అంతర్జాతీయంఈజిప్టు మసీదులో బాంబు దాడి ఈజిప్ట్‌లోని అల్ అరిష్ పట్టణంలో ఉన్న మసీదుపై నవంబర్ 24న ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రార్థనలు చేసుకుంటున్న సూఫీ ముస్లింలపై బాంబులు, భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో దాదాపు 235 మంది మరణించగా 109 మంది గాయపడ్డారు. ఈజిప్టు చరిత్రలో ఇది అతిపెద్ద ఉగ్రదాడని ఈజిప్ట్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
మధ్యదరాలో 33 వేల మంది శరణార్థులు మృతిప్రపంచంలోని సరిహద్దుల్లో అత్యంత ప్రమాదకర, ప్రాణాంతక సరిహద్దుగా మధ్యదరా తీరాన్ని గుర్తించినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. యూరప్ దేశాలకు వచ్చేందుకు మధ్యదరాలో సాహస ప్రయాణం చేస్తూ 2000 నుంచి 2016 వరకు 33 వేల మంది జల సమాధి అయినట్లు 2017 నవంబర్ 24న ఓ ప్రకటనలో తెలిపింది.
ఐఎస్‌ను నిర్మూలించామని ప్రకటించిన ఇరాన్ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూనీ 2017 నవంబర్ 21న ప్రకటించారు. తరచుగా ఉగ్ర దాడులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరాన్.. ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. నవంబర్ 18 నాటికి ఐఎస్‌ను నిర్మూలించామని ఇరాన్ సైన్యం ప్రకటించింది.
రోహింగ్యాలపై బంగ్లా, మయన్మార్ ఒప్పందంరోహింగ్యా శరణార్థులు స్వదేశానికి వచ్చేందుకు మయన్మార్ అంగీకరించింది. ఈ మేరకు మయన్మార్ రాజధాని నేపిదాలో 2017 నవంబర్ 23న మయన్మార్ నేత అంగ్‌సాన్ సూకీ, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ అలీ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. తమపై హింసాకాండతో మయన్మార్‌లోని రఖానే రాష్ర్టం నుంచి 6.20 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ వలస వచ్చారు.
జాతీయంబ్రిక్స్ టాప్-20 వర్సిటీల్లో నాలుగు భారతీయ విద్యాసంస్థలు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లోని టాప్-20 వర్సిటీల్లో భారత్‌కు చెందిన నాలుగు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక క్వాకరెల్లీ సైమండ్‌స(క్యూఎస్) సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ర్యాంకింగ్‌సలో ఐఐటీ బాంబే(9), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌స-బెంగళూరు (10), ఐఐటీ ఢిల్లీ(15), ఐఐటీ మద్రాస్(18) నిలిచాయి. చైనాకు చెందిన సింఘువా వర్సిటీ, పెకింగ్ వర్సిటీ, ఫుడాన్ వర్సిటీలు జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్-10 విద్యాసంస్థల్లో చైనాకు చెందిన 8 విద్యాలయాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : బ్రిక్స్ టాప్-20 వర్సిటీల్లో నాలుగు భారత విద్యా సంస్థలు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : క్వాకరెల్లీ సైమండ్స్
ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో 920 ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. నవంబర్ 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో-బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 వన్‌స్టాప్ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఆమోదం తెలిపింది. విస్తృత పథకమైన ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017-20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా బాగా వెనకబడిన 115 జిల్లాల్లో
ఎందుకు : గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపు సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న అంగీకరించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపునకు అంగీకారం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
దివాళా చట్టాన్ని సవరించిన కేంద్రంరుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్‌సకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.
దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఐబీసీని గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఐబీసీలో పలు సవరణలు చేస్తూ ఆర్డినెన్‌స రూపొందించింది. ఈ ఆర్డినెన్‌స స్థానంలో సవరణలతో కూడిన చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లో మార్పులు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : రుణ ఎగవేతకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారానికి
భారత అటవీ చట్టం ఆర్డినెన్‌సకు రాష్ట్రపతి ఆమోదం భారత అటవీ చట్టం-1927కు సవరణలు చేస్తూ కేంద్రం పంపిన ఆర్డినెన్‌సను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 23న ఆమోదించారు. తాజా సవరణల్లో అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగించారు. దీంతో అటవీ ప్రాంతం కాని చోట్ల పెరిగే వెదురు చెట్లను నరకడానికి, రవాణా చేయడానికి అనుమతులు అక్కర్లేదు. వెదురు చెట్ల సాగును పెంపొందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత అటవీ చట్టం-1927 సవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగించేందుకు
న్యూఢిల్లీలో జాతీయ న్యాయ దినోత్సవ సదస్సు నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా నవంబర్ 25, 26 తేదీల్లో న్యూఢిల్లీలో సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబానికి చెందినవనీ, అవి మూడు ఒకదానినొకటి బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ఉద్ఘాటించారు. ఈ మూడు వ్యవస్థల మధ్య ఉండే సమన్వయమే రాజ్యాంగానికి వెన్నెముకని ఆయన పేర్కొన్నారు. సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.
జాతీయ న్యాయ దినోత్సవాన్ని రాజ్యాంగ దినోత్సవంగాను నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ న్యాయ దినోత్సవ సదస్సు
ఎప్పుడు : నవంబర్ 25, 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని (జాతీయ న్యాయ దినోత్సవం) పురస్కరించుకొని
హైదరాబాద్ చేరుకున్న షురువాత్’ బస్సు యాత్ర ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)-2017 నేపథ్యంలో రోడ్ టు జీఈఎస్’ పేరిట ప్రారంభించిన దేశవ్యాప్త షురువాత్’ బస్సు యాత్ర హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ఈ యాత్ర నవంబర్ 26న గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌కు చేరింది. నీతిఆయోగ్, యునెటైడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సంయుక్త ఆధ్వర్యంలో ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, సీఈవో గౌరీ ఈశ్వరన్, స్పెషల్ ప్రాజెక్ట్స్ లీడ్ క్షితిజ్ శరణ్ నేతృత్వంలో పది మంది సభ్యుల బృందం ఈ బస్సులో ప్రయాణం సాగిస్తోంది. ఐఐటీ ఢిల్లీలో ప్రారంభమైన ఈ షుర్వాత్ బస్సు ఐదు నగరాల్లో పర్యటిస్తూ హైదరాబాద్ చేరుకుంది. 14 రోజుల పర్యటనలో ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించి 500 వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను షురువాత్’ బస్సులోని బృందం సేకరించింది. వీటిలో అత్యుత్తమమైన ఆలోచనలకు ఫండింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
2030 నాటికి పట్టణాల్లోనే 40 శాతం జనాభా2030 నాటికి దేశం మొత్తం జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు 40 శాతం ఉంటారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అధ్యయన సంస్థ బ్రూకింగ్‌స ఇన్‌స్టిట్యూషన్ వెల్లడించింది. వచ్చే పదేళ్లలో భారత్, చైనా, ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్‌స దేశాల నుంచి దాదాపు 30 కోట్ల జనం గ్రామాలను విడిచి పట్టణాలకు వలస వెళతారని తెలిపింది.
మధ్యతరగతి జనాభా విషయంలో 2027 కల్లా ఇండియా చైనాను వెనక్కు నెట్టనుందని అంచనా. 2014-50 మధ్య కాలంలో చైనా, భారత్‌లలో కలిపి కొత్తగా 70 కోట్ల జనం పట్టణాలకు తరలిపోయి మధ్య ఆదాయవర్గంగా ఎదుగుతారని బ్రూకింగ్‌సకు చెందిన హోమీ ఖరాస్ అంచనా వేస్తున్నారు. ఆసియాలో 2016 నాటికి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలు 275. 2030 నాటికి వాటి సంఖ్య 354కు పెరుగుతుందని భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టణాల్లోనే 40 శాతం జనాభా
ఎప్పుడు : 2030
ఎవరు : బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్, అమెరికా
ఎక్కడ : భారత్
ఎందుకు : వలసల వల్ల మధ్యతరగతి జనాభా పెరగడంతో
నెట్ న్యూట్రాలిటీకి ట్రాయ్ మద్ధతువివక్ష లేని ఇంటర్నెట్ సేవలను అందించే నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది. సర్వీసు ప్రొవైడర్లు, టెలికం కంపెనీలు సహా ఏ సంస్థలైనా ఇంటర్నెట్ సేవలు అందించడంలో వివక్ష చూపడాన్ని నిషేధించాలని సూచించింది. ఈ మేరకు నెట్‌న్యూట్రాలిటీపై సిఫార్సుల నివేదికను ట్రాయ్ నవంబర్ 28న కేంద్రానికి అందచేసింది.
ట్రాయ్ సిఫార్సులు
రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ తన కంటెంట్‌ను ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించేందుకు ఇంటర్నెట్.ఆర్గ్ పేరుతో టెలికం ఆపరేటర్లతో ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా ఎయిర్‌టెల్ కూడా ‘ఎయిర్‌టెల్ జీరో’ ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెట్ న్యూట్రాలిటీకి ట్రాయ్ సిఫార్సులు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : నెట్ న్యూట్రాలిటీకి నియమ నిబంధనలు రూపొందించడానికి
ఆధార్ గడువు పొడిగింపునకు కేంద్రం రెడీ సంక్షేమ పథకాల లబ్దిదారులు తమ ఖాతాలతో ఆధార్‌సంఖ్యను అనుసంధానించుకోవడానికి మరింత గడువు దొరికింది. వచ్చే ఏడాది మార్చి దాకా ఈ గడువును పొడగిస్తున్నట్టు కేంద్రం నవంబర్ 27న సుప్రీంకోర్టుకు తెలిపింది. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందడానికి ప్రజలు తమ ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలన్న నిబంధనపై నవంబర్ 27న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 2018 మార్చి 31 వరకు వినియోగదారులు తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఈ ఏడాది డిసెంబరు 31 చివరి తేదీ కాగా మొబైల్ నంబర్లకు 2018 ఫిబ్రవరి 6 వరకు ఉంది.
ఢిల్లీ రాష్ర్టం కాదని సుప్రీంకు తెలిపిన కేంద్రంకేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీకి ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ, రాజ్యాంగం ప్రకారం రాష్ర్టంగా పరిగణించలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రానేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్‌సింగ్ 2017 నవంబర్ 21న ఈ మేరకు వాదనలు వినిపించారు.
సిక్కిం అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రతిపాదనసిక్కిం రాష్ర్ట శాసనసభ స్థానాల పెంపును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2017 నవంబర్ 23న ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 32 అసెంబ్లీ స్థానాలు 40కి చేరుతాయి. 1975లో సిక్కిం భారత్‌లో భాగమైన తర్వాత తొలిసారి ఆ రాష్ర్ట శాసనసభ స్థానాలు పెరుగుతున్నాయి.
ద్వైపాక్షికంస్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు స్వతంత్ర పాలస్తీనా కోసం ఆ దేశ ప్రజలు చేస్తున్న పోరాటానికి భారత్ మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’ సందర్భంగా ఐరాసకు ఆయన ఓ సందేశం పంపారు. ఇజ్రాయెల్‌తో పాటు శాంతియుతంగా జీవనం సాగించే స్వతంత్ర, సార్వభౌమ, సుస్థిర పాలస్తీనా కల త్వరలోనే నిజం అవ్వాలని భారత్ ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 1979 నుంచి ఏటా నవంబర్ 29ని ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’గా నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్ సందర్భంగా
ఎందుకు : శాంతియుత, స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా ఏర్పాటు కోసం
ఉగ్రపోరులో సహకారానికి రష్యా అంగీకారం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక ఒప్పందంపై భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రష్యా అంతర్గత మంత్రి కోలోకొత్సేవ్‌లు సంతకం చేశారు. తద్వారా 1993లో భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. రష్యా పర్యటనలో భాగంగా నవంబర్ 27న రష్యా మంత్రితో రాజ్‌నాథ్ పలు అంశాలపై చర్చలు జరిపారు. సమాచార మార్పిడి విసృ్తతం చేయడంతో పాటు డేటాబేస్, పోలీసు, దర్యాప్తు విభాగాలకు శిక్షణలో సహకారానికి కూడా భారత్, రష్యాలు అంగీకరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉగ్రవాదంపై పోరులో సహకారం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : భారత్, రష్యా
ప్రాంతీయంగోదావరి-కావేరీ నదుల అనుసంధానానికి ప్రణాళిక గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబర్ 23న చెప్పారు. మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించిందని ఆయన వివరించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తామని.. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణించి.. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని తెలిపారు. అలాగే.. చెన్నై - బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామని ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక కోసం ముఖ్యమంత్రులతో సమావేశ నిర్వహణ
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ
ఎందుకు : గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు
పళని-పన్నీర్‌లకు ‘రెండాకుల’ గుర్తు కేటాయింపుఅన్నాడీఎంకే పార్టీ అధికారిక చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నవంబర్ 23న నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల్లో అత్యధికులు పళనికే మద్దతు ఇస్తున్నందున ఆ వర్గానికే గుర్తు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెండాకుల గుర్తును పళని వర్గానికి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. రెండాకుల గుర్తు కోసం ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ, దినకరన్ తీవ్రంగా పోరాడారు.
ఇది రెండోసారి..!అన్నా డీఎంకే పార్టీ ఎన్నికల చిహ్నంగా రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) పునరుద్ధరించడం ఇది రెండోసారి. ఒక పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రెండుసార్లు నిలిపివేసి మళ్లీ కేటాయించడం ఏఐఏడీఎంకే విషయంలోనే జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పళనిస్వామి - పన్నీర్ సెల్వం వర్గానికి రెండాకుల గుర్తు
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
ఎక్కడ : తమిళనాడు, పుదుచ్చేరి
కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ స్టేజ్ - 2 అనుమతులు ఇచ్చింది. దీంతో.. అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లు, టన్నెళ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూముల బదలాయింపు.. ఆ భూముల్లో నిర్దేశించిన మేర తిరిగి మొక్కల పెంపకానికి సంబంధించి ప్రభుత్వం రూ.722.30 కోట్లు మంజూరు చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది. డిసెంబర్ నాటికి పర్యావరణ తుది అనుమతులు వచ్చే అవకాశముంది.
రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లోని సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతోపాటు 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా రూ.80,499.71 కోట్ల వ్యయ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుకు స్టేజ్ - 2 అటవీ అనుమతులు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : కేంద్ర అటవీశాఖ
ఏపీలో సునామీ మెగా మాక్ డ్రిల్ సునామీల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది కోస్తా జిల్లాల్లో నవంబర్ 24న మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ విపత్తుల శాఖ, రాష్ట్ర విపత్తుల శాఖ, ఇన్కొయిస్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సునామీ వస్తున్నట్టుగా ఇన్కొయిస్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, రాష్ట్ర విపత్తుల శాఖ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ 9 కోస్తా జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మాక్ ఎక్సర్‌సైజ్ చేపట్టారు.
కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ మెగా మాక్ డ్రిల్ జరిగింది.
అవయవదానంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అవయవదానంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇందుకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్‌సప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) ఈ అవార్డును ప్రకటించింది. నవంబర్ 27న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’ సందర్భంగా ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు.
తమిళనాడును దాటేసి.. తమిళనాడు జనాభా 8 కోట్లు కాగా.. తెలంగాణ జనాభా 3.5 కోట్లు. తమిళనాడులో గత 11 ఏళ్లలో 5,367 అవయవాలను సేకరించి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తెలంగాణలోని నిమ్స్ జీవన్‌దాన్ ఆధ్వర్యంలో 2013 నుంచి 2017 అక్టోబర్ వరకు 414 మంది దాతల నుంచి 1,675 అవయవాలను సేకరించారు. గతేడాది వరకు రెండోస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి తొలిస్థానంలో నిలిచింది. కేరళ ఇప్పటివరకు 701 అవయవాలు సేకరించి మూడోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అవయవదానంలో దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ రాష్ట్రం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్‌సప్లాంటేషన్ ఆర్గనైజేషన్
మధ్యప్రదేశ్‌లో చిన్నారులపై రేప్‌కు మరణశిక్షమధ్యప్రదేశ్‌లో ఇటీవల అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా చట్టం రూపకల్పనకు అంగీకరించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో నవంబర్ 26న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : మధ్యప్రదేశ్‌లో
హైదరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుభారత్‌లో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017 నవంబర్ 28న హైదరాబాద్‌లో ప్రారంభమయింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రారంభించారు.
బెంగళూరుకు చెందిన కంపెనీ తయారు చేసిన ‘మిత్ర’ రోబో సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వాగతోపన్యాసం చేయగా మోదీ, ఇవాంకా సదస్సును ఆరంభించి మాట్లాడారు. అంనతరం ‘బీ ద చేంజ్.. విమెన్‌స ఎంట్రప్రెన్యురల్ లీడర్‌షిప్’ అంశంపై పలువురు చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్
ఎక్కడ : హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభంహైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో కలసి నవంబర్ 28న ప్రారంభించారు. అనంతరం మెట్రో పైలాన్, మెట్రో జర్నీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘టి-సవారీ’ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. తర్వాత మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ అక్కడి నుంచి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు(జీఈఎస్) జరిగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)కి బయల్దేరి వెళ్లారు.
మెట్రో తొలిదశలో నాగోల్-అమీర్‌పేట్ (17 కి.మీ), మియాపూర్-అమీర్‌పేట్ (13 కి.మీ) మొత్తంగా 30 కి.మీ. మార్గంలో రవాణా సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లున్నాయి. మెట్రో రైలులో ప్రయాణించేందుకు స్మార్ట్‌కార్డు నెబ్యులా, టికెట్, టోకెన్‌లను ప్రవేశపెట్టారు.
మెట్రో రైలు ప్రారంభంలో లోకో పైలట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేపరాల గ్రీష్మ ఉన్నారు. దీంతో ఆమె దేశంలోనే మెట్రో తొలి మహిళా లోకోపైలట్‌గా రికార్డులకెక్కారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మియాపూర్, హైదరాబాద్
దేశంలోనే తొలిసారి చెన్నైలో జీఐఎస్ సర్వేదేశంలోనే తొలిసారిగా చెన్నైలో భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) మ్యాపింగ్ సర్వే 2017 నవంబర్ 21న ప్రారంభించారు. రెండు డ్రోన్లతో 120 రోజుల్లో నగరంలోని రహదారులు మొదలు వీధి దీపాల వరకు అన్ని వివరాలను ఈ సర్వేలో నమోదు చేస్తారు.
ఆర్థికం15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నవంబర్ 22న నిర్ణయించింది. ఈ సంఘం పన్నుల ఆదాయ వనరులను మదింపు వేసి వాటిని కేంద్రం, రాష్ట్రాల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలన్న విధానాన్ని రూపొందిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు కాలానికి అమల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు నిర్ణయం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఐటీ చట్టాల సమీక్షకు అత్యున్నత స్థాయి కమిటీఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్ లిఖించడం, ముసాయిదా రూపకల్పన ఈ కమిటీ కర్తవ్యం. ఆరు నెలల్లో కమిటీ ఈ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంది.
కన్వీనర్‌గా అరవింద్ మోదీ ఆరుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీ సభ్యులు (లెజిస్లేషన్) అరవింద్‌మోదీ కన్వీనర్‌గా ఉంటారు. గిరీష్ అహూజా (చార్డెడ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ పార్ట్నర్) మాన్సీ కేడియా (కన్సల్టెంట్, ఐసీఆర్‌ఐఈఆర్) కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కమిటీకి శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం పన్ను వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది? అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలు ఏమిటి? దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉండాలి? వంటి అంశాలను తన కర్తవ్య నిర్వహణలో కమిటీ పరిశీలిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీ చట్టాల సమీక్షకు అరవింద్ మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో హైక్ జట్టు దేశీ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘హైక్’ తాజాగా తన యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైక్ యూజర్లు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన మర్చంట్, యుటిలిటీ పేమెంట్ సర్వీసులు పొందొచ్చు. 2012లో ప్రారంభమైన హైక్‌కు ప్రస్తుతం 10 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో హైక్ జట్టు
ఎప్పుడు : నవంబర్ 22
ఎందుకు : యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు
న్యూఢిల్లీలో సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సుప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ తీవ్రమవుతోన్న సైబర్ ముప్పుని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో నవంబర్ 23, 24 తేదీల్లో 5వ సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సు (Global conference on cyber space) జరిగింది. ఈ సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమాచార మార్పిడి, సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలకు ఇంటర్నెట్ ఆటస్థలంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించారు. కార్యక్రమంలో శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్
ఎప్పుడు : నవంబర్ 23, 24
ఎక్కడ : న్యూఢిల్లీ
దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పథకం ప్రారంభం తపాలా బిళ్లల సేకరణ చేసేవారికి కేంద్రప్రభుత్వం ఉపకార వేతనం (స్కాలర్‌షిప్) అందించనుంది. పోస్టాఫీసుల వైపు విద్యార్థులను మళ్లించేందుకు వారిలో తపాలాబిళ్లల సేకరణ అలవాటును పెంచాలని నిర్ణయించింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరిమిత సంఖ్యలో ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఎంపికై న వారికి రూ.ఆరు వేల ఆర్థిక సాయం అందుతుంది. దీన్ని ప్రతి మూడు నెలలకు రూ.1,500 చొప్పున తపాలాశాఖ చెల్లిస్తుంది. ఈ మేరకు దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో స్పర్శ్ (ఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్)ను స్కాలర్‌షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీగా పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పథకం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : తపాలా బిళ్లల సేకరణకు విద్యార్థులకు ఉపకార వేతనం ఇచ్చేందుకు
సామాజిక సేవకు సునీల్ మిట్టల్ 7,000 కోట్ల విరాళంప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి ఇస్తామని ప్రతిన బూనింది. ఈ మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలో మిట్టల్ కుటుంబ సభ్యులకు ఉన్న మూడు శాతం వాటా కూడా విరాళంలో భాగమే. ఈ మొత్తాన్ని తమ కుటుంబం తరఫున ఏర్పాటు చేసిన భారతీ ఫౌండేషన్ కార్యక్రమాల కోసం ఇవ్వనున్నట్టు సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. తన సోదరులు రాకేశ్, రాజన్‌తో కలసి ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతిభావంతులైన నిరుపేదలకు ఉచితంగా విద్యనందించేందుకు సత్యభారతి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మిట్టల్ చెప్పారు. ఉత్తర భారతంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ 2021 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. విరాళంలో అధిక భాగం యూనివర్సిటీ ప్రాజెక్టుపైనే వెచ్చించనున్నామని, కొంత మేర ఇప్పటికే నిర్వహిస్తున్న సత్యభారతి స్కూళ్ల విస్తరణకు వినియోగిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సామాజిక సేవకు రూ. 7,000 కోట్ల విరాళం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం
సీఎస్‌ఆర్ కింద వెయ్యి గ్రామాల అభివృద్ధి : హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వెయి్య గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించింది. ఈ మేరకు 16 రాష్ట్రాల పరిధిలోని వెయి్య గ్రామాల్లో పది లక్షల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించనుంది. హోలిస్టిక్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(హెచ్‌ఆర్‌డీపీ)లో భాగంగా రెండున్నరేళ్ల కాలంలో 750 వెనకబడిన గ్రామాలకు సాధికారత కల్పించామని బ్యాంకు పేర్కొంది. హెచ్‌ఆర్‌డీపీలో భాగంగా విద్య, నీరు, పారిశుద్ధ్యం, అందరికీ బ్యాంకింగ్ సేవలు తదితర రంగాల్లో మెరుగుదలకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వచ్చే ఆర్థిక సంవత్సరంలో సీఎస్‌ఆర్ కింద వెయ్యి గ్రామాల అభివృద్ధి
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ఎస్‌బీఐ ‘యోనో’ యాప్‌ను ఆవిష్కరించిన అరుణ్ జైట్లీ డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా యోనో (యూ నీడ్ ఓన్లీ వన్) పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 24న ఈ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్ దాకా ఈ యాప్ ద్వారా నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించేందుకు 60 పైగా ఈ-కామర్స్ సంస్థలతో ఎస్‌బీఐ చేతులు కలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యెనో యాప్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఎస్‌బీఐ
ఎందుకు : డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు
భారత్ రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించిన ఎస్ అండ్ పీ భారత్‌కు ఇస్తున్న రేటింగ్ ‘బీబీబీ-మైనస్‌ను’ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ఇదే విధంగా కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ‘స్టేబుల్ అవుట్‌లుక్’ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది. పటిష్ట వృద్ధి ధోరణి రెండేళ్లు కొనసాగుతుందని కూడా ఎస్ అండ్ పీ అంచనావేసింది. అతి తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వానికున్న భారీ రుణం ప్రాతిపదికన యథాతథ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సూచించింది.
2007 వరకూ ఎస్‌అండ్‌పీ భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్’గా ఉండేది. ఇది అతి దిగువ స్థాయి గ్రేడ్. ఈ రేటింగ్‌కు ఎస్‌అండ్‌పీ 2007 జనవరిలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను చేర్చింది. 2009లో అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చిన సంస్థ, మళ్లీ 2010లో స్టేబుల్ హోదా ఇచ్చింది. 2012లో మళ్లీ నెగటివ్ అవుట్‌లుక్‌కు మార్చిన ఎస్‌అండ్‌పీ... మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టాక మళ్లీ ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇచ్చింది. ఇదే రేటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు ‘బీబీబీ-మైనస్’ రేటింగ్ కొనసాగింపు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : స్టాండర్డ్ అండ్ పూర్
మహిళా సాధికారతకు అమెజాన్ ‘సహేలి’మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ‘సహేలి’ అనే కార్యక్రమాన్ని నవంబర్ 28న ఆవిష్కరించింది. మహిళలు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్‌స, గృహాలంకరణ ఉత్పత్తులు విక్రయించేందుకు వీలుగా సహేలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సబ్సిడీతో రెఫరల్ ఫీజు, ఉత్పత్తుల ఉచిత చిత్రీకరణ, ఖాతా నిర్వహణకు మహిళా వ్యాపారులకు తోడ్పాటునిస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ వుమెన్ అసోసియేషన్, ఇంపల్స్ సోషల్ ఎంటర్‌ప్రైస్ సహకారంతో అమెజాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా సాధికారతకు సహేలి కార్యక్రమం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : అమెజాన్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించడానికి
పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రారంభంపేటీఎం పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 28న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టెక్నాలజీ దేశ బ్యాంకింగ్ రూపురేఖలను మార్చేసి నగదు స్థానాన్ని భర్తీ చేస్తోందన్నారు. ఈ బ్యాంక్ కార్యకలాపాలను 2017 మేలో ప్రయోగాత్మకంగా చేపట్టగా, ఇప్పుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ సంస్థ కనీస బ్యాలెన్‌సలేని, ఉచిత ఆన్‌లైన్ లావాదేవీలను ఆఫర్ చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : పేటీఎం
సైన్స్ అండ్ టెక్నాలజీసుఖోయ్ నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
వాయు సేనలో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ప్రవేశపెట్టేందుకు గొప్ప ముందడుగు పడింది. ఇది వరకే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన ఈ క్షిపణిని నవంబర్ 22న యుద్ధ విమానం సుఖోయ్-30 నుంచి తొలిసారి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తన సమర్థతను చాటుకున్నట్లయింది.
బ్రోహ్మోస్ తరగతికి చెందిన క్షిపణిని ప్రయోగించిన తొలి వాయుసేన తమదేనని ఐఏఎఫ్ ప్రకటించింది. బ్రహ్మోస్, సుఖోయ్-30ల కాంబినేషన్ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొంది.
ఎక్కడి నుంచైనా ప్రయోగం..భూమిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన...ఇలా త్రివిధ దళాల్లో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువుగా ఉండే సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. బ్రహ్మోస్. మూడు చోట్ల నుంచి ప్రయోగానికి అనువుగా ఉండేలా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈ క్షిపణిలో మార్పులు చేసింది. రష్యాకు చెందిన పీ-700 ఒనిక్ సూపర్‌సోనిక్ క్షిపణి ఆధారంగా మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)-రష్యా ఎన్‌పీఓఎంలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధిచేశాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్‌గా నామకరణం చేశారు.
బ్రహ్మోస్ ప్రత్యేకతలు..
ఉమంగ్ యాప్‌ను ప్రారంభించిన ప్రధానిఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను కేంద్రం తెచ్చింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందొచ్చని అధికారులు చెప్పారు.
ఈ యాప్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు సులభంగా చేయొచ్చు. అంతేకాకుండా ఆధార్, డిజిలాకర్, భారత్ బిల్ పేమేంట్, ఈపీఎఫ్‌వో, కొత్త పాన్‌కు దరఖాస్తు తదితర సేవలనూ పొందొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ తెలుగుతో పాటు 12 భారతీయ భాషల్లో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా మాత్రమే పనిచేసే ఈ యాప్.. ఇంటర్నెట్ అవసరం లేని ఫీచర్‌ఫోన్‌లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమంగ్ యాప్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎందుకు : ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా
న్యూజిలాండ్‌లో తొలి వర్చువల్ రాజకీయ నేత ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ను న్యూజిలాండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిక్ గెర్రిట్‌సెన్(49) రూపొందించారు. ఫేస్‌బుక్ మెసెంజర్‌తో పాటు తన హోమ్‌పేజ్‌లో ఉన్న సర్వేల సాయంతో విషయాల్ని నేర్చుకునే శామ్.. ప్రపంచవ్యాప్తంగా విద్య, వలసలు, ఇళ్లు సహా పలు అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తుంది. శామ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉందనీ దాని రూపకర్త నిక్ తెలిపారు. 2020లో న్యూజిలాండ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ అభ్యర్థిగా పోటీపడేలా శామ్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కృత్రిమ మేధ ఉన్న రోబోలు ఎన్నికల్లో పోటీచేయడంపై నిషేధం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌స)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : నిక్ గెర్రిట్‌సెన్
ఎక్కడ : న్యూజిలాండ్
అటకామా ఎడారిలో హెచ్‌ఐవీకి మందుభూమ్మీద అత్యంత ఎత్తయిన, పొడి వాతావరణం కలిగిన అటకామా ఎడారి (చిలీ) లో ఎయిడ్‌స చికిత్సలో ఉపయోగపడే సూక్ష్మజీవులను కనుగొన్నట్లు బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ పరిశోధకులు గుడ్‌ఫెల్లో చెప్పారు. సముద్ర మట్టానికి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తు గల ప్రాంతం నుంచి సేకరించిన మట్టిలో ఈ సూక్ష్మజీవులున్నాయని తెలిపారు. పర్యావరణ వ్యవస్థలో కీలకమైన యాక్టినోబ్యాక్టీరియా జాతి హెచ్‌ఐవీ వైరస్‌ను పునరుత్పత్తి చేసే ఎంజైమ్‌ను నిరోధించడంలో సహకరిస్తుందని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సూక్ష్మజీవుల నుంచి హెచ్‌ఐవీ కి మందు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ పరిశోధకులు
ఎక్కడ : అటకామా ఎడారి, చిలీ
రక్తకణం సైజులో రోబోల తయారీరక్తకణాల సైజులో ఉండే రోబోలను తయారుచేశామని హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రోబోలు శరీరంలోని చిన్న చిన్న అవయవభాగాల్లోకి చొచ్చుకుపోయి, అక్కడ ఉన్న సమస్యను నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అత్యంత సూక్ష్మపరిమాణంలో ఉన్న శైవలాలతో రూపొందించిన ఈ రోబోల లోపలి పొరల్లో అయస్కాంతాన్ని పూతగా పూశారు. దీంతో రోబో మన శరీరంలో ఎక్కడ ఉన్నా.. చర్మంపై నుంచి స్పష్టంగా తెలుసుకోవచ్చు. వీటిని ఎలుకల్లో ప్రవేశపెట్టి పరీక్షించగా.. అవి రక్తం, జీర్ణరసాలలో అనుకున్న సమయానికే కరిగిపోయాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
మత్స్య సంపదను గుర్తించే ‘సముద్ర’ పరిశోధన కేంద్ర సముద్ర మత్స్య సంపద పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలిసి సముద్ర జలాల్లో పెద్దఎత్తున చేపలు లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించే ‘సముద్ర’ ప్రాజెక్టును ప్రారంభించింది. సముద్రంలో మార్పులను విశ్లేషిస్తూ, మత్స్య సంపద లభ్యతపై అంచనాలు రూపొందించే ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ డెరైక్టర్ ఎ.గోపాల కృష్ణన్ తెలిపారు.
క్రీడలుదివిజ్ జోడికి బెంగళూరు ఓపెన్ డబుల్స్ టైటిల్ భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నవంబర్ 24న జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)-ఎల్గిన్ (రష్యా) జోడి 6-3, 6-0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్-మాటెజ్ సబనోవ్‌పై విజయం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరు ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : డబుల్స్ విజేత దివిజ్ శరణ్(భారత్), ఎల్గిన్(రష్యా)
నాగల్‌కు బెంగళూరు ఓపెన్ సింగిల్స్ టైటిల్ భారత ఆటగాడు సుమీత్ నాగల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. బెంగళూరు ఓపెన్ లో నవంబర్ 25న జరిగిన ఫైనల్లో అతను 6-3, 3-6, 6-2తో జే క్లార్క్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ట్రోఫీతో పాటు అతను రూ. 9.36 లక్షల (14,400 డాలర్లు) ప్రైజ్‌మనీని, 100 ర్యాంకింగ్ పాయింట్లను అందుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరు ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత సుమీత్ నాగల్
హాంకాంగ్ ఓపెన్ రన్నరప్‌గా పీవీ సింధు బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో భారత స్టార్ పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. నవంబర్ 26న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 18-21, 18-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 30,000 డాలర్ల (రూ. 19 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 15,200 డాలర్ల (రూ. 9 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం సింధుకిది రెండోసారి. ఈ సంవత్సరం సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాంకాంగ్ ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : మహిళల సింగిల్స్ టైటిల్ విజేత తై జు యింగ్, రన్నరప్‌గా పీవీ సింధు
ప్రపంచ యూత్ మహిళల బాక్సింగ్ చాంప్ భారత్ ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ చేరిన ఐదుగురు బాక్సర్లూ విజేతలుగా నిలిచి తొలిసారి భారత్‌ను ఓవరాల్ చాంపియన్‌గా నిలబెట్టారు. ఐదు స్వర్ణాలతోపాటు రెండు కాంస్యాలు నెగ్గిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించారు. నీతు (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బొరో (64 కేజీలు)లు నవంబర్ 26న జరిగిన టైటిల్ పోరులో పసిడి సాధించారు.
గోపీ థోనకల్‌కు ఆసియా మారథాన్ టైటిల్ ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత మారథాన్ రన్నర్ గోపీ థోనకల్ స్వర్ణ పతకం సాధించాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో కేరళకు చెందిన గోపీ చాంపియన్‌గా నిలిచాడు. 42.195 కి.మీ. దూరాన్ని గోపీ 2 గంటల 15 నిమిషాల 48 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా పురుషుల విభాగంలో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ రన్నర్‌గా గుర్తింపు పొందాడు. ఆండ్రే పెట్రోవ్ (ఉజ్బెకిస్తాన్-2గం:15ని:51 సెకన్లు) రజతం... బ్యాంబలేవ్ సెవీన్వ్ర్‌డాన్ (మంగోలియా-2గం:16ని:14 సెకన్లు) కాంస్యం గెలిచారు. ఓవరాల్‌గా ఆసియా మారథాన్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయ రన్నర్‌గా గోపీ నిలిచాడు. గతంలో మహిళల విభాగంలో ఆశ అగర్వాల్ (1985లో), సునీత గోదర (1992లో) మాత్రమే స్వర్ణాలు గెలిచారు. 1988 వరకు ఈ మారథాన్ రేసు ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఉండేది. 1988 నుంచి ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వేరు చేసి ఈ మారథాన్ రేసును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : పురుషుల విభాగంలో టైటిల్ విజేత గోపీ థోనకల్ (భారత్)
బొటాస్‌కు ‘అబుదాబి’ టైటిల్ఫార్ములావన్ సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను బొటాస్ గంటా 34 నిమిషాల 14.062 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఎస్తెబన్ ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.
నిర్ణీత 20 రేసులు ముగిశాక హామిల్టన్ 363 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకోగా... 317 పాయింట్లతో వెటెల్ రన్నరప్‌గా... 305 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. 668 పాయింట్లతో మెర్సిడెస్ జట్టు ప్రపంచ కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించగా... 187 పాయింట్లతో ఫోర్స్ ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అబుదాబి గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : విజేత బొటాస్
ప్రపంచ స్నూకర్ టైటిల్ విజేత..పంకజ్ భారత క్యూ స్పోర్‌ట్స (బిలియర్‌డ్స, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ (32) కెరీర్‌లో 18వ ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దోహా లో 2017 నవంబర్ 27న ముగిసిన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో అమీర్ నర్థోష్ (ఇరాన్)ను ఓడించి పంకజ్ ఛాంపియన్‌గా నిలిచాడు.
బెంగళూరుకు చెందిన పంకజ్ గతంలో ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్; 2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్; 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... మూడు సార్లు ప్రపంచ స్నూకర్ (2017, 2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ స్నూకర్ టైటిల్ విజేత
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : పంకజ్ అద్వానీ
ఫ్రాన్స్ కు డేవిస్ కప్ టైటిల్డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. పారిస్‌లో 2017 నవంబర్ 26న ముగిసిన ఫైనల్లో బెల్జియంను 3-2 తేడాతో ఫ్రాన్‌స ఓడించింది. ఫ్రాన్‌సకిది పదో డేవిస్ కప్ టైటిల్.
వార్తల్లో వ్యక్తులుతొలి మహిళా నేవీ పైలట్‌గా సుభాంగి స్వరూప్ భారత నావికా దళంలో మొట్టమొదటిసారిగా ఓ మహిళ పెలైట్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాంగి స్వరూప్ ఎంపికయ్యారు. మరో ముగ్గురు మహిళా అధికారులను కూడా నావికాదళం ఎంపిక చేసింది. వీరు.. న్యూఢిల్లీకి చెందిన ఆస్తా సెహ్‌గల్, పుదుచ్చేరికి చెందిన ఎ. రూప, కేరళకు చెందిన ఎస్.శక్తిమాయ. నావికాదళంలోని నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టొరేట్ (NAI) విభాగంలో ఈ ముగ్గురూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేరళలోని కన్ననూర్ జిల్లాలో ఉన్న ఇండియన్ నావల్ అకాడెమీలో ఈ నలుగురు మహిళలు నావల్ ఓరియంటేషన్ పూర్తి చేసుకున్నారు. ఉమెన్ పైలట్‌గా సుభాంగి స్వరూప్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మహిళా నేవీ పైలట్
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : సుభాంగి స్వరూప్
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలతలోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స్నేహలతా శ్రీవాస్తవ నవంబర్ 28న నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలవనుంది. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా స్థానంలో స్నేహలత డిసెంబర్ 1న బాధ్యతలు చేపడతారు. ఈమె పదవీ కాలం 2018 డిసెంబర్ 30న ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్ నియామకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : స్నేహలతా శ్రీవాస్తవ
ఎందుకు : అనూప్ మిశ్రా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో
‘కొలిమి రవ్వలు’ పుస్తకం ఆవిష్కరణఇటీవల హత్యకు గురైన కర్ణాటకకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నవంబర్ 28న ఆవిష్కరించారు. గౌరీ లంకేశ్ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గౌరీ లంకేశ్ పుస్తకం కొలిమి రవ్వలు ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రకాశ్ రాజ్
ఎయిరిండియా కొత్త సీఎండీ ప్రదీప్ సింగ్ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ కొత్త సీఎండీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నవంబర్ 28న నియమితులయ్యారు. ఈయన 1985 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రదీప్‌సింగ్ 2015 ఫిబ్రవరి నుంచి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. అలాగే కర్ణాటక అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్‌స కార్పొరేషన్ చైర్మన్‌గా, కర్నాటక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ నుంచి ప్రదీప్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిరిండియా కొత్త సీఎండీ నియామకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రదీప్ సింగ్
ఎందుకు : ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ స్థానంలో
విశ్వసుందరిగా డెమి-లేహ్ నెల్ పీటర్స్దక్షిణాఫ్రికా యువతి డెమి-లేహ్‌సెల్ పీటర్‌స(22) విశ్వసుందరిగా ఎంపికయ్యారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో 2017 నవంబర్ 26న జరిగిన తుది పోటీల్లో డెమి ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన శ్రద్ధ శశిధర్ 10వ స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశ్వ సుందరి 2017 విజేత
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డెమీలే-నెల్ పీటర్స్
ఎక్కడ : లాస్ వేగాస్
15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఎన్‌కే సింగ్ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్ 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నవంబర్ 27న నియమితులయ్యారు. రుణ స్థాయిలు, నగదు నిల్వలు, కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్‌టీ ప్రభావం వంటి అంశాలను 15వ ఫైనాన్స్ కమిషన్ సమీక్షించి అక్టోబర్ 2019 నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. ఈ కమీషన్ 2020 ఏప్రిల్ 1 నుంచీ ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి తగినసిఫార్సులు చేస్తుంది.
కమీషన్‌లో మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరి, నీతీ ఆయోగ్ సభ్యులు రమేష్ చాంద్, జార్జిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనూప్ సింగ్‌లు సభ్యులుగా ఉంటారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు సంబంధించిన 14వ ఫైనాన్స్ కమిషన్ 2013 జనవరి 2న ఏర్పాటయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఎన్‌కే సింగ్
అవార్డులుఅనిల్ దవే, చంద్ర భూషణ్‌లకు ఓజోన్ అవార్డు కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) డిప్యూటీ డెరైక్టర్ చంద్ర భూషణ్‌లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులు అందుకున్నారు. రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు. దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్‌కు భాగస్వామ్య అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అనిల్ దవే, చంద్ర భూషణ్‌లకు ఓజోన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : పర్యావరణ కార్యక్రమంలో భాగంగా
రాజ్‌కుమార్ కు ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుభారత్ తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన న్యూటన్ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల (ఏపీఎస్‌ఏ) కార్యక్రమంలో ఈ చిత్రం రెండు అవార్డులను దక్కించుకుంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌రావు ఉత్తమ నటుడిగా, మయాంక్ తివారీ, అమిత్ మసూర్కర్‌లు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలుగా ఎంపికయ్యారు.
హీరో రాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన న్యూటన్ ఆస్కార్ రేసులో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఎంపికైంది. న్యూటన్ చిత్రంను చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కథతో బ్లాక్ కామెడీ తరహా సినిమాగా తీశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడి అవార్డు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్
ఎందుకు : న్యూటన్ చిత్రంలో నటనకు గాను
డా. రామారెడ్డికి అమిత్ బోరా ఆరేషన్ అవార్డుఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్యులు, బీసీరాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డికి ‘డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు’ లభించింది. 2017 ఏడాదికిగానూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సైకియాట్రి(ఐఏపీపీ) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. నవంబర్ 23 నుంచి 26 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఐఏపీపీ 18వ వార్షిక సమావేశాల్లో రామారెడ్డికి అవార్డును ప్రదానం చేశారు.
అకాల మరణం పొందిన యువ మానసిక వైద్యుడు అమిత్ బోరా పేరు మీదుగా ఆయన తల్లిదండ్రులు ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డాక్టర్ కర్రి రామారెడ్డి

- టెలికం కంపెనీలు, ఐఎస్‌పీలు ఇంటర్నెట్ ద్వారా అందించే కంటెంట్, సర్వీసులకు విభిన్న డేటా చార్జీలు, ఉచిత సేవలు ఉండకూడదు.
- ఆన్‌లైన్ వీడియోలను ఎక్కువ-తక్కువ స్పీడ్‌తో చూపకూడదు.
- ఇంటర్నెట్ యాక్సెస్(సేవలు)లో వివక్షను నిరోధించేందుకు ప్రొవైడర్ల లెసెన్‌స నిబంధనలను మార్చాలి.
- కంటెంట్‌ను అడ్డుకోవడం, స్పీడ్‌ను తగ్గించడం లేదా పెంచడం వంటివి వివక్షగా పరిగణించాలి.
- ఈ వివక్షరహిత ఇంటర్నెట్ విధానం విషయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స (ఎలక్ట్రా నిక్ ఉపకరణాలను ఇంటర్నెట్‌తో అనుసంధానించడం) వంటి సేవల విషయంలో నిబంధనలు సడలించవచ్చు.
- కొత్త నిబంధనల పర్యవేక్షణతోపాటు ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు టెలికం శాఖ ఒక బహుళపక్ష మండలిని ఏర్పాటు చేయాలి. దీనిలో టెలికం ఆపరేటర్లు, ఐఎస్‌పీలు, కంటెంట్ ప్రొవైడర్లు, సామాజిక సంస్థలు, వినియోగదారుల ప్రతినిధులకు చోటు కల్పించాలి.
- టెలికం అపరేటర్లు తమ వెబ్ ట్రాఫిక్ నిర్వహణ విధానాలను ప్రకటించాలి. ప్రత్యేక సేవలు, కంటెంట్ ప్రొవైడర్లతో కుదుర్చుకునే ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలు వంటివన్నీ బహిర్గతపరచాలి.

- 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ధ్వనివేగం కంటే మూడురెట్ల అధిక వేగంతో కచ్చితంగా ఛేదించగలదు.
- ఆర్మీ, నౌకాదళం ఉపయోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు 3 టన్నులు కాగా, వాయుసేన ప్రయోగించే క్షిపణి మాత్రం 2.5 టన్నులే ఉంటుంది. అయినా సుఖోయ్-30 యుద్ధ విమానం మోసే అత్యధిక బరువున్న క్షిపణి ఇదే.
- సుఖోయ్ యుద్ధవిమానం ఒకసారికి ఒక క్షిపణినే తీసుకెళ్లగలదు.
- బ్రహ్మోస్‌ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి యుద్ధనౌకలు క్షిపణులను ప్రయోగించేలోగానే బ్రహ్మోస్ ఆ నౌకలను ధ్వంసం చేస్తుంది.
- క్షిపణిని ప్రయోగించిన వెంటనే సుఖోయ్ విమానం తిరుగు ప్రయాణమవుతుంది.
- ప్రస్తుతం ప్రపంచంలోని ఏ యుద్ధనౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు.
- ప్రస్తుతం 290 కిలో మీటర్లుగా ఉన్న లక్షిత దూరాన్ని 450 కిలోమీటర్లకు పెంచేందుకు బ్రహ్మోస్ క్షిపణుల రూపురేఖలు, సాంకేతికతలో మార్పులు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు.
- క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశంతో ఈ క్షిపణుల పరిధిని పెంచడం సులువు కానుంది.
- మరో 40 సుఖోయ్-30 యుద్ధ విమానాలు బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగలిగేలా వాటికి అవసరమైన మార్పులు చేయడంతోపాటు ఇంకో 272 విమానాలు సమకూర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది.
ఉమంగ్ యాప్‌ను ప్రారంభించిన ప్రధానిఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను కేంద్రం తెచ్చింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందొచ్చని అధికారులు చెప్పారు.
ఈ యాప్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు సులభంగా చేయొచ్చు. అంతేకాకుండా ఆధార్, డిజిలాకర్, భారత్ బిల్ పేమేంట్, ఈపీఎఫ్‌వో, కొత్త పాన్‌కు దరఖాస్తు తదితర సేవలనూ పొందొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ తెలుగుతో పాటు 12 భారతీయ భాషల్లో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా మాత్రమే పనిచేసే ఈ యాప్.. ఇంటర్నెట్ అవసరం లేని ఫీచర్‌ఫోన్‌లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమంగ్ యాప్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎందుకు : ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా
న్యూజిలాండ్‌లో తొలి వర్చువల్ రాజకీయ నేత ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ను న్యూజిలాండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిక్ గెర్రిట్‌సెన్(49) రూపొందించారు. ఫేస్‌బుక్ మెసెంజర్‌తో పాటు తన హోమ్‌పేజ్‌లో ఉన్న సర్వేల సాయంతో విషయాల్ని నేర్చుకునే శామ్.. ప్రపంచవ్యాప్తంగా విద్య, వలసలు, ఇళ్లు సహా పలు అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తుంది. శామ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉందనీ దాని రూపకర్త నిక్ తెలిపారు. 2020లో న్యూజిలాండ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ అభ్యర్థిగా పోటీపడేలా శామ్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కృత్రిమ మేధ ఉన్న రోబోలు ఎన్నికల్లో పోటీచేయడంపై నిషేధం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌స)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : నిక్ గెర్రిట్‌సెన్
ఎక్కడ : న్యూజిలాండ్
అటకామా ఎడారిలో హెచ్‌ఐవీకి మందుభూమ్మీద అత్యంత ఎత్తయిన, పొడి వాతావరణం కలిగిన అటకామా ఎడారి (చిలీ) లో ఎయిడ్‌స చికిత్సలో ఉపయోగపడే సూక్ష్మజీవులను కనుగొన్నట్లు బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ పరిశోధకులు గుడ్‌ఫెల్లో చెప్పారు. సముద్ర మట్టానికి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తు గల ప్రాంతం నుంచి సేకరించిన మట్టిలో ఈ సూక్ష్మజీవులున్నాయని తెలిపారు. పర్యావరణ వ్యవస్థలో కీలకమైన యాక్టినోబ్యాక్టీరియా జాతి హెచ్‌ఐవీ వైరస్‌ను పునరుత్పత్తి చేసే ఎంజైమ్‌ను నిరోధించడంలో సహకరిస్తుందని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సూక్ష్మజీవుల నుంచి హెచ్‌ఐవీ కి మందు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ పరిశోధకులు
ఎక్కడ : అటకామా ఎడారి, చిలీ
రక్తకణం సైజులో రోబోల తయారీరక్తకణాల సైజులో ఉండే రోబోలను తయారుచేశామని హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రోబోలు శరీరంలోని చిన్న చిన్న అవయవభాగాల్లోకి చొచ్చుకుపోయి, అక్కడ ఉన్న సమస్యను నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అత్యంత సూక్ష్మపరిమాణంలో ఉన్న శైవలాలతో రూపొందించిన ఈ రోబోల లోపలి పొరల్లో అయస్కాంతాన్ని పూతగా పూశారు. దీంతో రోబో మన శరీరంలో ఎక్కడ ఉన్నా.. చర్మంపై నుంచి స్పష్టంగా తెలుసుకోవచ్చు. వీటిని ఎలుకల్లో ప్రవేశపెట్టి పరీక్షించగా.. అవి రక్తం, జీర్ణరసాలలో అనుకున్న సమయానికే కరిగిపోయాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
మత్స్య సంపదను గుర్తించే ‘సముద్ర’ పరిశోధన కేంద్ర సముద్ర మత్స్య సంపద పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలిసి సముద్ర జలాల్లో పెద్దఎత్తున చేపలు లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించే ‘సముద్ర’ ప్రాజెక్టును ప్రారంభించింది. సముద్రంలో మార్పులను విశ్లేషిస్తూ, మత్స్య సంపద లభ్యతపై అంచనాలు రూపొందించే ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ డెరైక్టర్ ఎ.గోపాల కృష్ణన్ తెలిపారు.
క్రీడలుదివిజ్ జోడికి బెంగళూరు ఓపెన్ డబుల్స్ టైటిల్ భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నవంబర్ 24న జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)-ఎల్గిన్ (రష్యా) జోడి 6-3, 6-0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్-మాటెజ్ సబనోవ్‌పై విజయం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరు ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : డబుల్స్ విజేత దివిజ్ శరణ్(భారత్), ఎల్గిన్(రష్యా)
నాగల్‌కు బెంగళూరు ఓపెన్ సింగిల్స్ టైటిల్ భారత ఆటగాడు సుమీత్ నాగల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. బెంగళూరు ఓపెన్ లో నవంబర్ 25న జరిగిన ఫైనల్లో అతను 6-3, 3-6, 6-2తో జే క్లార్క్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ట్రోఫీతో పాటు అతను రూ. 9.36 లక్షల (14,400 డాలర్లు) ప్రైజ్‌మనీని, 100 ర్యాంకింగ్ పాయింట్లను అందుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరు ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత సుమీత్ నాగల్
హాంకాంగ్ ఓపెన్ రన్నరప్‌గా పీవీ సింధు బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో భారత స్టార్ పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. నవంబర్ 26న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 18-21, 18-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 30,000 డాలర్ల (రూ. 19 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 15,200 డాలర్ల (రూ. 9 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం సింధుకిది రెండోసారి. ఈ సంవత్సరం సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాంకాంగ్ ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : మహిళల సింగిల్స్ టైటిల్ విజేత తై జు యింగ్, రన్నరప్‌గా పీవీ సింధు
ప్రపంచ యూత్ మహిళల బాక్సింగ్ చాంప్ భారత్ ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ చేరిన ఐదుగురు బాక్సర్లూ విజేతలుగా నిలిచి తొలిసారి భారత్‌ను ఓవరాల్ చాంపియన్‌గా నిలబెట్టారు. ఐదు స్వర్ణాలతోపాటు రెండు కాంస్యాలు నెగ్గిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించారు. నీతు (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బొరో (64 కేజీలు)లు నవంబర్ 26న జరిగిన టైటిల్ పోరులో పసిడి సాధించారు.
గోపీ థోనకల్‌కు ఆసియా మారథాన్ టైటిల్ ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత మారథాన్ రన్నర్ గోపీ థోనకల్ స్వర్ణ పతకం సాధించాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో కేరళకు చెందిన గోపీ చాంపియన్‌గా నిలిచాడు. 42.195 కి.మీ. దూరాన్ని గోపీ 2 గంటల 15 నిమిషాల 48 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా పురుషుల విభాగంలో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ రన్నర్‌గా గుర్తింపు పొందాడు. ఆండ్రే పెట్రోవ్ (ఉజ్బెకిస్తాన్-2గం:15ని:51 సెకన్లు) రజతం... బ్యాంబలేవ్ సెవీన్వ్ర్‌డాన్ (మంగోలియా-2గం:16ని:14 సెకన్లు) కాంస్యం గెలిచారు. ఓవరాల్‌గా ఆసియా మారథాన్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయ రన్నర్‌గా గోపీ నిలిచాడు. గతంలో మహిళల విభాగంలో ఆశ అగర్వాల్ (1985లో), సునీత గోదర (1992లో) మాత్రమే స్వర్ణాలు గెలిచారు. 1988 వరకు ఈ మారథాన్ రేసు ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఉండేది. 1988 నుంచి ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వేరు చేసి ఈ మారథాన్ రేసును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : పురుషుల విభాగంలో టైటిల్ విజేత గోపీ థోనకల్ (భారత్)
బొటాస్‌కు ‘అబుదాబి’ టైటిల్ఫార్ములావన్ సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను బొటాస్ గంటా 34 నిమిషాల 14.062 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఎస్తెబన్ ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.
నిర్ణీత 20 రేసులు ముగిశాక హామిల్టన్ 363 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకోగా... 317 పాయింట్లతో వెటెల్ రన్నరప్‌గా... 305 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. 668 పాయింట్లతో మెర్సిడెస్ జట్టు ప్రపంచ కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించగా... 187 పాయింట్లతో ఫోర్స్ ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అబుదాబి గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : విజేత బొటాస్
ప్రపంచ స్నూకర్ టైటిల్ విజేత..పంకజ్ భారత క్యూ స్పోర్‌ట్స (బిలియర్‌డ్స, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ (32) కెరీర్‌లో 18వ ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దోహా లో 2017 నవంబర్ 27న ముగిసిన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో అమీర్ నర్థోష్ (ఇరాన్)ను ఓడించి పంకజ్ ఛాంపియన్‌గా నిలిచాడు.
బెంగళూరుకు చెందిన పంకజ్ గతంలో ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్; 2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్; 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... మూడు సార్లు ప్రపంచ స్నూకర్ (2017, 2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ స్నూకర్ టైటిల్ విజేత
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : పంకజ్ అద్వానీ
ఫ్రాన్స్ కు డేవిస్ కప్ టైటిల్డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. పారిస్‌లో 2017 నవంబర్ 26న ముగిసిన ఫైనల్లో బెల్జియంను 3-2 తేడాతో ఫ్రాన్‌స ఓడించింది. ఫ్రాన్‌సకిది పదో డేవిస్ కప్ టైటిల్.
వార్తల్లో వ్యక్తులుతొలి మహిళా నేవీ పైలట్‌గా సుభాంగి స్వరూప్ భారత నావికా దళంలో మొట్టమొదటిసారిగా ఓ మహిళ పెలైట్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాంగి స్వరూప్ ఎంపికయ్యారు. మరో ముగ్గురు మహిళా అధికారులను కూడా నావికాదళం ఎంపిక చేసింది. వీరు.. న్యూఢిల్లీకి చెందిన ఆస్తా సెహ్‌గల్, పుదుచ్చేరికి చెందిన ఎ. రూప, కేరళకు చెందిన ఎస్.శక్తిమాయ. నావికాదళంలోని నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టొరేట్ (NAI) విభాగంలో ఈ ముగ్గురూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేరళలోని కన్ననూర్ జిల్లాలో ఉన్న ఇండియన్ నావల్ అకాడెమీలో ఈ నలుగురు మహిళలు నావల్ ఓరియంటేషన్ పూర్తి చేసుకున్నారు. ఉమెన్ పైలట్‌గా సుభాంగి స్వరూప్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మహిళా నేవీ పైలట్
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : సుభాంగి స్వరూప్
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలతలోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స్నేహలతా శ్రీవాస్తవ నవంబర్ 28న నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలవనుంది. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా స్థానంలో స్నేహలత డిసెంబర్ 1న బాధ్యతలు చేపడతారు. ఈమె పదవీ కాలం 2018 డిసెంబర్ 30న ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్ నియామకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : స్నేహలతా శ్రీవాస్తవ
ఎందుకు : అనూప్ మిశ్రా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో
‘కొలిమి రవ్వలు’ పుస్తకం ఆవిష్కరణఇటీవల హత్యకు గురైన కర్ణాటకకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నవంబర్ 28న ఆవిష్కరించారు. గౌరీ లంకేశ్ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గౌరీ లంకేశ్ పుస్తకం కొలిమి రవ్వలు ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రకాశ్ రాజ్
ఎయిరిండియా కొత్త సీఎండీ ప్రదీప్ సింగ్ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ కొత్త సీఎండీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నవంబర్ 28న నియమితులయ్యారు. ఈయన 1985 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రదీప్‌సింగ్ 2015 ఫిబ్రవరి నుంచి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. అలాగే కర్ణాటక అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్‌స కార్పొరేషన్ చైర్మన్‌గా, కర్నాటక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ నుంచి ప్రదీప్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిరిండియా కొత్త సీఎండీ నియామకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రదీప్ సింగ్
ఎందుకు : ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ స్థానంలో
విశ్వసుందరిగా డెమి-లేహ్ నెల్ పీటర్స్దక్షిణాఫ్రికా యువతి డెమి-లేహ్‌సెల్ పీటర్‌స(22) విశ్వసుందరిగా ఎంపికయ్యారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో 2017 నవంబర్ 26న జరిగిన తుది పోటీల్లో డెమి ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన శ్రద్ధ శశిధర్ 10వ స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశ్వ సుందరి 2017 విజేత
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డెమీలే-నెల్ పీటర్స్
ఎక్కడ : లాస్ వేగాస్
15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఎన్‌కే సింగ్ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్ 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నవంబర్ 27న నియమితులయ్యారు. రుణ స్థాయిలు, నగదు నిల్వలు, కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్‌టీ ప్రభావం వంటి అంశాలను 15వ ఫైనాన్స్ కమిషన్ సమీక్షించి అక్టోబర్ 2019 నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. ఈ కమీషన్ 2020 ఏప్రిల్ 1 నుంచీ ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి తగినసిఫార్సులు చేస్తుంది.
కమీషన్‌లో మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరి, నీతీ ఆయోగ్ సభ్యులు రమేష్ చాంద్, జార్జిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనూప్ సింగ్‌లు సభ్యులుగా ఉంటారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు సంబంధించిన 14వ ఫైనాన్స్ కమిషన్ 2013 జనవరి 2న ఏర్పాటయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఎన్‌కే సింగ్
అవార్డులుఅనిల్ దవే, చంద్ర భూషణ్‌లకు ఓజోన్ అవార్డు కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) డిప్యూటీ డెరైక్టర్ చంద్ర భూషణ్‌లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులు అందుకున్నారు. రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు. దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్‌కు భాగస్వామ్య అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అనిల్ దవే, చంద్ర భూషణ్‌లకు ఓజోన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : పర్యావరణ కార్యక్రమంలో భాగంగా
రాజ్‌కుమార్ కు ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుభారత్ తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన న్యూటన్ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల (ఏపీఎస్‌ఏ) కార్యక్రమంలో ఈ చిత్రం రెండు అవార్డులను దక్కించుకుంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌రావు ఉత్తమ నటుడిగా, మయాంక్ తివారీ, అమిత్ మసూర్కర్‌లు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలుగా ఎంపికయ్యారు.
హీరో రాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన న్యూటన్ ఆస్కార్ రేసులో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఎంపికైంది. న్యూటన్ చిత్రంను చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కథతో బ్లాక్ కామెడీ తరహా సినిమాగా తీశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడి అవార్డు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్
ఎందుకు : న్యూటన్ చిత్రంలో నటనకు గాను
డా. రామారెడ్డికి అమిత్ బోరా ఆరేషన్ అవార్డుఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్యులు, బీసీరాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డికి ‘డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు’ లభించింది. 2017 ఏడాదికిగానూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సైకియాట్రి(ఐఏపీపీ) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. నవంబర్ 23 నుంచి 26 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఐఏపీపీ 18వ వార్షిక సమావేశాల్లో రామారెడ్డికి అవార్డును ప్రదానం చేశారు.
అకాల మరణం పొందిన యువ మానసిక వైద్యుడు అమిత్ బోరా పేరు మీదుగా ఆయన తల్లిదండ్రులు ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డాక్టర్ కర్రి రామారెడ్డి
No comments:
Post a Comment