📖 *చరిత్రలో ఈ రోజు*
👉 *బుధవారం, 24.01.18*
👉 *సంవత్సరములో 24వ రోజు - 4వ వారం*
👉 *ఇంకా 341 రోజులు మిగిలినవి.*
*🍩 ప్రత్యేక దినాలు*
💥 జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు.
🌎 *సంఘటనలు*
🔹1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.
🔹1886 : యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.
🔹1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
🔹1950 : రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం జరిగింది
🔹1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది..
✅ జననాలు
🔸1712: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)
🔸1905: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976)
🔸1924: స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ
🔴 మరణాలు
🔺1920: అమేడియో మొడిగ్లియాని, ఇటాలియన్ కళాకారుడు.
🔺1966: హోమీ జహంగీర్ భాభా, సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త.
🔺1980: ముదిగొండ లింగమూర్తి, అలనాటి ప్రముఖ నటుడు.
🔺1981: కాంచనమాల, అలనాటి అందాల నటి. (జ.1917)
🔺1981: పువ్వాడ శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కవి, పండితులు. (జ.1906)
🔺2005: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. (జ.1958)
🔺2011 : ప్రముఖ సంగీతకారుడు, భారత రత్న గ్రహీత భీమ్‌సేన్ జోషి మరణం. 🙏
[1/24, 07:35] జి కె అడ్మిన్: _*శుభోదయం*_
--------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
-------------------------
" ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు..
మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది. "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
" మోసపోవడం కూడా ఒక పాఠమే..!
మరోసారి మోసపోకుండా ఉండడానికి..!! "
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[1/24, 07:43] జి కె అడ్మిన్: *👉 జనవరి 24*
*💁♀ జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు.*
భారత ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే విధంగా రూపొందించబడిన జాతీయగీతం, గేయంను రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 24న ఆమోదించడం జరిగింది.
మన జాతీయగీతం 'జనగణమన"ను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాళి భాషలో రచించారు. ఈ గీతం భారతదేశ సంసృతిని, నైసర్గిక స్వరూపాన్ని వివరిస్తుంది. దీనిని మొదటిసారిగా 1911 డిసెంబరు 27న కలకత్తా కాంగ్రెసు మహాసభలో ఆలపించడం జరిగింది.
మన జాతీయగేయం అయిన "వందేమాతరం' ను బంకించంద్ర చటర్జీ గారు రచించిన "ఆనంద్ మఠ్” నవల నుండి స్వీకరించడం జరిగింది. ఈ గీతం స్వతంత్ర పోరాటకాలంలో దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. బ్రిటీష్ వాని గుండెల్లో విప్లవనాదమై పేలింది. జాతీయగీతంను, గేయంను ఆలపించడం, జాతీయచిహ్నాలను గౌరవించడం ప్రతీ పౌరుడి ప్రథమ కర్తవ్యం.
~~~~~~~~~~~~~
*💁♂ జనగణమన..భారత జాతీయగీతం గా రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు నేడే..*
🔹నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. 1911లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది.
🔹ఈ గీతానికి సంగీత బాణీ కూడా టాగోరే సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
🔹ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికి నీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లె లో యున్నది.
🔹మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు
🔹దేశ ప్రజల్లో జాతీయ వాదాన్ని పెంపొందించే స్ఫూర్తిదాయక గీతం ‘జనగణ మన’. దీన్ని ఆలపించేటప్పుడు విధిగా కొన్ని నియమ నిబంధనలను మనం పాటించాలి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో దీన్ని ఆలపించాలి. సభలు, సమావేశాలు జరిగినపుడు అందరూ లేచి నిలబడి సామూహికంగా ఆలపించాలి. దీన్ని ఆలపించడం అంటే- కార్యక్రమం ముగింపో లేదా ఆ రోజుకి సమయం ముగిసిందని అనుకోరాదు. దేశ ఔన్నత్యాన్ని మననం చేసుకుని, జాతీయతా భావంతో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తిని నింపుతుంది. మన దేశ భౌగోళిక, సాహిత్య, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తు చేసుకుంటూ దేశం పట్ల గౌరవ భావం నింపుకోవడమే దీని ఉద్దేశం. ఈ ఆశయంతోనే దీన్ని మన జాతీయగీతంగా గుర్తించారు.
🔹జైహింద్..🙏
[1/24, 07:43] జి కె అడ్మిన్: 💁♀ *జాతీయ బాలికా దినోత్సవం*
🙋♀ *బాలికలకు భరోసా*
ఇదిగో జనవరి ఇరవెై నాల్గవ తేదీ!!
జాతీయ బాలికా దినోత్సవం!!
వివక్షతకిక వీడ్కోలు పలికేలా,
వివేకానికి పదును పెట్టేలా,
చిన్నచెల్లికి చేయూతనిచ్చేలా,
చిట్టితల్లికి బతుకునిచ్చేలా — -బాలికా దినోత్సవం!!
మోహం,మోసంలేని పలకరింపులతో…
కామం,కాఠిన్యం లేని కరుణతో…
అఘాయిత్యాలు లేని ఆదరణతో…
బలవన్మరణాల బారినపడకుండా…
బాలికలకు బాసటగా వుండటమే — -బాలికా దినోత్సవం!!!
కొన్ని కన్నీళ్లు, ఇంకొన్ని భౌతికదాడులు, మరికొన్ని గృహ హింసలు!- పెరటితోటలో మల్లెమొగ్గలై విరిసిన బాలికలకు మనం పంచుతున్న ఆస్తులు!! బలపం పట్టాల్సిన బాల్యం గునపం పడితే.. పలక పట్టాల్సిన చేతులు కలప మోస్తే.. బడి కెళ్లాల్సిన ఈడు మడిలో నానితే.. ప్రపంచం కదిలింది!! బాల్యాన్ని కోల్పోతున్న బాలికల తరఫున పోరాటానికి సమాయత్తమైంది. బాలురతో సమానంగా వారికి అన్ని హక్కులూ ఉన్నాయ ని ఉద్ఘాటించింది. ఈ క్రమంలో పురుడుపోసుకున్నదే బాలికా దినోత్సవం.
కాబట్టి నేడు మనం మాట్లాడాల్సింది బాలికల గురించి.. శ్వాసించాల్సింది బాలికల గురించి.. యోచించాల్సింది బాలికల గురించే!
ప్రపంచంలో బాలికలపై అకృత్యాలను నిలువరించేందుకు, బాలికల సంఖ్యను పెంచేందుకు, విద్యాభివృద్ధిని పెంపొందించేందుకు,
👉 ఈ రోజు ఏం చేయాలి?
🔺బాలికల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం.
🔺బాలికలపై వివిధ రీతుల హింసను వివరించి, నిరోధానికి ప్రతిజ్ఞ చేయించడం. స్థానిక సంస్థలు, నేతలు సమాజంలో బాలికల ప్రాముఖ్యంగురించి వివరించడం.
🔺బాలికల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం.
🔺బాలికల విద్యాభివృద్ధి సమాజానికి ఎలా మేలుచేస్తుందో వివరించడం. 🙋♂
[1/24, 07:44] జి కె అడ్మిన్: *నేటి మన టీ వి క్లాస్సెస్*
*తేదీ*:-- *24--01--2018*
*బుధ వారము*
***********************************
*తరగతి*:- *10 వ*
*సబ్జెక్టు*:- *జీవశాస్త్రం*
*విషయం:-* *జైవిక నియమాలు-నివారణ చర్యలు*
*సమయం*:- *10.30 ని,,ల నుండి*
★★★★★★★
*తరగతి*:- *9 వ*
*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*
*విషయం*:- *విపత్తుల నిర్వహణ -I*
*సమయం*:- *11.30ని,,
★★★★★★★
*తరగతి*:- *8 వ*
*సబ్జెక్టు*:- *గణితం*
*విషయం*:- *Laws of Exponents - I*
*సమయం*:- *2.00pm
★★★★★★★
*తరగతి*:- *7 వ*
*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*
*విషయం*:- *రాష్ట్ర శాసనసభ — చట్టాల అమలు - I*
*సమయం*:- *2.45 pm
★★★★★★★
*తరగతి*:- *6 వ*
*సబ్జెక్టు*: *తెలుగు*
*విషయం*:- *వాగ్గేయకారుడు రామదాసు - II*
*సమయం*:- *3.40 pm
★★★★★★★
[1/24, 07:44] జి కె అడ్మిన్: 🌱2018 ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సిన 6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్షలు 2018 ఏప్రియల్ 21వ తేదీకి వాయిదా వేయబడినది 🌱
[1/24, 07:44] జి కె అడ్మిన్: ❇❇❇❇❇❇❇❇❇❇❇
*🗓 నేటి పంచాంగం 🗓*
*తేది : 24, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(నిన్న సాయంత్రం 4 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 11 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(నిన్న ఉదయం 8 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 32 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : వణిజ
వర్జ్యం :
ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు :
(ఈరోజు ఉదయం 6 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 42 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 12 గం॥ 4 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 49 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 12 గం॥ 27 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 11 గం॥ 2 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 26 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 8 గం॥ 13 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 37 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 6 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మీనము

*✍🏼 నేటి కథ ✍🏼*
*ముఖ్యమైన పాఠం*
ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోని బల్లపై కొన్ని వస్తువులను ఉంచి విద్యార్ధుల ముందు నిల్చున్నాడు. క్లాసు మొదలయ్యింది. ఏమీ మాట్లాడకుండా ఉపాధ్యాయుడు ఒక గాజుపాత్రను రాళ్ళతో నింపసాగాడు.
ఆ తరువాత కొన్ని చిన్న చిన్న గులకరాళ్లను తీసుకుని వాటిని ఆ పాత్రలోకి నింపసాగాడు. ఆ గాజుపాత్రను ఊపగానే గులకరాళ్లు పెద్ద రాళ్ళ మధ్యన ఉన్న ఖాళీ స్ధలంలోనికి చేరిపోయాయి. మళ్ళీ ఉపాధ్యాయుడు "ఇప్పుడు ఈ పాత్ర నిడిందా?" అని అడగ్గానే "నిండింది" అనే సమాధానం చెప్పారు విద్యార్ధులు.
ఒక సంచిలో నుంచి కొంత ఇసుకను తీసి పాత్రలో నింపాడు ఉపాధ్యాయుడు. ఆ పాత్ర మిగిలివున్న ఖాళీ స్ధలాన్ని ఆ ఇసుక ఆక్రమించేసింది. మళ్ళీ "పాత్ర నిండిందా?" అని ప్రశ్నిచిన ఉపాధ్యాయుడికి "నిండింది" అనే సమాధానమే ఇచ్చారు విద్యార్ధులు.
"ఇప్పుడు చెప్పండి ఈ గాజుపాత్ర మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది కదా! గమనించారా? పెద్ద రాళ్ళు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు - మన కుటుంబం, ఆరోగ్యం మొదలైనవి. ఈ రెండు అంశాలు ఉంటే మిగతా అంశాలు మన జీవితానికి అవసరం లేదు".
"చిన్న గులకరాళ్ళు మిగతా అంశాలు - మన ఉద్యోగం, వృత్తి, ఇల్లు మొదలైనవి. ఇసుక మిగతా చిన్న చిన్న అంశాలు. మనం ముందుగానే ఇసుకతో గాజుపాత్రను నిలిపినట్లయితే గులకరాళ్ళకు, పెద్ద రాళ్ళకు చోటు ఉండేది కాదు. మన జీవితము అంతే. చిన్న చిన్న సుఖాలు కోసం సమయం, శక్తి వృధా చేసుకుంటే ముఖ్యమైన అంశాలను కోల్పోతాం. మన సంతోషానికి కారణం కాగల అంశాల పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలి. కుటుంబసభ్యులతో ఆడటం, ఇంటి దగ్గర గడపడం... ఇలాంటివి సమయం ఉన్నప్పుడు కోల్పోతే ఆ క్షణాలు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మన జీవిత గమనం అనేది నిర్దేశిత లక్ష్యాలతో, ముఖ్యమైన అంశాలు ప్రాతిపదికను సాగాలి" అని విద్యార్ధులకు వివరించాడు ఉపాధ్యాయుడు. ఒక ముఖ్యమైన పాత్ఠం నేర్చుకున్నామన్న తృప్తితో విద్యార్థులు తరగతి గదిని హోరెత్తించారు.

*✅ తెలుసుకుందాం ✅*
*⭕జ్వరంలోనూ వణుకు ఎందుకలా?*
✳సాధారణంగా జ్వరం వచ్చిన వాళ్ళకి ఒళ్లు కాలిపోతున్నప్పటికీ, విపరీతమైన చలితో వణికిపోతూ దుప్పటి కప్పుకుంటారు కదా...! అసలు అంత వేడిలోనూ, వాళ్ళకి చలి ఎందుకొస్తుంది, దీనికి కారణమేంటి?
ఒక మనిషికి చలి వేస్తుందా, ఉక్కగా ఉందా? అనే విషయాలు ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతకు, వాతావరణ ఉష్ణోగ్రతకు మధ్య ఉన్న తేడాను బట్టి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానంగా ఉంటే ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. శరీర ఉష్ణోగ్రత కన్నా బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే శరీరంలోకి ఆ బయటి ఉష్ణం చేరుకుంటుంది. ఇలాంటి అధిక వేడికి ప్రతిరూపంగా మనకు చెమట పట్టి, శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం అవుతుంది. అలాంటప్పుడే మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపిస్తుంది. శీతాకాలంలో బయటి ఉష్ణోగ్రత కన్నా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే మనం చలి అనే ఫీలింగ్ (భావన)కు లోనవుతాము.
సాధారణ పరిస్థితుల్లో వాతావరణ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటిగ్రేడు ఉంటే, ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెంటిగ్రేడు (98.7 డిగ్రీల ఫారెన్ హీట్) ఉంటుంది. కాబట్టి ఉష్ణశక్తి వినిమయం శరీరం నుంచి బయటికి కానీ, బయటి నుంచి శరీరానికి కానీ పెద్దగా ఉండదు కాబట్టి అంత ఇబ్బందిగా ఉండదు. అయితే జ్వరంతో ఉన్న వ్యక్తి శరీర ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడు (105 డిగ్రీల ఫారెన్ హీట్) వరకు ఉండవచ్చు. అంటే వాతావరణ ఉష్ణోగ్రత కన్నా 4 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి... జ్వరంతో ఉన్న మనిషి శరీరం నుంచి ఆ ఉష్ణశక్తి బయటికి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ మనిషికి చలి వేస్తుంది.
[1/24, 07:45] జి కె అడ్మిన్: ❇❇❇❇❇❇❇❇❇❇❇❇
*📖 మన ఇతిహాసాలు 📓*
*అంబాలిక*
అంబాలిక మహాభారతంలోని పాత్ర. ఆమె విచిత్ర వీర్యుని భార్య. పాండురాజు తల్లి.
అంబాలిక కాశీరాజు కుమార్తె. అంబ, అంబిక ఈమెకు అక్కలు. వీరి వివాహం కోసం కాశీరాజు స్వయంవరం ప్రకటించగా అనేకమంది రాజులు పోటీపడ్డారు, వారందరినీ భీష్ముడు ఓడించి, యువరాణులు ముగ్గురినీ ఎత్తుకు వెళ్ళాడు. అంబ సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను అతడి వద్దకు పంపించేసాడు. అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేసాడు.
విచిత్ర వీర్యుడు క్షయరోగంతో నిస్సంతుగా మరణించాడు. వంశవృద్ధి కోసమని అతడి సత్యవతి తన తొలిపుత్రుడైన వ్యాసుని కోరింది. అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించేందుకు అతడు అంగీకరించాడు.
అంబాలిక వ్యాసుని చూడడంతోనే భయంతో తెల్లబారింది. ఆ కారణాన ఆమెకు, పాండురోగం కారణాన తెల్లబారిపోయిన చర్మంతో పాండురాజు పుట్టాడు.
[1/24, 07:45] జి కె అడ్మిన్: ❇❇❇❇❇❇❇❇❇❇❇
*💎 నేటి ఆణిముత్యం 💎*
పోషకుల మతముఁ గనుఁగొని
భూషింపగ గాని ముదము బొందరు మఱియున్
దోషముల నెంచు చుండును
దోషివయిన మిగులఁ గీడు దోచుఁ గుమారా!
*భావం:*
ఓ కుమారా! నిన్ను పోషించేవారి ఇష్టం తెలుసుకుని మసలుకో. నీవు ఎంత గౌరవించినా అతడు సంతోషించడు. పైపెచ్చు నీ తప్పులనే వెతుకుతూ ఉంటాడు. నీవు చెడ్డవాడివైతే పలు కష్టాలు కలిగిస్తాడు.

*🤘 నేటి సుభాషితం🤘*
*పొదుపు చేయాల్సిన దగ్గర ఖర్చు చేయడం ఎంత తప్పో...ఖర్చు చేయాల్సిన దగ్గర పొదుపు చేయడం అంతే తప్పు.*

*👬 నేటి చిన్నారి గీతం 👬*
*కలిసి పని చేయాలి*
ఒకటికి ఒకటికి అడ్డు
ప్లస్ ఉంటే అది రెండు,
ఒకటి పక్క ఒకటుంటే
అపుడు విలువ పదకొండు...
ఒక్క అంకె కిందున్నా
మరో అంకె పైనున్నా
ఆ విలువలు పరిమితం
కలిసుంటే అపరిమితం...
ఏ ఇంటూ ఏ ఏ స్కేర్
బీ ఇంటూ బీ బీ స్కేర్
ఏ ప్లస్ బీ హోల్ స్కేర్
ఏ స్కేర్ బీ స్కేర్- టూ ఏ బీ అదనం...
వ్యక్తులుగా పని చేస్తే
ఫలితం చాలా స్వల్పం,
కలిసికట్టుగా చేస్తే
మన దేశం మహోదయం.
[1/24, 07:47] జి కె అడ్మిన్: *🔬ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్*
*🛡27న నైతిక, మానవ విలువలు*
-
*📡29న పర్యావరణ విద్య పరీక్ష*
*♦ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,600 కేంద్రాలు ఏర్పాటుచేశామని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించనున్నామని, దీనివల్ల ప్రశ్నాపత్రం లీక్ అయ్యే ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఈ నెల 27 నైతిక, మానవ విలువల పరీక్ష, 29న పర్యావరణ విద్య పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు ఉంటుందని వివరించారు. తమ కళాశాలల్లో విద్యార్థులు హాల్‌టికెట్లు పొందవచ్చని తెలిపారు.*
[1/24, 07:47] జి కె అడ్మిన్: *📚చదువులతో చంపేస్తున్నారు*
*🍥శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు, తెలుగురాష్ర్టాలకు హైకోర్టు నోటీసులు*
*🌀కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలపై విచారణ చేపట్టిన ఉమ్మడి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ కలలను, లక్ష్యాలను పిల్లల ద్వారా సాధించాలనే ప్రయత్నంలో తల్లితండ్రులుఒత్తిడి పెంచుతున్నారని పేర్కొంది. లేత వయస్సులో ఆత్మహత్యలు చేసుకోవాలనే దుస్థితికి తీసుకురావడం దారుణమని వ్యాఖ్యానించింది. కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టడం లేదంటూ తమకు అందిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. మంగళవారం శ్రీచైతన్య, నారాయణ కాలేజీలతోపాటు రెండు తెలుగురాష్ర్టాల ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చేపడుతున్న చర్యలను వివరించాలని ఇరురాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్య, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, బోర్డు కార్యదర్శులు, నిమ్స్, స్విమ్స్ దవాఖానల డైరక్టర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మూడువారాలకు వాయిదావేసింది.*
[1/24, 07:47] జి కె అడ్మిన్: *🔊ఉద్యోగ నైపుణ్యాలకు ప్రాధాన్యం*
*★బాలికల డ్రాపౌట్స్ తగ్గించే చర్యలు*
*🖥డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, అధ్యాపకుల భర్తీకి ప్రణాళికలు*
*◆2024 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించిన కళాశాలల విద్యాశాఖ*
*🔊రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టిపెట్టాలని కళాశాల విద్యాశాఖ భావిస్తున్నది. ఈ మేరకు ఐదేండ్ల దీర్ఘకాల వ్యూహాలతో కళాశాలల విద్యాకమిషనర్ ఆధ్వర్యంలో 2024 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించారు. స్థానిక, ప్రపంచ పరిస్థితులను పరిశీలించి, అందుకు అనుగుణంగా నైపుణ్యాలను తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం అన్ని డిగ్రీ కాలేజీలలో అమలుచేస్తున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)లో సత్వరమే ఉద్యోగం సాధించేందుకు వీలున్న ఒకేషనల్ కోర్సులను కచ్చితంగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. బాలికల డ్రాపౌట్స్‌ను గణనీయంగా తగ్గించడం, బాలికావిద్యను బలోపేతం చేయడం కోసం ప్రయత్నాలను మొదలుపెట్టాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.*
*🌀లింగ సమానత్వాన్ని సాధించే అంశంపై ప్రతి విద్యాసంస్థలో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, అందుకోసం అవగాహన తరగతులు, వర్క్‌షాపులు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో అధ్యాపక ఖాళీలను భర్తీచేయాలని నివేదికలో పేర్కొన్నారు. విద్యార్థులకు బాహ్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే, టీచర్ బోధనా సామర్థ్యాలపై మూల్యాంకనం చేసి, పురోగతిని పరిశీలించాలని సూచించారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో డిగ్రీ విద్యార్థులను ప్రోత్సహించాలని, అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందేలా అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. డిజిటల్ లైబ్రరీలను, ప్రత్యామ్నాయ వనరులను ఏర్పాటు చేయాలని డాక్యుమెంట్‌లో పొందుపరిచినట్లు కళాశాలల విద్య జాయింట్ డైరెక్టర్ ఏ శ్రీరాములు తెలిపారు.*
[1/24, 07:47] జి కె అడ్మిన్: *💰ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు: విద్యాశాఖ*
*🔘ప్రైవేటుపాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచొద్దని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎడ్యుకేషన్ యాక్ట్ 1983 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇష్టానుసారం ఫీజులు పెంచితే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య హెచ్చరించారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే జరిమానాలు వేస్తాం. గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉంది’’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.*
[1/24, 07:47] జి కె అడ్మిన్: *🆕అంగన్‌వాడీ టీచర్లకు కొత్త డ్రెస్‌కోడ్*
*🔶అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో కొత్త రంగు(డ్రెస్‌కోడ్) చీరలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరికీ మూడు చీరల చొప్పున పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ జిల్లాలో ఐదు ప్రాజెక్టుల పరిధిలో 914 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో పని చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు ఈ చీరలను ఇవ్వనున్నారు. ఇప్పటికే వాటిని ప్రాజెక్టు కార్యాలయాలకు పంపించారు. త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి టీచర్లకు అందజేయనున్నట్టు హైదరాబాద్ జిల్లా మహిళా శిశు, వృద్ధుల, వికలాంగులశాఖ వెల్ఫేర్ ఆఫీసర్ సునంద తెలిపారు.*
[1/24, 07:47] జి కె అడ్మిన్: *🛡పిల్లలు చస్తున్నా స్పందించరా?*
▪విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరం
❇తల్లిదండ్రుల ఒత్తిడే ప్రధాన కారణమా?
🔶వాటిని ఆపేందుకు ఏం చేస్తున్నారు?
🔘రెండు రాష్ట్రాలకూ హైకోర్టు నోటీసులు
శ్రీచైతన్య, నారాయణకూ సమన్లు
♦లేఖనే ‘పిల్’గా స్వీకరించిన ధర్మాసనం
📋✒పరీక్షల్లో చూచిరాతలపై సీరియస్
♦కాపీలతో విద్యావ్యవస్థ నాశనమే
♦ప్రోత్సహించే టీచర్లపై కేసు: హైకోర్టు
*🚸కార్పొరేట్ చదువుల ఒత్తిడికి చిత్తవుతూ ఆత్మహత్యలు! మార్కుల కోసం పరీక్షల్లో కాపీలు కొట్టిస్తూ మాయలు! ఈ రెండు పరిణామాలపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మండిపడింది. తల్లిదండ్రుల వైఖరే దీనికి కారణమని వ్యాఖ్యానించింది. విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల్లో కాపీల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఆత్మహత్యలకు సంబంధించి... నారాయణ, శ్రీచైతన్య కాలేజీల డైరెక్టర్లకు కూడా సమన్లు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వాలు స్పందించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన లోక్‌సత్తా ఆందోళన సమితి కో-కన్వీనర్ దాసరి ఇమ్మాన్యుయేల్ రాసిన లేఖనే ఉమ్మడి హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా స్వీకరించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ జరిపింది.*
*💠విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. లక్ష్యం సాధించాలంటూ తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని... అందుకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడింది. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని తెలుగు రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, విద్యా, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంటర్‌మీడియట్ బోర్డు, స్విమ్స్, నిమ్స్‌తోపాటు... శ్రీచైతన్య, నారాయణ కళాశాలలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మూడు వారాలపాటు వాయిదా వేసింది.*
*చూచిరాతతో నాశనం*
*🌀మంచి మార్కులు రావాలని చూచిరాతకు అవకాశం ఇస్తే విద్యావ్యవస్థ నాశనమవుతుందని... ఇలాంటివి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు అభిప్రాయపడింది. ‘‘చదివి రాస్తున్నారా? చూసి రాస్తున్నారా ? ఎలాగైనా 90 శాతం మార్కులు రావాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించింది. జిల్లా విద్యాశాఖాధికారులతోపాటు విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులను చూచిరాతలకు బాధ్యులుగా చేయాలని, అప్పుడే కొంత ఫలితం ఉంటుందని తెలిపింది.*
*🍥చూచిరాత ఎక్కువగా జరుగుతున్న పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు... ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. చూచిరాతను నిలువరించడంతోపాటు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలంటూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ గంగారావులతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. 10వ తరగతి పరీక్షలు నిర్వహించే సమయానికి 1500 సెంటర్లలో 405 సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు*.
*📋📋✒చూచిరాతకు అనుమతించే ఇన్విజిలేటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేస్తామని సర్క్యులర్ జారీచేశామని వివరించారు. కొన్ని సమస్యాత్మక సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది తెలిపారు. విచ్చలవిడిగా చూచిరాత జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. చూచిరాతల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.*
[1/24, 07:47] జి కె అడ్మిన్: *🔊'టీఆర్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్న కోచింగ్ సెంటర్లు'*
*🔘వచ్చేనెల 24 నుంచి జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) వాయిదా పడుతుందని కొన్ని కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర డీఎడ్, టీఆర్టీ అభ్యర్థులు విమర్శించారు. ఇలాంటి ప్రచారం చేసే ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని పలువురు అభ్యర్థులు రామ్మోహన్‌రెడ్డి, శ్రీనునాయక్, శ్రీనివాస్‌యాదవ్, స్వామిరెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, గురుప్రసాద్, మహేష్, బాలరాజు, భాను, మేఘన, నిహారిక శిరీష మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ అసత్య ప్రచారం చేయడం వల్ల ఎన్నో ఏండ్లుగా చదువుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.*
[1/24, 07:48] జి కె అడ్మిన్: *🚆‘సీట్ల’ ఫైలు కదిలింది!*
*🗳ఎన్నికల కమిషన్‌కు పంపిన హోంశాఖ*
*🔵రిజర్వుడు స్థానాలకు ప్రాతిపదికేంటి?*
*🔶2001 జనాభా లెక్కలా.. 2011వా?*
*⚠ఎస్సీలు ఎక్కువున్న చోటే పెంచాలా?*
*🔷ఈసీ అభిప్రాయం కోరిన కేంద్రం*
*⏹ఒకట్రెండు రోజుల్లో జవాబు?తర్వాత మరో 4 శాఖలకూ లేఖలు*
*🔹పునర్విభజనపై కసరత్తు ముమ్మరం*
*🔷తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి పురోగతి కనబడుతోంది. తాజాగా కేంద్ర హోం శాఖ కొంత సమాచారం కోరుతూ ఎన్నికల కమిషన్‌కు తాజాగా ఫైలు పంపింది. నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ఈసీ తన అభిప్రాయం చెప్పాలని అందులో కోరింది. ఈ రిజర్వేషన్లను 2001 జనగణన లేదా 2011 జనాభా లెక్కల్లో దేని ప్రాతిపదికన చేయాలన్న దానిపై కొంత వివాదం నెలకొంది. 2001 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని 2008లో నియోజకవర్గాలను పునర్‌వ్యవస్థీకరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తమ రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ సీట్లు పెంచాలని కోరుతూ మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.*
*🔺2008 పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2026 వరకూ నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పుచేర్పులకు అవకాశం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి మారింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఆ తర్వాత ఆమోదించింది. ఈ రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు 2008 నాటి చట్టంలోని నిబంధనలే వర్తిస్తాయా లేక 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది కేంద్ర హోంశాఖ ముందున్న సమస్య. దీనిపైనే హోంశాఖ ఈసీ అభిప్రాయం కోరింది. మరో అంశం కూడా తేలాల్సి ఉంది. పోయినసారి నియోజకవర్గాలను పునర్విభజించినప్పుడు ఎస్సీ నియోజకవర్గాలను రాష్ట్రమంతా విస్తరింపజేశారు. వారి జనాభా ఎక్కువ ఉన్నచోట మాత్రమే ఇస్తే రిజర్వుడు నియోజకవర్గాలన్నీ ఒకేచోట వస్తున్నాయని.. అది సరికాదనే అభిప్రాయంతో ఇలా చేశారు.*
*💢అప్పటి చట్టం దాని కి అనుమతించింది. ఇప్పుడు కూడా దానినే పరిగణనలోకి తీసుకోవాలా అన్నది మీమాంస. దీనిపైన ఈసీ తన అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది. ఈ అభిప్రాయాల వెల్లడికి ఎన్నికల కమిషన్ ఎక్కువ సమయం తీసుకోదని, ఒకట్రెండు రోజుల్లోనే తెలియజేస్తుందని హోంశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ తర్వాత మరో 4 శాఖలకు కూడా హోం శాఖ ఇటువంటి లేఖలు రాయాల్సి ఉంది. వాటికి కూడా సమాధానాలు వచ్చాక అన్నిటినీ కలిపి తుది ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. వాటిని పీఎంవో ఆమోదించాక దీనిని మంత్రివర్గ సమావేశం ముందు పెడతారు. కేబినెట్ ఆమోదంతో అది పార్లమెంటు ముందుకు వెళ్తుంది. అంతిమంగా రాజకీయ నిర్ణయమే కీలకమని హోం శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయ నిర్ణయం తరువాత రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయని ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు.*
[1/24, 07:48] జి కె అడ్మిన్: *1⃣0⃣0⃣వంద మున్సిపాలిటీలు!*
*👀మొదలైన స్పెషలాఫీసర్ల అన్వేషణ*
*📝వారం రోజుల్లో నివేదిక*
*♦కొత్తపంచాయతీరాజ్‌చట్టానికిముందే ప్రక్రియ పూర్తి దాదాపు 130 గ్రామాలను కొత్త మున్సిపాలిటీలల్లో విలీనం చేయనుంది.*
*🌀అందుకు 15వేల జనాభా మించిన నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలను మున్సిపాలిటీలుగా ప్రకటించనున్నట్టు తెలిసింది.*
*🌼రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వందకు పెరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు కలుపుకుని 73 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా మరో 26 మున్సిపాలిటీలు పెరగనున్నాయి.*
*♻కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు ఒకరి చొప్పున స్పెషలాఫీసర్లను నియమించినట్టు సమాచారం. స్థానిక పరిస్థితులను పరిశీలించడంతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి నివేదిక రూపొందిస్తారు. ఇప్పటికే కొత్త మున్సిపాలిటీల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ప్రభుత్వానికి వారం రోజుల్లో నివేదిక సమర్పించ నున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 26 మున్సిపాలిటీలను గుర్తించి, మొత్తంగా రౌండ్ ఫిిగర్ వంద చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే కొత్త పంచాయతీరాజ్ చట్టం నుంచి మున్సిపాలిటీలుగా ప్రకటించే గ్రామాలను మినహాయిం చేందుకు ఈ ప్రక్రియను వేగం చేస్తున్నది. అందుకే ఒకవైపు కొత్త చట్టానికి తుది మెరుగులు దిద్దుతూనే...మరోవైపు మున్సిపాలిటీలను ప్రకటించడానికి ప్రయత్నిస్తోంది. అర్బనైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువగా వస్తాయనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. బండ్లగూడ, మణికొండ, బాజ్‌పల్లి, నిజాంపేట్, భూత్ఫుర్, అమరచింత, అమీస్తాన్‌పూర్, చౌటుప్పల్, చేర్యాల, తొర్రూర్ తూఫ్రాన్, నర్సాపూర్, రామాయంపేట వంటి గ్రామాలు పరిశీలనలో ఉన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 40 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. అయితే ప్రస్తుతం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ఉన్న అవకాశాలు మాత్రం 30 వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త మున్సిపాలిటీలు ప్రకటించేందుకు కొన్ని విధి విధానాలు రూపొందించింది. ఆ గ్రామం పరిధిలో వ్యవసాయం కరువై, ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిపోవడం, ఒకటి లేదా రెండు కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను కూడా విలీనం చేయనున్నారు. మున్సిపాలిటీలుగా ప్రకటించడం ద్వారా మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడం, టౌన్‌ప్లానింగ్ చేయడం, పౌరులకు సకల సదుపాయాలు కల్పించడం, కొత్త మున్సిపాలిటీలలో గ్రామాలు విలీనం చేస్తే తమపై తీవ్రమైన పన్ను భారం పడుతుందని, పచ్చని పొలాలు బీళ్లుగా మారుతాయని రైతన్న ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రజల్లో దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను సిద్ధం చేస్తున్నది. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధి పెంచాలని మరో ప్రతిపాదన కూడా ఉన్నది. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న గ్రామాలను గ్రేటర్‌లో కలపాలని భావిస్తోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధి ఓఆర్‌ఆర్ వరకు విస్తరించనుంది. కాగా, పంచాయతీలను మున్సిపాలిటీల్లో చేర్చితే స్థానిక జనంపై మరిన్ని భారాలు పెరిగే అవకాశాలున్నాయని ప్రజా సంఘాలు అంటున్నాయి.*
[1/24, 07:48] జి కె అడ్మిన్: *💠తెలంగాణ ఎంసెట్ తేదీల్లో మార్పులు!*
*🔊మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్..*
*🔹4 నుంచి 6 వరకు ఇంజినీరింగ్..*
*🌀‘నీట్’ ప్రకటనతో ‘మండలి’ పునరాలోచన*
*🔹తెలంగాణ ఎంసెట్ తేదీల్లో మార్పులుచోటుచేసుకోనున్నాయి.*
*♻తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అగ్రికల్చర్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. తొలుత నిర్ణయించిన ప్రకారం ఇంజినీరింగ్‌కు మే 2, 3, 4 తేదీల్లో, అగ్రికల్చర్‌కు 5, 6 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ‘నీట్’ను మే 6న నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించిందనే వార్తల నేపథ్యంలో బైపీసీ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్‌కు, 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్‌కు ప్రవేశపరీక్షలు జరపవచ్చని తెలుస్తోంది. తెలంగాణ నుంచి నీట్‌కు దాదాపు 60 వేల మంది, ఎంసెట్ అగ్రికల్చర్‌కు 90 వేల మంది హాజరవుతారు. నీట్ రాసే విద్యార్థుల్లో అత్యధికులు ఎంసెట్ రాస్తారు. దీనిపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డిని వివరణ కోరగా...విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పలు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నామన్నారు.*
*🔺ఎంసెట్‌ను మే 6వ తేదీ లోపు నిర్వహిస్తామని ప్రకటించినా ముందు జాగ్రత్తగా మే 7వ తేదీని కూడా అందుబాటులో ఉంచుకున్నామని తెలిపారు. తెలంగాణలో నీట్‌ను హైదరాబాద్, వరంగల్ నగరాల్లో నిర్వహిస్తారు. ఎంసెట్‌ను అన్ని పాత జిల్లా కేంద్రాల్లో జరుపుతారు. వరుసగా రెండు రోజులు పరీక్ష రాయాలంటే ఇబ్బంది ఎదురవుతుందని కొందరు చెబుతూ ఉండటంతో.. ఉత్తమ ప్రత్యామ్నాయంగా ముందుగా అగ్రికల్చర్ పరీక్షతో ప్రారంభించాలనే ఆలోచన ఉందన్నారు. దీనిపై చర్చించి త్వరలోనే అధికారిక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.*
[1/24, 07:48] జి కె అడ్మిన్: *♦మార్కులపై తల్లిదండ్రులది విపరీత ధోరణి*
*♦చూచిరాతకు తావిస్తే విద్యావ్యవస్థను నాశనం చేసినట్లే*
ఈనాడు
*🛡ప్రోత్సహించేఉపాధ్యాయులపై చర్యలుంటేనే మార్పు ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యలు*
*⚠చదివి రాస్తున్నారా? కాపీ కొట్టి రాస్తున్నారా? అన్నదానితో సంబంధం లేకుండా 90 శాతం మార్కులు రావాల్సిందేనంటూ తల్లిదండ్రులు విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. సాధించాల్సిన విజ్ఞానం కంటే మార్కులే ప్రాతిపదికగా భావిస్తున్నారంది. మార్కుల కోసం చూచిరాతలకు తావిస్తే విద్యా వ్యవస్థను నాశనం చేసినట్లేనని వ్యాఖ్యానించింది. కాపీని ప్రోత్సహిస్తున్న, అవకాశం కల్పిస్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. కేసులు నమోదు చేయడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటే పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాధికారులతోపాటు ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులనూ బాధ్యులను చేస్తే కొంత మేర ఫలితాలను రాబట్టవచ్చంది.*
*🔶చూచిరాతలు ఎక్కువగా జరుగుతున్న పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు వాటిని ప్రోత్సహించే వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచ్చలవిడిగా కొనసాగుతున్న చూచిరాతలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గుంటుపల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. 10వ తరగతి పరీక్షలనాటికి 1500 పరీక్షా కేంద్రాలకుగాను 405 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కాపీకి అనుమతిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేస్తామని, ఈ వివరాలతో ఇన్విజిలేటర్లకు సర్క్యులర్లు జారీ చేస్తామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుతో సమస్య పరిష్కారం కాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుందని, చూచిరాతలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంచేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.*
[1/24, 07:48] జి కె అడ్మిన్: *➡వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలుగు’ చట్టం!*
*♻చట్టం ఉంటేనే తప్పనిసరిగా అమలవుతుంది*
*📝ఆచార్య సత్యనారాయణ కమిటీ తుది నివేదిక అందజేత*
*🔊తెలంగాణలో 1 నుంచి 12వ తరగతి వరకు అన్ని రకాల పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరిగా అమలు చేయాలంటే చట్టం చేయాల్సిందేనని కమిటీ తేల్చి చెప్పింది. తెలుగు అమలుపై తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌వీ సత్యనారాయణ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం.. ప్రపంచ తెలుగు మహాసభలకు ముందు కమిటీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి మధ్యంతర నివేదిక అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం మరోసారి సమావేశమై చర్చించిన కమిటీ మధ్యంతర నివేదికకు కొన్ని సవరణలు, వివరాలు చేర్చి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్యకు తుది నివేదికను అందజేసింది.*
*🍥దాదాపు మూడు గంటలపాటు ఆమెతో చర్చించింది. తెలుగు తప్పనిసరిగా అమలు చేయాలంటే చట్టం చేయాల్సిందేనని సృష్టంచేసింది. జీఓ జారీ చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని, అందువల్ల చట్టం చేయడం తప్పనిసరిని పేర్కొంది. ఈ క్రమంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేయాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. సమావేశంలో కమిటీ కన్వీనర్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్, ఇతర సభ్యులు కిషన్, దేవులపల్లి ప్రభాకర్‌రావు, సత్యనారాయణరెడ్డి, శేషుకుమారి, వినాయక్ తదితరులు పాల్గొన్నారు.*
[1/24, 07:48] జి కె అడ్మిన్: *📣ప్రభుత్వ పాఠశాలల పనితీరు అద్భుతం*
*❇ప్రశంసించిన నేపాల్ ప్రతినిధి బృందం*
*మండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ పాతూరితో భేటీ*
*🏦రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని నేపాల్ బృందం ప్రశంసించింది. నేపాల్ దేశానికి చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన బృందం ఈ నెల 21 నుంచి 25 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నది. బృందం సభ్యులు మంగళవారం శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్, మండలిలోప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తమ అనుభవాలను, పరిశీలించిన విషయాలను వెల్లడించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో త్వరితగతిన అభివృద్ధి ఫలాలు దక్కాలన్న తపన ప్రజల్లో ఉండటాన్ని గమనించామని వారు తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు రూపుమాపడానికి ఇక్కడి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు త్వరగా నెరవేరాలని ఆస్మాన్ నేపాల్ స్వచ్ఛంద సంస్థ బృందం నాయకురాలు రాధా కోయిరాలా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవల్‌కిశోర్‌యాదవ్ ఆకాంక్షించారు.*
*🔶ఇక్కడ తాము గమనించిన విషయాలను నేపాల్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా తెలంగాణ తరహాలో విద్యావ్యవస్థ పటిష్ఠతకు కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతామన్నారు. మండలి చైర్మన్ కే స్వామిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్యవివాహాలను పూర్తిగా తగ్గిస్తామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఇందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. శాసనమండలి జరుగుతున్న తీరును, వివిధ అంశాలపై సభలో జరుగుతున్న చర్చలను వారికి వివరించారు. ఈ భేటీలో విప్ బీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ ఉన్నారు. మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నేపాల్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలించిందని చెప్పారు. నేపాల్ -తెలంగాణల మధ్య విద్యతో సహా అన్నిరంగాల్లో సహాయ సహకారాలు పెరుగాల్సిన అవసరం ఉందన్నారు. నేపాల్ ప్రతినిధి బృందంలో కమ్లాబిస్తా, దిలీప్‌కుమార్‌యాదవ్, శ్వేతశ్రేష్ఠ, సునీల్‌కుమార్‌యాదవ్, దీపక్‌దల్హాల్ ఉన్నారు. పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన రిపూ దమన్‌సింగ్ అధికారుల బృందం సైతం గురుకులాలను పరిశీలించి ప్రశంసలు కురిపించింది.*
[1/24, 07:48] జి కె అడ్మిన్: *📲స్కూళ్లకు కాల్ సెంటర్*
*☎విద్యాశాఖ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవా..? వాటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారా? ఇకపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు.. సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులు విద్యార్థులకు అండగా నిలవనున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బాలికలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.*
*☎కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలోని బాలికల హాస్టళ్లతోపాటు విద్యాశాఖ గురుకులాల్లోని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 706 హాస్టల్ వసతిగల విద్యా సంస్థల్లో ప్రత్యేక ఫోన్ సదుపాయాన్ని విద్యాశాఖ త్వరలోనే అందుబాటులోకి తేనుంది. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా విద్యా సంస్థల్లోని దాదాపు లక్ష మంది బాలికలకు భరోసా కల్పించనుంది*.
*📱వినడమే కాదు.. పరిష్కారంపైనా చర్యలు*
*☎రాష్ట్రంలోని 485 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), 192 మోడల్ స్కూళ్లు, మరో 29 గురుకుల పాఠశాలల్లో దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హాస్టళ్లలోనే దాదాపు లక్ష మంది బాలికలు ఉన్నారు. వారంతా తమ హాస్టళ్లు, స్కూళ్లలో ఎదుర్కొనే ఎలాంటి సమస్యలైనా సరే ఫిర్యాదు చేసే అవకాశాన్ని విద్యాశాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులు చేసే ప్రతి ఫిర్యాదును రికార్డు చేసి అవి పరిష్కారమయ్యే వరకు నిరంతర సమీక్ష నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఆయా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే ఫోన్‌ను పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కాల్ సెంటర్‌కు అనుసంధానించనుంది.*
*📱విద్యార్థి హాస్టల్‌లోని ఫోన్ రిసీవర్ తీసుకోగానే ఆ ఫోన్ నేరుగా కాల్ సెంటర్‌కు మాత్రమే వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తోంది. కాల్ సెంటర్ సిబ్బంది కాల్ రిసీవ్ చేసుకోవడమే కాదు.. దాన్ని సంబంధిత సెక్షన్ అధికారి, సంబంధిత విభాగం ఉన్నతాధికారికి, జిల్లా డీఈవోకు, పాఠశాల ప్రిన్సిపాల్‌కు, పాఠశాల విద్యా డైరెక్టర్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నారు. మెసేజ్ రూపంలో వచ్చిన సమస్య పరిష్కారమైందా లేదా అన్నది అందులో అప్‌డేట్ చేస్తారు. ఆ తరువాత కాల్ సెంటర్ సిబ్బంది సమస్యల పరిష్కారంపై ర్యాండమ్‌గా విద్యార్థులకు ఫోన్ చేసి తెలుసుకొని నివేదికను డైరెక్టర్‌కు అందజేస్తారు. మరోవైపు విద్యార్థులు చేసే ఫిర్యాదులు రికార్డు అయ్యేలా కసరత్తు చేస్తున్నారు.*
*📞కాల్ సెంటర్, ఎమర్జెన్సీ నంబర్లకే ఫోన్..*
*☎పాఠశాలల్లో ఏర్పాటు చేసే ఫోన్ నుంచి కాల్ సెంటర్‌కు, పోలీసు, ఆసుపత్రి, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఫోన్ వెళ్లే సదుపాయం అందుబాటులో ఉంచేలా ప్రోగ్రాం రూపొందిస్తున్నారు. దానివల్ల విద్యార్థులు ఫోన్‌ను తమ సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్‌సెంటర్ సదుపాయాన్ని జూన్ నుంచి అమల్లోకి తెచ్చేలా చర్యలు వేగవంతం చేసింది. పాఠశాలల వేళలు మినహా మిగతా సమయాల్లో కాల్ సెంటర్ పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ సెంటర్ వేళలు ఉంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.*
[1/24, 07:48] జి కె అడ్మిన్: *🇮🇳జనవరి 24*
*🌼 జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు.*

*జనగణమన..భారత జాతీయగీతం గా రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు నేడే..*
నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. 1911లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది.
ఈ గీతానికి సంగీత బాణీ కూడా టాగోరే సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికి నీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లె లో యున్నది.
మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు
దేశ ప్రజల్లో జాతీయ వాదాన్ని పెంపొందించే స్ఫూర్తిదాయక గీతం ‘జనగణ మన’. దీన్ని ఆలపించేటప్పుడు విధిగా కొన్ని నియమ నిబంధనలను మనం పాటించాలి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో దీన్ని ఆలపించాలి. సభలు, సమావేశాలు జరిగినపుడు అందరూ లేచి నిలబడి సామూహికంగా ఆలపించాలి.
దీన్ని ఆలపించడం అంటే- కార్యక్రమం ముగింపో లేదా ఆ రోజుకి సమయం ముగిసిందని అనుకోరాదు. దేశ ఔన్నత్యాన్ని మననం చేసుకుని, జాతీయతా భావంతో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తిని నింపుతుంది. మన దేశ భౌగోళిక, సాహిత్య, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తు చేసుకుంటూ దేశం పట్ల గౌరవ భావం నింపుకోవడమే దీని ఉద్దేశం. ఈ ఆశయంతోనే దీన్ని మన జాతీయగీతంగా గుర్తించారు.
జైహింద్..
[1/24, 07:50] జి కె అడ్మిన్: *✍కరెంటు అఫైర్స్....*
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ప్రఖ్యాత టైర్ల ఉత్పత్తుల సంస్థ ‘సియట్’ జత కట్టింది.ఈ సంస్థకు అంబాసిడర్‌గా ఎంపికై న హర్మన్... ఇక ముందు తన బ్యాట్‌పై సియట్ లోగోను ప్రదర్శిస్తుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానేలతో ప్రస్తుతం ఒప్పందం కొనసాగిస్తున్న సియట్ ఒక మహిళా క్రికెటర్ బ్యాట్‌కు ఎండార్స్ చేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది హర్మన్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల అద్భుత ఇన్నింగ్‌స ఆడింది. మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో ఆడిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
భారత్ 2018లో 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది.చైనా వృద్ధి రేటు 6.8 శాతంగానే ఉంటుందని, తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా 2018లో భారతదేశమే ముందుంటుందని తన తాజా నివేదికలో విశ్లేషించింది. పెద్దనోట్ల రద్దు, వస్తు- సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుకు సంబంధించి ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకుంటోందని తన వరల్డ్ అవుట్‌లుక్‌లో వివరించింది. 2019లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందనీ ఐఎంఎఫ్ అంచనావేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా దావోస్ (స్విట్జర్లాండ్)లో ఐఎంఎఫ్ ఈ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. 2018-19లో ఆసియా వృద్ధి 6.5 శాతంగా ఐఎంఎఫ్ అవుట్‌లుక్.
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
సమ్మిళిత వృద్ధిలో పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ల కన్నా కూడా భారత్ అట్టడుగు స్థాయిలో ఉంది.వర్ధమాన దేశాలకు సంబంధించిన సమ్మిళిత వృద్ధి సూచీలో 62వ స్థానంలో నిల్చింది. చైనా 26, పాకిస్తాన్ 47వ స్థానాల్లో ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో నిల్చింది. సంపన్న దేశాల జాబితాలో అత్యంత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సదస్సు నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఈ సూచీ విశేషాలు విడుదల చేసింది. జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, రుణభారాల నుంచి భవిష్యత్ తరాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌సని ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.
సమ్మిళిత వృద్ధి సూచీలో మొత్తం 130 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 29 సంపన్న దేశాలు, మిగతా 74 వర్ధమాన దేశాలు ఉన్నాయి. భారత్ ఓవరాల్ స్కోరు తక్కువగానే ఉన్నప్పటికీ.. పురోగమిస్తున్న టాప్ టెన్ వర్ధమాన దేశాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.
గతేడాది 79 దేశాల వర్ధమాన దేశాల జాబితాలో భారత్ 60వ స్థానంలో నిల్చింది. చైనా 15, పాకిస్తాన్ 52వ స్థానాల్లో నిలిచాయి.
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
మూడ్రోజులపాటు అమెరికాను స్తంభింపజేసిన షట్‌డౌన్‌కు ముగింపు పలికే దిశగా అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.జనవరి 22న జరిగిన ఈ చర్చల్లో డెమొక్రాట్ల ‘స్వాప్నికుల’ డిమాండ్‌పై చర్చకు సెనెట్ మెజారిటీ (రిపబ్లికన్) నేత మిచ్ మెక్‌కన్నెల్ అంగీకారం తెలిపారు. దీంతో ప్రభుత్వ నిర్వహణకు నిధులు ఇచ్చే బిల్లుపై చర్చించేందుకు మార్గం సుగమమైంది. బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని డెమొక్రాట్ల నేత చుక్ షుమర్ ప్రకటించారు.
జనవరి 20, 21 తేదీల్లో(శని, ఆదివారం) కనిపించని అమెరికా షట్‌డౌన్ ప్రభావం జనవరి 22న (సోమవారం) తీవ్ర ప్రభావాన్ని చూపింది. వేల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండా ఇళ్లలోనే ఉండటంతో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. అత్యవసర సేవలు మినహా అమెరికా దాదాపుగా స్తంభించిపోయింది.
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది.ఇప్పటికే భారత్‌కు ఆకాశ్, బరాక్-8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా..ఎస్-400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా..
రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్-400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్‌స అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.
ఎప్పటికి వస్తాయి?
మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్-రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఇవీ ప్రత్యేకతలు..
శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్-400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్-300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్-400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్‌పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్-400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్‌న్రు ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది.
భారత్ వద్ద ఉన్న క్షిపణులు
స్పైడర్
ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయత్నిస్తోంది.
ఆకాశ్
డీఆర్‌డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది.
బరాక్-8
డీఆర్‌డీవో-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది.
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
[1/24, 07:51] జి కె అడ్మిన్: *✳స్థానిక సంస్థలు – కమిటీలు✳*
*💁బల్వంతరారు మెహతా కమిటీ*
👉ప్రణాళికా సంఘం చేపడుతున్న సమాజ వికాస కార్యక్రమాల అధ్యయనానికి భారత ప్రభుత్వం 1957, జనవరి 16న బల్వంతరారు మెహతా కమిటీని ఏర్పాటు చేసింది.
👉ఈ కమిటీ 1952, 1953 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (సీడీపీ), నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ (ఎన్‌ఈఎస్) కార్యక్రమాలను అధ్యయనం చేసి 1957, నవంబర్ 24న నివేదికను సమర్పించింది. కమిటీ తన నివేదికలో ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యం’ అనే భావనతో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది.
*💁♂సిఫార్సులు :*
1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అవి.. ఎ) గ్రామపంచాయతీ, బి) పంచాయతీ సమితి, సి) జిల్లాపరిషత్.
2. గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి.
3. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌లకు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి.
4. పంచాయతీ సమితికి కార్యనిర్వాహక, జిల్లాపరిషత్‌కు సలహా, రర్యవేక్షణ అధికారాలు కేటాయించాలి.
5. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా పంచాయతీ ఎన్నికలను స్వతంత్రంగా నిర్వహించాలి.
6. స్థానిక సంస్థలకు ఐదేళ్లకొకసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి.
7. ప్రణాళిక, అభివృద్ధి విధులను స్థానిక ప్రభుత్వాలకు అప్పగించాలి.
8. జిల్లాపరిషత్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించాలి.
9. స్థానిక సంస్థలకు అవసరమైన వనరులను కచ్చితంగా నిర్దేశించి, పంపిణీ చేయాలి.
– శ్రీనగర్‌లో 1958 ఏప్రిల్ 1న సమావేశమైన జాతీయ అభివృద్ధి మండలి బల్వంతరారు మెహతా కమిటీ సిఫార్సులను పాక్షికంగా ఆమోదించింది.
– మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రం.. రాజస్థాన్.
– అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1959, అక్టోబర్ 2న రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా సికార్‌లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నేడు ప్రారంభించిన ఈ స్థానిక ప్రభుత్వాలు… భారత ప్రజాస్వామ్య, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, భవిష్యత్ నాయకత్వానికి పాఠశాలలుగా ఉపయోగపడ తాయి’ అని అన్నారు.
– మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలుచేసిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఏపీలో తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 1959, అక్టోబర్ 11న పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1959, నవంబర్ 1న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్థానిక సంస్థను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా తరువాత శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌ల చట్టం 1964, జనవరి 18 నుంచి అమలులోకి వచ్చింది.
– పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఒకే రకమైన పద్ధతిని అనుసరించడంలేదు.
– నాలుగంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రం : పశ్చిమ బెంగాల్
– మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు : రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్.
– రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు : ఒడిశా, హర్యానా, అసోం, తమిళనాడు.
– ఒకే అంచెతో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు : సిక్కిం, గోవా, త్రిపుర, కేరళ, జమ్మూ-కాశ్మీర్.
– బల్వంరారు మెహతా కమిటీ సిఫారసుల ఆధారంగా ఏర్పాటు చేసిన పంచాయతీలను మొదటి తరం పంచాయతీలు అంటారు.
*💁అశోక్‌మెహతా కమిటీ (1977)*
👉మొరార్జీదేశారు ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థ అధ్యయనానికి 1977, డిసెంబర్‌లో అశోక్‌మెహతా కమిటీని (13 మంది సభ్యులతో) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1978, ఆగస్టులో మొత్తం 132 సిఫారసులతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది.
*💁♂సిఫార్సులు :*
1. గ్రామ పంచాయితీల స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి.
2. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయాలి.
3. మండల పరిషత్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి.
4. జిల్లా పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రత్యక్ష లేదా పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి.
5. రాజకీయ పార్టీలు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలి.
6. స్థానిక సంస్థలకు నాలుగేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి.
7. పంచాయతీరాజ్ సంస్థల్లో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి.
8. 15 నుంచి 20 వేల జనాభాతో మంచల పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
9. పంచాయతీరాజ్ శాఖకు మంత్రిని నియమించాలి.
10. పంచాయతీరాజ్ సంస్థల నియంత్రణకు సోషల్ ఆడిట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
11. స్థానిక ప్రభుత్వాలు.. రాష్ట్రప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితులు లేకుండా వాటికి పన్ను విధింపు, వసూలు, నిధుల ఖర్చు అధికారాలు కల్పించాలి.
12. జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని అధికార వికేంద్రీకరణ చేయాలి.
13. పంచాయతీల నిధులు, జమా ఖర్చులపై సామాజిక తనిఖీ నిర్వహించేందుకు శాసనసభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలి.
– మొరార్జీ దేశారు ప్రభుత్వం 1979లో కొన్ని మార్పులతో అశోక్‌మెహతా కమిటీ సిఫార్సులను ఆమోదించింది. ఈ సిఫార్సులను అమలు చేసిన మొదటి రాష్ట్రం కర్ణాటక (1985, అక్టోబర్ 2 (రామకృష్ణ హెగ్డే సీఎం).
– ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వం 1986లో 330 పంచాయతీ సమితుల స్థానంలో 1104 మండలాలను ఏర్పాటు చేసింది.
– అశోక్ మెహతా కమిటీ సిఫార్సులను అమలు చేసిన మూడో రాష్ట్రం పశ్చిమ బెంగాల్.
– అశోక్ మెహతా కమిటీ తన నివేదికలో పంచాయతీరాజ్ సంస్థలకు సరైన నిధులు, విధులు కేటాయిస్తే విజయవంతంగా పనిచేస్తాయని పేర్కొంది.
– అశోక్ మెహతా కమిటీ నివేదిక అనంతరం (1979 తరువాత) కాలాన్ని పునరుజ్జీవ దశ లేదా రెండోతరం పంచాయతీలు అంటారు.
– భారతదేశంలో 2004, మే 22న పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. (మే 27న అమలులోకి వచ్చింది).
దంత్‌వాలా కమిటీ (1978)
ఈ కమిటీని బ్లాక్ స్థాయిలో ప్రణాళికీకరణపై నివేదిక సమర్పించేందుకు ఏర్పాటు చేశారు.
సిఫార్సులు :
– గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి.
– జిల్లాస్థాయిలో ప్రణాళికా వికేంద్రీకరణ జరగాలి.
– జిల్లా ప్రణాళిక వికేంద్రీకరణలో కలెక్టర్ ప్రధానపాత్ర పోషించాలి.
– ప్రణాళిక వికేంద్రీకరణలో భాగంగా బ్లాక్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని ప్రణాళికలను రూపొందించాలి.
సి.హెచ్.హనుమంతరావు కమిటీ (1984)
జిల్లా ప్రణాళికలపై నివేదికను సమర్పించేందుకు సి.హెచ్.హనుమంతరావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కింది సిఫార్సులు చేసింది.
– జిల్లా ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
– ప్రత్యేక జిల్లా ప్రణాళిక సంఘాన్ని కలెక్టర్ లేదా మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాలి.
– జిల్లాస్థాయిలో అన్ని అభివృద్ధి, ప్రణాళిక కార్య కలాపాల్లో కలెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరించాలి.
*💁జి.వి.కె.రావు కమిటీ (1985)*
👉ప్రణాళికాసంఘం చేపడుతున్న పేదరిక నిర్మూలన, అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు 1985లో జి.వి.కె.రావు కమిటీని ఏర్పాటు చేశారు.
సిఫార్సులు :
1. బ్లాక్ వ్యవస్థను రద్దుచేయాలి.
2. అభివృద్ధిలో జిల్లా పరిషత్ కీలక పాత్ర పోషించాలి.
3. జిల్లాపరిషత్‌కు చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించాలి.
4. జిల్లాను ప్రధాన యూనిట్‌గా ఏర్పాటు చేయాలి.
5. భారతదేశంలో అభివృద్ధి చెందిన ఉద్యోగిస్వామ్యం స్థానంలో ప్రజాస్వామ్యాన్ని అబివృద్ధి చేయాలి.
6. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ పాత్రను తగ్గించాలి.
7. జిల్లా పరిషత్‌కు డీడీవో లేదా సీఈవో (అధికారి)ను నియమించాలి.
ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ (1986)
భారతదేశంలోని పంచాయతీరాజ్ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్.ఎం.సింఘ్వీ కమిటీని ఏర్పాటు చేసింది.
*💁♂సిఫార్సులు :*
1. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హౌదా కల్పించాలి.
2. గ్రామసభ ఏర్పాటు చేయాలి.
3. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి.
4. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి.
5. గ్రామీణ పరిపాలనలో గ్రామ సభలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయించాలి.
6. స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చాలి.
[1/24, 07:51] జి కె అడ్మిన్: 🛑🔊 *ఐటీ రిటర్న్ దాఖలు చేసే ముందు ఇలా..* 🔊🛑
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
...✍🌎🅰lfred🅿🌎
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
🔊 *క్యాలెండర్ సంవత్సరం ముగిసి 20 రోజులు దాటింది. సుమారు మరో 70 రోజుల్లో అంటే 2018 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది.*
🔊 *ఈలోపు పన్ను ప్లానింగ్ జరిగిపోవాలి. ఆఖరు నిమిషంలో కంగారు పడకుండా ముందస్తుగా అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవటం ద్వారా ఆదాయ పన్నుశాఖకు రిటర్న్ సమర్పించే విషయంలో అవగాహన ఉంటుంది.*
🔊 *ఆఖరు నిమిషంలో చేయాల్సిన ఇన్వెస్ట్‌మెంట్లు ఏమైనా ఉంటే ముందుగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పన్ను రాయితీల వినియోగంపై స్పష్టత ఉండాలని నిపుణులు చెబుతున్నారు.*
🔊 *టీడీఎస్ వర్తించే ఉద్యోగులు రాయితీ పొందేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ముందే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలు తెలుసుకుందాం*.
🛑 *సెక్షన్ 80 సీ కింద మినహాయింపుల కోసం*
🔊 *ఈ సెక్షన్ కింద పెట్టే పెట్టుబడులపై ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది*.
🔊 *హౌసింగ్ లోన్ మూలధనం చెల్లింపులు, బీమాతో సహా అనేక రకాల పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద మినహాయింపులు వర్తిస్తాయి. వాటికి సంబంధించిన ఆధారాలు జాగ్రత్త చేసుకోవాలి.*
🛑 *రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు*
🔊 *ఉద్యోగుల్లో ఎక్కువమంది ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు(ఈఎల్‌ఎస్‌ఎస్), జీవిత బీమా పథకాలు, పీపీఎఫ్ సహా చిన్న పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు.*
🔊 *ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తే ఓకే.. లేదంటే ఇప్పటికైనా 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందడానికి అవసరమైన ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే మంచిది.*
🔊 *ఎక్కువ మొత్తంలో టీడీఎస్ కట్ కాకుండా, ఈఎల్‌ఎస్‌ఎస్ అయితే ఫండ్ స్టేట్‌మెంట్, జీవిత బీమా పాలసీ అయితే ప్రీమియం చెల్లించిన రసీదులను ఆఫీసు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో సమర్పించాలి.*
🔊 *పీపీఎప్ పెట్టుబడులకు సంబంధించి బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలు సూచించే పాస్‌బుక్ జిరాక్స్ కాపీ ఇస్తే సరిపోతుంది.*
🔊 *ఒకవేళ ఆన్‌లైన్ ద్వారా పీపీఎఫ్‌లో పెట్టుబడులు పెడితే ఖాతా వివరాలు, లావాదేవీల వివరాలు తెలిపే ఇ–రసీదు సమర్పించాలి*.
🔊 *ఇవేకాకుండా సుకన్య సమృద్ధి యోజన లేదా ఐదేళ్ల కాలపరిమితి ఉండే టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఇచ్చే డిపాజిట్ రసీదు లేదా సర్టిఫికెట్ కాపీ సమర్పించాలి.*
🔊 *ఈ జాగ్రత్తలు తీసుకోని పక్షంలో టీడీఎస్ ఎక్కువ కట్ అవుతుంది. మళ్లీ రిటరŠన్స్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.*
👨👨👧👧 *ట్యూషన్ ఫీజు..*
🔊 *మీ పిల్లలకు స్కూల్, కళాశాలల్లో చెల్లించే ట్యూషన్ ఫీజు కూడా 80సీ కింద మినహాయింపు వర్తిస్తుంది.*
🔊 *ఐటీ రాయితీ క్లెయిమ్ చేస్తుంటే ఫీజులకు సంబంధించిన రసీదులు జిరాక్స్ కాపీని అకౌంట్స్ సిబ్బందికి ఇవ్వాలి*
🔊 *ఈ రసీదుపై స్కూల్/కళాశాల అధికారి స్టాంప్, ఫీజు అందుకున్నవారి సంతకం తప్పకుండా ఉండాలి.*
🏡 *తొలిసారి ఇల్లుకొన్న వ్యక్తులు..*
🔊 *కొత్తగా ఇల్లు కొన్నవారికి ఈసారి ప్రత్యేక రాయితీ ఉంది. సాధారణంగా సెక్షన్ 24 కింద గృహరుణాలపై చెల్లించే వడ్డీ మొత్తంలో గరిష్టంగా రూ.2 లక్షలు వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది.*
🔊 *మొట్టమొదటిసారిగా ఇల్లు కొన్నవారికి అదనంగా మరో రూ.50 వేలు వరకు సెక్షన్ 80ఈఈ కింద ప్రభుత్వం మినహాయింపు కల్పించింది.*
🔊 *అంటే తొలిసారి ఇల్లు కొన్నవారికి వడ్డీ చెల్లింపులపై రూ.2.5 లక్షల వరకూ పన్ను రాయితీ ఉంది. బ్యాంక్ నుండి మూలధనం ఎంత చెల్లించారు. వడ్డీ ఎంత చెల్లించారు తెలిపే సర్టిఫికెట్ సమర్పించాలి*.
🏡 *హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు*
🔊 *హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసేవారు తగిన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.*
🔊 *ఇంటి వార్షిక అద్దె రూ.లక్ష (నెలకు 8,333) దాటితే ఇంటి యజమాని పాన్ నంబర్ కూడా తప్పనిసరిగా పేర్కొనాలి.*
🔊 *ఇంకా నిర్ణీత ఫారంలో ఇంటి యజమాని సంతకంతో కూడిన లీజు అగ్రిమెంట్, ఇంటి యాజమాన్యానికి సంబంధించిన ఆధారాలు కాపీలు ఇవ్వాలి.*
🔊 *ఇంటి యాజమాన్యానికి సంబంధించి పన్ను రసీదు లేదా తాజా విద్యుత్ బిల్లు సరిపోతుంది*.
🔊 *ఇల్లు ఏదైనా కోఆపరేటివ్ సొసైటీలో ఉంటే ఆ సొసైటీ ఇచ్చే షేర్ సర్టిఫికెట్ అయినా సరిపోతుంది.*
🔊 *ఏప్రిల్ 2017 నుంచి ఇప్పటివరకు అందుకున్న ఒరిజనల్ అద్దె రసీదులు కూడా సమర్పించాలి.*
🔊 *గృహ రుణంతో కొన్న ఇంటిని అద్దెకిచ్చినా ఆ రుణంపై చెల్లించిన అసలు, వడ్డీల వివరాలు విడివిడిగా పేర్కొంటూ బ్యాంకు ఇచ్చిన సర్టిఫికెట్ జతచేయాలి*.
🛑 *ఎన్‌పీఎస్ పెట్టుబడులు..*
🔊 *మీరు పనిచేసే కంపెనీ, సంస్థ ద్వారా జాతీయ పింఛన్ పథకం (ఎన్‌పీఎస్)లో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలన్నీ మీ కంపెనీ దగ్గరే ఉంటాయి*.
🔊 *కాబట్టి ఆ పెట్టుబడుల వివరాలు ప్రత్యేకంగా కంపెనీకి సమర్పించాల్సిన అవసరం లేదు.*
🔊 *జీతం నుంచి కాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం నుంచి ఎన్‌పీఎస్‌లో వ్యక్తిగత హోదాలో రూ.50 వేలు పెడితే మాత్రం ఆ వివరాలు ఆఫీసుకు సమర్పించాలి.*
🔊 *ఇందుకోసం ఉద్యోగి పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్), టైర్ 1 ఖాతాకు సంబంధించిన ఎన్‌పీఎస్ లావాదేవీల స్టేట్‌మెంట్ వివరాలు ఇవ్వాలి.*
🛑 *మెడిక్లెయిమ్‌లు*
🔊 *మెడిక్లెయిమ్ పాలసీ కింద చెల్లించిన ప్రీమియం ప్రూఫ్‌లు కంపెనీకి ఇవ్వాలి. ఈ చెల్లింపులకు సెక్షన్ 80డీ కింద సీనియర్ సిటిజన్లకు రూ.30 వేల వరకు ఇతరులకు రూ.25 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది*
⚫⚫⚫🌎🅰🅿🌎⚫⚫⚫⚫
[1/24, 07:51] జి కె అడ్మిన్: 🛑🙏 *పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🛑
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
🗓 *24-01-2018*
*💧సుభాషిత వాక్కు*
*"అదృష్టం తనంత తానుగావచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మవద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, స్వంతం చేసుకో! అదే అదృష్టం అంటే."*
*"To share your weakness is to make yourself vulnerable; to make yourself vulnerable is to show your strength."*
*🔸మంచి పద్యం*
*లక్ష్యముండినేమి లాభంబు లేదురా*
*కష్టపడక ఫలము కలుగ బోదు*
*పాటుపడుచు నుండు ఫలములు పొందగ*
*వాస్తవంబు వేమువారి మాట*
*🔹భావం:*
*ఓ వేము ! లక్ష్యం ఉన్నప్పటికీ కష్టపడనిచో ఫలితం పొందలేము. కష్టపడితేనే ఫలితం లభిస్తుంది.*
*♦నేటి జీ కె*
*1) రంజీట్రోఫీ (క్రికెట్) విజేత ఎవరు?*
A: *విదర్భ జట్టు*
*2) "దేవధర్ ట్రోఫీ" (క్రికెట్) విజేత ఎవరు?*
A: *తమిళనాడు*
*3) "దులీప్ ట్రోఫీ" (క్రికెట్) విజేత ఎవరు?*
A: *ఇండియా రెడ్*
*4) "ఇరానీ కప్" (క్రికెట్) విజేత ఎవరు?*
A: *రెస్ట్ ఆఫ్ ఇండియా*
*5) "సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపి" (క్రికెట్) విజేత ఎవరు?*
A: *ఈస్ట్ జోన్*
⚫⚫⚫🌎🅰🅿🌎⚫⚫⚫
[1/24, 08:50] +91 95020 29120: Quiz no-103
Dt-27-12-17
1.అణుబాంబు రూప కర్త-
2.సూర్యుని శక్తికి కారణం?
3.NGS-న్యూక్లియర్ సప్లైర్ గ్రూప్ లోని సభ్యదేశాలు-
4.కేంద్రక రసాయన శాస్త్ర పితామహుడు?
5.దేనిని విటమిన్ M అంటారు?
6.చిన్న చిన్న దోమలు, కీటకాలు నీటి మీద తేలుతూ నడవడానికి కారణం?
7.పశువులలో లభ్యమయ్యే విటమిన్?
8.పప్పుధాన్యాలలో ఏవి అధికంగా ఉంటయి?
9.గుడ్డు పచ్చసొనలో ఏమి ఉంటుంది?
10.క్రిమిసంహారక మందులు, క్రిములు ఏ వ్యవస్థని దెెబ్భతీస్తాయి?
జవాబులు
1.ఓపెన్ హైమర్
2.కేంద్రక సంలీనం
3.48
4.ఒట్టో హాన్
5.పిటోరియల్ గ్లుటమిక్ ఆమ్లం
6.సర్ఫేస్ టెన్షన్
7.సయానో కో బాలమైన్
8.ప్రోటీన్లు
9.కొవ్వు
20.నాడీవ్యవస్థ
✍KVR
[1/24, 08:51] +91 95020 29120: Quiz no-104👍
Dt-28-12-17
1.సుప్రీంకోర్టు పురాతన నామం?
2.సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం ఎలా జరుగుతుంది?
3.హిందూకుష్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి?
4.8° నుంచి11° ల ఉత్తర అక్షంశాల మధ్య ఉన్న దీవులు?
5.ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణమయ్యే విటమిన్?
6.దేశంలో అత్యున్నత న్యాయాధికారి?
7.ఏ ఉద్యమ కాలంలో తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని నినాదం చేశారు?
8.లోక్ సభ, రాజ్యసభ ల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు?
9.ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఏ జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయిచారు?
10.మిల్క్- లెట్-డౌన్ ఎజెక్షన్ ఫ్యాక్టర్ అని ఏ హార్మోన్ కు పేరు?
జవాబులు
1.ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా
2.ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తారు.
3.ఆఫగనిస్థాన్
4.లక్షదీవులు
5.రైబో ప్లేవిన్
6.అటార్నీజనరల్
7.హోమ్ రూల్
8.108
9.1971
10.ఆక్సిటోసిన్
✍KVR
[1/24, 08:51] +91 95020 29120: Quize no-106👍
Dt-30-12-17
1.ICDS-Integrated child developement services ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
2.ఇటీవల 60 వసంతాలు పూర్తిచేసుకున్న బ్యారేజి?
3.ఇటీవల వార్తల్లోకి వచ్చిన బిర్సాముండా సెంట్రల్ జైల్ ఏ నగరంలో ఉంది?
4.పాలల్లో ఉండే ప్రోటీన్ ఏది?
5.ఆంధ్రాలో దత్తమండలాలకు రాయలసీమ అని పేరు పెట్టిందెవరు?
6.ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు?
7.ఆర్ధిక మంత్రి హోదా లోపార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని?
8.వరల్డ్ టెలివిజన్ డే?
9.సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
10.1969-జూలై-20 న మొట్టమొదటి సారిగా చంద్రుని మీద కాలుపెట్టిన వ్యక్తులుగా ముగ్గురు ప్రసిద్ధి చెందారు వారిలో నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ ,అయితే 3వ వ్యక్తి ఎవరు?
జవాబులు
1.1975 అక్టోబర్-2 గాంధీ జయంతి సందర్భంగా ప్రవేశపెట్టారు.
2.కృష్ణా నది పై ఉన్న ప్రకాశం బ్యారేజి.1957 డిసెంబర్-24 వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ప్రారంభo చేశారు. దీని వల్ల 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు ఎక్కువగా లబ్ది పొందుతున్నాయి
3.రాంచీ
4.కేసిన్
5.గాడిచర్ల హరిసర్వోత్తమరావు
అకచిక
అనంతపురo,కడప,చిత్తూరు,
కర్నూలు
6.బెజవాడ గోపాలరెడ్డి
7.జవహర్ లాల్ నెహ్రూ
8.నవంబర్-21
9.రోమ్
10.మైఖేల్ కొలిన్స్
✍కొపనాతి.వీర్రాజు🏃🏻
[1/24, 08:52] +91 95020 29120: QUIZ NO-105👍
DT-29-12-17
1.పార్లమెంట్ లో హిందీ, ఇంగ్లీష్ లొనే మాట్లాడాలని తెలియచేసే ఆర్టికల్?
2.జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రం?
3.గాంధీ రాజకీయ గురువు?
4.భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పటి నుంచి భారత పార్లమెంట్ గా తమ విధులను నిర్వర్తిస్తుoది?
5.ప్రవేశికను రాజ్యాంగ ఆత్మ అని వర్ణించింది?
6.క్రికెట్ బ్యాట్ ను ఏ మొక్క కలపనుంచి తయారు చేస్తారు?
7.ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా sc, st ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు?
8.ఏ సంవత్సరం లో 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటర్ల వయోపరిమితి ని21 నుండి18సంవత్సరాల కు తగ్గించారు?
9.ఉపగ్రహాలు లేని గ్రహాలు?
10.అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబులు
1.120
2.ఇధాలజీ
3.గోపాలకృష్ణ గోఖలే
4.15-8-1947
5.హిదయతుల్ల
6.సాలిక్స్ అల్బా
7.85(2001)
8.1988(ప్రధాని రాజీవగాంధీ)
9.బుధుడు, శుక్రుడు
10.లుసానే-స్విట్జర్లాండ్
✍కొపనాతి.వీర్రాజు🏃🏻
[1/24, 08:52] +91 95020 29120: QUIZ NO-108👍
01💐-01💐-2018💐.
(మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు💐👍)
1.1986 లో నార్మన్ బోర్లాగ్ ప్రారంభించిన ప్రపంచ ఆహార బహుమతిని ఎప్పుడు ప్రధానం చేస్తారు?
2.భారత భూభాగం నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహం?
3.నక్షత్రాల లో ఉండే వాయువు?
4.సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఏ క్రీడకు సంబంధించినది?
5.బీడీ తయారీలో ఉపయోగించే ఆకు?
6.ద విలేజ్ బై దసీ పుస్తక రచయిత?
7.మిరప పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
8.ఉల్లిగడ్డలను అధిక విస్తీర్ణం లో పండిస్తున్న జిల్లా?
9.పోస్టు ద్వారా ఉత్తరాలను పంపే సౌకర్యం కల్పించిన బ్రిటిష్ అధికారి?
10.బొప్పాయి లో ఎక్కువగా లభించే విటమిన్?
జవాబులు
1.ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్-16 న
2.రోహిణీ-1
3.హైడ్రోజెన్
4.హాకీ
5.తునికాకు
6.అనితా దేశాయ్
7.గుంటూరు
8.కర్నూలు
9.లార్డ్ డల్హౌసి
10.విటమిన్-A
✍కొపనాతి.వీర్రాజు🏃🏻
[1/24, 08:52] +91 95020 29120: My knowledge&my shot cut no-15👍
Dt-31-12-17
Topic-ఐరాస అనుబంధం సంస్థలు
1.A) (W o& I O ) తో ప్రారంభమయ్యే సంస్థలన్నీ జెనీవా (స్విట్జర్లాండ్ )లో ఉంటాయి.
నోట్-ఏదైనా ఒక సంస్థ world/international తో ప్రారంభ అయ్యి organisation తో end అయ్యే సంస్థలన్నీ స్విట్జర్లాండ్ లోని జెనీవా లో ఉంటాయి.
👉WO
1.WIPO
2.WHO
3.WMO
4.WTO
5.ILO
6.ICRCO
7.ISO
8.UNCTAD
ఈ సంస్థలన్నీ జెనీవా లో ఉంటాయి
👉నోట్-IMO-International maritime organisation-లండన్ లో ఉంది.
2.B)మనీ కు సంబంధించిన వన్నీ వాషింగ్టన్ DC లో ఉంటాయి.
1.IMF
2.IBRD
3.C)పరిశ్రమలు, అటామిక్ పెట్రోలియం కు సంబంధించన సంస్థలు వియన్నా లో ఉంటాయి.
1.UNIDO
2.IAEA
3.OPEC
4.UNDCP
4.D)ఆర్ధిక, చదువుకు సంభదించన సంస్థలన్నీ పారిస్ లో ఉన్నాయి.
1.OECD
2.UNESCO
5.E)ఆహారం. వ్యవసాయo కు సంబంధించిన సంస్థలన్నీ ఇటలీ రాజధాని రోమ్ లో ఉన్నాయి.
1.FAO
2.IFAD
3.WFP
6.F) un child emergy in న్యూయార్క్.
1.UNO
2.UNICEF
3.UNDP
4.UNFPA
QUIZ NO-107
1.అప్పుడే జన్మించిన పాపలో శ్వాసక్రియ నిమిషానికి ఎన్ని మార్లు జరుగుతుంది?
2.ఓజోన్ పొర రంగు
3.కేంద్ర భాషా సంస్థ ఎక్కడ ఉంది?
4.మొదటి రాజ్యాంగ సవరణ ఎక్కడ ఉంది?
5.TDS full form
6.ఒక ఓడ నదీ జలాల నుంచి సముద్ర జలాల్లో కి ప్రవేశిస్తే ఏమి జరుగుతుంది?
7.చూయింగ్ గమ్ లను ఏ వృక్షాల బంక నుంచి తయారుచేస్తారు?
8.సూర్యుడు తూర్పున ఉదయించడానికి కారణం?
9.బట్టమేక పక్షి శాస్త్రీయ నామం?
10.కప్పల గురుంచి అధ్యయనం చేసే శాస్త్రం?
జవాబులు
1.32
2.పల్చని నీలం O3 డే-sep-16
3.మైసూరు
4.ప్రాధమిక హక్కులు
5.టాక్స్ డిటక్షన్ ఎట్ సోర్స్
6.మరింత పైకి తేలుతుంది
7.జాపోట్ వృక్షాల చికిల్
8.భూమి పశ్చిమo నుంచి తూర్పు కు తిరగడం వలన
9.ఆర్టియోటెస్ నైగ్రీ సెప్స్
10.బాట్రకాలజీ
✍కొపనాతి.వీర్రాజు🏃🏻
[1/24, 08:52] +91 95020 29120: QUIZ NO-110
DT-03-01-18
(💐 జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు🙏🙏🙏)
1.ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని ఎవరికి బిరుదు?
2.భారతదేశ మొట్టమొదటి మహిళా గ్రామ సర్పంచ్ ఎవరు?
3.బందిపోటు రాణి అని ఎవరికి బిరుదు?
4.ICICI బ్యాంక్ CEO ఎవరు?
5.SBI మొట్టమొదటి మహిళా చైర్మన్?
6.అంతరిక్షం లోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయ మహిళ?
7.మొట్టమొదటి మహిళా ప్రధాని?
8.మొట్టమొదటి సారిగా2016 ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన భారతీయురాలు?
9.మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి బిరుదు?
10.భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి ఫూలే ఏ వ్యాధితో మరణించారు?
జవాబులు
1.ఇరోమ్ ఛాను షర్మిల
2.చవి రాజావత్ సోడా గ్రామం(రాజస్తాన్)
3.పూలందేవి
4.చందాకొచ్చర్
5.అరుంధతి భట్టాచార్య
6.కల్పనాచావ్లా
7.ఇందిరాగాంధీ
8.పూసర్ల వెంకట సింధు
9.టెస్సి థామస్
10.ప్లేగు వ్యాధి ఇది ఎలుకల వలన వ్యాప్తిచెందతుంది.
✍కొపనాతి.వీర్రాజు టీచర్🏃🏻
[1/24, 08:52] +91 95020 29120: QUIZ NO-109👍
DT-2-01-18
1.ICRC-ప్రధానకార్యాలయం ఎక్కడ ఉంది?
2.అల్బేనియా దేశ రాజధాని?
3.జాతీయ ఉపాధ్యాయ మహిళా దినోత్సవం జనవరి-3వ తేదీనఎవరి జన్మదినసందర్భంగా జరుపుకుంటాము?
4.కోమరంభీం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
5.నీటి కుళాయిని తిప్పడంలో ఇమిడి ఉన్న సూత్రం?
6.జాతీయ వాతావరణ రాడార్ ఎక్కడ ఉంది?
7.ఇటీవల ఢిల్లీ మెట్రో మార్గం సదుపాయo కల్పించిన నోయిడా పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది?
8.దేశంలోనే తొలిసారిగా AC సబర్బన్ రైలు ఏ నగరంలోకి అందుబాటులోకి వచ్చింది?
9.వరల్డ్ రాపిడ్ చెస్ చాంపియన్ షిప్ విజేత?
10.శివకపూర్ అనే క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవాడు?
జవాబులు
1.జెనీవా(స్విట్జర్లాండ్)
2.తిరానా
3.సావిత్రిబాయి ఫూలే(భారతదేశ ప్రధమ ఉపాధ్యాయరాలు)
4.ఆదిలాబాద్
5.బలయుగ్మ సూత్రం
6.గాందకి(తిరుపతి)
7.ఉత్తరప్రదేశ్
8.ముంబయి
9.విశ్వనాథన్ ఆనంద్
10.గోల్ఫ్
✍కొపనాతి.వీర్రాజు టీచర్🏃🏻
[1/24, 10:05] జి కె అడ్మిన్: 🌻🎤🎼➖➖➖➖➖➖➖➖
*హిందుస్థానీ రాగరత్న, మన భారతరత్న 'భీమ్‌సేన్ జోషి' గారి వర్దంతి నేడు..*
➖➖➖➖➖➖➖➖🌸🌸🍃
■హిందుస్థానీ సంగీత ప్రపంచంలో మారు మోగే పేరు భీమ్ సేన్ గురురాజ్ జోషి. ఆయన గొంతులో జీవనపోరాటస్ఫూర్తి ఉంది. అది పాటని పైలోకాల నుంచి తీసుకువచ్చి మనకు పంచేందుకు ప్రకంపిస్తుం ది. వినే వారిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ‘ఆకాశం బున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి’ అన్నట్టు గా ఆయన పాట పైలోకాలనుంచి మనకోసం ఆపాట మధరంగా దుకుతుంది. శాస్ర్తీయ సంగీతకారుల్లో ఒకొ్కక్కరిది ఒకొ్క రీతి అరుుతే భీమ్ సేన్ జోషి ది గుండెల్లో మఠం వేసుకొని ప్రతిధ్వనించే రీతి.
■కిరానా ఘరానాకు చెందిన భీమ్‌సేన్ జోషి ’ఖయాల్ గాయనంలోనే కాక, భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగ్‌లు పాడడంలో సిద్ధహస్తుడు.
*🌻సంగీత ప్రస్థానం:🎼🎧*
■20 వ శతాబ్దం పూర్వార్థం వరకూ, ’ఖయాల్ గాయనం’ గురుశిష్య పరంపర’ గా సాగేది. భీమ్‌సేన్ జోషి గురువైన సవాయి గంధర్వ, అబ్దుల్ కరీంఖాన్‌కు శిష్యుడు. అబ్దుల్ కరీంఖాన్ అబ్దుల్ వహీద్ ఖాన్‌తో కలిసి, కిరాణా ఘరాణాను స్థాపించారు.
■ తన 11 వ ఏట, చిన్నతనంలో అబ్దుల్ కరీంఖాన్ గాయనం విని ఉత్తేజితుడై, ఇల్లు వదలి గురువును వెదుక్కుంటూ, ధార్వాడ్ తరువాత పూణె చేరుకున్నాడు. తరువాత గ్వాలియర్‌కు వెళ్ళి, ’మాధవ సంగీత పాఠశాల’లో చేరాడు. ఆ పాఠశాలను గ్వాలియర్ మహరాజులు, ప్రముఖ సరోద్ విద్వాంసుడు, హఫీజ్ అలీఖాన్ సహాయంతో నడుపుతుండేవారు.
■ సరోద్ విద్వాంసుడు హఫీజ్ అలీఖాన్ సహాయంతో గ్వాలియర్ మహారాజు ప్రోత్సహిస్తున్న మాధవ్ సంగీత్ విద్యాలయం లో జోషి చేరాడు. గ్వాలియర్‌లో ఆవిర్భవించిన హిందుస్థాన్ మౌలిక శైలి ’ఖయాల్’. దాని లోతుపాతులు తెలుసుకొని ‘గాయకి’ అనే అంశంలో పరిపూర్ణమైన పరిజ్ఞానం సంపాదించారు. బీమ్‌సేన్ జోషి. విభిన్న రాగాల మధ్య ఉండే వేరువేరు ధోరణులను పట్టుకోవాలన్న జిజ్ఞాసతో జోషి ఎందరో గురువుల్ని సంప్రదించారు.
■ జలంధర్‌లో ఉన్నప్పుడు సంగీత సాధనతోపాటు వ్యాయామం కూడా చేసేవారు. బలమైన శరీరం ఆయన కోరికల్లో ఒకటి. అది కూడా జలంధర్‌లో సాధించుకున్నారు. భీమ్‌సేన్ జోషి గురువు సవాయి గంధర్వ క్రమశిక్షణకు పెట్టింది పేరు. జోషి ఒకసారి అపస్వరం పలికితే అసహనపడి ఇనుప వస్తువు జోషి మీదికి విసిరివేసారు. అయినా జోషి మరింత శ్రద్ధతో ఆ గురువునే ఆశ్రయించారు. ఆదిలో జోషి ధర్వాడ్, సాంగ్లీ, మిరాజ్, కురుంద్వాడ్‌లలో చిన్నచిన్న కచేరీలు చేశారు. అయితే ఖ్యాతిగాంచిన సంగీత ప్రియులెందరో ఆ కచేరీలకు హాజరైనారు. అయినా ఆయనకు అసలైన గుర్తింపునిచ్చింది 1946లో సవాయి గంధర్వ 60వ జన్మదినాన పూణెలో ఆయన ఇచ్చిన కచేరి. అప్పటి నుండి ఆయన వెనుదిరిగిచూడలేదు. ఆయన తన సంగీత ప్రపంచంలో ఒక ఘనత సాధించారని సంగీత ప్రియులంటారు. అదేమిటంటే సంగీతంలో సాంప్రదాయ విలువలకు, జనాకర్షక గాత్రరీతికి మధ్య సయోధ్యను సాధించడం. జన్మతః లభించిన శక్తివంతమైన గొంతుక ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చిందనడం యధార్థం.
*🌻ఇష్టమైన రాగాలు :🎼🎼*
శుద్ధ కల్యాణ్, మియాన్ కీ తోడి, పురియా ధనశ్రీ, ముల్తానీ, భీమ్‌పలాసీ, దర్బారీ మరియు రామ్‌కలీ లు. భీమ్‌సేన్ అబ్దుల్ కరీంఖానే కాక, కేసర్‌బాయి కేర్కర్, బేగం అక్తర్, ఉస్తాద్ అమీర్‌ఖాన్‌ల వల్ల ఎంతో ప్రభావితుడయ్యారు. చివరకు తన ప్రత్యేక గాయన శైలిని రూపొందించుకొన్నారు.
*🌻వ్యక్తిగత జీవితం:🎹*
■ భీమ్‌సేన్ జోషి తండ్రి, గురాచార్య జోషి... బడి పంతులు. చిన్న వయసులోనే భీమ్‌సేన్ జోషికి సునందతో వివాహం జరిగింది. పిల్లలు రాఘవేంద్ర, ఆనంద్ జోషిలు గాయకులు. తరువాత భీమ్‌సేన్ వత్సల అనే ఆమెను పెళ్లాడారు. శ్రీనివాస్ జోషి మంచి గాయకుడు...ఎన్నో ఆల్బంలను విడుదల చేశాడు.
*🌻సినిమాలు:📽*
◆బసంత్ బహార్ ( మన్నాడేతో ), బీర్బల్ మై బ్రదర్ ( పండిట్ జస్రాజ్‌తో), తాన్‌సేన్ (1958) మరియు అంకాహీ (1985). భీమ్‌సేన్ జోషి కన్నడ భజనలు (దాసవాణి, ఆల్బమ్) మరాఠీ అభంగ్‌లు పాడారు. జాతీయ సమగ్రతపై దూరదర్శన్ సౌజన్యంతో తీసిన సంగీతపరమైన వీడియో, ‘మిలే సుర్ మేరా తుమారా’ అనేది జగత్ ప్రసిద్ధం. భీమ్‌సేన్ జోషి తన గురువు సవాయి గంధర్వ గౌరవజ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం, డిశంబరు నెలలో పూణె నగరంలో, సవాయి గంధర్వ సంగీత మహోత్సవం ను నిర్వహించేవారు.
*🌻అవార్డులు:*
▪పద్మశ్రీ 1972
సంగీతనాటక అకాడమీ అవార్డు 1976
▪పద్మవిభూషణ్ 1999
▪పద్మభూషణ్ 1985
మహారాష్ట్ర భూషణ్ 2002
కర్నాటక రత్న 2005,
▪భారతరత్న 2008.
(ఫిబ్రవరి 4, 1922 - జనవరి 24 2011)
సేకరణ:సురేష్ కట్టా-చరిత్రలో ఈరోజు
🍃🌸🤗🌸🍃
[1/24, 10:05] జి కె అడ్మిన్: ➖➖➖➖➖➖➖➖➖➖
రథసప్తమి మరియు నర్మదా జయంతి
➖➖➖➖➖➖➖➖➖➖
సకల చరాచర జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు. మాఘశుద్ధ సప్తమి నాడు అదితి, కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. ఆ రోజునే సప్తాశ్వా రథారూఢుడై ప్రపంచానికి దర్శనమివ్వడంతో రథసప్తమిగా వేడుకలను జరుపుకొంటాం. రథంలోని భాగాలు సమయాన్ని, రుతువులను పేర్కొంటాయి. ఉత్తరదిశవైపు సూర్యుడి ప్రయాణం ప్రారంభమవుతుంది. దైవారాధనలో సూర్యుని ఆరాధనకు విశిష్టమైన స్థానముంది. ప్రత్యక్షంగా సూర్యుడు దర్శనమిస్తాడు. సూర్యుని వెలుగులు లేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది. వ్యవసాయానికి, మానవులకు, జంతువులకు, ఇతర
జీవజాలానికి సూర్యుని కిరణాలే ఆధారం. సూర్యురశ్మి లేని ప్రపంచాన్ని తలచుకుంటే భయంతో వణికిపోతాం. సూర్యనమస్కారాలు చేయడం ఆరోగ్యరీత్యా కూడా మంచిదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని అగస్త్యమహర్షి అనుగ్రహం చేత పొంది రావణ సంహారం చేసినట్టుశ్రీ రామాయణా ది పురాణాలు వెల్లడిస్తున్నాయి. మహాభారతంలో మహాబలుడిగా పేరొందిన కర్ణుడు సూర్యానుగ్రహం చేత కుంతికి జన్మించాడు. మణులలో విశిష్టమైన శమంతకమణిని సత్రాజిత్తు సూర్యుని ఆరాధనతో పొందాడు. వైవస్వత మన్వంతరంలో మొదటి తిథి రథసప్తమి.
నర్మదా జయంతి
నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్- ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో ఉన్నఅమరకంటక్ లో ఆవిర్భవిస్తున్నది. మాఘ శుద్ధ సప్తమి రోజున నర్మద భూతలమున కాలిడినట్లు ఐతిహ్యం. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నర్మదా జయంతికు హెచ్చు ప్రాశస్త్యం ఉన్నది
గంగాదేవి నర్మదా స్నానం: లక్షలాది మంది భక్తులు తమ పాపాలను తొలగించుకోవడానికై గంగానదిలో మునుగుతారు. అయితే వారి పాపాలు మూటగట్టుకొన్న గంగ నర్మదానదిలో స్నానమాచరించి పునీతురాలవుతుందని ఐతిహ్యం.. ఓం ఆదిత్యాయ నమః!
🍃🌷🤗🌷🍃
[1/24, 22:57] జి కె అడ్మిన్: *అవనిగడ్డ TET DSC తెలుగు హిందీ ఇంగ్లీష్ గణితం EVS Study Materials*👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*హిందీ స్టడీ మెటీరియల్, ఆంధ్రప్రదేశ్ టెట్ మరియ తెలంగాణ DSC TRT 2017 కు ఉపయుక్తము*
*Download Now*👇🏽👇🏽👇🏽
http://www.tsteachers.in/2017/12/sa-lp-hindi-study-material-for-ts-trt-ap-tet-dsc-download-telangana.html
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[1/24, 22:59] జి కె అడ్మిన్: *Hindi Antonyms (विलोम शब्द)*
1. अग्र – पश्च
2. अज्ञ – विज्ञ
3. अमृत -विष
4. अथ – इति
5. अघोष – सघोष
6. अधम – उत्तम
7. अपकार – उपकार
8. अपेक्षा – उपेक्षा
9. अस्त – उदय
10. अनुरक्त – विरक्त
11. अनुराग – विराग
12. अन्तरंग – बहिरंग
13. अवतल – उत्तल
14. अवर – प्रवर
15. अमर – मर्त्य
16. अर्पण – ग्रहण
17. अवनि – अम्बर
18. अपमान – सम्मान
19. अतिवृष्टि – अनावृष्टि
20. अनुकूल – प्रतिकूल
21. अन्तर्द्वन्द्व – बहिर्द्वन्द्व
22. अग्रज – अनुज
23. अकाल – सुकाल
24. अर्थ – अनर्थ
25. अँधेरा – उजाला
26. अपेक्षित – अनपेक्षित
27. आदि – अन्त
28. आस्तिक – नास्तिक
29. आरम्भ – समापन
30. आहूत – अनाहूत
31. आयात – निर्यात
32. आभ्यन्तर – बाह्य
33. आवृत – अनावृत
34. आशा – निराशा
35. आरोहण – अवरोहण
36. आस्था – अनास्था
37. आर्द्र – शुष्क
38. आकाश – पाताल
39. आवाहन – विसर्जन
40. आविर्भाव – तिरोभाव
41. आरोह – अवरोह
42. आदान – प्रदान
43. आगामी – विगत
44. आदर -अनादर
45. आकर्षण – विकर्षण
46. आर्य – अनार्य
47. आश्रित – अनाश्रित
48. इष्ट – अनिष्ट
49. इहलोक – परलोक
50. उग्र – सौम्य
51. उदात्त – अनुदात्त
52. उत्कृष्ट – निकृष्ट
53. उपसर्ग – परसर्ग
54. उन्मुख – विमुख
55. उन्नत – अवनत
56. उद्दत – विनीत
57. उपमान – उपमेय
58. उपत्यका – अधित्यका
59. उत्तरायण – दक्षिणायन
60. उन्मूलन – रोपण
61. उष्ण – शीत
62. उदयाचल – अस्ताचल
63. उपयुक्त – अनुपयुक्त
64. उच्च – निम्न
65. एड़ी – चोटी
66. ऐहिक – पारलौकिक
67. औचित्य – अनौचित्य
68. एक – अनेक
69. एकत्र – विकीर्ण
70. एकता – अनेकता
71. एकाग्र – चंचल
72. ऐतिहासिक – अनैतिहासिक
73. औपचारिक – अनौपचारिक
74. ऋजु – वक्र
75. ऋत – अनृत
76. कटु – सरल
77. कनिष्ट – जयेष्ट
78. कृष्ण – शुक्ल
79. कुटिल – सरल
80. कृत्रिम – अकृत्रिम
81. करुण – निष्ठुर
82. कायर – वीर
83. कुलीन – अकुलीन
84. क्रय – विक्रय
85. कल्पित – यथार्थ
86. कृतज्ञ – कृतघ्न
87. कोप -कृपा
88. क्रोध – क्षमा
89. कृश – स्थूल
90. क्रिया – प्रतिक्रिया
91. खण्डन – मण्डन
92. खरा – खोटा
93. खाद्य – अखाद्य
94. गुप्त – प्रकट
95. गरल – सुधा
96. गम्भीर – वाचाल
97. गुरु – लघु
98. गौरव – लाघव
99. गोचर – अगोचर
100. गुण – दोष
101. ग्राम्य – नागर
102. घृणा – प्रेम
103. चिरंतन – नश्वर
104. चल – अचल
105. चंचल – अचंचल
106. चिर – अचिर
107. जीवन – मरण
108. जाग्रत – सुप्त
109. जंगम – स्थावर
110. जागरण – सुषुप्ति
111. ज्योति – तम
112. तरुण – वृद्ध
113. तृप्त – अतृप्त
114. तृष्णा – तृप्ति
115. तीक्ष्ण – कुंठित
116. दण्ड – पुरस्कार
117. दानी – कृपण
118. दुरात्मा – महात्मा
119. देव – दानव
120. दिन – रात
121. धृष्ट – विनीत
122. निरर्थक – सार्थक
123. निर्दय – सदय
124. निषिद्ध – विहित
125. नैसर्गिक – कृत्रिम
126. निष्काम – सकाम
127. परतन्त्र – स्वतन्त्र
128. प्राचीन – नवीन
129. प्राची – प्रतीची
130. प्रभु – भृत्य
131. प्रसाद – अवसाद
132. पूर्ववर्ती – परवर्ती
133. पाश्चात्य – पौवार्त्य
134. बंजर – उर्वर
135. भला – बुरा
136. भूत – भविष्य
137. मुख्य – गौण
138. मनुज – दनुज
139. मूक – वाचाल
140. मन्द – तीव्र
141. मौखिक – लिखित
142. योगी -भोगी
143. युद्ध – शान्ति
144. यश – अपयश
145. योग्य – अयोग्य
146. राजा – रंक
147. रक्षक -भक्षक
148. रुग्ण – स्वस्थ
149. रुदन – हास्य
150. रिक्त – पूर्ण
151. लौकिक – अलौकिक
152. लम्बा – चौड़ा
153. व्यास – समास
154. विख्यात – कुख्यात
155. विधि – निषेध
156. विपन्न – सम्पन्न
157. विपदा – सम्पदा
158. वृष्टि – अनावृष्टि
159. शासक – शासित
160. शिष्ट – अशिष्ट
161. शिख- नख
162. श्याम – श्वेत
163. शोक – हर्ष
164. शोषक – पोषक
165. सत्कार – तिरस्कार
166. संक्षेप – विस्तार
167. सूक्ष्म – स्थूल
168. संगठन – विघटन
169. संयोग – वियोग
170. सुमति – कुमति
171. सत्कर्म – दुष्कर्म
172. सामिष – निरामिष
173. स्मरण – विस्मरण
174. संसदीय – असंसदीय
175. सृजन – संहार
176. क्षय – अक्षय
177. क्षुद्र – विराट
178. ज्ञेय – अज्ञेय
179. स्वीकृति – अस्वीकृति
180. भौतिक – आध्यात्मिक