AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 16 February 2025

Be Careful While Driving

 ⚡ తరచూ రోడ్డు ఏక్సిడెంట్ లతో నిత్యం ఎన్నో నిండు ప్రాణాలు బలి అవుతున్న తరుణంలో.. కనువిప్పు కలిగేలా ఒక సందేశం.. ఓపికతో జాగ్రత్తగా ప్రయాణం సాగించండి..🤝



Wednesday, 1 January 2025

HAPPY NEW YEAR 2025 GOOD BYE 2024

 Our new calendar year is a *mathematical wonder.*interesting 2025*


(1) 2025 itself is a square..

i.e. 45 x 45 = 2025 !


(2) It's a product of two squares..

i.e. 9² x 5² = 2025 !


(3) It is the sum of 3-squares..

i.e. 40²+ 20²+5²= 2025 !


(4) It's the sum of cubes, of all the single digits,

from 1 to 9..


i.e.1³+2³+3³+4³+5³+

6³+7³+8³+9³= 2025.


This is our New YEAR* 2025


 Have a  prosperous "New Year" 


May Your happiness Income & Wealth multiply in Square & Cubes, in the 2025.

Monday, 30 December 2024

శివుడికి మా - రేడు అంటే ఎందుకు అంత ఇష్టం?

 *శివుడికి మా - రేడు అంటే ఎందుకు అంత ఇష్టం?*


🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿


లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడుచెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలం’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగ పడుతుంది. మారేడు దళం మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము. దళాలు దళాలుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు.


ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగానికి తగలడం ఐశ్వర్యప్రదం..అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళాలతో శివునికి పూజ చేసేవారు.


మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుకింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందికి భోజనం పెట్టినంత ఫలితం వస్తుందని శాస్త్రోక్తి. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.


‘మా–రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.


🙏హరహర మహాదేవ శంభోశంకర 🙏

6th - 12th Class Maths Tuitions


 

Sunday, 29 December 2024

మనల్ని మనం గౌరవించుకోవడం నేర్చుకోవాలి


 

New Year 2025 Restrictions in Nalgonda

 న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ జారీ చేసిన నియమ నిబంధనలు..👇


*జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు* 


* *ప్రజలు,యువత డిశంబర్ 31 వేడుకలు శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలి* .

* *31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.* 

* *డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం జరుగుతుంది*

* *జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ IPS* 

  జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ డిసెంబర్ 31 న నిర్వహించుకునే  వేడుకలు జిల్లా ప్రజలు యువత శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని ఒక ప్రకటనలో జిల్లా యస్.పి గారు తెలిపారు.

     డిసెంబర్ 31 వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసు వారి సూచనలు పాటించాలి, వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రమాదాలకు దూరంగా ఉంటూ నిర్వహించుకోవాలని అన్నారు.


* మద్యం దుకాణాలు, వైన్ షాప్స్  రాత్రి 12.00 గంటల వరకు  బార్స్, రెస్టారెంట్స్ రాత్రి 1.00 గంట వరకు  ప్రభుత్వo అనుమతించిన సమయపాలన పాటించాలి.

*  31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిని అదుపులొకి  తీసుకుని కేసులు నమోదు చేసి కోర్టు లో హాజరు పరుస్తాము, అదేవిదంగా వాహనము సీజ్ చేయడం  లైసెన్స్ రద్దు చేయడం మరియు బైయిండోవర్ లాంటి చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. 

* గంజాయి, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాలు సేవించే వారి పై ఎప్పటికప్పుడు డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.

* ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే కూడా చట్ట పరమైన చర్యలు తప్పవు. 

* మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తో  అక్రమ సిట్టింగులు, ఆరుబయట మద్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేదింపులకు గురి చేస్తూ,ఇబ్బందులను పెట్టే వారిపై షి టీం బృందాలు ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది.

* ఆర్కెస్ట్రా, డి.జే లు, మైకులు ఉపయోగించడం, బాణసంచా నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు.

*  ముఖ్యంగా యువత పై కేసు నమోదు ఐతే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు,ఇతర దేశాలకు వెళ్ళుటకు వీసాలు లాంటివి ఇవ్వబడవు, కావున యువత గమనించగలరు. 

* మద్యానికి దూరంగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. 

* వేడుకల్లో అపశృతులు జరగకుండా వాహన తనిఖీలు, పెట్రోలింగ్, పికేట్స్,  మఫ్టీ టీమ్స్, ముఖ్యమైన కూడలిలలో  CC కెమరాలు ఏర్పాటు లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. 

పై సూచనలు పాటిస్తూ జిల్లా ప్రజలు మరియు యువత యొక్క అమూల్యమైన జీవితం ప్రమాదాల బారిన పడకుండా చూడడం పోలీస్ వారి బాధ్యత.


ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ *INCIDENT FREE-ACCEDENT FREE* గా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.


ఎస్పీ శరత్ చంద్రపవార్ ఐపీఎస్ 👆

Practice makes you perfect 😂🤪

 Practice makes you perfect

 😂🤪




మగాడి గా పుట్టడం ఈజీనే' మగాడు అనిపించుకోవడం చాలా కష్టం

 *ప్రతి మగాడు చూడాల్సిన వీడియో*


మగాడి గా పుట్టడం ఈజీనే' మగాడు అనిపించుకోవడం చాలా కష్టం




ఎంత మంది స్త్రీల పేర్లో చూడండి

 


ఏనుగు ముసలి కథ

 *_మనకు ఏనుగు, ముసలి గురించి తెలుసు కదా!భూమి పైన ఏనుగు కన్నా బలమైన జంతువు లేదు.పెద్ద పేద్ద చెట్లనూ నేలకూల్చ గలదూ._*


*_అది దాని స్థాన బలిమి.మరి ముసలి కన్నా బలమైన జంతువు నీటిలో ఉన్నదా..?అలాంటి ముసలి భూమి పైకి వస్తే ఏమి జరుగుతూంది.మరి ఈ ఏనుగు నీటిలోకి దిగినప్పుడు తన శక్తి అలాగే ఉంటుందా..?ఆలోచించండి._*


*_ఒకవేళ ఈ రెండు జంతువులు భూమి పైన,నీటి పైన పోరాడితే ఏది గెలుస్తుందో మనకి తెలుసు అలాగే మనం ఎంత సమర్థులమైనా మన మాట చెల్లుబడి కాదు అని అనిపించిన చోట మన ప్రజ్ఞ చూపించగూడదు._*


*_ఒకరు గుర్తించక పోయినా మనకు ఒరిగేదేమీ లేదు.అలాంటి చోట ఎరగనట్టు ఉండడమే మేలు._*


*_మూర్ఖుడు మంచి వినడు.పైపెచ్చు అవమానిస్తాడు.ఈ సంగతులు తెలిసి వేమన చక్కగా చెప్పాడు.కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది..అనీ.._*


*_అంత మాత్రాన అది చిన్నదై పోతుందా..?అలాగే గౌరవంగా బతకాలంటే అడగందే అలాంటి వాళ్లకు సలహాలివ్వ గూడదు.._*


*_ఒకరికి చాలా ఉంది.మనకు చాలినంత ఉంది అయితే వాడేమీ బంగారం తినలేడు.మనం తినేదే.. ఏదైనా ఆకలి తీరడానికే.._*


*_నాకింత ఉంది అన్నా నువ్వు తినేది అదే.అంతే.అందుచేత కొంచెముండుటెల్ల కొదువగాదు అన్నాడు._*


*_సంతోషం ప్రధానం.అది ఉంటే ఇంద్రుడే..అది ప్రాప్తం లేక పోతే ఎంత ఉన్నా వేరే వాళ్లు తినడానికే.నీవు దిగులు గడుస్తూ ఉండాల్సిందే.._*


*_కాబట్టి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండు నాకు లేదు వాడికి ఉందని నీకున్న కొద్దీ సంతోషం కూడా పాడుచేసుకోకు..☝🏾_*


*_ఈ మంచి సందేశం ఒక ఆత్మీయుడు.. 'రఘు ' పంపించిన మంచి మాటలు మీతో పంచుకుంటున్న.._*

Spending Time 1930 - 2024

 ⚡ Very interesting shift as to how and where people spend their time from 1930 to 2024.




సూర్య నమస్కారాలు

 💥 *సూర్య_నమస్కారాలు.*💥


⚡ *సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.*


*ఆసనానికో ప్రయోజనం :-*


*సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం..*


💫 *ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.*


💫 *రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.*


💫 *మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.*


💫 *నాలుగు, తొమ్మిది :-* *వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.*


💫 *ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.*


💫 *ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.*


💫 *ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.*


⚡ *మరెన్నో లాభాలు :-*


*సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. "సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.*

*ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.* *సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.*


*1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-*

సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.


*2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-*

కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.


*3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-*

శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.


*4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-*

ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.


*5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-*

కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.


*6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-*

ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.


*7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-*

శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.


*8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-*

ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.


*9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-*

నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి


*10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-*

మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.


*11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-*

రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.


*12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-*

నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.


🙏 *సర్వేజనా సుఖినోభవంతు* 🙏