AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 23 February 2018

కరెంట్ అఫైర్స్ జనవరి 2018 నెల మొత్తం

ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న


Heartfully Presented By

AIMS DARE TO SUCCESS

MADE IN INDIA

⏬Telegram Channel ⬇

https://t.me/AIMSDARETOSUCCESS

💡YouTube Channel 🔗

AIMS DARE TO SUCCESS

https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1

⌛ Web Sites ⏰

👀 For All Competitive Exams Study Material 👀

https://www.aimsdaretosuccess.blogspot.com

👇 For Mathematics Study Material 👇

https://www.aimsdts.blogspot.com

🔦 For Any Queries 🔭

aimsdaretosuccess@gmail.com

If u want to get FREE Study Material Please Add My number 9440345996 in Your All Groups

Joy of sharing is Caring & Helping


కరెంట్ అఫైర్స్ జనవరి 2018

అంతర్జాతీయంసయీద్ ర్యాలీలో పాల్గొన్న పాలస్తీనా రాయబారిCurrent Affairs ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకోవడాన్ని భారత్ తప్పుపట్టింది. పాలస్తీనా రాయబారి అద్నన్ హైజాను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా.. పాక్‌లోని తమ రాయబారికి ఉద్వాసన పలికింది. ఈ సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపం వెలిబుచ్చడంతో పాటు సయీద్ కార్యక్రమంలో తమ రాయబారి పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాలస్తీనా స్పష్టం చేసినట్లు భారత్ తెలిపింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : సయీద్ ర్యాలీలో పాల్గొన్న పాలస్తీనా రాయబారికి ఉద్వాసన 
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : అబు అలీ 
ఎందుకు : ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకున్నందుకు 

సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణం ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉందని యునిసెఫ్ వెల్లడించింది. తీవ్రవాద గ్రూపుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కొందరు పిల్లలు అక్కడి నుంచి బయటపడ్డాక భద్రతా బలగాల చేతుల్లో పడి మరోసారి అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది. ఈ పిల్లల పాలిట 2017 క్రూరమైన ఏడాదిగా నిలుస్తోందని యూనిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వెలిబుచ్చింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..

  • నైజీరియా, ఛాద్, నైజర్, కేమరూన్‌లలో విస్తరించి ఉన్న బోకో హరం’ ఉగ్రవాద సంస్థ 2016 కంటే 2017లో అయిదు రెట్లు ఎక్కువగా పిల్లలను ఆత్మాహుతి దళాలుగా మార్చింది.
  • తిరుగుబాటు ద్వారా సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్‌లో బోకోహరం ఆధిపత్యంపెరిగాక ఎంతోమంది పిల్లలు హత్యాచారాలకు గురయ్యారు. బలవంతంగా సాయుధ ముఠాల్లో చేర్చారు.
  • కాంగోలో రాజకీయ, సాయుధ హింస కారణంగా 8.5 లక్షల మంది పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు.
  • సోమాలియాలో 2017 అక్టోబర్ కల్లా 1800 మంది పిల్లలను సాయుధగ్రూపుల్లో చేర్చుకున్నారు. దక్షిణ సూడాన్‌లో 19 వేల మంది పిల్లలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నారు.
  • మూడేళ్ల అంతర్గత సంక్షోభం కారణంగా యెమెన్‌లో 5,000 మంది అమాయక చిన్నారులు మరణించారు. 18 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
  • ఇరాక్, సిరియాలో పిల్లలు మానవకవచాలుగా ఉపయోగపడుతున్నారు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌లో 700 మంది పిల్లలు చనిపోయారు.
  • రోహింగ్యాల పిల్లలను ఒక క్రమపద్ధతిలో మయన్మార్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఆ దేశంలోని సగానికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయేలా అక్కడి ప్రభుత్వం దాడులు, హింసాకాండకు దిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంక్షోభ ప్రాంతాల్లో దారుణంగా చిన్నారుల పరిస్థితి 
ఎప్పుడు : 2017లో 
ఎవరు : యునిసెఫ్ 
ఎక్కడ : ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాలో 

పాక్‌కు ఆర్థిక సాయం నిలిపివేస్తామని అమెరికా హెచ్చరికఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ.. పాక్ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూవస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సాయం కొనసాగిస్తున్నందుకు అమెరికా నేతలను మూర్ఖులనుకుంటున్నారా? అని ట్వీటర్‌లో జనవరి 1న ఘాటుగా విమర్శించారు. సాయం రూపంలో అమెరికా నుంచి భారీ మొత్తం అందుతున్నప్పటికీ.. పాక్ అవాస్తవాలతో తమను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 33 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) సాయం అందిస్తే.. ప్రతిగా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద కేంద్రాలకు రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు. ట్రంప్ ట్వీట్‌కు సరైన సమాధానమిస్తామని పాక్ ప్రతిస్పందించింది. ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు చెబుతామని పేర్కొంది. ట్రంప్ పాక్‌ను హెచ్చరిస్తూ చేసిన ట్వీట్.. ప్రధాని మోదీ దౌత్యనీతి ఫలితమేనని బీజేపీ పేర్కొంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం ఉండబోదని హెచ్చరిక 
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
ఎందుకు : ఉగ్రవాదం విషయంలో అవాస్తవాలతో మోసం చేస్తుందని ఆరోపణ 

సౌదీ, యూఏఈలో తొలిసారి వ్యాట్ఇంతవరకూ పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సరం రోజున.. పెట్రోల్ ధరల్ని 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. అధిక శాతం వస్తువులు, సేవలకు వర్తించే ఐదు శాతం అమ్మకం పన్నుతో రెండు ప్రభుత్వాలు 2018లో 21 బిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్నును అమల్లోకి తెచ్చిన రెండు దేశాలు 
ఎప్పుడు : జనవరి 1 నుంచి 
ఎవరు : సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
ఎందుకు : బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు 

ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్లు జైలున్యాయ వ్యవస్థను దూషించినందుకు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం డిసెంబర్ 30న మూడేళ్ల జైలుశిక్షతోపాటు 20 లక్షల పౌండ్ల జరిమానా విధించింది.

లైబీరియా కొత్త అధ్యక్షుడిగా జార్జ్ వేహ్లైబీరియాలో జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా జార్జ్ వేహ్ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డ్ డిసెంబర్ 29న ప్రకటించింది. ఆయన జనవరి 22న అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. 

జాతీయంట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం 
Current Affairs తక్షణ ట్రిపుల్ తలాక్‌ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు డిసెంబర్ 28న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. 
బిల్లులో ఏముంది..ట్రిపుల్ తలాక్ చట్టంగా పేర్కొంటోన్న ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ )బిల్లులో పలు కఠిన నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ముస్లిం పురుషుడు తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్ తప్ప దేశమంతటా అమల్లోకి వస్తుంది. 

  • రాతపూర్వకంగా లేక మొబైల్, ఈ-మెయిల్ వంటి ఎలక్ట్రానిక్ విధానంలో సహా ఏ రూపంలో చెప్పినా ట్రిపుల్ తలాక్ చెల్లదు. అలాగే చట్ట వ్యతిరేకం కూడా.
  • బిల్లులో ట్రిపుల్ తలాక్‌ను కేసు పెట్టదగిన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరంగా పేర్కొన్నారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు.
  • మైనర్ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లులో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు. - తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్ తలాక్ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్ పద్ధతుల్ని బిల్లులో తలాక్‌గా నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్‌ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెపితే తక్షణం విడాకులు మంజూరవుతాయి.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది..ట్రిపుల్ తలాక్ ద్వారా అప్పటికప్పుడు ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు వ్యతిరేకమనీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్‌లు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించగా.. జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను షరియా చట్టాలు ఆమోదిస్తున్నందున.. అది మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్ 25 కిందకు వస్తుందని పేర్కొన్నారు. చివరకు 3-2 తేడాతో ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం తీర్పునిచ్చింది. 

ఇక నుంచి భారత సైన్యంలో ఒంటెలుచైనా అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం ఒంటెల సేవలను ఉపయోగించుకోబోతోంది. లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు ఒంటెలను మోహరించాలని భారత సైన్యం నిర్ణయించింది. సరిహద్దుల్లో గస్తీ తిరగడంతోపాటు, పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర వస్తువులను రవాణా చేసేందుకు వీటిని ఉపయోగించుకోబోతోంది. రెండు మూపురాలు ఉన్న ఒంటెలు సుమారు 180 నుంచి 220 కేజీల బరువును మోస్తాయి. ఈ ఒంటెలు రెండు గంటల సమయంలో సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. 

మన్‌కీబాత్’ ట్విటర్‌లో టాప్ ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో మన్‌కీ బాత్’ కార్యక్రమం హ్యాష్‌ట్యాగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ట్విటర్ డిసెంబర్ 28న అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా ఏయే అంశాలకు సంబంధించిన విషయాల గురించి నెటిజన్లు చర్చించారనేది వెల్లడించింది. ప్రతి నెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే మోదీ మన్‌కీ బాత్’ కార్యక్రమం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ హ్యాష్‌ట్యాగ్ మన్‌కీ బాత్ అని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హ్యాష్‌ట్యాగ్ జల్లికట్టు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను), ముంబై వరదలు, ట్రిపుల్ తలాక్ ఈ ఏడాది ట్విటర్ టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి.

లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లుకీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును ప్రభుత్వం డిసెంబర్ 29న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వైద్య విద్యలో మరింత పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వైద్య విద్య విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు సంస్కరణలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. 
బిల్లులోని ముఖ్యాంశాలు..

  • నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఛైర్మన్‌తోపాటు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
  • ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్ వైద్య విద్యకు ఒక బోర్డు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యకు మరో బోర్డు, వైద్య విద్యా సంస్థల గుర్తింపు, సమీక్షకు ఒక బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటవుతాయి.
  • వైద్య కళాశాలలు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించుకునేందుకు, సీట్లను పెంచుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు.
  • వైద్య విద్యలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
  • పీజీ చేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లు
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎందుకు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటుకు

సత్యేంద్రనాథ్ బోస్ జయంత్యుత్సవాల్లో మోదీ ప్రసంగంశాస్త్ర సాంకేతికాంశాలను విసృ్తతపరిచేందుకు వ్యవహారిక భాష వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోనూ సైన్‌‌సపై ఆసక్తి పెరుగుతుందన్నారు. భాష ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కారాదన్నారు. ప్రతి శాస్త్రవేత్త, పరిశోధనకారుడు నవభారత నిర్మాణం దిశగా తన సృజనాత్మకతకు పదునుపెట్టాలన్నారు. ఈ మేరకు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జయంతి స్మారక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా జనవరి 1న కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని వాటర్‌షెడ్ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినందున శాస్త్రవేత్తలు ఈ దిశగా సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. 

ఎలక్టోరల్ బాండ్ల విధి విధానాలు ఖరారు రాజకీయ పార్టీలకిచ్చే విరాళాల్లో పారదర్శకత కోసం అమల్లోకి తేనున్న ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ బాండ్ల జారీకి సంబంధించిన విధివిధానాల్ని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 2న ప్రకటించారు. విరాళాలిచ్చే దాతలు ఎలక్టోరల్ బాండ్లను ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుంచి కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఆ బాండ్లను ఈసీకి సమర్పించిన బ్యాంకు ఖాతా ద్వారా సొమ్ము చేసుకోవాలని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీలకిచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న ఈ ఎలక్టోరల్ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో పది రోజుల పాటు ఎంపిక చేసిన ఎస్‌బీఐ శాఖల్లో అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలున్న సంవత్సరంలో మాత్రం 30 రోజుల పాటూ బాండ్లను విక్రయిస్తారు. కొనుగోలు అనంతరం 15 రోజుల పాటు ఇవి చెల్లుబాటు అవుతాయి. బాండ్లపై విరాళమిచ్చే దాత పేరు ఉండదని, అయితే వాటిని కొనుగోలు చేసే వ్యక్తి లేక కంపెనీ.. బ్యాంకుకు కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని జైట్లీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఖరారు చేసిందని వెల్లడించారు. 
కనీసం 1 శాతం ఓట్లు సాధించిన పార్టీలకే ప్రామిసరీ నోటును పోలిఉండే ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ ఇవ్వవు. బాండ్లలో పేర్కొన్న మొత్తాన్ని రాజకీయ పార్టీలకు చెల్లించేవరకు వాటిపై పూర్తి హక్కులు దాతకే చెందుతాయి. అయితే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1 శాతం ఓట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల సొమ్మును చెల్లిస్తారు. అందుకోసం పార్టీలు ఎన్నికల సంఘానికి బ్యాంకు ఖాతాను ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 1000, రూ. 10 వేలు, రూ. లక్ష, రూ. 10 లక్షలు, రూ. కోటి మొత్తాల్లో బాండ్లను దాతలు కొనుగోలు చేయవచ్చు. భారతీయ పౌరులు, భారత్‌లోని కార్పొరేట్ సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసేందుకు అర్హులు. అయితే బాండ్లపై కొనుగోలు చేసిన వ్యక్తి పేరు ఉండదు. 15 రోజుల్లోగా పార్టీలు వాటిని సొమ్ము చేసుకోవాలి. 
స్టాండింగ్ కమిటీకి మెడికల్ బిల్లు దేశంలోని వైద్య విద్య ప్రక్షాళనతో పాటు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)ని మార్చేందుకు ఉద్దేశించిన వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నివేదిక సమర్పించాలని కమిటీని లోక్‌సభ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్టాండింగ్ కమిటీ నివేదిక నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు వైద్య వృత్తికి ఉపయోగకరమని కేంద్రం ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టాండింగ్ కమిటీకి నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు 
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : లోక్‌సభ 

అసోం తొలి ఎన్‌ఆర్‌సీ ముసాయిదా విడుదలజాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ-నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్) తొలి ముసాయిదాను అసోం జనవరి 1న ప్రచురించింది. రాష్ర్టంలోని మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 1.9 కోట్ల మంది పేర్లను ఇందులో చేర్చారు.

బ్రహ్మపుత్రలో జలరవాణా ప్రారంభంకేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ డిసెం బర్ 29న బ్రహ్మపుత్ర నదిలో పాండు-ధుబ్రి మధ్య కార్గో రవాణాను ప్రారంభించారు. ఎగువ అసోంలోని సాదియా నుంచి పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని ధుబ్రి మధ్య బ్రహ్మ పుత్ర నదిలో 891 కి.మీ. పొడవున అభివృద్ధి చేసిన జలర వాణా మార్గాన్ని జాతీయ జలమార్గం-2గా ప్రకటించారు. దీన్ని ప్రారంభించడంతో 300 కి.మీ. మేర రహదారి ప్రయా ణం తగ్గడంతోపాటు రవాణా ఖర్చులు ఆదా అవుతాయి.

ద్వైపాక్షికంఎవరెస్టు ఎత్తు కొలవాలనే భారత్ ప్రతిపాదన తిరస్కరణCurrent Affairsనేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం ఈ మేరకు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది. 
2015 నాటి‘గోర్ఖా భూకంపం నేపాల్‌ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్ ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత్ అధికారులు అంటున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదనలు తిరస్కరణ 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : నేపాల్ 

ప్రాంతీయం‘బతుకుపోరు, విలువలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి Current Affairs బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘బతుకుపోరు, విలువలు’పుస్తకాన్ని డిసెంబర్ 28న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. రాములు.. 90కిపైగా పుస్తకాలు రాసి బహుగ్రంథ కర్తగా పేరొందారు. తత్వశాస్త్రంతోపాటు తెలంగాణ వాస్తవ జీవన చిత్రంపై కథలు, నవలలు, కథానికలు, సాహిత్య విమర్శ, బీసీ సామాజిక వర్గాలపై రచనలు చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘బతుకుపోరు, విలువలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : రచయిత బీఎస్ రాములు 

అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు భూమిపూజ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ భవన సముదాయ నిర్మాణానికి డిసెంబర్ 28న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగతనం ఏ రూపంలో అయినా అది పోలీసు, ప్రభుత్వం ఉదాసీనత వల్లే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేసినా న్యాయస్థానాల్లో ఏదో రకంగా తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారన్నారు. నేరాల ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్థంగా పనిచేసి తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. రూ. 254 కోట్లతో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు భూమిపూజ
ఎప్పుడు : డిసెంబర్ 28 
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 
ఎక్కడ : తుళ్లూరు, అమరావతి 

హైదరాబాద్‌లో రోబో పోలీస్ ప్రారంభంపోలీసు విభాగంలో అత్యాధునిక సాంకేతిక విధానాలతో రూపొందించిన రోబో పోలీస్‌ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ డిసెంబర్ 29న ప్రారంభించారు. ఈ రోబో డిసెంబర్ 31 నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తుంది. టీ-హబ్‌లో స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ‘హెచ్ బోట్స్’ రోబోటిక్స్ కంపెనీ పోలీస్ రోబోను రూపొందించింది. ఈ రోబో పోలీసు అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు తీసుకుని కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది. 
దుబాయ్‌లో చక్రాలతో కూడిన రోబో పోలీసు విధులను నిర్వహిస్తుండగా.. ఇక్కడ దానికి భిన్నంగా నడిచే పోలీస్ రోబోకు ‘హెచ్ బోట్స్’ రూపకల్పన చేసింది. ప్రపంచంలోనే రెండో పోలీస్ రోబోగా గుర్తింపు పొందనున్న దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్టు రూపకర్తలు తెలిపారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో రోబో సేవలు విస్తరించాలని భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో రోబో పోలీస్ ప్రారంభం 
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ‘హెచ్ బోట్స్’ రోబోటిక్స్

ఏపీలోని ఏడు ద్వీపాల్లో 7 పర్యాటక ప్రాజెక్టులుఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఏడు ద్వీపాలను అభివృద్ధి చేసి ఏడు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో నాలుగు ద్వీపాలు, రెండో దశలో మిగిలిన మూడు ద్వీపాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొదట భవానీ ద్వీపాన్ని ఎకో పార్కుగా అభివృద్ధి చేయడానికి ఇటీవలే ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే దీన్ని మారిషస్ తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా మరింత మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం కన్సల్టెన్సీలను కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏడు ద్వీపాల్లో 7 పర్యాటక ప్రాజెక్టులు 
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఎక్కడ : రాజధాని అమరావతిలో పరిధిలో 

54 సర్వీసులతో ’టీఎస్ కాప్’ యాప్ ఆవిష్కరణనేరాల నియంత్రణ నుంచి పరిశీలన, దర్యాప్తు, విచారణల తీరు దాకా అన్ని అంశాలూ అరచేతిలోనే ఇమిడిపోయేలా ‘టీఎస్ కాప్’ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయి పోలీసింగ్‌కు తోడ్పడేలా రూపొందిన ఈ యాప్‌ను జనవరి 1న హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులతో కలసి ఆవిష్కరించారు. దీనిని తొలుత పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో పరిశీలించగా.. పెట్రోలింగ్ సిబ్బంది, సెక్టార్ ఎస్సైలు, బ్లూకోల్ట్స్ సిబ్బందికి చాలా ఉపయోగపడింది. మంచి ఫలితాలను సాధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసు శాఖలోని దాదాపు 14 ప్రధాన విభాగాలు టీఎస్ కాప్ యాప్‌ను ఉపయోగించుకునేలా రూపొందించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీఎస్ కాప్ యాప్ ఆవిష్కరణ 
ఎప్పుడు : జనవరి 1 
ఎవరు : తెలంగాణ పోలీస్ 
ఎందుకు : నేరాల నియంత్రణ నుంచి పరిశీలన, దర్యాప్తు, విచారణల తీరు దాకా అన్ని అంశాలూ అరచేతిలోనే ఇమిడిపోయేలా 

గుంటూరులో భారత ఆర్థిక సంఘం సదస్సుభారత ఆర్థిక సంఘం(ఐఈఏ) శత వార్షిక సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న గుంటూరులోప్రారంభించారు. ఈ సదస్సు డిసెంబర్ 30 వరకు జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ తదితరులు పాల్గొన్నారు.

హిజ్రాలకు ప్రత్యేక విధానంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 30న హిజ్రా (ట్రాన్స్‌జెండర్స్)ల కోసం ప్రత్యేక విధానం ప్రకటిం చింది. ఈ విధానంలో భాగంగా 18 సంవత్సరాలు పైబడిన హిజ్రాలకు రూ.1500 అందించనుంది.

ఆర్థికం‘ఆర్‌కామ్’ను కొనుగోలు చేయనున్న జియో Current Affairsఅనిల్ అంబానీకి చెందిన రిలయన్‌‌స కమ్యూనికేషన్‌‌స ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ టెలికం కంపెనీ రిలయన్‌‌స జియో కొనుగోలు చేయనుంది. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, మీడియా కన్వర్జన్‌‌స నోడ్‌‌సను (ఎంసీఎన్) రిలయన్‌‌స ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్‌‌స జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్‌‌స జియో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.24,000 - 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్‌కామ్‌కు ఈ ఆస్తుల విక్రయం ఊరటనిచ్చే విషయం. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేయనున్న రిలయన్స్ జియో 
ఎప్పుడు : డిసెంబర్ 28 
ఎవరు : ఆర్‌కామ్, జియో మధ్య ఒప్పందం 

మొండి బకాయిల్లో 5వ స్థానంలో భారత్ అంతర్జాతీయంగా మొండిబకాయిల భారం (ఎన్‌పీఏ) మోస్తున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. అలాగే... బ్రిక్స్ (బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో భారత్‌దే మొదటి స్థానం. ఈ మేరకు డిసెంబర్ 28న ఓ నివేదిక విడుదల చేసిన కేర్ రేటింగ్స్.. భారత బ్యాంకుల మొండి బకాయిల భారం రూ.9.5 లక్షల కోట్లని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఈ పరిమాణం దాదాపు 10 శాతం. ఈ విషయంలో భారతదేశం హై రిస్క్ కేటగిరీలో నిలిచింది. 
యూరోపియన్ యూనియన్‌లో(ఈయూ) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాలుగు దేశాలు-గ్రీస్ (36.4%), ఇటలీ (16.4 శాతం), పోర్చుగల్ (15.5 శాతం), ఐర్లాండ్ (11.9 శాతం) మొండి బకాయిల భారాన్ని మోస్తున్నాయి. ఈ నాలుగు దేశాలు జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్ తరువాత ఆరవ స్థానంలో రష్యా (9.7 శాతం), ఏడవ స్థానంలో స్పెయిన్ (5.3 శాతం) నిలిచాయి. 
ఎన్‌పీఏల సమస్యను కేర్ నాలుగు కేటగిరీలుగా (లో, వెరీ లో, మీడియం, హై లెవెల్) విభజించింది. కేవలం ఒక శాతం ఎన్‌పీఏలను ఎదుర్కొంటున్న దేశాల్లో (లో కేటగిరీ) ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్ ఉన్నాయి. చైనా, జర్మనీ, జపాన్, అమెరికాల్లో ఈ సమస్య రెండు శాతంగా (రెండవ కేటగిరీ) ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు- బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, టర్కీలు మూడవ కేటగిరీలో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొండి బకాయిల్లో 5వ స్థానంలో భారత్ 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : కేర్ రేటింగ్స్ 

రూ. 2వేల దాకా డెబిట్ కార్డు చెల్లింపులపై చార్జీలు నిల్డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డులు, భీమ్ యాప్ ద్వారా రూ.2,000 దాకా చెల్లింపులపై లావాదేవీల చార్జీలను రద్దు చేసింది. ఇటు కొనుగోలుదారులకు అటు వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా సదరు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీల భారాన్ని ప్రభుత్వమే రెండేళ్ల పాటు భరించనున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. తాజా నిర్ణయంతో ఖజానాపై రూ. 2,512 కోట్ల మేర ప్రభావం పడనుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 2 వేల దాకా డెబిట్ కార్డు చెల్లింపులపై చార్జీలు నిల్ 
ఎప్పుడు : జనవరి 1 నుంచి 
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ 
ఎందుకు : డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు 

సైన్స్ అండ్ టెక్నాలజీసూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతంగగనతల రక్షణ కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ ఎత్తు నుంచి (30 కిలోమీటర్ల లోపు) వచ్చే ఎటువంటి ఖండాంతర క్షిపణులనైనా ఇది ధ్వంసం చేయగలదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి మూడు క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. వివిధ ఎత్తుల్లో ఖండాంతర క్షిపణుల నుంచి పూర్తి స్థాయి రక్షణ కోసం ఈ ఏడాది మార్చి 1న, ఫిబ్రవరి 11న రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. 
డిసెంబర్ 28న నిర్వహించిన మూడోపరీక్షలో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రదేశం నుంచి పృథ్వీ క్షిపణిని ప్రయోగించారు. రాడార్స్ నుంచి సిగ్నల్స్ రాగానే బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం (వీలర్ ద్వీపం) ద్వీపంలో ఉన్న సూపర్‌సోనిక్ క్షిపణి వెంటనే పృథ్వీ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భూమికి సుమారు 15 కిలోమీటర్ల ఎత్తులోనే ఏఏడీ పృథ్వీని అడ్డుకుని ధ్వంసం చేసిందని పేర్కొన్నాయి. 7.5 మీటర్ల పొడవుండే ఈ క్షిపణిలో నావిగేషన్ సిస్టంతో పాటు హైటెక్ కంప్యూటర్‌ను కూడా అనుసంధానం చేశారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న నాలుగో దేశం భారత్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : భారత సైన్యం 

ఒక్క రోజులో 16 న్యూ ఇయర్స్Current Affairsఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్ - ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో ఆరుగురు వ్యోమగాములు 2018 కొత్త ఏడాదిని ఒకేరోజులో 16 సార్లు జరుపుకోనున్నారు. భూమికి 402 కి.మీ. ఎత్తులో ప్రతి 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూడటం ద్వారా వారు దీనిని సుసాధ్యం చేయనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) డిసెంబర్ 29న వెల్లడించింది. 

కోల్‌కతాలో రెండో టీయూ-142 మ్యూజియంభారత నావికా దళంలో సుదీర్ఘ సేవలందించిన మరో యుద్ధ విమానం రెండో మ్యూజియంగా మారబోతోంది. ఒక దానిని ఇటీవలే విశాఖ సాగర తీరంలో ఏర్పాటుచేయగా.. ఇప్పుడు రెండో దానిని కోల్‌కతాలో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. 
రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎనిమిది టీయూ-142 యుద్ధ విమానాలు 1988లో ఇండియన్ నేవీలోకి వచ్చి 29 ఏళ్ల పాటు నిరంతరాయంగా విశేష సేవలందించాయి. వీటిని 2017 మార్చిలో నేవీ విధుల నుంచి తప్పించారు. తమిళనాడులోని అరక్కోణం నేవల్ ఎయిర్ బేస్ కేంద్రంగా ఇవి సముద్ర గగనతలంలో గస్తీ విధులు నిర్వహించాయి. కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. వాటి స్థానంలో కొత్తగా పీ8ఐ రకం అత్యాధునిక నిఘా విమా నాలను భారత్ కొనుగోలు చేసింది. నేవీ సేవల నుంచి నిష్ర్కమించిన టీయూ-142 యుద్ధ విమానాల్లో ఒకదాన్ని ఇటీవల విశాఖలో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియంగా తీర్చిదిద్దారు. దీనిని 2017 డిసెంబర్ 7న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్ తొలిరోజైన డిసెంబర్ 28 నుంచి ఇందులో ప్రవేశానికి అనుమతించారు. దేశంలోకెల్లా తొలి ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఇదే. ఈ నేపథ్యంలో రెండో టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖను కోరింది. ఇందుకు రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ రెండో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు. విశాఖ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియాన్ని విజయవంతంగా పూర్తిచేసి అందరి ప్రశంసలందుకున్న.. ఆంధ్రకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ రమణ్‌కుమార్‌నే కోల్‌కతా మ్యూజియానికి కూడా ఇన్‌చార్జిగా పంపనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో టీయూ-142 మ్యూజియం 
ఎక్కడ : కోల్‌కతాలో
ఎందుకు : సందర్శకుల కోసం 

చెమట చిందించే రోబో ఆవిష్కరణపుష్ అప్స్, పుల్ అప్స్ వంటి కఠిన వ్యాయామాలతో పాటు స్వేదాన్ని చిందించే సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘కెంగొరో’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. కృత్రిమ స్వేద వ్యవస్థతో పాటు మానవ కండరాలను పోలిన అస్థిపంజరాన్ని రోబోలో అమర్చారు. క్రీడాకారుల కండరాల పనితీరును విశ్లేషించేందుకుగాను దీనిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కృత్రిమ స్వేద వ్యవస్థలో తాము కీలకమైన ముందడుగు వేశామని, దీని ద్వారా రోబోలోని అధిక వేడిని తగ్గించవచ్చని వెల్లడించారు. 2001 నుంచి ఈ బృందం రోబోలపై పరిశోధనలు జరుపుతోందని సైన్‌‌స రోబోటిక్స్ అనే జర్నల్ ప్రచురించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : చెమట చిందించే రోబో ‘కెంగొరో’
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : జపాన్ శాస్త్రవేత్తలు

క్రీడలువరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017 విజేత ఆనంద్ Current Affairs మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్ నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్ ఫెడసీవ్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆనంద్.. టైటిల్ విజేతగా నిలిచాడు. 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : విజేత విశ్వనాథన్ ఆనంద్ 
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా 

రంజీ ట్రోఫీ - 2017 చాంపియన్ విదర్భ విదర్భ జట్టు రంజీ ట్రోఫీ సరికొత్త విజేతగా నిలిచింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జనవరి 1న ముగిసిన ఫైనల్లో విదర్భ 9 వికెట్ల తేడాతో ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీపై విజయం సాధించి.. ప్రతిష్ఠాత్మక దేశవాళీ కప్‌ను సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు తీసిన గుర్బానీకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టుకు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రంజీ ట్రోఫీ - 2017 
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : విజేత విదర్భ
ఎక్కడ : ఇండోర్ 

వరల్డ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో ఆనంద్‌కు కాంస్యం వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్... ఆ వెంటనే జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో జరిగిన 21 గేమ్‌లలో అతను ఒక్కటి మాత్రమే ఓడాడు. తన దృష్టిలో ఇది చాలా గొప్ప ప్రదర్శనగా ఆనంద్ విశ్లేషించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : విశ్వనాథన్ ఆనంద్‌కు కాంస్యం 
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా

వార్తల్లో వ్యక్తులురాజకీయాల్లోకి రజనీకాంత్ Current Affairs సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన చేశారు. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కలలను నిజం చేస్తూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు డిసెంబర్ 31న ప్రకటించారు. తమిళనాడులో రాజకీయాలు హీనదశకు చేరుకున్న నేపథ్యంలో ఓ సరైన రాజకీయ వేదిక అవసరం ఉందని.. సొంతగా ఓ పార్టీ పెట్టి ఆ లోటును భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ తెలిపారు. 

డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా రాజిందర్ ఖన్నా నిఘా ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ‘రా’ మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2017 ఆగస్టులో అరవింద్ గుప్తా పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంటోంది. 1978 బ్యాచ్‌కు చెందిన ఖన్నాకు పాకిస్తాన్ వ్యవహారాలు, ఇస్లాం ఉగ్రవాదంపై పూర్తి అవగాహన ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిన ఖన్నా నియామకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ పచ్చజెండా ఊపినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నియామకం 
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రా మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా 

విదేశాంగ కార్యదర్శిగా విజయ్ గోఖలేసీనియర్ దౌత్యవేత్త విజయ్ కేశవ్ గోఖలే భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా జనవరి 1న నియమితుల య్యారు. గోఖలే రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

అవార్డులుడాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారంCurrent Affairs హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘ఐఎంఏ డాక్టర్ ఎంజీ గార్గ్ జీవిత సాఫల్య పురస్కారం’లభించింది. ముంబైలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ చేతుల మీదుగా డిసెంబర్ 28న ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమానికి వెయి్యమంది ప్రసిద్ధ వైద్యులు హాజరయ్యారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారం 
ఎప్పుడు : డిసెంబర్ 28 
ఎవరు : డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి


అంతర్జాతీయంపాక్‌కు మిలటరీ సాయం నిలిపివేస్తామని అమెరికా ప్రకటన Current Affairs ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతో పాటు మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్ల్లు ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : పాక్‌కు మిలటరీ సాయం నిలివేస్తున్నట్లు ప్రకటన 
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : అమెరికా 
ఎందుకు : ఉగ్రవాదులపై చర్యలు తీసుకోనందుకు 

అమెరికా-మెక్సికో గోడకు 1.14 లక్షల కోట్లు మెక్సికో సరిహద్దులో గోడనిర్మించడానికి వచ్చే పదేళ్ల కాలానికి సుమారు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. సరిహద్దు రక్షణకు మొత్తం సుమారు రూ.2.09 లక్షల కోట్లు అవసరమని అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక అంచనా పత్రాన్ని విడుదల చేసింది. అందులో గోడ నిర్మాణానికి రూ.1.14 లక్షల కోట్లు, సాంకేతిక పరికరాలకు సుమారు 36 వేల కోట్లు, రోడ్డు నిర్మాణం, నిర్వహణ తదితరాలకు సుమారు రూ.6 వేల కోట్ల చొప్పున ప్రతిపాదించారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అమెరికా నుంచి మెక్సికోను వేరు చేస్తూ 1552 కి.మీ మేర గోడ లేదా కంచె పూర్తవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా-మెక్సికో గోడకు రూ. 1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా కాంగ్రెస్‌కు విజ్ఞప్తి 
ఎప్పుడు : జనవరి 6 
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 

పాక్‌లో వేళ్లూనుతున్న ఐఎస్ కిరాతకమైన ఐఎస్ ఉగ్రవాదం పాకిస్తాన్‌లో చాలా వేగంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) సంస్థ తాజా గణాంకాలు విడుదల చేసింది. పాక్‌లో ఐఎస్ ప్రభావం ఉత్తర సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విసృ్తతంగా ఉందని పిప్స్ పేర్కొంది. ఇటీవల బలూచిస్తాన్‌లో ఇద్దరు చైనీయుల హత్యకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థేనని తెలిపింది. ‘స్పెషల్ రిపోర్ట్ 2017’ పేరుతో విడుదల చేసిన సర్వేలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను పిప్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాకిస్తాన్‌పై సీమాంతర దాడులు 131 శాతం పెరిగాయని తెలిపింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌లో వేగంగా విస్తరిస్తున్న ఐఎస్
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ 

ఉభయ కొరియాల మధ్య మిలటరీ హాట్‌లైన్ ఉభయ కొరియా దేశాల మధ్య రెండేళ్ల తరువాత మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు తన బృందాన్ని పంపడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అలాగే దక్షిణ కొరియాతో మిలటరీ హాట్‌లైన్ సర్వీసును పునఃప్రారంభించినట్లు వెల్లడించింది. అణు పరీక్షలతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ చొరవ చూపడంతో ఇరు దేశాల సరిహద్దు గ్రామం పాన్‌మున్‌జోమ్‌లో జనవరి 9న ఈ చర్చలు మొదలయ్యాయి.

జాతీయంజోజిలా పాస్ సొరంగానికి కేబినెట్ ఓకేCurrent Affairs జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జనవరి 3న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన ప్రాజెక్టుకు 6,089 కోట్లు వ్యయం చేయనున్నారు. 14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది. 
హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్ నెలకొల్పడానికి, జాతీయ జలమార్గం-1లోని హల్దియా-వారణాసి మార్గంలో నౌకాయానానికి ఊతమిచ్చేలా 5,369 కోట్లతో జల్ వికాస్ మార్గ్ ప్రాజెక్టుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గం నిర్మాణానికి ఆమోదం 
ఎప్పుడు : జనవరి 3 
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎక్కడ : జోజిలా పాస్, జమ్ము కశ్మీర్ 
ఎందుకు : జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించేందుకు 

మహిళల కోసం ప్రత్యేకంగా నారీ పోర్టల్మహిళలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఓ చోట అందించేందుకు వీలుగా రూపొందించిన "NARI" వెబ్ పోర్టల్‌ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రారంభించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ పోర్టల్‌లో మహిళా సంక్షేమానికి సంబంధించిన 350కి పైగా పథకాల సమాచారాన్ని పొందు పరిచారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్, ఫిర్యాదుల సదుపాయాన్ని కల్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల కోసం ప్రత్యేకంగా నారీ పోర్టల్ 
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ
ఎందుకు : మహిళలకు సంబంధించిన పథకాల సమాచారాన్ని అందించేందుకు 

రక్తదాతలకు వేతనంతో కూడిన సెలవు ఎదుటివారి ప్రాణాలు నిలపగలిగే శక్తి ఉన్న రక్తదాన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్తదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులు ఏడాదిలో ఇలాంటివి గరిష్టంగా నాలుగు సెలవులను వాడుకోవచ్చు. రక్తదానానికి సెలవులు మంజూరు చేసే విధానం కొన్ని విభాగాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో.. రక్తదానంతో పాటు ప్లేట్‌లెట్స్, రక్త కణాలు, ప్లాస్మాను దానం చేసేవారికి కూడా సెలవులు వర్తింపజేసే విధంగా నిబంధనలు సవరించారు. ఉద్యోగులు దీనికి సంబంధించి లెసైన్‌‌సలు కలిగి ఉన్న రక్తనిధి కేంద్రాల్లోనే రక్తదానం చేయడమే కాకుండా.. అందుకు తగిన ఆధారాలను కూడా అందజేయాల్సి ఉంటుంది. 

పశ్చిమ బెంగాల్ అధికారిక చిహ్నం ఆవిష్కరణ పశ్చిమ బెంగాల్ అధికారిక చిహ్నాన్ని (రాజముద్ర) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి 5న ఆవిష్కరించారు. విశ్వ బంగ్లా, అశోక చక్రంతో కూడిన ఈ రాజముద్రని.. మమతా బెనర్జీయే స్వయంగా రూపొందించారు. అనంతరం ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ రాజముద్రకి ఆమోదం తెలపటంతో.. కోల్‌కతాలో అధికారంగా ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ జీవోలు, అధికారిక కార్యక్రమాల్లో ఇకపై ఈ రాజముద్రను వినియోగించనున్నారు. 

మధ్యప్రదేశ్‌లో ఆలిండియా డీజీపీల సదస్సు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని బీఎస్‌ఎఫ్ అకాడమీలో జనవరి 6-8 వరకు జరిగిన డీజీపీలు, ఐజీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ అంతర్గత భద్రతపై సమీక్షతోపాటుగా భవిష్యత్తులో భద్రతను మరింత పటిష్టపరచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో మోదీ విసృ్తతంగా చర్చించారు. దాదాపు 250 మంది రాష్ట్రాల పోలీసు బాస్‌లు, కేంద్రీయ పోలీసు బలగాల సంస్థల అధిపతులు మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
గతేడాది హైదరాబాద్..ప్రతి ఏడాదీ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్రీయ బలగాల ఉన్నతాధికారులు సమావేశమై దేశవ్యాప్తంగా ఉన్న భద్రతాపరమైన అంశాలపై చర్చిస్తారు. మామూలుగా ఈ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ బయట వేర్వేరు కేంద్రాల్లో ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. 2014లో గువాహటిలో, 2015లో రణ్ ఆఫ్ కచ్, 2016లో హైదరాబాద్‌లో ఈ సదస్సు జరిగింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాద ప్రేరేపిత అంశాలపై విసృ్తత చర్చ జరిగింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆలిండియా డీజీపీల సదస్సు - 2017
ఎప్పుడు : జనవరి 6 - 8
ఎక్కడ : గ్వాలియర్, మధ్యప్రదేశ్ 

సెక్షన్ 377ను పునఃపరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విసృ్తత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోన్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై అభ్యంతరాల్ని విసృ్తత ధర్మాసనం చర్చించాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది.
పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కంలో పాల్గొనే వయోధికుల్ని శిక్షించేందుకు అనుమతిస్తున్న సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసహజ నేరాల్ని పేర్కొంటున్న సెక్షన్ 377 ప్రకారం ‘ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా లైంగిక చర్యకు పాల్పడితే వారు శిక్షార్హులు. నేరం రుజువైతే వారికి జీవిత ఖైదు, జరిమానాతో పాటు అవసరమైతే శిక్షను గరిష్టంగా పదేళ్ల వరకూ పొడిగించవచ్చు.’ ఐపీసీ 377 సెక్షన్‌ను సవాలు చేస్తూ నవ్‌తేజ్ సింగ్ జోహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ ‘377 సెక్షన్‌ను సమర్ధిస్తూ 2013 నాటి సుప్రీం తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌ను అదే ధర్మాసనం విచారిస్తుంది’ అని స్పష్టం చేసింది. 
1861నుంచి నేరంగా...ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదంది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి సిఫార్సు 
ఎప్పుడు : జనవరి 8 
ఎవరు : సుప్రీంకోర్టు 

డిసెంబర్‌కల్లా భారత్ నెట్ రెండో దశ పూర్తిదాదాపు 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించే దిశగా తలపెట్టిన భారత్ నెట్ ప్రాజెక్ట్ రెండో దశ.. 2018 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వాస్తవానికి దీని గడువు 2019 మార్చి దాకా ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే పూర్తి కావొచ్చని తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తయిన సందర్భంగా జనవరి 8న జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. రెండో దశను వేగవంతం చేసే దిశగా సకాలంలో పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం... లేకపోతే జరిమానా విధించడం మొదలైన నిబంధనలు కాంట్రాక్టుల్లో చేర్చాల్సి ఉందని ఆయన చెప్పారు. 
తొలి దశలో లక్ష గ్రామ పంచాయతీలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరో 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు కూడా బ్రాడ్‌బ్యాండ్‌ని అందుబాటులోకి తెచ్చేలా రెండో దశ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు అందుబాటు ధరల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ ఈ భారీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ నెట్ రెండో దశ పూర్తి గడువు 
ఎప్పుడు : 2018 డిసెంబర్ నాటికి 
ఎవరు : కేంద్ర టెలికం శాఖ
ఎందుకు : గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించేందుకు 

థియేటర్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు జనవరి 9న స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో చలనచిత్రం ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం పాడటం తప్పనిసరని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని 2016 నవంబర్ 30న ఇచ్చిన ఆదేశాలను తదనుగుణంగా మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల మంత్రివర్గ కమిటీ సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటంపై తుది నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఈ మేరకు సినిమాహాళ్లలో జాతీయగీతం పాడటంపై మార్పులు చేసేందుకు 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామంటూ కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కమిటీ ఆరు నెలల కాలంలో తమ నివేదికను సమర్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : థియేటర్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు 
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీలో ప్రవాస భారత పార్లమెంటేరియన్ల సదస్సు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారత పార్లమెంటేరియన్లతో నిర్వహించిన ‘పర్సన్‌‌స ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఓ)’ తొలి సదస్సు జనవరి 9న న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. ఏ దేశ భూభాగంపైగానీ, వనరులపైన గానీ భారత్‌కు కన్ను లేదని పునరుద్ఘాటించారు. దక్షిణాసియాలో ఆధిపత్యానికి ఇటీవల చైనా చేస్తున్న ప్రయత్నాల్ని పరోక్షంగా విమర్శిస్తూ.. ఇతర దేశాలకు అభివృద్ధి సాయం చేసే విషయంలో మానవతా దృక్పథమే తప్ప.. భారత్‌ది ఇచ్చి పుచ్చుకునే ధోరణి కాదని స్పష్టం చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, అభివృద్ధికి సహాయకారిగా ఉండాలని ప్రవాస భారత పార్లమెంటేరియన్లను మోదీ కోరారు.
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు మహాత్మాగాంధీ వచ్చినరోజుకు సంబంధించిన 102వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును నిర్వహించారు. 24 దేశాలకు చెందిన 134 మంది ప్రవాస భారతీయ ప్రజా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రవాస భారత పార్లమెంటేరియన్ల సదస్సు 
ఎప్పుడు : జనవరి 9 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

జడ్జీల వేతనాల బిల్లుకు లోక్‌సభ ఆమోదంసుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపు బిల్లును లోక్‌సభ జనవరి 4న ఆమోదించింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నెల వేతనం రూ.లక్ష నుంచి రూ.2.80 లక్షలకు; సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు పెరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనం రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు; హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.80,000 నుంచి రూ.2.25 లక్షలకు చేరనుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు చేసిన ఈ మార్పులు 2016, జనవరి 1 నుంచి వర్తిస్తాయి.

హిమాచల్‌ప్రదేశ్‌కు ఎయిమ్స్ 
హిమాచల్‌ప్రదేశ్‌కు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గం జనవరి 3న నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ వద్ద రూ.1,350 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణాన్ని 48 నెలల్లో పూర్తిచేస్తారు.

18వ అఖిల భారత విప్‌ల సదస్సు18వ అఖిల భారత విప్‌ల సదస్సును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ జనవరి 8న ఉదయ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్‌లు పార్టీ సభ్యులను పర్యవేక్షించడంతోపాటు చైతన్యవంతులను చేయాలని సూచించారు. చట్టసభల్లో సభ్యల ప్రవర్తన, క్రమశిక్షణలను పరిశీలించాల్సింది విప్‌లేనన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికే ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి దాదాపు అన్ని రాష్ట్రాల విప్‌లు హాజరయ్యారు.

ద్వైపాక్షికంస్పైక్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దు
Current Affairs
ఇజ్రాయెల్‌కు చెందిన ఆయుధాల కంపెనీ రాఫెల్ అడ్వాన్‌‌స డిఫెన్‌‌స సిస్టమ్స్‌తో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల (స్పైక్) కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. 1,600 క్షిపణుల కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.3 వేల కోట్లు. ఈ మేరకు ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం అందిందని రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి వెల్లడించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇజ్రాయెల్ కంపెనీతో స్పైక్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దు 
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : భారత ప్రభుత్వం 

ఆసియాన్-ఇండియా రౌండ్ టేబుల్ సమావేశంఆసియాన్-ఇండియా నెట్‌వర్క్ మేధావుల ఐదవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 6న జకర్తాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సమష్టి భద్రత, సమష్టి సంపద’ అనే రెండు సూత్రాల ఆధారంగా ఆసియాన్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ఆకాంక్షించారు. ఆసియాన్ దేశాలు.. దృఢ, గతిశీల ఆర్థిక బంధాలను కలిగి ఉండాలన్నారు. ఈ దిశగా నౌకాయాన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వ సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు.

ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్సింగపూర్‌లో జనవరి 7న జరిగిన ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన ఆమె.. ఆసియాన్ కూటమితో భారత్ దృఢ బంధం ఏర్పరచుకోవడంలో ప్రవాస భారతీయులు అద్భుత వేదికగా నిలిచారన్నారు. 

ప్రాంతీయంఏపీలో ఐదో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ఐదో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 2న ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించారు. జనవరి 2 నుంచి 11 వరకు కొనసాగే కార్యక్రమంలో ప్రభుత్వ పాలనను మొత్తం ప్రజల ముందుకు తెస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. త్వరలో కొత్తగా మరో 4 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామని.. దీంతో మొత్తం 50 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐదో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం 
ఎప్పుడు : జనవరి 2 -11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎందుకు : ప్రభుత్వ పాలనను ప్రజల ముందుకు తెచ్చేందుకు

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జనవరి 2న సంతకం చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్‌కు చెందిన యువ నాయకుడు. కమిషన్ సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ (రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య (హైదరాబాద్‌లోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల)ను నియమించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు 
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్ 

తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా కమరుద్దీన్తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జనవరి 3న నోటిఫికేషన్ జారీ చేసింది. మహమ్మద్ కమరుద్దీన్‌ను కమిషన్ చైర్మన్‌గా, రాజారపు ప్రతాప్‌ను వైస్ చైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా మహ్మద్ అర్షద్ అలీఖాన్, విద్యా స్రవంతి, గస్టీ నోరియా, బొమ్మల కట్టయ్య, సురేందర్ సింగ్ నియమితులయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్‌తో పాటు సభ్యుల పదవీ కాలం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ మైనారిటీ కమిషన్ ఏర్పాటు 
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : చైర్మన్‌గా కమరుద్దీన్

తెలంగాణలో జనవరి 22 నుంచి పులుల గణన Current Affairsరాష్ట్రంలో పులుల సంఖ్యను పక్కాగా తేల్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. జనవరి 22 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పులుల గణన చేపడతామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,100 బీట్లను గుర్తించామని, ప్రతి బీట్‌కు ఇద్దరు చొప్పున నియమించి పులుల లెక్కలు తీస్తామన్నారు. ఈసారి గణనకు సీసీ కెమెరాల వినియోగంతో పాటు పాద ముద్రలు, పెంటిక నిర్ధారణ పరీక్షలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ గణనలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు గణనలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పులుల గణనను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 జనవరిలో పులుల గణన చేపట్టారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో పులుల గణన
ఎప్పుడు : జనవరి 22 నుంచి 29 వరకు
ఎవరు : తెలంగాణ అటవీశాఖ 

దేశంలో తొలిసారిగా తెలంగాణలో కో-ఫైనాన్సింగ్ సంస్థఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటూ ఉత్పాదక రంగంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఈ) రుణాలందించటమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు (టీఐహెచ్‌సీ) లైన్ క్లియరైంది. దేశంలోనే తొలిసారిగా దీనికి కో-ఫైనాన్సింగ్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. ఇది ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానుంది. 
టీఐహెచ్‌సీలో రెండు విభాగాలు

  1. ఖాయిలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించడం.
  2. ఉత్పాదక రంగంలోని ఎస్‌ఎంఈలకు నిధులు సమకూర్చడం.
ఖాయిలా పరిశ్రమల విషయానికొస్తే.. బిల్ రీ డిస్కౌంట్ స్కీమ్, టెక్నో ఎకనామిక్ వాల్యూవేషన్ (టీఈవీ) స్టడీ, సాఫ్ట్ లోన్ అనే 3 రకాల సేవలుంటాయి. 
బిల్ రీ డిస్కౌంట్‌లో.. గడువు ముగిసి బ్యాంకులు ఎన్‌పీఏలుగా ప్రకటించిన పరిశ్రమలను గుర్తించి.. వాటి బ్యాంక్ పేమెంట్‌ను టీఐహెచ్‌సీ చెల్లిస్తుంది. పరిశ్రమలకు మరో 90 రోజుల సమయమిస్తారు. దీనికి పరిశ్రమలు టీఐహెచ్‌సీకి సంబంధిత బ్యాంక్ వడ్డీ కంటే 5 శాతం తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి కో-ఫైనాన్సింగ్ ఎన్‌బీఎఫ్‌సీకి అనుమతి
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఆర్‌బీఐ 
ఎక్కడ : తెలంగాణలో 
ఎందుకు : తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఐహెచ్‌సీ) ఏర్పాటు కోసం 

తెలంగాణ గురుకులాల్లో ‘భారత్ దర్శన్’విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా, వారిలో విషయ పరిజ్ఞానం, వికాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు తెలంగాణ గురుకుల సొసైటీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచుకునే విధంగా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ‘భారత్ దర్శన్’ పేరిట దేశంలోని ప్రఖ్యాత ప్రాంతాలు, ప్రముఖ స్థలాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించింది. ఈ మేరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పించనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు దీన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1.35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో విశాల దృక్పథాన్ని అలవర్చాలనే ఉద్దేశంతో గురుకుల సొసైటీలు భారత్ దర్శన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ‘భారత్ దర్శన్’ 
ఎప్పుడు : జనవరి 5 
ఎవరు : తెలంగాణ గురుకుల సొసైటీ 
ఎందుకు : వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచేందుకు 

దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ పంజగుట్టదేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ కమిషనరేట్‌లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ అవార్డు దక్కించుకుంది. కేంద్ర హోంశాఖ, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లపై సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా వందకు పైగా స్టేషన్లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, దర్యాప్తు.. ఇలా 140 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో పది పోలీస్ స్టేషన్లతో తుది జాబితా రూపొందించి వాటిలోంచి మూడు ఉత్తమ స్టేషన్లను ఎంపిక చేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కమిషనరేట్ పరిధిలోని గుడుంబా పోలీస్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచాయి. డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పోలీస్ స్టేషన్లకు ట్రోఫీలు అందజేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : తొలి స్థానంలో తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్. రెండో స్థానంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్. 

ఏపీ రుణభారం రూ.2 లక్షల కోట్లు2018 బడ్జెట్ నాటికి ఆంధ్రప్రదేశ్ రుణభారం రూ.2.16 లక్షల కోట్లకు చేరుతుందని జనవరి 5న కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాక్రిష్ణన్ లోక్‌సభకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, బడ్జెట్ ప్రకారం 2016 మార్చి నాటికి ఏపీ రుణం రూ.1,73,854 కోట్లకు; 2017 మార్చి బడ్జెట్ నాటికి రూ.1,92,984 కోట్లకు చేరిందన్నారు. ఇది 2018 బడ్జెట్ నాటికి రూ.2,16,027 కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

ఆర్థికంమూలధన బాండ్లకు లోక్‌సభ ఆమోదం Current Affairs ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చే ప్రతిపాదనకు లోక్‌సభ జనవరి 4న ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు మరిన్ని సంస్కరణలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. ఏ బ్యాంకుకు ఎంత ఇవ్వాలి తదితర అంశాలకు సంబంధించి ఆర్థిక సర్వీసుల విభాగం ఇప్పటికే సమగ్రమైన ప్రణాళిక రూపొందించిందని సప్లిమెంటరీ డిమాండ్‌‌స ఫర్ గ్రాంట్స్ అంశంపై జరిగిన చర్చలో ఆయన వివరించారు. మొండిబాకీలను పెంచుకుంటూ కూర్చున్న పీఎస్‌బీలకు అదనపు మూలధనం సరైనది కాకపోయినప్పటికీ... వాటిని గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 
రూ. 7.33 లక్షల కోట్ల మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎస్‌బీలను పటిష్టపర్చేందుకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల ప్రణాళికను కేంద్రం 2017 ఆక్టోబర్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1.35 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీతో పాటు బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా రూ.58,000 కోట్లు సమకూర్చనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూలధన బాండ్ల జారీకి ఆమోదం 
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చేందుకు 

2017-18 వృద్ధి రేటు అంచనా 6.5 శాతంభారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్-2018 మార్చి) పేలవంగా ముగియనుందని కేంద్ర గణాంకాల కార్యాలయం ముందస్తు అంచనాలు వెల్లడించింది. వృద్ధి రేటు కేవలం 6.5 శాతంగానే నమోదవుతుందని ఈ మేరకు జనవరి 5న వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలే నిజమయితే, దేశ జీడీపీ నాలుగేళ్ల కనిష్టస్థాయికి పడిపోయినట్లవుతుంది. నాలుగేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో సైతం ఇదే అతితక్కువ వృద్ధి గణాంకమూ అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పేలవ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం ఇందుకు ప్రధాన కారణాల్లో కొన్నని గణాంకాలు వివరించాయి. 
గణాంకాల ప్రకారం తలసరి ఆదాయ వృద్ధి కూడా 9.7 శాతం (రూ.1,03,219) నుంచి 8.3 శాతానికి (రూ.1,11,782) మందగించే వీలుంది. 
ముఖ్యాంశాలు చూస్తే.. 

  • 2014 మేలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. 2014-15లో వృద్ధి రేటు 7.5 శాతం. 2015-16లో ఈ రేటు 8 శాతమయితే, 2016-17లో 7.1 శాతంగా నమోదయి్యంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు మూడేళ్ల గరిష్టస్థాయి 5.7 శాతం పడిపోయి, రెండవ త్రైమాసికంలో కొంత కోలుకుని 6.3%గా నమోదవడం తెలిసిందే.
  • తాజా అంచనాల ప్రకారం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో వృద్ధి రేటు 7.9 శాతం (2016-17) నుంచి 4.6%కి పడిపోనుంది.
  • ఇక వ్యవసాయ రంగం చూస్తే (అటవీ, మత్స్య రంగాలూ కలుపుకుని) వృద్ధి రేటు 4.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోనుంది.
  • 2017-18 వృద్ధి అంచనాను ప్రపంచబ్యాంక్ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019-20 నాటికి 7.4%కి పెరుగుతుందని విశ్లేషించింది.
  • ఇక 2017-18కి ఓఈసీడీ వృద్ధి అంచనా 6.7శాతం.
  • ఫిచ్ రేటింగ్‌‌స 6.9% నుంచి 6.7%కి తగ్గించింది. 2018-19కి 7.4% నుంచి 7.3%కి తగ్గించింది.
  • ఇక మూడీస్ విషయంలో 2017-18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
  • 2017-20 మధ్య సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ విశ్లేషిస్తోంది.
  • ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7%.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 వృద్ధి రేటు అంచనా 6.5 శాతం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : కేంద్ర గణాంకాల శాఖ

ప్రపంచ సోలార్ దిగ్గజాల్లో అదానీ గ్రూప్అంతర్జాతీయంగా సోలార్ విద్యుదుత్పత్తి సంస్థల్లో అదానీ గ్రూపు స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలో యుటిలిటీ సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి పరంగా టాప్-15 జాబితాలో చేరిన అదానీ గ్రూపు 12వ స్థానం దక్కించుకుంది. గ్రీన్‌టెక్ మీడియా రూపొందించిన ఈ జాబితాలో ఉన్న ఏకై న భారతీయ కంపెనీ అదానీ ఒక్కటే. ఈ జాబితాలో ఫస్ట్ సోలార్ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 4,619 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పాదన చేస్తుండగా, దీనికి అదనంగా 4,802 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోంది. అదానీ గ్రూపు 788 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ సోలార్ దిగ్గజాల్లో 12వ స్థానంలో అదానీ గ్రూప్
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : గ్రీన్‌టెక్ మీడియా

2018-19లో భారత వృద్ధి రేటు 7.6 శాతం: క్రిసిల్రానున్న ఆర్థిక సంవత్సరాని(2018-19)కి దేశ జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందన్న అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ మరోసారి పునరుద్ఘాటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించడానికి డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల స్వల్ప కాలంలో ఎదురైన ప్రతికూలతలు, వ్యవసాయ వృద్ధి బలహీనంగా ఉండడమే కారణాలుగా పేర్కొంది. జీఎస్టీ ప్రతికూల ప్రభావం కొనసాగుతుందన్న అంచనాలతోనే రానున్న ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.6 శాతంగా పేర్కొంటున్నట్టు వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు అంచనా 7.6 శాతం
ఎప్పుడు : 2018-19లో
ఎవరు : క్రిసిల్

జౌళి సంచుల్లో ఆహార ధాన్యాలు, పంచదారఈ ఏడాది జూన్ వరకు ఆహార ధాన్యాలు, పంచదారను తప్పనిసరిగా జౌళి సంచుల్లోనే ప్యాక్ చేయాలని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) జనవరి 3న నిర్ణయించింది. ఆహార ధాన్యాల్లో 90 శాతం, పంచదార ఉత్పత్తుల్లో 20 శాతాన్ని జౌళి సంచుల్లో ప్యాక్ చేస్తే 40 లక్షల మంది రైతులు; 3.7 లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ప్యాకింగ్‌కు పర్యావరణ అనుకూల జౌళిని వినియోగించేలా దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. తాజా నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, అసోం, మేఘాలయ, త్రిపురల్లోని రైతులు, కార్మికులకు మేలు జరుగుతుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీఓక్కీ తుపాను రికార్డు ప్రయాణం Current Affairs ఇటీవల తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లను కుదిపేసిన ఓక్కీ తుపాను 2,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని వాతావరణ శాస్త్రవేత్త రామచంద్రన్ తెలిపారు. గత నలభై ఏళ్లలో బంగాళాఖాతంలో ఇదే రికార్డని ఆయన పేర్కొన్నారు. 2017 నవంబర్ 28న ఓక్కీ అల్పపీడనంగా ప్రారంభమై 30వ తేదీన కన్యాకుమారి తీరాన్ని కుదిపేసింది. డిసెంబర్ 6న బలహీనపడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2,400 కిలోమీటర్ల రికార్డు దూరం ప్రయాణించిన ఓక్కీ తుపాను
ఎప్పుడు : 2017 నవంబర్ 28
ఎవరు : భారత వాతావరణ శాఖ

అతిపెద్ద ప్రధాన సంఖ్య ఎం77232917 ప్రపచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఔత్సాహిక శాస్త్రవేత్త ఒకరు కనుగొన్నారు. 2017 డిసెంబర్ 26న అమెరికాకు చెందిన జొనాథన్ పేస్ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈ ఘనత సాధించారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. 350 ఏళ్ల కిందటే ఈ ప్రధాన సంఖ్యల గురించి అధ్యయనం చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త మారిన్ మెర్సెన్నె పేరు వీటికి పెట్టారు. ఈ కొత్త ప్రధాన సంఖ్యను ఆరు రోజుల పాటు ఆగకుండా లెక్కించారు. ఎం77232917 ఇప్పటి వరకు కనుగొన్న 50వ మెర్సెన్నె ప్రధాన సంఖ్య. గ్రేట్ ఇంటర్నెట్ మెర్సెన్నె ప్రైమ్ సెర్చ్ (జీఐఎంపీఎస్) అనే సాఫ్ట్‌వేర్ సాయంతో ప్రధాన సంఖ్యలు కనుగొనేందుకు వేల మంది వలంటీర్లు నిత్యం ప్రయతిస్తుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అతిపెద్ద ప్రధాన సంఖ్యను కనుగొన్న శాస్త్రవేత్తలు
ఎవరు : అమెరికాకు చెందిన జొనాథన్ పేస్
ఎందుకు : ఎం77232917 గా నామకరణం

క్రూయిజ్ క్షిపణి హర్భాను పరీక్షించిన పాక్స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్ క్షిపణి హర్బాను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ నౌకాదళం జనవరి 3న ప్రకటించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితల, భూభాగ లక్ష్యాలను ఛేదించగలదు.

క్రీడలుజాతీయ సీనియర్ కబడ్డీ చాంప్స్ హిమాచల్, మహారాష్ట్రCurrent Affairsజాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ - 2017లో హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజేతలుగా నిలిచాయి. జనవరి 5న హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 38-35తో ఇండియన్ రైల్వేస్‌పై గెలుపొంది టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల టైటిల్ పోరులో మహారాష్ట్ర 34-29తో సర్వీసెస్‌ను ఓడించింది. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షులు జేఎస్ గెహ్లాట్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : మహిళల టైటిల్ విజేత హిమాచల్ ప్రదేశ్, పురుషుల టైటిల్ విజేత మహారాష్ట్ర
ఎక్కడ : హైదరాబాద్‌లో

డోపింగ్‌లో పట్టుబడ్డ యూసుఫ్ పఠాన్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడి.. ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గతేడాది మార్చి 16న అతడి నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించింది. అయితే ఫలితాలు ఆలస్యంగా రావడంతోపాటు, యూసుఫ్ పఠాన్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడకపోవడంతో బోర్డు అతని నిషేధాన్ని తగ్గించింది. గతేడాది నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్’ తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలోని మెడిసిన్. అయితే దీన్ని యూసుఫ్ దగ్గుమందు ద్వారా తీసుకున్నాడు. నేరుగా కాకుండా అస్వస్థతలో తెలియక తీసుకోవడంతో అతనికి నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీనిపై అతను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన బీసీసీఐ ఐదు నెలల నిషేధంతో సరిపెట్టింది. 2018 జనవరి 14న ఈ నిషేధం ముగుస్తుందని బోర్డు ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడ్డాడని ప్రకటన
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : బీసీసీఐ
ఎందుకు : అతడిపై విధించిన ఐదు నెలల నిషేధం జనవరి 14తో ముగుస్తుందని వెల్లడి

టాటా ఓపెన్ మహారాష్ట్ర విజేత సిమోన్టాటా ఓపెన్ మహారాష్ట్ర టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ టెన్నిస్ ప్లేయర్ గైల్స్ సిమోన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సిమోన్ ఫైనల్లో 7-6 (7/4), 6-2తో ప్రపంచ 14వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సిమోన్‌కు 89,435 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 65 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాటా ఓపెన్ - 2017
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత గైల్స్ సిమోన్

ఫెడరర్, బెన్సిచ్‌లకు హాప్‌మన్ కప్ - 2017ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్‌లో రోజర్ ఫెడరర్, బెలిండా బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. జనవరి 6న జరిగిన ఫైనల్లో ఫెడరర్, బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు 2-1తో అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టును ఓడించింది. తొలుత ఫైనల్స్ పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెడరర్ 6-7 (4/7), 6-0, 6-2తో జ్వెరెవ్‌పై గెలిచి స్విట్జర్లాండ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కెర్బర్ 6-4, 6-1తో బెన్సిచ్‌ను ఓడించి స్కోరును 1-1తో సమం చేసింది. నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్-బెన్సిచ్ జోడీ 4-3 (5/3), 4-2తో కెర్బర్-జ్వెరెవ్ జంటను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది.
30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో స్విట్జర్లాండ్ విజేతగా నిలువడం ఇది మూడోసారి. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి ఫెడరర్ ఈ టోర్నీలో టైటిల్ నెగ్గగా... 1992లో జాకబ్ హసెక్, మాన్యుయెలా మలీవా తొలిసారి స్విట్జర్లాండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాప్‌మన్ కప్ - 2017
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : విజేత స్విట్జర్లాండ్ (ఫెడరర్, బెన్సిచ్)

యాషెస్ సీరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సీరీస్‌ని ఆస్ట్రేలియా 4-0తో గెలుచుకుంది. జనవరి 8న ముగిసిన సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్‌‌స 123 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమిన్‌‌సకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’.. కెప్టెన్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య యాషెస్ సిరీస్ - 2017
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : విజేత ఆస్ట్రేలియా

వార్తల్లో వ్యక్తులువిదేశాంగ కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే Current Affairs భారత విదేశాంగ కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే నియమితులయ్యారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న ఎస్ జయశంకర్ పదవీకాలం జనవరి 28తో ముగియనుండటంతో.. ఆయన స్థానంలో కేశవ్ గోఖలే నియమితులయ్యారు. ఆయన 1981 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశాంగ శాఖ కార్యదర్శి నియామకం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : విజయ్ కేశవ్ గోఖలే

ఇన్ఫీ సీఈవో పరేఖ్‌కు రూ.16.25 కోట్ల ప్యాకేజీ ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రధాన కార్యనిర్వాహకఅధికారి (సీఈవో) సలీల్ పరేఖ్.. ఏడాదికి రూ.16.25 కోట్ల జీతం తీసుకోనున్నారు. స్థిరవేతనంగా రూ.6.50 కోట్లు, భత్యాలరూపంలో మరో రూ.9.25 కోట్లను అదనంగా ఏడాది చివరన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు కిరణ్ మజుందార్ వెల్లడించారు. ఇది వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేసిన విశాల్ సిక్కాకు గత ఏడాది రూ.42.92 కోట్లను చెల్లించారు. మరోవైపు విప్రో కంపెనీ సీఈవో అబిదాలి నిమూచ్‌వాలా ఏడాదికి రూ.12.71 కోట్లను ఆర్జిస్తున్నారు. స్టాక్ ఆప్షన్ల కింద సలీల్‌కు అదనంగా మరో రూ.3.25 కోట్లు ఇవ్వనున్నారు. ఆయన ఐదేళ్లపాటు ఇన్ఫోసిస్‌కు సేవలు అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ సీఈవోకు ఏడాదికి రూ.16.25 కోట్ల జీతం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : సలీల్ పరేఖ్

దాణా కేసులో లాలూకి మూడన్నరేళ్ల జైలు శిక్ష21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.10 లక్షల జరిమానా కూడా చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ జనవరి 6న తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు అదనంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆర్జేడీ చీఫ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించారు. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో మరో 15 మందికీ ఐపీసీ, పీసీఏ (అవినీతి నిరోధక చట్టం) కింద ఆర్నెల్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షలను కూడా న్యాయమూర్తి ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాణా కేసులో లాలూకి మూడన్నరేళ్ల జైలు శిక్ష
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : సీబీఐ ప్రత్యేక కోర్టు

వ్యోమగామి జాన్ యంగ్ కన్నుమూతఅత్యధిక పర్యాయాలు అంతరిక్షయానం చేయటంతోపాటు, చంద్రునిపై నడిచిన ప్రముఖ అమెరికా వ్యోమగామి జాన్ వాట్స్ యంగ్(87) కన్నుమూశారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన హూస్టన్‌లో తన నివాసంలో జనవరి 5న మృతి చెందారని నాసా తెలిపింది. అంతరిక్షయానంలో లెజెండ్‌గా అందరూ పిలిచే జాన్ యంగ్ నేవీ ఆఫీసర్, టెస్ట్ పెలైట్, ఏరోనాటికల్ ఇంజినీర్ కూడా. ఆయన పేరిట అనేక రికార్డులున్నాయి. జెమిని, అపొలోతోపాటు పలు అంతరిక్ష యాత్రల్లో కీలకంగా వ్యవహరించారు. 1965లో నాసా ప్రయోగించిన మొట్టమొదటి మానవ సహిత జెమిని మిషన్‌లో ఆయన కూడా సభ్యుడే. అంతరిక్షంలోకి ఆరుసార్లు వెళ్లి వచ్చిన ఏకైక వ్యోమగామిగా జాన్ రికార్డు నెలకొల్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక సార్లు అంతరిక్షయానం చేసిన వ్యోమగామి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : జాన్ వాట్స్ యంగ్

సిక్కిం ప్రచారకర్తగా రెహ్మాన్ సిక్కిం రాష్ట్ర ప్రచారకర్తగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నియమితులయ్యారు. గ్యాంగ్‌టక్‌లోని పాల్జోల్ స్టేడియంలో జనవరి 9న జరిగిన రెడ్ పాండా వింటర్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్.. ఇక నుంచి ఏఆర్ రెహ్మాన్ సిక్కిం పర్యాటక, వ్యాపార అంశాలలో ప్రచార కర్తగా కొనసాగుతారని ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాలో తొలి ఆర్గానిక్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్న సిక్కింకు రెహ్మాన్ అంబాసిడర్‌గా కొనసాగడం.. ఆ రాష్ట్ర పర్యాటక, వ్యాపార రంగాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిక్కిం ప్రచారకర్తగా ఏఆర్ రెహ్మాన్
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్

సంగీత విధ్వాంసురాలు రాధా విశ్వనాథన్ కన్నుమూతకర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్(83) జనవరి 2న బెంగళూరులో మరణించారు. ఈమె ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి కూతురు.

అవార్డులుఅజిజ్ అన్సారీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుCurrent Affairs లాస్ ఏంజెల్స్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డులు - 2018 ప్రదానోత్సవంలో భారత సంతతి నటుడు అజిజ్ అన్సారీ.. టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ద మాస్టర్ ఆఫ్ నన్ కామిడీ సిరీస్‌లో అజిజ్ అన్సారీ నటించాడు. 2016లోనూ ఇదే సిరీస్ కోసం అన్సారీ నామినేట్ అయినా అవార్డు రాలేదు.

అంతర్జాతీయం2017లో 138 మంది పాక్ సైనికుల హతం Current Affairsజమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి 2017లో జరిగిన సీమాంతర కాల్పులు, వ్యూహాత్మక ఘటనల్లో 138 మంది పాకిస్తాన్ సైనికులను భారత సైన్యం మట్టుబెట్టిందని ప్రభుత్వ నిఘా వర్గాలు వెల్లడించాయి. 28 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపాయి. 2017లో 860.. 2016లో 221 కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని వివరించాయి. 2017 డిసెంబర్ 25న ఎల్‌ఓసీ దాటి వెళ్లి ముగ్గురు పాక్ సైనికులను మట్టుబెట్టిన ఘటననూ అందులో పేర్కొన్నాయి. సాధారణంగా పాక్ సైనికుల మరణాలను అక్కడి ఆర్మీ ధ్రువీకరించదని, కొన్ని సందర్భాల్లో సైనికుల మరణాలను పౌరుల మరణాలుగా చూపిస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

డిఫాల్టర్లపై చైనా కఠిన చర్యలు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికే భారత్‌లో నానా కష్టాలు పడుతుంటే చైనా ప్రభుత్వం అక్కడి డిఫాల్టర్లకు చుక్కలు చూపిస్తోంది. 2017 చివరినాటికి రుణాల ఎగవేతకు పాల్పడిన 95.9 లక్షల మంది ప్రజల్ని కోర్టులు నిషేధిత జాబితాలో చేర్చినట్లు సుప్రీం పీపుల్స్ కోర్టు(ఎస్పీసీ) తెలిపింది. డిఫాల్టర్ల రూ.1.76 లక్షల కోట్ల(27.7 బిలియన్ డాలర్లు) డిపాజిట్లను జప్తు చేశారు. పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డుల ఆధారంగా విమానాలు, హైస్పీడ్ రైళ్లలో టికెట్లు కొనకుండా అడ్డుకున్నారు. డిఫాల్టర్లు దాఖలు చేసే రుణ, క్రెడిట్ కార్డ్ దరఖాస్తుల్ని తిరస్కరించేందుకు బ్యాంకులతో కలిసి పనిచేశారు. నిషేధిత జాబితా లోని వ్యక్తులు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులుగా ఇకపై ఉండలేరు.

జాతీయంకశ్మీర్‌లో సోనమ్ వాంగ్‌చుక్ వర్సిటీCurrent Affairs త్రీ ఇడియట్స్ సినిమాలో ఆమిర్‌ఖాన్ ‘ఫున్‌సుక్ వాంగ్‌డూ’పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ మరో కీలక ప్రాజెక్టును చేపట్టారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడక్(ఎస్‌ఈసీఎంవోఎల్) పేరిట ఇప్పటికే లాభార్జన లేని ఓ పాఠశాలను ప్రారంభించిన సోనమ్.. తాజాగా యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లోనే రూ.800 కోట్లతో దాదాపు 200 ఎకరాల్లో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్‌‌స విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నట్లు సోనమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పెట్టుబడి కోసం క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘మిలాప్’ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. 2018, మార్చి ఏప్రిల్ నాటికి ఈ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి రూ.14 కోట్లు అవసరమన్నారు. ఇందులో భాగంగా జనవరి మాసాంతానికి రూ.7 కోట్లను క్రౌడ్‌ఫండింగ్ ద్వారా, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నుంచి సేకరిస్తామన్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : కశ్మీర్‌లో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ విశ్వవిద్యాలయం
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : సోనమ్ వాంగ్‌చుక్

ఆధార్ భరోసాకు తాత్కాలిక వర్చువల్ ఐడీ ఆధార్ వల్ల ప్రజల సమాచార భద్రత, గోప్యత ప్రశ్నార్థకమవుతోందంటూ భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ- యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సమస్యను అధిగమించేందుకు ఆధార్ ధ్రువీకరణ కోసం కొత్త పద్ధతిని త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు జనవరి 10న ప్రకటించింది. నూతన విధానంలో ప్రజలెవరూ తమ 12 అంకెల ఒరిజినల్ ఆధార్ సంఖ్యను ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఆధార్ ఎక్కడ అవసరమైతే అక్కడ, దాని స్థానంలో తాత్కాలికంగా ఉండే ఒక వర్చువల్ గుర్తింపు సంఖ్యను మాత్రం ఇస్తే చాలని యూఐడీఏఐ పేర్కొంది. దీనివల్ల వినియోగదారుడి ఆధార్‌లో ఉన్న సమస్త సమాచారం వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు కనిపించదనీ, కేవలం ఫొటో, పేరు వంటి నామమాత్రపు వివరాలు మాత్రమే అందేలా కొత్త విధానంలో పలు నియంత్రణలున్నాయని యూఐడీఏఐ ఒక సర్క్యులర్‌లో వెల్లడించింది.
ఎలా పనిచేస్తుంది?
ముందుగా వినియోగదారులు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌కు అనుసంధానిస్తూ 16 అంకెల వర్చువల్ గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ వినియోగదారుడికి కేటాయిస్తుంది. బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు, ప్రభుత్వ విభాగాలు ఎక్కడైనా సరే...ప్రజలు తమ ఆధార్ నంబర్‌కు బదులుగా ఈ వర్చువల్ నంబర్‌ను ఇచ్చి, గతంలో మాదిరిగానే వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. వెంటనే వర్చువల్ నంబర్‌కు అనుసంధానమై ఉన్న ఆధార్ నంబర్‌లోని సమాచారం వాణిజ్య సంస్థలు/ప్రభుత్వ విభాగాలకు చేరుతుంది. అయితే ఆధార్‌లోని పూర్తి వివరాలు కాకుండా పేరు, ఫొటో, చిరునామా వంటి నామమాత్రపు సమాచారం మాత్రమే వారికి అందుతుంది. ఆ వివరాలతో కేవైసీ (మీ వినియోగదారుల గురించి తెలుసుకోండి) ధ్రువీకరణను సంస్థలు పూర్తి చేసుకుంటాయి. ఈ వర్చువల్ నంబర్‌ను వినియోగదారులు ఎన్నింటినైనా సృష్టించుకోవచ్చు. ఒక్కో వర్చువల్ సంఖ్య నిర్దిష్ట కాలంపాటు లేదా కొత్త నంబర్‌ను సృష్టించుకునే వరకు యాక్టివ్‌గా ఉంటుంది. సంస్థలకు వినియోగదారుడి ఆధార్ నంబర్‌తో పనిలేదు. అది వారికి తెలియాల్సిన అవసరం ఉండదు. అలాగే పరిమిత సమాచారం మాత్రమే యూఐడీఏఐ నుంచి సంస్థలకు అందుతుంది కాబట్టి ఈ వ్యవస్థ భద్రంగా ఉంటుందని యూఐడీఏఐ చెబుతోంది. వినియోగదారుడి తరఫున కంపెనీలు ఈ వర్చువల్ గుర్తింపు సంఖ్యను సృష్టించేందుకు కూడా అనుమతి ఉండదు.
మార్చి నుంచి అమలు
కొత్త విధానాన్ని మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఆధార్ ధ్రువీకరణలన్నీ కొత్త విధానంలోనే జరుగుతాయని సర్క్యులర్‌లో పేర్కొంది. నిర్దేశిత సమయం తర్వాత కూడా ఈ కొత్త విధానాన్ని అందిపుచ్చుకోని కంపెనీలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ‘ఆధార్ నంబర్ కలిగినవారు ధ్రువీకరణల కోసం ఆధార్ నంబర్‌కు బదులుగా వర్చువల్ గుర్తింపు సంఖ్యను వాణిజ్య సంస్థలకు ఇవ్వొచ్చు. గతంలో ఆధార్ నంబర్ చెప్పి వేలిముద్రలు ఎలా వేసేవారో ఇప్పుడు కూడా అలాగే ఈ తాత్కాలిక నంబర్ చెప్పి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది’ అని సర్క్యులర్‌లో యూఐడీఏఐ పేర్కొంది.
ఆందోళనలు తగ్గించేందుకే
ఆధార్ కార్డు కోసమంటూ ప్రజల మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, వేలిముద్రలు, ఐరిస్ సహా ఎంతో సున్నితమైన సమాచారాన్ని యూఐడీఏఐ సేకరిస్తోంది. అయితే ఈ సమాచారానికి రక్షణ కరువైందనీ, ఎవరికి పడితే వారికి ఆధార్ సమాచారం చాలా సులువుగా దొరుకుతోందని నిరూపించేలా పలు ఘటనలు జరిగాయి. ఈ నెల 3న ఆంగ్ల పత్రిక ‘ద ట్రిబ్యూన్’... రూ.500కే దేశంలో ఎవరి ఆధార్ సమాచారం కావాలన్నా దొరుకుతోందంటూ ఆధారాలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించడం, ఆ తర్వాత పత్రిక, ఆ వార్త రాసిన విలేకరిపై ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు, ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకే యూఐడీఏఐ కొత్త విధానం ప్రకటించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత విధానంలో.. 

  • 12 అంకెల ఆధార్ సంఖ్యను వెల్లడించాలి
  • వేలిముద్ర వేయాలి
  • వాణిజ్య సంస్థల చేతికి ఆధార్‌లోని పూర్తి సమాచారం వెళ్తుంది
  • ఒకటే ఆధార్ నంబర్ ఉంటుంది.
కొత్త విధానంలో..
  • 16 అంకెల వర్చువల్ సంఖ్యను వెల్లడించాలి
  • వేలిముద్ర వేయాలి.
  • వాణిజ్య సంస్థలకు పేరు, ఫొటో, చిరునామాతో పరిమిత సమాచారమే వెళ్తుంది.
  • ఎన్ని తాత్కాలిక సంఖ్యలనైనా సృష్టించుకోవచ్చు.

1984 అల్లర్లపై మరో సిట్సంచలనం సృష్టించిన 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను మరోసారి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నాటి అల్లర్లకు సంబంధించిన 241 కేసుల్లో 186 కేసులను ఎలాంటి దర్యాప్తు జరపకుండానే మూసేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. తాజా దర్యాప్తును పర్యవేక్షించేందుకు మళ్లీ త్రిసభ్య ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్‌ఎన్ ధింగ్రా నేతృత్వంలోని త్రిసభ్య బృందంలో ఆయనతో పాటు అభిషేక్ దులార్(2006 బ్యాచ్ ఐపీఎస్), రాజ్‌దీప్ సింగ్ (రిటైర్డ్ ఐజీ ర్యాంకు అధికారి)సభ్యులుగా ఉన్నారు. ఈ సిట్ రెండు నెలల్లో నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ అదేశించింది.
1984 నాటి ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో 2,733 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులపై మరో సిట్
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు

ఆధార్‌కు ‘బయోమెట్రిక్’ లాక్ఆధార్ సమాచారానికి రక్షణ, గోప్యత కోసం 16 అంకెల వర్చువల్ గుర్తింపు సంఖ్యను మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ- యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ వర్చువల్ ఐడీ కన్నా ముందే ఆధార్ వెబ్‌సైట్‌లో మరో సెక్యూరిటీ ఫీచర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి్య, తన బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవచ్చు. లాక్ ఆన్ చేసి ఉన్నప్పుడు ఎక్కడైనా ఆధార్ ధ్రువీకరణకు వేలిముద్ర వేసినా పనిచేయదు. వినియోగదారుడు తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మళ్లీ బయోమెట్రిక్ డేటాను అన్‌లాక్ చేయొచ్చు. వేలి ముద్ర వేసి ఆధార్ ధ్రువీకరణ పూర్తి కాగానే మళ్లీ లాక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో బయోమెట్రిక్ సమాచారం భద్రంగా ఉంటుందనీ, ఆధార్ వివరాలను ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ అవకాశాన్ని కల్పించామని యూఐడీఏఐ సీఈవో తెలిపారు.

హజ్ సబ్సిడీ రద్దు: కేంద్ర మంత్రి నఖ్వీ ఈ ఏడాది నుంచి హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వబోమని కేంద్ర మైనారిటీ శాఖమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జనవరి 17న తెలిపారు. ఈ సబ్సిడీతో ముస్లింలు ఎలాంటి లబ్ధి పొందటం లేదని.. ఇప్పటివరకూ హజ్‌యాత్రకు కేటాయిస్తున్న మొత్తాన్ని మైనారిటీ బాలికల చదువుకు వినియోగిస్తామని వెల్లడించారు. సౌదీ అరేబియాలోని మక్కాకు దేశం నుంచి ఏటా 1.75 లక్షల మంది ముస్లింలు వెళ్తుంటారు. గతేడాది హజ్ సబ్సిడీ కింద రూ.250 కోట్లకు పైగా కేటాయించారు. 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలంటూ సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని నఖ్వీ చెప్పారు. సబ్సిడీలో భాగంగా ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో టికెట్ ధరలపై రాయితీ ఇస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హజ్ సబ్సిడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలంటూ సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకు

సివిల్స్, గ్రూపు-1లకు ఉమ్మడి సిలబస్యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1లేదా తత్సమాన ఉన్నత శ్రేణి పరీక్షలకు 60శాతం ఉమ్మడి (కామన్) సిలబస్ ఉండాలన్న ప్రతిపాదనకు గోవాలో జరిగిన రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సు 2018, జనవరి 12న ఆమోదించింది.

ద్వైపాక్షికంఢిల్లీలో భారత్ - ఆసియాన్ సదస్సు Current Affairs జనవరి 25, 26న ఢిల్లీలో భారత్-ఆసియాన్ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా మహాకావ్యం రామాయణంలోని కొన్ని ఘట్టాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. ఆసియాన్ దేశాల(ఇండోనేసియా, సింగపూర్, ఫిలిప్పైన్‌‌స, మలేసియా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై, మయన్మార్, లావోస్) అధినేతలు ఈ కార్యక్రమాల్ని తిలకించనున్నారు. భారత్-ఆసియాన్ సంబంధాలకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి జరిగే గణతంత్ర వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-ఆసియాన్ సదస్సు
ఎప్పుడు : జనవరి 25, 26
ఎక్కడ : ఢిల్లీలో

భారతీయులను వెనక్కి పంపే ఒప్పందాలపై భారత్-బ్రిటన్ సంతకాలుచట్ట విరుద్ధంగా బ్రిటన్‌లో నివశిస్తున్న భారతీయులను వెనక్కి తిప్పి పంపేయడానికి సంబంధించిన రెండు ఒప్పందాలపై భారత్-బ్రిటన్‌లు లండన్‌లో 2018, జనవరి 13న సంతకాలు చేశాయి. ఉభయ దేశాల మధ్య కుదిరిన రెండు అవగాహన ఒప్పందాలపై భారత హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, బ్రిటన్ ఇమిగ్రేషన్ వ్యవహారాల మంత్రి కెరోలిన్‌నోక్స్ సంతకాలు చేశారు.

భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పర్యటన ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జనవరి 14న భారత్ చేరుకున్నారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. ఢిల్లీ విమానాశ్రయంలో నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, ఇజ్రాయెల్‌లు సంతకాలు చేయనున్నాయి.

తీన్ మూర్తి-హైఫా చౌక్‌గా పేరు మార్పు అంతకుముందు సెంట్రల్ ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ మెమోరియల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చౌక్ పేరును అధికారికంగా తీన్ మూర్తి- హైఫా చౌక్‌గా మార్చారు. ఇజ్రాయెల్ నగరం హైఫా విముక్తి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారతీయ సైనికులకు ఇరువురు నేతలు నివాళులర్పించారు. తీన్ మూర్తి మెమోరియల్‌లోని సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు.
తీన్‌మూర్తి చౌక్‌లోని మూడు కాంస్య విగ్రహాలు.. ‘15వ ఇంపీరియల్ సర్వీస్ బ్రిగేడ్’కు చెందిన హైదరాబాద్, జోధ్‌ఫూర్, మైసూర్ సైనికులకు ప్రతీక. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సెప్టెంబర్ 23, 1918న హైఫాకు ఒట్టొమాన్, జర్మనీ బలగాల నుంచి ఈ బ్రిగేడ్ విముక్తి కల్పించింది.
15 ఏళ్ల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని ఒకరు భారత్‌లో పర్యటిస్తున్నారు. 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరన్ భారత్‌లో పర్యటించారు. ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ఆ దేశంతో సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగాక ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే.

భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా జనవరి 16న ఢిల్లీలో రైసినా డైలాగ్ భౌగోళిక-రాజకీయ మూడో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇస్లాం అతివాదం, ఉగ్రవాదుల చర్యలు అంత్యంత ప్రమాదకరమైనవనీ, అంతర్జాతీయ వ్యవస్థపై ఇవి తీవ్ర దుష్పరిణామాలు చూపగలవని నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్-ఇజ్రాయెల్ మధ్య మరింత బలమైన బంధం ఉండాలని ఆయన పేర్కొన్నారు.
భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జనవరి 15న ఇరు దేశాల మధ్య సైబర్ భద్రత, గ్యాస్, ఆయిల్ తదితర రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల అధికారులు వీటిపై సంతకాలు చేశారు. అలాగే ఢిల్లీలో జనవరి 15న జరిగిన ఇండియా-ఇజ్రాయెల్ వాణిజ్య సదస్సులో మోదీ మాట్లాడుతూ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత అబివృద్ధి చేసుకునేందుకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనలో భాగంగా

ప్రాంతీయంతెలంగాణలో గుట్కాపై నిషేధం పొడిగింపుCurrent Affairsరాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా అమ్మకంపై నిషేధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కమిషనర్ శాంతికుమారి ఈ మేరకు జనవరి 11న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డెరైక్టర్ శంకర్ ఈ ప్రకటన విడుదల చేశారు. నికొటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి, నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. గుట్కా, పాన్‌మసాలా అమ్మకాలపై 2013 జనవరి 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ప్రతిఏటా కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుట్కాపై నిషేధం పొడిగింపు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలో

ఏపీ ‘నాలా’ బిల్లుకు గవర్నర్ ఆమోదంఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూ వినియోగ మార్పిడి (నాలా) చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. శాసనసభ, శాసనమండలి 2017 డిసెంబర్‌లో ఆమోదించి పంపిన నాలా బిల్లుపై గవర్నర్ జనవరి 11న సంతకం చేశారు. నాలా రుసుము తగ్గింపు, నిబంధనల సవరణపై ఆర్డినెన్‌‌స కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం పంపిన ప్రతిపాదనలపై గవర్నర్ పలు సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా పునఃపరిశీలించాలంటూ ఫైల్ వెనక్కి పంపటం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ‘నాలా’ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : గవర్నర్ నరసింహన్

పీఎస్సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా రెండోసారి చక్రపాణి యూపీఎస్సీ చైర్మన్ సమక్షంలో పీఎస్సీ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ చక్రపాణి రెండోసారి ఎన్నికయ్యారు. గోవాలో జనవరి 11, 12 తేదీల్లో జరిగిన పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ 20వ జాతీయ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. చక్రపాణి.. ఆ పదవిలో మరో రెండేళ్లపాటు కొనసాగుతారు. ఒకే పీఎస్సీ చైర్మన్‌ను రెండోసారి ఎన్నుకోవడం ఇదే ప్రథమం.
అన్ని రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగ పరీక్షల్లో మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని ఈ సదస్సులో పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎస్సీల స్టాండింగ్ కమిటీ 20వ జాతీయ సదస్సు
ఎప్పుడు : జనవరి 11,12
ఎక్కడ : గోవా
ఎవరు : రెండోసారి ీపఎస్సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన ఘంటా చక్రపాణి

తెలంగాణలో ‘అమ్మ ఒడి’ సేవల విస్తరణఅమ్మ ఒడి (102 సేవలు) విస్తరణ, కొత్తగా ద్విచక్ర అంబులెన్సులు, ఏఎన్‌ఎంలు వినియోగించే ద్విచక్ర వాహనాల (వింగ్‌‌స) సేవలను సీఎం కేసీఆర్ జనవరి 17న హైదరాబాద్‌లో ప్రారంభించారు. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అమలవుతున్న జననీ సురక్ష యోజన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పు అయిన మహిళను, శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. 2016 డిసెంబర్ 28న రాష్ట్రంలో అమ్మ ఒడి సేవలను ప్రారంభించారు. మొదటి దశలో 41 వాహనాలతో సేవలు మొదలయ్యాయి. జీవీకే ఈఎంఆర్‌ఐ భాగస్వామ్యంతో 102 వాహనాలకు విస్తరించింది. అయితే 12 జిల్లాల్లోనే ఈ సేవలను కొనసాగిస్తున్నారు. మిగతా జిల్లాల్లోనూ ఈ పథకం అమలుకు కొత్తగా 200 వాహనాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చారు.
అలాగే అత్యవసర సమయాల్లో వేగంగా రోగుల దగ్గరకు వెళ్లేందుకు వినియోగించే ద్విచక్ర అంబులెన్‌‌స సేవలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సేవల కోసం 50 వాహనాలను కొనుగోలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమ్మ ఒడి(102) సేవల విస్తరణ
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలో

‘మొయిబా’తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా జనవరి 17న తెలంగాణ ప్రభుత్వం.. మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్ (మొయిబా) సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స, వర్చువల్ రియాలిటీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర అంశాల్లో మొయిబా, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం కుదిరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మొయిబా’ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : మంత్రి కేటీఆర్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా
ఎక్కడ : దక్షిణ కొరియా

ఆర్థికంఎంపీల్యాడ్స్ కాలపరిమితి పొడిగింపుCurrent Affairs పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్)ను 14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ముగిసే తేదీ అయిన 2020, మార్చి 31 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జనవరి 10న ఈ మేరకు అంగీకరించింది. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ. 11,850 కోట్లు వెచ్చించనున్నారు. ప్రారంభించిన కార్యక్రమాల పర్యవేక్షణ, సామర్థ్య పెంపు, స్థానిక అధికారుల శిక్షణ తదితరాలకు అదనంగా ఏటా రూ.5 కోట్లు వ్యయం చేయనున్నారు.
స్థానికంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, రహదారులు తదితరాల అభివృద్ధికి ఏడాదికి రూ. 5 కోట్లు ఖర్చు చేసేందుకు పార్లమెంటు సభ్యులు సిఫారసు చేయొచ్చు. 1993-94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి గత ఆగస్టు వరకు పలు అభివృద్ధి పనులకు రూ.44,929.17 కోట్లు మంజూరు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంపీల్యాడ్‌‌స కాలపరిమితి పొడిగింపు
ఎప్పుడు : 2020, మార్చి 31 వరకు
ఎవరు : కేంద్ర కేబినెట్

ఎఫ్‌డీఐలో కీలక సంస్కరణలకు కేబినెట్ ఆమోదం విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా బడ్జెట్‌కి ముందుగానే కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో కీలక సవరణలు చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జనవరి 10న సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇవీ సంస్కరణలు..
  • సింగిల్ బ్రాండ్ రిటైల్, నిర్మాణ రంగం, విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు.
  • సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఆటోమేటిక్ విధానంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి. ఇప్పటిదాకా సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 49 శాతం దాకా ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతులు ఉండగా, అంతకు మించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉండేది.
  • రుణ సంక్షోభంలో కూరుకున్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో 49 శాతం దాకా విదేశీ ఎయిర్‌లైన్‌‌స ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతి. - వైద్య పరికరాల తయారీ సంస్థలు, విదేశీ నిధులు అందుకునే కంపెనీలకు సేవలందించే ఆడిట్ సంస్థల్లో ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం.
  • నిర్మాణ రంగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ సేవలను.. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా పరిగణించడం జరగదని స్పష్టీకరణ. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలు పొందేందుకు బ్రోకింగ్ సేవల సంస్థలకు అర్హత ఉంటుంది.
  • విద్యుత్ ట్రేడింగ్ జరిగే పవర్ ఎక్స్ఛేంజీల్లో ఎఫ్‌డీఐల సడలింపు. ప్రస్తుత పాలసీ ప్రకారం పవర్ ఎక్స్ఛేంజీల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 49 శాతం దాకా మాత్రమే ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెకండరీ మార్కెట్‌కి మాత్రమే పరిమితంగా ఉంటున్నాయి. ఈ నిబంధనను తొలగించాలని, ఎఫ్‌ఐఐలు/ఎఫ్‌పీఐలు కూడా ప్రైమరీ మార్కెట్ ద్వారా పవర్ ఎక్స్చేంజీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రక్రియపరమైన మార్పుల్లో భాగంగా ఆటోమేటిక్ రూట్ రంగాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చే పెట్టుబడి దరఖాస్తులను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) పరిశీలించి కేంద్రం ఆమోదానికి పంపుతుంది.

2018లో భారత్ వృద్ధి 7.3 % : ప్రపంచ బ్యాంక్ భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018లో 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది. అటుపై రెండేళ్లలో వృద్ధి 7.5 శాతంగా ఉంటుందనీ విశ్లేషిస్తోంది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చితే, భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న ప్రపంచబ్యాంక్ ఈ సందర్భంగా కేంద్రం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించింది. ఈ మేరకు 2018 గ్లోబల్ ఎకనమిక్స్ ప్రాస్పెక్టస్ పేరుతో ప్రపంచబ్యాంక్ నివేదిక విడుదల చేసింది.
నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...

  • 2017లో భారత్ వృద్ధి 6.7 శాతం అంచనా. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలుకు తొలిదశలో ఏర్పడుతున్న ఇబ్బందులు దీనికి ప్రధాన కారణాలు.
  • వృద్ధి మందగమనంలో ఉన్న చైనాతో పోల్చి చూస్తే, భారత్‌లో వృద్ధి వేగం క్రమంగా పుంజుకుంటోంది. 2017లో భారత్‌కన్నా (6.7 శాతం) కొంచెం ఎక్కువగా ఉన్న చైనా వృద్ధి రేటు (6.8 శాతం), 2018లో 6.4 శాతానికి తగ్గే వీలుంది. అటుపై వచ్చే రెండేళ్లలో వృద్ధి 6.3 శాతం, 6.2 శాతానికి తగ్గవచ్చు.
  • వచ్చే పదేళ్లలో భారత్ వృద్ధి సగటున 7 శాతం ఉండచ్చు. కొన్ని ఇబ్బందులు తలెత్తినా, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018లో భారత్ వృద్ధి 7.3 %
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ప్రపంచబ్యాంక్

విమానయాన రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతికీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ)ప్రోత్సహించేలా నిబంధనలను మరింత సరళతరం చేస్తూ 2018, జనవరి10న కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకొంది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాలో 49 శాతం పెట్టుబడులు పెట్టడానికి అప్రూవల్ విధానంలో విదేశీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. అప్రూవల్ విధానం అంటే.. వివిధ శాఖల అనుమతులు తీసుకొని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో ఆటోమేటిక్ రూట్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించింది. ఆటోమేటిక్ రూట్ అంటే.. భద్రతాపరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డిపార్‌‌టమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్-డీఐపీపీ) సిఫార్సులు సరిపోతాయి. నిర్మాణ అభివృద్ధి రంగంలోనూ ఇదే తరహా వెసులుబాటు కల్పించింది.

నాణేల ముద్రణను పునరుద్ధరించండి: కేంద్రంనాణేల ముద్రణ నిలిపేయాలంటూ దేశంలోని నాలుగు నాణేల ముద్రణ కేంద్రాలకు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాణేల ముద్రణను తిరిగి ప్రారంభించాలని, అయితే ముద్రణ వేగాన్ని తగ్గించాలని సూచించింది. ఈ మేరకు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)కు కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీఎంసీఐఎల్ పరిధిలో ఉన్న 4 ముద్రణా కేంద్రాల్లో గతంలో లాగా 2 షిఫ్టుల్లో కాకుండా ఒక్క షిఫ్టులోనే ముద్రణ కొనసాగించాలని తెలిపింది.
2017-18కి గాను 7,712 మిలియన్ల నాణేలు ముద్రించాల్సిందిగా రిజర్వ్ బ్యాంకు తమకు జారీ చేసిన ఇండెంట్‌లో పేర్కొంది. బ్యాంకుల్లో స్థలం లేనికారణంగా నాణేల ముద్రణ నిలిపేయాలంటూ జనవరి 9న కేంద్రం ఎస్పీఎంసీఐఎల్‌కు ఆదేశాలిచ్చింది.

తయారీ సూచీలో భారత్‌కు 30వ స్థానంప్రపంచ తయారీ రంగ సూచీలో భారత్ 30వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య(డబ్ల్యూఈఎఫ్) ఈ ర్యాంక్ ల జాబితాను ప్రకటించింది. కాగా, జపాన్ ఈ సూచీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియా, జర్మనీ, స్విట్జర్లాండ్, చైనా తొలి ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి. చైనా కంటే తయారీ రంగంలో భారత్ చాలా వెనుకబడినప్పటికీ... ఇతర బ్రిక్స్ దేశాలతో(బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా) పోలిస్తే మెరుగ్గానే ఉంది. ర్యాంకింగ్‌‌సలో రష్యా 35, బ్రెజిల్ 41, దక్షిణాఫ్రికా 45 స్థానాల్లో ఉన్నాయి. ‘భవిష్యత్తు తయారీ సంసిద్ధత’ పేరుతో తొలిసారిగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూఈఎఫ్ ఈ వివరాలను పొందుపరిచింది.
అధునాతన పారిశ్రామిక వ్యూహాల రూపకల్పన విషయంలో దేశాలు అనుసరిస్తున్న విధానాలను విశ్లేషించి 100 దేశాలను నాలుగు గ్రూపులుగా విభజించింది. ఇందులో భారత్ మూడో గ్రూప్(లెగసీ-బలమైన మూలాలు ఉన్నా, భవిష్యత్తులో రిస్కులు అధికం)లో ఉంది. కాగా, ఇదే గ్రూప్‌లో హంగరీ, మెక్సికో, ఫిలిప్పీన్‌‌స, రష్యా, థాయ్‌లాండ్, టర్కీ వంటివి ఉన్నాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు మాత్రం నాలుగో గ్రూప్(ప్రారంభ స్థాయి)కే పరిమితమయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘భవిష్యత్తు తయారీ సంసిద్ధత’ పేరుతో తయారీ సూచీ నివేదిక
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : ప్రపంచ ఆర్థిక సమాఖ్య
ఎక్కడ : 30వ స్థానంలో భారత్

2020-2022 కల్లా సగటున 7.3 శాతం జీడీపీ వృద్ధి రేటుభారత్ 2020-2022కల్లా సగటున 7.3 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించగలుగుతుందని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. మధ్యకాలికంగా ఇండియా వృద్ధి పటిష్టంగా వుండగలదని, 2018 నుంచి ప్రైవేటు మూలధన పెట్టుబడుల పెరుగుదల మొదలవుతుందని, దాంతో ఉత్పాదక వృద్ధిని క్రమేపీ సాధించగలుగుతుందని మోర్గాన్‌స్టాన్లీ తాజాగా విడుదల చేసిన నివేదికలో వివరించింది. కార్పొరేట్ రాబడి అంచనాలు, బ్యాలెన్‌‌స షీట్ ఫండమెంటల్స్ మెరుగుపడుతున్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరిస్తే...పరపతి డిమాండ్‌ను అందుకోవడం సాధ్యపడుతుందని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. ఈ 2018 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో రికవరీ కాగలుగుతుందని, 2016లో 6.4 శాతం ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2017లో 7.5 శాతానికి, 2018లో 7.7 శాతానికి పెరుగుతుందని ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత జీడీపీ వృద్ధి రేటు సగటున 7.3 శాతం
ఎప్పుడు : 2020-2022 కల్లా
ఎవరు : మోర్గాన్ స్టాన్లీ

ఈ-కామర్స్ దిగ్గజాలతో పతంజలి ఒప్పందంయోగా గురు బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ.. ఆన్‌లైన్ అమ్మకాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, షాప్‌క్లూస్, బిగ్‌బాస్కెట్, 1ఎంజీ, పేటీఎం మాల్, నెట్‌మెడ్స్ వంటి 8 ఈ-కామర్స్ దిగ్గజాలతో జట్టు కట్టింది. ఈ పోర్టల్స్‌లో తమ ఉత్పత్తుల శ్రేణి మొత్తం అందుబాటులో ఉంటుందని బాబా రామ్‌దేవ్ జనవరి 16న చెప్పారు. ఆన్‌లైన్ అమ్మకాల ద్వారా తొలి ఏడాదే రూ.1,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎనిమిది ఈ-కామర్స్ దిగ్గజాలతో పతంజలి ఒప్పందం
ఎప్పుడు : జనవరి 16
ఎందుకు : పతంజలి ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు

సైన్స్ అండ్ టెక్నాలజీదిగ్విజయంగా నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ - 40Current Affairs భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత జనవరి 12న ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్‌ఎల్వీ సీ-40 వాహకనౌక కార్టోశాట్-2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్‌ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే.
మైలురాయిగా 100వ ఉపగ్రహం...
నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్‌కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్‌లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది. మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్‌ఎల్వీ మిషన్ ఇదే.
ఇస్రో చైర్మన్‌గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్-2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్‌లాండ్, ఫ్రాన్‌‌స, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి.

భారత సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్ ఆవిష్కరణభారత్ సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్‌ను 2018, జనవరి 8న ఆవిష్కరించింది. ఇది గరిష్టంగా 6.8 పెటాప్లాప్‌ల వేగంతో పనిచేయగలదు. ఇక పెటాప్లాప్ అంటే.. సెకనుకు 1000 ట్రిలియన్ ఆపరేషన్‌‌స చేసే సామర్థ్యం. ప్రత్యూష్‌ను వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి వినియోగించనున్నట్లు పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ తెలియజేసింది. తద్వారా ఇలా వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి సూపర్ కంప్యూటర్‌లను వినియోగించడంలో జపాన్, యూకే, యూఎస్‌ఏ తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచినట్లయింది.

క్రీడలురిషబ్ పంత్ సూపర్ ఫాస్ట్ సెంచరీ Current Affairs సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (38 బంతుల్లో 116 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్‌‌స ఆడాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి.. భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డుని నెలకొల్పాడు. జనవరి 14న ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కేవలం 11.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఢిల్లీ విజయాన్నందుకుంది.
వేగవంతమైన సెంచరీ రికార్డులో.. పంత్ కంటే ముందు వరుసలో గేల్ (30 బంతుల్లో 100) ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో పుణే వారియర్స్‌పై బెంగళూరు తరఫున గేల్ ఈ ఘనత సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్
ఎక్కడ : సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో

పీబీఎల్ 2017-18 చాంపియన్ హైదరాబాద్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్ విజేతగా నిలిచింది. జనవరి 14న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో హైదరాబాద్ 4-3 స్కోరుతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించి.. తొలిసారి పీబీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీబీఎల్ - 2017
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : చాంపియన్ హైదరాబాద్
ఎక్కడ : హైదరాబాద్

స్కీయింగ్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకం హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి అంచల్ ఠాకూర్ స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించింది. టర్కీలో అంతర్జాతీయ స్కీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ఫైన్ ఎజ్డర్ 3200 కప్‌లో స్లాలోమ్ రేస్ విభాగంలో అంచల్ కాంస్య పతకం గెలిచింది.

వార్తల్లో వ్యక్తులుఇస్రో చైర్మన్‌గా శివన్ Current Affairs భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె.శివన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ శివన్‌ను ఇస్రోతో పాటు అంతరిక్ష కమిషన్ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా నియమిస్తూ జనవరి 10న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఏఎస్ కిరణ్‌కుమార్ పదవీకాలం జనవరి 18తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న శివన్ ఇస్రో ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడేళ్లపాటు శివన్ ఈ పదవుల్లో కొనసాగనున్నారు.
ప్రస్తుతం ఆయన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1980లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన శివన్..బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స(ఐఐఎస్‌సీ)లో మాస్టర్స్ చేశారు. ఇస్రో 1982లో చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ) ప్రాజెక్టుతో శివన్ కెరీర్ ప్రారంభమైంది. భారత జాతీయ ఇంజనీరింగ్ అకాడమీతో పాటు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియాలో శివన్ సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇస్రో చైర్మన్‌గా శివన్
ఎప్పుడు : జనవరి 10
ఎందుకు : జనవరి 18న ప్రస్తుత చైర్మన్ కిరణ్ కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో

బ్రిటన్ కేబినెట్‌లో నారాయణమూర్తి అల్లుడు టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్‌కు బ్రిటన్ మంత్రి మండలిలో చోటు దక్కింది. ఇటీవల ప్రధాని థెరిసా మే చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రిషితో పాటు మరో ఇద్దరు భారత మూలాలున్న ఎంపీలను కూడా మంత్రి పదవులు వరించాయి. రిచ్‌మాండ్ (యార్క్‌షైర్) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిషి సునాక్, స్థానిక ప్రభుత్వం, కమ్యూనిటీస్ శాఖకు సహాయ మంత్రిగా నియమితులయ్యారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన కృషిచేశారన్న పేరుంది. నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని రిషి వివాహమాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ కేబినెట్‌లో భారత మూలాలు ఉన్న ఎంపీ రిషి సునాక్
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : రిషి సునాక్.. టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు

ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి.నాయర్ రాధాకృష్ణన్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. ఆయన ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్‌లతో కూడిన కొలీజియం జనవరి 11న సమావేశమై పలు నియామకాలకు ఆమోదముద్ర వేసింది. సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులతో పాటు పలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలను ఆమోదిస్తూ కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటిలో భాగంగా ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. కేంద్రం ఆమోదముద్ర అనంతరం కొలీజియం సిఫార్సులు రాష్ట్రపతికి చేరతాయి. అనంతరం రాష్ట్రపతి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారు.
ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ దాదాపు ఏడాదిన్నరగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ రాధాకృష్ణన్ సీజేగా రానున్న నేపథ్యంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉమ్మడి హైకోర్టులోనే న్యాయమూర్తిగా కొనసాగుతారని తెలిసింది. హైకోర్టు విభజన పూర్తయ్యాక ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశముంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తి
ఎవరు : జస్టిస్ తొట్టతిల్ బి.నాయర్ రాధాకృష్ణన్
ఎక్కడ : హైదరాబాద్

సరోద్ పండితుడు దాస్‌గుప్తా కన్నుమూతసరోద్ పండితుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా(84) దక్షిణ కోల్‌కతాలో 2018 జనవరి 15న మరణించారు. ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత.

అవార్డులుఢిల్లీ యువతికి ఫ్రాన్స్ అత్యున్నత కల్చరల్ పురస్కారం
Current Affairs 
దేశ రాజధాని న్యూఢిల్లీకి చెందిన ఐశ్వర్య టిప్నిస్ ఫ్రాన్స్ అత్యున్నత కల్చరల్ పురస్కారానికి ఎంపికైంది. కన్జర్వేటివ్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న ఐశ్వర్య.. ఇరుదేశాల మధ్య చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడంలో చేస్తున్న కృషికిగాను ఈ పురస్కారానికి ఎంపికైంది. ఇండియాలో ఫ్రాన్‌‌స అంబాసిడర్ అలెగ్జాం డ్రె జిగ్లేర్ కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్ పూర్వ విద్యార్థి అయిన ఐశ్వర్య... విద్యాభ్యాసం ముగిసిన తర్వాత, భారత్‌లో విదేశీ సంస్కృతి పరిరక్షణపై దృష్టిసారించారు. ఇందుకుగాను ఆమె ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.

‘సుంకిరెడ్డి’కి రంగినేని పురస్కారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏటా అందించే ‘రంగినేని ఎల్లమ్మ’సాహిత్య పురస్కారం-2017 ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిన ‘తావు’ పుస్తకానికి దక్కింది. ఈ విషయాన్ని అవార్డు కమిటీ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు జనవరి 12న ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రంగినేని సుజాత, మోహన్‌రావు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అందించే ఈ పురస్కారాన్ని ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమంలో అందిస్తామని అవార్డు కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ తెలిపారు. పుష్కర కాలంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారాన్ని కథకులకు, కవులకు అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘రంగినేని ఎల్లమ్మ’ సాహిత్య పురస్కారం - 2017
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : ‘తావు’ పుస్తకం, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి

అంతర్జాతీయంపదవిలో ఉండగా తల్లి కాబోతున్న న్యూజిలాండ్ ప్రధాని Current Affairs ప్రధాని పదవిలో ఉండగా ఓ బిడ్డకు జన్మనిచ్చిన నేతల జాబితాలో న్యూజిలాండ్ పధానిజసిందా అర్డెన్ (37) చేరనున్నారు. 2017 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అర్డెన్ ‘ఈ ఏడాది జూన్‌లో నేను బిడ్డకు జన్మనివ్వబోతున్నా’ అని జనవరి 19న ప్రకటించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కూడా పదవిలో ఉండగానే సంతానం పొందారు.

వినిమయ బిల్లును తిరస్కరించిన అమెరికా సెనెట్అమెరికా పాలనా యంత్రాంగ నిర్వహణకు అవసరమైన ఖర్చులను నిర్దేశించే ‘వినిమయ బిల్లు’ను సెనెట్ తిరస్కరించటంతో అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చే ఈ బిల్లు జనవరి 19న సెనేట్‌లో 50-48 తేడాతో వీగిపోయింది. దీంతో పెంటగాన్, ఇతర కేంద్ర సంస్థలు పనిచేసేందుకు అవసరమైన నిధులు తాత్కాలికంగా ఆగిపోతాయి. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండానే సెలవులో ఉంటారు. వైద్యం, పోలీసు వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. గతంలో 2013 అక్టోబర్‌లో 16 రోజులు, 1996లో 21 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : వినిమయ బిల్లును తిరస్కరించిన అమెరికా సెనెట్
ఎప్పుడు : జనవరి 19
ఎందుకు : పాలనా యంత్రాంగ నిర్వహణకయ్యే ఖర్చులను విడుదల చేసేందుకు

అమెరికాలో షట్‌డౌన్‌కు ముగింపు చర్చలు సఫలంమూడ్రోజులపాటు అమెరికాను స్తంభింపజేసిన షట్‌డౌన్‌కు ముగింపు పలికే దిశగా అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. జనవరి 22న జరిగిన ఈ చర్చల్లో డెమొక్రాట్ల ‘స్వాప్నికుల’ డిమాండ్‌పై చర్చకు సెనెట్ మెజారిటీ (రిపబ్లికన్) నేత మిచ్ మెక్‌కన్నెల్ అంగీకారం తెలిపారు. దీంతో ప్రభుత్వ నిర్వహణకు నిధులు ఇచ్చే బిల్లుపై చర్చించేందుకు మార్గం సుగమమైంది. బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని డెమొక్రాట్ల నేత చుక్ షుమర్ ప్రకటించారు.
జనవరి 20, 21 తేదీల్లో(శని, ఆదివారం) కనిపించని అమెరికా షట్‌డౌన్ ప్రభావం జనవరి 22న (సోమవారం) తీవ్ర ప్రభావాన్ని చూపింది. వేల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండా ఇళ్లలోనే ఉండటంతో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. అత్యవసర సేవలు మినహా అమెరికా దాదాపుగా స్తంభించిపోయింది.

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుస్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లోని విడిది కేంద్రం దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు జనవరి 23న ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ప్రసంగంతో డబ్ల్యూఈఎఫ్ ప్రారంభ ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలిచిన మోదీ ‘విరోధాలు, విభేదాలు లేని.. సహకారంతో కూడిన స్వేచ్ఛాయుత స్వర్గాన్ని కలిసికట్టుగా నిర్మించాలి’ అని ప్రపంచ దేశాలకు సూచించారు.
1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు - 2018
ఎప్పుడు : జనవరి 23
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
ఎవరు : ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

అమెరికా ‘షట్‌డౌన్’కు తెరఅమెరికాలో మూడు రోజులు కొనసాగిన ‘షట్‌డౌన్’ ముగిసింది. ప్రభుత్వ వ్యయానికి స్వల్పకాలిక నిధులందించే బిల్లుకు ప్రతిపక్ష డెమొక్రాట్లు మద్దతు తెలపడంతో సంక్షోభం సమసిపోయింది. ఈ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో జనవరి 23 నుంచి రోజువారీ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. దేశంలోకి చిన్నారులుగా తల్లిదండ్రులతో పాటు అక్రమంగా అడుగుపెట్టిన సుమారు 7 లక్షల మంది యువకుల(డ్రీమర్స్) భవిష్యత్తుపై చర్చకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదరడంతో సమస్య పరిష్కారమైంది. ఫిబ్రవరి 8న గడువు ముగిసే ఈ తాత్కాలిక ఫండింగ్ బిల్లు సెనేట్‌లో 81-18 ఓట్లు, ప్రతినిధుల సభలో 266-150 ఓట్ల తేడాతో గట్టెక్కింది.

జాతీయంఈశాన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ Current Affairs ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపురల్లో శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జోతి జనవరి 18న ఢిల్లీలో ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌ల్లో ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మూడు రాష్ట్రాల ఫలితాలను మార్చి 3న వెల్లడిస్తారు. ఈ మూడింటిలో ప్రతి రాష్ట్రంలోనూ 60 శాసనసభ స్థానాలే ఉన్నాయి.
ప్రస్తుతం మేఘాలయలో కాంగ్రెస్, త్రిపురలో సీపీఎం, నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి.

'ఐ క్రియేట్' కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ, నెతన్యాహుఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గుజరాత్‌లో ఏర్పాటు చేసిన 'ఐ క్రియేట్' ( International Centre for Entrepreneurship and Technology) ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నేరంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో కలిసి జనవరి 17న ప్రారంభించారు. అహ్మదాబాద్ సమీపంలోని దియోధోలేరా గ్రామంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 'ఐ క్రియేట్' స్టార్టప్ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎక్కడ : దియోధోలేరా, అహ్మదాబాద్, గుజరాత్
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

దివ్యాంగుల కోసం మరో 100 వెబ్‌సైట్లు దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన దాదాపు 100 వెబ్‌సైట్లను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ ప్రారంభించారు. దీంతో తమ శాఖ ‘వెబ్‌సైట్ యాక్సెసిబిలిటీ ప్రాజెక్టు’ కింద దివ్యాంగుల కోసం రూపొందించిన వెబ్‌సైట్ల సంఖ్య 917కు చేరుకుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దివ్యాంగులు సమాజంలో ఒక భాగమని మిగతా వారితో సమానంగా వారు వ్యవహరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు.

20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటుకు ఈసీ సిఫార్సుఢిల్లీ ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు గాను ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన 20 ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. ఒకపక్క ఎమ్మెల్యేలుగా ఉంటూనే మరోవైపు పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగారని.. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు సమంజసమేనని సిఫార్సుల్లో ఈసీ పేర్కొంది. మరోవైపు ఈసీ సిఫార్సుల్ని సవాలు చేస్తూ అనర్హత జాబితాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసీ సిఫార్సులపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 20 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురైనా కేజ్రీవాల్ సర్కారుకు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 65 మంది ఎమ్మెల్యేల బలముంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతకు రాష్ట్రపతికి సిఫార్సు
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
ఎందుకు : ఎమ్మెల్యేలుగా ఉంటూ లాభాదాయక పదవుల్లో కొనసాగినందుకు

విమానాల్లోనూ మొబైల్, ఇంటర్నెట్టెలికం రెగ్యులేటర్ ట్రాయ్... తాజాగా ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీపై తన ప్రతిపాదనలను నివేదిక రూపంలో విడుదల చేసింది. ఇందులో... శాటిలైట్, టెరిస్ట్రియల్ నెట్‌వర్క్ ద్వారా దేశీ విమాన ప్రయాణంలో మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సేవల్ని అనుమతించాలని సిఫార్సు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది. విమానం 3,000 మీటర్లకన్నా ఎత్తులో ఉన్నపుడు మాత్రమే వాటిలో మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసులను అనుమతించాలని.. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఈ సేవలుండకూడదని పేర్కొంది. విమాన ప్రయాణం సమయంలో మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచినప్పుడే వై-ఫై సర్వీసులను అందించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఇన్-ఫ్లైట్ కమ్యూనికేషన్‌‌స (ఐఎఫ్‌సీ) సర్వీస్ ప్రొవైడర్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రాయ్ నివేదికలో పేర్కొంది.

ఆప్ ఎమ్మేల్యేల అనర్హతకు రాష్ట్రపతి ఆమోదంలాభదాయక పదవుల్లో కొనసాగినందుకు ఢిల్లీ అసెంబ్లీలోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు జనవరి 21న కేంద్ర న్యాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో కొనసాగారంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నాను’ అని రాష్ట్రపతి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆప్ ఎమ్మేల్యేల అనర్హతకు రాష్ట్రపతి ఆమోదం
ఎప్పుడు : జనవరి 21
ఎందుకు : లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న ఈసీ సిఫార్సు మేరకు

ద్వైపాక్షికంమోదీకి కానుకగా నీటిశుద్ధి యంత్రం Current Affairs భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకమైన కానుక అందజేశారు. నీటిలోని లవణాలు తొలగించి శుద్ధిచేసే ‘గాల్-మొబైల్ వాటర్ డీసాలినేషన్ అండ్ ప్యూరిఫికేషన్ జీప్’ను కానుకగా ఇచ్చారు. అహ్మదాబాద్ జిల్లా బావ్లా సమీపంలో జనవరి 17న జరిగిన కార్యక్రమంలో ఈ నీటి శుద్ధి యంత్రాన్ని మోదీకి అందజేశారు. ఈ వాహనాన్ని నెతన్యాహు సమక్షంలోనే బసకంఠ జిల్లా సుయిగామ్ (భారత్-పాక్ సరిహద్దుల్లోని గ్రామం) ప్రజలకు మోదీ అంకితం చేశారు. సరిహద్దుల్లోని సుయిగామ్‌లో ఇది ఉంటుందని.. దీనిద్వారా సరిహద్దులోని జవాన్లకు శుద్ధమైన తాగునీరు అందుతుందని మోదీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోదీకి కానుకగా నీటిశుద్ధి యంత్రం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఎందుకు : ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా

ఆస్ట్రేలియా గ్రూప్‌లో భారత్‌కు చోటు క్షిపణి సాంకేతికత నియంత్రణ కూటమి (ఎంటీసీఆర్), వాసెనార్ గ్రూప్‌లలో స్థానం దక్కించుకున్న భారత్‌కు జనవరి 19న జీవ, రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ అయిన ఆస్ట్రేలియా గ్రూప్‌లోనూ చోటు దక్కింది.
జీవ, రసాయనిక ఆయుధాలను అభివృద్ధి చేసుకోకుండా.. వీటి తయారీకి అవసరమైన పరికరాలు, ముడిపదార్థాలు, సాంకేతిక వ్యాప్తిని వ్యతిరేకించే దేశాలను సమన్వయం చేసే, సామరస్యపూర్వక ఎగుమతుల నియంత్రణను పర్యవేక్షించే స్వచ్ఛంద సంస్థగా ఆస్ట్రేలియా గ్రూప్ (ఏజీ) పనిచేస్తోంది. అణ్వాయుధ నిరాయుధీకరణ లక్ష్యాలను చేరుకోవటం, అంతర్జాతీయ భద్రతలో ఈ సభ్యత్వం పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. ఏజీలో సభ్యత్వం భారత విశ్వసనీయత మరింత పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. 2016లో ఎంటీసీఆర్‌లో, గతేడాది వాసెనార్ గ్రూప్‌లో భారత్ సభ్యత్వం పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా గ్రూప్‌లో భారత్‌కు చోటు
ఎప్పుడు : జనవరి 19
ఎందుకు : జీవ, రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ

ఆకర్షణీయ నగరాల జాబితాలోకి మరో తొమ్మిది
ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో కొత్తగా తొమ్మిది నగరాలు చేరాయి. దీంతో వీటి సంఖ్య 99కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, మొరాదాబాద్, సహరన్‌పూర్; తమిళనాడులోని ఈరోడ్; బిహార్‌లోని బిహార్‌షరీఫ్, దాద్రా నగర్ హవేలీలోని సిల్వాసా, లక్షద్వీప్‌లోని కవరత్తి; అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్ తదితర నగరాలు తాజా జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ జనవరి 19న ప్రకటన చేశారు.

ప్రాంతీయంవిశాఖలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక సదస్సుCurrent Affairsపారిశ్రామిక నవకల్పనలు, సాంకేతిక ఉత్పత్తి, పారిశ్రామికీకరణ అంశాలపై విశాఖపట్నంలో జనవరి 17న అంతర్జాతీయ మహిళా పారిశ్రామికాభివృద్ధి సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సదస్సుని ప్రారంభించారు. తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించడంతో పాటు వ్యాపార అభివృద్ధిపై చర్చించేందుకు దేశ విదేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు సదస్సుకి హాజరయ్యారు. భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (అలీఫ్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ మహిళా పారిశ్రామివేత్తల సదస్సు
ఎప్పుడు : జనవరి 17-19
ఎక్కడ : విశాఖపట్నం
ఎవరు : భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (అలీఫ్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా సిసోడియాఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా ఆర్.పి.సిసోడియాను నియమిస్తూ జనవరి 17న కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భన్వర్‌లాల్ సీఈవోగా పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత జాయింట్ సీఈవో అనూప్‌సింగ్ రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జి సీఈవోగా విధులు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రధాన ఎన్నికల అధికారి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఆర్.పి. సిసోడియా

తెలంగాణలో నేరస్తులు 2.18 లక్షలురాష్ట్రంలో తరచూ నేరాలకు పాల్పడేవారు 2.1 లక్షల మంది ఉన్నట్లు పోలీసుశాఖ నేరస్తుల సమగ్ర సర్వేలో లెక్కతేల్చింది. రాష్ట్రంలో నేరస్తుల గుర్తింపు, వారి కదలికలు, నిఘా కోసం జనవరి 18న ఒకేరోజున రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని స్థాయిల పోలీసు సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. పదే పదే నేరాలకు పాల్పడేవారెంత మంది, దొంగలు ఎందరు, దోపిడీలకు పాల్పడేవారెంత మంది, ఈవ్‌టీజింగ్, ఇతర నేరాలకు పాల్పడేవారెంత మంది ఉన్నారనే లెక్కలు తేల్చారు.
సమగ్ర సర్వే ద్వారా గుర్తించిన నేరస్తుల వివరాలను, వారి నివాసాలకు చేసిన జియో ట్యాగింగ్‌ను ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ వాహనాలకు అనుసంధానించారు. అంతేగాకుండా ఈ వివరాలన్నింటినీ టీఎస్ కాప్ యాప్‌కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఎక్కడైనా దొంగతనం లేదా ఇతర నేరం ఏదైనా జరిగితే.. వెంటనే అనుమానితులను గుర్తించడం, వారి నివాసాలకు వెళ్లి విచారించడం సులభతరం కానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో తరచూ నేరాలకు పాల్పడేవారు 2.18 లక్షల మంది
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : తెలంగాణ పోలీస్

ఏపీ-నీతిఆయోగ్ మధ్య ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్ ఒప్పందంముఖ్యమంత్రి చంద్రబాబు నివాస సముదాయంలో కొత్తగా నిర్మించిన గ్రీవెన్‌‌స హాలులో జనవరి 18న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దేశంలో అత్యంత వెనుకబడిన 115 జిల్లాల్లో ఆన్‌లైన్ డ్యాష్ బోర్డు అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం మాట్లాడిన రాజీవ్ కుమార్.. దేశాన్ని 2022 నాటికి సరికొత్త భారతావనిగా ఆవిష్కరించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి సర్వ శ్రేష్ట భారత్‌ను ఆవిష్కరించాలన్నారు. అవినీతిరహిత, పరిశుభ్ర, ఆరోగ్య, నైపుణ్య, సురక్షిత భారత్ సాకారం కావాలని ఆకాంక్షించారు. టీమ్ ఇండియా మాదిరిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ క్రతువులో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ - నీతి ఆయోగ్ మధ్య ఆన్‌లైన్ డ్యాష్ బోర్డు అభివృద్ధి ఒప్పందం
ఎప్పుడు : జనవరి 18
ఎక్కడ : అమరావతి

టీఎస్ వైద్య, ఆరోగ్య శాఖకు జాతీయ అవార్డు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు మరో జాతీయ అవార్డు దక్కింది. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) నిహిలెంట్ ఈ-గవర్నెన్‌‌స అవార్డు-2017కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బెస్ట్ ఈ-గవర్నెన్‌‌స స్టేట్-అవార్డు ఆఫ్ రికగ్నేషన్ (హెల్త్ అండ్ వెల్ బీయింగ్) విభాగంలో ఎంపికై ంది. ఈ మేరకు జనవరి 20న కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ ఈ అవార్డుని అందుకున్నారు.
2002 నుంచి ఈ సంస్థ ఈ -గవర్నెన్‌‌సలో ప్రగతి సాధించిన రాష్ట్రాలను ఎంపిక చేసి అవార్డులను అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖకు ఈ-గవర్నెన్స్ అవార్డు-2017
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా
ఎక్కడ : న్యూఢిల్లీలో

టోక్యో క్లీన్ అథారిటీతో తెలంగాణ ఒప్పందం టోక్యో క్లీన్ అథారిటీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బృందం జపాన్ పర్యటనలో భాగంగా జనవరి 19న ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఘన వ్యర్థాల భస్మీకరణ, నిర్వహణకు సంబంధించి సాంకేతిక సహకారాన్ని టోక్యో సహాయం అందించనుంది. పౌల్ట్రీ రంగంలో సాంకేతిక సహకారానికి సంబంధించి ఐఎస్‌ఈ ఫుడ్‌‌సతో కూడా ఓ అవగాహనకు వచ్చింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో కొత్త సాంకేతికతను వినియోగించుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా సోలార్ పార్కును రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టోక్యో క్లీన్ అథారిటీతో ఎంవోయూ
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : మంత్రి కేటీఆర్ జపాన్ పర్యటనలో భాగంగా

ఏపీ మాజీ డీజీపీ రాగాల కన్నుమూతఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ రామకొండల రాగాల (80) జనవరి 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం చదలవాడ గ్రామానికి చెందిన ఆర్.కె.రాగాల 1994లో ఏడు నెలలపాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. పోలీసు శాఖలో 33 ఏళ్లపాటు కమ్యూనికేషన్ ఐజీ, ఫైర్ సర్వీసెస్ డీజీ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : రామకొండల రాగాల
ఎక్కడ : హైదరాబాద్

హైదరాబాద్‌లో అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సుఅంతర్జాతీయ హెరిటేజ్ సదస్సు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. ఈ సదస్సులో చారిత్రక పరిశోధకుడు, ది రాయల్ హిస్టారికల్ సొసైటీ ఫెలో కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి తన పరిశోధన వ్యాసాన్ని సమర్పించారు. ఇందులో ఆయన హైదరాబాద్ పాతపేరు చిచులం అని తెలిపారు. చిచులం లేదా చచలం అంటే చింతచెట్టు అని అర్థం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సు
ఎప్పుడు : జనవరి 19 - 20
ఎవరు : ది రాయల్ హిస్టారికల్ సొసైటీ ఫెలో లింగాల పాండురంగారెడ్డి
ఎక్కడ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ

‘కళారత్న’ రవిశంకర్ కన్నుమూత కళారత్న బిరుదు గ్రహీత కూచిపూడి నాట్య కళాకారుడు వెంపటి రవిశంకర్ (49) జనవరి 23న హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. తండ్రి వెంపటి చినసత్యం వారసునిగా ఈ రంగంలో ప్రవేశించిన ఆయన తండ్రి అడుగుజాడలనే అనుసరించారు. పెదనాన్న పెద్దసత్యం బాణీని కళకు చేర్చి కూచిపూడి నాట్యంలో శిల్పప్రావీణ్యానికి శోభను చేకూర్చారు. దాదాపు 80కి పైగా నృత్యరీతులను దేశవిదేశాల్లో శిష్యులకు నేర్పించారు. 200లకు పైగా స్వీయ రచనలకు సంగీతాన్ని సమకూర్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘కళారత్న’ రవిశంకర్ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 23
ఎక్కడ : హైదరాబాద్‌లో

ఆర్థికం29 వస్తువులపై జీఎస్టీ పన్నుకోతCurrent Affairs సామాన్యులకు మరింత ఊరటనిచ్చేలా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మండలి మరోసారి పన్ను రేట్లను తగ్గించింది. తాజాగా 29 వస్తువులు, 54 సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలో జనవరి 18న జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి 25వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సవరించిన పన్ను రేట్లు ఈ నెల 25 నుంచే అమల్లోకి రానున్నాయి.
28 నుంచి 18 శాతానికి తగ్గినవి
  • సెకండ్ హ్యాండ్‌లో కొనే పెద్ద, మధ్యస్థాయి కార్లు, ఎస్‌యూవీలు (మిగతా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ మోటార్ వాహనాలపై పన్నును 28 నుంచి 12 శాతానికి తగ్గించారు) ళీ జీవ ఇంధనాలతో నడిచే, ప్రజా రవాణాకు ఉపయోగించే బస్సులు.
18 నుంచి 12 శాతానికి తగ్గినవి
  • చక్కెర ఉండే స్వీట్లు, చాక్లెట్లు, 20 లీటర్ల తాగునీటి సీసాలు, ఎరువుగా ఉపయోగించే పాస్ఫరిక్ యాసిడ్, బయో డీజిల్, వేప ఆధారిత పురుగు మందులు, కొన్ని రకాల జీవ-పురుగుమందులు, డ్రిప్‌ల వంటి నీటిపారుదల పరికరాలు, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు.
18 నుంచి 5 శాతానికి తగ్గినవి
  • చింతగింజల పొడి, మెహందీ కోన్లు, ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేసే ఎల్‌పీజీ సిలిండర్లు.
12 నుంచి 5 శాతానికి తగ్గినవి
  • వెదురు/ఎండుగడ్డితో తయారైన బుట్టలు తదితర వస్తువులు, అల్లికతో తయారైన వస్తువులు, వెల్వెట్ వస్త్రాలు
సున్నా శాతానికి తగ్గిన వస్తువులు
  • విబూది, వినికిడి పరికరాల విడి భాగాలు, తవుడు
సమ్మిళిత వృద్ధిలో 62వ స్థానంలో భారత్
సమ్మిళిత వృద్ధిలో పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ల కన్నా కూడా భారత్ అట్టడుగు స్థాయిలో ఉంది. వర్ధమాన దేశాలకు సంబంధించిన సమ్మిళిత వృద్ధి సూచీలో 62వ స్థానంలో నిల్చింది. చైనా 26, పాకిస్తాన్ 47వ స్థానాల్లో ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో నిల్చింది. సంపన్న దేశాల జాబితాలో అత్యంత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సదస్సు నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఈ సూచీ విశేషాలు విడుదల చేసింది. జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, రుణభారాల నుంచి భవిష్యత్ తరాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌‌సని ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.
సమ్మిళిత వృద్ధి సూచీలో మొత్తం 130 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 29 సంపన్న దేశాలు, మిగతా 74 వర్ధమాన దేశాలు ఉన్నాయి. భారత్ ఓవరాల్ స్కోరు తక్కువగానే ఉన్నప్పటికీ.. పురోగమిస్తున్న టాప్ టెన్ వర్ధమాన దేశాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.
గతేడాది 79 దేశాల వర్ధమాన దేశాల జాబితాలో భారత్ 60వ స్థానంలో నిల్చింది. చైనా 15, పాకిస్తాన్ 52వ స్థానాల్లో నిలిచాయి.

2018లో భారత వృద్ధి రేటు 7.4 శాతం : ఐఎంఎఫ్భారత్ 2018లో 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. చైనా వృద్ధి రేటు 6.8 శాతంగానే ఉంటుందని, తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా 2018లో భారతదేశమే ముందుంటుందని తన తాజా నివేదికలో విశ్లేషించింది. పెద్దనోట్ల రద్దు, వస్తు- సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుకు సంబంధించి ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకుంటోందని తన వరల్డ్ అవుట్‌లుక్‌లో వివరించింది. 2019లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందనీ ఐఎంఎఫ్ అంచనావేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా దావోస్ (స్విట్జర్లాండ్)లో ఐఎంఎఫ్ ఈ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. 2018-19లో ఆసియా వృద్ధి 6.5 శాతంగా ఐఎంఎఫ్ అవుట్‌లుక్.

అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారత్‌కు 5వ ర్యాంకుపెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్ల జాబితాలో భారత్ 5వ ర్యాంకు దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం ఎగబాకింది. అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో కన్సల్టెన్సీ దిగ్గజం ‘పీడబ్ల్యూసీ’ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. జనవరి 23న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం... 2018లో అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా జపాన్‌ను అధిగమించి భారత్ అయిదో స్థానానికి చేరింది. 2017లో భారత్ ఆరో స్థానంలో ఉంది. మరోవైపు, ఈ లిస్టులో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 46 శాతం మంది సీఈవోలు అమెరికాకు ఓటేశారు. చైనా (33 శాతం), జర్మనీ (20 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 15 శాతం ఓట్లతో బ్రిటన్ నాలుగో స్థానంలో, తొమ్మిది శాతం ఓట్లతో భారత్ అయిదో స్థానంలో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారత్‌కు 5వ ర్యాంకు
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : పీడబ్ల్యూసీ సర్వే

సైన్స్ అండ్ టెక్నాలజీఫాస్టెస్ట్ ప్లేన్‌ను రూపొందిస్తున్న అమెరికా Current Affairs ప్రపంచం అత్యంత వేగంతో ప్రయాణించే విమానాన్ని అమెరికా రూపొందిస్తోంది. ఆ దేశానికి చెందిన ఫైటర్ జెట్ల తయారీ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ స్పై ప్లేన్ ‘ఎస్‌ఆర్-72 బ్లాక్‌బర్డ్’ను అభివృద్ధి చేస్తోంది. కోల్డ్‌వార్ సమయంలో ఎస్‌ఆర్-71 బ్లాక్‌బర్డ్ విమానం ద్వారా రష్యాపై అమెరికా గూఢచర్యం నిర్వహించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఎస్‌ఆర్-71 విధుల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత అమెరికా ఎలాంటి స్పై జెట్‌ను రూపొందించలేదు. తాజాగా రూపొందుతున్న ఎస్‌ఆర్-72ను ‘సన్ ఆఫ్ బ్లాక్‌బర్డ్’ గా లాక్ హీడ్ మార్టిన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. 2030లో ఈ ప్లేన్ రంగంలోకి దిగుతుందని అంచనా వేస్తున్నారు. హైపర్ సోనిక్ టెక్నాలజీని వినియోగించడం వల్ల ధ్వనివేగం కంటే ఆరు రెట్లు ఎక్కువ(మాక్-6)వేగంతో ఎస్‌ఆర్-72 ప్రయాణిస్తుంది. కోల్డ్‌వార్ సమయంలో సేవలందిచిన ఎస్‌ఆర్-71 మాక్-3.5 వేగం (సుమారు గంటకు 2వేల కిలోమీటర్లు)తో ప్రయాణించేది.

అగ్ని-5 పరీక్ష విజయవంతంఅణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరీక్షని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి కానిస్టర్ ద్వారా జనవరి 18న ఈ క్షిపణిని పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరానికి పైగా ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు. ఎన్నో అత్యాధునిక సాంకేతికతలున్న ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్షిపణి తయారీలో దేశీయ సాంకేతికతకు నూతనోత్సాహం వచ్చింది. అన్ని రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలు క్షిపణి పనితీరును పరిశీలించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పరీక్ష పూర్తిగా విజయవంతమైందని, 19 నిమిషాల పాటు ప్రయాణించిన క్షిపణి 4,900 కిలోమీటర్లు దూసుకెళ్లిందని వెల్లడించాయి.
అగ్ని శ్రేణిలో ‘అగ్ని-5’మరింత ఆధునికమైంది. కొత్త సాంకేతికతలతో అభివృద్ధి చేశారు. విస్తారమైన నావిగేషన్ వ్యవస్థ (ఆర్‌ఐఎన్‌ఎస్), అత్యాధునికమైన మైక్రో నావిగేషన్ వ్యవస్థ (ఎంఐఎన్‌ఎస్)లు ఉండటం వల్ల ఈ క్షిపణి చాలా కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించగలదు.
అగ్ని శ్రేణిలో క్షిపణులు.. 

క్షిపణిలక్ష్యాన్ని చేధించగలిగే సామర్థ్యం
అగ్ని-1700 కి.మీ.
అగ్ని-22000 కి.మీ.
అగ్ని-32,500 నుంచి 3,500 కి.మీ.
అగ్ని-55,000 కి.మీ.

రష్యా నుంచి భారత్‌కు ‘ట్రయంఫ్’ క్షిపణి వ్యవస్థ
రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే భారత్‌కు ఆకాశ్, బరాక్-8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా.. ఎస్-400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా..
రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్-400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్‌‌స అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.
ఎప్పటికి వస్తాయి?
మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్-రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ట్రయంఫ్-400 ప్రత్యేకతలు
శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్-400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్-300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్-400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్‌పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్-400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్‌న్రు ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది.
భారత్ వద్ద ఉన్న క్షిపణులుస్పైడర్
ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయత్నిస్తోంది.
ఆకాశ్
డీఆర్‌డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది.
బరాక్-8
డీఆర్‌డీవో-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది.

క్రీడలుఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లీ Current Affairs అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక అవార్డుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డును తొలిసారి కోహ్లి అందుకోనున్నాడు. భారత్ తరఫున గతంలో ద్రవిడ్, సచిన్, అశ్విన్ దీనిని గెల్చుకున్నారు. ఇక 50 ఓవర్ల ఫార్మాట్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన కోహ్లి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఐసీసీ టెస్టు, వన్డే జట్లలో స్థానం లభించడంతో పాటు ఆ రెండు టీమ్‌లకు కూడా అతనే కెప్టెన్‌గా ఎంపిక కావడం కోహ్లికి లభించిన మరో అరుదైన గౌరవం.
మరో ప్రధాన అవార్డు ఐసీసీ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు లభించింది. ఇంగ్లండ్‌పై భారత యువ లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్ బౌలింగ్ (6/25) 2017 టి20 అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు హసన్ అలీ (పాకిస్తాన్)కు దక్కగా... అఫ్ఘానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు.
ఐసీసీ టెస్టు ఎలెవన్, వన్డే ఎలెవన్ జట్లను కూడా ప్రకటించింది. టెస్టు జట్టులో భారత్ తరఫున చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు లభించింది. మూడో డబుల్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ, పేస్ అస్త్రం జస్‌ప్రీత్ బుమ్రా వన్డే టీమ్‌లోకి ఎంపికయ్యారు. వార్నర్, స్టోక్స్, డి కాక్ రెండు జట్లలోనూ ఉన్నారు.
ఐసీసీ టెస్టు ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), ఎల్గర్, వార్నర్, స్మిత్, పుజారా, స్టోక్స్, డి కాక్, అశ్విన్, స్టార్క్, రబడ, అండర్సన్.
ఐసీసీ వన్డే ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), వార్నర్, రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, డివిలియర్స్, డి కాక్, స్టోక్స్, బౌల్ట్, హసన్ అలీ, రషీద్ ఖాన్, బుమ్రా.
అవార్డు విజేతలు
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్:రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)
ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: హసన్ అలీ(పాకిస్తాన్)
ఫ్యాన్స్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్: పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవడం.
ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్: మరాయిస్ ఎరాస్‌మస్ (దక్షిణాఫ్రికా)
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : విరాట్ కోహ్లీ

900 రేటింగ్ పాయింట్ల మార్క్‌ని అందుకున్న కోహ్లీ జనవరి 18న ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్‌‌సలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ (916 పాయింట్లు-1979లో) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. తాజా పాయింట్లతో అతను వరల్డ్ ర్యాంకింగ్‌‌సలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 947 పాయింట్లతో స్మిత్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.
గతంలో భారత ఆటగాళ్లు సచిన్ (898), ద్రవిడ్ (892) 900 పాయింట్ల మార్క్‌కు చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు. ఓవరాల్‌గా 900 రేటింగ్ పాయింట్ల మైలురాయిని అందుకున్న 31వ బ్యాట్స్‌మన్ కోహ్లి. డాన్ బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెస్టుల్లో 900 రేటింగ్ పాయింట్ల్ల మార్క్‌ని అందుకున్న రెండో భారత బ్యాట్స్‌మెన్
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : విరాట్ కోహ్లీ

అంధుల వన్డే ప్రపంచ కప్ విజేత భారత్అంధుల క్రికెట్ వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి కప్‌ను గెలుచుకున్న జట్టుగా భారత్ నిలిచింది. 2014లో భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలుచుకుంది. గతేడాది టి20 వరల్డ్‌కప్ సైతం సొంతం చేసుకుంది.
బౌలింగ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్‌‌స ఆడిన సునీల్ రమేష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంధుల వన్డే ప్రపంచకప్ విజేత
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : భారత్
ఎక్కడ : షార్జా, పాకిస్తాన్

వార్తల్లో వ్యక్తులుసుఖోయ్‌లో ప్రయాణించిన రక్షణమంత్రి సీతారామన్ Current Affairsరక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 17న రెండు సీటర్ల సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించారు. సీతారామన్ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ పెలైట్‌తో కలిసి 45 నిమిషాల సేపు ఆకాశంలో విహరించారు. దీంతో సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. సీతారామన్ కంటే ముందు మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్ 2003లో, ప్రతిభా పాటిల్ 2009లో సుఖోయ్‌లో ప్రయాణించారు. సీతారామన్ కంటే ముందు 2003లో అప్పటి రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ సుఖోయ్-30 విమానంలో చక్కర్లు కొట్టారు. రక్షణమంత్రి ప్రయాణించిన విమానం 8 వేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ధ్వని వేగాన్ని అధిగమించిందని ఓ ఐఏఎఫ్ అధికారి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : నిర్మలా సీతారామన్

ఎన్‌ఎస్‌జీ డీజీగా సుదీప్ లఖ్టాకియా అత్యంత ప్రముఖుల వ్యక్తిగత భద్రత బాధ్యతలు చేపట్టే నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్‌ఎస్‌జీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సుదీప్ లఖ్టాకియా నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన ఉన్న క్యాబినెట్ నియామకాల కమిటీ జనవరి 19న ఆమోదించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ డీజీగా ఉన్న ఎస్‌పీ సింగ్ జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేయనుండగా కేంద్రం తాజా నియామకం చేపట్టింది.
1984 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లఖ్టాకియా ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.‘బ్లాక్ క్యాట్స్’ గా పిలిచే ఎన్‌ఎస్‌జీ గుర్‌గావ్‌లోని మనేసర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎస్‌జీ డెరైక్టర్ జనరల్ నియామకం
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : సుదీప్ లఖ్టాకియా

ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా ఓపీ రావత్కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్(సీఈసీ)గా ప్రస్తుత కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. జనవరి 22న పదవీ విరమణ చేసిన ప్రస్తుత సీఈసీ ఏకే జోతి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లావాసా ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల సంఘంలో ప్రస్తుతం సునీల్ అరోరా మరో కమిషనర్‌గా ఉన్నారు. రావత్ ఈ పదవిలో 2018 డిసెంబర్ వరకు కొనసాగుతారు.
1953లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన రావత్ 1977లో మధ్యప్రదేశ్ కేడర్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ విభాగంలో కార్యదర్శిగా, రక్షణ శాఖలో డెరైక్టర్‌గా పనిచేశారు. 2004-08 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్‌కు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
1980 బ్యాచ్ హరియాణా కేడర్‌కు చెందిన లావాసా కేంద్ర ఆర్థిక, పర్యావరణం, పౌర విమానయానం, విద్యుత్, హోం మంత్రిత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన ఎన్నికల కమీషనర్ నియామకం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఓం ప్రకాశ్ రావత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ప్రస్తుత సీఈసీ ఏకే జోతి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో

హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ‘సియట్’ ఒప్పందం భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ప్రఖ్యాత టైర్ల ఉత్పత్తుల సంస్థ ‘సియట్’ జత కట్టింది. ఈ సంస్థకు అంబాసిడర్‌గా ఎంపికై న హర్మన్... ఇక ముందు తన బ్యాట్‌పై సియట్ లోగోను ప్రదర్శిస్తుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానేలతో ప్రస్తుతం ఒప్పందం కొనసాగిస్తున్న సియట్ ఒక మహిళా క్రికెటర్ బ్యాట్‌కు ఎండార్స్ చేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది హర్మన్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల అద్భుత ఇన్నింగ్‌‌స ఆడింది. మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో ఆడిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనందిబెన్గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియ మితులయ్యారు. రాష్ర్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 19న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

కార్టూనిస్ట్ చండీ లాహిరీ కన్నుమూతప్రముఖ కార్టూనిస్టు, రచయిత చండీ లాహిరీ (87) జనవరి 18న కోల్‌కతాలో మరణించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన లాహిరీ 1952లో పాత్రికేయుడిగా వృత్తి జీవితం ప్రారంభించారు. తర్వాత కొన్నేళ్లకు పూర్తి స్థాయి కార్టూనిస్టుగా మారి విశేష కీర్తి గడించారు. దీంతోపాటు ఆయన అనేక పుస్తకాలను రచించారు.

అవార్డులు18 మంది బాలలకు సాహస అవార్డులు Current Affairsగ్యాంబ్లింగ్, బెట్టింగ్ దందా నడుపుతున్న ముఠాను పట్టుకోవటంలో పోలీసులకు సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నజియా(18)తోపాటు 18 మంది బాలలు ఈ ఏడాది సాహస అవార్డులకు ఎంపికయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్(ఐసీసీడబ్ల్యూ) ఇచ్చే ఈ అవార్డులకు ఐదు విభాగాల కింద బాలలను ఎంపిక చేస్తారు. వీటిలో అత్యున్నతమైన ‘భారత్ అవార్డు’కు నజియా ఎంపికైంది. ఈమెకు దుండగుల నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయి. అయినా లక్ష్యపెట్టకుండా తమ ప్రాంతంలోని గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ముఠా ఆటకట్టించగలిగింది. కర్ణాటకకు చెందిన నేత్రావతి ఎం.చవాన్ నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలురను రక్షించే క్రమంలో నీట మునిగి చనిపోయింది. ఈమెకు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించారు. కాల్వలో పడి పోయిన స్కూల్ బస్సు నుంచి 15 మంది బాలలను కాపాడిన అదే బస్సులో ఉన్న పంజాబ్‌నకు చెందిన విద్యార్థి కరణ్‌బీర్ సింగ్(17) కూడా ఎంపికయ్యాడు. జనవరి 24వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వీరంతా ప్రధాని చేతుల మీదుగా పతకాలు అందుకుంటారు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న అనంతరం వీరందరికీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ విందు ఇస్తారు.

‘ఫేక్ న్యూస్’ అవార్డుల్ని ప్రకటించిన ట్రంప్తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని మీడియా సంస్థలకు ‘ఫేక్ న్యూస్ అవార్డుల్ని’ ప్రకటించారు. ఈ ఫేక్ న్యూస్ అవార్డుల జాబితాలో ద న్యూయార్క్ టైమ్స్ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించాక.. ‘ఇక దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నటికీ కోలుకోదు’ అని ఆ పత్రిక వెలువరించిన కథనానికి మొదటి బహుమతి ప్రకటించారు. ఏబీసీ న్యూస్, సీఎన్‌ఎన్, టైమ్ మ్యాగజైన్, వాషింగ్టన్ పోస్టులు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ‘అత్యంత అవినీతి, నిజాయతీ లేని’ మీడియా కథనాలకు వీటిని అందజేస్తున్నామని ట్రంప్ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
2016 అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసేలా రష్యాతో ట్రంప్ వర్గం కుమ్మకైందా? అన్న అంశంపై వెలువడ్డ కథనాలకే ఈ జాబితాలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఈ అవార్డుల్ని రిపబ్లికన్ పార్టీ నేషనల్ కమిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఫేక్ న్యూస్’ అవార్డుల ప్రకటన
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

మేటి మహిళలను సత్కరించిన కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష కృషి చేసి అరుదైన విజయాలు నమోదు చేసిన మహిళలను కేంద్రం పురస్కారాలతో సత్కరించింది. క్రీడా, వైద్య, ఆరోగ్య, రక్షణ, విమానయాన, పరిశ్రమ, సినీ రంగాల్లో సాధించిన విజయాలను గుర్తించి మొత్తం 112 మంది మహిళలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రపతి భవన్‌లో జనవరి 20న నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా వీరంతా అవార్డులను అందుకున్నారు.
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళ పీవీ సింధు, ప్రపంచ టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్‌‌సలో నంబర్ వన్ స్థానం సాధించిన మొదటి భారత క్రీడాకారిణి సానియా మిర్జా, ప్రపంచ మహిళా క్రికెట్‌లో తొలిసారిగా 6000 పరుగులు పూర్తిచేసిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్, ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి భారత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తొలి మహిళా అధ్యక్షురాలు, శోభన కామినేని, బ్రిటీష్ పార్లమెంటు ద్వారా హౌస్ ఆఫ్ కామన్‌‌స గౌరవాన్ని పొందిన తొలి భారతీయ గాయకురాలు కేఎస్ చిత్ర, హైదరాబాద్‌కు చెందిన తొలి మహిళా మ్యూజిక్ టెక్నీషియన్ సాజిదా ఖాన్ పురస్కారాలు అందుకున్నారు.

63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జనవరి 20న ముంబైలో జరిగింది. 2017 సంవత్సరానికిగాను ప్రదానం చేసిన ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘హిందీ మీడియం’ ఎంపికైంది. ఉత్తమ నటుడి అవార్డును ఇర్ఫాన్ ఖాన్ దక్కించుకోగా, తుమ్హారి సులు’ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటిగా విద్యాబాలన్ నిలిచింది. విద్యాబాలన్‌కు ఇది ఆరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం
ఎప్పుడు : జనవరి 20
ఎక్కడ : ముంబై
ఎవరు : ఉత్తమ నటుడు ఇర్ఫాన్‌ఖాన్, ఉత్తమనటి విద్యాబాలన్

అంతర్జాతీయం ‘పుతిన్ లిస్టు’ విడుదల చేసిన అమెరికా 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ రష్యాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లతో అమెరికా ‘పుతిన్ లిస్టు’ను విడుదల చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు రష్యాను శిక్షించాలని అమెరికన్ కాంగ్రెస్ చేసిన చట్టం అమల్లో భాగంగా జనవరి 30న అమెరికా ఆర్థిక శాఖ ఈ జాబితాను విడుదల చేసింది.
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న పుతిన్ పరిపాలన యంత్రాంగంలోని అందరి పేర్లతో పాటు కేబినెట్ మంత్రుల్ని, ఆ దేశానికి చెందిన ప్రముఖ బిలియనీర్లను ఇందులో చేర్చింది. జాబితాలోని 114 మంది రాజకీయ నాయకుల్లో పుతిన్ సహాయకులు, కేబినెట్ మంత్రుల పేర్లు ఉండగా.. 96 మంది బిలియనీర్లలో వివాదరహితులుగా పేరొందిన పలువురు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదెవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, నిఘా విభాగాలైన ఎఫ్‌ఎస్‌బీ, జీఆర్‌యూలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఇందులో ఉన్నారు

140 ఏళ్లు బతికే అవకాశంఆరోగ్య రంగంలో వస్తోన్న ఆధునిక సాంకేతిక మార్పుల కారణంగా మనిషి ఆయుర్దాయం140 ఏళ్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భాగంగా జనవరి 24న దావోస్‌లో ‘ఆరోగ్య రంగాన్ని మారుస్తున్న నాలుగో తరం పారిశ్రామిక విప్లవం’ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నిపుణులు రాబోయే కొన్ని దశాబ్దాల్లో మనిషి ఆయుర్దాయం పెరగనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చైనాలో స్పై విమానంCurrent Affairs సముద్రాల్లో విమాన వాహక నౌకల నుంచి నియంత్రించగలిగే కొత్త గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. శత్రు దేశాల డ్రోన్లు, జెట్‌ల కదలికలను కనిపెట్టడానికి వీలుగా దీనికి ఏఈఎస్‌ఏ రాడార్‌ను అమర్చారు. కేజే-600 అనే పేరుగల ఈ గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధిపరుస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా జనవరి 28న తొలిసారిగా బయటపెట్టిందంటూ హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా సముద్ర జలాల్లో ఇప్పటికే రెండు విమాన వాహక నౌకలు సేవలందిస్తుండగా, మూడో దానిని షాంఘైలో నిర్మిస్తోంది. తాజాగా అభివృద్ధి చేస్తున్న గూఢచర్య విమానాలను మూడో విమాన వాహక నౌకపై మోహరించే అవకాశం ఉన్నట్లు పత్రిక పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేజే-600 గూఢచర్య విమానం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : అభివృద్ధి చేస్తున్న చైనా

జాతీయం ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు Current Affairs భారత దేశభక్తిని, అస్త్ర శక్తిని ప్రతిబింబించేలా 69వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియాన్ దేశాధినేతల సమక్షంలో భారత సంప్రదాయాలు, సైనిక పాటవ ప్రదర్శనల నడుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రాజ్‌పథ్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు, ప్రముఖులు హాజరయ్యారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ అనంతరం భారత త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్ పరేడ్‌లో సైనిక వందనం స్వీకరించారు. రాష్ట్రపతిగా కోవింద్‌కు ఇదే తొలి గణతంత్ర దినోత్సవ వేడుక.
ముఖ్య అతిథులు
1. మయన్మార్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూచీ
2. వియత్నాం ప్రధాని ఎన్‌గెయెన్ జువాన్
3. ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టె
4. థాయలాండ్ ప్రధాని ప్రయుత్ చానోచా
5. సింగపూర్ చీఫ్ సీన్ లూంగ్
6. బ్రూనై సుల్తాన్ హాజీ బోల్‌కయా
7. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో
8. మలేసియా ప్రధాని నజీబ్ రజాక్
9. లావోస్ పీఎం థాంగ్‌లౌన్ సిసౌలిత్
10. కంబోడియన్ అధ్యక్షుడు హున్‌సేన్
ఆసియాన్ దేశాల వ్యూహాత్మక సంబంధాలతో బలమైన కూటమిగా ఎదిగే క్రమంలో భారత్‌లో జరుగుతున్న జాతీయ వేడుకలకు ఈ 10 దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరవటం ఇదే తొలిసారి.


చైనాకు భారత్-ఆసియాన్ దేశాల గట్టి సందేశం చైనాకు భారత్-ఆసియాన్ దేశాలు గట్టి సందేశమిచ్చాయి. దక్షిణ చైనా సముద్ర వివాదంపై భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమర్థంగా పకడ్బందీగా అమలుచేయాలని తీర్మానించాయి. క్లిష్టమైన సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత, స్వేచ్ఛా నౌకాయానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాయి. ఈ మేరకు 10 ఆసియాన్ దేశాధినేతలు పాల్గొన్న ఇండియా-ఆసియాన్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ పేరిట ఏడు పేజీల ప్రకటనను జనవరి 25న విడుదల చేశారు.
భారత్-ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ స్మారక స్టాంపులు విడుదల చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆసియాన్ దేశాధినేతలతో సముద్ర తీర రక్షణ, అనుసంధానత, వాణిజ్యం తదితరాలపై మోదీ చర్చలు జరిపారు. ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ.. ఉమ్మడి సముద్ర తీరాల భద్రత కోసం భారత్ ఆసియాన్ దేశాలతో కలసి పనిచేయడానికి కట్టుబడి ఉందన్నారు. అనంతరం... గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆసియాన్ దేశాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - ఆసియాన్ సదస్సు
ఎప్పుడు : జనవరి 25
ఎక్కడ : న్యూఢిల్లీలో

సోషల్ మీడియాలో టాప్‌లో ‘భారత్ అంటే బిజినెస్’ భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న ‘భారత్ అంటే బిజినెస్’ (#Indiameansbusiness) హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఎక్కువ సార్లు ప్రస్తావనకు వచ్చిన విషయంగా నిలిచింది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖంగా వినిపించిన అంశాలపై అమెరికాకు చెందిన టాక్‌వాకర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘భారత్ అంటే బిజినెస్’ హ్యాష్‌ట్యాగ్ అత్యధికంగా39,252 సార్లు ప్రస్తావనకు రాగా, తరువాతి స్థానాల్లో వరుసగా మహిళలు (35,837), అమెరికా ఫస్ట్ (31,449), సంపద (22,896), కృత్రిమ మేధ(19,018), ప్రపంచీకరణ (16,513), వాతావరణ మార్పులు (15,477)అనే హ్యాష్‌ట్యాగ్‌లున్నాయి.
వ్యక్తుల పరంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (2.73 లక్షల సార్లు) అగ్ర భాగంలో నిలిచారు. ఆ తరువాత ప్రధాని మోదీ, ఫ్రాన్‌‌స అధ్యక్షుడు ఎమాన్యుయెల్, బ్రిటన్ ప్రధాని థెరిసా, జర్మన్ చాన్స్‌లర్ మెర్కెల్ ఉన్నారు. ఈసారి దావోస్ పేరు సామాజిక మాధ్యమాల్లో 20.20 లక్షల సార్లు ప్రస్తావనకు వచ్చినట్లు టాక్‌వాకర్ వెల్లడించింది.

2017 సంవత్సరపు హిందీ పదంగా ‘ఆధార్’ ఆధార్ కార్డుతో దేశవాసుల మనసుల్లో బాగా నాటుకుపోయిన ‘ఆధార్’కు 2017 సంవత్సరపు హిందీ పదంగా గుర్తింపు లభించింది. జైపూర్ సాహితీ వేడుకలో భాగంగా జనవరి 27న ‘ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్’ అంశంపై జరిగిన చర్చలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆధార్ తర్వాత మిత్రోన్(అసలు రూపం మిత్రో), నోట్‌బందీ, గోరక్షక్ అనే హిందీ పదాలు కూడా బాగా ప్రాచుర్యం పొందినట్లు వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017 సంవత్సరపు హిందీ పదంగా ‘ఆధార్’
ఎప్పుడు : జనవరి
ఎక్కడ : జైపూర్ సాహితీ వేడుకలో

మహారాష్ట్ర శకటానికి ప్రథమ బహుమతిగణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో ప్రదర్శించిన శకటాలకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. రాష్ట్రాల కేటగిరీలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఘట్టాన్ని చూపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. అస్సాం, ఛత్తీస్‌గఢ్‌ల శకటాలు వరుసగా రెండో, మూడో బహుమతులు పొందాయి. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 28న ఢిల్లీలో బహుమతులను ప్రదానం చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కేటగిరీలో క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఉత్తమ శకటం అవార్డు దక్కింది. త్రివిధ దళాల కేటగిరీలో ఆర్మీ పంజాబ్ రెజిమెంట్, పారా-మిలిటరీ దళాల కేటగిరీలో ఐటీబీపీలు ఉత్తమ కవాతు ట్రోఫీని పొందాయి.

యాసిడ్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధి మాంద్యంతో పాటు యాసిడ్ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీచేసే గ్రూప్ ఏ, బీ, సీ ఉద్యోగాల్లో 40 శాతానికి పైగా వైకల్యస్థాయి ఉన్న అభ్యర్థులకు మొత్తం ఖాళీల్లో నాలుగు శాతం కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మొత్తం గతంలో మూడు శాతంగా ఉండేది. దృష్టి లోపం, వినికిడి లోపం, సెరిబ్రల్ పాల్సీ, మరుగుజ్జు, కుష్ఠు వ్యాధి నయమైనవారు, యాసిడ్ దాడి బాధితులకు ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర సిబ్బంది, శిక్షణా విభాగం(డీవోపీటీ) అన్ని ప్రభుత్వ విభాగాలకు ఇటీవల లేఖ రాసింది. వీరితో పాటు ఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధిమాంద్యంతో బాధపడేవారికి కూడా ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రతి కేంద్ర ప్రభుత్వ విభాగం వైకల్యమున్న ఉద్యోగుల ఫిర్యాదులు స్వీకరించడానికి ఓ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందుకునే అధికారులు 2 నెలల్లోగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాల్లో వైకల్యమున్న అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ సర్దుబాటు చేయరాదని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధి మాంద్యంతో పాటు యాసిడ్ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

పాత పద్ధతిలోనే పాస్‌పోర్ట్ ఈసీఆర్(ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) హోదా ఉన్న పౌరులకు ఆరెంజ్ రంగు పాస్‌పోర్ట్ జారీ చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం విరమించుకుంది. మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జనవరి 29న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాంగ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
ఆరెంజ్ రంగు కవర్‌తో పాటు చివరి పేజీలో వ్యక్తిగత వివరాలు ముద్రించాలని గతంలో విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకోగా.. దీన్ని వ్యతిరేకిస్తు పలువురు వ్యక్తులు, బృందాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి.

సీజేఐ వేతనం నెలకు రూ.2.80 లక్షలుసుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల వేతనాలను దాదాపు రెండు రెట్లు పెంచే బిల్లుపై రాష్ట్రపతి కోవింద్ జనవరి 30న సంతకం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతన, సర్వీసు నిబంధనల) సవరణ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.1 లక్ష నుంచి రూ.2.80 లక్షలకు పెరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనాలు కూడా రూ.80 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెరుగుతాయి. 2016 జనవరి 1 నుంచే జడ్జీల వేతన పెంపు అమల్లోకి వస్తుంది.

జాతీయ ఓటరు దినోత్సవంఅర్హులంతా ఓటర్లుగా నమోదు చేసుకొని భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు శుభాకాంక్షలు తెలిపారు. 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటైంది. దీన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 25న ఏటా జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నారు.

గీన్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 177వ స్థానంవాయు కాలుష్య నియంత్రణలో పేలవ పనితీరు, నామమాత్ర అటవీ సంరక్షణ చర్యలు.. భారత్‌ను 2018 గ్రీన్ ర్యాంకింగ్స్‌లో 177వ స్థానంలో నిలబెట్టాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)180 దేశాలతో కూడిన పర్యావరణ పనితీరు సూచీ (ఈపీఐ)ని జనవరి 23న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో విడుదల చేసింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, మాల్టా, స్వీడన్ తొలి ఐదు స్థానాల్లో; బురుండీ(180), బంగ్లాదేశ్(179), కాంగో(178), భారత్(177), నేపాల్(176) చివరి ఐదు స్థానాల్లో నిలిచాయి.

దేశంలో తగ్గిన మరణ శిక్షలుఉరిశిక్ష ఖరారైన ఖైదీలు 2017 చివరి నాటికి భారత్‌లో 371 మంది ఉన్నట్లు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. 2016 చివరి నాటికి ఈ సంఖ్య 399గా ఉంది. 2016తో పోలిస్తే 2017లో 27 శాతం తక్కువగా ఉరి శిక్ష ఖారరైనట్లు పేర్కొంది. భారత్‌లో ‘మరణశిక్ష వార్షిక గణాంకాలు’ పేరుతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం జనవరి 25న నివేదిక విడుదల చేసింది.

ద్వైపాక్షికం
భారత్ - కంబోడియా మధ్య 4 ఒప్పందాలు Current Affairs భారత్-కంబోడియాల మధ్య రక్షణ బంధాల బలోపేతానికి కృషి చేయాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్వీర్యం చేయటంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయటంపై కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కంబోడియా ప్రధానమంత్రి హున్‌సేన్‌ల మధ్య జనవరి 27న రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరసాయానికి చర్చలు జరిగాయి. అనంతరం వీరిరువురి సమక్షంలో ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలపై ఒప్పందాలు జరిగాయి. నేరస్తుల అప్పగింత, నేర సంబంధిత విచారణకు న్యాయసాయం, కంబోడియాలోని స్వా హబ్ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు భారత రుణసాయం (దాదాపు రూ.234 కోట్లు) అంశాలపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు.

ప్రాంతీయంవరంగల్‌లో టెక్ మహీంద్ర ఏర్పాటుకు అంగీకారం Current Affairs ప్రముఖ ఐటీరంగ కంపెనీ టెక్ మహీంద్ర వరంగల్‌లో తమ కేంద్రాన్ని (టెక్ సెంటర్) ఏర్పాటు చేయనుంది. టెక్ మహీంద్ర కార్యకలాపాలు ప్రారంభించా లని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన విజ్ఞప్తికి కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ జనవరి 25న మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, సీఈవో సీపీ గుర్నానీతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం-మహీంద్ర సంస్థల మధ్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి కోరగా, వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆనంద్ హామీ ఇచ్చారు. తొలుత 500 మందితో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు అలీబాబా క్లౌడ్ సహకారందావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 24న క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ సర్వీసెస్ కంపెనీ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అలీబాబా సహకారం అందిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సైమన్ హూ స్పందిస్తూ.. భారత్‌లో తమరెండో డేటా సెంటర్‌ను ఈ ఏడాది చివరకు ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. వ్యవసాయంలో సూక్ష్మ పోషకాలు, క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలన్నది తమ ఉద్దేశమని, ఆ దిశగా ఎనలిటిక్స్ రంగంలో అలీబాబా సంస్థ సహకారం కోరుతున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జనవరి 26న ప్రారంభమైంది. 28వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో పలు సాహిత్య, సామాజిక అంశాలపై 30కిపైగా సదస్సులు, సాంస్కృతిక, చర్చా కార్యక్రమాలు, వర్క్‌షాపులు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో స్పెయిన్ అతిథి దేశంగా పాల్గొంటుంది. 15కు పైగా రాష్ట్రాలు, 10 దేశాల నుంచి ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
ఎప్పుడు : జనవరి 26 - 28
ఎక్కడ : బేగంపేట్ పబ్లిక్ స్కూల్

ఆంధ్రప్రదేశ్ సర్కార్ విజన్ - 2029ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతం కుటుంబాలకు ఇంటి ఆవరణలో స్నానం చేసే గదులు కూడా లేవు. ఇందులో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీల కుటుంబాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇది ఎక్కువగా ఉంది. వీరిలో అత్యధికులకు బ్యాంకు ఖాతాలు కూడా లేకపోవడం గమనార్హం. ఇక 69 లక్షల కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. విజన్-2029లో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు స్పష్టమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు నోచుకోక 48 లక్షల కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నట్లు తేలింది.
నివేదికలో ముఖ్యాంశాలు..

  • రాష్ట్రంలో ఇంటి ఆవరణలో స్నానపు గదుల్లేని కుటుంబాలు 44 శాతం ఉన్నాయి.
  • 72 శాతం ఎస్టీ కుటుంబాలకు, 54 శాతం ఎస్సీ కుటుంబాలు, 38 శాతం మంది ఇతరులకు ఇంటి ఆవరణలో స్నానం గదులు లేవు.
  • రాష్ట్రంలో 33 శాతం కుటుంబాలకు సరైన గూడు లేదు. నాణ్యతతో కూడిన నివాస గృహాలు 67 శాతం మందికే ఉన్నాయి.
  • రాష్ట్రంలో 1.37 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉండగా వీరిలో 39 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. ఇతర కుటుంబాల్లో 98 లక్షల మంది నిరక్షరాస్యులున్నారు.
  • 60 శాతం కుటుంబాలకు ఇంట్లో నల్లా నీటి సౌకర్యం లేదు.

విజయవాడలో సూర్యారాధన కార్యక్రమంవిజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28న సూర్యారాధన కార్యక్రమం నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. చరిత్రలో మొదటి సారిగా ప్రభుత్వం తరఫున ప్రకృతిని ఆరాధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. భారత దేశంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్‌లోనే సూర్యుడు ఉదయిస్తాడని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు సూర్యోదయం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. సూర్యారాధన మతం కాదని, సైన్‌‌స అని అన్నారు. కులమతాలకు అతీతంగా సూర్యారాధన కొనసాగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మాదిరిగానే సూర్యారాధనను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సూర్యారాధన కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 28
ఎక్కడ : విజయవాడ
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

హైదరాబాద్‌లో అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సుహైదరాబాద్ వేదికగా జనవరి 27 నుంచి 31 వరకు అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు(ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సెల్ బయాలజీ) జరిగింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌లో ఈ సదస్సు జరిగింది. అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మార్టిన్ చాల్ఫీ ప్రారంభోపన్యాసం చేశారు. జీవ వైజ్ఞానిక శాస్త్రంలో మూడు అగ్రగామి సంస్థలైన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఐఎఫ్‌సీబీ), ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఏపీఓసీబీ), ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజీ (ఐఎస్‌సీబీ)లు తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నాయి. 30 దేశాల నుంచి 300 సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, 1,400 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు
ఎప్పుడు : జనవరి 27 - 31
ఎక్కడ : హైదరాబాద్‌లో

ఆర్థికం ఉడాన్‌లోకి కొత్తగా 325 మార్గాలు
Current Affairs దేశంలో విమానయాన రంగం భారీ విస్తరణకు ప్రభుత్వం మరో సానుకూల చర్య తీసుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలను మరింత పెంచేలా కొత్తగా 325 మార్గాలను ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కిందకు తీసుకొచ్చింది. ఉడాన్ రెండో విడతలో భాగంగా కొత్తగా 56 విమానాశ్రయాలు/హెలిప్యాడ్‌లను ప్రభుత్వం ఈ పథకం కిందకు చేర్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ అనుసంధాన పథకమైన ఉడాన్ కింద రెండో రౌండ్ బిడ్డింగ్ ముగిసిన అనంతరం విమానయాన సంస్థలకు కేటాయించిన మార్గాలను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు జనవరి 24న వెల్లడించారు. మొత్తం 15 సంస్థలకు ఈ మార్గాలను కేటాయించారు.
కొత్త మార్గాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, తిరుపతి నగరాలకు కూడా వివిధ ప్రాంతాల నుంచి విమానాలు రానున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని యుద్ధభూమి కార్గిల్‌కూ ఉడాన్ రెండో విడతలో చోటు దక్కింది. అత్యధికంగా ఇండిగో సమర్పించిన 20 ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. స్పైస్‌జెట్ ప్రతిపాదనల్లో 17 ఆమోదం పొందాయి. రోడ్డు, రైలు మార్గాలు సరిగా లేని ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత నగరాలకు ప్రాధాన్యతనిస్తూ ఉడాన్ పథకం రెండో విడతలో వాటికే ఎక్కువ మార్గాలను కేటాయించారు. విమానయాన సంస్థలు 50 శాతం సీట్లను కచ్చితంగా ఉడాన్ పథకానికి కేటాయించాలి. ఆ సీట్లకు గంట ప్రయాణానికి రూ.2,500 కన్నా ఎక్కువ చార్జీలను వసూలు చేయకూడదు. అదే హెలికాప్టర్లు అయితే 13 సీట్లను కేటాయించి, అర్ధగంట ప్రయాణానికి గరిష్టంగా రూ.2,500 మాత్రమే వసూలు చేయాలి. రాయితీ కింద ప్రభుత్వం సంస్థలకు కొంత మొత్తం చెల్లిస్తుంది. మొత్తంగా రూ.620 కోట్లను ఇందుకోసం ప్రభుత్వం కేటాయించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి నూతన మార్గాలు
మార్గం విమానయాన సంస్థ
హైదరాబాద్-హుబ్లీ టర్బో ఏవియేషన్, అలయన్‌‌స ఎయిర్, స్పైస్‌జెట్
హైదరాబాద్-కొల్హాపూర్ ఇండిగో, అలయన్‌‌స ఎయిర్
హైదరాబాద్-నాసిక్ అలయన్‌‌స ఎయిర్, స్పైస్‌జెట్
హైదరాబాద్-షోలాపూర్ అలయన్‌‌స ఎయిర్
హైదరాబాద్-కొప్పళ్ టర్బో ఏవియేషన్
తిరుపతి-కొల్హాపూర్ ఇండిగో
తిరుపతి-హుబ్లీ ఘొడావత్ (హెలికాప్టర్లు)
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉడాన్ పథకంలోకి కొత్తగా 325 మార్గాలు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ

2017-18లో బ్యాంకులకు మూలధనంగా రూ.88 వేల కోట్లు మొండిబాకీలతో సతమతమవుతున్న 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) ఊతమిచ్చే దిశగా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 88,139 కోట్ల అదనపు మూలధనాన్ని అందించనుంది. ఇందులో అత్యధికంగా ఐడీబీఐ బ్యాంక్‌కి రూ. 10,610 కోట్లు, ఎస్‌బీఐకి రూ. 8,800 కోట్లు దక్కనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 24న ఈ విషయాలు తెలిపారు. పీఎస్‌బీలకి అందించే అదనపు మూలధనంపై విసృ్తతంగా కసరత్తు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. మొండిబాకీల సమస్యకు చెక్ చెప్పే దిశగా బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు.
2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా రూ.2.11 లక్షల కోట్లు అందించేలా కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రణాళిక ప్రకటించింది. ఇందులో రూ.1.35 లక్షల కోట్లు బాండ్ల జారీ ద్వారా, మిగతా రూ. 76,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు, మార్కెట్ నుంచి నిధుల సమీకరణ రూపంలో ఉండనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాంకులకు అదనపు మూలధనంగా రూ.88,139 కోట్లు
ఎప్పుడు : 2017-18 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ఆర్థిక సర్వే 2017-18పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ తాలూకు ప్రభావాల నుంచి బయటపడి దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా పుంజుకుంటోందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7- 7.5 శాతం స్థాయిలో వృద్ధి రేటు నమోదవుతుందని 2017-18 సంవత్సర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. జనవరి 29న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు ముందుంచిన ఈ సర్వే... ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మళ్లీ గత స్థానానికి చేరుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చే సింది. ‘‘ప్రపంచ వృద్ధి రేటు 2018లో ఒక మోస్తరు స్థాయిలోనే పురోగమిస్తుంది. మనకైతే జీఎస్‌టీ పూర్తి స్థాయిలో స్థిరపడటం, పెట్టుబడులు పెరిగే అవకాశాలు, కొనసాగుతున్న సంస్కరణలు అధిక వృద్ధి రేటుకు అనుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. కాకపోతే పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన స్టాక్ ధరల్లో భారీ కరెక్షన్ వంటి సవాళ్లుంటాయి. వీటి కారణంగా విదేశీ నిధుల రాక ఆగిపోతుంది’’ అని సర్వే అభిప్రాయపడింది.
అంచనాలను మించే వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో (2017-18) జీడీపీ వృద్ధి 6.75 శాతంగా నమోదవుతుందని సర్వే పేర్కొంది. కాకపోతే ఇది 6.5 శాతంగా ఉండొచ్చని ఇటీవలే కేంద్ర గణాంకాల విభాగం పేర్కొనడం గమనార్హం. 2016-17లో జీడీపీ వృద్ధి 7.1 శాతం కాగా, 2014-15లో ఇది ఏకంగా 8 శాతంగా ఉంది. 2017-18కు స్థూలంగా జోడించిన విలువ (జీవీఏ) 6.1 శాతంగా సర్వే అంచనా వేసింది. గతేడాది ఇది 6.6 శాతం. ఎగుమతులు, ప్రైవేటు పెట్టుబడులు వచ్చే సంవత్సరంలో తిరిగి పుంజుకుంటాయంటూ... జీఎస్‌టీ సాధారణ స్థితికి చేరడం, రెండు రకాల బ్యాలన్‌‌స షీటు చర్యలు, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంలో (మాక్రో) స్థిరత్వం నెలకొంటుందని అంచనా వేసింది.
సవాళ్లు పొంచి ఉన్నాయి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకునే చమురు ధరలు సగటున 14 శాతం పెరగ్గా, 2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ 10-15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విధానాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ‘‘మధ్య కాలానికి మూడు విభాగాలపై దృష్టి సారించాలి. ఇందులో ఉద్యోగాల కల్పన ఒకటి. యువతకు, ముఖ్యంగా మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలుండాలి. విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన కార్మిక శక్తిని సృష్టించడం రెండోది. సాగు ఉత్పాదనను పెంచడం మూడోది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలున్నం దున ఆర్థిక నిర్వహణ సవాలుగా ఉంటుంది’’ అని సర్వే హెచ్చరించింది. వ్యాపార నిర్వహణలో మరింత సులభతర దేశంగా భారత్‌ను మార్చేందుకు అప్పిలేట్, న్యాయ విభాగాల్లో జాప్యం, అపరిష్కృత పరిస్థితులను తొలగించాలని సూచించింది. ఇందుకోసం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని సర్వే గుర్తు చేసింది.
సర్వే ముఖ్యాంశాలు

  • 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండొచ్చు.
  • 2018-19లో ఇది 7-7.5%కి చేరుతుంది
  • చమురు ధరలు పెరిగినా లేక షేర్ల ధరలు పడినా విధానపరమైన చర్యలు అవసరం.
  • వ్యవసాయానికి సహకారం పెంచడం, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి.
  • పరోక్ష పన్నులు 50 శాతం పెరిగినట్టు జీఎస్‌టీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
  • రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు ఇతర సమాఖ్య దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి.
  • పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్థిక పొదుపునకు ప్రోత్సాహం లభించింది.
  • 2017-18లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.3 శాతం. గత 6 ఆర్థిక సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి.
  • 2017-18లో సంస్కరణల కారణంగా సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15 శాతం పెరిగాయి.
  • కార్మిక చట్టాలు మెరుగ్గా అమలు చేసేందుకు టెక్నాలజీని వినియోగించాలి.
  • స్వచ్ఛభారత్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల వసతులు పెరిగాయి. 2014లో 39 శాతమే ఉంటే, 2018 నాటికి 76%కి చేరాయి.
  • సమ్మిళిత వృద్ధికి గాను విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలకు ప్రాధాన్యమివ్వాలి.
ముఖ్యమైన గణాంకాలు..
జీడీపీ
6.5 (2017-18 ముందస్తు అంచనా)
టోకు ద్రవ్యోల్బణం
2.9 (2017-18 ఏప్రిల్ - డిసెంబర్)
స్థూల ద్రవ్యోల్బణం
3.2 (2017-18 బడ్జెట్ అంచనా)
విదేశీ వాణిజ్యం 
విదేశీ ఎగుమతులు 12.1 శాతం(2017-18 ఏప్రిల్ - డిసెంబర్)
విదేశీ దిగుమతులు 21.8 శాతం(2017-18 ఏప్రిల్ - డిసెంబర్)
విదేశీ మారకపు నిల్వలు
409.4 బిలియన్ డాలర్లు(2017-18 ఏప్రిల్ - డిసెంబర్)
ఆహార ధాన్యాల ఉత్పత్తి
134.7 మిలియన్ టన్నులు(2017-18 తొలి ముందస్తు అంచనా)
ఆరేళ్ల కనిష్టానికి సగటు ద్రవ్యోల్బణం
2017-18లో సగటు ద్రవ్యోల్బ ణం 3.3 శాతం. ఇది ఆరేళ్ల కనిష్టస్థాయి. ఒక స్థిర ధరల వ్యవస్థవైపు ఆర్థికవ్యవస్థ పురోగమిస్తోంది. ధరల కట్టడి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటి. హౌసింగ్, ఇంధనం మిగిలిన ప్రధాన కమోడిటీ గ్రూపులన్నింటిలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. సీజనల్ ఇబ్బందుల వల్ల ఇటీవల కూరగాయలు, పండ్ల ధరలు పెరిగాయి. సరఫరాల్లో ఇబ్బందుల తొలగించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుంది.
డీమోనిటైజేషన్‌తో పెరిగిన గృహ పొదుపు
పెద్ద నోట్ల రద్దు వల్ల బహుళ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం ఇందులో ఒకటి. అలాగే గృహ పొదుపు రేట్లూ పెరిగాయి. పెట్టుబడుల పునరుద్ధరణలో పొదుపు రేటు పెంపు కీలకాంశం. అలాగే సాంప్రదాయకంగా బంగారంపై చేసే వ్యయాలను నగదు సంబంధ పొదుపులవైపు మళ్లించడానికి విధానపరమైన ప్రాధాన్యత ఇవ్వాలి. నగదు వాడకం తగ్గి, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరగడం డీమోనిటైజేషన్ వల్ల ఒనగూరిన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.
ఎన్‌పీఏల పరిష్కారంలో ఐబీసీది కీలకపాత్ర
బ్యాంకుల్లో పేరుకున్న రూ.8 లక్షల కోట్ల మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారానికి కొత్త దివాలా చట్టం (ఐబీసీ) పటిష్టవంతమైన యంత్రాంగాన్ని అందిస్తోంది. పలు వివాదాల పరిష్కారానికి నిర్ధిష్టమైన కాలపరిమితులను నిర్దేశిస్తోంది. కార్పొరేట్ల బ్యాలెన్‌‌స షీట్లను మెరుగుపరచుకోవటానికి తగిన విధివిధానాలను అందిస్తోంది. ట్విన్ బ్యాలెన్‌‌స షీట్ (టీబీఎస్) చర్యలు దీర్ఘకాలిక సమస్యపరిష్కారంలో ప్రధానమైనవి. ప్రస్తుతం దివాలా ప్రొసీడింగ్‌‌స కింద 11 కంపెనీలకు చెందిన రూ.3.13 కోట్ల విలువైన క్లెయిమ్స్ ఉన్నాయి.
మహిళల ప్రాధాన్యాన్ని వివరించిన సర్వే
ఈ సారి సర్వేలో మహిళల ప్రాధాన్యాన్ని, లింగ వివక్షపై వ్యతిరేకతను చాటడానికి మోదీ ప్రభుత్వం గులాబీ రంగును ఎంచుకుంది. సర్వే కవర్ పేజీ సహా గులాబీ రంగులో మెరిసింది. మహిళలపై హింసకు ముగింపు పలకాలన్న ఉద్యమానికి మద్దతుగానే కవర్ పేజీకి గులాబీ రంగులద్దారన్నది నిపుణుల మాట. ‘‘కనీసం ఒక్క కుమారుడినైనా కలిగి ఉండాలన్న సామాజిక ప్రాధాన్యతను భారత్ వ్యతిరేకించాలి. స్త్రీ, పురుషులను సమానంగా అభివృద్ధి చేయాలి’’ అని పేర్కొంది. ‘‘47 శాతం మహిళలు ఎటువంటి గర్భనిరోధకాలూ వాడటం లేదు. వాడే వారిలో కూడా మూడోవంతు కన్నా తక్కువ మంది మాత్రమే పూర్తిగా మహిళలకు సంబంధించిన గర్భ నిరోధకాలు వాడుతున్నారు’’ అని సర్వే తెలియజేసింది.
నిర్మాణ రంగంలో కోటిన్నర కొత్త ఉద్యోగాలు
కొన్నాళ్లుగా స్థిరాస్తి.. నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇందులో వచ్చే అయిదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించడంలో వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కలిపి రెండో స్థానంలో ఉన్నట్లు తెలియజేసింది. ‘‘2013లో ఈ రంగంలో 4 కోట్లపైగా సిబ్బంది ఉండగా.. 2017కి ఈ సంఖ్య 5.2 కోట్లకు చేరింది. 2022 నాటికి 6.7 కోట్లకు చేరొచ్చు. ఏటా 30 లక్షల ఉద్యోగాల చొప్పున అయిదేళ్లలో కోటిన్నర ఉద్యోగాల కల్పన జరగవచ్చు‘ అని సర్వే వివరించింది. రియల్టీ, కన్‌స్ట్రక్షన్ రంగంలో 90% మంది నిర్మాణ కార్యకలాపాల్లో పనిచేస్తుండగా, మిగతా 10% ఫినిషింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల్లో ఉంటున్నారు.
ఫండ్స్ పై పెరుగుతున్న మక్కువ
గత ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు... బ్యాంక్ డిపాజిట్లలో 82%, జీవిత బీమా ఫండ్‌‌సలో 66 శాతం, షేర్లు, డిబెంచర్లలో 345% చొప్పున పెరిగాయి. మ్యూచువల్ ఫండ్‌‌సపై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది. ఫండ్‌‌స పొదుపులు 400 శాతం వృద్ధి చెందాయి. కేవలం రెండేళ్లలోనే ఫండ్‌‌స పొదుపులు 11 రెట్లు పెరిగాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ నాటికి మ్యూచువల్ ఫండ్‌‌సలోకి రూ.2.53 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో గత ఏడాది అక్టోబర్ 31 నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.21.43 లక్షల కోట్లకు పెరిగింది.
వనరులు తక్కువైనా విద్య, ఆరోగ్యంపై దృష్టి
పరిమిత వనరులున్నా.. విద్య, ఆరోగ్యాలకు ప్రభుత్వం గణనీయ ప్రాధాన్యమిస్తోందని సర్వే తెలిపింది. ‘భారత్ వర్ధమాన దేశం. విద్య, ఆరోగ్యం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించేందుకు వెసులుబాటుండదు. ప్రభుత్వం మాత్రం వీటిని మెరుగుపర్చేందుకు నిరంతరం ప్రాధాన్యమిస్తూనే ఉంది. సామాజిక సంక్షేమం దృష్ట్యా పథకాలపై వ్యయాలను స్థూల రాష్ట్రీయోత్పత్తిలో (జీఎస్‌డీపీ) 2016-17లో 6.9%కి పెంచినట్లు తెలిపింది. 2014-15లో ఇది 6%. బాలికల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 640 జిల్లాలకు విస్తరించనున్నారు.
ఇన్‌ఫ్రాకు 2040కి 4.5 ట్రిలియన్ డాలర్లు
దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి వచ్చే 25 సంవత్సరాల్లో 4.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, 3.9 ట్రిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించుకోగలిగే అవకాశముంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌ఐఐబీ), ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్) ద్వారా మౌలికానికి పెట్టుబడులను సమీకరించుకోవాలి.
విదేశీయుల పర్యటనలు పెరిగాయి
పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల దేశంలో విదేశీయుల పర్యటనలు గణనీయంగా పెరిగాయి. పర్యాటకం ద్వారా 2017లో విదేశీ మారక ఆదాయం 29 శాతం పెరిగి, 27.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పర్యాటకుల సంఖ్య 15.6 శాతం పెరిగి, 1.02 కోట్లుగా నమోదైంది. పర్యాటకం అభివృద్ధి దిశలో ఈ-వీసా, ది హెరిటేజ్ ట్రైల్ వంటి అంశాలతో సహా ప్రభుత్వం ఈ విషయంలో చేపట్టిన ప్రచారం కూడా కలిసివచ్చాయి.
జీఎస్‌టీతో పెరిగిన ‘పరోక్ష’ పన్ను బేస్
జూలై నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్నుతో పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50 శాతంపైగా పెరిగింది. 34 లక్షల వ్యాపార సంస్థలు పన్ను పరిధిలోకి వచ్చాయి. పలు చిన్న పరిశ్రమల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జీఎస్‌టీ వసూళ్ల పట్ల కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ఒకసారి వ్యవస్థ స్థిరపడిన తర్వాత, ఆయా పరిస్థితులన్నీ తొలగిపోతాయి. జనవరి 24 వరకూ జీఎస్‌టీ కింద కోటి మంది పన్ను చెల్లింపుదారులు నమోదయ్యారు.
ఎగుమతులూ పుంజుకుంటాయి
అంతర్జాతీయ వాణిజ్యం పెరగనున్న నేపథ్యంలో మున్ముందు దేశీ ఎగుమతులు కూడా పుంజుకోగలవని సర్వే అంచనా వేసింది. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని పేర్కొంది. 2016లో 2.4 శాతంగా ఉన్న ప్రపంచ వాణిజ్యం.. 2017లో 4.2 శాతం, 2018లో 4 శాతం మేర వృద్ధి చెందగలదని అంచనా వేసింది.
విదేశీ ఎగుమతుల్లో తెలంగాణకు 5వ స్థానం
వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం దక్కించుకుంది. దాదాపు 70 శాతం విదేశీ ఎగుమతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరగడం విశేషం. జనవరి 29న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2017-18లో ఈ వివరాలను పేర్కొన్నారు. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఈ గణాంకాల్లో జీఎస్టీయేతర (పెట్రోలియం తదితర) వస్తు, సేవల వివరాలు లేవు.
విదేశీ ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 22.3 శాతం, గుజరాత్ వాటా 17.2 శాతం, కర్ణాటక వాటా 12.7 శాతం, తమిళనాడు వాటా 11.5 శాతం, తెలంగాణ వాటా 6.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో 2.8 శాతం వాటా కలిగి ఉంది.
అంతర్రాష్ట్ర వాటాలు ఇలా
అంతర్రాష్ట్ర ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలు నిలిచాయి. 10వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. అంతర్రాష్ట్ర దిగుమతుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు తొలి 5 స్థానాల్లో నిలవగా, 10వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ ఉంది.
రైతు ఆదాయం 25% తగ్గొచ్చు
వాతావరణంలో మార్పుల కారణంగా రైతుల ఆదాయం రాబోయే కొన్నేళ్లలో 20 నుంచి 25 శాతం వరకు తగ్గొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించడం, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితిని కొంతవరకు అధిగమించొచ్చంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే వ్యవసాయ, సర్కారీ విధానాల్లో సమూల మార్పులు అవసరమని సర్వే పేర్కొంది. వ్యవసాయదారుల రాబడిని పెంచడంతోపాటు, ఆ రంగంలో సంస్కరణలు తీసుకురావడం కోసం జీఎస్టీ మండలి తరహాలో ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. ఎరువులు, విద్యుత్తుపై రైతులకు ఇస్తున్న రాయితీని కూడా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అందజేయాలని సూచించింది.
ప్రస్తుతం దేశంలో 45 శాతం పంట భూమికే సాగునీటి వసతి ఉండగా, ఈ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్యప్రదేశ్, గుజరాత్‌లు మినహా మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో సాగునీటి వసతి ఉన్న భూమి అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. సాగునీటి వసతిని మెరుగుపరిచేందుకు అధిక నిధులను కేటాయించాలని సిఫారసు చేసింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు మరింత ప్రభావ వంతమైన, సమర్థవంతమైన పంట బీమా సదుపాయాలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తుచేసింది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే స్త్రీలు కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ వారి పాత్ర మరింత పెరగాలనీ, మహిళా రైతులకు రుణాలు, భూమి, విత్తనాలు సులభంగా లభించేలా విధానాలు ఉండాలని ఆర్థిక సర్వే పేర్కొంది.
రైతులకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు
దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌బీఐ) రైతులకు క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ ‘ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్’ ద్వారా రైతులకు క్రెడిట్ కార్డులను అందిస్తామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పైలట్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ చేపట్టామని.. దీని విజయం ఆధారంగా తర్వాత దేశవ్యాప్త విస్తరణ ఉంటుందని వెల్లడించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) మాదిరి కాకుండా ఎస్‌బీఐ కార్డులో 40 రోజుల క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతులకు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటన
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ఎస్బీఐ

సైన్స్ అండ్ టెక్నాలజీ భూ అధ్యయనానికి నాసా ‘గోల్డ్ మిషన్’
Current Affairs భూ వాతావరణం, అంతరిక్షం కలిసే చోట వాతావరణ పొరల్లోని మార్పుల్ని క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు అంతరిక్ష సంస్థ నాసా తొలిసారి ప్రత్యేక మిషన్‌ను అంతరిక్షంలోకి పంపింది. ‘ద గ్లోబల్ స్కేల్ అబ్జర్వేషన్‌‌స ఆఫ్ ద లింబ్ అండ్ డిస్క్(గోల్డ్)’గా పిలిచే ఈ మిషన్‌ను ఫ్రెంచ్ గయనాలోని కౌరు నుంచి ‘ఎస్‌ఈఎస్-13’ సమాచార ఉపగ్రహానికి అనుసంధానించి జనవరి 26న ప్రయోగించింది. భూ వాతావరణంలోని చిట్టచివరి పొరల్లో ఉష్ణోగ్రతలు, విద్యుదయస్కాంత క్షేత్రాల్లో మార్పుల్ని ఈ మిషన్ అంచనావేస్తుంది.
భూవాతావరణం, అంతరిక్షం కలిసే ఈ ప్రాంతంలో విద్యుదయస్కాంత అణువులతో కూడిన అయనోస్పియర్, తటస్థ వాతావరణంతో కూడిన థర్మోస్పియర్‌లు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. జీపీఎస్ వ్యవస్థ, రేడియో సిగ్నల్స్నిప్రభావితం చేసే ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ‘గోల్డ్’ వ్యవస్థలో తగిన విధమైన ఏర్పాట్లు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూ అధ్యయనానికి ‘గోల్డ్ మిషన్’ ప్రాజెక్టు
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : నాసా
ఎందుకు : భూ వాతావరణంలోని చిట్టచివరి పొరల్లో ఉష్ణోగ్రతలు, విద్యుదయస్కాంత క్షేత్రాల్లో మార్పులని అంచనా వేసేందుకు

చైనాలో కృత్రిమ చంద్రుడిపై విద్యార్థుల పరిశోధన
చైనాకు చెందిన కొందరు విద్యార్థులు భూమిపై చంద్రుడిని పోలిన వాతావరణాన్ని కృత్రిమంగా ల్యాబ్‌లో సృష్టించి సుమారు 200 రోజుల పాటు అందులో గడిపారు. చైనాలోని బీహాంగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు యూగ్యాంగ్-1 పేరుతో సుమారు 160 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.
తొలుత అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు చొప్పున ల్యాబ్‌లోకి ప్రవేశించి 60 రోజుల పాటు చంద్రుడి వాతావరణంలో జీవించి బయటకు వచ్చారు. అనంతరం వీరి స్థానంలో మరో నలుగురు వలంటీర్లు ల్యాబ్‌లోకి ప్రవేశించి 200 రోజుల పాటు అందులోనే ఉన్నారు. వీరు ల్యాబ్‌లో ఉన్నప్పుడు బయట నుంచి ఎటువంటి సహాయం తీసుకోలేదని.. ఈ ప్రయోగంలో వలంటీర్లు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారని ప్రాజెక్టు ముఖ్య రూపకర్త లి హాంగ్ వెల్లడించారు. ల్యాబ్‌లో ఉన్న సమయంలో వలంటీర్లు స్వయంగా కూరగాయలు, పంటలను ఆహార వ్యర్థపదార్థాల సహాయంతో పండించుకున్నారని తెలిపింది. చంద్రుడిపైకి మనుషులను పంపి శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని భావిస్తున్న చైనాకు ఆ దేశ విద్యార్థులు చేసిన ప్రయోగం ఓ దిక్సూచిగా నిలవనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృత్రిమంగా సృష్టించిన చంద్రుడి వాతావరణ పరిస్థితులపై విద్యార్థుల పరిశోధన
ఎక్కడ : చైనాలో
ఎందుకు : చంద్రుడిపై మనుషులకు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా

సరస్ విమాన ప్రయోగం విజయవంతంబెంగళూరులోని నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఎల్) అభివృద్ధి చేసిన 14 సీట్ల సరస్ విమానాన్ని జనవరి 24న విజయవంతంగా పరీక్షించారు.

క్రీడలు ఐపీఎల్ - 2018 వేలంCurrent Affairs ఐపీఎల్ సీజన్ 11కు సంబంధించిన 2018 వేలం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఈ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గతేడాదిలాగే ఈ ఏడాదీ ఫ్రాంచైజీలన్నీ వేలంలో అతనిపైనే గాలం వేశాయి. మొత్తానికి రూ.12.50 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ వశమయ్యాడు స్టోక్స్. గతేడాది (రూ. 14.50 కోట్లు; పుణే)తో పోలిస్తే 2 కోట్లు తక్కువైనా... అప్పుడు ఇప్పుడు వేలంలో అగ్రస్థానం అతనికే లభించింది. ఇదే జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనాద్కత్‌ను రూ.11.5 కోట్లకు సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మనీశ్ పాండేను రూ.11 కోట్లకు దక్కించుకుంది.
2018 వేలంలో..
అమ్ముడుపోయిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య - 169
మొత్తం భారత ఆటగాళ్లు - 113
అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు - 56
మొత్తం విదేశీ ఆటగాళ్లు - 71
ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తం - రూ. 431 కోట్ల 70 లక్షలు

ఆస్ట్రేలియా ఓపెన్ విజేత రోజర్ ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొందడం ద్వారా 36 ఏళ్ల రోజర్ తన కెరీర్‌లో 20వ టైటిల్‌ను గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 40 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 63 లక్షలు)... రన్నరప్ మారిన్ సిలిచ్‌కు 20 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
200వ గ్రాండ్‌స్లామ్... 30వ ఫైనల్...
టెన్నిస్ చరిత్రలో ఇది 200వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఇందులో 30వ ఫైనల్ ఆడిన ఫెడరర్ 20వ టైటిల్ గెలవడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతనికిది ఆరో టైటిల్. దీంతో ఇది వరకే ఈ ఘనత సాధించిన జొకోవిచ్ (సెర్బియా), అలనాటి ఆసీస్ దిగ్గజం రాయ్ ఎమర్సన్‌ల సరసన నిలిచాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్
ఎప్పుడు : జనవరి 28
ఎక్కడ : మెల్‌బోర్న్
ఎవరు : విజేత రోజర్ ఫెడరర్

ఇండోనేషియా ఓపెన్ విజేత తై జు యింగ్ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ) గెలుచుకుంది. జనవరి 28న జరిగిన ఫైనల్లో తై జుయి యింగ్.. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా సైనాపై తై జు యింగ్‌కిది వరుసగా ఏడో విజయం. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 69 వేలు)... రన్నరప్ సైనాకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండోనేషియా ఓపెన్ మహిళల సింగిల్స్
ఎప్పుడు : జనవరి 28
ఎక్కడ : జకార్తా
ఎవరు : విజేత తై జు యింగ్

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కరోలిన్ వోజ్నియాకిఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను డెన్మార్ స్టార్ కరోలిన్ వోజ్నియాకి సొంతం చేసుకుంది. జనవరి 27న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా 11 ఏళ్ల తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్
ఎప్పుడు : జనవరి 27
ఎక్కడ : మెల్‌బోర్న్
ఎవరు : విజేత కరోలిన్ వోజ్నియాకి

టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికాభారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. జొహన్నెస్‌బర్గ్‌లో జనవరి 27న ముగిసిన మూడో టెస్టును భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 2-1 తేడాతో దక్షిణాఫ్రికా వశమైంది.

వార్తల్లో వ్యక్తులు ప్రముఖ నటీమణి కృష్ణకుమారి కన్నుమూత
తెలుగు చలనచిత్ర రంగంలో తన ముగ్ధ మనోహర రూపంతో, అద్వితీయ నటనా కౌశలంతో ప్రేక్షకులను కట్టిపడేసిన అలనాటి అందాల తార, ప్రముఖ నటీమణి కృష్ణకుమారి జనవరి 24న బెంగళూరులో కన్నుమూశారు. 1933, మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లోని నౌహతిలో కృష్ణకుమారి జన్మించారు. ఆమె భర్త ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక మాజీ ఎడిటర్ అజయ్ మోహన్ ఖైతాన్. ప్రముఖ నటీమణి షావుకారు జానకి కృష్ణకుమారికి స్వయానా సోదరి.
1951లో ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రం ద్వారా కృష్ణకుమారి తెరంగ్రేటం చేశారు. అనంతరం పల్లెపడుచు, బంగారు పాప, ఇలవేల్పు, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర సీమపై చెరగని ముద్ర వేశారు. ఆమె నటనా కౌశలానికి మూడుసార్లు జాతీయ అవార్డు, రాష్ట్ర స్థాయి నంది అవార్డు, కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు వరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ నటి కృష్ణకుమారి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 24
ఎక్కడ : బెంగళూరులో

దాణా మూడో కేసులోనూ దోషిగా తేలిన లాలూదాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జనవరి 24న దోషిగా తేల్చింది. లాలూతోపాటు మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కూడా దోషేనని పేర్కొన్న కోర్టు..వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. వీరు ఒక్కోసారి 5 లక్షల రూపాయలను రెండు దఫాల్లో చెల్లించొచ్చు. జరిమానా కట్టని పక్షంలో వారు మరో ఏడాది సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 1992-93 మధ్య కాలంలో చాయ్‌బాసా ఖజానా నుంచి రూ. 37.62 కోట్లను వీరు అక్రమంగా కాజేసినట్లు గుర్తించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎస్ ప్రసాద్.. ఇదే కేసులో మరో 50 మందిని కూడా దోషులుగా తేల్చారు.

బెంగాలీ నటి సుప్రియా దేవి కన్నుమూత బెంగాలీ ప్రముఖ నటి సుప్రియా దేవి(85) జనవరి 26న కన్నుమూశారు. రిత్విక్ ఘటక్ దర్శకత్వం వహించిన ‘మేఘే ఢాకా తారా’ చిత్రంలో నీతా అనే పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. 1933లో మిచ్‌కినాలో జన్మించిన సుప్రియా దేవి 1952లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 55 ఏళ్లు ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో చౌరింగీ, బాగ్ బందీ ఖేలా, సన్యాసి రాజ్, దేబ్‌దాస్ లాంటి క్లాసిక్ చిత్రాలున్నాయి. 2007లో విడుదలైన నేమ్‌సేక్ చిత్రంలో చివరిసారి నటించారు. దేవికి పద్మశ్రీ అవార్డుతో పాటు బెంగాల్ ప్రభుత్వ పౌర పురస్కారం బంగా విభూషణ్ లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ బెంగాలీ నటి సుప్రియా దేవి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 26
ఎక్కడ : కోల్‌కతా

దేశంలో తొలి మహిళా ఇమామ్‌గా జమిథా
Current Affairs ఇటీవల దళితుల్ని ఆలయాల్లో పూజారులుగా నియమించిన కేరళలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ శుక్రవారం(జనవరి 26) ప్రార్థనల(జుమ్మా నమాజ్)కు ఇమామ్‌గా వ్యవహరించింది. మలప్పురంలోని ఖురాన్ సున్నత్ సొసైటీ కార్యదర్శి జమిథా(34) తమ సంస్థ కార్యాలయంలో శుక్రవారం నమాజ్‌కు నేతృత్వం వహించారు. ఈ ప్రార్థనలకు పలువురు మహిళలు సహా 80 మంది హాజరయ్యారు. ఈ విషయమై జమిథా స్పందిస్తూ.. పవిత్ర ఖురాన్ పురుషులు, స్త్రీల మధ్య ఎలాంటి వివక్ష చూపదని చెప్పారు. మహిళలు ఇమామ్ కాకూడదని ఖురాన్‌లో ఎక్కడా లేదని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి మహిళా ఇమామ్
ఎప్పుడు : జనవరి 26
ఎక్కడ : కేరళ
ఎవరు : జమిథా

విదేశాంగ కార్యదర్శిగా విజయ్ గోఖలేవిదేశాంగ నూతన కార్యదర్శిగా చైనా వ్యవహారాల్లో నిపుణుడైన 1981 ఐఎఫ్‌ఎస్ అధికారి విజయ్ కేశవ్ గోఖలే జనవరి 29న బాధ్యతలు చేపట్టారు. భారత్ - చైనాల మధ్య నెలకొన్న డోక్లామ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అమెరికా-భారత్ పౌర అణు ఒప్పందంతో పాటు ఇండియా-చైనాల మధ్య నెలకొన్న డోక్లామ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించిన విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ జనవరి 28న పదవీవిరమణ చేశారు. మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న జైశంకర్.. గత నాలుగు దశాబ్దాల్లో అత్యధిక కాలం విదేశాంగ కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రధాని మోదీ 2015, జనవరి 28న విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశాంగ కార్యదర్శిగా విజయ్ గోఖలే
ఎప్పుడు : జనవరి 29
ఎందుకు : జనవరి 28న పదవీ విరమణ చేసిన ఎస్.జైశంకర్

‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇద్దరు భారతీయులు అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (యూఎస్‌పీటీఓ) ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్వెస్టర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్‌కు చెందిన ప్రొఫెసర్ ఆరోగ్యస్వామి జోసెఫ్ పాల్‌రాజ్, సుమితా మిత్రాలకు చోటు దక్కింది. అత్యంత వేగంగా డేటాను ట్రాన్‌‌సమిట్ చేయడంతో పాటు స్వీకరించేలా వైర్‌లెస్ టెక్నాలజీని రూపొందించినందుకు పాల్‌రాజ్ ఈ ఘనత సాధించారు. నానో కాంపోజిట్ డెంటల్ మెటీరియల్ అభివృద్ధికి కృషి చేసినందుకు సుమితా మిత్రాకు ఈ గౌరవం లభించింది. మే 3న వాషింగ్టన్‌లో ఈ అవార్డును పాల్‌రాజ్, సుమితాలకు అందిస్తారు.

వ్యవసాయ శాస్త్రవేత్త గురు చరణ్ సింగ్ మృతిప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త గురు చరణ్ సింగ్ కల్కట్(92) జనవరి 27న చండీగఢ్‌లో మరణించారు. పంజాబ్ హరిత విప్లవంలో కీలకపాత్ర పోషించిన కల్కట్.. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

ది టాల్ మ్యాన్ పుస్తకావిష్కరణఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్‌పై గణేశన్ రాసిన ‘ది టాల్ మ్యాన్’ పుస్తకాన్ని జనవరి 27న భువనేశ్వర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.

అవార్డులు పద్మ పురస్కారాలు - 2018
Current Affairs2018 సంవత్సరానికి 85 మంది పేర్లతో పద్మ అవార్డుల (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) జాబితాను జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మ్యూజిక్ మేో్ట్ర ఇళయరాజా, హిందుస్తానీ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా ఖాన్, వివేకానంద కేంద్రం (కన్యాకుమారి) అధ్యక్షుడు పరమేశ్వరన్‌లు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2009లో ఇళయరాజా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.
పద్మ భూషణ్ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బిలియర్డ్స్ ప్రపంచ చాంపియన్ పంకజ్ అడ్వాణీ, గోవా చిత్రకారుడు లక్ష్మణ్ పాయ్, ఆధ్యాత్మికవేత్త ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్, పురాతత్వవేత్త రామచంద్రన్ నాగస్వామిసహా తొమ్మిది మంది ఉన్నారు. సామాజికసేవ, ప్రజాసంబంధాలు, ఇంజనీరింగ్, వాణిజ్య, విద్య, వైద్య, సాహిత్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలందించిన 73 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
ఈ అవార్డుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఒక్కరే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో 16 మంది విదేశీ, ఎన్నారై ప్రతినిధులున్నారు. ఇందులో ముగ్గురికి మరణానంతరం పద్మ అవార్డులు ప్రకటించారు. భారత్‌లో రష్యా రాయబారిగా పనిచేసిన అలెగ్జాండర్ కడాకిన్‌కు (మరణానంతర) పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది.
పద్మ విభూషణ్ విజేతలు

పేరురంగంరాష్ట్రం
ఇళయరాజాసంగీతంతమిళనాడు
గులాం ముస్తఫాఖాన్సంగీతంమహారాష్ట్ర
పరమేశ్వరన్ పరమేశ్వరన్సాహిత్యం, విద్యారంగంకేరళ


పద్మ భూషణ్ విజేతలు: 

పేరురంగంరాష్ట్రం
మహేంద్ర సింగ్ ధోనీక్రీడలు(క్రికెట్)జార్ఖండ్
పంకజ్ అడ్వాణీక్రీడలు(బిలియర్డ్స్)కర్ణాటక
ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్ఆధ్యాత్మికంకేరళ
అలెగ్జాండర్ కడాకిన్ప్రజాసంబంధాలురష్యా(మరణానం తర/విదేశీ)
రామచంద్రన్ నాగస్వామిపురాతత్వ విభాగంతమిళనాడు
వేదప్రకాశ్ నందసాహిత్యం, విద్యారంగంఅమెరికా
లక్ష్మణ్ పాయ్కళారంగంగోవా
అరవింద్ పారిఖ్సంగీతంమహారాష్ట్ర
శారదాసిన్హాసంగీతంబిహార్


పద్మశ్రీ విజేతలు: 

పేరురంగంరాష్ట్రం
అభయ్ భంగ్వైద్యంమహారాష్ట్ర
రాణి బంగ్వైద్యంమహారాష్ట్ర
దామోదర్ గణేశ్ బాపత్సామాజిక సేవఛత్తీస్‌గఢ్
ప్రఫుల్ల గోవింద బారాహ్సాహిత్యం, పాత్రికేయంఅస్సోం
మోహన్ స్వరూప్ భాటియాసంగీతంఉత్తరప్రదేశ్
సుధాన్షు బిశ్వాస్సామాజిక సేవపశ్చిమ బెంగాల్
మిరాబాయి చానుక్రీడలుమణిపూర్
శ్వామ్‌లాల్ చతుర్వేదిసాహిత్యం, పాత్రికేయంఛత్తీస్‌గఢ్
ఎల్ సుబదాని దేవికళలు-నేతమణిపూర్
సోమ్‌దేవ్ దేవర్‌మాన్క్రీడలు-టెన్నిస్త్రిపుర
యషి ధోడెన్వైద్యంహిమాచల్ ప్రదేశ్
అరుప్ కుమార్ దత్తసాహిత్యం, విద్యఅస్సోం
డాదరరంగే గౌడకళలు-గేయ రచనకర్ణాటక
అరవింద్ గుప్తసాహిత్యం, విద్యమహారాష్ట్ర
దిగంబర్ హందాసాహిత్యం, విద్యజార్ఖండ్
అన్వర్ జలాల్పురి (మరణానంతరం)సాహిత్యం,విద్యఉత్తరప్రదేశ్
పియాంగ్ టెంజిన్ జామిర్సాహిత్యం, విద్యనాగాలాండ్
సితవ్వ జొద్దాటిసామాజిక సేవకర్ణాటక
మల్తీ జోషిసాహిత్యం,విద్యమధ్యప్రదేశ్
మనోజ్ జోషికళలు - నటనమహారాష్ట్ర
రామేశ్వర్లాల్ కబ్రావ్యాపారంమహారాష్ట్ర్ర
పాన్ కిషోర్ కౌల్కళలుజమ్ము కశ్మీర్
విజయ్ కచ్లుకళలు - సంగీతంపశ్చిమ బెంగాల్
లక్ష్మికుట్టివైద్యంకేరళ
జోయ్ శ్రీగోస్వామిసాహిత్యం,విద్యఅస్సోం
నారాయణ్ దాస్ మహారాజ్ఆధ్యాత్మికంరాజస్థాన్
ప్రవాకర మహారాణాశిల్ప కళఒడిషా
జవేరిలాల్ మెహతాసాహిత్యం, విద్యగుజరాత్
కృష్ణ బీహారీ మిశ్రాసాహిత్యం,విద్యపశ్చిమబెంగాల్
సిసిర్ పురుషోత్తం మిశ్రాకళ - సినిమామహారాష్ట్ర
ఎంఎస్. సుభాసిని మిస్త్రీసామాజిక సేవపశ్చిమబెంగాల్
కేశవ్ రావుసాహిత్యం,విద్యమధ్యప్రదేశ్
నా నామమాల్యోగాతమిళనాడు
సులగిట్టి నరసమ్మసామాజిక సేవకర్ణాటక
విజయలక్ష్మీకళ- జానపద సంగీతంతమిళనాడు
గోవర్దన్ పనికాకళలు-నేతఒడిషా
బాబాని చరణ్ పట్నాయక్ప్రజా సంబంధాలుఒడిషా
ముర్లీకాంత్ పెటేకర్క్రీడలు-ఈతమహారాష్ట్ర
ఎం. రాజగోపాల్వైద్యంకేరళ
సాంపత్ రామ్టేకే (మరణానంతరం)సామాజిక సేవమహారాష్ట్ర
చంద్ర శేఖర్ రాత్సాహిత్యం,విద్యఒడిషా
రాథోర్సివిల్ సర్వీస్గుజరాత్
అమితావ రాయ్సైన్‌‌స అండ్ ఇంజినీరింగ్పశ్చిమబెంగాల్
ఆర్ సత్యనారాయణకళలుకర్ణాటక
పంకజ్ ఎం షావైద్యంగుజరాత్
భజ్జ శ్యాంకళలు-పెయింటింగ్మధ్యప్రదేశ్
మహారావు రఘువీర్ సింగ్సాహిత్యం,విద్యరాజస్థాన్
కిదాంబి శ్రీకాంత్క్రీడలు-బ్యాడ్మింటన్ఆంధ్రప్రదేశ్
ఇబ్రహీం సుతర్కళలు-సంగీతంకర్ణాటక
సిద్ధేశ్వర స్వామిజీఆధ్యాత్మికంకర్ణాటక
లెంటినో థాకర్సామాజిక సేవనాగాలాండ్
విక్రం చంద్ర ఠాకూర్సైన్స్ అండ్ ఇంజినీరింగ్ఉత్తరాఖండ్
రుద్రపట్నం నారాయణ స్వామికళలు-సంగీతంకర్ణాటక
థరంథన్ రుద్రపట్నం నారాయణ స్వామికళలు-సంగీతంకర్ణాటక
త్యాగరాజన్ నెయెన్ టీన్ థిన్ఆధ్యాత్మికంవియత్నాం
భగీరత్ ప్రసాద్ త్రిపాఠిసాహిత్యం,విద్యఉత్తరప్రదేశ్
రాజగోపాలన్ వాసుదేవన్సైన్స్ అండ్ ఇంజినీరింగ్తమిళనాడు
మనస్ బిహారీ వర్మసెన్స్ అండ్ ఇంజినీరింగ్బిహార్
పనతవేనే గంగాధర్సాహిత్యం, విద్యమహారాష్ట్ర
రోములస్ విటేకర్జంతు సంరక్షణతమిళనాడు
బాబా యోగేంద్రకళలుమధ్యప్రదేశ్
ఎ జాకియాసాహిత్యం, విద్యమిజోరం


పద్మశ్రీకి ఎంపికైన విదేశీయులు

జోస్ మా జోయ్వ్యాపారంఫిలిప్పీన్స్
బౌన్లాప్ కీకోంగ్నఆర్కిటెక్చర్లావోస్
రామ్లీ బిన్ ఇబ్రహీంకళలు-నృత్యంమలేషియా
టామీ కోప్రజాసంబంధాలుసింగపూర్
హన్ మెనీప్రజా సంబంధాలుకంబోడియా
నౌఫ్ మర్వాయ్యోగాసౌదీ అరేబియా
టోమియో మిజోకిమిసాహిత్యం,విద్యజపాన్
సోమ్డెట్ ఫ్రా మహాఆధ్యాత్మికంథాయిలాండ్
డా. థాంట్ మైఇంట్ - యుప్రజా సంబంధాలుమయన్మార్
ఐ న్యామన్ నౌటాశిల్పకళఇండోనేషియా
మాలై హాజీ అబ్దుల్లా బిన్ మాలయ్ హజి ఓథ్‌మన్సామాజిక సేవబ్రూనే, దారుస్సలాం
హబీబుల్లో రాజాబోవ్సాహిత్యం, విద్యతజికిస్తాన్
సందుక్ రూట్వైద్యంనేపాల్
పీడీఎఫ్ కోసం క్లిక్ చేయండి 

795 మంది పోలీసు అధికారులకు పతకాలుగణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 795 మంది పోలీసు అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. ఇందులో 107 మంది అధికారులకు శౌర్య పతకాలు, 75 మందికి రాష్ట్రపతి పతకాలు, 613 మంది అధికారులకు విశిష్ట సేవా పతకాలు దక్కాయి.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురికి శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు, 13 మందికి విశిష్ట సేవా పతకాలు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు, 14 మందికి విశిష్ట సేవా పతకాలు దక్కాయి.

జ్యోతి ప్రకాశ్ నిరాలాకు ‘అశోక్ చక్ర’ ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడైన వైమానిక దళం గరుడ్ కమాండో జ్యోతి ప్రకాశ్ నిరాలాకు కేంద్రం ‘అశోక్ చక్ర’ పురస్కారాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 390 మందికి రాష్ట్రపతి సాహస పురస్కారాలను ప్రకటించారు. కీర్తి చక్ర పురస్కారాన్ని మేజర్ విజయంత్ బిస్త్‌కు ప్రకటించారు. ప్రకటించిన పురస్కారాల్లో.. 14 శౌర్య చక్ర, 28 పరమ్ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్‌‌ధ సేవా పతకాలు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించిన 27 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రకటించారు.

బ్రూనో మార్స్‌కు ఆరు గ్రామీ అవార్డులు గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో ఈ ఏడాది బ్రూనో మార్స్ ఆరు గ్రామీలను గెలుచుకొని టాపర్‌గా నిలిచాడు. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, రికార్డర్ ఆఫ్ ద ఇయర్, సాంగ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ ఆర్ అండ్ బీ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను బ్రూనో మార్స్ గెలుచుకున్నాడు. కెండ్రిక్ లామర్‌కు ఐదు గ్రామీలు దక్కాయి. ద వార్ ఆన్ డ్రగ్‌‌సకు బెస్ట్ రాక్ ఆల్బమ్ అవార్డు వచ్చింది. కెండ్రిక్ లామర్‌కు చెందిన డామ్ ఆల్బమ్‌కు బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ అవార్డు దక్కింది. న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జనవరి 29న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. బెస్ట్ సోలో పెర్ఫార్మెన్స్ కెటగిరీలో పాప్‌స్టార్ ఎడ్ షీరన్ గ్రామీ దక్కింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : గ్రామీ మ్యూజిక్ అవార్డులు - 2018
ఎప్పుడు : జనవరి 29
ఎక్కడ : బ్రూనో మార్స్‌కు ఆరు గ్రామీలు

షారుఖ్ ఖాన్‌కు క్రిస్టల్ అవార్డుప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ జనవరి 22న దావోస్‌లో 24వ క్రిస్టల్ అవార్డు అందుకున్నారు. భారత్‌లో మహిళలు, బాలల హక్కుల దిశగా షారుఖ్ చేస్తున్న సేవలను గుర్తించి వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్)ఈ పురస్కారం అందించింది. షారుఖ్‌తోపాటు మ్యుజీషియన్ ఎల్టన్‌జాన్, హాలీవుడ్ నటి కేట్ బ్లాంచెట్‌లకు ఈ అవార్డు దక్కింది. బ్లాంచెట్ శరణార్థుల పరిరక్షణకు కృషి చేయగా; ఎల్టన్ జాన్ ఎయిడ్స్ పౌండేషన్‌లో పనిచేశారు. ఈ అవార్డును సామాజిక సేవలో పాల్గొంటున్న కళాకారులకు అందిస్తారు.