AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 1 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 1


*🌎చరిత్రలో ఈరోజు/నవంబరు 1🌎*

*▪నవంబర్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 305వ రోజు (లీపు సంవత్సరములో306వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 60 రోజులు మిగిలినవి.*

*🕘సంఘటనలు*🕘

*🌷అమెరికా చే 1952 నవంబర్ 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది.*

*🌷1956: బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబర్ 1 వరకు).*

*🌷1956 - ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది.*

*🌷1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.*

*🌷1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.*

*🌷1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగామార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్‌దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు.*

*🌷1983: ఆంధ్ర ప్రదేశ్లో లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు.*

*🌷2000: చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.*

*❤జననాలు❤*

*♦1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ప్రసిద్ధ తెలుగు కవి. (మ.1980)*

*♦1915: వట్టికోట ఆళ్వారుస్వామి, ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. (మ.1961)*

*♦1919: అంట్యాకుల పైడిరాజు, ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (మ.1986)*

*♦1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు.*

*♦1973: ఐశ్వర్యా రాయ్, అందాల తార, ప్రముఖ నటి,*

*♦1974: వి.వి.యెస్.లక్ష్మణ్, ప్రముఖ క్రికెట్ ఆటగాడు.*

*🍃మరణాలు🍃*

*🔺1996: శ్రీలంక మాజీ అధ్యక్షుడు జయవర్థనే.*

*🔺1989: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (జ.1936)*

*🔹పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*

*♦ఆంధ్ర ప్రదేశ్అవతరణ దినోత్సవము.*

*♦కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం.*

*♦గర్వాల్ రైఫిల్ దినం.*

*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻

 *🔹సుభాషిత వాక్కు*

*ఈ రోజుల్లో సంబంధాలు రొట్టె తొ సమానమైనవి*
*ఎందుకంటే కొద్దిగా మంట ఎక్కవైందొలెదో రొట్టె*
*మాడిమసి కావటం ఖాయం*

 *"There is no greater agony than. bearing an untold story inside you."*

   *🔹మంచి పద్యం*
 
*పారు నదులు చెట్లు ఫకముల నిచ్చును*
*పరుల హితము కోరి ప్రాణమిచ్చు*
*సజ్జనులగువారి సహజ గుణములివి*
*వాస్తవంబు వేమువారి మాట*

*🔺భావం*:-

*పారె నదుల, చెట్లు పరుల హితము కోరి ఫలములను ఇచ్చుట వాటి సహజ గుణము. సజ్జనులకు త్యాగ నిరతి వారి సహజ నైజము.*

       *♦నేటి జీ.కె*♦

*🌷ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వ దేశం*

 *సౌదీ అరేబియా*

*🌷అమెరికాను ఎవరు కనుగొన్నారు?*

  *కొలంబస్*

*🌷న్యూఢిల్లీ ముందు భారతదేశం యొక్క రాజధాని?*

  *కొల్ కతా*

*🌷కంప్యూటర్ యొక్క మెదడు అంటారు?*

  *CPU*

*🌷కంటి భాగంలో వస్తువు యొక్క ప్రతిబింబం ?*

  *రెటీనా*

*🌷అగా ఖాన్ కప్ సంబంచినది?*

  *హాకీ*

*🌷షిప్బిల్డింగ్ యార్డ్ - మజౌగావ్ డాక్ ఎక్కడ ఉంది?*

  *ముంబై*

*🌷SAARC యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది?*
  *ఢాకా*

*(మిషన్ కాకతీయ)*

*1) మిషన్ కాకతీయ పథకం టాగ్ లైన్ ఏది ?*

*జ: మన ఊరు – మన చెరువు*

*2) మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలో దాదాపు ఎన్ని చెరువులను పునరుద్ధరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ?*

*జ: 46,531 వేలకు పైగా చెరువులు (2లక్షల కోట్లు )*

*3) మిషన్ కాకతీయ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?*

*జ: 2015 మార్చి 12న*

*4) ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?*

*జ: నిజామాబాద్ జిల్లా సదాశివ నగర్ లోని పాత చెరువులో*

*5) ప్రతి ఏడాది ఎన్ని చెరువులు బాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?*

*జ: 9,306 చెరువులు*

*6) ఒక్కో చెరువు కనీసం ఎంత నీటి సామర్థ్యం కలిగి ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది ?*

*జ: 2 50 – 2 70 టీఎంసీలు*

*7) మిషన్ కాకతీయ పథకానికి ఏయే సంస్థలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి ?*

*జ: నాబార్డ్, ప్రపంచ బ్యాంక్*

*🏹 జనరల్ నాలెడ్జ్ 🎯*

*♦“రాష్ట్ర గుర్తులు”♦*

 *♦రాష్ట్ర భాష    —     తెలుగు*

 *♦రాష్ట్ర గుర్తు    —     పూర్ణకుంభం*

*♦రాష్ట్ర గీతం    —     మా తెలుగు తల్లికి మల్లె పూదండ*

*♦రాష్ట్ర జంతువు — కృష్ణ జింక*

*♦రాష్ట్ర పక్షి       —   పాలపిట్ట*

*♦రాష్ట్ర వృక్షం   —    వేప చెట్టు*

*♦రాష్ట్ర ఆట     —     చెడుగుడు(కబడ్డీ)*

*♦రాష్ట్ర నృత్యం  —    కూచిపూడి*

*♦రాష్ట్ర పుష్పము— కలువ పువ్వు (వాటర్ లిల్లి)*

*🌷ఆంధ్రప్రదేశ్ అవతరణ గూర్చి..*🌷

*★ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని 29రాష్ట్రాల లో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రం లో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో  ఉర్దూ ఉంది.*

*̀ㅁ✧ఈ రాష్ట్రానికి వాయవ్యదిశలో*
*తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు,తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన  తమిళ నాడు రాష్ట్రం,పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.*

*ㅁభారతదేశంలో ఎనిమిదవ అతి పెద్దరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.*

*ㅁరాష్ట్రంలోని ముఖ్యమైన నదులు.. గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా.*

*ㅁఆంధ్ర ప్రదేశ్ 12°37'- 19°54' ఉత్తర*
*అక్షాంశాల మధ్య, 76°46', 84°46'*
*తూర్పు రేఖాం శాల మధ్య వ్యాపించి*
*ఉంది. భారత ప్రామాణిక రేఖాంశ మైన 82°30'తూర్పు రేఖాంశంరాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.*

*ㅁదేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది.*

*♦ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు..*

*●రాష్ట్ర భాష    —     తెలుగు*
*●రాష్ట్ర గుర్తు    —     పూర్ణకుంభం*
*●రాష్ట్ర గీతం    —     మా తెలుగు తల్లికి మల్లె పూదండ*
*●రాష్ట్ర జంతువు — కృష్ణ జింక*
*●రాష్ట్ర పక్షి         —   పాలపిట్ట*
*●రాష్ట్ర వృక్షం      —    వేప చెట్టు*
*●రాష్ట్ర ఆట        —     చెడుగుడు(కబడ్డీ)*
*●రాష్ట్ర నృత్యం    —    కూచిపూడి*
*●రాష్ట్ర పుష్పము — కలువ పువ్వు*

*♦రాష్ట్ర సమాచారం..*

*✧రాజధాని.        : హైదరాబాదు*
*✧అవతరణ.       : నవంబర్ 1,1956*
*✧అధికార బాషలు:తెలుగు - ఉర్దూ*
*✧విస్తీర్ణము.         : 160205 చ.కి.మీ(8వది)*
*✧జనాభా (2011): 49,665,533 (10వది)*
*✧జనసాంద్రత.     : 310/చ.కి.మీ*
*✧జిల్లాలు.            : 13*
*✧పెద్ద నగరము.    : విశాఖపట్నం*

*✧గవర్నరు.          : ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ (E.S.L) నరసింహన్*
*✧ముఖ్యమంత్రి: నారా చంద్రబాబునాయుడు*
*✧శాసనసభ        :175 స్థానాలు*
*✧శాసన మండలి :56 స్థానాలు*
*✧లోక్ సభలో      :25*
*✧రాజ్యసభలో     :11*

*♦చరిత్ర..*

*ㅁ1953 అక్టోబరు1న మద్రాస్ రాష్ట్రం లోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.*

*ㅁరాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్తరాష్ట్రాలు వచ్చాయి.*

*ㅁహైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీనప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది.*

*ㅁఅలా 1956, నవంబర్ 1న అప్పటి హైదరా బాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరి యు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.*

*ㅁమద్రాసు రాజధానిగా ఉండే "ఆంధ్ర రాష్ట్రం కోసం" అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష*
*చేసిమరణించారు.కానీ ,సురేష్ కట్టా కర్నూలును  రాజధానిగా చేసి 1953  అక్టోబరు1న "మద్రాసు రాష్ట్రం"లో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు.*

*ㅁగుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు.  టంగు టూరి ప్రకాశం పంతులు ఆంధ్రరాష్ట్రాని కి మొట్టమొదటి ముఖ్యమంత్రి.*

*ㅁతెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న "హైదరాబాదు రాష్ట్రం"లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది.*

*ㅁఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రం లలో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రము ఐనది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.*

*ㅁ1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువభాగాన్ని  తమిళనాడు కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు.*

*ㅁఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి.తర్వాత, 1970, ఫిబ్రవరి 2న  ప్రకాశం  జిల్లా,1978 ఆగష్టు 12న రంగా రెడ్డి జిల్లా 1979 జూన్1న  విజయనగరం  జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాల య్యాయి.*

*♦రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలు*

*ㅁరాష్ట్రం ఏర్పడిన తర్వాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు.. దానికి పోటీగా సమైక్య ఉద్యమాలు  జరుగుతూ వచ్చాయి.*

*ㅁ2009లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం "తెలంగాణా ఏర్పాటు"  ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం*

*ㅁ2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్*
*కమిటీ 10 జిల్లాలతో సురేష్ కట్టాకూడి న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.*

*ㅁ2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటు ని ఆమోదించారు.*

*ㅁ2014, ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. పిభ్రవరి20న రాజ్యసభ ఆమోదం తెలిపింది.*

*ㅁఉద్యమాల ఫలితంగా.. దాదాపు 58 సం"ల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణా ప్రాంతం సీమాంధ్ర ప్రాంతాలనుండి వీడి, క్రొత్త రాష్ట్రంగా ఏర్పడింది.*

*ㅁతెలంగాణా రాష్ట్రానికి కె.చంద్రశేఖర్ (కేసిర్) ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టగా..*

*ㅁచంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు*
*ㅁహైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది.*

*ㅁఅమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శానికి స్థాపన జరిగింది.*