Heartfully Presented By
AIMS DARE TO SUCCESS
MADE IN INDIA
⏬Telegram Channel ⬇
https://t.me/AIMSDARETOSUCCESS
💡YouTube Channel 🔗
https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1
⌛ Web Sites ⏰
👀 For All Competitive Exams Study Material 👀
https://www.aimsdaretosuccess.blogspot.com
👇 For Mathematics Study Material 👇
https://www.aimsdts.blogspot.com
🔦 For Any Queries 🔭
If u want to get FREE Study Material Please Add My number 9440345996 in Your All Groups
అంతర్జాతీయం అఫ్గానిస్తాన్‌లో చైనా మిలటరీ బేస్ ఏర్పాటు అఫ్గానిస్తాన్‌లో మిలటరీ బేస్ నిర్మించేందుకు చైనా ఆ దేశంతో చర్చలు జరుపుతోందని అఫ్గానిస్తాన్ అధికారులు తెలిపారు. పర్వతాలతో కూడిన వాఖన్ కారిడార్ నుంచి తమ సరిహద్దు ప్రాంతం జిన్‌జియాంగ్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారని ఆందోళన చెందుతున్న చైనా..అక్కడ మిలటరీ బేస్ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అఫ్గానిస్తాన్‌లో మిలటరీ బేస్ ఏర్పాటు
ఎప్పుడు : త్వరలో
ఎవరు : చైనా
ఎందుకు : ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కోవడానికి
మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభంజైళ్లలో ఉన్న ప్రతిపక్ష నేతల శిక్షల్ని రద్దు చేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాల్దీవుల్లో మరోసారి రాజకీయ అనిశ్చితి తలెత్తింది. జైలు శిక్ష ఎదుర్కొంటోన్న మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రవాసంలో ఉండగా.. జైళ్లలో ఉన్న మిగిలిన రాజకీయ నేతల్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. వివాదాస్పదమైన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నషీద్‌పై విజయం సాధించాక యమీన్ అధికారంలోకి వచ్చారు. అనంతరం స్వపక్షంలోని అసంతృప్త నేతలు, ప్రతిపక్ష నేతలను యమీన్ జైల్లో పెట్టించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాల్దీవుల్లో రాజకీయ అనిశ్చితి
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : యమీన్
ఎందుకు : జైళ్లల్లో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేయమని ఆ దేశ సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో
‘అణు’ ఆధునీకరణకు అమెరికా కొత్త విధానం అణ్వస్త్రాలను ఆధునీకరించేందుకు, చిన్నస్థాయి అణ్వాయుధాల తయారీకి వీలుగా అమెరికా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 100 పేజీలతో న్యూక్లియర్ పోస్టర్ రివ్యూ(ఎన్‌పీఆర్)-2018 పేరిట తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా అమెరికా, దాని మిత్రదేశాలపై జరిగే అణు దాడుల్ని నిరోధించవచ్చని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. ఈ విధానంపై పెంటగాన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘21వ శతాబ్దంలో అమెరికాకు ఎదురవుతున్న అనేక రకాల ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ విధానం చాలా అనువైనదని పేర్కొన్నారు. అణ్వాయుధ కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ విభాగాలతో పాటు సంప్రదాయ, అణ్వాయుధాలు ప్రయోగించే విమానాలు, భూ,సముద్ర, వాయు మార్గాల నుంచి దాడిచేసే సామర్థ్యం ఆధునీకరణకు ఈ విధానం దోహదం చేస్తుందని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ విధానం అణువ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ), అణ్వాయుధాల నియంత్రణతో పాటు అణు పరీక్షల నిషేధంపై అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది అని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘అణు’ ఆధునీకరణకు న్యూక్లియర్ పోస్టర్ రివ్యూ(ఎన్‌పీఆర్)-2018 విధానం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : అమెరికా
మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం-కారణాలు దక్షిణ ఆసియాలోని మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 5న పార్లమెంట్‌ను సస్పెండ్ చేసి 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కొన్ని గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో న్యాయమూర్తిని అరెస్టు చేయించింది. మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ కూడా నిర్బంధంలో ఉన్నారు.
సంక్షోభానికి కారణం..
వివిధ కేసుల్లో మాజీ అధ్యక్షుడు మొహమద్ నషీద్ సహా పలువురు రాజకీయ నాయకులపై జరుగుతున్న విచారణ చెల్లదని సుప్రీంకోర్టు 2018 జనవరిలో ప్రకటించింది. నిర్బంధంలో ఉన్న 9 మంది ప్రతిపక్ష ఎంపీల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. మొహమద్ నషీద్‌పై 2015లో చేపట్టిన విచారణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాల్ద్దీవుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడుగా గుర్తింపు పొందిన నషీద్ ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నారు.
అయితే.. తన రాజకీయ ప్రత్యర్థులను కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విడుదల చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ నిరాకరించడంతో మాల్దీవుల్లో సంక్షోభం తలెత్తింది. ప్రతిపక్ష నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టారు.
భారత్ సహాయాన్ని కోరిన నషీద్..
తమ దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు భారత్ తన సైన్యాన్ని పంపించి సాయం చేయాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కోరారు. మాల్దీవుల్లో అత్యవసర స్థితిని ప్రకటించడం సైనిక పాలనను ప్రవేశపెట్టడం వంటిదేనని.. ఇది రాజ్యాంగవిరుద్ధం, అక్రమమని ఆయన పేర్కొన్నారు. కాగా, మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో తాము కలత చెందామని భారత్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తిని అరెస్టు చేయించడం ఆందోళనకరమంది. మాల్దీవులకు సాయం చేసే విషయంలో భారత్ నిర్దిష్ట కార్యాచరణ విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మాల్దీవుల్లో సంక్షోభంతో భారత్, చైనాపై ప్రభావం
హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఇండియాను కలవరపెడుతోంది. ఇటీవలే మాల్దీవులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న మరో ఆసియా దిగ్గజం చైనా కూడా తన వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. భారత నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మాల్దీవులతో 2011 వరకు భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే 2012లో నాటి అధ్యక్షుడు నషీద్ ప్రభుత్వాన్ని పోలీసు, సైనిక తిరుగుబాటులో కూల్చివేసి అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడయ్యాక మాల్దీవుల్లో చైనా పలుకుబడి, వ్యాపారం విపరీతంగా పెరిగాయి. రాజధాని మాలేలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి భారత కంపెనీ జీఎంఆర్‌కు ఇచ్చిన కాంట్రాక్టును కూడా యమీన్ సర్కారు రద్దు చేసింది.
మాల్దీవుల్లో 22 వేల మంది భారతీయులు
లక్ష దీవులకు 700 కి.మీ. దూరంలోని ఈ చిన్న దేశం జనాభా నాలుగున్నర లక్షలు. ప్రస్తుతం 22 వేల మంది భారతీయులు ఇక్కడ పనిచేస్తున్నారు. దేశంలోని మొత్తం 400 మంది వైద్యుల్లో 125 మందికి పైగా భారతీయులే. ఉపాధ్యాయుల్లో నాలుగో వంతు మంది కూడా ఇండియా నుంచి వెళ్లినవారే. దాదాపు అందరూ ముస్లింలే ఉన్న మాల్దీవుల్లో సంక్షోభం ముదిరితే అక్కడ మత ఛాందస వాదం, వాణిజ్య నౌకల దోపిడీ, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా పెరిగి తన భద్రతకు ముప్పువాటిల్లుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. భారత సరుకు రవాణా 97 శాతం ఈ ప్రాంతం మీదుగానే జరుగుతోంది. 1988లో మాల్దీవులను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి శ్రీలంక తీవ్రవాదుల ముఠా యత్నించినా భారత సైన్యం అండతో నాటి అధ్యక్షుడు గయూమ్ ఆ చర్యను తిప్పికొట్టారు.
2011లో చైనా పాదం
మాల్దీవుల్లో చైనా రాయబార కార్యాలయాన్ని 2011లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ద్వీపదేశంతో చైనా వాణిజ్య సంబంధాలు వేగంగా వృద్ధి చెందాయి. సార్క్ దేశాల్లో పాకిస్తాన్ తర్వాత చైనాతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చేసుకున్న రెండో దేశం మాల్దీవులు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రాజెక్టులో మాల్దీవులు కూడా భాగస్వామి. మాలే-హుల్‌హూల్ ద్వీపాల మధ్య వంతెన సహా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా సహాయంతో ఇక్కడ నిర్మిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర సిల్క్ రూట్ ప్రాజెక్టు నిర్మాణంలో మాల్దీవులది కీలకపాత్రగా చైనా భావిస్తోంది. శ్రీలంకలో హంబన్‌టోటా రేవు ప్రాజెక్టుతోపాటు జిబూటీలోనూ సైనిక స్థావరం నిర్మాణానికి స్థలం సంపాదించిన చైనా చెప్పుచేతల్లో నడిచే రాజ్యంగా మాల్దీవులు మారడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే.
శరణార్థులపై నిషేధం ఎత్తేసిన యూఎస్ 11 దేశాల శరణార్థులపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు అమెరికా జనవరి 30న ప్రకటించింది. అయితే ఆయా దేశాల నుంచి వచ్చే శరణార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఇరాన్, లిబియా, ఈజిప్ట్, మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్, ఉత్తర కొరియా ఉన్నాయి.
జాతీయం ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 42వ స్థానంపెచ్చుమీరుతున్న హిందూ అతివాదం, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ప్రజాస్వామ్య సూచీలో భారత్ స్థానం మరింత పడిపోయింది. 2016లో భారత్‌కు 32వ స్థానం దక్కగా, 2017లో 42వ స్థానానికి దిగజారి ‘దోషపూరిత ప్రజాస్వామ్య’ దేశాల జాబితాలోనే కొనసాగుతోంది. ఈ లిస్ట్‌లో అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ, చైనాకు 139వ స్థానం దక్కాయి. మొత్తం పది మార్కులకు గాను భారత్ 7.23 పాయింట్లు స్కోరు చేయగలిగింది. నార్వేకు అగ్రస్థానం (9.87 పాయింట్లు) దక్కగా ఐస్‌లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి. 165 దేశాలు, రెండు ప్రత్యేక ప్రాంతాలతో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌స యూనిట్ (ఈఐయూ) జాబితా రూపొందించింది. మొదటి 19 స్థానాల్లో నిలిచిన దేశాల్లోనే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పింది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఎకనమిస్ట్ గ్రూప్’లోని పరిశోధన, విశ్లేషణ విభాగమే ఈఐయూ. ఇది 1946 నుంచి ఏటా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంపై సూచీలను విడుదల చేస్తోంది. ఆయా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వం పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సంస్కృతి, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. సంపూర్ణ ప్రజాస్వామ్యం, దోషపూరిత ప్రజాస్వామ్యం, మిశ్రమ పాలన, నిరంకుశ పాలన ఉన్న దేశాలుగా విభజిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌స యూనిట్ ప్రజాస్వామ్య సూచీ - 2017
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : 42వ స్థానంలో భారత్
‘బోఫోర్స్’ పై మళ్లీ పిటిషన్ వేసిన సీబీఐ బోఫోర్స్ కుంభకోణంపై 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఫిబ్రవరి 2న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ నేత అజయ్ అగర్వాల్ గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. రూ.64 కోట్లకు సంబంధించిన ఈ కేసులో యూరప్ పారిశ్రామిక వేత్తలైన హిందూజా సోదరులతో సహా పలువురిపై కీలకమైన దస్తావేజులు, సాక్షాలతో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మే 31, 2005న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ సోధి ఈ కుంభకోణంలో సీబీఐ కేసును కొట్టేశారు. అంతకుముందు, 2004 ఫిబ్రవరి 4న మరో జడ్జి జస్టిస్ జేడీ కపూర్ ఈ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ ప్రమేయం లేదంటూ నిర్దోషిగా ప్రకటించారు.
భోఫోర్స్ నేపథ్యం
భారత ప్రభుత్వం స్వీడన్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య నాలుగు వందల 155 ఎంఎం హోవిట్జర్‌లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్ 16న స్వీడన్ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఏబీ బోఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ అర్డ్‌బో, మధ్యవర్తులుగా ఉన్న విన్ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భోఫోర్స్‌పై సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : సీబీఐ
ఎందుకు : కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని
ఢిల్లీలో డీజిల్ ఇంజిన్లు మరో ఏడాదేఢిల్లీ ప్రాంతంలో 2019 మార్చి తర్వాత డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైలు ఒక్కటి కూడా ఉండదని అధికారులు తనకు చెప్పినప్పినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల వాడకాన్ని నిలిపేసేందుకు కృషి చేస్తున్నామనీ, ఆ తర్వాత నుంచి అన్ని రైళ్లనూ విద్యుత్తు ఇంజిన్లతోనే పరుగులు తీయిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి రైల్వే 279 విద్యుత్తు ఇంజిన్‌లను అందుబాటులోకి తెచ్చిందనీ, ఈ సంఖ్యను వెయి్యకి పెంచాల్సి ఉందని గోయల్ చెప్పారు. 2019 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల స్థానంలో విద్యుత్తు ఇంజిన్లను ప్రవేశపెడితే రైల్వేకు ఏడాదికి రూ.11,500 కోట్లు ఆదా అవడంతోపాటు రైళ్ల వేగం కూడా స్వల్పంగా పెరుగుతుందని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీలో డీజిల్ రైలు ఇంజిన్లు మరో ఏడాదే
ఎప్పుడు : 2019, మార్చి నాటికి
ఎవరు : పీయూష్ గోయల్
విమాన రద్దీలో ముంబై విమానాశ్రయం అరుదైన రికార్డు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 24 గంటల్లో 980 విమానాల రాకపోకలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయంగా రెండో ఏడాది కూడా రికార్డుల్లోకెక్కింది. జనవరి 20న ఈ విమానాశ్రయం ఈ ఘనత సాధించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 6న 24 గంటల్లో 974 విమానాల రాకపోకలతో తన పేరిట ఉన్న రికార్డును ముంబై ఎయిర్‌పోర్ట్ బద్దలు కొట్టిందన్నారు. గత మార్చిలో ఒక్క రోజు వ్యవధిలో 837 విమానాల రాకపోకలతో ముంబై విమానాశ్రయం లండన్‌లోని గట్విక్ ఎయిర్‌పోర్ట్ (757 విమానాల రాకపోకలు)ను వెనక్కు నెట్టింది. ముంబై విమానాశ్రయం 24 గంటల పాటు పనిచేస్తే, ప్రభుత్వ నిషేధం కారణంగా గట్విక్ ఎయిర్‌పోర్ట్ ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకే పనిచేస్తుంది. అయినప్పటికీ ఈ విమానాశ్రయానికి 2018లో రోజుకు 870 ఫ్లైట్ల రాకపోకల సామర్థ్యం ఉంది.
ఈవీఎంలను ఎవరికీ అమ్మొద్దని ఈసీఐ ఆదేశం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అమ్మకానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లకు ఆదేశాలు జారీ చేసింది. తమ కోసం రూపొందించిన ఈవీఎంలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు (ఎస్‌ఈసీ) కానీ, విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు కానీ తమ అనుమతి లేకుండా అమ్మకూడదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు సంస్థలకు 2017, మే 27న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలపై 2017 నవంబర్‌లో జరిగిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ల జాతీయ సదస్సులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఒక సమాచార హక్కు విజ్ఞాపన ద్వారా వెల్లడైంది. ఈ విషయాన్ని ఈసీతో చర్చించాలని చివరకు నిర్ణయించారు. ఈసీఐ, ఎస్‌ఈసీ.. రెండూ కూడా ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థల నుంచే ఈవీఎంలను కొనుగోలు చేస్తాయి.
తొలిసారిగా మావో నేత ఆస్తుల అటాచ్‌మెంట్ బిహార్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఓ మావోయిస్టు కమాండర్‌కు చెందిన రూ.86 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మావోయిస్టు ఆస్తులను ఈడీ వంటి దర్యాప్తుసంస్థ అటాచ్ చేయడం దేశంలో ఇదే తొలిసారి. అవినీతి నిరోధక చట్టం కింద సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యా, అతని కుటుంబీకుల స్థిర, చరాస్తులను అటాచ్‌చేస్తూ ఈడీ ఆదేశాలిచ్చింది. యాదవ్ ప్రస్తుతం మావోయిస్టు బిహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ‘మధ్య జోన్’ ఇన్‌చార్జిగా ఉన్నాడు. బిహార్‌లోని 5 ప్లాట్లను, ఢిల్లీలో ఫ్లాటు కొనుగోలుకు సంబంధించిన రూ.10.43 లక్షల నగదు, కొన్ని వాహనాలు, బ్యాంకు డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలిసారిగా మావో నేత ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎక్కడ : బిహార్
ఎవరు : సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యా
ద్వైపాక్షికంపాలస్తీనా, యూఏఈ, ఒమన్‌లలో మోదీ పర్యటన
రక్షణ, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం తదితర అంశాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రధాని మోదీ పశ్చిమాసియా పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకూ పాలస్తీనా, యునెటైడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దుబాయ్‌లో జరిగే ఆరో వరల్డ్ గవర్న్‌మెంట్ సదస్సులో ప్రసంగించడంతో పాటు ఒపేరా హౌస్‌లో జరిగే కార్యక్రమంలో అక్కడి భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. అలాగే అబుదాబి, దుబాయ్ నగరాల మధ్య హిందూ దేవాలయం నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్‌స ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు. ఒమన్ పర్యటనలో భాగంగా మస్కట్‌లోని 200 ఏళ్ల శివాలయాన్ని, సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శిస్తారు. మూడు దేశాలతో సాగే చర్చల్లో ఉగ్రవాద నిరోధం చాలా కీలక అంశంగా ఉంటుంది.
సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటనద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేపాల్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఆమె ఫిబ్రవరి 2 నుంచి రెండు రోజులపాటు నేపాల్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండతో సమావేశమయ్యారు.
ప్రాంతీయం
తెలంగాణ నూతన సీఎస్‌గా శైలేంద్ర కుమార్ జోషి రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం జనవరి 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్‌కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు.
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్‌సడ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు నూతన ప్రధాన కార్యదర్శి
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : శైలేంద్ర కుమార్ జోషి
ఏటా ఏపీకి వచ్చే పర్యాటకులు 10 కోట్ల మంది ఏటా రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 2.84 లక్షలు పెరిగింది. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)కి పర్యాటక రంగం అండగా నిలుస్తోంది. 2017-18 (ఏప్రిల్-నవంబర్)లో రాష్ట్రానికి పర్యాటకుల ద్వారా రూ.36,034 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ కాలంలో రాష్ట్రాన్ని 10,62,80,739 మంది సందర్శించారని అధికారిక లెక్కల ద్వారా వెల్లడైంది.
రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయం చిత్తూరు జిల్లా నుంచే వస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. గతేడాది తిరుపతి సందర్శించిన పర్యాటకులతో పోల్చితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 2.84 లక్షలు పెరిగింది.
ముగిసిన మేడారం జాతరతెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. ఫిబ్రవరి 2న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం చేరుకొని వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ‘‘మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తామన్నారు. జాతర కోసం 200 నుంచి 300 ఎకరాల స్థలం సేకరిస్తామని తెలిపారు.
తెలంగాణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతర ప్రతి రెండేళ్లకొకసారి జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 3న ముగుస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముగిసిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర
ఎప్పుడు : జనవరి 31 - ఫిబ్రవరి 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : మేడారం, తాడ్వాయి మండలం, జయశంకర్ భూపాలపల్లి
అమరావతిలో సీఎస్‌ఐఆర్ ప్రయోగ కేంద్రంఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ప్రయోగ, ప్రదర్శన కేంద్రం ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సీఎస్‌ఐఆర్ డెరైక్టర్ జనరల్ గిరీశ్ సాహ్నీ, సీనియర్ శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 6న సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాల్ని, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి, ప్రదర్శించడానికి వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రతిపాదించగా.. సీఎం అంగీకారం తెలిపారు. ‘సెంటర్ ఫర్ స్కేలింగ్ అప్ అండ్ డిమాన్‌స్ట్రేషన్ ఆఫ్ రెలవెంట్ సీఎస్‌ఐఆర్ టెక్నాలజీస్’ పేరుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు నెలల్లో సవివర కార్య ప్రణాళికను సిద్ధం చేసి తీసుకొస్తామని సాహ్ని తెలిపారు. కాగా, బౌద్ధ ఆలయం నిర్మాణానికి అమరావతిలో పదెకరాల స్థలం కేటాయిస్తామని సీఎం చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్‌ఐఆర్ ప్రయోగ కేంద్రం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎక్కడ : అమరావతిలో
ఏపీ తాత్కాలిక హైకోర్టుకు ఏఎన్‌యూ భవనాలు తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) ప్రాంగణంలోని కొన్ని భవనాలను ఎంపిక చేశామని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఆయా భవనాలను పరిశీలించేందుకు రావాలని కోరుతూ ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనాల ఏర్పాటు పరిశీలన కమిటీకి సర్కార్ లేఖ రాసింది. యూనివర్సిటీ భవనాలను పరిశీలించిన తర్వాత కమిటీ.. తన అభిప్రాయాలను న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టు ముందు ఉంచుతుంది. ఫుల్‌కోర్టులో మెజారిటీ నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది.
ఆర్థికం జీడీపీ గణాంకాలను సవరించిన కేంద్రం భారత్ 2015-16, 2016-17 స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు సంబంధించి లెక్కలను మరింత మదింపుచేస్తూ, కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) జనవరి 31న ప్రకటన చేసింది. దీని ప్రకారం.. 2015-16 జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. 2016-17 వృద్ధి రేటు యథాతథంగా 7.1 శాతంగా ఉంది. ఈ రెండేళ్లకు సంబంధించి జీడీపీ విలువలు వరుసగా రూ.113.86 లక్షల కోట్లు, రూ.121.96 లక్షల కోట్లుగా ఉన్నాయి.
జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకందేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు (భారత జనాభాలో దాదాపు 40 శాతం) వైద్య ఖర్చుల కవరేజ్ అందించేందుకు ఉద్దేశించిన ‘మోదీ కేర్’ లేదా జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆగస్టు 15 లేదా, గాంధీ జయంతి (అక్టోబర్ 2)నాడు ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది. దీనికయ్యే ఖర్చును 60 శాతం కేంద్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే 2018-19 కేంద్ర బడ్జెట్‌లో దీనికోసం రూ.2 వేల కోట్లతో మూలనిధిని ఏర్పాటు చేశారు. ఈ వైద్య పథకం రీ-ఇంబర్స్‌మెంట్ కాకుండా క్యాష్‌లెస్ విధానంలో ఉండనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం
ఎప్పుడు : త్వరలో
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : 10 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిండానికి
సంపన్నుల వలసలో రెండో స్థానంలో భారత్ 2017లో భారత్ నుంచి 7,000 మంది మిలియనీర్లు (అధిక విలువ కలిగిన వ్యక్తులు/మిలియన్ డాలర్లు/రూ.6.4 కోట్లు ఆపై సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోయారని న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్ చెబుతోంది. 2016లో వలస వెళ్లిన వారి సంఖ్య కంటే 16 శాతం అధికం. 2016లో 6,000 మంది, 2015లో 4,000 మంది మిలియనీర్లు మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్లారు. అమెరికా, యూఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు భారత్ వాసులను ఆకర్షించిన టాప్ దేశాలు.
నివేదికలోని కీలక అంశాలు...
- 2017లో 10,000 మంది చైనీయులు ఆ దేశం వీడి వెళ్లారు. వలసల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానం చైనాది కాగా రెండో స్థానంలో భారత్ ఉంది. టర్కీ 6,000 మంది, బ్రిటన్ 4,000 మంది, ఫ్రాన్‌స 4,000 మంది, రష్యా 3,000 మంది మిలియనీర్లను కోల్పోయాయి. మిలియనీర్ల వలసల సంఖ్య 2017లో మొత్తం మీద అంతర్జాతీయంగా 95,000గా ఉంది.
- మిలియనీర్లను ఆకర్షించడంలో ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకుంది. 2017లో ప్రపంచ దేశాల నుంచి ఈ దేశానికి తరలివెళ్లిన వారు 10,000 మంది ఉన్నారు. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో మరోసారి ఆస్ట్రేలియా కంటే వెనుకబడింది. అయితే, మొత్తం మీద మిలియనీర్ల ఆకర్షణలో ఆస్ట్రేలియా తర్వాత నిలిచింది అగ్రరాజ్యమే. 9,000 మంది ఈ దేశాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కెనడా 5,000 మంది, యూఏఈ 5,000 మందిని ఆకర్షించాయి.
- మిలియనీర్ల సంపద ఎక్కువగా వున్న దేశాల్లో భారత్‌కు ఈ నివేదిక ఆరో స్థానం కల్పించింది. మొత్తం సంపద విలువ 8,230 బిలియన్ డాలర్లు. భారత్‌లో 3,30,400 మంది మిలియనీర్లు ఉన్నారు. మిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ అంతర్జాతీయంగా 9వ స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయంగా సంపన్నుల వలసలో రెండో స్థానంలో భారత్
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్
భారత జీడీపీ వృద్ధి రేటుపై మెరిల్‌లించ్ అంచనా రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత జీడీపీ 7.5 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని, దీనికి తక్కువ బేస్ కారణమని, ఆ తర్వాతి ఆరు నెలల్లో 7 శాతానికి తగ్గిపోతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ పేర్కొంది. వృద్ధి రేటు పుంజుకున్నా గానీ, వాస్తవ సామర్థ్యం కంటే ఒక శాతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. 2017-18లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలతో వృద్ధి కనిష్టానికి (తక్కువ బేస్) చేరినందున 2018-19 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో జీడీపీ 7.5 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018-19లో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.5 శాతం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 3న అసోంలోని గువహటిలోప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, పలువురు కేంద్రమంత్రులు, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, 16 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ కనువిందు చేసిన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్లూ బ్లడ్‌మూన్ జనవరి 31న కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాలిఫోర్నియాతోపాటు పశ్చిమ కెనడాలోని ప్రజలు చంద్ర గ్రహణాన్ని పూర్తిగా చూశారని నాసా వెల్లడించింది. దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ యూరప్‌తోపాటు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపించలేదు. భారత్‌లోనూ అనేక మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని వీక్షించారు.
పౌర్ణమినాడు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ అంటారు. అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్ అంటారు. చంద్రగ్రహణం నాడు ముదురుఎరుపు రంగులో కనిపించే చంద్రుడిని బ్లడ్‌మూన్ అంటారు. జనవరి 31న ఈ మూడు ఏకకాలంలో ఆవిష్కృతమయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కనువిందు చేసిన సూపర్ బ్లడ్ మూన్
ఎప్పుడు : జనవరి 31
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో
స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి కరంజ్ జలప్రవేశంభారత నావికాదళంలో స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కరంజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబా భార్య రీనా లాంబా జనవరి 31న ముంబైలో ఐఎన్‌ఎస్ కరంజ్‌ను ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌకా తయారీ సంస్థ డీసీఎన్‌ఎస్ భాగస్వామ్యంతో స్కార్పిన్ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఐఎన్‌ఎస్ కరంజ్‌తో నేవీలో మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది. ఛత్రపతి శివాజీ నావికాదళం ఆధీనంలోని కరంజా ద్వీపం పేరు మీదుగా ఈ జలాంతర్గామికి ఐఎన్‌ఎస్ కరంజ్‌గా నామకరణం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జలప్రవేశం చేసిన స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామని కరంజ్
ఎప్పుడు : జనవరి 31
ఎక్కడ : ముంబైలో
చెన్నైలో కృత్రిమ చెవి తయారీ దేశంలోనే ప్రప్రథమంగా చెన్నై సైన్స్ ల్యాబ్‌లో వైద్యులు కృత్రిమ చెవిని రూపొందించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు సిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో కృత్రిమ చెవి నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, సిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా దీనిని రూపొందించింది. చెవులు కోల్పోయిన వారి కోసం వారి దేహంలోని ఒక ప్రదేశంలో కణాలను తీసుకొని ల్యాబ్‌లో కృత్రిమ చెవులను తయారు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే ప్రప్రథమంగా కృత్రిమ చెవిని తయారు చేసిన వైద్యులు
ఎప్పుడు : 2018 ఫిబ్రవరి
ఎవరు : చెన్నై సైన్స్ ల్యాబ్ వైద్యులు
అగ్ని-1 పరీక్ష విజయవంతం అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని బాలసోర్‌లోగల అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించిన క్షిపణ 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు. అగ్ని -1లో ఇది 18వ వర్షెన్. నిర్ణీత సమయంలోనే క్షిపణి టార్గెట్‌ను చేధించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణి 2004లోనే సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. సైనిక దళాలు తమ రెగ్యులర్ శిక్షణ విన్యాసాల సందర్భంగా దీనిని పరీక్షించారు. లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 క్షిపణిలో ఉందని అధికారులు తెలిపారు. రేంజ్, అక్యూరెసీలో అగ్ని -1 అత్యద్భుత ప్రదర్శన జరిపినట్లు అధికారులు చెప్పారు. 15 మీటర్లు పొడవు ఉండే అగ్ని-1 సుమారు 12 టన్నుల బరువు ఉంటుంది. ఇది సుమారు వెయి్య కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇదే బేస్ నుంచి గతంలో అగ్ని-1 క్షిపణిని 2016 నవంబర్ 22వ తేదీన ప్రయోగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అగ్ని-1 పరీక్ష విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎక్కడ : అబ్దుల్ కలామ్ దీవి, ఒడిశా
అతి చిన్న రాకెట్ ప్రయోగం విజయవంతంజపాన్ అంతరిక్ష సంస్థ..జక్సా ఫిబ్రవరి 4న ప్రపంచంలోనే అతి చిన్న రాకె ట్(ఎస్‌ఎస్-520)ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ట్రైకామ్-1ఆర్(సూక్ష్మ ఉపగ్రహం)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎస్‌ఎస్-520 పొడవు 10 మీటర్లు కాగా, వ్యాసం 53 సెంటీమీటర్లు. ఈ ప్రయోగం కగోషిమా ఫ్రిపెక్చర్‌లోని ఉంచినోరా అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది.
విహరించిన తేలికపాటి హెలికాప్టర్భారత తేలికపాటి పోరాట హెలికాప్టర్(ఎల్‌సీహెచ్-టీడీ2) జనవరి 31న బెంగళూరులో 20 నిమిషాలపాటు విహరించింది. దీనికి తొలిసారిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) రూపొందించిన ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్(ఏఎఫ్‌సీఎస్)ను అమర్చి ప్రయోగించారు.
క్రీడలు న్యూఢిల్లీలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ దేశంలో క్రీడల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ (కేఐఎస్‌జీ)’ జనవరి 31న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న క్రీడా పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సమర్థమైన ఆర్మీ, బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే చాలదని, క్రీడాభివృద్ధి కూడా జరగాలని అన్నారు. ఖేలో ఇండియా పోటీలు క్రీడల్లో భారత్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్తాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏటా 1000 మంది ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి 8 ఏళ్ల పాటు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని వెల్లడించారు.
అండర్-17 విభాగంలో 16 క్రీడాంశాల్లో ఫిబ్రవరి 8 వరకు ఈ పోటీలు జరగుతాయి. ఇందులో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 5000 పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్
ఎప్పుడు : జనవరి 31 - ఫిబ్రవరి 8
ఎక్కడ : న్యూఢిల్లీ
మానవ్‌కు టీటీ అండర్-18 టాప్ ర్యాంక్భారత యువ ఆటగాడు మానవ్ వికాస్ ఠక్కర్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో టాప్ ర్యాంక్‌ను చేరుకున్నాడు. గుజరాత్‌కు చెందిన మానవ్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకులో 6,396 రేటింగ్ పాయింట్లతో అండర్-18 బాలుర సింగిల్స్ విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా మానవ్ చరిత్రకెక్కాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టేబుల్ టెన్నిస్ అండర్-18 టాప్ ర్యాంక్
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : మానవ్ వికాస్ ఠక్కర్
ఇండియా ఓపెన్ టోర్నీలో భారత్‌కు 8 స్వర్ణాలున్యూఢిల్లీలో ఫిబ్రవరి 1న ముగిసిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. 18 కేటగిరీలలో కలిపి 8 స్వర్ణాలు, 10 రజతాలు, 23 కాంస్య పతకాలతో మొత్తం 41 పతకాలను సొంతం చేసుకున్నారు.
మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మనీషా (54 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), ప్విలావో బసుమతిరి (64 కేజీలు)... పురుషుల విభాగంలో సంజీత్ (91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను గెలుపొందారు.
పురుషుల 49 కేజీల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ 0-5తో భారత్‌కే చెందిన అమిత్ చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకం గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా ఓపెన్ టోర్నీలో భారత్‌కు 8 స్వర్ణాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : మేరీకోమ్, మనీషా, పింకీరాణి, లవ్లీనా మొదలైనవారు
అండర్ - 19 ప్రపంచ కప్ విజేత భారత్ న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్ - 19 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. మౌంట్ మాంగనీలో జరిగిన ఫైనల్లో టీ మిండియా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ గెల్చుకుని కొత్త రికార్డు నెలకొల్పింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఓపెనర్ మన్‌జ్యోత్ కల్రా (102 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత శతకంతో భారత్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 38.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కల్రాకే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్ (6 మ్యాచ్‌ల్లో 372 పరుగులు; ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు) ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు.
భారత్ ఇంతకముందు 2000, 2008, 2012లో అండర్ - 19 ప్రపంచ కప్ గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అండర్ - 19 క్రికెట్ ప్రపంచ కప్
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎక్కడ : మౌంట్ మాంగనీ, న్యూజిలాండ్
ఎవరు : విజేత భారత్, రన్నరప్ ఆస్ట్రేలియా
ఇండియా ఓపెన్ టైటిల్ విజేత బీవెన్ జాంగ్ఇండియా ఓపెన్ టైటిల్‌ను చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 4న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, టాప్ సీడ్ సింధుని ఓడించి జాంగ్ టైటిల్‌ను గెలుచుకుంది. తన కెరీర్‌లో సింధుపై జాంగ్‌కిది వరుసగా రెండో విజయం. గతేడాది ఇండోనేసియా ఓపెన్‌లోనూ సింధును జాంగ్ ఓడించింది. విజేతగా నిలిచిన జాంగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 83 వేలు), 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 53 వేలు), 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చైనాలో జన్మించిన 27 ఏళ్ల బీవెన్ జాంగ్ 2007 నుంచి 2013 వరకు సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2013 నుంచి అమెరికా తరఫున ఆడుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా ఓపెన్ - 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎవరు : విజేత బీవెన్ జాంగ్, రన్నరప్ పీవీ సింధు
వార్తల్లో వ్యక్తులు బళ్లారి ఎంపీకి ట్రంప్ ఆహ్వానం
కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఏర్పాటు చేసిన విందుకు భారతదేశం నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. వీరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒకరు కాగా, బళ్లారి ఎంపీ శ్రీరాములు మరొకరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బళ్లారి ఎంపీకి ట్రంప్ ఆహ్వానం
ఎప్పుడు : ఫిబ్రవరి 2న
ఎవరు : శ్రీరాములు
ఎందుకు : అధ్యక్షుడి అధికారిక విందులో పాల్గొనడానికి
కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ దినేశ్ మహేశ్వరికర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియామకం దాదాపుగా ఖాయమైంది. ఈ మేరకు ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతత్వంలోని కొలీజియం జస్టిస్ దినేశ్ మహేశ్వరి పేరును ప్రతిపాదించింది. అక్టోబర్ 9వ తేదీన జస్టిస్ ఎస్‌కే ముఖర్జీ పదవి విరమణ చేయగా.. అప్పటి నుంచి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది. దినేశ్ మహేశ్వరి ప్రస్తుతం మేఘాలయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్ణాటక హైకోర్టు సీజే నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : జస్టిస్ దినేశ్ మహేశ్వరి
విద్యార్థుల కోసం మోదీ పుస్తకం - ఎగ్జామ్ వారియర్స్వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసేందుకు తన అనుభవాలతో 25 అధ్యాయాలు (మంత్రాలు, యోగాసనాలతో) పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాశారు. ఎగ్జామ్ వారియర్స్ (పరీక్షా యోధులు) పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఫిబ్రవరి 3న ఢిల్లీలో విడుదల చేశారు. ఈ పుస్తకం రాయటం ద్వారా.. ఇంతవరకు ఏ దేశాధ్యక్షుడు గానీ.. ప్రధాని గానీ సాధించని అరుదైన ఘనతను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. భారత యువతకు అంకితమిచ్చిన ఈ పుస్తకాన్ని ‘ది ఐడియా’ అనే నరేంద్రమోదీ మొబైల్ యాప్‌తో అనుసంధానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఎగ్జామ్స్ వారియర్స్ పుస్తకం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
తేజస్‌లో అమెరికా వాయు సేనాధిపతి దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను అమెరికా వాయు సేనాధిపతి జనరల్ డేవిడ్ గోల్డ్‌ఫీన్ ఫిబ్రవరి 3న నడిపారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న వైమానికస్థావరం వద్ద భారత ఎయిర్ వైస్ మార్షల్ ఏపీ సింగ్‌తో కలసి ఆయన తేజస్‌లో చక్కర్లు కొట్టారు. భారత వాయుసేన ఈ సమాచారాన్ని ట్వీటర్‌లో ప్రకటించింది. భారత, అమెరికా వాయుసేనల మధ్య బంధాన్ని మరింత దృఢపరిచేందుకు కృషిచేస్తానని గోల్డ్‌ఫీన్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తేజస్‌ను నడిపిన అమెరికా వాయు సేనాధిపతి
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎక్కడ : జోధ్‌పూర్
ఎవరు : డేవిడ్ గోల్డ్‌ఫీన్
నీతి ఆయోగ్ సీఈవో పదవీకాలం పొడిగింపు నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని 2019 జూన్ 30 వరకు పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించడంతో అమితాబ్ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కాలపరిమితి రెండేళ్లు ఉండే నీతి ఆయోగ్ సీఈవో పదవిని అమితాబ్ 2016 ఫిబ్రవరి 17న చేపట్టారు. నీతి ఆయోగ్‌లో పదవిచేపట్టకముందు ఆయన పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అమితాబ్ కేరళ కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : 2019 జూన్ 30 వరకు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
కొత్త డీజీఎంఓ అనిల్ చౌహాన్భారత సైన్యం నూతన డీజీఎంఓ(డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ జనవరి 30న బాధ్యతలు స్వీకరించారు. చౌహాన్‌కు జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లలో అపార అనుభవం ఉంది.
ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడి ఆత్మహత్యక్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు డియాజ్ బలర్ట్(68) ఫిబ్రవరి 2న హవానాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. డియాజ్ రాజకీయాల్లో లేనప్పటికీ అచ్చు తండ్రి పోలికలతో ఉండటంతో అక్కడి వారు ఆయన్ను ఫిడెల్ జూనియర్‌గా పిలుస్తుంటారు. ఫిజిక్స్ శాస్త్రవేత్తయిన డియాజ్.. క్యూబా అణుశక్తి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు.
అవార్డులు నరిశెట్టికి ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు ప్రముఖ సాహితీవేత్త ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు 2018ని గిజ్‌మోడో మీడియా గ్రూప్ సీఈవో రాజు నరిశెట్టి (అమెరికా)కి ప్రకటించారు. ఈ మేరకు మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 21న న్యూఢీల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమంలో అవార్డుని ప్రదానం చేస్తామని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : రాజు నరిశెట్టి(అమెరికా)
AIMS DARE TO SUCCESS
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒంటరి పక్షి నెగైల్ మృతి
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎక్కడ : న్యూజిలాండ్
క్రిప్టో సంపన్నుడు క్రిస్ లారెన్స్ ఫోర్బ్స్ తాజాగా తొలి క్రిప్టో కరెన్సీ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రిపిల్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ లార్సెన్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన క్రిప్టో నికర విలువ 7.5-8 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 2017లో బిట్‌కాయిన్, ఇథీరియమ్, ఎక్స్‌ఆర్‌పీ అనే మూడు ప్రముఖ క్రిప్టోకరెన్సీల సగటు విలువలో మార్పు 14,409 శాతంగా ఉంది. దాదాపు 1,500 క్రిప్టో కరెన్సీలున్నాయి. వీటి సమష్టి విలువ 550 బిలియన్ డాలర్లు. 2017 ప్రారంభం నుంచి చూస్తే ఈ కరెన్సీల విలువ 31 శాతం మేర ఎగసింది. జోసెఫ్ లుబిన్ (క్రిప్టో నికర విలువ: 1-5 బిలియన్ డాలర్లు), చాంగ్‌పెంగ్ ఝావో (1-1.2 బిలియన్ డాలర్లు), కామెరాన్ అండ్ టైలెర్ వింక్‌లెవోస్ (900 మిలియన్- 1.1 బిలియన్ డాలర్లు), మాథ్యూ మెలాన్ (900 మిలియన్-1.1 బిలియన్ డాలర్లు) తదితరులు ఈ జాబితాలో స్థానం పొందారు.
2018 జనవరి 19 నాటి క్రిప్టో కరెన్సీల విలువ ఆధారంగా ఈ సంపన్నుల జాబితాలను రూపొందించారు. ఇందులో స్థానం దక్కించుకోవాలంటే కనీసం 350 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలను కలిగి ఉండాలి. భారత్‌లో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ క్రిప్టో సంపన్నుల జాబితా
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : తొలిస్థానంలో క్రిస్ లారెన్స్
రష్యా విమాన ప్రమాదంలో 71 మంది మృతిరష్యాలో ఫిబ్రవరి 11న జరిగిన విమాన ప్రమాదంలో 71 మంది దుర్మరణం చెందారు. మాస్కోలోని డొమొడెడొవో విమానాశ్రయం నుంచి ఉరల్ పర్వతశ్రేణుల్లోని ఓర్క్స్ పట్టణానికి బయలుదేరిన సరతోవ్ ఎయిర్‌లైన్‌సకు చెందిన ఆంటొనోవ్ ఏఎన్-148 జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూప్పకూలిపోయింది. దీంతో అందులోని ఆరుగురు సిబ్బందితో సహా 65 మంది ప్రయాణికులు మృతి చెందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా విమాన ప్రమాదంలో 71 మంది మృతి
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : మాస్కో
దక్షిణ కొరియాపై కిమ్ ప్రశంసల వర్షం దక్షిణకొరియా అంటే భగ్గున మండిపడే ఉత్తర కొరియా నేత కిమ్ దక్షిణకొరియా వైఖరి బాగా నచ్చిందని మెచ్చుకోవడంతో పాటు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షణకొరియా ప్యాంగ్‌చాంగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తన సోదరి, ఇతర ప్రతినిధుల బృందం ఫిబ్రవరి 12న రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో కిమ్‌ను కలుసుకుంది. వారితో చర్చల అనంతరం అధికార మీడియా ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. తమదేశ ప్రతినిధి బృందం దక్షిణ కొరియా పర్యటనపై అధ్యక్షుడు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని, పర్యటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన ఆ దేశ వైఖరి కిమ్‌కు నచ్చిందని పేర్కొంది. సియోల్ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది.
జాకబ్ జుమా రీకాల్‌కు ఏఎన్‌సీ నిర్ణయందక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాను రీకాల్ చేయాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ) నిర్ణయించింది. అవినీతి ఆరోపణలతో నిండా మునిగిన జుమా రాజీనామాకు నిరాకరించటంతో ఫిబ్రవరి 12న ఏఎన్‌సీ అత్యున్నత స్థాయి భేటీ జరిపింది. దాదాపు 13 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత జుమాను సాగనంపాలని తీర్మానించింది. అయితే, ఇందుకు గడువేదీ విధించలేదు. ఈ మేరకు జుమాకు ఏఎన్‌సీ లేఖ రాయనున్నట్లు సమాచారం. రాజీనామాకు అంగీకరించిన జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్‌సీ ప్రధాన కార్యదర్శి మగషులే తెలిపారు. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం కారణాలతో జుమాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా రీకాల్‌కు నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ)
పాక్ నిషేధిత జాబితాలో సయీద్ సంస్థలుఅంతర్జాతీయ ఆంక్షల్ని తప్పించుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చట్టాల్లో సవరణలు చేసింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా, ఫలాహ్-ఐ-ఇన్సానియత్ ఫౌండేషన్‌తో పాటు పలు సంస్థల్ని ఉగ్రవాద జాబితాలో చేర్చుతూ పాక్ అధ్యక్షుడు ఆర్డినెన్‌స జారీ చేశారు. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్ర సంస్థలూ ఇందులో ఉన్నాయి.
ఉగ్రవాదానికి పాక్ అనుకూలమన్న ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగా పారిస్‌లో ఫిబ్రవరి 18 నుంచి జరగనున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని ఎఫ్‌ఏటీఎఫ్ నియంత్రిస్తోంది. ఉగ్రవాదులకు అండగా ఉన్న పాక్‌ను ‘ఎఫ్‌ఏటీఎఫ్’ గ్రే జాబితాలో చేర్చేందుకు అమెరికా, భారత్‌ల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఆర్డినెన్‌స జారీచేశారు. గతంలో 2012 నుంచి మూడేళ్ల పాటు పాక్ ‘ఎఫ్‌ఏటీఎఫ్’ గ్రే జాబితాలో కొనసాగింది.
మేధోహక్కుల సూచీలో భారత్‌కు 44వ ర్యాంకుఅంతర్జాతీయ మేధోహక్కుల (ఐపీ) సూచీలో భారత్ ర్యాంకింగ్ కొంత మెరుగుపడింది. 50 దేశాల జాబితాలో 44వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 45 దేశాల సూచీలో భారత్‌కు 43వ ర్యాంకు దక్కింది. స్కోరు కొంత మెరుగుపడినప్పటికీ .. ఈ సూచీలో భారత్ ఇంకా అట్టడుగు స్థానంలోనే ఉంది. అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్‌లో భాగమైన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) రూపొందించిన వార్షిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు గాను... విధానాలకు అనుగుణంగా భారత్ మరిన్ని అర్థవంతమైన సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది.
మేధోహక్కుల సూచీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా బ్రిటన్, స్వీడన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేధోహక్కుల సూచీలో భారత్‌కు 44వ ర్యాంకు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్, అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్
‘నీతి’ ఆరోగ్య సూచీలో కేరళ టాప్ నీతి ఆయోగ్ వెల్లడించిన ఆరోగ్య సూచీలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. పంజాబ్ రెండో స్థానంలో, తమిళనాడు మూడో స్థానంలో నిలిచాయి. వైద్య సదుపాయాలు, శిశు మరణాల రేటు, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు, సంపూర్ణ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం అమలు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
‘ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతం: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకుల రిపోర్టు’ పేరుతో నీతి ఆయోగ్-ప్రపంచబ్యాంకు సంయుక్తంగా రూపొందించిన ఈ జాబితాను ఫిబ్రవరి 9న విడుదల చేశారు. గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఇటీవల వైద్యప్రమాణాలు మెరుగుపరుచుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచింది. జాబితాలో దారుణమైన పనితీరును కనబరిచిన రాష్ట్రాలుగా రాజస్తాన్, బిహార్, ఒడిశా నిలిచాయి. ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే మెరుగైన వైద్యవసతులు కల్పిస్తున్న జాబితాలో జార్ఖండ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిక
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : తొలి స్థానంలో కేరళ
ప్రామాణిక సమయానికి వంద కోట్లతో ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఒకే ప్రామాణిక సమయాన్ని అమల్లోకి తేవడానికి కేంద్రం త్వరలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం. ఇది ఆచరణకు నోచుకుంటే ఒకే ప్రామాణిక సమయంతో పాటు మరింత కచ్చితత్వంతో కూడిన సమయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల బ్యాంకింగ్, టెలికాం, వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ, రైల్వే ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ తదితర రంగాల్లో ఏకరూపత రావడంతో పాటు పలు ఇతర కీలక మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు ప్రాంతీయ రెఫరెన్‌స స్టాండర్డ్స్ లేబొరేటరీ(ఆర్‌ఆర్‌ఎస్‌ఎల్)ల మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు అలాంటివి మరో రెండింటిని నెలకొల్పుతారు. అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, ఫరీదాబాద్, గువాహటిల్లో ఉన్న ల్యాబ్‌ల బలోపేతానికి నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ(ఎన్‌పీఎల్) సాయం తీసుకుంటారు.
ఉత్తరాఖండ్‌లో సినిమా షూటింగ్ ఉచితంఉత్తరాఖండ్‌లో ఉచితంగా సినిమా షూటింగ్‌లు జరుపుకోవచ్చని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఫిబ్రవరి 9న వెల్లడించారు. సినిమా షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌ను కేంద్రస్థానంగా మార్చడంలో భాగంగా చిత్రీకరణ ఫీజును రద్దుచేశామన్నారు. తెహ్రీ పట్టణంలో షాహీద్ కపూర్ నటిస్తున్న ‘బిజ్లీ గుల్ మీటర్ చాలూ’ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి రావత్ క్లాప్ కొట్టారు. ప్రకృతి సౌందర్యంతో అలరారే ఉత్తరాఖండ్ సినిమాల చిత్రీకరణకు అద్భుతమైన చోటని రావత్ వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సినిమా షూటింగ్ ఉచితం
ఎక్కడ : ఉత్తరాఖండ్ ఎవరు
ఎవరు : సీఎం త్రివేంద్ర సింగ్ రావత్
మహిళా ఎమ్మెల్యే లేని రాష్ట్రంగా నాగాలాండ్దేశవ్యాప్తంగా శాసనసభలో(అసెంబ్లీలో) మహిళా ఎమ్మెల్యే లేని రాష్ట్రంగా నాగాలాండ్ రికార్డు సృష్టించింది. జాతీయ అక్షరాస్యత (65 శాతం) కంటే నాగాలాండ్‌లో స్త్రీల అక్షరాస్యత (76 శాతం) ఎక్కువయినప్పటికీ ఇప్పటివరకు ఆ రాష్ట్ర శాసనసభలో ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందలేదు.
1963లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 30 మంది మహిళలే పోటీ చేశారు. అయితే 1977 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రానో ఎం షాజియా అనే మహిళ గెలుపొంది రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు వెళ్లిన ఏకై క మహిళగా నిలిచారు. 2018 ఫిబ్రవరి 27న నాగాలాండ్‌లో 60 శాసనసభా స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 227 మంది బరిలో నిలవగా వారిలో కేవలం అయిదుగురే మహిళా అభ్యర్థులున్నారు.
నాగాలాండ్‌లో వారసత్వంగా ఆస్తులను పొందే హక్కు కూడా మహిళలకు లేదు. గ్రామాభివృద్ధి బోర్డుల్లో వారికి 25 శాతం రిజర్వేషన్లు ఉన్నా ముఖ్యమైన అంశాలపై కీలకంగా వ్యవహరించలేకపోతున్నారు. 2016 గణాంకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో 23.5 శాతం, ప్రైవేట్ రంగంలో 49 శాతం మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ల సాధనకు ‘నాగా మదర్స్ అసోసియేషన్’ (ఎన్‌ఎంఏ) అనే మహిళా సంస్థ న్యాయపోరాటం చేస్తోంది. 2016లో ఈ సంస్థ పిటిషన్ పైనే స్పందించిన సుప్రీంకోర్టు 33 శాతం మహిళా రిజర్వేషన్లతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురుషుల ఆధిపత్యంలోని గిరిజన మండళ్లు వ్యతిరేకించడంతో పాటు ఆందోళనలు చెలరేగడంతో అది కార్యరూపం దాల్చలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో మహిళా ఎమ్మెల్యే లేని అసెంబ్లీ
ఎప్పుడు : స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు
ఎక్కడ : నాగాలాండ్
బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తేవాలి: లా కమిషన్ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రజా సంస్థే అని 21వ లా కమీషన్ తేల్చింది. దీనిని సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేసింది. బోర్డు ఆర్టీఐ చట్టపరిధిలోకి వస్తే జట్ల సెలక్షన్, ఆటగాళ్ల ఎంపిక వంటి అంశాలపై కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేయవచ్చు. జస్టిస్ బి.ఎస్.చౌహాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లా కమిషన్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను అందించనుంది.
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు తమ జెర్సీలపై త్రివర్ణాలను, హెల్మెట్‌లపై అశోక ధర్మచక్రాన్ని ప్రముఖంగా ధరించడంతో పాటు వారు సాధించిన ఘనతలకు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు, పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను పొందుతున్నారు. కాబట్టి దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌గా చూడలేమని, ప్రభుత్వ సంస్థే అవుతుందని కమిషన్ తమ సిఫారసులో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీసీసీఐ ప్రజాసంస్థే కాబట్టి ఆర్టీఐ పరిధిలోకి తేవాలని సిఫారసు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : 21వ లా కమీషన్
ఆయుధాల కొనుగోలుకు 16 వేల కోట్లు సాయుధ దళాల బలోపేతానికి రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.15,935 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు, సేకరణకు పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఫిబ్రవరి 13న ఈ మేరకు ఆమోదం తెలిపింది. కొనుగోలు చేయనున్న ప్రతిపాదిత జాబితాలో 7.40 లక్షల రైఫిల్స్, 5719 స్నైపర్ రైఫిల్స్, మెషీన్ గన్‌స ఉన్నాయి. సరిహదుల్లో పాక్, చైనాల నుంచి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. సుమారు రూ. 12,280 కోట్ల ఖర్చయ్యే రైఫిళ్లను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భారత్‌లో తయారుచేస్తారు. స్నైపర్ రైఫిళ్లను తొలుత విదేశాల నుంచి కొనుగోలు చేసి, తర్వాత భారత్‌లో తయారుచేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయుధాల కొనుగోలుకు 16 వేల కోట్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : రక్షణ శాఖ
ద్వైపాక్షికం యూఏఈ పర్యటనలో మోదీ సాంకేతికతను అభివృద్ధికోసం ఉపయోగించుకోవాలని విధ్వంసం కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న మోదీ ఫిబ్రవరి 11న జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో ప్రసంగించారు. దాదాపు 140 దేశాలకు చెందిన 4 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారత జనాభాలో 65 శాతం.. జనాభా 35 ఏళ్ల లోపువారేనని.. అందుకే సాంకేతికత ద్వారా యువతకు సాధికారత కల్పిస్తూ నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం ముందడుగేస్తోందని ఆయన తెలిపారు. ‘6 ఆర్’ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రీడిజైన్, రీమ్యానుఫ్యాక్చర్), ‘5 ఈ’ (ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ) సూత్రాల ద్వారానే మనం సంతోషంగా ఉంటామన్నారు.
సదస్సులో భాగంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ఇరు పక్షాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భారత ఆయిల్ కంపెనీల కన్సార్షియానికి 10% రాయితీ కల్పించే చారిత్రక ఒప్పందం కూడా ఉంది. ఇది 2018 నుంచి 2057 వరకు 40 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందంతో గల్ఫ్ దేశాల్లోని భారత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
అనంతరం దుబాయ్ ఒపెరా హౌజ్‌లో 30 లక్షల భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ అబుదాబిలో నిర్మించతలపెట్టిన తొలి హిందూ దేవాలయం బీఏపీఎస్ నారాయణ్ ఆలయ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్‌స ద్వారా శంకుస్థాపన చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీ దుబాయ్ పర్యటన
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : దుబాయ్
అబుదాబి ఆయిల్‌ఫీల్డ్‌లో ఓఎన్‌జీసీ విదేశ్‌కి వాటాఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్, దాని భాగస్వామ్య కంపెనీలు కలసి అబుదాబిలోని అతిపెద్ద ఆఫ్‌షోర్ చమురు క్షేత్రం(లోయర్ జుకమ్)లో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. ఈ కొనుగోలు విలువ దాదాపు 600 మిలియన్ డాలర్లు (రూ.3,840 కోట్లు). ఈ మేరకు ప్రధాని మోదీ, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ సమక్షంలో ఫిబ్రవరి 10న ఈ ఒప్పందం కుదిరింది.
చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న యూఏఈలోకి ఓ భారత కంపెనీ అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఈ ఒప్పందం 40 ఏళ్లు అమల్లో ఉంటుంది. ఓఎన్‌జీసీ విదేశ్‌తోపాటు ఐవోసీ, బీపీసీఎల్ ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం లోయర్‌జుకమ్ ఆయిల్ ఫీల్డ్‌లో నిత్యం 4 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరుగుతోంది. 2025 నాటికి రోజుకు ఉత్పత్తిని 4.5 లక్షల బ్యారెళ్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అబుదాబి ఆయిల్‌ఫీల్డ్‌లో భారత కంపెనీకి వాటా
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ఓఎన్‌జీసీ విదేశ్
పాలస్తీనా పర్యటనలో ప్రధాని మోదీఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని కోరారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించగా ఆరు ఒప్పందాలు కుదిరాయి. పాలస్తీనా సామర్థ్య నిర్మాణం కోసం భారత్ దాదాపు 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.321 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ తెలిపారు.
పాలస్తీనా పర్యటన సందర్భంగా ఆ దేశం మోదీని పాలస్తీనా విదేశీ అతిథులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో సత్కరించింది. ఈ పర్యటనతో పాలస్తీనా అధికార పర్యటనకు వచ్చిన తొలి భారత ప్రధానిగా మోడీ నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోదీ పాలస్తీనా పర్యటన
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎక్కడ : పాలస్తీనా
ప్రధాని మోదీ ఒమన్ పర్యటనఉగ్రవాదానికి సహకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఒమన్ దేశాలు నిర్ణయించాయి. ఒమన్ పర్యటనలో భాగంగా మోదీ ఫిబ్రవరి 12న ఆ దేశ సుల్తాన్ ఖబూస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై విసృ్తతంగా చర్చించిన మోదీ, ఖబూస్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక వీసాలు ఉన్నవారికి సంయుక్త వీసా రద్దుకు సంబంధించిన ఒప్పందంతో పాటు వైద్యం, పర్యాటకం, శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం వంటి ఒప్పందాలు ఉన్నాయి. డుక్మా ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారత సంస్థలు 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, ఒమన్‌ల మధ్య 8 ఒప్పందాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎక్కడ : ఒమన్
ఎందుకు : ప్రధాని మోదీ ఒమన్ పర్యటనలో భాగంగా
జోర్డాన్ రాజుతో భేటీ అయిన మోదీపశ్చిమాసియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 9న జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ఆ దేశ రాజు అబ్దుల్లా-2తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
ప్రాంతీయం తెలంగాణలో 17 పులులు ఉన్నట్లు ప్రాథమిక అంచనారాష్ట్ర అడవుల్లో పెద్ద పులులు, చిరుతల లెక్కలపై అటవీ శాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మొత్తం 17 పులులు, 125 చిరుతలు ఉన్నాయని జాతీయ జంతు గణనలో భాగంగా సేకరించిన పాదముద్రల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యధికంగా నల్లమలలోని రాజీవ్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 21 పెద్ద పులులు, 57 చిరుతల అడుగు జాడలను సేకరిం చగా.. అవి 13 పులులు, 45 చిరుతల పాదముద్రలని భావిస్తున్నారు. రెండో స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 4 పులులు, 25 చిరుతల అడుగుజాడలను గుర్తించారు. కచ్చితమైన నిరూపణ కోసం పాదముద్రలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు, పెంటిక (మలం) నమూనాలను సీసీఎంబీ హైదరాబాద్‌కు పంపించారు. కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోని జన్నారం దట్టమైన ఫారెస్టు పరిధిలో ఒకటంటే ఒక్క పులి అడుగు జాడ కనిపించలేదు.
ఈ-ప్రగతి ప్రాజెక్టుకు పెగా సాఫ్ట్‌వేర్సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేంద్రీకృత పోర్టల్ ‘ఈ-ప్రగతి’కి సాంకేతిక సేవలందించే ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఈ-ప్రగతి పోర్టల్ ద్వారా 33 ప్రభుత్వ విభాగాలు, 315 ఏజెన్సీలు, 745 పౌర సేవల్ని ఒకే గొడుగు కిందికి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,398 కోట్లు. ఒకే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో పౌర సేవల్ని అందించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఈ-ప్రగతి సీఈవో ఎన్.బాలసుబ్రమణ్యం చెప్పారు. కేంద్రీకృత వ్యవస్థ కావడంతో ఏపీలో డిజిటైజేషన్‌కు ఇది ఊతమిస్తుందని, అన్ని విభాగాలపై నియంత్రణ ఉంటుందని తెలియజేశారు. కాగా, భారత్‌లో పెగాసిస్టమ్స్‌కు ఇదే తొలి ప్రాజెక్టు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ-ప్రగతి ప్రాజెక్టుకు పెగా సాఫ్ట్‌వేర్
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
హైదరాబాద్‌లో ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాలుఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ 26వ ప్లీనరీ సమావేశాలు ఫిబ్రవరి 9-11 వరకు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సమావేశాలకు కోర్ కమిటీ సభ్యుడు మౌలానా సల్మాన్ నద్వీ గైర్హాజరై బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించడానికి శ్రీ శ్రీ రవిశంకర్‌ను బెంగళూరులో కలవడం వివాదానికి దారి తీసింది. దీంతో సల్మాన్ బోర్డు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో పాటు కొత్త బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చివరి రోజైన ఫిబ్రవరి 11న బోర్డు హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో కొన్ని నిర్ణయాలను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ 26వ ప్లీనరీ సమావేశాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 9-11 వరకు
ఎక్కడ : హైదరాబాద్
హైదరాబాద్‌లో తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుచిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణకు దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటవుతోంది. నాంపల్లిలోని హాకా భవన్‌లో ఉన్న భరోసా కేంద్రం ఆధీనంలోనే ఫిబ్రవరి 24న దీన్ని ప్రారంభించనున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో అత్యాచారం, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, తీవ్రమైన గృహహింస కేసుల్లో బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి భరోసా కేంద్రాన్ని 2016, మే 7న ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : చిన్నారులపై జరిగే అఘాయిత్యాల కేసుల విచారణకు
7 దేశాల్లో తెలంగాణ మహిళల బైక్ యాత్రతెలంగాణ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళలు బైక్‌లపై సాహసయాత్ర చేపట్టారు. ఈ మేరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఫిబ్రవరి 11న యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రా బృందానికి ప్రముఖ బైక్ రైడర్ జై భారతి నాయకత్వం వహిస్తుండగా ప్రియా బహదూర్, శిల్ప బాలకృష్ణన్, సుజన్ శాంతిలు సభ్యులుగా ఉన్నారు.
ఈ బృందం 50 రోజుల యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి మేకాంగ్ వరకు భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం వంటి 7 దేశాల్లో రోడ్డు మార్గం ద్వారా సుమారు 17 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వీరు 19 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు, 35 యునెస్కో సైట్లను సందర్శించి తెలంగాణ టూరిజం ప్రమోషన్‌తో పాటు, పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం నిర్వహిస్తారు. వీరికి 400 సీసీ బైకులను బజాజ్ ఆటో కంపెనీ స్పాన్సర్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7 దేశాల్లో తెలంగాణ మహిళల బైక్ యాత్ర
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి
ఎవరు : జై భారతి, ప్రియా బహదూర్, శిల్ప బాలకృష్ణన్, సుజన్ శాంతి
తెలంగాణలో బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ పార్కుతెలంగాణలో కన్‌స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుకు యూఏఈకి చెందిన కెఫ్ ఇన్‌ఫ్రా (కేఈఎఫ్ ఇన్‌ఫ్రా), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకోసం కెఫ్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే పార్కులో ఏర్పాటు కానున్న 60-70 అనుబంధ పరిశ్రమలతో మొత్తం 10 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, దాదాపు 30 వేల మందికి పరోక్ష ఉపాధి దొరకనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ పార్కు
ఎప్పుడు : త్వరలో
ఎక్కడ : తెలంగాణలో
ఎవరు : యూఏఈకి చెందిన కెఈఫ్ ఇన్‌ఫ్రా
హైదరాబాద్‌లో ఫ్రెంచ్ ఏరియల్ షోదేశంలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫ్రెంచ్ ఏరియల్ షో నగరవాసులను మంత్ర ముగ్ధులను చేసింది. భారీ క్రేన్ సాయంతో 50 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడుతూ.. మరోపక్క మనసుకు పులకరించే సంగీతం మధ్యన సాగిన విన్యాసాలను కేరింతలు, చప్పట్లతో సందర్శకులు స్వాగతించారు. ‘మన్సూర్ ఇండియా కల్చరల్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిర్వహిస్తున్న ఫ్రెంచ్ ఏరియల్ షో తొలి ప్రదర్శనను నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఫిబ్రవరి 13న రాత్రి నిర్వహించారు. ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో 18 మంది కళాకారుల సంగీతం, నృత్యం, క్రాఫ్ట్, ఆర్కెస్ట్రా, సర్కస్ తదితర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ఫ్రెంచ్ ఏరియల్ షో
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎక్కడ : హైదరాబాద్
ఆర్థికం 3 కోట్ల ఉచిత ఎల్పీజీకి రూ.4,800 కోట్లు
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకోసం ప్రకటించిన 3కోట్ల అదనపు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లకు రూ.4,800 కోట్లు అదనంగా ఖర్చుకానుంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫిబ్రవరి 8న ఢిల్లీలో వెల్లడించారు. గతంలో నిర్ణయించినట్లుగానే 5కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు అందజేస్తామని.. ఇప్పటికే 3.36కోట్ల కనెక్షన్లను పేద మహిళలను అందజేశామని తెలిపారు. ఇందుకోసం రూ.8వేల కోట్ల కేటాయింపులు జరిగాయిని చెప్పారు. ఇప్పుడు ఈ పథకాన్ని మరో 3 కోట్లు పెంచాలన్న ప్రకటన నేపథ్యంలో అదనంగా రూ.4,800 కోట్లకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అని పేర్కొన్నారు. క్విక్ రివ్యూ:
ఏమిటి : 3 కోట్ల అదనపు ఉచిత ఎల్పీజీకి రూ.4,800 కోట్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
స్మార్ట్ సిటీ పథకానికి 9,940 కోట్లుస్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో మహారాష్ట్రలోని 8 నగరాలకు రూ.1,378 కోట్లు, మధ్యప్రదేశ్‌లోని 7 నగరాలకు రూ.984 కోట్లు, తమిళనాడులోని 11 నగరాలకు రూ.848 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాలకు రూ.588 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలను విడుదల చేసింది. స్మార్ట్ సిటీ పథకంలో చేరడానికి పశ్చిమ బెంగాల్ విముఖత చూపినా, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు రూ.8 కోట్లు విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మార్ట్ సిటీ పథకానికి రూ.9,940 కోట్లు విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : దేశవ్యాప్తంగా
86 వేల కోట్ల రుణమాఫీ చేసిన పీఎస్‌బీలుప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.81,683 కోట్లను రైటాఫ్ చేశాయని తాజా ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. ఇందులో అత్యధికంగా ఎస్‌బీఐ రూ.20 వేల కోట్లకు పైగానే మొండిబాకీలను మాఫీ చేసింది. 2012-13 ఏడాదిలో పీఎస్‌బీలు రైటాఫ్ చేసిన రుణాలు రూ.27,231 కోట్లు.
2016-17లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ.9,205 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) రూ.7,346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) రూ.4,348 కోట్ల చొప్పున మొండి బకాయిలను రైటాఫ్ చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18) తొలి ఆరు నెలల కాలంలో(డిసెంబర్ వరకూ) పీఎస్‌బీలు రూ.53,625 కోట్లను రైటాఫ్ చేశాయి.
పీఎస్‌బీల రుణమాఫీ వివరాలు
ఏడాది | రైటాఫ్ మొత్తం |
2012-13 | రూ.27,231 కోట్లు |
2013-14 | రూ.34,409 కోట్లు |
2014-15 | రూ.49,018 కోట్లు |
2015-16 | రూ.57,585 కోట్లు |
2016-17 | రూ.81,683 కోట్లు |
2017-18 | రూ.53,625 కోట్లు (డిసెంబర్ నాటికి) |
ఏమిటి : 81,683 కోట్లను రుణమాఫీ చేసిన పీఎస్‌బీలు
ఎప్పుడు : 2016-17 ఆర్థిక సంవత్సరంలో
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ప్రపంచ సంపన్న నగరాల్లో ముంబైకి 12వ స్థానందేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రపంచ సంపన్న నగరాల్లో 12వ స్థానంలో నిలిచింది. ముంబై మొత్తం సంపద విలువ 950 బిలియన్ డాలర్లు (రూ.60.8 లక్షల కోట్లు). ఈ మేరకు ప్రపంచంలో 15 సంపన్న నగరాలతో న్యూ వరల్డ్ వెల్త్ ఓ నివేదిక విడుదల చేసింది. ముంబై తర్వాత 944 బిలియన్ డాలర్ల (రూ.50.04 లక్షల కోట్లు)తో టొరంటో, 912 బిలియన్ డాలర్ల(రూ.58.3 లక్షల కోట్లు)తో ఫ్రాంక్‌ఫర్ట్, 860 బిలియన్ డాలర్ల(రూ.54.4 లక్షల కోట్లు)తో పారిస్ అధిక సంపన్న నగరాలుగా జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
ఈ జాబితాలో 3 లక్షల కోట్ల డాలర్లతో (రూ.192 లక్షల కోట్లు) న్యూయార్క్ నగరం మొదటి స్థానంలో ఉంది. రెండు అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ఈ నగరంలోనే ఉన్నాయి. 2.7 లక్షల కోట్ల డాలర్ల (రూ.172.8 లక్షల కోట్లు) సంపదతో లండన్ రెండో స్థానంలో ఉండగా 2.5 లక్షల కోట్ల డాలర్ల సంపదతో టోక్యో మూడోస్థానంలో ఉంది.
టాప్-10 నగరాల జాబితా
ర్యాంక్ | నగరం | సంపద (లక్షల కోట్ల డాలర్లలో) |
1. | న్యూయార్క్ | 3 |
2. | లండన్ | 2.7 |
3. | టోక్యో | 2.5 |
4. | శాన్‌ఫ్రాన్సిస్కో | 2.3 |
5. | బీజింగ్ | 2.2 |
6. | షాంఘై | 2 |
7. | లాస్ ఏంజెలిస్ | 1.4 |
8. | హాంకాంగ్ | 1.3 |
9. | సిడ్నీ | 1 |
10. | సింగపూర్ | 1 |
ఏమిటి : ప్రపంచంలో 15 సంపన్న నగరాల జాబితా
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : ముంబైకి 12వ స్థానం
భారత వృద్ధి రేటు 7.5 శాతం: డాయిష్ బ్యాంక్భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19) లో 7.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డాయిష్ బ్యాంక్ తన నివేదికలో విశ్లేషించింది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి పెరిగే అవకాశాలు లేకపోవడమే తన విశ్లేషణకు ఆధారమని, ఇది వృద్ధికి దోహదపడే అంశమని పేర్కొంది.
నివేదిక ముఖ్యాంశాలు
- పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అమల్లో ఇబ్బందులు తత్సంబంధ అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ సవాళ్లు తొలగిపోనున్నాయి.
- అంతర్జాతీయ చమురు ధరల ధోరణి, వర్షపాతం, కనీస మద్దతు ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక మార్కెట్ల ఒడిదుడుకుల తీవ్రత వంటి అంశాలు వృద్ధికి నిరోధకాలుగా పనిచేయవచ్చు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌లో భారత్ వృద్ధి మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతానికి పడిపోయింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొంచెం మెరుగుపడి 6.3 శాతంగా ఉంది. అయితే డిసెంబర్, మార్చి త్రైమాసికంలో వృద్ధి మరింత పుంజుకుంటుంది.
ఏమిటి : భారత వృద్ధి రేటు 7.5 శాతంగా అంచనా
ఎప్పుడు : 2018-19
ఎవరు : డాయిష్ బ్యాంక్
ఎన్‌పీఏల పరిష్కారానికి కొత్త మార్గదర్శకాలుబ్యాంకింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న మొండిబాకీల సమస్యను మరింత వేగవంతంగా పరిష్కరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. మొండిబాకీలుగా మారే ఖాతాలను బ్యాంకులు మరింత ముందుగానే గుర్తించి, సత్వరం తగు చర్యలు తీసుకునే విధంగా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పలు రుణ పునర్‌వ్యవస్థీకరణ స్కీములను రద్దు చేసింది. సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న సంస్థ ఖాతా మొండిపద్దుగా మారిన పక్షంలో.. డిఫాల్ట్ అయిన నాటి నుంచి 180 రోజుల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే దివాలా చట్టం కింద సత్వరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత మార్గదర్శకాలను ఉల్లంఘించే బ్యాంకులపై జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌పీఏల పరిష్కారానికి కొత్త మార్గదర్శకాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఆర్‌బీఐ
దేశంలో 1.6 లక్షలకు చేరిన కుబేరుల సంఖ్య దేశీయంగా సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2017లో అత్యంత సంపన్న కుటుంబాల సంఖ్య 1.60 లక్షల పైకి చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. అయితే, వీరి ఉమ్మడి సంపద మాత్రం సుమారు అయిదు శాతమే వృద్ధి చెంది.. రూ. 153 లక్షల కోట్లుగా నమోదైంది. కోటక్ వెల్త్ మేనేజ్‌మెంట్ తరఫున అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సుమారు రూ. 25 కోట్ల పైగా సంపద ఉన్న కుటుంబాలను ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే అయిదేళ్లలో సంపన్న కుటుంబాల సంఖ్య 3.30 లక్షలకు, నికర సంపద విలువ రూ. 352 లక్షల కోట్లకు చేరవచ్చని అధ్యయనంలో అంచనా వేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో 1.6 లక్షలకు చేరిన కుబేరుల సంఖ్య
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఈవై అధ్యయనం
సైన్స్ అండ్ టెక్నాలజీ హాక్-ఐకి స్వదేశీ చోదక వ్యవస్థ
దేశంలోనే తొలిసారిగా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఆర్టీవోఎస్)తో రూపొందిన హాక్-ఐ యుద్ధ శిక్షణ విమానాన్ని హెచ్‌ఏఎల్ తొలిసారిగా పరీక్షించింది. ఆర్టీవోఎస్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్‌ఏఎల్ తయారుచేసింది. ఈ విమానాలను యుద్ధ అవసరాలకు, శిక్షణకు ఉపయోగించుకోవచ్చు. బ్రిటన్ మాతృకగా గల ఈ విమానాల్లో భారత్ తన అవసరాలకు తగినట్లుగా ఆర్టీవోఎస్‌ను నిక్షిప్తం చేసింది. ఇది ఫిబ్రవరి 7న విజయవంతంగా గగనవిహారం చేసింది. ఇందులో పొందుపరిచిన ప్రోగ్రామ్‌లను చాలా కచ్చితత్వంతో అమలు చేయడం ఈ విమానం ప్రత్యేకత.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్టీవోఎస్‌తో రూపొందించిన హాక్-ఐ యుద్ధ శిక్షణ విమానాన్ని తొలిసారిగా పరీక్షించిన హెచ్‌ఏఎల్
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : హెచ్‌ఏఎల్
ఎక్కడ : బెంగళూరు
పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. ‘ఉపరితలం నుంచి ఉపరితలంలోకి’ ప్రయోగించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఫిబ్రవరి 7న ఒడిశాలోని బాలసోర్‌లో సమీపంలో ఉన్న చాందీపూర్‌లోని ఇంటిగ్రేటేడ్ టెస్ట్ రేంజ్ మూడో వేదికపై మొబైల్ లాంచర్ సాయంతో ఈ క్షిపణిని ప్రయోగించారు. 500 నుంచి 1000 కిలోగ్రాముల వార్‌హెడ్‌సను పృథ్వీ-2 రెండు ఇంజిన్లతో సునాయాసంగా తీసుకెళ్లగలదు. ఈ ప్రయోగ గమనాన్ని డీఆర్‌డీవో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ ట్రాకింగ్ వ్యవస్థతో పాటు ఒడిశా తీరం వెంబడి ఉన్న టెలీమెట్రీ స్టేషన్ల సాయంతో పర్యవేక్షించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పృథ్వి - 2 క్షిపణి ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎక్కడ : చాందీపూర్‌లోని ఇంటిగ్రేటేడ్ టెస్ట్ రేంజ్
ఫాల్కన్ హేవీ రాకెట్ ప్రయోగం విజయవంతం ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’(స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. నిప్పులు విరజిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్.. స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్ కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫాల్కన్ హెవీ రాకెట్‌లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
కక్ష్య తప్పి.. సౌరవ్యవస్థలో షి‘కారు’..
తొలుత ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు భావించారు. అయితే ఫాల్కన్ హెవీ రాకెట్ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్ మస్క్ తెలిపారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది.
ఫాల్కన్ హెవీ ప్రత్యేకతలు: ఫాల్కన్ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారు 64 మెట్రిక్ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది. ఇది నిండుగా నింపిన 737 జెట్‌లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్ హెవీ కంటే శాటర్న్ వీ రాకెట్ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికై తే అంతరిక్ష రంగంలో ఫాల్కన్ హెవీ ప్రయోగం అతిపెద్దది. తొలుత ఫాల్కన్ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్ మస్క్ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
న్యూ హారిజాన్‌స స్పేస్ క్రాఫ్ట్ సరికొత్త చరిత్ర నాసాకు చెందిన న్యూ హారిజాన్‌స స్పేస్‌క్రాఫ్ట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ సాధించని రికార్డును తన పేరిట నమోదుచేసింది. సౌరకుటుంబంలో చివరిగా ఉంటూ.. కొన్నేళ్ల కిందట గ్రహం హోదా కోల్పోయిన ప్లూటో గురించి ఇప్పటికే ఎంతో సమాచారం అందించిన ఘనత ఈ న్యూ హారిజాన్‌స సొంతం. కాగా తాజాగా భూమికి సుదూరాన ఉన్న నక్షత్ర మండలి ఫొటోలను తీసి కొత్త రికార్డు సృష్టించింది. భూమికి 1,300 కాంతి సంవత్సరాల దూరంలో క్యూపర్ బెల్ట్‌లోని నక్షత్ర సమూహానికి చెందిన అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను న్యూ హారిజాన్‌స తీసింది. ఆ సయమంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి 612 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. తన అత్యాధునిక లాంగ్ రేంజ్ రీకానిసెన్‌స ఇమేజర్ కెమెరాను ఆన్ చేసి ఈ అద్భుత చిత్రాలను తీసింది. ఈ క్రమంలో గతంలో నాసాకే చెందిన వోయేజర్స్ 1 రికార్డును కూడా బీట్ చేసింది. వోయెజర్స్ స్పేస్‌క్రాఫ్ట్ అత్యధికంగా 606 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్లి ఫొటోలు తీసింది. ఇప్పుడు న్యూ హారిజాన్‌స ఆ దూరాన్ని దాటి ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఈ స్పేస్‌క్రాఫ్ట్ రోజుకు 11 లక్షల కిలోమీటర్ల వేగంతో విశ్వంలో దూసుకెళ్తోంది.
కొత్త రకం అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తున్న పాక్పాకిస్తాన్ కొత్త రకం అణ్వాయుధాలను తయారుచేస్తోందని అమెరికా ఇంటెలిజెన్‌స చీఫ్ ఫిబ్రవరి 13న హెచ్చరించారు. వాటిలో స్వల్ప శ్రేణి ఆయుధాలు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రమాద తీవ్రత పెరుగుతోందని డెరైక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్‌స డ్యాన్ కోట్స్ కాంగ్రెస్‌కు చెప్పారు. సముద్రం నుంచి, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే క్షిపణులు, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు కూడా పాక్ తయారుచేస్తున్న వాటిలో ఉన్నాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొత్త రకం అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తున్న పాక్
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : హెచ్చరించిన అమెరికా ఇంటెలిజెన్స్
దేశంలో పెరిగిన అటవీ విస్తీర్ణంభారత అటవీ నివేదిక- 2017ను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్థన్ ఫిబ్రవరి 12న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం 2015-17 మధ్యకాలంలో భారత అటవీ విస్తీర్ణం 0.21 శాతం మేర పెరిగింది. దేశం మొత్తం అటవీ విస్తీర్ణం 7,08,273 చ.కి.మీ.గా ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.53 శాతం వాటాను కలిగి ఉంది.
ల్యాబ్‌లో మానవ అండాల అభివృద్ధిబ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ అండాలను ప్రయోగశాలలో విజయవంతంగా పెంచారు. ఇవి మానవ అండాల అభివృద్ధి తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని లండన్‌లో ఫిబ్రవరి 9న వెల్లడించారు. కాగా, ఎలుకల అండాలను దాదాపు 20 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. పరిశోధనల్లో భాగంగా 25-40 ఏళ్ల వయసు కలిగిన 10 మంది మహిళల నుంచి అండాశయ కణజాలాన్ని సేకరించారు.
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం వేదికగా ప్రతిష్టాత్మక వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 9న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. 92 దేశాల నుంచి 2,920 మంది క్రీడాకారులు 102 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (శివ కేశవన్, జగదీశ్) బరిలో ఉన్నారు. వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న శివ కేశవన్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా వ్యవహరించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎక్కడ : దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్
ఇండియా ఓపెన్ విజేత సౌరవ్భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 11న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 11-9, 5-11, 6-11, 11-7, 12-10తో నికోలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా ఓపెన్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : సౌరవ్ ఘోషల్
వార్తల్లో వ్యక్తులు బంగ్లా మాజీ ప్రధాని జియాకు జైలు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియా(72)కు ఓ అవినీతి కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. దీంతో డిసెంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆమె అనర్హతకు గురయ్యే వీలుంది. తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అనాథ శరణాలయానికి సేకరించిన విదేశీ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 8న ఈ తీర్పు వెలువరించింది. జియా కొడుకు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తారిక్‌నూ దోషిగా తేల్చిన కోర్టు..ఆయనతో పాటు మరో నలుగురికి 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం తారిక్ లండన్‌లో అజ్ఞాతంలో ఉన్నారు.
ప్రతిపక్ష బీఎన్‌పీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్న జియా.. మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జైలు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ఖలీదా జియా:
ఎందుకు : అవినీతి కేసులో
‘బాటా’ అంబాసిడర్‌గా స్మృతి మంధన భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధనను ప్రముఖ పాదరక్షల ఉత్పత్తి సంస్థ బాటా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. సంస్థకు చెందిన క్రీడా సంబంధ బ్రాండ్ ‘పవర్’కు అంబాసిడర్‌గా స్మృతి వ్యవహరించనుంది. 2017లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన స్మృతి.. తాజాగా ఫిబ్రవరి 7న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేసి సత్తాచాటింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘బాటా’ అంబాసిడర్‌గా మహిళా క్రికెటర్ స్మృతి మంధన
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎందుకు : క్రీడా సంబంధ బ్రాండ్ ‘పవర్’కు ప్రచారం కోసం
ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డెరైక్టర్‌గా ఇంద్రా నూయీపెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి మహిళా స్వతంత్ర డెరైక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 9న నియామకం ఖరారైంది. ఆమె ఈ ఏడాది జూన్‌లో బోర్డులో చేరతారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేసే ఉద్దేశంతో గతేడాది జూన్‌లో ఐసీసీ నియమావళిలో భారీ సంస్కరణలు చేపట్టారు. దీనిలో భాగంగా బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా స్వతంత్ర డెరైక్టర్ ఉండాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. నూయీ నియామకాన్ని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ స్వాగతించారు. తమ పాలనా వ్యవహారాల పరిధి పెంపొందించుకునేందుకు ఆమె సామర్థ్యం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి స్వతంత్ర డెరైక్టర్ పదవి రెండేళ్ల పాటు ఉంటుంది. దీనిని వరుసగా రెండు దఫాల్లో ఆరేళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డెరైక్టర్
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : ఇంద్రా నూయీ
పాక్ ఉద్యమకారిణి అస్మా జహంగీర్ కన్నుమూతపాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66) ఫిబ్రవరి 11న కన్నుమూశారు. 1952లో లాహోర్ జన్మించిన అస్మా, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని 1983లో అప్పటి పాక్ నియంత జియా ఉల్ హక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో సైనిక ప్రభుత్వం ఆమెను జైల్లో నిర్బంధించింది. జైలు నుంచి విడుదలైన అనంతరం 1986లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు వెళ్లిన ఆమె..డిఫెన్‌స ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ సంస్థకు రెండేళ్లు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1987లో పాకిస్తాన్‌లో స్థాపించిన జాతీయ మానవహక్కుల సంఘానికి 1993 వరకూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
పాకిస్తాన్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన అస్మా.. శక్తిమంతమైన ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్‌ఐల వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించేవారు. మానవహక్కుల రంగంలో చేసిన కృషికి గానూ 2014లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు, 2010లో ఫ్రీడమ్ అవార్డు, హిలాల్ ఏ ఇంతియాజ్ అవార్డులను ఆమె అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాక్ మానవహక్కుల ఉద్యమకారిణి కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : అస్మా జహంగీర్
దేశంలో ధనిక సీఎం చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది. అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో నిలవగా, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ.48 కోట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులున్నారు. వీరి సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్‌ఎల్‌డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి.
అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు.
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది (35శాతం)పై క్రిమినల్ కేసులు, దాదాపు 26 శాతం సీఎంలపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. విద్యార్హతల విషయంలో మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండో తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్ సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో ధనిక ముఖ్యమంత్రి
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఎందుకు : దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్‌లు విశ్లేషించిన ఏడీఆర్, ఎలక్షన్ వాచ్
కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా చంద్రశేఖర కంబారకేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా కన్నడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య చంద్రశేఖర కంబార ఫిబ్రవరి 12న ఎన్నికయ్యారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీతైన కంబార..కవిగా, నాటకరంగ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందారు.
బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా అబ్దుల్ హమీద్ బంగ్లాదేశ్ అధ్యక్షడిగా అబ్దుల్ హమీద్ ఫిబ్రవరి 7న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండోసారి బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు
అవార్డులు ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు ‘ఎస్’ పురస్కారం
వినూత్న ఆవిష్కరణల్లో ముందుండే ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు. తమ ప్రతిభాపాటవాలతో ప్రతిష్టాత్మకంగా భావించే యంగ్ ఇంజినీర్స్ అండ్ సైంటిస్ట్స్(వైఈఎస్) అవార్డును కైవసం చేసుకున్నారు. ఏటా హోండా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ పురస్కారాన్ని విద్యాసంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇస్తుంటారు. ప్రస్తుతం 2017-18 సంవత్సరానికి గాను పియూష్ నందా, బిందు సాంచెట్టి, అయాన్ మజుందార్‌లు ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరంతా తమతమ కోర్సులలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులే. హోండా సంస్థ అధికారులు మాట్లాడుతూ.. ఎస్ అవార్డు సొంతం చేసుకున్న ఈ ముగ్గురు విద్యార్థులకు 3వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందిస్తామని ప్రకటించారు. దీనితోపాటు జపాన్‌లోని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్రెడిట్ గ్రాంటింగ్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు ‘ఎస్’ పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : హోండా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ప్రొఫెసర్ జగదీశ్‌కు నాయుడమ్మ అవార్డు నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్‌స సంస్థ ఏటా అందించే ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డును ఈ ఏడాది ఆస్ట్రేలియాకు చెందిన ప్రొ.డాక్టర్ చెన్నుపాటి జగదీశ్‌కు అందచేస్తున్నట్లు ఆ సంస్థ డెరైక్టర్ ఎ.జగదీశ్ ఫిబ్రవరి 7న తెలిపారు. ఆస్ట్రేలియా నేషనల్ వర్సిటీలో జగదీశ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఢిల్లీ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. ఆయన సెమీ కండక్టర్ ఆఫ్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలో విశేష కృషి చేశారు. పలు అంశాలపై ఆయన రాసిన 870కుపైగా పరిశోధనాపత్రాలు ప్రచురిత మయ్యాయి. అమెరికాలో 5 పేటెంట్లతో పాటు 11 పుస్తకాలు ప్రచురించారు. గతంలో ఈ అవార్డును కె.కస్తూరి రంగన్, నందన్ నీలేకని తదితర ప్రముఖులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాయుడమ్మ అవార్డు - 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రొ.డాక్టర్ చెన్నుపాటి జగదీశ్
నౌహెరాకు పవర్ ఫుల్ ఉమెన్ అచీవర్ అవార్డు నెక్స్‌బ్రాండ్ తాజాగా ‘పవర్‌ఫుల్ ఉమెన్ అచీవర్’ అవార్డును ప్రకటించింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో హీరా గ్రూప్ వ్యవస్థాపకురాలు, సీఈవో షేక్ నౌహెరా ఈ అవార్డును అందుకున్నారు. ఆమె 19 ఏళ్ల వయసులో విద్యా రంగంలో కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత మల్టీ డైవర్సిఫైడ్ కంపెనీ ‘హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ను స్థాపించారు. ఇది జువెలరీ, టెక్స్‌టైల్, ఎడ్యుకేషన్, మినరల్ వాటర్, గ్రానైట్, గోల్డ్, టూర్స్ అండ్ ట్రావెల్స్, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తోంది. నౌహెరా ఇటీవల ‘ఆల్ ఇండియా మహిళా సాధికారత పార్టీ’ని స్థాపించడం ద్వారా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెక్స్‌బ్రాండ్ ‘పవర్‌ఫుల్ ఉమెన్ అచీవర్’ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : షేక్ నౌహెరా
ప్రముఖ వైద్యుడు జీఆర్ రెడ్డికి అంతర్జాతీయ అవార్డు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ జీఆర్ రెడ్డికి ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ అవార్డు లభించింది. అంధత్వ నివారణకు కృషి చేస్తున్న వైద్యులకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. భారతదేశం నుంచి జీఆర్‌రెడ్డికి మాత్రమే ఈ పురస్కారం దక్కింది. జీఆర్ రెడ్డి గ్రామీణ ప్రాంతంలో గ్లకోమా (నీటి కాసులు)పై అవగాహన కల్పించడంతోపాటు 30 ఏళ్లుగా డయాబెటిక్ రెటినోపతిని ప్రజలకు చేరువ చేశారు. భారత్‌లో అత్యధికంగా రెటీనా శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్‌గా కూడా ఆయనకు గుర్తింపు ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ప్రముఖ వైద్యుడు జీఆర్ రెడ్డి
ఎందుకు :
అంధత్వ నివారణకు కృషి చేస్తున్నందుకు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు గోల్డెన్ పీకాక్ అవార్డు
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) విభాగంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డెన్ ిపీకాక్ అవార్డును చేజిక్కించుకుంది. బెంగళూరులో ఫిబ్రవరి 12న జరిగిన అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ సదస్సులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ఎయిర్‌పోర్టు నిర్వాహకులైన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈఓ ఎస్‌జీకే కిశోర్ మాట్లాడుతూ..పన్నెండేళ్లుగా జీఎంఆర్ సంస్థ వరలక్ష్మీ ఫౌండేషన్ ద్వారా విమానాశ్రయ పరిసర గ్రామాల్లో యువతకు ఉపాధి అవకాశాలు, వైద్య, విద్య, మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు గోల్డెన్ పీకాక్ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎందుకు : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) విభాగంలో
AIMS DARE TO SUCCESS
అంతర్జాతీయం దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా సిరిల్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 9 ఏళ్ల జుమా పాలనకు తెరపడింది. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ), జుమాకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. ఆయన రాజీనామా చేయకపోతే ప్రతిపక్ష పార్టీలతో కలసి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి జుమాను గద్దె దించాలని అధికార పార్టీ భావించింది. జాకబ్ జుమా రాజీనామా నేపథ్యంలో దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 15న జరిగిన పార్లమెంటు సమావేశంలో ఆయన ఎన్నికైనట్లు ప్రకటన వెలువడింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 65 ఏళ్ల రామాఫోసా రెండు నెలల కిందటే ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా రామాఫోసా
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎందుకు : జాకబ్ జుమా పదవికి రాజీనామా చేసినందున
నేపాల్ ప్రధానిగా ఓలీ ప్రమాణ స్వీకారం హిమాలయ దేశమైన నేపాల్‌కు 41వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఫిబ్రవరి 15న ప్రమాణ స్వీకారం చేశారు. మహరాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లో అధ్యక్షురాలు బిద్యా దేవీ.. ఓలీ చేత ప్రమాణం చేయించారు. ఓలీ ఇంతకుముందు 2015 అక్టోబర్ నుంచి 2016, ఆగస్టు 3 వరకూ నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓలీకి చెందిన సీపీఎన్-యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ 174 సీట్లు గెలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేపాల్ ప్రధాని ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ
యూనిసెఫ్ ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది చిన్నారులు పుట్టినవెంటనే చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. నెల రోజుల్లోపు వయసున్న చిన్నారులు ప్రతి ఏటా 26 లక్షల మంది కన్నుమూస్తున్నారని వెల్లడించింది. ఈ మేరకు ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి అనుబంధంగా 184 దేశాల్లో చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి యూనిసెఫ్ నివేదికను ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చుకుంటే పేద దేశాల్లో పుట్టే చిన్నారులు చనిపోయే అవకాశం 50 రెట్లు ఎక్కువని పేర్కొంది. ఈ మరణాలన్నీ మెరుగైన వైద్యంతో నివారించదగ్గవేనని యూనిసెఫ్ తెలిపింది.
నవజాత శిశువుల మరణాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచిందనీ, అక్కడ పుట్టిన ప్రతి 22 మంది శిశువుల్లో ఒకరు చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. శిశు మరణాలకు సంబంధించి 52 దిగువ మధ్యతరగతి దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచినట్లు యూనిసెఫ్ తెలిపింది. నవజాత శిశువుల మరణాలు జపాన్‌లో(ప్రతి 1,111 మందిలో ఒకరు) అత్యల్పంగా నమోదైనట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ నివేదిక
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : యూనిసెఫ్
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలపై
ఇజ్రాయెల్ ప్రధానిపై విచారణకు సిఫారసుఅవినీతి ఆరోపణలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై రెండు కేసుల్లో నేరాభియోగాలు నమోదుకు ఆ దేశ పోలీసులు ిసిఫారసు చేశారు. 14 నెలల దర్యాప్తు అనంతరం నెతన్యాహుకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయని ప్రకటించిన పోలీసులు.. ప్రభుత్వ విచారణకు సిఫారసు చేశారు. అనుకూలంగా పనులు చేసి పెట్టేందుకు కానుకలు స్వీకరించడం; మీడియా కవరేజ్ కోసం ఒక ప్రముఖ వార్తా ప్రతిక ప్రచురణకర్తతో తెరవెనుక లావాదేవీలు జరపడం వంటివి పోలీసుల ప్రధాన ఆరోపణలు. నెతన్యాహు గత పదేళ్ల కాలంలో దాదాపు 3 లక్షల డాలర్లు స్వీకరించారని పోలీసులు ఆరోపించారు.
జాతీయం ఎన్నికల కమిషనర్ల వేతనం రూ.2.50 లక్షలు ఎన్నికల కమిషనర్ల వేతనాలు రెండింతలు పెరిగాయి. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సమానంగా వారు వేతనాలు అందుకోనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఎన్నికల సంఘంలో ఉన్న మిగతా ఇద్దరు కమిషనర్లూ ప్రస్తుతం ఉన్న నెలకు రూ.90 వేల బదులు రూ.2.50 లక్షలు అందుకోనున్నారు. పెరిగిన వేతనం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషనర్లకు కూడా వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
విద్యార్థులతో మోదీ ‘పరీక్షా పర్ చర్చా’ కార్యక్రమం 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ‘పరీక్షా పర్ చర్చా’ పేరిట ఢిల్లీలోని తల్కతోరాస్టేడియంలో ఫిబ్రవరి 16న నిర్వహించిన కార్యక్రమంలో గంటన్నరకు పైగా విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఈ చర్చను దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి.. పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి.. ఎలా విజయం సాధించాలన్న అంశాలపై విద్యార్థులకు సూచనలు, సలహాలు చేశారు. ఫలితం గురించి ఆందోళన చెందకుండా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఆయన బోధించారు. ఇతరులతో పోటీ పడకుండా తమతో తామే పోటీపడాలని, నిరాశతో మధ్యలోనే వదిలిపెట్టే ధోరణిని అధిగమించాలని సూచించారు. ప్రతి భారతీయ చిన్నారి పుట్టుకతోనే రాజకీయ నాయకుడని, తనకు కావాల్సింది ఎలా పొందాలో వారికి బాగా తెలుసని మోదీ అన్నారు.
పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెపుతూ ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని ఇటీవలే ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యార్థులతో ‘పరీక్షా పర్ చర్చా’ కార్యక్రమం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢి ల్లీలో
ఎన్నికల్లో పోటీ చేసే వారు ఆదాయ మార్గాలు చెప్పాలిఎన్నికల విధానంలో సంస్కరణలకు బాటలు పరిచే కీలక ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతోపాటు వారి జీవిత భాగస్వాముల ఆస్తులతోపాటు ఆదాయ మార్గాలనూ వెల్లడించాలని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వారి జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన ఇతరుల ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించటంతోపాటు ఆస్తులు అకస్మాత్తుగా పెరిగిందీ లేనిదీ పరిశీలించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ వ్యవస్థ అందజేసిన వివరాలపై ‘సంబంధిత శాసన వ్యవస్థలు’ పరిశీలించి సదరు పార్లమెంటు లేదా శాసనసభల సభ్యులు అర్హులో కాదో నిర్ణయిస్తాయని చెప్పింది. అభ్యర్ధుల ఆస్తుల వివరాలను తెలుసుకోవటం పౌరుల ప్రాథమిక హక్కని తెలిపింది. ఇందుకోసం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్నికల్లో పోటీ చేసే వారు ఆదాయ మార్గాలు చెప్పాలి
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీలో ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సుప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు ఫిబ్రవరి 16న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుని ప్రారంభించిన ప్రధాన నరేంద్ర మోదీ.. వాతావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, అయితే మిగిలిన వారే తమ తమ వాగ్దానాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సమానత్వం, న్యాయం, వాతావరణ న్యాయం వైపు తమను నడిపిస్తున్నాయని చెప్పారు. 2030 నాటికి 3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను కరిగించేందుకు కార్బన్ సింక్ రూపొందించే విషయంపై మాట్లాడుతూ.. ‘ఈ లక్ష్యాన్ని సాధించే విషయంలో భారత్ స్థిరమైన వృద్ధి సాధిస్తోంది’ అని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఘనంగా బాహుబలి అభిషేకోత్సవం కర్ణాటకలోని హాసన్ జిల్లా శ్రావణ బెళగొళలో బాహుబలి 88వ మహామస్తకాభిషేకాల్లో ప్రధాన ఘట్టమైన అభిషేకోత్సవం ఫిబ్రవరి 17న ఘనంగా జరిగింది. 12 ఏళ్లకోసారి నిర్వహించే మహామస్తకాభిషేకాన్ని చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య పవిత్రజలంతో బాహుబలిని అభిషేకించారు. అనంతరం జైన మునులు, భక్తులు బిందెలలోని పవిత్ర జలాలతో విగ్రహాన్ని అభిషేకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీఎం హోదాలో మహామస్తకాభిషేకాల్లో తొలిసారి పాల్గొన్నాననీ, ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని సీఎం వ్యాఖ్యానించారు.
ముంబైకి రెండో విమానాశ్రయానికి శంకుస్థాపన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 19న శంకుస్థాపన చేశారు. అలాగే దేశంలోనే అతి పెద్ద నౌకాశ్రయమైన జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)లోని నాలుగో టర్మినల్‌లో మొదటి దశను మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన (ఒకటే రన్‌వే ఉన్న వాటిలో) ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త విమానాశ్రయాన్ని అందుబాటులోకి తేనున్నారు. నవీ ముంబైలో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన 1997 నుంచి ఉండగా 21 ఏళ్ల తర్వాత శంకుస్థాపన జరిగింది. రూ.16,700 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టును జీవీకే గ్రూప్, సిడ్కో (ముంబై నగర పారిశ్రామికాభివృద్ధి సంస్థ) కలసి నిర్మించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముంబై రెండో విమానాశ్రయానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
జైపూర్‌లో ‘మహిళా’ రైల్వే స్టేషన్ రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్‌ను ఇకపై పూర్తిగా ఉద్యోగినులే నిర్వహించనున్నారు. స్త్రీలకు సాధికారత కల్పించే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ స్టేషన్‌లో టికెట్ తనిఖీ, ఆర్‌పీఎఫ్, రిజర్వేషన్ కార్యాలయం తదితర అన్ని విభాగాల్లోని ఉద్యోగాల్లోనూ మొత్తం మహిళలనే నియమించినట్లు వాయవ్య రైల్వే అధికారి చెప్పారు. శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషీన్లను ఈ స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. గాంధీనగర్ స్టేషన్ గుండా రోజుకు 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మహిళా’ రైల్వే స్టేషన్
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎక్కడ : జైపూర్, రాజస్తాన్
ముంబై, పుణే మధ్య హైపర్‌లూప్ నెట్‌వర్క్ ముంబై-పుణేల మధ్య హైపర్‌లూప్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు అమెరికాకు చెందిన వర్జిన్ హైపర్‌లూప్స్ వన్(వీహెచ్‌వో) సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఫిబ్రవరి 18న ఒప్పందం చేసుకుంది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. దాదాపు రూ.20,000 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 2021 నాటికి పూర్తికానుంది. దీనివల్ల ముంబై, పుణేల మధ్య ప్రయాణ సమయం 3 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. హైపర్‌లూప్ టికెట్ ధర విమానాల చార్జీలకు సమానంగా ఉంటాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీహెచ్‌వో చైర్మన్ రిచర్డ్ బ్రాన్సన్ తెలిపారు. హైపర్‌లూప్ వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ ప్రాజెక్టుతో రాబోయే 30 ఏళ్లలో భారత్‌కు రూ.3.5 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.
భూమిపై నిర్మించిన గొట్టాల్లాంటి నిర్మాణాల్లో గాలిలేకుండా చేసి మాగ్నెటిక్ లెవిటేషన్ సాయంతో ప్యాడ్ల(బోగీల)ను గంటకు 1,223 కి.మీ వేగంతో వెళ్లేలా చేయడాన్నే హైపర్‌లూప్ టెక్నాలజీగా పిలుస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముంబై, పుణే మధ్య హైపర్‌లూప్ నెట్‌వర్క్
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : వర్జిన్ హైపర్‌లూప్స్ వన్(వీహెచ్‌వో) సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం
ద్వైపాక్షికం ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భారత పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 17న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు విసృ్తత చర్చలు జరిపారు. అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అనంతరం రౌహానీతో కలసి మోదీ సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం, మత్తు పదార్థాల రవాణా, సైబర్ నేరాలు తదితరాలను ప్రోత్సహిస్తున్న శక్తులను నిలువరించేందుకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయన్నారు. ఇరాన్‌లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహర్ నౌకాశ్రయాన్ని ఆయన స్వర్ణ ద్వారంగా అభివర్ణించారు. రౌహానీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు విషయంలో ఇరాన్, భారత్ ఉమ్మడి వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. భారత్, ఇరాన్‌ల మధ్య రాజకీయ, రాయబారాలకు మించిన చారిత్రక సంబంధం ఉందని రౌహానీ అన్నారు. ప్రాంతీయ సమస్యలను రాజకీయ చర్యలు, రాయబారాలతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో కలసి తాను కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ఇరాన్ ఎప్పటికీ లోబడి ఉంటుందని రౌహానీ అన్నారు. ఈ ఒప్పందం రద్దయితే అమెరికా చింతించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అనుకూలంగా రౌహానీ మాట్లాడారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు భద్రతా మండలిలో వీటో అధికారాలు ఎందుకు లేవనీ, అణు బాంబులు కలిగిన వారికి కూడా వీటో అధికారాలు ఉన్నాయంటూ ఆయన భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికారు.
9 ఒప్పందాలపై సంతకాలు
ఉగ్రవాదం, భద్రత, వాణిజ్యం, ఇంధనం తదితరాల అంశాలపై చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య 9 ఒప్పందాలు కుదిరాయి. చాబహర్ నౌకాశ్రయంలో కార్యకలాపాలను భారత్ నిర్వహించేందుకు అవసరమైన ఒప్పందం, ద్వంద్వ పన్నులు, పన్నుల ఎగవేతను నివారించడం, రాయబార పాస్‌పోర్టులు కలిగిన వారికి వీసాల నుంచి మినహాయింపునివ్వడం, వైద్యం, ఇంధన రంగాలకు సంబంధించిన ఒప్పందాలు వాటిలో ఉన్నాయి. ఇరు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ తొమ్మిదింటితోపాటు రౌహానీ పర్యటన సందర్భంగా మరో 4 ఒప్పందాలు కూడా ఇరు దేశాల మధ్య కుదిరాయని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు.
పాంతీయం
హైదరాబాద్‌లో అంతర్జాతీయ మైనింగ్ సదస్సు హైదరాబాద్‌లో 4 రోజుల అంతర్జాతీయ మైనింగ్ సదస్సు జరిగింది. మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు, ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గనులేమీ అక్షయ పాత్రలు కావని.. దుర్వినియోగం చేస్తే వైపరీత్యాలు, ఆపదలు తప్పవని గవర్నర్ అన్నారు. గనుల తవ్వకాల కోసం ధ్వంసం చేసిన అడవులను తప్పనిసరిగా పునరుద్ధరించాలని, లేదంటే కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ మైనింగ్ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 14 - 17
ఎక్కడ : హైదరాబాద్
హైదరాబాద్‌లో ఇరాన్ అధ్యక్షుడి పర్యటన భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ.. ఫిబ్రవరి 16న (శుక్రవారం) చారిత్రక మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతు.. భారతదేశానికి పెట్రోల్, గ్యాస్ విక్రయించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. తమ దేశంలో చబహార్ ఓడరేవు ప్రారంభమైందని, దీని వల్ల భారత్‌కు రవాణా మార్గం దగ్గర అవుతుందని పేర్కొన్నారు.
భారతదేశం ఓ పుష్పగుచ్ఛం లాంటిదని, ఓ పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులూ ఉంటాయని, అలాగే భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, తెగలు ఐకమత్యంతో ఉంటున్నాయని రౌహానీ పేర్కొన్నారు. ఇరు దేశాలు టెక్నాలజీ, వైజ్ఞానిక రంగాల్లో సహాయ, సహకారాలు అందించుకోవాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో ఇరాన్ అధ్యక్షుడి పర్యటన
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : హసన్ రౌహాని
కావేరీ జలాల్లో కర్ణాటకకు మరో 14.75 టీఎంసీలుతమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న కీలక తీర్పునిచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశమిచ్చింది. అంతే పరిమాణంలో తమిళనాడుకు కోత విధించింది. కేటాయింపుల్లో తాగు నీటికే తొలి ప్రాధాన్యత అని సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తేల్చింది. బెంగళూరుకు ఉన్న ‘ప్రపంచ స్థాయి నగరం’ హోదాను దృష్టిలో పెట్టుకుని తాజా కేటాయింపులు చేస్తున్నామంది. 14.75 టీఎంసీల్లో బెంగళూరు నగర అవసరాలకోసం 4.75 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ తీర్పుతో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని బిలిగుండ్లు నుంచి తమిళనాడుకు కర్ణాటక 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది.
జాతీయ ఆస్తి.. రాష్ట్రాల సొత్తు కాదు
అంతర్జాతీయ నదీ జలాల సమాన పంపకాలకు సంబంధించిన హెల్సింకి, కాంపియన్, బెర్లిన్ నిబంధనలను తాజా తీర్పులో ఉటంకించిన కోర్టు.. నదులు జాతీయ ఆస్తులనీ, ఏ రాష్ట్రం కూడా ఒక నది పూర్తిగా తనకే చెందుతుందని చెప్పుకోజాలదని స్పష్టం చేసింది. ప్రకృతి వరప్రసాదాలైన నదీ జలాలను బాధ్యతాయుతంగా వాడుకునే హక్కు ఆ నది పారుతున్న ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 363 ప్రకారం ఈ కేసును సుప్రీంకోర్టు విచారించకూడదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కావేరీ జలాల వివాదం విషయమై 2016లో కర్ణాటక, తమిళనాడుల్లో ఘర్షణలు జరిగాయి.
తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75
సీడబ్ల్యూడీటీ 2007లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలకు వరుసగా 419, 270, 30, 7 టీఎంసీల నీటిని కేటాయించింది. తాజా తీర్పుతో తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 టీఎంసీల నీళ్లు దక్కనున్నాయి. కేరళ, పుదుచ్చేరిల కేటాయింపుల్లో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి మార్పులూ చేయలేదు. అలాగే నదీ పరీవాహక ప్రాంతం నుంచి 10 టీఎంసీల భూగర్భ జలాలను తోడుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. తీర్పును అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రానికి ధర్మాసనం ఆరు వారాల గడువిచ్చింది. 15 ఏళ్ల వరకు ఈ కేటాయింపులు అమలవుతాయని ధర్మాసనం తెలిపింది.
1881 నుంచి వివాదం
- 1881వ సంవత్సరంలో కావేరీ నదిపై డ్యామ్ నిర్మించాలన్న అప్పటి మైసూర్ సంస్థానం ప్రయత్నాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్డుకోవటంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత నదీ జలాల పంపిణీపై రెండు ప్రభుత్వాలు 1892, 1924వ సంవత్సరాల్లో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోవటంతో వివాదం పరిష్కారమయింది. ఈ ఒప్పందాల కాల పరిమితి 1974లో ముగిసింది.
- 1990 - తమిళనాడు కోరిక మేరకు కేంద్రం కావేరీ జల వివాద ట్రిబ్యునల్(సీడబ్ల్యూడీటీ)ను ఏర్పాటు చేసింది.
- 1991 - అత్యవసర సాయంగా కొంతనీరు విడుదల చేయాలన్న తమిళనాడు వినతిని సీడబ్ల్యూడీటీ తిరస్కరించింది. దీంతో తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం సూచనల మేరకు.. తమిళనాడుకు 205 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూడీటీ కోరగా కర్ణాటక పట్టించుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కర్ణాటక దిగిరాలేదు. ఈ పరిణామంతో కేంద్రం సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను గెజిట్‌లో ప్రచురించింది.
- 1998 - సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను అమలు పరిచేందుకు ప్రత్యేకంగా కేంద్రం కావేరి నదీ ప్రాధికార సంస్థ(సీఆర్‌ఏ)ను ఏర్పాటు చేసింది.
- 2007 - ఏర్పాటైన 17 ఏళ్ల తర్వాత కావేరి జలాల పంపిణీ తుది అవార్డును సీడబ్ల్యూడీటీ ప్రకటించింది. నదీ జలాల పంపిణీపై 1892, 1924 సంవత్సరాల్లో కుదిరిన ఒప్పందాల అమలే సరైన పరిష్కారమని అందులో పేర్కొంది.
- 2013 - కావేరి యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని తమిళనాడు కోరడంతో ఆ మేరకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- 2013 మే 28 - సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయనందుకు తనకు కలిగిన రూ.2,480 కోట్ల నష్టాన్ని కర్ణాటక చెల్లించాలంటూ తమిళనాడు సుప్రీంకు వెళ్లింది.
- 2013 - నీటి విడుదలపై సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయాలన్న తమిళనాడు డిమాండ్ సహేతుకం కాదని కావేరీ పర్యవేక్షక కమిటీ పేర్కొంది.
- 2016 సెప్టెంబర్ 11 - కావేరి నీటి విడుదలపై ఉత్తర్వులను సవరించాలని కర్ణాటక వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
హైదరాబాద్‌లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్‘ఐటీ పరిశ్రమ ఒలింపిక్స్’గా ఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మక ప్రపంచ ఐటీ కాంగ్రెస్ మూడు రోజుల సదస్సు హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగుతున్న ఈ సదస్సుని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు ప్రసంగించారు. వరల్డ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్‌స (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నాయి. 40 ఏళ్లగల చరిత్రగల ఈ సదస్సును తొలిసారి భారత్‌లో నిర్వహిస్తుండటంతో దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. 1978లో తొలిసారి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరగ్గా 22వ సమావేశానికి హైదరాబాద్ వేదికైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఐటీ కాంగ్రెస్
ఎప్పుడు : ఫిబ్రవరి 19 - 21
ఎక్కడ : హైదరాబాద్
ఎవరు : వరల్డ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్‌స (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో ఎన్నికల కమిషనర్ల పానెల్ సమావేశమై తెలంగాణకు కొత్త సీఈవోగా ఆయనను ఎంపిక చేసింది. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రజత్‌కుమార్ ప్రస్తుతం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న రీ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఈవోగా రజత్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఈవోగా వ్యవహరించిన భన్వర్‌లాల్ ఏపీ విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలకు సీఈవోగా కొనసాగారు. భన్వర్‌లాల్ పదవీ విరమణ పొందాక ఏపీ సీఈవోగా సిసోడియా బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు ఎన్నికల ప్రధానాధికారి నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : రజత్‌కుమార్
హైదరాబాద్‌లో అడోబ్ కార్యాలయంఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా కొనసాగుతున్న హైదరాబాద్‌లో మరో ఐటీ దిగ్గజ సంస్థ ఏర్పాటు కానుంది. ప్రముఖ ఐటీ సంస్థ అడోబ్ తమ కార్యాలయాన్ని హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా ఐటీ దిగ్గజం అడోబ్ చైర్మన్, సీఈఓ శంతన్ నారాయణ్‌తో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 19న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అడోబ్ కార్యాలయాన్ని నెలకొల్పాల్సిందిగా కేటీఆర్ కోరారు. 2015, మే నెలలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో శంతన్ నారాయణ్‌తో తొలిసారి సమావేశమైన కేటీఆర్, తర్వాత పలుమార్లు ఆయన్ను కలిశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో అడోబ్ కార్యకలాపాలను విస్తరించాల్సిందిగా కోరిన విషయాన్ని ఐటీ కాంగ్రెస్ సమావేశంలో గుర్తుచేశారు. దీనికి స్పందించిన శంతన్ నారాయణ్ అడోబ్ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానమిస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే అడోబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పుతామని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో అడోబ్ కార్యాలయం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : అడోబ్ చైర్మన్, సీఈఓ శంతన్ నారాయణ్
ఎక్కడ : వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా అంగీకారం
వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొన్న రోబో సోఫియా ప్రపంచంలోనే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’.. హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ రోబో సృష్టికర్త, హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్‌తో కలసి ఫిబ్రవరి 20న సోఫియా సదస్సుకి హాజరైంది. ప్రసంగించడమే కాదు.. ప్రశ్నలు అడిగితే చకచకా సమాధానాలూ ఇచ్చింది. బాలీవుడ్‌లో నీకు ఇష్టమైన హీరో ఎవరనే ప్రశ్నకి.. షారూక్ ఖాన్ అంటు సమాధానం ఇచ్చింది.
హ్యూమనాయిడ్ రోబో సోఫియాకి సౌదీ అరేబియా 2017లోనే పౌరసత్వం ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొన్న హ్యూమనాయిడ్ రోబో సోఫియా
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : హైదరాబాద్
ప్రమాదంలో 40 భాషలుదేశంలోని 40కి పైగా భాషలు/మాండలికాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 17న వెల్లడించింది. ఈ భాషలను (ఒక్కో భాష) మాట్లాడేవారి సంఖ్య 10 వేల కంటే తక్కువగా ఉందని తెలిపింది. ఈ జాబితాలో అండమాన్-నికోబార్ దీవులకు చెందిన భాషలు/ మాండలికాలు 11 ఉండగా, తర్వాతి స్థానాల్లో మణిపూర్ 7; హిమాచల్‌ప్రదేశ్ 4 ఉన్నాయి. అంధ్రప్రదేశ్‌కు చెందిన గడాబా, నైకీ భాషలు కూడా ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి.
ఆర్థికం హెల్త్‌కేర్ సేవలకు జీఎస్టీ లేదు ఆస్పత్రుల్లోని రోగులకు వైద్యుల సూచనల మేరకు అందజేసే ఆహారంపై జీఎస్టీ లేదని ప్రభుత్వం తెలిపింది. అనారోగ్యం, గాయం, గర్భం, వంటి కారణాలతో ఆస్పత్రిలో చేరిన వారు చేయించుకునే పరీక్షలు, చికిత్స, వైద్యం వంటివి జీఎస్టీ చట్టం ప్రకారం హెల్త్‌కేర్ సేవల పరిధిలోకి వస్తాయని, వీటిపై పన్ను ఉండదంది. దీంతోపాటు ఆస్పత్రులకు రోగులు చెల్లించే మొత్తం (వైద్యుల ఫీజు సహా)నకు కూడా జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఆస్పత్రిలో అడ్మిట్ కాని రోగులు, వారి సంబంధీకులకిచ్చే ఆహారంపై జీఎస్టీ ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
టోకు ధరల సూచీ 2.84 శాతంగా నమోదుటోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.84 శాతంగా నమోైదె ంది. దీన్ని బట్టి జనవరి 2017తో పోల్చితే 2018 జనవరి నాటికి టోకు ధరలు 2.84 శాతం మేర పెరిగాయని తెలుస్తుంది. ప్రభుత్వం ఫిబ్రవరి 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆరు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి.
ఓబీసీలకు 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఓబీసీలకు రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ వెల్లడించింది. ఈ శాఖకు కేటాయించిన బడ్జెట్ ద్వారా చేపట్టనున్న పనుల వివరాలు తెలిపింది. గతంతో పోల్చితే ఈసారి కేటాయింపులు 12.10 శాతం పెరిగి రూ. 7,750 కోట్లకు చేరాయంది. వివిధ పథకాలకు 11.57 శాతం కేటాయింపులు పెరగగా, ఓబీసీ సంక్షేమానికి 41.03 శాతం కేటాయింపులు పెరిగాయి. గతేడాది ఎస్సీలకు అమలుచేసిన తరహాలో ఓబీసీలకూ రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయనుంది. ఇందులో రూ.140 కోట్లను 2018-19లో సమకూర్చనుంది.
మత్తుపదార్థాల బారిన పడ్డ వారి పునరావాసం కోసం తొలిసారిగా జాతీయ సర్వే ద్వారా వారిని గుర్తిస్తారు. ఇందుకోసం 185 జిల్లాల్లో, 1.5 లక్షల కుటుంబాలపై చేస్తున్న సర్వే ఏప్రిల్ నాటికి పూర్తవనుంది. వీరి పునరావాసానికి రూ. 200 కోట్లు కేటాయించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓబీసీలకు రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ
పీఎన్‌బీలో 11,400 కోట్ల కుంభకోణంప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో ’భారీ కుంభకోణం’ వెలుగుచూసింది. 1.77 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,346 కోట్లు) మేర ప్రభావం చూపే మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలింది. ముంబైలోని ఓ శాఖలో ఇవి జరిగాయని గుర్తించినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. కొంత మంది ఖాతాదారులతో కుమ్మకై ్కన కొందరు ఉద్యోగులు.. వారికి ప్రయోజనం చేకూర్చేలా మోసపూరిత, అనధికారిక లావాదేవీలు జరిపినట్లు తెలిపింది. ఈ లావాదేవీల ఆధారంగా.. సదరు కస్టమర్లకు విదేశాల్లో మరికొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లుగా తెలుస్తోందని వివరించింది. దీంతో, వీటి ప్రభావం మరిన్ని బ్యాంకులకు కూడా విస్తరించి ఉండవచ్చని పేర్కొంది. ఈ వ్యవహారంలో 10 మంది ఉద్యోగులను బ్యాంకు సస్పెండ్ చేసింది.
మూడేళ్ల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఈ తరహాలో దాదాపు రూ. 6,000 కోట్ల కుంభకోణం చోటుచేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 11,346 కోట్ల మోసపూరిత లావాదేవీలు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎక్కడ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో
పీఎన్‌బీ కేసులో 5,100 కోట్ల ఆస్తుల స్వాధీనం వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల్ని రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో దర్యాప్తును సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ)లు ముమ్మరం చేశాయి. భారతదేశ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు కుంభకోణంగా పేర్కొంటున్న ఈ కేసులో ఫిబ్రవరి 15న ఈడీ భారీ మొత్తంలో ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారుడైన బిలియనీర్, ఆభరణాల డిజైనర్ నీరవ్ మోదీకి చెందిన దుకాణాలు, ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలు, బంగారాన్ని సీజ్ చేసింది.
బ్యాంకులకు వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు ఉడాయించిన విజయ్ మాల్యా తరహాలోనే.. ఈ కేసులో నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, సోదరుడు నిశాల్, భార్య అమీ, వ్యాపార భాగస్వామి మోహుల్ చోక్సీలు కూడా కుంభకోణం బయటపడక ముందే విదేశాలకు ఉడాయించారు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) సీబీఐకి ఫిర్యాదు చేయగా.. జనవరి మొదటి వారంలోనే నిందితులంతా దేశం నుంచి జారుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో నీరవ్ మోదీ ఆస్తుల స్వాధీనం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : సీబీఐ, ఈడీ
2017-18కి మారనున్న గణాంకాల బేస్ ఇయర్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకు ప్రభుత్వం బేస్ ఇయర్‌ను మార్చనుంది. జీడీపీ, ఐఐపీ గణాంకాలకు బేస్ ఇయర్ 2017-18గా మార్చుతున్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ వెల్లడించారు. రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్‌ను 2018గా మార్చుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మూడు కీలక ఆర్థిక గణాంకాలకూ 2011-12 బేస్ ఇయర్‌గా ఉంది. ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో పారదర్శకత, స్పష్టత లక్ష్యంగా కేంద్రం బేస్ ఇయర్ మార్పు నిర్ణయం తీసుకుంటోందన్నారు.
2018-19లో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖకు కేంద్రం రూ.4,859 కోట్లను కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18కి మారనున్న జీడీపీ, ఐఐపీ, రీటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల బేస్ ఇయర్
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ
2018 జనవరిలో ఎగుమతుల వృద్ధి 9% భారత్ ఎగుమతులు 2018 జనవరిలో (2017 జనవరితో పోల్చి) 9 శాతం పెరిగాయి. విలువ రూపంలో రూ.24.38 కోట్లుగా నమోదయి్యంది. ఇక ఇదే నెలలో దిగుమతులు 26.1 శాతం పెరిగాయి. విలువ రూపంలో 40.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దీనితో ఎగుమతులు- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు 16.3 బిలియన్ డాలర్లుగా నమోదయి్యంది. గడచిన మూడేళ్లలో ఈ స్థాయిలో వాణిజ్యలోటు పెరుగుదల ఇదే తొలిసారి.
కాగా 2017 డిసెంబర్‌లో సేవల ఎగుమతుల విలువ 16 బిలియన్ డాలర్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడించాయి. ఈ విభాగంలో దిగుమతుల విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. సేవల వాణిజ్యలోటు 6 బిలియన్ డాలర్లు.
2020 నాటికి 10 వేల కోట్లకు భారత ఆన్‌లైన్ మార్కెట్వినియోగదారులు ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2.5 రెట్లు పెరిగి దాదాపు 10,000 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. ఈ-కామర్స్, ట్రావెల్ అండ్ హోటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ మీడియా రంగాల్లోని వృద్ధి దీనికి దోహదపడుతుంది. ఈ విషయాలు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్ సంయుక్త నివేదికలో వెల్లడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- భారతీయులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్ల విలువ దాదాపు 4,000 కోట్ల డాలర్లుగా ఉంది.
- ఈ-కామర్స్ విభాగంలో అప్పరెల్ అండ్ యాక్ససిరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఫుడ్ అండ్ గ్రాసరీ వంటి ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయాలు 2020 నాటికి ప్రస్తుతమున్న 18 బిలియన్ డాలర్ల నుంచి 40-45 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. అలాగే ట్రావెల్ అండ్ హోటల్ వ్యయాలు 11 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్లకు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యయాలు 12 బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్లకు, డిజిటల్ మీడియా వ్యయాలు 200 మిలియన్ డాలర్ల నుంచి 570 మిలియన్ డాలర్లకు పెరగొచ్చు.
- 2020 నాటికి మహిళా షాపర్ల సంఖ్య 2.5 రెట్లు పెరగనుంది.
- భారత్‌లో ఐదుగురు ఇంటర్నెట్ యూజర్లలో ఒకరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసి ప్రొడక్టులను కొనుగోలు చేస్తున్నారు. ఆరుగురిలో ఒకరు ఆన్‌లైన్‌లో ట్రావెల్ బుకింగ్‌స చేసుకుంటున్నారు. దాదాపు 75-80 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేయడం లేదు.
ఏమిటి : 2020 నాటికి 10 వేల కోట్లకు భారత ఆన్‌లైన్ మార్కెట్
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్
రొటొమ్యాక్ కుంభకోణం 3,695 కోట్లురూ. 3,695 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని రొటొమ్యాక్ పెన్‌స ప్రమోటర్ విక్రమ్ కొఠారి ముంచేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఆ మేరకు కొఠారీ అండ్ కో పై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)లు ఫిబ్రవరి 19న వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించాయి. రొటొమ్యాక్ కంపెనీ ఖాతాల పరిశీలన తర్వాత ఆ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ల నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ బ్యాంకుల నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో రూ. 2919 కోట్ల రుణాల్ని పొందగా అసలు, వడ్డీ, కలుపుకుంటే ఆ మొత్తం రూ. 3,695 కోట్లుగా ఉంది.
10 లక్షల కోట్లను మించిపోయిన ఐటీ వార్షికాదాయందేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం వార్షికాదాయం ఏకంగా రూ.10 లక్షల కోట్లను మించిపోయింది. ఎగుమతుల్లో 24 శాతం వాటాతో దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతోంది. దేశంలో ఐటీ రంగం పురోగతిపై ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)’రూపొందించిన నివేదికను ఫిబ్రవరి 20న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదికపై విడుదల చేసింది.
దేశ ఐటీ రంగం 2015-16లో 143 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.28 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించగా.. 2016-17లో 154 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.98 లక్షల కోట్లు)కు పెంచుకుందని నాస్కామ్ తెలిపింది. ఇది 2017-18లో 167 బిలియన్ డాలర్ల (10.8 లక్షల కోట్లు)కు పెరుగుతుందని అంచనా వేసింది. డిజిటల్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, బీపీఎం వంటి ప్రధాన సేవలు సహా మొత్తంగా ఐటీ రంగానికి ఈ ఆదాయం సమకూరిందని తెలిపింది. లక్షకుపైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.10 లక్షల కోట్లను మించిపోయిన ఐటీ వార్షికాదాయం
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : నాస్కామ్
ఎందుకు : ఐటీ ఎగుమతుల్లో
4 రాష్ట్రాల్లో 11,661 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బెంగళూరు-మైసూరు మధ్య జాతీయ రహదారి- 275ను 61 కి.మీ. మేర విస్తరణకు రూ. 2,920 కోట్ల ఖర్చుకు ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. ఈ నిధులతో నిడగట్ట-మైసూరు సెక్షన్ మధ్య ఎన్‌హెచ్-275ను ఆరు లేన్లుగా విస్తరిస్తారని ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ తెలిపింది. నాలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రాక్‌ల విద్యుదీకరణ, కొత్త రైల్వే లైన్ కోసం రూ. 11,661 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులు అమలైతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో 2 కోట్ల పనిదినాల మేర ఉపాధి కల్పించవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.
చార్‌ధామ్ ప్రాజెక్టులో సొరంగానికి పచ్చజెండా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిని కలిపే చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా ధారసు- యమునోత్రి మధ్య రూ. 1,384 కోట్లతో సొరంగం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సొరంగం నిర్మాణంతో ఆ రెండు ప్రాంతాల మధ్య 20 కి.మీ. దూరం, గంట ప్రయాణ సమయం తగ్గుతాయి.
ప్రైవేటుకూ బొగ్గు మైనింగ్ అనుమతులు ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ బొగ్గు రంగంలో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు కూడా కాంట్రాక్టులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు సొంత అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. 1973లో బొగ్గు రంగాన్ని జాతీయం చేశాక మళ్లీ ఇన్నాళ్లకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది బొగ్గు రంగంలో అత్యంత కీలక సంస్కరణ అని సమావేశానంతరం బొగ్గు, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశీయంగా 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత సాధించేం దుకు ఈ సంస్కరణలు దోహదపడగలవని తెలిపారు.
ఈ మేరకు బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్‌స) 2015, గనులు.. ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 కింద బొగ్గు గనులు/బ్లాకుల వేలంలో ఉపయోగించే ప్రక్రియను సీసీఈఏ ఆమోదించినట్లు కేంద్ర బొగ్గు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అయిదు బొగ్గు రాష్ట్రాలకు అత్యధిక లబ్ధి ..
బొగ్గు గనుల వేలం, విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం అంతా బొగ్గు నిల్వలున్న ఆయా రాష్ట్రాలకే చెందుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆర్థిక వృద్ధికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సదరు రాష్ట్రాలు ఈ ఆదాయాలను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చని వివరించింది. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలకు అత్యధికంగా ప్రయోజనం చేకూరగలదని పేర్కొంది. భారత్‌లో 300 బిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా. వీటిలో అత్యధికంగా నిల్వలు అయిదు రాష్ట్రాల్లో.. పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు తాజా సంస్కరణలు ప్రయోజనం చేకూర్చనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇకపై ప్రైవేటు కంపెనీలకు బొగ్గు ఉత్పత్తి కాంట్రాక్ట్
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
సైన్స్ అండ్ టెక్నాలజీ మార్స్‌పై చారలను గుర్తించిన ఆపర్చునిటీ రోవర్ అరుణగ్రహం (మార్స్)పై శోధించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన రోవర్ ఆపర్చునిటీ ఓ కొత్త విషయాన్ని గుర్తించింది. అక్కడ రాళ్లపై చారలను కనుగొంది. ఈ చారలకు భూమిపై ఉన్న కొన్ని పర్వతాలపై మట్టి తరచూ గడ్డకట్టడం, కరిగిపోవడం వల్ల ఏర్పడే చారలతో పోలి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ చారలు కొన్నిసార్లు గాలి వీయడం, పై నుంచి నీరు పారడం వంటి కారణాలతో కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. ఈ రోవర్ 2004 జనవరిలో అరుణగ్రహంపై అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఇది 5 వేల అరుణగ్రహం రోజులను పూర్తి చేసుకుంది. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఓ లోయలో అన్వేషణ సాగిస్తోందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన అర్వింద్‌సన్ రాయ్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మార్స్‌పై చారల గుర్తింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : నాసా ఆపర్చునిటీ రోవర్
క్రీడలు భారత హాకీకి ప్రధాన స్పాన్సర్‌గా ఒడిశా ఆనవాయితీకి భిన్నంగా ఒడిశా సర్కారు జాతీయ క్రీడ హాకీకి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. వచ్చే ఐదేళ్ల పాటు ఒడిశా ప్రభుత్వం భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు స్పాన్సర్‌షిప్ అందించనుంది. భారత క్రీడల చరిత్రలో ఓ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించిన వేడుకలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విషయాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో భారత పురుషులు, మహిళా జట్ల సభ్యులు, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్), ఐఓఏ అధ్యక్షుడు కూడా అయిన నరీందర్ బాత్రా, ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా తదితరులు పాల్గొన్నారు.
2014 చాంపియన్‌స ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన భువనేశ్వర్‌లో 2018 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత హాకీకి ప్రధాన స్పాన్సర్ తొలిసారి ఓ రాష్ట్ర ప్రభుత్వం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఒడిశా
ఆసియా క్రీడల టెస్టు ఈవెంట్‌లో ఏపీ బాక్సర్‌కు స్వర్ణం ఆసియా క్రీడల టెస్టు ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ బంగారు పతకం సాధించాడు. ఈ పోటీల్లో మరో నలుగురు భారత బాక్సర్లు కూడా పసిడి పతకాలు నెగ్గారు. మూడు సార్లు కింగ్‌స కప్‌లో విజేతగా నిలిచిన శ్యామ్ కుమార్ 49 కేజీల ఫైనల్లో 4-1తో మరియో బ్లాసియస్ కలి (ఇండోనేసియా)పై గెలుపొందాడు. ఇతనితో పాటు మనీశ్ కౌషిక్, షేక్ సల్మాన్ అన్వర్, ఆశిష్, మహిళల ఈవెంట్‌లో పవిత్ర బంగారు పతకాలు సాధించారు. మరో మహిళా బాక్సర్ శశి చోప్రా (57 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా క్రీడల టెస్టు ఈవెంట్ బాక్సింగ్ - 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : నలుగురు భారత బాక్సర్లకు పసిడి పతకాలు
ఎక్కడ : జకార్తా, ఇండోనేషియా
దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్ గెలిచిన భారత్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వన్డేల సీరీస్‌ను భారత్ 5-1తో గెలుచుకుంది. తద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సీరీస్‌ను గెలుచుకుంది. ఫిబ్రవరి 17న జరిగిన ఆరో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (96 బంతుల్లో 129 నాటౌట్; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో ముందుండి జట్టును గెలిపించాడు. ఈ సిరీస్‌లో 3 సెంచరీలు, 1 అర్ధసెంచరీ సహా 186 సగటుతో 558 పరుగులు చేసిన కోహ్లికే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
ఆరేళ్ల తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌గా ఫెడరర్ యువ ఆటగాళ్లకు దీటుగా ఆడుతూ... సమకాలీకులపై పూర్తి ఆధిప త్యం చలాయిస్తూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను తాజాగా రోటర్‌డామ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. 26 వారాలుగా నంబర్‌వన్ స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో ర్యాంక్‌కు పడిపోనున్నాడు.
- అగ్రస్థానానికి చేరుకున్న క్రమంలో ఫెడరర్ తన పేరిట ఎన్నో ఘనతలు లిఖించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న పెద్ద వయస్కుడిగా (36 ఏళ్ల 6 నెలల 11 రోజులు) ఫెడరర్ గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ అగస్సీ (33 ఏళ్లు; అమెరికా 2003లో) పేరిట ఉండేది.
- కోల్పోయిన టాప్ ర్యాంక్‌ను మళ్లీ అందుకునేందుకు ఎక్కువ విరామం (5 ఏళ్ల 106 రోజులు) తీసుకున్న ప్లేయర్‌గానూ ఫెడరర్ రికార్డు నెలకొల్పాడు. 2012 నవంబర్ 4న నంబర్‌వన్ ర్యాంక్ చేజార్చుకున్న ఫెడరర్ ఈనెల 19న మళ్లీ దానిని అందుకోనున్నాడు.
- తన కెరీర్‌లో 2004 ఫిబ్రవరి 2న తొలిసారి నంబర్‌వన్ అయిన ఫెడరర్ రికార్డుస్థాయిలో వరుసగా 237 వారాలు ఆ స్థానంలో ఉన్నాడు. 2008 ఆగస్టు 17న టాప్ ర్యాంక్ కోల్పోయిన అతను మళ్లీ రెండుసార్లు (2009 జూలై 6 నుంచి 2010 జూన్ 6 వరకు; 2012 జూలై 9 నుంచి 2012 నవంబర్ 4 వరకు) శిఖరాగ్రానికి చేరుకున్నాడు.
ఫెడరర్‌కు రోటర్‌డామ్ ఓపెన్ టైటిల్ ఫిబ్రవరి 19న ముగిసిన రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఫెడరర్ గెలుచుకున్నాడు. ఫైనల్లో ఫెడరర్ 6-2, 6-2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను అలవోకగా ఓడించాడు. తద్వారా తన కెరీర్‌లో 97వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
స్టార్ ఇండియాకు ఐపీఎల్ ఆడియో-విజువల్ హక్కులు స్టార్ ఇండియా 2018-19 సీజన్‌కు ఐపీఎల్‌తో పాటు బీసీసీఐ దేశవాళీ సీజన్ ఆడియో, వీడియో ప్రొడక్షన్ హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కులు కలిగి ఉంది. ‘మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి బీసీసీఐ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆహ్వానించింది. ఐపీఎల్ 2018, 2018-19 సీజన్ ప్రొడక్షన్ హక్కులు స్టార్ ఇండియాకు దక్కాయి’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌధురి వెల్లడించారు. ఇదే ఒప్పందాన్ని యథాతథంగా మరో ఏడాది పొడిగించేందుకు, 2020 ఐపీఎల్‌కు ప్రత్యేకంగా కొనసాగించే విచక్షణాధికారం బీసీసీఐకి ఉందని అమితాబ్ తెలిపాపరు.
ఐపీఎల్ అయిదేళ్ల కాలానికి టీవీ, డిజిటల్, గ్లోబల్ ప్రసార హక్కులను గతేడాది స్టార్ ఇండియా రూ.16,347 కోట్లకు దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టార్ ఇండియాకు ఐపీఎల్, దేశవాళీ సీజన్ ఆడియో-విజువల్ హక్కులు
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : బీసీసీఐ
వార్తల్లో వ్యక్తులు నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, చోక్సీల పాస్‌పోర్టుల్ని విదేశాంగ శాఖ 4 వారాల పాటు రద్దు చేసింది. వారంలోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ వారిద్దరికీ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈడీ సమన్లు జారీ చేసింది. నీరవ్, చోక్సీలు దేశం విడిచి పారిపోవడంతో.. ఆ ఇద్దరి కంపెనీల డెరైక్టర్లకు నోటీసులను పంపింది. నీరవ్ మోదీ తన పేరు మీదే నగల దుకాణాల్ని నిర్వహిస్తుండగా, గీతాంజలి జెమ్స్‌కు చోక్సీ ప్రమోటర్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో
భారత్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పర్యటన ఏడురోజుల పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 17న భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ట్రూడో రక్షణ, ఉగ్రవాదంసహా పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రూడో 18న తాజ్‌మహల్‌ను సందర్శించారు. అనంతరం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని, గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో కెనడా ప్రధాని పర్యటన
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : జస్టిన్ ట్రూడో
అవార్డులు యశ్ చోప్రా అవార్డు అందుకున్న ఆశా భోంస్లే
లెజండరీ సింగర్ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ ఫిబ్రవరి 16న ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నటి జయప్రద, బాలీవుడ్ నటి రేఖ పాల్గొన్నారు.
2012లో చనిపోయిన యశ్ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్‌లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆశా భోంస్లేకు యశ్ చోప్రా అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్
AIMS DARE TO SUCCESS
AIMS DARE TO SUCCESS
No comments:
Post a Comment