AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 6 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 5


*🌎చరిత్రలో ఈరోజు / నవంబరు 05🌎*

*◾నవంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 309వ రోజు (లీపు సంవత్సరములో310వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 56 రోజులు మిగిలినవి.▪*

*🕘సంఘటనలు🕘*

*🔹1556: రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం హేమును ఓడించిన రోజు. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్‌ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది.*

*🔹1605: బ్రిటిష్‌ పార్లమెంటు భవనాన్ని పేల్చివేసేందుకు రోమన్‌ క్యాథలిక్కులు పన్నిన కుట్ర విఫలమైన రోజు. దీన్నే 'గన్‌పౌడర్‌ ప్లాట్‌' అంటారు. 'గై ఫాకెస్‌' అనే వ్యక్తి పేలుడు సామగ్రితో పార్లమెంటు లోపలికి వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబర్ 5న ఇంగ్లండ్‌లో బాణాసంచా కాల్చి 'గై ఫాకెస్‌ డే'గా జరుపుకుంటారు.*

*🔹1895: జార్జ్‌ సెల్డెన్‌ రూపొందించిన గ్యాసోలిన్‌తో నడిచే ఇంజిన్‌కు పేటెంటు హక్కులు లభించాయి. అమెరికన్‌ ఆటోవెుబైల్‌ రంగానికి సంబంధించినంత వరకూ ఇదే మొదటి పేటెంటు*

*🔹.1920: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.*

*🔹1951: పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి.*

*🔹1967: ఏటీఎస్‌-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది*

*🔹1976: ఎమర్జెన్సీ కాలం. లోక్‌సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది.*
*🔹.1977: భారత విదేశ వ్యవహారాల శాఖా మంత్రి, అటల్ బిహారీ వాజపేయి, ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించాడు.*

*🔹1976: భారత లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్పదవిని స్వీకరించాడు*

*🔹1989: అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ అరంగేట్రం.*

*❤జననాలు❤*

*🌷1877: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950)*

*🌷1892: జె.బి.ఎస్‌. హాల్డేన్‌, ప్రఖ్యాత బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. (మ.1964)*

*🌷1925: ఆలూరి బైరాగి, ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది. (మ.1978)*

*🌷1952: వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి.*

*🍃మరణాలు🍃*

*♦1972: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925)*

*♦1987: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925)*

*♦1995: ఇల్జక్ రాబిన్, ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి.*

ఈ రోజు జికె
     
*1)👉 ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు?*

A) *1918 లో.*

*2)👉 ఎవరి పేరిట ఉస్మానియా యూనివర్సిటీకీ ఆ పేరు పెట్టబడింది?*

A) *హైదరాబాద్ ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరిటి.*

*3)👉 ఉస్మానియా యూనివర్సిటీ యొక్క నినాదం ఏమిటి?*

A) " *తమసోమా జ్యోతిర్గమయ"*
( *Lead us from darkness to light.*

*4)👉 విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియం పేరేమిటి?*

A) *ఠగూర్ ఆడిటోరియం.*

*5)👉 ఉస్మానియా యూనివర్సిటి ప్రస్తుత V.C. (వైస్ ఛాన్సిలర్ ) ఎవరు?*

*A) ఎస్.సత్యనారాయణ*
               
*6)👉 మనదేశంలో క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన నూరీ అనేది ఏ జంతువు పేరు?*

A: *మేక.*

*7)👉 జాతీయ టెక్నాలజీ డే ను ఎప్పుడు జరుపుకుంటాము?*

A: *మే 11.*

*8)👉𒐭భారత్ లో DNA ఫింగర్ ప్రింట్ కు ఆద్యుడు ఎవరు?*

A: *లాల్జీ సింగ్.*

*9)👉 లై-ఫై (లైట్ ఫిడిలిటీ) అనే పదాన్ని సూచించింది ఎవరు?*

A:  *హరాల్డ్ హోస్.*

*10)👉 నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం శనిగ్రహం,దాని చుట్టూ ఉన్న వలయంలో  చేరింది?*

A: *కస్సిని.*

GK& CA BITS🔥*

*1.చిప్కో ఉద్యమ ప్రారంభకుడు?*

*2.నర్మదా బచావో ఆందోళనకు కారకుడు?*

*3.సామాజిక అడవుల అభివృద్ధి పధకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?*

*4.తమిళనాడు రాష్ట్ర సాంప్రదాయక నృత్యం?*

*5.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ నృత్యం?*

*6.కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేసినవారు?*

*7.భారత్ లో హరిత విప్లవం అధిక ప్రభావం చూపిన పంట?*

*8.భారత ప్రధానమంత్రి గా ఉండి ఛీటింగ్ కేసులోమూడు సంవత్సరాలు జైలు శిక్ష విధింపబడిన ఏకైక ప్రధాని?*

*9.ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్-?*

*10.ప్రపంచంలో అతితక్కువ జనాభాగల  దేశం?*

*🔥జవాబులు*🔥

*1.సుందర్ లాల్ బహుగుణ*

*2.మేధా పాట్కర్*

*3.1976*

*4.భరతనాట్యం*

*5.కూచిపూడి*

*6.తీర్ధనారాయణ,సిద్దంద్రయోగి.*
*7.గోధుమ*

*8.శ్రీ. పి. వి. నరసింహారావు.*

*9.360*

*10.వాటికన్ సిటీ.*


No comments:

Post a Comment