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్- గుల్‌మార్‌‌గ
8. ఆర్మర్‌‌డ కార్‌‌ప్స సెంటర్ అండ్ స్కూల్-అహ్మద్‌నగర్
9. స్కూల్ ఆఫ్ ఆర్టిల్లరీ- దేవ్‌లాలీ (మహారాష్ర్ట)
10. కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్- ఖడ్కీ (మహారాష్ర్ట)
11. మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - మౌ
12. కౌంటర్ ఇన్‌సర్జన్సీ అండ్ జంగిల్ వార్‌ఫేర్ స్కూల్ - వెరైంగ్టే (మిజోరాం)
13. ఆర్మీ మెడికల్ కార్‌‌ప్స సెంటర్ అండ్ స్కూల్-లక్నో
14. కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్- జబల్‌పూర్
15. మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్- సికింద్రాబాద్
16. రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్‌‌ప్స సెంటర్ అండ్ స్కూల్- మీరట్
17. ఆర్మీ ఎడ్యుకేషన్ కార్‌‌ప్స ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్- పచ్‌మడి (మధ్యప్రదేశ్)
18. కార్‌‌ప్స ఆఫ్ మిలిటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్- బెంగళూర్
19. ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్- పుణె
20. ఆర్మీ ఎయిర్‌బార్‌‌న ట్రైనింగ్ స్కూల్- ఆగ్రా
21. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్- పుణె
22. ఆర్మీ కేడెట్ కాలేజ్- డెహ్రాడూన్
23. ఆర్మీ క్లర్‌‌క్స ట్రైనింగ్ స్కూల్- ఔరంగాబాద్
24. ఆర్మీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్‌‌సపోర్‌‌ట- బెంగళూర్
25. ఆర్మీ, ఎయిర్ ట్రాన్‌‌సపోర్‌‌ట స్కూల్- ఆగ్రా
26. మిలిటరీ ఇంటెలిజెన్‌‌స ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపో - పుణె
27. ఆర్‌‌మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్- పుణె
వైమానిక దళ సంస్థలు
1. ఎయిర్‌ఫోర్‌‌స అకాడమీ- దుండిగల్ (హైదరాబాద్)
2. ఎయిర్‌ఫోర్‌‌స అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్- కోయంబత్తూర్
3. పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్- అలహాబాద్
4. స్కూల్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్- బెంగళూర్
5. ఎయిర్‌ఫోర్‌‌స టెక్నికల్ ట్రైనింగ్ కాలేజ్- జలహళ్లి (బెంగళూరు)
6. పారాట్రూపర్‌‌స ట్రైనింగ్ స్కూల్- ఆగ్రా
7. ఇండియన్ ఎయిర్‌ఫోర్‌‌స టెస్ట్ పైలట్ స్కూల్- బెంగళూరు

ఇవే కాకుండా నేషనల్ డిఫెన్‌‌స కాలేజ్ న్యూఢిల్లీలో, కాలేజ్ ఆఫ్ డిఫెన్‌‌స మేనేజ్‌మెంట్ సికింద్రాబాద్‌లో, డిఫెన్‌‌స సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగటన్‌లో ఉన్నాయి.

నౌకాదళ సంస్థలు
1. ఇండియన్ నావల్ అకాడమీ- ఎజిమల (కేరళ)
2. ఐఎన్‌ఎస్ అగ్రాని- కోయంబత్తూర్
3. ఐఎన్‌ఎస్ చిల్కా- ఒడిశా
4. ఐఎన్‌ఎస్ ద్రోణాచార్య- కొచ్చి
5. ఐఎన్‌ఎస్ గరుడ- కొచ్చి
6. ఐఎన్‌ఎస్ హమ్లా- ముంబై
7. ఐఎన్‌ఎస్ కుంజలి- ముంబై
8. ఐఎన్‌ఎస్ మండోవీ- గోవా
9. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ- గోవా
10. ఐఎన్‌ఎస్ శివాజీ- లోనావాలా
11. షిప్‌రైట్ స్కూల్- విశాఖపట్నం
12. ఐఎన్‌ఎస్ వల్సురా- జాంనగర్
13. ఐఎన్‌ఎస్ వెందుర్తి- కొచ్చి
14. ఐఎన్‌ఎస్ శాతవాహన- విశాఖపట్నం

ఏపీపీఎస్సీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు
1. అగ్ని-5 లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఒడిశాలోని ఏ ప్రదేశం నుంచి పరీక్షించారు?
2. 2012లో ఏప్రిల్ 23న పాకిస్థాన్ విజయవంతంగా ప్రయోగించిన క్షిపణి పేరు?
3. ఇండియా ఏ దేశంతో కలసి ‘ఇంద్ర’ నౌకా విన్యాసం నిర్వహించింది?
4. 2012లో మే 31న 25వ భారత సేనాధిపతిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
5. భారత నౌకా దళాధిపతి ఎవరు?
6. 2012 ఏప్రిల్‌లో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టిన, న్యూ క్లియర్ శక్తితో దాడిచేయగల జలాంతర్గామి పేరేమిటి?
7. అణుశక్తి సామర్థ్యం ఉన్న అగ్ని-5ని విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రయోగించిన రోజు?
8. బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం ఏ దేశంతో కలసి తయారు చేసింది?

సమాధానాలు: 1) వీలర్ ద్వీపం; 2) షాహీన్-1; 3) రష్యా; 4) బిక్రమ్‌సింగ్; 5) డి.కె. జోషి; 6) ఐఎన్‌ఎస్ చక్ర; 7) ఏప్రిల్ 19, 2012; 8) రష్యా 
క్షిపణిప్రయోగించే విధానంపరిధి (కిలోమీటర్లు)
పృథ్వీ-1ఉపరితలం నుంచి ఉపరితలానికి150 కి.మీ.
పృథ్వీ-2ఉపరితలం నుంచి ఉపరితలానికి250-350 కి.మీ.
పృథ్వీ-3ఉపరితలం నుంచి ఉపరితలానికి350-600 కి.మీ.
ఆకాశ్ఉపరితలం నుంచి గగనతలం30 కి.మీ.
త్రిశూల్ఉపరితలం నుంచి గగనతలం9 కి.మీ.
నాగ్యాంటీ ట్యాంక్ క్షిపణి4-5 కి.మీ.
ధనుష్ఉపరితలం నుంచి ఉపరితలానికి350 కి.మీ.
అగ్ని-1ఉపరితలం నుంచి ఉపరితలానికి700 కి.మీ.
అగ్ని-2ఉపరితలం నుంచి ఉపరితలానికి2,000-3,000 కి.మీ.
అగ్ని-3ఉపరితలం నుంచి ఉపరితలానికి3500 కి.మీ.
అగ్ని-4ఉపరితలం నుంచి ఉపరితలానికి4000 కి.మీ.
అగ్ని-5ఉపరితలం నుంచి ఉపరితలానికి అగ్ని- 5 భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి 2012లో ఏప్రిల్ 19న తొలిసారి ఒడిశాలోని వీలర్ ఐల్యాండ్ నుంచి ప్రయోగించారు. మరోసారి ఈ ఏడాది సెప్టెంబర్ 15న రెండోసారి ప్రయోగించారు5000-6000 కి.మీ.
అస్త్రగగనతలం నుంచి గగనతలానికి80-110 కి.మీ.
శౌర్యఉపరితలం నుంచి ఉపరితలానికి750-1900 కి.మీ.
ప్రహార్ఉపరితలం నుంచి ఉపరితలానికి150 కి.మీ.


జాతీయం National భారతదేశ అంతరిక్ష విజయాలు...

భారతదేశ అంతరిక్ష విజయాలు...

ప్రతి పోటీ పరీక్షలోనూ జనరల్ అవేర్‌నెస్‌లో కీలకమైన విభాగం శాస్త్ర, సాంకేతిక అంశాలు (సైన్స్ అండ్ టెక్నాలజీ). ఈ విభాగంలో ముఖ్యంగా మనదేశం ప్రయోగించిన వివిధ ఉపగ్రహాలు, ఏ సంవత్సరంలో, ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆ ఉపగ్రహాల వల్ల ఉపయోగాలు వంటి అంశాలను అధ్యయనం చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రయోగించిన వివిధ ఉపగ్రహాల వివరాలు..

ముందుగా ప్రపంచ అంతరిక్ష రంగాన్ని పరిశీలిస్తే.. అమెరికా, సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) దేశాలు మొదట్లో అంతరిక్ష రంగంలో తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను 1957లో అప్పటి సోవియట్ యూనియన్ (యూఎస్‌ఎస్‌ఆర్) ప్రయోగించింది. అదే ఏడాది స్పుత్నిక్-2ను, అందులో లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపారు. తద్వారా రోదసీలో ప్రయాణించిన తొలి జంతువుగా లైకా పేరుగాంచింది. 1958లో అమెరికా తన తొలి ఉపగ్రహం ఎక్స్‌ప్లోరర్-1ను ప్రయోగించింది.

రష్యాకు చెందిన వ్యోమగామి యూరీ గగారిన్ 1961, ఏప్రిల్ 12న వొస్తోక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించాడు. మే,

1961లో అలెన్ షెపర్‌‌డకు మొదటి అమెరికా అంతరిక్ష యాత్రికుడిగా గుర్తింపు దక్కింది. అంతరిక్షయానం చేసిన మొదటి మహిళ రష్యాకు చెందిన వాలెంతినా తెరిష్కోవా. ఆమె 1963, జూన్ 16న అంతరిక్షంలోకి ప్రవేశించింది. రష్యాకు చెందిన అలెక్సీ లెనోవ్ అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు. ఆయన 1965, మార్చి18న ఈ ఘనత సాధించాడు. 1969, జూలై 20న అమెరికాకు చెందిన నీల్ ఆర్‌‌మస్ట్రాంగ్ చంద్రుడిపై అడుగిడిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఆయనతోపాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ కూడా అపోలో-11 నౌకలో ప్రయాణించారు.

1984లో అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. నవంబర్, 1997లో కొలంబియా నౌకలో ప్రయాణించిన కల్పనా చావ్లా మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు. ఆమె 2003, ఫిబ్రవరి 1న కొలంబియా నౌక కూలిపోవడంతో మరణించారు. భారతీయ అమెరికన్ మహిళ సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో ఎక్కువసేపు నడిచిన (స్పేస్‌వాక్) మహిళ కూడా ఈమే. సునీత 50 గంటల 40 నిమిషాలపాటు అంతరిక్షంలో నడవటంతోపాటు మొత్తం ఏడుసార్లు స్పేస్‌వాక్ చేసింది.

ఇస్రో:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్‌‌చ ఆర్గనైజేషన్-ఇస్రో)ను 1969లో ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో భారత ప్రభుత్వంలోని అంతరిక్ష విభాగం నియంత్రణలో పనిచేస్తోంది. ఇస్రో ప్రస్తుత చైర్మన్ కె.రాధాకృష్ణన్. అంతరిక్ష పరిశోధనల కోసం ఏర్పాటైన ఇస్రో 1975, ఏప్రిల్ 19న భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించింది.

భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఆయన అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్‌‌చ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను ఆయన పేరు మీదనే నెలకొల్పారు. ఆయన ఇస్రో మొదటి చైర్మన్. ఇప్పటివరకు ఏడుగురు ఇస్రో చైర్మన్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు. వారు.. విక్రమ్ సారాభాయ్, ఎం.జి.కె.మీనన్, సతీశ్ ధావన్, యు.ఆర్.రావు, కె.కస్తూరిరంగన్, జి.మాధవన్ నాయర్, కె.రాధాకృష్ణన్. వీరిలో సతీశ్ ధావన్ అత్యధిక కాలం ఇస్రో చైర్మన్‌గా పనిచేశారు. ఆయన 1972 నుంచి 1984 వరకు 12 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. 2002లో సతీశ్ ధావన్ మరణానంతరం శ్రీహరికోటలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు.

పరిశోధనా సంస్థలు - వాటి విధులు
ఇస్రో - బెంగళూరు
ఫిజికల్ రీసెర్‌‌చ లేబొరేటరీ - అహ్మదాబాద్: ఖగోళ భౌతిక శాస్త్రం, సౌరకుటుంబ భౌతిక శాస్త్రం, ప్లాస్మా భౌతిక శాస్త్రం, పురావస్తు శాస్త్రాల అధ్యయనం.
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట, నెల్లూరు జిల్లా: రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించే కేంద్రం.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం: ఉపగ్రహ వాహక నౌకల తయారీ కేంద్రం.
తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తిరువనంతపురం: రాకెట్‌లను ప్రయోగించే ప్రదేశం.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - హైదరాబాద్: దీనిని గతంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని పిలిచేవారు.
మాస్టర్ కంట్రోల్ కేంద్రం - భోపాల్ (మధ్యప్రదేశ్), హసన్ (కర్ణాటక).
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ - తిరువనంతపురం: ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కోర్సులను నిర్వహిస్తోంది.
ఆంట్రిక్స్ కార్పొరేషన్-బెంగళూరు: ఇది ఇస్రో వాణిజ్య విభాగం. దీన్ని ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానం, సేవలను మార్కెట్ చేయడానికి ఏర్పాటు చేశారు.
ఏపీపీఎస్సీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు
ఏ సంవత్సరంలో ఇండియా తన మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది?
కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం?
మానవ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపిన మొదటి దేశం?
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, భారత రాకెట్ లాంచింగ్ కేంద్రం ఉన్న రాష్ర్టం?
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది?
చంద్రుడిపై మానవుడు ఎప్పుడు కాలుమోపాడు?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ ఏ రాష్ర్టంలో ఉంది?
ఇస్రో ప్రస్తుత చైర్మన్?
సమాధానాలు: 
1. 1975; 2. యూఎస్‌ఎస్‌ఆర్; 3. యూఎస్‌ఏ; 4. కేరళ; 5. శ్రీహరికోట; 6. 1969; 7. కేరళ; 8. కె.రాధాకృష్ణన్
భారత అంతరిక్ష రంగంలో మైలురాళ్లు
1962 - భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా కమిటీ ఏర్పాటు.
1965 - తుంబాలో స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు.
1969 - ఆగస్ట్ 15న ఇస్రో ఏర్పాటైంది. అప్పుడు అణుశక్తి విభాగం కింద ఉండేది.
1971 - ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో షార్ కేంద్రం ఏర్పాటైంది.
1972 - డిపార్‌‌టమెంట్ ఆఫ్ స్పేస్‌ను ఏర్పాటు చేసి ఇస్రోను అంతరిక్ష విభాగం కిందకు తీసుకువచ్చారు. అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్‌‌స సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
1975 - భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ఏప్రిల్ 19న రష్యాలోని బైకనూరు నుంచి ప్రయోగించారు.
1979 - భాస్కర -1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
1980 - శ్రీహరికోట నుంచి శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎల్‌వీ-3) ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
1981 - జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్‌ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించారు. అఞఞ్ఛ అంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్‌పెరిమెంట్.
1981 - భాస్కర -2 ప్రయోగం.
1982 - అమెరికా రాకెట్ ద్వారా ఇన్‌శాట్-1ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం.
1983 - ఇన్‌శాట్ -1 బీ ప్రయోగం.
1984 - రష్యా రాకెట్ సోయూజ్ టీ-11లో రాకేష్‌శర్మ అంతరిక్షయానం.
1987 - విఫలమైన మొదటి ఎస్‌ఎల్‌వీ ప్రయోగం (ఆగ్‌మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్).
1988 - రష్యా రాకెట్ ద్వారా తొలి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఐఆర్‌ఎస్-1ఏ ప్రయోగం.
1991 - ఐఆర్‌ఎస్-1బీ ప్రయోగం.
1992 - ఇన్‌శాట్ -2ఏ ప్రయోగం.
1993 - పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ద్వారా ఐఆర్‌ఎస్-1ఈ ప్రయోగం. ఇది విఫలమైంది.
1994 - పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఐఆర్‌ఎస్-పీ2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
1995 - ఇన్‌శాట్ -2సీ, ఐఆర్‌ఎస్-1సీ ప్రయోగం.
1996 - పీఎస్‌ఎల్‌వీ -డీ3ని ఉపయోగించి ఐఆర్‌ఎస్-పీ3ను కక్ష్యలో ప్రవేశపెట్టారు.
1997 - ఐఆర్‌ఎస్-1డీ ప్రయోగం.
1999 - ఓషన్ శాట్‌తోపాటు విదేశీ శాటిలైట్లను కూడా తొలిసారి ప్రయోగించారు. కొరియా, జర్మనీలకు చెందిన శాటిలైట్లను ప్రయోగించారు.
2000 - ఇన్‌శాట్-3బీ ప్రయోగం.
2001- జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జిఎస్‌ఎల్‌వీ) రాకెట్ ద్వారా జీశాట్-1 శాటిలైట్‌ను ప్రయోగించారు.
2002 - వాతావరణ ఉపగ్రహం కల్పన-1ను ప్రయోగించారు. దీని మొదటి పేరు మెట్‌శాట్-1.
2003 - జీశాట్-2ను, రిసోర్‌‌సశాట్-1ను ప్రయోగించారు.
2004 - విద్యాసేవలకై ఎడ్యుశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
2005 - మ్యాపింగ్ ప్రక్రియలకు ఉద్దేశించిన కార్టోశాట్-1ను, హ్యామ్ రేడియో సేవల కోసం హ్యామ్‌శాట్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ6 ద్వారా ప్రయోగించారు.
2005 - ఇన్‌శాట్-4ఏ ప్రయోగం.
2007 - కార్టోశాట్-2, ఇన్‌శాట్-4సీఆర్‌ను ప్రయోగించారు.
2008 - పీఎస్‌ఎల్‌వీ-సీ10 ద్వారా ఇజ్రాయెల్ శాటిలైట్ టెక్సార్ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ-సీ9 ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో రెండు భారత్‌వి, ఎనిమిది విదేశాలకు చెందినవి.
2008 - పీఎస్‌ఎల్‌వీ -సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు.
2009 - పీఎస్‌ఎల్‌వీ- సీ12 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రీశాట్-2), అన్నా యూనివర్సిటీకి చెందిన అనుశాట్‌ను ప్రయోగించారు.
2010-పీఎస్‌ఎల్‌వీ -సీ15 వాహక నౌక ద్వారా కార్టోశాట్-2బి, స్టడ్‌శాట్‌లతోపాటు మూడు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు.
2011-పీఎస్‌ఎల్‌వీ-సీ16 ద్వారా రిసోర్‌‌సశాట్-2, యూత్‌శాట్, ఎక్‌్‌శాట్ ప్రయోగం. ఇవికాకుండా జీశాట్-12, మేఘ ట్రాపిక్స్ ఉపగ్రహ ప్రయోగాలు.
2012-ఫ్రెంచ్ శాటిలైట్ స్పాట్-6, జపాన్ శాటిలైట్ ప్రోయిటెరస్ ప్రయోగం. వీటిని పీఎస్‌ఎల్‌వీ-సీ21 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ఇస్రో 100వ అంతరిక్ష ప్రయోగం.
2013-పీఎస్‌ఎల్‌వీ-సీ20 రాకెట్ ద్వారా సరళ్ అనే భారత్-ఫ్రెంచ్ శాటిలైట్‌ను ప్రయోగించారు. ఇది సముద్రాలను అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న సరళ్‌తోపాటు ఆరు విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు. అవి.. ఆస్ట్రియాకు చెందిన యూనిబ్రైట్, బ్రైట్; డెన్మార్‌‌కకు చెందిన అవ్‌శాట్-3, యూకేకు చెందిన స్ట్రాండ్, కెనడాకు చెందిన నియోశాట్, సాఫైర్.
2013-పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ అనే నావిగేషన్ శాటిలైట్‌ను ఈ ఏడాది జూలై1న ప్రయోగించారు.
2013-ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి ఈ ఏడాది జూలై 26న భారత వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీని విజయవంతంగా ప్రయోగించారు.
2013 - ఈ ఏడాది నవంబర్‌లో మార్‌‌స ఆర్బిటర్ మిషన్‌ను ప్రయోగిస్తారు. ఇది అంగారక గ్రహంపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
చంద్రయాన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2008, అక్టోబర్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు. ఇది 312 రోజులు పనిచేసి 2009, ఆగస్టు 29న ఆగిపోయింది. చంద్రయాన్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. త్వరలో చంద్రయాన్-2ను కూడా ప్రయోగిస్తారు.


జాతీయం National ముఖ్యమైన దినోత్సవాలు..

ముఖ్యమైన దినోత్సవాలు..

దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్ విభాగంలో వివిధ దినోత్సవాల గురించి ప్రశ్నలడుగుతున్నారు. సంబంధిత దినోత్సవాన్ని ఏ తేదీన, ఏ సందర్భంగా నిర్వహించుకుంటారు? ఎవరి జయంతి సందర్భంగా వాటిని జరుపుకుంటారో తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ముఖ్య దినోత్సవాలు..

జాతీయ దినోత్సవాలు
జనవరి 9: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మనదేశాభివృద్ధిలో తోడ్పాటుకు గుర్తుగా ప్రతి ఏటా జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివస్‌గా పరిగణిస్తారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి జనవరి 9, 1915న భారతదేశానికి తిరిగి వచ్చారు. అందువల్ల జనవరి 9ని ఎన్‌ఆర్‌ఐ డేగా జరుపుకొంటారు. 2003 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 11వ ప్రవాసీ భారతీయ దివస్‌ను ఈ ఏడాది జనవరి 7, 9 తేదీల్లో కేరళలోని కొచ్చిలో నిర్వహించారు. మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్‌యాగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును బహూకరించారు.
జనవరి 12: స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటారు. 1985 నుంచి దీన్ని పాటిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 12న స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను జరుపుకొన్నారు.
జనవరి 25: 2011 నుంచి జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో యువకులు ఎక్కువగా పాల్గొనాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. జనవరి 25, 2013 నాటికి భారతదేశంలో ఓటర్ల సంఖ్య 77.78 కోట్లు. ఎన్నికల్లో మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం ఒలింపిక్ పతక విజేతలైన సైనా నెహ్వాల్, మేరీకామ్‌లను ప్రతినిధులుగా నియమించింది.
ఫిబ్రవరి 28: సర్ సి.వి.రామన్.. రామన్ ఎఫెక్ట్‌ను ఫిబ్రవరి 28, 1928న కనుగొన్నారు. ఆ కారణంగా ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్‌‌స దినోత్సవంగా నిర్వహిస్తారు. రామన్‌కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 2013 సైన్‌‌స దినం ప్రధాన అంశం- ‘జన్యుమార్పిడి పంటలు, ఆహార భద్రత’.
మే 11: భారతదేశం మే 11, 1998లో రెండో అణ్వస్త్ర పరీక్షలను రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించింది. దీన్నే పోఖ్రాన్-2 లేదా ఆపరేషన్ శక్తి అంటారు. అందువల్ల మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినం (టెక్నాలజీ డే)గా జరుపుకొంటాం. మొదటి అణు పరీక్షలను 1974లో నిర్వహించారు.
జూలై 1: ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గౌరవార్థం జూలై 1ని వైద్యుల దినోత్సవం (డాక్టర్‌‌స డే)గా జరుపుకొంటారు. డాక్టర్ బి.సి.రాయ్ పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి. ఆయనకు 1961లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఆయన జూలై 1, 1882న జన్మించారు. 1962లో జూలై ఒకటో తేదీనే మరణించారు. మన జీవితాల్లో వైద్యులు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తారో తెలియచేయడానికి జూలై ఒకటో తేదీని వైద్యుల దినంగా పాటిస్తాం.
ఆగస్టు 29: హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టిన రోజైన ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినంగా పరిగణిస్తారు. ధ్యాన్‌చంద్ అద్భుత ప్రతిభ వల్ల మనదేశానికి 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లలో బంగారు పతకాలు లభించాయి. ప్రజల్లో క్రీడల పట్ల అవగాహన కల్పించడానికి క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర, అర్జున, ద్రోణాచార్య మొదలైన క్రీడా అవార్డులను ఆగస్టు 29న ప్రదానం చేస్తారు.
సెప్టెంబర్ 15: ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 15వ తేదీని ఇంజనీర్‌‌స డే నిర్వహిస్తారు. ఆయన సెప్టెంబర్ 15, 1860లో జన్మించారు. విశ్వేశ్వరయ్యకు 1955లో భారతరత్న లభించింది.
నవంబర్ 11: భారతదేశ మొదటి విద్యామంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి అయిన నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యాదినంగా పాటిస్తారు. ఆయనకు 1992లో మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు.
డిసెంబర్ 22: భారత గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887న జన్మించారు. ఆయన జయంతిని భారత ప్రభుత్వం జాతీయ గణితశాస్త్ర దినంగా ప్రకటించింది. 2012ను జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా పాటించారు.
డిసెంబర్ 23: భారతదేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ డిసెంబర్ 23, 1902న జన్మించారు. ఆయన జయంతిని కిసాన్ దివస్ లేదా వ్యవసాయదారుల దినోత్సవంగా నిర్వహిస్తారు. మనదేశంలోని రైతుల అభివృద్ధికి చరణ్‌సింగ్ నిరంతరం కృషి చేశారు.
 
మరికొన్ని జాతీయ దినోత్సవాలు
జనవరి 15 సైనిక దినోత్సవం
జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం
జనవరి 25 జాతీయ పర్యాటక దినం
జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినం
ఫిబ్రవరి 2 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినం
ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ దినం
మార్చి 3 జాతీయ రక్షణ దినం
మార్చి 4 జాతీయ భద్రతా దినం
ఏప్రిల్ 5 జాతీయ మారిటైమ్ దినం
ఏప్రిల్ 11 జాతీయ జననీ సురక్షా దినం
ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ దినం
ఏపిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినం
మే 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం 
(రాజీవ్‌గాంధీ వర్ధంతి)
జూలై 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దినం
జూలై 26 కార్గిల్ విజయ్ దివస్
ఆగస్ట్ 9 క్విట్ ఇండియా దినం
ఆగస్ట్ 20 జాతీయ సద్భావనా దినం 
(రాజీవ్‌గాంధీ జయంతి)
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం 
సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం
అక్టోబర్ 8 భారత వైమానిక దినం
అక్టోబర్ 10 జాతీయ తపాలా దినం
నవంబర్ 14 బాలల దినోత్సవం
డిసెంబర్ 4 నావికాదళ దినం
డిసెంబర్ 7 ఆర్‌‌మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే
డిసెంబర్ 14 జాతీయ శక్తి సంరక్షణ దినం
డిసెంబర్ 18 మైనారిటీల హక్కుల దినం


జాతీయం National జ్ఞాన్‌పీఠ్ అవార్డును మొదట అందుకున్నవారు

జ్ఞాన్‌పీఠ్ అవార్డును మొదట అందుకున్నవారు

వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్‌‌జ, కరెంట్ అఫైర్‌‌సలలో తప్పనిసరిగా అవార్డుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వివిధ అవార్డులు, వీటిని ఎవరు ఏర్పాటు చేశారు? ఏ రంగంలో ఇస్తారు? ప్రథమ విజేతలు, ఇటీవల ఎవరికి లభించింది? వంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో వివిధ అవార్డులు గురించి తెలుసుకుందాం.

భారతరత్న
భారతరత్న భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. కళలు, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ప్రజా సేవల రంగాలలో అత్యున్నత కృషికి ఇస్తారు. 2011లో క్రీడలను కూడా ఈ జాబితాలో చేర్చారు. 1954లో మొదటిసారిగా ముగ్గురికి భారతరత్న లభించింది.వారు భారతదేశ చివరి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, తొలి ఉపరాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. ఇప్పటివరకు 41 మందికి భారతరత్న లభించింది. చివరిసారిగా 2008లో పండిట్ భీమ్‌సేన్ జోషికి ప్రదానం చేశారు. ఈ అవార్డును మరణానంతరం పొందిన మొదటి వ్యక్తి భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనకు 1966లో ఈ అవార్డు లభించింది. భారతరత్న పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ (1971). భారతరత్న ఇద్దరు విదేశీయులకు కూడా లభించింది. 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పాకిస్థాన్)కు, 1990లో నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా)కు లభించింది. భారతరత్న లభించిన వ్యక్తులలో నలుగురు జీవించి ఉన్నారు. వారు.. అబ్దుల్ కలాం (1997), అమర్త్యసేన్ (1999), లతా మంగేష్కర్ (2001), నెల్సన్ మండేలా (1990).

పద్మ అవార్డులు
భారతరత్న తర్వాత అత్యున్నతమైన పౌర పురస్కారాలు వరుసగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ సంవత్సరం జనవరి 26న 108 మందికి పద్మ అవార్డులు బహూకరించారు. ఇందులో 24 మంది మహిళలు. 2013 విజేతలు..

పద్మవిభూషణ్: నలుగురికి లభించింది. రఘునాథ్ మహాపాత్ర (శిల్పి), హైదర్ రజా (చిత్రకళ), సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో యశ్‌పాల్, రొద్దం నరసింహ.

పద్మభూషణ్: 24 మందికి ప్రదానం చేశారు. కొంతమంది ప్రముఖులు: సినిమా రంగానికి చెందిన డి.రామానాయుడు, ఎస్.జానకి, షర్మిలా ఠాగోర్, రాజేష్ ఖన్నా, (మరణానంతరం), జస్పాల్ భట్టి (మరణానంతరం). భరత నాట్యకారిణి సరోజ వైద్యనాథన్, సైన్‌‌స విభాగంలో శివథాను పిళ్లై, విజయకుమార్ సారస్వత్, అశోక్ సేన్, బి.ఎన్. సురేష్. పరిశ్రమ రంగానికి చెందిన ఆర్. త్యాగరాజన్, ఆది గోద్రెజ్. సాహిత్యంలో మంగేష్ పడ్‌గావ్‌కర్, గాయత్రి స్పివాక్. క్రీడారంగంలో క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, మహిళా బాక్సర్ మేరీకోమ్.

పద్మశ్రీ: 80 మందికి ప్రదానం చేశారు. కొంతమంది ముఖ్యులు: చలనచిత్ర రంగానికి చెందిన శ్రీదేవి కపూర్, నానా పటేకర్, బాపు, రమేష్ సిప్పీ; మన రాష్ట్రానికి చెందిన గజం అంజయ్య (చేనేత), సురభి బాబ్జీ (ఆర్‌‌ట), చిట్టా వెంకట సుందరరామ్ (వైద్యం), రామకృష్ణరాజు (సైన్‌‌స అండ్ ఇంజనీరింగ్) ఉన్నారు.

చలన చిత్ర రంగ అవార్డులు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: భారతదేశ అత్యున్నత సినిమా అవార్డు. భారతీయ చలనచిత్ర పితామహుడిగా పేరు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే పేరిట ఈ అవార్డును భారత ప్రభుత్వం 1969లో నెలకొల్పింది. ఈ అవార్డు కింద స్వర్ణకమలం, పది లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. తొలి విజేత 1969లో దేవికా రాణి రోరిచ్. 2012లో ఈ బహుమతిని ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్‌కు ప్రదానం చేశారు. ఇప్పటివరకు 44 మందికి లభించింది. 1971లో పృథ్వీరాజ్ కపూర్‌కు ప్రకటించారు. మరణానంతరం ఈ అవార్డు పొందిన తొలి వ్యక్త్తి పృథ్వీరాజ్ కపూర్. భారతదేశపు తొలి మూకీ చిత్రం రాజాహరిశ్చంద్రను దాదాసాహెబ్ ఫాల్కే 1913లో నిర్మించాడు. ఆ సినిమా మే 3, 1913లో విడుదలైంది. అందుకే ఈ అవార్డును, జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రతి ఏటా మే 3న ప్రదానం చేస్తారు.

60వ జాతీయ చలనచిత్ర అవార్డులు: ఈ అవార్డులను మే 3, 2013 నాడు ప్రదానం చేశారు. దేఖ్ ఇండియన్ సర్కస్ అనే హిందీ చిత్రం అత్యధికంగా నాలుగు అవార్డులను గెలుచుకున్నది. ఉత్తమ చిత్రం పాన్‌సింగ్ తోమర్ (హిందీ), ఉత్తమ బాలల చిత్రం దేఖ్ ఇండియన్ సర్కస్ (హిందీ), ఉత్తమ దర్శకుడు శివాజీ లోతన్ పాటిల్ (మరాఠీ చిత్రం దాగ్), ఉత్తమ నటులు 1) ఇర్ఫాన్ ఖాన్ (పాన్‌సింగ్ తోమర్), 2) విక్రమ్ గోఖలే (మరాఠీ చిత్రం అనుమతి). ఉత్తమ నటి ఉషా జాదవ్ (మరాఠీ చిత్రం దాగ్), ఉత్తమ సహాయ నటుడు అన్నుకపూర్ (హిందీ చిత్రం వికీడోనర్), ఉత్తమ సహాయ నటి 1) డాలీ అహ్లూవాలియా (వికీడోనర్), 2) కల్పన (మలయాళ చిత్రం తనిచళ ఎంజన్).

58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు: ఫిల్మ్‌ఫేర్ అవార్డులను టైమ్స్ గ్రూప్ 1954లో ప్రారంభించింది. వీటిని హిందీ చలన చిత్ర రంగంలో ప్రతిభావంతులకు ఇస్తారు. 58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను జనవరి 20, 2013న ముంబైలో ప్రదా నం చేశారు. బర్ఫీ చిత్రానికి 7 అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం-బర్ఫీ, ఉత్తమ దర్శకుడు- సుజయ్‌ఘోష్ (కహానీ),ఉత్తమ నటుడు-రణ్‌బీర్ కపూర్(బర్ఫీ), ఉత్తమ నటి-విద్యాబాలన్ (కహానీ), ఉత్తమ సహాయనటుడు-అన్నూ కపూర్(వికీడోనర్), ఉత్తమ సహాయ నటి - అనుష్కశర్మ (జబ్‌తక్ హై జాన్), జీవితకాల సాఫల్య పురస్కారం-యశ్ చోప్రా(మరణానంతరం).

జాతీయ క్రీడా అవార్డులు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న: క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం.1991 -92లో ప్రారంభించారు. 7,50,000 రూపాయల నగ దు బహుమతిని ఇస్తారు. మొదటి విజేత విశ్వనాథన్ ఆనంద్. 2012-13కు గానూ షూటింగ్ నిపుణుడు రంజన్ సోధికి లభించింది. 2010-11లో గగన్ నారంగ్ (షూటింగ్), 2011-12లో విజయ్‌కుమార్ (షూటింగ్), యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్)లకు లభించింది. ఇప్పటివరకూ ఏడుగురు షూటర్లకు ఈ పురస్కారం లభించింది.

అర్జున: అర్జున అవార్డులను భారత ప్రభుత్వం 1961లో ప్రారంభించింది. ఐదు లక్షల నగదు బహుమతిని ఇస్తా రు. ఈ ఏడాది 14 మందికి ఇచ్చారు. వారు విరాట్ కోహ్లీ (క్రికెట్), చెక్రవోలు స్వురో (ఆర్చరీ), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), కవితాచాహల్ (బాక్సింగ్), రూపేష్ షా (బిలియర్‌‌డ్స), అభిజిత్ గుప్తా (చెస్), గగన్‌జీత్ భుల్లార్ (గోల్ఫ్), సబా అంజుమ్ (హాకీ), రాజ్‌కుమారి రాథోర్ (షూటింగ్), జోత్స్న చిన్నప్ప (స్క్వాష్), మౌమ దాస్ (టేబుల్ టెన్నిస్), నేహారాధి (రెజ్లింగ్), ధర్మేందర్ దలాల్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ సరోహ (పారా అథ్లెటిక్స్).

ద్రోణాచార్య అవార్డు: ద్రోణాచార్య అవార్డును క్రీడా శిక్షకులకు ఇస్తారు. ఈ అవార్డును 1985లో ప్రారంభించారు. రూ. 5 లక్షల నగదు బహుమతిని ఇస్తారు. 2013 సంవత్సరానిగానూ ఐదుగురు కోచ్‌లకు లభించింది. వారు పూర్ణిమా మహతో (ఆర్చరీ), మహావీర్‌సింగ్ (బాక్సింగ్), నరీందర్ సింగ్ సైనీ (హాకీ), కె.పి.థామస్ (అథ్లెటిక్స్), రాజ్‌సింగ్ (రెజ్లింగ్).

ధ్యాన్‌చంద్ అవార్డు: క్రీడల్లో జీవితకాల సాఫల్యానికి గాను ఇస్తారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. 2002లో ప్రారంభించిన ఈ అవార్డు కింద ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. ఆగస్టు 31, 2013న ధ్యాన్‌చంద్ అవార్డును భారత రాష్ర్టపతి నలుగురికి అందజేశారు. వారు సయ్యద్ అలీ (హాకీ), మేరీ డిసౌజా (అథ్లెటిక్స్), అనిల్‌మన్ (రెజ్లింగ్), గిరిరాజ్ సింగ్ (పారా స్పోర్‌‌ట్స).

సాహిత్య అవార్డులు
జ్ఞాన్‌పీఠ్ పురస్కారం: ఈ అవార్డును సాహుజైన్ కుటుంబం స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ్ ట్రస్ట్ ప్రతిఏటా ఇస్తుంది. రాజ్యాంగంలోని 22 అధికార భాషలకు చెందిన రచనలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఇస్తారు. మొదటి గ్రహీత 1965లో జి. శంకర కురూప్. ఆయన మలయాళ రచయిత. ఇప్పటివరకు 53 మందికి లభించింది. ఈ అవార్డు కింద 11 లక్షల రూపాయలను బహూకరిస్తారు. మొదటి మహిళా గ్రహీత 1976లో ఆశాపూర్ణాదేవి. బెంగాలీ రచన ప్రథమ్ ప్రతిశ్రుతికిగాను ఆమెకు జ్ఞాన్‌పీఠ్ లభించింది. ఇప్పటివరకూ ఏడుగురు మహిళలు ఈ అవార్డు పొందారు. 2012 కు 48వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు విజేత తెలుగు రచయిత రావూరి భరద్వాజ. ఆయన రాసిన పాకుడురాళ్లు నవల కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు పొందిన మూడో తెలుగు రచయిత రావూరి భరద్వాజ. 1970లో రామాయణ కల్పవృక్షంకు విశ్వనాథ సత్యనారాయణకు, 1988 లో విశ్వంభరకు డాక్టర్ సి. నారాయణరెడ్డికి లభించింది.

మూర్తిదేవి అవార్డు: దీన్ని కూడా భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ప్రదానం చేస్తుంది. 1983లో ప్రారంభించిన ఈ బహుమతి కింద రెండు లక్షల రూపాయల నగదును ఇస్తారు. 2013 గ్రహీత హరిప్రసాద్ దాస్. ఒడియా భాషలో ఈయన రచించిన ‘వంశ’ అనే గ్రంథానికి ఈ అవార్డు లభించింది.

సరస్వతీ సమ్మాన్: 1991లో కె.కె. బిర్లా ఫౌండేషన్ వారు స్థాపించిన ఈ అవార్డును 22 భాషలలో రచనలకు ఇస్తారు. రూ. పది లక్షల నగదును ఇస్తారు. 2013లో ఈ బహుమతిని మలయాళ రచయిత్రి సుగతా కుమారికి ప్రదానం చేశారు. ఆమె రచన ‘మనలెజుతు’.

వ్యాస్ సమ్మాన్: దీన్ని కూడా 1991లో కె.కె. బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. హిందీ రచనలకు మాత్రమే ఇస్తారు. 2.5 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. 2012 విజేత నరేంద్ర కోహ్లీ. ‘నభూతో న భవిష్యతి’ అనే హిందీ రచనకు ఆయనకు ఈ అవార్డు లభించింది.

ధైర్యసాహసాలకు ఇచ్చే అవార్డులు
పరమవీరచక్ర: ఇది భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం. ఈ అవార్డును తొలిసారిగా నవంబర్ 3, 1947న మేజర్ సోమ్‌నాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేశారు. పరమవీరచక్ర తర్వాత అత్యున్నత మిలిటరీ అవార్డులు మహావీర చక్ర, వీరచక్ర.

అశోక్ చక్ర: యుద్ధం జరగని సందర్భంలో, శాంతి సమయంలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. 2012లో ఈ అవార్డు నవదీప్‌సింగ్‌కు మరణానంతరం లభించింది. అశోక్ చక్ర తర్వాత శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత అవార్డులు కీర్తిచక్ర, శౌర్యచక్ర.

రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డు
దీన్ని 1992లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసింది. సద్భావన, జాతీయ సమగ్రత, శాంతిని పెంపొందించేందుకు కృషి చేసిన వారికి రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డును ఇస్తారు. ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. ప్రతి ఏటా రాజీవ్‌గాంధీ జయంతి అయిన ఆగస్టు 20న ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఆగస్టు 20ను సద్భావన దివస్‌గా జరుపుకుంటారు. 2013కు సరోద్ వాద్యకారుడు అంజద్ అలీఖాన్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు.

ఇందిరాగాంధీ శాంతి బహుమతి
ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని 1986లో ప్రారంభించారు. 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. 2012 గ్రహీత లైబీరియా దేశాధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్. ఈ అవార్డు లభించిన ప్రముఖులు రాజీవ్‌గాంధీ(1991), వాక్లెద్ హోవెల్(1993), జిమ్మీ కార్టర్ (1997), మహ్మద్ యూనస్ (1998), ఎం.ఎస్ స్వామినాథన్ (1999), కోఫి అన్నన్ (2003), హమీద్ కర్జాయ్ (2005), షేక్ హసీనా (2009), ఇలాభట్ (2011).

లతా మంగేష్కర్ అవార్డు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతా మంగేష్కర్ సమ్మాన్ అలంకరణ్‌ను 1984 లో ప్రవేశపెట్టింది. నగదు బహుమతి రెండు లక్షల రూపాయలు. 2013 గ్రహీత ప్రముఖ గాయకుడు హరిహరన్.

కాళిదాస్ సమ్మాన్
దీన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కళలకుగానూ ప్రదానం చేస్తుంది. 1980లో ప్రవేశపెట్టారు. 2012లో ఈ అవార్డును హిందీ నటుడు అనుపమ్‌ఖేర్ స్వీకరించారు.

టాగోర్ కల్చరల్ హార్మనీ అవార్డు
కోటి రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. 2013 విజేత పాశ్చాత్య సంగీత కారుడు జుబిన్ మెహతా. ఈ అవార్డును రవీంద్రనాథ్ టాగోర్ 150వ జయంతి సందర్భంగా 2012లో ఏర్పాటు చేశారు. తొలి గ్రహీత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్.

వివిధ ఏపీపీఎస్సీ పరీక్షల్లో జాతీయ అవార్డులపై అడిగిన కొన్ని ప్రశ్నలు
1. భారతదేశ 64వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్ పొందిన వారు?
2. భారతదేశ 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాహిత్యం, విద్యారంగంలో పద్మభూషణ్ అవార్డు ఎవరికి వచ్చింది?
3. 2013లో కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి పద్మ అవార్డులు అందజేసింది?
4. భారతరత్న అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళ?
5. ఇండియాలో శాంతి సమయంలో ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు?
6. జ్ఞాన్‌పీఠ్ అవార్డును మొదట అందుకున్నవారు?
7. భారతీయ జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఏర్పాటుచేసిన సంవత్సరం?
8. ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి 2011కి ఎవరు ఎంపికయ్యారు?
9. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మొట్టమొదట స్వీకరించింది?
10. ఇండియాలో క్రీడలలో అత్యుత్తమ గౌరవచిహ్నంగా ఇచ్చే అవార్డు?
సమాధానాలు: 1) హైదర్ రజా, 2) మంగేష్ పడ్‌గావ్‌కర్, 3) 108, 4) ఇందిరాగాంధీ, 5) అశోక్ చక్ర, 6) జి.శంకర కురూప్, 7) 1961, 8) ఇలాభట్, 9) దేవికారాణి రోరిచ్, 10) రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న.


ప్రపంచం World జీ-20 - గ్రూప్ ఆఫ్ 20

జీ-20 - గ్రూప్ ఆఫ్ 20

అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. 1999లో ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్‌ల వేదికగా ఇది ఏర్పడింది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. ఈ వేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. జీ-20 లో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు సభ్యత్వం ఉంది.జీ-20 దేశాలు ప్రపంచలో మూడింట రెండింతల జనాభా కలిగి ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం వాటా ఈ దేశాలదే.
జీ-20 సదస్సు 2016 ముఖ్యాంశాలు..
జీ-20 11వ సదస్సు 2016 సెప్టెంబర్ 4, 5 తేదీల్లో చైనాలోని హాంగ్‌జూ నగరంలో జరిగింది. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిచ్చిన రెండో ఆసియా దేశం చైనా. 2010 నవంబర్‌లో నిర్వహించిన జీ-20 సదస్సుకు మరో ఆసియా దేశం దక్షిణ కొరియా ఆతిథ్యమిచ్చింది.

ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ‘ఒక దక్షిణాసియా దేశం ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోంది’ అని పాకిస్తాన్‌ను పరోక్షంగా విమర్శించారు. వాతావరణాన్ని కాపాడుకోవాలని, ప్రజారోగ్యం ముఖ్యమైన విషయమని, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందానికి ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు.

హాంగ్‌జూ సదస్సులో సభ్యదేశాల నాయకులతోపాటు ఈజిప్ట్, కజకిస్తాన్, లావోస్, సెనెగల్, స్పెయిన్, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నేతలు కూడా అతిథులుగా పాల్గొన్నారు.

జీ-20 శిఖరాగ్ర సదస్సులు
క్రమ సంఖ్యసంవత్సరంఆతిథ్య నగరందేశం
1.2008 నవంబర్వాషింగ్టన్ డి.సి.అమెరికా
2.2009 ఏప్రిల్లండన్యూకే
3.2009 సెప్టెంబర్పిట్స్‌బర్‌‌గఅమెరికా
4.2010 జూన్టొరంటోకెనడా
5.2010 నవంబర్సియోల్దక్షిణ కొరియా
6.2011 నవంబర్కేన్‌‌సఫ్రాన్స్‌
7.2012 జూన్లాస్ కబోస్మెక్సికో
8.2013 సెప్టెంబర్సెయింట్ పీటర్‌‌సబర్‌‌గరష్యా
9.2014 నవంబర్బ్రిస్బేన్ఆస్ట్రేలియా
10.2015 నవంబర్అంతాల్యాటర్కీ
11.2016 సెప్టెంబర్హాంగ్‌జూచైనా
12వ జీ-20 శిఖరాగ్ర సదస్సు 2017 జూలైలో జర్మనీలోని హాంబర్‌‌గ నగరంలో జరగనుంది.

జీ-20 11వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న నాయకులు
దేశంపాల్గొన వ్యక్తి హోదాపేరు
అర్జెంటీనాఅధ్యక్షుడుమారీసియో మాక్రి
ఆస్ట్రేలియాప్రధానమంత్రిమల్కమ్ టర్‌‌నబుల్
బ్రెజిల్అధ్యక్షుడుమిచెల్ టెమెర్
కెనడాప్రధానమంత్రిజస్టిన్ ట్రుడో
చైనాఅధ్యక్షుడుజీ జిన్ పింగ్
ఫ్రాన్‌‌సఅధ్యక్షుడుఫ్రాంకోయిస్ హోలాండ్
జర్మనీచాన్‌‌సలర్ఎంజెలా మెర్కెల్
భారత్ప్రధానమంత్రినరేంద్ర మోదీ
ఇండోనేషియాఅధ్యక్షుడుజోకో విడోడో
ఇటలీప్రధానమంత్రిమాతియో రెంజీ
జపాన్ప్రధానమంత్రిషింజో అబే
మెక్సికోఅధ్యక్షుడుఎన్రిక్ పెనా నియతో
రష్యాఅధ్యక్షుడువ్లాదిమిర్ పుతిన్
సౌదీ అరేబియాడిప్యూటీ క్రౌన్ప్రిన్స్‌ మొహ మ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్
దక్షిణ కొరియాఅధ్యక్షురాలుపార్‌‌క గెన్ హై
దక్షిణాఫ్రికాఅధ్యక్షుడుజాకబ్ జుమా
టర్కీఅధ్యక్షుడురెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్
యునెటైడ్ కింగ్‌డమ్ప్రధానమంత్రిథెరిసా మే
యునెటైడ్ స్టేట్స్అధ్యక్షుడుబరాక్ ఒబామా
యూరోపియన్ కౌన్సిల్ప్రెసిడెంట్డొనాల్డ్ టస్క్


ప్రపంచం World 21వ ప్రపంచ పర్యావరణ సదస్సు

21వ ప్రపంచ పర్యావరణ సదస్సు

గ్లోబల్ వార్మింగ్, విపత్తు ప్రభావాలు, వాతావరణ మార్పుల నుంచి పుడమిని రక్షించడంతోపాటు వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు 21వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 21)ను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి 195 దేశాల నేతలు, 40 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. హరిత గృహ వాయువుల గాఢతను తగ్గించి భూ సగటు ఉష్ణోగ్రతలను (పారిశ్రామిక విప్లవానికి ముందటి ఉష్ణోగ్రతలతో పోల్చితే) 2 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు నిర్దిష్ట గడువును విధించడానికి ప్రపంచ దేశాలు ఈ వార్షిక సదస్సులో అంగీకరించాయి. వాతావరణ మార్పులపై ఇంతటి పాలనాపరమైన చైతన్యం గతంలో ఎప్పుడూ రాలేదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ పేర్కొన్నారు.
సమగ్ర ఒప్పందానికి మోదీ పిలుపు
సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరులో ప్రపంచ దేశాల మధ్య సమానత్వ భావన, బాధ్యతల పంపిణీ కోసం సమగ్ర, నిష్పాక్షిక, దీర్ఘకాలిక ఒప్పందాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. ‘వాతావరణ మార్పు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్. ఇది భూతాపం ఫలితమే. పారిశ్రామిక యుగంలో శిలాజ ఇంధనాల భారీ వినియోగ పర్యవసానాలను ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత పురోగతి సాధించేందుకు కర్బన విస్తృతి (కార్బన్ స్పేస్)లో వాటికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలపై ఉంది. ప్రస్తుత కర్బన ఉద్గారాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏమాత్రం కారణం కాదు’ అని మోదీ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన రుగ్వేదంలోని సూక్తిని, మహాత్మాగాంధీ నమ్మిన సిద్ధాంతాన్ని ఉటంకించారు. ‘ప్రకృతితో కలిసి జీవించడం తప్ప దాన్ని ధ్వంసం చేయడం భారత సంస్కృతి కాదు. ఇది భారతీయులు అనాదిగా పాటిస్తున్న జీవన విధానం’ అని పేర్కొన్నారు. సాంకేతికత, పురోగతిలో ఇతర దేశాలకూ భాగస్వామ్యం కల్పించాలని ప్రధాని మోదీ అభివృద్ధి చెందిన దేశాలకు విజ్ఞప్తి చేశారు.

‘పరంపర’ ఆవిష్కరణ
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో మన దేశ సంప్రదాయాలను వివరించే పరంపర అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నూతన పరికల్పనలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభం
కాప్-21 సందర్భంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ మిషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ సౌర విద్యుత్‌ను అందరికీ అందుబాటులోకి తేవడం; నాణ్యమైన జీవనాన్ని అందించడం; పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నివాసాలను ఏర్పాటు చేయడం విశ్వజనీన ఆకాంక్షలని తెలిపారు. వీటిని నెరవేర్చేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. మిషన్ ఇన్నోవేషన్‌లో భారత్‌తో కలిసి నడిచేందుకు అమెరికా, చైనా సహా 19 దేశాలు అంగీకరించాయని ప్రధాని వెల్లడించారు.

2030 నాటికి ఉద్గారాల తీవ్రత 33 శాతం తగ్గింపు 
భారత్ 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను స్థూల దేశీయోత్పత్తిలో 33 శాతం (2005 నాటి స్థాయిలతో పోల్చితే) తగ్గించనుందని మోదీ తెలిపారు. 2022 నాటికి 40 శాతం విద్యుత్‌ను శిలాజేతర ఇంధనాల నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. పెద్దమొత్తంలో గ్రీన్‌హౌస్ ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే భారత్‌లో తలసరి ఉద్గారాల విడుదల చాలా తక్కువ. తలసరి పరంగా చూస్తే ఈ విషయంలో భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో నిలుస్తుంది.

ఇండియా పెవిలియన్ ప్రారంభం
సదస్సుకు ముందు ఏర్పాటు చేసిన భారత పెవిలియన్‌ను మోదీ ప్రారంభించారు. వాతావరణ మార్పుల విషయంలో భారత్ స్థానం గురించి తెలిపే ఎన్నో విషయాలు పెవిలియన్‌ను సందర్శించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై పోరుకు భారత్ సారథ్యం వహిస్తుందని, ఈ మేరకు ప్రాథమిక నిధి కింద రూ.175 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ ఇంధన ప్రణాళిక సౌర విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించిందని, 2022 నాటికి భారత్ 100 గిగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని వివరించారు.

‘జల, వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని’ ప్రకటించిన పారిస్ సదస్సు
మానవ సుస్థిర అభివృద్ధికి కీలకమైన నీటి వ్యవస్థలను వాతావరణ మార్పుల ప్రభావం నుంచి కాపాడాల్సిన ఆవశ్యకతను తెలిపే ‘జల, వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని’ పారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు డిసెంబర్ 2న ప్రకటించింది. వాతావరణ మార్పులపై ‘లిమా టు ప్యారిస్ యాక్షన్ అజెండా’ పేరిట నిర్వహించిన ‘వాటర్ రీసెలైన్స్ ఫోకస్’ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. దీనికి భారత్ సహా పలు దేశాలు; ప్రపంచవ్యాప్తంగా ఉన్న 290 నదీ తీర ప్రాంత సంస్థలు; వ్యాపార, పౌర సమాజాలు మద్దతు తెలిపాయి. నీటి వ్యవస్థలను రక్షించేందుకు మెరుగైన భూగర్భ జల నిర్వహణను చేపట్టనున్నట్లు భారత్ పేర్కొంది. నీటి వ్యవస్థల రక్షణకు ఏ దేశం ఏ ప్రణాళికలను, నీటి నిర్వహణ వ్యవస్థలను, నీటి కొలమానాలను అనుసరిస్తున్నాయి?, నిధులను ఏవిధంగా సమీకరిస్తున్నాయి?, ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నాయి? అనే విషయాలను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

అభివృద్ధి చెందిన దేశాలే అధిక వాటా ఇవ్వాలి
వాతావరణ మార్పుపై పోరుకు అన్ని దేశాలు సమానంగా ఆర్థిక సాయం చేయాలన్న వాదనను అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి వ్యతిరేకించింది. సమాన వాటా భరించాలనడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని హెచ్చరించింది. అభివృద్ధి చెందిన దేశాలు అధిక భారం మోయాలని డిమాండ్ చేసింది. వందకుపైగా దేశాలు గల ఈ కూటమిలో భారత్ కూడా సభ్య దేశం. అభివృద్ధి చెందుతున్న దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు, వాతావరణ మార్పునకు అనుగుణంగా మారేందుకు ఏటా పది వేల కోట్ల డాలర్ల చొప్పున 2020 వరకు సాయం చేయనున్నట్లు పారిశ్రామిక దేశాలు 2009లో పేర్కొన్నాయి. కానీ ఆ హామీని నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో పారిస్ సదస్సు చట్టబద్ధమైన సమగ్ర ఒప్పందాన్ని రూపొందించాలని, ఆర్థిక సాయం అనే అంశాన్ని అందులో పొందుపరచాలని ప్రధాని మోదీ కోరారు. ఒప్పంద ముసాయిదా రూపకల్పనకు ఏడీపీ (అడహక్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ద దర్బన్ ప్లాట్‌ఫాం) కృషి చేస్తోంది. ఏడీపీని 2011లో డర్బన్ (దక్షిణాఫ్రికా)లో కాప్17 సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఒప్పంద ప్రణాళిక సమావేశ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ - 1992) అధికార పరిధికి లోబడి ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ సోలార్ కూటమి ప్రారంభం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌లు సంయుక్తంగా అంతర్జాతీయ సోలార్ కూటమిని పారిస్‌లో ప్రారంభించారు. 121 ఉష్ణమండల దేశాలు సౌరశక్తిని ఒడిసిపట్టుకునేలా చేయడమే ఈ కూటమి ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. రానున్న ఐదేళ్లలో ప్రాథమిక శక్తివనరుల పరిశోధనలో పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు భారత్, మరో 17 దేశాలు మిషన్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

పారిస్ ప్యాకేజీకి 196 దేశాల గ్రీన్‌సిగ్నల్
వాతావరణ మార్పులపై పోరు దిశగా నాలుగేళ్ల (2011) నుంచి జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. 48 పేజీలతో కూడిన పారిస్ ముసాయిదా ఒప్పందానికి 196 దేశాలు డిసెంబర్ 5న ఆమోదం తెలిపాయి. ఈ ముసాయిదా ఒప్పందంపై ఇక ఆయా దేశాల మంత్రులు చర్చలు జరిపి తుది ఒప్పందాన్ని రూపొందిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మెజారిటీ దేశాలు ‘పర్యావరణ రక్షణ ఉమ్మడి బాధ్యతలో స్థాయి భేదాలు’ అనే అంశంపై ఎటూ తేల్చుకోలేకపోయాయి. ఒకే ఆలోచనా ధోరణి గల అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున మలేసియా; జీ77, చైనా గ్రూప్ తరఫున దక్షిణాఫ్రికా అభిప్రాయాలను వెల్లడించాయి. వాతావరణ మార్పుల ఉపశమన చర్యలు, ఆర్థిక సాయం, అనుసరణ, అంగీకారం, సమీక్ష, శుద్ధ సాంకేతికత పంపకం, సామర్థ్య నిర్మాణం తదితర అంశాల్లో తుది ఒప్పందం అన్ని దేశాలను సమానంగా పరిగణనలోకి తీసుకోవాలని, బాధ్యతల్లో స్థాయీ భేదాలను చూపాలని ఆ రెండు దేశాలు పునరుద్ఘాటించాయి. మొత్తం మీద ముసాయిదా ఒప్పందం రూపకల్పన వరకు జరిగిన చర్చలు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు అనుకూలంగా సాగకుండా అభివృద్ధి చెందిన దేశాలు అడ్డుకున్నాయి. ఉమ్మడి బాధ్యతలో స్థాయీ భేదాలపైన స్పష్టత రాకుండా చేయడంలో కూడా అవి సఫలీకృతమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రుల స్థాయి చర్చలు కీలకంగా మారనున్నాయి. చిన్న దేశాల మంత్రులు ఈ చర్చల్లో పాల్గొనకపోవడం వల్లే కోపెన్‌హాగెన్ సదస్సు (2009) ఫలితం లేకుండా ముగిసింది.


ప్రపంచం World కామన్‌వెల్త్ - చోగమ్

కామన్‌వెల్త్ - చోగమ్

కామన్‌వెల్త్ లేదా కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది ఒకప్పటి బ్రిటిష్ వలస దేశాల కూటమి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం యునెటైడ్ కింగ్‌డమ్(యూకే) రాజధాని లండన్‌లో ఉంది. అధికార భాష ఇంగ్లిష్. కామన్‌వెల్త్ అధిపతి బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి భారత్‌కు చెందిన కమలేశ్ శర్మ. ఆయన 2008 ఏప్రిల్ 1 నుంచి కామన్‌వెల్త్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా కూడా పనిచేశారు. కామన్‌వెల్త్‌లో ప్రస్తుతం 53 సభ్య దేశాలున్నాయి. ఈ దేశాల జనాభా 232 కోట్లు.
53 సభ్యదేశాలు
ఆంటిగ్వా అండ్ బార్బుడా, ఆస్ట్రేలియా, బహమస్, బంగ్లాదేశ్, బార్బడోస్, బెలీజ్, బోట్స్‌వానా, బ్రూనై, కామెరూన్, కెనడా, సైప్రస్, డొమినికా, ఫిజీ, ఘనా, గ్రెనడా, గయానా, భారత్, జమైకా, కెన్యా, కిరిబతి, లెసోథో, మలావి, మలేసియా, మాల్దీవులు, మాల్టా, మారిషస్, మొజాంబిక్, నమీబియా, నౌరు, న్యూజిలాండ్, నైజీరియా, పాకిస్తాన్, పపువా న్యూగినియా, రువాండా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనిడైన్స్, సమోవా, సీషెల్స్, సియర్రా లియోన్, సింగపూర్, సోలోమన్ ఐలాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, స్వాజిలాండ్, టాంజానియా, టోంగా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, తువాలు, ఉగాండా, యునెటైడ్ కింగ్‌డమ్, వనౌటు, జాంబియా.

కామన్‌వెల్త్ దేశాల తొలి అధిపతిగా బ్రిటిష్ రాజు ఆరో జార్జ్ వ్యవహరించారు. ఆయన 1949 ఏప్రిల్ 28 నుంచి 1952 ఫిబ్రవరి 6 వరకు కొనసాగారు. ఆయన మరణానంతరం బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ 1952 ఫిబ్రవరి 6 నుంచి కామన్‌వెల్త్ అధిపతిగా కొనసాగుతున్నారు.

కామన్‌వెల్త్ సెక్రెటేరియట్ లండన్‌లో ఉంది. దీన్ని 1965లో ఏర్పాటు చేశారు. దీనికి అధిపతిగా కామన్‌వెల్త్ సెక్రెటరీ జనరల్ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. ప్రధాన కార్యదర్శి పదవీకాలం నాలుగేళ్లు. ఈ పదవిలో రెండు పర్యాయాలు కొనసాగవచ్చు.

చోగమ్
కామన్‌వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు ప్రతి రెండేళకోసారి జరుగుతుంది. ఈ సదస్సును ‘చోగమ్’ అంటారు. చోగమ్ అంటే కామన్‌వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. (Commonwealth Heads Of Government Meeting). మొదటి చోగమ్ 1971లో సింగపూర్‌లో జరిగింది.

24వ కామన్‌వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సును మాల్టా రాజధాని వలెట్టాలో 2015 నవంబర్ 27న బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ ప్రారంభించారు. ఈ సదస్సు నవంబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు జరిగింది. ఈ సదస్సుకు మాల్టా ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ అధ్యక్షత వహించారు. మనదేశం నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రాతినిధ్యం వహించారు. ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఈ సదస్సుకు హాజరై వాతావరణ మార్పులపై జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు.

మాల్టా చోగమ్‌కు హాజరైన ప్రముఖుల్లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కం టర్‌‌నబుల్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడియు, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నారు.

మాల్టా సదస్సులో ప్రధానంగా వాతావరణ మార్పులు, ఉగ్రవాదంపై చర్చించారు. కామన్‌వెల్త్ కూటమిలోని చిన్న, పేద దేశాలు కర్బన ఉద్గారాలు తగ్గించుకునే చర్యల కోసం ఆర్థిక సహకారం అందక ఇబ్బంది పడుతున్నాయి. ఈ పేద దేశాలకు నిధులు అందించడానికి ఒక వాతావరణ మార్పుల హబ్‌ను ఏర్పాటు చేయాలని కామన్‌వెల్త్ దేశాల నాయకులు నిర్ణయించారు. దీన్నే కామన్‌వెల్త్ క్లైమేట్ ఫైనాన్స్ యాక్సెస్ హబ్ అంటారు. దీన్ని మారిషస్ కేంద్రంగా నెలకొల్పనున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కోవడానికి వచ్చే అయిదేళ్లలో కెనడా 2.65 బిలియన్ డాలర్లను సమకూర్చనున్నట్లు ప్రకటించింది. యు.కె. ప్రభుత్వం విపత్తుల నిర్వహణకు 21 మిలియన్ పౌండ్ల సహాయాన్ని ప్రకటించింది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం 5.5 మిలియన్ల పౌండ్ల సహాయాన్ని కూడా యు.కె. ప్రకటించింది. నూతనంగా నెలకొల్పనున్న వాతావరణ మార్పుల నిధికి ఆస్ట్రేలియా తన వంతుగా ఒక మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భారత్ 25 లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. భూతాపం పెరుగుదలను అదుపులో ఉంచాలని పేర్కొంది. రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ మేరకు ఉష్ణోగ్రతలు తగ్గించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ ప్రకటించింది.

కామన్‌వెల్త్ దేశాధినేతలు అంతర్జాతీయ సహకారంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి ఏ జాతీయతను, మతాన్ని, దేశాన్ని ముడిపెట్టొద్దని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ కామన్‌వెల్త్ దేశాల్లో ఉగ్రవాద నిరోధానికి రూ. 50 లక్షల పౌండ్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మాల్టా కామన్‌వెల్త్ సదస్సును ‘యాడింగ్ గ్లోబల్ వాల్యూ’ అనే అంశంపై నిర్వహించారు.

బ్రిటన్‌లో 25వ చోగమ్
25వ కామన్‌వెల్త్ శిఖరాగ్ర సదస్సు2018లో బ్రిటన్‌లో జరగనుంది. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ సదస్సు 2017లో వనౌటు అనే దేశంలో జరగాల్సి ఉంది. అయితే 2015 మార్చిలో పామ్ అనే తుపాను తాకిడితో ఈ చిన్న పసిఫిక్ దీవి తీవ్రంగా దెబ్బతింది. దీంతో చోగమ్‌ను నిర్వహించలేమని వనౌటు ప్రకటించింది. దీంతో 25వ చోగమ్‌ను నిర్వహించడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. అయితే 2017కు బదులు 2018లో చోగమ్‌ను నిర్వహిస్తామని బ్రిటన్ ప్రకటించింది.

నూతన సెక్రెటరీ జనరల్ ఎన్నిక
మాల్టాలో జరిగిన చోగమ్‌లో కామన్‌వెల్త్ నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. 2015 నవంబర్ 27న జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ న్యాయవాది ప్యాట్రీషియా స్కాట్లాండ్ కామన్‌వెల్త్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆమె కామన్‌వెల్త్‌కు ఆరో సెక్రెటరీ జనరల్‌గా 2016 ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ప్యాట్రిషియా స్కాట్లాండ్ పదవీ విరమణ చేయబోతున్న కమలేశ్ శర్మ స్థానంలో ఎన్నికయ్యారు. ఈమె గతంలో ఉత్తర ఐర్లాండ్, ఇంగ్లండ్, వేల్స్‌కు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఈమెకు యునెటైడ్ కింగ్‌డమ్, డొమినికా దేశాల పౌరసత్వం ఉంది.

కామన్‌వెల్త్ ప్రధాన కార్యదర్శులు
పేరుదేశంపదవీకాలం
ఆర్నాల్డ్ స్మిత్కెనడా1965 జూలై 1- 1975 జూన్ 30
శ్రీదత్ రాంఫాల్గయానా1975 జూలై 1- 1990 జూన్ 30
ఎమెకా అన్యోకునైజీరియా1990 జూలై 1- 2000 మార్చి 31
డాన్ మెకిన్నోన్న్యూజిలాండ్2000 ఏప్రిల్ 1- 2008 మార్చి 31
కమలేశ్ శర్మభారత్2008 ఏప్రిల్ 1- ప్రస్తుత ప్రధాన కార్యదర్శి

చోగమ్ సదస్సులు
సం॥నగరందేశం
1971సింగపూర్సింగపూర్
1973ఒట్టావాకెనడా
1975కింగ్‌స్టన్జమైకా
1977లండన్యునెటైడ్ కింగ్‌డమ్
1979లుసాకాజాంబియా
1981మెల్‌బోర్న్ఆస్ట్రేలియా
1983న్యూఢిల్లీభారత్
1985నస్సావుబహమాస్
1986లండన్యు.కె.
1987వాంకూవర్కెనడా
1989కౌలాలంపూర్మలేషియా
1991హరారేజింబాబ్వే
1993లిమస్సోల్సైప్రస్
1995అక్లాండ్న్యూజిలాండ్
1997ఎడిన్‌బరోయు.కె.
1999డర్బన్దక్షిణాఫ్రికా
2002కూలమ్ఆస్ట్రేలియా
2003అబుజానైజీరియా
2005వలెట్టామాల్టా
2007కంపాలాఉగాండా
2009పోర్ట్ ఆఫ్‌స్పెయిన్ట్రినిడాడ్ అండ్ టొబాగో
2011పెర్త్ఆస్ట్రేలియా
2013కొలంబోశ్రీలంక
2015వలెట్టామాల్టా


ప్రపంచం World ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి

సాంఘిక, ఆర్థిక మండలిలో అంతర్భాగమైన ఈ కమిషన్‌లో 53 సభ్యదేశాలకు మూడేళ్ల పదవీకాలానికి సభ్యత్వముండేది. ప్రతి ఏటా 1/3 వంతు మంది పదవీ విరమణ చేసేవారు. మానవ హక్కుల ప్రోత్సాహం, పరిరక్షణ కార్యకలాపాల నిర్వహణకు ఒక ఉప కమిషన్ పనిచేసేది. కమిషన్ పనితీరు అనేక విమర్శలకు గురవడంతో దాని స్థానంలో 2006 మార్చి 3న మానవ హక్కుల మండలి ఏర్పాటైంది.

నిర్మాణం
యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో 47 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. సర్వప్రతినిధి సభ వీరిని ఎన్నుకుంటుంది. సభ్యదేశాల పదవీకాలం మూడేళ్లు. రెండు పర్యాయాలకు మించి ఎన్నికయ్యేందుకు వీలుండదు. సభ్యదేశాల కేటాయింపు ప్రాంతాల వారీగా ఉంటుంది.
ఆఫ్రికా - 13
ఆసియా - 13
తూర్పు యూరప్ - 6
లాటిన్ అమెరికా, కరేబియన్ - 8
పశ్చిమ యూరప్, ఇతర గ్రూపులు - 7

మానవ హక్కుల మండలి సర్వ ప్రతినిధి సభకు చెందిన ఉపసంస్థ. మానవ హక్కులు దుర్వినియోగం అయిన సభ్యదేశాలను తొలగించేందుకు సర్వప్రతినిధి సభకు అధికారం ఉంది. మానవ హక్కుల మండలి ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. మూడు సంత్సరాలకొకసారి యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలకు పిలుపునిస్తుంది.

విధులు
అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణకు కృషిచేస్తుంది.
మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినపుడు భద్రతామండలి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించవచ్చు.
అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వివాదాలను మానవతా విలువలకు లోబడి మానవ హక్కులను గౌరవించి జాతి, మత, లింగ, వర్ణ భేదాలు చూడకుండా పరిష్కరానికి కృషిచేస్తుంది.


ప్రపంచం World నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO).. 1949, ఏప్రిల్ 4న ఏర్పడింది. ఇది ఒక అంతర ప్రభుత్వ సైనిక కూటమి. ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంపై ఏప్రిల్ 4, 1949లో సంతకాలు జరగడంతో ఈ సైనిక కూటమి తెరపైకి వచ్చింది.

ప్రధాన కార్యాలయం: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్
ప్రధాన ఉద్దేశం: సభ్యదేశాల భద్రత కోసం ఉమ్మడి రక్షణ వ్యవస్థ ఏర్పాటు
ప్రధాన కార్యదర్శి: జెన్స్ స్టోలెన్‌బర్గ్

స్థాపనకు కారణాలు
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐరోపాలో శాంతికి సోవియట్ రష్యా ముప్పుగా మారింది. 1948 నాటి బెర్లిన్ దిగ్బంధం(పశ్చిమ హోదా దేశాల నుంచి బెర్లిన్‌కు రైలు రోడ్డు రవాణాను రష్యా అడ్డుకుంది. ఆ సమయంలో బెర్లిన్ పశ్చిమ ప్రాంతాలు రష్యా నియంత్రణలో ఉండేవి.), కొరియా యుద్ధం- 1950, తూర్పు ఐరోపా దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాల ఏర్పాటు తదితర ఘటనల నేపథ్యంలో... రష్యా బలవంతంగా పశ్చిమ ఐరోపాను కూడా తన అధీనంలోకి తెచ్చుకుంటుందనే ఆందోళన పశ్చిమ దేశాల్లో మొదలైంది. దాంతో రష్యాను దీటుగా ఎదుర్కొనేందుకు నాటోను ఏర్పాటుచేశారు.

సభ్యదేశాలు
నాటోలో మొత్తం 28 సభ్య దేశాలు ఉన్నాయి. బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్‌లాండ్, నార్వే, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, అమెరికా, ఇటలీ, యూకే (స్థాపక దేశాలు) జర్మనీ, టర్కీ, స్పెయిన్, గ్రీస్, పోలెండ్, హంగేరీ, చెక్ రిపబ్లిక్, లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా, బల్గేరియా, రొమేనియా, స్లొవేకియా, అల్బేనియా, స్లొవేనియా, క్రోయేషియా


ప్రపంచం World ఆసియాన్ సదస్సు

ఆసియాన్ సదస్సు

ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) 1967లో ఆగస్ట్ 8న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం జకార్తాలో ఉంది. ఆగ్నేయాసియాలోని పది దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అవి.. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్‌‌స, సింగపూర్, థాయ్‌లాం డ్, బ్రూనై, కంబోడియా, లావోస్, మయన్మార్ (బర్మా), వియత్నాం. ఆసియాన్ సమావే శాలను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. 25వ ఆసియాన్ సదస్సు ఈ నెల 12న మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగింది.

12వ ఆసియాన్ - భారత్ సదస్సు
12వ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య - భారత్ శిఖరాగ్ర సదస్సును నేపిటాలో నవంబర్ 12న నిర్వహించారు. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోడీ, మయన్మార్ అధ్యక్షుడు థేన్‌సేన్, ఆసియాన్‌లో ఇతర దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్నేయాసియాలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత, ఆసియాన్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఈ సదస్సులో ఆయన హిందీలో ప్రసంగించారు. ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధిలో పరస్పర సహకారానికి భారత్‌తో భాగస్వామిగా ఆసియాన్ ఉండాలన్నారు. సముద్ర జలాలు, సరిహద్దులకు సంబంధించి అన్ని దేశాలు, అంతర్జాతీయ నియమ, నిబంధనలను పాటించాలని కోరారు. భారత్ - ఆసియాన్ దేశాల మధ్య ప్రస్తుత వాణిజ్యం 76 బిలియన్ డాలర్లుగా ఉంది. దీన్ని 2015 చివరినాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.


ప్రపంచం World తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)

తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)

ఆసియాన్ వార్షిక సమావేశాల తర్వాత తొమ్మిదో తూర్పు ఆసియా సదస్సు (ఈస్ట్ ఏసియా సమ్మిట్) నవంబర్ 13న మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగింది. 2005, డిసెంబర్‌లో నిర్వహించిన మొదటి సదస్సుకు మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఆతిథ్యమిచ్చింది. ఈ సదస్సులో 18 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. పది ఆసియాన్ దేశాలతోపాటు.. వాటి ఇరుగుపొరుగు దేశాలైన భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్‌ఏ, రష్యాలు కూడా సభ్యులుగా చేరాయి.

తొమ్మిదో తూర్పు ఆసియా సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ భారత్ గతంలో అనుసరించిన లుక్ ఈస్ట్ విధానాన్ని యాక్ట్ ఈస్ట్ విధానంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. లుక్ ఈస్ట్ విధానాన్ని మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ప్రవేశపెట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని మోడీ పేర్కొన్నారు. మతం ముసుగులో ఉగ్రవాదానికి పాల్పడడాన్ని వ్యతిరేకించాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సు ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా ప్రకటన చేసింది.

తూర్పు ఆసియా సదస్సులోపాల్గొన్న దేశాధినేతలు/ప్రభుత్వాధినేతలు
బూనై సుల్తాన్హసనల్ బోల్‌కియా
మయన్మార్ అధ్యక్షుడుథేన్‌సేన్
కంబోడియా ప్రధానిహున్‌సేన్
ఇండోనేషియా అధ్యక్షుడుజోకో విడోడో
లావోస్ ప్రధానిథాంగ్‌షింగ్ థమ్మవాంగ్
మలేషియా ప్రధానినజీబ్ రజాక్
ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడుబెనిగ్నో అక్వినో
సింగపూర్ ప్రధానిలీ సీన్ లూంగ్
థాయ్‌లాండ్ ప్రధానిప్రయుత్ చాన్ వో చా
వియత్నాం ప్రధానిగుయెన్ టాన్ డంగ్
ఆస్ట్రేలియా ప్రధానిటోనీ అబాట్
న్యూజిలాండ్ ప్రధానిజాన్ కీ
చైనా ప్రీమియర్లీ కెకియాంగ్
జపాన్ ప్రధానిషింజో అబే
దక్షిణ కొరియా అధ్యక్షురాలుపార్‌‌క గేన్ హై
భారత్ ప్రధానినరేంద్ర మోడీ
రష్యా ప్రధానిదిమిత్రి మెద్వదేవ్
అమెరికా అధ్యక్షుడుబరాక్ ఒబామా


ప్రపంచం World బిమ్స్‌టెక్.. ఏడు దేశాల స్నేహ సౌరభం!

బిమ్స్‌టెక్.. ఏడు దేశాల స్నేహ సౌరభం!

దక్షిణాసియా, ఆగ్నేయాసియాలలోని ఏడు దేశాలు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ (బిమ్స్‌టెక్). ఇందులో సభ్య దేశాలుగా బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ ఉన్నాయి.

1997, జూన్6న బ్యాంకాక్‌లో జరిగిన ఒక సమావేశంలో మొదట నాలుగు దేశాలు- బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనమిక్ కోఆపరేషన్ (బిస్టెక్) అనే కూటమిగా ఏర్పడ్డాయి. అదే ఏడాది డిసెంబర్‌లో కూటమిలో మయన్మార్ అయిదో సభ్య దేశంగా చేరింది. ఆ తర్వాత ఈ కూటమి పేరును బిమ్‌స్టెక్‌గా మార్చారు. 2003లో నేపాల్, భూటాన్‌లు కూటమిలో చేరాయి.

14 రంగాల్లో స్నేహ హస్తం!
బిమ్‌స్టెక్ దేశాలలో 1.3 బిలియన్ ప్రజలు అంటే ప్రపంచ జనాభాలో 21 శాతం మంది నివసిస్తున్నారు. ఈ దేశాలు 14 ప్రాథమ్య రంగాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి. అవి.. వాణిజ్యం, పెట్టుబడులు; సాంకేతికత; ఇంధనం; రవాణా, కమ్యూనికేషన్లు; పర్యాటకం; మత్య్స పరిశ్రమ; వ్యవసాయం; సాంస్కృతిక సహకారం; పర్యావరణం-విపత్తుల నిర్వహణ; ప్రజారోగ్యం; ప్రజల మధ్య సంబంధాలు; పేదరిక నిర్మూలన; తీవ్రవాద వ్యతిరేకత; వాతావరణ మార్పులు.

మొదటి సదస్సు మయన్మార్‌లో:
బిమ్‌స్టెక్ మొదటి శిఖరాగ్ర సదస్సు 2004లో బ్యాంకాక్‌లో జరగ్గా, రెండో సదస్సును 2008లో ఢిల్లీలో నిర్వహించారు. మూడో శిఖరాగ్ర సదస్సు 2014 మార్చిలో మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగింది. ఈ సమావేశానికి అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ హాజరయ్యారు. ఇందులో సభ్యదేశాలు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణాపై ఉమ్మడిగా పోరాడాలని.. వాణిజ్యం, విద్యుత్తు, పర్యావరణ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాయి.

మూడు ఒప్పందాలు:
మూడో సదస్సులో మూడు ఒప్పందాలు కుదిరాయి. అవి.. 1. బిమ్స్‌టెక్ శాశ్వత సచివాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నెలకొల్పుతారు. 2. భారత్‌లో ‘బిమ్స్‌టెక్ సెంటర్ ఫర్ వెదర్ అండ్ క్లైమేట్’ ఏర్పాటు చేస్తారు. 3. బిమ్స్‌టెక్ కల్చరల్ ఇండస్ట్రీస్ కమిషన్, కల్చరల్ ఇండస్ట్రీస్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేస్తారు. నాలుగో శిఖరాగ్ర సదస్సు నేపాల్‌లోని ఖాట్మండ్‌లో జరుగుతుంది. బిమ్స్‌టెక్ తొలి సెక్రటరీ జనరల్‌గా శ్రీలంకకు చెందిన సుమిత్ నకందలను 2014 మార్చిలో నియమించారు.


ప్రపంచం World జీ-8 దేశాల సదస్సు

జీ-8 దేశాల సదస్సు

పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఎనిమిది దేశాల కూటమిని జీ-8 (గ్రూప్ ఆఫ్ ఎయిట్) దేశాలని పిలుస్తారు. ఈ కూటమి 1975లో ఆరు దేశాలతో ఆవిర్భవించింది. అవి ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, యునెటైడ్ కింగ్‌డమ్, యునెటైడ్ స్టేట్స్. ఈ జీ6 దేశాల మొదటి సదస్సు ఫ్రాన్స్‌లో జరిగింది. ఇది 1976లో కెనడా చేరికతో జీ7గా మారింది. ఈ గ్రూపులో 1998లో రష్యా ఎనిమిదో సభ్య దేశంగా చేరింది. కూటమిలో ఐరోపా యూనియన్ కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. క్రిమియాను తనలో అంతర్భాగం చేసుకున్నందుకుగాను 2014, మార్చి 24న రష్యాను కూటమి నుంచి సస్పెండ్ చేశారు. అందువల్ల ప్రస్తుతానికి ఇది జీ7 కూటమిగా ఉంది.

కూటమి 40వ సదస్సు:
కూటమి 40వ సదస్సు రష్యాలోని సోచి నగరంలో జరగాలి. కానీ, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాను సస్పెండ్ చేయడంతో సదస్సు వేదికను బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు మార్చారు. ఇందులో రష్యా పాల్గొనలేదు కాబట్టి దీన్ని జీ7 సదస్సుగా పరిగణిస్తున్నారు. ఐరోపా యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో ఉంది. ఐరోపా యూనియన్ జీ8/జీ7 సదస్సుకు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.

సదస్సులో పాల్గొన్న నేతలు:
స్టీఫెన్ హార్పర్- కెనడా ప్రధానమంత్రి
ఫ్రాంకోయిస్ హాలండ్- ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఏంజెలా మెర్కల్- జర్మనీ చాన్స్‌లర్
మాటియో రెంజీ- ఇటలీ ప్రధాని
షింజో అబే- జపాన్ ప్రధాని
డేవిడ్ కామెరాన్- బ్రిటిష్ ప్రధాని
బరాక్ ఒబామా- అమెరికా అధ్యక్షుడు
జోస్ మాన్యుల్ బరోసో- ఐరోపా కమిషన్ అధ్యక్షుడు
హెర్మాన్ వాన్ రోంపీ- ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు
ఈ సదస్సులో జీ-7 దేశాల నేతలు.. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని అతిక్రమిస్తున్నందుకు రష్యాను తీవ్రంగా విమర్శించారు. కూటమి 41వ సదస్సు 2015 జూన్‌లో జర్మనీలో జరుగుతుంది.


ప్రపంచం World ముఖ్యమైన దినోత్సవాలు..

ముఖ్యమైన దినోత్సవాలు..

అంతర్జాతీయ దినోత్సవాలు
1. మార్చి 8: ప్రపంచ మహిళా దినోత్సవంగా పాటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ, సాంఘిక రంగాలలో మహిళల విజయాలకు గుర్తింపుగా నిర్వహిస్తారు. జర్మనీకి చెందిన క్లారా జెట్‌కిన్ 1910లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. మొదటి దినోత్సవాన్ని 1911లో మార్చి 19న పాటించారు. 1913 నుంచి మార్చి 8న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి 1975ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది.
2. మార్చి 20: అంతర్జాతీయ సంతోష దినంగా పాటిస్తారు. ఇందుకోసం ఐరాస భూటాన్‌ను ఆదర్శంగా తీసుకొని మార్చి 20ని అంతర్జాతీయ సంతోష దినంగా ప్రకటించింది.
3. ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైంది. అందువల్ల ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్యదినంగా పాటిస్తారు. 2013లో ఈ దినం ముఖ్య ఉద్దేశం.. అధిక రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచడం.
4. మే 31: పొగాకు వ్యతిరేక దినం లేదా ధూమపాన వ్యతిరేక దినంగా మే 31ని పాటిస్తారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఆరు మిలియన్ల ప్రజలు పొగాకు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే రుగ్మతల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ దినాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తోంది.
5. జూన్ 5: ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినంగా నిర్వహిస్తోంది. 1972 నుంచి దీన్ని పాటిస్తున్నారు. పర్యావరణంపై అవగాహనను పెంపొందించడానికి ప్రతి ఏటా నిర్వహిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ఆహార పదార్థాలను వ్యర్థం చేయకపోవడం వంటి అంశాలపై ప్రజలు దృష్టి కేంద్రీకరించాలని ఈ దినాన్ని పాటిస్తారు.
6. జూలై 11: ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం (యూఎన్‌డీపీ) 1989లో ప్రపంచ జనాభా దినాన్ని ప్రకటించింది. ప్రతి ఏటా జూలై 11న నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన కోసం దీన్ని పాటిస్తారు. ప్రస్తుత ప్రపంచ జనాభా 700 కోట్లను దాటింది.
7. సెప్టెంబర్ 8: యునెస్కో సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రకటించింది. మొదటిసారి 1966లో నిర్వహించారు. సమాజానికి, ప్రజలకు అక్షరాస్యత ఆవశ్యకత గురించి తెలియచేయడానికి దీన్ని పాటిస్తారు. 2013 సంవత్సరానికిగానూ ప్రధాన అంశం.. ‘21 వ శతాబ్దానికి అక్షరాస్యతలు’. 2003-2012 దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1990ని అంతర్జాతీయ అక్షరాస్యతా సంవత్సరంగా నిర్దేశించింది.
8. సెప్టెంబర్ 16: ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 16ను అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినం లేదా ఓజోన్ దినంగా ప్రకటించింది. సెప్టెంబర్ 16, 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్‌పై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. దీని ఆధారంగా ఓజోన్ దినాన్ని సెప్టెంబర్ 16న నిర్వహిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఓజోన్ పొర కరిగిపోవడానికి కారణాలైన క్లోరోఫ్లోరో కార్బన్ వంటి హానికారకాలైన రసాయనాలను తగ్గించాలి.
9. అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తారు. 2007 నుంచి ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
10. అక్టోబర్ 16: అక్టోబర్ 16, 1945లో ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ఏర్పాటైంది. అందువల్ల అక్టోబర్ 16ను ప్రపంచ ఆహార దినంగా పాటిస్తారు. ఆహార ఉత్పత్తిని పెంచడం, ఆకలి, పేదరికం, పోషకాహారలోపం వంటి అంశాల గురించి ప్రజలను చైతన్యపరచడం వంటివి ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు.
11. డిసెంబర్ 10: డిసెంబర్ 10, 1948లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ మానవహక్కుల విశ్వవ్యాప్త ప్రకటనను ఆమోదించింది. ఆ కారణంగా డిసెంబర్ 10వ తేదీని ప్రపంచ మానవహక్కుల దినంగా నిర్వహిస్తారు.
వివిధ పోటీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు
1. ప్రపంచ పర్యావరణ దినం?
2. ప్రపంచ ఆరోగ్య దినం?
3. ప్రపంచ వారసత్వ దినం?
4. ప్రపంచ పుస్తక దినం?
5. పత్రికా స్వాతంత్య్ర దినం?
6. మే 21ను ఏ రోజుగా నిర్వహిస్తారు?
7. జాతీయ విద్యాదినం?
8. జాతీయ సైన్‌‌స దినం?
9. ప్రపంచ మానవ హక్కుల దినం?
10. ప్రపంచ తపాలా దినం?
11. అంతర్జాతీయ కుటుంబ దినం?
12. ప్రపంచ జనాభా దినం?
సమాధానాలు: 1. జూన్ 5, 2. ఏప్రిల్ 7, 3. ఏప్రిల్ 18, 4.ఏప్రిల్ 23, 5. మే 3, 6. తీవ్రవాద వ్యతిరేక దినం, 7. నవంబర్ 11, 8. ఫిబ్రవరి 28, 9. డిసెంబర్ 10, 10. అక్టోబర్ 9, 11. మే 15, 12. జూలై 11.

మరికొన్ని అంతర్జాతీయ దినోత్సవాలు
జనవరి 30 ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలనా దినం
ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్‌ల్యాండ్‌‌స డే
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం
మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినం (స్పారో డే)
మార్చి 21 ప్రపంచ అటవీ దినం
మార్చి 21 అంతర్జాతీయ వర్ణ వివక్ష నిర్మూలనా దినం
మార్చి 22 ప్రపంచ నీటి దినం
మార్చి 23 ప్రపంచ వాతావరణ దినం
మార్చి 24 ప్రపంచ క్షయ దినం
మార్చి 27 థియేటర్ దినం
ఏప్రిల్ 17 ప్రపంచ హీమోఫీలియా దినం
ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినం
ఏప్రిల్ 22 ధరిత్రీ దినం
ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక, కాపీరైట్ దినం
ఏప్రిల్ 30 అంతర్జాతీయ జాజ్ దినం
మే 1 అంతర్జాతీయ కార్మిక దినం
మే 3 పత్రికా స్వాతంత్య్ర దినం
మే 8 ప్రపంచ రెడ్‌క్రాస్ దినం
మే 12 అంతర్జాతీయ నర్సుల దినం
మే 15 అంతర్జాతీయ కుటుంబ దినం
మే 17 ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినం
మే 22 జీవ వైవిధ్య దినం
జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినం
జూన్ 26 మాదకద్రవ్యాల వాడకం, అక్రమ రవాణా వ్యతిరేక దినం
జూలై 12 మలాలా దినం
జూలై 18 నెల్సన్ మండేలా దినం
ఆగస్టు 6 హిరోషిమా దినం
ఆగస్టు 9 నాగసాకి దినం
సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతి దినం
సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినం
అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినం
అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినం
అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికా శిశు దినం
అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి దినం
అక్టోబర్ 31 ప్రపంచ పొదుపు దినం
నవంబర్ 14 డయాబెటీస్ దినం
డిసెంబర్ 1 ఎయిడ్స్ దినం
డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినం


ప్రపంచం World ఐక్యరాజ్యసమితి.. అనుబంధ సంస్థలు

ఐక్యరాజ్యసమితి.. అనుబంధ సంస్థలు

దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ ఐక్యరాజ్యసమితి.. దాని అనుబంధ సంస్థలు, అవి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై ప్రశ్నలుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఏర్పాటైన నాటి నుంచి దాని విధులు, దాని ఆధ్వర్యంలోని వివిధ సంస్థలు, వాటి కార్యక్రమాలను బాగా అధ్యయనం చేయాలి.

మొదటి ప్రపంచయుద్ధం (1914-1918) ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి కోసం 1920లో నానాజాతి సమితి ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉండేది. అయితే ఈ సంస్థ రెండో ప్రపంచ యుద్ధాన్ని నిలువరించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాపాడటానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అక్టోబర్ 24, 1945న ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అక్టోబర్ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

యునెటైడ్ నేషన్‌‌స అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్. ఈ పదాన్ని అధికారికంగా తొలిసారి జనవరి 1, 1942న వాడారు. ఆ రోజు అట్లాంటిక్ చార్టర్‌పై 26 దేశాలు సంతకాలు చేశాయి. ఏప్రిల్ 25, 1945న శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)లో సమావేశమైన 50 దేశాలు యునెటైడ్ నేషన్‌‌స చార్టర్‌ను రూపొందించాయి. ఈ 50 దేశాలు జూన్ 26, 1945న చార్టర్‌పై సంతకాలు చేశాయి. ఈ సమావేశానికి హాజరుకాని పోలండ్ అక్టోబర్ 15, 1945న సంతకం చేసి 51వ సభ్యదేశంగా చేరింది. ఈ 51 సభ్యదేశాల్లో భారతదేశం కూడా ఉంది. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో 193 సభ్యదేశాలున్నాయి. జూలై, 2011లో దక్షిణ సూడాన్ 193వ సభ్యదేశంగా చేరింది. ఆఫ్రికాలోని సూడాన్ నుంచి దక్షిణ సూడాన్ జూలై 9, 2011న స్వాతంత్య్రం పొందింది. సెప్టెంబర్, 2002లో స్విట్జర్లాండ్, తూర్పు తైమూర్ దేశాలు 190,

191వ సభ్యదేశాలుగా చేరాయి. 2006, జూన్ 28న మాంటినిగ్రో ఐక్యరాజ్యసమితిలో 192వ సభ్యదేశంగా చేరింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్‌‌కలో ఉంది. ఆరు భాషలను అధికారిక భాషలుగా గుర్తించింది. అవి.. అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఈ సంస్థలో 193 సభ్యదేశాలే కాకుండా పరిశీలక హోదా ఉన్న దేశాలు రెండు ఉన్నాయి. అవి..
వాటికన్, పాలస్తీనా.
ఐక్యరాజ్యసమితి జెండాను అక్టోబర్ 20, 1947న ఆమోదించారు. లేత నీలిరంగుపై రెండు ఆలివ్ కొమ్మల మధ్య ప్రపంచ పటం ఉంటుంది. ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం. ఈ సంస్థ అధికారిక రంగులు తెలుపు, నీలం.

ఐక్యరాజ్యసమితి ప్రధానాంగాలు..
ప్రధానాంగాలు ఆరు ఉన్నాయి. అవి.. సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ), భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్), ఆర్థిక, సాంఘిక మండలి (ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్), ధర్మకర్తృత్వ మండలి (ట్రస్ట్‌షిప్ కౌన్సిల్), అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్‌‌ట ఆఫ్ జస్టిస్), సచివాలయం (సెక్రటేరియట్).
1. సాధారణ సభ: ఐక్యరాజ్యసమితిలోని అన్ని సభ్యదేశాలు దీనిలో సభ్యదేశాలుగా ఉంటాయి. దీన్ని ప్రపంచ పార్లమెంట్‌గా వ్యవహరిస్తారు. ప్రతిదేశం ఐదుగురు సభ్యులను పంపొచ్చు. కానీ ఒక ఓటు మాత్రమే ఉంటుంది. భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశాలను సాధారణ సభ నియమిస్తుంది. ఈ సభ సమావేశాలను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. మొదటి సమావేశం 1946లో జరిగింది. సాధారణ సభ అధ్యక్షుడి పదవీకాలం ఒక ఏడాది. ప్రస్తుత అధ్యక్షుడు ఆంటిగ్వా, బార్బుడాకు చెందిన జాన్ విలియమ్ ఆషే. భారతదేశానికి చెందిన విజయలక్ష్మీ పండిట్ 1953లో సాధారణ సభకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సాధారణ సభ ప్రధాన కార్యాలయం న్యూయార్‌‌కలో ఉంది.
2. భద్రతా మండలి: కేంద్ర కార్యాలయం న్యూయార్‌‌కలో ఉంది. ప్రధాన ఉద్దేశం అంతర్జాతీయ శాంతిభద్రతలు. ఇందులో 15 సభ్యదేశాలు. శాశ్వత సభ్యదేశాలు ఐదు. అవి... యూఎస్‌ఏ, రష్యా, యూకే, ఫ్రాన్‌‌స, చైనా. వీటినే పీ-5 దేశాలు (పర్మనెంట్ ఫైవ్) అని పిలుస్తారు. వీటికి వీటో అధికారముంటుంది. ఏదైనా తీర్మానాన్ని ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్కటి వ్యతిరేకించినా అది రద్దవుతుంది. 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. వీటి పదవీకాలం రెండేళ్లు. ప్రస్తుతమున్న తాత్కాలిక సభ్యదేశాలు.. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అజర్‌బైజాన్, గ్వాటిమాలా, లగ్జెంబర్‌‌గ, మొరాకో, పాకిస్థాన్, రువాండా, దక్షిణ కొరియా, టోగో. వీటిని సాధారణ సభ ఎన్నుకుంటుంది. 2/3 వంతు మెజారిటీతో ఎన్నిక కావాలి.
3. ఆర్థిక, సాంఘిక మండలి: ఇందులో 54 సభ్యదేశాలున్నాయి. కేంద్ర కార్యాలయం న్యూయార్‌‌కలో ఉంది. సభ్యదేశాలను సాధారణ సభ మూడేళ్ల పదవీకాలం కోసం ఎన్నుకొంటుంది. ప్రపంచంలోని ఆర్థిక, సామాజిక అంశాలపై మండలి దృష్టి సారిస్తుంది. అధ్యక్షుని పదవీకాలం ఒక సంవత్సరం. ప్రస్తుత అధ్యక్షుడు నెస్టర్ ఒసోరియో లండనో. ఆయన కొలంబియా దేశస్తుడు. ఇందులో భారతదేశం కూడా ఒక సభ్యదేశం.
4. ధర్మకర్తృత్వ మండలి: వలస రాజ్యాల ప్రయోజనాలను కాపాడటానికి ఇది ఏర్పడింది. పసిఫిక్ మహాసముద్రంలోని పలావు దేశం 1994లో స్వాతంత్య్రం పొందడంతో ఈ మండలి లక్ష్యం పూర్తైది. అందుకే 1994, నవంబర్ 1 నుంచి మండలి తన కార్యకలాపాలను నిలిపేసింది.
5. అంతర్జాతీయ న్యాయస్థానం: దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉంది. సభ్యదేశాల మధ్య వివాదాలను పరిష్కరించడం, సాధారణ సభ, ఇతర అనుబంధ సంస్థలకు న్యాయపరమైన సలహాలను ఇవ్వడం దీని ప్రధాన విధులు. ఇందులో 15 మంది న్యాయమూర్తులుంటారు. వీరిని సాధారణ సభ, భద్రతామండలి ఎన్నుకుంటాయి. వీరి పదవీకాలం తొమ్మిది ఏళ్లు. ప్రతి మూడేళ్లకు ఐదుగురు న్యాయమూర్తులను ఎన్నుకొంటారు. ఏ ఇద్దరు న్యాయమూర్తులు ఒకే దేశానికి చెంది ఉండకూడదు. ప్రస్తుత న్యాయమూర్తుల్లో భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ కూడా ఉన్నారు. ఆయన ఈ పదవిలో 2018 వరకు కొనసాగుతారు. జస్టిస్ దల్వీర్ భండారీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రస్తుత అధ్యక్షుడు స్లోవేకియాకు చెందిన పీటర్ టోమ్కా. ఆయన పదవీకాలం మూడేళ్లు.
6. సచివాలయం: ప్రధాన కార్యాలయం న్యూయార్‌‌కలో ఉంది. ఇది పరిపాలనా మండలి. ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీనికి అధిపతిగా ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ ఉంటారు. భద్రతా మండలి సలహాపై సాధారణ సభ ప్రధాన కార్యదర్శిని నియమిస్తుంది. ఆయన పదవీకాలం ఐదేళ్లు. తిరిగి రెండోసారి ఎన్నికయ్యే అవకాశం ఉంది. జనవరి 1, 2007 నుంచి ఈ పదవిలో దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్ కొనసాగుతున్నారు. ఆయన మొదటి పదవీకాలం డిసెంబర్ 31, 2011న ముగిసినప్పటికీ తిరిగి ఎన్నికయ్యారు. జనవరి 1, 2012 నుంచి రెండో పర్యాయం పదవిలో కొనసాగుతున్నారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారు:
పేరుదేశంకాలం
ట్రిగ్విలీనార్వే1946-52
డాగ్ హామర్ జోల్డ్స్వీడన్1953-61
యు థాంట్మయన్మార్1961-71
కర్‌‌ట వాల్దీమ్ఆస్ట్రియా1972-81
జేవియర్ పెరేజ్ డిక్యులర్పెరూ1982-91
బౌత్రోస్ ఘలీఈజిప్ట్1992-96
కోఫి అన్నన్ఘనా1997-2006
బాన్ కీ మూన్ద. కొరియా2007, జనవరి 1..

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శులలో రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ట్రిగ్విలీ. రెండో ప్రధాన కార్యదర్శి అయిన డాగ్ హామర్ జోల్డ్ సెప్టెంబర్, 1961లో విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన పదవిలో ఉండగా మరణించిన ఏకైక ప్రధాన కార్యదర్శి. హామర్ జోల్డ్‌కు మరణానంతరం 1961లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. కర్‌‌టవాల్దీమ్ 1986 నుంచి 1992 వరకు ఆస్ట్రియా అధ్యక్షుడిగా పనిచేశారు. జేవియర్ పెరేజ్ డిక్యులర్ నవంబర్, 2000 నుంచి జూలై, 2001 వరకు పెరూ ప్రధానిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితికి, అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్‌కు సంయుక్తంగా 2001లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థలు
యూఎన్ ఉమెన్: మహిళల సాధికారత కోసం ఈ సంస్థను 2010లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన పుమ్‌జిల్ లాంబో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్నారు.

ఐరాస శరణార్థుల హైకమిషనర్: 1950లో జెనీవా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటైంది. 1954, 1981ల్లో నోబెల్ శాంతి బహుమతి ఈ సంస్థకు లభించింది. పోర్చుగల్ దేశస్తుడైన ఆంటోనియో గుటెరెస్ ప్రస్తుత హైకమిషనర్. ఐరాస మానవహక్కుల హైకమిషనర్: 1993లో ఏర్పాటైంది. దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతం పిళ్లై ప్రస్తుత హైకమిషనర్.

అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్): 1946లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. 1965లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అమెరికాకు చెందిన ఆంథోని లేక్ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్.

ఐరాస అభివృద్ధి కార్యక్రమం: ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. న్యూజిలాండ్‌కు చెందిన హెలెన్ క్లార్క్ దీనికి కార్యనిర్వహణాధికారి.

ఆహార, వ్యవసాయ సంస్థ: అక్టోబర్ 16, 1945న ఏర్పాటైంది. ఇటలీ రాజధాని రోమ్‌లో దీని కేంద్ర కార్యాలయం ఉంది. అక్టోబర్ 16ను ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తారు. సంస్థ డెరైక్ట్ జనరల్ బ్రెజిల్‌కు చెందిన జోన్ గ్రాజియానో డిసిల్వా.

అంతర్జాతీయ కార్మిక సంస్థ: 1919లో ఏర్పాటైన ఈ సంస్థ మొదట నానాజాతి సమితికి అనుబంధంగా ఉండేది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రధాన కార్యాలయం ఉంది. 185 దేశాలకు సభ్యత్వం ఉంది. 1969లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. బ్రిటన్‌కు చెందిన గై రైడర్ ప్రస్తుత డెరైక్టర్ జనరల్.

అంతర్జాతీయ ద్రవ్యనిధి: ఈ సంస్థ డిసెంబర్ 27, 1945న ఏర్పాటైంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఇందులో 188 దేశాలకు సభ్యత్వం ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టీన్ లగార్డే ఐఎంఎఫ్ ప్రస్తుత మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో): నవంబర్ 16, 1945న ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉంది. బల్గేరియాకు చెందిన ఇరీనా బొకోవా ప్రస్తుత డెరైక్టర్ జనరల్. ఇందులో 195 దేశాలకు సభ్యత్వం ఉంది. నవంబర్, 2011లో పాలస్తీనా చివరి సభ్యదేశంగా చేరింది.

ప్రపంచ బ్యాంక్ గ్రూప్: డిసెంబర్ 27, 1945న ఏర్పాటైంది. 188 సభ్యదేశాలున్నాయి. కొరియన్ అమెరికన్ అయిన జిమ్ యోంగ్ కిమ్ ప్రస్తుత అధ్యక్షుడు. ఇందులో ఐదు సంస్థలున్నాయి. అవి..

ఐబీఆర్‌డీ: ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్; ఐఎఫ్‌సీ: ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్; ఐడీఏ: ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్; ఐసీఎస్‌ఐడీ: ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్; ఎంఐజీఏ: మల్టీలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ.

ప్రపంచ ఆరోగ్య సంస్థ: ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైంది. ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. చైనాకు చెందిన మార్గరెట్ చాన్ ప్రస్తుత డెరైక్టర్ జనరల్. ఈ సంస్థ ప్రపంచ ఆరోగ్య నివేదికను విడుదల చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సర్వేను కూడా నిర్వహిస్తుంది.

ప్రపంచ మేధో సంపత్తి సంస్థ: జూలై 14, 1967న ఏర్పాటైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాన్సిస్ గురే ప్రస్తుత డెరైక్టర్ జనరల్. మొత్తం 186 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది.

ప్రపంచ వాతావరణ సంస్థ: 1950లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. మొత్తం సభ్యదేశాలు 191. మైకేల్ జెరాడ్ ప్రస్తుత సెక్రటరీ జనరల్.

ప్రపంచ పర్యాటక సంస్థ: 1974లో ఏర్పడింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. జోర్డాన్‌కు చెందిన తలేబ్ రిఫాయ్ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ: 1957లో ఏర్పాటైంది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ప్రధాన కార్యాలయం ఉంది. జ పాన్‌కు చెందిన యుకియా అమనో ప్రస్తుత డెరైక్టర్ జనరల్. 2005లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు, అప్పటి డెరైక్టర్ జనరల్ ఈజిప్టుకు చెందిన మహ్మద్ ఎల్ బరాదీకి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ఐరాస గురించి ఏపీపీఎస్సీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..
1. ఐక్యరాజ్యసమితిలో సార్వభౌమ దేశాలు ఎన్ని సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి?
2. ఐక్యరాజ్యసమితి దినం?
3. ఐక్యరాజ్యసమితిలో 193వ సభ్యదేశంగా చేరిన దక్షిణ సూడాన్ ఏ ఖండంలో ఉంది?
4. ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్?
5. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఏ దేశస్తుడు?
6. 2013, ఫిబ్రవరి నుంచి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి?
7. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రారంభమైన సంవత్సరం?
8. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యులు కాగా శాశ్వత సభ్యులు కానివారు ఎందరు?
9. ఐక్యరాజ్యసమితికి పూర్వం ఉన్న శాంతి సంస్థ?
10. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించిన భారతీయ వ్యక్తి ఎవరు?
సమాధానాలు: 1) 193; 2) అక్టోబర్ 24; 3) ఆఫ్రికా; 4) ట్రిగ్విలీ; 5) దక్షిణ కొరియా; 6) అశోక్ కుమార్ ముఖర్జీ; 7) 1945; 8) 10; 9) నానాజాతి సమితి; 10) విజయలక్ష్మీ పండిట్.