AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

సైన్స్ & టెక్నాలజీ Science & Technology అణువిద్యుత్ కోసం అతి పెద్ద రియాక్టర్

అణువిద్యుత్ కోసం అతి పెద్ద రియాక్టర్

ఫాన్స్‌లో రూపుదిద్దుకుంటున్న కేంద్రక సంలీన అణురియాక్టర్
రూ.1.22 లక్షల కోట్లతో నిర్మిస్తున్న 35 దేశాలు
భారత్ పాత్రే అత్యంత కీలకం
నిరంతరం నిప్పుల కొలిమిలా మండే సూర్యుడిని ఓ స్టీలు డబ్బాలో బంధించి.. ఆ డబ్బా నుంచి విడుదలయ్యే వేడితో కొద్దికొద్దిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటే ఎలా ఉంటుంది? అది సాధ్యం కాదు. కానీ.. దాదాపుగా అచ్చం అలాంటి పనినే చేసేందుకు ఇప్పుడు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుంబిగించారు! ప్రపంచ శాస్త్రీయ పరిశోధనల రంగంలో అతిపెద్ద ప్రాజెక్టుకు ఫ్రాన్స్‌లో రంగం సిద్ధం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి కలగానే మిగిలిపోయిన ఈ తొలి ‘కేంద్రక సంలీన అణు రియాక్టర్’ ఏర్పాటు ప్రాజెక్టుకు అమెరికా, జపాన్, రష్యా, తదితర 35 దేశాలతో సహా భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. దక్షిణ ఫ్రాన్స్‌లోని క్యాడరాచే వద్ద ‘ఐటర్ (ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్)’ పేరుతో తలపెట్టిన ఈ రియాక్టర్‌ను 2021 నాటికి నిర్మాణం పూర్తిచేసేందుకు భారత్ సహా అమెరికా, చైనా, రష్యా, దక్షిణకొరియా, ఈయూ, జపాన్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఒసామూ మోటోజిమా నేతృత్వంలో సంయుక్తంగా కృషిచేస్తున్నారు. ఈ మేరకు 800 మంది శాస్త్రవేత్తలు ఇటీవలే సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో సమావేశమై ప్రణాళికలు రూపొందించారు.

కేంద్రక సంలీన రియాక్టర్ అంటే..?
సూర్యుడు నిత్యం నిప్పుల కొలిమిలా మండుతూ ఉండేందుకు కారణం.. సూర్యుడిలో కేంద్రక సంలీన చర్యలు జరగడమే. అంటే.. హైడ్రోజన్ పరమాణువులు పరస్పరం కలిసిపోవడం వల్ల అత్యంత శక్తి విడుదలవుతుందన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా వెలువడే శక్తి స్వచ్ఛమైన విద్యుత్‌గా ఉపయోగపడుతుంది. దీని నుంచి ఎలాంటి వ్యర్థాలు ఏర్పడవు. దీనిని రియాక్టర్లలో నియంత్రించడం సులభం. ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉండదు. అందుకే ప్రస్తుత అణు రియాక్టర్లకు ప్రత్యామ్నాయంగా ప్రపంచానికి స్వచ్ఛమైన అణువిద్యుత్ అందించేందుకు ఐటర్ ప్రాజెక్టుపై దృష్టిపెట్టినట్లు భారత బృందం చీఫ్ డాక్టర్ రవి గ్రోవర్ వెల్లడించారు. ప్రస్తుతం అణు రియాక్టర్లలో రేడియోధార్మిక పదార్థాలతో కేంద్రక విచ్ఛిత్తి చర్యలు జరపడం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రియాక్టర్లలో రేడియోధార్మిక పరమాణువులను విభజన చెందిస్తూ.. ఆ సందర్భంగా గొలుసుకట్టు చర్యల ద్వారా వెలువడే శక్తి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల రేడియోధార్మిక వ్యర్థాలు ఏర్పడుతున్నాయి. వీటి వల్ల పర్యావరణానికి భారీగా హాని కలుగుతోంది. ఈ రియాక్టర్లు పేలి విపత్తులు జరిగే ప్రమాదమూ ఉంది.

భారత్ పాత్ర ఏమిటి? 
ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజిరేటర్‌ను ఈ రియాక్టర్ కోసం భారత్ నిర్మిస్తోంది. వాయువులను మైనస్ 269 డిగ్రీ సెల్షియస్‌లకు చల్లబర్చే థర్మాస్‌ఫ్లాస్క్‌లా పనిచేసేలా దీనిని రూపొందిస్తోంది. రియాక్టర్‌లో కేంద్రక సంలీన చర్యలు జరిపేందుకు ఉపయోగించే భారీ అయస్కాంతాల వ్యవస్థ పనిచేసేందుకు ఈ క్రయోస్టాట్(శీతల) వ్యవస్థే కీలకం. అయస్కాంత వ్యవస్థ తగినంత చల్లబడకపోతే కేంద్రక సంలీన చర్యలు స్తంభించిపోతాయి కాబట్టి.. ఇందులో భారత్ తయారు చేసే క్రయోస్టాట్ వ్యవస్థే ప్రధానం కానుంది.

విద్యుత్ ఉత్పత్తి ఇలా... 
భారీ డబ్బాలాంటి స్టీలు ఫ్రేములా ఉండే ఐటర్‌లో హైడ్రోజన్ వాయువును 15 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతకు వేడిచేస్తారు. దానిని తక్కువ స్థలంలోకి ఒత్తిడితో నిర్బంధిస్తారు. తర్వాత భారీ అయస్కాంతాల ప్రభావంతో పరమాణువులు ఒకదానితో ఒకటి బలంగా కలిసిపోయి సంలీనం చెందేలా చేస్తారు. దీనివల్ల పెద్ద ఎత్తున వెలువడే ఉష్ణశక్తిని విద్యుత్‌గా మారుస్తారు.

ఇవీ విశేషాలు... 
కేంద్రక విచ్ఛిత్తి కన్నా ఈ పద్ధతిలో 10 రెట్లు ఎక్కువగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
ఐటర్ నిర్మాణానికి సుమారుగా 1.22 లక్షల కోట్లు (20 బిలియన్ డాలర్లు) వ్యయం కానున్నాయి.
అత్యంత కీలకమైన క్రయోజనిక్ వ్యవస్థతో పాటు 9 వేల కోర్(ఇతర భాగాలు)లను భారత్ అందిస్తోంది. అందువల్ల ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం ఖర్చును మాత్రమే భరించనుంది.
ఐటర్ రియాక్టర్ బరువు 23 వేల టన్నులు. ఇది మూడు ఈఫిల్ టవర్ల బరువుతో సమానం.
ఐటర్లో ఉపయోగించిన తీగల మొత్తం పొడవు 80 వేల కిలోమీటర్లు.
ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే గనక.. 2050 నాటికి సొంత కేంద్రక సంలీన రియాక్టర్ తయారీపై భారత్ దృష్టిపెట్టనుంది.


సైన్స్ & టెక్నాలజీ Science & Technology అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణంలో భారత్

అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణంలో భారత్

హవాయ్ దీవిలో నిర్మిస్తున్న ప్రపంచ అతిపెద్ద థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) నిర్మాణంలో జపాన్, అమెరికా, చైనా, కెనడాలతోపాటు భారత్ కూడా భాగం పంచుకుంటోంది. దీని నిర్మాణ ప్రారంభ కార్యక్రమం అక్టోబర్ 7న జరిగింది. హవాయి దీవిలో 4,012 మీటర్ల ఎత్తై మౌనా కీ అగ్ని పర్వతంపై 1.4 బిలియన్ డాలర్ల (రూ. 8,618 కోట్లు) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెలిస్కోపు ద్వారా 500 కి.మీ దూరంలో ఉన్న నాణెం పరిమాణాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ టీఎంటీ నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుంది.


సైన్స్ & టెక్నాలజీ Science & Technology వివిధ శాస్త్రాలు - అధ్యయనాలు

వివిధ శాస్త్రాలు - అధ్యయనాలు

సైటాలజీకణం, కణాంగాల అధ్యయన శాస్త్రం
అనాటమీమొక్కలు, జంతువులు లేదా మానవ అంతర్నిర్మాణ శాస్త్రం
ఎకాలజీమొక్కలు, జంతువులకు వాటి పరిసరాలతో ఉండే సంబంధాల గురించి వివరించే అధ్యయన శాస్త్రం
ఆర్థిక వృక్షశాస్త్రం (ఎకనమిక్ బోటనీ)మానవులకు ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల అధ్యయనాన్ని ఎకనమిక్ బోటనీ అంటారు ధాన్యాలు, పప్పులు, నూనెగింజల పంటలు, ఫలాలు, కూరగాయల వంటి వాటి అధ్యయన శాస్త్రం
ఎంబ్రియాలజీపిండాభివృద్ధి శాస్త్రం
జెనెటిక్స్జన్యువుల లక్షణాల అధ్యయన శాస్త్రం
పేలినాలజీపుష్పించే మొక్కల పరాగ రేణువుల అధ్యయనం
పేలియోబోటనీవృక్షశిలాజాల అధ్యయన శాస్త్రం
టాక్సానమీమొక్కలు, జంతువుల గుర్తింపు, వాటి వర్గీకరణ వంటి వాటి అధ్యయన శాస్త్రం
మైకాలజీవివిధ రకాల ఫంగస్‌ల అధ్యయన శాస్త్రం
పాథాలజీమొక్కలు, జంతువుల వ్యాధుల అధ్యయన శాస్త్రం
ఫైకాలజీఆల్గేల అధ్యయనం దీన్నే ఆల్గాలజీ అంటారు
బ్రయాలజీబ్రయోఫైట్స్ అనే మొక్కల అధ్యయనం (ఉదా: లివర్‌వార్ట్స్, మాస్)
టెరిడాలజీఫెర్న్స్ వంటి టెరిడోఫైట్ మొక్కల అధ్యయన శాస్త్రం
జువాలజీఏకకణ జీవి అమీబా నుంచి మానవుని వరకు అన్ని జంతువుల అధ్యయన శాస్త్రం
హిస్టాలజీకణజాల శాస్త్రం
ఎండోక్రైనాలజీఅంతఃస్రావిక వ్యవస్థ అధ్యయనం (జంతువుల్లో విడుదలయ్యే హార్మోన్ల అధ్యయనం)
ఎంటమాలజీకీటకాల అధ్యయన శాస్త్రం
పేలియోజువాలజీజంతు శిలాజాల అధ్యయన శాస్త్రం
ఆర్నిథాలజీపక్షుల అధ్యయన శాస్త్రం
హెల్మింథాలజీపరాన్నజీవ పురుగుల అధ్యయన శాస్త్రం
లెపిడోటెరాలజీసీతాకోకచిలుకలు, మాత్‌ల అధ్యయన శాస్త్రం
లిమ్నాలజీసరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం
మయాలజీకండరాల అధ్యయన శాస్త్రం
ఓఫియాలజీపాముల అధ్యయన శాస్త్రం
మైక్రోబయాలజీసూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం
బాక్టీరియాలజీబాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం
వైరాలజీవైరస్‌ల అధ్యయన శాస్త్రం
ఆగ్రోస్టాలజీగడ్డి అధ్యయన శాస్త్రం
హైడ్రాలజీభూగర్భ జలాల అధ్యయన శాస్త్రం
హైడ్రోపోనిక్స్(నేల సహాయం లేకుండా) మొక్కలను నీటిలోనే పెంచటాన్ని అధ్యయనం చేసే శాస్త్రం
హార్టీకల్చర్తోటల పెంపకం
ఫ్లోరీకల్చర్పుష్పాల పెంపకం
పెడాలజీనేలల అధ్యయన శాస్త్రం
విటికల్చర్ద్రాక్షతోటల పెంపకం
సిల్వీకల్చర్కలపనిచ్చే చెట్ల పెంపకం
ఇక్తియాలజీచేపల అధ్యయన శాస్త్రం
పోమాలజీపండ్ల మొక్కల అధ్యయన శాస్త్రం
ఒలెరీకల్చర్కూరగాయల పెంపకం
ఎపీకల్చర్తేనెటీగల పెంపకం
టిష్యూకల్చర్కణజాలాల సంవర్ధనం
పిసికల్చర్చేపల పెంపకం
వర్మికల్చర్వానపాముల పెంపకం
కార్డియాలజీమానవ హృదయ నిర్మాణం, గుండెకు వచ్చే వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం
ఆఫ్త్తాల్మాలజీమానవుని కన్ను, నిర్మాణం, విధులు, కంటి వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం
ఇమ్యునాలజీమానవుని రోగ నిరోధక శక్తి అధ్యయన శాస్త్రం
డెర్మటాలజీమానవుని చర్మం, నిర్మాణం, విధులు, చర్మానికి వచ్చే వ్యాధులు, వాటికి చికిత్సల అధ్యయన శాస్త్రం
హెమటాలజీరక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం
గైనకాలజీస్త్రీల వ్యాధుల అధ్యయన శాస్త్రం
హెపటాలజీకాలేయ అధ్యయన శాస్త్రం
పీడియాట్రిక్స్చిన్నపిల్లల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం
న్యూరాలజీనాడీ వ్యవస్థ అధ్యయన శాస్త్రం
ఆంకాలజీకేన్సర్ అధ్యయన శాస్త్రం
జెరియాట్రిక్స్వృద్ధుల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం
రుమటాలజీకీళ్లు, వాటికి సంబంధించిన వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం
ఆంజియాలజీరక్తనాళాల అధ్యయన శాస్త్రం
పల్మనాలజీఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రం
క్రేనియాలజీమానవుని పుర్రెను అధ్యయనం చేసే శాస్త్రం దీన్నే ఫ్రెనాలజీ అని కూడా అంటారు
నెఫ్రాలజీమూత్రపిండాల నిర్మాణం, విధులు, వాటికి సంక్రమించే వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం
క్రిమినాలజీనేరాలు, నేరస్థుల అధ్యయన శాస్త్రం
టాక్సికాలజీవిషంపై అధ్యయనం చేసే శాస్త్రం
క్రిప్టోగ్రఫీరహస్య సంకేతాలతో రాసిన చేతిరాతల అధ్యయన శాస్త్రం
ట్రైకాలజీమానవుని జుట్టుపై అధ్యయనం చేసే శాస్త్రం
థానటాలజీమరణంపై అధ్యయనం చేసే శాస్త్రం
ఆస్ట్రానమీఖగోళ అధ్యయన శాస్త్రం
సిస్మాలజీభూకంపాల అధ్యయన శాస్త్రం
లిథాలజీశిలల అధ్యయన శాస్త్రం
ఓరాలజీపర్వతాల అధ్యయన శాస్త్రం
కాస్మోలజీవిశ్వంపై అధ్యయనం చేసే శాస్త్రం
సెలినాలజీచంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం
మెటియోరాలజీవాతావరణ అధ్యయన శాస్త్రం
పోటమాలజీనదుల అధ్యయన శాస్త్రం
అకౌస్టిక్స్ధ్వని అధ్యయన శాస్త్రం
ఆప్టిక్స్కాంతి అధ్యయన శాస్త్రం
క్రయోజెనిక్స్అత్యల్ప ఉష్ణోగ్రతల నియంత్రణ అధ్యయన శాస్త్రం
థియోలజీవివిధ మతాల అధ్యయన శాస్త్రం
సోషియాలజీసమాజ అధ్యయన శాస్త్రం
డెమోగ్రఫీమానవ జనాభా అధ్యయన శాస్త్రం (జననాలు, మరణాల వంటి గణాంకాలు)
పెడగాగీబోధనాపద్ధతుల అధ్యయన శాస్త్రం
ఫిలాటలీస్టాంపుల సేకరణ
న్యూమిస్‌మ్యాటిక్స్నాణేల అధ్యయన శాస్త్రం
లెక్సికోగ్రఫీనిఘంటువుల అధ్యయన శాస్త్రం
ఎటిమాలజీపదాల పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రం
న్యూమరాలజీసంఖ్యా శాస్త్రం
సెఫాలజీఎన్నికల అధ్యయన శాస్త్రం
ఫొనెటిక్స్భాషా ఉచ్ఛరణ అధ్యయన శాస్త్రం


పాలిటి Polity ఎస్మా చట్టం

ఎస్మా చట్టం

‘ఎసెన్షియల్ సర్వీసెస్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ (అత్యవసర సేవల నిర్వహణ చట్టం)’ సంక్షిప్త రూపం ఎస్మా. సమ్మెలు, హర్తాళ్ (బంద్) వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా, కొన్ని రకాల ‘అత్యవసర సేవల నిర్వహణ’ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టం.
అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా, ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె చేపడితే దీన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది.

ఎస్మాను ఎప్పుడు ప్రయోగిస్తారు..?
నిరంతరం శ్రమించే కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెబాట పడుతుంటారు. కార్మిక సంఘాలు, ప్రభుత్వ పెద్దల నడుమ చర్చలు జరుగుతాయి. కోర్కెలు న్యాయబద్ధమైనవని ప్రభుత్వం భావించి సమస్యలు పరిష్కరిస్తే ఆందోళన విరమించి అంతటితో సద్దుమణుగుతుంది. లేని పక్షంలో సమ్మె మరిం త ఉధృతరూపం దాల్చుతుంది. అదే సమయంలో ప్రజా జీవనానికి అంతరాయం ఏర్పడకుండా అత్యవసర సేవలందిస్తుంటారు. దైనందిన జీవితానికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు నెలకొన్న సందర్భాల్లో చివరకు సర్కారు కార్మికులపై ‘ఎస్మా’ చట్టాన్ని ప్రయోగిస్తుంది. ఒకసారి ప్రయోగిస్తే ఈ చట్టం ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. అవసరమైన మేరకు పొడిగించుకొనే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ప్రజా ప్రయోజనాల రీత్యా సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు. సస్పెన్షన్, డిస్మిస్, జైలు శిక్ష, జరిమానా విధించే హక్కు ప్రభుత్వాలకు సంక్రమిస్తుంది.

ఎప్పుడొచ్చింది? 
1980లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉధృతస్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంటు ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. క్రమేపీ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతున్నట్లు స్పష్టమవడంతో ప్రభుత్వం ముందుగా 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ‘ఎస్మా’ చట్టం తెచ్చారు. జమ్మూ కశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఇది వర్తిస్తుంది.

ఉల్లంఘిస్తే? 
ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా బలమైన అనుమానం ఉంటే, నేరశిక్షాస్మృతి (సీపీసీ)తో సంబంధం లేకుండానే పోలీసులు వారంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతోపాటు వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి జైలు, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షార్హులే.

గతంలో ఎక్కడెక్కడ విధించారు? 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెలపై ‘ఎస్మా’ ప్రయోగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2003లో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో జయలలిత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి దాదాపు 1,70,000 మందిని విధుల్లోంచి తొలగించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాతగానీ వారంతా విధుల్లో చేరలేకపోయారు. సమ్మె కట్టిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఎస్మా ప్రయోగించారు. 2006లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినపుడు, 2009లో ట్రక్కు రవాణా దారులు సమ్మె చేసినపుడు, అదే ఏడాది చమురు, గ్యాస్ సిబ్బంది సమ్మె చేసినపుడు.. ఇలా పలు సందర్భాల్లో ఎస్మా ప్రయోగించారు.


పాలిటి Polity సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ)

సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ)

పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రస్తావన లేదు. అయితే ప్రకరణ 105లో వీటి గురించి పరోక్షంగా ప్రస్తావించారు. వీటి నిర్మాణం, విధులు, అధికారాలు పార్లమెంటు నిర్ణయిస్తుంది.
జేపీసీలకు సంబంధించి కూడా రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. పార్లమెంటులో ఆయా శాఖలకు సంబంధించి శాశ్వత కమిటీలు, ప్రత్యేక అంశాలపై వేసే తాత్కాలిక కమిటీలు ఉంటాయి. జేపీసీలు తాత్కాలిక కమిటీల విభాగంలోకి వస్తాయి.

జేపీసీ నిర్మాణం
ఉభయ సభలకు చెందిన సుమారు 15-30 మందిని ఇందులో సభ్యులుగా తీసుకోవచ్చు. అధికార పక్ష సభ్యునికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ.
పార్లమెంటు ఉభయసభల్లో ఏదైనా ఒక సభలో ఈ కమిటీ ఏర్పాటు కోసం సాధారణ మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించిన తరువాత మరొక సభ దానిని అంగీకరిస్తే లేదా మద్దతిస్తే సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటవుతుంది.
లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఇద్దరూ పరస్పర అవగాహనతో జేపీసీని ఏర్పాటుచేస్తారు.
ఇప్పటి వరకూ ఏర్పాటైన పలు జేపీసీలు
బోఫోర్స్ కుంభకోణం- 1987 ఆగస్టు 6
అధ్యక్షులు: శంకరానంద్(కాంగ్రెస్). 50 పర్యాయాలు సమావేశమైంది. 1998 ఏప్రిల్ 26న నివేదిక సమర్పించింది. ప్రతిపక్షాలు దీన్ని తోసిపుచ్చాయి. 
స్టాక్ మార్కెట్ కుంభకోణం (హర్షద్ మెహతా కుంభకోణం): 1992 ఏప్రిల్ 6
అధ్యక్షులు: రాం నివాస్ మీర్ధా(కాంగ్రెస్). 105 సార్లు సమావేశమైంది. 1993 డిసెంబర్ 21 నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదు, తిరస్కరించలేదు. 
కేతన్ పరేఖ్ కుంభకోణం(స్టాక్ మార్కెట్ కుంభకోణం): 2001 ఏప్రిల్ 26
అధ్యక్షులు: ప్రకాశ్ మణి(బీజేపీ). 109 సార్లు సమావేశమైంది. నివేదికను 2002 డిసెంబర్ 19న ఇచ్చింది. స్టాక్‌మార్కెట్ నియంత్రణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 
శీతల పానీయాల్లో పురుగుల మందు: 2003 ఆగస్టు 8
అధ్యక్షులు: శరద్ పవార్(నేషనలిస్ట్ కాంగ్రెస్). 17 సార్లు సమావేశమైంది. 2004 ఫిబ్రవరి 4న నివేదిక సమర్పించింది. శీతల పానీయాల్లో పురుగుల మందుల అవశేషాలు నిజమేనని తేల్చింది. ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ఏర్పాటైంది. 
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం: 2011 మార్చి 1
అధ్యక్షులు: పీసీ చాకో(కాంగ్రెస్). మొత్తం సభ్యుల సంఖ్య 30. లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు.
పార్లమెంటరీ సంఘాలు- ప్రభావం
పార్లమెంటరీ కమిటీలు భారత రాజకీయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు పనిచేసే విధానాన్ని నిరంతరం సమీక్షిస్తూ, పరిపాలన యంత్రాంగం సమర్థంగా పనిచేయడానికి దోహదం చేస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను బాధ్యత వహించేటట్లు చేస్తూ, దుబారా, లంచగొండితనం, పక్షపాత వైఖరి, బాధ్యతారాహిత ్య ధోరణులను సాధ్యమైనంత వరకూ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి.


పాలిటి Polity జాతీయ మానవ హక్కుల కమిషన్‌

జాతీయ మానవ హక్కుల కమిషన్‌

మానవులు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలే మానవహక్కులు. ఇవి కుల, మత, ప్రాంత, లింగ భేదాలకు అతీతం.
దేశంలో మానవహక్కుల పరిరక్షణకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మానవ హక్కుల కమిషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ 1993లో జాతీయ హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. దీన్ని 2006లో సవరించారు.

సభ్యుల నియామకం: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షునిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి(పదవిలో ఉన్నా లేదా విరమణ చేసినా), హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(పదవిలో ఉన్నా లేదా విరమణ చేసినా), మానవ హక్కుల కార్యక్ర మాల్లో చురుగ్గా ఉన్న ఇద్దరు వ్యక్తులను సభ్యులుగా నియమిస్తారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ సిఫార్సు మేరకు కమిషన్ సభ్యులను రాష్ర్టపతి నియమిస్తారు. పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్లు వచ్చేంతవరకు(ఏది ముందైతే అది).

విధులు
కమిషన్ స్వయంగా లేదా బాధితుని ఫిర్యాదు మేరకు లేదా కోర్టు ఉత్తర్వు మేరకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినపుడు దానిపై సమగ్ర విచారణ చేయడం
న్యాయస్థానం అనుమతి మేరకు మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కార్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం
మానవహక్కుల పరిరక్షణకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను, శాసన సభలు రూపొందించే చట్టాలను సమీక్షించి వాటిని ప్రభావవంతంగా అమలుచేయడానికి సూచనలివ్వడం
అధికారాలు
1. సివిల్ కోర్టుకున్న అధికారాలు ఉంటాయి.
ఎ) అఫిడవిట్లను, సాక్ష్యాధారాలను సేకరించడానికి, విచారించడానికి
బి) న్యాయస్థానం లేదా ప్రభుత్వ కార్యాలయం నుంచి అవసరమైన సమాచారం పొందే అధికారం ఉంటుంది.
2. కమిషన్ తాను దర్యాప్తు చేస్తున్న కేసును మెజిస్ట్రేట్‌కు పంపడానికి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కేసును బదిలీ చేయడానికి.. 
3. విచారణ ముగిసిన తర్వాత కమిషన్ దృష్టిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే..
ఎ) బాధితునికి లేదా వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం ఇవ్వాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు.
బి) సుప్రీంకోర్టు లేదా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరవచ్చు.


పాలిటి Polity అసెంబ్లీ... తెలుసుకోతగ్గ అంశాలు

అసెంబ్లీ... తెలుసుకోతగ్గ అంశాలు

అసెంబ్లీ అంటే ఏమిటి? సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? పాటించే పద్ధతులేంటి? చట్టాలు ఎలా రూపొందుతాయి? వంటి వాటితో సహా తరచూ మనం వినే అసెంబ్లీ పదజాలం మీకోసం...
అసలు అసెంబ్లీ అనే ఆంగ్ల పదం ‘అసెంబ్లర్’ అనే ప్రాచీన ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. అసెంబ్లీ అంటే ‘ఒక ప్రయోజనం కోసం కొంత మంది ప్రజలు ఒక చోట సమావేశం అవటం’ అని అర్థం.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల్లో భారతదేశం ఒకటి. ఎలాంటి భేదభావం లేకుండా 18ఏళ్లు నిండిన అన్ని వర్గాల ప్రజలకు ఓటేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. భారతదేశంలో ప్రతి ఐదేళ్లకొకసారి పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను కేంద్ర, రాష్ర్ట ఎన్నికల సంఘాలు నిర్వహిస్తాయి. దేశ ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేసేందుకు పార్లమెంటు ఉన్నట్లుగానే రాష్ట్రానికి అసెంబ్లీ ఉంటుంది. శాసనసభ, శాసనమండలిని కలిపి అసెంబ్లీగా పిలుస్తారు. శాసనసభలో మొత్త స్థానాల్లో సరిగ్గా సగం కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మిగిలిన పార్టీలు ప్రతిపక్షాలుగా వ్యవహరిస్తాయి. వాటిలో ఎక్కువ స్థానాలు గెలుచుకొన్న పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ఈ సగం సీట్లు ఉన్న సంఖ్యను మేజిక్ ఫిగర్ అంటారు. ఉదాహరణకు తెలంగాణ శాసనసభలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. ఇందులో మేజిక్ ఫిగర్ 60.

సభా నిర్వహణ: శాసనసభా నిర్వహణ బాధ్యతను స్పీకర్ నిర్వహిస్తారు. సభ్యులు వారిలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకొంటారు. సాధారణంగా అధికార పార్టీ సభ్యుడే స్పీకర్‌గా ఎన్నికవుతారు. సహాయకుడిగా ఒక డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుంది. ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో శాసనసభ ఏర్పాటవుతుంది. ప్రమాణ స్వీకార నిర్వహణకు ఒక తాత్కాలిక సభాపతిని ఎన్నుకుంటారు. సాధారణంగా సభలో అనుభవజ్ఞుడైన సభ్యుడిని ఎన్నుకోవడం ఆనవాయితీ. తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అప్పటినుంచి పూర్తి బాధ్యత స్పీకరుదే. సభానిర్వహణకు కొన్ని నిబంధనలు కూడా ఏర్పాటుచేస్తారు. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ నియమావళి ఉంటుంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కోసం బిజినెస్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తారు.

శాసనసభ
ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ లేదా విధానసభ అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండానూ, 60 కంటే తక్కువ కాకుండా స్థానాలు ఉండాలి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175, తెలంగాణలో 119 స్థానాలున్నాయి. సభా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించేందుకు సభాపతి, ఉపసభాపతులను సభ్యుల నుంచి ఎన్నుకుంటారు.

సభ్యుల అర్హతలు
భారత పౌరుడై ఉండాలి.
25 ఏళ్ల వయసు ఉండాలి.
శాసన మండలి
రాష్ట్రాల శాసన వ్యవస్థలలో రెండో సభను ‘శాసన మండలి’ అంటారు. ప్రస్తుతం ఉన్న 29 రాష్ట్రాల్లో కేవలం ఏడింటిలోనే రెండో సభ ఉంది. అవి ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీరు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షంగా ఎన్నికవుతారు. ఇది శాశ్వత సభ. మండలిని రద్దు చేయడం సాధ్యం కాదు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు.

సభ్యుల అర్హతలు
భారత పౌరుడై ఉండాలి.
30 ఏళ్ల వయసు ఉండాలి.
ఆంధ్రప్రదేశ్
శాసనసభ స్థానాలు- 175
శాసనమండలి స్థానాలు- 50
లోక్‌సభ స్థానాలు- 25
రాజ్యసభ స్థానాలు- 11
గవర్నర్- ఈఎస్‌ఎల్ నరసింహన్
ముఖ్యమంత్రి- నారా చంద్రబాబునాయుడు
శాసనసభ స్పీకర్- కోడెల శివప్రసాద్
డిప్యూటీ స్పీకర్- మండలి బుద్ధ ప్రసాద్
శాసనమండలి చైర్మన్- ఎ. చక్రపాణి
డిప్యూటీ చైర్మన్- సతీశ్ కుమార్ రెడ్డి

తెలంగాణ
శాసనసభ స్థానాలు- 119
శాసనమండలి స్థానాలు- 40
పార్లమెంట్ స్థానాలు- 17
రాజ్యసభ స్థానాలు- 7
గవర్నర్- ఈఎస్‌ఎల్ నరసింహన్
ముఖ్యమంత్రి- కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
శాసనసభ స్పీకర్- సి. మధుసూదనాచారి
డిప్యూటీ స్పీకర్- పద్మా దేవేందర్ రెడ్డి
శాసనమండలి చైర్మన్- స్వామిగౌడ్
డిప్యూటీ చైర్మన్- నేతి విద్యాసాగర్

అసెంబ్లీ భవన నిర్మాణం
హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవనాన్ని 1913లో నిర్మించారు. ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్‌హాల్. 1905లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ 40వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు ఈ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరించారు. ఈ భవన నిర్మాణం పూర్తవడానికి ఎనిమిది ఏళ్ల సమయం పట్టింది. పర్షియన్, రాజస్థానీ శైలుల మేళవింపుతో ఈ భవనాన్ని ప్రత్యేక వాస్తుశిల్పకళా నిపుణులు డిజైన్ చేశారు. 1980లో పాత అసెంబ్లీ భవనానికి ఆనుకొని నూతన భవనాన్ని నిర్మించారు. నూతన భవనం కూడా పాత భవనం మాదిరిగా ఉంటుంది. రెండింటిలో ఏది పాతదో, ఏది కొత్తదో కనిపెట్టడం కష్టం.

తొలి సమావేశాలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు 1956 డిసెంబర్ 3న ప్రారంభమయ్యాయి. తొలి స్పీకర్‌గా అయ్యదేవర కాళేశ్వరరావు, డిప్యూటి స్పీకర్‌గా కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవహరించారు. ఆ సమయంలో సభలో 245 మంది సభ్యులుగా ఉండేవారు. ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు 140, హైదరాబాద్ రాష్ట్ర ఎమ్యెల్యేలు 105 మంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2014, జూన్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్‌గా నా దెండ్ల మనోహర్ వ్యవహరించారు.

చట్ట నిర్మాణం
ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించుకున్నవే చట్టాలు, శాసనాలు. ప్రస్తుత వ్యవస్థలో అంటిపెట్టుకొని ఉన్న లోపాలను సవరించి ప్రజలకు ఉత్తమ జీవితాన్ని అందించడమే వాటి ఉద్దేశం. ప్రజల పరిస్థితులను మెరుగుపరచడానికి కొత్త చట్టాలు, శాసనాల అవసరం ఉంది. రాష్ట్ర కార్యకలాపాలు పెరిగేకొద్దీ శాసనాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది.

బిల్లు: బిల్లు అంటే ముసాయిదా చట్టం అని అర్థం. బిల్లు చట్టంగా మారాలంటే వివిధ దశలను దాటాలి.

ప్రతిపాదనా నోటీసు: బిల్లును సభలో ప్రవేశపెట్టాలనుకొనే సభ్యుడు లేక మంత్రి ముందుగా సభ అనుమతి కోసం ప్రతిపాదనా నోటీసు ఇవ్వాలి. బిల్లు ప్రతిని, ఉద్దేశ కారణాలను తెలియజేయాలి. ప్రతిపాదనా నోటీసు గడువు ఏడురోజులు. ప్రతిపాదనను సభ్యుడెవరైనా వ్యతిరేకిస్తే ప్రతిపాదించిన, వ్యతిరేకించిన సభ్యుల అభిప్రాయాల్ని విని ఎలాంటి చర్చకు తావీయకుండా సభ అనుమతికి పెట్టవచ్చు.

గెజిట్‌లో ప్రచురణ: ప్రవేశపెట్టడానికి అనుమతి లభించిన వెంటనే బిల్లును, దాని ఉద్దేశ కారణాలను గెజిట్‌లో ప్రచురించాలి. బిల్లును ప్రవేశపెట్టిన తరువాత ప్రతిపాదిత సభ్యుడు దానిని సభ పరిశీలనకు గానీ, సెలెక్ట్ కమిటీ పరిశీలనకు గానీ, ప్రజాభిప్రాయ సేకరణకు గానీ పంపాలి. ప్రతిపాదిత సభ్యుడు బిల్లును పరిశీలనలోకి తీసుకోవాలని ప్రతిపాదించినపుడు, దానిని సెలెక్ట్ కమిటీకి లేదా ప్రజాభిప్రాయ సేకరణకు పంపాలని ఏ సభ్యుడైనా ప్రతిపాదనకు సవరణ కోరవచ్చు. ఆ సవరణను సభ ఆమోదిస్తే ఆ మేరకు పంపుతారు.

కమిటీ సమక్షంలో ఎలా?: సెలెక్ట్ కమిటీ సభ్యులను సభ నిర్ణయిస్తుంది. సాధారణంగా పదిహేను మందికి మించకుండా సభ్యులు ఉంటారు. కమిటీ అధ్యక్షుణ్ని సభాపతి నియమిస్తారు. బిల్లు ప్రతిపాదిత సభ్యుడు విధిగా కమిటీలో సభ్యుడై ఉండాలి. బిల్లును కమిటీ పరిశీలనకు పంపినపుడు, పరిశీలనకు తీసుకునే ముందు రోజు కమిటీ సభ్యులు దానికి సవరణ నోటీసులు ఇవ్వొచ్చు. బిల్లును కమిటీ సమగ్రంగా పరిశీలించి తాను భావించిన విధంగా సవరించి సభకు సమర్పిస్తుంది.

సవరణ: సెలెక్ట్ కమిటీ నివేదించిన రూపంలో బిల్లును సభ పరిశీలనలోకి తీసుకుంటుంది. ఒకవేళ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపకపోతే ప్రవేశపెట్టిన రూపంలో పరిశీలనకు తీసుకుంటుంది. సవరణలు ప్రతిపాదించాలనుకుంటే బిల్లును సభ పరిశీలనలోకి తీసుకొనే ముందు రోజు సవరణ నోటీసులను శాసనసభ కార్యదర్శికి అందజేయాలి. గడువులోగా వచ్చిన సవరణ నోటీసులను సభాపతి ఆమోదించిన తరువాత ఆయా అంశాలు చర్చకు వచ్చినపుడు సవరణలు పరిశీలించి ఓటింగ్‌కు పెడతారు.

బిల్లు ఆమోదం: బిల్లును సభ పరిశీలించిన తరువాత ఓటింగ్‌కు పెట్టి సభ అనుమతి పొందుతారు. రాష్ట్ర ఉభయ సభలూ(శాసనసభ, శాసనమండలి) ఆమోదించిన తరువాత బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపుతారు. గవర్నర్ దానికి ఆమోదం తెలియజేయచ్చు లేదా నిలుపు చేయచ్చు లేదా రాష్ర్టపతి పరిశీలనకు పంపవచ్చు. బిల్లులోని ఏవైనా అంశాలను పునఃపరిశీలించాలని కోరుతూ గవర్నర్ దాన్ని తిప్పి పంపితే ఉభయసభలు దానికి సవరించి కానీ లేక అలాగే ఆమోదించి తిరిగి గవర్నర్‌కు సమర్పిస్తే ఆయన బిల్లుకు ఆమోదాన్ని తెలుపుతారు. సందర్భానుసారంగా గవర్నర్ లేదా రాష్ర్టపతి ఆమోదాన్ని పొందిన తర్వాత బిల్లు చట్టంగా రూపొందుతుంది.

అసెంబ్లీ విశేషాలు
ప్రశ్నోత్తరాల సమయం: సమావేశం మొదలైన తర్వాత మొదటి గంట సమయం. నక్షత్రం మార్కు గల ప్రశ్నలకు కచ్చితంగా మౌఖికంగా సమాధానం చెప్పాలి, నక్షత్రం మార్కులేని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇస్తారు.

జీరో అవర్: ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండాకు ముందు ఈ రెండింటి మధ్యగల సమయం. దీనికి నిర్ధిష్ట కాల పరిమితి ఉండదు. ముందుగా నోటీస్ ఇవ్వకుండానే ప్రశ్నలు వేయవచ్చు.

క్లోజర్ మోషన్: ఏదైనా ఒక బిల్లుపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు.. జరుగుతున్న చర్చను నిలిపివేసి బిల్లును ఓటింగ్‌కు పెట్టడాన్ని క్లోజర్ మోషన్ అంటారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్: సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు ఒక సభాపతి (స్పీకర్), ఒక ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్)ని సభ్యులు ఎన్నుకుంటారు. సభాపతినిగా అధికార పక్షానికి, ఉప సభాపతిగా ప్రతిపక్షానికి చెందిన వారిని ఎన్నుకోవడం సంప్రదాయం. అయితే ఇది నియమం కాదు. తమ పదవికి రాజీనామా సమర్పించదలచిన సందర్భంలో సభాపతి ఉపసభాపతికి, ఉప సభాపతి సభాపతికి సమర్పించాలి. వారి తొలగింపుకు మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం. క్రమశిక్షణతో కూడిన అర్థవంతమైన చర్చలు జరిగేలా చూడటం స్పీకర్ బాధ్యత. సభలో ఎవరు మాట్లాడాలి అనే అంశంపై తుది నిర్ణయం స్పీకర్‌దే.

బడ్జెట్
ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంచనాల వివరణను బడ్జెట్ అంటారు. గవర్నర్ నిర్ణయించిన తేదీన బడ్జెట్‌ను శాసనసభకు సమర్పిస్తారు.

బడ్జెట్‌పై చర్చ: బడ్జెట్ సమర్పణకు, దానిపై చర్చకు మధ్య 48 గంటల విరామం ఉండాలి. శాసనసభ.. బడ్జెట్‌ను రెండు దశలలో పరిశీలిస్తుంది. బడ్జెట్‌పై సాధారణ చర్చ, గ్రాంట్ల నిమిత్తం అభ్యర్థనలపై ఓటింగ్. సాధారణ చర్చకు ఆరు రోజులు, గ్రాంట్ల అభ్యర్థనలపై ఓటింగ్‌కు పద్దెనిమిది రోజులు కేటాయిస్తారు. సాధారణ చర్చలో బడ్జెట్‌ను పూర్తిగా కానీ విధానపరమైన అంశాన్ని కానీ చర్చిస్తారు. చర్చ ముగింపులో ఆర్థికమంత్రి ఆ చర్చలకు సమాధానాలిస్తారు.

వాయిదా ప్రతిపాదన
అత్యవసర విషయాన్ని సభాసమక్షానికి తీసుకువచ్చి.. అప్పటికే జరుగుతున్న కార్యక్రమాన్ని వెంటనే వాయిదా వేసి ఆ విషయంపై చర్చ జరగాలని కోరడమే వాయిదా ప్రతిపాదన ఉద్దేశం. దీని వల్ల ఒక విషయంపై పూర్తి చర్చ జరిపే అవకాశం దక్కుతుంది. అయితే చర్చించాల్సిన విషయం కచ్చితమైనదై ఉండాలి. అంతకు క్రితమే జరిగిన ప్రభుత్వ చర్యకు సంబంధించినదై ఉండాలి. విషయం అత్యవసర స్వభావం కలిగినదై ఉండాలి. అకస్మాత్తుగా జరిగిన సంఘటనగా ఉండాలి. జాప్యానికి అవకాశమే ఉండకూడదు.

గవర్నరు ప్రసంగం - ధన్యవాద తీర్మానం
ప్రతి సాధారణ ఎన్నికల తరువాత జరిగే శాసనసభ తొలి సమావేశపు ప్రారంభంలో, ప్రతి సంవత్సరం జరిగే మొదటి సమావేశపు ప్రారంభంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణాలను ఉభయసభలకు గవర్నర్ తెలియజేస్తారు.
గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞత తెలిపే తీర్మానం సభలో ఓ సభ్యుడు ప్రతిపాదిస్తారు. దాన్ని మరో సభ్యుడు బలపరుస్తారు. ఈ ఇద్దరిని ఆచారం ప్రకారం ముఖ్యమంత్రి ఎంపికచేస్తారు.
గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ జరుగుతుంది.
గవర్నర్ ప్రసంగంపై చర్చాపరిధి చాలా విస్తృతమైంది. యావత్ పాలనారంగ పనితీరును చర్చించవచ్చు. ప్రసంగంలోని అంశాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గవర్నర్ బాధ్యుడు కాదు.
ధన్యవాద తీర్మానానికి సవరణలను ప్రతిపాదించవచ్చు.
ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రి ఇచ్చే ప్రత్యుత్తరంతో కృతజ్ఞతా ప్రతిపాదనపై చర్చ ముగుస్తుంది.
ధన్యవాద తీర్మానానికి సవరణలు ఉన్నట్లయితే వాటిని ముఖ్యమంత్రి ప్రత్యుత్తరం తరువాత సభలో ఓటింగ్‌కు పెడతారు. ప్రతిపాదనను ఆమోదించిన తరువాత సభాపతి దాన్ని గవర్నర్‌కు తెలియజేస్తారు. ప్రతిపాదన అందినట్లుగా గవర్నర్ ఒక సందేశం పంపుతారు. ఆ సందేశాన్ని సభలో చదివి వినిపిస్తారు.

సభా సంప్రదాయాలు

సభలో సభ్యులు పాటించవలసిన నియమాలను సభాసంప్రదాయాలని అంటారు. సభాపతి ఆయా సమయాల్లో ఇచ్చిన రూలింగ్స్‌పై ఇవి ఆధారపడి ఉంటాయి. 
సభ ఆరంభ సమయం (సాధారణంగా ఉ. 9.00 గంటలు) కన్నా ముందుగానే సభ్యులు సభకు హాజరుకావాలి.
సభ వాయిదాపడిన తరువాత తిరిగి సమావేశమయ్యేందుకు స్పీకరు నిర్ణయించిన సమయం కన్నా కొన్ని నిమిషాల ముందే సభ్యులు సభలో ఉండాలి.
సభాపతి అధ్యక్షస్థానాన్ని స్వీకరించడానికి వచ్చినప్పుడు, సభ్యులందరు వారి స్థానాల్లో లేచి నిలబడాలి.
సభలోకి ప్రవేశించేటప్పుడు, వెళ్లేటప్పుడు అధ్యక్షస్థానానికి శిరస్సువంచి అభివాదం చేయాలి.
సభాకార్యక్రమంతో సంబంధముంటే తప్ప ఏ పుస్తకాన్ని గానీ, వార్తాపత్రికను గానీ చదవరాదు.
ఎవరైనా సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు, మిగతా సభ్యులు ఎలాంటి అంతరాయం కలిగించరాదు. సభ్యుడు ప్రసంగించేటప్పుడు నిర్దేశ స్థానంలోనే ఉండాలి.
సభాకార్యకలాపాలను అడ్డుకోవడం, హేళన ధ్వనులు చేయడం, అంతరాయం కలిగించడం వంటివి చేయరాదు.
వేరొక సభ్యుడు ప్రసంగించే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయరాదు. సభలో నినాదాలు కూడా చేయరాదు.
బ్యాడ్జీలు, జెండాలు, చిహ్నాలు ధరించడం, ప్రదర్శించడం వంటివి చేయరాదు.
సభ్యుడు తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే సభను వీడరాదు.
సభా ఆవరణలో ఎలాంటి సాహిత్యం, ప్రశ్నావళి, చిన్నపుస్తకాలు, పత్రికా ప్రకటనలు, కరపత్రాలు పంచరాదు.
ఆరోగ్యకారణంపై సభాపతి అనుమతిస్తే తప్ప ఏ సభ్యుడూ సభలోనికి చేతికర్రను తీసుకెళ్లరాదు.
సభ్యుడు టేప్‌రికార్డులు, క్యాసెట్‌లను సభలోకి తీసుకురావటంగానీ, వినిపించటంగానీ చేయరాదు.
సభలో సత్యాగ్రహం, ధర్నా వంటివి చేయరాదు.
సభనుద్దేశించి సభ్యుడు ప్రసంగించాలనుకున్నప్పుడు సభాపతి దృష్టిని ఆకర్షించే వరకు చేతులు ఎత్తాలి. సభాపతి అనుమతి ఇచ్చిన తరువాతనే ప్రసంగించాలి.

సభ్యుడు ప్రసంగించేటప్పుడు...

న్యాయనిర్ణయం అపరిష్కృతంగా ఉన్న వాస్తవ విషయాన్ని ప్రస్తావించరాదు.
వేరొక సభ్యునికి వ్యతిరేకంగా వ్యక్తిగత దోషారోపణ చేయరాదు.
శాసనసభ కార్యకలాపాల గురించి పరుషమైన వ్యక్తీకరణాలు ఉపయోగించరాదు.
సభా నిర్ణయాన్ని రద్దు చేసే ప్రతిపాదన మినహా ఇది వరకటి సభానిర్ణయాన్ని నిందించకూడదు.
చర్చను ప్రభావితం చేసే ఉద్దేశంతో గవర్నరు పేరును ఉపయోగించకూడదు.
పరుషపదజాలం ఉపయోగించకూడదు.
ప్రభుత్వాధికారులను పేరుపెట్టి ప్రస్తావించరాదు.
సభాపతి అనుమతితో తప్ప లిఖిత ఉపన్యాసాన్ని చదువరాదు.
సభాపతి ద్వారా తప్ప వ్యక్తిగతంగా సభ్యులను సంభోదించరాదు.
నియమిత ప్రతిపాదన మినహా సభాపతి రూలింగ్‌ను ప్రశ్నించటంగానీ, వ్యాఖ్యానించటం గానీ చేయకూడదు.
సభ వెలుపల సభ్యుల నైతిక ప్రవర్తనకు సంబంధించిన మార్గదర్శకాలు
ప్రత్యక్షంగానీ, పరోక్షంగా గానీ తనకు సంబంధమున్న వ్యాపార సంస్థలకు ప్రభుత్వం నుంచి వ్యాపారానికి పొందడానికి సభ్యుడు ప్రయత్నించకూడదు.
ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రతి సభ్యుడు నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, తన స్వప్రయోజనాలు ఆశించి నిర్ణయాలు తీసుకోకూడదు.
అవాస్తవమైన సర్టిఫికెట్లను సభ్యుడు ఇవ్వరాదు.
ప్రభుత్వం తనకు కేటాయించిన నివాస ప్రాంగణాన్ని సభ్యుడు మరొకరికి అద్దెకివ్వకూడదు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఆర్థికపరంగా తనకు ఆసక్తి ఉన్న అంశం విషయంలో ప్రభుత్వాధికారులను లేదా మంత్రులను సభ్యుడు అనుచితంగా ప్రభావితం చేయరాదు.


ఎకానమీ Economy జీ-7, బ్రిక్స్ సదస్సులు

జీ-7, బ్రిక్స్ సదస్సులు

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు పపంచ దేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలపై అధిక ప్రభావం చూపే బ్రిక్స్, జీ-7 (ప్రస్తుతం) సదస్సులు, కొత్తగా ఏర్పాటైన న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు వంటి అంశాలపై సమగ్ర అవగాహన తప్పనిసరి. అంతర్జాతీయ అంశాల్లో ఇండియా పాత్ర, ప్రభావాల కోణంలో ప్రిపరేషన్ సాగిస్తే చక్కని ఫలితాలు సాధించొచ్చు.
జీ-7 
పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఆరు దేశాలు 1975లో జీ-6 కూటమిగా ఏర్పడ్డాయి. పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, యునెటైడ్ కింగ్‌డమ్(యూకే), యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(యూఎస్‌ఏ) దేశాలతో కూడిన జీ-6 తొలి సదస్సు ఫ్రాన్స్‌లో(1975 నవంబరు) జరిగింది. 1975లో కెనడా ఏడో సభ్యదేశంగా చేరడంతో జీ-7గా మారింది. 1998లో ఈ కూటమిలో రష్యా చేరికతో జీ-8గా అవతరించింది. క్రిమియా సంక్షోభం కారణంగా 2014, మార్చి 24న రష్యా జీ-8 నుంచి సస్పెండ్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ కూటమి జీ-7గా మారింది. 2014, జూన్‌లో ఈ సదస్సు రష్యాలోని సోచి నగరంలో జరగాల్సి ఉంది. కాని రష్యా సస్పెండ్ కావడంతో మిగిలిన ఏడు దేశాలు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో సమావేశమయ్యాయి. ఈ సదస్సుల్లో ఐరోపా యూనియన్ (ఈయూ) కూడా పాల్గొంటుంది. ఈయూ ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లోనే ఉంది. ఈ కూటమి ప్రతి ఏటా సమావేశమై ప్రపంచ ఆర్థిక విధానాలపై చర్చిస్తుంది.

41వ శిఖరాగ్ర సదస్సు: 
జీ-7.. 41వ శిఖరాగ్ర సదస్సు 2015, జూన్ 7, 8 తేదీల్లో జర్మనీలోని క్రున్ నగరంలో జరిగింది. ఈ సదస్సులో కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలండే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్, ఇటలీ ప్రధాని మతియో రెంజీ, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఐరోపా కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్, ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌లు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఉక్రెయిన్ సంక్షోభం, వాతావరణ మార్పులు, తీవ్రవాదం, ఎబోలా వంటి వ్యాధుల నుంచి పొంచి ఉన్న ముప్పు తదితర అంశాలపై నేతలు చర్చించారు. వీటితో పాటు రష్యాపై విధించిన ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై రష్యా దౌర్జన్య వైఖరి కొనసాగిస్తే మరిన్ని ఆంక్షలు విధిస్తామని జీ-7 దేశాలు ఆ దేశాన్ని హెచ్చరించాయి.

వాతావరణ మార్పులు-విస్తృత చర్చ:
వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను జీ-7 విస్తృతంగా చర్చించింది. ఈ శతాబ్దానికి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని నిశ్చయించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కర్బనీకరణ నిర్మూలన జరగాలని నేతలు పిలుపునిచ్చారు. పెట్రోలు, బొగ్గు వంటి ఇంధనాల స్థానంలో సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తిలను పూర్తిస్థాయిలో వాడాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివర్లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు పారిస్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో జీ-7 సదస్సులో తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ శతాబ్దంలో భూతాపం పెరుగుదలను 2 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పేద దేశాలకు 100 బిలియన్ డాలర్ల సాయం అందించాలని జీ-7 దేశాలు నిర్ణయించాయి. వీటితో పాటు గ్రీసు ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ తీవ్రవాదం వంటి అంశాలపైన చ ర్చించారు. 42వ జీ-7 సదస్సు 2016 మే 26,27 తేదీల్లో జపాన్‌లోని షిమా నగరంలో జరుగుతుంది.

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఎన్‌డీబీ)’ను నెలకొల్పాయి. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు బ్రిక్స్ దేశాలతోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా రుణ సహాయాన్ని అందించనుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని చైనాలోని షాంఘై నగరంలో ఏర్పాటు చేశారు. ఆఫ్రికన్ ప్రాంతీయ కేంద్రాన్ని దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్యాంకును 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేశారు. బ్యాంకు తొలి అధ్యక్షుడిగా భారతీయుడైన కెవీ కామత్ నియమితులయ్యారు. ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. బ్యాంకు తన తొలి రుణాన్ని 2016 ఏప్రిల్‌లో ఇస్తుందని ఇటీవల ప్రకటించారు. ఈ రుణాన్ని చైనా కరెన్సీలో (రెన్‌మిన్‌బీ యువాన్) ఇవ్వనున్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏర్పాటైన ఎన్‌డీబీ 2015,జులై 21న షాంఘైలో ప్రారంభమైంది. ఎన్‌డీబీ త్వరలో ప్రారంభం కానున్న ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)తో కలిసి పనిచేస్తుంది. ఏఐఐబీ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఏర్పాటు కానుంది.

బ్రిక్స్ సదస్సు
అమెరికాలోని గోల్డ్‌మన్ శాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుకు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జిమ్. ఓ నీల్ 2001లో ‘బ్రిక్ ’ పదాన్ని ప్రవేశపెట్టారు. బ్రిక్స్ సభ్యదేశాలు బ్రెజిల్,రష్యా, ఇండియా, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థలు కలిసి 2050 నాటికి జీ-7 దేశాల ఆర్థిక వ్యవస్థలను మించిపోతాయని గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ అంచనా వేసింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో ఈ కూటమి బ్రిక్స్‌గా మారింది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 42శాతాన్ని(300కోట్లు) కలిగి ఉన్నాయి.

బ్రిక్స్ సదస్సులు- వివరాలు:
1. జూన్ 16, 2009- ఎకాతెరిన్ బర్గ్, రష్యా
2. ఏప్రిల్ 15, 2015- బ్రెసీలియా, బ్రెజిల్
3. ఏప్రిల్ 14, 2011- సాన్యా, చైనా
4. మార్చి 29, 2012- న్యూఢిల్లీ, ఇండియా
5. మార్చి 26,27, 2013-డర్బన్, దక్షిణాఫ్రికా
6. జులై 15, 16, 2014-ఫోర్తలేజా, బ్రెజిల్
7. జులై 8, 9, 2015 - ఉఫా, రష్యా
ఎనిమిదవ బ్రిక్స్ సదస్సు 2016లో న్యూఢిల్లీలో జరగనుంది.

నరేంద్ర మోదీ ప్రతిపాదిత సూత్రాలు
1. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య ప్రదర్మన
2. రైల్వే పరిశోధనా కేంద్రం
3. అత్యున్నత ఆడిటింగ్ సంస్థల మధ్య సహకారం.
4. డిజిటల్ రంగంలో సహకారం.
5. బ్రిక్స్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం.
6. బ్రిక్స్ దేశాల్లోని రాష్ట్రాలు లేదా స్థానిక ప్రభుత్వాలతో ఏర్పాటైన వేదిక.
7. పట్టణీకరణ రంగంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం.
8. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా మండలి ఏర్పాటు. ఈ దేశాల మధ్య వార్షిక క్రీడోత్సవాలు.
9. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు తొలి ప్రాజెక్టు శుద్ద ఇంధన రంగంలో
10. బ్రిక్స్ చలన చిత్రోత్సవం. 
7వ బ్రిక్స్ సదస్సు ద్వారా కంటెంజెంట్ రిజర్వ్ కరెన్సీ( సీఆర్‌ఏ) అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ దేశాల్లో లిక్విడిటీలో సమస్యలు తలెత్తినప్పుడు సహకరించడానికి ఈ నిధి ఉపయోగపడనుంది. ఈ నిధిని 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేశారు. ఇందు కోసం చైనా అత్యధికంగా చైనా 41 బిలియన్ డాలర్లను సమకూర్చింది. భారత్, బ్రెజిల్, రష్యాలు 18 బిలియన్ డాలర్ల చొప్పున, ద క్షిణాఫ్రికా 5 డాలర్లను సమకూర్చాయి. ఈ నిధి 2015, జులై 30 నుంచి అందుబాటులోకి వచ్చింది.

సదస్సు - పాల్గొన్న దేశాల నేతలు
నరేంద్ర మోదీ - భారత ప్రధాన మంత్రి
వ్లాదిమర్ పుతిన్ - రష్యా అధ్యక్షుడు
జీ జిన్‌పింగ్ - చైనా అధ్యక్షుడు
జాకబ్ జుమా - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
దిల్మా రౌసెఫ్ - బ్రెజిల్ అధ్యక్షురాలు
7వ బ్రిక్స్ సదస్సు 2015 జులైలో రష్యాలోని ఉఫా నగరంలో జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికై 10 సూత్రాలను ప్రతిపాదించారు. వీటిని ఆయన ‘దస్ కదమ్- టెన్ స్టెప్స్ ఫర్ ది ప్యూచర్’ గా అభివర్ణించారు.
 

ఎకానమీ Economy ప్రజా పద్దుల కమిటీ

ప్రజా పద్దుల కమిటీ

కేంద్ర ప్రభుత్వ వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) పార్లమెంటుకు సమర్పించే నివేదికను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేదా ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) పర్యవేక్షిస్తుంది. ఇదే ఈ కమిటీ ప్రధాన విధి.
ఇది భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కొనసాగుతోంది. ఈ కమిటీకి తొలి చైర్మన్‌గా డబ్ల్యూ.ఎమ్. హెయిలీ (1921) నేతృత్వం వహించారు. ప్రస్తుతం చైర్మన్‌గా కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేవీ థామస్ వ్యవహరిస్తున్నారు.

నియామకం: 
ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు పార్లమెంటు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో 22 మంది ఎంపిక చేసిన ఎంపీలు (15 మంది లోక్‌సభ, 7 మంది రాజ్యసభ) సభ్యులుగా ఉంటారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడిని చైర్మన్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సభ్యుడి ఎంపికను పార్లమెంటు స్పీకర్ చూసుకుంటారు.

విధులు: 
రైల్వే, రక్షణ, పోస్టల్ శాఖలతో పాటు ఇతర ప్రధాన పౌర శాఖలకు సంబంధించిన వ్యయాలపైన కమిటీ పర్యవేక్షణ జరుపుతుంది. పార్లమెంటు ద్వారా ఏ శాఖలకు ఎంత నిధులు మంజూరయ్యాయి. వాటి వినియోగం, ఖర్చులపై ఆరా తీస్తుంది. అలాగే వివిధ శాఖల వ్యయాలపై కాగ్ ఇచ్చిన నివేదికలపైనా పరిశీలన జరుపుతుంది. ఆయా శాఖలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని అధికంగా ఖర్చు పెడుతున్నాయో ? లేదా? పర్యవేక్షణ జరుపుతుంది. అంటే కేవలం పెట్టిన ఖర్చులపై మాత్రమే కాకుండా పెడుతున్న ఖర్చులపై కూడా కన్నేసి ఉంచుతుంది. తద్వారా నిధుల దుర్వినియోగాన్ని అదుపు చేయడం కమిటీ ప్రధాన లక్ష్యం. అలాగే, ఆయా శాఖల ఖాతాల నిర్వహణలో అవలంబిస్తున్న సాంకేతిక విధానాలను పరీక్షిస్తుంది. ఆయా శాఖల ఖర్చుల పద్దులపై ఉన్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. వాటిని యథాతథంగా పార్లమెంటు ముందు ఉంచుతుంది.

2011లో 2జీ కుంభకోణంలో జరిగిన అవకతవకల్ని ప్రజా పద్దుల కమిటీ ప్రజల దృష్టికి తీసుకువచ్చింది. ఇంతవరకు భారతదేశంలో వెలుగుచూసిన అతి పెద్ద కుంభకోణాల్లో ఇదీ కూడా ఒకటి కావడం విశేషం.


ఎకానమీ Economy అంతర్జాతీయ ద్రవ్య నిధి

అంతర్జాతీయ ద్రవ్య నిధి

గ్రీసులో సంక్షోభం తీవ్రతరమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధికి(ఇంటర్నేషన్ మానెటరీ ఫండ్- ఐఎంఎఫ్) గ్రీసు చెల్లించాల్సిన 1.6 బిలియన్ల రుణ వాయిదా గడువు 2015, జూన్ 30తో ముగిసింది.
ఈ ఐఎంఎఫ్ వాయిదా చెల్లింపుల దగ్గరే సంక్షోభం ముదిరి ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తోంది. ఈ నేపథ ్యంలో ‘ఐఎంఎఫ్’ గురించి తెలుసుకుందాం..

ఐఎంఎఫ్: 
అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచంలోని అతి ప్రధానమైన ఆర్థిక సంస్థల్లో ఒకటి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 44 దేశాల అధినేతలు అమెరికాలోని బ్రెటన్ ఉడ్స్‌లో సమావేశమై ఐఎంఎఫ్ స్థాపన విషయాన్ని చర్చించి ఒక ఒడంబడిక పత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఐక్య రాజ్యాల ద్రవ్య, ఆర్థిక సమావేశం జరిగింది. 1945 డిసెంబర్ 7 నుంచి ఐఎంఎఫ్ డ్రాఫ్ట్ అమల్లోకి వచ్చింది.

ప్రధాన లక్ష్యాలు:
అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక, ద్రవ్య వ్యవహారాలను సహకార భావంతో ఒక శాశ్వత సంస్థ ద్వారా నిర్వహించడం
అంతర్జాతీయ వ్యాపారాన్ని సమతుల్యస్థితిలో అభివృద్ధి పరచడానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం
వివిధ దేశాల మధ్య సక్రమ ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూల పరిస్థితులు కల్పించడం
అంతర్జాతీయ స్థాయిలో ద్రవ్య విలువలను స్థిరంగా ఉంచడానికి కృషి
విదేశీ చెల్లింపు నిబంధనలు రద్దు చేయడం
స్వరూపం
ఐఎంఎఫ్ కార్యకలాపాలు నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నర్లు, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, మేనేజింగ్ డెరైక్టర్ ఇతర కార్యాలయ సిబ్బంది ఉంటారు. ఐఎంఎఫ్ కేంద్ర కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. ప్రస్తుతం దీని సభ్యదేశాల సంఖ్య 188. ఐఎంఎఫ్ కార్యనిర్వహణకు సభ్యదేశాలు ఆర్థిక సహాయం అందిస్తాయి. ప్రతి సభ్య దేశం ఎంత డబ్బు చెల్లించాల్లో కోటాల కింద నిర్ధారించారు. బంగారు నిల్వల రూపంలో 20శాతం లేదా 10 శాతం నగదు చెల్లించాలి. అధిక భాగం బంగారం విలువ లేదా డాలర్ హోల్డింగ్స్ రూపంలో, మిగిలిన మొత్తాన్ని కరెన్సీ రూపంలో చెల్లించాలి.

ఐఎంఎఫ్ ముఖ్యంగా ద్రవ్య మార్పిడి అంశాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. 1947 మార్చి 1 నుంచి ఈ సంస్థ వివిధ దేశాలతో ఒప్పందం కుదుర్చుకొని ద్రవ్యమార్పిడి విషయాలను సమన్వయపరచడానికి కృషి చేస్తోంది. సభ్యదేశాలకు ద్రవ్యసంబంధమైన విషయాల్లో సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక సంబంధ విషయాలను నిశితంగా పరిశీలిస్తుంది. ఐక్యరాజ్యసమితితో ఐఎంఎఫ్ సన్నిహిత సబంధాలు కలిగి ఉంటుంది.


ఎకానమీ Economy ద్రవ్య బాధ్యత, బడ్జెట్ యాజమాన్య చట్టం

ద్రవ్య బాధ్యత, బడ్జెట్ యాజమాన్య చట్టం

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకనస్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ‘ద్రవ్య బాధ్యత, బడ్జెట్ యాజమాన్య చట్టం’ (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్-ఎఫ్‌ఆర్‌బీఎం)ను రూపొందించారు.
అధిక ద్రవ్యలోటు ద్రవ్యోల్బణానికి దారితీసి తద్వారా వినియోగం తగ్గుతుందని ఆర్థిక శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరిగి ప్రజల జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోటును తగ్గించుకునే చర్యలో భాగంగా 2003లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం 2004లో యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించింది.

చట్టం ఆవశ్యకత ఏమిటి? 
ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ సూచనల్లో భాగంగా కేంద్ర నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్యే వనరుల ప్రక్రియలో రాష్ర్ట ప్రభుత్వాలు విధిగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఆమోదించాల్సిన ఆవశ్యకతను తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం మాదిరిగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ‘లోటు నియంత్రణ యంత్రాంగాన్ని’ ఏర్పాటు చేసుకున్నాయి. సాధారణంగా మన దేశంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం.. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల నుంచి వైదొలగడానికి ఒక సాధనంగా ఉపకరిస్తోంది. చట్టం దీర్ఘకాల లక్ష్యాలతో పాటు వాటి సాధనకు వార్షిక లక్ష్యాలను రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రాలు తమ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3 శాతం మేరకు అప్పులు తెచ్చుకొనే వీలుంటుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం కాలంలో ఎన్‌సీఎంపీ..
సమగ్రమైన లోటు తగ్గింపు వ్యూహం ద్వారా ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్య అసమతౌల్యాన్ని పూర్తిగా తొలగించగలమని ఎన్‌సీఎంపీ (నేషనల్ కామన్ మినిమం ప్రోగ్రామ్) భావించింది. వాస్తవంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని రూపొందించిన తర్వాత ప్రభుత్వం తన లక్ష్యాల సాధనకు చేసిన ప్రయత్నం సంతృప్తికరంగా ఉంది. ప్రస్తుత కాలంలో జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)వృద్ధిరేటు, పన్ను-జీడీపీ నిష్పత్తిలో మంచి వృద్ధి సాధించడమే కాకుండా.. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం లక్ష్యాల సాధనలో భాగంగా అన్ని విధాలైన లోటులను తగ్గించుకోగలిగింది.

ప్రయోజనాలేమిటి? 
ఎఫ్‌ఆర్‌బీఎం కాలంలో జీడీపీలో భాగంగా ముఖ్య రంగాలపై చేసే ప్రభుత్వ వ్యయం తగ్గడం కూడా గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వ మొత్తం అభివృద్ధి వ్యయం జీడీపీలో 11 శాతం నుంచి 7 శాతం కన్నా తగ్గింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం లాంటి రంగాలకు వనరుల కేటాయింపు పెంపుదలకు ప్రయత్నించినప్పటికీ.. ఎన్‌సీఎంపీ అవసరాల కన్నా ఆ కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల విత్త సమస్యలు పెరిగాయి. ఈ చట్టం కాలంలో సాంఘిక, ఆర్థిక సేవలకు సంబంధించిన అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాల వనరుల పంపిణీ గణనీయంగా తగ్గింది. జీడీపీలో రెవెన్యూ వ్యయం మొత్తం సాంఘిక, ఆర్థిక రంగాలైన విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల లాంటి రంగాల్లో తగ్గింది. ఈ చట్టం అమలులో ఉన్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల మూలధన వ్యయం, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీలో తగ్గుదల కన్పించింది.

ప్రభుత్వాల బాధ్యత ఏమిటి?
అభిలషణీయ ద్రవ్య విధానంతో పాటు కోశపరమైన ప్రోత్సాహకాలు అందించి, ఆయా రంగాలు తిరోగమనం వైపు వెళ్లకుండా ప్రభుత్వం ప్రయత్నించాలి.
ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటూనే.. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి వీలుగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను పెంచాలి.
ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట ప్రకారం.. రెవెన్యూలోటు నిర్మూలించి, ద్రవ్యలోటు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రుణ సేకరణ ద్వారా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి.
రుణ నిర్వహణ సక్రమంగా జరిగేలా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి.
తీసుకున్న రుణాన్ని ఉత్పాదక రంగాలపై వ్యయం చేస్తే.. భవిష్యత్తులో వృద్ధి రేటు పెరుగుతుంది.
తద్వారా వ్యవస్థలో తిరోగమనాన్ని అధిగమించవచ్చు. ఎగుమతుల విషయంలో.. డ్రాబ్యాక్ స్కీంకు సంబంధించి కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి.


ఎకానమీ Economy రూ. 1,13,049 కోట్లుతో ఆంధ్రప్రదేశ్ బ‌డ్జెట్‌

రూ. 1,13,049 కోట్లుతో ఆంధ్రప్రదేశ్ బ‌డ్జెట్‌

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బ‌డ్జెట్‌ను రూ. 1,13,049 కోట్లతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.
ఈ మేర‌కు ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు గురువారం శాస‌న‌స‌భ‌లో 2015-16 సంవ‌త్సరానికి బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టారు. ఆయ‌న ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
మొత్తం బడ్జెట్ - రూ. 1,13,049.00 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - రూ. 78,637.00 కోట్లు
ప్రణాళికా వ్యయం - రూ. 34,412.00 కోట్లు
రెవెన్యూ లోటు - రూ. 7,300 కోట్లు
ఆర్థిక లోటు - రూ. 17,584 కోట్లు
సాగునీటి రంగానికి - రూ. 5,258 కోట్లు
సాంఘిక సంక్షేమానికి - రూ. 2,123 కోట్లు
గిరిజన సంక్షేమం - రూ. 993 కోట్లు
బీసీల సంక్షేమానికి - రూ. 3,231 కోట్లు
మైనార్టీ సంక్షేమం - రూ. 379 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి - రూ. 1080 కోట్లు
వికలాంగుల సంక్షేమం - రూ. 81 కోట్లు
చేనేత, జౌళి రంగానికి - రూ. 46 కోట్లు
గృహ నిర్మాణం - రూ. 897 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ కోసం - రూ. 2123 కోట్లు
ఉన్నత విద్య - రూ. 3049 కోట్లు
ఇంటర్ విద్య - రూ. 585 కోట్లు
పాఠశాల విద్య - రూ. 14,962 కోట్లు
పంచాయతీ రాజ్ - రూ. 3296 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ - రూ. 280 కోట్లు
గ్రామీణ నీటి సరఫరా - రూ. 881 కోట్లు
గ్రామీణాభివృద్ధికి - రూ. 8212 కోట్లు
పట్టణాభివృద్ధి - రూ. 3168 కోట్లు
రెవెన్యు శాఖ - రూ. 1429 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖకు - రూ. 200 కోట్లు
శాంతిభద్రతలకు - రూ. 4062 కోట్లు
వికలాంగులకు - రూ. 81 కోట్లు
పర్యాటక రంగానికి - రూ. 330 కోట్లు
రవాణా శాఖకు - రూ. 122 కోట్లు
స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు - రూ. 360 కోట్లు
ఐటీ రంగానికి - రూ. 370 కోట్లు
ఆరోగ్య శాఖకు - రూ. 5,728 కోట్లు
గనులు - రూ. 27 కోట్లు
గృహ నిర్మాణానికి - రూ. 897 కోట్లు
గోదావరి పుష్కరాలకు అన్ని శాఖల నుంచి - రూ. 1,360 కోట్లు
పోలీస్ సంక్షేమానికి - రూ. 40 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి - రూ. 37 కోట్లు
కాపుల సంక్షేమానికి - రూ. 100 కోట్లు
మచిలీపట్నంలో 300 ఎకరాల్లో మెరైన్ అకాడమీ ఏర్పాటు
కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో టూరిస్ట్ సర్క్యూట్లు
బారువ, కళింగపట్నం, కాకినాడ, రామాయపట్నం, తుమ్మలపెంట దగ్గర సముద్ర విహారాలు
భవానీ ద్వీపాన్ని ప్రముఖ టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయ‌డం
ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధి
భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు
2015 జూన్ నాటికి శిల్పారామాలు పూర్తి
కర్నూలులో కొత్త శిల్పారామాలు మంజూరు
వృద్ధకళాకారులకు ఫించన్లు రూ. 500 నుంచి రూ. 1500కు పెంపు


ఎకానమీ Economy కేంద్ర బడ్జెట్ హైలైట్స్

కేంద్ర బడ్జెట్ హైలైట్స్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ...
1. ఏపీలో ఐఐఎం ఏర్పాటు
2. ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు
3. గోల్డ్ లోన్ల పథకం స్థానంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్
4. నిర్భయ ఫండ్ కు వెయ్యి కోట్లు
5. వీసా ఆన్ అరైవల్ స్కీం కింద 150 దేశాలు
6. అశోక చక్ర ముద్రతో బంగారు నాణేలు
7. మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
8. అల్ట్రా మెగా పవర్ కు లక్ష కోట్లు.
9. ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు
10. వేల మెగా వాట్ల సామర్థ్యం గల 5 మెగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు.
11. సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్.
12. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు
13. వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం.
14. నాబార్డుకు 25 వేల కోట్లు
15. ఏడాదికి రూ.330తో ప్రమాద బీమా
16. స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు
17. అటల్ పెన్షన్ యోజన కొనసాగుతుంది
18. యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటు ఏర్పాటుకు కృషి
19. ఐటీ హబ్ ఏర్పాటుకు రూ.150 కోట్లు
20. శిషు సంరక్షణకు రూ.300 కోట్లు
21. చైల్డ్ డెవలప్ మెంట్ కు రూ.1500 కోట్లు
22. మౌలిక వసతులకు రూ.70 వేల కోట్లు
23. స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి
24. చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు
25. అత్యున్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత.
26. గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు.
27. 80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ
28. దవ్యోల్బణం 6 శాతానికి పెరగకుండా చర్యలు తీసుకుంటాం
29. గ్రామీణాభివృద్ధికి 20 వేల కోట్లు
30. భారత్ ను తయారీ రంగానికి హబ్ గా చేస్తాం
31. కేంద్రం పన్నుల్లో 62 శాతం నిధులను రాష్ట్రాలకు ఇస్తాం
32. జన్ ధన్ యోజన ద్వారా మధ్య తరగతి పేదలకు బీమా సౌకర్యం
33. ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం.
34. ఎంపీలందరూ గ్యాస్ సబ్సిడీలను వదులుకోవాలి.
35. సబ్సిడీలు హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది.
36. ఏడాదికి రూ.12 బీమాతో రూ.2 లక్షల ప్రీమియం.
37. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ
38. ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి తగ్గిస్తాం.
39. ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉద్యోగాలు కలిగి ఉండేలా చేస్తాం
40. ఇండియాను తయారీ రంగం ద్వారా వృద్ధిలోకి తెస్తాం
41. స్కిల్ ఇండియా.. మేక్ ఇండియాకు మరింత ప్రాధాన్యం
42. 2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు ఇస్తాం
43. స్కాలర్ షిప్ లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే.
44. 11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించాం.
45. 2015-16 మధ్య ఆర్ధిక అభివృద్ధి 8 నుంచి 8.5శాతం పెరిగే అవకాశం
46. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
47. ద్రవ్యోల్భణం 5.1శాతానికి తగ్గింది
48. లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మిస్తాం
49. పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం ఇస్తున్నాం
50. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
51. 2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం
52. త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకుంటాం.
53. 2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం.
54. ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిస్తాం.
55. ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్సిస్తాం.
56. ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు
57. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం
58. భారత్ వృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది
59. 340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు
60. పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం
61. భారత ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ దశదిశ నిర్దేశిస్తుంది.
62. ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
63. అవినీతిని అంతం చేసేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
64. 12.5 కోట్ల కుటుంబాలకు జనధన్ యోజన
65. 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం.
66. భారత ఆర్ధిక వ్యవస్థకు బడ్జెట్ దశా నిర్దేశం చేస్తుంది
67. ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెడతాం
68. జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది
69. జీడీపీ వృద్ది రేటు 7.8 శాతం ఉంది.. ఇది మరింత పెరగనుంది
70. కరెంట్ అకౌంట్ లోటు మూడుశాతం
71. రూపాయి మారకం విలువ బలపడుతోంది.


ఎకానమీ Economy రూ. 1,15,689 కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌

రూ. 1,15,689 కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌

హైదరాబాద్: తెలంగాణ తొలి పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ బుధ‌వారం శాస‌న‌స‌భ‌లో ప్రవేశ‌పెట్టారు.
2015 - 16 సంవ‌త్సరానికి రూ. 1,15,689 కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించిన‌ట్లు మంత్రి తెలిపారు. దీనిలో ప్రణాళిక వ్యయం రూ.52,383 కోట్లు, ప్రణాళికేత‌ర వ్యయం రూ. 63,306 కోట్లని వెల్లడించారు. తొలి ఏడాది ప‌ది నెల‌ల‌కు బ‌డ్జెట్ త‌యారు చేసిన ప్రభుత్వం.. ఈసారి పూర్తి ఆర్థిక సంవ‌త్సరానికి బ‌డ్జెట్‌ను రూపొందించింది. 5 నెల‌ల వ్యవ‌ధిలో రెండోసారి రెండో బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టింది.

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు:
* తెలంగాణ బడ్జెట్ - రూ. 1,15,689 కోట్లు
* ప్రణాళిక వ్యయం - రూ. 52, 383 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం - రూ. 63,306 కోట్లు
* ఆర్థిక మిగులు - రూ. 501 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా - రూ. 16,969 కోట్లు
* రెవిన్యూ మిగులు - రూ. 531 కోట్లు
* పన్నుల రాబడి - రూ. 12,823 కోట్లు
*ఎస్సీ సంక్షేమానికి - రూ. 5,547 కోట్లు
* గిరిజన ఎస్టీ సంక్షేమం - రూ. 2,578 కోట్లు
* బీసీ సంక్షేమం - రూ. 2,172 కోట్లు
* మైనార్టీ సంక్షేమం - రూ.1105 కోట్లు
* ఆసరా పెన్షన్లు - రూ. 4 వేల కోట్లు
*కేంద్ర పన్నుల వాటా - రూ. 12, 823 కోట్లు
* గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి - రూ. 526 కోట్లు
* విద్యా రంగానికి - రూ. 11,216 కోట్లు
* విద్యుత్ శాఖకు - రూ.7,400 కోట్లు
* మిషన్ కాకతీయకు - రూ.2,083 కోట్లు
* ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు - రూ.22,889 కోట్లు
*ఎర్రజొన్న రైతులకు - రూ.13.5 కోట్లు
* హైదరాబాద్ తాగునీటికి - రూ. వెయ్యి కోట్లు
* స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు - రూ. 771 రూ. కోట్లు


ఎకానమీ Economy బడ్జెట్ బేసిక్స్

బడ్జెట్ బేసిక్స్

ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో క్లిష్టమైన పదాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటిని సులభతర రీతిలోకి మారిస్తే- నెలవారీ బడ్జెట్‌లో సామాన్యుడు వినియోగించే పదాలే ఇవి.
ఇలాంటి కొన్ని ముఖ్య పదజాలం గురించి పరిశీలిద్దాం..

+ బడ్జెట్ పదజాలం 

వార్షిక ఆర్థిక నివేదిక
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్ అంటే వార్షిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల పట్టిక. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- ప్రభుత్వం ఖర్చుపెట్టే మొత్తాలు ఇందులో పొందుపరుస్తారు. ఆర్థిక సంవత్సరం మన దేశానికి ఏప్రిల్ నుంచి వరుసగా 12 నెలలు అంటే ఆ తదుపరి సంవత్సరం మార్చి వరకూ కొనసాగుతుంది. కొన్ని దేశాలు క్యాలెండర్ ఇయర్‌నే ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాయి. ‘క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు’ అన్న అంశం ప్రాతిపదికన పలు అంచనాలు, సవరణలతో ఈ బడ్జెట్ రూపొందుతుంది. బడ్జెట్ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలు సంచిలో తీసుకువచ్చేవారు కాబట్టే ఈ మాట వాడుకలోకి వచ్చింది.

మూలధన బడ్జెట్
మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి.

మూలధన వ్యయం
ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు ఇది.

బడ్జెట్ ఫండ్‌‌స 
బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్.. ఇలా మూడు భాగాలుగా ఉంటుంది.
వసూళ్లు-వ్యయాలు అంటూ రెండు విభాగాలుగా ఈ మూడూ భాగాలూ రూపొందుతాయి. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటెజెన్సీ ఫండ్ నుంచి వ్యయాలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

కన్సాలిడేటెడ్ ఫండ్: ప్రభుత్వానికి ఇది ఒక రకంగా ప్రాణం వంటిది. అన్ని రకాల ఆదాయాలు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీలు ఈ అకౌంట్‌లో చేరిపోతాయి. అలాగే ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులూ ఈ ఫండ్ నుంచే వెచ్చించాలి.

కంటింజెన్సీ ఫండ్: ఇది రూ.500 కోట్లతో ఏర్పాటైన నిధి. ఉన్నట్లుండి అనుకోకుండా ఏర్పడే ఖర్చులకు వినియోగించడానికి ఈ నిధిలోని ధనాన్ని రాష్ట్రపతి సంతకం ద్వారా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ నిధి నుంచి డబ్బును తిరిగి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది.

పబ్లిక్ అకౌంట్: ఈ అకౌంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా బ్యాంకర్‌లాగా పనిచేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి నిధుల వసూళ్లు ఈ అకౌంట్ కిందకు వస్తాయి.

రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు రెండింటినీ బడ్జెట్‌లో రెండు పద్దులుగా విభజిస్తారు. అందులో ఒకటి రెవెన్యూ అకౌంట్. రెండు క్యాపిటల్ అకౌంట్. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి వచ్చీ, పోయే నిధులను రెవెన్యూ బడ్జెట్ (రెవెన్యూ అకౌంట్) క్యాపిటల్ బడ్జెట్ (క్యాపిటల్ అకౌంట్)గా పరిగణించడం జరుగుతుంది.

రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: పన్నుల వంటి అన్ని రకాలు ఆదాయాలు ఇక వేతనాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటి అన్ని రకాల వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లోకి చేరతాయి.

క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయం వంటి అంశాల ద్వారా వచ్చే ఆదాయాలు, వడ్డీల ద్వారా ఆదాయాలు తెచ్చుకోడానికి ఉద్దేశించి ఇచ్చే రుణ వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లో చేరతాయి.

పబ్లిక్ డెట్
ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసం అప్పులు చేస్తుంది. అది నేరుగా ప్రజలపై భారంగానే భావిస్తారు. మొత్తం ప్రభుత్వ అప్పులను దేశ జనాభాతో భాగించగా వచ్చేదాన్ని దేశ ప్రజల తలసరి అప్పుగా అంటే ఒకొక్కరి తలమీద ఎంత అప్పు భారం ఉందన్న విషయం తెలుస్తుంది. ప్రభుత్వం దేశీయంగా, విదేశాల నుంచి కూడా అప్పులను స్వీకరిస్తుంది. ఈ మొత్తాన్ని పబ్లిక్ డెట్‌గా వ్యవహరిస్తారు.

ద్రవ్య లోటు
సాధారణంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని మించి వ్యయం చేస్తుంది. ఇలా అదనంగా కావల్సిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరిస్తుంది. ఆదాయం కంటే చేసిన అధిక వ్యయాలనే ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్)గా వ్యవహరిస్తారు.

రెవిన్యూ లోటు
ప్రభుత్వం తన రెవిన్యూ ఆదాయం కంటే అధికంగా రెవిన్యూ వ్యయాలను చేసినప్పుడు ఏర్పడే లోటును రెవిన్యూ లోటుగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రెవిన్యూలోటు సున్నాగా ఉండాలి. అలా ఉం టే ప్రభుత్వం చేసిన రెవిన్యూ వ్యయం కేవలం వినియోగానికి కాకుండా ఒక సంపదను సృష్టించినట్లు లెక్క.

జీడీపీలో లోటు శాతం
ద్రవ్యలోటు ఎంత ఉందన్నది శాతాల్లో లెక్కిస్తారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఈ లోటు శాతం ఎంత ఉందన్నది కీలకం. ఉదాహరణకు ప్రస్తుతం మన ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది.

ట్రెజ‌రీ బిల్స్
ఒక సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్న బాండ్లను ట్రెజరీ బిల్స్‌గా పేర్కొంటారు. వసూళ్ళు, చెల్లింపుల్లో వచ్చే తేడాలను సర్దుబాటు చేసుకోవడానికి ట్రెజరీ బిల్స్‌ను ఆశ్రయిస్తారు. ఈ బాండ్స్ కాలపరిమితి ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే వాటిని డెట్ సెక్యూరిటీస్‌గా పేర్కొంటారు.

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు ఆర్‌బీఐ సహకారాన్ని తీసుకుంటాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్ప కాలిక రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు.

ప్రణాళికా వ్యయం:
ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఈ ఖాతాలో ఉంటాయి.

ప్రణాళికేతర వ్యయం
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటక రంగాలు, విదేశీ వ్యవహారాలు, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ప్రణాళికేతర ఖాతాలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.

సంచిత నిధి
అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 
1. రెవెన్యూ వసూళ్లు-రెవెన్యూ వ్యయం. |
2. మూలధన వసూళ్లు-మూలధన వ్యయం.

ప్రభుత్వ ఖాతా 
సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. పార్లమెంటు అనుమతి లేకుండానే ఈ ఖాతాలోని నిధులను ఉపయోగించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు నుంచి, పీఎఫ్ (భవిష్య నిధి) నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది.

+ పన్నులు - రకాలు

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో పన్నులు కూడా ఒకటి. వివిధ శాఖలకు చేసే కేటాయింపులు పన్నుల వసూళ్ళపైనే ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం విధించే పన్నులను రెండు రకాలుగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులుగా విభజించవచ్చు.
పన్ను లక్షణాలు
ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు.
పన్ను చెల్లింపులో ప్రత్యక్ష ప్రతిఫలం ఉండదు.
ఇందులో త్యాగం ఇమిడి ఉంటుంది.
ప్రజల ప్రయోజనాల కోసమే పన్నులను విధిస్తారు.
పన్నులు నిర్బంధ చెల్లింపులు
ప్రత్యక్ష పన్నులు (డెరైక్ట్ ట్యాక్సెస్):
వ్యక్తులు, సంస్థలపై విధించే పన్నులను ప్రత్యక్ష పన్నులంటారు. అంటే, పన్ను తొలి, తుది భారాన్ని ఒకే వ్యక్తి/ సంస్థ భరిస్తే అది ప్రత్యక్ష పన్ను. ఈ పన్ను భారాన్ని ఇతరులకు బదిలీచేసే అవకాశం ఉండదు. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, వృత్తి పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఎస్టేట్ డ్యూటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వ్యయంపై పన్ను... ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు.

ఆదాయపు పన్ను
ఒక వ్యక్తి తన లేదా హిందూ అవిభక్త కుటుంబంలోని కర్త తన ఆదాయంపై చెల్లించే పన్ను. ఆదాయాన్ని బట్టి ఈ చెల్లించే పన్ను మారుతుంటుంది.

కార్పొరేట్ ట్యాక్స్
ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చే వాటిల్లో ఇదే ప్రధానమైనది. కంపెనీలు ఆర్జించిన లాభాలపై చెల్లించే పన్నును కార్పొరేట్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు.
మినిమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్
కొన్ని కంపెనీలు లాభాలను ఆర్జించినా పన్ను చెల్లించనవసరం ఉండదు. అటువంటి కంపెనీలు వాటి లాభాల్లో కనీసం చెల్లించాల్సిన పన్నుని మినమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్ (మ్యాట్)గా పేర్కొంటారు.

లావాదేవీలపై పన్ను
స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల క్రయవిక్రయాలు వంటి లావాదేవీలపై చెల్లించే పన్నుని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌గా పేర్కొంటారు.

క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్
షేర్లు, స్థిరాస్తి, వ్యాపారం వంటి విక్రయాలు చేసినప్పుడు పొందే లాభాలపై చెల్లించే పన్నును క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు.

గిఫ్ట్ ట్యాక్స్
1958లో ప్రవేశపెట్టారు. మొదట్లో బహుమతి దాతపై ఈ పన్ను విధించే వారు. 1990-91 నుంచి బహుమతి గ్రహీతల నుంచి వసూలు చేస్తున్నారు.

డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్
ఇన్వెస్టర్లు అందుకునే డివిడెండ్‌పై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు కానీ.. ఇచ్చే కంపెనీ డివిడెండ్ మొత్తంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.

వెల్త్ ట్యాక్స్ (సంపద పన్ను)
ఒక వ్యక్తి, హెచ్‌యూఎఫ్ లేదా సంస్థ వ్యక్తిగత ఆస్తి విలువ రూ.30 లక్షలు దాటితే, ఆ మొత్తం మీద ఒక శాతం పన్ను చెల్లించాలి.

పరోక్ష పన్నులు (ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్):
పన్ను తొలి భారం ఒకరిపైన, తుది భారం మరొకరిపైన పడితే, అంటే, పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాలు విధించే అమ్మకం పన్ను, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, వాహనాలపై పన్ను, వినోదపు పన్ను... ఇవన్నీ పరోక్ష పన్నులు.

కస్టమ్స్ సుంకం
వస్తువుల ఎగుమతి, దిగుమతులపై విధించే పన్ను. ఇది ప్రభుత్వం ఆదాయ వనరుగానే కాకుండా దేశీయ పరిశ్రమల రక్షణకు, చెల్లింపుల సమతౌల్యం (దిగుమతులు, ఎగుమతుల విలువల మధ్య అంతరం) లోటును తగ్గించేందుకు దిగుమతి సుంకం విధిస్తారు. ప్రభుత్వ రాబడిని, దేశంలో వస్తు లభ్యతను కల్పించేందుకు ఎగుమతి పన్ను విధిస్తారు.

ఎక్సైజ్ సుంకం
దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులపై ఈ సుంకాన్ని విధిస్తారు.

సర్వీస్ ట్యాక్స్
వివిధ సేవలపై ఈ పన్నును విధిస్తారు. ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల్లో సర్వీస్ ట్యాక్స్ ఒకటి.

జీఎస్‌టీ
ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నుల విధానాన్ని సమూలంగా మారుస్తూ ఏకీకృత పన్నుల విధానం ఉండే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)ని రూపొందించారు. ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. జీఎస్‌టీ వస్తే వినియోగదారులపై పరోక్ష పన్నుల భారం తగ్గుతుందని అంచనా. దీనిని ప్రపంచంలో తొలిసారిగా ఫ్రాన్స్‌లో అమలు చేశారు.

జీఎస్‌టీ ప్రయోజనాలు
సరళంగా, పారదర్శకంగా ఉంటుంది.
కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో వివిధ రకాల పన్నులను తగ్గిస్తుంది. వివిధ రకాల వస్తువులపై పన్ను రేటు తగ్గుతుంది. ప్రభుత్వానికి పన్ను రాబడులను పెంచుతుంది.

పన్నులు ఎవరు విధిస్తారు?
రాష్ట్ర ప్రభుత్వాలూ కొన్ని పన్నులను విధించుకోవచ్చు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఖర్చుచేసుకోవచ్చు. అవి అమ్మకం పన్ను (వ్యాట్), రాష్ట్ర ఎక్సైజ్ పన్ను, భూమి శిస్తు, వ్యవసాయ ఆదాయంపై పన్ను, వినోద పన్ను.

కొన్ని పన్నులను కేంద్రమే విధించి... ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచుతుంది. అవి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీలు, ఆదాయపు పన్ను. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు వీటి ఆదాయాన్ని రెండు ప్రభుత్వాలూ పంచుకుంటాయి.

కొన్ని పన్నులను విధించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. వీటి ద్వారా వచ్చే రాబడి మాత్రం రాష్ట్రప్రభుత్వాలకే చెందుతుంది. అవి... న్యూస్ పేపర్ల అమ్మకాలపై పన్ను, వ్యవసాయ భూమిని మినహాయించి ఇతర సంపదపై ఉండే ఎస్టేట్ డ్యూటీ, టెర్మినల్ ట్యాక్స్, రైల్వే సరకులు, ప్రయాణ ఛార్జీలపై డ్యూటీలు, అడ్వర్‌టైజ్‌మెంట్‌లపై వచ్చే పన్ను, బహుమతి పన్ను.

మరికొన్ని పన్నుల్ని కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది. కానీ, వాటి వసూలు బాధ్యత మాత్రం రాష్ట్రాలపై ఉంటుంది. అవి... స్టాంపు డ్యూటీలు, వ్యాట్ డ్రగ్స్, కాస్మోటిక్స్‌పై విధించే పన్నులు.

+ బడ్జెట్ రూపకల్పన

క్లుప్తంగా చెప్పుకోవాలంటే... రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్‌ల రూపకల్పన. రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన రెవెన్యూ బడ్జెట్ రూపొందితే, క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన క్యాపిటల్ బడ్జెట్ రూపొందుతుంది. కానీ ఈ మూడక్షరాల వెనుక ఆరు నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది.

సెప్టెంబర్ చివర్లో..
రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబర్ చివర్లో..
తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు.

డిసెంబర్..
ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

జనవరి..
పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు.
ముద్రణ ప్రక్రియ..
బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు.

ఫోన్ ట్యాపింగ్..
బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది.

సందర్శకులపై మూడో కన్ను..
ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సంద ర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు.

ఫిబ్రవరి చివర్లో..
బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

ఆహారంపై ఎంత జాగ్రత్తో..
ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. 
అత్యవసర సమయాల్లో..
ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు.

ఫిబ్రవరి 28/29..
సాధారణంగా ఈ రోజుల్లోనే ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు.

+ బడ్జెట్ పద్ధతులు..

బడ్జెట్ పద్ధతులు: కాలక్రమంలో వివిధ రకాల బడ్జెట్ తయారీ పద్ధతులు రూపొందాయి. వాటిలో చెప్పుకోదగ్గవి పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్, ప్రోగ్రాం బడ్జెటింగ్, జీరో బేస్డ్ బడ్జెటింగ్, ఇంక్రిమెంటల్ బడ్జెటింగ్‌లు.. వీటిలో ఒక్కో బడ్జెటింగ్ పద్ధతిని వివిధ దేశాలు అనుసరిస్తున్నాయి.
పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్
ఇందులో ప్రభుత్వ కార్యకలాపాలు, వ్యయాలు పొందుపరుస్తారు. ప్రభుత్వ వ్యయం, పథకాలు, కార్యకలాపాలను ప్రాజెక్టుల పరంగా చూపిస్తారు. వ్యయాల ఆధారంగా అంతర్గత నిర్వహణను మెరుగుపర్చడమే ఈ బడ్జెట్ ముఖ్య స్వభావం. అందుకే ఈ పద్ధతిలో మరింత మెరుగైన నిర్వహణ పద్ధతులు రూపొందించడం, ప్రమాణాలు,యూనిట్ వ్యయాలకు ప్రాధాన్యం ఉంటుంది. మళ్లీ ఇందులో ప్రభుత్వ లక్ష్యాలను బట్టి కొన్ని విధులుగాను, పథకాలు, కార్యకలాపాలుగాను విభజిస్తారు. ఇవన్నీ కొంత నిర్దిష్ట పని ప్రమాణాన్ని సాధించేందుకు నిధులు కేటాయిస్తారు. ఒక్కో మంత్రిత్వ శాఖ కొంత వ్యయంతో కొంత కాల వ్యవధిలో సాధించాల్సిన పనులు బడ్జెట్‌లో చూపిస్తారు. అమలు చేయాలనుకున్న పథకం పరిమాణం, వ్యయం రెండిటికీ ప్రాధాన్యం ఉంటుంది. ఇది వ్యయాలను, ప్రయోజనాలను ఒకేచోట చూపించే కొత్త రకం బడ్జెటింగ్ పద్ధతి. నిధుల కేటాయింపులు, నిర్ణయాలు తీసుకోవడంలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రోగ్రాం బడ్జెటింగ్
ఈ బడ్జెటింగ్ విధానంలో మొదట లక్ష్యాలను నిర్వచించుకుంటారు. వాటిలో నుంచి కొన్నింటిని ఎంపిక చేసుకుని, వాటిని సాధించే పథకాలను రూపొందిస్తారు. ఇందులో సాధించిన ఫలితాలను కొలిచే పద్ధతులు కూడా ఉంటాయి. ప్రణాళికను ప్రస్తుత సంవత్సరానికే పరిమితం చేయకుండా కొన్నేళ్లకు విస్తరింపచేసి, ప్రణాళిక మొత్తాన్ని కొంత కాల వ్యవధిలో పునఃపరిశీలన చేస్తుంటారు. ఈ పద్ధతిని ఒకే శాఖకు అమలు జరిపితే ప్రోగ్రాం బడ్జెటింగ్ అనీ, అన్ని శాఖలకు అమలుచేస్తే ప్లానింగ్ ప్రోగ్రాం బడ్జెటింగ్ అనీ పిలుస్తారు. రెండు పద్ధతుల వెనుక ఉండే సూత్రం మాత్రం ఒక్కటే. లక్ష్యాలు సాధించే ప్రత్యామ్నాయాలు ఎక్కువ ఉన్నట్లయితే వాటి ఉత్పాదకాలు, ఉత్పత్తుల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తారు. గణాంక పద్ధతులు ఉపయోగించి ప్రత్యామ్నాయాలు ఎంపిక చేసి పథకాల పనితీరును అంచనా వేసే ఈ పద్ధతి కొంత మెరుగైనదని చెప్పవచ్చు. 1960 దశకంలో అమెరికా రక్షణశాఖలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.

ఇంక్రిమెంట్ బడ్జెటింగ్
బడ్జెటింగ్‌లో వివిధ ఉద్దేశాల కోసం వ్యయాలను పెంచాలా, తగ్గించాలా అనే నిర్ణయాలు ఇందులో ఉంటాయి. కొత్త పథకాలను చేపట్టడం గురించి ఆలోచించకుండా, అమలులో ఉన్న పథకాలకు కేటాయింపులు ఎక్కువ చేయాలా, లేదా అనే విషయాలు ఇందులో నిర్ణయిస్తారు. చాలా పథకాలు ఒకసారి ప్రారంభించాక వాటికి అదనపు కేటాయింపులు అవసరమవుతాయి.

జీరోబేస్డ్ బడ్జెటింగ్
ఇటీవలి అన్ని దేశాల్లో ప్రభుత్వ వ్యయపరిమాణం బాగా పెరిగినందువల్ల.. ప్రభుత్వ వ్యయ ఉత్పాదకతను పెంచి, అనుత్పాదక వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల కొత్త బడ్జెటింగ్ పద్ధతులు రూపొందించుకోవాల్సిన అవసరం ఉత్పన్నమైంది. ఆ కారణంగానే జీరో బేస్ బడ్జెటింగ్ ఏర్పడింది. ఇందులో ప్రతి మేజర్ బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదనకు వివరంగా మొదటి నుంచి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అదనపు కేటాయింపుల బదులుగా యూనిట్‌లోని ద్రవ్య అవసరాలను మొత్తంగా పరిగణలోకి తీసుకుంటారు.

తొలిభారం (ఇంపాక్ట్): ప్రభుత్వం పన్ను విధించినపుడు దాన్ని మొదటగా చెల్లించిన వ్యక్తి భరించే భారమే తొలి భారం. తుదిభారం (ఇన్సిడెన్స్): చిట్టచివరిగా పన్ను భరించే వారిపై పడే భారం.

ఉదా: వినోదపు పన్ను తొలి భారాన్ని థియేటర్ యజమాని, తుది భారాన్ని ప్రేక్షకులు భరిస్తారు.

+ బడ్జెట్ - సందేహాలు

ఏప్రిల్ 1 లోపు బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఏమవుతుంది?
అన్ని సమస్యల్లాగే దీనికి కూడా ‘ఓటాన్ అకౌంట్’ అనే ఆల్‌టైమ్ పరిష్కారం ఒకటుంది. రాజ్యాంగంలో 116వ అధి కరణ ప్రకారం లోక్‌సభలో ఈ విషయంపై ఓటాన్ అకౌంట్ నిర్వహిస్తారు. దీని ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం పొందే వరకు రెండు నెలల కాలవ్యవధి ఉన్న తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర అవసరాల కోసం తయారుచేస్తారు.

ఆర్థిక మంత్రి ఇచ్చే బడ్జెట్ ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
లోక్‌సభలో ఆర్థికమంత్రి ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రసంగిస్తారు. ఆ ఉపన్యాసం రెండు భాగాలుగా ఉంటుంది. ఇతర ప్రతినిధులు ఎవరూ అంతరాయం కలిగించకపోతే ఆర్థిక మంత్రి చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి ప్రసంగాన్ని ముగిస్తారు. అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ప్రసంగాన్ని రెండు భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకోవడం అవసరం.

మొదటి భాగం
అన్ని రంగాల్లో ఉన్న ఆదాయ వ్యయాలను గురించి సంక్షిప్తంగా వివరిస్తారు.
కొత్త పథకాలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి చేయాల్సిన రంగాలు, అమలు చేయాల్సిన పనుల గురించి చెబుతారు.
వీటిని వివరించే ముందు అవసరమైన చోట గతేడాది బడ్జెట్ లెక్కలను కూడా ప్రస్తావిస్తారు.

రెండవ భాగం
ఇందులో అన్నీ పన్నులకు సంబంధించిన అంశాలే ఉంటాయి.
కొత్త పన్నులు, పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, పన్ను తగ్గింపు, పెంపుల అమలు వంటి వివరాలన్నీ ఉంటాయి.
ప్రతి అంశాన్నీ చదివేముందు దానికి మద్దతిచ్చే చట్టాన్ని పేర్కొంటారు. అలాగే దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలనూ ప్రస్తావిస్తారు.

ఆర్థిక రంగం, స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
బడ్జెట్, ఆర్థికరంగం, స్టాక్ మార్కెట్లు.. వీటన్నింటికీ ధనమే మూలం. బడ్జెట్ పూర్తిగా ద్రవ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి దీని ప్రభావం మిగతా వాటిపై కచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం ఎలాంటిదనే విషయం మాత్రం ఆర్థికమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. వివిధ రంగాలకు కేటాయించిన మొత్తం ఆధారంగా ఈ ప్రభావాన్ని నిర్ణయించవచ్చు. అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఆర్థికాభివృద్ధి, స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. అలా కాకుండా ఆకాశమంత అప్పుల చిట్టాను చూపిస్తే రెండూ ఢమాల్‌న కుప్పకూలిపోతాయి.

సగటు మనిషిపై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుంది? 
అవసరమైన వనరులను వాడుకున్నందుకు ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందే. పన్ను ఎంత కట్టాలి అని నిర్ణయించేది బడ్జెట్టే. కాబట్టి సామాన్యులపై బడ్జెట్ ప్రభావం ఉంటుంది. పన్నులు ఎక్కువ ఉంటే ఆర్థికభారం పెరిగినట్లు, లేదంటే తగ్గినట్లు. ఉన్న పన్నుల్లో ఏ ఒక్క పన్ను పెంచినా దాని ప్రభావం సామాన్యుడిపై కచ్చితంగా ఉంటుంది.

ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టడం అవసరమా?
అవసరమే, రాజ్యాంగంలో 112వ అధికరణ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31)లో ప్రభుత్వం చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయం లెక్కలను పార్లమెంట్ ముందు ఉంచాలి. దీన్ని ‘యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్’ అంటారు. ఇది రాజ్యాంగంలో బడ్జెట్‌కు మూలరూపం.

ఇతర దేశాల్లో కూడా ఇలాగే బడ్జెట్ ప్రవేశపెడతారా?
ఆర్థిక వ్యవస్థ సంక్షోభం లేకుండా సాగాలంటే బడ్జెట్ అవసరం. అన్ని దేశాలకు బడ్జెట్ తప్పనిసరి. కాకపోతే వారి రాజ్యాంగాలను అనుసరించి ప్రాధాన్యం ఉంటుంది. మనలాగే యూకే, హాంగ్‌కాంగ్, ఐర్లాండ్ దేశాలు బడ్జెట్ ఆమోదం కోసం ఒక సమయాన్ని అనుసరిస్తాయి. కానీ, అమెరికాలో విడిగా బడ్జెట్ డే అంటూ ఒకటి ఉండదు. అవసరమైనపుడు వారి కాంగ్రెస్ కార్యనిర్వాహక శాఖే ఖర్చులు, ఆదాయం లెక్కలు చూసుకుంటుంది.

పేదల బడ్జెట్‌గా పేరొందింది ఏది?
1986లో ఆర్థిక మంత్రిగా వీపీసింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘పేదల బడ్జెట్’గా పేర్కొంటారు. ఈ బడ్జెట్‌లో రైల్వేపోర్టర్లకు, రిక్షా కార్మికులకు సబ్సిడీలతో కూడిన రుణాలను ప్రకటించారు. చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటుచేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కోసం ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది?
ప్రతి ఏటా బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలాఖరున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2000 యూనియన్ బడ్జెట్ నుంచి మాత్రం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టే నూతన సంప్రదాయాన్ని యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టారు.
2016 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం యత్నిస్తోంది. జీఎస్‌టీ అమల్లోకి వస్తే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీలు జీఎస్‌టీలో విలీనమవుతాయి.)
మన దేశంలో వ్యాట్‌ను అమలు చేసిన తొలిరాష్ట్రం హర్యానా. 2003 ఏప్రిల్ 1 నుంచి అక్కడ వ్యాట్ అమల్లో ఉంది. చివరగా, ఉత్తర్‌ప్రదేశ్ 2008 జనవరి 1 నుంచి అమలు చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలూ వ్యాట్ పరిధిలోకి వచ్చాయి.

డాలర్‌తో రూపాయి విలువ ఎలా నిర్ణయిస్తారు?
వ్యాపార సంబంధమైన లావాదేవీలు చర్చకు వచ్చినప్పుడు కచ్చితంగా వచ్చే ప్రస్తావన డాలర్. బిజినెస్‌కు సంబంధించిన లాభాలు, నష్టాలు వేటినైనా డాలర్‌తోనే పోలుస్తారు. డాలర్‌తో రూపాయి విలువ మారకాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం..!

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న నష్టాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు భద్రత ఉన్న దేశాల్లో తమ పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపడంతో డాలర్ విలువ పెరుగుదల కనపడుతోంది.

ఆర్థిక విధానం
ప్రభుత్వం అమలు చేసే ఆర్థిక విధానాలు, ప్రభుత్వ రుణం, ప్రభుత్వ పన్నుల విధానంలో పాటిస్తున్న నియమాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వ విధానాలు కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తాయి.

అంతర్జాతీయ వాణిజ్యం
దేశీయంగా ఎగుమతులు తక్కువ స్థాయిలో ఉండటం, దిగుమతులు ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల మనం చెల్లించాల్సిన మొత్తం ద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతుంది. భారతదేశంలో అమలవుతోన్న పన్నుల విధానం, వాణిజ్య ప్రభావమూ దీనిపై ఉంటుంది.

స్పెక్యులేషన్
దేశీయ మార్కెట్లలో పెట్టుబడుల ప్రవాహం కూడా రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తుంది.

వడ్డీరేటు విధానం
ప్రభుత్వ ఆర్థిక విధానాలు మార్కెట్లలో పెట్టుబడులు పెంచే విధంగా, విదేశీ మారకాన్ని స్వాగతించేలా ఉంటే విదేశీ మారకం దేశంలోకి ప్రవహించడం ద్వారా రూపాయి విలువలో పెరుగుదల అవకాశం ఉంటుంది.

ఉన్నత సంస్థల ప్రభావం
దేశంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ సంస్థ తీసుకునే విధానాలు కూడా దేశీయ కరెన్సీపై ప్రభావితం చూపిస్తాయి. మన దేశంలో ఉన్నత స్థాయి సంస్థ రిజర్వు బ్యాంకు తీసుకునే విధానాలు రూపాయి మారకం విలువలో పెరుగుదల, తరుగుదలకు దోహదపడే అవకాశాలున్నాయి.
+ బడ్జెట్ రికార్డులు / విశేషాలు
మొదటి (1947) బడ్జెట్ వివరాలు
ఇప్పుడు బడ్జెట్ లెక్కలన్నీ వేలు, లక్షల కోట్లలోనే.. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కేంటి? అప్పుడు మన ఆదాయం ఎంత? రక్షణ శాఖ బడ్జెట్ ఎంత? ఆ వివరాలు తెలుసుకుందామా..

(అంకెలు రూ.కోట్లలో)
మంత్రి: ఆర్కే షణ్ముగం చెట్టి, 
తేదీ: 1947, నవంబర్ 26
రెవెన్యూ అంచనా: 171.15
రెవెన్యూ వ్యయం: 197.39
రెవెన్యూ లోటు: 26.24
రక్షణశాఖకు: 92.74
ఆదాయపు పన్ను ద్వారా ఆదాయం: 119
కస్టమ్స్ ఆదాయం: 50.5
ఫారెక్స్ నిల్వలు: 1,547
గణతంత్ర భారత దేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను జాన్ మతాయ్ 1950 ఫిబ్రవరి 28న సభలో ప్రవేశపెట్టారు.
స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఆర్‌కే షణ్ముగంశెట్టి. 1947-49 మధ్య బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆయన నెహ్రూతో విభేదాల కారణంగా పదవి నుంచి వైదొలిగారు.
1951-52లో రిజర్వు బ్యాంకు గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ప్రధానమంత్రిగా కొనసాగుతూ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి జవహర్‌లాల్ నెహ్రూ. 1958-59లో ఆర్థికశాఖను కూడా పర్యవేక్షించిన ఆయన ఈ రికార్డు సాధించారు. ఆ తర్వాత ఇదే బాటలో ఇందిరాగాంధీ 1970లో, రాజీవ్ 1987లో ప్రధానులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌లు ప్రవేశపెట్టి అనంతర కాలంలో రాష్ట్రపతి పదవిని అధిష్టించినవారు ఇద్దరున్నారు. 1980-82 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆర్.వెంకట్రామన్, 1974-75లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత 1982-84 మధ్య, 2009-12 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
1991-92లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఏడాది తుది, తాత్కాలిక బడ్జెట్లను రెండు పార్టీలకు చెందిన, వేర్వేరు ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టడం గమనార్హం. తాత్కాలిక బడ్జెట్‌ను బీజేపీ నేత యశ్వంత్‌సిన్హా, తుది బడ్జెట్‌ను మన్మోహన్‌సింగ్ ప్రవేశపెట్టారు.
అతి తక్కువకాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన రికార్డు బీజేపీ నేత జశ్వంత్‌సింగ్ పేరిట ఉంది. ఆయన కేవలం 13 రోజుల పాటే కొనసాగారు.

మరికొన్ని విశేషాలు
పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ కూడా లీకయింది. కానీ అది 1950లో. అప్పట్లో బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతిభవన్‌లో ముద్రించేవారు. ఆ తర్వాత మింటో రోడ్‌లోకి మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నా