AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday 31 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 30


*🌎చరిత్రలో ఈ రోజు /అక్టోబర్ 30*🌎

*◾అక్టోబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 303వ రోజు (లీపు సంవత్సరములో304వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 62 రోజులు మిగిలినవి*

*🕘సంఘటనలు*🕘

*🌹2006: 2005 అక్టోబర్ లో, కేంద్ర ప్రభుత్వము "పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ (పిఏడిసి) ని ఏర్పాటు చేసింది.దీనినే సోలి సొరాబ్జి కమిటీ అని అంటారు. పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, మోడల్ పోలీస్ ఏక్ట్ 2006ని, ప్రభుత్వానికి 30 అక్టోబరు 2006 న సమర్పించింది. అతిపురాతనమైన, పోలీస్ ఏక్ట్ 1861 ని, నేటి కాలానికి, అనుగుణంగా, మార్చవలసిన అవసరం ఉంది.*

*🌹1976: ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ ఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది.*

*❤జననాలు❤*

*🌷1735: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు*

*🌷1909: హోమీ జహంగీర్ బాబా, ప్రముఖ అణుశాస్త్రవేత్త.*

*🌷1930: వారెన్ బఫ్ఫెట్, యు.ఎస్. మదుపరి, వ్యాపారవేత్త, మరియు లోకోపకారి.*

*🌷1938: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989)*

*🌷1944: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (మ.2014)*

*🌷1957: శిఖామణి, ప్రముఖ కవి*

*🍃మరణాలు🍃*

*♦1883: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్స్థాపకుడు. (జ.1824)*

*♦1910: హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు.*

*♦1973: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.(జ.1902)*

*♦1990: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మరియు నటుడు.(జ.1901)*

*♦1992: వడ్డాది పాపయ్య, ప్రముఖ చిత్రకారుడు. (జ.1921)*

*♦2011: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకుచెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956)*

🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏

   *🔹సుభాషిత వాక్కు*

*"ధర్మంగా జీవించు ధర్మబద్దంగా  ముందుకు నడువు నీవు సాధించే విజయం నిన్ను చూసి గర్వపడుతుంది."*

 *"Yesterday is history, tomorrow is a mystery, today is a gift of God, which is why we call it the present."*

*🔹మంచి పద్యం*
 
*శాంతి కలిగి యున్న సకలంబు చుట్టము*
*శాంతి వల్ల కలుగు సంతసమ్ము*
*కోపమున్న వేళ కోల్పోవు నన్నియూ*
*వాస్తవంబు వేమువారి మాట*

*🔺భావం*:-

*శాంతి, నెమ్మది, తొందరపాటు లేని వారిని బంధువుల వలె అందరూ ఆదరిస్తారు. శాంతి వలన ఎప్పుడూ మేలు చేకూరును. కోపమున్నా అన్నింటిని కోల్పోవును.*

  *♦నేటి జీ.కె*♦

*🌷ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం 1862 సంవత్సరంలో పుత్తూరు నుంచి రేణిగుంట వరకూ వేశారు.*

*🌷 భారతదేశంలో మొదటి రైల్వే లైను డల్హౌసి కాలంలో 1853లో, బొంబాయి నుంచి థానా వరకూ వేసారు.*

*🌷 ప్రపంచంలో అయితే 1830లో మాంచెస్టర్ నుంచి రివర్ పూల్( ఇంగ్లాండు) వరకూ*

*🌷 ప్రపంచంలో మొదటి విద్యుదీకరించిన రైల్వే వ్యవస్థలో రష్యా మొదటి స్థానం. మన దేశంలో రైలు మార్గాలు లేని రాష్ట్రం మేఘాలయ, సిక్కిం. రోగులకు కోసం ప్రత్యేకంగా వేసి రైలుపైరు ధన్వంతరి. భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు దక్కన్ క్వీన్.*

*♦ఈరోజు  "ప్రాథమిక హక్కులు"  అనే అంశంపై సమగ్ర సమాచారం చదవండి.♦*

*🌹_ప్రాథమిక హక్కులు🇮🇳_*
*> రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న అధికరణలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తాయి*

*> వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు*

*> ప్రాథమిక హక్కులకు సవరణలు చేసే అధికారం భారత పార్లమెంట్‌కు ఉంది*

*> ప్రాథమిక హక్కులు 6*

*ఆరు ప్రాథమిక హక్కులు...*

*> సమానత్వపు హక్కు (14-18 Art)*

*> స్వాతంత్ర్యపు హక్కు (19-22 Art)*

*> దోపిడీని నిరోధించే హక్కు (23-24 Art)*

*> మత స్వాతంత్ర్యపు హక్కు (25-28 Art)*

*> సాంస్కృతిక, విద్యా హక్కు (29-30 Art)*

*> రాజ్యాంగ పరిహార హక్కు (32 Art)*

*> 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు (31వ Art)ను ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగంలోని 12వ భాగంలో 300A అధికరణలో చేర్చారు.*

*> ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధ హక్కు మాత్రమే*

*> సమానత్వపు హక్కు (14-18 Art)*

*> Art- 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానం*

*> చట్టం భారత పౌరులందరికీ సమాన రక్షణ, సదుపాయాలను కల్పిస్తుంది.*

*> Art- 15 ప్రకారం, రాజ్యం భారత పౌరుల మధ్య కులం, మతం, జాతి లేదా తెగ, లింగం, జన్మస్థలం అనే వివక్షత చూపకూడదు*

*> Art- 16 ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో భారత పౌరులందరికీ సమాన అవకాశాలుంటాయి*

*> Art- 17 ప్రకారం, అస్పృశ్యత లేదా అంటరానితనాన్ని నిషేధించారు*

*> Art- 18 ప్రకారం, భారత పౌరులకు సైనిక, విద్యా సంబంధ బిరుదులు తప్ప మిగతా బిరుదులన్నింటినీ రద్దు చేశారు*

*> 1954 నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పౌర పురస్కారాలు (అవార్డులు) అయిన భారతరత్న, పద్మ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. 1977లో జనతా ప్రభుత్వం ఈ అవార్డులను నిషేధించింది. వీటిని తిరిగి 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రారంభించింది .*

*> స్వాతంత్ర్యపు హక్కు (19-22 Art):*

*> Art- 19 ప్రకారం, భారత పౌరులకు ఆరు రకాల స్వాతంత్ర్యాలు లభిస్తాయి. ఇవి విదేశీయులకు వర్తించవు.*

*1) వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్ర్యం*

*2) శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వాతంత్ర్యం*

*3) సంఘాలు, యూనియన్లను ఏర్పాటు చేసుకునేందుకు స్వాతంత్ర్యం*

*4) దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం*

*5) దేశమంతా స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్ర్యం*

*6) ఏ వృత్తినైనా, ఏ వ్యాపారాన్నైనా చేసుకునే స్వాతంత్ర్యం*

*> Art- 20 ప్రకారం, చట్టం అనుమతించనిదే ఏ వ్యక్తినీ శిక్షించకూడదు. ఏ వ్యక్తినీ ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు శిక్ష విధించకూడదు. ఏ నిందితుడిని అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని నిర్బంధించకూడదు*

*> Art- 21 ప్రకారం, ఏ ఒక్క వ్యక్తినీ చట్టం పేర్కొన్న పద్ధతిలో తప్ప మరే విధంగా అతడి జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి  భంగం కలిగించకూడదు*

*> 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21(A) అనే నూతన అధికరణను చేర్చారు. దీని ప్రకారం 6-14 ఏళ్ల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్భంద విద్యను అందించాలి. ఇది 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.*

*> సుప్రీంకోర్టు ఆర్టికల్ 21పై అనేక సార్లు తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పుల సారాంశం ప్రకారం 21వ ఆర్టికల్‌లో కింది హక్కులు అంతర్భాగంగా ఉంటాయి. అవి*

*1) గౌరవంగా జీవించే హక్క*

*2) కాలుష్యరహిత వాతావరణ హక్కు*

*3) రహస్యాలు, ఆరోగ్యాలను కాపాడుకునే హక్కు*

*4) ఉచిత న్యాయ సలహా హక్కు*

*5) సమాచార హక్కు మొదలైనవి.*

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*♦సూర్యకుటుంబం♦*

*✧సౌర కుటుంబంలో సూర్యుడు, నవ గ్రహాలు (ప్రస్తుతం:8), ఉపగ్రహాలు, లఘు గ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. నవగ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.*

*ㅁనక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘పాలపుంత’ అంటారు. దీన్నే ‘పాలవెల్లి’, ‘ఆకాశగంగ’ అని కూడా అంటారు.*

*✽ సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి.అవి:*

*సిద్ధాంతకర్త ~సిద్ధాంతం*

✧చాంబర్లీన్, మౌల్టన్: గ్రహాల పరికల్పన సిద్ధాంతం
✧కాంట్ : గ్యాసియస్ మాస్ థియరీ
✧లాప్లాస్ : నెబ్యులార్ థియరీ
✧జీన్స్,జెఫ్రీ :టెడల్ సిద్ధాంతం
✧రస్సెల్, లిటిల్ టన్: బైనరీ స్టార్ హైపోథిసిస్

*ㅁసూర్యుడి ఉపరితలంపై 6000°C, కేంద్రంలో 10,00,000 °C ఉష్ణోగ్రత ఉంటుంది.*

*★  _Planeties_ అనే గ్రీకు భాష పదం నుంచి 'ప్లానెట్స్' అనే ఆంగ్లపదం ఆవిర్భవించింది. ప్లానెట్స్ ను తెలుగులో 'గ్రహాలు' అంటారు. ఇవి సూర్యుడు చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ, సూర్యుడు నుంచి వెలుతురు, వేడిని పొందుతాయి.*

*● గ్రహాలన్ని పశ్చిమం నుంచి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్రుడు, యురేనస్ తూర్పు నుంచి పశ్చిమo కు తిరుగుతాయి.*

*■ గ్రహాలు రెండు రకాలు:*
*1.అంతర గ్రహాలు*
*2.బాహ్య గ్రహాలు*

*ㅁఅంతర గ్రహాలు:బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు...ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి వీటిని "టేరీస్ట్రియల్ గ్రహాలు" అంటారు.*

*ㅁఅంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. ఇవి అధిక సాంద్రత, ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. వీటిని "భౌమ గ్రహాలు "అని కూడా పిలుస్తారు.*

*బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లు...ఇవి హైడ్రోజెన్, హీలియం, సమ్మేళనంతో ఉంటుంది. వీటిని "జోవియన్ గ్రహాలు" అంటారు.*

*✽ గమనిక: 2006లో ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫ్ (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.*

*ㅁభూమి సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది.*
*ㅁసూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది.*
*ㅁభూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.*

*🌍సౌరకుటుంబంలో ప్రస్తతం 8 గ్రహాలు ఉన్నాయి.*

*Short cut: గ్రహాలను ఆర్డర్ లో గుర్తుపెట్టుకునే విధానం.*

*★ _M_y _V_ery _E_ducate _M_other _J_ust        _S_how _U_s _N_ine _P_lanets.*

1. *M* మెర్క్యూరీ
2. *V*వీనస్
3. *E*ఎర్త్
4. *M*మార్స్
5. *J*-జూపిటర్
6. *S*-శాటర్న్
7. *U*-యురేనస్
8. *N*-నెప్ట్యూన్
9. *P*-ప్లూటో- తొలిగించ బడింది.

             *★1.బుధుడు(మెర్క్యూరీ)*

1.గ్రహాలలో కెల్లా అతి చిన్నది.
2.అత్యంత వేడిగల రెండో గ్రహం.(+350C)
3.దీనిపై వాతరణం లేదు. దీనికి ఉపగ్రహాలు లేవు. బుధగ్రహాన్ని యూరప్ ఖండంలో అపోలో అంటారు.
4.దీన్ని భ్రమణ కాలం-58 రోజులు
5.పరిభ్రమణ కాలం-88రోజులు
6.ఇది తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం.
7.భూమికి, సూర్యుడికి మధ్యలో బుధుడు వచ్చినప్పుడు నల్లటి మచ్చలాగ కనిపిస్తుంది. దీన్ని ట్రాన్సిట్ అంటారు.

             *2.శుక్రుడు(వీనస్)*

1.పసుపు పచ్చ రంగులో ఉంటుంది.
2.దీన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు.
3.భూమికి కవల గ్రహం.
4.ప్రకాశవంతమైంది. గ్రీకులు ఈ గ్రహాన్ని అందమైన దేవత గా భావిస్తారు. తూర్పు నుంచి పడమరవరకు తిరుగుతుంది. దీన్ని *వేగుచుక్క* అంటారు.
5.దీనికి ఉపగ్రహాలు లేవు.
6.90% Co2 కలిగి అత్యంత విషపురితంగా ఉంటుంది. దీన్ని క్రూర గ్రహం అంటారు.
7.సౌర కుటుంబంలో అత్యంత వేడిగల గ్రహం.(+475C)
8.దీన్ని భ్రమణ కాలం-243రోజులు,పరిభ్రమణ కాలం-225  రోజులు.


             *🌍3.భూమి(ఎర్త్)*

*1.సూర్యుడు నుండి దూరంలో మూడోది.*
*2.పరిమాణంలో 5వది.*
*3.దీన్ని నీలి గ్రహం, జలయుత గ్రహం అంటారు.*
*4.అత్యధిక సాంద్రత గల గ్రహం(5.5గ్రా/ఘ. సెo. మీ)*
*5.భూమి ఉత్తర, దక్షిణాల మధ్య వ్యాసం -12714km తూర్పు-పడమరల మధ్య వ్యాసం -12,756km.*
*6.భూమిచుట్టుకొలత, భూమధ్యరేఖ చుట్టూ- 40,075km, ధ్రువాల వద్ద- 40,008km.*
*7.భూమి సుమారు4,600 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది.*
*8.భూమికి గల ఏకైక ఉపగ్రహం-చంద్రుడు.*
*9.భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం-సూర్యుడు.*
*10.భూమి ఆకారం-జియాయిడ్(దీర్ఘగోళం)*
*11.సూర్యుడు, భూమికి మధ్య దూరాన్ని ఆస్త్ర నామికల్ యూనిట్ అంటారు.*
*12.భూ ఉపరితలంపై సగటు ఉష్ణోగ్రత 13 డిగ్రీల సె.*
*13.భూమికి, చంద్రుడి మధ్య దూరం-3,84,365km.*
*14.భూమ్యాకర్షణ శక్తిలో చంద్రుడి ఆకర్షణ శక్తి1/6 వంతు ఉంటుంది.*
*15.చంద్రుడి పై మొదటిగా కాలు పెట్టినవారు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్-1969-జులై-21. అమెరికా పంపిన అపోలో-2 లో వెళ్లారు.*
*16.దీన్ని భ్రమణ కాలం-23గ56ని04se*

        *4.అంగారకుడు/కుజుడు/(మార్స్)*

1.దీన్ని dust planet అంటారు. అగ్ని పర్వత విస్ఫోటనాలు ఎక్కువగా సంభవిస్తాయి.
2.ఈ గ్రహణం భ్రమణ కాలం-24గo 37ని
పరిభ్రమణ కాలం-687 రోజులు.
3.2013,నవంబర్5న భారతదేశం మంగళయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది2014,సెప్టెంబర్24న అంగారకుడిపై దిగింది.
4.దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫొబోసే, డియోస్
5.దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు.

       *5.గురుడు/బృహస్పతి(జూపిటర్)*
*GONE SAIDESWARA RAO*
1.గ్రహాలలో కెల్లా అతి పెద్ద గ్రహం.
2.భూమికంటే 11 రెట్లు పెద్దది, దీన్ని బరువు భూమికంటే 300 రెట్లు ఎక్కువ.
3.భ్రమణ కాలం 9గo 50ని"
ఇది వేగంగా తిరిగే గ్రహం.
4.పరిభ్రమణ కాలం-12 ఏళ్లు
5.ఈ గ్రహం తెల్లగా కనిపిస్తుంది. దీన్ని సుపీరియర్ ప్లానెట్ అంటారు. ఈ గ్రహం పై హైడ్రోజెన్, హీలియం వాయువులు ఎక్కువగా ఉంటాయి..
6.దీనికి గల మొత్తం ఉపగ్రహాలు-65.
7.వీటిలో అతి పెద్ద గనిమెడ్. ఇది సౌరకుటుంబంలో సురేష్ కట్టాపెద్ద ఉపగ్రహం.
8.అత్యధిక ద్రవ్యరాశి గల ఉపగ్రహం-ఐవో
9.1994 ,జులై లో షూమేకర్ లేవి-9అనే తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొట్టింది.

             *6.శని(శాటర్న్)*

1.గ్రహాలలో రెండో పెద్ద గ్రహం. ఇది వలయాలుగా ఉంటుంది. అందమైన గ్రహం.
2.భూమికంటే9 రెట్లు పెద్దది.
3.దీనికి మొత్తం ఉపగ్రహాలు-62.
4.వీటిలో పెద్దది టైటాన్. ఇది ఉపగ్రహాలలో రెండో పెద్దది.వాతరణం గలది. దీన్ని హైగెన్స్ కనుగొన్నాడు.
5.శని గ్రహం భ్రమణ కాలం-10గం"39ని"
6.పరిభ్రమణ కాలం-29సం.46రోజులు
7.అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. దీని సాంద్రత 0.69 గ్రా/ఘ. సె. మీ.
8.దీన్ని నీటిలో తేలియాడే గ్రహం అని కూడా అంటారు.

             *7.యురేనస్*

1.ఇది పరిమాణంలో మూడోది.
2.ఈ గ్రహ ఉపరితలంపై మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
3.ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమిస్తుంది.
4.దీనికి మిరండా, ఏరియల్, ఒబెరాన్, టిటానియా, ఉమ్‌బ్రియల్ మొదలైన ఉపగ్రహాలున్నాయి.
5.సూర్యుడి నుంచి ఏడో గ్రహం.

             *8.నెప్ట్యూన్*

1.ఇది అతి చల్లని గ్రహం.
2.దీని పరిభ్రమణ కాలం - 165 ఏళ్లు.
3.సూర్యుడి నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం ఇది.
4.ఇది విష వాయువులైన మీథేన్, 5.అమ్మోనియాలను కలిగి ఉంది.
6.సూర్యుడి నుంచి 8వ గ్రహం.
7.పరిమాణంలో నాలుగోది.

*♦క్లుప్తంగా..*

*1.సూర్యుడు మండుతున్న ఒక అగ్ని గోళం....సూర్యుడు ఒక స్వయం ప్రకాశం.*

*2.విశ్వం గురుంచి తెలియజేసే శాస్త్రాన్ని కాస్మాలాజిఅంటారు.*

*3.విశ్వంలో మెత్తం 8గ్రహాలు ఉన్నాయి.*

*4.అతి పెద్ద గ్రహం-గురుడు/బృహస్పతి/(జూపిటర్)*

*5.అతి చిన్న గ్రహం-బుధుడు(మెర్క్యూరి)*

*6.ఉపగ్రహాలు లేని గ్రహాలు-బుధుడు, శుక్రుడు.*

*7.అందమైన దేవతగా భావించే గ్రహం-శుక్రుడు(వీనస్)*

*8.సౌరకుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం -గనిమెడ(బృహస్పతి గ్రహానికి ఉపగ్రహం) రెండవది టైటాన్ ఇది శని గ్రహానికి ఉపగ్రహం.*

*9.అత్యధిక సాంద్రత గల గ్రహం-భూమి (5.5గ్రా"/ఘ. సె. మీ.)*

*10.అత్యల్ప సాంద్రత గల గ్రహం-శని దీని సాంద్రత-0.69గ్రా"ఘ. సె.*

*11.చంద్రుని పై కాలుమోపిన మొదటి వ్యక్తులు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్.-1969 జూలై-21 నఅమెరికా పంపిన అపోలో-2 నౌకలో*

*12.గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య-దీర్ఘ వృత్తాకారం.*

*13.ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం-జూపిటర్-65*

*14.గ్రహాలలో రెండవపెద్దది&అందమైన వలయాలు గల గ్రహం-శని*

*15.రెడ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు-అంగారకుడు.*

➖➖➖➖➖➖➖➖➖
*తెలంగాణ పాటలు రచయితలు*
➖➖➖➖➖➖➖➖➖➖
*పాటలు ~రచయిత ల పేర్లు*                    

*1. జయజహే తెలంగాణ                                                      -       అందెశ్రీ*

*2. నా తెలంగాణ కోటిరాత నాల వీణ                                       -     దాశరధి*

*3. పల్లెకన్నీరు పెడుతు డోయ్                                                -     గోరెటి ఎంకన్న*

*4. నాగేటిచాల్లా నా తెలం గాణ                                                -     నందిని సిద్ద రెడ్డి*

*5. తెలంగాణ గట్టుమీద సందమామయ                               -   ఆర్ .నారాయణమూర్తి*

*6. తల్లి తెలంగాణ-కిశోరె*                                                                  

*7. ఉస్మానియా క్యాంపుస్లో ఉదయించిన                                  --   అభినయ శ్రీనివాస్*

*8. బతుకమ్మ బతుకమ్మ                                                          --       గోరెటి ఎంకన్న*

*9. నీపాదం మీద పుట్టు మచ్చ                                                  --      గద్దర్*

*10 . పల్లెటూరి పిల్లగాడా                                                          ---   సుద్దాల హనుమంతు*

*11. ఊరు మనదిర వాడమ నాదిరా   ---  గూడ అంజన్న*

*[ జ్ఞ్యానపీటీ  అవార్డు అందుకొన్న తోలి కవి —  డా ” సి “నారాయణరెడ్డి ]*

*12 . గోల్కొండ పత్రిక సంపాదకులు – సురవరం ప్రతాపరెడ్డి*

*13 .అమ్మ తెలంగాణమా ఆకలికేకలు గానము   — గద్దర్*

*14 .మాయమయిపోతున్నాడమ్మా మనిషన్నవాడు   — అందెశ్రీ*

*15 .ఎచ్చమ్మ ముచ్చట్లు  / మా ఉరి కథలు   — యశోదారెడ్డి*

*16 .రాజిగ ఓ రాజిగ  ‘.. పుడితే ఒకటి సత్తే రెండు … ”  —- గూడ అంజన్న*

*17 .మంజీరా పత్రికను స్థాపించింది    —- నందిని సిద్దారెడ్డి*

*-----------------------------------*

*🌹వ్యక్తులు  వారి  బిరుదులు🌹*                                            

*1 . తెలంగాణ టైగర్*                            

 *నల్లనర్సింహులు*

*2. హైదరాబాద్ ప్రకాశము*
     
*స్వామిరామానంద తీర్థ*

*3. తెలంగాణ కాటన్*
   
*నవాబ్ అలీ నవాబ్ జంగ్*

*4. తెలంగాణ సర్దార్*
   
*జమలాపురం కేశవరావు*

*5. తెలంగాణ సరిహద్దు గాంధీ*

*జమలాపురం కేశవరావు*

*6. తెలంగాణ పితామహు డు*

 *కొండా వెంకట రంగారెడ్డి*

*7.తెలంగాణ గోర్కీ*
     
*వట్టికోట అశ్వరావు*

*------------------------------------*

*🌹తెలంగాణ రచనలు🌹*

*1 . కాళోజి నారాయణ రావు*

*నా గొడవ  , జీవన గీత*

*2 . వట్టికోట అశ్వరరావు*

 *— ప్రజల మనిషి*

*3 . దాశరధి కృష్ణమాచార్యు లు*

*— తిమిరంతో సమరం   , రుద్రవీణ , అగ్నిధార*

*4.సుంకర సత్యనారాయణ* –   —
*మా భూమి*

 *---------------------------------*
     *తెలంగాణ రాష్ట్రము లో ముఖ్యమైన జాతరలు*
➖➖➖➖➖➖➖➖➖➖
*1 , సమ్మక్క -సారక్క       --  వరంగల్*

*2 . ఏడుపాయల జాతర  -- మెదక్*

*3 . కొండగట్టు జాతర       - కరీనగర్*

*4 . నాగోబా జాతర           --  ఆదిలాబాద్*

*5 . ఉర్సు                        --  నల్గొండ*

*6. పెద్దగట్టు జాతర          - నల్గొండ*

*7 .కొండగట్టు అంజన్న జాతర     - కరీంనగర్*

*8 .గొల్లగట్టు జాతర                -- నల్గొండ*

*9 .కొమురెల్లి జాతర            --  వరంగల్*

*10 .రామప్ప జాతర           -   -- వరంగల్*

*11.వేళల జాతర                 -- ఆదిలాబాద్*

*12.బెజ్జంకి జాతర               - కరీంనగర్*

*13.మన్నెంకొండ జాతర  -- మహబూబ్ నగర్.*

No comments:

Post a Comment