AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 4 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 4


 *🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 04 🌎*                                                        *◼డిసెంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 338వ రోజు (లీపు సంవత్సరములో 339వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 27 రోజులు మిగిలినవి.*

*⏱సంఘటనలు*⏱ 

*♦1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.*

*♦1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.*

*❤జననాలు*❤ 

*🔥1877: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958)జి సైదేశ్వర రావు*

*🔥1898: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (మ.1961)*

*🔥1910: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)*

*🔥1919: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012)*

*🔥1922: ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. (మ.1974)*

*🔥1929: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (మ. 1995)*

*🔥1945: ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి*.

*🔥1977: అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.*

*🔥1981: రేణూ దేశాయ్, తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్*.

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*♦నౌకాదళ దినోత్సవం.*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

*🌳సుభాషిత వాక్కు*🌳

*"అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు.*
*అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులుండరు.*
*అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు."*

*"I didn’t get there by wishing for it or hoping for it, but by working for it.”*

  *♦మంచి పద్యం*

*తప్పకుండ చేయు తనువుకు కసరత్తు*
*విడిచిపోవు కొవ్వు విరివిగున్న*
*అలుపు అనక చేయు ఆరోగ్యము కలుగు*
*వాస్తవంబు వేము వారి మాట*

*❗భావం*:-

*అనునిత్యం అలసత్వాన్ని వీడి వ్యాయామం చేసినచో అనారోగ్యము దరిచేరదు.*

    *🔹నేటి జీ కె🔹:*

*1)  థార్ ఎడారిలో ప్రవహించే ఒకే ఒక్క నది ఏది?*

A: *లూని*

*2) "నీలగిరి" పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది?*

A: *దొడబెట్ట*

*3) "నానాజాతి సమితి స్థాపకుడు ఎవరు?*

A: *ఉడ్రో విల్సన్*

*4)  "బోల్షివిక్ పార్టీ" స్థాపకుడు ఎవరు?*

A: *లెనిన్*

*5) ఆధునిక చైనా నిర్మాత ఎవరు?*

A: *సన్ యెట్-సెన్*

ఈ రోజు జికె 

*1.) ఆరెంజ్ ప్రైజ్ ఎవరికి మాత్రమే బహుకరిస్తారు?*

*జ: మహిళారచయితలకు (1996)*

*2.) సార్క్ అవార్డు ను ఎవరికి ప్రధానం చేస్తారు?*

*జ: సార్క్ సభ్యదేశాలలో ప్రసిద్ధ వ్యక్తులకు(2005)*

*3) .టెంపుల్టన్ అవార్డు ఎవరికి ప్రధానo చేస్తారు?*

*జ: మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన చింతన పెంపొందించుటకు కృషిచేసిన వారికి ఇస్తారు.(1972)*

*4.) బి. డి. గోయెంకా అవార్డు ఎవరికి ప్రధానం చేస్తారు?*

*జ:-పత్రికా రంగంలో కృషి చేసిన వారికి బహుకరిస్తారు*.

*5) .శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగంలో కృషిచేసిన వారికి ఇస్తారు?*

*జ:-శాస్త్ర&సాంకేతిక విజ్ఞాన రంగాలలో*

*6) .సత్యశోధక్ సమాజం, ధీనబందు సార్వజనిక సభ స్థాపకులు?*

*జ:-జ్యోతి భా పూలే*

*7) ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకులు?*

*జ:;రాస్ బిహారి బోస్*

*8) బహమని సామ్రాజ్య స్థాపకుడు-*

*జ: అల్లా ఉద్దీన్ హసన్ గంగూ బహుమాన్ షా*

*9) విజయనగర రాజుల కాలంలో రెవిన్యూ డిపార్ట్మెంట్ ను ఏమని పిలిచేవారు?*

*జ: అటావన*

*10) మువ్వ గోపాల పదాలను రచించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు?*

  *జ: క్షేత్రయ్య*


No comments:

Post a Comment