AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 29 December 2024

New Year 2025 Restrictions in Nalgonda

 న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ జారీ చేసిన నియమ నిబంధనలు..👇


*జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు* 


* *ప్రజలు,యువత డిశంబర్ 31 వేడుకలు శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలి* .

* *31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.* 

* *డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం జరుగుతుంది*

* *జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ IPS* 

  జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ డిసెంబర్ 31 న నిర్వహించుకునే  వేడుకలు జిల్లా ప్రజలు యువత శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని ఒక ప్రకటనలో జిల్లా యస్.పి గారు తెలిపారు.

     డిసెంబర్ 31 వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసు వారి సూచనలు పాటించాలి, వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రమాదాలకు దూరంగా ఉంటూ నిర్వహించుకోవాలని అన్నారు.


* మద్యం దుకాణాలు, వైన్ షాప్స్  రాత్రి 12.00 గంటల వరకు  బార్స్, రెస్టారెంట్స్ రాత్రి 1.00 గంట వరకు  ప్రభుత్వo అనుమతించిన సమయపాలన పాటించాలి.

*  31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిని అదుపులొకి  తీసుకుని కేసులు నమోదు చేసి కోర్టు లో హాజరు పరుస్తాము, అదేవిదంగా వాహనము సీజ్ చేయడం  లైసెన్స్ రద్దు చేయడం మరియు బైయిండోవర్ లాంటి చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. 

* గంజాయి, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాలు సేవించే వారి పై ఎప్పటికప్పుడు డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.

* ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే కూడా చట్ట పరమైన చర్యలు తప్పవు. 

* మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తో  అక్రమ సిట్టింగులు, ఆరుబయట మద్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేదింపులకు గురి చేస్తూ,ఇబ్బందులను పెట్టే వారిపై షి టీం బృందాలు ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది.

* ఆర్కెస్ట్రా, డి.జే లు, మైకులు ఉపయోగించడం, బాణసంచా నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు.

*  ముఖ్యంగా యువత పై కేసు నమోదు ఐతే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు,ఇతర దేశాలకు వెళ్ళుటకు వీసాలు లాంటివి ఇవ్వబడవు, కావున యువత గమనించగలరు. 

* మద్యానికి దూరంగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. 

* వేడుకల్లో అపశృతులు జరగకుండా వాహన తనిఖీలు, పెట్రోలింగ్, పికేట్స్,  మఫ్టీ టీమ్స్, ముఖ్యమైన కూడలిలలో  CC కెమరాలు ఏర్పాటు లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. 

పై సూచనలు పాటిస్తూ జిల్లా ప్రజలు మరియు యువత యొక్క అమూల్యమైన జీవితం ప్రమాదాల బారిన పడకుండా చూడడం పోలీస్ వారి బాధ్యత.


ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ *INCIDENT FREE-ACCEDENT FREE* గా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.


ఎస్పీ శరత్ చంద్రపవార్ ఐపీఎస్ 👆

No comments:

Post a Comment