AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 1 January 2018

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 28

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅డిసెంబర్ 28*🌅🏞సంఘటనలు*🏞


1612 : మొట్టమొదట నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో


1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.


1921: మొదటిసారి

వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.

*🌻🌻జననాలు*🌻🌻


1856: అమెరికా - ఉడ్రోవిల్సన్, మాజీ అధ్యక్షుడు.


1859 : మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబర్ 28) ). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).


1875: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, కవీంద్రుడు ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి


1932: ఇండియా - ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త.


1932: నేరెళ్ళ వేణుమాధవ్, ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు. వీరికి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు


1937: ఇండియా - రతన్ టాటా, పారిశ్రామికవేత్త.


1940: వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు


1945: నేపాల్ - బీరేంద్ర, రాజు.


1952: ఇండియా - అరుణ్ జైట్లీ, రాజకీయవేత్త.


1955: చైనా - లియూ క్సియాబొ, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత.


*🤘 నేటి సుభాషితం🤘*

*యధార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు.*

👁💧👁

*❣కంటిలో నుండి వచ్చే కన్నీరు అందరికీ కనిపిస్తుంది గుండె లో ఎంత బాధ ఉందొ ఎవరికి తెలియదు.. అందుకే కావాల్సిన వారి దగ్గర ఏడుస్తారు.. అందరి ముందు ఆ బాధను దాచేస్తారు.❣*

🔲 సూక్తులు

🔺నిన్ను గురించి నీవు తెలుసుకోవడం ధ్యానంలో ఒక భాగం.

🔺నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.

🔺నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.

🔺నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.

🔺నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు.

*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  28, డిసెంబర్ 2017*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 52 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 12 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 34 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 34 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : తైతిల
వర్జ్యం :
(ఈరోజు రాత్రి 8 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 16 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(నిన్న రాత్రి 11 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 45 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 5 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 12 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 10 గం॥ 25 ని॥ నుంచి ఉదయం 11 గం॥ 9 ని॥ వరకు)(మద్యాహ్నం 2 గం॥ 52 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 40 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 9 గం॥ 30 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 53 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 12 గం॥ 16 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 39 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మేషము

*💎 నేటి ఆణిముత్యం 💎*

ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబు దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నబడెడు మాడ్కిదిరుగు మెలమి కుమారా! 

*భావము :*

జీవితంలో కలిమి ఉండవచ్చు, కష్టమూ ఉండవచ్చు. కానీ నీ పరిస్థితి ఏమిటో ఇతరులకు తెలియనివ్వకు. ఆ రహస్యాన్ని నీలోనే ఉంచుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల కీర్తిప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా నడుచుకో.

*👬 నేటి చిన్నారి గీతం 👬*

*వద్దూ వద్దూ వద్దూ..*

వద్దూ వద్దూ వద్దూ 
వద్దు వద్దని అనవద్దు 
ఉదయం లేవను అనవద్దు 
నిద్దుర పోతా అనవద్దు...
వద్దూ వద్దూ వద్దూ 
వద్దూ వద్దని అనవద్దు 
ముఖం కడగనని అనవద్దు 
స్నానం వద్దని అనవద్దు...
వద్దూ వద్దూ వద్దూ 
వద్దు వద్దని అనవద్దు 
అన్నం తిననని అనవద్దు 
పాలు తాగనని అనవద్దు..
వద్దూ వద్దూ వద్దూ 
వద్దు వద్దని అనవద్దు
బడికి పోనని అనవద్దు 
పాఠం వద్దని అనవద్దు...
ముద్దూ ముద్దూ ముద్దూ 
ఎవ్వరి కైనా ముద్దు 
మంచి చదువులే ముద్దు 
మంచి అలవాట్లు ముద్దు...

*✍🏼 నేటి కథ ✍🏼*

*బ్రహ్మరాక్షసుడి సంగీతం*

పేదబ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీయాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలాదూరం నడిచీ నడిచీ అలసిపోయిన అతనికి, చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని, వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకొనేందుకని అతను ఓ పొద మాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి 'వద్దు' అన్నది. 

అతను గబుక్కున లేచి అది 'ఎవరి గొంతు' అని అన్ని వైపులా చూశాడు; కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకుగానూ అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్లీ అదే స్వరం వినబడింది: 'వద్దు' అని! అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా. 

అయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకుల మూటను విప్పినప్పుడు, మళ్లీ ఆ గొంతు "వద్దు" అన్నది. అతను దాన్నీ పట్టించుకోకుండా, తను తినగలిగినన్నింటినీ తిని, మిగిలిన వాటిని తిరిగి మూటగట్టుకొని, ముందుకు బయలుదేరాడు. అంతలో అదే స్వరం "వద్దు,వెళ్లకు" అన్నది. 

బ్రాహ్మణుడు ఆగి, నలుదిక్కులా చూశాడు. ఎవ్వరూ కనబడలేదు. అందుకని అతను "ఎవరునువ్వు? ఎందుకిలా శబ్దం చేస్తున్నావు?" అని అరిచాడు. 

"పైకి చూడు, నేనిక్కడున్నాను" అన్నది గొంతు. అతను పైకి చూసేసరికి, ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఒక రాక్షసుడు కనబడ్డాడు. 

ఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. "గత జన్మలో నేనూ నీలాగానే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి, గాన కళలో ఆరితేరాను. నా జీవితకాలమంతా నేను సంగీత రహస్యాల్ని సేకరించటంలోనే వెచ్చించాను తప్పిస్తే, వాటిని ఎవ్వరితోటీ పంచుకోలేదు; ఏ ఒక్కరికీ నేర్పలేదు. అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడినవ్వాల్సి వచ్చింది. భగవంతుడు నాకిచ్చిన శిక్ష ఇది. నువ్వలా వెనక్కి తిరిగిచూస్తే అక్కడో చిన్న గుడి కనబడుతుంది. ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తూంటాడు- రోజంతా! అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవ్వరూ వాయించలేరు- అన్నీ అపశృతులే. ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను - నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది. నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటీ నాలోంచి బాణం మాదిరి దూసుకుపోతున్నది. ఆ శబ్దాలకు నా శరీరం తూట్లుపడి జల్లెడ అయిపోయినంత బాధ కలుగుతున్నది. ఒళ్లంతా నొప్పులే నొప్పులు. ఇదిగనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏవేవో చేయటం తథ్యం. రాక్షసుడిని గనుక నన్నునేను చంపుకోలేను కూడాను. మరి ఈ చెట్టును విడిచి పోనూ పోలేను - నన్ను ఈ చెట్టుకు కట్టేశారు. కనుక ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా మంచివాడివి. నీకు పుణ్యం ఉంటుంది. నామీద దయ తలుచు. తీసుకెళ్లి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు. అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను. అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి. ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై, ఇప్పుడు నాలాగా రాక్షసుడైనవాడిని ఉద్దరించినందుకుగాను, నీకు బహు పుణ్యం లభిస్తుంది." అన్నాడు. 

పేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కానీ పేదరికం అతన్ని రాటుదేల్చింది. అతనన్నాడు -"సరే, నేను నీ కోరిక తీరుస్తాను. నిన్ను వేరే తోటకు చేరుస్తాను - అయితే దానివల్ల నాకేం ప్రయోజనం? నువ్వు బదులుగా నాకోసం ఏం చేస్తావు?" అని. 

"నీ ఋణం ఉంచుకోను. నీకు మేలు చేస్తాను. నాకీ ఒక్క సాయం చెయ్యి చాలు" అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మరాక్షసుడు. 

'సరే'నని బ్రాహ్మణుడు వాడిని భుజాలమీద ఎక్కించుకొని, గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు. 

బ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి. సంతోషం వేసింది. దానితోపాటు, పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగివచ్చాయి వాడికి. వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి, అన్నాడు -"నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయి - ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు. ఇప్పుడు నేను స్వతంత్రుడిని- కనుక నేను పోయి, మైసూరు రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను. 

నన్ను వదిలించటం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు. కానీ నేను మాత్రం వాళ్లెవరికీ లొంగను. నువ్వు వచ్చాకగానీ నేను ఆమెను వదలను. తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకుగాను సంతోషించి మహారాజుగారు, జీవితాంతం నిల్చేంత సంపదను నీపైన కురిపిస్తారు. అయితే ఒక్క షరతు - ఆ తర్వాత నేను వెళ్లి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు, నువ్వు ఇక ఎన్నడూ అడ్డురాకూడదు. దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను మరి, ఆలోచించుకో" అని. 

బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ఆపైన అతను కాశీకి పోయి, గంగలో స్నానం చేసి, వెనక్కి తిరిగివస్తూండగా బ్రహ్మరాక్షసుడి మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో అతను అష్టకష్టాలూ పడి, చివరికి మైసూరు రాజ్యం చేరుకున్నాడు. అక్కడొక పూటకూళ్లమ్మ ఇంట్లో బసచేసి ఆ రాజ్య విశేషాలేంటని అడిగితే ఆమె అన్నది - "ఏం చెప్పను. మా యువరాణి చక్కని చుక్క. ఆమెనేదో భూతం ఆవహించింది, దాన్ని ఎవ్వరూ వదిలించలేకపోయారు. తన కుమార్తెను భూతం బారి నుండి కాపాడినవారికి నిలువెత్తు ధనం ఇస్తానని రాజుగారు చాటించారుకూడాను" అని. 

ఈ సంగతి వినగానే 'మంచిరోజులొచ్చాయని' బ్రాహ్మణుడికి అర్థమైపోయింది. అతను వెంటనే రాజభవనానికి వెళ్లి, "ఆ భూతాన్ని వదిలించే శక్తి తనకున్నదని లోనికి కబురంపాడు. ఈ పేదవాడికి అంతటి శక్తి ఉంటుందని ఎవ్వరూ నమ్మలేదు; కానీ 'ప్రయత్నిస్తే తప్పేంట'ని రాజుగారు బ్రాహ్మణుడికి ప్రవేశం కల్పించారు. 

అంత:పురాన్ని చేరుకోగానే, బ్రాహ్మణుడు తననక్కడ యువరాణితో వదిలి అందరినీ వెళ్లిపొమ్మన్నాడు. అందరూ గది బయట నిలబడ్డాక, బ్రాహ్మణుడు గది తలుపులు మూశాడు. ఆ వెంటనే బ్రహ్మరాక్షసుడు యువరాణి ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు: "నీకోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం ఈ క్షణమే ఈమెను వదిలి వెళ్లిపోతాను. కానీ- నేను నీకు గతంలో చెప్పిన సంగతిని గుర్తుంచుకో- నేను ఇప్పుడు వెళ్లే చోటుకుగనక -తప్పిజారైనా సరే- వచ్చావంటే మాత్రం, నేను నిన్ను తినకుండా వదిలిపెట్టను." అన్నాడు. ఆపైన, పెద్దగా శబ్దం చేస్తూ బ్రహ్మరాక్షసుడు యువరాణి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. యువరాణిగారు మామూలుగా అయిపోవటం చూసిన పురజనులంతా ఎంతో సంతోషించారు. రాజుగారు బ్రాహ్మణుడికి అనేక బహుమానాలు - బంగారం, భూములు అనేకమిచ్చి గౌరవించారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఒక చక్కని యువతిని పెండ్లాడి, పట్టణంలోనే ఇల్లు కట్టుకొని, పిల్లాపాపలతో హాయిగా జీవించసాగాడు. 

ఇక మైసూరు యువరాణిని వదిలిన బ్రహ్మరాక్షసుడు, నేరుగా కేరళ రాజ్యానికి పోయి, ట్రావన్ కూర్ యువరాణిని ఆవహించాడు. ట్రావన్ కూర్ రాజుగారు కూడా, పాపం తన బిడ్డను భూతం బారినుండి కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ ఏదీ ఫలించలేదు. ఒక రోజున ఆయనకెవరో చెప్పారు - మైసూరు యువరాణిని సరిగ్గా ఇదేలాంటి భూతం పూనినప్పుడు, ఒక బ్రాహ్మణుడు ఆమెను చిటికెలో ఎలా స్వస్థపరిచాడో. వెంటనే ఆయన తన మిత్రుడైన మైసూరు రాజుకు ఒక ఉత్తరం రాశారు- తన బిడ్డనుకూడా ఆ భూతం బారినుండి తప్పిస్తే బ్రాహ్మణుడిని తగిన విధంగా సన్మానిస్తామని. 

మైసూరురాజుగారు బ్రాహ్మణుడిని పిలిపించి, ట్రావన్ కూర్ రాజుగారి ఆస్థానానికి వెళ్లి, ఆ యువరాణికి సాయం చేసి రమ్మని అభ్యర్థించాడు. ఆ బ్రహ్మరాక్షసుడిని మరోసారి ఎదుర్కోవటం అనగానే బ్రాహ్మణుడికి ఒళ్లు చల్లబడింది. వణుకు మొదలైంది. అయినప్పటికీ, రాజుగారి ఆజ్ఞాయె! అతిక్రమించే వీలు లేదాయె! చాలాసేపు ఆలోచించీ, ఆలోచించీ అతను ఒక నిర్ణయానికి వచ్చాడు: తనకేమన్నా అయితే తన భార్యా బిడ్డల పోషణ సరిగా జరిగేటట్లు ఏర్పాట్లు చేసి, తను ట్రావన్ కూర్ కు బయలుదేరివెళ్లాడు. అయితే ఒకసారి అక్కడకు చేరుకున్నాక కూడా, బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కొనేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తనకు ఆరోగ్యం బాగా లేనట్లు నటిస్తూ అతను మూర్ఛపోయాడు. అలా దాదాపు రెండు నెలలపాటు తన గదిలోంచి కాలు బయట పెట్టలేదు. అయినా రెండు నెలల తర్వాత ఇక దాటవేసేందుకు వీలులేకపోయింది. యువరాణిని పీడిస్తున్న రాక్షసుడిని తరిమివేయాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి! 

ఇక అతను ప్రాణాలు అరచేతబట్టుకొని, యువరాణీవారిని చూడటం కోసం బయలుదేరాడు. తనను ఈ గండం నుండి తప్పించమని భగవంతుడిని వెయ్యి రకాలుగా ప్రార్థిస్తూ, అతను రాజుగారి ప్రాసాదానికి చేరుకుని, అక్కడినుండి అంత:పురంలో యువరాణీవారి మందిరంలో ప్రవేశపెట్టబడ్డాడు. అతణ్ని చూసిన మరుక్షణం బ్రహ్మరాక్షసుడు గర్జించాడు - "నిన్ను చంపేస్తాను! ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాను. నీకు ఇక్కడికి రావాల్సిన పనేముంది? నిన్ను వదిలేది లేదు" అని అరుస్తూ వాడు ఒక పెద్ద ఇనుప రోకలిని చేతబట్టుకొని బ్రాహ్మణుని మీదకు ఉరికాడు. 

బ్రాహ్మణుడి పైప్రాణాలు పైనే పోతున్నాయి. అయినా ప్రాణాలకు తెగించి వచ్చి ఉన్నాడు గనుక ఆ తెగింపు నుండి వచ్చిన ధైర్యంతో నిటారుగా నిలబడి, లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకొని గట్టిగా అన్నాడు- "చూడు, నువ్వు నేను చెప్పిన మాట విని మర్యాదగా ఈ యువరాణిని విడిచిపెట్టి వెళ్తావా?, లేకపోతే ఆ గుడిలోని సంగీతకారుడిని ఓసారి పిలిపించమంటావా? అతనైతే ఈ అంత:పురంలో కూర్చొని రాత్రింబవళ్లూ చక్కగా తనశైలిలో సంగీత సాధన చేస్తాడు మరి, నీకు అభ్యంతరం లేకపోతే!" అని. 

'సంగీతకారుడు' అనే మాట వినగానే ఆ బ్రహ్మరాక్షసుడికి ఆ సంగీతమూ, దాని కారణంగా తను పడ్డ బాధా ఒకేసారి గుర్తుకొచ్చాయి. ఆ బాధను తలుచుకొని వాడు భయంతో వణికిపోయాడు- "వద్దు! వద్దు! అతన్ని మాత్రం పిలువకు! నేను వెళ్లిపోతున్నాను" అని అరుస్తూ వాడు యువరాణిని వదిలిపెట్టి ఒక్కసారిగా మాయమయిపోయాడు. 

అటుపైన ట్రావన్ కూర్ యువరాణి ఆరోగ్యం త్వరితంగా కుదురుకున్నది. రాజుగారికి బ్రాహ్మణుడు చేసిన సహాయం ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయన బ్రాహ్మణుడికి ఎన్ని బంగారు నాణేలు ఇచ్చాడంటే, ఆ మొత్తాన్నీ బండ్లల్లో నింపుకొని, మైసూరు చేరుకొన్న బ్రాహ్మణుడు, తన భార్యాపిల్లలతో కలిసి ఇంకా ఆ డబ్బును లెక్కపెడుతూనే ఉన్నాడు! 

*📖 మన ఇతిహాసాలు 📓*

*పారిజాతాపహరణంలో సత్యభామ*

చం. అతుల మహానుభావ మని యవ్విరిఁ దానొక పెద్ద సేసి య
     చ్యుతునకు నిచ్చకంబొదవ సూడిద నిచ్చిన నిచ్చెఁగాక తా
     నతఁడు ప్రియంబు గల్గునెడ కర్పణ సేసినఁ జేసెఁగాక యా
     మతకరి వేలుపుం దపసి మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటన్

పై పద్యం నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణం లోనిది. ఈయనకు ముక్కు తిమ్మన అనే మరో ముద్దుపేరు కూడా ఉంది. ముక్కును వర్ణిస్తూ ఆయన వ్రాసిన ఒక పద్యానికి వచ్చిన ప్రసిద్ధి వల్ల ఆయన్ను ముక్కు తిమ్మన అంటారని జనశ్రుతి. కానీ, ముక్కును వర్ణించిన ఆ ప్రసిద్ధ పద్యం పారిజాతాపహరణంలో లేదు. రామరాజ భూషణుడు వ్రాసిన వసుచరిత్రలో ఉంది. కానీ లోకంలో ప్రతీతి మాత్రం ఆ పద్యం తిమ్మకవే వ్రాశాడని. జనంలో ఉండే ఇలాంటి కథలను బట్టి నిజానిజాలు నిర్ణయించడం వీలూ కాదు, న్యాయమూ కాదు.

తిమ్మకవి గూడా కృష్ణదేవరాయల ఆస్థాన కవే. ఆయన సభలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. రాయలవారి చిన్న భార్య అయిన చిన్నాదేవితో పాటు ఆమె పుట్టింటి రాజ్యం నుంచి అరణంగా వచ్చాడంటారు. ఒకరోజు రాత్రి నిద్రపోతుండగా చిన్నాదేవి కాలు రాయలవారి తలకు తగిలిందనీ, దానికి రాజు కోపించి ఆమె దగ్గరకు రావడం మానుకున్నాడనీ, ఆ బాధను ఆమె తిమ్మకవికి చెప్పుకున్నదనీ, భార్య కాలు భర్తకు తగలడం తప్పేమీ కాదని రాయలవారికి అన్యాపదేశంగా చెప్పడం కోసం కృష్ణా-సత్యభామలకు అటువంటి ఘట్టం ఒకటి కల్పించి పారిజాతాపహరణ కావ్యం వ్రాసి సున్నితంగా సరసంగా రాయలవారికి బోధించాడనీ, ఆ సూచనను సహజ సహృదయమూర్తి ఐన రాయలు గ్రహించి తదాది భార్యతో సఖ్యంగా వున్నాడనీ – ఒక ఐతిహ్యం జనంలో ప్రచలితంగా వుంది. పైన మనం చెప్పుకున్నట్లు జనబాహుళ్యం లోని వదంతుల నిజానిజాలు నిర్ధారించటం కష్టమే. ఏమైనా కానీ ఒక చక్కని ప్రబంధ కావ్యం తెలుగు ప్రజలకు దక్కిందనేది మాత్రం నిజం.

‘ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు’ అనేది సాహిత్యప్రియుల వాడుక. నిజమే. పారిజాతాపహరణం లోని ప్రతి పద్యమూ ఆ విషయాన్ని వేనోళ్ళ చాటుతుంది. ఎంత చక్కని కథాప్రణాలిక వేసుకున్నాడో అంత అందంగా ఆ కథను కావ్యంగా మలిచాడు తిమ్మన. కావ్యంలో ఎన్ని ఆశ్వాసాలున్నాయో గిరి గీసినట్లు అన్ని రంగాలుగా విభజించి వొక మంచి నాటకాన్ని పద్యాల్లో రూపొందించాడనుకోవచ్చు. అయితే కొందరు విమర్శకుల ఆరోపణ కూడా ఒకటుంది. ప్రధాన కథ ప్రథమాశ్వాసం లోనే అయిపోయింది, మిగిలిన ఐదు ఆశ్వాసాలూ అనవసరంగా సాగదీశాడు అని. కానీ అది పూర్తి నిజం కాదు. ప్రథమాశ్వాసం తరువాయి భాగాల్లో కవిత్వం గానీ, పద్యాలు గానీ తక్కువ స్థాయివేమీ కావు.

తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే (ఇమేజ్) వేరు. ఏ యితర భారతీయ భాషా సాహిత్యాలలోనూ సత్యభామకు ఈ ఇమేజ్ లేదని తెలిసిన వారంటారు. భర్తను అపరిమితంగా ప్రేమిస్తూ, భర్త నుండి అంతే విపరీతమైన ప్రేమను పొందుతూ, అతనితో చనవులు నెరపుతూ, అవసరమైనప్పుడు అలుగుతూ, కోర్కెలు తీర్చుకుంటూ, అప్పుడప్పుడూ నిష్ఠురాలాడుతూ, భర్త తన కొక్కతికే అనురక్తుడుగా వుండాలని కోరుకుంటూ, అలానే వున్నాడని నమ్మే ఒక ప్రణయమూర్తి, ఒక గడుసు తెలుగు ఇల్లాలు – తిమ్మన గారి సత్యభామ.

కృష్ణుడు ఒకరోజు రుక్మిణి ఇంట్లో ఉండగా నారదుడు వచ్చి ఒక పారిజాత పుష్పం ఇచ్చి నీకు ఇష్టమయిన వారికి ఇచ్చుకోమని చెపుతాడు. తాను అప్పుడు రుక్మిణితో వున్నాడు కాబట్టి కృష్ణుడు ఆ పూవుని రుక్మిణికే ఇస్తాడు. నారదుడు సత్యభామను గురించి, అప్పుడక్కడే ఉన్న సత్యభామ చెలికత్తె వినేట్లుగా కొన్ని ఎకసక్కెపు మాటలంటాడు. చెలికత్తె పోయి ఈ సంగతంతా సత్యభామకు చెపుతుంది. ఇంకేముంది! ‘వ్రేటు వడ్డ ఉరగాంగన యుం బలె, నేయి వోయ భగ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ’ లేస్తుంది సత్యభామ. ఆ సమయంలో తన కోపాన్నీ, అక్కసునూ వ్యక్తంచేస్తూ తన చెలికత్తెతో మాట్లాడే సందర్భం లోనిది పై పద్యం. నిజంగానే నారదుడు అలా మాట్లాడాడా అని అడుగుతుంది. అవన్నీ విని ఊరికే వున్నాడా కృష్ణుడు అని అంటుంది. రుక్మిణి ఏమేం మాట్లాడింది అని ఆరా తీస్తుంది.

అసలు తానే కృష్ణుని మహిషులందర్లోకీ ఆయనకు అత్యంత ప్రియమైన దానినని సత్యభామ నమ్మిక. ఒక మంచి వస్తువు ఆయన చేతికి వస్తే దాన్ని తనకే ఇస్తాడని ఆమెకు ప్రగాఢ విశ్వాసం. అలాంటిది, పారిజాతాన్ని తనకీయకుండా తన సవతి కివ్వడం భరించలేక పోతుంది. నారదుడు తన గురించి ఎకసక్కెపు మాటలు మాట్లాడడం – అదీ రుక్మిణి ఎదుట – ఊహించలేని అవమానంగా భావిస్తుంది. పైగా ఈ ప్రహసనమంతా కృష్ణుని ఎదుట జరగడమూ, ఆయన ఔనూ కాదూ అనకుండా ఉండడమూ, పుండు మీద కారం జల్లినట్లయింది. ఇదీ నేపథ్యం పై పద్యానికి.

ఈ పద్యంలో మూడు పనులు స్పష్టంగా ఎత్తిచూపుతుంది సత్య – నారదుడు పూవుని కృష్ణుని కీయడం, ఆయన దానిని రుక్మిణి కీయడం, నారదుడు తనను గేలి చేస్తూ మాట్లాడడం. ఈ మూడూ సత్యకు హృదయ శల్యాలే. నారదుడు పువ్వును కృష్ణుని కివ్వడంలో తప్పేముంది. కానీ కృష్ణుడు దాన్ని రుక్మిణి కిచ్చేసరికి, అసలు పువ్వును తేవడమే తప్పై పోయింది అభిమానవతీ, కోపనా అయిన సత్యకు. ఈ పద్యంలో సత్యభామ మనస్థితి చాలా స్వభావసిద్ధంగా చిత్రితమైంది. నిజానికి పారిజాతం ‘అతుల మహాను భావ’మైనదే. అది అంత గొప్పది కాబట్టే నారదుడు దాన్ని పెద్ద జేసి వర్ణించాడు. మామూలు పువ్వైతే ఎవరిచ్చినా, ఎవరికిచ్చినా ఎవరూ పట్టించుకోవల్సిన పనే లేదు. ‘అతుల మహానుభావమని యవ్విరి తానొక పెద్ద జేసి అచ్యుతునకు ఇచ్చకం బొడవ సూడిద ఇచ్చిన ఇచ్చెగాక’ అని సత్య అనడం అందని ద్రాక్షపండ్ల సామెతను జ్ఙాపకం చేయడమే గాక, ఒక రకంగా ఆ పూవు గొప్పదనాన్ని అంగీకరించి దానిని తనకు కాకుండా తన సవతి కీయడం పట్ల బాధ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. పైగా దాన్ని ‘అచ్యుతునకు ఇచ్చకం బొదవ సూడిద’ ఇచ్చాడట. నారదుణ్ణి ఇచ్చకాలాడే వాడిగా తేల్చి పారేసింది. ‘తానతడు ప్రియంబు గల్గు నెడ కర్పణ జేసిన జేసె గాక’ అనడంలో రుక్మిణి ఎడనే కృష్ణునికి ప్రియమున్నది, తన ఎడ లేదు అని కొత్తగా తెలుసుకున్న నిజం వల్ల కలిగే బాధను అనుభవిస్తూనే, కడుపుడుకుతో ‘తన కిష్టమైన వాళ్ళకు ఇచ్చుకుంటే ఇచ్చుకోనీ’ అంటున్నది. ఇవ్వడం కూడా కాదు ‘అర్పణ’ చేయడం అట.

నారదుడు ఆ మాములు పువ్వును ఓ బ్రహ్మాండమైనదిగా వర్ణించి కృష్ణుడి మెప్పు కోసం ఇస్తే ఇచ్చుకోనీ, దాన్ని కృష్ణుడు తనకు నచ్చిన వాళ్ళకు సమర్పణ చేస్తే చేసుకోనీ! కానీ, మాయావి ఐన ఆ దేవ ఋషి, ఆ మతకరి వేలుపుం దపసి (మతకము + అరి మోసకారి) మమ్మల్ని గూర్చి మాట్లాడ్డమెందుకు అక్కడ? ఇదీ ఆమె బాధ.

ఎంత లెక్క లేని తనమో చూడండి, నారదుడన్నా, రుక్మిణన్నా, తనను చిన్న పరచిన కృష్ణుడన్నా. ఈ పద్యంలో ఆ ముగ్గురి మీదా ఎంత తిరస్కారం ప్రకటించిందో గమనించండి. నారదుడు ఇచ్చకాల మారి, మోసకారి. కృష్ణుడి మెప్పు కోసం ఓ మాములు పువ్వును గొప్పజేసి పొగిడిన భట్రాజు. ఇక రుక్మిణి పేరు ఎత్తడం గూడా ఇష్టం లేదు ఆమెకు. ‘తానతడు ప్రియంబు గల్గు నెడకు’ అని రుక్మిణి ఊసు కూడా పరిహరిస్తూ మాట్లాడడం, ఆమెకు రుక్మిణిపై గల చులకన భావం చెప్పకనే చెబుతున్నది. ఇక కృష్ణుణ్ణి తిరస్కారంగా ‘అతడు’ అని సూచించింది, పువ్వుని ‘అర్పణ’ చేశాడు అంది. వాళ్ళపై తిరస్కారమే గాదు, తన అతిశయోక్తి ఎలా ప్రకటించిందో చూడండి. ‘మమ్ము దలంపగ నేల?’ అట. కృష్ణుడేమో ‘అతడు’ తానేమో ‘మమ్ము’ !

ఇలా సత్యభామ మనసు లోకి దూరి, ఆమె మనోభావాల ఛాయాచిత్రంగా పద్యాన్ని చెక్కాడు తిమ్మకవి. సత్య అతిశయమూ, కోపమూ, బాధా, అక్కసూ, తిరస్కారా లన్నింటినీ అద్భుతంగా బొమ్మ కట్టించాడు. పారిజాతాపహరణం లోని ప్రతీ పద్య సమూహమంతా అమృత బిందు సందోహం. అందులో నాకు నచ్చిన చాలా పద్యాల్లో ఒకటైన ఈ పద్యం ప్రథమాశ్వాసం లోనిది.

*✅ తెలుసుకుందాం ✅*

*⭕మన శరీరంలో కాళ్లకు, చేతులకు మాత్రమే తిమ్మిర్లు ఏర్పడుతాయెందుకు?*

✳మన శరీరంలో పరిసరాలతో సంధానించుకుని పనికి ఉపక్రమించేవి ప్రధానంగా కాళ్లు, చేతులే. మన ఉదరభాగం, వీపు, ముఖం, వక్షస్థలం, మెడ తదితర భాగాలు పరిసరాల ఒత్తిడి (pressure)కి కానీ, తాకిడి (impact)కి కానీ లోను కావు. కానీ మనం ప్రతి పనిలోను చేతుల్ని వాడకుండా ఉండలేము. కూర్చున్నప్పుడు, ఇతర భంగిమల్లోను కాళ్లు యాంత్రిక ఒత్తిడి (mechanical stress)కి లోనవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే రక్తనాళాలు (blood capillaries), నాడీ తంత్రులు (nerve fibres) అడకత్తెరలో పోకలాగా ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడు ఆయా కణాలకు, నాడీ తంత్రులకు సరిపడా రక్తప్రసరణ అందదు. ఫలితంగా ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. ఈ విషయాన్ని అక్కడున్న నాడీ తంత్రులు మెదడుకు సంకేతాల రూపంలో చేరవేయడం వల్ల తిమ్మిర్లు (fingling and numbness) అనే భావనను మనం పొందుతాము. ఒత్తిడికి లోనవుతున్న చేతులు, కాళ్ల భాగాల్ని కాస్త విదిలిస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అంటే తిరిగి ఆక్సిజన్‌ సరఫరా సజావుగా సాగడం వల్ల సమస్య తగ్గినట్టు మెదడు భావించి తిమ్మిర్ల భావన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

*📣40శాతం డీఎడ్‌ అభ్యర్థులకు ఊరటొ టీఆర్టీ దరఖాస్తు చేసేందుకు అనుమతించండి:హైకోర్టు*

*🌸రాష్ట్రంలో 40 శాతం ఉత్తీర్ణతతో ఉన్న డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) అభ్యర్థుల నిరీక్షణ ఫలించింది. హైకోర్టు ఆదేశాలతో వారికి ఊరట లభించింది. 40 శాతం మార్కులతో డీఎడ్‌ అభ్యర్థులనూ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని ఉమ్మడి హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 40 శాతంతో ఉత్తీర్ణులైన డీఎడ్‌ అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. 8,792 ఉపాధ్యాయ పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 21న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. అయితే ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారే ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కానీ జనరల్‌ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారమే జనరల్‌ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులతో డీఎడ్‌కు అర్హత కల్పించారని అభ్యర్థులు కోర్టుకు నివేదించారు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన కోర్టు టీఆర్టీలోని ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కోరారు. టీఆర్టీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ వరకు ఉన్న విషయం తెలిసిందే.*

*_🌸STUTS :_*🌸

*✍డ్రాపౌట్స్‌కు కళ్లెం*

🔷స్కూళ్లలో పెరుగుతున్న అడ్మిషన్లు

🔷ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు

🔷2016-17 విద్యాగణాంకాల విడుదల

🔷గత విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 57.99% అక్షరాస్యత

♦ రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం పెంచడంతోపాటు ఆ స్కూళ్ల పర్యవేక్షణపైనా అధికారులు దృష్టిసారించారు. ఈ క్రమంలో గత విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 57.99% అక్షరాస్యత నమోదుకాగా గ్రామీణ ప్రాంతాల్లో 47.12%, పట్టణ ప్రాంతాల్లో 75.39% చొప్పున అక్షరాస్యత నమోదైంది. 

♦గ్రామీణ ప్రాంతాలలో తక్కువగా నమోదవుతున్న అక్షరాస్యతను క్రమంగా వృద్ధి చేసేందుకు ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా పాఠశాలకు వెళ్ళేలా క్షేత్రస్థాయిలో విద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో నిత్యం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగింది. ఈ వివరాలతో కూడిన ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్: 2016-17 పుస్తకాన్ని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు జీ కిషన్ బుధవారం విడుదలచేశారు. ఈ పుస్తకంలో మాధ్యమాలవారీగా విద్యార్థుల నమోదుతోపాటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జాబితాలను కమ్యూనిటీలవారీగా సేకరించారు. 

♦పాఠశాల యాజమాన్యాల వారీగా విద్యార్థులు నమోదు ఏ విధంగా ఉన్నది? సంవత్సరాలవారీగా డ్రాపౌట్స్ నిష్పత్తి పరిస్థితి ఏమిటి? ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా అమలవుతున్నది? తదితర అంశాలను కూడా ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ పుస్తకంలో పేర్కొన్నారు.

♦ 2016-17 విద్యాసంవత్సరంలో 1,483 ప్రాథమిక పాఠశాలలు, 3,310 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5,304 ఉన్నత పాఠశాలలు, 414 మాధ్యమిక పాఠశాలలు కలిపి మొత్తం 10,511 ఆంగ్ల మాధ్యమం స్కూళ్లు కొనసాగుతున్నాయి. వీటిలో అన్ని తరగతుల్లో కలిపి 30,44,320 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే తెలుగు మాధ్యమంలో 21,300 పాఠశాలల్లో 14,01,306 మంది చదువుతున్నారు. అన్ని మాధ్యమాలు/యాజమాన్యాలతో కలిపి 41,337 పాఠశాలలు పనిచేస్తున్నాయి. 2016-17 లెక్కల ప్రకారం అన్ని రకాల పాఠశాలల్లో కలిపి మొత్తం 60,33,196 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

*♦స్థిరంగా డ్రాపౌట్లు*
2014-15 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల డ్రాప్ అవుట్ క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గత రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో విద్యార్థుల ప్రవేశాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో జరుగుతున్న బహుళ ప్రవేశాల విధానం నియంత్రణలోకి వచ్చింది. దీంతో గతంలోకంటే 2016-17 విద్యా సంవత్సరంలో సేకరించిన డైస్ డాటా ప్రకారం వాస్తవ లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 2015-16లో డ్రాపౌట్ రేటు 36.99% ఉంటే వాస్తవ లెక్కల ప్రకారం 2016-17లో 37.92 శాతంతో స్థిరంగా ఉందని తెలిపారు.

👇 వచ్చే విద్యాసంవత్సరంలో ఈ డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి చర్యలు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ సంచాలకులు జీ కిషన్ పేర్కొన్నారు. అయితే విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తికంటే ఎక్కువ మొత్తంలో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

*_🌸STUTS :_*🌸

*✍సీన్‌రివర్స్‌ ప్రయివేటు బడుల్లో తగ్గారు..!*

🔷 గతేడాది కంటే తగ్గిన 21,335 మంది విద్యార్థులు

🔷 అదేబాటలో జిల్లాపరిషత్‌, ఎయిడెడ్‌ స్కూళ్లు

🔷 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో పెరిగిన విద్యార్థులు

🔷 గతం కంటే పెరిగిన డ్రాప్‌అవుట్స్‌

🔷 గిరిజనుల్లో ఏకంగా 61.09శాతం

🔷 విడుదలైన విద్యాగణాంకాల నివేదిక

♦నవతెలంగాణ:నిన్నమొన్నటి వరకూ సర్కారు బడుల్లో విద్యార్థులు తగ్గడం, ప్రయివేటు బడుల్లో విద్యార్థులు పెరగడం చూశాం. కానీ 2016-17లో సీన్‌రివర్స్‌ అయింది. ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు తగ్గితే, ఈ ఏడాదీ రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు పెరిగారు. అయితే జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలలు, ఎయిడెడ్‌ బడుల్లో మరోసారి విద్యార్థులు తగ్గారు. విద్యార్థుల డ్రాప్‌అవుట్స్‌ గతేడాది కంటే పెరిగాయి. దీనిలో బడికి దూరమవుతున్న వారిలో ఎస్టీ విద్యార్థులు ఎక్కువగా ఉండగా, అదే స్థాయిలో ఎస్సీ విద్యార్థులూ ఉన్నారు. ఇవి హైస్కూల్‌స్థాయిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి . డ్రాప్‌ అవుట్స్‌ నివారణ కోసం పాఠశాల విద్యాశాఖ పలు చర్యలు చేపడుతున్నా, పెద్దగా ఫలితం చూపలేకపోయాయి. 

♦ప్రయివేటులో తగ్గేందుకు ఫీజులు ఒక భారమైతే, గిరిజనుల్లో, అదీ హైస్కూల్‌ స్థాయిలో తగ్గడం సర్కారీ విద్యావ్యవస్థలపై నమ్మకం లేకపోవడం మరోకారణంగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అక్షరాస్యత సాధించే తెలంగాణగా కాకుండా నిరక్షరాస్య తెలంగాణగా మారే అవకాశాలున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

♦ రాష్ట్రంలో 2016-17 విద్యాసంవత్సరంలో 60,33,196 మంది విద్యార్థులుండగా, వీరిలో 29,26,608 మంది బాలికలు, 31,06,588 మంది బాలురు ఉన్నారు. విద్యార్థుల్లో ఎస్సీలు 10,24,646 మంది, బీసీలు 30,29,205 మంది, ఎస్టీలు 6,78,030 మంది ఉన్నారు. మొత్తంగా 2015-16 విద్యాసంవత్సరంతో పోలిస్తే 1,58,586 మంది విద్యార్థులు తగ్గారు. ప్రతి ఏటా ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య పెరుగుతూ ఉన్నది. 

♦కానీ ఈసారి ప్రయివేటులోనూ విద్యార్థులు తగ్గారు. 2015-16లో 31,40,957 మంది చదివితే, 2016-17లో 31,19,625 మంది చదివారు. భారీగా గురుకుల పాఠశాలలు ప్రారంభించడంతో 2017-18లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 22,385 మంది, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 1217 మంది విద్యార్థులు గతేడాది కంటే పెరిగారు. మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్‌ పాఠశాలల్లో 1,02,647 మంది, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 17,554 మంది విద్యార్థులు తగ్గారు.

*♦భారీగా డ్రాప్‌ అవుట్స్‌..*
2015-16తో పోలిస్తే 2016-17లో బడికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగింది. ప్రభుత్వం బడిబాట లాంటి కార్యక్రమాలు నిర్వహించినా, ఫలితం కనిపించలేదు. 2007-08లో 8,40,933 మంది విద్యార్థులు ఒకటో తరగతిలో చేరితే, 2016-17లో పదో తరగతి వరకూ కొనసాగింది కేవలం 5,22,027 మంది మాత్రమే. మిగిలిన వారంతా మధ్యలోనే బడి మానేశారు.

♦ 2015-16లో డ్రాప్‌అవుట్‌ రేటు 36.99శాతం ఉంటే, 2016-17లో 37.92శాతానికి పెరిగింది. ఎస్సీల్లో 38.90శాతం, ఎస్టీల్లో 61.09 శాతంగా ఉంది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో 18.48 శాతం, ప్రాథమికోన్నత స్థాయిలో 32.33 శాతం, హైస్కూల్‌ స్థాయిలో 37.92 శాతంగా ఉంది. అత్యధికంగా కొమురంభీం జిల్లాలో 65.66 శాతం, జయశంకర్‌ జిల్లాలో 60.77 శాతం, మహబూబాబాద్‌లో 60.36శాతం, నాగర్‌కర్నూల్‌లో 57.51 శాతం ఉండగా, తక్కువగా వరంగల్‌ అర్బన్‌లో 14.09 శాతం, మేడ్చెల్‌లో 16.57శాతం ఉంది. బడికి దూరమవుతున్న వారిలో అన్ని విభాగాల్లోనూ బాలురే ఎక్కువగా ఉన్నారు. 

♦ఎస్టీల్లో ఏజెన్సీ ప్రాంతమైన కొమురం భీం జిల్లాలో 79.33 శాతం, సంగారెడ్డిలో 75.11 శాతం, నిర్మల్‌లో 75.02 శాతం, జోగులాంబ గద్వాలలో 74.84 శాతం డ్రాప్‌అవుట్స్‌ జరిగాయి.

 ♦ఎస్సీల్లో అత్యధికంగా మహబూబాబాద్‌లో 56.02శాతం, నాగర్‌కర్నూల్‌లో 55.23 శాతం, జోగులాంబలో 53.79 శాతం వనపర్తిలో 50.57శాతం, వికారాబాద్‌లో 50.29 శాతం విద్యార్థులు మధ్యలోనే బడి మానేశారు.

*♦ఉపాధ్యాయుల వివరాలు..*
కేంద్ర ప్రభుత్వం 1031
రాష్ట్ర ప్రభుత్వం 20,649
ఎంపీపీ,జెడ్పీపీ 98,207
ఎయిడెడ్‌ 3202
ప్రయివేటు 96,580
గుర్తింపులేని, మదర్సాలు ఇతర.. 1780
మొత్తం 2,21,449

*♦డ్రాప్‌ అవుట్‌ నిష్పత్తి(1-10వరకు)*
.......... బాలురు బాలికలు మొత్తం
2007-08 4,33,350 4,07,587 8,40,933
2016-17 2,64,812 2,57,215 522027
డ్రాప్‌అవుట్‌శాతం 38.89 36.89 37.92 

*♦ఎస్సీల్లో*
.......... బాలురు బాలికలు మొత్తం
2007-08 75066 71469 146535
2016-17 44388 45149 89537
డ్రాప్‌అవుట్‌శాతం 40.87 36.83 38.90

*♦ఎస్టీల్లో...*
.......... బాలురు బాలికలు మొత్తం
2007-08 66,550 62,773 12,9321
2016-17 25,746 24,577 50,323
డ్రాప్‌అవుట్‌శాతం 61.31 60.85 61.09

*♦డ్రాపౌట్స్‌ శాతం..*

విభాగం ప్రాథమిక,    ప్రాథమికోన్నత ,     హైస్కూల్‌
జనరల్‌ 18.48   32.33   37.92
ఎస్సీ 19.71    32.33      38.90
ఎస్టీ 37.50      54.97     61.09

*_🌸STUTS :_*🌸

*✍పీహెచ్‌డీ ప్రవేశాల ఇంటర్వ్యూలు ప్రారంభం*

*❇కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: నాలుగేళ్ల నుంచి నానుతూ వచ్చిన పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. 2013-2014 విద్యాసంవత్సరంలో పీహెచ్‌డీ ప్రవేశాలను నిర్వహించిన అనంతరం మళ్లీ ఇప్పుడే ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. 31 కోర్సుల్లోని అభ్యర్థులకు వచ్చే నెల 13వ తేదీ వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. బుధవారం కేయూ క్యాంపస్‌లోని డీన్‌ కార్యాలయాల్లో, ఆంగ్ల విభాగం, కేయూ ప్రవేశాల డైరెక్టరేట్‌ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 2015-2017 బ్యాచ్‌ల విద్యార్థులకు 25, 2016-2017 బ్యాచ్‌ వారికి 30 మార్కులకుగాను ఇంటర్వ్యూలు జరిగాయి. వాణిజ్యశాస్త్రం, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం కామర్స్‌ డీన్‌ ఆచార్య సూర్య దేవర కమలేశ్వర్‌రావు, ఆంగ్ల విభాగంలో డీన్‌ ఆచార్య కె.పురుషోత్తం, క్యాంపస్‌ కళాశాలలో సైన్స్‌ డీన్‌ ఆచార్య వై.ప్రమీలాదేవి, కేయూ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌లో ఇంజినీరింగ్‌ డీన్‌ ఆచార్య టి.శ్రీనివాసులు నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరిగాయి. శాఖాధిపతులు, పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షులు, విషయ నిపుణులు, ఎస్టీ, ఎస్టీ, మహిళా విభాగాల నుంచి, వీసీ కార్యాలయం నుంచి నామినీలు సభ్యులుగా వ్యవహరించారు. అన్ని విభాగాల్లో ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం వచ్చే నెల ఆఖరు వరకు ప్రవేశాలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. కొన్ని రోజులుగా పీహెచ్‌డీ ప్రవేశాలపై నెలకొన్న అభ్యంతరాలు తొలగిపోయి సజావుగా ఇంటర్వ్యూలు ప్రారంభం కావడంతో కేయూ వీసీతోపాటు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు*

*_🌸STUTS :_*🌸

*✍ఆన్లైన్లో ఎంప్లాయిమెంట్ కార్డు*

*👉త్వరలో శ్రీకారం చుట్టనున్న ఉపాధి శిక్షణశాఖ*

*❇ఉపాధి కార్డు(ఎంప్లాయిమెంట్)లను ఇక మీదట ఆన్లైన్లో పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధి శిక్షణశాఖ కసరత్తు ప్రారంభించారు. గతంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయాలకు ఎంతో ప్రఖ్యాత ఉండేది. కాలక్రమంలో బోర్డుల ద్వారా ఉద్యోగాల ఎంపిక కావడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్కే పరిమితమయ్యాయి. అయినప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగ భృతిని కల్పించేలా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళాలను నిర్వహిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థల్లో జాబ్ మేళాలను కార్యాలయాల్లోనే నిర్వహించి యువతకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ ఉపాధి శిక్షణశాఖ కృషి చేస్తున్నది. ఇకమీదట ఎంప్లాయిమెంట్ కార్డుల కోసం అభ్యర్థులు ఆయా జిల్లాల పరిధిలోని కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా కుల, ఆదాయ ద్రువీకరణ పత్రాలను ఎలా పొందుతున్నారో అదే తరహాలో ఎంప్లాయిమెంట్ కార్డులను అందించేందుకు ఉపాధి శిక్షణశాఖ సెక్రటరీ శశాంక్గోయల్, శాఖ సంచాలకుడు కేవై నాయక్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎంప్లాయిమెంట్ కార్డులను పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఇకమీదట ఇంటి నుంచి ఆన్లైన్లో లేదా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేలా ఉపాధి శిక్షణశాఖ శ్రీకారం చుడుతున్నది.*

*👉రెన్యువల్కు విశేష స్పందన*

*❇రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఉపాధి శిక్షణశాఖ ల్యాప్స్ అయిన ఎంప్లాయిమెంట్ కార్డుల అభ్యర్థులకు 2000 నుంచి 2017 జూలై వరకు రెన్యువల్కు అనుమతి ఇవ్వడంతో హైదరాబాద్లో 1,300 మంది, నల్లగొండలో 850, మహబూబ్నగర్లో 1,500 మంది అభ్యర్థులు ల్యాప్స్ అయిన ఎంప్లాయిమెంట్ కార్డులను రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తులు అందజేశారని ప్రాంతీయ ఉపాధికారి ఏ లింగ్యానాయక్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయంలో 1,100పైగా అభ్యర్థులు రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తులను అందజేశారని ఉపాధి అధికారి పరమేశ్వర్రెడ్డి తెలిపారు.*

*📚మేలో ప్రవేశ పరీక్షల నిర్వహణ!* 

*🔹రెండు రోజుల్లో సెట్స్‌ తేదీలు, కన్వీనర్ల వెల్లడి*

*♻లాసెట్‌ కన్వీనర్‌గా ద్వారకానాథ్‌ : పాపిరెడ్డి*

*❇రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఉన్నత విద్యలో చేరేందుకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలు (సెట్స్‌)-2018, మేలోనే జరగనున్నాయి. రెండు రోజుల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలు, కన్వీనర్ల పేర్లను వెల్లడిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మెన్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలో ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌)తో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. రాతపరీక్షలను టీసీఎస్‌ నిర్వహిస్తుందని అన్నారు. లాసెట్‌ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్‌ ద్వారకానాథ్‌ను ఎంపిక చేశామన్నారు. ఐసెట్‌ కన్వీనర్‌ను త్వరలోనే ఎంపిక చేస్తామని అన్నారు. ఎంసెట్‌, ఈసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్‌లకు గతంలో కొనసాగిన వారే కన్వీనర్లుగా వ్యవహరిస్తారని వివరించారు. ఎంసెట్‌కు ఎన్‌ యాదయ్య (జేఎన్టీయూ), ఈసెట్‌కు గోవర్ధన్‌ (జేఎన్టీయూ), పీజీఈసెట్‌కు సమీనా ఫాతిమా (ఓయూ), ఎడ్‌సెట్‌కు మధుమతి (ఓయూ), పీఈసెట్‌కు వి సత్యనారాయణ (ఓయూ) ఉంటారని చెప్పారు.*

*📝40 శాతం డీఎడ్‌ అభ్యర్థులకు ఊరట టీఆర్టీ దరఖాస్తు చేసేందుకు అనుమతించండి:హైకోర్టు*

*🌸రాష్ట్రంలో 40 శాతం ఉత్తీర్ణతతో ఉన్న డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) అభ్యర్థుల నిరీక్షణ ఫలించింది. హైకోర్టు ఆదేశాలతో వారికి ఊరట లభించింది. 40 శాతం మార్కులతో డీఎడ్‌ అభ్యర్థులనూ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని ఉమ్మడి హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 40 శాతంతో ఉత్తీర్ణులైన డీఎడ్‌ అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. 8,792 ఉపాధ్యాయ పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 21న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. అయితే ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారే ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కానీ జనరల్‌ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారమే జనరల్‌ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులతో డీఎడ్‌కు అర్హత కల్పించారని అభ్యర్థులు కోర్టుకు నివేదించారు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన కోర్టు టీఆర్టీలోని ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కోరారు. టీఆర్టీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ వరకు ఉన్న విషయం తెలిసిందే.*

🔊 *ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్‌!*

సాక్షి,  ✴ *హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తుకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వనుంది. గతనెల 30తో దరఖాస్తుల ప్రక్రియ ముగియగా... క్షేత్రస్థాయిలో దాదాపు 30వేల మంది విద్యార్థులు ఈపాస్‌ వెబ్‌సైట్‌ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్‌!ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్‌!లో వివరాలు నమోదు చేసుకోలేకపోయారు. ఈక్రమంలో గడువు ముగియడంతో ఆయా విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలకు వినతులు వెల్లువెత్తాయి*.

 ♦ *మరోవైపు బీఈడీ, లాసెట్, నర్సింగ్‌ కోర్సులకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ సైతం గతనెలాఖరుకు ముగియకపోవడంతో ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో దరఖాస్తుల నమోదుకు అవకాశం ఇవ్వాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈమేరకు రెండ్రోజుల క్రితం ఆ శాఖ సంచాలకులు కరుణాకర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.*

 ⏰🔷 *నెలరోజులు పెంపు!*

🦋 *2017–18 వార్షిక సంవత్సరంలో పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు 13.05 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 13.30 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేయగా... 25వేల దరఖాస్తులు తగ్గాయి. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి జూన్‌ 20న ప్రారంభమైన నమోదు ప్రక్రియ ఆగస్టు వరకు సాగింది. ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతోపాటు ఇతర వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లోనూ జాప్యం జరిగింది*.

 ♻ *దీంతో అక్టోబర్, నవంబర్‌లో దరఖాస్తుకు మళ్లీ అవకాశం కల్పించింది. 95శాతం మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో పలువురు విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. తాజాగా ఆయా విద్యార్థులతో పాటు, బీఈడీ, లాసెట్, నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 50వేల మందికి అవకాశం కల్పించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడితే వచ్చే ఏడాది జనవరి నెల మొత్తం దరఖాస్తులు స్వీకరిస్తామని సంక్షేమాధికారులు చెబుతున్నారు.*

31 నుంచి ఆ చెక్బుక్లు చెల్లవు
జన్మభూమి న్యూస్:-
న్యూఢిల్లీ : భారతీయ స్టేట్ బ్యాంక్ తనలో విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులు ఇంకా పాత చెక్బుక్, ఐఎఫ్ఎస్ కోడ్లే వాడుతున్నారా? అయితే త్వరగా మార్చేసుకోండి. 2017 డిసెంబర్ 31 నుంచి ఎస్బీఐ తన విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులకు చెందిన పాత చెక్బుక్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు చెల్లవు. ఈ లోపలే కొత్త చెక్బుక్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు తీసుకోవాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు సూచిస్తోంది. గతంలో పాత చెక్బుక్లను మార్చుకోవడానికి 2017 సెప్టెంబర్ 30న డెడ్లైన్గా గడువు విధించింది. అనంతరం ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఎస్బీఐ మరోసారి తన కస్టమర్లకు ఈ సూచన చేస్తోంది.
ఈ ఏడాది ఆరంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమైన విషయం తెలిసిందే. కొత్త చెక్బుక్ పొందడానికి బ్యాంకు శాఖనైనా సందర్శించవచ్చని లేదా ఎటీఎం, ఎస్బీఐ మొబైల్ యాప్ ద్వారానైనా దీన్ని పొందవచ్చని పేర్కొంది. ఎస్బీఐ కూడా మేజర్ సిటీల్లో ఉన్న బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్లను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మారుస్తోంది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కత్తా, పాట్న, అహ్మదాబాద్, భోపాల్, అమరావతి, చంఢీగర్, జైపూర్, తిరువనంతపురం, లక్నో వంటి నగరాల్లో ఎస్బీఐ బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్లను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మార్చేసింది.

*ఆధార్ లింక్ ఉంటేనే ఇక పేస్ బుక్ ఖాతా*జన్మభూమి న్యూస్:- త్వ‌ర‌లో ఫేస్‌బుక్ ఖాతా సృష్టించుకోవాలంటే ఆధార్‌లో ఉన్న పేరును ఉప‌యోగించేలా ఆ సంస్థ చ‌ర్య‌లు తీసుకోబోతోంది. త‌ప్పుడు పేర్ల‌తో అకౌంట్లు తెరిచి, మోసాల‌కు పాల్ప‌డుతున్న వారిని అరిక‌ట్ట‌డానికే ఇలాంటి ప‌ద్ధ‌తిని ఫేస్‌బుక్ అమ‌లు చేయ‌నుంది.

👉అంతేకాకుండా ఇలా ఆధార్‌లో ఉన్న పేరుతోనే ఖాతా తెర‌వ‌డం వ‌ల్ల స్నేహితులు గానీ, కుటుంబ స‌భ్యులు గానీ సుల‌భంగా ఫేస్‌బుక్ ఖాతాను గుర్త‌పట్ట‌వ‌చ్చు. ఇప్ప‌టికే ఈ విధానం ప్ర‌యోగ‌ద‌శ‌లో ఉన్న‌ట్లు ఫేస్‌బుక్ వ‌ర్గాలు తెలిపాయి. భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగం అతితక్కువగా ఉన్న ప్రాంతంలో దీన్ని ప్రయోగించినట్లు ఫేస్‌బుక్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విధానాన్ని ఆప్ష‌న‌ల్‌గా మాత్ర‌మే ఉంచ‌బోతున్న‌ట్లు సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. అంటే.. ఇష్టం ఉన్న వాళ్లు మాత్ర‌మే ఆధార్‌లో పేరుని ఉప‌యోగించుకోవ‌చ్చ‌న్న‌మాట‌. అయితే ఈ విధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేసే అవకాశాలు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఖాతా తెర‌వ‌డానికి ఆధార్ సంఖ్య అవసరం లేదని, ఆధార్ ప్రకారం పేరుమాత్రమే అవసరం అని స్పష్టం చేశారు.

*✅ తెలుసుకుందాం ✅*

*⭕మన శరీరంలో కాళ్లకు, చేతులకు మాత్రమే తిమ్మిర్లు ఏర్పడుతాయెందుకు?*

✳మన శరీరంలో పరిసరాలతో సంధానించుకుని పనికి ఉపక్రమించేవి ప్రధానంగా కాళ్లు, చేతులే. మన ఉదరభాగం, వీపు, ముఖం, వక్షస్థలం, మెడ తదితర భాగాలు పరిసరాల ఒత్తిడి (pressure)కి కానీ, తాకిడి (impact)కి కానీ లోను కావు. కానీ మనం ప్రతి పనిలోను చేతుల్ని వాడకుండా ఉండలేము. కూర్చున్నప్పుడు, ఇతర భంగిమల్లోను కాళ్లు యాంత్రిక ఒత్తిడి (mechanical stress)కి లోనవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే రక్తనాళాలు (blood capillaries), నాడీ తంత్రులు (nerve fibres) అడకత్తెరలో పోకలాగా ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడు ఆయా కణాలకు, నాడీ తంత్రులకు సరిపడా రక్తప్రసరణ అందదు. ఫలితంగా ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. ఈ విషయాన్ని అక్కడున్న నాడీ తంత్రులు మెదడుకు సంకేతాల రూపంలో చేరవేయడం వల్ల తిమ్మిర్లు (fingling and numbness) అనే భావనను మనం పొందుతాము. ఒత్తిడికి లోనవుతున్న చేతులు, కాళ్ల భాగాల్ని కాస్త విదిలిస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అంటే తిరిగి ఆక్సిజన్‌ సరఫరా సజావుగా సాగడం వల్ల సమస్య తగ్గినట్టు మెదడు భావించి తిమ్మిర్ల భావన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

*తెలంగాణ  ప్రజలకు ముఖ్య సూచన*

ఈ నెల డిసెంబర్ 31వ తేదీన రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రతి పొలీసు స్టేషన్ అద్వర్యం లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును.
500 పోలీసు టీమ్లు స్థానిక మరియు సంచార టీమ్లుగా ఏర్పడి ప్రత్యేకంగా  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును.పరిక్షించు సమయంలో విడియే రికార్డు చేయబడును.
            డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్న సమయంలో పట్టుబడ్డ వ్యక్తుల వాహనాలు స్వాధినం
చెసుకోబడును.ఆ  రోజు ప్రయణించు వారు పై విషయాన్ని గమనించగలరు.
               డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించు సమయంలో పట్టుబడిన వ్యక్తుల సమాచారం ఆధార్ నంబరుతో జతపరచడం జరుగును.ఆ సమాచారం ఉద్యోగం మరియు వీసా మరియు పాస్పోర్ట్ ఇంకా మిగతావి జారీ చెయు సమయంలో ఈ విషయాన్ని అందరు గమనించగలరు.
ఇట్లు,
మీ,

తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్

Saturday, 30 December 2017

అన్ని ప్రవేశ పరీక్షల కోసం జికె బిట్స్ 7

అన్ని ప్రవేశ పరీక్షల కోసం జికె బిట్స్ 7
1. రక్షణ రంగంలో సహకారం కోసం భారత్ - రష్యాలు ఏ పేరుతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి ? 1) ముద్ర - 2017 2) ఇంధ్ర - 20173) యుద్ధ అభ్యాస్ - 2017 4) మైత్రీ - 2017 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అనే అంశంపై ఇంధ్ర - 2017 పేరుతో భారత్ - రష్యా సంయుక్తంగా త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించాయి. రష్యాలోని సెర్గీవిస్కీ 249 కంబైడ్‌‌య ఆర్మీ రేంజ్, వ్లాదివోస్తోక్‌లోని జపాన్ సముద్ర జలాల్లో అక్టోబర్ 19 నుంచి 29 వరకు జరిగిన ఈ సైనిక విన్యాసాల్లో ఇరు దేశాల త్రివిధ దళాలు పాల్గొన్నాయి.
2. భారత్ - కజఖస్తాన్ ఇటీవల ఏ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి ?1) ప్రబల్ దోస్తిక్ - 2017 2) దోస్తీ - 20173) ఇండో - కజక్ - 20174) ఇంధ్ర - 2017 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని బాక్‌లోహ్‌లో భారత్ - కజఖస్తాన్ రెండవ సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయి. మొదటి సంయుక్త సైనిక విన్యాసాలు 2016లో కజఖస్తాన్‌లో నిర్వహించారు. ప్రబల్ దోస్తిక్ (PRABAL DOSTYK) అంటే ధృడమైన స్నేహం అని అర్థం.
3. వ్యవసాయ రంగంలో ఏటా 4 శాతం వృద్ధిని సాధించేందుకు ప్రవేశపెట్టిన రాష్టీయ్ర కృషి వికాస్ యోజన పథకాన్ని ఎప్పటి వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? 1) 2017-18 2) 2019-203) 2020-214) 2021-22 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: రాష్టీయ్ర కృషి వికాస్ యోజన పథకాన్ని Rashtriya Krishi Vikas Yojana& Remunerative Approaches for Agriculture and Allied sector Rejuvenation (RKVY&RAFTAAR) పేరుతో 2019-20 వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగులో ప్రోత్సాహం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15,722 కోట్లు కేటాయించింది.
4. పాకిస్తాన్‌లో భారత హై కమిషనర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) అజయ్ బిసారియా 2) గౌతం బంబావాలే 3) ముఖ్తా తోమర్4) నవతేజ్ సర్నా 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 1987 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అజయ్ బిసారియా పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ఇంతకముందు పాక్‌లో భారత హైకమిషనర్‌గా ఉన్న గౌతం బంబావాలే ఇటీవలే చైనా రాయబారిగా వెళ్లారు.
5. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించిన భారత షూటర్ ఎవరు ? 1) జీతు రాయ్ 2) దీపక్ కుమార్ 3) గగన్ నారంగ్ 4) హీనా సిద్ధు 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎరుుర్ పిస్టల్ ఈవెంట్లో 626.6 స్కోరుతో తొలి స్థానంలో నిలిచిన హీనా సిద్ధు స్వర్ణాన్ని గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫల్ ఈవెంట్లో దీపక్ కుమార్ రజతం గెలుచుకున్నాడు.
6. బ్లూ ఫ్లాగ్ - 2017 సైనిక విన్యాసాలను ఏ దేశం నిర్వహిస్తుంది ? 1) భారత్ 2) ఇజ్రాయెల్ 3) అమెరికా4) జర్మనీ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: బ్లూ ఫ్లాగ్ పేరుతో ఇజ్రాయెల్ ఏటా రెండుసార్లు బహుళ సైనిక విన్యాసాలను నిర్వహిస్తుంది. 2017 నవంబర్‌లో ఇజ్రాయెల్‌లోని ఉడా ఎయిర్ ఫోర్స్‌బేస్‌లో ఈ విన్యాసాలు జరిగాయి. భారత్ ఈ విన్యాసాల్లో తొలిసారి పాల్గొంది. 45 మంది వాయుసేన సిబ్బందితో సీ-130 జే.. ఈ విన్యాసాల్లో పాల్గొంది. భారత్‌తో పాటు ఫ్రాన్స్‌, జర్మనీ కూడా ఈ విన్యాసాల్లో తొలిసారి పాల్గొన్నాయి.
7. కృష్ణ జింకల కోసం ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ఇటీవల ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది ?1) తెలంగాణ 2) ఉత్తరప్రదేశ్ 3) ఆంధ్రప్రదేశ్ 4) మధ్యప్రదేశ్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఉత్తరప్రదేశ్ అలహాబాద్ యమునా నదీ తీరం వెంట ఉన్న మెజా అడవిలోని 126 హెక్టార్లలో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో 350 వరకు కృష్ణ జింకలు ఉన్నాయి.
8. గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ - 2017లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ? 1) 100 2) 1043) 1084) 144 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ - 2017లో భారత్ 108వ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నివేదికలో 87వ స్థానంలో నిలిచిన భారత్ ఈ సారి 21 స్థానాలు దిగజారింది. విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ ప్రోత్సాహం వంటి అంశాల్లో పురుషులు, మహిళలకు ఉన్న అవకాశాల్లో తేడాల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తారు. 
  • 2017 నివేదికలో ఐస్‌లాండ్ జండర్ ఈక్వల్ దేశాల్లో తొలిస్థానంలో నిలిచింది. నార్వే రెండో స్థానంలో, ఫిన్‌లాండ్ మూడో స్థానంలో, రువాండా నాలుగో స్థానంలో నిలిచాయి.
9. చెక్క బొమ్మల తయారీలో ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ? 1) తెలంగాణ 2) కర్ణాటక3) ఆంధ్రప్రదేశ్ 4) తమిళనాడు 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: చెక్క బొమ్మల తయారీలో ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ(GIR) ఇక్కడ తయారయ్యే బొమ్మలకు ఇటీవల జియోగ్రాఫిక్ ఇండికేషన్ (GI) ఇచ్చింది. ఏపీ నుంచిఇంతకముందు కొండపల్లి బొమ్మలు, తిరుపతి లడ్డు, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడికి జీఐ గుర్తింపు పొందాయి.
10. 2017 డిసెంబర్ 1 నుంచి అమ్ముడయ్యే కొత్త నాలుగు చక్రాల వాహనాలకు వేటిని తప్పనిసరి చేస్తు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ? 1) ఫాస్ట్‌టాగ్ 2) ఇన్సురెన్స్‌3) జీపీఎస్ 4) సీఎన్‌జీ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 2017 డిసెంబర్ 1 నుంచి అమ్ముడయ్యే కొత్త నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్‌టాగ్‌లను తప్పనిసరి చేస్తు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. టోల్‌గేట్ల వద్ద చెల్లింపులను డిజిటిల్ పద్ధతిలో చేసేందుకు ఉద్దేశించినవే ఫాస్ట్‌టాగ్‌లు. వీటిని వాహనం ముందు భాగంలోని అద్దంపై అమర్చుతారు. ప్రత్యేక నంబర్‌తో కూడిన ఈ ఫాస్ట్‌టాగ్‌లను ప్రీ పెయిడ్ పద్ధతిలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా టోల్‌గేట్ల వద్ద టాక్స్ చెల్లింపు డిజిటల్ పద్ధతిలో చేయవచ్చు.
11. వరల్డ్ ఫుడ్ ఇండియా(WFI) - 2017 సమావేశాలు ఎక్కడ జరిగాయి ? 1) హైదరాబాద్ 2) న్యూఢిల్లీ3) అమృత్‌సర్ 4) విశాఖపట్నం 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా - 2017 సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఈ సమావేశాలను నిర్వహించారు. జర్మనీ, జపాన్, డెన్మార్క్ దేశాలు ఈ సమావేశాల నిర్వహణలో భాగస్వామిగా వ్యవహరించాయి.
  • WFI 2017 Theme :Transforming the food economy
12. ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారం - 2017ను ఎవరికి ప్రకటించారు ? Current Affairs 1) కృష్ణ సోబతీ 2) జుంపా లహరీ3) చేతన్ భగత్ 4) అనితా దేశాయ్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 53వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారానికి ప్రముఖ హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ ఎంపికయ్యారు. సాహిత్య రంగంలో అందించిన సేవలకుగాను ఆమెకు ఈ పురస్కారం ప్రకటించారు. సోబతీ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గుజరాత్‌లో జన్మించారు. ఆమె రాసిన దార్ సే బిఛుడీ, మిత్రో మర్జానీ, జిందగీనామా తదితర రచనలు ప్రఖ్యాతి గాంచాయి. కృష్ణ సోబతీ ఈ అవార్డు గెలుచుకున్న 8వ మహిళ. 
  • సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్‌ను 1961లో స్థాపించారు. 2016లో ఈ పురస్కారాన్ని బెంగాలీ రచయిత శంకాఘోష్‌కు ప్రకటించారు.
13. వరల్డ్ యూత్ ఫోరమ్ - 2017 ఎక్కడ జరిగింది ? 1) భారత్2) ఇండోనేషియా3) ఈజిప్ట్ 4) యూఏఈ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఈజిప్టులోని షరమ్ ఎల్ షేక్ నగరంలో వరల్డ్ యూత్ ఫోరమ్ - 2017 జరిగింది. వ్యాపారం, ఆవిష్కరణ, భావి నాయకుల తయారీలో సవాళ్లు, లింగ సమానత్వం, మహళా సాధికారత అంశాల్లో యువత పాత్రపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చలు జరిపారు.
14. భారత ప్రభుత్వం ప్రపంచంలోనే ఎతైన రోడ్డు మార్గాన్ని ఏ ప్రాంతంలో నిర్మించింది ? 1) లడఖ్ 2) అరకు3) షిల్లాంగ్4) గుల్మార్గ్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో 19,300 అడుగుల ఎత్తులో భారత ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎతైనది. ప్రాజెక్టు హిమాంక్‌లో భాగంగా బోర్డర్ రోడ్‌‌స ఆర్గనైజేషన్(BRO) ఈ రోడ్డు మార్గాన్ని పూర్తి చేసింది. లేహ్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిసుమ్లే, దెమ్‌చోక్ గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఈ రహదారి పొడవు 86 కిలోమీటర్లు.
15. సాంస్కృతికవారసత్వ పరిరక్షణ కార్యక్రమం కింద యునెస్కో నుంచి ఆసియా-పసిఫిక్ అవార్డు ఆఫ్ మెరిట్ పొందిన తమిళనాడులోని దేవాలయం ఏది ? 1) మధుర మీనాక్షి దేవాలయం 2) రామేశ్వరం రామనాథస్వామి దేవాలయం 3) తంజావూరు బ్రిహదీశ్వర దేవాలయం 4) శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయానికి మెరిట్ విభాగంలో యునెస్కో ఈ అవార్డుని ప్రకటించింది. ఆలయ నిర్మాణం పునరుద్ధరణ, వాననీటి సంరక్షణ, మురుగు నీటి వ్యవస్థల అభివృద్ధికి చేపట్టిన చర్యలకు గాను ఈ దేవాలయానికి యునెస్కో ఈ సాంస్కృతిక వారసత్వ అవార్డుని ప్రకటించింది.
16. మహిళల ఆసియా హాకీ కప్ - 2017 టైటిల్ విజేత ఎవరు ? 1) చైనా2) భారత్ 3) మలేషియా4) పాకిస్తాన్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: జపాన్‌లో జరిగిన మహిళల ఆసియా హాకీ కప్ ఫైనల్లో చైనాను ఓడించి భారత్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. తద్వారా రెండోసారి ఈ కప్‌ను కైవసం చేసుకుంది. మహిళల హాకీ జట్టు మొదటిసారి 2004లో ఆసియా కప్‌ను గెలుచుకుంది. 2017 అక్టోబర్‌లో పురుషుల హాకీ జట్టు ఆసియా హాకి కప్‌ను సొంతం చేసుకుంది.
17. చైనా సొంతంగా రూపొందించిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ పేరు ఏమిటి ? 1) బెయ్‌డూ 2) గగన్ 3) జీపీఎస్ 4) గ్లోనాస్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: బెయ్‌డూ ప్రాజెక్టు మూడో దశలో భాగంగా చైనా ఇటీవల మార్చి - 3బీ రాకెట్ ద్వారా బెయ్‌డూ - 3M1, బెయ్‌డూ - 3M2 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 2020 నాటికి ఈ వ్యవస్థ పూర్తిగా చైనాకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అమెరికా(జీపీఎస్), రష్యా(గ్లోనాస్)కు సొంత నావిగేషన్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. భారత్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ (గగన్) పేరుతో సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
18. ఒడిశాలో ఏ రంగంలో అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రపంచ బ్యాంకుతో 119 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది ? 1) ఉన్నత విద్య 2) వ్యవసాయం3) పరిశ్రమలు 4) ప్రజా సేవలు 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: Odisha Higher Education Programme for Excellence and Equity(OHEPEE) ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఈ రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత విద్య పరిపాలనా అభివృద్ధి, విద్యార్థులు ఉన్నత విద్యలో ఎన్నుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేలా చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
19. డీఆర్‌డీఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి ఇటీవల విజయవంతంగా పరీక్షించిన క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ పరిధి ఎంత ?1) 0 - 1000 కిలోమీటర్లు 2) 1000 - 2000 కిలోమీటర్లు3) 2000 - 3000 కిలోమీటర్లు4) 3000 - 4000 కిలోమీటర్లు 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో తయారైన అణ్యాయుధ సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. భూ ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ సబ్ సోనిక్ క్షిపణి 300 కిలోల బరువు గల అణువార్ హెడ్లను మోసుకెళ్లగలదు.
20. భారత్‌లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంత ? 1) 152) 173) 194) 21 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: భారత్‌లో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటి సంఖ్యను తగ్గించి నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని పరిశీలిస్తోంది. విలీన ప్రతిపాదనలని పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
21. ఇటీవల ఏ రాష్ట్రం హిందీ సత్యాగ్రహీలకు జీవితకాలం నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్ల ప్రకటించింది ? 1) పంజాబ్ 2) హర్యానా3) అరుణాచల్ ప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: 1975లో దేశంలో అత్యయిక స్థితి సమయంలో హింధీ భాష ప్రచారం కోసం పంజాబ్ ఆర్య ప్రతినిధి సభ హిందీ సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన హిందీ భాష ఉద్యమకారులకు జీవితకాలం నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వీరు 194 మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
22. కర్ణాటకలో తొలి మహిళా డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) మీరా బోర్వన్కర్ 2) సంజుక్తా పరాషార్ 3) నీలమణి ఎన్ రాజు 4) అపరాజితా రాయ్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఆరే కే దుత్తా స్థానంలో 1983 ఐపీఎస్ బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన నీలమణి ఎన్ రాజు ఆ రాష్ట్ర డీజీ ఐజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తద్వారా రాష్ట్ర పోలీసు శాఖలో అత్యున్నత పదవి చేపట్టిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన ఆమె.. 2020 జనవరి వరకు ఈ పదవిలో ఉంటారు.
23. ద కొలిన్‌‌స డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ - 2017గా ఏ పదాన్ని ఎంపిక చేసింది ? 1) FAKE NEWS2) BREXIT3) UNICORN4) INSTA 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: The Collins Dictionary..Fake News అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ - 2017గా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాల్లో తరచు వినిపించిన ఈ పదం తద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2016లో బ్రెగ్జిట్ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు.
24. భారత్‌లో అమెరికా రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) రిచర్డ్ వర్మా 2) నిక్కీ హేలీ3) కెన్నెత్ జస్టర్ 4) నీల్ చటర్జీ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: రిచర్డ్ వర్మ స్థానంలో కెన్నెత్ జస్టర్ ఇటీవల భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. ఈయన ఇంతకముందు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడికి డిప్యుటీ అసిస్టెంట్‌గా వ్యవహరించారు.
25. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ? 1) నవంబర్ 12) నవంబర్ 33) నవంబర్ 54) నవంబర్ 7 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: 2015 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏటా నవంబర్ 5న సునామీ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. సునామీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో నష్టాన్ని తగ్గించాలన్నది ఈ దినోత్సవం నిర్వహించడం వెనక ముఖ్య ఉద్దేశం.
26. ప్రతిష్టాత్మక విష్ణుదాస్ భవే అవార్డు - 2017కు ఎవరు ఎంపికయ్యారు ? 1) మోహన్ జోషి 2) నాజర్ 3) నవాజుద్దీన్ సిద్ధిఖీ4) కై కాల సత్యనారాయణ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు మోహన్ జోషి ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం అఖిల భారత మరాఠీ నాట్య పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. మరాఠీ థియేటర్‌ను స్థాపించిన విష్ణుదాస్ భవే పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. పురస్కారం కింద 25 వేల నగదు బహుమతి అందజేస్తారు.
27. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సిటీ బస్ సర్వీస్ అవార్డుకి ఎంపికై న నగర పాలక సంస్థ ఏది ? 1) హైదరాబాద్ 2) చెన్నై3) బెంగళూరు4) సూరత్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ప్రైవేటు వాహనాలు, ఆటోల్లో ప్రయాణిస్తున్న వారిలో 87 శాతం మందిని సిటీ బస్సుల వైపు ఆకర్షించినందుకుగాను సూరత్ నగర పాలక సంస్థ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఉత్తమ సిటీ బస్ సర్వీస్ అవార్డుకి ఎంపికైంది. మెట్రో రైలు ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసినందుకుగాను కొచి బెస్ట్ అర్బన్ ట్రాన్‌‌సపోర్ట్ ఇనిషియేటివ్ అవార్డుకు ఎంపికైంది.
28. సంప్రితి(SAMPRITI) పేరుతో భారత్ - బంగ్లాదేశ్ సంయుక్తంగా చేపట్టే సైనిక విన్యాసాలను తొలిసారి ఏ సంవత్సరంలో నిర్వహించారు ? 1) 2011 2) 20133) 20154) 2017 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: భారత్ - బంగ్లాదేశ్ ఏడో ఎడిషన్ సంప్రితి సైనిక విన్యాసాలు మేఘలయాలోని ఉమ్రోయ్ కంటోన్మెంట్‌లో నవంబర్ 6 నుంచి నవంబర్ 11 వరకు జరిగాయి. భారత్ నుంచి 20 మంది సైనికులు, బంగ్లాదేశ్ నుంచి 14 మంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. 2011లో తొలిసారి ఈ సైనిక విన్యాసాలను నిర్వహించారు.
29. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) అశోక్ లవస 2) హస్ముఖ్ అధియా3) సంజయ్ మిత్రా4) పీకే సిన్హా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: అశోక్ లవస స్థానంలో హస్ముఖ్ అధియా ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ఇంతకముందు రెవెన్యు శాఖ కార్యదర్శిగా పనిచేశారు. హస్ముఖ్ 1981 ఐఏఎస్ బ్యాచ్ గుజరాత్ క్యాడర్‌కు చెందిన అధికారి.
30. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ ఎవరు ? 1) జెరోమ్ పావెల్ 2) జానెట్ యెలెన్3) బెన్ బెర్నాంకే 4) నీల్ చటర్జీ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా జెరోమ్ పావెల్ పేరుని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఫెడ్ చైర్మన్ జానెట్ యెలెన్ పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసిన తర్వాత జెరోమ్ పావెల్ బాధ్యతలు చేపడతారు.
31. అంతర్జాతీయ వాతావరణ సదస్సు (COP 23) ఇటీవల ఎక్కడ జరిగింది ? 1) భారత్ 2) జర్మనీ3) ఫ్రాన్స్‌4) రష్యా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: జర్మనీలోని బాన్‌లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్ 23) జరిగింది. వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని భారత్ ఈ సమావేశాల్లో మరోసారి స్పష్టం చేసింది. 
  • కాప్ 23 భారత్ థీమ్ : Conserving now, preserving future
32. పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనం ఇటీవల భారత్‌లోని ఏ నగరంలో జరిగింది ? 1) ముంబయి2) హైదరాబాద్3) న్యూఢిల్లీ4) విజయవాడ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఈ సమ్మేళనాన్ని కేంద్ర సైన్స్‌ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రారంభించారు. పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై సమ్మేళనంలో చర్చించారు.
33. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర మండలికి ఎవరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు ? 1) రాష్ట్రపతి2) ప్రధానమంత్రి3) హోంమంత్రి4) రాజ్యసభ చైర్మన్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన అంతరాష్ట్ర మండలిని ఇటీవల పునర్ వ్యవస్థీకరించారు. ఇందులో ఆరుగురు కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. అంతరాష్ట్ర మండలిలో ఉన్న కేంద్ర మంత్రులు - రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, థావర్ చంద్ గెహ్లాట్, నిర్మలా సీతారామన్. మరో 8 మంది కేంద్ర మంత్రులు మండలిలో శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
34. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్రేట్ ఇండియా ఫుడ్ స్ట్రీట్ ఉత్సవంలో అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థ తయారు చేసిన ఏ వంటకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది ? 1) బిర్యానీ 2) మసాలా దోశ3) డోక్లా4) కిచిడీ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఢిల్లీలో జరిగిన ఈ ఉత్సవంలో అక్షయ పాత్ర సంస్థ 918 కేజీలతో కిచిడీని తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ప్రముఖ చెఫ్ సంజీవ్ కుమార్ నేతృత్వంలో 50 మంది బృందం ఈ కిచిడీని తయారు చేసింది.
35. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైలు వంతెనను భారత్‌లోని ఏ నదిపై నిర్మిస్తున్నారు ? 1) చినాబ్ 2) సట్లెజ్ 3) బ్రహ్మపుత్ర4) యుమన 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైలు వంతెన నిర్మాణ పనులను భారత్‌కు చెందిన కొంకణ్ రైల్వే ఇటీవల ప్రారంభించింది. ఉధమ్‌పూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు.
36. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది ? 1) ఒడిశా 2) మహారాష్ట్ర3) ఆంధ్రప్రదేశ్ 4) కర్ణాటక 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: తెలంగాణ ప్రభుత్వం అంతరాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో 2016 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. ఇటీవల ఈ ఎత్తిపోతల పథకానికి అంతరాష్ట్ర అనుమతులు ఇస్తు కేంద్ర జల సంఘం ప్రకటన విడుదల చేసింది.
37. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలన్నది లక్ష్యం ?1) రూ. 5 వేల కోట్లు 2) రూ. 15 వేల కోట్లు3) రూ. 20 వేల కోట్లు4) రూ. 30 వేల కోట్లు 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా - 2017 సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. దీని ద్వారా వచ్చే 5 ఏళ్లలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 25 వేల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పాలసీ కాలపరిమితి ఐదేళ్లు.
38. దేశంలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ? 1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ3) గోవా4) తమిళనాడు 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల్లో అధిక బరువు సమస్యలపై సర్వే నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం అధిక బరువు సమస్య ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయి.
39. వాస్తు శాస్త్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్లిమ్ సెస్ ఆఫ్ వాస్తు అనే గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు ? 1) సోమేశ్ కే శర్మ 2) బీఎన్ రెడ్డి3) ఎక్కా యాదగిరి4) నందిని సిద్ధారెడ్డి 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: బీఎన్ రెడ్డిగా సుపరిచితులైన ప్రముఖ వాస్తు శిల్పి, రచయిత, మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఆయన 1989, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు మిర్యాలగూడ ఎంపీగా గెలిచారు. ఆయన రాసిన పెళ్లి కాని పెళ్లి కథకు ఉత్తమ కథకుడిగా నంది పురస్కారం, రాజీవ్ గాంధీ పురస్కారం లభించాయి.
40. ఓడ రేవుల అభివృద్ధి, కొత్త ఓడ రేవుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పేరు ఏమిటి ? 1) సాగర్ మాల 2) భారత్ మాల3) జల్ సంచార్ 4) ఇండో ఓషన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: సాగర్‌మాల ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకం కింద 2,302 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో 47 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
41. భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన తేలికపాటి గ్లెడ్ బాంబును అభివృద్ధి చేసిన సంస్థ ఏది ? 1) ఇమారత్ పరిశోధన కేంద్రం2) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ3) వాయుసేన4) పై మూడు 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: తేలికపాటి గ్లెడ్ బాంబును ఈ మూడు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ బాంబులను వాయుసేన విమానాల నుంచి జార విడుస్తారు. 70 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంది.
42. జాతీయ అంధుల వన్డే క్రికెట్ టోర్నమెంట్- 2017ను ఏ జట్టు గెలుచుకుంది ? 1) గుజరాత్ 2) ఆంధ్రప్రదేశ్ 3) మహారాష్ట్ర4) కర్ణాటక 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ముంబైలో జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి ఆంధ్రప్రదేశ్ జాతీయ అంధుల వన్డే క్రికెట్ టైటిల్‌ను గెలుచుకుంది. ప్రపంచ కప్‌ను గెలిచిన జట్టు సారథి అజయ్ రెడ్డి ఏపీ జట్టుకి కెప్టెన్‌గా ఉన్నాడు.
43. ఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికి గాను ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించిన భారతీయ మహిళలు ఎవరు ? 1) చందాకొచ్చర్ 2) రోష్ని నాడార్ మల్హోత్రా3) ప్రియాంకా చోప్రా4) పై ముగ్గురు 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికిగాను ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఐసీఐసీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందాకొచ్చర్, బాలీవుడ్ నటి ప్రియంకా చోప్రా, హెచ్‌సీఎల్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రాతో పాటు బైయోకాన్ ఎండీ కిరణ్ మజుందర్ షా, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ శోభన భర్తియా ఉన్నారు. 
  • ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తొలిస్థానంలో, బ్రిటన్ ప్రధాని థెరెసా మే రెండో స్థానంలో, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిండా గేట్స్ మూడో స్థానంలో ఉన్నారు.
44. హిట్ రీఫ్రెష్ పుస్తక రచయిత ఎవరు ?1) సత్య నాదెళ్ల2) బిల్ గేట్స్ 3) సుందర్ పిచాయ్4) రఘురామ్ రాజన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల రాసిన హిట్ రీఫ్రెష్ పుస్తకాన్ని తెలుగు, హీందీ, తమిళ భాషల్లోకి అనువదించారు. హిందీ ఎడిషన్‌ను హార్పర్ కొలిన్స్.. తెలుగు, తమిళం ఎడిషన్లను వెస్ట్‌లాండ్ బుక్స్ పబ్లిష్ చేశాయి.
45. 2018 ఫిబ్రవరిలో భారత్‌లోని ఏ నగరంలో ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ జరగనుంది ? 1) చెన్నై2) బెంగళూరు3) పూణె4) ముంబై 
  • స‌మాధానం: 1
46. ఇంటర్ బ్రాండ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం భారత్‌లో అత్యంత బ్రాండ్ విలువ కలిగిన సంస్థ ఏది ? 1) రిలయన్స్‌2) టాటా 3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా4) మహీంద్రా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఈ సంస్థ నివేదిక ప్రకారం టాటా బ్రాండ్ విలువ రూ.73,944 కోట్లు. రెండో స్థానంలో ఉన్న రిలయన్‌‌స బ్రాండ్ విలువ రూ.38,212 కోట్లు, మూడో స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ బ్రాండ్ విలువ రూ. 36,927 కోట్లుగా ఉంది.
47. ఇటీవల ఏ దేశం అవినీతి ఆరోపణలతో 11 మంది రాజులు, నలుగురు మంత్రులు, 12 మందికిపైగా మాజీ మంత్రులను అరెస్టు చేసింది ? 1) సౌదీ అరేబియా2) నేపాల్ 3) మొనాకో 4) భూటాన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన కొత్తగా అవినీతి వ్యతిరేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించిన ఈ కమిషన్ పలువురు అత్యున్నత స్థాయి వ్యక్తులను సైతం అరెస్టు చేసింది.
48. భారత్‌లో జరిగిన పానసోనిక్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?1) అదితి అశోక్2) జీవ్ మిల్కా సింగ్ 3) శివ్ కపూర్ 4) అనిర్బన్ లహరి 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: భారత స్టార్ గోల్ఫర్ శివ కపూర్ ఢిల్లీలో జరిగిన పానసోనిక్ ఓపెన్ టోర్నీ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది శివకపూర్ కు ఇది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా భారత్‌లో మొదటిది.
49. విదేశాల్లో పనిచేసే భారతీయులకు ఏ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ? 1) ఈఎస్‌ఐ2) గృహ రుణం3) ఉచిత ప్రయాణ సౌకర్యం4) ప్రావిడెంట్ ఫండ్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: విదేశాల్లో పనిచేసే భారతీయులకు ప్రావిడెంట్ ఫండ్‌లో చేరే అవకాశాన్ని కల్పించనున్నట్ల కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ విభాగం వెల్లడించింది. దీని కోసం కేంద్రం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో చేరాలంటే ఆయా దేశాల్లో వారు పొందుతున్న సోషల్ సెక్యురిటీ పథకాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
50. న్యూ పెన్షన్ స్కీమ్(NPS)లో చేరేందుకు గరిష్ట వయోపరిమితిని కేంద్రం ఎంతకు పెంచింది ? 1) 60 ఏళ్లు2) 65 ఏళ్లు3) 68 ఏళ్లు4) 70 ఏళ్లు 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: న్యూ పెన్షన్ స్కీమ్‌లో చేరేందుకు60 ఏళ్లుగా ఉన్నగరిష్ట వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతు పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది.

అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 2
1. కర్ణాటకలో నిర్వహించే సంప్రదాయ పశుక్రీడ పేరు ఏమిటి ? 1) జల్లికట్టు2) కంబాలా3) తబాలా4) సిరిమానోత్సవం 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: కర్ణాటకలో సంప్రదాయ పశు క్రీడ కంబాలాను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కంబాలా క్రీడ నిర్వహణ కోసం పెటా చట్టంలో మార్పులు చేస్తు ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను నిలిపివేయాలంటూ కొందరు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఆర్డినెన్స్‌పై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. దాని చెల్లుబాటు అంశాన్ని మాత్రం పరిశీలిస్తామని ఇటీవల పేర్కొంది.
2. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ వేదిక పేరు ఏమిటి ?1) SHe-Box2) Online Box 3) E-Women4) E-WCD 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు షీ - బాక్స్ (సెక్సువల్ హరాస్‌మెంట్ ఎలక్టాన్రిక్ బాక్సు) అనే ఆన్‌లైన్ వేదికను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. 2017 జూలైలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినుల కోసం ప్రారంభించిన ఈ వేదికను ఇటీవల ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులకు అందుబాటులోకి తెచ్చారు.
3. ఏ రంగానికి సంబంధించి ఇటీవల యునెస్కో చెన్నై నగరాన్ని క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చింది ? 1) మీడియా 2) సినిమా3) సంగీతం4) సాహిత్యం 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: యునెస్కో ఇటీవల 44 దేశాల్లోని 64 నగరాలను కొత్తగా క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చింది. దీంతో ఈ నెట్ వర్క్ జాబితా 72 దేశాలతో 180కి చేరింది. సంగీతం విభాగంలో చెన్నై నగరానికి ఇటీవల ఈ జాబితాలో చోటు దక్కింది. సిటీ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో జైపూర్, సిటీ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ ఫోల్క్ ఆర్ట్ విభాగంలో వారణాసి 2015 డిసెంబర్‌లో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్‌లో చేరాయి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ను 2004లో ప్రారంభించారు.
4. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ - 2017లో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది ? 1) తెలంగాణ 2) హర్యానా3) ఒడిశా4) ఛత్తీస్ గఢ్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: వ్యాపారానికి అనుకూలమైన సంస్కరణలు అమలు చేస్తున్న(business reforms action plan) రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ను ఏటా ప్రకటిస్తున్నారు. 2017 సంవత్సరానికి గాను ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తెలంగాణ 61.83 శాతం స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. 54.03 శాతం స్కోరుతో హర్యానా రెండో స్థానంలో, 45.70 స్కోరుతో ఒడిశా మూడో స్థానంలో, 45.43 స్కోరుతో ఛత్తీస్‌గడ్ నాలుగో స్థానంలో నిలిచాయి.
5. 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ప్లేయర్ ఎవరు ? 1) కిడాంబి శ్రీకాంత్ 2) హెచ్‌ఎస్ ప్రణయ్ 3) సాత్విక్ సాయిరాజ్ 4) సాయి ప్రణీత్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి హెచ్‌ఎస్ ప్రణయ్ టైటిల్ విజేతగా నిలిచాడు.
6. 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?1) పీవీ సింధు 2) రితుపూర్ణ దాస్ 3) సైనా నెహ్వాల్ 4) శ్రీ కృష్ణ ప్రియ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధును ఓడించి సైనా నెహ్వాల్ టైటిల్‌ను గెలుచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాత్విక్ సాయి రాజ్, అశ్విని పొన్నప్ప గెలుచుకున్నారు.
7. 2018 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు అందుబాటులోకి రానున్నాయి ?1) 6502) 2503) 1004) 400 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 2018 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 650 జిల్లాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(IPPB) సేవలను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ బ్యాంకులను 1 లక్ష 55 వేల గ్రామీణ పోస్ట్ ఆఫీసులతో అనుసంధానం చేస్తారు.
8. కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతి సుంకాన్ని ఇటీవల ఎంతకు పెంచింది ? 1) 10 శాతం 2) 20 శాతం 3) 30 శాతం 4) 50 శాతం 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: గోధుమలపై ఉన్న 10 శాతం దిగుమతి సుంకాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (CBEC) ఇటీవల 20 శాతానికి పెంచింది. దేశీయంగా రైతులు పండించిన గోధుమ పంటకు మంచి ధరలు లభించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే బటానీల(peas) పై దిగుమతి సుంకాన్ని 50 శాతానికి పెంచింది.
9. ఆసియాన్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్- 2017లోపసిడి పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ? Current Affairs1) కిమ్ హ్యాంగ్ మి 2) క్రిస్టీ మార్టిన్ 3) మేరీ కోమ్ 4) కవిత గోయట్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఆసియాన్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ లైట్ వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన కిమ్ హ్యాంగ్‌మిని ఓడించి భారత బాక్సర్ మేరీ కోమ్ విజేతగా నిలిచింది. మొత్తంగా ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమెకిది 5వ స్వర్ణం.
10. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో ఉండే ఆలివ్ రైడ్లీ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం భారత్‌లోని ఏ రాష్ట్ర తీర ప్రాంతానికి అధికంగా వస్తాయి ? 1) ఆంధ్రప్రదేశ్ 2) గోవా 3) ఒడిశా 4) తమిళనాడు 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఆలివ్ రైడ్లీ తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం ఒడిశా కేంద్రపారా జిల్లాలోని గహరిమాతా బీచ్‌కి అధిక సంఖ్యలో తరలివస్తాయి. జనవరి, ఫిబ్రవరిలో నెలల్లో అవి ఇక్కడ గుడ్లను పొదుగుతాయి. 2016-17లో 9.75 లక్షల ఆలివ్ రైడ్రీ తాబేళ్లు ఈ ప్రాంతానికి వచ్చాయి. ఈ తాబేళ్ల సంఖ్యరోజు రోజుకీ తగ్గిపోతున్నందున వీటిని IUCN ప్రమాదంలో ఉన్న జంతువుల జాబితాలో చేర్చింది. భారత్‌లో వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంఆలివ్ రైడ్లీ తాబేళ్ల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
11. 19వ ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ - 2017 ఎక్కడ జరిగింది ? 1) టర్కీ 2) చైనా 3) ఇండోనేషియా 4) భారత్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ - 2017 సమావేశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రారంభించారు. ఈ సమావేశాలను మూడేళ్లకోసారి నిర్వహిస్తారు. 2014 సమావేశాలు టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగాయి. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహిస్తారు.
12. భారత్‌లో ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక కార్యక్రమాల్లో ఉపయోగపడేందుకు డిజాస్టర్ మ్యాప్స్‌ను రూపొందించిన సంస్థ ఏది ? 1) ట్విటర్ 2) గూగుల్3) ఫేస్‌బుక్ 4) లింక్డిన్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి ఫేస్‌బుక్ తొలి డిజాస్టర్ రెస్పాన్స్‌ సమ్మిట్‌ను ఇటీవల నిర్వహించింది. ఈ సందర్భంగా భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజాస్టర్ మాప్స్‌ను విడుదల చేసింది.
13. నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ? 1) చిత్రా రామకృష్ణ 2) చందా కొచ్చర్ 3) దేబ్ జానీ ఘోష్ 4) వనితా నారాయణన్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ (NASSCOM - National Association of sotware and services companies) ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్ ఎంపికయ్యారు. 2018 మార్చిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పదవీకాలం అప్పటితో ముగుస్తుంది. దేబ్‌జానీ ఘోష్ ఇంటెల్ దక్షిణాసియా విభాగం ఎండిగా పనిచేశారు.
14. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముఖ్య విధులు ఏంటి ? 1) ప్రవేశ పరీక్షల నిర్వహణ2) బ్యాంకు పరీక్షల నిర్వహణ 3) స్కాలర్ షిప్ లబ్ధ్దిదారుల ఎంపిక4) ఉద్యోగ కల్పన 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ఇటీవల కేంద్ర కేబినెట్ స్వయంప్రతిపత్తితో కూడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇది ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షలని ఈ సంస్థ నిర్వహిస్తుంది. క్రమంగా మిగతా పరీక్షల నిర్వహణను చేపడుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
15. ప్రధానమంత్రి లడఖ్ పునరుత్పాతక ఇంధన కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రంలో తొలి జలవిద్యుత్ ప్రాజెక్టుని ప్రారంభించారు ?1) అరుణాచల్ ప్రదేశ్ 2) సిక్కిం3) ఉత్తరాఖండ్ 4) జమ్ము అండ్ కశ్మీర్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ప్రధానమంత్రి లడఖ్ పునరుత్పాదక ఇంధన కార్యక్రమంలో భాగంగా జమ్ము కశ్మీర్ కార్గిల్ ప్రాంతంలోని బియారస్ డ్రాస్‌లో 1.5 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుని నిర్మించారు. కార్గిల్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ నిర్మించిన ఈ ప్రాజెక్టుని ఇటీవల ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు.
16. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి సురక్షితమైన మంచి నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు వెచ్చిస్తాయి ?1) 70 : 30 2) 50 : 503) 60 : 40 4) 30 : 70 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: 2009లో ప్రారంభించిన జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమాన్ని(NRDWP) 2020 వరకు కొనసాగించాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం రూ.23,050 కోట్లు మంజూరు చేసింది. అలాగే కార్యక్రమాన్ని పునర్ వ్యవస్థీకరించడం ద్వారా పైప్లైన్లతో అన్ని గ్రామాలకు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్యక్రమానికి అయ్యే నిధుల్లో చెరి సగం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
17. ఇటీవల ఏ రాష్ట్రం ఉర్దూని రెండో అధికారిక భాషగా గుర్తించింది ? 1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్ 3) కర్ణాటక4) మహారాష్ట్ర 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: తెలంగాణలో రెండో అధికారిక భాషగా ఉర్దూని గుర్తించేందుకు వీలుగా తెలంగాణ భాషల చట్ట సవరణకు రాష్ట్ర శాసనసభ ఆమోముద్ర వేసింది. వాస్తవానికి 1966లోనే ఉర్దూని రెండో భాషగా ప్రకటించినా అప్పట్లో అది జిల్లా యూనిట్‌గా అమలైంది. ఇప్పుడు చట్ట సవరణతో రాష్ట్ర యూనిట్ గా ఉర్దూ రెండో అధికారిక భాషగా అమలు కానుంది.
18. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం హెపటైటిస్ - సీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా ఓరల్ మెడిసన్ అందిస్తుంది ? 1) పంజాబ్2) పశ్చిమ బెంగాల్ 3) హర్యానా4) మధ్యప్రదేశ్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: హెపటైటిస్ - సీతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఓరల్ మెడిసన్ అందిస్తున్న దేశంలోని తొలి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. నెలకు 28 వేల నుంచి 30 వేల రూపాయల విలువ గల మందులను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తుంది.
19. IBSF వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ - 2017ను గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు ?1) మైక్ రస్సెల్ 2) పంకజ్అద్వాని 3) గీత్ సేథి4) రుపేష్ షా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఐబీఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఖతార్‌లోని దోహలో జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వాని.. ఇంగ్లండ్‌కు చెందిన మైక్ రస్సెల్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. పంకజ్ కు ఇది 17వ ప్రపంచ టైటిల్. దీంతో ఏ క్రీడలోనైనా భారత్ నుంచి అత్యధిక ప్రపంచ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా పంకజ్ అద్వాని నిలిచాడు.
20.ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్(APEC) సమావేశాలు ఇటీవల ఎక్కడ జరిగారుు ? 1) భారత్2) చైనా3) సింగపూర్ 4) వియత్నాం 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: వియత్నాంలోని డా నాంగ్‌లో ఆసియా - పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ సమావేశాలు జరిగాయి. ఈ సమ్మిట్‌ను వియత్నాం నిర్వహించడం ఇది రెండోసారి. 2018 సమావేశాలు పాపువా న్యూ గినియాలో జరుగుతాయి. 
  • APEC 1989లో సింగపూర్ ప్రధాన కార్యాలయంగా ఏర్పడింది. ఇందులో 21 దేశాలకు సభ్యత్వం ఉంది. 2011 నుంచి ఈ కూటమిలో పరిశీలక దేశంగా ఉన్న భారత్.. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది.
21. యునెస్కో డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) ఇరినా బొకోవా 2) ఆడ్రే అజౌలే 3) సౌమ్యా స్వామినాథన్ 4) నిక్కీ హేలీ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఫ్రాన్స్‌ సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి ఆడ్రే అజౌలే యునెస్కో (UNESCO - United Nations Educational, Science and Cultural Organisation) 11వ డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఇరినా బొకోవా స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. 1945 నవంబర్ 16న యునెస్కో ఏర్పాటైంది.
22. ఇటీవల ఏ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరిట వరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ? 1) ఫిలిప్పీన్స్‌ 2) ఇజ్రాయెల్ 3) చైనా 4) జపాన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రీసర్చ్ ఇన్సిస్టిట్యూట్(IRI)లో Shri Narendra Modi Resilient Rice Field Laboratory ని ఏర్పాటు చేశారు. ఆసియాన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మనీలా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ పరిశోధక కేంద్రాన్ని సందర్శించి ప్రారంభించారు. ఇరిని 1960లో ప్రారంభించారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 17 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి.
23. 31వ ఆసియాన్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ? 1) మనీలా2) వియత్నాం3) బ్యాంకాక్ 4) జకార్తా 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 31వ ఆసియాన్ సదస్సు నవంబర్ 13 నుంచి 14 వరకు ఫిలిప్పీన్‌‌స రాజధాని మనీలాలో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇండో - పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని చెప్పారు. ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చర్చల్లో భాగస్వాములుగా ఉన్నాయి. 
  • మనీలా వేదికగా ఇటీవల 12వ తూర్పు ఆసియా సదస్సు, 15వ ఆసియాన్ - భారత్ సదస్సులు కూడా జరిగాయి.
24. దేశంలో న్యాయ సేవల దినోత్సవాన్ని (legal services day) ఎప్పుడు నిర్వహిస్తారు ? 1) నవంబర్ 7 2) నవంబర్ 113) నవంబర్ 94) నవంబర్ 13 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: దేశంలో న్యాయ సేవల దినోత్సవాన్ని సుప్రీంకోర్టు 1995లో ప్రారంభించింది. ఏటా నవంబర్ 9న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. ఆయన 45వ ప్రధాన న్యాయమూర్తి.
25. ఏ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తిరస్కరించింది ?1) అభివృద్ధి బ్యాంకింగ్ 2) స్మాల్ ఫైనాన్స్‌ బ్యాంకింగ్ 3) ఇస్లామిక్ బ్యాంకింగ్ 4) పేమెంట్స్ బ్యాంకింగ్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: భారత్‌లో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తిరస్కరించింది. షరియా నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఇస్లామిక్ బ్యాంకింగ్‌లో రుణాలపై వడ్డీ తీసుకోవడం నిషిద్ధం. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అధ్యక్షతన ఆర్థిక సంస్కరణల కమిటీ దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టాలంటూ 2008లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
26. దేశంలో తొలి గిరిజన ఎంట్రెప్రెన్యుర్‌షిప్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ? 1) అరకు 2) దంతెవాడ3) అసిఫాబాద్ 4) ములుగు 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని దంతెవాడలో దేశంలో తొలి గిరిజన ఎంట్రెప్రెన్యుర్‌షిప్ సదస్సు జరిగింది. నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన 8వ గ్లోబల్ ఎంట్రెప్రెన్యుర్‌షిప్ సదస్సులో భాగంగా ఈ సమ్మిట్‌ను నిర్వహించారు.
27. దేశ రాజధాని న్యూఢిల్లీలో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టనున్న వాహన ఇంధనం ఏది ? 1) బీఎస్ - 32) బీఎస్ - 43) బీఎస్ - 54) బీఎస్ - 6 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలో 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్ - 6 వాహన ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని గతంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అరుుతే.. ఇటీవల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడంతో.. ఈ ఇంధనాన్ని 2018 ఏప్రిల్ 1 నుంచే అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. బీఎస్ - 4 ఇంధనలో సల్ఫర్ పరిమాణం 50 పార్‌‌ట్స పర్ మిలియన్‌గా ఉంటే.. బీఎస్ - 6 ఇంధనంలో ఇది 10 పీపీఎమ్‌గా ఉంటుంది.
28. పర్యావరణ హిత కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే ఏ సంస్థతో కలిసి బయో టైలెట్స్‌ను రూపొందించింది ?1) డీఆర్‌డీవో 2) బీహెచ్‌ఈఎల్3) ఇస్రో4) హెచ్‌ఏఎల్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: భారతీయ రైల్వే, డీఆర్‌డీవోతో కలిసి పర్యావరణ హిత బయో టైయోలెట్స్‌ను రూపొందించింది. రైల్వే శాఖ 2018 డిసెంబర్ నాటికి అన్ని రైళ్లలో ఈ టైలెట్స్‌ను అమర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
29. పూర్తి విద్యుత్ శక్తి ఆధారంగా నడిచే ప్రపంచంలోనే తొలి సరకు రవాణా నౌకను రూపొందించిన దేశం ఏది ? 1) భారత్ 2) చైనా3) జపాన్ 4) రష్యా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: చైనాలోని గుంజౌ షిప్‌యార్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ నౌకను రూపొందించింది. 70.5 మీటర్ల పొడవైన నౌకలో 26 టన్నుల లిథియమ్ బేటరీలను అమర్చారు. రెండు గంటల చార్జింగ్‌తో ఈ నౌక 80 కిలోమీటర్లు ప్రయాణించగలదు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గుని రవాణా చేసేందుకు ఈ నౌకను వినియోగిస్తారు.
30. దేశంలో తొలి భారీ తీర ప్రాంత ఆర్థిక జోన్(Coastal economic zone)ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది ? 1) ఆంధ్రప్రదేశ్ 2) మహారాష్ట్ర3) తమిళనాడు4) ఒడిశా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: మహారాష్ట్రలోని జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్(JNPT) వద్ద కోస్టల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆటోమొబైల్, టెలికం, ఐటీ రంగాలకు చెందిన 45 కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. సాగర్‌మాల ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 14 కోస్టల్ ఎకనామిక్ జోన్‌లను ఏర్పాటు చేయాలని 2016లో కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
31. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరి అధ్యక్షతన రెండవ జాతీయ జ్యూడిషియల్ పే కమిషన్‌ను ఏర్పాటు చేసింది ? 1) జస్టిస్ పి. వెంకట రామారెడ్డి 2) జస్టిస్ ఎన్. వి. రమణ 3) జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ 4) జస్టిస్ దీపక్ మిశ్రా 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసేందుకు.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వెంకటరామారెడ్డి అధ్యక్షతన రెండవ జాతీయ జ్యూడిషయల్ పే కమిషన్(SNJPC)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్. బసంత్ కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులని అందజేస్తుంది.
32. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని ఏ నగరంలో ఇటీవల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ? 1) న్యూఢిల్లీ 2) బెంగళూరు3) కోల్‌కతా4) చెన్నై 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగ మంచు కప్పేయడంతో జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్ 8న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో రైతులు వరి పంటను కోసిన తర్వాత రెల్లు గడ్డిని, వరి మొదళ్లను పాలాల్లో తగలబెడుతున్నారు. దీంతో వెలువడే పొగ ఢిల్లీ మీదుగా వ్యాపిస్తుంది.
33. కేంద్ర ప్రభుత్వంరూ. 25 వేల కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది ? 1) విశాఖపట్నం 2) వారణాసి 3) రాయ్ పూర్ 4) ద్వారకా 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఎగ్జిబిషన్ మార్కెట్లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకలో రూ. 25, 703 కోట్ల రూపాయలతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, నాన్ - పీపీపీ పద్ధతిలో 2025 నాటికి దీని నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
34. జాతీయ హరిత ట్రిబ్యునల్ దేశంలోని ఏ దేవాలయంలోకి రోజుకి 50 వేల మందిని మాత్రమే అనుమతిస్తు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ? 1) వైష్ణోదేవీ ఆలయం 2) బద్రీనాథ్ ఆలయం 3) స్వర్ణ దేవాలయం 4) కేదార్‌నాథ్ ఆలయం 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: కశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు(ఎన్‌జీటీ) జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్‌జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్.
35. ప్రపంచ మహిళల టెన్నిస్ చాంపియన్‌షిప్(ఫెడ్ కప్) - 2017ను ఏ జట్టు గెలుచుకుంది ? 1) అమెరికా2) జర్మనీ3) ఫ్రాన్స్‌ 4) బెలారస్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ఫెడ్‌కప్ ఫైనల్లో అమెరికా 3 - 2 తేడాతో బెలారస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అమెరికా జట్టులో యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్‌, కోకో వాండెవె, షెల్బీ రోజర్స్, రిస్కీ సభ్యులుగా ఉన్నారు. గతంలో 2000 సంవత్సరంలో అమెరికా ఫెడ్‌కప్‌ను గెలుచుకుంది.
36. 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ దేశంలోని ఏ నగరంలో జరిగింది ? 1) బెంగళూరు 2) న్యూఢిల్లీ3) హైదరాబాద్ 4) విశాఖపట్నం 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 14న ప్రారంభించారు. 14 రోజుల పాటు జరిగిన ఈ ఫెరుుర్‌ను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) నిర్వహించింది.
37. బంధన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు ఏ రెండు దేశాల మధ్య నడుస్తుంది ? 1) భారత్ - బంగ్లాదేశ్ 2) భారత్ - పాకిస్తాన్ 3) భారత్ - నేపాల్ 4) భారత్ - చైనా 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: బంధన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు భారత్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఖుల్నా మధ్య నడుస్తుంది. వారానికోసారి నడిచే ఈ రైలుని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా ప్రారంభించారు.
38. ఇటీవల కన్నుమూసిన ఒగ్గు కథా పితామహుడు చుక్క సత్తయ్య ఏ రాష్ట్రానికి చెందినవారు ? 1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ3) తమిళనాడు4) కర్ణాటక 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఒగ్గు కథా పితామహుడు, పల్లె సుద్దులకు జీవం పోసిన చుక్క సత్తయ్య ఇటీవల కన్నుమూశారు. తెలంగాణలోని జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురంలో ఆయన జన్మించారు. సత్తయ్య 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వంనుంచికళాసాగర్ అవార్డు పొందారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ఉత్తమ కళాకారుడి అవార్డు అందుకున్నారు.
39. తెలంగాణ డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) అనురాగ్ శర్మ2) తేజ్ దీప్ కౌర్ మీనన్ 3) మహేందర్ రెడ్డి4) రాజీవ్ త్రివేది 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: తెలంగాణ తొలి డీజీపీగా 2014 నుంచి సేవలందించిన అనురాగ్ శర్మ ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మహేందర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీగా నియమించింది. అలాగే... అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.
40. ఖాదీ ఇండియా జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్ - 2017ను ఎవరు గెలుచుకున్నారు ? 1) దెబాషిస్ దాస్ 2) అరవింద్ చిదంబరం 3) ఎస్ ఎల్ నారాయణన్ 4) లలిత్ బాబు 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక ఖాదీ ఇండియా జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో జరిగిన ఈ టోర్నీలో లలిత్ బాబు 9.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి టైటిల్‌ను గెలుచుకున్నాడు. 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలిచాడు.
41. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల ఏ దేశంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు ? 1) భారత్ 2) యూఏఈ3) ఆస్ట్రేలియా 4) ఇంగ్లండ్‌ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: యూనెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీ(MSDCA) పేరుతో ధోని క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేశాడు. దుబాయ్‌కి చెందిన పసిఫిక్ స్పోర్‌‌ట్స క్లబ్, ఆర్కా స్పోర్‌‌ట్స క్లబ్‌తో కలిసి ధోని ఈ అకాడమీని నెలకొల్పాడు.
42. ఇటీవల జరిగిన బ్రెజిల్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు విజేత ఎవరు ? 1) సెబాస్టియన్ వెటెల్ 2) వాల్తెరి బొటాస్ 3) కిమీ రైకోనెన్ 4) లూయిస్ హామిల్టన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: బ్రెజిల్ గ్రాండ్ ప్రీ రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో మెర్సిడీస్ డ్రైవర్ వాల్తెరీ బొటాస్ నిలిచాడు. ఈ విజయంతో డ్రైవర్స్ చాంపియన్ షిప్‌లో వెటెల్‌కు రెండో స్థానం ఖాయమైంది. మొదటి స్థానంలో లూయిస్ హామిల్టన్ ఉన్నాడు.
43. ఖైదీల ఆరోగ్యం మెరుగుపరచటంతో పాటు వారి శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఏ రాష్ట్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో అవాగహన ఒప్పందం కుదుర్చుకుంది ? 1) కర్ణాటక 2) మధ్యప్రదేశ్3) హర్యానా4) ఆంధ్రప్రదేశ్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఈ ఒప్పందం ప్రకారం హర్యానాలోని జైళ్లలోని ఖైదీల కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను శ్రీ శ్రీ రవిశంకర్ ఏర్పాటు చేశారు.
44. మాంట్రియాల్‌లో జరిగిన దక్షిణ ఆసియాన్ చిత్రోత్సవం-2017లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డు పొందిన భారతీయ షార్ట్ ఫిల్మ్ ఏది ?1) ఇల్యూషన్ 2) ద స్కూల్ బాగ్ 3) కై ట్.. ద మెసెంజర్ 4) చట్నీ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ద స్కూల్ బాగ్ చిత్ర దర్శకుడు ధీరజ్ జిందాల్. మాంట్రియాల్ నగరం కెనడాలో ఉంది.
45. శీతాకాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏ నగరంలో ఐదు నెలల పాటు ఉక్కు కర్మాగారాలను మూసివేస్తున్నారు ? 1) ఢిల్లీ 2) ఇస్లామాబాద్ 3) బీజింగ్ 4) ఢాకా 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: చైనాలోని బీజింగ్‌లో శీతాకాల కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలోని స్టీల్ ప్లాంట్లను మూసివేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. పీఎమ్ 2.5గా ఉన్న కాలుష్య పరిమాణాల్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టింది.
46. ఇజ్రాయెల్ ప్రతిష్టాత్మక పురస్కారం జెనిసెస్ ప్రైజ్ - 2018కి ఎవరు ఎంపికయ్యారు ?1) కెయిరా నెట్లే2) చైర్లైజ్ థెరాన్3) ఎమ్మా స్టోన్ 4) నటాలియా పోర్ట్ మాన్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: నటి నటాలియా పోర్ట్ మాన్ 2018 జెనెసిస్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. అవార్డు కింద ఆమెకు 1 మిలియన్ డాలర్లు అందజేస్తారు.
47. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారుల డిస్‌ప్లే నేమ్ పరిమితిని ఎన్ని అక్షరాలకు పెంచింది ? 1) 302) 503) 204) 40 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: 20 అక్షరాలుగా ఉన్న డిస్‌ప్లే నేమ్ పరిమితిని ట్వీటర్ ఇటీవల 50 అక్షరాలకు పెంచింది. పొడవైన పేర్లు కలిగిన వారు తమ పూర్తి పేరుని డిస్‌ప్లే నేమ్‌గా పెట్టుకునేందుకు వీలుగా ట్వీటర్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్వీట్‌లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ ఇటీవల 140 నుంచి 280కి పెంచింది.
48. 2017 నవంబర్ 1 నుంచి అంతర్జాలం ద్వారా చేసే RTGS, NEFT లావాదేవీలకు ఎలాంటి చార్జీలు విధించబోమని ఏ బ్యాంకు ప్రకటించింది ? 1) YES Bank2) ICICI Bank3) Axis Bank4) HDFC Bank 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఆన్లైన్ లావాదేవీలపై విధించే చార్జీలను HDFC బ్యాంక్ ఇటీవల సవరించింది. సేవింగ్స్‌, సేలరీ ఖాతాదారులు నిర్వహించే ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలకు నవంబర్ 1 నుంచి ఇకపై ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. దేశంలో డిజిటల్ ఎకనామీని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
49. కింది వాటిలో ఏ సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్య దేశంగా భారత్ ఇటీవల తిరిగి ఎన్నికై ంది ? 1) IFAO 2) WIPO3) UNIDO4) UNESCO 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఇటీవల జరిగిన 39వ యునెస్కో సాధారణ సభలో భారత్‌కు సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో తిరిగి స్థానం కల్పించారు. యునెస్కో కేంద్ర కార్యాలయం పారిస్‌లో ఉంది.
50. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్టాన్రిక్ హార్డ్‌వేర్ రంగానికి సంబంధించి ఇంటెల్, యూఎస్‌టీ గ్లోబల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ? 1) రాజస్తాన్ 2) తెలంగాణ3) కేరళ4) ఆంధ్రప్రదేశ్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: రాష్ట్రాన్ని ఎలక్టాన్రిక్ హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా మార్చేందుకు కేరళ ప్రభుత్వం ఇంటెల్, యూఎస్‌టీ గ్లోబల్ సంస్థతోఅవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కేరళ ఎలక్టాన్రిక్స్ అండ్ హార్డ్‌వేర్ మిషన్‌ను ఏర్పాటు చేసింది.