*🌏 చరిత్రలో ఈరోజు 🌎*
*🌅జనవరి 9*🌅
*🏞సంఘటనలు*🏞
ప్రవాస భారతీయుల దినోత్సవం. 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా జరుపుతున్నది.
1969: మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది.
1982: భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి అంటార్కిటికాను చేరింది.
2009: ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
*🌻🌻జననాలు*🌻🌻
1922: నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా.
1965: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్.
1985: మిట్టపల్లి సురేందర్, తెలుగు జానపద, సినీ గీతరచయిత.
1995: దేవేంద్ర హర్నె [1] 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి ప్రణమ్య మెనారియకి కూడా 25 వేళ్ళు ఉన్నాయి.
*🌹🌹మరణాలు*🌹🌹
*🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷
🔻ప్రవాస భారతీయ దివస్
[1/9, 07:59] +91 95020 29120: *తెలంగాణ న్యూస్*
*💥ఒక్కో పోస్టుకు 31 మంది పోటీ*
🔷ఎస్జీటీలో అత్యల్పం, ఎస్‌ఏ(పీఈ)లో అధికం
🔷స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 1.45 లక్షల దరఖాస్తులు
🔷టీఆర్‌టీ దరఖాస్తులో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు అవకశం
♦ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పోటీ అత్యల్పంగా ఉంది. ఒక్కో పోస్టుకు సగటున 16.46 మంది అభ్యర్థులు మాత్రమే పోటీపడనున్నారు. టీఆర్‌టీకి రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్నారు.
♦ టీఎస్‌పీఎస్సీ వెలువరించిన 8,792 పోస్టులతో కూడిన ప్రకటనకు అక్టోబరు నుంచి జనవరి 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు. టీఆర్‌టీ దరఖాస్తులో అభ్యర్థుల వ్యక్తిగత వివరాల్లో దొర్లిన తప్పులను సరిచేసేందుకు ‘ఎడిట్’ ఆప్షన్ ఇస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సవరణకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
♦ అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 1,45,158 దరఖాస్తులు వచ్చాయి.ఆ తరువాత స్థానంలో ఎస్జీటీ పోస్టులకు 89,149 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. *జిల్లాల వారీగా చూసినపుడు ఈ నిష్పత్తి మారుతుంది.*
♦టీఆర్‌టీ కింద వెలువరించిన 8,792 ఖాళీలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఒక్కో పోస్టుకు సగటున 31.57 మంది చొప్పున పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.
[1/9, 07:59] +91 95020 29120: *🌷🌱పాఠశాల అసెంబ్లీ కోసం🌱🌷*
*🍥09-01-2018*
*💧సుభాషిత వాక్కు*
*"నీ శత్రువు మీద నీవు రగుల్చుకున్న అగ్రహజ్వాల అతని కన్నా నిన్నే ఎక్కువగా దహించివేస్తుంది."*
*"Live your life as if everything is rigged in your favour."*
*🔹మంచి పద్యం*
*కడలిలోతు కూడ కాంచగ వచ్చును*
*గగన దూరములను కనగ వచ్చు*
*కాంతమనసు లోతు కాంచగలేముగా*
*వాస్తవంబు వేమువారి మాట*
*🔸భావం:*
*ఓ వేము ! సముద్రం యొక్క లోతును, సూర్య చంద్రులకు గల దూరాన్ని చెప్పవచ్చేమో గానీ, స్త్రీ యొక్క హృదయపు లోతులను చెప్పలేము.*
*♦నేటి జీ కె*
*ప్రాజెక్ట్ పేరు--నది--లబ్ది పొందే జిల్లాలు*
● *సుంకేసుల--తుంగభద్ర--కర్నూలు*
● *పులిచింతల--కృష్ణా--కృష్ణా, గుంటూరు, ప్రకాశం,వెస్ట్ గోదావరి*
● *జంజావతి--జంజావతి--విజయనగరం*
● *కోట్ల.విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్--srbc--కర్నూలు, కడప*
● *ఏలేరు రిజర్వాయర్--ఏలేరు--తూర్పుగోదావరి*
● *ఒట్టిగడ్డ--నాగావళి--శ్రీకాకుళం*
● *తాండవ--తాండవ--విశాఖపట్నం*
● *చెయ్యేరు--చెయ్యేరు--కడప*
[1/9, 07:59] +91 95020 29120: _*👇👇TRT APPLICATION ఎడిట్ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు*_
_*TRT అన్ని అప్లికేషన్ ల options Edit చేసుకొనే తేదీలు : 9th - 12th January*_
_*కేవలం ఒక్కసారి మాత్రమే TSPSC అవకాశం కల్పించింది.కావున అభ్యర్థులు ఒక్కటికి రెండు సార్లు సరి చూసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు.*_
_*TSPSC ID, DATE OF BIRTH, JOURNAL NUMBER ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP వస్తది. OTP ద్వారా అప్లికేషన్ కు లాగిన్ అవ్వాలి.*_
_*CASTE సర్టిఫికెట్ తో సహా అన్నింటికీ ఎడిట్ ఆప్షన్ కలదు.*_
_*మీ అప్లికేషన్ మీ సమక్షంలో సరిచూస్కొగలరు.కంప్యూటర్ సెంటర్ వాళ్లకు అన్ని తెలుసు అనుకోని చూడకుండా ఉండకండి.*_
_*వాళ్లకు కూడా అన్నివిషయాలలో అవగాహన ఉండకపోవచ్చు కావున ఎవరి అప్లికేషన్ వారే సరిచూస్కోవడం ఉత్తమం.*_
_*ఇదే ఆఖరి అవకాశం ఇక్కడ తప్పు జరిగితే,మళ్లీ అవకాశం లేదు.*_
[1/9, 07:59] +91 95020 29120: *🎾సృజనాత్మక స్ఫూర్తి.. సాంకేతిక దీప్తి*
*చిరు నమూనాలతో మెరిసిన భావి ఆవిష్కర్తలు*
*ఆకట్టుకుంటున్న దక్షిణ భారత సైన్స్ ప్రదర్శన*
*12వ తేదీ వరకు పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం*
🏀 హైదరాబాద్-
నమూనాల ఆవిష్కర్తల మస్తిష్కాల్లో సృజనాత్మకత వెల్లివిరిసింది. భావి భారతావని శాస్త్ర సాంకేతిక రంగానికి తామే ప్రతినిధులమంటూ వారు ప్రదర్శించిన ఆవిష్కరణలు ఆలోచింపజేశాయి. తమ నమూనాల ప్రయోజనాల గురించి వారు వివరించిన తీరు ఆకట్టుకుంది. హైదరాబాద్లో సోమవారం ప్రారంభమైన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన-2018 ఇందుకు వేదికైంది. సికింద్రాబాద్ సెబాస్టియన్ రోడ్లోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో ఈ నెల 12 వరకు ప్రదర్శన కొనసాగనుంది.
తెలంగాణ విద్యాశాఖ, బెంగళూరు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం(వీఐటీఎం) ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు.
*1🛑అంశం: రవాణా, సమాచార వ్యవస్థలు*
* బృందం: సంగన్ గౌడ, నిశాంత్ జె గౌడ (9వ తరగతి)
* పాఠశాల: విజయ విఠల విద్యాశాల (మైసూర్)
* గైడ్ టీచర్: వీణామూర్తి
*🏀పని చేసే విధానం*: రోడ్డు, రైలు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ బృందం ‘సాగా ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్’ అనే నమూనా ఏర్పాటు చేసింది. ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణ కోసం అప్రమత్తం చేసే వ్యవస్థను రూపొందించారు. మూల మలుపు సమీపంలో రహదారిపై వేగ నిరోధకాల అడుగుభాగంలో సెన్సర్లను ఏర్పాటు చేయాలి. వాహనం వేగనిరోధకం పైకి ఎక్కగానే అందులోని సెన్సర్ గ్రహిస్తుంది. మూల మలుపు తిరిగాక ఎదురుగా వచ్చే వాహనాన్ని అప్రమత్తం చేసేలా అవతలి వైపు విద్యుత్తు దీపం దానంతట అదే వెలుగుతుంది. పగటి పూట అయితే విద్యుత్తు దీపం వెలిగితే కనిపించే అవకాశం తక్కువ కాబట్టి శబ్దం వినిపించే ఏర్పాటు ఉంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు జీపీఎస్ ద్వారా సమీపంలోని వైద్యశాలలకు సమాచారం అందించే వ్యవస్థను రూపొందించారు. అటవీ ప్రాంతాల్లో రహదారులు, రైల్వేట్రాక్ల దగ్గర తరచూ ప్రమాదాలు జరిగి వన్యప్రాణులు మృత్యువాత పడటాన్ని నిరోధించే వ్యవస్థకు రూపకల్పన చేశారు.
*2✡అంశం: పట్టాలు దాటేవారికి రక్షణ*
* విద్యారి ్థ: వి.శివశక్తి
* పాఠశాల: టీఎస్ఎన్ మెట్రిక్యులేషన్ స్కూల్(దాలవాయి-తమిళనాడు)
* గైడ్ టీచర్: సంగీత
*🔵పని చేసే విధానం*: రైల్వేస్టేషన్లు, రైల్వేక్రాసింగ్ల దగ్గర జరిగే ప్రమాదాల్ని నివారించడం ద్వారా మానవుల ప్రాణాల్ని కాపాడే వ్యవస్థపై విద్యార్థిని శివశక్తి ‘సేవ్ హ్యూమన్లైఫ్ యూజింగ్ డిజిటల్ అండ్ టెక్నలాజికల్ సొల్యూషన్స్’ నమూనాను రూపొందించింది. రైల్వేస్టేషన్లలో తప్పనిసరిగా పైవంతెన ఉన్నా.. పలువురు ప్రయాణికులు పట్టాలను దాటుతూనే ఒక ప్లాట్ఫాం నుంచి మరో ప్లాట్ఫాం పైకి వెళ్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. వాటిని నివారించేందుకు ప్లాట్ఫామ్ల దగ్గర తాత్కాలికంగా బారియర్స్ను ఏర్పాటు చేయడం నమూనాలో భాగం. ప్లాట్ఫాం దగ్గర ఏర్పాటు చేసే ఈ బారియర్స్ను రిమోట్ సహాయంతో ఆపరేట్ చేయొచ్చు. రైలు వచ్చేంత వరకు ఈ బారియర్స్ను గోడ మాదిరిగా పైకి లేపేందుకు వీలుంటుంది. రైలు ప్లాట్ఫాం పైకి రైలు పట్టాలపైకి వచ్చేంత వరకు ఈ గోడ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు పట్టాలు దాటే అవకాశముండదు. తప్పనిసరిగా పైవంతెన ఎక్కి దాటాలి. రైలు ప్లాట్ఫాం పైకి వచ్చి నిలిచిన తర్వాత పట్టాలకు బిగించిన సెన్సర్ల ఆధారంగా బారియర్స్ వాటంతట అవే భూమి లోపలికి దిగిపోతాయి. కాపలా సిబ్బంది లేని రైల్వే క్రాసింగ్ల దగ్గర సాంకేతికతను ఉపయోగించి గేట్లు వాటంతట అవే తెరచుకొని, మూసుకునే పరిజ్ఞానాన్ని రూపొందించారు. ఈ తరహా క్రాసింగ్ల దగ్గర పట్టాలపై రెండు వైపులా కొద్ది దూరంలో సెన్సర్లను అమర్చుతారు. రైలు మరికొంత సేపట్లో క్రాసింగ్ వద్దకు వస్తున్న సమయంలోనే గేట్లు వాటంతట అవే మూసుకుంటాయి.
*3🅾అంశం: స్వయం శుభ్రత.. మూత్రశాల*
* బృందం: టి.జయకృష్ణ, ధనుష్
* పాఠశాల: కూనంనేనివారి పాలెం జడ్పీహెచ్ఎస్ (సంతనూతలపాడు- ప్రకాశం)
*🎾పని చేసే విధానం:* స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అపరిశుభ్రత నెలకొంటున్న దృష్ట్యా విద్యార్థులు ఈ నమూనాను రూపొందించారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా మూత్రశాలలను ఉపయోగించుకుంటూనే.. వాటిని ఏలా శుభ్రం చేసుకోవాలనేది నమూనాలో భాగం. రోడ్డు పక్కన ప్రజలు ఉపయోగించుకునేందుకు మూత్రశాలలు ఏర్పాటు చేసినా అక్కడుండే అపరిశుభ్రత కారణంగా మూత్ర విసర్జనకు వెళ్లేందుకే జంకే పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో మూత్రశాలలు శుభ్రంగా ఉండాలంటే వాటిపై ట్యాంక్ను ఏర్పాటు చేసి లోపలికి వెళ్లే మార్గానికి అనుసంధానం చేసుకునే పైప్లను అమర్చారు. వాటి ద్వారా ట్యాంక్, సబ్ట్యాంక్లు ఉండే విధంగా వాల్వులను ఏర్పాటు చేశారు. మూత్రశాలకు వెళ్లే వ్యక్తి డోర్ను తోసుకొని వెళ్లి మూత్ర విసర్జన పూర్తయి బయటకు వచ్చే సమయంలో డోర్ను బయటకు నెట్టగానే ట్యాంకు నుంచి నీరు దానంతట అదే విడుదలయ్యేలా నమూనా తయారు చేశారు. తద్వారా ఆ ప్రాంతం శుభ్రం అవుతుంది.
*4🌐అంశం: స్మార్ట్ సైకిల్*
* విద్యార్థిని: శ్రీదళదేవి(8వ తరగతి)
* పాఠశాల: కామరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(పుదుచ్చేరి)
* గైడ్ టీచర్: ఇక్బాల్ బాషా
*🏀పని చేసే విధానం:* శారీరకంగా ఆరోగ్యం బాగుండేందుకు సాధారణంగా మనుషులు వ్యాయామం చేస్తుంటారు. అందులో సైక్లింగ్ చేయడం ఉత్తమంగా చెబుతారు. ఇతర వాహనాలతో పోలిస్తే సైకిల్ పర్యావరణ హితంగానూ పనిచేస్తుంది. ఈ సూత్రాన్నే ఆధారంగా చేసుకొని శ్రీదళదేవి సరికొత్త రీతిలో స్మార్ట్ సైకిల్ను రూపొందించింది. సాధారణ సైకిల్ అయితే పెడెల్ను 360 డిగ్రీల కోణంలో తొక్కాల్సి ఉంటుంది. ఇది పళ్లచక్రంతోపాటు చెయిన్తో కూడిన ‘పాల్ అండ్ రాచెట్’ పరిజ్ఞానంతో పనిచేస్తుంది. స్మార్ట్ సైకిల్ ఇందుకు భిన్నం. దీనిలో పళ్లచక్రం, చెయిన్ ఉండదు. ఉండేదల్లా మూడు ఇనుప కడ్డీలే. ఇవి ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉండే ‘బార్ లింకింగ్ మెకానిజం’ పరిజ్ఞానం దీని సొంతం. ఈ పరిజ్ఞానం వల్ల పెడల్ను 360 డిగ్రీల కోణంలో కాకుండా కొంత మేరకే తొక్కితే సరిపోతుంది. శారీరకంగా ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేకుండానే సాధారణ సైకిల్కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశముంటుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ స్మార్ట్ సైకిల్ మధుమేహం, వూబకాయం, వెన్నునొప్పి బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది.
*5🅾అంశం: ఎం.స్మార్ట్ రోవర్*
* విద్యార్థి: నివి శ్రీధర్ వినురాజ్
* పాఠశాల: వీహెచ్ఎస్ఎస్(కంచికులనగరి- కేరళ)
* గైడ్ టీచర్: రజని.ఆర్
*🔵పని చేసే విధానం:* సాధారణంగా రోబోలను ఏదో ఒక పని కోసం రూపొందిస్తారు. వినురాజ్ మాత్రం బహుళ ప్రయోజనకారిగా పనిచేసే ఎం.స్మార్ట్ రోవర్ తరహా రోబోను రూపొందించాడు. గడ్డిని కత్తిరించడం, టైల్స్ను శుభ్ర పరచడం, లోహాల్ని గుర్తించడం, నీటిలో తేలియాడే చెత్తను తొలగించడంతోపాటు అగ్నిమాపక యంత్రం, వాక్యూమ్ క్లీనర్, వైర్లెస్ ఛార్జర్, పోర్టబుల్ ఏసీ యూపీఎస్గా పనిచేస్తుంది. ఈ రోబోకు సెన్సర్లను కలిగిన చేయి కూడా ఉంది. ఈ బహుళ ప్రయోజనకారి రోవర్ను ఏ ప్రాంతానికైనా తరలించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ ఉంది. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికులకు ఇది చాలా వరకు ఉపయుక్తమవుతుంది. శత్రువుల కదలికలను కనిపెట్టే ట్రాకింగ్ డివైజ్గా పనిచేస్తుంది. డ్రోన్ సహాయంతో ఆకాశమార్గంలో ఈ రోవర్ను పంపి శత్రువుల ఆనుపానుల్ని కనిపెట్టొచ్చు.
*6🛑అంశం: స్పర్శను అందించే కృత్రిమ చేయి*
* విద్యార్థిని: రామశ్రీ
* పాఠశాల: సెయింట్ పాల్స్ స్కూల్ (భద్రాచలం)
*🎾పని చేసే విధానం:* చేయిని కోల్పోయిన దివ్యాంగులకు నిజమైన చేయి ద్వారా లభించే స్పర్శను అందించేలా ప్రత్యేక బయో ఆర్మ్ను రూపొందించింది రామశ్రీ. చేయి కోల్పోయిన చివరన బయో ఆర్మ్ చేతిని అమర్చి అందులో ఉన్న సెన్సర్ల ద్వారా మెదడుకు సంకేతాలను పంపించి స్పర్శను తెలుపుతాయి. ఈ విద్యార్థినే... రోబోటిక్ ఆర్మ్నూ తయారు చేసింది. గనులు, పరిశ్రమల్లో మనిషి చేయి దూరని చోటకు వెళ్లి పనిచేయడం దీని ప్రత్యేకత. అంధులకు తక్కువ ఖర్చుతో చూపును ప్రసాదించేందుకు ‘బయో ఐ’ని తయారు చేసింది. ఇందులో భాగంగా కంటి దగ్గర చిన్నపాటి కెమెరాను అమర్చుతారు. కెమెరా చిత్రీకరించే దృశ్యాన్ని వైర్లెస్ ట్రాన్స్మిషన్ ద్వారా రెటీనాను ప్రేరేపించి ఎలక్ట్రోల్ సంకేతాల ద్వారా అంధులు చూడగలగడం ఈ పరికరం ప్రత్యేకత. ఈ పరికరం వల్ల కంటిచూపు 80 శాతం పనిచేసే వీలుంది.
*🎾ఆరు రాష్ట్రాలు... 300 నమూనాలు*
ఈ విజ్ఞాన ప్రదర్శనలో ఆరు రాష్ట్రాల విద్యార్థులు నమూనాలను ప్రదర్శిస్తున్నారు. దక్షిణ భారత స్థాయి కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల నమూనాల్ని ఇక్కడ ప్రదర్శించేందుకు అవకాశమిచ్చారు. విద్యార్థులు వ్యక్తిగతంగా, బృందాలుగా పాల్గొంటున్నారు. ఉపాధ్యాయుల విభాగంలోనూ నమూనాలున్నాయి. ఒక్కో రాష్ట్రం నుంచి 50 చొప్పున మొత్తం 300 నమూనాలు కొలువుదీరాయి. 350 మంది విద్యార్థులు, 300 మంది ఉపాధ్యాయులు పాలుపంచుకుంటున్నారు. వీఐటీఎం జ్యూరీ సభ్యులు... విజేతల్ని ఎంపిక చేసి త్వరలో జరగనున్న జాతీయ స్థాయి ప్రదర్శనలకు పంపిస్తారు.(osraju)
*🏀స్థానిక విద్యార్థులకు అవకాశం*
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనలను తిలకించే అవకాశముంది. మూడు జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల బృందాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని సమయాన్ని పొందాల్సి ఉంటుంది. జిల్లా విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే ఉప పర్యవేక్షణాధికారుల ద్వారా ఆయా పాఠశాలలకు సమాచారం అందించారు. పాఠశాలల వారు తమ విద్యార్థుల్ని ప్రదర్శనకు తీసుకెళ్లాలనుకుంటే సంబంధిత ఉప పర్యవేక్షణాధికారి ద్వారా సమయం పొందొచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు వ్యక్తిగతంగా తమ పిల్లల్ని తీసుకెళ్లాలనుకుంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెళ్లొచ్చు. ఇలాంటి వారు హైదరాబాద్ జిల్లా సైన్స్ అధికారి ప్రభాకర్ను 9246273583 నంబరులో సంప్రదించవచ్చు.
*🔵ఆకర్షణగా సంచార ప్రదర్శనశాల*
ఓరెస్టడ్స్ ప్రయోగం.. ఫ్లెమింగ్ ఎడమచేయి సూత్రం.. ఫారడే సిద్ధాంతం.. ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు రూపొందించిన నమూనాలు. ఆయా సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్ అవకాశం కల్పిస్తోంది. తెలుసుకోవడమే కాకుండా ఆయా సిద్ధాంతాల, ప్రయోగాల పనితీరును స్వయంగా పరిశీలించే వేదికైంది. నేషనల్ కౌన్సెల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో నడిచే బెంగళూరు ‘విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం’ సంచార ప్రదర్శనశాల ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రదర్శనను తిలకించే విద్యార్థులు ఉచితంగా ఈ సంచార ప్రయోగశాలలోనికి వెళ్లి పరిశీలించొచ్చు.
*osraju@*
*🏀మీరూ కావొచ్చు ఆవిష్కర్తలు!*
ఆర్యభట్ట.. హోమీ జహంగీర్ బాబా.. ఏపీజే అబ్దుల్కలాం.. సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్.. జగదీశ్ చంద్రబోస్.. శ్రీనివాస రామానుజన్... సుబ్రహ్మణ్య చంద్రశేఖర్.. ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాంతాడంత అవుతుంది. వీరంతా శాస్త్రవేత్తలే అనేది ఎంత సత్యమో పుట్టుకతోనే శాస్త్రవేత్త కావాలనే ఆకాంక్షతోనే వీరు జన్మించలేదనేది అంతే నిజం. ఉన్న తెలివితేటలకు తోడు తమ జిజ్ఞాసకు పదును పెట్టడం వల్లే అంతటివారు కాగలిగారు. అప్పట్లో వారు రాణించేందుకు అవకాశాలు తక్కువే అయినా అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగైంది. తమలోని సృజనకు పదును పెట్టుకోవాలనుకునే ఔత్సాహిక విద్యార్థులకు అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి దోహదపడే సైన్స్ ఎగ్జిబిషన్(వైజ్ఞానిక ప్రదర్శన)లే ఇందుకు వేదికలు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని డిపార్ట్మెంటü ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏటా పలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాఠశాల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వీటిని నిర్వహిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు తమ నమూనాల్ని నమోదు చేసేందుకు వెబ్సైట్
(www.inspireawards.dst.com) అందుబాటులో ఉంది.
*✳జవహర్లాల్ సైన్స్ ఎగ్జిబిషన్*
స్వాతంత్య్రానంతరం నుంచి జరుగుతున్న ప్రదర్శన ఇది. ఏటా జిల్లా స్థాయిలో దీన్ని నిర్వహిస్తారు. జిల్లా విద్యాధికారుల ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అత్యుత్తమ ప్రదర్శనల్ని ఎంపిక చేసి బహుమతుల ద్వారా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తారు. సాధారణంగా విద్యా సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటవుతుంది.
నేషనల్ టాలెంట్ సెర్చ్
సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఇది. ఏటా పాఠశాలల్లో డ్రామాల్లాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. ప్రతిభను బట్టి అంచెలవారీగా జాతీయ స్థాయి వరకు ఎంపికలుంటాయి.
*🅾తెలంగాణ సైన్స్ అకాడమీ*
తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఏర్పాటైన అకాడమీ ఇది. సీసీఎంబీ మాజీ సంచాలకులు మోహన్రావు ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా కార్యకలాపాల్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యార్థుల్ని సైన్స్ రంగంలో పరిశోధనల దిశగా సమాయత్తం చేసేందుకు ఉపాధ్యాయులు పోషించాల్సిన పాత్రపై అవగాహన కల్పిస్తారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో జల, ధరిత్రీ దినోత్సవాల్ని నిర్వహిస్తూ వాటి ప్రాధాన్యాన్ని వివరించే కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.
*⚛బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్*
దే శంలోని సైన్స్ ప్రదర్శనల్లో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. జాతీయ స్థాయిలో రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఒకే అంశంపై పిల్లలు తమ నమూనాల్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. 11-17 ఏళ్లలోపు విద్యార్థులతోపాటు ఇతరులూ ప్రాజెక్టు నమూనాల్ని రూపొందించేందుకు అర్హులు. సాధారణంగా 2-5 మంది పిల్లలు బృందంగా ప్రాజెక్టుల్ని తయారు చేయొచ్చు. రాష్ట్ర స్థాయి వరకు బృందంగా పోటీల్లో పాల్గొన్నా.. జాతీయ స్థాయిలో బృంద నాయకుడే పోటీ పడాలి. ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి సమస్యను గుర్తించాల్సి ఉంటుంది. ఆ సమస్య స్థానికంగా ఇబ్బందులు సృష్టించేదేనని రుజువు చేయగలగాలి. అనంతరం పరిశోధన సంస్థలు, నిపుణుల్ని సంప్రదించి ఆ సమస్యను శాస్త్రీయంగా రూపుమాపేందుకు అవసరమైన పరిష్కార మార్గాన్ని కనుగొనగలగాలి. అప్పుడే విద్యార్థుల నమూనా ప్రదర్శనకు ఎంపికవుతుంది.
*🌐కొలువుదీరిన దిగ్గజాలు*
దక్షిణ భారత స్థాయి సైన్స్ ప్రదర్శన-2018లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా కొలువుదీరారు. ఎలాగంటారా... నీల్స్బోర్, శుశ్రుత, సత్యేంద్రనాథ్బోస్, మేఘనాథ్ సాహా తదితర శాస్త్రజ్ఞుల జీవిత చరిత్ర వివరాలతో కూడిన ఫెక్ల్సీలను ఇక్కడ ఏర్పాటు చేశారు. శాస్త్రపరిజ్ఞానంపై ఉత్సాహం కనబరిచే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయుక్తం.
శాస్త్రవేత్తలతో సమావేశాలు
సైన్స్ ఎగ్జిబిషన్లో తమ నమూనాల్ని ప్రదర్శిస్తున్న విద్యార్థులు.. ప్రముఖ శాస్త్రవేత్తలతో కలుసుకునే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు సైన్స్ క్విజ్, వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
[1/9, 08:00] +91 95020 29120: *జోనల్ వ్యవస్థ కీలకం*
*ప్రయోజనాలన్నీ తెలంగాణ వారికే దక్కేలా ప్రతిపాదనలు రూపొందించండి*
*మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి కడియం*
*జోనల్ వ్యవస్థ కీలకమైనదని, తెలంగాణ వారికే అన్ని ప్రయోజనాలు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. కొత్త జోనల్ వ్యవస్థపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ముఖ్యమంత్రికి త్వరలో సమర్పిస్తామన్నారు. అందుకు అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుంటామన్నారు.*
*సోమవారం సచివాలయంలో జోనల్ విధానంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా..మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఉన్నతాధికారులు సురేశ్‌చందా, అథర్‌సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించారు. చర్చల అనంతరం వచ్చే వారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు.*
[1/9, 08:07] జి కె అడ్మిన్: *🗓 నేటి పంచాంగం 🗓*
*తేది : 9, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(నిన్న సాయంత్రం 3 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 19 ని॥ వరకు)
నక్షత్రం : చిత్త
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 49 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 6 ని॥ వరకు)
యోగము : అతిగండము
కరణం : కౌలవ
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 10 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 55 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు రాత్రి 8 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 2 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 9 గం॥ 1 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 45 ని॥ వరకు)(రాత్రి 11 గం॥ 5 ని॥ నుంచి రాత్రి 11 గం॥ 49 ని॥ వరకు)
రాహుకాలం :
(సాయంత్రం 3 గం॥ 9 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 32 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 45 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 9 గం॥ 35 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 58 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 57 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : కన్య
[1/9, 08:08] జి కె అడ్మిన్: *🤘 నేటి సుభాషితం🤘*
*పిల్లలకు నేర్పాల్సింది డబ్బు విలువ కాదు.. మానవత్వ విలువలు.*
[1/9, 08:08] జి కె అడ్మిన్: 🙏 _*శుభోదయం*_ 🙏
--------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
-------------------------
" నీ శత్రువు మీద నీవు రగుల్చుకున్న అగ్రహజ్వాల అతని కన్నా నిన్నే ఎక్కువగా దహించివేస్తుంది. "
*-చైనా సామెత*
--------------------------
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
---------------------------
" స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు. అంతటి త్యాగం చేసే స్నేహితుణ్ణిీ పొందడం కష్టం. "
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[1/9, 08:09] జి కె అడ్మిన్: *💎 నేటి ఆణిముత్యం 💎*
ఉత్తమ గుణములు నీచుకెత్తెరగున గలుగ నేర్చు నెయ్యడలం దానెత్తిచ్చి కరగ పోసిననిత్తడి బంగార మగునె యిలలో సుమతీ...!!
*తాత్పర్యం :*
ఎవరూ పుట్టుకతోనే ఉత్తములు కారు. అందరిలోనూ ఏవో కొన్ని చెడు గుణాలు ఉంటాయి. అయితే వాటిని క్రమంగా వదిలేస్తూ కొంతమంది ఉత్తములుగా మారతారు. కొంతమంది తమలోని ఆ చెడు గుణాలనే గొప్పవనుకుంటారు. అందుకే వాటిని మార్చుకోవాల్సి అవసరం లేదనుకుంటారు.అలాంటివారు జీవితాంతం నీచులుగానే ఉండిపోతారు. వారిని ఎవరైనా మార్చాలనుకున్నా వారి ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. ఇత్తడిని ఎంతగా కరిగించి పోసినా అది బంగారంగా మారదు కదా.. అలాగే మారాలన్న తపనలేని నీచులకు ఉత్తమ గుణాల గురించి ఎంత చెప్పినా ఫలితం ఉండదని ఈ పద్యం సారాంశం.
[1/9, 08:10] జి కె అడ్మిన్: *💥అన్ని శాఖల్లో ‘ఆధార్’ హాజరు!*
🔷ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, ప్రభుత్వోద్యోగులందరికీ త్వరలోనే అమల్లోకి
🔷ఆ తర్వాత స్కూళ్లల్లోనూ.. సర్కారు యోచన
♦ రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింట్లోనూ ఇకపై ఆధార్ ఆధారిత హాజరు విధానం అమల్లోకి రానుంది! ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ప్రభుత్వోద్యోగులందరికీ ఈ విధానం అమలు కానుంది. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖలోని ఉద్యోగులకు, జీహెచ్‌ఎంసీలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని శాఖల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత దీన్ని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
♦‘ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ సిస్టం(ఏఈబీఎంఎస్)’గా పేర్కొంటున్న ఈ విధానం వల్ల జీహెచ్‌ఎంసీకి ఏటా రూ.35 కోట్ల మేర అనవసర ఖర్చు తగ్గినట్లు ప్రభుత్వం ఇప్పటికే లెక్కగట్టింది. జీహెచ్‌ఎంసీలోని ఆరోగ్య, పారిశుధ్య విభాగాల్లో పనిచేస్తున్న 22,500 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గత కొంత కాలంగా ఏఈబీఎంఎస్ ను అమలు చేస్తున్నారు. ఇందుకోసం 1,200 హ్యాండ్‌హెల్డ్ బయోమెట్రిక్ యంత్రాలను వినియోగిస్తున్నారు.
♦ఏఈబీఎంఎస్ హాజరు వల్ల విధులకు గైర్హాజరవడాన్ని, నకిలీ ఉద్యోగులను నిరోధించవచ్చు. ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని వినియోగించడం దేశం మొత్తం మీద తెలంగాణలోనే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి.
♦సాధారణ బయోమెట్రిక్ యంత్రాలతో కంటే ఏఈబీఎంఎస్ ద్వారా హాజరు తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని మరికొన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వినియోగిస్తున్న ఏఈబీఎంఎస్ ను మొత్తం 3లక్షల మందికి పైగా ఉన్న ప్రభుత్వోద్యోగులు, ఇతరత్రా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
♦ఇందుకు 15 వేల హ్యాండ్ హెల్డ్ మెషిన్లు అవసరమవుతాయని అంచనా. ఏఈబీఎంఎస్ ఆధారిత హాజరు వల్ల ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 30 శాతం మేర బోగస్ ఔట్‌సోర్సింగ్ కార్మికులను గుర్తించి, తొలగించడం జరిగిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులందరికీ ఈ విధానాన్ని వర్తింపజేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. *ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమల్లోకి తేవాలని యోచిస్తోంది.*
[1/9, 08:12] జి కె అడ్మిన్: 💐 *విద్యార్థి తప్పు చేసినపుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షిస్తాడు. దాని అర్థం క్రింది విధాలుగా ఉంటుంది*💐
1.మోకాళ్ళమీద కూర్చోబెడితే - *వినయంగా ఉండాలని.*
2. నోటిమీద వేలు వేసుకోమంటే - *నీగురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని.*
3. చెవులుపట్టుకోమంటే - శ్రద్ధగా వినమని.
4. బెంచీ ఎక్కి నిలబడమంటే - *నీవు చదువులో అందరి కంటే పైన ఉండాలని.*
5. చేతులెత్తి నిలబడమంటే - *నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని.*
6. గోడవైపు చూస్తూ నిలబడమంటే - *ఆత్మ పరిశీలన చేసుకోమని.*
7. తరగతిగది బయట నిలబెడితే - *పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని.*
8. బ్లాక్ బోర్డ్ తుడవమంటే - *తప్పులు సరిచేసుకోమని.*
9. ఏదైన విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే - *గెలిచే వరకూ పోరాడమని.*
[1/9, 08:13] జి కె అడ్మిన్: 🌸STU తెలంగాణ🌸
🍭 *హారగోవింద్ ఖోరానా జన్మదినం సందర్బంగా* 🍭
ఖొరానా (9 జనవరి 1922- 9 నవంబర్ 2011) భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. 1922 జనవరి 9న అవిభక్త భారతదేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్లోఉన్నది).
🍎 *విద్య*🍎
తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. అయిదుగురి సంతానములో చివరి వాడు. తొలుత తండ్రి శిక్షణలోను, తదుపరి ముల్తాన్ లో దయానంద్ ఆర్య విద్యా (DAV) ఉన్నత పాఠశాలలో చదివాడు. పంజాబ్ విశ్వవిద్యాలయము, లాహోర్ నుండి 1943లో B.Sc మరియు 1945లో M.Sc పట్టాలు పొందాడు. లివర్ పూల్ విశ్వవిద్యాలయములో 1945 నుండి 1948 వరకు శాస్త్ర పరిశోధనలు చేసి Ph.D పట్టా పొందాడు. తదుపరి రెండు సంవత్సరములు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్లో పరిశోధనలు సాగించాడు.
🍓*పరిశోధనలు*🍓
1951-52లో విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జ్విశ్వవిద్యాలయములో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంధించిన పరిశోధన మొదలు పెట్టాడు. 1952లో కెనడా లోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వవిద్యాలములో చేరాడు. అటు పిమ్మట 1960 లో అమెరికా లోని విస్కాన్సిన్విశ్వవిద్యాలములో (మ్యాడిసన్) ఆచార్యునిగా చేరాడు. 1970లో ప్రతిష్ఠాత్మకమైన మశాచుసెట్స్ సాంకేతిక సంస్థలో (Massachusets Institute of Technology) రసాయనశాస్త్ర ఆచార్యునిగా చేరాడు. 2007లో పదవీవిరమణ చేశాడు. అప్పటి నుండి గౌరవ ఆచార్యునిగా పరిశోధనలు సాగిస్తున్నాడు[1].
🍒 *నోబెల్ పురస్కారము* 🍒
జీవ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న ప్రశ్న- ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా? ఈ దిశలో వంశపారంపర్యముగా సంక్రమించు జీవ నిర్మాణానికి దోహదం చేసే "కృత్రిమ జీన్"ను సృష్టించగలిగాడు. ఈ ఆవిష్కరణ Genetic Engineering అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది.
ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని ఖొరానా కనుక్కొన్నాడు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (DNA) ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించాడు. DNA ముక్కలను అతికించు DNA ligase అనబడు ఎంజైమును కనుగొన్నాడు. ఈ పరిశోధనల మూలముగా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవమువచ్చింది. 1968 లో వైద్యశాస్త్రములో నోబెల్ బహుమతి లభించింది.
🌹*పరివారము*🌹
1952లో స్విస్ జాతీయురాలైన ఎలిజబెత్ సిబ్లర్ ను వివాహమాడాడు. వీరికి ముగ్గురు పిల్లలు: జూలియా ఎలిజబెత్, ఎమిలీ యాన్నె మరియూ డేవ్ రాయ్.
అవార్డులుమెడిసిన్ లో నోబెల్ బహుమతి (1968),గైరిందర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డు,లూయిసా స్థూల హోర్విత్జ్ బహుమతి,ప్రాథమిక మెడికల్ రీసెర్చ్ ఆల్బర్ట్ లస్కెర్ అవార్డు,పద్మ విభూషణ్,విల్లార్డ్ గిబ్స్ అవార్డు
*మరణము*
*ఖొరానా నవంబర్ 9, 2011 న కంకార్డ్, మసాచుసెట్స్ లో 89వ ఏట సహజ మరణము చెందాడు.*
[1/9, 08:14] జి కె అడ్మిన్: 🛑 🚀🛰 *12న అంతరిక్షంలోకి 31శాటిలైట్లు* 🚀🛰🛑
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
.....✍🌎🅰lfred🅿🌎
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
🗓 *Tuesday, 09 Jan, 6.46 am*
🔳 *శ్రీహరి కోట నుంచి ప్రయోగం*
🌎 *బెంగళూరు:*
🚀🛰 *ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఈ నెల 12న 31 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించబోతున్నది.*
🚀🛰 *గతంలో ప్రకటించినట్టుగా ఈ నెల 10న కాకుండా రెండురోజుల వాయిదా వేసుకుని 12న ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నది*.
🚀🛰 *భూమిని పరిశీలించే కార్టొశాట్ స్పేస్‌క్రాఫ్ట్‌తోపాటు అమెరికా, ఇతర నాలుగు దేశాలకు చెందిన 28 శాటిలైట్‌లు సహా రెండు శాటిలైట్‌లను 12న ఉదయం 9గంటల 30 నిమిషాలకు పంపించనున్నట్టు ఇస్రో పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ దేవి ప్రసాద్ కార్నిక్ తెలిపారు.*
🚀🛰 *ఎనిమిదవ నావిగేషన్ శాటిలైట్ ప్రయోగం గత ఏడాది ఆగస్టులో విఫలమైన విషయం విదితమే.*
🚀🛰 *12న అంతరిక్షంలోకి పంపబోతున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ-సీ4) ప్రయోగమే 2018లో మొదటిది కానున్నది.*
నేటి జి కె
*(2017 ట్రోఫీలు/కప్ లు-విజేతలు)*
1)👉 "ఫీఫా అండర్- 17" ప్రపంచకప్ కప్ విజేత ఎవరు?
A: *ఇంగ్లాండ్*
2)👉 "మహిళల ప్రపంచకప్ క్రికెట్" విజేత ఎవరు?
A: *ఇంగ్లాండ్*
3)👉 "రగ్బీ లీగ్" ప్రపంచకప్ (పు+మ) విజేత ఎవరు?
A: *ఆస్ట్రేలియా*
4)👉 "డేవిస్ కప్" విజేత ఎవరు?
A: *ఫ్రాన్స్*
5)👉 "స్నూకర్ వరల్డ్ కప్ విజేత" ఎవరు?
A': *చైనా*
🍃✌🌺
Idiom of the Day
📚a gut feeling
✍🏾Meaning:
If you have a gut feeling, you sense something about a person or a situation, without knowing why, but you're sure what you sense is true.
❗️For example:
🔺As soon as I came into the room I had a gut feeling that something was wrong - and then I saw the dead body.
🔺Chaz said his gut feeling was that Laura was lying and, sure enough, she was.
🗨Origin: Probably derived from the fact that many people experience emotions and intuitive feelings as being centred on, or having a strong effect on, the stomach area, which is also called the gut. Interestingly, the nervous system's second biggest network of closely-interconnected neurones, after the brain, is located in this area of the body.
━━━━━━━━━
#Idiom_of_the_Day
Slang of the Day
🔰tight-ass
🇺🇸American English Offensive
✍🏾Meaning:
1) sby who spends as little money as possible, a miser 2) sby who's repressed and very strict about following society's rules
❗️For example:
🔺Our boss is a real tight-ass; we never get a Christmas bonus.
🔺Don't be such a tight-ass, Rob. Let yourself have some fun for a change.
💥Note: An alternative spelling is "tight-arse".
🗨Variety: This slang term is typically used in American English but may be used in other varieties of English too.
━━━━━━━━━━━
#Slang_of_the_day
సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపించాల్సిన అవసవరం లేదని కోర్టుకు తెలియజేసింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనే దానిపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు 16 నవంబరు 2016లో ఇచ్చిన తీర్పు ముందునాటి స్థితిని పునుద్ధరించాలని కోరింది.సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పౌరులు తమలోని దేశభక్తిని ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కొందరు వాదించారు. జాతీయ గీతాలాపనకు సినిమా హాళ్లు వేదిక కాకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో తర్జన భర్జన పడిన ప్రభుత్వం దిగి వచ్చింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనేదానిపై అధ్యయనం కోసం అంతర-మంత్రిత్వ శాఖ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరు నెల్లలోపు ఈ బృందం నివేదిక ఇవ్వనుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది...

No comments:
Post a Comment