AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 1 January 2018

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 28

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅డిసెంబర్ 28*🌅🏞సంఘటనలు*🏞


1612 : మొట్టమొదట నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో


1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.


1921: మొదటిసారి

వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.

*🌻🌻జననాలు*🌻🌻


1856: అమెరికా - ఉడ్రోవిల్సన్, మాజీ అధ్యక్షుడు.


1859 : మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబర్ 28) ). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).


1875: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, కవీంద్రుడు ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి


1932: ఇండియా - ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త.


1932: నేరెళ్ళ వేణుమాధవ్, ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు. వీరికి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు


1937: ఇండియా - రతన్ టాటా, పారిశ్రామికవేత్త.


1940: వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు


1945: నేపాల్ - బీరేంద్ర, రాజు.


1952: ఇండియా - అరుణ్ జైట్లీ, రాజకీయవేత్త.


1955: చైనా - లియూ క్సియాబొ, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత.


*🤘 నేటి సుభాషితం🤘*

*యధార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు.*

👁💧👁

*❣కంటిలో నుండి వచ్చే కన్నీరు అందరికీ కనిపిస్తుంది గుండె లో ఎంత బాధ ఉందొ ఎవరికి తెలియదు.. అందుకే కావాల్సిన వారి దగ్గర ఏడుస్తారు.. అందరి ముందు ఆ బాధను దాచేస్తారు.❣*

🔲 సూక్తులు

🔺నిన్ను గురించి నీవు తెలుసుకోవడం ధ్యానంలో ఒక భాగం.

🔺నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.

🔺నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.

🔺నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.

🔺నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు.

*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  28, డిసెంబర్ 2017*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 52 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 12 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 34 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 34 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : తైతిల
వర్జ్యం :
(ఈరోజు రాత్రి 8 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 16 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(నిన్న రాత్రి 11 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 45 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 5 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 12 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 10 గం॥ 25 ని॥ నుంచి ఉదయం 11 గం॥ 9 ని॥ వరకు)(మద్యాహ్నం 2 గం॥ 52 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 40 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 9 గం॥ 30 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 53 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 12 గం॥ 16 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 39 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మేషము

*💎 నేటి ఆణిముత్యం 💎*

ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబు దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నబడెడు మాడ్కిదిరుగు మెలమి కుమారా! 

*భావము :*

జీవితంలో కలిమి ఉండవచ్చు, కష్టమూ ఉండవచ్చు. కానీ నీ పరిస్థితి ఏమిటో ఇతరులకు తెలియనివ్వకు. ఆ రహస్యాన్ని నీలోనే ఉంచుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల కీర్తిప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా నడుచుకో.

*👬 నేటి చిన్నారి గీతం 👬*

*వద్దూ వద్దూ వద్దూ..*

వద్దూ వద్దూ వద్దూ 
వద్దు వద్దని అనవద్దు 
ఉదయం లేవను అనవద్దు 
నిద్దుర పోతా అనవద్దు...
వద్దూ వద్దూ వద్దూ 
వద్దూ వద్దని అనవద్దు 
ముఖం కడగనని అనవద్దు 
స్నానం వద్దని అనవద్దు...
వద్దూ వద్దూ వద్దూ 
వద్దు వద్దని అనవద్దు 
అన్నం తిననని అనవద్దు 
పాలు తాగనని అనవద్దు..
వద్దూ వద్దూ వద్దూ 
వద్దు వద్దని అనవద్దు
బడికి పోనని అనవద్దు 
పాఠం వద్దని అనవద్దు...
ముద్దూ ముద్దూ ముద్దూ 
ఎవ్వరి కైనా ముద్దు 
మంచి చదువులే ముద్దు 
మంచి అలవాట్లు ముద్దు...

*✍🏼 నేటి కథ ✍🏼*

*బ్రహ్మరాక్షసుడి సంగీతం*

పేదబ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీయాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలాదూరం నడిచీ నడిచీ అలసిపోయిన అతనికి, చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని, వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకొనేందుకని అతను ఓ పొద మాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి 'వద్దు' అన్నది. 

అతను గబుక్కున లేచి అది 'ఎవరి గొంతు' అని అన్ని వైపులా చూశాడు; కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకుగానూ అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్లీ అదే స్వరం వినబడింది: 'వద్దు' అని! అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా. 

అయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకుల మూటను విప్పినప్పుడు, మళ్లీ ఆ గొంతు "వద్దు" అన్నది. అతను దాన్నీ పట్టించుకోకుండా, తను తినగలిగినన్నింటినీ తిని, మిగిలిన వాటిని తిరిగి మూటగట్టుకొని, ముందుకు బయలుదేరాడు. అంతలో అదే స్వరం "వద్దు,వెళ్లకు" అన్నది. 

బ్రాహ్మణుడు ఆగి, నలుదిక్కులా చూశాడు. ఎవ్వరూ కనబడలేదు. అందుకని అతను "ఎవరునువ్వు? ఎందుకిలా శబ్దం చేస్తున్నావు?" అని అరిచాడు. 

"పైకి చూడు, నేనిక్కడున్నాను" అన్నది గొంతు. అతను పైకి చూసేసరికి, ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఒక రాక్షసుడు కనబడ్డాడు. 

ఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. "గత జన్మలో నేనూ నీలాగానే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి, గాన కళలో ఆరితేరాను. నా జీవితకాలమంతా నేను సంగీత రహస్యాల్ని సేకరించటంలోనే వెచ్చించాను తప్పిస్తే, వాటిని ఎవ్వరితోటీ పంచుకోలేదు; ఏ ఒక్కరికీ నేర్పలేదు. అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడినవ్వాల్సి వచ్చింది. భగవంతుడు నాకిచ్చిన శిక్ష ఇది. నువ్వలా వెనక్కి తిరిగిచూస్తే అక్కడో చిన్న గుడి కనబడుతుంది. ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తూంటాడు- రోజంతా! అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవ్వరూ వాయించలేరు- అన్నీ అపశృతులే. ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను - నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది. నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటీ నాలోంచి బాణం మాదిరి దూసుకుపోతున్నది. ఆ శబ్దాలకు నా శరీరం తూట్లుపడి జల్లెడ అయిపోయినంత బాధ కలుగుతున్నది. ఒళ్లంతా నొప్పులే నొప్పులు. ఇదిగనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏవేవో చేయటం తథ్యం. రాక్షసుడిని గనుక నన్నునేను చంపుకోలేను కూడాను. మరి ఈ చెట్టును విడిచి పోనూ పోలేను - నన్ను ఈ చెట్టుకు కట్టేశారు. కనుక ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా మంచివాడివి. నీకు పుణ్యం ఉంటుంది. నామీద దయ తలుచు. తీసుకెళ్లి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు. అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను. అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి. ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై, ఇప్పుడు నాలాగా రాక్షసుడైనవాడిని ఉద్దరించినందుకుగాను, నీకు బహు పుణ్యం లభిస్తుంది." అన్నాడు. 

పేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కానీ పేదరికం అతన్ని రాటుదేల్చింది. అతనన్నాడు -"సరే, నేను నీ కోరిక తీరుస్తాను. నిన్ను వేరే తోటకు చేరుస్తాను - అయితే దానివల్ల నాకేం ప్రయోజనం? నువ్వు బదులుగా నాకోసం ఏం చేస్తావు?" అని. 

"నీ ఋణం ఉంచుకోను. నీకు మేలు చేస్తాను. నాకీ ఒక్క సాయం చెయ్యి చాలు" అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మరాక్షసుడు. 

'సరే'నని బ్రాహ్మణుడు వాడిని భుజాలమీద ఎక్కించుకొని, గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు. 

బ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి. సంతోషం వేసింది. దానితోపాటు, పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగివచ్చాయి వాడికి. వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి, అన్నాడు -"నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయి - ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు. ఇప్పుడు నేను స్వతంత్రుడిని- కనుక నేను పోయి, మైసూరు రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను. 

నన్ను వదిలించటం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు. కానీ నేను మాత్రం వాళ్లెవరికీ లొంగను. నువ్వు వచ్చాకగానీ నేను ఆమెను వదలను. తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకుగాను సంతోషించి మహారాజుగారు, జీవితాంతం నిల్చేంత సంపదను నీపైన కురిపిస్తారు. అయితే ఒక్క షరతు - ఆ తర్వాత నేను వెళ్లి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు, నువ్వు ఇక ఎన్నడూ అడ్డురాకూడదు. దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను మరి, ఆలోచించుకో" అని. 

బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ఆపైన అతను కాశీకి పోయి, గంగలో స్నానం చేసి, వెనక్కి తిరిగివస్తూండగా బ్రహ్మరాక్షసుడి మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో అతను అష్టకష్టాలూ పడి, చివరికి మైసూరు రాజ్యం చేరుకున్నాడు. అక్కడొక పూటకూళ్లమ్మ ఇంట్లో బసచేసి ఆ రాజ్య విశేషాలేంటని అడిగితే ఆమె అన్నది - "ఏం చెప్పను. మా యువరాణి చక్కని చుక్క. ఆమెనేదో భూతం ఆవహించింది, దాన్ని ఎవ్వరూ వదిలించలేకపోయారు. తన కుమార్తెను భూతం బారి నుండి కాపాడినవారికి నిలువెత్తు ధనం ఇస్తానని రాజుగారు చాటించారుకూడాను" అని. 

ఈ సంగతి వినగానే 'మంచిరోజులొచ్చాయని' బ్రాహ్మణుడికి అర్థమైపోయింది. అతను వెంటనే రాజభవనానికి వెళ్లి, "ఆ భూతాన్ని వదిలించే శక్తి తనకున్నదని లోనికి కబురంపాడు. ఈ పేదవాడికి అంతటి శక్తి ఉంటుందని ఎవ్వరూ నమ్మలేదు; కానీ 'ప్రయత్నిస్తే తప్పేంట'ని రాజుగారు బ్రాహ్మణుడికి ప్రవేశం కల్పించారు. 

అంత:పురాన్ని చేరుకోగానే, బ్రాహ్మణుడు తననక్కడ యువరాణితో వదిలి అందరినీ వెళ్లిపొమ్మన్నాడు. అందరూ గది బయట నిలబడ్డాక, బ్రాహ్మణుడు గది తలుపులు మూశాడు. ఆ వెంటనే బ్రహ్మరాక్షసుడు యువరాణి ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు: "నీకోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం ఈ క్షణమే ఈమెను వదిలి వెళ్లిపోతాను. కానీ- నేను నీకు గతంలో చెప్పిన సంగతిని గుర్తుంచుకో- నేను ఇప్పుడు వెళ్లే చోటుకుగనక -తప్పిజారైనా సరే- వచ్చావంటే మాత్రం, నేను నిన్ను తినకుండా వదిలిపెట్టను." అన్నాడు. ఆపైన, పెద్దగా శబ్దం చేస్తూ బ్రహ్మరాక్షసుడు యువరాణి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. యువరాణిగారు మామూలుగా అయిపోవటం చూసిన పురజనులంతా ఎంతో సంతోషించారు. రాజుగారు బ్రాహ్మణుడికి అనేక బహుమానాలు - బంగారం, భూములు అనేకమిచ్చి గౌరవించారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఒక చక్కని యువతిని పెండ్లాడి, పట్టణంలోనే ఇల్లు కట్టుకొని, పిల్లాపాపలతో హాయిగా జీవించసాగాడు. 

ఇక మైసూరు యువరాణిని వదిలిన బ్రహ్మరాక్షసుడు, నేరుగా కేరళ రాజ్యానికి పోయి, ట్రావన్ కూర్ యువరాణిని ఆవహించాడు. ట్రావన్ కూర్ రాజుగారు కూడా, పాపం తన బిడ్డను భూతం బారినుండి కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ ఏదీ ఫలించలేదు. ఒక రోజున ఆయనకెవరో చెప్పారు - మైసూరు యువరాణిని సరిగ్గా ఇదేలాంటి భూతం పూనినప్పుడు, ఒక బ్రాహ్మణుడు ఆమెను చిటికెలో ఎలా స్వస్థపరిచాడో. వెంటనే ఆయన తన మిత్రుడైన మైసూరు రాజుకు ఒక ఉత్తరం రాశారు- తన బిడ్డనుకూడా ఆ భూతం బారినుండి తప్పిస్తే బ్రాహ్మణుడిని తగిన విధంగా సన్మానిస్తామని. 

మైసూరురాజుగారు బ్రాహ్మణుడిని పిలిపించి, ట్రావన్ కూర్ రాజుగారి ఆస్థానానికి వెళ్లి, ఆ యువరాణికి సాయం చేసి రమ్మని అభ్యర్థించాడు. ఆ బ్రహ్మరాక్షసుడిని మరోసారి ఎదుర్కోవటం అనగానే బ్రాహ్మణుడికి ఒళ్లు చల్లబడింది. వణుకు మొదలైంది. అయినప్పటికీ, రాజుగారి ఆజ్ఞాయె! అతిక్రమించే వీలు లేదాయె! చాలాసేపు ఆలోచించీ, ఆలోచించీ అతను ఒక నిర్ణయానికి వచ్చాడు: తనకేమన్నా అయితే తన భార్యా బిడ్డల పోషణ సరిగా జరిగేటట్లు ఏర్పాట్లు చేసి, తను ట్రావన్ కూర్ కు బయలుదేరివెళ్లాడు. అయితే ఒకసారి అక్కడకు చేరుకున్నాక కూడా, బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కొనేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తనకు ఆరోగ్యం బాగా లేనట్లు నటిస్తూ అతను మూర్ఛపోయాడు. అలా దాదాపు రెండు నెలలపాటు తన గదిలోంచి కాలు బయట పెట్టలేదు. అయినా రెండు నెలల తర్వాత ఇక దాటవేసేందుకు వీలులేకపోయింది. యువరాణిని పీడిస్తున్న రాక్షసుడిని తరిమివేయాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి! 

ఇక అతను ప్రాణాలు అరచేతబట్టుకొని, యువరాణీవారిని చూడటం కోసం బయలుదేరాడు. తనను ఈ గండం నుండి తప్పించమని భగవంతుడిని వెయ్యి రకాలుగా ప్రార్థిస్తూ, అతను రాజుగారి ప్రాసాదానికి చేరుకుని, అక్కడినుండి అంత:పురంలో యువరాణీవారి మందిరంలో ప్రవేశపెట్టబడ్డాడు. అతణ్ని చూసిన మరుక్షణం బ్రహ్మరాక్షసుడు గర్జించాడు - "నిన్ను చంపేస్తాను! ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాను. నీకు ఇక్కడికి రావాల్సిన పనేముంది? నిన్ను వదిలేది లేదు" అని అరుస్తూ వాడు ఒక పెద్ద ఇనుప రోకలిని చేతబట్టుకొని బ్రాహ్మణుని మీదకు ఉరికాడు. 

బ్రాహ్మణుడి పైప్రాణాలు పైనే పోతున్నాయి. అయినా ప్రాణాలకు తెగించి వచ్చి ఉన్నాడు గనుక ఆ తెగింపు నుండి వచ్చిన ధైర్యంతో నిటారుగా నిలబడి, లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకొని గట్టిగా అన్నాడు- "చూడు, నువ్వు నేను చెప్పిన మాట విని మర్యాదగా ఈ యువరాణిని విడిచిపెట్టి వెళ్తావా?, లేకపోతే ఆ గుడిలోని సంగీతకారుడిని ఓసారి పిలిపించమంటావా? అతనైతే ఈ అంత:పురంలో కూర్చొని రాత్రింబవళ్లూ చక్కగా తనశైలిలో సంగీత సాధన చేస్తాడు మరి, నీకు అభ్యంతరం లేకపోతే!" అని. 

'సంగీతకారుడు' అనే మాట వినగానే ఆ బ్రహ్మరాక్షసుడికి ఆ సంగీతమూ, దాని కారణంగా తను పడ్డ బాధా ఒకేసారి గుర్తుకొచ్చాయి. ఆ బాధను తలుచుకొని వాడు భయంతో వణికిపోయాడు- "వద్దు! వద్దు! అతన్ని మాత్రం పిలువకు! నేను వెళ్లిపోతున్నాను" అని అరుస్తూ వాడు యువరాణిని వదిలిపెట్టి ఒక్కసారిగా మాయమయిపోయాడు. 

అటుపైన ట్రావన్ కూర్ యువరాణి ఆరోగ్యం త్వరితంగా కుదురుకున్నది. రాజుగారికి బ్రాహ్మణుడు చేసిన సహాయం ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయన బ్రాహ్మణుడికి ఎన్ని బంగారు నాణేలు ఇచ్చాడంటే, ఆ మొత్తాన్నీ బండ్లల్లో నింపుకొని, మైసూరు చేరుకొన్న బ్రాహ్మణుడు, తన భార్యాపిల్లలతో కలిసి ఇంకా ఆ డబ్బును లెక్కపెడుతూనే ఉన్నాడు! 

*📖 మన ఇతిహాసాలు 📓*

*పారిజాతాపహరణంలో సత్యభామ*

చం. అతుల మహానుభావ మని యవ్విరిఁ దానొక పెద్ద సేసి య
     చ్యుతునకు నిచ్చకంబొదవ సూడిద నిచ్చిన నిచ్చెఁగాక తా
     నతఁడు ప్రియంబు గల్గునెడ కర్పణ సేసినఁ జేసెఁగాక యా
     మతకరి వేలుపుం దపసి మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటన్

పై పద్యం నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణం లోనిది. ఈయనకు ముక్కు తిమ్మన అనే మరో ముద్దుపేరు కూడా ఉంది. ముక్కును వర్ణిస్తూ ఆయన వ్రాసిన ఒక పద్యానికి వచ్చిన ప్రసిద్ధి వల్ల ఆయన్ను ముక్కు తిమ్మన అంటారని జనశ్రుతి. కానీ, ముక్కును వర్ణించిన ఆ ప్రసిద్ధ పద్యం పారిజాతాపహరణంలో లేదు. రామరాజ భూషణుడు వ్రాసిన వసుచరిత్రలో ఉంది. కానీ లోకంలో ప్రతీతి మాత్రం ఆ పద్యం తిమ్మకవే వ్రాశాడని. జనంలో ఉండే ఇలాంటి కథలను బట్టి నిజానిజాలు నిర్ణయించడం వీలూ కాదు, న్యాయమూ కాదు.

తిమ్మకవి గూడా కృష్ణదేవరాయల ఆస్థాన కవే. ఆయన సభలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. రాయలవారి చిన్న భార్య అయిన చిన్నాదేవితో పాటు ఆమె పుట్టింటి రాజ్యం నుంచి అరణంగా వచ్చాడంటారు. ఒకరోజు రాత్రి నిద్రపోతుండగా చిన్నాదేవి కాలు రాయలవారి తలకు తగిలిందనీ, దానికి రాజు కోపించి ఆమె దగ్గరకు రావడం మానుకున్నాడనీ, ఆ బాధను ఆమె తిమ్మకవికి చెప్పుకున్నదనీ, భార్య కాలు భర్తకు తగలడం తప్పేమీ కాదని రాయలవారికి అన్యాపదేశంగా చెప్పడం కోసం కృష్ణా-సత్యభామలకు అటువంటి ఘట్టం ఒకటి కల్పించి పారిజాతాపహరణ కావ్యం వ్రాసి సున్నితంగా సరసంగా రాయలవారికి బోధించాడనీ, ఆ సూచనను సహజ సహృదయమూర్తి ఐన రాయలు గ్రహించి తదాది భార్యతో సఖ్యంగా వున్నాడనీ – ఒక ఐతిహ్యం జనంలో ప్రచలితంగా వుంది. పైన మనం చెప్పుకున్నట్లు జనబాహుళ్యం లోని వదంతుల నిజానిజాలు నిర్ధారించటం కష్టమే. ఏమైనా కానీ ఒక చక్కని ప్రబంధ కావ్యం తెలుగు ప్రజలకు దక్కిందనేది మాత్రం నిజం.

‘ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు’ అనేది సాహిత్యప్రియుల వాడుక. నిజమే. పారిజాతాపహరణం లోని ప్రతి పద్యమూ ఆ విషయాన్ని వేనోళ్ళ చాటుతుంది. ఎంత చక్కని కథాప్రణాలిక వేసుకున్నాడో అంత అందంగా ఆ కథను కావ్యంగా మలిచాడు తిమ్మన. కావ్యంలో ఎన్ని ఆశ్వాసాలున్నాయో గిరి గీసినట్లు అన్ని రంగాలుగా విభజించి వొక మంచి నాటకాన్ని పద్యాల్లో రూపొందించాడనుకోవచ్చు. అయితే కొందరు విమర్శకుల ఆరోపణ కూడా ఒకటుంది. ప్రధాన కథ ప్రథమాశ్వాసం లోనే అయిపోయింది, మిగిలిన ఐదు ఆశ్వాసాలూ అనవసరంగా సాగదీశాడు అని. కానీ అది పూర్తి నిజం కాదు. ప్రథమాశ్వాసం తరువాయి భాగాల్లో కవిత్వం గానీ, పద్యాలు గానీ తక్కువ స్థాయివేమీ కావు.

తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే (ఇమేజ్) వేరు. ఏ యితర భారతీయ భాషా సాహిత్యాలలోనూ సత్యభామకు ఈ ఇమేజ్ లేదని తెలిసిన వారంటారు. భర్తను అపరిమితంగా ప్రేమిస్తూ, భర్త నుండి అంతే విపరీతమైన ప్రేమను పొందుతూ, అతనితో చనవులు నెరపుతూ, అవసరమైనప్పుడు అలుగుతూ, కోర్కెలు తీర్చుకుంటూ, అప్పుడప్పుడూ నిష్ఠురాలాడుతూ, భర్త తన కొక్కతికే అనురక్తుడుగా వుండాలని కోరుకుంటూ, అలానే వున్నాడని నమ్మే ఒక ప్రణయమూర్తి, ఒక గడుసు తెలుగు ఇల్లాలు – తిమ్మన గారి సత్యభామ.

కృష్ణుడు ఒకరోజు రుక్మిణి ఇంట్లో ఉండగా నారదుడు వచ్చి ఒక పారిజాత పుష్పం ఇచ్చి నీకు ఇష్టమయిన వారికి ఇచ్చుకోమని చెపుతాడు. తాను అప్పుడు రుక్మిణితో వున్నాడు కాబట్టి కృష్ణుడు ఆ పూవుని రుక్మిణికే ఇస్తాడు. నారదుడు సత్యభామను గురించి, అప్పుడక్కడే ఉన్న సత్యభామ చెలికత్తె వినేట్లుగా కొన్ని ఎకసక్కెపు మాటలంటాడు. చెలికత్తె పోయి ఈ సంగతంతా సత్యభామకు చెపుతుంది. ఇంకేముంది! ‘వ్రేటు వడ్డ ఉరగాంగన యుం బలె, నేయి వోయ భగ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ’ లేస్తుంది సత్యభామ. ఆ సమయంలో తన కోపాన్నీ, అక్కసునూ వ్యక్తంచేస్తూ తన చెలికత్తెతో మాట్లాడే సందర్భం లోనిది పై పద్యం. నిజంగానే నారదుడు అలా మాట్లాడాడా అని అడుగుతుంది. అవన్నీ విని ఊరికే వున్నాడా కృష్ణుడు అని అంటుంది. రుక్మిణి ఏమేం మాట్లాడింది అని ఆరా తీస్తుంది.

అసలు తానే కృష్ణుని మహిషులందర్లోకీ ఆయనకు అత్యంత ప్రియమైన దానినని సత్యభామ నమ్మిక. ఒక మంచి వస్తువు ఆయన చేతికి వస్తే దాన్ని తనకే ఇస్తాడని ఆమెకు ప్రగాఢ విశ్వాసం. అలాంటిది, పారిజాతాన్ని తనకీయకుండా తన సవతి కివ్వడం భరించలేక పోతుంది. నారదుడు తన గురించి ఎకసక్కెపు మాటలు మాట్లాడడం – అదీ రుక్మిణి ఎదుట – ఊహించలేని అవమానంగా భావిస్తుంది. పైగా ఈ ప్రహసనమంతా కృష్ణుని ఎదుట జరగడమూ, ఆయన ఔనూ కాదూ అనకుండా ఉండడమూ, పుండు మీద కారం జల్లినట్లయింది. ఇదీ నేపథ్యం పై పద్యానికి.

ఈ పద్యంలో మూడు పనులు స్పష్టంగా ఎత్తిచూపుతుంది సత్య – నారదుడు పూవుని కృష్ణుని కీయడం, ఆయన దానిని రుక్మిణి కీయడం, నారదుడు తనను గేలి చేస్తూ మాట్లాడడం. ఈ మూడూ సత్యకు హృదయ శల్యాలే. నారదుడు పువ్వును కృష్ణుని కివ్వడంలో తప్పేముంది. కానీ కృష్ణుడు దాన్ని రుక్మిణి కిచ్చేసరికి, అసలు పువ్వును తేవడమే తప్పై పోయింది అభిమానవతీ, కోపనా అయిన సత్యకు. ఈ పద్యంలో సత్యభామ మనస్థితి చాలా స్వభావసిద్ధంగా చిత్రితమైంది. నిజానికి పారిజాతం ‘అతుల మహాను భావ’మైనదే. అది అంత గొప్పది కాబట్టే నారదుడు దాన్ని పెద్ద జేసి వర్ణించాడు. మామూలు పువ్వైతే ఎవరిచ్చినా, ఎవరికిచ్చినా ఎవరూ పట్టించుకోవల్సిన పనే లేదు. ‘అతుల మహానుభావమని యవ్విరి తానొక పెద్ద జేసి అచ్యుతునకు ఇచ్చకం బొడవ సూడిద ఇచ్చిన ఇచ్చెగాక’ అని సత్య అనడం అందని ద్రాక్షపండ్ల సామెతను జ్ఙాపకం చేయడమే గాక, ఒక రకంగా ఆ పూవు గొప్పదనాన్ని అంగీకరించి దానిని తనకు కాకుండా తన సవతి కీయడం పట్ల బాధ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. పైగా దాన్ని ‘అచ్యుతునకు ఇచ్చకం బొదవ సూడిద’ ఇచ్చాడట. నారదుణ్ణి ఇచ్చకాలాడే వాడిగా తేల్చి పారేసింది. ‘తానతడు ప్రియంబు గల్గు నెడ కర్పణ జేసిన జేసె గాక’ అనడంలో రుక్మిణి ఎడనే కృష్ణునికి ప్రియమున్నది, తన ఎడ లేదు అని కొత్తగా తెలుసుకున్న నిజం వల్ల కలిగే బాధను అనుభవిస్తూనే, కడుపుడుకుతో ‘తన కిష్టమైన వాళ్ళకు ఇచ్చుకుంటే ఇచ్చుకోనీ’ అంటున్నది. ఇవ్వడం కూడా కాదు ‘అర్పణ’ చేయడం అట.

నారదుడు ఆ మాములు పువ్వును ఓ బ్రహ్మాండమైనదిగా వర్ణించి కృష్ణుడి మెప్పు కోసం ఇస్తే ఇచ్చుకోనీ, దాన్ని కృష్ణుడు తనకు నచ్చిన వాళ్ళకు సమర్పణ చేస్తే చేసుకోనీ! కానీ, మాయావి ఐన ఆ దేవ ఋషి, ఆ మతకరి వేలుపుం దపసి (మతకము + అరి మోసకారి) మమ్మల్ని గూర్చి మాట్లాడ్డమెందుకు అక్కడ? ఇదీ ఆమె బాధ.

ఎంత లెక్క లేని తనమో చూడండి, నారదుడన్నా, రుక్మిణన్నా, తనను చిన్న పరచిన కృష్ణుడన్నా. ఈ పద్యంలో ఆ ముగ్గురి మీదా ఎంత తిరస్కారం ప్రకటించిందో గమనించండి. నారదుడు ఇచ్చకాల మారి, మోసకారి. కృష్ణుడి మెప్పు కోసం ఓ మాములు పువ్వును గొప్పజేసి పొగిడిన భట్రాజు. ఇక రుక్మిణి పేరు ఎత్తడం గూడా ఇష్టం లేదు ఆమెకు. ‘తానతడు ప్రియంబు గల్గు నెడకు’ అని రుక్మిణి ఊసు కూడా పరిహరిస్తూ మాట్లాడడం, ఆమెకు రుక్మిణిపై గల చులకన భావం చెప్పకనే చెబుతున్నది. ఇక కృష్ణుణ్ణి తిరస్కారంగా ‘అతడు’ అని సూచించింది, పువ్వుని ‘అర్పణ’ చేశాడు అంది. వాళ్ళపై తిరస్కారమే గాదు, తన అతిశయోక్తి ఎలా ప్రకటించిందో చూడండి. ‘మమ్ము దలంపగ నేల?’ అట. కృష్ణుడేమో ‘అతడు’ తానేమో ‘మమ్ము’ !

ఇలా సత్యభామ మనసు లోకి దూరి, ఆమె మనోభావాల ఛాయాచిత్రంగా పద్యాన్ని చెక్కాడు తిమ్మకవి. సత్య అతిశయమూ, కోపమూ, బాధా, అక్కసూ, తిరస్కారా లన్నింటినీ అద్భుతంగా బొమ్మ కట్టించాడు. పారిజాతాపహరణం లోని ప్రతీ పద్య సమూహమంతా అమృత బిందు సందోహం. అందులో నాకు నచ్చిన చాలా పద్యాల్లో ఒకటైన ఈ పద్యం ప్రథమాశ్వాసం లోనిది.

*✅ తెలుసుకుందాం ✅*

*⭕మన శరీరంలో కాళ్లకు, చేతులకు మాత్రమే తిమ్మిర్లు ఏర్పడుతాయెందుకు?*

✳మన శరీరంలో పరిసరాలతో సంధానించుకుని పనికి ఉపక్రమించేవి ప్రధానంగా కాళ్లు, చేతులే. మన ఉదరభాగం, వీపు, ముఖం, వక్షస్థలం, మెడ తదితర భాగాలు పరిసరాల ఒత్తిడి (pressure)కి కానీ, తాకిడి (impact)కి కానీ లోను కావు. కానీ మనం ప్రతి పనిలోను చేతుల్ని వాడకుండా ఉండలేము. కూర్చున్నప్పుడు, ఇతర భంగిమల్లోను కాళ్లు యాంత్రిక ఒత్తిడి (mechanical stress)కి లోనవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే రక్తనాళాలు (blood capillaries), నాడీ తంత్రులు (nerve fibres) అడకత్తెరలో పోకలాగా ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడు ఆయా కణాలకు, నాడీ తంత్రులకు సరిపడా రక్తప్రసరణ అందదు. ఫలితంగా ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. ఈ విషయాన్ని అక్కడున్న నాడీ తంత్రులు మెదడుకు సంకేతాల రూపంలో చేరవేయడం వల్ల తిమ్మిర్లు (fingling and numbness) అనే భావనను మనం పొందుతాము. ఒత్తిడికి లోనవుతున్న చేతులు, కాళ్ల భాగాల్ని కాస్త విదిలిస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అంటే తిరిగి ఆక్సిజన్‌ సరఫరా సజావుగా సాగడం వల్ల సమస్య తగ్గినట్టు మెదడు భావించి తిమ్మిర్ల భావన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

*📣40శాతం డీఎడ్‌ అభ్యర్థులకు ఊరటొ టీఆర్టీ దరఖాస్తు చేసేందుకు అనుమతించండి:హైకోర్టు*

*🌸రాష్ట్రంలో 40 శాతం ఉత్తీర్ణతతో ఉన్న డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) అభ్యర్థుల నిరీక్షణ ఫలించింది. హైకోర్టు ఆదేశాలతో వారికి ఊరట లభించింది. 40 శాతం మార్కులతో డీఎడ్‌ అభ్యర్థులనూ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని ఉమ్మడి హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 40 శాతంతో ఉత్తీర్ణులైన డీఎడ్‌ అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. 8,792 ఉపాధ్యాయ పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 21న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. అయితే ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారే ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కానీ జనరల్‌ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారమే జనరల్‌ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులతో డీఎడ్‌కు అర్హత కల్పించారని అభ్యర్థులు కోర్టుకు నివేదించారు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన కోర్టు టీఆర్టీలోని ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కోరారు. టీఆర్టీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ వరకు ఉన్న విషయం తెలిసిందే.*

*_🌸STUTS :_*🌸

*✍డ్రాపౌట్స్‌కు కళ్లెం*

🔷స్కూళ్లలో పెరుగుతున్న అడ్మిషన్లు

🔷ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు

🔷2016-17 విద్యాగణాంకాల విడుదల

🔷గత విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 57.99% అక్షరాస్యత

♦ రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం పెంచడంతోపాటు ఆ స్కూళ్ల పర్యవేక్షణపైనా అధికారులు దృష్టిసారించారు. ఈ క్రమంలో గత విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 57.99% అక్షరాస్యత నమోదుకాగా గ్రామీణ ప్రాంతాల్లో 47.12%, పట్టణ ప్రాంతాల్లో 75.39% చొప్పున అక్షరాస్యత నమోదైంది. 

♦గ్రామీణ ప్రాంతాలలో తక్కువగా నమోదవుతున్న అక్షరాస్యతను క్రమంగా వృద్ధి చేసేందుకు ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా పాఠశాలకు వెళ్ళేలా క్షేత్రస్థాయిలో విద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో నిత్యం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగింది. ఈ వివరాలతో కూడిన ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్: 2016-17 పుస్తకాన్ని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు జీ కిషన్ బుధవారం విడుదలచేశారు. ఈ పుస్తకంలో మాధ్యమాలవారీగా విద్యార్థుల నమోదుతోపాటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జాబితాలను కమ్యూనిటీలవారీగా సేకరించారు. 

♦పాఠశాల యాజమాన్యాల వారీగా విద్యార్థులు నమోదు ఏ విధంగా ఉన్నది? సంవత్సరాలవారీగా డ్రాపౌట్స్ నిష్పత్తి పరిస్థితి ఏమిటి? ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా అమలవుతున్నది? తదితర అంశాలను కూడా ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ పుస్తకంలో పేర్కొన్నారు.

♦ 2016-17 విద్యాసంవత్సరంలో 1,483 ప్రాథమిక పాఠశాలలు, 3,310 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5,304 ఉన్నత పాఠశాలలు, 414 మాధ్యమిక పాఠశాలలు కలిపి మొత్తం 10,511 ఆంగ్ల మాధ్యమం స్కూళ్లు కొనసాగుతున్నాయి. వీటిలో అన్ని తరగతుల్లో కలిపి 30,44,320 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే తెలుగు మాధ్యమంలో 21,300 పాఠశాలల్లో 14,01,306 మంది చదువుతున్నారు. అన్ని మాధ్యమాలు/యాజమాన్యాలతో కలిపి 41,337 పాఠశాలలు పనిచేస్తున్నాయి. 2016-17 లెక్కల ప్రకారం అన్ని రకాల పాఠశాలల్లో కలిపి మొత్తం 60,33,196 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

*♦స్థిరంగా డ్రాపౌట్లు*
2014-15 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల డ్రాప్ అవుట్ క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గత రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో విద్యార్థుల ప్రవేశాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో జరుగుతున్న బహుళ ప్రవేశాల విధానం నియంత్రణలోకి వచ్చింది. దీంతో గతంలోకంటే 2016-17 విద్యా సంవత్సరంలో సేకరించిన డైస్ డాటా ప్రకారం వాస్తవ లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 2015-16లో డ్రాపౌట్ రేటు 36.99% ఉంటే వాస్తవ లెక్కల ప్రకారం 2016-17లో 37.92 శాతంతో స్థిరంగా ఉందని తెలిపారు.

👇 వచ్చే విద్యాసంవత్సరంలో ఈ డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి చర్యలు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ సంచాలకులు జీ కిషన్ పేర్కొన్నారు. అయితే విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తికంటే ఎక్కువ మొత్తంలో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

*_🌸STUTS :_*🌸

*✍సీన్‌రివర్స్‌ ప్రయివేటు బడుల్లో తగ్గారు..!*

🔷 గతేడాది కంటే తగ్గిన 21,335 మంది విద్యార్థులు

🔷 అదేబాటలో జిల్లాపరిషత్‌, ఎయిడెడ్‌ స్కూళ్లు

🔷 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో పెరిగిన విద్యార్థులు

🔷 గతం కంటే పెరిగిన డ్రాప్‌అవుట్స్‌

🔷 గిరిజనుల్లో ఏకంగా 61.09శాతం

🔷 విడుదలైన విద్యాగణాంకాల నివేదిక

♦నవతెలంగాణ:నిన్నమొన్నటి వరకూ సర్కారు బడుల్లో విద్యార్థులు తగ్గడం, ప్రయివేటు బడుల్లో విద్యార్థులు పెరగడం చూశాం. కానీ 2016-17లో సీన్‌రివర్స్‌ అయింది. ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు తగ్గితే, ఈ ఏడాదీ రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు పెరిగారు. అయితే జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలలు, ఎయిడెడ్‌ బడుల్లో మరోసారి విద్యార్థులు తగ్గారు. విద్యార్థుల డ్రాప్‌అవుట్స్‌ గతేడాది కంటే పెరిగాయి. దీనిలో బడికి దూరమవుతున్న వారిలో ఎస్టీ విద్యార్థులు ఎక్కువగా ఉండగా, అదే స్థాయిలో ఎస్సీ విద్యార్థులూ ఉన్నారు. ఇవి హైస్కూల్‌స్థాయిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి . డ్రాప్‌ అవుట్స్‌ నివారణ కోసం పాఠశాల విద్యాశాఖ పలు చర్యలు చేపడుతున్నా, పెద్దగా ఫలితం చూపలేకపోయాయి. 

♦ప్రయివేటులో తగ్గేందుకు ఫీజులు ఒక భారమైతే, గిరిజనుల్లో, అదీ హైస్కూల్‌ స్థాయిలో తగ్గడం సర్కారీ విద్యావ్యవస్థలపై నమ్మకం లేకపోవడం మరోకారణంగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అక్షరాస్యత సాధించే తెలంగాణగా కాకుండా నిరక్షరాస్య తెలంగాణగా మారే అవకాశాలున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

♦ రాష్ట్రంలో 2016-17 విద్యాసంవత్సరంలో 60,33,196 మంది విద్యార్థులుండగా, వీరిలో 29,26,608 మంది బాలికలు, 31,06,588 మంది బాలురు ఉన్నారు. విద్యార్థుల్లో ఎస్సీలు 10,24,646 మంది, బీసీలు 30,29,205 మంది, ఎస్టీలు 6,78,030 మంది ఉన్నారు. మొత్తంగా 2015-16 విద్యాసంవత్సరంతో పోలిస్తే 1,58,586 మంది విద్యార్థులు తగ్గారు. ప్రతి ఏటా ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య పెరుగుతూ ఉన్నది. 

♦కానీ ఈసారి ప్రయివేటులోనూ విద్యార్థులు తగ్గారు. 2015-16లో 31,40,957 మంది చదివితే, 2016-17లో 31,19,625 మంది చదివారు. భారీగా గురుకుల పాఠశాలలు ప్రారంభించడంతో 2017-18లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 22,385 మంది, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 1217 మంది విద్యార్థులు గతేడాది కంటే పెరిగారు. మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్‌ పాఠశాలల్లో 1,02,647 మంది, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 17,554 మంది విద్యార్థులు తగ్గారు.

*♦భారీగా డ్రాప్‌ అవుట్స్‌..*
2015-16తో పోలిస్తే 2016-17లో బడికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగింది. ప్రభుత్వం బడిబాట లాంటి కార్యక్రమాలు నిర్వహించినా, ఫలితం కనిపించలేదు. 2007-08లో 8,40,933 మంది విద్యార్థులు ఒకటో తరగతిలో చేరితే, 2016-17లో పదో తరగతి వరకూ కొనసాగింది కేవలం 5,22,027 మంది మాత్రమే. మిగిలిన వారంతా మధ్యలోనే బడి మానేశారు.

♦ 2015-16లో డ్రాప్‌అవుట్‌ రేటు 36.99శాతం ఉంటే, 2016-17లో 37.92శాతానికి పెరిగింది. ఎస్సీల్లో 38.90శాతం, ఎస్టీల్లో 61.09 శాతంగా ఉంది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో 18.48 శాతం, ప్రాథమికోన్నత స్థాయిలో 32.33 శాతం, హైస్కూల్‌ స్థాయిలో 37.92 శాతంగా ఉంది. అత్యధికంగా కొమురంభీం జిల్లాలో 65.66 శాతం, జయశంకర్‌ జిల్లాలో 60.77 శాతం, మహబూబాబాద్‌లో 60.36శాతం, నాగర్‌కర్నూల్‌లో 57.51 శాతం ఉండగా, తక్కువగా వరంగల్‌ అర్బన్‌లో 14.09 శాతం, మేడ్చెల్‌లో 16.57శాతం ఉంది. బడికి దూరమవుతున్న వారిలో అన్ని విభాగాల్లోనూ బాలురే ఎక్కువగా ఉన్నారు. 

♦ఎస్టీల్లో ఏజెన్సీ ప్రాంతమైన కొమురం భీం జిల్లాలో 79.33 శాతం, సంగారెడ్డిలో 75.11 శాతం, నిర్మల్‌లో 75.02 శాతం, జోగులాంబ గద్వాలలో 74.84 శాతం డ్రాప్‌అవుట్స్‌ జరిగాయి.

 ♦ఎస్సీల్లో అత్యధికంగా మహబూబాబాద్‌లో 56.02శాతం, నాగర్‌కర్నూల్‌లో 55.23 శాతం, జోగులాంబలో 53.79 శాతం వనపర్తిలో 50.57శాతం, వికారాబాద్‌లో 50.29 శాతం విద్యార్థులు మధ్యలోనే బడి మానేశారు.

*♦ఉపాధ్యాయుల వివరాలు..*
కేంద్ర ప్రభుత్వం 1031
రాష్ట్ర ప్రభుత్వం 20,649
ఎంపీపీ,జెడ్పీపీ 98,207
ఎయిడెడ్‌ 3202
ప్రయివేటు 96,580
గుర్తింపులేని, మదర్సాలు ఇతర.. 1780
మొత్తం 2,21,449

*♦డ్రాప్‌ అవుట్‌ నిష్పత్తి(1-10వరకు)*
.......... బాలురు బాలికలు మొత్తం
2007-08 4,33,350 4,07,587 8,40,933
2016-17 2,64,812 2,57,215 522027
డ్రాప్‌అవుట్‌శాతం 38.89 36.89 37.92 

*♦ఎస్సీల్లో*
.......... బాలురు బాలికలు మొత్తం
2007-08 75066 71469 146535
2016-17 44388 45149 89537
డ్రాప్‌అవుట్‌శాతం 40.87 36.83 38.90

*♦ఎస్టీల్లో...*
.......... బాలురు బాలికలు మొత్తం
2007-08 66,550 62,773 12,9321
2016-17 25,746 24,577 50,323
డ్రాప్‌అవుట్‌శాతం 61.31 60.85 61.09

*♦డ్రాపౌట్స్‌ శాతం..*

విభాగం ప్రాథమిక,    ప్రాథమికోన్నత ,     హైస్కూల్‌
జనరల్‌ 18.48   32.33   37.92
ఎస్సీ 19.71    32.33      38.90
ఎస్టీ 37.50      54.97     61.09

*_🌸STUTS :_*🌸

*✍పీహెచ్‌డీ ప్రవేశాల ఇంటర్వ్యూలు ప్రారంభం*

*❇కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: నాలుగేళ్ల నుంచి నానుతూ వచ్చిన పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. 2013-2014 విద్యాసంవత్సరంలో పీహెచ్‌డీ ప్రవేశాలను నిర్వహించిన అనంతరం మళ్లీ ఇప్పుడే ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. 31 కోర్సుల్లోని అభ్యర్థులకు వచ్చే నెల 13వ తేదీ వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. బుధవారం కేయూ క్యాంపస్‌లోని డీన్‌ కార్యాలయాల్లో, ఆంగ్ల విభాగం, కేయూ ప్రవేశాల డైరెక్టరేట్‌ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 2015-2017 బ్యాచ్‌ల విద్యార్థులకు 25, 2016-2017 బ్యాచ్‌ వారికి 30 మార్కులకుగాను ఇంటర్వ్యూలు జరిగాయి. వాణిజ్యశాస్త్రం, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం కామర్స్‌ డీన్‌ ఆచార్య సూర్య దేవర కమలేశ్వర్‌రావు, ఆంగ్ల విభాగంలో డీన్‌ ఆచార్య కె.పురుషోత్తం, క్యాంపస్‌ కళాశాలలో సైన్స్‌ డీన్‌ ఆచార్య వై.ప్రమీలాదేవి, కేయూ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌లో ఇంజినీరింగ్‌ డీన్‌ ఆచార్య టి.శ్రీనివాసులు నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరిగాయి. శాఖాధిపతులు, పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షులు, విషయ నిపుణులు, ఎస్టీ, ఎస్టీ, మహిళా విభాగాల నుంచి, వీసీ కార్యాలయం నుంచి నామినీలు సభ్యులుగా వ్యవహరించారు. అన్ని విభాగాల్లో ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం వచ్చే నెల ఆఖరు వరకు ప్రవేశాలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. కొన్ని రోజులుగా పీహెచ్‌డీ ప్రవేశాలపై నెలకొన్న అభ్యంతరాలు తొలగిపోయి సజావుగా ఇంటర్వ్యూలు ప్రారంభం కావడంతో కేయూ వీసీతోపాటు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు*

*_🌸STUTS :_*🌸

*✍ఆన్లైన్లో ఎంప్లాయిమెంట్ కార్డు*

*👉త్వరలో శ్రీకారం చుట్టనున్న ఉపాధి శిక్షణశాఖ*

*❇ఉపాధి కార్డు(ఎంప్లాయిమెంట్)లను ఇక మీదట ఆన్లైన్లో పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధి శిక్షణశాఖ కసరత్తు ప్రారంభించారు. గతంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయాలకు ఎంతో ప్రఖ్యాత ఉండేది. కాలక్రమంలో బోర్డుల ద్వారా ఉద్యోగాల ఎంపిక కావడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్కే పరిమితమయ్యాయి. అయినప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగ భృతిని కల్పించేలా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళాలను నిర్వహిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థల్లో జాబ్ మేళాలను కార్యాలయాల్లోనే నిర్వహించి యువతకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ ఉపాధి శిక్షణశాఖ కృషి చేస్తున్నది. ఇకమీదట ఎంప్లాయిమెంట్ కార్డుల కోసం అభ్యర్థులు ఆయా జిల్లాల పరిధిలోని కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా కుల, ఆదాయ ద్రువీకరణ పత్రాలను ఎలా పొందుతున్నారో అదే తరహాలో ఎంప్లాయిమెంట్ కార్డులను అందించేందుకు ఉపాధి శిక్షణశాఖ సెక్రటరీ శశాంక్గోయల్, శాఖ సంచాలకుడు కేవై నాయక్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎంప్లాయిమెంట్ కార్డులను పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఇకమీదట ఇంటి నుంచి ఆన్లైన్లో లేదా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేలా ఉపాధి శిక్షణశాఖ శ్రీకారం చుడుతున్నది.*

*👉రెన్యువల్కు విశేష స్పందన*

*❇రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఉపాధి శిక్షణశాఖ ల్యాప్స్ అయిన ఎంప్లాయిమెంట్ కార్డుల అభ్యర్థులకు 2000 నుంచి 2017 జూలై వరకు రెన్యువల్కు అనుమతి ఇవ్వడంతో హైదరాబాద్లో 1,300 మంది, నల్లగొండలో 850, మహబూబ్నగర్లో 1,500 మంది అభ్యర్థులు ల్యాప్స్ అయిన ఎంప్లాయిమెంట్ కార్డులను రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తులు అందజేశారని ప్రాంతీయ ఉపాధికారి ఏ లింగ్యానాయక్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయంలో 1,100పైగా అభ్యర్థులు రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తులను అందజేశారని ఉపాధి అధికారి పరమేశ్వర్రెడ్డి తెలిపారు.*

*📚మేలో ప్రవేశ పరీక్షల నిర్వహణ!* 

*🔹రెండు రోజుల్లో సెట్స్‌ తేదీలు, కన్వీనర్ల వెల్లడి*

*♻లాసెట్‌ కన్వీనర్‌గా ద్వారకానాథ్‌ : పాపిరెడ్డి*

*❇రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఉన్నత విద్యలో చేరేందుకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలు (సెట్స్‌)-2018, మేలోనే జరగనున్నాయి. రెండు రోజుల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలు, కన్వీనర్ల పేర్లను వెల్లడిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మెన్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలో ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌)తో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. రాతపరీక్షలను టీసీఎస్‌ నిర్వహిస్తుందని అన్నారు. లాసెట్‌ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్‌ ద్వారకానాథ్‌ను ఎంపిక చేశామన్నారు. ఐసెట్‌ కన్వీనర్‌ను త్వరలోనే ఎంపిక చేస్తామని అన్నారు. ఎంసెట్‌, ఈసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్‌లకు గతంలో కొనసాగిన వారే కన్వీనర్లుగా వ్యవహరిస్తారని వివరించారు. ఎంసెట్‌కు ఎన్‌ యాదయ్య (జేఎన్టీయూ), ఈసెట్‌కు గోవర్ధన్‌ (జేఎన్టీయూ), పీజీఈసెట్‌కు సమీనా ఫాతిమా (ఓయూ), ఎడ్‌సెట్‌కు మధుమతి (ఓయూ), పీఈసెట్‌కు వి సత్యనారాయణ (ఓయూ) ఉంటారని చెప్పారు.*

*📝40 శాతం డీఎడ్‌ అభ్యర్థులకు ఊరట టీఆర్టీ దరఖాస్తు చేసేందుకు అనుమతించండి:హైకోర్టు*

*🌸రాష్ట్రంలో 40 శాతం ఉత్తీర్ణతతో ఉన్న డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) అభ్యర్థుల నిరీక్షణ ఫలించింది. హైకోర్టు ఆదేశాలతో వారికి ఊరట లభించింది. 40 శాతం మార్కులతో డీఎడ్‌ అభ్యర్థులనూ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని ఉమ్మడి హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 40 శాతంతో ఉత్తీర్ణులైన డీఎడ్‌ అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. 8,792 ఉపాధ్యాయ పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 21న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. అయితే ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారే ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కానీ జనరల్‌ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారమే జనరల్‌ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులతో డీఎడ్‌కు అర్హత కల్పించారని అభ్యర్థులు కోర్టుకు నివేదించారు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన కోర్టు టీఆర్టీలోని ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కోరారు. టీఆర్టీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ వరకు ఉన్న విషయం తెలిసిందే.*

🔊 *ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్‌!*

సాక్షి,  ✴ *హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తుకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వనుంది. గతనెల 30తో దరఖాస్తుల ప్రక్రియ ముగియగా... క్షేత్రస్థాయిలో దాదాపు 30వేల మంది విద్యార్థులు ఈపాస్‌ వెబ్‌సైట్‌ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్‌!ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్‌!లో వివరాలు నమోదు చేసుకోలేకపోయారు. ఈక్రమంలో గడువు ముగియడంతో ఆయా విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలకు వినతులు వెల్లువెత్తాయి*.

 ♦ *మరోవైపు బీఈడీ, లాసెట్, నర్సింగ్‌ కోర్సులకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ సైతం గతనెలాఖరుకు ముగియకపోవడంతో ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో దరఖాస్తుల నమోదుకు అవకాశం ఇవ్వాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈమేరకు రెండ్రోజుల క్రితం ఆ శాఖ సంచాలకులు కరుణాకర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.*

 ⏰🔷 *నెలరోజులు పెంపు!*

🦋 *2017–18 వార్షిక సంవత్సరంలో పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు 13.05 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 13.30 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేయగా... 25వేల దరఖాస్తులు తగ్గాయి. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి జూన్‌ 20న ప్రారంభమైన నమోదు ప్రక్రియ ఆగస్టు వరకు సాగింది. ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతోపాటు ఇతర వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లోనూ జాప్యం జరిగింది*.

 ♻ *దీంతో అక్టోబర్, నవంబర్‌లో దరఖాస్తుకు మళ్లీ అవకాశం కల్పించింది. 95శాతం మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో పలువురు విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. తాజాగా ఆయా విద్యార్థులతో పాటు, బీఈడీ, లాసెట్, నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 50వేల మందికి అవకాశం కల్పించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడితే వచ్చే ఏడాది జనవరి నెల మొత్తం దరఖాస్తులు స్వీకరిస్తామని సంక్షేమాధికారులు చెబుతున్నారు.*

31 నుంచి ఆ చెక్బుక్లు చెల్లవు
జన్మభూమి న్యూస్:-
న్యూఢిల్లీ : భారతీయ స్టేట్ బ్యాంక్ తనలో విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులు ఇంకా పాత చెక్బుక్, ఐఎఫ్ఎస్ కోడ్లే వాడుతున్నారా? అయితే త్వరగా మార్చేసుకోండి. 2017 డిసెంబర్ 31 నుంచి ఎస్బీఐ తన విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులకు చెందిన పాత చెక్బుక్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు చెల్లవు. ఈ లోపలే కొత్త చెక్బుక్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు తీసుకోవాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు సూచిస్తోంది. గతంలో పాత చెక్బుక్లను మార్చుకోవడానికి 2017 సెప్టెంబర్ 30న డెడ్లైన్గా గడువు విధించింది. అనంతరం ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఎస్బీఐ మరోసారి తన కస్టమర్లకు ఈ సూచన చేస్తోంది.
ఈ ఏడాది ఆరంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమైన విషయం తెలిసిందే. కొత్త చెక్బుక్ పొందడానికి బ్యాంకు శాఖనైనా సందర్శించవచ్చని లేదా ఎటీఎం, ఎస్బీఐ మొబైల్ యాప్ ద్వారానైనా దీన్ని పొందవచ్చని పేర్కొంది. ఎస్బీఐ కూడా మేజర్ సిటీల్లో ఉన్న బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్లను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మారుస్తోంది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కత్తా, పాట్న, అహ్మదాబాద్, భోపాల్, అమరావతి, చంఢీగర్, జైపూర్, తిరువనంతపురం, లక్నో వంటి నగరాల్లో ఎస్బీఐ బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్లను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మార్చేసింది.

*ఆధార్ లింక్ ఉంటేనే ఇక పేస్ బుక్ ఖాతా*జన్మభూమి న్యూస్:- త్వ‌ర‌లో ఫేస్‌బుక్ ఖాతా సృష్టించుకోవాలంటే ఆధార్‌లో ఉన్న పేరును ఉప‌యోగించేలా ఆ సంస్థ చ‌ర్య‌లు తీసుకోబోతోంది. త‌ప్పుడు పేర్ల‌తో అకౌంట్లు తెరిచి, మోసాల‌కు పాల్ప‌డుతున్న వారిని అరిక‌ట్ట‌డానికే ఇలాంటి ప‌ద్ధ‌తిని ఫేస్‌బుక్ అమ‌లు చేయ‌నుంది.

👉అంతేకాకుండా ఇలా ఆధార్‌లో ఉన్న పేరుతోనే ఖాతా తెర‌వ‌డం వ‌ల్ల స్నేహితులు గానీ, కుటుంబ స‌భ్యులు గానీ సుల‌భంగా ఫేస్‌బుక్ ఖాతాను గుర్త‌పట్ట‌వ‌చ్చు. ఇప్ప‌టికే ఈ విధానం ప్ర‌యోగ‌ద‌శ‌లో ఉన్న‌ట్లు ఫేస్‌బుక్ వ‌ర్గాలు తెలిపాయి. భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగం అతితక్కువగా ఉన్న ప్రాంతంలో దీన్ని ప్రయోగించినట్లు ఫేస్‌బుక్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విధానాన్ని ఆప్ష‌న‌ల్‌గా మాత్ర‌మే ఉంచ‌బోతున్న‌ట్లు సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. అంటే.. ఇష్టం ఉన్న వాళ్లు మాత్ర‌మే ఆధార్‌లో పేరుని ఉప‌యోగించుకోవ‌చ్చ‌న్న‌మాట‌. అయితే ఈ విధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేసే అవకాశాలు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఖాతా తెర‌వ‌డానికి ఆధార్ సంఖ్య అవసరం లేదని, ఆధార్ ప్రకారం పేరుమాత్రమే అవసరం అని స్పష్టం చేశారు.

*✅ తెలుసుకుందాం ✅*

*⭕మన శరీరంలో కాళ్లకు, చేతులకు మాత్రమే తిమ్మిర్లు ఏర్పడుతాయెందుకు?*

✳మన శరీరంలో పరిసరాలతో సంధానించుకుని పనికి ఉపక్రమించేవి ప్రధానంగా కాళ్లు, చేతులే. మన ఉదరభాగం, వీపు, ముఖం, వక్షస్థలం, మెడ తదితర భాగాలు పరిసరాల ఒత్తిడి (pressure)కి కానీ, తాకిడి (impact)కి కానీ లోను కావు. కానీ మనం ప్రతి పనిలోను చేతుల్ని వాడకుండా ఉండలేము. కూర్చున్నప్పుడు, ఇతర భంగిమల్లోను కాళ్లు యాంత్రిక ఒత్తిడి (mechanical stress)కి లోనవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే రక్తనాళాలు (blood capillaries), నాడీ తంత్రులు (nerve fibres) అడకత్తెరలో పోకలాగా ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడు ఆయా కణాలకు, నాడీ తంత్రులకు సరిపడా రక్తప్రసరణ అందదు. ఫలితంగా ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. ఈ విషయాన్ని అక్కడున్న నాడీ తంత్రులు మెదడుకు సంకేతాల రూపంలో చేరవేయడం వల్ల తిమ్మిర్లు (fingling and numbness) అనే భావనను మనం పొందుతాము. ఒత్తిడికి లోనవుతున్న చేతులు, కాళ్ల భాగాల్ని కాస్త విదిలిస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అంటే తిరిగి ఆక్సిజన్‌ సరఫరా సజావుగా సాగడం వల్ల సమస్య తగ్గినట్టు మెదడు భావించి తిమ్మిర్ల భావన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

*తెలంగాణ  ప్రజలకు ముఖ్య సూచన*

ఈ నెల డిసెంబర్ 31వ తేదీన రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రతి పొలీసు స్టేషన్ అద్వర్యం లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును.
500 పోలీసు టీమ్లు స్థానిక మరియు సంచార టీమ్లుగా ఏర్పడి ప్రత్యేకంగా  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును.పరిక్షించు సమయంలో విడియే రికార్డు చేయబడును.
            డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్న సమయంలో పట్టుబడ్డ వ్యక్తుల వాహనాలు స్వాధినం
చెసుకోబడును.ఆ  రోజు ప్రయణించు వారు పై విషయాన్ని గమనించగలరు.
               డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించు సమయంలో పట్టుబడిన వ్యక్తుల సమాచారం ఆధార్ నంబరుతో జతపరచడం జరుగును.ఆ సమాచారం ఉద్యోగం మరియు వీసా మరియు పాస్పోర్ట్ ఇంకా మిగతావి జారీ చెయు సమయంలో ఈ విషయాన్ని అందరు గమనించగలరు.
ఇట్లు,
మీ,

తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్

No comments:

Post a Comment