రాష్ట్రీయం
1) తెలంగాణలో తయారీ రంగంపై హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం ఏది ?
జ: మ్యాన్ ఎక్సీ – 2017
2) మ్యాన్ ఎక్సీ – 2017 ఏర్పాటు చేసిన కార్యక్రమంలో CII, యెస్ బ్యాంకులు రూపొందించిన నివేదిక ఏది ?
జ: మేక్-ఇన్-ఇండియా, క్రియేటింగ్ సస్టయినబుల్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ ఎకో సిస్టమ్
3) తాపీ ధర్మారావు పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
జ: రచయిత, పత్రికా సంపాదకుడు సతీష్ చందర్
4) ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ దక్షిణ భారత మండలి (కౌన్సిల్ ) అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ?
జ: సూరపనేని పూర్ణచంద్రరావు
5) సుద్దాల హనుమంతు, జానకమ్మ 2017 సంవత్సరం జాతీయ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు ?
జ: ప్రజాకవి గోరటి వెంకన్న
6) రాష్ట్రంలో సోయాబీన్ సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఎవర్ని ప్రభుత్వం నియమించింది ?
జ: హాకా
జాతీయం
7) మూడు రోజుల అంతర్జాతీయ వైజ్ఞానిక ఉత్సవం (ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ) ఎక్కడ జరుగుతోంది ?
జ: చైన్నైలో
8) ఏ ఆలయంలోకి 10-50 యేళ్ళ మహిళలు ప్రవేశాన్ని నిషేధించాలా… సమర్థించాలా అన్న అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది ?
జ: శబరిమలైలో
9) మిత్ర శక్తి 2017 పేరుతో ఏ దేశంతో కలసి భారత్ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది ?
జ: శ్రీలంకతో
10) వాతావరణం ప్రభావంతో పసిఫిక్ సముద్రంలో మునిగిపోయిన భారతీయ నౌక ఏది ?
జ: ఎమరాల్డ్ స్టార్ నౌక
11) ది కొయిలేషన్ ఇయర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
12) 2017 మాతృభూమి సాహిత్య అవార్డును అందుకున్నది ఎవరు ?
జ: విష్ణు నారాయణన్ నంబూద్రి (మలయాళ రచయిత)
13) టైమ్ మ్యాగజైన్ తదుపరి తరం నాయకుల జాబితా-2017లో ఎవరికి చోటు దక్కింది ?
జ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ గుర్ మెహర్ కౌర్
14) ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ( ఆక్టా) అందించే ఉత్తమ ఆసియా చిత్రం అవార్డుకు నామినేట్ అయిన చిత్రాలు ఏవి ?
జ: కసవ్ టర్టల్ (మరాఠీ), దంగల్, పింక్ ( హిందీ )
15) ల్యూరెస్ కి మొదటి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన క్రికెటర్ ఎవరు ?
జ: యువరాజ్ సింగ్
16) అంతర్జాతీయ తోలు బొమ్మలాట ( పప్పెట్స్ ఫెస్టివల్ ) ఎక్కడ జరుగుతోంది ?
జ: కోల్ కతాలో
అంతర్జాతీయం
17) యునెస్కో డైరక్టర్ జనరల్ గా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: ఆద్రే అజౌలే (ఫ్రాన్స్)
18) ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచేందుకు 1 బిలియన్ డాలర్ల నిధులు ఖర్చు చేయాలని ఏ ఐటీ దిగ్గజ సంస్థ నిర్ణయించింది ?
జ: గూగుల్
19) ఎన్ని దేశాలతో టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది ?
జ: తొమ్మిది దేశాలు
20) ఏసియన్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ (AFC) 2019 ను ఏ దేశంలో నిర్వహించనున్నారు ?
*జ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్*
No comments:
Post a Comment