AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 9 February 2018

జనరల్ నాలెడ్జ్ తెలుగులో

జనరల్ నాలెడ్జ్ తెలుగులో 

ఫిడెల్ కాస్ట్రో కన్నుమూత

ప్రపంచ విప్లవ పోరాటాలకు నెలవైన క్యూబాను ఏలిన ఫిడెల్ కాస్ట్రో (90) 2016 నవంబర్ 25 రాత్రి చనిపోయారు.  ఆయన మరణ వార్తను సోదరుడు, క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో అధికార టీవీ ద్వారా ప్రకటించారు.  అమెరికాకు పక్కలో బల్లెంగా మారిన కాస్ట్రో 634 హత్యా ప్రయత్నాలను తప్పించుకొని మృత్యుంజయుడు అయ్యాడు. 1926 ఆగస్టు 13న జన్మించిన కాస్ట్రో హవానా విశ్వవిద్యాలయంలో లా, సామాజిక శాస్త్రాల్లో పట్టాలు తీసుకున్నారు.  అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫుల్ జెన్సియా బటిస్టా అమెరికా చెప్పు చేతల్లో నడుస్తూ, దేశాభివృద్ధికి పనిచేయకపోవడంతో ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.  గెరిల్లా పోరాటం, విప్లవ ఉద్యమాల ద్వారా బటిస్టా ప్రభుత్వాన్ని దింపేశారు.  అమెరికా ఆంక్షలను ఎదుర్కుంటూనే క్యూబాను విద్య, వైద్య రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టారు.  క్యూబాలో అంతా అక్షరాస్యులే. 2007 నాటికే ఆ దేశాన్ని పూర్తి అక్షరాస్యత గల దేశంగా తీర్చిదిద్దారు. 1990 నాటికి డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెరిగేలా చేశారు. భారత్ తో క్యాస్ట్రోకి సత్సంబంధాలే ఉన్నాయి.  మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఈ సంబంధాలు కొనసాగాయి.  ఫిడేల్ కాస్ట్రో 1983 మార్చి 7న ఢిల్లీలో జరిగిన  ఏడో అలీనోద్యమ (నామ్) సదస్సుకు చివరి సారిగా భారత్ కు వచ్చారు.

టీపీపీ కు అమెరికా గుడ్ బై
AIMS DARE TO SUCCESS: 

ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం (టీపీపీ) నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా ప్రకటించింది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఈ నిర్ణయం తీసుకున్నారు. పసిఫిక్ మహాసముద్రం సరిహద్దుగా కలిగిన 12 దేశాలు ఒక కూటమిగా ఏర్పాడ్డాయి. సభ్య దేశాల మధ్య ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, పన్నులు తగ్గించుకోవడం ముఖ్యమైనవి. కార్మిక విధానాలు, మేధో హక్కులు, పోటీ విధానాలు లాంటి అంశాల్లో సభ్యదేశాలు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలి. ఈ ఒప్పందంలో అమెరికాతో పాటు జపాన్, మలేసియా, వియత్నాం, సింగపూర్; బ్రునై, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో చిలీ, పెరు సభ్య దేశాలు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు అమెరికాలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఒప్పందాన్ని తెచ్చారు.

AIMS DARE TO SUCCESS: 
భూమ్మీద 8వ ఖండం

ఇప్పటిదాకా మనం ఏడు ఖండాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 8 వ ఖండం కూడా కనుక్కున్నారు. ఈ కొత్త ఖండానికి జీలాండియా అని పేరు పెట్టారు. పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి భాగంలో న్యూజిలాండ్ కి దగ్గరల్లో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు ఈ ఖండం విస్తరించింది ఉంది. జీలాండియా 94శాతం వరకూ నీటిలోనే మునిగి ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో మునిగి ఉన్నప్పటికీ దీనికి ఖండానికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది 6 నుంచి 8.5 కోట్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా నుంచి విడిపోయి సముద్రంలో మునిగి ఉంటుందని భావిస్తున్నారు. సముద్రమట్టానికి ఎత్తుగా ఉండే భూభాగాలనే ఖండాలు అని పిలుస్తారు. జీలాండియాకి మాత్రం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చుట్టపక్కల ప్రాంతాల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండటం, భూగర్భ లక్షణాలు, నిర్ధిష్టమైన ప్రాంతం లాంటివి ఈ ప్రత్యేకతలు. జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా పత్రికలో ఎనిమిదో ఖండం జీలాండియా వివరాలను పొందుపరిచారు.
AIMS DARE TO SUCCESS: 
ఏడు కొత్త గ్రహాలు గుర్తింపు

మన సౌరకుటుంబానికి 40 కాంతి సంవత్సరాల దూరంలో మరో ఏడు కొత్త గ్రహాలు ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే 235 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ దాదాపు భూమి పరిణామంలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ గ్రహ వ్యవస్థకు ద ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ అండ్ ప్లానెస్టిమాల్స్ స్మాల్ టెలిస్కోప్ (ట్రాపిస్ట్-1) గా పేరు పెట్టారు. చిలీలోని ఓ టెలిస్కోపు పేరు ట్రాపిస్ట్. గతంలో ఈ టెలిస్కోప్ మూడు గ్రహాలను కనుగొంది. ఆ తరువాత ఐరోపా సౌత్ అబ్జర్వేటరీకి చెందిన ‘వెరీ లార్జ్ టెలిస్కోప్’ తో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కు చెందిన స్పిట్జర్ అంతరిక్ష టెలిస్కోపు పరిశోధనలు సాగించారు. ఈ సందర్బంలో మరో నాలుగు కొత్త గ్రహాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం గ్రహాల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఏడు గ్రహాలు తక్కువ వేడి ఉన్న మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. మన సూర్యుడి కన్నా 10 రెట్లు చిన్నది. వీటిల్లో మూడింటిలో ఆవాసయోగ్య ప్రదేశం (గోల్డీ లాక్స్ జోన్ )లో ఉన్నాయి. దాంతో వీటిల్లో నీరు ఉండే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

AIMS DARE TO SUCCESS: 
ఏ అవార్డు దేనికి? 

1) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు – సినిమా రంగం
2) శంకర్ అవార్డు   – భారతీయ తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు
3) కబీర్ సమ్మాన్ – సామాజిక సేవ, మత సామరస్యం
4) అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి – గాంధీ బాటలో నడుస్తూ ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో కృషి చేసిన వారికి
5) భారత రత్న – దేశానికి సేవ చేసిన వారికిచ్చే అత్యున్నత అవార్డు
6) పద్మ భూషణ్ – దేశంలో మూడో అత్యున్నత అవార్డు
7) పద్మ విభూషణ్ – దేశంలో రెండో అత్యున్నత అవార్డు ప్రభుత్వ సర్వీసులతో పాటు ఇతర రంగాల్లో సేవ చేసినవారికి ఇచ్చేది
8) పద్మ శ్రీ – పరిశ్రమలు, సామాజిక సేవ, విద్య, సాహిత్యం, కళలు, సైన్స్, మెడికల్, స్పోర్ట్స్, ప్రజా సంబంధాల్లో సేవ చేసిన వారికి ఇచ్చేది
9) ద్రోణాచార్య అవార్డు – క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే గురువులకు
10) ధ్యాన్ చంద్ – దేశంలోనే క్రీడల్లో ప్రతిభ కనబరచిన వారికి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు
11) రాజీవ్ గాంధీ ఖేల్ రత్న – క్రీడల్లో దేశంలో అత్యున్నత అవార్డు
12) జ్ఞాన్ పీఠ్ అవార్డు – సాహిత్యంలో
13) వ్యాస్ సమ్మాన్ – హిందీ భాషా సాహిత్యం
14) సరస్వతీ సమ్మాన్ – రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIకింద గుర్తించిన భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి
15) పరమ్ వీర్ చక్ర – యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే దేశంలోనే అత్యన్నత అవార్డు
16) మహావీర్ చక్ర – ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లో పనిచేసే సైనికుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేవారికి ఇచ్చేది
17) వీర్ చక్ర – దేశంలో రెండో అత్యున్నత సైనిక అవార్డు
18) అశోక్ చక్ర – దేశం కోసం ప్రాణాలు అర్పించిన లేదా ప్రాణాలకు తెగించిన పోరాడిన వీర జవాన్లకు ఇచ్చేది
19) అర్జున్ అవార్డు – క్రీడా రంగం
20) కళింగ అవార్డు – సైన్స్ రంగం
21) ధన్వంతరి అవార్డు – మెడికల్ సైన్సెస్
22) భట్నానగర్ – సైన్స్ రంగం
23) వాచస్పతి సమ్మాన్ – సంస్కృత సాహిత్యం

AIMS DARE TO SUCCESS: 
వరల్డ్ టాప్ 100 లో చరఖా ఫోటో

భారత జాతిపిత మహాత్మాగాంధీ చరఖాతో నూలు వడుకుతున్న ఫోటోకు టైమ్స్ మేగజైన్ ఎంపిక చేసిన ఉత్తమ 100 ఫోటోల్లో ఒకటిగా ఎంపికైంది. 1820 నుంచి 2015 వరకూ ప్రపంచంపై ఎక్కువ ప్రభావం చూపిన ఫోటోలను ఎంపిక చేశారు. భారత్ లో నాయకులపై కథనాలు రాయడానికి బ్రిటీష్ పత్రికలు ఈ ఫోటోలు తీశాయి. ఈ ఫోటో ప్రపంచంలో చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని టైమ్స్ మేగజైన్ తెలిపింది.

AIMS DARE TO SUCCESS: 
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో బ్రెగ్జిట్

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం కోసం ఆ దేశంలో నిర్వహించిన రిఫరెండం నిర్వహించారు. ఈసందర్భంగా BREXIT పదం బాగా పాపులర్ అయింది. దాంతో ఈ పదాన్ని ఆక్స్‌ఫ‌ర్డ్‌ డిక్షనరీలో చేర్చారు. మొత్తం 500 కొత్త పదాలు, పదసంబంధాలను డిక్షనరీలో చేర్చారు.

AIMS DARE TO SUCCESS: 
పారా ఒలింపిక్స్

బ్రెజిల్ లోని రియో డీజనీరోలో 2016 సెప్టెంబర్ లో 11 రోజుల పాటు పారా ఒలింపిక్స్ (వికలాంగుల ఒలింపిక్స్) జరిగాయి. ఈసారి భారత అథ్లెట్లు పారా ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. మొత్తం 4 పతకాల్లో…  రెండు స్వర్ణాలు, ఒక రజితం, ఒక కాంస్య పతకం సంపాదించారు. మొత్తం పతకాల పట్టికలో 43వ స్థానంలో నిలిచారు.  మొత్తమ్మీద పారా ఒలింపిక్స్ లో అత్యధికంగా చైనా 239 పతకాలు (107 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు) సాధించింది. బీజింగ్ ఒలింపిక్స్ నుంచి రియో ఒలింపిక్స్ దాకా బ్రెజిల్ స్విమ్మర్ డానియెల్ డయాస్ 24 పతకాలు సాధించాడు. రియో ఒలింపిక్స్ లో డయాస్ వివిధ విభాగాల్లో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు సాధించాడు. 2012 లండన్ పారా ఒలింపిక్స్ లో 102 పతకాలు సాధించిన రష్యా ఈసారి డోపింగ్ ఆరోపణలతో రియోలో పాల్గొనే అర్హత కోల్పోయింది.  2020 పారా ఒలింపిక్స్ టోక్యోలో జరుగుతాయి. మన దేశానికి చెందిన మరియప్పన్ తంగవేలు హైజంప్ లో స్వర్ణ పతకం సాధించారు.  ఇదే విభాగంలో మన దేశానికి చెందిన మరో ప్లేయర్ వరుణ్ భాటీ కాంస్య పతకం గెలుపొందాడు. మహిళ షాట్ పుట్ F-53లో దీపామాలిక్ రజిత పతకం సాధించింది.  పురుషుల F-46 జావెలిన్ త్రో ఈవెంట్ లో దేవేంద్ర జజారియా స్వర్ణం సాధించాడు.

AIMS DARE TO SUCCESS
AIMS DARE TO SUCCESS: అంతర్జాతీయం వ్యక్తులు:

నినాదం         వ్యక్తి    

» స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది    -    హిట్లర్    
...
AIMS DARE TO SUCCESS: 
Byheart These 19 Words

1. am - ఉన్నాను

2. are -  ఉన్నాము,ఉన్నారు, ఉన్నవి

3. is - ఉన్నాడు,ఉన్నది

4. was - ఉండెను,ఉండినది

5. were –    ఉంటిమి,ఉండిరి,ఉందినవి

6. will be - ఉంటాను,ఉంటాము,ఉంటారు,ఉంటాడు,ఉంటుంది

7. have been - చాలాసేపటినుండి

8. has been - చాలాసేపటినుండి

9. had been - చాలాసేపు

10. will have been - చాలాసేపు

11. have walked (v3) -ఇప్పుడే నడిచాను

12. has walked (v3) - ఇప్పుడే నడిచాడు

13. had walked (v3) - అప్పుడే నడిచాను

14. will have walked (v3) - ఆ సమయానికి నడచివుంటాను.

15. walk - రోజూ/ఇప్పుడు నడుస్తాను

16. walks –  రోజూ/ఇప్పుడు నడుస్తాడు

17. walked (v2) - (గతంలో)నడిచాను.

18. shall walk  ( I/we ) - (భవిష్యత్తులో)నడుస్తాను

19. will walk ( you,they,boys,he,she, it,Rama,Sita) - (భవిష్యత్తులో)నడుస్తారు.

AIMS DARE TO SUCCESS: ముఖ్యమైన ఆపరేషన్లు

ఆపరేషన్ పేరు - ఆపరేషన్ ఉద్దేశం
» రెయిన్ బో ఈస్ట్ - 2004 డిసెంబరు 26న వచ్చిన సునామీ బాధితుల సాయం కోసం మనదేశ నౌకాదళం, శ్రీలంక చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ పవన్ - శ్రీలంలోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాలు
» ఆపరేషన్ రెడ్ డాన్ - ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోడానికి అమెరికా సైన్యం చేపట్టింది.
» ఆపరేషన్ ఓవర్ లోడ్ - ఫ్రాన్స్ ను నాజీల నుంచి విముక్తం చేయడానికి అమెరికా చేపట్టిన సైనికచర్య.
» ఆపరేషన్ ఈగల్ - శ్రీలంకలోని తమిళులకు ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి భారత శాంతిస్థాపక దళం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ లీప్ ఫార్వర్డ్ - ఎల్.టి.టి.ఇ (లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం) స్థావరాలను ధ్వంసం చేయడానికి శ్రీలంక సైన్యం, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఆల్ క్లియర్ - భూటాన్ లోని భారత వ్యతిరేక శక్తులైన ఉల్ఫా, కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ల కోసం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ తొపక్ - మన దేశ యువకులకు అక్రమంగా సైనిక శిక్షణ ఇచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు 1988 లో ఏర్పాటు చేసింది.
» ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ - అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను అరికట్టడానికి అమెరికా చేపట్టిన సైనిక చర్య.
» ఆపరేషన్ సన్ షైన్ - 1995లో ఎల్.టి.టి.ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ చెక్ మేట్ - ఎల్.టి.టి.ఈ కి వ్యతిరేకంగా భారత శాంతిదళాలు తీసుకున్న చర్యలు.
» ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ - ఇరాక్ పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ స్యార్ యర్ - ఇరాక్ లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006 లో చేపట్టిన దాడులు.
» ఆపరేషన్ రెస్టోర్ హోష్ - సోమాలియాలో కరవు నివారణ కోసం యూఎన్ వో చేపట్టిన చర్యలు.
» ఆపరేషన్ సైలెన్స్ - లాల్ మసీదులోని తీవ్ర వాదులను, మత ఛాందసులను నిరోధించడానికి పాకిస్థాన్ సైన్యం చేసిన కార్యక్రమం
» ఆపరేషన్ పుష్ బాల్ - బంగ్లాదేశ్ నుంచి భారత దేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం
» ఆపరేషన్ ఖఖరి - రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రాలియోన్ లో జరిగింది. 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు.
» ఆపరేషన్ డెవలప్ మెంట్ ఎఫర్ట్ - బంగ్లాదేశ్ లోని తుపాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి.
» ఆపరేషన్ ఎర్త్ క్వేక్ - ఎల్ టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది.
» ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ - నాటో ఆధ్వర్యంలో శాంతి స్థాపన కోసం బోస్నియాలో జరిగిన కార్యక్రమం.
» ఆపరేషన్ అనకొండ - తోరాబోరా గుహల్లో దాక్కొని ఉన్న అల్ ఖైదా తీవ్రవాదులను చంపడానికి అమెరికా ఈ ఆపరేషన్ నిర్వహించింది.
» ఆపరేషన్ ఒడిస్సీడాన్ - అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యంతో కూడిన అంతర్జాతీయ దళాలు లిబియాపై చేపట్టిన చర్య.
» ఆపరేషన్ జరోనిమా - అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఖంజర్ - తాలిబన్ ల ఏరివేతకు అమెరికా సైన్యం, అప్ఘానిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన చర్య.

AIMS DARE TO SUCCESS: 
Longest Rivers in the World

The world features some amazingly long rivers but which are the longest? 

Check out our list of the top ten longest rivers in the world featuring well known rivers such as the Nile, Amazon and Mississippi.

While most scientists and researchers agree on the order, accurately measuring the length of such enormous rivers can be difficult and there is at times disagreement on where a river starts, where it finishes and its accurate length. Learn about the longest rivers on Earth plus lots more with our huge range of fun science facts for you.

Number
River name
Kilometres
Miles
Location
1.
Nile
6650
4132
North East Africa
2.
Amazon
6400
4000
South America
3.
Yangtze
6300
3917
China
4.
Mississippi - Missouri
6275
3902
USA
5.
Yenisei - Angara - Selenga
5539
3445
Russia, Mongolia
6.
Yellow
5464
3398
China
7.
Ob - Irtysh
5410
3364
Russia, Kazakhstan, China, Mongolia
8.
Congo - Chambeshi
4700
2922
Central Africa
9.
Amur - Argun
4444
2763
Russia, China, Mongolia
10.
Lena
4400
2736
Russia

AIMS DARE TO SUCCESS: 
తెలుగు రాష్ట్రాల్లో...
వ్యక్తి         బిరుదు    
» టంగుటూరి ప్రకాశం పంతులు    -    ఆంధ్ర కేసరి    

» పొట్టి శ్రీరాములు    -    అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత
» దువ్వూరి రామిరెడ్డి    -    కవి కోకిల    

» డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు    -    విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్
» కొమర్రాజు వెంకట లక్ష్మణరావు    -    గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత
» న్యాపతి సుబ్బారావు    -    ఆంధ్ర భీష్మ    
» పర్వతనేని వీరయ్య చౌదరి    -    ఆంధ్ర శివాజి    
» గాడిచర్ల హరిసర్వోత్తమరావు    -    ఆంధ్ర తిలక్    
» అన్నమయ్య    -    పద కవితా పితామహుడు    
» అల్లసాని పెద్దన    -    ఆంధ్ర కవితా పితామహుడు    
» మాడపాటి హనుమంతరావు    -    ఆంధ్ర పితామహుడు    
» ఆదిభట్ల నారాయణదాసు    -    హరికథా పితామహుడు    
» గిడుగు రామ్మూర్తి    -    వ్యవహారిక భాషా పితామహుడు    

» శ్రీకృష్ణదేవరాయలు    -    ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ    
» దేవులపల్లి కృష్ణశాస్త్రి    -    ఆంధ్ర షెల్లి    
» దుగ్గిరాల గోపాలకృష్ణయ్య    -    ఆంధ్ర రత్న    

» దుర్గాబాయ్ దేశ్‌ముఖ్    -    ఆంధ్ర మహిళ
» జొన్నవిత్తుల శేషగిరిరావు    -    ఆంధ్ర గంధర్వ
» వేమన    -    ఆంధ్ర కబీర్    
» పానుగంటి లక్ష్మీనరసింహారావు    -    ఆంధ్ర షేక్స్‌పియర్, అభినవ కాళిదాసు    
» కల్లూరు సుబ్బారావు    -    రాయలసీమ పితామహుడు    
» కొండా వెంకటప్పయ్య    -    దేశభక్త    
» జమలాపురం కేశవరావు    -    తెలంగాణ సరిహద్దు గాంధీ    
» కుమారగిరి రెడ్డి    -    కర్పూర వసంతరాయలు    
» బులుసు సాంబమూర్తి    -    మహర్షి    
» రఘుపతి వెంకటరత్నం నాయుడు    -    బ్రహ్మర్షి    
» త్రిపురనేని రామస్వామి చౌదరి    -    కవిరాజు    

» గురజాడ వెంకట అప్పారావు    -    నవయుగ వైతాళికుడు, ప్రజాకవి
» విశ్వనాథ సత్యనారాయణ    -    కవి సామ్రాట్    

» కందుకూరి వీరేశలింగం పంతులు    -    గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహద్దూర్
» తుమ్మలపల్లి సీతారామమూర్తి    -    అభినవ తిక్కన, తెనుగు లెంక    
» నాళం వెంకట కృష్ణారావు    -    మధుర కవి    

» గుర్రం జాషువా    -    నవయుగ కవి చక్రవర్తి
» కోడి రామమూర్తి    -    ఇండియన్ హెర్క్యూలస్
» నన్నయ    -    వాగమశాసనుడు    
» ఎర్రన    -    శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు    
» పుట్టపర్తి నారాయణాచార్యులు    -    సరస్వతీ పుత్రుడు    

» దాశరథి కృష్ణమాచార్యులు    -    కళాప్రపూర్ణ
» శ్రీనాథుడు    -    కవి సార్వభౌమ
» కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు    -    దేశోద్ధారక

AIMS DARE TO SUCCESS: 
తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ 1

* మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య లక్షలు)

* మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య లక్షలు)

* యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?
జ : స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌.

* దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
జ : డా. అక్కినేని నాగేశ్వర్‌రావు

* ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,08కి.మీ.)

* బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : ది హాంగ్‌

* గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : పద్మానది

* గంగానది పొడవు ఎంత?
జ : 2,2 కి.మీ.

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
జ : మహాభారతం. (ఇందులో  వేల పద్యాలు, 8 లక్షల పదాలు ఉన్నాయి)

*  మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
జ : న్యూజీలాండ్‌.

* భారతదేశంలో మొదటి 'మున్సిపల్‌ కార్పోరేషన్‌'ను ఎక్కడ స్థాపించారు?
జ : మద్రాసులో

* భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
జ : ఢిల్లిలో. (1)

* శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
జ : రోహిణి.

* భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్‌ ఎవరు?
జ : విక్రం సారభాయ్‌

* స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?
జ : అవతార్‌

AIMS DARE TO SUCCESS: 
కరెంటు అఫైర్స్ నవంబరు 7
రాష్ట్రీయం
1) పదో అర్బన్ మొబిలిటీ ఇండియా 2017 సదస్సు హైదరాబాద్ లో ముగిసింది. వచ్చే ఏడాది ఈ సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: నాగపూర్ లో
2) బెస్ట్ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ప్రాక్టీసెస్ అవార్డు గెలుచుకున్నరాష్ట్రానికి చెందిన మున్సిపాలిటీ ఏది ?
జ: GHMC
3) పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాపై బెస్ట్ సిటీ గా (బెస్ట్ సిటీ బస్ సర్వీసెస్) ఏది ఎంపికైంది
జ: సూరత్ మున్సిపల్ కార్పొరేషన్
4) బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ లో ఎంపికైన నగరం ఏది
జ: మైసూర్
5) అతిధి దేవోభవ కార్యక్రమం కింద రాష్ట్రప్రభుత్వం ఏ దేశానికి చెందిన సెపక్ తక్రా పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధికి అత్యవసర వైద్య చికిత్స అందించింది ?
జ: మలేసియా జట్టు మేనేజర్ యూనిస్
6) కబీర్ సమ్మాన్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ తెలుగు కవి,రచయిత ఎవరు ?
జ: కె.శివారెడ్డి
7) భాగ్యనగరంలో ఎన్నో ప్రముఖ భవనాలకు రూపశిల్పి చనిపోయారు. ఆయన ఎవరు
జ: బి.ఎన్ రెడ్డి
8) రాష్ట్రంలోని ఏయే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ ) గుర్తింపు వచ్చింది ?
జ: వరంగల్, సిద్ధిపేట, కరీంనగర్ కాలేజీలకు
9) రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో 200 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు TSIIC ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు ప్రకటించారు
జ: చందన్వెల్లి (రంగారెడ్డి జిల్లా )
10) 116 మంది ప్రముఖ కథా రచయితల వైభవ దీపిక ‘‘వందేళ్ళ కథకి వందనాలు’’ అనే పుస్తకాన్ని ఎవరు రూపొందించారు ?
జ: నటుడు, కథారచయిత గొల్లపూడి మారుతీరావు
11) ఇటీవల చనిపోయిన బద్దం నర్సింహారెడ్డి గతంలో ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు ?
జ: మిర్యాల గూడ

జాతీయం
12) అరుణాచల్ ప్రదేశ్ లో ఏ కేంద్రమంత్రి పర్యటనపై చైనా అభ్యంతరం చెప్పింది ?
జ: రక్షణమంత్రి నిర్మలా సీతారామన్
13) 2017 డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ ఇన్ ఫ్రా అవార్డు ఏ ప్రభుత్వ రంగం విద్యుత్ కంపెనీకి దక్కింది ?
జ: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
14) మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ టు క్రికెట్ – నో టు డ్రగ్స్ అంటూ ఏ రాష్ట్ర పోలీసులు చేపట్టిన కార్యక్రమానికి భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు ఇచ్చాడు
జ: కేరళ పోలీసులు
15) డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు గ్రామస్థాయిలో ఆటలపోటీలు నిర్వహించాలని ఏ రాష్ట్ర నిర్ణయించింది ?
జ: పంజాబ్
16) 2017 విష్ణుదాస్ భవే అవార్డు ఎవరికి దక్కింది
జ: మోహన్ జోషి
17) సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో భారత్ గౌరవ్ అవార్డ్ – 2017  ఎవరికి ప్రకటించారు
జ: అనిల్ కె. త్రిపాఠి
18) బంగినపల్లి మామిడి పండు ఏ జిల్లాకు చెందినదిగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది ?
జ: ఏపీలోని కర్నూలు జిల్లా ( ప్రపంచ వ్యాణిజ్య సంస్థ గుర్తించింది )
19) 2017 బలి జాతర ఉత్సవం ఎక్కడ జరుగుతోంది
జ: ఒడిశా
20) తమిళనాడు సీఎం, తిరునల్వేలి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ లపై వ్యంగ చిత్రం గీసి అరెస్ట్ అయిన కార్టూనిస్ట్ ఎవరు ?
జ: జి.బాల అలియాస్ బాలక్రిష్ణన్
21) నందనకన్నన్ జూలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది
జ: ఒడిషా

అంతర్జాతీయం
22) మూడో అత్యధిక ఉష్ణ సంవత్సరం గా ఏది నమోదవుతుందని WMO తెలిపింది ?
జ: 2017

AIMS DARE TO SUCCESS:
 ఏ కమిటీకి ఎవరు? 

1) కమ్యూనిటీ కాలేజీల ఏర్పాటు
(జ) అర్చనా చిట్నిస్
2) మల్టీబ్రాండ్ లో FDIలు
(జ) ఎ.కె.సేధ్
3) రక్షణ రంగ ప్రక్షాళన
(జ) సుబ్రమణ్యం
4) నేషనల్ స్టాక్ ఎక్సేంజి ఏర్పాటు
జ) నాదకర్ణి కమిటీ
5) స్టాక్ ఎక్చేంజీల పనితీరు
జ) ఎల్.సి.గుప్తా
6) సేవా రంగంలో పన్నుల సమస్యలు
జ) రస్తోగి కమిటీ
7) ఉన్నత విద్యలో కార్పొరేట్ రంగం భాగస్వామ్యం
జ) నారాయణమూర్తి
8) పోస్టాఫీసుల్లో చిన్నమొత్తాలు
జ) శ్యామలా గోపీనాధ్
9) నల్లధనం
జ) జీవన్ రెడ్డి
10) జాతీయ గణాంక సంస్థకు చట్ట హోదాను సూచించింది
జ) యాదవ్ మీనన్ కమిటీ

AIMS DARE TO SUCCESS: యానిమేషన్ గేమింగ్ కేంద్రాలు

యానిమేషన్, గేమింగ్ రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లో ఇమేజ్ టవర్ ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాయదుర్గంలో 6.5 ఎకరాల్లో దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో భారీ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని నిర్మిస్తారు. 100 మీటర్ల ఎత్తయిన ఇమేజ్ టవర్ ను నిర్మిస్తారు. 1.25 లక్షల చదరపు అడుగుల స్థలంలో స్టూడియోలను నిర్మిస్తారు. యానిమేషన్ అకాడమీని కూడా ఏర్పాటు చేస్తారు. వాల్డ్ డిస్నీ, సోని, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలతో పాటు టాటా, ప్రైమ్ టాక్, సెవ‌న్‌సీస్‌ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు కూడా భాగస్వాములు అవుతాయి.

AIMS DARE TO SUCCESS: 
గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ లోగో

తెలంగాణ రాష్ట్ర చేతి వృత్తుల అభివృద్ధి సంస్థ లోగో ఫైనల్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేతి వృత్తుల అభివృద్ధి సంస్థ లోగోగా లేపాక్షి నంది బొమ్మ ఉండేది. ఇప్పుడు తెలంగాణ
లోగోగా గోల్కొండ బాల ఇస్సార్ గేటు, నెమలి, మధ్యలో ఫిలిగ్రీ ఆర్ట్ తో లోగోను ఫైనల్ చేశారు.

AIMS DARE TO SUCCESS: 
రాష్ట్రం లో దక్షిణ అమెరికా చేప

రాష్ట్రంలోని జనగామ జిల్లాలోని కుందారం చెరువులో దక్షిణ అమెరికాకి చెందిన అరుదైన చేప లభించింది. బిల్లా క్యాట్ చేపగా దీన్ని భావిస్తున్నారు. దక్షిణ అమెరికాలో మొత్తం 150 రకాల చేపలు ఉన్నాయి. వీటిల్లో నాలుగు రకాల జాతులు మన దేశంలో కూడా బయటపడ్డాయి.

AIMS DARE TO SUCCESS: 
పాడి రైతులకు ఈ లాభ్ 

పాడి రైతులకు నేరుగా సబ్సిడీలు అందించేందుకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఈలాభ్ అనే సాఫ్ట్ వేర్ రూపొందించింది. మొదటి విడతలో సునందిని సబ్సిడీనీ రైతులకు ఆన్‌లైన్‌లో ద్వారా అందించనున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలో ప్రారంభిస్తున్నారు. సునందిని పథకం కింద మేలుజాతి ఆడ దూడలను కాపాడేటందుకు రెండేళ్ళ దాకా అవసరమైన దాణాను ప్రభుత్వం అందిస్తుంది. ఈలాభ్ ద్వారా దూడకు, యజమానికి కూడా బీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఒక్కో దూడకి ఏడాదిలో 612 కిలోల దాణా ఇస్తారు.

AIMS DARE TO SUCCESS: హైదరాబాదు సంపన్న నగరం

దేశంలో నాలుగో సంపన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. నగరంలో ఆరుగుకు బిలియనీర్లు ఉన్నారు. 9 వేల మంది మిలియనీర్లు ఉన్నారు. వీళ్ళ మొత్తం సంపద విలువ 310 బిలియన్ డాలర్లు ( అంటే 31 వేల కోట్ల రూపాయలు). న్యూవరల్డ్ వెల్త్ అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. దేశం మొత్తంలో ముంబై నగరం అత్యంత సంపన్న నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 28 బిలియనీర్లు ఉండగా, 46 వేల మంది మిలియనీర్లు ఉన్నారు. వీళ్ళ మొత్తం సంపద 820 బలియిన్ డాలర్లు ( అంటే 82 వేల కోట్లు). రెండో స్థానంలో ఢిల్లీ, మూడో స్థానంలో బెంగళూరు నిలిచాయి. దేశం మొత్తమ్మీద చూసుకుంటే 95 బిలియనీర్లు, 2.64 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద విలువ 6.2 లక్షల కోట్ల డాలర్లు.

AIMS DARE TO SUCCESS: 
2017వ సంవత్సరంలో ఆస్కార్ అవార్డులు

సినిమా రంగంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులను ప్రకటించారు. 89వ ఆస్కార్ అవార్డులను లాస్ ఏంజెల్స్ లోని డాల్ఫీ థియేటర్ లో ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రంగా మూన్ లైట్ కి అకాడమీ అవార్డు దక్కింది. ఉత్తమనటుడిగా కేసీ అప్లెక్ (మాంచెస్తర్ బై ద సీ), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ ( లా లా లాండ్), ఉత్తమ దర్శకుడిగా డామియన్ చాజెల్లె ( లా లా లాండ్) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీగా ఓజే మేడ్ ఇన్ అమెరికా, ఉత్త విదేశీ భాషా చిత్రంగా ద సేల్స్ మ్యాన్ (ఇరాన్ ) చిత్రాలకు అవార్డులు లభించాయి. ఆస్కార్ అవార్డుల చరిత్రలో మొదటిసారిగా ఓ ముస్లిమ్ నటుడికి అవార్డు ఇచ్చారు. మూన్ లైట్ లో నటించిన మహెర్షల అలీ ఉత్తమ సహాయనటుడిగా అవార్డు అందుకున్నారు.

AIMS DARE TO SUCCESS: 
ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్ష 

ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా ప్రయోగించినట్టు ప్రకటించింది. న్యూక్లియర్ స్టేషన్ పంగ్వేరీ దగ్గర ఈ ప్రయోగంతో భూమి 5.1 తీవ్రతతో కంపించింది. 1952లో అమెరికా తొలిసారి హైడ్రోజన్ బాంబు పరీక్ష చేసి పసిఫిక్ సముద్రంలోని ఓ ద్వీపాన్ని తుడిచిపెట్టింది. కేంద్రక విచ్ఛిత్తితో పనిచేసే అణుబాంబు కన్నా హైడ్రోజన్ బాంబు వెయ్యిరెట్లు పవర్ ఫుల్ కలది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రయోగానికి అనుమతి ఇచ్చారు. ఇటీవల కాలంలో తరుచుగా అణ్వాయుధాలు ప్రయోగిస్తోంది ఉత్తర కొరియా. 2006, 2009, 2013ల్లో ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది.

AIMS DARE TO SUCCESS: 
ప్రణవ్ ధన్ వాడే 1009 పరుగులు 

ముంబై అండర్ 16 టోర్నీ భండారీ కప్ లో కేసీగాంధీ స్కూల్ బ్యాట్స్ మెన్ ప్రణవ్ ధన్ వాడే 323 బాల్స్ లో 1009 (నాటౌట్) పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇందులో 129 ఫోర్లు, 59 సిక్సర్లు ఉన్నాయి. ఆర్య గురుకుల్ జట్టుపై ఈ రికార్డు సాధించాడు. గతంలో 1899లో ఇంగ్లండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో AEJ కొలిన్స్ 628 పరుగుల రికార్డును ప్రణవ్ బద్దలు కొట్టాడు.

AIMS DARE TO SUCCESS: 
61వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు

61వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో బాజీరావ్ మస్తానీ సినిమాకి అవార్డులు పంట పండింది. మొత్తం 9 అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటుడు రణవీర్ సింగ్, సహాయనటి ప్రియాంక చోప్రాకి కూడా అవార్డులు లభించాయి. ఉత్తమ నటిగా దీపికా పదుకొనే (పీకూ), సహాయనటుడిగా అనిల్ కపూర్ (దిల్ ధడ్కన్) అవార్డులు గెలుచుకున్నారు. క్రిటిక్స్ ఉత్తమ చిత్రంగా పీకూ, ఉత్తమ నటుడిగా అమితాబ్ (పీకూ), క్రిటిక్స్ ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) నిలిచారు. లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్‌ అవార్డు మౌసమీ ఛటర్జీకి దక్కింది.

AIMS DARE TO SUCCESS: 
స్టార్టప్ ఇండియా 

ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది జనవరిలో న్యూఢిల్లీలో స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా స్టార్టప్ లకు మూడేళ్ళ పాటు ట్యాక్స్ హాలిడే, లాభాలపై చెల్లించాల్సిన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. స్టార్టప్ నిధుల కోసం 2500 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నాలుగేళ్ళలో దీన్ని 10 వేల కోట్లకు పెంచుతారు. ఏటా 500 కోట్ల అదనపు బడ్జెట్ కేటాయింపులతో నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. అందుకోసం వరుసగా నాలుగేళ్ళ పాటు 2 వేల కోట్లు కేటాయిస్తారు. బయోటెక్నాలజీ రంగంలో ప్రోత్సాహానికి 7 రీసెర్చ్ పార్క్ లు కూడా ఏర్పాటు చేస్తారు.

AIMS DARE TO SUCCESS: 
కిల్కరీ సర్వీస్ 

గర్భిణులు, శిశుజననం, సంరక్షణపై అవగాహన కల్పించేందుకు కేంద్రం మొబైల్ సర్వీస్ ’కిల్కరీ‘ని ప్రారంభించింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, రాజస్థాన్ లో మొదట ఈ పథకాన్ని ప్రారంభించారు. అందుకోసం డిజిటల్ ఇండియాలో భాగంగా 4 మొబైల్ సర్వీసులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ASHA వర్కర్లకు అవగాహన కల్పించడం కోసం ప్రసూతి, శిశువుల ఆరోగ్యంపై మొబైల్ శిక్షణా కోర్సు ‘మొబైల్ అకాడమీ’ని జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లో ప్రవేశపెట్టారు. పొగాకు మానేందుకు హిందీ, ఇంగ్లీష్ లో SMS సర్వీసులు అందించే M-సెనేషన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.

AIMS DARE TO SUCCESS: 
తగ్గిన శిశు మరణాల రేటు

రాష్ట్రంలో శిశుమరణాల రేటు తగ్గినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకటించింది. 2015-16 ప్రకారం ప్రతి వేయి మందికి శిశుమరణాల రేటు 41 ఉండగా అది 32 కు తగ్గింది. రాష్ట్రంలో గర్భిణీలకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించడంతో ఈ తగ్గుదల సాధ్యమైంది. ప్రభుత్వ దవాఖానాల్లోనే 31 శాతం కాన్పులు అవుతున్నాయి. జననీ సురక్ష యోజన కింద ప్రభుత్వం మహిళలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం పొందుతున్న వారు 12.2 శాతం మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో కాన్పునకు సరాసరి రూ.4,020లు ఖర్చవుతున్నట్టు ఆరోగ్యసర్వేలో తేలింది.

AIMS DARE TO SUCCESS: 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో బుగ్గపాడులో ఆహార శుద్ధి కేంద్రం 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడులో భారీ ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) కు చెందిన 60 ఎకరాల్లో రూ.112కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ రంగంలో ఏర్పాటయ్యే ఈ సెంటర్ కు కేంద్ర ప్రభుత్వం రూ.50కోట్లు ఇవ్వనుంది. నాబార్డ్ రూ.32 కోట్ల రుణం ఇస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు భర్తిస్తుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఈ ఆహార శుద్ధి కేంద్రం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఈ ఐదు జిల్లాల్లో గోదాములు, కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తారు. ప్యాకింగ్, ప్రింటింగ్ యూనిట్లను బుగ్గపాడులో ఏర్పాటు చేస్తారు.

AIMS DARE TO SUCCESS: 
మొదటి ఆర్గానిక్ రాష్ట్రంగా సిక్కిం

దేశంలోనే మొదటి సేంద్రీయ (ఆర్గానిక్) రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. జనవరి 18న గ్యాంగ్ టక్ లో జరిగిన రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయం ప్రకటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ కు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. సిక్కింను సుఖిస్తాన్ గా అభివర్ణించారు ప్రధాని మోడీ. రాష్ట్రంలోనే అభివృద్ధి చేసిన మూడు పూల మొక్కలకు సర్దార్, దీన్‌ద‌యాళ్, నమో అనే పేర్లను పెట్టారు.

AIMS DARE TO SUCCESS: 
కేంద్రం 726 కోట్లు సమీకరణ 

గోల్డ్ బాండ్లను జారీ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.726 కోట్లు సమీకరించింది. 2,790 కిలోలకు స‌బ్‌స్ర్కిప్షన్ వచ్చింది. నవంబర్ లో మొదటి విడత కింద 916 కేజీల స‌బ్‌స్ర్కిప్షన్ తో రూ.246 కోట్లు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం 99.9 క్యారెట్స్ గోల్డ్ ధరను రూ.2,600లుగా లెక్కగట్టి గోల్డ్ బాండ్స్ పై 2.75 శాతం వడ్డీ ఇస్తోంది.

AIMS DARE TO SUCCESS: 
20 స్మార్ట్ సిటీలు

2017 జనవరిలో కేంద్ర సర్కార్ తొలివిడత స్మార్ట్ సిటీల జాబితాను ప్రకటించింది. జాబితాలో ప్రకటించిన 20 నగరాలను రూ.50,802 కోట్లతో ఐదేళ్ళలోపు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారు. ఇందులో తెలంగాణకి ప్రాధాన్యత లభించలేదు. ఏపీకి చెందిన విశాఖపట్నానికి 8వ స్థానం, కాకినాడకు 14 వ స్థానం దక్కాయి. ఇవి కాకుండా కోయంబత్తూర్, చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), దావణగెరే, బెలగావి ( కర్ణాటక) తదితర సిటీలకు స్మార్ట్ సిటీల్లో చోటు దక్కింది.

AIMS DARE TO SUCCESS: 
నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లో బయటపడ్డది శంభు లింగేశ్వరాలయం

నల్లగొండ జిల్లాలో ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎండిపోవడంతో పురాతన కట్టడమైన శంభు లింగేశ్వరాలయం బయటపడింది. పానగల్లు రాజధానిగా పాలించిన కందూరు చోళుల కాలం నాటిదిగా ఈ ఆలయాన్ని భావిస్తున్నారు. గ్రానైట్ రాళ్ళతో రాతి స్థంభాలను నిర్మించారు. శివలింగం, వినాయకుడు, నంది విగ్రహాలను ఈ ఆలయంలో గుర్తించారు. చంద్రుడు, సూర్యుడు, శివలింగ ఆకారంలో చెక్కిన అచంద్రార్క శాసనం కూడా బయటపడింది. ఇందులో తెలుగు, సంస్కృత అక్షరాలు ఉన్నాయి. 11,12 శతాబ్దాల నాటి ఆలయంగా పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు.

AIMS DARE TO SUCCESS: వాయుకాలుష్యంతో నగరాలకు ప్రమాదం 

ప్రపంచంలో టాప్ 20 కాలుష్యనగరాల జాబితాను WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రకటించింది. ఇందులో 14 నగరాలు ఆగ్నేయ ఆసియాలోనే ఉన్నాయి. వాయు కాలుష్యంతో కేన్సర్ సోకి చనిపోతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల మంది ఉన్నారు. మృతుల్లో 22శాతం మంది పొగాకు, దాని ఉత్పత్తులతోనే చనిపోతున్నట్టు WHO తెలిపింది. భారత్ తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ దేశాలు ఈ బాధిత జాబితాలో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్మికులకు సూర్యకిరణాలు, క్యాన్సర్ కారక రసాయనాల నుంచి రక్షణ లేదని WHO తెలిపింది.

AIMS DARE TO SUCCESS: హైదరాబాదులో బయో ఏసియా సదస్సు 

హైదరాబాద్ హైటెక్స్ లో 2017 ఫిబ్రవరి 8న బయో ఏషియా-2016 సదస్సు జరిగింది. 50 దేశాలకు చెందిన 8 వందల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో నోబెల్ బహుమతి గ్రహీత ఆద ఇ యోనాల్ (ఇజ్రాయెల్)కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33 శాతం ఉంది. దాంతో 15 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నెలకొల్పుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏడు ఫార్మా కంపెనీలతో రాష్ట్ర సర్కార్ MOU కుదుర్చుకుంది.

AIMS DARE TO SUCCESS: 
మేక్ ఇన్ ఇండియా వీక్ 

ముంబైలో మేక్ ఇన్ ఇండియా వీక్ పేరుతో ఇన్వెస్టర్ల సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫెన్, ఫిన్లాండ్ ప్రధాని జుహాపెట్రీ సిపిలా ఈ సదస్సులో పాల్గొన్నారు. మొదటి రోజు రూ.21,400 కోట్ల ఒప్పందాలు కుదిరాయి. స్టెరిలైట్ గ్రూప్ సంస్థ ట్విన్ స్టార్ డిస్‌ప్లే టెక్నాలజీస్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పోరేషన్ మధ్య LCD తయారీ యూనిట్ కోసం 20వేల కోట్ల ఒప్పందం జరిగింది. ఈ వీక్ లో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం 15.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో మేజర్ షేర్ రూ.8లక్షల కోట్లు మహారాష్ట్రకే దక్కాయి. GDPలో 16-17 శాతంగా ఉన్న తయారీ రంగం వాటాని రాబోయే పదేళ్ళలో 25 శాతానికి చేర్చాలన్న లక్ష్యంతో మేక్ ఇన్ ఇండియా వీక్ నిర్వహించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వేర్ హౌస్ ఆటోమేషన్ స్టార్టప్ ARK రోబోట్ కి 3.5 లక్షల డాలర్ల ఈక్విటీ పెట్టుబడులను క్యాల్ కామ్ నుంచి లభించాయి.

AIMS DARE TO SUCCESS: 
తెలంగాణ పురావస్తు శాఖ ఒప్పందం

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పురాతన చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర అన్వేషణకు అంతగా ప్రయత్నాలు జరగలేదు. దాంతో చరిత్రను పరిశోధించే పనిలో ఉన్నారు తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు. 1952 నుంచి మొన్న మొన్నటిదాకా రాష్ట్రంలో ఆదిమానవుల సంచారంపై నాణేలు, సమాధులు, శిలలు దొరుకుతూనే ఉన్నాయి. వాటిని పరిశోధన చేస్తున్నారు పురావస్తు శాఖ నిపుణులు. ఈ పరిశోధనలకు సహకరించేందుకు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ తో పాటు డెక్కన్ వర్సిటీ, పుణెతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర పురావస్తు శాఖ.

AIMS DARE TO SUCCESS: మాతృత్వ ప్రయోజన పథకం

గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించేందుకు, వారు విశ్రాంతి తీసుకునేందుకు రూ.6 వేలు ఇవ్వనుంది. మాతృత్వ ప్రయోజన పథకాన్ని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ రూపొందించింది. మూడు విడతలుగా ఈ మొత్తాన్ని అందిస్తారు. గర్భం దాల్చినప్పుడు దవాఖానాలో నమోదు చేసుకున్నప్పుడు రూ.3 వేలు, ప్రసవతం అయినప్పుడు రూ.1500, శిశువు పుట్టిన తర్వాత మూడు నెలలకు రూ.1500 ఇస్తారు. అయితే రెండు కాన్పులకు మాత్రమే ఈ సాయం అందనుంది.

AIMS DARE TO SUCCESS: అంధులకు అట్లాస్

ప్రపంచంలోనే మొదటిసారిగా అంధుల కోసం ప్రపంచ పటాన్ని మన దేశంలో తయారు చేశారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అట్లాస్ ను రూపొందించారు. అంధులు తమ స్పర్శతో తడిమి భారత్ పటాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ బ్రెయిలీ అట్లాస్ ను కోల్ కతాలోని జాతీయ అట్లాస్, థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ కృషి ఫలితంగా సాధ్యమైంది.

AIMS DARE TO SUCCESS
👇👇👇చరిత్రలో ఈ రోజు జికె మీ కోసం 👇👇👇
డిపిటి 44 సమ్మిళిత విధానాలు

1) జాతీయ మైనారిటీ కమిషన్ కు చట్టబద్దత ఎప్పుడు కల్పించబడింది ?
ఎ) 1992
బి) 1993✅
సి) 1994
డి) 1991

2) ప్రస్తుత జాతీయ మహిళ కమీషన్ చైర్మన్ ఎవరు ?
ఎ) సుమత్రా
బి) గిరిజావ్యాస్
సి) మమతాశర్మ
డి) లలిత కుమార మంగళం✅

3) స్వయం సహాయక బృందాలు అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు  ?
ఎ) బంగ్లాదేశ్✅
బి) శ్రీలంక
సి) చైనా
డి) పాకిస్తాన్

4) షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ ను ఎవరు ఏర్పాటు చేస్తారు ?
ఎ) ప్రధానమంత్రి
బి) లోక్ సభ స్పీకర్
సి) రాష్ట్రపతి✅
డి) ముఖ్యమంత్రి

5) మొదటిసారి మహిళ రిజర్వేషన్ బిల్లు ఏ సవరణగా ముందుకు వచ్చింది ?
ఎ) 83
బి) 81✅
సి) 85
డి) 84

6) SC.ST అకృత్యాల నిరోధక చట్టం-1989 అమలుకు అవసరమైన నిబంధనలను ఎవరు రూపొందిస్తారు ?
ఎ) రాష్ట్ర ప్రభుత్వం
బి) రాష్ట్రపతి
సి) సంబంధిత మంత్రిత్వశాఖ
డి) కేంద్ర ప్రభుత్వం✅

7) షెడ్యూల్డ్ కులాలను హరిజనులు అని సంబోధించినది ఎవరు ?
ఎ) వల్లభాయ్ పటేల్
బి) మహాత్మగాంధీ✅
సి) అంబేద్కర్
డి) జవహర్ లాల్ నెహ్రూ

8) ఏ రాష్ట్రం వనబంధు కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించింది ?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) తెలంగాణ
సి) గుజరాత్✅
డి) మధ్యప్రదేశ్

9) రాష్ట్రపతి ప్రకటన ఒక రాష్ట్రానికి సంబంధించినదైతే జాబితా విషయంలో రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి ?
ఎ) గవర్నర్ ను✅
బి) ముఖ్యమంత్రిని
సి) ఆ రాష్ట్ర శాసననభ్యుడు
డి) ఎవరినీ కాదు

10) ముస్లిం స్థితిగతుల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
ఎ) నజీమ్ కమిటీ
బి) సుధీర్ కమిటీ
సి) రంగనాథ్ మిశ్రా కమిటీ
డి) రాజేంద్ర సచార్ కమిటీ✅

11) సామాజికాభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ) 1953
బి) 1952✅
సి) 1951
డి) 1950

12) మైనారిటీ కమిషన్ ఏ తీర్మానం ప్రకారం ఏర్పాటు కాబడింది ?
ఎ) 1974 కేంద్ర సంక్షేమ శాఖ
బి) 1978 కేంద్ర హోం శాఖ✅
సి) 1972 కేంద్ర మైనారిటీ శాఖ
డి) 1976 కేంద్ర కార్మిక శాఖ

13) 1978లో కార్యనిర్వాహక తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన కమిషన్ ?
ఎ) ఎస్.టి. కమిషన్
బి) ఎస్.సి. కమిషన్
సి) మైనారిటీ కమిషన్✅
డి) వెనకబడిన తరగతుల కమిషన్

14) అంటరానితనం  పాటించిన వారిని శిక్షించుటకు ఉద్దేశించిన చట్టం ఏది ?
ఎ) ప్రొటక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆక్ట్, 1955✅
బి) షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ చట్టం, 1977
సి) అంటరానితనం (నేరాలు) చట్టం, 1955
డి) పైవన్నీ

15) భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని మహిళ సాధికారత సంవత్సరంగా ప్రకటించింది ?
ఎ) 1985
బి) 2002
సి) 1972
డి) 2001✅

16) జాతీయ మహిళ కమిషన్ ఛైర్మన్, ఇతర సభ్యులను ఎవరు నియమిస్తారు ?
ఎ) రాజ్యాంగం
బి) ప్రధానమంత్రి
సి) రాష్ట్రపతి✅
డి) పార్లమెంట్

17) 1991 ఏప్రిల్ 29న మహిళా సాధికారతపై ఏ సంఘాన్ని ఏర్పాటు చేశారు ?
ఎ) జాతీయ మహిళా కమిషన్
బి) సాంఘిక సంక్షేమ మండలి
సి) సంయుక్త పార్లమెంటరీ సంఘం✅
డి) పైవన్నీ

18) పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన నిబంధన ఏది ?
ఎ) 344
బి) 243 (a)
సి) 343
డి) 243 (d)✅

19) ఏ చట్టం దళిత వర్గాలను మొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలుగా పేర్కోన్నది ?
ఎ) 1935 భారత ప్రభుత్వ చట్టం✅
బి) 1950 భారత ప్రభుత్వ చట్టం
సి) 1919 భారత ప్రభుత్వ చట్టం
డి) 1947 భారత ప్రభుత్వ చట్టం

20) మనదేశంలోని పంచవర్ష ప్రణాళికల ఆధారమైన దేశం ఏది ?
ఎ) రష్యా✅
బి) బ్రిటన్
సి) అమెరికా
డి) కెనడా

21) షెడ్యూల్డ్ కులాల గుర్తింపునకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది ?
ఎ) 342వ
బి) 341వ✅
సి) 343వ
డి) 340వ

22) ప్రస్తుత జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎవరు ?
ఎ) కుల్దీప్ సింగ్
బి) సూరజ్ భాను
సి) నందకుమార్ సాయి✅
డి) పున్నయ్య

23) గిరిజన పంచశీల కార్యక్రమాన్ని ఎవరు ప్రతిపాదించారు ?
ఎ) నరేంద్రమోదీ
బి) పి.వి. నరసింహరావు
సి) ఇందిరాగాంధీ
డి) జవహర్ లాల్ నెహ్రూ✅

24) ప్రభుత్వ విధాన దశలలో లేని దశ ఏది ?
ఎ) విధానాల అమలు దశ
బి) విధాన అవలంబన దశ✅
సి) విధానాల సమీక్ష దశ
డి) విధానే రూపకల్పన దశ

25) ఏ రాష్ట్రంలో భూమిలేని షెడ్యూల్డ్ కులాల వారు ఎక్కువ శాతంగా ఉన్నారు ?
ఎ) పంజాబ్
బి) రాజస్థాన్
సి) తెలంగాణ
డి) మహారాష్ట్ర✅

26) భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాల విద్య, ఆర్థిక ప్రయోజనాలు పెంపుదలకు ఎందులో వీలు కల్పించడమైంది ?
ఎ) ఆదేశిక సూత్రాలు✅
బి) 8వ షెడ్యూల్డ్
సి) నిబంధన 18
డి) ప్రవేశిక

27) ఓబిసిలకు ఇచ్చిన రిజర్వేషన్ సవాలు చేస్తూ దాఖలు అయిన కేసు ఏది ?
ఎ) యం.ఆర్.బాలాజీ
బి) కేశవానంద భారతి
సి) ఇందిరా సహానీ✅
డి) ఏదీకాదు

28) బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం బీహార్, రెండవ రాష్ట్రం ఏది ?
ఎ) మధ్యప్రదేశ్
బి) కర్ణాటక✅
సి) ఆంధ్రప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్

29) ప్రస్తుత కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖామంత్రి ఎవరు ?
ఎ) ఉమా భారతి
బి) స్మృతి ఇరానీ
సి) నజ్మా హెప్తుల్లా
డి) మేనకాగాంధీ✅

30) 1957లో మైనారిటీ భాషల కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ) ఢిల్లీ✅
బి) ముంబై
సి) బెంగళూరు
డి) హైదరాబాద్

31) తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత స్త్రీ-శిశు సంక్షేమ శాఖా మంత్రి ఎవరు ?
ఎ) జగదీశ్ రెడ్డి
బి) ఈటెల రాజెందర్
సి) తుమ్మల నాగేశ్వరరావు✅
డి) పద్మా దేవేందర్ రెడ్డి

32) 2000 సంవత్సరంలో గర్భిణి స్త్రీల సుఖ ప్రసవానికి సంబంధించి ప్రభుత్వం అమలు పరచిన పథకమేది ?
ఎ) అమృత హస్తం
బి) సుఖీభవ పథకం✅
సి) స్వధార్
డి) భోజనామృతం

33) సుకన్య సమృద్ధి యోజన పథకంను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏ రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభించారు ?
ఎ) తెలంగాణ
బి) గుజరాత్
సి) మహారాష్ట్ర
డి) హర్యానా✅

34) మొట్టమొదటి భారతీయ మహిళ బ్యాంక్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
ఎ) మహారాష్ట్ర✅
బి) తమిళనాడు
సి) గుజరాత్
డి) ఢిల్లీ

35) వి.వి.గిరి నేషనల్ లేబర్ ఇనిస్టిట్యూట్ ఎచ్చట కలదు ?
ఎ) ధన్ బాద్
బి) హైదరాబాద్
సి) నోయిడా✅
డి) భువనేశ్వర్

36) గ్రామీణాభివృద్ధి కోసం చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఏది ?
ఎ) ఆర్ఎల్ఇజిపి
బి) ఐఆర్ డిపి✅
సి) డిపిఎపి
డి) ఎన్ఆర్ఇపి

37) 1952లో ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి పథకంలో భాగం కానిది ఏది ?
ఎ) వ్యవసాయ కూలీల అభివృద్ధి✅
బి) మహిళ సంక్షేమం
సి) కమ్యూనికేషన్ల అభివృద్ధి
డి) పారిశుద్ధ్యం

38) సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ప్రధానంగా ఎవరికి నిర్దేశితమైంది ?
ఎ) మహిళలు
బి) గ్రమీణ భూస్వాములు
సి) నగర కార్మికులు
డి) చిన్న, ఉపాంత రైతులు✅

39) N.S.S. ప్రధాన కేంద్రం (National Sample Survey Organisation) ఎక్కడ ఉంది ?
ఎ) చైన్నై
బి) హైదరాబాద్
సి) న్యూఢిల్లీ✅
డి) ముంబై

40) తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు ఎక్కువగా తీసుకుంటున్న జిల్లా ఏది ?
ఎ) మెదక్
బి) కరీంనగర్✅
సి) ఆదిలాబాద్
డి) నల్గొండ

41) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం అమలులో ఏ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది ?
ఎ) ఖమ్మం
బి) కరీంనగర్
సి) ఆదిలాబాద్
డి) వరంగల్✅

42) ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకం అమలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది ?
ఎ) తెలంగాణ✅
బి) కర్ణాటక
సి) ఆంధ్రప్రదేశ్
డి) చైన్నై

43) కేంద్ర ప్రభుత్వ విధానాల తయారీలో పాల్గొనే సంస్థలు ఏవి ?
ఎ) పార్లమెంట్
బి) న్యాయవ్యవస్థ
సి) కాబినేట్ సెక్రటేరియట్
డి) జాతీయ సలహామండలి
1) a,b,c
2) b,c,d
3) a,b,c,d✅
4) a,d,b

44) జాతీయ వెనుకబడిన తరగతుల మొదటి ఛైర్మన్ ఎవరు ?
ఎ) జస్టిస్ ఎస్. రత్నవేల్ పాండ్యన్
బి) జస్టిస్ ఆర్.ఎన్. ప్రసాద్✅
సి) జస్టిస్ రాం సూరత్ సింగ్
డి) జస్టిస్ వి. ఈశ్వరయ్య

45) గిరిజనుల్లో వెనుకబడిన నాగరికతకు, సౌకర్యాలకు దూరంగా ఉన్న వర్గం ఏది ?
ఎ) లంబాడ
బి) ద్వితీయ గిరిజనులు
సి) గౌణ గిరిజనులు
డి) ఆదిమ గిరిజనులు✅

46) ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గిరిజనుల ఉపప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ?
ఎ) 6వ పంచవర్ష ప్రణాళిక
బి) 3వ పంచవర్ష ప్రణాళిక
సి) 5వ పంచవర్ష ప్రణాళిక✅
డి) 4వ పంచవర్ష ప్రణాళిక

47) జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యుల పదవీ కాలం ?
ఎ) 3 సంవత్సరాలు✅
బి) 5 సంవత్సరాలు
సి) 2 సంవత్సరాలు
డి) 4 సంవత్సరాలు

48) 2004లో మత, భాషా పర మైనారిటీల సంక్షేమం కోసం ఏర్పడిన కమిషన్ ?
ఎ) సుధీర్ కమిషన్
బి) రాజేంద్ర సచార్ కమిషన్
సి) రంగనాథ్ మిశ్రా కమిషన్✅
డి) రాజీవ్ శర్మ కమిషన్

49) గ్రామ స్వరాజ్య భావన మూలసూత్రం ఏది ?
ఎ) స్వదేశీ విధానం
బి) సత్యాగ్రహం
సి) ధర్మకర్తృత్వం
డి) పైవన్నీ✅

50) జాతీయ S.T కమిషన్ ఏ తేదీన ఏర్పడింది  ?
ఎ) 19 ఏప్రిల్ 2004
బి) 19 ఫిబ్రవరి 2004✅
సి) 19 మార్చి 2004

డి) 19 జనవరి 2004

AIMS DARE TO SUCCESS

No comments:

Post a Comment