AIMS Q FREE Study Materials
https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1
https://t.me/AIMSDARETOSUCCESS
www.aimsdaretosuccess.blogspot.com
www.aimsdts.blogspot.com
aimsdts.teachmint.in
aimsdaretosuccess@gmail.com
😂😂😂😂😂😂తెలుగు జోక్స్ Telugu Jokes 😂😂😂😂😂😂








సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు,కానీ మనం(జింకలు) 21రోజులు బ్రతకగలం.
అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి..
సింహం ఒకసారి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం.అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .
కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి. చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .
పొరపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .
అయితే ఆ జింకల్లో తెలివైన కుర్ర జింక ఒకటుంది.
దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.
జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.
ఎటు ఆలోచించినా. ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.
ఈ సింహం ఆహారం లేకుండా
14 రోజులు మాత్రమే బ్రతక గలదు.
కానీ మనం 21రోజులు బ్రతకగలం.
కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.
ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.
జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.
పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది. ఇందులో ఉన్న #నీతి ఏంటి
కొంతకాలం వరకు మనము జాగ్రత్తలు పాటిస్తు ఇంట్లోనే ఉంటే కరోనా రక్కసి నుండి
సురక్షితంగా ఉంటాము. అందరం అనందంగా జీవించవచ్చు.
ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా..
అందుకే..
మాస్క్ ధరించండి
ఇంట్లోనే ఉండండి
అదే నీకు శ్రీరామ రక్ష
మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా...???
Please stay home stay safe. 🙏🏻🙏🏻



🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒
నిన్న రాత్రి కరెంట్ పోయిందని కొవ్వొత్తి🕯️ వెలిగించా...
కొంచెం సేపు తరువాత, కరెంట్💡 వచ్చింది కదా అని ఉఫ్ ఉప్ అని మూడుసార్లు ఊదాను... ఎంత ఊదినా కొవ్వొత్తి🕯️ ఆరలేదు...
ఒక్కసారిగా ఉద్రిక్తతకు లోనయ్యాను... "ఓరి బాబోయ్... Oxigen💨 levels పడిపోయాయా" అని...?
కిచెన్ లోనుండి హాల్ లోకి వచ్చిన మా ఆవిడ🤦♀️ " ముందు మూతికి ఉన్న మాస్క్ తీయండి మహాప్రభో"....👩🍳 అంది....😜