*🌎చరిత్రలో ఈరోజు / అక్టోబర్ 28🌎*
*◾అక్టోబర్ 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 301వ రోజు (లీపు సంవత్సరములో302వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 64 రోజులు మిగిలినవి.*▪
*❤జననాలు❤*
*🌷1867: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (మ.1911)1909: కొడవటిగంటి కుటుంబరావు, ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. (మ.1980)*
*🌷1924: సూర్యకాంతం, ప్రసిద్ధ తెలుగు సినిమా నటి. (మ.1996)*
*🍃మరణాలు🍃*
*🌹1892: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (జ.1824)1900: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823)*
*🌹2011: దూసి బెనర్జీ భాగవతార్, రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్.2016: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. (జ.1935)*
*🌷పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*
*♦అంతర్జాతీయ యానిమేషన్ డే.*
*♦అత్తవార్ల దినోత్సవం.*
*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻
🌹 *మంచి మాట*🌹
*"మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం...!"*
*Take things as they are. Punch when you have to punch. Kick when you have to kick*
*🔺మంచి పద్యం*
*ఎన్ని మేఘములను ఎదురొచ్చియున్నేమి*
*మిహర కాంతి ఎదుట మిడియ చుండు*
*జాతి కులము అనెడి జంకులు యున్నేమి*
*విద్య ఎదుట అవియు విరిగిపోవు*
*🔹భావం:-*
*ఎన్ని మేఘాలు అడ్డు వచ్చిన సూర్యుని కాంతిని ఆపలేవు, అలాగే చదువుకుంటే కుల, మత భేధాలు తొలగిపోతాయి*
*♦నేటి జీ కె*
*1) మూలకాల వర్గీకరణను మొదట చేపట్టినది ఎవరు?*
*జ) 1817 డాబర్నీర్*
*2) అష్టక సిద్దాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?*
*జ) జాన్ న్యూలాండ్స్*
*3) పరమాణు ధర్మం మూలకాల వర్గీకరణకు ఆధారం కావాలని ఎవరు సూచించారు?*
*జ) మెండలీఫ్*
*4) జడ వాయువులు ఏవి?*
*జ) హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్*
*5) అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది?*
*జ) ఫ్లోరిన్*
*6) పరమాణు పరిమాణాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?*
*జ) ఆంగ్ స్ట్రామ్*
ఈ రోజు జికె
*1⃣ అంతర్జాతీయ బౌద్ధ సదస్సుని ఇటీవల ఎక్కడ నిర్వహించారు..?*
✅ *హైదరాబాద్ (హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకి 15 దేశాల నుంచి 63 ప్రతినిధులు హాజరయ్యారు)*
*2⃣ రైల్వే భద్రత కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది..?*
✅ *జపాన్ (ఈ ఒప్పందం ప్రకారం రైల్వే ట్రాక్‌ల తనిఖీ, ట్రాక్ వెల్డింగ్, రోలింగ్ స్టాక్ నిర్వహణ వంటి అంశాల్లో జపాన్ సాంకేతిక సహకారం అందిస్తుంది)*
*3⃣ అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఎక్కడ ప్రారంభించనున్నారు..?*
✅ *కన్నూర్ (కేరళ రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురం సిటిజన్ ఇండియా ఛారిటబుల్ ట్రస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో కన్నూర్‌లో రూ. 300 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు)*
*4⃣ మొదటి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది..?*
✅ *హౌరా - ఎర్నాకులం (ముందస్తు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వీలు కల్పించేదే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్. సాధారణ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. మొదటి ఎక్స్‌ప్రెస్ హౌరా-ఎర్నాకులం మధ్య ప్రారంభమైంది. రెండో ఎక్స్‌ప్రెస్ ముంబయి - టాటానగర్ మధ్య ప్రారంభం కానుంది)*
*5⃣ ప్రభుత్వ అందించే సేవలను పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రత్యేక చట్టం చేసిన రాష్ట్రం..?*
✅ *గుజరాత్ (ప్రభుత్వం నుంచే పొందే ప్రతి ప్రయోజనానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది)*
*6⃣ జమ్ము కశ్మీర్ రాష్ట్రం 2017ను ఏ సంవత్సరంగా ప్రకటించింది..?*
✅ *ఆపిల్ సంవత్సరం (దేశ, విదేశాలలో కశ్మీర్ ఆపిల్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు జమ్ము కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం 2017ను ఆపిల్ సంవత్సరంగా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా హెక్టార్‌కు 50 - 70 మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత్‌లో ఏటా 20 లక్షల టన్నుల ఆపిల్ దిగుబడులు వస్తోండగా వీటిలో అత్యధికంగా జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి)*
*7⃣ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతంలో సైబర్ స్వచ్ఛ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది..?*
✅ *న్యూఢిల్లీ (ఈ కేంద్రం ఇంటర్నెట్ భద్రత సేవలను అందిస్తుంది. అలాగే కంప్యూటర్, మొబైల్ యూజర్లకు ఉచితంగా యాంటీ వైరస్ టూల్స్ ను అందిస్తుంది)*
*8⃣ బారెన్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది..?*
✅ *అండమాన్ అండ్ నికోబార్(దక్షిణాసియాలో క్రీయాశీలకంగా ఉన్న ఏకైక అగ్ని పర్వతం బారెన్. ఇది చివరగా 1911లో లావా విరజిమ్మింది. 2017 జనవరి నుంచి దీని నుంచి మళ్లీ లావా విడుదలవుతోందని సీఎస్‌ఐఆర్, గోవాకు చెందిన నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ సంస్థలు ప్రకటించాయి)*
*9⃣ శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించిన తొలి విమానయాన సంస్థ ఏది..?*
✅ *ఎయిర్ ఏషియా (శ్రీనగర్‌లోని షేక్ ఉల్ ఆలమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఏషియా సంస్థ 2017 ఫిబ్రవరిలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించింది)*
🌹📘📗📕📚📒📔📓🍎
*💐DSC మరియు TET మెటీరియల్... మోడల్ పేపర్స్ "ఒకే లింక్" తెలుగులో మొత్తం 200 PDF ఫైల్స్* 👇👇👇
https://drive.google.com/folderview?id=0B3NkIkgzJ3TJNGctS1g4eFhtUE0
No comments:
Post a Comment