AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 21 February 2018

ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2015 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2015 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఆర్థిక వ్యవహారాలు జనవరి 2015 ఎకానమీ
ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’
ఆరున్నర దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను కేంద్రం తీసుకొచ్చింది. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(ఎన్‌ఐటీఐ)’ పేరుతో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ఇకపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విధానాలను రూపొందించే మేధో సంస్థగా సేవలందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనికి చైర్‌పర్సన్‌గా వ్యవ హరిస్తారు. ఈ మేరకు జనవరి1న కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా ఆర్థికవేత్త అరవింద్ పనగరియా(62) నియమితులయ్యారు. మరో ఆరుగురు సభ్యులను, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులను కూడా ప్రభుత్వం జనవరి 5న నియమించింది.

మళ్లీ రూపాయి నోటు ముద్రణ
కేంద్ర ప్రభుత్వం రూపాయి నోటు ముద్రణను జనవరి 1 నుంచి తిరిగి ప్రారంభించింది. ఇది మరో రెండు నెలల్లో చెలామణిలోకి రానుంది. ఆర్థిక కార్యదర్శి సంతకంతో రూపాయి నోట్లను ముద్రిస్తారు. ప్రభుత్వం 1994 నవంబరులో రూపాయి నోటు ముద్రణను నిలిపేసింది.

పుణెలో బ్యాంకుల ‘జ్ఞాన సంగమ్’
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్న ‘జ్ఞాన సంగమ్’ సమావేశం జన వరి 3న ముగిసింది. కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బ్యాంకులు సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభు త్వ రంగ బ్యాంకులను పటిష్టం చేసేందుకు సాహసోపేత సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

ఆర్థిక వ్యవహారాలు ఫిబ్రవరి 2015 ఎకానమీ
కేంద్ర బడ్జెట్ 2015-16
కేంద్ర బడ్జెట్ 2015-16ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 28న పార్లమెంట్‌కు సమర్పించారు.
ముఖ్యాంశాలు..

ప్రణాళికా వ్యయం రూ. 4,65,277 కోట్లుప్రణాళికేతర వ్యయం రూ. 13,12,200 కోట్లుమొత్తం వ్యయం రూ. 17,77,477 కోట్లుస్థూల పన్ను వసూళ్లు రూ. 14,49,490 కోట్లుపన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ రూ. 5,23,958 కోట్లురెవెన్యూ లోటు రూ. 3,94,472 కోట్లుద్రవ్యలోటు రూ. 5,55,649 కోట్లుయథాతథంగా వ్యక్తిగత ఆదాయ పన్నుసంపద పన్ను రద్దు. కోటి రూపాయల ఆదాయం మించితే 2 శాతం అదనపు సర్‌చార్జీసేవల పన్ను 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంపు (విద్యా సెస్సు కలిపి)2016 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తు సేవల పన్నుకార్పొరేట్ పన్ను వచ్చే నాలుగేళ్లలో 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గింపువ్యవసాయ రుణాల లక్ష్యం రూ.8.5 లక్షల కోట్లుఅసంఘటిత రంగంలోని వారికి ప్రభుత్వం 50 శాతం ప్రీమియం చెల్లింపుతో అటల్ పెన్షన్ యోజనఅదనంగా 100,000 కి.మీ. రోడ్ల నిర్మాణం4,000 మెగావాట్ల 5 కొత్త అల్ట్రా మెగా విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటురక్షణ రంగం: రూ.2,46,727 కోట్లుమౌలిక వసతులు: రూ.77,526 కోట్లుగ్రామీణాభివృద్ధి: రూ.77,526 కోట్లువిద్యుత్ రంగం: రూ.61,404 కోట్లువిద్యారంగం: రూ.69,074 కోట్లుగ్రామీణ ఉపాధి హామీ పథకం: రూ.34, 699 కోట్లుఆరోగ్యం: రూ.33,150 కోట్లురూ.20,000 కోట్లతో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ ఫండ్కొత్తగా ఏర్పాటు చేసే మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రీ ఫైనాన్‌‌స ఏజెన్సీ (ముద్ర) బ్యాంకుకు రూ.20,000 కోట్లు.ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 69,500 కోట్లు.



ఆర్థిక సర్వే 2014-15
ఆర్థిక సర్వే 2014-15ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 27న పార్లమెంట్‌కు సమర్పించారు.
ముఖ్యాంశాలు..

2014-15లో జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధిరేటు 7.4 శాతంగా అంచనా. 2015-16లో ఈ వృద్ధిరేటు 8.1-8.5 శాతంగా ఉండే అవకాశం.ద్రవ్యోల్బణం 2013 నుంచి 6 శాతానికి పైగా తగ్గుదల. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5-5.5గా అంచనా.కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 6.7 శాతం నుంచి 1 శాతానికి తగ్గుదలజీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యం 3 శాతం.వృద్ధిరేటు పెరుగుదలకు రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించాల్సిన అవసరం.వృద్ధికి తోడ్పడనున్న తగ్గిన ముడిచమురు ధరలు, సంస్కరణలు, రుతుపవనాలు.పెట్టుబడులు పుంజుకోవడానికి ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం విధానానికి కొత్త రూపు అవసరం.సబ్సిడీలు నేరుగా లబ్ధిదారుడికి అందేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అవసరం.ఆహార ధాన్యాల అంచనా 257.07 మిలియన్ టన్నులు. ఇది గత అయిదేళ్ల సగటు కంటే 8.5 మిలియన్ టన్నులు ఎక్కువ.2015 మార్చి నాటికి 340 బిలియన్ డాలర్లకు చేరనున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు. పెరుగుదల 26 బిలియన్ డాలర్లుగా నమోదు.



ఆర్థిక సంఘం సిఫార్సులకు ఆమోదం
14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిని ఫిబ్రవరి 24న పార్లమెంట్‌కు సమర్పించారు. కేంద్ర పన్నుల్లో 32 శాతంగా ఉన్న రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వై.వి. రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ పెంపు రికార్డు స్థాయిలో 10 శాతంగా ఉంది. కొత్త వాటా ద్వారా 2015-16లో రాష్ట్రాలకు అదనంగా రూ.1.78 లక్షల కోట్లు సమకూరుతుంది. ఈ కాలంలో రాష్ట్రాలకు అందే మొత్తం నిధులు రూ. 5.26 లక్షల కోట్లు. 2014-15లో అందిన ఈ మొత్తం రూ. 3.48 లక్షల కోట్లు. 2019-20 వరకు అయిదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధులు రూ. 39.48 లక్షల కోట్లు.
రాష్ట్ర విభజన వల్ల ఆదాయం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు 2015 నుంచి 2020 వరకు రూ. 22,113 కోట్ల గ్రాంట్ మంజూరు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆదాయ లోటు ఉన్న మరో 10 రాష్ట్రాలకు కూడా గ్రాంట్ ఇవ్వాలని సిఫార్సు చేశారు. ఈ రాష్ట్రాలకు 2020 వరకు రూ. 1.94 లక్షల కోట్లు అందుతుంది. విపత్తు నిర్వహణ కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,429 కోట్లు, తెలంగాణకు రూ.1,364 కోట్లు అందజేయాలని కూడా సిఫార్సు చేశారు.

రైల్వే బడ్జెట్ 2015-16 
2015-16 రైల్వే బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఫిబ్రవరి 26న లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రయాణికుల చార్జీలను యథాతథంగా ఉంచారు. 12 వస్తువుల రవాణా చార్జీలు 0.8 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. 2015-16లో మొత్తం ఆదాయం రూ.1,83,578 కోట్లు కాగా, మొత్తం వ్యయం రూ.1,62,210 కోట్లు. పెట్టుబడులు 52 శాతం పెంచడంతో రూ.1.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ముఖ్యాంశాలు..

వచ్చే అయిదేళ్లలో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులతో రైల్వేలను బలోపేతం చేయడం.రైల్వేల అభివృద్ధికి కనెక్టివిటీ, భద్రత, ఆర్థిక స్థిరత్వం, ఆధునికీకరణలకు ప్రాధాన్యం.సుపరిపాలన, పారిశుద్ధ్యానికి పెద్దపీట.స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ రైల్ కార్యక్రమం. ఇందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు.మహిళల భద్రత కోసం 182 టోల్ ఫ్రీ నెం.17,000 టాయిలెట్లను బయోటాయిలెట్లుగా మార్చడం.152 స్టేషన్లను ఆధునికీకరించడం9,400 కి.మీ. గేజ్ మార్పిడి.6000 కి.మీ. విద్యుద్దీకరణ.రోజూ ప్రయాణికులను చేరవేసే సామర్థ్యాన్ని 21 మిలియన్ల నుంచి 30 మిలియన్లకు పెంచడం.వార్షిక సరకు రవాణా సామర్థ్యాన్ని 1 బిలియన్ నుంచి 1.5 బిలియన్ టన్నులకు పెంచడం.ట్రాక్ పొడవును 20 శాతం పెంచి 114,000 కి.మీ. నుంచి 138,000 కి.మీ.కు విస్తరించడం.9 కారిడార్లలో రైళ్ల వేగాన్ని 110-130 నుం చి 160-200 కి.మీ. వరకు పెంచడం.ఈశాన్య ప్రాంతాలకు అధిక రైలు మార్గాల ఏర్పాటు.120 రోజుల ముందుగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశం.138 హెల్ప్‌లైన్.ప్రయాణికుల సౌకర్యాలకు 67 శాతం నిధుల పెంపు.400 స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం.

ఆర్థికవృద్ధి - సీఎస్‌వో అంచనా
2014-15లో జీడీపీ 7.4 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో) 2015 ఫిబ్రవరి 9న విడుదల చేసిన ముందస్తు అంచనాల్లో పేర్కొంది. బేస్ ఇయర్‌ను 2004-05 నుంచి 2011-12కు మార్పు చేసి ఈ గణాంకాలు విడుదల చేసింది. దీంతో ప్రస్తుత సంవత్సర వృద్ధి రేటు 6.9 శాతం నుంచి 7.4 శాతానికి చేరింది. 2013-14లో వృద్ధి రేటును కూడా 4.7 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. 2012-13 స్థిర ధరల ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ. 106.57 లక్షల కోట్లు ఉంటుందని సీఎస్‌వో అంచనా. 

5.11 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
వినియోగ వస్తు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2015 జనవరిలో 5.11 శాతానికి చేరింది. ఇది డిసెంబర్‌లో 4.28 శాతంగా నమోదైంది. కొత్తగా నిర్ణయించిన బేస్ ఇయర్ 2012 ప్రకారం కేంద్రం తాజా గణాంకాలను విడుదల చేసింది. 2014 జనవరి రిటైల్ ధరలతో పోలిస్తే 2015 జనవరిలో 5.11 శాతం పెరుగుదల ఉన్నట్లు తెలిపారు. పండ్లు, కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. వినియోగ ఆహార పదార్థాల ధరల సూచీని కూడా విడుదల చేశారు. వార్షిక ప్రాతిపదికన ఈ సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6.06 శాతం పెరిగింది.

పారిశ్రామిక వృద్ధి నామమాత్రం
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) వృద్ధి రేటు 2014 డిసెంబర్‌లో నామమాత్రంగా 1.7 శాతంగా నమోదయ్యింది. గనులు, తవ్వకాల రంగం పేలవ పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే 2013 డిసెంబర్‌తో పోల్చిచూస్తే మాత్రం వృద్ధి కొంత బెటర్. అప్పట్లో ఈ వృద్ధి రేటు నామమాత్రంగా 0.1 శాతంగా ఉంది. కాగా 2014 నవంబర్‌లో ఐఐపీ వృద్ధి రేటును స్వల్పంగా 3.8 శాతం నుంచి 3.9 శాతానికి సవరించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఐఐపీ వృద్ధి రేటు 2013-14 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 0.1 శాతం నుంచి 2.1 శాతానికి ఎగసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా కేంద్రం ఈ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు గణాంకాలను విడుదల చేస్తుంది. 

భారత్ ఎగుమతుల్లో క్షీణత
భారత్ ఎగుమతులు 2015 జనవరిలో నిరుత్సాహం కలిగించాయి. 2014 ఇదే నెలతో పోల్చితే విలువలో అసలు వృద్ధి లేకపోగా 11.19 శాతం తగ్గిపోయాయి (క్షీణత). 2015 జనవరిలో ఎగుమతుల విలువ 23.88 బిలియన్ డాలర్లు. 2014 ఇదే నెలలో ఈ పరిమాణం 26.89 బిలియన్ డాలర్లు. ఇంత తక్కువ స్థాయికి ఎగుమతుల రేటు పడిపోవడం రెండున్నర సంవత్సరాల కాలంలో (2012 జూలైలో 14.8 శాతం) ఇదే తొలిసారి. ఇక దిగుమతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. 11.39 శాతం క్షీణించి 32.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల పడిపోవడం వరుసగా ఇది రెండవనెల. దీనితో ఎగుమతులు-దిగుమతులు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 8.32 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు గడచిన తొమ్మిది నెలల్లో మొదటిసారి ఇంత తక్కువ స్థాయిని నమోదుచేసుకుంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విలువ తగ్గడం దీనికి (తక్కువ స్థాయి వాణిజ్యలోటు) ప్రధాన కారణం. చమురు దిగుమతుల బిల్లు 37.46 శాతం పడిపోయి కేవలం 8.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.

పేదరికాన్ని తగ్గించిన జీడీపీ వృద్ధి
భారత్ 2004-11 మధ్య సాధించిన 8 శాతం జీడీపీ వృద్ధి కారణంగా దేశంలో పేదరికం తగ్గిందని ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్ ఆర్థిక-సామాజిక కమిషన్ (ఇఎస్‌సీఏపీ) పేర్కొంది. జీడీపీ వృద్ధి వల్ల పేదరికం 41.6 నుంచి 32.7 శాతానికి తగ్గిందని తెలిపింది. దీంతో 2015 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలన్న మొదటి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యం సాధించిదని ఇఎస్‌సీఏపీ వెల్లడించింది. ప్రాథమిక స్థాయిలో స్కూల్ ఎన్‌రోల్‌మెంట్, ప్రసూతి మరణాల సంఖ్య తగ్గడం, ఎయిడ్స్, మలేరియా, టీబీ వంటి వ్యాధుల నియంత్రణ, అడవుల పెంపకం, తాగు నీటి లభ్యత వంటి అంశాల్లో భారత్ మెరుగైన ప్రగతిని కనబరిచిందని ఇఎస్‌సీఏపీ అభ్రిపాయ పడింది.

వృద్ధి బాటలో భారత్
ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరం (2014-15)లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2004-05 నుంచి 2011-12కు బేస్ ఇయర్ మార్పు ప్రకారం ప్రభుత్వం ఫిబ్రవరి 9న తాజాగా ఈ ముందస్తు అంచనా గణాంకాలను విడుదల చేసింది. మారిన బేస్ ఇయర్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2013-14లో వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 6.9 శాతానికి ఇటీవల సవరించిన సంగతి తెలిసిందే. తాజా ఫార్ములా ప్రకారం ప్రస్తుత ఏడాది వృద్ధి రేటు 6.9 శాతం నుంచి 7.4 శాతానికి ఎగబాకనున్నట్లు కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్‌ఓ) అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (2014 ఏప్రిల్ -2015 మార్చి, అక్టోబర్-డిసెంబర్) 7.5 శాతంగా నమోదయ్యింది. రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 6.5 శాతం. 

విలువల్లో... వాస్తవిక జీడీపీ (లేదా) 2011-12 స్థిర ధరల ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ. 106.57 లక్షల కోట్లు ఉంటుందని తాజా విధానం అంచనా వేస్తోంది.

ఆర్థిక వ్యవహారాలు మార్చి 2015 ఎకానమీ
స్పెక్ట్రం వేలంలో రూ. 1.10 లక్షల కోట్లు
టెలికాం స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.10 లక్షల కోట్లు సమకూరాయి. 19 రోజుల పాటు జరిగిన 115 రౌండ్ల వేలం మార్చి 25న ముగిసింది. బేస్ ధర ప్రకారం రూ. 82,395 కోట్లు రావాల్సి ఉండగా, వేలంలో నికరంగా రూ. 1,09,847 కోట్లకు బిడ్లు వచ్చాయి. పలు టెలికాం సంస్థలకు వివిధ సర్కిళ్లలో పర్మిట్ల గడువు 2015-16లో ముగియనుంది. ఇందువల్ల స్పెక్ట్రం వేలం నిర్వహించారు. ఈ స్పెక్ట్రం పర్మిట్లు 20 ఏళ్ల పాటు ఉంటాయి. 2జీ, సీడీఎంఏ, 3జీ సేవల కోసం 17 సర్కిళ్లలో ప్రభుత్వం వేలం నిర్వహించింది.

కనిష్టంగా ‘టోకు ధరల సూచీ’ ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2015 ఫిబ్రవరిలో -2.06 శాతంగా నమోదైంది. ఇంత కనిష్ట స్థాయిలో నమోదు కావడం 40 ఏళ్లలో ఇదే తొలిసారి. వరుసగా నాలుగో నెల ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. టోకు ధరల సూచీలో ప్రధాన విభాగాలైన ఆహారం, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల ఈ రేటు తగ్గుతోంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 16న విడుదల చేసిన గణాంకాల్లో ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడించింది.

నల్లధనం నియంత్రణ బిల్లుకు ఆమోదం
విదేశాల్లో దాచిన నల్లధనం కేసులకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ మార్చి 17న ఆమోదం తెలిపింది. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తుల (పన్ను విధింపు) బిల్లు-2015కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం దాచిపెట్టిన ఆదాయం, ఆస్తులకు సంబంధించిన పన్నులపై 300 శాతం జరిమానా విధిస్తారు. పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా ఉంటుంది. విదేశీ ఆస్తులకు సంబంధించిన వివరాలు సరిగా చూపకపోయినా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోయినా విచారణ పరిధిలోకి వస్తారు. ఈ కేసుల్లో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. పన్ను విధించదగ్గ ఆదాయం లేకపోయినప్పటికీ విదేశీ ఆస్తుల సొంతదారు, లబ్ధిదారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలి. వీటిలో విదేశీ ఖాతా తెరిచిన తేదీని తప్పనిసరిగా పేర్కొనాలి. నేరానికి పాల్పడిన వారు వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించడానికి అనుమతి ఉండదు.

వచ్చే ఏడాదిభారత్ వృద్ధి8% : ఫిచ్ అంచనా
భారత ఆర్థిక వృద్ధి అంచనాల పట్ల వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆశావహంగా ఉన్నాయి. భారత జీడీపీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 శాతంగానూ, 2016-17లో 8.3 శాతంగానూ ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేస్తోంది. బ్రిక్స్ దేశాల్లో భారత్ మాత్రమే వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని ‘గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్’ నివేదికలో ఫిచ్ పేర్కొంది. జీడీపీ గణనకు ఆధార సంవత్సరాన్ని 2004-05కు బదులుగా కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ) 2011-12కు మార్చిన విషయం తెలిసిందే. వృద్ధి వేగవంతంగా ఉండే అవకాశాలున్నప్పటికీ, బ్యాంక్‌ల మొండి బకాయిలు పెరుగుతున్నాయని, కంపెనీల ఆర్థిక పరిస్థితులు బాగా లేవని, పెట్టుబడుల స్థాయిలు కనిష్ట స్థాయిలో ఉన్నాయని ఫిచ్ ఆందోళన వెలిబుచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న సంస్థాగత సంస్కరణలు, ద్రవ్య, పరపతి విధానాల్లో ఉదారత్వం భారత వృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.4 శాతం వృద్ధిని సాధిస్తుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేసింది. భారత్‌కు కాలం కలసివస్తోందని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి వ్యాఖ్యానించారు. సంస్కరణల జోరు, స్తంభించిన ప్రాజెక్టులను పునఃప్రారంభించడం, పెట్టుబడుల జోరు పెంచడం, ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు.. ఈ అంశాలన్నీ భారత వృద్ధికి చోదక శక్తులుగా పనిచేస్తాయన్నారు.

ఉక్కు ఉత్పత్తిలో మూడో స్థానానికి భారత్
భారత్‌లో ఉక్కు ఉత్పత్తి ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో అమెరికాను మించిపోయింది. 2015 జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమెరికా 13.52 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగా, భారత్ 14.56 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసిందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) వెల్లడించింది. దీంతో ఉక్కు ఉత్పత్తి విషయంలో మూడో అతి పెద్ద దేశంగా అమెరికాను తోసిరాజని భారత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని పేర్కొంది. 

డబ్ల్యూఎస్‌ఏ గణాంకాల ప్రకారం..

వివిధ ఉక్కు కంపెనీల కొత్త ప్లాంట్లు ఈ ఏడాదిలోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించనున్నందున భారత్‌లో ఉక్కు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో భారత ఉక్కు ఉత్పత్తి ఈ ఏడాది 100 మిలియన్ టన్నులను దాటొచ్చు.మరోవైపు సమీప భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకునే సూచనలు లేనందున ఈ దేశంలో ఉక్కు ఉత్పత్తి కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. గత నాలుగేళ్లుగా అమెరికాలో ఏడాదికి 86 నుంచి 88 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతోంది.ఈ కారణాల వల్ల ఈ ఏడాది ఉక్కు ఉత్పత్తి విషయంలో చైనా, జపాన్‌ల తర్వాత స్థానం భారత్‌దే కానున్నది. ఇప్పటి వరకూ మూడో స్థానంలో ఉన్న అమెరికాను భారత్ దాటేసే అవకాశాలున్నాయి.

వృద్ధిలో చైనాను మించనున్న భారత్: ఏడీబీ అంచనా
వృద్ధి రేటులో చైనాను భారత్ అధిగమిస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో 7.8 శాతం, ఆ తర్వాతి ఏడాది 8.2 శాతం వృద్ధి రేటును ఇండియా సాధిస్తుందని తెలిపింది. వచ్చే కొన్నేళ్లలో చైనా కంటే భారత్ వేగంగా పురోగమిస్తుందని ఏడీబీ చీఫ్ ఎకనామిస్ట్ షాంగ్ జిన్ వీ చెప్పారు. ఈ ఏడాది ఆసియా అభివృద్ధి అంచనాలతో రూపొందించిన నివేదికను మంగళవారం న్యూఢిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే..

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల అనుకూల విధానాలను చేపట్టడం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు అదుపులోకి రావడంతో భారత్‌లో వాణిజ్య వాతావరణం మెరుగుపడింది. దేశ, విదేశీ పెట్టుబడిదార్లను ఇండియా ఆకర్షిస్తోంది.చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 7.2 శాతానికి, వచ్చే సంవత్సరం 7 శాతానికి తగ్గిపోతుంది.భారత ఆర్థిక వ్యవస్థ 2015-16లో 7.5 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది.భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఆశాజనకంగా ఉన్నప్పటికీ పలు సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. ద్రవ్యోల్బణం 2015-16లో 5 శాతం, ఆ తర్వాతి ఏడాది 5.5 శాతం ఉండవచ్చు.



ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్చి 13న శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం 5.9 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు. వర్షపాతంలో 36 శాతం లోటు ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 10 వేల సౌరవిద్యుత్ పంపుసెట్లను రైతులకు సమకూర్చనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. రాష్ర్ట స్థూల ఉత్పత్తి (జీఎస్‌డిపి)లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 27.84 శాతంగా ఉందన్నారు.

మొత్తం బడ్జెట్: * 14,184.03 కోట్లు
ప్రణాళికేతర వ్యయం: * 9,670.58 కోట్లు
ప్రణాళికావ్యయం: * 4,513.45 కోట్లు

ప్రధాన కేటాయింపులు:
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం :* 2,717.61 కోట్లు
రుణమాఫీ : * 4,300 కోట్లు
ఉచిత విద్యుత్తు : * 3,000 కోట్లు
వడ్డీలేని రుణాలకు : * 172 కోట్లు
అధిక ఆదాయాన్నిచ్చే పథకాలకు : * 513.21 కోట్లు
పశుగణ రంగం అభివృద్ధి :* 672.73 కోట్లు
మత్స్య శాఖ : * 223.68 కోట్లు
బిందు, తుంపర సేద్యం :*144.07 కోట్లు
వ్యవసాయ విశ్వవిద్యాలయం: *367.73 కోట్లు
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం : *124.48 కోట్లు
ఉద్యాన విశ్వవిద్యాలయం: * 53.01 కోట్లు

అత్యధిక వృద్ధి రేటు దిశగా భారత్
ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిచెందే దిశగా భారత ఆర్థిక వ్యవస్థ పయనిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టీన్ లాగార్డ్ తెలిపారు.
ఇండియాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆమె మార్చి 16న ఈ మేరకు ట్వీట్ చేశారు. భారత ఎకానమీ ఈ ఏడాది 7.25 శాతం, వచ్చే ఏడాది 7.5 శాతం వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో క్రిస్టీన్ సమావేశమయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తదితరులతోనూ ఆమె భేటీ అవుతారు. 

ఆధార్‌పై కేంద్రం ఖర్చు రూ.5,630 కోట్లు
కేంద్ర ప్రభుత్వం యూఐడీ (యూనిక్ ఐడెంటింటి నెంబర్-ఆధార్) ప్రాజెక్టుపై రూ.5,630 కోట్లు ఖర్చు చేసిందని, ఇంతరవరకు 78.65 కోట్ల కార్డులు జారీ చేసినట్లు కేంద్ర ప్రణాళికా మంత్రి రావ్ ఇందర్‌జిత్ సింగ్ మార్చి 13న లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. 2009-2017 వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.13,633.22 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28, 2014 వరకు దీనిపై చేసిన ఖర్చు రూ.5,630 అని తెలిపారు. ఈ ఏడాది మార్చి 10 వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 78.65 కోట్లు అని వివరించారు.

బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం వేతనాలు పెంపు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఎట్టకేలకు తమ దీర్ఘకాలిక డిమాండ్లను సాధించుకున్నారు. దీని ప్రకారం 2012 నవంబర్ నుంచీ 15 శాతం వేతన పెంపు అమలు కానుంది. 
దీనితోపాటు నెలలో రెండు శనివారాలుత సెలవు ఇవ్వాలన్న డిమాండ్ కూడా పరిష్కారమైంది. ఈ మేరకు సోమవారం ఉద్యోగ యూనియన్లకు, యాజమాన్యానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీనితో తమ డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 25 నుంచీ నాలుగురోజుల పాటు జరపతలపెట్టిన సమ్మెను యూనియన్లు విరమించాయి. 
మధ్యేమార్గం...
నిజానికి 19 శాతం వేతన పెంపునకు యూనియన్లు డిమాండ్ చేశాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తొలుత 12.5 శాతం పెంపునకు సరే అంది. దీనికి యూనియన్లు ససేమిరా అన్నాయి. చివరకు చర్చల్లో మధ్యేమార్గంగా 15 శాతంగా నిర్ణయించుకున్నారు. ఈ చర్చల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు, బ్యాంక్ యాజమాన్య, ఐబీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. వీటికి దేశ వ్యాప్తంగా 50,000 బ్రాంచీలుండగా, వాటిలో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 

తగ్గనున్న ల్యాండ్‌లైన్ కాల్ చార్జీలు 
ల్యాండ్‌లైన్ కనెక్షన్ల జోరును పెంచడానికి, లాండ్‌లైన్ నెట్‌వర్క్ వృద్ధి కోసం, ఈ రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి చేసే కాల్స్‌కు ఇంటర్ కనెక్షన్ యూసేజీ చార్జీలను(ఐయూసీ) పూర్తిగా తొలగించింది. గతంలో ఈ చార్జీ కాల్‌కు 20 పైసలుగా ఉండేది. ఇక మొబైల్ ఫోన్ల నుంచి చేసే కాల్స్‌కు ఐయూసీ చార్జీలను కాల్‌కు 20 పైసల నుంచి 14 పైసలకు(30 శాతం) తగ్గించింది. మొబైల్స్ నుంచి ల్యాండ్‌లైన్‌కు చేసే కాల్స్‌కు ఫిక్స్‌డ్ టెర్మినేషన్ చార్జీలు(ఎఫ్‌టీసీ)కూడా ఇకపై ఉండవు. ఆలాగే ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు చేసే కాల్స్‌కు మొబైల్ టెర్మినేషన్ చార్జీలు(ఎంటీసీ) ఉండవు. ఈ నిర్ణయతో ల్యాండ్‌లైన్ కాల్ రేట్లు తగ్గుతాయని ట్రాయ్ పేర్కొంది.

ఆర్థిక వ్యవహారాలు ఏప్రిల్ 2015 ఎకానమీ
దేశవిదేశాల్లో నల్లధనం రూ.7,800 కోట్లు
ఒక ఏడాదికి సంబంధించి నల్లధనంపై లెక్క లు తీసిన కేంద్ర ప్రభుత్వం.. ఆశ్చర్చపోయేస్థాయిలో నిల్వలను కనుగొంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశవిదేశాల్లో రూ. 7,800 కోట్లకు పైగా నల్లధన నిల్వలు పేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ద్వా రా తెలుస్తోంది. దేశంలోని వివిధ ఆర్థిక సంస్థలు అందించిన సమాచారం ప్రకారం ఇలాంటి లావాదేవీలు రికార్డు స్థాయిలో ఉన్నాయని ఆర్థిక నిఘా విభాగం గుర్తించింది. కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్టుమెంట్ రూ.750 కోట్ల విలువైన పన్ను ఎగవేతలను గుర్తించింది.

హిందుజా బ్రదర్స్ ఆసియా బిజినెస్ లీడర్స్
వ్యాపార రంగంలో అపార ప్రతిభ చూపినందుకు హిందుజా సోదరులు ఎస్.పి.హిందుజా, జి.పి.హిందుజాలకు ‘ఆసియా బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్-2015’ అవార్డు దక్కింది. ఏప్రిల్ 18న జరిగిన 5వ ఆసియా ఆవార్డుల ఫంక్షన్‌లో ప్రదానం చేశారు. బిజినెస్‌లో గొప్ప విజయాలు సాధించినందుకు ఈ అవార్డు లభించింది.

మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 5.17 శాతం
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ పెరుగుదల రేటు వార్షికంగా మార్చిలో 5.17 శాతంగా నమోదైంది. సీపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.37, జనవరిలో 5.19 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ధరలు ముఖ్యంగా పాలు, కూరగాయల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం మూడు నెలల్లో కనిష్ట స్థాయికి చేరింది.

ద్రవ్యోల్బణంలో -2.33 శాతం తగ్గుదల
టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలో 2014 మార్చితో పోల్చితే 2015లో -2.33 శాతం తగ్గుదల నమోదైంది. వరుసగా ఐదు నెలల నుంచి టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. 2014 నవంబర్‌లో -0.17, డిసెంబర్‌లో -0.50, 2015 జనవరిలో -0.39, ఫిబ్రవరిలో -2.06 శాతంగా ఉంది. తయారీ వస్తువులు, చమురు, కూరగాయల ధరలు తగ్గడంతో వరుసగా ఐదో నెల ద్రవ్యోల్బణం తగ్గింది. 2014 మార్చిలో ఇది 6 శాతంగా నమోదైంది.

2015-16 వృద్ధి 7.5 శాతం: ఐఎంఎఫ్
భారత వృద్ధి రేటు 2015-16లో 7.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇది 2014లో 7.2 శాతం. చైనా వృద్ధి రేటును భారత్ అధిగమిస్తుందని ఐఎంఎఫ్ ఏప్రిల్ 14న విడుదల చేసిన అంచనాల్లో తెలిపింది. ఇందుకు కనిష్ట చమురు ధరలు, సానుకూల డిమాండ్, పెట్టుబడుల పెరుగుదల అంశాలు భారత్ వృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు కూడా స్థూల దేశీయోత్పత్తి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. పెట్టుబడుల్లో వృద్ధి వల్ల 2017-18 నాటికి 8 శాతం వృద్ధి రేటు సాధించవచ్చని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన దక్షిణాసియా ద్వైవార్షిక నివేదికలో పేర్కొంది.

పెట్టుబడులకు అనువైన దేశం భారత్
పన్ను వ్యవస్థకు సంబంధించిన సవాళ్లు ఉన్నా బ్రిక్ దేశాలతో పోలిస్తే భారత్ పెట్టుబడులకు అనువైన దేశమనే విషయం గ్లోబల్ కన్సల్టెన్సీ, రీసెర్చ్ సంస్థ డాల్ఫిన్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 90 టాప్ జర్మనీ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. సర్వే ప్రకారం ఇన్‌ఫ్రా, అడ్మినిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్స్‌కు సంబంధించిన సమస్యలపైన కాకుండా ఇన్వెస్టర్లు భారత మార్కెట్ వృద్ధిని, మార్కెట్ పరిమాణాన్ని, ఎఫ్‌డీఐలను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. బ్రిక్ దేశాలతో పోలిస్తే భారత్ పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని సృష్టించిందని సర్వేలో పాల్గొన్న 94 శాతం మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు.

2014-15 వృద్ధి రేటు 7.5
2015-16 ఆర్థిక సంవత్సరపు మొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 7న ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లలో మార్పు చేయకుండా ప్రస్తుత రేట్లను యథాతథంగా కొనసాగించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిని 7.5 శాతంగా అంచనా వేసింది. ఇది 2015-16లో 7.8 శాతానికి చేరుకుంటుందని అంచనా. 2016 మార్చి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది 2015, ఆగస్టు నాటికి 4 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది.

ముద్ర యోజన ప్రారంభం
 లఘు, చిన్న ఆర్థిక సంస్థలకు తోడ్పడే మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ఎంయూడీఏఆర్‌ఏ-ముద్ర)యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దాదాపు 12 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న 5.75 కోట్లకు పైగా ఉన్న లఘు, చిన్న తరహా సంస్థల ఆర్థిక అవసరాలను ముద్ర తీరుస్తుందని ప్రధాని తెలిపారు. ఈ సంస్థ రూ.20 వేల కోట్ల కార్పస్ ఫండ్‌తో సేవలందిస్తుంది. ప్రస్తుతం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా పనిచేస్తూ.. ఏడాదిలోగా బ్యాంక్‌గా రూపొందుతుంది. ఈ సంస్థ ఏర్పాటును 2015-16 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

విధులు:

చిన్న తరహా వ్యాపార సంస్థలకు రూ. 50 వేలు-పది లక్షల వరకు రుణ సదుపాయం.బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు 7 శాతం వడ్డీ రేటుపై రీఫైనాన్స్ సేవలు.తయారీ, సర్వీసులు తదితర రంగాల్లో చిన్న వ్యాపారులకు రుణాలు కల్పించే సంస్థలకు మార్గదర్శకాలు రూపొందించడం.మెక్రో ఫైనాన్స్ సంస్థల రిజిస్ట్రేషన్, రేటింగ్ తదితర అంశాలను పర్యవేక్షిస్తూ వడ్డీ రేట్లను నిర్ణయించడం.


ఉత్తమ నిర్వహణ సంస్థగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
అంతర్జాతీయ ఫైనాన్సియల్ మేగజైన్ ఫైనాన్స్‌ఏషియా సర్వేలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారత ఉత్తమ నిర్వహణ సంస్థగా ఎన్నికైంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి ఉత్తమ సీఈఓగా ఎన్నిక అయ్యారు. కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్వెస్టర్ల సంబంధాలలో ఈ బ్యాంక్ 3వ ర్యాంక్‌లో నిలిచింది. 


ఇండో-జర్మన్ బిజినెస్ సదస్సులో ప్రసంగించిన మోదీ
జర్మనీ పర్యటనలో భాగంగా అక్కడి హనోవర్ ఫెయిర్‌లో ఇండో-జర్మన్ బిజినెస్ సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు. భారత్‌ను ప్రపంచ తయారీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జర్మనీ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు.. భారత్‌లోని విధానాలపై గతంలో ఉన్న దురభిప్రాయాలను పక్కన పెట్టి ప్రస్తుతం మారిన నియంత్రణ పరిస్థితులను పరిశీలించాలని ఆయన సూచించారు. ‘మేకిన్ ఇండియా అన్నది అత్యవసరం. భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా మార్చడంలో మా సొంత నిబంధనలు, నియంత్రణలే ప్రతిబంధకాలుగా మారకుండా చూడాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ క్రమంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.
జర్మనీ పత్రికలో మోదీ వ్యాసం
భారత్‌లో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ ప్రధాని మోదీ జర్మనీ దినపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ అల్జెమెయిన్ జీటంగ్ ఎడిటోరియల్ పేజీలో మోదీ ఒక వ్యాసం రాశారు. జర్మనీ వ్యాపారవేత్తలకున్న సందేహాలను ఈ వ్యాసం ద్వారా నివృత్తి చేసేందుకు ప్రధాని ప్రయత్నించారు. 

ఈ ఏడాది వృద్ధిరేటు 7.9 శాతానికి: మోర్గాన్ స్టాన్లీ
భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) 7.9% ఉండొచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. 2016-17లో ఈ రేటు 8.4 శాతంగా ఉంటుందని తాజాగా విడుదల చేసిన ఒక విశ్లేషణా పత్రంలో పేర్కొంది. కేంద్రం పలు రంగాల్లో తీసుకున్న సంస్కరణలు, దేశీయ డిమాండ్ పురోగతి, దిగువస్థాయి ద్రవ్యోల్బణం అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశాలని వివరించింది. 

దవ్య విధానం యథాతథం ...మారని పాలసీ రేట్లు
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 7న నిర్వహించిన తన మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లలో ఎటువంటి మార్పులూ చేయలేదు. ప్రస్తుత రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 7.5 శాతంగా కొనసాగనుంది. రివర్స్ రెపో రేటు (బ్యాంకులు స్వల్పకాలికంగా తన వద్ద ఉంచే నిధులకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటు) 6.5 శాతంగానే ఉంటుంది. ఇక బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగుతుంది. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన పరిమాణం) యథాతథంగా 21.5 శాతంగా ఉండనుంది. 

కారణం ఇది..: రేట్లు యథాతథంగా ఉంచడానికి కారణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించింది. ప్రత్యేకించి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలి అకాల వర్షాలను ప్రస్తావించింది. దీనివల్ల ఆహార ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఎప్పటికప్పుడు లభ్యమయ్యే స్థూల ఆర్థిక గణాంకాల ఆధారంగా తగిన ద్రవ్య పరపతి విధానాన్ని అనుసరిస్తామని గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలను తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, తగిన సమయం లో నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా అరశాతం పాలసీ రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించే అంశం సైతం పెండింగులో ఉండగా... ఇప్పటికిప్పుడు మరో దఫా కీలక రేటు తగ్గింపు సరికాదని ఆర్‌బీఐ భావించినట్లు కనబడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

కొన్నిముఖ్యాంశాలు...

2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతం అంచనా. ఇది 2015-16లో 7.8 శాతానికి పెరిగే అవకాశం.2016 మార్చి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా 5.8 శాతం. ఈ ఏడాది ఆగస్టు నాటికి 4 శాతం.మార్చిలో కొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల రబీ పంట సాగు ప్రాంతంలో 17 శాతం మేర ప్రభావం.బ్యాంకుల వడ్డీరేటు తగ్గింపు ఆధారంగా తదుపరి పాలసీ రేటు కోత.జూన్ 2న రెండవ ద్వైమాసిక విధాన ప్రకటన.ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే (బ్యాంకుల) ఆవరణకు వెలుపల, అలాగే మొబైల్ ఏటీఎంల ఏర్పాటునకు స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు అనుమతి.రిజర్వ్ బ్యాంకు 80వ వార్షికోత్సవం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 80వ వార్షికోత్సవం ఏప్రిల్ 2న జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ పేద రైతులకు రుణాలు ఇవ్వడం, వసూలు చేసుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకులను కోరారు. ఆర్థిక సమ్మిళితం సాధించేందుకు 20 ఏళ్ల మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆర్‌బీఐకి ప్రధాని సూచించారు. కీలకమైన సంఘటనలు నిర్దేశించుకొని లక్ష్యాలు ఏర్పరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు.

2015-20 వాణిజ్య విధానం
2015-20 వాణిజ్య విధానాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 1న ప్రకటించారు. ఇందులోని ముఖ్యాంశాలు: వస్తు, సేవల ఎగుమతులను 2020 నాటికి 900 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యం. ఇవి 2013-14లో 465.9 బిలియన్ డాలర్లుగా ఉన్నా యి. విదేశీ వాణిజ్య విధానాన్ని ఇకపై రెండేళ్లకొకసారి సమీక్షించడం. ఇప్పటివరకు ఈ విధానంపై వార్షిక సమీక్ష జరుగుతోంది. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను 2 శాతం నుంచి 3.5 శాతానికి పెంచడం. ఆం ధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, భీమవరం పట్టణాలను టౌన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ జాబితాలో చేర్చడం. దీంతో ఈ హోదా గల నగరాల సంఖ్య 23కు చేరుకుంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని ఎగుమతి ఆధారిత యూనిట్లకు పలు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

ఏపీ, తెలంగాణలకు కేంద్ర నిధులు 
దేశంలోని 29 రాష్ట్రాలకు 2015-16 ఆర్థిక సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసులపై రాష్ట్రాల వాటా కింద తొలి విడతగా రూ. 37,420 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,616.78 కోట్లు, తెలంగాణకు రూ. 915.85 కోట్లు విడుదలయ్యాయి.అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ. 6,735 కోట్లు, అత్యల్పంగా సిక్కింకు రూ. 137.46 కోట్లు విడుదలయ్యాయి. బిహార్‌కు రూ. 3,624 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.2,835.75 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 2,746.91 కోట్లు, మహారాష్ట్రకు రూ.2,075.59 కోట్లు విడుదలయ్యాయి. తక్కువ నిధులు దక్కిన రాష్ట్రాల్లో గోవా (రూ.141.51 కోట్లు), మిజోరాం(రూ.172.40 కోట్లు), నాగాలాండ్ (రూ.186.68 కోట్లు), మణిపూర్ (రూ.231. 27 కోట్లు) ఉన్నాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పది శాతం పెంచి మొత్తం 42 శాతం ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సూచించటం తెలిసిందే. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.1.78 లక్షల కోట్ల నిధులు అదనంగా రానున్నాయి.రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న 11 రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 48,906 కోట్లు ఇవ్వాలని కూడా ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బెంగాల్, కశ్మీర్ తదితర రాష్ట్రాలున్నాయి.

ఆర్థిక వ్యవహారాలు మే 2015 ఎకానమీ
ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతం
ఏప్రిల్‌లో వినియోగధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.87 శాతంగా నమోదైంది. 2014 ఏప్రిల్ ధరలతో పోల్చితే ఆయా వినియోగ వస్తువుల ధరలు 2015 ఏప్రిల్‌లో 4.87శాతం పెరిగి మార్చిలో 5.25 శాతంగా ఉన్నాయి. 4 నెలల తర్వాత తక్కువ స్థాయిలో ధరల వృద్ధి రేటు నమోదయింది. పండ్లు, కూరగాయలు, పాలు సంబంధిత ఉత్పత్తుల ధరల పెరుగుదలలో వేగం తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం రేటు తగ్గింది.

ఏప్రిల్‌లో -2.65కు తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్‌లో - 2.65 శాతం క్షీణించింది. 2014 ఏప్రిల్‌తో పోల్చితే మొత్తం టోకు వస్తువుల ధరలు పెరగకపోగా 2015 ఏప్రిల్‌లో -2.65 శాతం తగ్గాయి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగినా చమురు, తయారీ రంగ ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐలో ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది 2014 ఏప్రిల్‌లో 5.5 శాతంగా ఉందని ప్రభుత్వం మే14న ప్రకటించింది.

భారత వృద్ధి రేటు 8.1 శాతంగా ఐరాస అంచనా
భారత ఆర్థిక వ్యవస్థ 2015లో 8.1 శాతం వృద్ధి సాధిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతం- ఈ ఏడాది ఆర్థిక, సామాజిక పరిస్థితులు అనే నివేదికలో ఐక్యరాజ్య సమితి వృద్ధిని అంచనా వేసింది. తగ్గిన ద్రవ్యోల్బణం, పటిష్టమైన వినియోగ డిమాండ్, మౌలిక ప్రాజెక్టుల అమలు, ప్రభుత్వ సంస్కరణలు చేపట్టడం వంటివి వృద్ధి రేటు పెరగడానికి దోహదపడతాయని ఐరాస తెలిపింది. ఈ వృద్ధి 2016 లో 8.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

మోదీ సర్కారు ఏడాది పాలనపై అసోచామ్ రేటింగ్
 మోదీ ప్రభుత్వం తొలి ఏడాది పనితీరుపై పారిశ్రామిక మండళ్లు సానుకూలంగానే స్పందించాయి. పదికి ఏడు మార్కులు ఇస్తున్నట్లు అసోచామ్ పేర్కొంది. అయితే, పన్ను సంబంధ అంశాలు, వ్యాపారాలకు మెరుగైన పరిస్థితులను కల్పించడం వంటి విషయాల్లో ప్రభుత్వం ఇంకా చాలాచేయాల్సి ఉందని అభిప్రాయపడింది. ‘గడిచిన ఏడాది వ్యవధిలో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చింది. కరెన్సీ స్థిరత్వం, ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకోవడం వంటివి దీనికి దోహదం చేశాయి. రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత లావాదేవీలపై పన్ను విధింపు)లకు సంబంధించి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) ఆందోళనలను పరిష్కరించాలి. భారీ స్థాయి మౌలిక రంగ ప్రాజెక్టులు ప్రారంభం కావాల్సి ఉంది’ అని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐదు విదేశీ పర్యటనలతో ఆర్థికపరమైన దౌత్యంలో కొత్త మార్పులను తీసుకొచ్చేలా చేసిందని కూడా ఆయన పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీలు, స్వచ్ఛ భారత్, జన ధన యోజన వంటి పథకాలపై విదేశాల్లో కూడా విశేష స్పందన వ్యక్తమైందని కపూర్ చెప్పారు.

చైనాతో ఆర్థిక బంధం బలపడింది: సీఐఐ
ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనతో ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధానికి పునరుత్తేజం లభించిందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. పర్యటన సందర్భంగా కుదిరిన వ్యాపార ఒప్పందాలు శుభపరిణామమని అభిప్రాయపడింది.

వస్తు, సేవల బిల్లుకు ఆమోదం
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ మే 6న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రాలు, కేంద్రం వస్తు, సేవల పన్ను వసూలుకు వీలుకల్పిస్తుంది. సేవల పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంప్ డ్యూటీ, ఎంట్రీ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్‌లను వస్తు, సేవల పన్నులో కలిపేస్తారు. దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్ను వ్యవస్థ అమలు చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఆమోదం తర్వాత 29 రాష్ట్రాల్లో.. సగం రాష్ట్రాలు ఈ బిల్లుకు ఆమోదం తెలపాలి. 2016 ఏప్రిల్ నుంచి జీఎస్‌టీని అమల్లోకి తేవాల్సి ఉంది. నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన జీఎస్‌టీ పన్ను రేటు 27 శాతం కంటే పన్ను రేటు తక్కువగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

టాప్ 10 కన్సూమర్ ఫైనాన్స్ కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ
ప్రపంచ అతిపెద్ద పది కన్సూమర్ ఫైనాన్స్ కంపెనీల్లో భారత్‌కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ ఏడవ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన ఈ టాప్ 10 జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారత కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీయే. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, క్యాపిటల్ వన్ ఫైనాన్షియల్, విసా, డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓరిక్స్, మాస్టర్‌కార్డ్‌లు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా అతి పెద్ద, అత్యంత శక్తివంతమైన 2,000 కంపెనీల జాబితాలను ఫోర్బ్స్ ఇటీవలనే రూపొందించింది. ఈ జాబితాల్లో భాగంగా కన్సూమర్ ఫైనాన్స్ కంపెనీల విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీకు ఏడవ స్థానం, పూర్తి 2,000 జాబితాలో 485వ స్థానం దక్కింది. ఇక ఈ 2,000 కంపెనీల జాబితాల్లో భారత్‌లో వివిధ రంగాలకు చెందిన 56 కంపెనీలకు చోటు దక్కింది. అతి పెద్ద బ్యాంకుల జాబితాలో ఏ భారత బ్యాంక్‌కూ స్థానం లభించలేదు. ప్రాంతీయ బ్యాంకుల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 22వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్‌కు 29వ స్థానం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు 40వ స్థానం లభించాయి.

2015-16లో భారత్ వృద్ధిని 7.5 శాతం అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతానికి పెరుగుతోందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, అధిక సుస్థిరత ఇందుకు తోడ్పడుతున్నాయని 2015 ఏప్రిల్ 28న భారత్ వృద్ధిపై విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇది 2016-17లో మరింత పెరిగి 7.9 శాతానికి చేరుతుందని, 2017-18లో 8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటును 8.5 శాతంగా చూపింది.

వ్యాపార పరిస్థితులను మెరుగుపర్చేందుకు పెట్టుబడుల మార్గాలకు అడ్డంకులు తొలగించే సంస్కరణలు ప్రారంభించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) సరళీకరణ వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అదే విధంగా మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను పెంపొందించడం, కార్పొరేట్ వివాదాలకు సత్వర పరిష్కారం, పన్ను విధానాలను సరళీకరించడం, తక్కువ కార్పొరేట్ పన్నులు వంటి పనులను ప్రభుత్వం చేపట్టిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

ఆర్థిక వ్యవహారాలు జూన్ 2015 ఎకానమీ
ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో భారత్ ముందంజ
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆకర్షించడంలో 2014లో భారత్ మొదటి పది స్థానాల్లో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి సమావేశం(యూఎన్‌సీటీఏడీ) పేర్కొంది. 2015 వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్‌ను ఆ సంస్థ జూన్ 24న విడుదల చేసింది. 2014లో మొదటి పది స్థానాల్లో చైనా 129 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. 2013లో 15వ స్థానంలో ఉన్న భారత్ 2014లో ఆరు స్థానాలు మెరుగుపరచుకొని 9వ స్థానానికి చేరింది. దక్షిణాసియాలోకి వచ్చిన 41.2 బిలియన్ డాలర్లలో 83.5 శాతం భారత్‌కు దక్కాయి.

ఏఐఐబీ విధివిధానాలపై 50 దేశాల సంతకాలు
ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) విధివిధానాల ఒప్పందంపై భారత్‌తో సహా 50 దేశాలు జూన్ 29న బీజింగ్‌లో సంతకాలు చేశాయి. ఈ బ్యాంకులో సభ్యదేశాల వాటా, పాలనా వ్యవస్థ, విధానపర నిర్ణయాలు వంటి 60 అంశాలకు సంబంధించి ఈ ఒప్పందం కుదిరింది. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాలకు ఆర్థిక మద్దతును అందించే లక్ష్యంతో చైనా నేతృత్వంలోని 100 బిలియన్ డాలర్ల అధీకృత మూలధనంతో ఈ బ్యాంకు ఏర్పాటవుతోంది.

అదనపు సెక్యూరిటీ ఫీచర్‌తో కొత్త వంద నోట్లు
భారత రిజర్వ్ బ్యాంక్ అదనపు సెక్యూరిటీ ఫీచర్‌తో కొత్త రూ.వంద నోట్లను జారీ చేసింది. కొత్త నెంబరింగ్ ప్యాటర్న్‌తో ఈ మహాత్మా గాంధీ 2005 సిరీస్ బ్యాంక్‌నోట్లను అందిస్తుంది. నోటుపై రెండు చోట్ల ఉండే నంబర్ల ప్యానల్‌లో అంకెల సైజు ఎడమ నుంచి కుడివైపుకు పెరుగుతూ ఉంటుంది. మొదటి మూడు అంకెలు(అల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్) సైజు ఒకేలా ఉంటుంది. ఒక్క నంబరింగ్ ప్యాటర్న్ మినహా మిగిలిన అన్ని అంశాలు మహాత్మా గాంధీ సిరీస్ 2005 నోట్లలో ఒకే విధంగా ఉంటాయి. గతంలో ఈ సిరీస్‌లో జారీ చేసిన అన్ని నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయి.

వరి మద్దతు ధర రూ.50 పెంపు
వరి ధాన్యానికి మద్దతు ధరను రూ.50 పెంచుతూ ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ జూన్ 17న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కామన్ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.1360 కనీస మద్దతు ధరతోపాటు రూ.200 బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ కంది, పెసర, మినప పంటలకు వర్తిస్తుంది. కందికి మద్దతు ధరను క్వింటాలుకు రూ.75 పెంచడంతో బోనస్ రూ.200 కలిపి మొత్తం ధర రూ.4625కు చేరింది. పెసరకు రూ.50 పెంచడంతో బోనస్‌తో కలిపి మొత్తం 4850 చేరింది. 

మోదీ సర్కారు పాలనపై అసోచామ్ నివేదిక
రోడ్లు, పోర్టులు, విద్యుత్ రంగంలో కీలక ప్రాజెక్టుల జాప్యం విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలే కారణమని పారిశ్రామిక మండలి అసోచామ్ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వం అవినీతికి దూరంగా ఉందని, వారి పర్యవేక్షణ కారణంగా ప్రభుత్వాధికారులు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అభిప్రాయపడింది. ఈ జాప్యం వల్ల తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని పేర్కొంది. 

స్విస్ బ్యాంక్ ఖాతాల్లో 61 వ స్థానంలో భారత్
స్విస్ బ్యాంక్‌ల్లో డ బ్బు దాచిన విదేశీ ఖాతాదారుల జాబితాలో భారత్ 61వ స్థానంలో నిలిచింది. స్విస్ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు దాచిన విదేశాల జాబితాలో బ్రిటన్, అమెరికాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో పాకిస్తాన్ 73వ స్థానంలో ఉంది. స్విస్ బ్యాంకుల్లో ఉన్న విదేశీ ధనంలో మూడింట రెండొంతులు కేవలం రెండు పెద్ద బ్యాంకులు యూబీఎస్, క్రెడిట్ సూయిష్‌లలోనే ఉంది. భారతీయులు దాచుకున్న సొమ్ములో 82 శాతం వరకు ఈ రెండు బ్యాంకుల్లోనే ఉన్నట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది. స్విస్ బ్యాంకుల్లో నిల్వ చేసిన భారతీయుల డబ్బు 2014లో 10 శాతం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది.

మే నెలలో టోకు ద్రవ్యోల్బణం -2.36 శాతం
ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ రంగ వస్తువుల ధరలు తగ్గడంతో మే నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -2.36 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వం జూన్ 15న ప్రకటించింది. వరుసగా ఏడోనెల ఈ ప్రతిద్రవ్యోల్బణం కొనసాగింది. 2014 నవంబరు నుంచి డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ప్రతికూలంగానే కొనసాగింది.

5.1 శాతానికి పెరిగిన సీపీఐ ద్రవ్యోల్బణం
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2015 మే నెలలో 5.01 శాతానికి చేరింది. ఇది 2015 ఏప్రిల్‌లో 4.87 శాతంగా నమోదైంది. పండ్లు, కూరగాయల ధరలు తగ్గినప్పటికీ పప్పు ధాన్యాల ధరలు పెరగడంతో మేలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇది 2014 మేలో 8.83 శాతంగా ఉంది. 2015, మే 12న గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం ఏప్రిల్‌లో పోల్చితే మేలో పప్పు ధాన్యాల ధరలు 16.62 శాతం పెరిగాయి.

మొబైల్ వినియోగదారులు ఐదేళ్లలో 140 కోట్లు!
దేశంలో 2020 నాటికి మొబైల్ వినియోగదారుల సంఖ్య 140 కోట్లకు చేరుతుందని టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్‌సన్ తెలిపింది. గతేడాది మొబైల్ వినియోగదారుల సంఖ్య 97 కోట్లుగా ఉందని పేర్కొంది. అందుబాటు ధరల్లో వివిధ మొబైల్ హ్యాండ్‌సెట్స్ అందుబాటులో ఉండటమే మొబైల్ వినియోగదారుల సంఖ్య పెరుగుదలకు ప్రధాన కారణమని తెలిపింది. ఎరిక్‌సన్ నివేదిక ప్రకారం.. జీఎస్‌ఎం వినియోగదారులు ఈ ఏడాది గణనీయంగా పెరగనున్నారు. కానీ తర్వాత 3జీ సర్వీసుల ప్రభావంతో వీరి సంఖ్యలో తగ్గుదల నమోదుకావచ్చు. 2020 నాటికి 4జీ వినియోగదారుల సంఖ్య 23 కోట్లకు చేరుతుందని అంచనా. గతేడాది 12 కోట్లుగా ఉన్న డబ్ల్యూసీడీఎంఏ వినియోగదారుల సంఖ్య 2020 నాటికి 62 కోట్లకు చేరవచ్చు. అలాగే గతేడాది 13 కోట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 2020 నాటికి 75 కోట్లకు పెరగవచ్చు.

పన్ను సమాచార మార్పిడి
ఆర్థిక సమాచారాన్ని ఆటోమేటిక్‌గా మార్పిడి చేసుకునే విధానానికి (ఏఈఓఐ) సంబంధించిన మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటీ అగ్రిమెంట్ (ఎంసీఏఏ)పై భారత్, పారిస్‌లో జూన్ 3న సంతకం చేసింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల సంఖ్య 60కి చేరింది. ఏఈఓఐ పూర్తిగా అమలైతే భారీగా పన్ను చెల్లించే ఖాతాదారుడి సమాచారం అతడికి చెందిన దేశానికి నిర్దేశించిన కాలంలో పన్ను పొందుతున్న దేశం చేరవేస్తుంది. ఇంతకుముందు పన్ను ఎగవేత కేసుల్లో సంబంధిత దేశం కోరితేనే సమాచార మార్పిడి జరిగేది.

పోటీ ప్రపంచంలో భారత్‌కు 44వ స్థానం
ఆర్థిక పోటీ ప్రపంచంలో భారత్‌కు 44వ ర్యాంకు లభించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (ఐఎండీ)’ ఈ మేరకు తన వార్షిక నివేదికను విడుదల చేసింది. 2015లో ప్రధానంగా 61 దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ఆధారంగా ఐఎండీ ఈ నివేదిక ఇచ్చింది. దేశీయంగా భారత్ ఆర్థిక పనితీరుకు సంబంధించి ర్యాంక్ 21 నుంచి 16కు మెరుగుపడింది. జాబితాలో అమెరికా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. తరువాతి 10 స్థానాల్లో వరుసగా హాంకాంగ్(2), సింగపూర్(3), స్విట్జర్లాండ్(4), కెనడా(5), నార్వే(6), డెన్మార్క్(7), స్వీడన్(8), జర్మనీ(9), లగ్జెంబర్గ్ (10) ఉన్నాయి. 

భారత్ వృద్ధి రేటు 7.5 శాతం
2014-15 చివరి త్రైమాసికం (జనవరి - మార్చి) మధ్యకాలంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.5 శాతంగా నమోదైంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) మే 29న విడుదల చేసింది. ఇదే కాలంలో చైనా వృద్ధిరేటు 7 శాతంగా ఉంది. దీంతో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. తయారీ, సేవల రంగాల పనితీరు అధిక వృద్ధికి తోడ్పడింది. తయారీ రంగం 8.4 శాతం, సేవల రంగం 14.1 శాతం వృద్ధి సాధించింది. మైనింగ్, క్వారీ రంగంలో 2.3 శాతం నమోదైంది. వ్యవసాయ రంగం కేవలం 1.4 శాతం వృద్ధి సాధించింది. 2014-15లో జీడీపీ విలువ రూ.106.44 లక్షల కోట్లుగా (2011-12 స్థిర ధరల్లో) ఉంది.

14 శాతం ‘సేవా’ పన్ను అమలు
భారత్‌లో సేవల పన్ను 12.36 శాతం(విద్యా సెస్సు కూడా కలిపి) నుంచి 14 శాతానికి పెరిగింది. దేశీయ పరోక్ష పన్నుల వ్యవస్థ 2016 ఏప్రిల్ 1 నుంచి ‘వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ)’గా మారుతోంది. ఈ కొత్త వ్యవస్థకు అనుగుణంగా సేవల పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం మార్చింది.

రెపోరేటును 7.25 శాతానికి తగ్గించిన ఆర్బీఐ
 ప్రభుత్వ, పారిశ్రామిక పెద్దల కోరికకు, అంచనాకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 జరిగిన ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా కీలక రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 7.25 శాతానికి చేరింది. దీనికి అనుగుణంగా రివర్స్ రెపో రేటు 6.25 శాతానికి చేరుతుంది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ను 4 శాతంగానే యథాతథంగా కొనసాగించింది. కీలక పాలసీ రేటు రెపోను ఆర్‌బీఐ తగ్గించడం ఈ ఏడాది ఇది మూడవసారి. కాగా భవిష్యత్తుకు సంబంధించి నిరాశాజనక అంచనాలను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెలువరించారు. 

బంగ్లాదేశ్‌లోనూ ఎల్‌ఐసీ సేవలు
బంగ్లాదేశ్‌లో వ్యాపార నిర్వహణకు భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)కు అనుమతి లభించింది. తద్వారా, బంగ్లాదేశ్‌లో బీమా వ్యాపారానికి అనుమతి పొందిన రెండో విదేశీ సంస్థగా ఆవిర్భవించింది. ‘ఎల్‌ఐసీ బంగ్లాదేశ్’ పేరుతో జాయింట్ వెంచర్ సంస్థగా దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఎల్‌ఐసీకి సగం వాటా ఉంటుంది. మిగిలిన సగం వాటా బంగ్లా భాగస్వాముల చేతుల్లో ఉంటుంది. కొన్ని నిబంధనలతో ఎల్‌ఐసీకి అనుమతి మంజూరు చేశామని బంగ్లాదేశ్ బీమా అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐడీఆర్‌ఏ) చీఫ్ ఎం.షెఫాక్ అహ్మద్ బుధవారం మీడియాకు తెలిపారు. భారత్‌లోని అతి పెద్ద బీమా రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ ఆరు దశాబ్దాలుగా జీవిత బీమా సేవలు అందిస్తోంది.

ఆర్థిక వ్యవహారాలు జూలై 2015 ఎకానమీ
ఫార్చ్యూన్ జాబితాలో ఏడు భారత కంపెనీలు
 ప్రపంచంలోని 500 టాప్ కంపెనీల జాబితాను ఫార్చ్యూన్ విడుదల చేసింది. ఇందులో భారత్ కంపెనీలు ఏడు ఉన్నాయి. ఆయా కంపెనీలు ఆర్జించే మొత్తం ఆదాయం ద్వారా ఈ ర్యాంకింగ్‌ను నిర్ణయించారు. జాబితాలో మొదటి ర్యాంక్‌లో అమెరికా సంస్థ వాల్‌మార్ట్ ఉంది. రెండవ స్థానంలో చైనా పెట్రోలియం రిఫైనింగ్ దిగ్గజం సినోపిక్ గ్రూప్ నిలిచింది. నెదర్లాండ్స్ రాయల్ డచ్ షెల్‌ది మూడవ స్థానం. చైనా నేషనల్ పెట్రోలియంది నాల్గవ స్థానం. ఐదవ స్థానంలో ఎగ్జాన్ మొబిల్ ఉంది. 128 కంపెనీలతో అమెరికా జాబితాలో తొలి స్థానంలో ఉంది. 100 కంపెనీలతో చైనా ద్వితీయ స్థానంలో ఉంది. 

500 కంపెనీల్లో భారత ఏడు కంపెనీల ర్యాంకులు 

భారత్ కంపెనీ

ర్యాంక్

ఆదాయం

ఇండియన్ ఆయిల్

119

74

రిలయన్స్ ఇండస్ట్రీస్

158

62

టాటా మోటార్స్

254

42

ఎస్‌బీఐ

260

42

భారత్ పెట్రోలియం

280

40

హిందుస్తాన్ పెట్రోలియం

327

35

ఓఎన్‌జీసీ

449

26

(ఆదాయం బిలియన్ డాలర్లలో)

టెక్నాలజీ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఒప్పందం
దాదాపు 200 టెక్నాలజీ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) జూలై 24న తెలిపింది. అమెరికా, చైనా, ఐరోపా యూనియన్‌కు చెందిన 28 దేశాలతోపాటు మొత్తం 49 దేశాలు ఈ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో టెక్నాలజీ సంబంధ ఉత్పత్తులు వినియోగదారులకు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. వీటిలో జీపీఎస్ నావిగేషన్ పరికరాలు, మెడికల్ స్కానర్లు, కొత్త తరానికి చెందిన సెమీకండక్టర్లు తదితర ఉత్పత్తులు ఉన్నాయి.

ఫోర్బ్స్ ఆసియా 50లో భారత్ కంపెనీలు 10
ఫోర్బ్స్ ఆసియా ఫ్యాబ్యులస్ 50 కంపెనీల్లో భారత్ కంపెనీలు పది ఉన్నాయి. అరబిందో ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లుపిన్, మదర్‌సన్ సుమి సిస్టమ్స్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టెక్ మహీంద్ర, టైటాన్ ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. వరుసగా ఐదో సంవత్సరం భారత్ కంపెనీల సంఖ్య రెండో స్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మంచి పనితీరును కనబరుస్తున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. కాగా చైనా కంపెనీల సంఖ్యలో మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణకొరియాది తరువాతి స్థానం. మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్‌కు చెందిన కంపెనీలు రెండు చొప్పున ఉన్నాయి. ఇండోనేషియా, జపాన్ కంపెనీలు ఒక్కొక్కటిగా ఉన్నాయి. వార్షిక ఆదాయం కానీ, లేదా మార్కెట్ క్యాపిటల్ కానీ మూడు బిలియన్ డాలర్లు దాటిన 1,116 కంపెనీల్లోంచి ఈ ‘50’ కంపెనీలను ఎంపిక చేస్తారు.

2015-16లో వృద్ధి రేటు 7.8 శాతం: ఏడీబీ
ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) భారత జీడీపీ వృద్ధి రేటు 2015-16లో 7.8 శాతంగా కొనసాగుతుందని తెలిపింది. ఏడీబీ జూలై 17న విడుదల చేసిన అంచనాల్లో 2016-17లో భారత వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ వృద్ధిని సానుకూల రుతుపవనాలు, కొత్త పెట్టుబడుల ఆధారంగా అంచనావేసింది. అయితే, అభివృద్ధి చెందుతున్న ఆసియా వృద్ధి రేటును 2015లో ముందు అంచనావేసిన 6.3 శాతం కంటే తక్కువగా (6.1 శాతం) ఉంటుందని తెలిపింది. దక్షిణాసియా వృద్ధి రేటు 2015లో 7.3 శాతంగా ఉంటుందని అంచనావేసింది. దీన్ని గతంలో 7.2 శాతంగా పేర్కొంది.

షాంఘైలో బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావం
చైనా రాజధాని షాంఘై కేంద్రంగా జూలై 21న నేషనల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) ఆవిర్భవించింది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కూటమి 100 బిలియన్ డాలర్ల మూలధనంతో ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) వంటి పశ్చిమదేశాల ఆధిపత్య ధోరణి బహుళజాతి బ్యాంకులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం ఈ బ్యాంక్ ఏర్పాటు లక్ష్యం. అభివృద్ధి చెందుతున్న ప్రముఖ దేశాల కూటమి ఏర్పాటు చేసిన మొదటి బ్యాంక్ ఇది. ఈ బ్యాంకుకు భారత్‌కు చెందిన ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ తొలి ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు.

జూన్‌లో 5.4 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 5.4 శాతంగా నమోదైంది. అంటే 2014 జూన్‌లో వస్తువుల మొత్తం బాస్కెట్ ధరతో పోల్చితే 2015లో దీని ధర 5.4 శాతం పెరిగింది. ఇది మేలో 5.01 శాతం. వరుసగా మూడో నెల సీపీఐ ద్రవ్యోల్బణంలో పెరుగుదల నమోదైంది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 5.5 శాతానికి పెరిగింది. ఇది 2015 మేలో 4.8 శాతంగా నమోదయినట్లు జూన్ 13న కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. పప్పు ధాన్యాల ధరలు భారీగా 22.24 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 9.71 శాతం పెరిగాయి.

ప్రపంచ వృద్ధిరేటు తగ్గుదల: ఐఎంఎఫ్
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్).. 2015లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంగా ఉండొచ్చని జూలై 9న వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ)లో పేర్కొంది. ఇది ఏప్రిల్‌లో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 0.2 శాతం తక్కువ. వచ్చే సంవత్సరం ఈ వృద్ధి రేటు 3.8 శాతానికి పెరగవచ్చని తెలిపింది. చైనా వృద్ధిని భారత్ అధిగమిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది.

గ్రీస్ బెయిలవుట్‌కు యూరోజోన్ ఆమోదం
యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగకుండా బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటిస్తూ జూలై 13న యూరోజోన్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కఠినమైన షరతులకు గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ అంగీకరించడంతో రుణదాతలు డీల్‌కు ఒప్పుకున్నారు. మూడేళ్లపాటు అమలయ్యే విధంగా 86 బిలియన్ యూరోల(దాదాపు 96 బిలియన్ డాలర్లు) బెయిలవుట్ ప్యాకేజీని ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో ఐదేళ్ల వ్యవధిలో గ్రీస్‌కు ఇది మూడో బెయిలవుట్ కానుంది. 2010 నుంచి ఇప్పటివరకూ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు 240 బిలియన్ యూరోల విలువైన రెండు ప్యాకేజీలను అమలు చేశాయి. 

యూరోజోన్ షరతులు
గ్రీస్ కఠినమైన కార్మిక, పెన్షన్ సంస్కరణలు, వ్యయ నియంత్రణ చర్యలకు కట్టుబడి ఉండాలి. దీనికి పార్లమెంటులో బుధవారం(ఈ నెల 15)కల్లా ఆమోదముద్ర పడాలి. తాజాగా కుదిరిన బెయిలవుట్ ప్యాకేజీని ఆమోదించేందుకు కూడా ఇదే డెడ్‌లైన్. ఆ తర్వాతే బెయిలవుట్‌పై తదుపరి సంప్రదింపులు మొదలవుతాయి. అంటే పెన్షన్లలో కోత, పన్నుల (వ్యాట్) పెంపు, ప్రైవేటీకరణ వంటి చర్యలను తక్షణం అమల్లోకి తీసుకురావాలన్నమాట.
అన్నింటికంటే ముఖ్యంగా జర్మనీ కొత్త షరతుతో ఆ దేశ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రకారం గ్రీస్ 50 బిలియన్ యూరోల(దాదాపు 56 బిలియన్ డాలర్లు) విలువైన ప్రభుత్వ ఆస్తులను ఒక ప్రత్యేకమైన నిధికి బదలాయించాలి. ఈ ఆస్తులపై పర్యవేక్షణ, మధ్యవర్తిత్వం అంతా రుణదాతల(జర్మనీ నేతృత్వంలోని యూరోజోన్) చేతిలోనే ఉంటుంది.
ఈ ప్రత్యేక నిధికి చెందిన ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని గ్రీస్ బ్యాంకులకు మూలధనం సమకూర్చడం, పాత రుణ బకాయిలు తీర్చడానికి వినియోగిస్తారు. ఇందులో 12 బిలియన్ యూరోలను గ్రీస్‌లో కొత్త పెట్టుబడులకు కూడా ఉపయోగించనున్నట్లు జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ పేర్కొన్నారు.
కొత్త దివాలా(బ్యాంక్రప్సీ) నిబంధనలు, ఈయూ బ్యాంకింగ్ చట్టాన్ని గ్రీస్ ఆమోదించాలి. దీనిప్రకారం చెల్లింపుల్లో గ్రీస్ చేతులెత్తేస్తే... బడా డిపాజిటర్లు ముందుగా నష్టపోవాల్సి వస్తుంది.

ఎస్‌ఎంఎస్‌ల ఆలోచన రూపకర్త మృతి
మొబైల్ నెట్‌వర్క్ ద్వారా ఎస్‌ఎంఎస్ సమాచారం పంపే ఆలోచనను అభివృద్ధి చేసిన మట్టి మెకోనెన్ (63)లండన్‌లో జూన్ 26న అనారోగ్యంతో మరణించారు. ఫిన్‌లాండ్‌కు చెందిన మెకోనెన్ అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఎస్ సాంకేతికతకు నోకియా సంస్థ ప్రాచుర్యం కల్పించింది. 1994లో ‘నోకియా 2010’ మోడల్ ఫోన్‌లో తొలిసారి ఎస్‌ఎంఎస్ సౌకర్యం కల్పించింది.

సామాజిక, ఆర్థిక , కుల జనగణన 2011 విడుదల
‘2011 సామాజిక, ఆర్థిక , కుల జనగణన(ఎస్‌ఈసీసీ)’ వివరాలను కేంద్ర ప్రభుత్వం జులై 3న విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం గ్రామాల్లోని ప్రతీ మూడు కుటుంబాల్లో ఒకటి కూలి పనిని జీవనోపాధిగా చేసుకున్న సాగుభూమి లేని నిరుపేద కుటుంబమేనని తేలింది. 23.52% గ్రామీణ కుటుంబాల్లో చదువుకున్న పెద్దలెవరూ(25 ఏళ్లు పైబడినవారు) లేరని వెల్లడైంది. దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన జనగణన-2011 వివరాలను ఆ శాఖ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్‌తో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు. ఈ సెన్సస్‌లో వివరాల నమోదుకు పేపర్‌ను ఉపయోగించకపోవడం విశేషం. చేతిలో ఇమిడే 6.4 లక్షల ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో పౌరుల వివరాలను నమోదు చేశారు. 1932 తరువాత కులాల వారీగా వివరాలను నమోదు చేసిన సెన్సస్ ఇదే.

ఎస్‌ఈసీసీ- 2011 ముఖ్యాంశాలు..

దేశంలో మొత్త 24.39 కోట్ల కుటుంబాలున్నాయి. పల్లెల్లోని కుటుంబాలు 17.91 కోట్లు. ఈ పల్లె కుటుంబాల్లో 10.69 కోట్లు నిరుపేద కుటుంబాలు.2.37 కోట్ల(13.25%) గ్రామీణ కుటుంబాలు కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న ఒకే ఒక్క గదిలో నివసిస్తున్నాయి.51.14% పల్లె కుటుంబాలు(9.16కోట్లు) కూలిపనిపై, 30.10% కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. 14.01%(2.5 కోట్లు) ప్రభుత్వ, ప్రైవేట్ కొలువుల్లాంటి వాటిపై ఆధారపడి ఉన్నాయి.4.08 లక్షల మంది చెత్త ఏరుకోవడం ద్వారా, 6.68 లక్షల మంది భిక్షాటన, ఎన్జీవోల సాయం ద్వారా జీవనం గడుపుతున్నారు.గ్రామాల్లో మాన్యువల్ స్కావెంజర్స్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర(2.5%)తొలి స్థానంలో ఉంది. ఈ విషయంలో దేశ సగటు 0.10%(18.06 లక్షలు)గా ఉంది. గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మణిపూర్, అస్సాం తదితర 9 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థను నిర్మూలించాయి.పల్లెల్లో ఎక్కువ మొత్తం సంపాదించే కుటుంబ సభ్యుడి సంపాదన నెలకు సగటున రూ.5 వేల లోపే ఉన్న కుటుంబాలు74.49%(13.34 కోట్ల కుటుంబాలు). 1.48 కోట్ల కుటుంబాల్లోని (8.29%) అత్యధిక సంపాదనాపరుడైన వ్యక్తి నెలవారీ సంపాదన మాత్రం రూ. 10 వేలుగా ఉంది.గ్రామాల్లో నెలవారీ జీతాలొచ్చే ఉద్యోగ కుటుంబాలు 9.68%. ఈ కుటుంబాల్లో ఆదాయపన్ను చెల్లిస్తోంది 4.6%.
బ్రిక్స్ నిధికి భారత్.. 18 బిలియన్ డాలర్లు
 బ్రిక్స్ దేశాలు 100 బిలియన్ డాలర్లతో నెలకొల్పనున్న విదేశీమారక ద్రవ్య నిల్వల నిధి(ఫారెక్స్ రిజర్వ్స్ పూల్)కి భారత్ తనవంతుగా 18 బిలియన్ డాలర్లను సమకూర్చనుంది. డాలర్ లిక్విడిటీలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఒకరికొకరు సహకారం అందించుకోవడానికి ఈ నిధిని ఏర్పాటు చేశారు.

ఆర్థిక వ్యవహారాలు ఆగష్టు 2015 ఎకానమీ
బంధన్ బ్యాంకు ప్రారంభం
దేశీయ బ్యాంకింగ్ రంగంలో కోల్‌కతాలో మరో పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకు ‘బంధన్’ ఆగస్టు 23న ప్రారంభమమైంది. దీన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో తొలివిడతగా 501 శాఖలు, 2,022 సర్వీస్ సెంటర్లు, 50 ఏటీఎంలతో కార్యకలాపాలను ప్రారంభించినట్లు బంధన్ బ్యాంకు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 27 రాష్ట్రాల్లో మొత్తం 632 శాఖలు, 250 ఏటీఎంలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా తమ సేవలను కొనసాగిస్తామని తెలిపింది. ‘కస్టమర్ ఫస్ట్’ తమ వ్యాపార సిద్ధాంతమని బ్యాంకు చీఫ్ చంద్రశేఖర ఘోష్ తెలిపారు.

నల్లధనంపై సెబీ యుద్ధం
పన్ను ఎగవేత కోసం స్టాక్ మార్కెట్లను ఉపయోగించుకుంటున్న 59 సంస్థలపై మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలు ప్రత్యక్షంగా/పరోక్షంగా స్టాక్ మార్కెట్లో ఎలాంటి కొనుగోలు/అమ్మకం వంటి కార్యకలాపాలు నిర్వహించవు. నిషేధానికి గురైన వాటిలో హెచ్‌ఎన్‌ఐ, శ్రీకమోడిటీస్, మహాకాళేశ్వర్ మైన్స్ తదితర సంస్థలు ఉన్నాయి.

పతనమైన రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్ల పతనం కారణంగా ఆగస్టు 24న రూపాయి విలువ తగ్గింది. డాలర్‌తో పోల్చితే దేశీ కరెన్సీ మారకం విలువ 66 స్థాయి కంటే కిందకు పడిపోయింది. 82 పైసలు క్షీణించి 66.65 వద్ద ముగిసింది. ఒక్కరోజులోనే రూపాయి విలువ ఇంతగా పడిపోవడం ఈ ఏడాదిలోనే ఇది తొలిసారి. ఇది రెండేళ్ల కనిష్టం కూడా. చైనా తమ కరెన్సీని డీవాల్యూ చేయడంతో గత రెండు వారాల్లో ఏకంగా 202 పైసలు పడిపోయింది. 

‘రామ్‌దేవ్’తో డీఆర్‌డీఓ ఒప్పందం
రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తను అభివృద్ధి చేసిన పలు ఔషధ, ఆహార ఉత్పత్తులను తయారు చేసి, మార్కెట్ చేసేందుకు యోగా గురువు రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేత లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ (దిహార్) అభివృద్ధి చేసిన సీబక్‌థార్న్ సాంకేతిక ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి ఆదివారం లెసైన్సు ఒప్పందాలను కుదుర్చుకుంది. 

భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద పతనం
భారత స్టాక్ మార్కెట్లు ఆగస్టు 24, 2015న భారీ పతనాన్ని కళ్లజూశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమవడంతో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఉదయం ఆరంభమవుతూనే 600 పాయింట్లు కోల్పోయిన బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్... ట్రేడింగ్ ముగిసేసరికి 1,625 పాయింట్లు కోల్పోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 491 పాయింట్లు పతనమైంది. ఒక్కరోజులో ఇన్ని పాయింట్లు కోల్పోవటం... ఇంత మొత్తంలో సొమ్ము ఆవిరవడం చరిత్రలో ఎప్పుడూ లేదు. శాతాల వారీగా చూసినా 2009 తరవాత ఈ స్థాయి పతనం లేదు. బీఎస్‌ఈ-500 కంపెనీల్లో 114 కంపెనీల షేర్లు ఆగస్టు 24 ఒక్కరోజే ఏడాది కనిష్టానికి చేరిపోయాయి. బీఎస్‌ఈ మొత్తం మార్కెట్ క్యాప్‌లో ఈ 500 కంపెనీలదే 93 శాతం.

ఏఐఐబీ హెడ్‌గా జిన్ లిక్విన్
ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) హెడ్‌గా చైనా మాజీ ఉప ఆర్థిక మంత్రి జిన్ లిక్విన్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం ధ్రువీకరించింది. చైనా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లోనూ, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గానూ జిన్ లిక్విన్ బాధ్యతల నిర్వహించారు. ఏఐఐబీని ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులకు పోటీగా పరిగణిస్తున్నారు.

జూలైలో 3.78 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2015 జూలైలో కనిష్ట స్థాయిలో 3.78 శాతంగా నమోదైంది. ఇది జూన్‌లో 5.40గా ఉంది. దాదాపు రెండున్నర సంవత్సరాల్లో రిటైల్ ధరల పెరుగుదల ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలతోపాటు పలు ఆహార ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండటం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైంది. దీనికి సంబంధించిన గణాంకాలను ప్రభుత్వం 2015, ఆగస్టు 12న విడుదల చేసింది.

కరెన్సీ విలువను తగ్గించిన చైనా
చైనా తన కరెన్సీ యువాన్ విలువను రెండుసార్లు తగ్గించింది. ఆగస్టు 11న రెండు శాతం, ఆగస్టు 12న 1.6 శాతం తగ్గించింది. దీంతో మొత్తంగా 3.6 శాతం యువాన్ విలువ తగ్గింది. 1994 తర్వాత చైనా తమ కరెన్సీ విలువను ఇంత ఎక్కువగా తగ్గించడం ఇదే తొలిసారి. మార్కెట్ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేసేందుకు కరెన్సీ విలువ తగ్గించాల్సి వచ్చిందని చైనా పేర్కొంది.

జూలైలో -4.05 శాతానికి తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం బాస్కెట్ ధర వద్ద 2014 జూలైతో పోల్చితే 2015లో -4.05 శాతం క్షీణించింది. కూరగాయలు, ఇంధనాల ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం తగ్గింది. ఇది 2015 జూన్‌లో -2.4 శాతంగా నమోదైంది. దీనికి సంబంధించిన గణాంకాలను ప్రభుత్వం ఆగస్టు 14న విడుదల చేసింది.

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘ఇంద్రధనుష్’
ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) తోడ్పాటునిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 14న ఏడు సూత్రాల ప్రణాళిక ‘ఇంద్రధనుష్’ను ఆవిష్కరించింది. దీని కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13 పీఎస్‌బీలకు రూ. 25,000 కోట్లు అందించనున్నారు.

ఇంద్రధనుష్ ప్రణాళికలోని ఏడు సూత్రాలు:

బ్యాంకుల్లో నియామకాల కోసం బోర్డు ఆఫ్ బ్యూరో ఏర్పాటుమూలధనం సమకూర్చడంమొండిబకాయిల తగ్గింపు చర్యలురాజకీయ ప్రమేయం తగ్గిస్తూ సాధికారత కల్పించడంజవాబుదారీతనం పెంచడంగవర్నెన్స్‌పరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడంహోల్డింగ్ సంస్థ ఏర్పాటు చేయడం


ఎస్‌బీఐ మొబైల్ వాలెట్ యాప్ ‘బడ్డీ’ ఆవిష్కరణ
 ‘బడ్డీ’ పేరుతో ఎస్‌బీఐ రూపొందించిన మొబైల్ వాలెట్ యాప్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 18న ముంబైలో ఆవిష్కరించారు. ఎస్‌బీఐ సొంత ఖాతాదారులతో పాటు ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా ‘బడ్డీ’ మొబైల్ వాలెట్ యాప్ సేవలు వినియోగించుకోవచ్చని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. యాప్‌లో రిజిస్టర్ అయిన కస్టమర్లకు నగదు బదిలీ చేసేందుకు, సినిమా టికెట్లు, హోటళ్లు, విమాన టిక్కెట్లు మొదలైనవి బుక్ చేసుకునేందుకు, షాపింగ్ తదితర అవసరాలకు బడ్డీ ఉపయోగపడుతుందని వివరించారు. అలాగే బిల్లుల చెల్లింపులు, రీచార్జ్‌లు మొదలైన వాటికి అలర్ట్‌లు కూడా పంపుతుందని అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులో ఉంది.

గోధుమల దిగుమతిపై 10 శాతం పన్ను
ఎనిమిదేళ్ల అనంతరం కేంద్రం మళ్లీ గోధుమల దిగుమతిపై పన్ను విధించింది. 2016 మార్చి వరకు వీటి దిగుమతిపై 10 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించింది. గోధుమల ఎగుమతులను అరికట్టడంతో పాటు ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లో నిల్వ ఉన్న తక్కువ నాణ్యత కలిగిన ధాన్యాన్ని అమ్మేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ చట్టం 1962, సెక్షన్ 159ను అనుసరించి 2016 మార్చి 31 వరకు గోధుమల దిగుమతిపై 10 శాతం పన్ను విధించనున్నారు.

మూడో ద్వైమాసిక విధాన సమీక్ష
మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 4న ప్రకటించింది. రెపో రేటు (బ్యాంకులకిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను 7.25 శాతం వద్ద కొనసాగించింది. దీనికి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కారణంగా చూపింది. అదే విధంగా రివర్స్ రెపో రేటు (బ్యాంకులు స్వల్పకాలానికి తనవద్ద ఉంచే నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు)ను కూడా 6.25 శాతానికే పరిమితం చేసింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్ - బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తం)ని కూడా 4 శాతంగానే ఉంచింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.6 శాతంగా ఉందని పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు లక్ష్యం 7.6 శాతంగా వెల్లడించింది. నాలుగో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సెప్టెంబరు 29న జరుగుతుంది.

షియామీ మొబైల్ ఫోన్ ఆవిష్కరణ
షియామీ ఆంధ్రప్రదేశ్‌లో తయారుచేసిన మొబైల్ ఫోన్ ‘రెడ్‌మి-2 ప్రైమ్’ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఆగస్టు 10న ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీలో షియామీ ఫోన్లను తయారుచేశారు. చైనాకు చెందిన షియామీ సంస్థ.. ఇప్పటివరకు చైనా, బ్రెజిల్‌లో మాత్రమే ఈ ఫోన్లను తయారు చేస్తోంది. ఇకపై భారత్‌లో అమ్మే ప్రతి షియామీ ఫోన్‌ను ఈ దేశంలోనే తయారుచేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న షియామీ సంస్థ ఉపాధ్యక్షుడు హ్యూగోబర్ర ప్రకటించారు.

బఫెట్ కంపెనీ భారీ ఒప్పందం
విమానాల విడిభాగాల తయారీ సంస్థ ప్రెసిషన్ క్యాస్ట్‌పార్ట్స్‌ను వారెన్ బఫెట్‌కి చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే.. 37.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది. ఇందులో ఈక్విటీ భాగం 32.64 బిలియన్ డాలర్లు కాగా మిగిలినది డెట్ రూపంలో ఉంటుంది. ప్రెసిషన్ క్యాస్ట్‌పార్ట్స్ షేరు ఆగస్టు 7న 193.88 డాలర్ల దగ్గర ట్రేడవగా బెర్క్‌షైర్ 21.2% ప్రీమియంతో షేరు ఒక్కింటికి 235 డాలర్లు ఆఫర్ చేసింది.

అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం
అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది రెండో క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో సానుకూల రీతిలో 2.3 శాతంగా నమోదైంది. వినియోగ వ్యయం పెరగడం (అమెరికా ఆర్థిక క్రియాశీలతలో ఈ విభాగం వాటా దాదాపు 70 శాతం), ఎగుమతుల్లో వృద్ధి వంటి అంశాలు దీనికి కారణమని వాణిజ్య శాఖ పేర్కొంది.

7 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
 కేంద్రప్రభుత్వం రూ.981 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో హాత్‌వే కేబుల్ అండ్ డేటా కామ్, హైదరాబాద్‌కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, లాలియా ట్రేడింగ్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి.

యోగా ముద్రతో రూ.10 నాణేలు
భారత వారసత్వ సంపద అయిన యోగాకు అంతర్జాతీయంగా ఓ దినోత్సవాన్ని కేటాయించినందుకు గుర్తుగా భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ. 10 నాణేలను విడుదల చేయనుంది. యోగా దినోత్సవానికి గుర్తుగా భారత ప్రభుత్వం రూ. 10 నాణేలను ముద్రించనున్నట్లు ఆర్బీఐ జూలై 30న వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

అక్టోబర్ 1 నుంచి ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కార్యకలాపాలు
కొత్తగా బ్యాంకింగ్ లెసైన్సు పొందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ 2015 అక్టోబర్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. జులై 23న ఐడీఎఫ్‌సీ బ్యాంకుకు ఆర్‌బీఐ లెసైన్సు మంజూరు చేసింది. మొదట 20 శాఖలు, రూ. 55,000 కోట్ల రుణ ఖాతాలతో ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. 


ఆర్‌బీఐ పాలసీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఆగస్టు 4న జరిగిన మూడో ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో పాలసీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో రెపో రేటు 7.25 శాతం, రివర్స్ రెపో రేటు 6.25 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంగా యథాతథ స్థితిలో ఉండనున్నాయి. 
రెపో రేటు: బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు.
రివర్స్ రెపో రేటు: బ్యాంకులు స్వల్పకాలం తన వద్ద ఉంచే నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటు.
నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్): బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల పరిమాణం.

ఆర్థిక వ్యవహారాలు సెప్టెంబరు 2015 ఎకానమీ
హెలికాప్టర్ల కొనుగోలుకు యూఎస్‌తో భారత్ ఒప్పందం
రక్షణ రంగ వినియోగానికి 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల కొనుగోలుకు అమెరికా ప్రభుత్వంతో, అక్కడి వైమానిక సంస్థ బోయింగ్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 28న జరిగిన ఈ ఒప్పందం విలువ 300 కోట్ల(రూ. 19.86 వేల కోట్లు) డాలర్లు. తొలి హెలికాప్టర్‌ను భారత్‌కు అందించేందుకు మరో 3, 4 సంవత్సరాలు పడుతుంది. 

రెపో రేటు 0.5 శాతం తగ్గించిన ఆర్‌బీఐ
రెపో రేటును 0.5 శాతం తగ్గిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సెప్టెంబర్ 29న ప్రకటించారు. దీనితో రెపో రేటు 6.75 శాతానికి తగ్గింది. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి. దీనికి అనుగుణంగా రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా మారింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోలలో (ఎస్‌ఎల్‌ఆర్) ఎటువంటి మార్పులూ చేయలేదు.

గోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేబినెట్ ఆమోదం
గోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ సెప్టెంబరు 9న ఆమోదం తెలిపింది. దేశీయంగా బంగారం డిమాండ్ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభిస్తోంది. అదే విధంగా ఇళ్లకు పరిమితమవుతున్న బంగారాన్ని మార్కెట్ వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు కూడా ఈ పథకాలు ఉపయోగపడతాయి. వీటివల్ల బంగారం దిగుమతులు తగ్గుముఖం పడతాయి. బంగారానికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక ఆస్తులను అభివృద్ధి చేసేందుకు బంగారం బాండ్ల (ఎస్‌జీబీ) పథకాన్ని ప్రారంభించాలని ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకు ఈ బాండ్లను జారీచేస్తుంది.

వ్యాపారానికి అనువైన రాష్ట్రాల్లో గుజరాత్‌కు మొదటి స్థానం
వ్యాపారానికి అనువైన రాష్ట్రాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రూపొందించిన జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐఐపీ), సీఐఐ, ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీతో కలిసి ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదిక సెప్టెంబరు 14న విడుదలైంది. జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం, జార్ఖండ్‌కు మూడో స్థానం లభించింది. తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అరుణాచల్‌ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. స్థల కేటాయింపులు, కార్మిక సంస్కరణలు, పర్యావరణ అనుమతులు, వ్యాపారాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, మౌలిక సదుపాయాలు వంటి 8 ప్రాతిపదికల ఆధారంగా నివేదికను రూపొందించారు.

కరెన్సీ నోట్లకు కొత్త నంబరింగ్ విధానం!
నకిలీ కరెన్సీ నోట్ల నియంత్రణ దిశగా రూ.1000, రూ.500 నోట్లలో కొత్త నంబరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ముద్రా ప్రైవేట్ లిమిటెడ్, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లకు సూచించింది. ఈ కొత్త నోట్లు వచ్చే ఏడాది మే నుంచి అందుబాటులోకి రానున్నాయి. 

ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితాలో ఐఓసీ
ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్‌కు చెందిన అతిపెద్ద చమురు రిటైల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కి 119వ స్థానం దక్కింది. ఇది 2015 సంవత్సరానికి గ్లోబల్ 500 రెవెన్యూలో అతిపెద్ద భారతీయ సంస్థగా ఫార్చ్యూన్ జాబితాలో నిలిచింది. గత 20 ఏళ్లుగా ఐఓసీ ఈ జాబితాలో చోటుదక్కించుకుంటోంది. ఇంతవరకు ఏ భారతీయ కంపెనీ కూడా ఫార్చ్యూన్ జాబితాలో ఐఓసీని అధిగమించలేదు.

జతియా హౌస్‌ను రూ.425 కోట్లకు కొన్న బిర్లా
పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా ముంబైలోని మలబార్ హిల్‌లో ఉన్న జతియా హౌస్‌ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది భారీ మొత్తం. సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ రెండతస్తుల బంగళా.. బిల్టప్ ఏరియా సుమారు 25వేల చ.అ. ఉంటుంది. 1970లలో వై జతియా దీన్ని ఎంసీ వకీల్ నుంచి కొనుగోలు చేశారు.

గోల్డ్ బాండ్, డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
గోల్డ్ బాండ్, పసిడి డిపాజిట్ (మోనిటైజేషన్) పథకాలకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 9, 2015వ తేదీన ఆమోద ముద్ర వేసింది. మెటల్‌గా (ఫిజికల్ గోల్డ్) పసిడి డిమాండ్‌ను తగ్గించడానికి, ఇళ్లలో, సంస్థల్లో బీరువాలకే పరిమితమవుతున్న పసిడిని వ్యవస్థలోకి తీసుకువచ్చి, ఆర్జన సామర్థ్యం సమకూర్చడం, తద్వారా దేశ ఆర్థిక పటిష్టత ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలు.

డిపాజిట్ స్కీమ్:
డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రజలు తమ వద్ద అదనంగా ఉన్న పసిడిని బ్యాంకుల్లో స్వల్ప (1-3 సంవత్సరాలు), మధ్య (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక కాలాలకు (12-15 సంవత్సరాలు) డిపాజిట్ చేసుకోవచ్చు. బంగారం రూపంలో వడ్డీని గుణించి, మెచ్యూరిటీ తరువాత నగదు రూపంలో అసలు, వడ్డీలను చెల్లిస్తారు.

గోల్డ్ బాండ్:
గోల్డ్ బాండ్ పథకం వార్షిక గరిష్ట పరిమితి వ్యక్తికి 500 గ్రాములు. 5 నుంచి 7 సంవత్సరాల కాలపరిమితితో ఈ బాండ్ల జారీ జరుగుతుంది. ఈ స్కీమ్ ప్రకారం, పసిడిని ఫిజికల్‌గా కాకుండా, భారత పౌరులు గోల్డ్ బాండ్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. 5, 10.50, 100 గ్రాముల చొప్పున ఈ గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. వాటి కాలవ్యవధి 5 నుంచి 7 ఏళ్లు వుంటుంది. భారత పౌరులు, సంస్థలకు మాత్రమే ఈ బాండ్లను ఆఫర్ చేస్తారు. ఇన్వెస్టర్లు మెచ్యూరిటీ కంటే ముందస్తుగా వీటిని అమ్మేందుకు వీలుగా ఎక్స్ఛేంజీలపై ఈ బాండ్లు ట్రేడవుతాయి.

ఆంధ్రాబ్యాంక్ ముద్రా కార్డు
 చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారవేత్తల కోసం ఆంధ్రాబ్యాంకు ‘ముద్రా’ పేరుతో రూపే డెబిట్‌కార్డులను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రాలోన్స్‌లో భాగంగా ఎటువంటి క్రెడిట్ గ్యారంటీ లేకుండానే రూ. 10 లక్షల లోపు రుణాలను బ్యాంకులు మంజూరు చేయనున్నాయి.

పీఎంఎంవై రుణ లక్ష్యం 1.22 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద బ్యాంకులు రూ.1.22 లక్షల కోట్లను చిన్న వ్యాపార యూనిట్లకు రుణాలుగా అందించనున్నాయి. ముద్రా రుణాల కోసం బ్యాంకింగ్ రంగానికి రూ.1.22 లక్షల కోట్లను కేటాయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

జన్‌ధన్ యోజన్ ద్వారా రూ.22,000 కోట్లు
కేంద్ర ప్రతిష్టాత్మక పథకం జన్‌ధన్ యోజన కింద 17.5 కోట్ల బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.22,000 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌలభ్యం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా 2014, ఆగస్టు 28న ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఆర్థిక వ్యవహారాలు అక్టోబరు 2015 ఎకానమీ
ఆఫ్రికాకు భారత్ రూ. 65.33 వేల కోట్ల రుణం
భారత్ తరఫున ఆఫ్రికా దేశాలకు రానున్న ఐదేళ్లలో రూ. 65.33 వేల కోట్ల మేరకు రాయితీతో కూడిన రుణాన్ని అందజేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 29న ప్రకటించారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన మూడో ఇండియా-ఆఫ్రికా ఫోరం సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆఫ్రికాకు రూ. 3.9 వేల కోట్ల సహాయక నిధిని కూడా ప్రకటించారు. ఇవి భారత్ ఇప్పటికే అందిస్తున్న రుణ సదుపాయాలకు అదనమని పేర్కొన్నారు. ఈ సదస్సు గత మూడు దశాబ్దాల్లో భారత్ నిర్వహిస్తోన్న అతిపెద్ద కార్యక్రమం. ఇందులో 54 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో 41 ఆఫ్రికా దేశాల అధినేతలు ప్రతినిధులుగా హాజరయ్యారు.

రెండు పన్ను సేవలను ప్రారంభించిన అరుణ్ జైట్లీ
పన్నుల వ్యవస్థను మరింత స్నేహపూర్వకంగా మలచడానికి ఉద్దేశించిన రెండు కీలక సేవలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అక్టోబర్ 27న ప్రారంభించారు. ఇందులో ఒకటి ఈ-సహయోగ్ కాగా, మరొకటి పాన్ క్యాంప్స్ ఏర్పాటు. పన్ను అంశాలకు సంబంధించి కార్యకలాపాలు సులభతరం చేయడం కూడా వీటి ప్రధాన లక్ష్యం.
ఈ-సహయోగ్: పేపర్ రహిత సేవలు ఈ-సహయోగ్ ప్రధాన ఉద్దేశం. దీని కింద అసెస్సీలకు నోటీసులు వారి ఈమెయిల్స్‌కే పంపిస్తారు. చిన్న కేసుల విషయంలో అసెస్సీ ఐటీ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా చేయాలన్నది ఈ పైలట్ ప్రాజెక్ట్ ముఖ్యాంశం.
పాన్ క్యాంప్స్: పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కవరేజ్‌ను మరింత పెంచడం పాన్ క్యాంప్స్ లక్ష్యం. దేశంలో ప్రస్తుతం 23 కోట్ల మందికి పాన్ కార్డులు ఉన్నాయి. అయితే అందరికీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి పాన్ ఇప్పటికీ లేని అంశంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా శిబిరాల ఏర్పాటు ద్వారా పాన్ అందుబాటు సౌలభ్యం కల్పించడానికి కేంద్రం వ్యూహ రచన చేసింది. తాజా చొరవ నేపథ్యంలో సీబీడీటీ 43 పాన్ క్యాంప్స్‌ను ఏర్పాటు చేసింది.

వ్యక్తిగత సంపదలో భారత్‌కు 10వ స్థానం
దేశాల వారీగా వ్యక్తిగత సంపద విషయంలో భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. దేశం మొత్తం ప్రైవేటు సంపద విలువ 3,492 బిలియన్ డాలర్లు. ఆస్తి, నగదు, ఈక్విటీలు, బిజినెస్ ప్రయోజనాలుసహా ప్రతి దేశంలోని వ్యక్తులందరి ప్రైవేటు సంపద ప్రాతిపదికన న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ 2015కు సంబంధించి ఈ నివేదికను విడుదల చేసింది. ఈ వరుసలో 48,734 బిలియన్ డాలర్లతో అమెరికా ముందు నిలిచింది. తరువాత స్థానాల్లో చైనా (17,254 బి.డాలర్లు), జపాన్ (15,230 బి.డాలర్లు), జర్మనీ (9,358 బి.డాలర్లు), బ్రిటన్ (9,240 బి.డాలర్లు), ఫ్రాన్స్ (8,722 బి. డాలర్లు), ఇటలీ (7,308 బి. డాలర్లు), కెనడా (4,796 బి.డాలర్లు) నిలిచాయి. 

బిజినెస్ అనుకూల దేశాల జాబితాలో భారత్‌కు 130వ ర్యాంకు
కొత్త కంపెనీల చట్టం, విద్యుత్ సరఫరా మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో వ్యాపారాల నిర్వహణకు అనుకూల దేశాల జాబితాలో భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. గతేడాది భారత ర్యాంకింగ్ 142. ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట ప్రపంచ బ్యాంకు 189 దేశాలతో రూపొందించిన జాబితాలో పది అంశాల ప్రాతిపదికన భారత్‌కు తాజాగా 130వ ర్యాంకు దక్కింది. ఈ లిస్టులో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిల్యాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనా 84, పాకిస్తాన్ 138 ర్యాంకుల్లో ఉన్నాయి. కనీస పెట్టుబడి పరిమితి నిబంధనలను తొలగించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించడాన్ని భారత్ మరింత సులభతరం చేయడం సానుకూలాంశమని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది.

భారత వృద్ధిరేటును తగ్గించిన ఐఎంఎఫ్
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అక్టోబరు 5న విడుదల చేసిన నివేదికలో భారత వృద్ధిరేటును 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 3.1 శాతంగా ఉంటుందని తెలిపింది. 2016 సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 7.5 శాతం, చైనా వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండనుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థల పురోగమనం నెమ్మదిగా ఉండటం, వర్థమాన దేశాల్లో మందగమన పరిస్థితులు, చమురు ధరలు తగ్గడం వల్ల చమురు ఎగుమతి దేశాల ఇబ్బందులు వంటి కారణాలతో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు తిరోగమనంలో ఉందని తెలిపింది.

వృద్ధిరేటును 7.5 శాతంగా పేర్కొన్న అంక్టాడ్
2015 సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)రేటు 7.5 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్) అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ దేశాలు కరెంట్ అకౌంట్ లోటును తగ్గించుకొనేందుకు చమురు ధరల తగ్గుదల ఉపయోగపడిందని అభిప్రాయపడింది. 

సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే!
ఫోర్బ్స్ ఆసియా ప్రాంత 50 సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే ఉన్నాయి. ఈ జాబితాలో 21.5 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ కుటుంబం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫోర్బ్స్ జాబితాలో 26.6 బిలియన్ డాలర్ల సంపదతో దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ లీ కుటుంబం టాప్‌లో ఉంది.

ఐడీఎఫ్‌సీ బ్యాంకు ప్రారంభం
దేశీయంగా 91వ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా ఐడీఎఫ్‌సీ బ్యాంకు అక్టోబర్ 1న కార్యకలాపాలు ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లో 15 బ్రాంచీలు సహా మొత్తం 23 శాఖలతో బ్యాంకు సేవలు మొదలయ్యాయి. కార్పొరేట్, హోల్‌సేల్ బ్యాంకింగ్‌తో పాటు గ్రామీణ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం బ్యాంకులో 1,200 మంది ఉద్యోగులు ఉన్నారు. బంధన్, ఐడీఎఫ్‌సీలు కొత్తగా బ్యాంకింగ్ లెసైన్సులు పొందాయి. బంధన్ ఇప్పటికే బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుపెట్టింది.

ముద్ర యోజనను ప్రారంభించిన మోదీ
 మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని జార్ఖండ్‌లో అక్టోబర్ 2న ముద్ర యోజనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సంథాల్ పరగణాలోని దుంకాలో ‘ముద్ర మహారుణ మేళా’ను, బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ పథకాన్ని ప్రారంభించారు. ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులకు తొలి విడతగా మోదీ రూ. 10 వేల చొప్పున రుణం అందించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ. 26 వేల కోట్లను 20 లక్షల మంది మహిళలు సహా అర్హులైన 42 లక్షల మందికి రుణాలుగా అందిస్తారు.

ఆర్థిక వ్యవహారాలు నవంబరు 2015 ఎకానమీ
రెండేళ్ల కనిష్టానికి రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం నవంబరు 27న 19 పైసలు క్షీణించి 66.76 వద్ద ముగిసింది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి. నెల చివర కావడంతో దిగుమతిదారులు, కొన్ని బ్యాంక్‌ల నుంచి డాలర్‌కు డిమాండ్ బాగా ఉండటంతో రూపాయి విలువ ఈ స్థాయిలో క్షీణించిందని నిపుణులు పేర్కొంటున్నారు.

అక్టోబర్‌లో -3.81 శాతంగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం
ఈ ఏడాది అక్టోబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -3.81 శాతంగా నమోదైంది. ఇది సెప్టెంబర్‌లో -4.54 శాతంగా ఉంది. 2014 అక్టోబర్‌లో 1.66 శాతంగా నమోదైంది. అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిలో ఉండటం వల్ల టోకు ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెల మైనస్‌లోనే కొనసాగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నవంబర్ 16న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 

ఆస్తుల రికవరీపై ప్రపంచ సదస్సు
ఆస్తుల రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సు నవంబర్ 18న న్యూఢిల్లీలో జరిగింది. సీబీఐ, అవినీతి నిరోధక, విజిలెన్స్ విభాగాల 21వ సదస్సును కూడా నిర్వహించారు. వ్యవస్థీకృత నేరాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటివి అక్రమ నిధులు పెంపొందిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

102 కోట్లకు చేరిన టెలిఫోన్ వినియోగదారులు
దేశంలో ఈ ఏడాది (2015) సెప్టెంబర్ నాటికి టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 102 కోట్లకు చేరిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నవంబర్ 18న తెలిపింది. టెలీ- డెన్సిటీ కూడా 80.98 శాతానికి పెరిగింది.

ఫార్చ్యూన్ టాప్-50లో సత్యనాదెళ్ల, అజయ్ బంగా
బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ రూపొందించిన ప్రపంచ టాప్ 50 బిజినెస్ లీడర్ల జాబితాలో భారత సంతతికి చెందిన అజయ్‌బంగా, ఫ్రాన్సిస్ డిసౌజా, సత్యనాదెళ్లలకు చోటు దక్కింది. ఈ జాబితాలో మాస్టర్డ్ కార్డ్‌అజయ్‌బంగా ఐదవ స్థానం, కాగ్నిజంట్ ఫ్రాన్సిస్ డిసౌజా 16వ స్థానం, మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల 47వ స్థానాలలో నిలిచారు. ఈ జాబితాలో నైక్ కంపెనీకి చెందిన మైక్ పార్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఫేస్‌బుక్ మార్క్‌జుకర్ బర్‌‌గ నిలిచారు.

సరైన దిశలో భారత్ సంస్కరణలు 
భారత్‌లో ఆర్థిక సంస్కరణలు సరైన దిశలో పయనిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడానికి తమ వంతు సహకారం అందిస్తామని ఐఎంఎఫ్ తెలిపింది. భారత వృద్ధిరేటును 2015లో 7.3 శాతంగా, 2016లో 7.5 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది.

ఢిల్లీలో 35వ అంతర్జాతీయ వాణిజ్య మేళా
దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ వాణిజ్య మేళాను న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నవంబర్ 14వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. రెండు వారాలపాటు జరిగే ఈ 35వ అంతర్జాతీయ వాణిజ్య మేళా ఈ నెల 27తో ముగుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ మేళాలో 28 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ వాణిజ్య మేళాలో అఫ్ఘానిస్తాన్ భాగస్వామ్య దేశంగా పాలుపంచుకోగా, బంగ్లాదేశ్ ప్రధాన దేశంగా ఉంది. గోవా, జార్ఖండ్ రాష్ట్రాలు నిర్వహణలో భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్నాయి. మధ్య ప్రదేశ్ ప్రధాన రాష్ట్రంగా ఉంది. దేశ విదేశాల నుంచి దాదాపు 7000 కంపెనీలు తమ ఉత్పత్తులను మేళాలో ప్రదర్శిస్తాయి.

జమ్మూకాశ్మీర్‌కు రూ.80 వేల కోట్ల ప్యాకేజీ
జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి రూ.80 వేల కోట్ల ప్యాకేజీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 7న శ్రీనగర్‌లో జరిగిన ర్యాలీలో ప్రకటించారు. జమ్మూలోని చందర్‌కోట్‌లో 450 మెగావాట్ల బగ్లీహర్ జల విద్యుత్ ప్రాజెక్టు రెండో దశను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఉధంపూర్-రాంబన్, రాంబన్-బనీహాల్ మధ్య నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధాని ప్రకటించిన రూ.80,068 కోట్ల ప్యాకేజీని రహదారులు, వరద నిర్వహణ, పర్యాటక రంగం, విద్యుత్ రంగం, ఆరోగ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యాన అభివృద్ధి, స్వచ్ఛ భారత్, ఆకర్షణీయ నగరాలు, భద్రత, సంక్షేమ రంగాల అభివృద్ధికి ఖర్చు చేస్తారు.

భారత జీడీపీలో ఐపీఎల్ వాటా రూ. 1150 కోట్లు
ఈ ఏడాది భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఐపీఎల్ వాటా రూ. 1150 కోట్లు అని ఓ సర్వేలో తేలింది. భారత్‌లో 2015 సీజన్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి అంశం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 2650 కోట్లు అని కేపీఎంజీ అనే ప్రఖ్యాత ఆర్థిక గణాంక సంస్థ చేపట్టిన సర్వేలో తేలినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. ఆతిథ్య నగరాలు కాకుండా ఇతర నగరాల నుంచి వచ్చిన 20 శాతం మంది అధికంగా ఈ పోటీలను తిలకించారు. ఇందులో యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.

ఆర్థిక వ్యవహారాలు డిసెంబరు 2015 ఎకానమీ
క్యూ2లో క్యాడ్ 1.6 శాతం
కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) సెప్టెంబర్ త్రై మాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.6 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది 8.2 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ లోటు జీడీపీలో 2.2 శాతంగా ఉంది. విలువలో 10.9 బిలియన్ డాలర్లు. ఎగుమతులు-దిగుమతులకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు తగ్గడం త్రై మాసికం పరంగా క్యాడ్ తగ్గడానికి కారణమని ఆర్‌బీఐ తెలిపింది.

స్వచ్ఛ భారత్ సుంకం వసూళ్లు రూ.330 కోట్లు
 డిసెంబర్ 16 నాటికి స్వచ్ఛ భారత్ సుంకపు వసూళ్లు రూ.329 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15 నుంచి పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపైన 0.5 శాతం మేర సుంకాన్ని విధించారు. స్వచ్ఛ భారత్ సుంకంతో (0.5 శాతం) కలుపుకొని సర్వీస్ ట్యాక్స్ 14.5 శాతానికి చేరింది. 

రూ. 40వేల కోట్లతో జాతీయ ఇన్‌ఫ్రా నిధి
మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం రూ. 40,000 కోట్ల జాతీయ పెట్టుబడి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీఈవో నియామక ప్రక్రియ జనవరి ఆఖరు నాటికి పూర్తి కాగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ నిధికి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) పెట్టుబడుల సలహాదారుగా ఆరు నెలల పాటు వ్యవహరిస్తుంది. ఎన్‌ఐఐఎఫ్‌కు బడ్జెట్ నుంచి ప్రభుత్వం రూ.20,000 కోట్ల మేర కేటాయింపులు జరపనుండగా, ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి మరో రూ. 20,000 కోట్లు వస్తాయని అంచనా. కొత్త వాటితో పాటు నిలిచిపోయిన ప్రాజెక్టులు, విస్తరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఆర్థిక మంత్రి వ్యవహరిస్తుండగా, ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో ప్రభుత్వ వాటా 49శాతం లోపు ఉంటుంది.

టీయూఎఫ్ పథకం సవరణకు ప్రభుత్వం ఆమోదం
జౌళి రంగానికి సంబంధించి టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ స్కీమ్ (టీయూఎఫ్‌ఎస్) సవరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత రివైజ్డ్ రీస్ట్రక్చర్డ్ టీయూఎఫ్ స్కీమ్ స్థానంలో అమలుకానున్న సవరిత టీయూఎఫ్‌ఎస్ వల్ల జౌళి రంగంలో సాంకేతికత మరింత పురోగతి సాధించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో డిసెంబర్ 30న న్యూఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యాంశాలు చూస్తే...
పథకానికి సంబంధించి రూ.17,822 కోట్ల బడ్జెట్ ప్రొవిజన్‌ను ఆమోదించింది. ఈ మొత్తంలో రూ.12,671 కోట్లు ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకం కింద ఇప్పటికే నిర్ణయించిన అంశాలకు ఉద్దేశించింది. సవరించిన టీయూఎఫ్‌కు సంబంధించి తాజా అంశాలకు మిగిలిన మొత్తం రూ.5,151 కోట్లు కేటాయించడం జరిగింది.కొత్త పథకం ప్రకారం ప్రధానంగా దుస్తులు, వస్త్రాలు- టెక్నికల్ టెక్స్‌టైల్స్ అనే రెండు విస్తృత కేటగిరీల కింద, అలాగే మిగిలిన విభాగాలకు సంబంధించిన పెట్టుబడులపై సబ్సిడీలు అందుతాయి.టెక్స్‌టైల్స్ కమిషనర్ ఆఫీస్ (టీఎక్స్‌సీ) కార్యాలయాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ప్రతి రాష్ర్టంలో సంబంధిత కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ రంగంలో పారిశ్రామిక వేత్తలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పురోగతి వంటి కార్యకలాపాలను టీఎక్స్‌సీ నిర్వహిస్తుంది.

67.09 వద్ద కనిష్ట స్థాయికి రూపాయి
డాలరుతో రూపాయి మారక విలువ డిసెంబర్ 14న కనిష్ట స్థాయిలో 67.09కి పడిపోయింది. ఇది గత 27 నెలల కనిష్ట స్థాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుండటంతో విదేశీ నిధులు భారీగా తరిలిపోతాయనే ఆందోళన ఫలితంగా రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015 ప్రారంభం నుంచి రూపాయి విలువ క్షీణత 5.9 శాతంగా ఉంది.

రూ.50 వేలు మించిన నగదు చెల్లింపులకు పాన్ 
రూ.50,000 మించి జరిగే నగదు చెల్లింపులకు పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ డిసెంబర్ 15న ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేశారు. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లకు సంబంధించి రూ.50,000 మించితే పాన్ తప్పనిసరి కాగా, విలాసవంతం కాని లావాదేవీలకు రూ.2 లక్షలు దాటితే పాన్ నంబరు తప్పనిసరి.

జీడీపీ వృద్ధి రేటు 7-7.5 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7-7.5 శాతంగా ఉండొచ్చని తాజాగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంతకు ముందు 8.1-8.5 శాతంగా ఉండొచ్చని లెక్కలు వేసినప్పటికీ ఆ స్థాయికి చేరుకోవడం కష్టమని పేర్కొంది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వస్తాయనుకున్న నిధుల పరిమాణం తగ్గినా.. పన్నుల వసూళ్లు అధికంగా ఉండటం ద్వారా బడ్జెట్ లోటు కట్టడి లక్ష్యాన్ని సాధించగలమని తెలిపింది. డిసెంబర్ 18న పార్లమెంటులో ప్రవేశపెట్టిన అర్ధ సంవత్సర ఆర్థిక విశ్లేషణ నివేదికలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 3.9 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది.

తెలంగాణ రుణ ప్రణాళిక రూ.59,831 కోట్లు
తెలంగాణకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య రంగాలకు రూ.59,831 కోట్ల రుణం అవసరమని జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అంచనా వేసింది. డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర రుణ సదస్సులో రుణ ప్రణాళిక అంచనాలను నాబార్డు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 20 శాతం ఎక్కువ. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.43,444.35 కోట్లు కేటాయించారు. వాటిలో పంట రుణాలకు రూ.30,435.09 కోట్లు, టర్మ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,009.26 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార రుణాలకు రూ.8,464.58 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.7,922.21 కోట్లని అంచనా వేశారు. రుణ ప్రణాళికను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. ప్రణాళిక వివరాలను నాబార్డు సీజీఎం వి.వి.వి.సత్యనారాయణ వెల్లడించారు.

5.41 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.41 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం డిసెంబర్ 14న విడుదల చేసిన గణాంకాల్లో ఈ మేరకు పేర్కొంది. పప్పులు, పండ్లు, కూరగాయలు వంటి ఆహార పదార్థాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెకైగబాకింది. ఇది గత ఏడాది నవంబర్‌లో 3.27 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా నవంబర్‌లో మైనస్ 1.9 శాతం పెరిగింది.

మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 130వ ర్యాంకు
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) డిసెంబర్ 14న విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)-2014లో భారత్‌కు 130వ ర్యాంకు లభించింది. మొత్తం 188 దేశాలకు సంబంధించిన సూచీలో నార్వే మొదటి స్థానాన్ని దక్కించుకొంది. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదిక భారత్ హెచ్‌డీఐ విలువను 0.609గా పేర్కొంది. దీంతో మీడియం హ్యూమన్ డెవలప్‌మెంట్ కేటగిరీలో భారత్ చేరింది. 1980లో భారత్ హెచ్‌డీఐ విలువ 0.362. ర్యాంకుల కేటాయింపులో ఆరోగ్యకరమైన జీవితం, విద్యాప్రమాణాలు, మెరుగైన జీవన విధానం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు
దాదాపు దశాబ్ద కాలం తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. ఫెడ్ ఫండ్స్ రేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు డిసెంబర్ 16న ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లు 0.25 - 0.50 శాతం శ్రేణికి పెరిగినట్లయింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. అమెరికాలో ప్రస్తుతం 0-0.25 శాతం శ్రేణిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. రివర్స్ రెపో రేటును పావు శాతంగా ఉంచుతున్నట్లు ఫెడ్ తెలిపింది. మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం 2 శాతానికి పెరగగలదని భావిస్తున్నట్లు తెలిపింది. ఫెడ్ సభ్యులు రేట్ల పెంపును ఏకగ్రీవంగా ఆమోదించారు. 

స్వచ్ఛభారత్‌కు ప్రపంచబ్యాంక్ రుణం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి 1.5 బిలియన్ డాలర్ల్ల రుణం అందించేందుకు ప్రపంచబ్యాంకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు, 2019 నాటికి గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనకు ముగింపు పలికేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు. పారిశుధ్య సదుపాయం లేని కారణంగా ప్రాణాంతక వ్యాధులతో భారత్‌లో ప్రతి పదిమందిలో ఒకరి మరణిస్తున్నారు.

జీఎస్‌టీ ప్రామాణిక రేటు
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) ప్రామాణిక రేటు 17-18 శాతంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ సూచింది. ఈ మేరకు కమిటీ డిసెంబరు 4న తమ నివేదికను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించింది. జీఎస్‌టీ రేటు కనీసంగా 15 శాతం, గరిష్టంగా 40 శాతం ఉండొచ్చని పేర్కొంది. అంతర్ రాష్ట్ర విక్రయాలపై జీఎస్‌టీను అదనంగా వేయాలనుకున్న 1 శాతం పన్నును తీసేయాలని సూచించింది. ప్రారంభ దశలో ఆల్కహాల్, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. రెవెన్యూ న్యూట్రాలిటీ రేటును 15 నుంచి 15.5 శాతంగా ప్రతిపాదించింది. 

కీలక వడ్డీరేట్లు యథాతథం
అయిదో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథంగా కొనసాగించింది. డిసెంబరు 1న ప్రకటించిన సమీక్షలో రెపోరేటును 6.75 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను 4 శాతంగానే ఉంచింది. 2015-16లో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న హెచ్చరికలతో వడ్డీరేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయలేదు. ఆరో ద్వైమాసిక పరపతి విధానాన్ని 2016, ఫిబ్రవరి 2న ఆర్‌బీఐ సమీక్షిస్తుంది.

తమిళనాడుకు రూ. 1,000 కోట్ల కేంద్ర సాయం
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం రూ. 1000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వర్షాలకు ఛిన్నాభిన్నమైన చెన్నైతో పాటు పలు జిల్లాల్లో డిసెంబర్ 3న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇంతకు ముందు కేంద్రం తమిళనాడుకు రూ. 940 కోట్ల సాయం ప్రకటించిందని, ఇప్పుడు ప్రకటించిన మొత్తం దానికి అదనమని ఆయన తెలిపారు.

అమరావతి నిర్మాణం ఖర్చు రూ. 27 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు రూ. 27,097 కోట్లు అంచనాలను నిపుణుల కమిటీ సూచించిందని కేంద్ర హోం శాఖ తెలిపింది. రాజధాని జోన్, మౌలిక సదుపాయాలు, నగర నవీకరణ, విస్తరణ వంటి వాటికి ఖర్చును కమిటీ అంచనా వేసింది. భవనాలకు రూ.10,519 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.1,536 కోట్లు, నగర మౌలిక సదుపాయాల ఆధునీకరణకు రూ. 5,861 కోట్లు, నగర మౌలిక అభివృద్ధి విస్తరణకు రూ. 9,181 కోట్లతో అంచనాలను నిపుణుల కమిటీ ప్రతిపాదించింది.

రూపే కార్డు బీమాకు కాల పరిమితి పొడిగింపు
రూపే కార్డుకు సంబంధించి ప్రమాద బీమా క్లెయిమ్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఏదైనా ఒక ప్రమాద సంఘటన విషయంలో... క్లెయిమ్‌కు ముందు కార్డు వినియోగ కాలాన్ని (కార్డ్ యూసేజ్ కండీషన్) 90 రోజుల వరకు పొడిగించింది. ఇప్పటి వరకు ఈ పరిమితి 45 రోజులుగా ఉంది. నవంబర్ 25 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద జారీ అయిన రూపే డెబిట్ కార్డుపై రూ.లక్ష వరకు ప్రమాద బీమా కవరేజ్ ఉంది.

మొబైల్ సర్వీస్ రంగం విస్తరణ
భారత్‌లో మొబైల్ సర్వీసుల రంగం భారీగా విస్తరించనుంది. 2020 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా 8.2 శాతానికి (దాదాపు రూ.14 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ టెలికం ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ జీఎస్‌ఎంఏ పేర్కొంది. 2014లో ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపింది. 2020 నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుతుందని అభిప్రాయపడింది.

‘అమృత్’కు రూ.వెయ్యి కోట్లు విడుదల
 ‘అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్-ఏఎమ్‌ఆయ్‌యూటీ)’ పథకం అమలుకు తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2న నిధులు మంజూరు చేసింది. 13 రాష్ట్రాలకు సుమారు రూ.1000 కోట్లకు పైగా నిధులను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, హరియాణా, జార్ఖండ్, మిజోరాం రాష్ట్రాలకు మొత్తం రూ.1062.27 కోట్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అమృత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 500 పట్టణాలను అభివృద్ధి చేయనున్నారు.