Aparnika Reddy Institute of Mathematics & Sciences [AIMS] DARE TO SUCCESS MADE IN INDIA YOUTUBE CHANNEL: JUST TYPE "AIMS DARE TO SUCCESS" OR CLICK https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1 Website: www.aimsdaretosuccess.blogspot.com Gmail: aimsdaretosuccess@gmail.com Telegram Channel: https://t.me/AIMSDARETOSUCCESS It is a Honey to the Students as well as Faculty To get AIMS Q free study material please add my number 9440345996 in your all groups
AIMS DARE TO SUCCESS MADE IN INDIA
Friday, 14 January 2022
Off line Antava Online Antava Baby
మన పల్లెలు మనకు నేర్పిన జీవిత పాఠాలు
😘మన పల్లెలు మనకు నేర్పిన జీవిత పాఠాలు..🥰
😊పొలం గట్లపై నడిపించి, తడబడకుండా నిలదొక్కుకోవటం నేర్పింది.
👉 అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు పాడై పోతే, నష్టాలకు నిలదొక్కుకునే స్థైర్యం నేర్పింది.
🙏వాగు పక్కన నీటి చెలిమలు తీయించి,
శోధించే తత్వం నేర్పింది.
👉సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,
అన్వేషణ నేర్పింది.
👏తుమ్మ ముల్లు, పల్లేరు గాయల గుచ్ఛులతో,
జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.
👏వేరుశనగ కాయ కొట్టించి, సోలెడు పల్లీలు తీయించి, ఐదు పైసల సంపాదన నేర్పింది.
🐂ఆవులతో, 🐃గేదెలతో, 🐓కోళ్లతో స్నేహం🐔 చేయించి,
😘ప్రాణికోటి పై బాధ్యత పెంచింది,
ప్రేమతత్వాన్ని నేర్పింది.
👏రాగడి మట్టితో బండి గిర్రలు చేయించి,
మొక్కజొన్న సొప్ప బండ్లకు తొడిగించి,
పనితనం నేర్పింది.
👉వేలాడే పిచ్చుక గూళ్ళు, చెట్ల కొమ్మల పంగల మధ్య కొంగ గూళ్ళు చూపించి
బొమ్మరిల్లు కట్టించి, చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పింది.🕊️
🙋బతుకమ్మ తంగేడు, గానుగు పూల కోసం,
తెల్లవారుతూనే పొలం బాట పట్టించి,
ఇంటి ఆడబిడ్డల బాధ్యతను నేర్పింది.
🤗పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే,
నల్లాలం ఆకు పసరు పోయించి,
చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది.
👌చెట్టుమీద మామిడికాయ
గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది.
👉నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి, జీవితమంటే బరువు కాదు,
బాధ్యత అని నేర్పింది.
👉బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి,
బాలన్స్ గా బరువు లాగటం నేర్పింది.
😘ఇంటి ముంగిటకు అతిథి దేవతలు
హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,
ఉన్న దాంట్లో కొంత పంచుకునే గుణం నేర్పింది,
👉ఇసుకలో పిట్ట గూళ్ళు కట్టించి,
ఒక ఇంటి వాడివి కావాలి అనే స్పృహను నింపింది.
👏పచ్చపచ్చని నిగనిగలాడే మోదుగాకుల విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే ఒద్దికను నేర్పింది.
😋మోదుగాకులు తెంపించి, ఎండబెట్టించి,
కట్టలు కట్టించి, విస్తరాకులు కుట్టించి,
అతిథులకు ఎంగిలి కాని పాత్రల్లో భోజనం వడ్డించడం నేర్పింది.
😊ఉన్న ఒక్క పిప్పర్మెంట్ ను, అంగీ బట్ట వేసి, కొరికి ముక్కలు చేసి, కాకి ఎంగిలి పేరుతో దోస్తులతో పంచుకోవటం నేర్పింది.
👉ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేగ్గాయలు తెంపే ఓర్పును నేర్పింది.
🤗ఎండా కాలంలో తుమ్మ చెట్ల బంక సేకరణ,
స్వయం సంపాదన ధోరణి నేర్పింది.
💕గోరింటాకు ని తెంపించి, దంచించి, చేతులకు అద్దించి, వికసించడం చూపించింది.
🤗వాయిలి బరిగెలతో, సుతిలి దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ మెళకువలు నేర్పింది.
😘అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయినమ్మా, తాతయ్యా వరుసలతో, ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.
🙏ధైర్యంగా బ్రతికే పాఠాలను నేర్పిన
మా ఊరుకు పల్లెకు మేము జీవితాంతం బుుణపడి ఉంటాం.
😘నేను గ్రామం లో (పల్లెలో) పుట్టి పెరిగాను అని చెప్పటానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా......