AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday, 5 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 5


*🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 05🌎*

*▪డిసెంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 339వ రోజు (లీపు సంవత్సరములో 340వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 26 రోజులు మిగిలినవి.*◾

*🕘సంఘటనలు*🕘

*🌻ఆంధ్ర ప్రదేశ్🌻* 

*🔹1970: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా అవతరణ.*

*🔹1972: ఒంగోలు జిల్లా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.*

*❤జననాలు* ❤

*🌷1782: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (మ.1862).*

*🌷1886: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్ మరియు ఛాయాగ్రహకుడు (మ.1969).*

*🌷1896: స్వామి జ్ఞానానంద, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు మరియు అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969).*

*🌷1901: వాల్ట్ డిస్నీ, అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త (మ.1966).*

*1905: షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982)*

*🌷1940: గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు.*

*🌷1931: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు మరియు సినిమా నటుడు. (మ.2015)జి సైదేశ్వర రావు*

*🌷1958: దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.*

*🍃మరణాలు*🍃

*♦1950: శ్రీ అరబిందో, గురు (జ.1872).*

*♦1995: కాశీనాయన, పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసారు*

*2008: కొమ్మినేని శేషగిరిరావు, సినిమా నటుడు (జ.1939).*

*♦2008: మహ్మద్ ఇస్మాయిల్, ప్రముఖ సాహితీకారుడు (జ.1943).*

*♦2013: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918).*

*♦2016: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ సినిమానటి (జ.1948).*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳 

*🔹అంతర్జాతీయ వాలంటీర్లు దినం.*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

  *❤సుభాషిత వాక్కు*

*"నిన్ను ఒకరు కిందకు లాగుతున్నారంటే*
*వారు నీ కంటే కిందే ఉన్నట్లు*
*అలాంటివారికై ఆలోచన అనవసరం"*

*"To succeed in life, you need two things ignorance and confidence.”*

  *♦మంచి పద్యం*

*స్వల్పకాలముండు సాయము చేసిన*
*త్యాగముండు మహిని తరతరములు*
*ఏది చేయ నీవు ఎంచుకో మానవ*
*వాస్తవంబు వేము వారి మాట*

*🔺భావం*:-

*సహాయము స్వల్పకాలము ఉంటుంది. త్యాగము తరతరాలు నిలిచి పోతుంది. ఏది చేయాలో ఎంచుకో ఓ మనిషి.*

 *🔹నేటి జీ కె:*

*1)ప్రపంచ అబివృద్ది నివేదికకు ప్రచురించేది ఎవరు ?*

*జ: వరల్డ్ బ్యాంక్*

*2) పురా నమూనా రూపకర్త* 

*జ: అబ్దుల్ కలాం* 

*3) ప్రదర్శన ప్రభావం అనే పదాని కలిపించిన వారు ఎవరు?* 

*జ: డ్యుషన్ బేరి* 

 *4)ఈ క్రింది వానిలో రోస్టోవ్ ఆర్థిక అబిరుద్ది దశ లో లేనిది ఏద?*ీ 

*జ: ఆదిమ సమాజం*

*5) 2011 వ ఇయర్ లో మన దేశం లో శిశుమరణాల రేటు యెంత % నమోదు అయింది ?*

*జ :40*

ఈ రోజు జికె 

*1)ఇండీవుడ్ తరుపున ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డ్ గ్రహీత ఎవరు?*

జ) *సినీనటి జయప్రధ*

*2) దేశంలో పౌష్టికాహార లోపాన్ని నియంత్రించేందుకు ఏ మిషన్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది?*

జ) *కేంద్ర పౌష్టికాహార మిషన్(NNM)*
*(నేషనల్ న్యూట్రిషన్ మిషన్)*

*3) ప్రపంచ యూత్ బాక్సింగ్ లో సత్తాచాటిన బాక్సర్లకు  ఆవులు బహుమతి గా ఇవ్వాలని ఏ  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?*

జ) *హర్యానా*

*4) ఆటా (అమెరికన్ తెలుగు అసోసీయేషన్) జీవిన సాఫల్య పురస్కారం అందుకొనున్న సినీ  నటుడు ఎవరు?*

జ) *కృష్ణ*

*5) ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం ఏ  నగరంలో ఉంది?*

జ) *ఢిల్లీ*

*1) ఇటీవల  అమెరికాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం సాధించిన భారతీయురాలు ఎవరు?*

*జ: మీరాబాయి చాను*

*7)  మురికి నీటితో వ్యవసాయం చేస్తున్న దేశాలలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది?*

A: *చైనా*

*8) ఇటీవల ఏ దేశ ప్రముఖుడి ట్విట్టర్ ఖాతా 11నిమిషాలపాటు మాయం  అయ్యింది?*

A: *అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్*

*9) వరల్డ్ ఫుడ్ ఇండియా 2017 సధస్సును ఢిల్లీ లో ఎవరు ప్రారంభించారు?*

A: *భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ*

*10) WEF నివేధిక ప్రకారం భారత్ లో లింగ వ్యత్యాస సూచీలో భారత్ స్థానం ఎంత?*

A: *108*

*మౌర్య సామ్రాజ్యం*

*చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ.322 - 299)*

     చంద్రగుప్తుడు తన ప్రధాన మంత్రి అయిన కౌటిల్యుడి (చాణుక్యుడు) సహాయంతో నందవంశపు చివరి రాజైన ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని క్రీ.పూ.322లో స్థాపించాడు.

» సెల్యుకస్‌నికేటర్ మౌర్య సామ్రాజ్యంపై దాడి చేసి ఓడిపోయి చంద్రగుప్త మౌర్యుడితో సంధి చేసుకున్నాడు.

» తన కూతురిని చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన గ్రీకు రాయబారీగా మెగస్తనీస్‌ని నియమించాడు.

» చంద్రగుప్తుడు సెల్యూకస్ నికేటర్‌కు 500 మేలు జాతి ఏనుగులను బహుకరించాడని మెగస్తనీస్ తన గ్రంథమైన ఇండికాలో పేర్కొన్నాడు. చంద్రగుప్తుడి సామ్రాజ్యం పడమర పర్షియా నుంచి తూర్పున బిహార్ వరకు, దక్షిణాన కర్ణాటక నుంచి తమిళనాడులోని తిరునల్వేలి వరకు విస్తరించినట్లు కౌటిల్యుడి అర్థశాస్త్రం తెలుపుతుంది.

» చంద్రగుప్తుడు చక్కటి పరిపాలనాదక్షుడు

» సామ్రాజ్యాన్ని పటిష్ఠపరచి శాంతి భద్రతలను నెలకొల్పాడు.

» వ్యవసాయాభివృద్ధికి తాగునీటి వసతికై సుదర్శనం అనే తటాకం తవ్వించాడు.

» మొదట హిందూ మతాన్ని ఆచరించినప్పటికీ ఆ తర్వాత జైన మతాన్ని అవలంబించినా, పరమత సహనాన్ని పాటించాడు.

» అవసాన దశలో జైనభిక్షువుగా మారి సల్లేఖన వ్రత (ఉపవాస) దీక్షను ఆచరించి శ్రావణం బెళగోళలో నిర్యాణం చెందాడు.

*బిందుసారుడు* కాలం - క్రీ.పూ. (297 - 273)

» చంద్రగుప్తుడు క్రీ.పూ.297లో తన కుమారుడైన బిందుసారుడుకి రాజ్యాధికారం అప్పగించాడు.

» ఇతడు తండ్రి లాగా సామ్రాజ్యాన్ని స్థిరపరచడమే కాకుండా పశ్చిమాసియా దేశాలతో మంచి దౌత్య సంబంధాలు నెలకొల్పాడు.

» ఇతడి కాలంలో తక్షశిలలో తిరుగుబాటు జరుగగా దాన్ని అతడి కుమారుడైన ఉజ్జయిని యువరాజు అశోకుడు అణచి వేశాడు.

*అశోకుడు: క్రీ.పూ. (273 - 232)*

» క్రీ.పూ.269లో పట్టాభిషిక్తుడయ్యాడు.

» బిందుసారుడి తర్వాత అశోకుడు మౌర్య సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు.

» అశోకుడి సామ్రాజ్యం ఉత్తరంలో అఫ్గానిస్థాన్ నుంచి దక్షిణాన మైసూర్ వరకు, పడమర బెలుచిస్థాన్ నుంచి తూర్పున ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రాంతం వరకు వ్యాపించి ఉంది.

» పక్క రాజ్యమైన కళింగ స్వతంత్ర రాజ్యంగా ఉండటం వల్ల ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక అశోకుడికి అధికంగా ఉండేది.

» కళింగ రాజ్యాన్ని (ప్రస్తుత ఒడిశా ప్రాంతం) ఆక్రమించుకునేందుకు క్రీ.పూ.261వ సంవత్సరంలో అశోకుడు లక్షల సైన్యంతో కళింగ రాజుపై యుద్ధానికి దిగాడు.

» ప్రస్తుత భువనేశ్వర్‌కు దగ్గరలో ఉన్న దౌలీ వద్ద జరిగిన భీకర పోరాటంలో అశోకుడు విజయం సాధించాడు.

» కళింగ రాజ్యంపై జరిగిన పోరులో లక్షల మంది మరణించారు. లక్షా యాభైవేల మంది క్షతగాత్రులయ్యారు.

» వారి కుటుంబాల ఆర్తనాదాలు, ఏరులై పారిన రక్త ప్రవాహం చూసి అశోకుడి మనసు చెలించిపోయింది.

» అశోకుడు యుద్ధం విడిచిపెట్టి, శాంతివైపు పయనించి ఇక ఎప్పుడూ యుద్ధం చేయనని, శాంతి, సత్యం, అహింస, న్యాయం, ధర్మం కలిగిన ధర్మపాలన చేస్తానని ప్రకటించుకున్నాడు.

» ఉపగుప్తుడు అనే బౌద్ధగురువు ద్వారా బౌద్ధమతాన్ని స్వీకరించాడు.

» అశోకుడు ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూశాడు.

» బాటసారుల విశ్రాంతికై ధర్మశాలలు నిర్మించాడు.

» తన తాతాగారు తవ్వించిన సుదర్శనం అనే తటాకం నుంచి కాలువ ద్వారా దూర ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు సరఫరా చేయించాడు.

» ప్రయాణికులకు కష్టం కలుగకుండా మార్గ మధ్యలో బావులు తవ్వించి, రహదారులకు ఇరు వైపులా చెట్లను నాటించాడు.

» అహింసా విధానాన్ని పాటిస్తూ, దాన్ని ఇతరులు ఆచరించేట్లు చేశాడు.

» తాను మాంసాహార భోజనాన్ని, మద్యాన్ని పూర్తిగా వదిలేశాడు.

» అశోకుడి ధర్మపాలన వల్ల అతడికి  *దేవానాం ప్రియా*,  *ప్రియదర్శిని* అనే బిరుదులు ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.

» అశోకుడు ధర్మ ప్రచారం కోసం ప్రత్యేకంగా *ధర్మ మహా మంత్రులనే* ఉద్యోగులను నియమించాడు.

» అశోకుడు గొప్ప నిర్మాత, కాశ్మీరంలో  (ప్రస్తుత కశ్మీర్)  *శ్రీనగరం* అనే నూతన నగరాన్ని నిర్మించాడు. అలాగే పాటలీపుత్రంలో అందమైన అతిపెద్ద రాజ ప్రసాదాన్ని *గంగా - సోన్‌నది సంగమం* వద్ద నిర్మించాడు.

» దీని పొడవు 15 కి.మీ., వెడల్పు 2.50 కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. దీని చుట్టూ కొయ్యలతో ప్రాకారం నిర్మించాడు.

» ఈ ప్రాకారానికి 64 ద్వారాలు, 570 బురుజులు, చుట్టూ 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల లోతు ఉన్న కందకాన్ని తవ్వించినట్లు మెగస్తనీస్ రాసిన ఇండికా, కౌటిల్యుడి అర్థశాస్త్రాల ద్వారా తెలియజేశాడు.

» దీన్ని 27 మంది అధ్యక్షులతో కూడిన ధర్మ సంస్థ నిర్వహించేది.

» అశోకుడు నిర్మించిన సుమారు 84,000 స్తూపాలు ప్రసిద్ధి చెందినవి.

» వీటిపై అందమైన శిల్పాలను చెక్కించాడు.

» ముఖ్యంగా సార్‌నాథ్ స్తూపంపై నిలబడి నలుదిక్కులు పరిశీలిస్తున్న నాలుగు సింహాలు, ఆనాటి శిల్పకళకు గొప్ప ఉదాహరణ.

» ఈ సింహ శిల్పాన్నే మన భారత ప్రభుత్వం రాజ చిహ్నంగా గ్రహించింది. బౌద్ధ ధర్మ చక్రం పోలిన అశోక ధర్మచక్రాన్ని మన జాతీయజెండా మధ్యలో పొందుపరిచారు. అశోకుడు పాటలీపుత్రంలో బౌద్ధ మహాసభ జరిపించి భారతదేశానికి బౌద్ధ ప్రచారకులను పంపించాడు.

» విదేశాల్లో బౌద్ధమత వ్యాప్తికి తన *కుమార్తె సంఘమిత్రను, కుమారుడు మహేంద్రుడిని* పంపించాడు.

» తాను బౌద్ధమతాన్ని అవలంబించినప్పటికీ పరమత సహనాన్ని చూపాడు.

» అన్ని మతాల సారాంశాన్ని క్రోడీకరించి అశోకుడు *ధర్మమతాన్ని* ప్రవేశపెట్టాడు.

» గ్రీకులు, పర్షియన్లతో సమ్మేళనం ఏర్పడటంతో సాహిత్యం, వాస్తుకళ అభివృద్ధి చెందాయి.

» అనేక ఇతర గ్రంథాలు వేర్వేరు భాషల్లోకి అనువాదం జరిగి విజ్ఞానాభివృద్ధి జరిగింది.

» భారతీయ శిల్పకళ కొత్తగా రూపుదిద్దుకుంది.

» అశోకుడి బౌద్ధమత విధానం తన వారసుల్లో లేకపోవడంతో, ఎవరూ సమర్థులైనవారు కాకపోవడంతో అశోకుడి అనంతరం సామంతులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు.

» మౌర్యవంశంలో చివరి రాజైన బృహద్రదుడి, అతడి సైన్యాన్ని పుష్యమిత్రుడు వధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. దీంతో మౌర్యసామ్రాజ్యం పతనం అయ్యింది.

* శాతవాహనులు*.

» మౌర్య సామ్రాజ్యం పతనం అయిన తర్వాత దక్షిణాపథంలో మహోన్నతంగా కొనసాగిన సామ్రాజ్యం ఆంధ్రశాతవాహన రాజ్యం.
» *శాతవాహన* అనే పదం *వంశనామం*గా, *ఆంధ్ర* అనే పదం *జాతినామం*గా వాడుకోవడం వల్ల వారికి ఆంధ్ర శాతవాహనులు అనే పేరు వచ్చింది.
» కృష్ణ, గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతంలో నివసించే ప్రజలను ఆంధ్రులుగా వ్యవహరించేవారు.
» వీరి గురించి ఐతరేయ బ్రాహ్మణంలో, మత్స్యయుగ, వాయు పురాణాల్లో, అశోకుడి శిలా శాసనాలైన నాసిక్, నానాఘాట్, హాతిగుంపా, కిన్హేరిగుహ శాసనాల్లో, కోథారిత్సాగరంలో ప్రస్తావించారు.
» *మెగస్తనీస్, ప్లేని* రచనల నుంచి వీరికి సంబంధించిన సమాచారం లభ్యమైంది. దీన్ని బట్టి ఆంధ్రశాతవాహనుల చరిత్ర చాలా ప్రాచీనమైందని తెలుస్తుంది.
» మగధను పాలిస్తున్న కణ్వ వంశపు చివరి రాజైన సుశర్మని ఓడించి శ్రీముఖ శాతవాహనుడు శాతవాహన రాజ్యాన్ని నెలకొల్పాడు.
» శాతవాహనుల పాలన *క్రీ.పూ.231లో మొదలై క్రీ.శ.225*లో ముగిసిందని చాలా మంది అంగీకరించారు.
» దక్షిణ రాజ్యాలను సంఘటితపరచి, మరికొన్ని ఉత్తరాది ప్రాంతాలను జయించి, మహాసామ్రాజ్య నిర్మాణం చేసి తమ రాజ్యాన్ని విదేశీ దండయాత్రల నుంచి రక్షించిన గొప్పతనం ఆంధ్ర శాతవాహనులదే. శాతవాహనుల రాజధానుల్లో ఒకటి *ప్రతిష్టానపురం (పైలాన్)* కాగా, రెండోది *ధాన్యకటకం (అమరావతి)*.

» శాతవాహన రాజుల్లో శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, పులోమావి, హాలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్ప చక్రవర్తులు.
» *మొదటి శాతకర్ణి* దక్షిణాపథంలో తిరుగులేని పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు. హైదరాబాద్, బీరార్‌ను ఆక్రమించి రెండు సార్లు అశ్వమేథయాగాన్ని, ఒక పర్యాయం రాజసూయయాగం చేసి *దక్షిణాపథ అధిపతి*గా కీర్తిని పొందాడు.
» ఇతడు వేయించిన *నానాఘాట్ శాసనంలో శాతకర్ణి ఘన విజయాల ప్రస్తావన* ఉంది.
» శాతవాహనుల్లో *17వ చక్రవర్తి* అయిన *హాలుడి* కాలంలో *సారస్వత వికాసం* జరిగింది.
» *హాలుడు గాథాసప్తశతి*ని రచించాడు. *శర్వవర్మ కాతంత్రం అనే వ్యాకరణాన్ని* రచించాడు. *గుణాఢ్యుడి బృహత్కథ* అనే గ్రంథాన్ని *ప్రాకృత భాష*లో రచించాడు.
» శాతవాహన రాజుల్లో *23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి*, ఇతడి *తల్లిపేరు గౌతమిబాలశ్రీ*. శాతకర్ణి తన పేరుకు ముందు తల్లిపేరు ఉంచి గౌరవించాడు.
» అతడు అనేక దిగ్విజయ యాత్రలను చేసి శక, యవన, పహ్లావ తదితర రాజవంశాలను నాశనం చేసినట్లు నాసిక్ శాసనంలో ఉంది.
» ఇతడి సామ్రాజ్యం దక్షిణాన కడలూరు, ఉత్తరాన ముఖలింగం వరకు, తూర్పు పడమరలుగా బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు విస్తరించింది

» శాతకర్ణి పరమత సహనం కలవాడని, పరిపాలనాదక్షుడని, పేదవారిని, బలహీనుల్ని ఆదుకున్న అత్యుత్తమ చక్రవర్తిగా పేరుగాంచాడు.
» గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత అతడి కుమారుడు 2వ పులోమావి రాజ్యానికి వచ్చి కృష్ణాలోయలో తన అధికారాన్నినిలుపుకున్నాడు.
శాతవాహనుల పరిపాలన
» శాతవాహనుల కాలంలో వంశపారంపర్య రాజరికం కొనసాగింది. సామ్రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు.
» మహామాత్రుడు అంటే ఆహారాన్ని నిర్వహించే ఉద్యోగి.
» *గ్రామికుడు గ్రామ పాలన*ను నిర్వహించేవాడు.
» ప్రభుత్వానికి *భూమిశిస్తు ప్రధాన ఆదాయంగా* చెప్పవచ్చు.
» రేవులు, వృత్తులు, బాటలపై పన్ను విధించాడు. ప్రభుత్వానికి *పన్నులను ధనరూపంలో* చెల్లించేవారు, *ధాన్య రూపం*లోకూడా చెల్లించే అవకాశం ఉండేది.
» శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ దృఢపడింది. శకులు, యవనులు, పహ్లావులు వంటి విదేశీ తెగలు కాలక్రమంలోహిందూ సమాజంలో కలిసి పోయారు.
» నాటి*స్త్రీలు విద్యావంతులు. వారికి *ఆస్తి హక్కు* ఉండేది.
» చక్రవర్తులు తమ పేర్లకు ముందు తమ తల్లి పేర్లను పెట్టుకునేవారు.

» స్త్రీలు మత సంబంధమైన క్రతువుల్లో, యజ్ఞయాగాల్లో పాల్గొనేవారు. సంఘంలో స్త్రీల స్థానం ఉన్నతంగా ఉండేది.
» శాతవాహనుల కాలంలో హిందూమతం పునఃఉద్ధరించింది. శైవ, వైష్ణవ మతాలకు సమానమైన ఆదరణ లభించింది.
» బౌద్ధమతానికి రాజుల నుంచి ఆర్థిక ప్రోత్సాహం లభించేది.
» శాతవాహన రాజులు బౌద్ధ మతాభిమానులు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, బట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్యపేటలో బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, ఆరామాలను నిర్మించారు.
» శాతవాహన రాజులు, భాషా సారస్వతాలకు ఎనలేని సేవ చేశారు. వారిలో చాలా మంది కవులు, మరికొందరు పండిత పోషకులు.
» ప్రాకృత, సంస్కృత భాషలను పోషించారు.
» ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖ, ఆరోగ్యమంజరి, రసరత్నావళి అనే గ్రంథాలను రచించాడు.
» నాటి ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయం. రేవు, పట్టణాలను వారు అభివృద్ధి చేశారు. పరిశ్రమలు, వృత్తి పనులు అభివృద్ధి చెందాయి.
» నాటి ప్రజలు వెండి, బంగారం, మిశ్రమలోహ నాణాలను ఉపయోగించేవారు.
» శాతవాహనుల ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండేది.
» దేశీయ, విదేశీయ వాణిజ్యం విరివిగా సాగింది
» పైఠాన్ (ప్రతిష్టానపురం), గోవర్థన, ధాన్యకటకం, విజయపురి, నాటి ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు.
» పశ్చిమ తీరంలో భరుకిచ్చం, సోపార, కల్యాణి, తూర్పు తీరంలోని మైసోలియా (మచిలీపట్నం). ఘంటశాల ముఖ్యమైన రేవు పట్టణాలు.
» విదేశాలకు రాగి, చందనం, దంతాలు, పట్టు, నూలు వస్త్రాలు ఎగుమతి చేసి, బంగారం, వెండి లోహాలను దిగుమతి చేసుకునేవారు.