AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday, 23 January 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 6 2018


*🔥IMP SCIENCE BITS🔥*                
Q.  ఏ లక్షణం వల్ల నీటిని మంచి ద్రావణిగా వ్యవహరిస్తున్నారు?
జ: అయనీకరణ సామర్థ్యం

Q   . నైట్రోలిమ్ రసాయన ఎరువులో ఉండేవి-
జ: కాల్షియం కార్బైడ్, నైట్రోజన్

Q   . బుల్లెట్‌ప్రూఫ్ స్క్రీన్‌లలో ఉపయోగించే గాజు ఏది?
జ: రెయిన్‌ఫోర్స్‌డ్ గాజు

Q   . సిమెంట్ సెట్టింగ్ చర్యను భంగపరచడానికి ఉపయోగించే పదార్థమేది?
జ: CaSO. 2 HO

Q   . పొటాషియం నైట్రేట్, పొడి బొగ్గు, సల్ఫర్ మిశ్రమాన్ని ఏమంటారు?
జ:  గన్ పౌడర్

Q   . రసాయన మార్పు కానిది-
జ: సముద్ర జలం నుంచి టేబుల్ సాల్ట్ స్ఫటీకీకరణం

Q   . అత్యధిక సాంద్రత  దేనికి  ఉంటుంది?
జ: నీరు

అత్యంత మృదువైన మూలకం ఏది?
జ:  సోడియం

Q   .  వజ్రం ఒక-
జ: మూలకం

Q   . శుద్ధమైన పంచదారలో ఉండని మూలకమేది?
జ: నైట్రోజన్

Q   . అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించేది?
జ: ఎర్ర భాస్వరం

Q   . ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లో ఉండే లోహం ఏది?
జ: కాల్షియం

Q   .అలోహాల్లో అథమ విద్యుద్వాహకం కానిది?
జ: సెలీనియం 

Q   . ఏ గాజుకు ఉష్ణ నిరోధకం ఎక్కువ?
జ:  పైరెక్స్ గ్లాస్

Q. సబ్బులంటే ఏమిటి?
జ: భారీ ఫాటీ ఆమ్లాల సోడియం

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

*🌹సుభాషిత వాక్కు*

*"నమ్మకం లేనిచోటమనం ఎన్ని చెప్పినా,   అది అబద్ధంలాగే కనిపిస్తుంది."*

*"Dreams and beliefs to humans are like fuel and oil to an automobile. One generates movement and the other makes it fast.."*

 *❤మంచి పద్యం*

*పలుమఱు సజ్జనుండు ప్రియభాషలునల్కుఁ గఠోరవాక్యముల్‌*
*పలుకఁ డొకానొకప్పు డవి పల్కినఁ గీడునుగాదు నిక్కమే*
*చలువకు వచ్చి మేఘుఁ డొకజాడను దావడగండ్ల రాల్చినన్‌*
*శిలలగునోటు వేగిరమె శీతలనీరము గాక భాస్కరా!*

*💜భావం:*

*మంచివాడు ఎప్పుడూ కఠినంగా మాట్లాడడు. ఒకవేళ పరుల మేలుకొరకు మాట్లాడినా, అవి వినటానికి మాత్రం కఠోరాలుగా ఉనా, మంచి చేకూర్చేవే అగునుగానీ, కీడును చేయవు. మేఘం చల్లదనం కొరకు వడగండ్లను కురిపించినా, అవి వెంటనే నీరైపోవునుగానీ, రాళ్లు కావు గదా!*

*🔥నేటి జీ కె*

*దేశాలు-జాతీయ క్రీడలు*

1. *అమెరికా-బేస్ బాల్*

2. *స్పెయిన్-బుల్ ఫైట్*

3. *కెనడా-లాక్రోస్*

4. *జపాన్-జూడో*

5. *చైనా-టేబుల్ టెన్నిస్*

6. *భారత్,పాకిస్తాన్-హాకీ*

7. *ఇంగ్లాండ్-క్రికెట్,రగ్బి,ఫుట్ బాల్*

8. *ఆస్ట్రేలియా-క్రికెటర్,టెన్నిస్*

9. *స్కాట్లాండ్-రగ్బి,ఫుట్ బాల్*

10. *మలేషియా-బ్యాడ్మింటన్*

11. *రష్యా-చెస్*

*💎 నేటి ఆణిముత్యం 💎*

అలుపెరుంగక ధనము నెంతైన పేర్చి
దాని నరకొరగా ఖర్చు తడవు సేసి
మూటలను గట్టి పలుమార్లు మురిసిపోవ
నిహపరంబుల సౌఖ్యంబు లెట్లు కల్గు?

*భావము :*

విశ్రాంతి తీసుకోకుండా అధికంగా ధనం సంపాదించి దానిలో కొంత మాత్రం ఖర్చు చేసి మిగిలినది మూటకట్టి, దాన్ని చూసి మురిసిపోతుంటే ఈ లోకంలోను, పరలోకంలోను సుఖాలుండవు.

 *👬 నేటి చిన్నారి గీతం 👬*

*కిచ కిచ పిచ్చుక*

కిచ కిచ పిచ్చుక 
కిలాడి పిచ్చుక 
కిటికీగుండా దూరింది 
ఇంటి లోపలికి చేరింది...
కిచ కిచ పిచ్చుక
కిలాడి పిచ్చుక 
బల్ల మీద ఉన్నది అద్దం
చూడదలచినది తన అందం...
కిచ కిచ పిచ్చుక 
కిలాడి పిచ్చుక 
అద్దం లోపల చూసుకొన్నది
అక్కడ ఇంకో పిచ్చుకున్నది...
కిచ కిచ పిచ్చుక 
కిలాడి పిచ్చుక 
ఎక్కడి దింకో పిచ్చుక అంటూ
ముక్కుతో పోటు పొడిచింది...
కిచ కిచ పిచ్చుక 
కిలాడి పిచ్చుక 
అద్దం ముక్క లయ్యింది
పిచ్చుక పారిపోయింది.

*✍🏼 నేటి కథ ✍🏼*

*నేను కొనబోయే ఆవు కథ*

పేరొందిన హాస్య కళా మూర్తి గోపాల్ భాండ్ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో, ఆయన ఇంటి ప్రక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు. ఆ భార్యాభర్తలిద్దరికీ, పాపం, పగటి కలలు కనే అలవాటు ఉండేది. ఒక రోజున గోపాల్ భాండ్ వింటుండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళను మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనటం మొదలు పెట్టారు.

భర్త అన్నాడు: " నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే, నేనొక ఆవును కొంటాను" అని.

భార్య శృతి కలిపింది- "అప్పుడు నేను పాలు పిండుతాను. మనకు చాలా కుండలు అవసరమౌతాయి మరి. నేను వెళ్ళి, కొన్ని కుండలు కొనుక్కురావాలి" అని.

మర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్లి కుండలు కొనుక్కొచ్చింది. భర్త ఆమెను అడిగాడు: " ఏం కొనుక్కొచ్చావు?" అని.

"ఏముంది? కుండలు! ఒకటి పాలకు, ఒకటి మజ్జిగకు, ఒకటి వెన్నకు, ఒకటి నెయ్యికి!" అన్నది భార్య.

"బాగుంది, బాగుంది. మరి ఇంక ఆ ఐదో కుండ దేనికి?‌" అడిగాడు భర్త.

"మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలికి ఇవ్వటం కోసం ఈ ఐదో కుండ!‌" అన్నది భార్య.

"ఏంటీ!? మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా?! ఎంతకాలంగా చేస్తున్నావు, ఈ పని? నాకు కనీసం చెప్పకుండా, నా అనుమతి లేకుండా, ఇంత నాటకం ఆడుతున్నావా?" అని భర్త అరుస్తూ, కోపం పట్టలేక కుండల్ని విసిరేసి, అన్నింటినీ పగలగొట్టేశాడు.

ఇక భార్య తిరగబడింది- " ఆవు ఆలనా, పాలనా చూసేది నేను! పాలు పిండేది నేను! మిగులు పాలతో‌నాకేది ఇష్టమైతే అది చేస్తాను!" అని.

"దుర్మార్గురాలా! నేను రాత్రింబవళ్ళూ చెమటోడ్చి పనిచేసి, డబ్బులు కూడబెట్టి, ఆవును కొంటే, ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలికి పోసేస్తావా? ముందు నిన్నేం చేస్తానో చూడు" అని గర్జిస్తూ, భర్త తన చేతికందిన మూకుళ్లనూ, గిన్నెల్నీ భార్య మీదికి విసిరేశాడు.

ఇంట్లోంచి వింటున్న గోపాల్ భాండ్ కి చాలనిపించింది. అతను పక్కింటికెళ్ళి అడిగాడు అమాయకంగా- "ఏమైంది? వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారు?" అని.

" మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి, ఈమె తన చెల్లెలికి పోసేస్తోంది!" అన్నాడు భర్త.
"మీ ఆవా?!" అడిగాడు గోపాల్ భాండ్.
"అవును. తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు!"
"ఓహో, ఆ ఆవా? మీకు ఈరోజున ఇంకా ఆవు లేదు, కదూ?" అడిగాడు గోపాల్.
భర్త అన్నాడు- " చూస్తూండు. ఎప్పటినుండో అనుకుంటున్నాను. నేనొకదాన్ని తెస్తున్నాను త్వరలో" అని.

"ఓహో ఇప్పుడు అర్థమైంది, నా కూరగాయల తోట ఎప్పుడూ నాశనం ఎందుకౌతున్నదో!" అని గోపాల్ అకస్మాత్తుగా ఓ చింత బరికె చేతపుచ్చుకొని అతని మీదికి ఉరికాడు.

"ఆగు..ఆగు... నన్నెందుకు కొడుతున్నావు?" అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కింటాయన.

"నీ ఆవు! నీ ఆవు మా తోటలోకి జొరబడి, నా చిక్కుళ్ళనీ, దోసపాదుల్నీ ఇష్టం వచ్చినట్లు నమిలేస్తోంది. నువ్వు దాన్ని అట్లా వదిలేశావు!" అని చిందులేశాడు గోపాల్.
"ఏ చిక్కుళ్ళూ, ఏ దోస పాదులు? నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు?"

"నేను నాటబోతున్న చిక్కుళ్ళూ, నేను పెట్టబోతున్న దోసపాదులు! నేను పెంచబోతున్న కూరగాయల తోట! నేను ఎంతో కాలంగా దాన్ని గురించి ఆలోచిస్తుంటే, మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తోంది దాన్ని!" అన్నాడు గోపాల్ ఊపిరి బిగబట్టి.

పొరుగింటివాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నై. కలలన్నీ విరిగి, ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు. ఆపైన కొద్ది సేపటికి అందరూ కలిసి నవ్వుకున్నారు. 

 *📖 మన ఇతిహాసాలు 📓*

*బభ్రువాహనుడు*

బభృవాహనుడు అర్జునుడు మరియు మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు.

అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి అయిన చిత్రవాహనునికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రవాహనుడు చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.

కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు అర్జునునికి ఎదురేగి పాదాభివందనము చేసాడు. అర్జునునికి తన కుమారుడు వీరుని వలే ఎదిరించకుండా లొంగిపోవుట నచ్చక "వీరపుత్రులు యుద్ధమునకు వెనుకాడరు" అని పల్కాడు. బభృవాహనుడు తన తండ్రి మాటలకు కుంగిపోయి తన రాజధానికి చేరాడు. ఆ విషయము తెలుసుకొన్న అర్జునుని భార్య అయిన కౌరవ్యుడు కుమార్తె ఉలూచి బభృవాహనుడు వద్దకు వచ్చి యుద్ధము చేసి తండ్రిని సంతోషపెట్టమని చెప్పింది. అంతట సకల సైన్యముతో బభృవాహనుడు అర్జునునిపై దండెత్తాడు. ఆ యుద్ధములో అర్జునుని బాణమునకు బభృవాహనుడు మూర్చపోయినాడు. కాని బభృవాహనుడు మూర్చపోక ముందు ప్రయోగించిన బాణము అర్జునుని రొమ్ములో గ్రుచ్చుకుని అర్జునుని ప్రాణం తీసింది. ఈ విషయము తెలిసి చిత్రాంగద మరియు ఉలూచి రణరంగమునకు వచ్చారు. అంతలో బభృవాహనుడు మూర్చనుంచి తేరుకుని లేచి తండ్రి మరణించాడని తెలుసుకుని హతాశుడై ఉలూచిని దుర్భాషలాడి, ప్రాయోపవేశము చేసి ప్రాణాలు విడుచుటకు సిద్దమయ్యాడు. అప్పుడు ఉలూచి బభృవాహనునికి సంజీవనిమణిని ఇచ్చి అర్జునునిగుండెలపై ఉంచమని చెప్పింది. అర్జునుడు తిరిగి బ్రతికాడు. ఉలూచి వారికి కురుక్షేత్ర సంగ్రామంలోఅర్జునుడు భీష్ముని (ఎనిమిదవ వసువు అవతారం) చంపుట వల్ల వసువులు ఇచ్చిన శాపం గురించి వివరించింది.

*👸🏻👩🏻‍⚖ స్ఫూర్తినిచ్చే మగువలు👩🏻‍✈👩🏻‍🎓*

*కోనేరు హంపి*

ఫైడ్ ఎలో రేటింగ్లో 2600 పాయింట్లను దాటి భారతదేశం నుండి ఈ ఘనత సాధించిన తొలి చెస్ క్రీడాకారిణిగా నిలిచిన కోనేరు హంపి 1987, మార్చి 31న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాకుండా మొత్తం గ్రాండ్ మాస్టర్లలోనే అతి పిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది హంపి అరుదైన రికార్డు సృష్టించింది. కేలవం 15 సంవత్సరాల 1 నెల, 27 రోజుల వయస్సులోనే హంపి ఈ ఘనత సాధించింది.ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన తండ్రి (కోనేరు అశోక్) ద్వారా హంపికి చదరంగం ఆట పరిచయమైయింది. 1995లో 8 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి నాలుగవ స్థానం కైవసం చేసుకోగానే, ఆమె ప్రతిభని గుర్తించిన ఆమె తండ్రి అశోక్ తన ఉద్యోగాన్ని మానివేసి హంపికి పూర్తి స్థాయి శిక్షకునిగా మారారు. చదరంగంలో హంపి చూపించిన విశేష ప్రతిభకు గుర్తింపుగా 2007లో భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది

*✅ తెలుసుకుందాం ✅*

*⭕చేపలు తలకిందులవుతాయేం?*

✳ఏ ప్రాణి చనిపోయిన తర్వాతైనా దాని శరీరం నిండా వాయువులు ఉత్పన్నమవుతాయి. చేపల్లో కూడా ఇలాగే జరుగుతుంది. తేలికైన ఈ వాయువుల కారణంగానే చనిపోయిన చేపలు నీటిపైన తేలుతాయి. వాయువులు ముఖ్యంగా చేపల కిందివైపు ఉండే ఉదరభాగంలో ఉత్పన్నమవుతాయి. ఫలితంగా ఉదరభాగం ఉత్ల్పవన (buoynacy) ప్రభావానికి గురవుతుంది. చేపల గరిమనాభి (centre of gravity) ఉదర భాగంలో కేంద్రీకరించి ఉండడంతో ఆ భాగం నీటి ఉపరితలానికి చేరుకుంటుంది. అందువల్లనే చనిపోయిన చేప తలకిందులై వెల్లకిలా తేలుతుంది. తర్వాత కొంత కాలానికి చనిపోయిన చేప విఘటనం (decay) చెంది దాని లోని వాయువులన్నీ విడుదలవడంతో అది నీటిలో మునిగిపోతుంది.

 *💥8 నుంచి సౌత్ ఇండియా సైన్స్‌ఫేర్*

🔷పాల్గొననున్న ఆరు రాష్ట్రాల విద్యార్థులు

🔷హాజరుకానున్న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

🔷పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ వెల్లడి

♦ హైదరాబాద్‌లో ఈ నెల 8 నుంచి 12 వరకు సౌత్ ఇండియా సైన్స్‌ఫేర్ (ఎస్‌ఐఎస్‌ఎఫ్)ను ఘనంగా నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు.

 ♦సికింద్రాబాద్‌లోని సెయింట్ ప్యాట్రిక్స్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ఈ సైన్స్‌ఫేర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభిస్తారని, ముగింపు కార్యక్షికమానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హాజరవుతారని చెప్పారు. సైన్స్‌ఫేర్‌లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి 650 మందికి పైగా విద్యార్థులు, 200 మంది వాలంటీర్లు పాల్గొంటారని పేర్కొన్నారు.

♦ ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 50 చొప్పున 300 సైన్స్ విశేషాలతో ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆరోగ్యం, ఆహారభవూదత, వ్యర్థ్యాల నిర్వహణ, జలసంరక్షణ, రవాణా, కమ్యూనికేషన్, డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్, మ్యాథమెటికల్ మోడలింగ్ తదితర అంశాలపై వినూత్న ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. జాతీయస్థాయి సైంటిస్ట్‌లు కూడా హాజరవుతారన్నారు.

♦ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సైన్స్ ఫేర్‌ను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ పేర్కొన్నారు.

*🍀టీఆర్టీ దరఖాస్తుల సవరణకు తుదిగడువు 11*


🔷రేపటితో ముగియనున్న దరఖాస్తుల గడువు

♦ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ)కి దరఖాస్తుచేసిన అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు సవరించుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ వెల్లడించారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ సవరించుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

♦ గడువుతీరిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు ఆదివారంతో ముగుస్తున్న సంగతి తెలిసిందే.

*📚ఫిబ్రవరి 16 నుంచి ఎస్సెస్సీ ప్రీఫైనల్స్*

🔷ఏప్రిల్ 2 నుంచి 9 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు ..షెడ్యూళ్లు విడుదల చేసిన ఎస్సీఈఆర్టీ

♦ రాష్ట్రంలో పరీక్షల సీజన్ వచ్చేస్తున్నది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎస్సెస్సీ ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ నిర్ణయించింది. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు (1వ తరగతి నుంచి 9వ తరగతి) సమ్మెటివ్-2 పరీక్షలు జరుగనున్నాయి. 

♦ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బీ శేషుకుమారి శుక్రవారం షెడ్యూళ్లను విడుదల చేశారు. విద్యాక్యాలండర్ ప్రకారం పరీక్షల తేదీలను ప్రకటించామని ఉన్నతాధికారులు తెలిపారు.

*📚నెలలో ఒకరోజు ‘నో బ్యాగ్‌ డే’*

🔷పాఠశాల విద్యాశాఖ కసరత్తు

♦ పాఠశాల విద్యార్థుల బ్యాగుల మోతకు చెక్‌ పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ప్రతి నెలలో ఒకరోజు ‘నో బ్యాగ్‌ డే’ను అమలు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోంది.

♦ నో బ్యాగ్‌ డేపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఆ తర్వాత అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతోనూ చర్చించనున్నారు. వీలైతే ఒక బృందాన్ని కర్ణాటక రాష్ట్రానికి పంపి అక్కడ అమలవుతున్న తీరును కూడా పరిశీలించాలని నిర్ణయించింది. 

♦అన్నీ అనుకూలిస్తే.. 2018-19 లేదా.. 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. అయితే ఇప్పటికే స్కూల్‌ బ్యాగుల బరువును తగ్గించేందుకు గతేడాది జులై 18వ తేదీన జీవో నం. 22ను జారీ చేసిన విషయం తెలిసిందే.

♦ అయితే ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలు పట్టించుకోవడం లేదు. ఇందుకు కారణం క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోకపోవడమే పరిశీలకులు భావిస్తున్నారు. బ్యాగుల బరువు అటుంచి నెలలో ఒకరోజైనా బ్యాగుల మోతను తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ చేస్తున్న కసరత్తును ‘ప్రైవేటు’ సహకరిస్తోందో లేదో వేచి చూడాల్సిందే.

*🔷‘సర్కారీ’ విద్యార్థులు సూపర్‌!*

♦ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు.  డిసెంబర్‌ 21 నుంచి 23 వరకు వరంగల్‌లోని మడికొండలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 40 మంది విద్యార్థులు, టీచర్లు తమ సృజనాత్మక ప్రదర్శనలతో ప్రథ మ స్థానంలో నిలిచారు. వీరు ఈ నెల 8 నుంచి 12 వరకు సికింద్రాబాద్‌ సెయింట్‌ ప్యాట్రిక్‌ హైస్కూల్లో నిర్వహించే సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌లో తమ ప్రదర్శనలను ఉంచబోతున్నారు. 

♦ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు ఎగ్జిబిషన్‌లో ఉంటా యి. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను జాతీయ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌కు ఎంపిక చేయనున్నారు. 

♦ఒక్కో రాష్ట్రం నుంచి 50 ఆవిష్కరణలకు సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌లో ప్రదర్శనకు అవకాశం ఇచ్చామని, మొత్తం గా 300 ప్రదర్శనలు ఉంటాయని పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.శేషుకుమారి తెలిపారు.

*♦40 ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలవే..*
సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌లో రాష్ట్రం నుంచి పాల్గొనే 50 ప్రదర్శనల్లో 40 ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవి ఉండగా 10 ప్రదర్శనలు మాత్రమే ప్రైవేటు పాఠశాలలకు చెందినవి ఉన్నా యి. అలాగే 15 గ్రూపు ఎగ్జిబిట్స్‌లో 13 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులవే ఉన్నాయి.

*♦ప్రభుత్వ పాఠశాలలే మెరుగు..: బి.శేషుకుమారి*
ప్రైవేటు స్కూళ్లకంటే ప్రభుత్వ పాఠశాలలే మెరుగైనవని మరోసారి నిరూపితమైందని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ శేషుకుమారి పేర్కొన్నారు.

*నేటి మన టీ వి క్లాస్సెస్*

*తేదీ*:-- *06--01--2018* 
*శని వారము*

***********************************

*తరగతి*:- *10 వ*

*సబ్జెక్టు*:- *తెలుగు*

*విషయం*:- *భిక్ష- I*

*సమయం*:- *10.30 ని,,ల నుండి*

          ★★★★★★★

*తరగతి*:- *9 వ*

*సబ్జెక్టు*:- *హిందీ*

*విషయం*:- *ఆమర్ వాణి- 1*

*సమయం*:- *11.30ని,,

          ★★★★★★★

*తరగతి*:- *8 వ*

*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*

*విషయం*:- *సాంఘీక మాట -    సంస్కరణోద్యమాలు -1*

*సమయం*:- *2.00pm

          ★★★★★★★

*తరగతి*:- *7 వ*

*సబ్జెక్టు*:- *సామాన్యశాస్త్రం*

*విషయం*:- *విద్యుత్ ప్రవాహం*

*సమయం*:- *2.45 pm 

          ★★★★★★★

*తరగతి*:- *6 వ*

*సబ్జెక్టు*:- *ఇంగ్లీష్*

*విషయం*:- *పి టి ఉష -ద గోల్డెన్ గర్ల్ -1*

*సమయం*:- *3.40 pm

          ★★★★★★★
*త్వరలో ఎస్‌బీఐ కనీస నగదు నిల్వలపై  కీలక నిర్ణయం*

ముంబై : భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) కనీస నిల్వ నిబంధనలపై సమీక్షించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పట్టణాల్లోని ఎస్‌బీఐ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీసం రూ.3,000 ఉంచాలనే నిబంధన అమలవుతోంది. ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో ఈ నిబంధనలను సవరించేందుకు ఎస్‌బీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సగటు నిల్వను ప్రతి నెలా చూడటానికి బదులు మూడు నెలలకోసారి పరిశీలించేందుకు కూడా ఎస్‌బీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఎస్‌బీఐ 2017 ఏప్రిల్-నవంబరు మధ్య కాలంలో కనీస సగటు నిల్వను ఖాతాల్లో ఉంచలేకపోయిన ఖాతాదారుల నుంచి జరిమానా రూపంలో రూ.1,772 కోట్లు వసూలు చేసింది. పట్టణ ఖాతాదారులు ఒక్కొక్క ఖాతాలో నెలకు సగటున రూ.3,000 నిల్వ ఉంచాలని ఎస్‌బీఐ నిబంధన విధించిన సంగతి తెలిసిందే.

విశ్వసనీయ సమాచారం ప్రకారం నిర్దేశిత కనీస నిల్వను రూ.1,000కి తగ్గించాలని ఎస్‌బీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క ఖాతాలో ఉండవలసిన కనీస సగటు నిల్వ మొత్తాన్ని రూ.5,000కు జూన్‌లో పెంచింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిబంధనను సవరించింది. మెట్రో ఖాతాదారులు రూ.3,000, సెమీ అర్బన్ ఖాతాదారులు రూ.2,000, గ్రామీణులు రూ.1,000 ఉంచాలని ఆదేశించింది. దీనిని కూడా సవరించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

*✍10వ తేదీ నుంచి సెల్ట్ తరగతులు*

*❇హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 10వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ జె. సావిత్రి తెలిపారు. ఎ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గా పిలువబడే ఈ కోర్సుకు ఉదయం, సాయంత్రం వేర్వేరుగా తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండు నెలల కాలవ్యవధి గల ఈ కోర్సుకు రుసుమును రూ.4,000గా నిర్ణయించినట్లు చెప్పారు. ఓయూ విద్యార్థులు, ఉద్యోగుల, అనుబంధ కళాశాలల విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుందని చెప్పారు. ఇతర వివరాలకు 9652856107, 040-64575575, 27682354 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.*

*✍పాఠశాల అసెంబ్లీ కోసం*

                *సుభాషిత వాక్కు*

*"నమ్మకం లేనిచోటమనం ఎన్ని చెప్పినా,
  అది అబద్ధంలాగే కనిపిస్తుంది."*

*"Dreams and beliefs to humans are like fuel and oil to an automobile. One generates movement and the other makes it fast.."*

                    *మంచి పద్యం*

*పలుమఱు సజ్జనుండు ప్రియభాషలునల్కుఁ గఠోరవాక్యముల్‌*
*పలుకఁ డొకానొకప్పు డవి పల్కినఁ గీడునుగాదు నిక్కమే*
*చలువకు వచ్చి మేఘుఁ డొకజాడను దావడగండ్ల రాల్చినన్‌*
*శిలలగునోటు వేగిరమె శీతలనీరము గాక భాస్కరా!*

*భావం:*

*మంచివాడు ఎప్పుడూ కఠినంగా మాట్లాడడు. ఒకవేళ పరుల మేలుకొరకు మాట్లాడినా, అవి వినటానికి మాత్రం కఠోరాలుగా ఉనా, మంచి చేకూర్చేవే అగునుగానీ, కీడును చేయవు. మేఘం చల్లదనం కొరకు వడగండ్లను కురిపించినా, అవి వెంటనే నీరైపోవునుగానీ, రాళ్లు కావు గదా!*

*నేటి జీ కె*

*దేశాలు-జాతీయ క్రీడలు*

1. *అమెరికా-బేస్ బాల్*

2. *స్పెయిన్-బుల్ ఫైట్*

3. *కెనడా-లాక్రోస్*

4. *జపాన్-జూడో*

5. *చైనా-టేబుల్ టెన్నిస్*

6. *భారత్,పాకిస్తాన్-హాకీ*

7. *ఇంగ్లాండ్-క్రికెట్,రగ్బి,ఫుట్ బాల్*

8. *ఆస్ట్రేలియా-క్రికెటర్,టెన్నిస్*

9. *స్కాట్లాండ్-రగ్బి,ఫుట్ బాల్*

10. *మలేషియా-బ్యాడ్మింటన్*

11. *రష్యా-చెస్*

*✍స్కూళ్లలో నెలకోసారి నో బ్యాగ్‌ డే!*

*❇సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో నెలకు ఒకసారి విద్యార్థులు పుస్తకా లు లేకుండా బడికి వచ్చేలా ‘నో బ్యాగ్‌ డే’ను అమలు చేసే అంశాన్ని విద్యాశాఖ పరిశీలి స్తోంది. కర్ణాటకలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని భావిస్తోంది.*

*❇విద్యార్థుల బ్యాగు బరువును తగ్గించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ వాటి అమలుకు చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు, పాఠశా లల్లో పుస్తకాలను దాచుకునేలా ర్యాక్‌లను ఏర్పాటు చేయాలని కోరు తోంది. దానిపై ఇప్పటికే పలు ప్రైవేటు స్కూళ్లు చర్యలు చేపట్టాయని పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ పేర్కొన్నారు.*

*✍గురుకులాల్లో ‘భారత్‌ దర్శన్‌’*

*❇సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా, వారిలో విషయ పరిజ్ఞానం, వికాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు గురుకుల సొసైటీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచుకునే విధంగా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ‘భారత్‌ దర్శన్‌’పేరిట దేశంలోని ప్రఖ్యాత ప్రాంతాలు, ప్రముఖ స్థలాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించింది.  ఈ మేరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు  ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పించనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు  దీన్ని అమలు చేస్తోంది.*

*👉అవగాహన.. విశ్లేషణ..* 

*❇రాష్ట్రంలో ఉన్న సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1.35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో విశాల దృక్పథాన్ని అలవర్చాలనే ఉద్దేశంతో గురుకుల సొసైటీలు భారత్‌ దర్శన్‌ కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి. దీని ద్వారా మెరిట్‌ విద్యార్థులను బృందాలుగా విభజించి, సొసైటీ సొంత ఖర్చుతో నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్తారు. విద్యార్థులు అక్కడున్న సామాజిక పరిస్థితులు, ప్రాంతీయ అంశాలను పరిశీలించి, వాటిపై ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా మార్కులుండనప్పటికీ.. దీని వల్ల విద్యార్థుల్లో పరిశీలన, సృజనాత్మకత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.*

*👉ఏటా 400 మందికి అవకాశం..*

*ఈ కార్యక్రమం ద్వారా ఏటా 400 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ ద్వారా 200 చొప్పున ఈసారి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇటీవల 50 మంది విద్యార్థుల బృందం తమిళనాడు (చెన్నై సమీప ప్రాంతాలు) పర్యటనకు వెళ్లి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌–ఒడిశా, కర్ణాటక–కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్‌–గుజరాత్‌ రాష్ట్రాలకు మిగతా విద్యార్థులను పంపనున్నట్లు సాంఘిక సంక్షేమ     గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.*

*👉డిగ్రీ గురుకులాల్లో ప్రత్యేక సబ్జెక్టు...*

*❇రాష్ట్ర సామాజిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన ఉండాలని గురుకుల సొసైటీ భావిస్తోంది. ఈ మేరకు ‘అండర్‌స్టాండింగ్‌ తెలంగాణ’పేరిట గురుకుల డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో ప్రత్యేక సబ్జెక్టును పాఠ్యాంశంగా ప్రవేశపెట్టనుంది. ఈ కోర్సులో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, అవగాహన పెంచుకొని పరీక్షలు రాయాల్సి ఉంటుంది. త్వరలో ఈ కోర్సును ప్రవేశపెడతామని సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌  వెల్లడించారు.*

 *IMP GK BITS*

🖊1). చెమట ద్వారా ఏది బయటకు పోవటం వల్ల వేడి కొంకర్లు వస్తాయి ?

*జ: సోడియం క్లోరైడ్*

🖊2). కరిచింది ఏ విషపు పామో తెలియనపుడు రోగికి ఇచ్చే విరుగుడు ?

*జ: పాలీ వీనమ్* 

🖊3). పోలియో వంటి వ్యాధులలో వైరస్ చే నశింపబడే కణాలు?

*జ: చాలక నాడీ కణలు*

🖊4). దీర్ఘఘనం లో అంచుల సంఖ్య.?

*జ: 12*

🖊5). రైలు పట్టాలు వేటికి ఉదాహరణ ?

*జ: సమాంతర రేఖలు*

🖊6). వృత్త వ్యాసం ,వృత్త వ్యాసార్థానికి ఎన్ని రెట్లు?

*జ: 2 రెట్లు* 

🖊7). గడియారంలో సమయం ఉదయం  11 గంటలకు ముళ్ళ మద్య కోణం ఎంత?

*జ: 30 డిగ్రీలు*

🖊8). వృత్త వ్యాసార్దం 7 సెం.మీ 
అయిన వృత్త పరిది( చుట్టుకొలత) ?

*జ: 44 సెం.మీ* 

🖊9). కష్టసుఖాలు ఏ సమాసము?

ద్వంద్వ సమాసం 

🖊10). Observation dome రూపొందించింది?

*జ: గెసెల్*