AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 5 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 10 2018

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅జనవరి 10*🌅

*🏞సంఘటనలు*🏞

1920: నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.

1973 : ఆంధ్రప్రదేశ్రాష్ట్రం ఐదవ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ (1971 సెప్టెంబరు 30 నుంచి 1973 జనవరి 10 వరకు).

*🌻🌻జననాలు*🌻🌻

1894: పింగళి లక్ష్మీకాంతం, ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు.[మ.1972]

1910 : సి.సుబ్రమణ్యం, భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ చేసిన వ్యక్తి, భారత రత్న గ్రహీత.

1924 : ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు.

1938 : డొనాల్డ్ నూత్కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రొఫెసర్.

1940 : యేసుదాస్, భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు.

1949 : అల్లు అరవింద్, భారత చలన చిత్ర నిర్మాత.

1965 : కస్తూరి మురళీకృష్ణ, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు.

1966 : మురళీ నాయర్, భారత సినీ దర్శకులు.

1974 : హృతిక్ రోషన్, సినీ నటుడు.

1985 : ద్రష్టి దామీ, భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి.

*🌹🌹మరణాలు*🌹🌹

1778 : కరోలస్ లిన్నేయస్, ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు.

1883 : అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త.

1972: పింగళి లక్ష్మీకాంతం, ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. (జ.1894)

1987: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలన చిత్ర నటుడు మరియు దర్శకుడు.

2016: డేవిడ్ బౌవీ, బ్రిటీష్ పాప్ మరియు రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947)

2016: పి.ఆర్.రాజు, ప్రముఖ చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928)

*🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷

🔻ప్రపంచ నవ్వుల దినోత్సవం

*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  10, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి
(నిన్న సాయంత్రం 4 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 29 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 7 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 1 ని॥ వరకు)
యోగము : ధృతి
కరణం : గరజ
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 52 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు రాత్రి 7 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 14 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 12 గం॥ 0 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 44 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 45 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 10 గం॥ 58 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 8 గం॥ 11 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 57 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : తుల

*🤘 నేటి సుభాషితం🤘*

*బంగారం నాణ్యత కొలిమిలో కాల్చితే బయటపడుతుంది. మనిషిలోని గుణాలు కష్టంలో ఉన్నపుడు బయటపడతాయి.*

_*శుభోదయం*_    
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" అసమర్థుడు తన అదృష్టాన్ని వెతుకుతాడు. సమర్థుడు తన శక్తిపై బ్రతుకుతాడు. "

           _*-చైనా సామెత*_

       --------------------------
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
      ---------------------------
" ఏది తప్పో, ఏది ఒప్పో అంతరాత్మ చెపుతూనే ఉంటుంది..!
తెలియదనడం ఒట్టి వంచన..!!

*💎 నేటి ఆణిముత్యం 💎*

సతతముఁ బ్రాతఃకాలో
చితవిధులను జరుపు మరసి శీఘ్రముగ నహః
పతి పూర్వ పర్వతాగ్రా
గతుడగుటకు మున్నె వెరవు గల్గి కుమారా! 

*భావము ;*

ఓ కుమారా! ఎల్లప్పుడూ సూర్యోదయానికి ముందే, నిద్రలేచి నీవు చేయవలసిన పనులు వేగంగా, శ్రద్ధతో చేసుకో.

*👬 నేటి చిన్నారి గీతం 👬*

*దాక్కో దాక్కో*

సింహం వచ్చే 
సింహం వచ్చే 
నక్కా నక్కా 
దాక్కో దాక్కో...
నక్కా వచ్చే 
నక్కా వచ్చే 
కుక్కా కుక్కా 
దాక్కో దాక్కో...
కుక్కా వచ్చే 
కుక్కా వచ్చే 
పిల్లీ పిల్లీ 
దాక్కో దాక్కో...
పిల్లీ వచ్చే 
పిల్లీ వచ్చే 
ఎలుకా ఎలుకా 
దాక్కో దాక్కో...
ఎలుకా వచ్చే 
ఎలుకా వచ్చే 
బందరు లడ్డూ
దాక్కో దాక్కో.

*✍🏼 నేటి కథ ✍🏼*

*అభిమాని*

*అభిమానం చాలా చిత్రమైనది. ప్రేమ గుడ్డిది అంటారు. అలాగే ఈ అభిమానం కూడా గుడ్డిదేనని చెప్పాలి. కత్తి పండ్లు కోసుకొని తినడానికే పనికి వస్తుంది.అలాగే ఆ అభిమానం మనుషుల మధ్య అనుబంధానికి దారి తీస్తుంది. మనుషుల పతనానికీ దారి తీస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ! "అతి సర్వత్రావర్ష్యమేత"అని అన్నారు పెద్దలు. మంచి అయినా, చెడ్డ అయిన ఒక స్థాయివరకూ పరవాలేదు. ఆ స్థాయి దాటితే ముప్పు తప్పదు కదా. అటువంటి సమయాల్లో తమని అభిమానించే వారిని పెడదోవ పెట్టనీకుండా సరైన సలహా ఇచ్చి, వారిని సక్రమమైన మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత అభిమానింపబడే వారిలోనూ వుంది. అందుకు ఉదాహరణే ఈ కథ.*

పదవ తరగతి చదువుతున్న మహేష్‌కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను విడవకుండా చదువుతాడు. చక్రపాణిగారిని చూడాలని మఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్‌కి. ఆయన ఉండేది హైదరాబాదులో కాబట్టి అక్కడికి వెళ్ళేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి, తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం వుండదు కనుక ఊరకుండిపోయాడు.

అదృష్టవశాత్తు చక్రపాణిగారు ఆ ఊరిలో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకురానీయరని గుర్తుకొచ్చి తనలోతానే బాధపడ్డాడు.

ఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కాకొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణిగారిని చూసి, ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేం ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయట పడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకున్నాడు. 

సభ పూర్తయిన తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణిగారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి, తనను పరిచయం చేసుకున్నాడు. "సార్! నేను ఈ ఊరి హైస్కూల్లోనే టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ ప్రక్కన పెట్టి మిమ్మల్ని చూడటానికి వచ్చాను" అని గొప్పగా చెప్పాడు.

మహేష్ చివరిమాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణిగారు. అది గమనించిన మహేష్, "ఏంటిసార్! అలా ఉన్నారు" అని అడిగాడు.

"బాబూ మహేష్ నీవు నా అభిమానివైనందుకు సంతోషం. కానీ ఇప్పుడు నీవు చేసిన పని బాగులేదు. ఎందుకంటే ఈ వయస్సులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి, ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు, నేనూ గర్వపడతాను" అని చెప్పారు చక్రపాణిగారు.

ఆయన మాటలను ఆలోచిస్తూ తానుచేసింది తప్పేననిపించింది మహేష్‌కి. వెంటనే ఇకముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణిగారికి మాట ఇచ్చి, ఇంటికొచ్చి చదవటంలో నిమగ్నయ్యాడు మహేష్.

*📖 మన ఇతిహాసాలు 📓*

*సాత్యకి*

సాత్యకికి యుయూధనుడు అను పేరు కూడా ఉంది. ఇతను కృష్ణునికి చెందిన వృషణి యాదవ వంశమునకు చెందిన మహా యోధుడు.

సాత్యకి కృష్ణుని భక్తుడు. ఇతను అర్జునునితో కలసి ద్రోణుని వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను అర్జునుడు మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి సాత్యక. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులతో కలసి కౌరవులపై యుద్ధం చేసెను. కృష్ణుడు శాంతి రాయబారమునకు హస్తినాపురంనకు వచ్చునపుడు సాత్యకితో కలసి వచ్చెను.

సాత్యకి మరియు కృతవర్మలు కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడిన యాదవ వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి పాండవుల వైపు, కృతవర్మ కౌరవుల వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి ద్రోణుని విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న భూరిశ్రవునితో యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. భూరిశ్రవుడు సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. కృష్ణుడు అర్జునునితో జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. భూరిశ్రవుడు సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుని చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.

భూరిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని అర్జునుని నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని అర్జునుడు ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.

అంతట భూరిశ్రవుడు ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భూరిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి భూరిశ్రవుని తల ఖండింస్తాడు.

కురుక్షేత్ర సంగ్రామంలో సాత్యకి, కృతవర్మ ఇద్దరూ బ్రతికారు. కృతవర్మ కృపాచార్యుడు మరియు అశ్వద్దామలతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు రాత్రి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని కృతవర్మని, కృతవర్మ నిరాయుధుడైన భూరిశ్రవుని చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, కృతవర్మ, మిగిలిన యాదవ వంశం మొత్తం గాంధారి శాపం మూలంగా నాశనం అయింది.

*✅ తెలుసుకుందాం ✅*

*⭕జంతువులు పళ్లు తోమక్కర్లేదా?*

✳కేవలం ఆధునిక మానవుడు మాత్రమే పళ్లు తోముకుంటున్నాడు. నాగరికత నేర్చిన మానవుడు పళ్లు తోముకోడానికి కేవలం సూక్ష్మక్రిముల నిర్మూలనే కారణం కాదు. ఇది సౌందర్యపరమైన అంశం కూడా. సంఘజీవులైన మనుషులు చనువుగా, దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దుర్వాసన ఒక సమస్యగా మారుతుంది. పళ్ల మధ్యలో చిక్కుకున్న ఆహారపు అణువులపై సూక్ష్మక్రిములు ఏర్పడ్డం వల్ల దుర్వాసనే కాదు, దంతాలు కూడా పాడవుతాయి. ఇక మనుషులు తినేంత వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లు జంతువులకు లేవు. శాకాహార జంతువులు పీచు బాగా ఉండే ఆకులు, గడ్డి మేస్తాయి. మొక్కల రసాలు వాటి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి .చంతాల మధ్య, చిగుళ్ళ మీద సూక్ష్మజీవులు చేరకుండా వాటిని సంహరించగలిగిన రసాయనాలు జంతువులు తినే గడ్డి , ఇతర వృక్షపదార్ధాల ద్వారా సమకూరుతాయి. శాఖాహారజంతుల్వుల పళ్లు దగ్గరగా, పెద్దగా ఉంటాయి. మాంసాహార జంతువుల పళ్ల మధ్య ఎడం బాగా ఉంటుంది. జంతువుల నాలుకలు పొడవుగా, గరుకుగా ఉంటాయి. వాటితో అవి పళ్లను పదే పదే నాకుతూ శుభ్రం చేసుకోగలుగుతాయి. అలాగే వాటి లాలాజలంలోని లవణీయత, జిహ్వస్రావాల లాంటివి కూడా దంతక్షయం కాకుండా కాపాడుతాయి.

*✍పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య‌ను అందించాలి: మంత్రి కడియం*

*❇హైదరాబాద్ : దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు పీజీ వరకు గురుకుల విధానంలో ఉచిత విద్యను అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కేబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) మీటింగ్ లో ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రతిపాదించడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసింది. ఈ కేబ్ గౌహతి, న్యూఢిల్లీ, భువనేశ్వర్ లలో మూడుసార్లు సమావేశమై నాల్గోసారి హైదరాబాద్ లో నేడు సమావేశం అయింది. ఈ సమావేశానికి జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరాజా యాదవ్, అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ రీనారాయ్, మెంబర్ సెక్రటరీ మీనాక్షీ గార్గ్, ఇతర అధికారులు హాజరయ్యారు.*

*❇తెలంగాణలో విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, బాలికల విద్య కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వివరించారు. దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఈ రోజు కేబ్ మీటింగ్ లో చర్చించిన అంశాలను విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు పీజీ వరకు గురుకుల విధానంలో ఉచిత, నిర్భంద విద్య అందించాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ప్రత్యేకంగా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. ఇదేవిధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. మహిళా యూనివర్శిటీలను కూడా అన్ని రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. కేజీబీవీలలో ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకే విద్య అందిస్తున్నారని, దీనిని ఇంటర్ వరకు పొడగించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం వంద వరకే ఉందని, దీనిని 200కు పెంచాలని సూచిస్తున్నామన్నారు. యుక్తవయస్సు వచ్చిన బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని, వారికి ఆరోగ్య-పరిశుభ్రత కిట్స్ ఉచితంగా అందించాలని అన్నారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహార్ నవోదయా విద్యాలయాలలో ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్ బోధిస్తున్నారని, ఇలాంటివి రెసిడెన్షియల్ విధానంలో మరిన్నిఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు.*

*❇బాలికలకు విద్యాలయాల్లో భద్రత కల్పించాలని, ప్రతి పాఠశాలలో పనిచేసే టాయిలెట్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేబ్ మీటింగ్ లో నేడు ప్రతిపాదించారు. మొత్తానికి పాఠశాలల్లో అకాడమిక్ అట్మాస్పియర్ నెలకొల్పాలని చెప్పారు. త్వరలోనే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తరపున అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖలో అమలు చేస్తున్న పది ఉత్తమ విధానాలను సేకరించి, వాటి నుంచి 10 నుంచి 15 వరకు ఉత్తమ విధానాలను క్రోడీకరించి తమ తుది నివేదికలో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. మరొక సమావేశం ఢిల్లీలో ఈ నెల 15, 16 తేదీల్లో ఉంటుందన్నారు.*

*❇అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ...కేబ్ చైర్మన్ కడియం శ్రీహరి చెప్పినట్లు తాము వెంటన మధ్యంతర నివేదిక అందిస్తామని, తుది నివేదికలో కూలంకుషంగా బాలికల విద్యలో ఉన్న సమస్యలు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలను ప్రాతిపాదిస్తామన్నారు. కచ్చితంగా కేబ్ చైర్మన్ కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ బాలికల విద్యపై అత్యుత్తమ ప్రతిపాదనలతో నివేదిక ఇస్తుందన్నధీమా వ్యక్తం చేశారు.*

*❇జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరాజా యాదవ్ మాట్లాడుతూ...ప్రధానమంత్రి బేటీ బచావో..బేటీ పడావో నినాదాన్ని నిజం చేసే విధంగా తమ నివేదిక ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బాలికల విద్యను ముందుకు తీసుకెళ్లేందుకు కావల్సిన అన్ని అంశాలతో తన నివేదిక అందజేస్తామన్నారు.*

*✍పాఠశాల అసెంబ్లీ కోసం*

*10-01-2018*

                *సుభాషిత వాక్కు*

*"సాధన లేకుండా విజయాన్ని ఆశించడం, ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం వంటిది."*

*"Our Anger Makes to block the mind and losses the Tongue Faster...*
 *Our Smile Makes Everything Work Faster Except The Tongue be cool when you are in angry"*

                    *మంచి పద్యం*

*కులము పేర నొకడు కుట్రలు చేయును*
*గుణము కన్నమిన్న కులము కాదు*
*కుత్సితుండు చేరి కులచిచ్చు పెట్టును*
*వాస్తవంబు వేమువారి మాట*

*భావం:*

*ఓ వేము ! కులాల పేరుతోటి కుట్రలు చేసేవారు కొందరు. గుణానికి కులము సాటిరాదు. కొంతమంది దుష్టులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గమనించి నడచుకోవలెను.*

                         *నేటి జీ కె*

*పధకాలు — ప్రారంభపు తేదీలు*

1. *ప్రధాన్ మంత్రి జన ధన్ యోజన* (PMJDY)    28 ఆగస్టు 2014

2. ,*ప్రధాన్ మంత్రి సుకన్య సంధ్య యోజన* (PMSSY) 22 జనవరి 2015

3. *ప్రధాన్ మంత్రి ముద్రా యోజన* (PMMY) 08 ఏప్రిల్ 2015

4. *ప్రధాన్ మంత్రీ జీవన్ జ్యోతి బీమా యోజన* (PMJJBY) 09 మే 2015

5. *ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన* (PMSBY) 09 మే 2015

6. *అటల్ పెన్షన్ యోజన* (APY) 09 మే 2015

7. *ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన* - అర్బన్ (PMAY-U) 25 జూన్ 2015

8. *సన్సాద్ ఆదర్శ్ గ్రామ్ యోజన* (SAGY) 11 అక్టోబర్ 2014

*✍25న విద్యాసంస్థల్లో ఎన్నికల దినోత్సవం*

*❇తెలంగాణ: రాష్ట్రంలోని అన్నిరకాల విద్యాసంస్థల్లో ఈ నెల 25న జాతీయ ఎన్నికల దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రధాన ఎన్నికల అధికారి అనూప్సింగ్ కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కోఆర్డినేటర్లతో సమావేశం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వెంకటరమణ పాల్గొన్నారు.*

*✍ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్ విడుదల*

*❇తెలంగాణ: పలు పోస్టుల రాతపరీక్షలకు హాజరైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినట్టు టీఎస్పీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. పలు ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, పశుసంవర్ధకశాఖలోని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, బాయిలర్స్ డిపార్ట్మెంట్లోని ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన వివరాలు వెబ్సైట్లో పొందుపర్చినట్టు వెల్లడించింది.*

♦♻🌼 *గ్రేడింగ్‌’పై వెనక్కి!*

   ⇒  కేవలం గ్రేడింగ్‌ మాత్రమే
   ⇒  అమలు చేయడం కష్టమే
   ⇒  జేఈఈలో 75 శాతం 

*మార్కుల నిబంధనతో సమస్యలు*

   ⇒  ర్యాంకుల ఖరారులో వెయిటేజీతో ఇబ్బందులు
   ⇒  కొందరి మార్కులు 

*వెల్లడించాల్సి వస్తే ఎలాగన్న సందేహాలు*

   ⇒  సాధ్యాసాధ్యాలపై 
   ⇒  మళ్లీ కమిటీ పరిశీలన 

🏆 *సాక్షి, హైదరాబాద్‌ : విద్యార్థులను మార్కుల ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు, కార్పొరేట్‌ యాజమాన్యాల అడ్డగోలు ప్రచారానికి తెరవేసేందుకు అమల్లోకి తేవాలని నిర్ణయించిన గ్రేడింగ్‌ విధానంపై ఇంటర్మీ డియట్‌ బోర్డు వెనకడుగు వేస్తోంది. ప్రభుత్వం కూడా దీనిలోని ఇబ్బందులు, సందేహాలను లేవనెత్తడంతో గ్రేడింగ్‌ విధానం అమలును విరమించు కునే అవకాశం కనిపిస్తోంది. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, విద్యావేత్తలు, అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్‌ బోర్డు సలహా కమిటీ సిఫార్సు మేరకు ఇంటర్‌ బోర్డు గ్రేడింగ్‌ విధానం అమలుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే.*

❇ *వాటిని పరిశీలించిన ఉన్నతాధికారులు గ్రేడింగ్‌ అమలుతో తలెత్తే సమస్యలు, సందేహాలను లేవనెత్తారు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ, ఏపీలతోపాటు ఐదారు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు మార్కులను మాత్రమే ఇస్తుండగా.. సీబీఎస్‌ఈతోపాటు మరికొన్ని రాష్ట్రాల బోర్డులు మార్కులతోపాటు గ్రేడ్లను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం గ్రేడింగ్‌ మాత్రమే ఎలా అమలు చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది.* 

🍋 *కమిటీ నివేదిక తరువాత తుది నిర్ణయం* 

🔷 *గ్రేడింగ్‌ విధానంపై సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గ్రేడింగ్‌ విధానాన్ని సిఫారసు చేసిన కమిటీకే ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి సమాధానాలను సూచించడంతోపాటు అసలు గ్రేడింగ్‌ సాధ్యాసాధ్యాలను తేల్చే పని అప్పగించారు. అయితే ప్రభుత్వం లేవనెత్తిన అంశాలకు తగిన పరిష్కారాలు లేవని, అందువల్ల గ్రేడింగ్‌పై వెనక్కి తగ్గే పరిస్థితి ఉందని ఇంటర్‌ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కమిటీ తమ తుది నివేదికను ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.*

🎱 *ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలివీ*.. 

♦ *ఎంసెట్‌ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండటం, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందేవారు జేఈఈ ర్యాంకుతోపాటు ఇంటర్‌లో 75 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం) ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు మూడు రకాల ప్రతిపాదనలు చేసింది.* 

1. ఎంసెట్‌ ర్యాంకుల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని తొలగించి.. ఎంసెట్‌ మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టడం.  

2. మార్కులకు బదులు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవడం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లను బట్టి వెయిటేజీని లెక్కించడం. 

3. విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా, బోర్డు వద్ద మార్కులు ఉంటాయి. కాబట్టి ఎంసెట్‌ ర్యాంకుల ఖరారులో ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ ఇవ్వడం. అలాగే జేఈఈ, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించే సీబీఎస్‌ఈ, ఐఐటీలకు మా ర్కుల జాబితాలు అందజేయడం.. అయితే ఈ మూడు రకాల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

 🌎 *‘గ్రేడింగ్‌’పై సందేహాలివీ..*

► ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో విద్యార్థుల మధ్య పోటీ ఒకటీ రెండు మార్కుల వ్యత్యాసంతోనే ఉంటుంది. ఉదాహరణకు నలుగురు విద్యార్థులకు జేఈఈలో మంచి ర్యాంకు వచ్చి, ఆ నలుగురికీ ఇంటర్‌లో 70–79 శాతం గ్రేడ్‌ ఉంటే.. ఎవరికి ఎక్కువశాతం మార్కులు ఉన్నాయన్నది తెలియదు. సీబీఎస్‌ఈకి మార్కులు ఇచ్చినా విద్యార్థుల్లో సందేహాలు తలెత్తుతాయి. అలాంటపుడు వారి అనుమానాల నివృత్తి ఎలాగనే సందేహాలు తలెత్తుతున్నాయి.

►  సందేహం వ్యక్తం చేసిన విద్యార్థులకు మార్కులను ఇచ్చి, మిగతావారికి ఇవ్వకపోవడం కుదరదు. 
► ఎంసెట్‌లో వెయిటేజీ కోసం మార్కులు ఇచ్చినపుడు విద్యార్థులకు ఎందుకు ఇవ్వరనేదానిపై న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. 
► తక్కువ గ్రేడ్‌ వచ్చిన వారు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం పరీక్షలు రాయాలంటే ఎలా? రాసినా ముందు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇప్పుడెన్ని పెరిగాయనేది తెలిసేదెలా? అన్న సందేహాలు వస్తున్నాయి. 

♦ *🔟పరీక్షల రుసుము గడువు పొడిగింపు*

🔶 *ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తత్కాల్‌ పథకం కింద రూ.వెయ్యి ఆలస్య రుసుంతో ఈనెల 20వ తేదీ వరకు ప్రధానోపాధ్యాయులకు రుసుము చెల్లించవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకూ రుసుము చెల్లించని వారికి ఇది చివరి అవకాశమని పేర్కొన్నారు.*

*🇮🇳ప్లాస్టిక్ జాతీయ జెండాలు వాడొద్దు: హోంశాఖ*

♦న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో.. ప్లాస్టిక్తో తయారు చేసిన జాతీయ జెండాలను వినియోగించవద్దని కేంద్రప్రభుత్వం ఆదేశించింది.

 ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ర్టాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలు రాసింది. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా అలంకరణల కోసం పేపర్ జెండాల బదులు ప్లాస్టిక్ జెండాలను వినియోగిస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని ఆ లేఖల్లో పేర్కొంది. 

ప్లాస్టిక్ జెండాలు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయని, కొందరు వాటిని తొక్కుకుంటూ అలాగే ముందుకువెళ్తుంటారని పేర్కొంది. దీంతో జాతీయ జెండాకు అవమానం జరిగినట్లు భావించాల్సి వస్తుందని, ఈ సమస్య ప్రతియేటా ఎదురవుతున్నదని వివరించింది.

🌼♦🔘 *ఉద్యోగుల విభజన 98.67శాతం పూర్తి:*

🍥 *ఈనాడు, హైదరాబాద్‌: సమైక్య రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విభజించటానికి సంబంధించి దాఖలైన వాజ్యాల సంఖ్య 167కు చేరింది. చాలాకాలం వివాదాస్పదంగా ఉంటూ వచ్చిన డిప్యూటీ కలెక్టర్ల విభజన పూర్తికావటంతో మొత్తం 57,176 మంది ఉద్యోగుల్లో 56,419 మందిని ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లయింది. దీంతో ఉద్యోగుల విభజనలనో 98.67శాతం పంపిణీ పూర్తయింది.*

🌎  *రాష్ట్ర విభజన సమయానికి 76,414 రాష్ట్ర స్థాయి పోస్టులుండగా వాటిలో 57,176 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండేవారు. ఉద్యోగులను ఉభయ రాష్ట్రాలకు పంచడానికి రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కమలనాథన్‌ నేతృత్వంలో కేంద్రం సలహా సంఘం ఏర్పాటు చేసింది. ఆ సంఘం విభజించగా మిగిలిన ఉద్యోగుల విభజన బాధ్యతను కేంద్రప్రభుత్వమే చేపట్టింది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు, శిక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ మిత్తల్‌ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. పంపిణీ అయిన వారిలో కొంతమంది వేరే రాష్ట్రం కావాలంటూ న్యాయపోరాటానికి దిగటంతో వారిని విభజించిన కేంద్రం కూడా తన వాదనలు వినిపించాల్సిన అవసరం ఏర్పడింది.*

📗 *పరిపాలన ట్రైబ్యునల్‌, హైకోర్టుల్లో ఉన్న కేసుల్లో కొంతమందికి నిలుపుదల(స్టే) ఉత్తర్వులూ లభించాయి. పంపిణీపై ఉద్యోగుల వాజ్యాలు ప్రస్తుతం పరిపాలన ట్రైబ్యునల్‌లో 35, హైకోర్టులో 131 ఉన్నాయి. సీనియారిటీని సక్రమంగా నిర్ధరించలేదంటూ దాఖలైన మరో కేసు ఒకటి ఉంది.  సీనియారిటీ జాబితాలు సక్రమంగా లేవంటూ లేవనెత్తిన వివాదాల కారణంగా ప్రస్తుతం 757 మంది అధికారుల విభజన నిలిచింది. సీనియారిటీ నిర్ధరణ జరిగాకే వీరి పంపిణీకి మార్గం సుగమమవుతుంది..*

*✍ChildInfo Application access is given in 2 Sessions.*

*👉7am to 3pm :*

 *❇ADILABAD,KOMARAM BHEEM,MANCHERIAL, NIRMAL,NIZAMABAD,JAGTIAL,PEDDAPALLI,JAYASHANKAR, BHADRADRI,MAHABUBABAD,WARANGAL RURAL,WARANGAL URBAN, KARIMNAGAR,RAJANNA,KAMAREDDY.*

*👉3pm to 7am :*

 *❇SANGAREDDY,MEDAK,SIDDIPET,JANGAON,YADADRI, MEDCHAL-MALKAJGIRI, HYDERABAD,RANGAREDDY, VIKARABAD,MAHABUBNAGAR,JOGULAMBA,WANAPARTHY,NAGARKURNOOL,NALGONDA,SURYAPET,KHAMMAM...*

*నేటి మన టీ వి క్లాస్సెస్*

*తేదీ*:-- *10--01--2018* 
*బుధ వారము*

********************************

*తరగతి*:- *10 వ*

*సబ్జెక్టు*:- *జీవశాస్త్రం*

*సమయం*:- *10.30 ని,,ల నుండి*

          ★★★★★★★

*తరగతి*:- *9 వ*

*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*

*విషయం*:-  *హ్యూమన్స్ రైట్స్ - II*

*సమయం*:- *11.30ని,,

          ★★★★★★★


*తరగతి*:- *8 వ*

*సబ్జెక్టు*:- *గణితం*

*విషయం*:- *ఘాతాలు-ఘాతాంకాలు - II *

*సమయం*:- *2.00pm

          ★★★★★★★

*తరగతి*:- *7 వ*

*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*

*విషయం*:- *దైవసంబంధ, భక్తి మార్గాలు-II* 

*సమయం*:- *2.45 pm 

          ★★★★★★★

*తరగతి*:- *6 వ*

*సబ్జెక్టు*: *తెలుగు*

*విషయం*:- *పల్లెటూరి పిల్లగాడు - II*

*సమయం*:- *3.40 pm

          ★★★★★★★
*అజ్ఞాతవాసి తొలి రివ్యూ వచ్చేసింది.. పవన్ కుమ్మేశాడు.. బ్లాక్ బస్టర్ (4/5).. బాక్సులు బద్దలే..*

పవన్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం తొలి రివ్యూ వచ్చేసింది.

 ప్రముఖ సినీ విశ్లేషకుడు *ఉమేర్ సంధూ* మొదటి రివ్యూను తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. 

దుబాయ్‌ సెన్సార్ సభ్యుల బృందంలో ఒకడిగా ఉన్న ఆయన తెలుగు భారీ చిత్రాలకు సంబంధించిన రివ్యూలను ముందే వెల్లడించడం అనవాయితీగా వస్తున్నది. 

ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఉమేర్ సంధూ రివ్యూ వైరల్‌గా మారింది.

*పవన్ వన్ మ్యాన్ షో.*

అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కల్యాణ్ ఫెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో. ఇమేజ్‌కు అనుకూలంగా తన నటనతో అదరగొట్టాడు.

 డ్యాన్సులు ఆయన స్టయిల్‌లోనే ఉన్నాయి. అయితే ఆకట్టుకునే విధంగా డ్యాన్సులు చేయడం విశేషం.

ఓవరాల్‌గా పవన్ కల్యాణ్ నటన ఈ సినిమాను మరోస్థాయికి చేర్చింది.

*కీర్తి,అనూ గ్లామర్.*

 హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఫెర్ఫార్మెన్స్, గ్లామర్ అదనపు ఆకర్షణగా మారింది.

 మిగితా నటీనటులు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండి సినిమాను మరో మెట్టు ఎక్కించింది.

కేవలం అభిమానులనే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించే ఎన్నో అంశాలు అజ్ఞాతవాసి చిత్రంలో ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. 

ఈ చిత్ర కథ, కథనం ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉన్నాయి. 

ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ పండుగలా ఉంటుంది.

*త్రివిక్రమ్ మాటలు...*

అజ్ఞాతవాసి చిత్రంలోని కీలక సన్నివేశాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ పటాసుల్లా పేలాయి. 

ఆయన స్టామినాకు ఏమాత్రం తక్కువ మాటలు అద్భుతంగా ఉన్నాయి.

ఫస్టాఫ్‌‌లో మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొనే విధంగా అజ్ఞాతవాసి చిత్రం రూపొందింది.

 సెకండాఫ్ కూడా అద్బుతమైన స్క్రీన్ ప్లేతో దూసుకుపోతుంది.

 *బ్లాక్ బాస్టర్.....*

ఓవరాల్‌గా అజ్ఞాతవాసి చిత్రం ప్రేక్షకులకు పైసా వసూల్ చిత్రం.

 ఫ్యాన్స్ ఈలలతో థియేటర్లను మోత మోగించడం ఖాయం.

 ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో అజ్ఞాతవాసి చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో రికార్డులు తిరగరాసే అవకాశం ఉంది.

అజ్ఞాతవాసి చిత్రం రిలీజైన తర్వాత 5 రోజుల్లో కలెక్షన్లు సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం. 

తెలుగు సినిమా చరిత్రలో పవన్ కల్యాణ్ చిత్రం అతిపెద్ద హిట్‌గా మారడం ఖాయం.

 చివరగా నేను చెప్పేమాట ఏంటంటే.. అజ్ఞాతవాసి చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

 ఈ చిత్రానికి నేనిచ్చే పాయింట్లు 4/5.అంటూ ఉమేర్ సంధూ ట్విట్ చేశారు.

*Jobs*

*ఎస్బీఐలో ఆఫీసర్లు*

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇంటర్నల్ ఆడిట్ విభాగంలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐని 1955 జూలై1న ఏర్పాటుచేశారు.

-పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)

-మొత్తం పోస్టుల సంఖ్య: 50 (జనరల్-26, ఓబీసీ-13, ఎస్సీ-7, ఎస్టీ-4)

-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ఐసీఏ నుంచి చార్టెడ్ అకౌంటెంట్. సీఐఎస్ఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.

-వయస్సు: 2017 జూన్ 1 నాటికి 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు రూ. 100/-

-ఎంపిక: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా
-రాతపరీక్షలో మొత్తం 220 మార్కులకుగాను 170 ప్రశ్నలు ఇస్తారు. 135 నిమిషాల్లో పరీక్షను పూర్తిచేయాల్సి ఉంటుంది.

-రాతపరీక్షలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, సంబంధిత ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

-దరఖాస్తు: ఆన్లైన్లో

-ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేదీ: జనవరి 28

-కాల్లెటర్ డౌన్లోడింగ్: ఫిబ్రవరి 12

-ఆన్లైన్ పరీక్షతేదీ: ఫిబ్రవరి 25

-వెబ్సైట్: www.statebankofindia.in

👉*హెచ్ఎం సంతకం ఫోర్జరీతో బ్యాంకు రుణం*

 తెలంగాణ: వడ్డీవ్యాపారం నిమిత్తం బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు హెడ్మాస్టర్ సంతకాన్ని ఫోర్జరీచేశాడు ఓ ఉపాధ్యాయుడు. *మౌలాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బీ విద్యాసాగర్* ఈ నిర్వాకానికి పాల్పడినట్టు బ్యాంకు అధికారుల విచారణలో వెల్లడైంది. *హెడ్మాస్టర్ శ్రీనివాస్* ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యాసాగర్ను అరెస్ట్ చేశామని మల్కాజిగిరి పోలీసులు తెలిపారు. అతడిని సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు *మల్కాజిగిరి జిల్లా ఇంచార్జి డీఈవో రోహిణి* చెప్పారు.

👉*ఈ నెల 20 వరకు ఎస్సెస్సీ పరీక్ష ఫీజు గడువు*

హైదరాబాద్: మార్చిలో నిర్వహించనున్న ఎస్సెస్సీ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 20తో ముగుస్తుందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ బీ సుధాకర్ మంగళవారం తెలిపారు. 

ఇందుకోసం రూ.వెయ్యి అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులందరికీ నిబంధన వర్తిస్తుందన్నారు.

👉*సీసీఆర్టీలో 650 స్కాలర్షిప్స్*

సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రెయినింగ్ (సీసీఆర్టీ) 2018-19 అకడమిక్ ఇయర్కు గాను వివిధ సాంస్కృతిక విభాగాల్లో యంగ్ చిల్డ్రన్ ఫెలోషిప్స్ పొందడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం పరిధిలో పనిచేస్తుంది.

-మొత్తం ఫెలోషిప్ల సంఖ్య: 650

-ప్రతి ఏడాదికి 650 యంగ్ చిల్డ్రన్ ఫెలోషిప్స్ ఇస్తారు.

-విభాగాలు : 

సంగీతం, నృత్యం, నాటకం, పెయింటింగ్, శిల్పకళ, కళలు, సాహిత్య సాంస్కృతిక రంగాలు.

-అర్హత:

 గుర్తింపు పొందిన పాఠశాలలో 10 నుంచి 14 ఏండ్ల వయస్సులో ఉన్న ప్రతిభావంతులైన పిల్లలు.

-స్టయిఫండ్: ఏడాదికి రూ. 3600/-, సంస్థకు లేదా గురు/ఉపాధ్యాయుడికి ప్రత్యేక శిక్షణ కోసం ట్యూషన్ ఫీజు కింద రూ.9000/- చెల్లిస్తారు.

-ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ రెండేండ్లకు ఇస్తారు. తర్వాత పునరుద్ధరించబడుతుంది.

-ఎంపిక: టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా.

-ఇంటర్వ్యూ/టెస్ట్ తేదీలు, సమయాలు, వేదిక/ప్రదేశం విషయాలను పోస్టు ద్వారా తెలియజేస్తారు. 2018 మేలో ప్రాంతీయ స్థాయిలో నిర్వహిస్తారు.

-దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా.

చిరునామా: CCRT Regional Centre, OPP. CII , New Google Office, Kondapur Main Road, Madhapur, Hyderabad-500084

-చివరితేది: జనవరి 31

-వెబ్సైట్: www.ccrtindia.gov.in

🙏         _*శుభోదయం*_    🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" ఒక మూర్ఖుడిని చూడకూడదనుకుంటే ముందు నీ అద్దాన్ని బద్దలు కొట్టు. "

                         _*-రేబిలియస్*_

       --------------------------
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
      ---------------------------
" నీకన్నా అరటి తొక్క నయం. తన నెత్తిన కాలేస్తేనే పడదోస్తుంది. "

         💦🐬🐥🐳💦
 *💥బాలికా విద్యాభివృద్ధికి 10 సూత్రాలు*

 🔷నివేదికను ఆమోదించిన సబ్‌కమిటీ

🔷 15న కేంద్రానికి మధ్యంతర నివేదిక

 🔷కడియం అధ్యక్షతన సబ్‌కమిటీ భేటీ

♦బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన సెంట్రల్‌ అడ్వయిజరీ బోర్డ్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌(కేబ్‌) 10 సూత్రాలతో నివేదికను రూపొందించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ తన చివరి సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. నివేదికను కమిటీ సభ్యులు చర్చించి ఆమోదించారు. 

♦ఈ సమావేశానికి జార్ఖండ్‌, అస్సాం మంత్రులు నీరజా యాదవ్‌ హిమంత్‌ బిస్వా శర్మ, కేంద్ర మానవ వనరుల అభివృద్థి శాఖ స్పెషల్‌ సెక్రటరీ రీనారాయ్‌, మెంబర్‌ సెక్రటరీ మీనాక్షీ గార్గ్‌, తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్‌ ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. తమ కమిటీ ప్రతిపాదనలతో మధ్యంతర నివేదికను ఈ నెల 15, 16 తేదీల్లో ఢిల్లీలో జరిగే మానవ వనరుల అభివృద్ధి శాఖ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు అందిస్తామన్నారు. 

♦తుది నివేదికను మాత్రం జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అందిస్తామన్నారు. బాలికా విద్యాభివృద్ధికి కమిటీ చేసిన ప్రతిపాదనలు వెల్లడించారు. అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. కడియం అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ బాలికల విద్యపై అత్యుత్తమ ప్రతిపాదనలతో నివేదిక ఇస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

*కమిటీ ప్రతిపాదనలు..*
 ♦కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్యను అందించాలి.

 ♦బాలికలకు ప్రత్యేక రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఎక్కువగా ఏర్పాటు చేయాలి.

 ♦ప్రతి రాష్ట్రంలో తప్పనిసరిగా ఒక మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.

 ♦నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మాదిరిగా జిల్లాల్లో 3 నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలి.

 ♦కేజీబీవీలను 6 నుంచి 8వ తరగతి వరకు కాకుండా 12వ తరగతి వరకు విస్తరించాలి.

 ♦మోడల్‌ స్కూళ్లలో వసతి సౌకర్యాన్ని 200 మంది బాలికలకు పెంచాలి.

 ♦బాలికలకు క్రమం తప్పకుండా హెల్త్‌ కిట్స్‌ అందించాలి. ఖర్చును కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరించాలి.
 ప్రతి పాఠశాలలో, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో తప్పనిసరిగా కౌన్సిలర్‌ను నియమించాలి.

 ♦బాలికా పాఠశాలల్లో, కాలేజీల్లో తప్పనిసరిగా ప్రత్యేక టాయ్‌లెట్‌ వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.

 ♦ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన బాలికల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేయాలి.

ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవాలు
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవాలు

 ఫిబ్రవరి 4

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం


ఫిబ్రవరి 11

ఇంటర్నేషనల్ డే ఆఫ్ వుమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్

ఫిబ్రవరి 13

ప్రపంచ రేడియో దినోత్సవం

ఫిబ్రవరి 20

సోషల్ జస్టిస్ వరల్డ్ డే 

ఫిబ్రవరి 21

ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే 

మార్చి 1

జీరో వివక్షత దినోత్సవం [UNAIDS]

మార్చి 3

వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 

మార్చి 8

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మార్చి 21

జాతి వివక్ష నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం 

21 మార్చి

అడవుల అంతర్జాతీయ  దినోత్సవం

22 మార్చి

వరల్డ్ వాటర్ డే 

23 మార్చి

వరల్డ్ మెటియోరోలాజికల్ డే 

24 మార్చి

ప్రపంచ క్షయవ్యాధి డ దినోత్సవం[WHO]

ఏప్రిల్ 2

ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే 

7 ఏప్రిల్

ప్రపంచ ఆరోగ్య దినం [WHO] 

21 ఏప్రిల్

ప్రపంచ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే 

22 ఏప్రిల్

ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే 

23 ఏప్రిల్

వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే 

25 ఏప్రిల్

ప్రపంచ మలేరియా దినం [WHO]

26 ఏప్రిల్

ప్రపంచ మేధో సంపద దినం [WIPO]

10 మే

ప్రపంచ వలస పక్షుల దినోత్సవం [UNEP]

29 మే

శాంతిభద్రతల అంతర్జాతీయ దినోత్సవం

31 మే

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం [WHO]

1 జూన్

 గ్లోబల్ పేరెంట్స్ డే 

5 జూన్

ప్రపంచ పర్యావరణ దినం 

8 జూన్

ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం 

12 జూన్

వరల్డ్ చైల్డ్ లేబర్ ఎగైనెస్ట్ డే

14 జూన్

ప్రపంచ బ్లడ్ డోనార్ డే [WHO] 
15 జూన్

20 జూన్

ప్రపంచ రెఫ్యూజీ డే 

21 జూన్

యోగా అంతర్జాతీయ దినం 

23 జూన్

అంతర్జాతీయ విడోస్ డే 25 జూన్

11 జూలై

ప్రపంచ జనాభా దినం 

15 జూలై

వరల్డ్ యూత్ స్కిల్స్ డే 

18 జూలై

నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినం 

28 జూలై

ప్రపంచ హెపటైటిస్ డే [WHO]

30 జూలై

 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 

12 ఆగస్టు

ఇంటర్నేషనల్ యూత్ డే 

19 ఆగస్టు

ప్రపంచ మానవతావాద దినోత్సవం 

8 సెప్టెంబరు

అంతర్జాతీయ అక్షరాస్యత దినం 

సెప్టెంబర్ 16

□glympse of Gupta era
1. గుప్తవంశ మూలపురుషుడు ఎవరు ?
              The first two guptas, srigupta and ghatotkacha were rulers of no consequence and are known only through respectful mention by chandragupta-1, the founder of the guptaline.
2. మొదటి చంద్రగుప్తుడు (క్రీ.శ 320-335) ఎవరు ?
గుప్తవంశాల మూలపురుషుడు శ్రీగుప్తుడు. ఇతడు పాటలీపుత్రం దాని పరిసర ప్రాంతాలకు అధిపతి. ఇతని కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని కుమారుడు మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్చవీరాకుమార్తె అయిన కుమారీదేవిని వివాహమాడి, వారి సాయంతో గంగానదీ పరిసర ప్రాంతాలను జయించి, గుప్తసామ్రాజ్యానికి పునాదులు వేశాడు. ఇతడు క్రీ.శ 320 ఫిబ్రవరి 26న గుప్తశకాన్ని ప్రారంభించాడు.
By marriying a lichchhavi princess, chandragupta-1 sought to gain in prestige, though vaishali does not appear to have been part of his kingdom. His rule remained confined to magadha and parts of eastern uttar pradesh (saketa and prayaga). He took 319-20 marks the beginning of the gupta era.
3. 'నీతిసారం' గ్రంథకర్త ఎవరు ?
కౌటిల్యుని అర్ధశాస్త్రానికి పూర్వార్థంలోని ఒకటో చంద్రగుప్తుని కాలంలో కామందుకుని 'నీతిసారం' అనే గ్రంథం ప్రసిద్ధి చెందింది. ఆనాటి రాజనీతి, పరిపాలనా వ్యవస్థ ఈ నీతిసారంలో ప్రతిబింబిస్తున్నాయి. 
4. గుప్తవంశం - రాజులు ఎవరు ?
- శ్రీగుప్తుడు (మూలపురుషుడు)
- ఘటోత్కచుడు
- మొదటి చంద్రగుప్తుడు (క్రీ.శ 320-335)
- సముద్రగుప్తుడు (క్రీ.శ 335-380)
- చంద్రగుప్త విక్రమాదిత్యుడు (క్రీ.శ 380-414)
- మొదటి కుమారగుప్తుడు (క్రీ.శ 414-435)
- స్కందగుప్తుడు (క్రీ.శ 435-467)
నోట్‌ : స్కందగుప్తుడు చివరిగొప్ప గుప్త చక్రవర్తి. అతని తర్వాత గుప్తరాజ్యం పతనం కావడం ప్రారంభమైంది. స్కందగుప్తుని తర్వాత పురుగుప్తుడు రాజయ్యాడు. తర్వాత 477 ఎడిలో బుద్ధగుప్తుడు అధికారంలోకి వచ్చాడు. హుణ దండయాత్రల వల్ల గుప్తరాజ్యం బాగా బలహీనపడి, మూడవ కుమారగుప్తుడు చివరి గుప్త చక్రవర్తి.
5. సముద్రగుప్తుడిని గుప్తవంశం గొప్పవాడు అని ఎందుకు అంటారు?
గుప్తచక్రవర్తులలోనేకాక భారతీయ చక్రవర్తులలో అగ్రగణ్యుడు సముద్రగుప్తుడు. ఇతనిని చరిత్రకారుడు స్మిత్‌ 'భారతీయ నెపోలియన్‌' అని అభివర్ణిస్తారు. ఇతడు గొప్ప విజేత. ఓటమి ఎరుగనిధీరుడు. సముద్రగుప్తుని దిగ్విజయయాత్రలను గురించి అతని మంత్రియైన హరిసేనుడు అశోకుని స్తంభముపై రాయించిన అలహాబాద్‌ ప్రశస్తి అనే శిలాశాసనం వల్ల తెలుస్తుంది. ఇతడు తన దిగ్విజయ యాత్రలతో గుప్తసామ్రాజ్యాన్ని ఉత్తర హిమాలయ పర్వతాల నుంచి దక్షిణ నర్మదానది వరకూ, పడమర యమున, చంబల్‌ నదుల నుంచి తూర్పు బ్రహ్మపుత్రవరకూ విస్తరింపజేశాడు.
సముద్రగుప్తుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతడు గొప్పనాయకుడు. సంగీత విద్వాంసుడు. వీణ వాయిస్తున్నట్లు ఉన్న అతని బంగారు నాణేలు అతని సంగీత ప్రతిభను, సంగీతాభిమానాన్ని చాటుచున్నవి. సముద్రగుప్తుడు గొప్పకవి. కవి, పండిత పోషకుడు. ఇతనికి 'కవిరాజు' అనే బిరుదు ఉన్నది. ఇతని ఆస్థానంలో 'వసుబంధుడు' అనే బౌద్ధ పండితుడు ఉండేవాడు.
6. సంస్కృత సాహిత్యాన్ని అభివృద్ధి చేసిన 'నవరత్నాలు' అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉన్నారు?
గుప్తచక్రవర్తులలోనేకాక భారతీయ చక్రవర్తులలో ప్రముఖుడు రెండో చంద్రగుప్తుడు లేక చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఇతని పాలనాకాలం స్వర్ణయుగంగా కీర్తికెక్కింది. 
రెండో చంద్రగుప్తుడు తన తండ్రి సముద్రగుప్తుని వలే దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఇందుకు మొదట భారతదేశంలోని బలీయులైన చక్రవర్తులతో వివాహ సంబంధాలు కలిపి, విదేశీయులైన శక్తులను భారతదేశం నుంచి తరిమివేశాడు. ఈ విజయానికి చిహ్నంగా చంద్రగుప్తుడు 'శకారి', 'సాహసాంక', 'విక్రమాదిత్య' అనే బిరుదులను ధరించాడు. సింహం బొమ్మగల బంగారు నాణేలను ముద్రించాడు.
చంద్రగుప్తుని దిగ్విజయ యాత్రల వల్ల ఇతని రాజ్యం ఉత్తర హిమాలయ పర్వతాల నుంచి దక్షిణ నర్మదానది వరకూ, తూర్పు బెంగాలు నుంచి పశ్చిమ వల్లభి వరకూ విస్తరించింది.
చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆదరణలో ఉజ్జయిని గొప్ప విద్యాకేంద్రంగా విలసిల్లింది. విక్రమాదిత్యుని ఆస్థానంలో 'నవరత్నాలు' అనే తొమ్మిదిమంది సంస్కృత పండితులు ఉండేవారు. వారి పేర్లు 3 Period 
1. కాళిదాసు 2. వరహమిహిరుడు
3. ధన్వంతరి 4. అమరసింహుడు
5. క్షపణకుడు 6. శంకు
7. భేతాళభట్టు 8. ఘాటకర్పురుడు
9. వరరుచి 
నవరత్నాలలో కాళిదాసు అగ్రగణ్యుడు. ఈయన,  రచించిన,  అభిజ్ఞాన శాకుంతలం, మేఘసందేశం, కుమారసంభవం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, రఘువంశం, ఋతుసంహారం, మేఘదూత.. మొదలైన రచనలు సంస్కృత భాషలో అత్యుత్తమమైనవి. 
వరాహమిహిరుడు రచనలు.. పంచసిద్ధాంతం, బృహత్‌ సంహిత. తన బృహత్‌ సంహితలో చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతున్నాడని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని చెప్పాడు. బృహత్‌ జాతక అనే గ్రంథాన్నీ రచించాడు. ఇవి ఖగోళ, భౌతిక, వృక్ష, ప్రకృతి శాస్త్రాల విజ్ఞానసర్వస్వమని చెప్పవచ్చు.
7. రెండో చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రీకుడు ఎవరు?
చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో 'పాహియాన్‌' అనే చైనాయాత్రీకుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఇతడు భారతదేశంలో పది సంవత్సరాలు ఉమ్మడి గుప్తుల పాలనను ప్రశంసించాడు. ఇతని రచన 'రికార్డు ఆఫ్‌ బుద్ధిస్ట్‌ కింగ్‌డమ్స్‌.
గుప్తుని కాలంలో ప్రజలపై పన్నుల భారం లేదని పేర్కొన్నాడు. సుమారు క్రీ.శ 399-414 మధ్య కాలంలో సందర్శించాడు. 
8. గుప్తులకాలంనాటి- పండితులు - రచనలు ఏవి?
- రామచంద్రుడు - నాట్యదర్పణం
- సుబంధు - వాసవదత్త
- ప్రవరసేనుడు - సేతుబంధం
- వాగ్భటుడు - పుష్పాంగ సంగ్రహం (వైద్యశాస్త్రం)
- మాఘకవి - శిశుపాలవధ
- కాస్మాస్‌ - క్రిష్టియన్‌ టోఫోగ్రఫీ
- బ్రహ్మగుప్తుడు - గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం, 
బ్రహ్మసృత సిద్ధాంతం, కందకంద్యకా
- దండి - దశకుమార చరిత్ర, కావ్యదర్మ
- ఆర్యభట్టు - సూర్యసిద్ధాంతం, ఆర్యభట్టీయం
- శిఖాభదత్తుడు - ముద్రరాక్షసం, దేవీచంద్రగుప్తం
- శూద్రకుడు - మృచ్ఛకటికం, మృత్స్యకటిక
- విష్ణుశర్మ - పంచతంత్రం
- భారవి - కిరాతార్జునీయం
- బాణుడు - స్వప్నవాసవదత్త, ప్రతిజ్ఞాయుగంథరాయ
- మయూరుడు - సూర్య శతకం
9. గుప్తుల కాలంనాటి మంత్రిమండలి ఎలా ఉండేది?
చక్రవర్తికి పరిపాలనలో సహాయపడటానికి, మంత్రిమండలి ఉంది. మంత్రులను మంత్రి లేదా సచివ అని పిలిచేవారు. విశ్వాసపాత్రులైన వారిని, ప్రతిభగలవారిని మాత్రమే మంత్రులుగా నియమించారు.
1. సర్వాధక్ష : ఇతను మొత్తం కేంద్రపరిపాలనను పర్యవేక్షిస్తాడు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను గవర్నర్లకు, జిల్లా అధికారులకు చేరవేసే బాధ్యత సర్వాధ్యక్షునిది.
2. మహాసేనాపతి : గుప్తచక్రవర్తులే సైన్యానికి నాయకత్వం వహించి దండయాత్రలు నడిపేవారు. అయినప్పటికీ సైనిక నిర్వహణ కోసం మహాసేనాధిపతిని నియమించేవారు. 
3. మహాదండనాయక : ఇతను న్యాయాధిపతి
4. మహాబలాధికరణ : సైనికశాఖాధిపతి
5. దండోపాశిక : పోలీసుశాఖాధిపతి
6. మహాసంధివిగ్రహిక : విదేశాంగమంత్రి
7. భండాగారాధికృత : ప్రభుత్వకోశాధికారి
8. మహాప్రతిహార : ప్రభుకుటుంబ బాధ్యతలు చూసుకునేవాడు.
10. 'విషయపతి' అంటే ఎవరు ?
రాష్ట్ర పరిపాలనా కేంద్ర పరిపాలనను పోలి ఉంది. ప్రావిన్సులను జిల్లాలుగా (విషయ) విభజించారు. జిల్లాధికారిని విషయపతి అంటారు. ఇతన్ని ఐదేళ్ల కాలానికి నియమించారు. విషయ పరిపాలనా నిర్వహణ కోసం 30 మందితో కూడిన సలహాబోర్డు ఉండేది. ఈ బోర్డును 'విషయ మహత్తర' అంటారు. ఈ బోర్డు సభ్యులను విషయపతి నియమిస్తాడు. ఈ బోర్డు సభ్యులు వివిధరకాల గిల్డులు, వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. 
1. సార్థవహ - వ్యాపారవాణిజ్య సంస్థాధిపతి
2. నగరశ్రేష్టి - గిల్డు అధ్యక్షుడు
3. ప్రథమ కాయస్త - ప్రధానలేఖనుడు 
4. ప్రథమ కులిక - మొదలైనవారు జిల్లా బోర్డులో సభ్యులుగా ఉండి, జిల్లా పరిపాలనలో విషయపతికి సహకరిస్తారు.

నమూనా ప్రశ్నలు
1. హైందవ తర్కశాస్త్రానికి మూలపురుషుడైన ప్రాచీన భారతమేధావి - దిజ్నాగుడు
2. గుప్తుల కాలంలో వైద్య విజ్ఞానంలో, శస్త్రచికిత్సలు చేయడంలో పేరుగాంచినవారు - శుశ్రుతుడు - శుశ్రుతసంహిత గ్రంథం రచయిత
3. నలందా విశ్వవిద్యాలయంతో సంబంధమున్న గుప్త చక్రవర్తి 
- కుమారగుప్తుడు
4. పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి తన రాజధానిని మార్చిన గుప్తరాజు - రెండో చంద్రగుప్తుడు
5. గుప్తుల కాలంలో 'పూగ' అనేపదం దేన్ని సూచిస్తుంది 
- వర్తకుల సమూహం (వడ్ల వ్యాపారులు)
6. గుప్తులకాలంలో తూర్పు తీరంలోని ఓడరేవు (ముఖ్యమైనది) 
- తామ్రలిప్తి 
7. సముద్రగుప్తుని పరిపాలనాకాలం - క్రీ.శ 335-375
8. సముద్రగుప్తుని సుప్రసిద్ధ ప్రశస్తియైన అలహాబాద్‌ స్తంభశాసనాన్ని రచించిన హరిసేనుడు ఏ పదవిని నిర్వహించాడు - సేనాధిపతి
9. సముద్రగుప్తుని సైనిక విజయాలతో విశేషంగా ఆకర్షితుడైన ఏ చరిత్రకారుడు ఇతన్ని 'ఇండియన్‌ నెపోలియన్‌'గా వర్ణించాడు - డా.వి.ఎ.స్మిత్‌
10. దశాంశ, సున్న విలువలను ప్రపంచానికి ఇచ్చింది ఏ కాలపు గణిత, ఖగోళశాస్త్రజ్ఞులు - గుప్తుల కాలంనాటి
11. అజంతాలోని కుడ్యచిత్రాలలోని గుప్తులకు సంబంధించిన గుహలు - 16,17,19
12. నిగమ అనగా - ఒక పట్టణానికి చెందిన ప్రజల సమూహం
13. మౌర్యుల కాలంనాటి కౌటిల్యుని అర్ధశాస్త్రంలో పోల్చదగిన గుప్తులకాలం నాటి గ్రంథం ఏమిటి - కామందకుడు రచించిన నీతిసారం
14. గుప్తుల కాలంలో రచించిన నవనికేతనం ఏ శాస్త్రానికి సంబంధించినది - వైద్యం
15. స్కందావారాలు అనగా - మిలటరీ క్యాంపులు

*ప్రశ్న: రాకెట్లను ఆకాశంలోకి పంపేటప్పుడు తూర్పు వైపునకు ఎందుకు గురి పెడతుంటారు? ఇతర దిశల్లో ఎందుకు పంపరు?*

జవాబు: ఈ ఆనవాయితీ మన దేశంలోనే ఉంది. ఇస్రో రాకెట్టు ప్రయోగంలో టన్నుల కొద్దీ ఇంధనం చాలా త్వరితంగా మండుతుంటుంది. ఆ దహనక్రియలో వెలువడే వేడి వాయువులు ఇరుకైన నాజిల్‌ ద్వారా రావడం వల్లే రాకెట్టు పైకి ఎగురుతుంది. ఒకవేళ ఏవైనా సాంకేతిక లోపాల వల్ల రాకెట్టు కొంచెం దూరం ఎగిరాక కింద పడితే ఆ పడ్డచోట జనావాసం ఉన్నా, పరిశ్రమలు, పంటలు, ఇతర నిర్మాణాలు ఉన్నా ఆ రాకెట్టు మంటల్లో ప్రమాదానికి గురి కాగలవు. శ్రీహరి కోటలో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి తూర్పున బంగాళాఖాతం ఉంది. ఇక మిగిలిన అన్ని దిశల్లో భూభాగం, తీర ప్రాంత ప్రజానికం, నిర్మాణాలు ఉంటాయి. కాబట్టి ప్రమాదవశాత్తు రాకెట్టు విఫలమైనా, రాకెట్టు వృథా కావడం మినహా మిగిలిన అవాంఛిత నష్టాలు జరగవు.

1.ఏ భారత గోల్ఫ్ క్రీడాకారుడు రాయల్ కప్ టోర్నమెంట్ 2017 గెలుచుకున్నాడు?
✅శివ్ కపూర్

2.ఈశాన్య రాష్ట్రం అధికారికంగా ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ (ODF) ను ప్రకటించిది సిక్కిం తర్వాత ?
✅అరుణాచల్ ప్రదేశ్

3. బహుళ-పార్శ్వ వాణిజ్య సంస్థను పునరుద్ధరించడానికి ఫిబ్రవరి 2018 లో WTO సభ్యుల చిన్న మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించే ఏ దేశం?
✅భారతదేశం

4.KKR & Co. అనేది భారతదేశ మొట్టమొదటి విదేశీ ఆస్థి పునఃనిర్మాణ సంస్థ (ARC) గా మారింది. ఇది ఏ దేశానికి సంబంధించినది?
✅యునైటెడ్ స్టేట్స్

5.ఏ దేశం ప్రపంచంలోని అతిపెద్ద మానవ జన్యు పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించింది?
✅చైనా

6.ఏ కేంద్ర మంత్రి మన్గులూరులో కొత్త ప్రారంభ-ప్రారంభ పొదుపు కేంద్రాన్ని "ఎంట్రప్రెన్యూర్షిప్ సెంటర్ ఫర్ ఎర్ప్రాపెన్యూర్షిప్ ఆపోనిటీస్ అండ్ లెర్నింగ్ (సీఈఓఎల్)" ను ప్రారంభించారు?
✅నిర్మల సీతారామన్

7. 2018 ఖెలో ఇండియా స్కూల్ గేమ్స్ (KISG) యొక్క ప్రసార హక్కులు ఏ కంపెనీకి లభించింది?
✅స్టార్ స్పోర్ట్స్

8. ఏ క్రికెట్ జట్టు 2017 రంజీ ట్రోఫీ టోర్నమెంట్ గెలుచుకుంది?
✅విదర్భ

9. ఛమరా డ్యామ్ ఏ రాష్ట్రంలో / యుటిలో ఉంది?
✅హిమాచల్ ప్రదేశ్

10. 32 వ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ ఫెయిర్ కోసం ఏ రాష్ట్రం రాష్ట్ర స్థితి అవుతుంది?
✅ఉత్తరప్రదేశ్

11. తెలంగాణ మైనారిటీ కమీషన్ చైర్మన్, వైస్ చైర్మన్ గా నియామకం జరిగింది
✅మహమ్మద్ కమరుద్దున్
✅రాజారపు ప్రతాప్
           🍃🌷🤗🌷🍃
➖➖➖➖➖➖➖➖➖➖
*CURRENT AFFAIRS*
➖➖➖➖➖➖➖➖➖➖
*రాష్ట్రీయం*
1) కరీంనగర్ లో రూ.25 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణానికి ఎవరు శంకుస్థాపన చేశారు ?
జ: మంత్రి కేటీఆర్
2) రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రమాణాలకు కొత్తగా ఏ కార్యక్రమాన్ని ఉన్నత విద్యా మండలి ప్రవేశపెట్టనుంది ?
జ: క్వాలిటీ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్( ది క్విప్ )
3)జనగామకు దగ్గరల్లో ఉన్న గజగిరి గుట్టపై చారిత్రక యుగం, బృహత్ శిలా యుగం నాటి ఆనవాళ్ళ కోసం HCU ఏ యూనివర్సిటీతో కలసి పరిశోధనలు చేయనుంది ?
జ: కేంబ్రిడ్జి యూనివర్సిటీ (ఇంగ్లండ్)

*జాతీయం*
4) మార్కెట్ లో తక్కువకే పంటను అమ్ముకోవాల్సి వస్తే ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇలాంటి పథకం మధ్యప్రదేశ్ లో ఇప్పటికే అమల్లో ఉంది. దాని పేరేంటి ?
జ: భవంతర్ భుగతాన్ యోజన
5) ప్రపంచ సోలార్డ్ దిగ్గజ కంపెనీల్లో చోటు దక్కించుకున్న మన దేశానికి చెందిన సంస్థ ఏది ?
జ: అదానీ గ్రూప్ ( టాప్ 12)
6) ఏ దేశ సరిహద్దుల్లో రూ.416.73 కోట్లతో 14,460 బంకర్లు నిర్మించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది ?
జ: పాకిస్తాన్
7) కేంద్ర చలన చిత్ర ధృవీకరణ మండలి ఆమోదించినా ఏ రాష్ట్రంలో పద్మావత్ ను నిషేధించారు ?
జ: రాజస్థాన్
8) అప్రమత్తంగా ఉండి సమయస్ఫూర్తిని ప్రదర్శించే ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ పేరుతో ఏ సంస్థ అవార్డులు ఇస్తుంది ?
జ: దక్షిణ మధ్య రైల్వే
9) భారత విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గా ఎవరు నియమితులయ్యారు ?
జ: టి.ఎస్. తిరుమూర్తి
10) జాతీయ గుడ్డు సమన్వయ సంఘం (నెక్) అధ్యక్షురాలిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ?
జ: అనూరాధా జే దేశాయ్
11) స్వలింగ సంపర్కానికి సంబంధించిన శిక్షలపై కేసును పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఐపీసీలో ఏ సెక్షన్ కింది స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారు ?
జ: ఐపీసి 377
12) ఇంద్రావతి డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: ఒడిశా
13) ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ నెల 6 నుంచి జరుగుతున్న న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ థీమ్ ఏంటి ?
జ: Environment and Climate change
14) ఈసారి న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ లో ఎక్కువ ఏ దేశాల బుక్స్ అందుబాటులో ఉన్నాయి ?
జ: యూరోపియన్ యూనియర్ ( 40 దేశాలు)
15) 2018 అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (ఉత్తరాయణ్) గుజరాత్ లోని ఏ నగరంలో జరుగుతోంది
జ: అహ్మదాబాద్
16) వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ 2018 ను దేశంలోని ఏ నగరంలో నిర్వహిస్తున్నారు ?
జ: హైదరాబాద్
17) సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: తమిళనాడు

*అంతర్జాతీయం*
18) 5 లక్షల ఏళ్ల నాటి రాతి గొడ్డళ్ళును ఎక్కడ గుర్తించారు ?
జ: జెరూసలేం లోని జుల్ జులియా (ఇజ్రాయెల్)
19) వాష్టింగ్టన్ లో చనిపోయిన జాన్ వాట్స్ యంగ్ ఏ రంగానికి చెందినవారు ?
జ: వ్యోమగామి ( ఎక్కువసార్లు అంతరిక్షయానం చేశారు. చంద్రుడిపై నడిచిన అమెరికా వ్యోమగామి)
20) అతిపెద్ద ప్రధాన సంఖ్యను అమెరికాకి చెందిన జొనాథన్ పేస్ అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ కనిపెట్టాడు. అందులో ఎన్ని అంకెలు ఉన్నాయి ?
జ: 2,32,49,425
21) తప్పుడు, మోస పూరితమైన వార్తలు రాస్తున్నారంటూ మీడియాకి ఫేక్ న్యూస్ అవార్డులు ఇస్తానని చెప్పిన దేశాధ్యక్షుడు ఎవరు ?
జ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
22) డ్రామా టెలివిజన్ సిరీస్ లో ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ అమెరికన్ ఎవరు ?
జ: స్టెర్లింగ్ కె బ్రౌన్
23) హాప్ మన్ కప్ టోర్నమెంట్ 2018 ను ఏ దేశం గెలుచుకుంది ?
జ: స్విట్జర్లాండ్
24) హిమాలయన్ హైడ్రో ఎక్స్ పో 2018 ఏ నగరంలో జరుగుతోంది ?
జ: ఖాట్మండు
25) మహిళలు, పురుషులకు సమాన వేతనం ఇవ్వాలని చట్టం చేసిన మొదటి దేశం ఏది ?
జ: ఐస్ లాండ్
26) యునెస్కో డైరక్టర్ జనరల్ ఎవరు ?
జ: ఆడ్రీ అజౌలే
27) యునెస్కో నుంచి అమెరికాతో పాటు తప్పుకుంటున్నట్టు ప్రకటించిన దేశం ఏది
జ: ఇజ్రాయెల్
28) VAT ను ప్రవేశపెట్టిన మొదటి గల్ఫ్ దేశం ఏది
జ: సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
29) Whistled అనే భాషను పక్షుల భాష అంటారు. దీన్ని ఏ దేశంలోని ఓ గ్రామంలో ప్రజలు మాట్లాడతారు ?
జ: టర్కీ
            🍃🌷🤗🌷🍃
■అక్టోబర్ 2017 అంతర్జాతీయంసింగపూర్ పాస్‌పోర్ట్ అత్యంత శక్తిమంతం
 ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులను జారీచేస్తున్న దేశాల జాబితాలో సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో ఒక ఆసియా దేశం తొలి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఆర్థిక సలహాల సంస్థ ఆర్టన్ క్యాపిటల్ విడుదల చేసిన 'గ్లోబల్ పాస్‌పోర్టు పవర్ ర్యాంక్-2017'జాబితాలో రెండో స్థానంలో జర్మనీ నిలవగా భారత్ 75వ ర్యాంకును పొందింది. గత ఏడాది 78వ స్థానంలో నిలిచిన ఇండియా ఈసారి మూడుస్థానాలు మెరుగుపరుచుకుంది. భారతీయులకు 51 దేశాల్లో వీసా మినహాయింపు, లేదా వీసా ఆన్ అరైవల్ (విదేశీ విమానాశ్రయాల్లో దిగిన వెంటనే వీసా మంజూరు చేస్తారు) సౌకర్యం ఉంది. అఫ్గానిస్తాన్ చివరిదైన 94వ స్థానానికి పరిమితమవగా, పాకిస్తాన్, ఇరాక్‌లు సంయుక్తంగా 93వ స్థానంలో నిలిచాయి. 
టాప్-10 శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌లు 

ర్యాంకు

దేశం

స్కోరు

1

సింగపూర్

159

2

జర్మనీ

158

3

స్వీడన్, దక్షిణ కొరియా

157

4

డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, జపాన్, యూకే

156

5

లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్‌‌స, బెల్జియం, ఆస్ట్రియా, పోర్చుగల్

155

6

మలేసియా, ఐర్లాండ్, కెనడా, అమెరికా

154

7

ఆస్ట్రేలియా, గ్రీస్, న్యూజిలాండ్

153

8

మాల్టా, చెక్ రిపబ్లిక్, ఐస్‌లాండ్

152

9

హంగెరీ

150

10

స్లోవేనియా, స్లోవేకియా, పోలండ్, లిథువేనియా, లాత్వియా

149

ర్యాంకు ఎలా నిర్ణయిస్తారు..
వివిధ దేశాల మధ్య అమలులో ఉన్న ఒప్పందాల ప్రకారం ఏ దేశ పౌరులకై తే అత్యధిక దేశాల్లో వీసా అవసరం ఉండదో సదరు దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. సింగపూర్ దేశస్తులు వీసా అవసరం లేకుండా ఏకంగా 159 దేశాలకు వెళ్లే ఆస్కారం ఉంది కాబట్టి దానికి ప్రథమ స్థానం దక్కింది. ఇదివరకు జర్మనీతో కలిసి సింగపూర్ తొలి స్థానాన్ని పంచుకునేది. అయితే ఇటీవల సింగపూర్ ప్రజలకు పరాగ్వే వీసా మినహాయింపునిచ్చింది. దాంతో జర్మనీని రెండోస్థానానికి నెట్టిన సింగపూర్ తొలి స్థానానికి ఎగబాకింది. ఆసియా నుంచి దక్షిణకొరియా, జపాన్, మలేసియాలు కూడా మొదటి పది దేశాల్లో చోటు దక్కించుకున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ పాస్‌పోర్టు పవర్ ర్యాంక్-2017 
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : ఆర్టన్ క్యాపిటల్
ఎక్కడ : తొలి స్థానంలో సింగపూర్, 75వ స్థానంలో భారత్ 

చైనా అధ్యక్షుడిగా మరో ఐదేళ్లు జిన్‌పింగ్
చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ.. దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ నేతృత్వంలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మరో ఐదేళ్ల పాటు (రెండోసారి) జిన్‌పింగ్‌కు అవకాశం కల్పించింది.
జిన్‌పింగ్, కెకియాంగ్ (కమ్యూనిస్ట్ పార్టీ రెండో ర్యాంక్ నాయకుడు, ప్రధాని) కాక రూలింగ్ కౌన్సిల్‌లో జిన్‌పింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లీ జాన్షు(67), ఉప ప్రధాని వాంగ్ యాంగ్(62), కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త వాంగ్ హనింగ్(62), పార్టీ ఆర్గనైజేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ జావో లెజీ(60), షాంఘై పార్టీ చీఫ్ హాన్ జెంగ్ (63) చోటు దక్కించుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా అధ్యక్షుడిగా మరో ఐదేళ్లు జిన్‌పింగ్ 
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : చైనా జాతీయ కమ్యూనిస్ట్ కాంగ్రెస్
ఎక్కడ : బీజింగ్ 

హవాయిలో రోడ్లపై ఫోన్లు వినియోగిస్తే జరిమానా
హవాయిలోని హోనొలులు నగరం రోడ్లపై నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు చూడటంపై నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అక్టోబర్ 25 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రోడ్లపై ఫోన్లు చూస్తూ నడిచిన వారికి 35 డాలర్ల (రూ.2,200) జరిమానా విధిస్తారు. 
ఇటీవల అమెరికాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క 2016లోనే 5,987 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోడ్డుపై వస్తున్న వాహనాలను చూసుకోకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రోడ్లపై ఫోన్లు చూస్తూ నడిస్తే 35 డాలర్ల జరిమానా 
ఎప్పుడు : అక్టోబర్ 25 నుంచి 
ఎక్కడ : హోనొలులు, హవాయి, అమెరికా 
ఎందుకు : రోడ్డు ప్రమాదాల నివారణకు 

స్వాతంత్ర తీర్మానాన్ని ఆమోదించిన కాటలోనియా 
స్వాతంత్య్రానికే మొగ్గు చూపుతూ జరిగిన రెఫరెండానికి కొనసాగింపుగా స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అక్టోబర్ 27న బార్సిలోనాలోని కాటలోనియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘గణతంత్ర స్వతంత్ర దేశంగా కాటలోనియాను ప్రకటిస్తున్నాం’ అనే ఆ తీర్మానానికి అనుకూలంగా 70 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓటేశారు. 
అయితే ఆ నిర్ణయం చట్టబద్ధం కాదని, అమలుకు వీలుకాదని స్పెయిన్ తేల్చిచెప్పింది. కాటలోనియాపై ప్రత్యక్ష పాలన విధించేలా ప్రధాని రజోయ్‌కి అధికారాలను అప్పగిస్తూ స్పెయిన్ సెనెట్ తీర్మానం చేసింది. ఐక్య స్పెయిన్‌కే యూరోపియన్ యూనియన్, అమెరికాలు మద్ధతు ప్రకటించాయి. కాటలోనియా పార్లమెంట్‌ను రద్దు చేసి, డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కాటలోనియా స్వాతంత్ర తీర్మానానికి ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : కాటలోనియా పార్లమెంట్ 
ఎందుకు : స్పెయిన్ నుంచి విడిపోయేందుకు 

సౌదీలో క్రీడా మైదానాల్లోకి మహిళలకు అనుమతి
ఇటీవల మహిళలను డ్రైవింగ్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా తాజాగా వారిని క్రీడా మైదానాల్లోకి కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం 2018 నుంచి అమల్లోకొస్తుందని, దీంతో వారు దేశంలోని మూడు ప్రధాన మైదానాలైన రియాద్, జెడ్డా, దామన్ స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. అక్కడి గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా తండ్రి, భర్త లేదా సోదరుడి నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మహిళల ప్రగతి కోసం పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రీడా మైదానాల్లోకి మహిళలకు అనుమతి
ఎప్పుడు : 2018 నుంచి
ఎవరు : రాజు మహ్మద్ బిన్ సల్మాన్ 
ఎక్కడ : సౌదీ అరేబియా
ఎందుకు : పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు

రోబోకు పౌరసత్వం 
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక రోబోకి పౌరసత్వం లభించింది. ‘సోఫియా’ అనే హ్యూమనాయిడ్ రోబోకి పౌరసత్వం ఇస్తున్నట్లు అక్టోబర్ 27న సౌదీ అరేబియా ప్రకటించింది.

తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించం: జిన్‌పింగ్ 
 స్వతంత్రంగా ఉండేందుకు తైవాన్ చేస్తున్న ప్రయత్నాలను విజయవంతం కానీయబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. చైనా భూభాగం నుంచి ఏ భాగమైనా, ఎవరైనా, ఏ సంస్థ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా విడిపోయేందుకు ప్రయత్నిస్తే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కావాలంటే, హాంకాంగ్, మకావ్‌ల్లో జరుగుతున్నట్లు ఒక దేశం రెండు వ్యవస్థల విధానం ద్వారా శాంతియుత పద్ధతిలో పాలన కొనసాగించుకునేందుకు అంగీకరిస్తాం. తైవాన్ అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహాయం చేస్తాం. ఈ మేరకు అక్టోబర్ 18న చైనా కమ్యూనిస్ట్ పార్టీ 19వ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన అధ్యక్షుడు షి జిన్‌పింగ్.. కీలక అంతర్గత, అంతర్జాతీయ అంశాలపై దేశ, పార్టీ విధానాలను సమావేశాలకు హాజరైన దాదాపు 2 వేల మంది ప్రతినిధులకు వివరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించేది లేదని స్పష్టీకరణ 
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 
ఎక్కడ : చైనా కమ్యూనిస్ట్ట్ పార్టీ 19వ సమావేశాల్లో 

కేటలోనియా సర్కారు రద్దుకు స్పెయిన్ నిర్ణయం 
కేటలోనియా వేర్పాటువాద ప్రభుత్వాన్ని రద్దుచేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. వేర్పాటువాద నేతలు స్వాతంత్య్రం ప్రకటించకుండా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 21న అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించిన ప్రధాని మేరియానో రాజోయ్ కేటలోనియా ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కేటలోనియన్ పార్లమెంటును రద్దుచేసేందుకు తనకు సంపూర్ణ అధికారాలివ్వాలని స్పెయిన్ సెనెట్‌ను ఆయన కోరారు. సెనెట్‌లో రాజోయ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పాపులర్ పార్టీకి మెజారిటీ ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేటలోనియా సర్కార్ రద్దుకు నిర్ణయం 
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : స్పెయిన్ ప్రధాని మేరియానో రాజోయ్ 

జపాన్ ఎన్నికల్లో షింజో అబే పార్టీ విజయం
జపాన్ ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని షింజో అబే పార్టీ విజయం సాధించింది. 465 మంది సభ్యులున్న దిగువ సభలో అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ప్రతినిధుల సభకు అక్టోబర్ 22న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో లిబరల్ డెమొక్రటిక్‌కు 281, మిత్రపక్షం కొమెటోకు 29 కలిపి మొత్తం 310 స్థానాలు లభించడంతో దాదాపు మూడింట రెండొంతుల ఆధిక్యం దక్కినట్లయింది. అబే నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

లండన్‌లో కార్లపై కాలుష్య పన్ను 
కాలుష్యానికి కారణమవున్న కార్లకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త పన్నును అమల్లోకి తెచ్చింది. లండన్ నగరంలో తిరిగే పాత కార్లు, అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలకు 10 పౌండ్ల (రూ. 858) జరినామా విధించాలని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ నిర్ణయించారు. 2006కు ముందు రిజిస్టరైన డీజిల్, పెట్రోల్ వాహనాలకు ఈ కాలుష్య పన్ను వర్తిస్తుంది. యూరప్‌లో అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన లండన్‌లో తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాత కార్లు, అధిక కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలపై 10 పౌండ్ల జరిమానా
ఎప్పుడు : అక్టోబర్ 23 
ఎవరు : లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ 
ఎక్కడ : లండన్‌లో 
ఎందుకు : కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా

ఏఆర్ రెహ్మాన్ సంస్థతో యాపిల్ మ్యూజిక్ జట్టు
 మ్యాక్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహ్మాన్ నెలకొల్పిన కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీస్ (కేఎంఎంసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాపిల్ మ్యూజిక్ వెల్లడించింది. యాపిల్‌కి చెందిన ప్రొఫెషనల్ మ్యూజిక్ యాప్ లాజిక్ ప్రో ఎక్స్‌తో స్వరాల రూపకల్పన చేయడంలో మ్యాక్ ల్యాబ్స్‌లో శిక్షణనిస్తారు. ప్రస్తుతం చెన్నైలో ఒక సెంటర్ ఉండగా.. ముంబైలో మరోటి ఏర్పాటు చేయనున్నట్లు యాపిల్ తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చేందుకు 10 మ్యూజికల్ స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తున్నట్లు యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) ఎడీ క్యూ తెలిపారు. 
ఏఆర్ రెహ్మాన్ 2008లో కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీని నెలకొల్పారు. ఇందులో హిందుస్తానీ, వెస్టర్న్ క్లాసికల్ సంగీతం, మ్యూజిక్ టెక్నాలజీ వంటి వాటిలో శిక్షణనిస్తున్నారు. 

ఒబామా కేర్‌ను రద్దు చేసిన ట్రంప్ 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్లుగానే మాజీ అధ్యక్షుడు ఒబామా తెచ్చిన ఆరోగ్య బీమా చట్టాన్ని(ఒబామా కేర్) అక్టోబర్ 12న రద్దు చేశారు. కాంగ్రెస్ సాయంతో ఒబామా కేర్‌ను రద్దు చేయాలని యత్నించినప్పటికీ వీలుకాకపోవడంతో తనకున్న విశేషాధికారాలతో కార్యనిర్వాహక ఉత్తర్వుల్ని జారీచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒబామా కేర్ అమెరికన్ల పాలిట పీడకలగా మారిందని విమర్శించారు. తాజాగా తాను తీసుకువచ్చిన ఆరోగ్య బీమా వల్ల తక్కువ ధరలతోనే పాలసీలను బీమా సంస్థలు ప్రజలకు విక్రయించవచ్చని ట్రంప్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఒబామా కేర్ రద్దు 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
ఎక్కడ : అమెరికాలో 

విద్య’కు గూగుల్ బిలియన్ డాలర్ల సాయం
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ వచ్చే ఐదేళ్లలో స్వచ్ఛంద సంస్థల ద్వారా 1 బిలియన్ డాలర్లమేర నిధులను ఖర్చు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఉపయోగిస్తామని గూగుల్ తెలిపింది. అలాగే సంస్థలోని ఉద్యోగులు కూడా ఈ అంశానికి సంబంధించి స్వచ్ఛందంగా సేవలందిస్తారని తెలియజేసింది. ‘గ్రో విత్ గూగుల్’ అనే కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా అమెరికన్లకు ఉద్యోగం సంపాదించడం ఎలా? వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవడం ఎలా? వంటి పలు అంశాలపై శిక్షణనిస్తారు. వివిధ ఆన్‌లైన్ విద్యా సంస్థలు సహా పలు స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విద్యా ప్రమాణాల పెంపునకు 1 బిలియన్ డాలర్ల సాయం 
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : గూగుల్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

సోమాలియా బాంబు పేలుడులో 231 మంది మృతి 
సోమాలియా రాజధాని మొగదిషులో అక్టోబర్ 14న అత్యంత శక్తిమంతమైన బాంబు పేలడంతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 275 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్రికా కొమ్ముగా పేరుపడ్డ సోమాలియాలో ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడిని జాతీయ విపత్తుగా పేర్కొన్న సోమాలియా ప్రభుత్వం ఇది అల్‌కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ పనేనని ఆరోపించింది. సోమాలియా అధ్యక్షుడు మొహమద్ అబ్దుల్లాహీ మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. 

చెన్నై హైస్పీడ్ రైల్వే కారిడార్‌పై డోక్లామ్ ప్రభావం 
492 కి.మీ. పొడవున్న చెన్నై-బెంగళూరు-మైసూరు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తిచేసి ఏడాది అయినప్పటికీ.. చైనా రైల్వే పనుల్లో ఎలాంటి పురోగతి చూపలేదని అధికారులు తెలిపారు. ఇందుకు భారత్-చైనాల మధ్య డోక్లామ్‌లో తలెత్తిన ఉద్రిక్తతే కారణమై ఉండొచ్చని రైల్వే శాఖ మొబిలిటి డెరైక్టరేట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో చైనా రైల్వే ఎరియువన్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్(సీఆర్‌ఈఈసీ) స్పందన కోసం గత 6 నెలలుగా ఈ-మెయిల్స్ పంపిస్తూన్నా వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదని అధికారులు వెల్లడించారు. 
దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న 80 కి.మీ/గంట నుంచి 160 కి.మీ/గంటకు పెంచేందుకు వీలుగా చెన్నై-బెంగళూరు-మైసూరు వంటి 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 
అక్టోబర్ 18 నుంచి చైనా కమ్యూనిస్ట్ కాంగ్రెస్
ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాలు అక్టోబర్ 18న ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు సాగే ఈ కీలక సమావేశాల్లో ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కే మరోసారి చైనా పగ్గాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన ఎన్నిక దాదాపు ఖరారు కాగా జిన్‌పింగ్‌ను అధికారికంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోనున్నారు. చైనాలో సీపీసీ ప్రధాన కార్యదర్శే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 
స్టాండింగ్ కమిటీ చేతిలో అధికారాలు 
చైనాలో కీలక అధికారాలు ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ చేతుల్లోనే ఉంటాయి. ఆ కమిటీకి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న జిన్‌పింగ్ (64) దేశాధ్యక్షుడిగానే కాకుండా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సైనికాధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు. మిగతా ఆరుగురిలో ప్రధాని లీ కెకియాంగ్ తదితరులు ఉన్నారు. 2002 పార్టీ సమావేశాల్లో చేసిన ఒప్పందం మేరకు అగ్రనేతలైన అధ్యక్షుడు, ప్రధాని రెండోసారి కమిటీలో కొనసాగనున్నారు. వారిద్దరినీ మినహాయిస్తే కమిటీలోని మిగిలిన ఐదుగురు సభ్యుల మార్పు దాదాపు ఖాయమైంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ 19వ సమావేశాలు 
ఎప్పుడు : అక్టోబర్ 18 నుంచి (వారం రోజులు)
ఎక్కడ : చైనాలో 

ఆసియా టాప్-50 యూనివర్సిటీల జాబితా 
ఆసియాలోని అత్యుత్తమ 50 యూనివర్సిటీల జాబితాలో మూడు భారత విద్యాసంస్థలకు స్థానం దక్కింది. క్వాక్‌క్వాడ్రిల్లీ సైమండ్‌‌స (క్యూఎస్) సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ మొదటి స్థానంలో (నిరుడు 3వ స్థానం) నిలవగా.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రెండో స్థానం (గతేడాది మొదటి స్థానం) దక్కించుకుంది. టాప్-10 జాబితాలో భారత యూనివర్సిటీలకు చోటు దక్కలేదు. ఐఐటీ-బాంబే 34వ స్థానంలో నిలవగా.. ఐఐటీ-ఢిల్లీ 41వ, ఐఐటీ-మద్రాస్ 48వ స్థానాలను దక్కించుకున్నాయి. తర్వాతి స్థానాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స బెంగళూరు (51), ఐఐటీ కాన్పూర్ (59), ఢిల్లీ యూనివర్సిటీ (72), ఐఐటీ రూర్కీ (93), ఐఐటీ గువాహటి (98)లు ఉన్నాయి. 
ఆసియాలోని 400కు పైగా వర్సిటీలను పరిశీలించిన ఈ సంస్థ.. యూనివర్సిటీల్లో అధ్యాపకుల అర్హత (పీహెచ్‌డీ), దేశ, విదేశీ విద్యార్థుల సంఖ్య, అకడమిక్ ఫలితాలు, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్ నిర్ణయించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా టాప్ - 50 యూనివర్సిటీల జాబితా 
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : క్వాక్‌క్వాడ్రిల్లీ సైమండ్స్

ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించిన ఈయూ
వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికా, దాని మిత్ర దేశాలకు హెచ్చరికలు పంపుతున్న ఉత్తర కొరియాపై యూరోపియన్ యూనియన్ మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ మేరకు లక్సెంబర్గ్‌లో జరిగిన ఈయూ విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. దీని ప్రకారం ఉత్తర కొరియాలో ఈయూ దేశాల పెట్టుబడులను నిషేధించారు. చమురు ఉత్పత్తుల సరఫరాను నిలిపివేశారు. ఈయూలో ఉన్న ఉత్తర కొరియాకు చెందిన వ్యక్తులు స్వదేశానికి నగదు పంపకుండా నిషేధించారు. 
ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఐక్యరాజ్య సమితి.. ఇప్పటికే ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉత్తర కొరియపై మరిన్ని ఆంక్షలు 
ఎప్పుడు : అక్టోబర్ 17 
ఎవరు : యూరోపియన్ యూనియన్

అమెరికాతో సౌదీ భారీ ఆయుధ డీల్
 సౌదీ అరేబియాకు అత్యాధునిక టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్‌‌స(థాడ్) క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. థాడ్ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు(రూ. 97 వేల కోట్లు) అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. శక్తివంతమైన రాడార్లు అమర్చిన ఈ థాడ్ క్షిపణులు శత్రు దేశాల క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకుని పేల్చివేస్తాయి. గంటకు 10 వేల కి.మీ వేగంతో ప్రయాణించే థాడ్ క్షిపణులు 150 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎగరగలవు. 
ఇప్పటికే థాడ్‌ను సౌదీ పొరుగు దేశాలైన ఖతర్, యూఏఈలకు అమెరికా సరఫరా చేసింది. అమెరికా ఆయుధ సంపత్తిలో థాడ్ అత్యంత సమర్థవంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ. శత్రు క్షిపణుల్ని కచ్చితంగా గుర్తించి పేల్చేందుకు ఇందులో రాడార్ వ్యవస్థలున్నాయి. 20 అడుగుల పొడవుండే థాడ్ క్షిపణులు టన్ను బరువుంటాయి. ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల సాయంతో మిస్సైల్‌ను అంచనావేసి పేల్చేస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సౌదీ అరేబియాతో 15 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందానికి ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 6 
ఎవరు : అమెరికా 
ఎందుకు : టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్‌‌స(థాడ్) క్షిపణుల సరఫరా కోసం

చైనాలో 13 లక్షల అవినీతి అధికారులకు శిక్ష
చైనాలోని 13.4 లక్షల మంది అవినీతి అధికారులను ఆ దేశ ప్రభుత్వం శిక్షించింది. అవినీతిని నిర్మూలించేందుకుగాను ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించిన స్వీపింగ్ యాంటీ కరప్షన్’ కార్యక్రమంలో భాగంగా అవినీతి అధికారులను గుర్తించి శిక్షించారు. అక్టోబర్ 18న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) 19వ జాతీయ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ (సీసీడీఐ)కు నేతృత్వం వహిస్తున్న వాంగ్ క్విషాన్ ఈ వివరాలను అక్టోబర్ 8న వెల్లడించారు. 2012లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 13.4 లక్షల మంది అవినీతి అధికారులను శిక్షించినట్లు పేర్కొన్నారు. వీరిలో 13 వేల మంది మిలిటరీ అధికారులు ఉన్నట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) అధికార పత్రిక వెల్లడించింది. మిలిటరీలో ఉద్యోగాలను అమ్ముకున్నారని సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్‌గా పనిచేసిన జనరల్ జు కై హూతోపాటు జనరల్ జూ బోక్సంగ్‌ను కూడా శిక్షించారు.

చెల్లెలికి ప్రమోషన్ ఇచ్చిన కిమ్ 
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్.. పార్టీ కీలక పదవిలో తన సోదరిని నియమించారు. ఈ మేరకు కిమ్ యో జోంగ్‌ను పార్టీ శక్తిమంతమైన పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించినట్లు ప్రభుత్వ అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ స్పష్టం చేసింది. అక్టోబర్ 8న కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సౌదీలో మహిళల డ్రైవింగ్‌కు అనుమతి
 సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ మేరకు సౌదీ రాచకుటుంబం సెప్టెంబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2018 జూన్ నుంచి అమల్లోకి వస్తాయి. 
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని సౌదీ గతంలో నిషేధించింది. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని దాదాపు మూడు దశాబ్దాల నుంచి మహిళలు, హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం.. నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మహిళలకు డ్రైవింగ్‌కు అనుమతి 
ఎప్పుడు : సెప్టెంబర్ 26 
ఎవరు : సౌదీ రాచకుటుంబం 
ఎక్కడ : సౌదీ అరేబియాలో

జపాన్ పార్లమెంట్ రద్దు
జపాన్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ ప్రధాని షింజో అబే సెప్టెంబర్ 28న ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణం, కొత్త పన్ను విధానం అమలు నేపథ్యంలో పార్లమెంట్‌పై పూర్తి పట్టుకోసం తాజా ఎన్నికలకు అబే పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జపాన్‌లో అక్టోబర్ 22న ఎన్నికలు జరిగే అవకాశముంది. అబే అధికారిక నిర్ణయాన్ని స్పీకర్ చదివి వినిపించగానే పార్లమెంట్ దిగువ సభ సభ్యులు ఆమోదం తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జపాన్ పార్లమెంటు రద్దు 
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : జపాన్ ప్రధాని షింజో అబే

కాటలోనియాలో ప్రజాభిప్రాయ సేకరణ
స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం పొందేందుకు ఆ దేశ ఈశాన్య ప్రాంతం కాటలోనియాలో అక్టోబర్ 1న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కాటలోనియా జనాభా సుమారు 75 లక్షలు. ఆర్థికంగా బలమైన ఈ ప్రాంతానికి ప్రత్యేక సంస్కృతి, భాష ఉన్నాయి.

థాయ్‌లాండ్ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు
థాయ్‌లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రకు ఆ దేశ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బియ్యం రాయితీ పథకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం కలిగించారని కోర్టు తేల్చింది.

■ఇండియా & వరల్డ్
అక్టోబర్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

ఇటలీ ప్రధాని భారత పర్యటన
 Current Affairs ఇటలీ ప్రధాని పాలో జెంటిలోని రెండు రోజుల భారత పర్యటన కోసం అక్టోబర్ 29న న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జెంటిలోని ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సహా పలు రంగాల్లో సహకారానికి సంబంధించి విసృ్తతమైన చర్చలు జరిపారు. అనంతరం రైల్వే భద్రత, విద్యుత్, సంయుక్త పెట్టుబడుల ప్రోత్సాహం తదితర ఆరు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
2018 మార్చిలో ఇటలీతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ లోగోను విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం 8.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57 వేల కోట్లు) ద్వైపాక్షిక వ్యాపారం జరుగుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇటలీ ప్రధాని భారత పర్యటన
ఎప్పుడు : అక్టోబర్ 30 - 31
ఎవరు : పాలో జెంటిలోని
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం

ఫ్రాన్స్ రక్షణ మంత్రి భారత్ పర్యటన
ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ భారత పర్యటనలో భాగంగా అక్టోబర్ 27న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

యూఎస్ విదేశాంగ మంత్రి పర్యటన
భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ అక్టోబర్ 25న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాదం, ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా, హెచ్-1బీ వీసాలు, దక్షిణాసియాపై ట్రంప్ విధానం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు.

అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ర భారత పర్యటన
ఒక రోజు పర్యటనకు భారత్ వచ్చిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్రఘనీ అక్టోబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఫ్గాన్ అవసరాల కు అనుగుణంగా అక్కడి రక్షణ, పోలీసు దళాలకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఘనీ ఢిల్లీలోని వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆసియాన్ రక్షణ మంత్రుల సదస్సు
ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల నాలుగో సదస్సు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అక్టోబర్ 24న ముగిసింది. ఈ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాద అనుకూల శక్తులను సమర్థంగా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) నిర్ణయించింది. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ సదస్సులో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

భారత్ - రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు 
Current Affairs రక్షణ రంగంలో మరింత సహకారంలో భాగంగా భారత్ - రష్యాలు అక్టోబర్ 19 నుంచి 11 రోజుల పాటు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అన్న అంశంపై 'ఇంధ్ర-2017' పేరుతో రష్యాలో చేపట్టే ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలు పాల్గొంటాయి. సెర్గీవిస్కీలోని 249వ కంబైండ్ ఆర్మీ రేంజ్, వ్లాదివోస్తోక్ లోని జపాన్ సముద్రాల్లో ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. భారత్ తరపున 350 మంది ఆర్మీ, 80 మంది వైమానిక సిబ్బంది, రెండు ఐఎల్ -76 విమానాలు, నౌకదళానికి చెందిన ఒక యుద్ధ నౌక, ఒక సహాయక నౌక పాల్గొంటాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంధ్ర - 2017 సైనిక విన్యాసాలు 
ఎప్పుడు : అక్టోబర్ 19 నుంచి 30 
ఎవరు : భారత్ - రష్యా 
ఎక్కడ : రష్యాలో 
ఎందుకు : రక్షణ రంగంలో మరింత సహకారం కోసం 

జపాన్‌తో భారత్ టీఐటీపీ ఒప్పందం 
యువతను టెక్నికల్ ఇంటర్న్స్‌గా జపాన్‌కు పంపేందుకు భారత్ ఆ దేశంతో టెక్నికల్ ఇంటర్న్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్(TITP)పై సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అక్టోబర్ 17న టోక్యోలో జరిగిన సమావేశంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, జపాన్ మంత్రి కత్సునోబు కాటో ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం జపాన్‌లో 3 నుంచి 5 ఏళ్ల పాటు ఉపాధి శిక్షణ కోసం భారత్ ఔత్సాహిక యువతీ యువకులను ఆ దేశం పంపిస్తుంది. 
జపాన్‌తో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్న మూడో దేశం భారత్. జపాన్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ దేశంలో 2016 చివరి నాటికి వివిధ దేశాలకు చెందిన 2.3 లక్షల మంది టెక్నికల్ ఇంటర్న్స్‌గా ఉపాధి శిక్షణ పొందుతున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జపాన్‌తో భారత్ టీఐటీపీ ఒప్పందం 
ఎప్పుడు : అక్టోబర్ 17 
ఎందుకు : ఉపాధి శిక్షణ కోసం యువతను జపాన్‌కు పంపేందుకు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటన
 Current Affairs రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటనలో అక్టోబర్ 4న తూర్పు ఆఫ్రికా దేశం జిబూతీని సందర్శించారు. ఆ దేశ అధ్యక్షుడు ఒమర్ గ్యులేహ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యాలయ స్థాయి ద్వైపాక్షిక సంప్రదింపులు నెలకొల్పుకునే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 2015లో యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్ నుంచి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆపరేషన్ రాహత్’లో జిబూతీ అందించిన తోడ్పాటుకు కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. నౌకా వాణిజ్య, సౌర విద్యుత్ రంగాల్లో పరస్పర సహకారంపై కోవింద్, ఒమర్ చర్చించారు. జిబూతీని సందర్శించిన తొలి భారతీయ నేత కోవింద్ కావడం గమనార్హం. జిబూతీలో చైనా తన విదేశీ సైనిక స్థావరాన్ని నెలకొల్పిన నేపథ్యంలో భారత రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇథియోపియాతో రెండు ఒప్పందాలు: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇథియోపియా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ములాతు తెషోమేతో అడిస్ అబాబాలో చర్చలు జరిపారు. వాణిజ్యం, సమాచార-ప్రసార రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలపడేలా ఇరువురి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ)లో ఇథియోపియా భాగస్వామి కావడం పట్ల భారత్ కృతజ్ఞతలు తెలిపింది. భారత్- ఇథియోపియా 70 ఏళ్ల దౌత్య సంబంధాలు’ అనే పుస్తకాన్ని ఇరువురూ విడుదల చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత రాష్ట్రపతిమొదటివిదేశీ పర్యటన
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్

భారత్-ఈయూ 14వ సదస్సు
ఉగ్రవాదంపై పోరుకు ఒకరికొకరు సహకరించుకోవాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. ఈ మేరకు అక్టోబర్ 6న న్యూఢిల్లీలో జరిగిన భారత్-ఈయూ 14వ సదస్సులో ఇరు పక్షాలు ఒక ప్రకటన (డిక్లరేషన్)ను విడుదల చేశాయి. సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పాల్గొన్నారు.
వాణిజ్యం, భద్రత వంటి ప్రధాన అంశాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడం; రోహింగ్యా సంక్షోభం, కొరియా ద్వీపకల్పంలోని ఉద్రిక్త పరిస్థితులతో పాటు వివిధ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. మూడు ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. వీటిలో అంతర్జా తీయ సౌర కూటమికి సంబంధించిన ఒడంబడిక కూడా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : ప్రధాని మోదీ, ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్
ఎక్కడ : భారత్-ఈయూ 14వ సదస్సు, న్యూఢిల్లీ
ఎందుకు : ఉగ్రవాదం, అతివాదంపై ఉమ్మడి పోరుకు

బంగ్లాదేశ్‌కు రూ.29,250 కోట్ల రుణంపై ఒప్పందం
బంగ్లాదేశ్‌లో మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధికి భారత్ రూ.29,250 కోట్ల రుణం ఇచ్చేందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు అక్టోబర్ 4న సంతకాలు చేశాయి. భారత్, బంగ్లా ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీ, అబుల్ మాల్ అబ్దుల్ ముహిత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

భారత్‌కు ఏఐఐబీ, ఏడీబీ 655 కోట్ల రుణం
Current Affairs భారత్‌లో విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడంతో పాటు సౌర, పవన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), మనీలాలోని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) రూ.655.63 కోట్ల(100 మిలియన్ డాలర్లు) రుణం అందించనున్నాయి. ఏఐఐబీ, ఏడీబీలు చెరో 50 మిలియన్ డాలర్ల చొప్పున ఈ రుణాన్ని ఇవ్వనున్నాయి. ఏఐఐబీ, ఏడీబీలు సంయుక్తంగా రుణాలు జారీ చేయడం ఇది నాలుగోసారి.
చైనా నేతృత్వంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 2016లో ఏర్పాటైన ఏఐఐబీలో చైనా 26.06% పెట్టుబడితో మెజారిటీ వాటాదారుగా ఉండగా, భారత్ 7.5 శాతంతో రెండో స్థానంలో ఉంది. రష్యా 5.93%, జర్మనీ 4.5శాతం పెట్టుబడితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌కు రూ.655 కోట్ల రుణం 
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఏఐఐబీ, ఏడీబీ 

భారత్‌కు మళ్లీ అమెరికా ‘చమురు’
అమెరికా నుంచి ముడి చమురుతో బయలుదేరిన తొలి ఓడ ఒడిశా లోని పారదీప్ ఓడరేవుకు అక్టోబర్ 2న చేరింది. అతి పెద్ద ముడి చమురు రవాణా ఓడ ‘వీఎల్‌సీసీ ఎమ్‌టీ న్యూ ప్రాస్పెరిటీ’ ద్వారా 1.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అందినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలిపింది. మరో 3.95 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కోసంయూఎస్‌ను కోరినట్లు ప్రకటించింది. భారత్-యూఎస్ వాణిజ్య సంబంధాల్లో ప్రధానంగా చమురు-గ్యాస్ రంగాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైడ్రోకార్బన్ రంగాన్ని పటిష్టపరిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ నెలలో జరిపిన అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. 
1975లో అమెరికా చమురు ఎగుమతులను నిలిపివేసింది. దాదాపు 42 ఏళ్ల తర్వాత మళ్లీ ఎగుమతులు ప్రారంభించింది. ఇలా సుదీర్ఘ విరామం అనంతరం అమెరికా నుంచి తొలిసారిగా చమురు దిగుమతులు చేసుకుంటున్న దేశాల్లో ఒకటిగా భారత్ కూడా నిల్చింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా నుంచి భారత్‌కు చమురు 
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎందుకు : చమురు-గ్యాస్ రంగాల్లో ఒప్పందంలో భాగంగా

■•అక్టోబర్ 2017 జాతీయం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల 
 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే... హిమాచల్‌ప్రదేశ్‌తో పాటుగానే డిసెంబర్ 18న గుజరాత్ ఎన్నికలకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ఏకే జోతి అక్టోబర్ 25న వెల్లడించారు. 
182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని 50,128 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ధ్రువీకరణ పత్రాల (వీవీపీఏటీ)తో కూడిన ఈవీఎంలతో ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో ఒక పూర్తిస్థాయి మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఈసారి ఏర్పాటు చేయనున్నారు. 

నవంబర్ 8న ‘నల్లధన వ్యతిరేక దినం’
నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నవంబర్ 8తో ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఆ రోజును ‘నల్లధన వ్యతిరేక దినం’గా జరుపుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నల్లధనం వ్యతిరేక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొంటారని ఆయన మీడియాకు వెల్లడించారు. 
మరోవైపు నవంబర్ 8న ‘బ్లాక్ డే’గా జరుపుకోవాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా 18 పార్టీలు పిలుపునిచ్చాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నల్లధన వ్యతిరేక దినం 
ఎప్పుడు : నవంబర్ 8న
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా 

బుల్లెట్ రైలుకు ‘చిరుత’ లోగో ఖరారు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1.08లక్షల కోట్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు ‘లోగో డిజైన్’ పోటీలో 27 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ చక్రధర్ ఆళ్ల విజేతగా నిలిచారు. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న చిరుత పులి రైలు ఇంజన్‌పై కనిపించేలా ‘లోగో’ను సృష్టించి కాంపిటీషన్‌లో గెలిచాడు. ఈ మేరకు సతీశ్ గుజ్రాల్ నేతృత్వంలోని కమిటీ చక్రధర్ లోగోను తుది విజేతగా ప్రకటించింది. ఇకపై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలపై ఈ లోగోనే వాడనున్నారు. 
ప్రస్తుతం చక్రధర్ అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)లో గ్రాఫిక్ డిజైన్ పీజీ రెండో సంవత్సరం అభ్యసిస్తున్నాడు. అహ్మదాబాద్, ముంబై నగరాలను కలుపుతూ 500 కి.మీ. పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ చేపడుతోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బుల్లెట్ రైలు లోగో ఖరారు 
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : డిజైనర్ చక్రధర్ ఆళ్ల 

ఆధార్ లింక్ గడువు మార్చి 31 వరకు పొడగింపు
వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. 2017, డిసెంబర్ 31 వరకు ఉన్న ఈ గడువును ఇప్పటికీ ఆధార్ లేని వారికి (కొత్తగా నమోదు చేసుకొని లింక్ చేసుకోవాలి) మాత్రమే పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి అక్టోబర్ 25న వివరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎంకే ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వివిధ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువు పెంపు
ఎప్పుడు : 2018 మార్చి వరకు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీలో అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు 
అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు అక్టోబర్ 26న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కఠినంగా వ్యవహరించేలా త్వరలోనే కొత్త వినియోగదారుల చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు 
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎక్కడ : న్యూఢ్లిలీలో 
ఎవరు : సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ 

బోర్డింగ్ పాస్‌తో ఆధార్ కార్డు అనుసంధానం 
బోర్డింగ్ పాస్, తనిఖీల వంటివేవీ లేకుండా నేరుగా విమానం ఎక్కే వ్యవస్థ త్వరలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టికెట్ బుకింగ్‌ను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోకి చేరుకోగానే ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, బ్యాగేజ్ వంటివి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తెలియజేసింది. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం.. ఫేస్ రికగ్నిషన్, వేలిముద్ర, ఐరిస్ వంటి వాటిని పరిశీలించామని, వీటిల్లో ఆధార్ అనుసంధానం ద్వారా ముఖ గుర్తింపు వ్యవస్థను ఎంచుకున్నామని ఎయిర్‌పోర్టు సీఈఓ కిశోర్ వెల్లడించారు. 2 నెలల్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఆరంభిస్తామని, ఫలితాలు పరిశీలించాక, నియంత్రణ సంస్థల అనుమతి తీసుకున్నాక ఈ సేవల్ని ఆరంభిస్తామని తెలియజేశారు. దశల వారీగా బెంగళూరుతో పాటూ ఇతర విమానాశ్రయాలకూ దీన్ని విస్తరిస్తామని చెప్పారు.

అత్యాధునిక ఆయుధాలకు 40 వేలకోట్లు
అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారత ఆర్మీ రూ.40 వేల కోట్లు వెచ్చించనుంది. ఇందులో భాగంగా 7 లక్షల రైఫిళ్లు, 44 వేల తేలికపాటి మెషిన్ గన్లు (ఎల్‌ఎంజీ), దాదాపు 44,600 కార్బైన్లను ఆర్మీ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు సరిహద్దులో చైనా, పాకిస్తాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలు అవసరమని ఆర్మీ పలుమార్లు చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అత్యాధునిక ఆయుధాలకు 40 వేల కోట్ల ఖర్చు
ఎప్పుడు : త్వరలో 
ఎవరు : భారత ఆర్మీ
ఎందుకు : చైనా, పాకిస్తాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో

రాజ్యాంగ ధర్మాసనానికి ‘ఆధార్ అనుసంధానం’ పిటిషన్
వివిధ సేవలు, సంక్షేమ పథకాల లబ్ధ్దికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ చివరి వారంలో విచారిస్తుందని సుప్రీంకోర్టు అక్టోబర్ 30న వెల్లడించింది. అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ విజ్ఞప్తి మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజ్యాంగ ధర్మాసనానికి ఆధార్ అనుసంధానం కేసు
ఎప్పుడు : నవంబర్ చివరివారం 
ఎవరు : సుప్రీంకోర్టు

పటేల్ 142వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 
భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 142వ జయంతి వేడుకలను అక్టోబర్ 31న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం నుంచి.. ఇండియాగేట్ వరకు జరిగిన ఐక్యతా పరుగును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మోదీ... తొలి కేంద్ర హోం మంత్రి రాజనీతిజ్ఞత, రాజకీయ చతురత కారణంగానే దేశం నేడు ఐక్యంగా ఉందని అన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్దార్ వల్లభాయ్ పటేల్ 142వ జయంతి వేడుకలు 
ఎప్పుడు : అక్టోబర్ 31 
ఎవరు : ఐక్యతా పరుగును ప్రారంభించిన ప్రధాని మోదీ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

కర్ణాటకలో ఉపేంద్ర "ప్రజ్ఞావంత జనతా పార్టీ"
కన్నడతో పాటు తెలుగు సినీరంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)’ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అక్టోబర్ 31న ప్రకటించారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర పార్టీ ప్రకటన చేశారు. డ్రెస్‌కోడ్‌ను ఖాకీ యూనిఫాంగా నిర్ణయించినట్లు చెప్పారు. తమ పార్టీలో చేరాలనుకునే వారికి డబ్బు అవసరం లేదని, కేవలం కొత్త ఆలోచనలు, ప్రజల కోసం కష్టపడే తత్వం ఉంటే చాలని ఉపేంద్ర అన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రజ్ఞావంత జనతా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన 
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : సినీ నటుడు ఉపేంద్ర
ఎక్కడ : కర్ణాటకలో 

రోడ్డు ప్రమాద కేసులపై వయసు ఆధారంగా పరిహారం 
రోడ్డు ప్రమాద బాధితులకు అందాల్సిన పరిహారంపై అక్టోబర్ 31న సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బాధితుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి పరిహారం అందాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇన్సూరెన్‌‌స సంస్థలు బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై వేసిన పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది. 
తీర్పు వివరాలు..
బాధితుడు పర్మినెంట్ ఉద్యోగి అయి అతని వయసు 40 ఏళ్ల లోపు ఉన్నట్లయితే.. అతడి భవిష్యత్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవ వేతనం (యాక్చువల్ శాలరీ) లో 50 శాతం అదనంగా చెల్లించాలి.బాధితుడి వయసు 40-50 ఏళ్లలోపున్నట్లయితే 30 శాతం అదనంగా, 50-60 ఏళ్ల లోపుంటే 15 శాతం అదనంగా చెల్లించాలి.బాధితుడు స్వయం ఉపాధి లేదా నిర్ణీత వేతన జీవి అయి 40 ఏళ్ల లోపు వాడైతే.. ఎస్టాబ్లిష్డ్ ఆదాయానికి అదనంగా 40 శాతం చెల్లించాలి.రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితుడు చనిపోయిన పక్షంలో.. అతని అంత్యక్రియలకు రూ.15వేలు చెల్లించాలి. ఇది కూడా ప్రతీ మూడేళ్లకోసారి 10 శాతం పెరుగుతుంది.
ఆధార్ లేదని రేషన్ నిరాకరించొద్దు
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదలకు అందించే రేషన్ సరుకులను ఆధార్ లేదని, రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాలేదనే కారణాలతో నిరాకరించొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సాకులతో లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించరాదని అక్టోబర్ 26న జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. జార్ఖండ్‌లో రేషన్ సరుకులు నిరాకరించడంతో ఓ కుటుంబంలోని 11 ఏళ్ల బాలిక ఆకలిని తట్టుకోలేక మరణించిన నేపథ్యంలో తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

వినియోగదారుల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సు
యునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) ఆధ్వర్యంలో వినియోగదారుల పరిరక్షణపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 26న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా 1986 నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సవరించి కొత్త చట్టం తీసుకొస్తామన్నారు.

భారత్‌లో కాలుష్యంతో 25 లక్షల మంది మృతి 
 ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు భారత్‌లోనే అత్యధికమని అగ్రశ్రేణి వైద్య పత్రిక ది లాన్సెట్ పేర్కొంది. 2015లో కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది చనిపోతే, ఒక్క భారత్‌లోనే 25 లక్షల మంది మృత్యువాత పడ్డారని వెల్లడించింది. ఈ జాబితాలో 18 లక్షల మరణాలతో చైనా రెండో స్థానంలో ఉందన్నారు. ఐఐటీ ఢిల్లీతో పాటు అమెరికాకు చెందిన ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 
ప్రపంచ వ్యాప్తంగా 2015లో వాయు కాలుష్యంతో 65 లక్షల మంది చనిపోతే, నీటి కాలుష్యంతో 18 లక్షల మంది, పని ప్రదేశంలో కాలుష్యంతో 8 లక్షల మంది దుర్మరణం చెందారని నివేదిక వెల్లడించింది. పారిశ్రామికంగా వేగంగా పురోగమిస్తున్న భారత్, చైనా, పాక్, బంగ్లాదేశ్, మడగాస్కర్, కెన్యాల్లో చనిపోయే ప్రతి నలుగురిలో ఒకరు కాలుష్యం కారణంగానే మరణించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య మరణాలపై ది లాన్సెట్ నివేదిక 
ఎప్పుడు : 2015లో
ఎక్కడ : భారత్‌లో 25 లక్షల మంది మృతి 
ఎందుకు : వాతావరణ కాలుష్యం కారణంగా 

కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ 
అక్టోబర్ 19న దీపావళి పండుగను సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకున్న ప్రధాని మోదీ అక్టోబర్ 20న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కేదార్‌నాథుడికి రుద్రాభిషేకం చేశారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యాలు మెరుగుపరచటం, మందాకినీ, సరస్వతి నదుల రిటైనింగ్ వాల్స్, ఘాట్‌ల నిర్మాణం, దేవాలయానికి వెళ్లే రోడ్డును పునర్నిర్మించటం, వరదల్లో ధ్వంసమైన ఆది గురు శంకరాచార్య సమాధిని పునరుద్ధరించే పనులకు శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్‌ను అభిమాన పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. 2022 కల్లా ఈ రాష్ట్రం పూర్తి ఆర్గానిక్ రాష్ట్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
అండమాన్‌లో వేడుకల్లో నిర్మలా 
బంగాళాఖాతంలోని అత్యంత వ్యూహాత్మక త్రివిధ దళాల కేంద్రమైన అండమాన్ నికోబార్ దీవుల్లో సైనికులతో కలిసి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భద్రతా సన్నద్ధతను సమీక్షించారు. అండమాన్ నికోబార్ కమాండ్ ఏరియా ప్రాంతంలోని కోస్ట్ గార్డ్ బేస్, నౌకాదళ కేంద్రాలనూ ఆమె సందర్శించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ 
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎక్కడ : ఉత్తరాఖండ్ 

గుజరాత్‌లో రోరో ఫెర్రీ సర్వీసులు ప్రారంభం 
సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లను జలమార్గంతో అనుసంధానించే ‘రోరో’ ఫెర్రీ సర్వీసులను (రోల్ ఆన్-రోల్ ఆఫ్) ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న ప్రారంభించారు. భరూచ్ జిల్లా ఘోఘా- భావ్‌నగర్ జిల్లా దహేజ్ మధ్య ఈ సేవలు నడుస్తాయి. 100 మంది అంధ విద్యార్థులతో కలిసి ఘోఘా నుంచి దహేజ్ వరకూ ఫెర్రీలో ప్రధాని ప్రయాణించారు. మొదటి దశ ఫెర్రీ సేవల్ని కేవలం ప్రయాణికుల కోసమే ప్రారంభించారు. రెండు నెలల అనంతరం ప్రారంభమయ్యే రెండో దశలో కార్లు వంటి తేలికపాటి వాహనాల్ని కూడా తరలించవచ్చు. ఈ ఫెర్రీ సేవలతో ఘోఘా-భరూచ్‌ల మధ్య రోడ్డు మార్గం ద్వారా ఉన్న దూరం 330 కి.మీ. కాగా, జలమార్గంలో అది కేవలం 30 కి.మీ. మాత్రమే. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రోరో ఫెర్రీ సర్వీసులు ప్రారంభం 
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : భరూచ్ జిల్లా ఘోఘా- భావ్‌నగర్ జిల్లా దహేజ్ మధ్య
ఎందుకు : సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లను జలమార్గంలో అనుసంధానించేందుకు

ఎయిర్‌పోర్టుల భద్రతకు సోషల్ మీడియా 
దేశంలోని ఎయిర్‌పోర్టులు, అణువిద్యుత్, అంతరిక్ష కేంద్రాల వద్ద భద్రత పర్యవేక్షణ, పటిష్టానికి తొలిసారిగా సోషల్ మీడియా సమాచారాన్ని వినియోగించబోతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు రక్షణ కల్పిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం(సీఐఎస్‌ఎఫ్) చెన్నై సమీపంలోని అరక్కోణం వద్ద సోషల్ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శిక్షణ పొందిన సీఐఎస్‌ఎఫ్ ప్రతినిధులు సోషల్ మీడియా ట్రెండ్‌‌స, వార్తలు, నివేదికలు, ఇతర సమాచారాన్ని సమన్వయపరిచి ఎయిర్‌పోర్టులు, ఇతర కీలక సంస్థలకు వాటిని ఎప్పటికప్పుడు చేరవేస్తారు. ఇందుకోసం ట్వీటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఫ్లికర్‌ల సేవల్ని వాడుకోనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎయిర్‌పోర్ట్‌ల భద్రతకు సోషల్ మీడియా కేంద్రం 
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : సీఐఎస్‌ఎఫ్ 
ఎక్కడ : అరక్కోణం, చెన్నై 
ఎందుకు : ఎయిర్‌పోర్ట్‌లు, అణు విద్యుత్, అంతరిక్ష కేంద్రాల వద్ద భద్రత పర్యవేక్షణకు 

100 సీసీ లోపు బైక్‌లపై డబుల్స్ నిషేధం
100 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యమున్న ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ప్రయాణించడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఒకవేళ వెనక సీటు ఉంటే కొత్త వాహనాల(100 సీసీ కంటే తక్కువ) రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అక్టోబర్ 13న ఆ రాష్ట్ర రవాణా శాఖ జీవో విడుదల చేసింది. ఒక రోడ్డు ప్రమాదం కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిబంధనల్ని అమల్లోకి తెచ్చారు. అలాగే 100 సీసీ లోపు వాహనాలకు వెనుక సీట్లు ఉంటే కొత్తగా రిజిస్టర్ చేయవద్దని, ఇప్పటికే రిజిస్టర్ చేసి ఉంటే వెనుక సీట్లలో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 100 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలపై డబుల్స్ నిషేధం 
ఎప్పుడు : అక్టోబర్ 23 నుంచి 
ఎవరు : కర్ణాటక ప్రభుత్వం 
ఎక్కడ : కర్ణాటకలో 

జాతీయ గీతం ప్రసార నిబంధనల మార్పునకు సుప్రీంకోర్టు సూచన 
సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ భక్తిని భుజాలపై మోయాల్సిందిగా ప్రజలను ఎవరూ బలవంతపెట్టలేరంది. సినిమా వేయడానికి ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది.

లక్నో-ఆగ్రా హైవేపై యుద్ధవిమానాల ల్యాండింగ్
అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేందుకు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) ‘టచ్ అండ్ గో’ పేరుతో కసరత్తులు నిర్వహించింది. ఈ మేరకు ఐఏఎఫ్ యుద్ధ, రవాణా విమానాలు అక్టోబర్ 24న ఎక్స్‌ప్రెస్‌వేపై దిగి అనంతరం గాల్లోకి ఎగురుతూ తమ సామర్థ్యాన్ని చాటి చెప్పాయి. లక్నోకు 65 కి.మీ. దూరంలోని ఉన్నావ్ జిల్లా బంగర్‌మౌ సమీపంలో చేపట్టిన కసరత్తుల్లో 12కు పైగా మిరేజ్-2000, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో పాటు 35 వేల కిలోల బరువైన సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానం పాలుపంచుకున్నాయి. 
సీ-130జే విమానాలు 2010లో వాయుసేనకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎక్స్‌ప్రెస్ వేపై దిగడం మాత్రం ఇదే మొదటిసారి. ఒకేసారి 200 మంది కమాండోలను తరలించే సామర్థ్యం దీని సొంతం. ధర దాదాపు రూ. 900 కోట్లు. ఇక 2015, 16ల్లో మిరేజ్-2000 విమానాలు యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ‘టచ్ అండ్ గో’ డ్రిల్‌లో పాలుపంచుకోగా.. గత నవంబర్‌లో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఆరు సుఖోయ్-30 జెట్‌లు యుద్ధ సన్నద్ధతను చాటిచెప్పాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత వాయుసేన ‘టచ్ అండ్ గో’ కసరత్తులు 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎక్కడ : లక్నో - ఆగ్రా జాతీయ రహదారిపై 
ఎందుకు : అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేందుకు 

రైతుల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పథకం
రైతులకు దన్నుగా ఉండాలనే లక్ష్యంతో అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘భవంతర్ భుగ్దాన్ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు, వ్యాపారి సరకును కొనే మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరిస్తుంది.

అఖిల భారత ఆయుర్వేద సంస్థ ప్రారంభం
ఢిల్లీలో నిర్మించిన తొలి అఖిల భారత ఆయుర్వేద సంస్థను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 17న (ఆయుర్వేద దినోత్సవం) జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రసంగించిన ఆయన తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్య విధానాల కిందఆరోగ్య విప్లవాన్ని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగా గత మూడేళ్లలో 65 ఆయుష్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు.

ఏడవ వేతన సంఘం సిఫారసులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
 ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసులను అమలుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో అక్టోబర్ 11న సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా యూజీసీ నిధులతో నడిచే 106 యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే 329 యూనివర్సిటీలు, వర్సిటీలకు అనుబంధంగా ఉన్న 12,912 ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లోని 7.58 లక్షల మంది టీచర్లు, ప్రొఫెసర్లు, బోధన సిబ్బందికి లబ్ధి జరుగుతుంది. వీరితోపాటుగా 119 కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎస్‌సీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీఐఈల్లోని ఉపాధ్యాయులకూ వేతనాలు పెరుగుతాయి. 
ఈ వేతన సవరణ అమలు వల్ల ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, అకడమిక్ ఉద్యోగుల వేతనాల్లో రూ.10,400 నుంచి 49,800 వరకు పెంపుదల ఉంటుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే విద్యాసంస్థల్లో వేతన సవరణ మార్పులకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం అవసరం. అయితే.. మార్చిన తర్వాత పెరిగే వేతనాల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,800 కోట్ల భారం పడుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏడవ వేతన సంఘం సిఫారసులకు ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : యూనివర్సిటీల్లో టీచర్లు, ప్రొఫెసర్లు, బోధన సిబ్బందికి వేతనాల పెంపు కోసం 

సంకల్ప్, స్ట్రైవ్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం 
రూ.6,655 కోట్ల ప్రపంచబ్యాంకు ఆర్థికసాయంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకొచ్చే సంకల్ప్ (స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్‌‌జ అవేర్‌నెస్ ఫర్ లైవ్‌లీహుడ్ ప్రమోషన్), స్ట్రైవ్ (స్కిల్ స్ట్రెంతెనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్‌హాన్‌‌సమెంట్) పథకాలకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 11న ఆమోదం తెలిపింది. అలాగే.. వచ్చే మూడునుంచి ఐదేళ్లలో 3 లక్షల మంది భారత యువతను ఉద్యోగ శిక్షణ కోసం జపాన్‌కు పంపాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఇందుకు అవసరమైన ఖర్చులను జపాన్ భరిస్తుంది. ప్రభుత్వేతర సంస్థగా ఉన్న అంతర్జాతీయ సముద్రయాన విభాగం ఐఏఎల్‌ఏను ప్రభుత్వ సంస్థగా (వివిధదేశాల మధ్య సముద్ర బంధాలు పెరిగేలా) మార్చాలన్న ప్రతిపాదనకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సంకల్ప్, స్ట్రైవ్ పథకాలకు ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకొచ్చేందుకు 

మైనర్ భార్యతో కాపురం అత్యాచారమే: సుప్రీం కోర్టు
మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం నేరమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 15-18 ఏళ్ల మధ్య వయసున్న మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని ఐపీసీలోని సెక్షన్ 375లోని మినహాయింపు-2 చెబుతోందని.. చట్టంలో ఇలాంటి మినహాయింపునివ్వడం నిరంకుశమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం అక్టోబర్ 11న వెలువరించిన తీర్పులో పేర్కొంది. పార్లమెంటు ఏ విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశ్నించింది. బాలికల హక్కులు కాలరాసినట్లే
‘అన్ని చట్టాల్లో కనీస వివాహ వయసు 18 ఏళ్లు. అయితే ఐపీసీలో మాత్రం 18 ఏళ్లలోపు భార్యతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించకుండా మినహాయించడం నిలకడలేని, నిరంకుశ నిర్ణయం. ఇది బాలికల హక్కులను కాలరాసినట్లే’అని జస్టిస్ దీపక్ గుప్తా తన తీర్పులో పేర్కొన్నారు. మినహాయింపునివ్వడం రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణలను ఉల్లంఘించడమే అని తెలిపారు. 
చెల్లని వివాహాల రద్దు ఎలా? 
హిందూ, ముస్లిం వివాహ చట్టాల్లోని నిబంధనలు బాల్య వివాహ నిషేధ చట్టాన్ని (పీసీఎంఏ) అపహాస్యం చేసేలా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ముస్లిం వివాహాల రద్దు చట్టం - 1939 ప్రకారం.. 15 ఏళ్ల లోపున్న బాలికకు వివాహం జరిగితే, ఆమె 18 ఏళ్లు నిండక ముందే, అది కూడా భర్తతో శృంగార జరగకపోతేనే విడాకులను కోరొచ్చు. ‘బాలిక మేజర్ కాక ముందే, అది కూడా శృంగారం జరగకపోతేనే విడాకులు కోరొచ్చన్న నిబంధన ఈ చట్టాన్ని అపహాస్యం పాలుచేస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇక హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం.. తనకు 15 ఏళ్లలోపు జరిగిన వివాహాన్ని బాలిక 15 ఏళ్లు దాటిన తరువాత, 18 ఏళ్లు నిండక ముందు రద్దుచేయాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేయొచ్చని తెలిపింది. అసలు 15 ఏళ్లలోపు వివాహం చెల్లదని, దాని రద్దుని కోరే ప్రశ్నే ఉత్పన్నం కావొద్దని పేర్కొంది.
తీర్పులోని ప్రధానాంశాలుభారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 375కు ధర్మాసనం సవరణ చేసింది. ఈ సెక్షన్ రాజ్యాంగంలోని అధికరణం 14, 15, 21లను ఉల్లంఘిస్తోందంది.చిన్నారుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన అన్ని చట్టాల్లో సమరూపత ఉండాలని ధర్మాసనం పేర్కొంది. బాధితురాలితో ఉన్న బంధానికి అతీతంగా ఒక రేపిస్టు ఎప్పటికీ రేపిస్టేనన్న యూరోపియన్ మానవ హక్కుల కమిషన్ వ్యాఖ్యలను ఉటంకించింది.18 ఏళ్ల లోపు భార్యతో లైంగిక చర్యలో పాల్గొన్న భర్తను నేరస్తుడిగా పరిగణించనందుకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. సామాజిక సంక్షేమ పథకాలపై ఆకట్టుకునే నినాదాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోదనీ, వాటి అమల్లోనూ చిత్తశుద్ధితో పనిచేయాలంది.ఇదీ చరిత్ర..
1860: వివాహానికి బాలికకు కనీస వయసును నిర్ధారించకున్నా, భర్తతో శృంగారానికి అంగీకరించడానికి కనీస వయసు 10 ఏళ్లుగా నిర్ణయం.
1891: ఈ వయసు 12 ఏళ్లకు పెంపు. 
1925: శృంగారానికి అంగీకరించేందుకు కనీస వయసు 14 ఏళ్లకు పెంపు, ఐపీసీ సెక్షన్ 375లో ఇచ్చిన మినహాయింపును 13 ఏళ్లకు పెంచారు. 
1929: బాల్య వివాహ నియంత్రణ చట్టానికి ఆమోదం. వివాహానికి, శృంగారానికి కనీస వయసు 14 ఏళ్లుగా నిర్ధారణ. సెక్షన్ 375లో ఇచ్చిన మినహాయింపుకు ఎలాంటి మార్పు చేయలేదు. 
1940: ఐపీసీకి చేసిన సవరణల్లో శృంగారానికి కనీస వయసు 16 ఏళ్లకు పెంపు. సెక్షన్ 375 మినహాయింపు కింద 15 ఏళ్లకు పెంచారు. వివాహాల నియంత్రణ చట్టం ప్రకారం వివాహానికి బాలికల కనీస వయసు కూడా 15 ఏళ్లుగా నిర్ణయం. 
1978: ఐపీసీ సవరణల్లో శృంగారానికి కనీస వయసు 16 ఏళ్లుగా నిర్ణయం. మినహాయింపు కింద వివాహ కనీస వయసు 15 ఏళ్లలో మార్పు లేదు. మహిళకు వివాహ కనీస వయసు 18 ఏళ్లకు పెంపు.
2013: నిర్భయ ఘటన నేపథ్యంలో శృంగారానికి కనీస వయసు 18 ఏళ్లకు పెంపు.
చాలా దేశాల్లో నేరం
ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నారు. యూరోప్‌లో 22 దేశాల్లో, ఉభయ అమెరికా ఖండాల్లో 22 దేశాల్లో, ఆఫ్రికాలో 11 దేశాల్లో, ఆసియా, ఆస్ట్రేలియాల్లో కలిపి.. 15 దేశాల్లో మారిటల్ రేప్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు. భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించిన తొలిదేశం పోలండ్. 1932లో పోలండ్ ఈ మేరకు చట్టం చేసింది. అమెరికాలో 1970లో మొదలై 1993 దాకా మొత్తం 50 రాష్ట్రాలూ దీన్ని నేరం చేశాయి. మహిళలపై హింసకు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ పార్లమెంటు తీర్మానం చేసి.. మారిటల్ రేప్‌ను నేరంగా చేయాలని పిలుపునిచ్చింది. దాంతో ఫ్రాన్‌‌స, జర్మనీ, నెదర్లాండ్‌‌స, బెల్జియం తదితర దేశాలు మినహాయింపును ఎత్తివేశాయి. 1991లో బ్రిటన్ ఈ పనిచేసింది. మన పొరుగునున్న చిన్నదేశం నేపాల్ 2002లోనే మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటించింది. రాజ్యాంగంలోని సమాన రక్షణ, వ్యక్తిగత గోప్యత హక్కులను ఈ మినహాయింపు ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు తేల్చడంతో నేపాల్ ప్రభుత్వం చట్టాలను మార్చింది.

హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ 
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 12న ప్రకటించింది. నవంబర్ 9న ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 68 నియోజకవర్గాలకు ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. ఆలోపే (డిసెంబర్ 18) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలుంటాయని తెలిపింది. 
హిమాచల్ ఎన్నికల్లో అన్ని ఈవీఎంలకు ఓటు ధ్రువీకరణ (వీవీపీఏటీ) యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని 7,479 పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. 

మైనర్ భార్యతో శృంగారానికి శిక్షలు ఖరారు 
మైనర్ భార్యతో శృంగారాన్ని నేరంగా ప్రకటించిన సుప్రీంకోర్టు ఈ నేరానికి శిక్షలను ఖరారు చేసింది. ఈ విధమైన శృంగారంలో పాల్గొన్న వారికి ఐపీసీ ప్రకారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష లేదా బాలలను అత్యాచార నేరాలనుంచి కాపాడే (పోస్కో) చట్టం ప్రకారం జీవిత ఖైదు విధించాలంది. 15-18 ఏళ్ల వయసున్న భార్యలపై శృంగారం విషయంలో ఐపీసీ 375 సెక్షన్‌లోని మినహాయింపు 2ను (భర్తల శిక్షకు సంబంధించిన) సవరించాలని సుప్రీంకోర్టు సూచించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మైనర్ భార్యతో శృంగారానికి శిక్షలు ఖరారు 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : సుప్రీంకోర్టు 

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానం
ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (IFPRI) విడుదల చేసిన ప్రపంచ ఆకలి సూచీ-2017లో భారత్ 100వ స్థానంలో నిలిచింది. మొత్తం 119 దేశాలతో సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ఈ నివేదికలో భారత్ ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఇరాక్ కన్నా వెనుక స్థానంలో ఉండగా, పాకిస్తాన్ కన్నా కొంచెం మెరుగైన ర్యాంకు సాధించింది. భారత్‌లో ఆకలికి ముఖ్యమైన కారణం పిల్లల్లో అధిక శాతం పౌష్టికాహార లోపమని, దీన్ని తగ్గించాలంటే సమాజం నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) తన నివేదికలో పేర్కొంది. గతేడాది భారత్ 97వ స్థానంలో ఉంది. 
2017 జాబితాలో చైనా (29), నేపాల్ (72), మయన్మార్ (77), శ్రీలంక (84), బంగ్లాదేశ్ (88)తో స్థానాల్లో ఉన్నాయి. పాక్(106), అఫ్గానిస్తాన్ 107వ ర్యాంకుతో భారత్ కన్నా వెనుక ఉన్నాయి. ఉత్తర కొరియా 93, ఇరాక్ 78వ స్థానంలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ ఆకలి సూచీ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్
ఎక్కడ : 100వ స్థానంలో భారత్

ఐలయ్య పుస్తకాన్ని నిషేధించలేం:సుప్రీంకోర్టు 
కంచ ఐలయ్య రాసిన వివాదాస్పద పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు- కోమటోళ్లు’ను నిషేధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రాథమిక హక్కు అని, రచయితకు వ్యక్తిగతంగా తన భావాలను వ్యక్తపరిచే హక్కు ఉందని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేస్తూ అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు పుస్తకాన్ని నిషేధించలేమన్న సుప్రీంకోర్టు 
ఎప్పుడు : అక్టోబర్ 13 
ఎవరు : రచయిత కంచ ఐలయ్య 

పట్నా వర్సిటీ వందేళ్ల వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 
బిహార్‌లోని పట్నా యూనివర్సిటీ వందేళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తద్వారా వందేళ్ల చరిత్రలో యూనివర్సిటీలో జరిగిన వేడుకలకు హాజరైన తొలి ప్రధానమంత్రిగా మోదీ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... యూనివర్సిటీల సంకెళ్లను తెంచి ప్రపంచంలోనే ఉత్తమ విద్యాకేంద్రాలుగా మార్చేందుకు దేశంలోని 20 వర్సిటీలకు రూ.10వేల కోట్లు కేటాయించనున్నట్లు స్పష్టంచేశారు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు వర్సిటీలకు ఐదేళ్లపాటు రూ.10వేల కోట్లు). పాత పద్ధతిలో కొనసాగే విద్యావిధానాన్ని పక్కనబెట్టి.. యువత ఆలోచనలను అత్యాధునిక సమాచారం, సృజనాత్మకతతో కూడిన విద్యావిధానంపై వర్సిటీలు దృష్టిపెట్టాలని మోదీ కోరారు. ఈ 20 యూనివర్సిటీల ఎంపిక ప్రభుత్వాలు, పార్టీల చేతుల్లో కాకుండా థర్డ్‌పార్టీ ప్రొఫెషనల్ ఏజెన్సీతో జరుగుతుందన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పట్నా యూనివర్సిటీ వందేళ్ల వేడుకలు 
ఎప్పుడు : అక్టోబర్ 14 
ఎవరు : వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ 
ఎక్కడ : బిహార్‌లో 

గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం 
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ 1.93 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందింది. బీజేపీ ఎంపీ వినోద్ ఖన్నా హఠాన్మరణంతో (ఏప్రిల్‌లో) ఖాళీ అయిన ఈ స్థానానికి అక్టోబర్ 11న ఉప ఎన్నిక జరిగింది. అక్టోబర్ 15న వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జక్కడ్ 4,99,752 ఓట్లు సంపాదించగా.. బీజేపీ అభ్యర్థి స్వరన్ సలారియాకు 3,06,533 ఓట్లు వచ్చాయి. ఆప్ అభ్యర్థి సురేశ్ ఖజురియా 23,579 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఆర్నెల్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

ఢిల్లీలో హార్లే డేవిడ్సన్ యూనివర్సిటీ 
అమెరికాకు చెందిన ఖరీదైన బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్ భారత్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ ద్వారా స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి టెక్నికల్, నాన్‌టెక్నికల్ కోర్సులలో శిక్షణ ఇస్తారు. అంతేకాక శిక్షణ పొందినవారిని ఉద్యోగులుగా చేర్చుకోవడం, డీలర్‌షిప్‌లను ఇవ్వడం వంటివి కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఏషియా పసిఫిక్ రీజియన్‌లలో మూడు యూనివర్సిటీలు ఉండగా, తాజాగా భారతదేశ రాజధాని ఢిల్లీలో నాలుగో యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు హార్లే డేవిడ్సన్ ఇండియా చైనా సంయుక్త మేనేజింగ్ డెరైక్టర్ పీటర్ మాక్ కెన్‌‌జ తెలిపారు. టెక్నికల్ ట్రైనింగ్‌తోపాటు యూనివర్సిటీ నిర్వహణ, ఫైనాన్‌‌స, బ్రాండింగ్ వంటి కోర్సులను అందిస్తామని, రాబోయే కొన్ని వారాల్లోనే యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ యూనివర్సిటీ 
ఎక్కడ : ఢిల్లీలో 
ఎందుకు : టెక్నికల్ ట్రైనింగ్‌తోపాటు యూనివర్సిటీ నిర్వహణ, ఫైనాన్‌‌స, బ్రాండింగ్ వంటి కోర్సులను అందించేందుకు 

పీపీపీ పద్ధతిలో మైక్రో ఇరిగేషన్ 
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించడమే లక్ష్యంగా అన్ని రాష్ట్రాల్లో మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మ నీటి పారుదల) సాగు విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో దీనిని అమల్లోకి తేనుంది. ఇందుకోసం ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అక్టోబర్ 16న పంపించింది. ఈ మార్గదర్శకాలపై అభిప్రాయాలను నెల రోజుల్లోగా తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 
69 మిలియన్ హెక్టార్లలో ‘సూక్ష్మ’ సాగే లక్ష్యం 
ప్రస్తుతం ఒక్కో రైతుకు మైక్రో ఇరిగేషన్ సాగుకు ఐదు హెక్టార్ల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిని పది హెక్టార్లకు పెంచాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అలాగే... దేశంలో 160 మిలియన్ హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూమి ఉంటే దాదాపు 65 మిలియన్ హెకార్లకు సాగునీరు అందుతోంది. ఇందులో కేవలం 8.6 మిలియన్ హెక్టార్లలోనే మైక్రో ఇరిగేషన్ విధానంలో సాగవుతున్నాయి. మైక్రో ఇరిగేషన్‌లో భాగంగా 4.7 మిలియన్ హెక్టార్లలో స్ప్రింకర్ల ద్వారా, 3.9 మిలియన్ హెక్టార్లలో డ్రిప్ ద్వారా సాగు చేస్తున్నారు. దేశంలో 69 మిలియన్ హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ సాగులోకి తేవాలని లక్ష్యంగా ఈ పీపీపీ మైక్రో ఇరిగేషన్ విధానాన్ని కేంద్రం రూపొందించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పీపీపీ పద్ధతిలో సూక్ష్మ సాగుకు ముసాయిదా మార్గదర్శకాలు విడుదల 
ఎప్పుడు : అక్టోబర్ 16 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

ముంబై ఎయిర్‌పోర్ట్ చిత్రంతో పోస్టల్ స్టాంపుల విడుదల 
వాణిజ్య రాజధాని ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 75 వసంతాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తపాలాశాఖ విమానాశ్రయం ముఖచిత్రంతో రెండు పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. 
1932 అక్టోబరు 15న జంజీర్ రతన్‌జీ దాదాబాయ్ టాటా మొదటి సారి సింగిల్ ఇంజిన్ విమానాన్ని కరాచీ నుంచి ముంబైకి నడిపారు. తరువాత రతన్‌జీ స్నేహితుడు మాజీ పెలైట్ నివిల్ విన్సెంట్ మద్రాసుకు నడిపారు. స్టాంపుపై రద్దీగా ఉన్న విమానాశ్రయ చిత్రంతోపాటు, ప్రయాణికులు దిగే చిత్రాన్ని ముద్రించారు. రూ.5, రూ.15 ముఖవిలువతో ఈ స్టాంపులను విడుదల చేశారు. విమానాశ్రయం ఏర్పాటైన తర్వాత 1942 నుంచి దీనిని మిలటరీ పనులకు వినియోగించారు. స్వాంతంత్య్రం వచ్చిన తరువాత పౌర సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ టెర్మినల్ నుంచి రోజూ 867 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సంవత్సరానికి నాలుగున్నర కోట్ల మంది దీని ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముంబై ఎయిర్‌పోర్ట్ చిత్రంతో పోస్టల్ స్టాంపుల విడుదల 
ఎప్పుడు : అక్టోబర్ 15 
ఎవరు : తపాలాశాఖ 
ఎందుకు : చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 75 వసంతాలను పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 

డెంగీ వ్యాప్తిపై చెన్నైలో 12.5 లక్షల మందికి జరిమానా 
చెత్తకుప్పలు, మురికిగుంటలు తొలగించకపోవడం ద్వారా ప్రాణాంతక డెంగీ దోమల వ్యాప్తికి కారకులైన 12.5 లక్షల మంది చెన్నై వాసులకు అక్టోబర్ 12న తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే 2.5 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో డెంగీ మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఇకపైనా ఇదే పరిస్థితి కొనసాగితే రూ.5 వేలు, ఆ తరువాత రూ.10 వేల చొప్పున జరిమానా వసూలు చేస్తామని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ కార్తికేయన్ హెచ్చరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డెంగీ వ్యాప్తిపై 12.5 లక్షల మందికి రూ. 2 వేల జరిమానా 
ఎప్పుడు : అక్టోబర్ 12 
ఎవరు : తమిళనాడు ఆరోగ్య శాఖ 
ఎక్కడ : చెన్నైలో 

నియంతృత్వ పాలన కోరుకుంటున్న 55 శాతం భారతీయులు 
భారతీయుల్లో అత్యధికులు(55 శాతం మంది) నియంతృత్వ పాలనను కోరుకుంటున్నారని ప్యూ రీసెర్చ్ సర్వేలో తేలింది. ప్రపంచంలోని 38 ముఖ్య దేశాల్లో పాలన తీరు, ప్రభుత్వాలపై ప్రజల విశ్వాసం.. అనే అంశాలపై ప్యూ రీసెర్చ్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16-మే 8 మధ్యలో 38 దేశాల్లో 41,953 మంది అభిప్రాయాలను ప్యూ రీసెర్స్ సేకరించింది. 
మరిన్ని వివరాలు.. 
సమష్టి నిర్ణయాల కంటే ఏకవ్యక్తి పాలనే మెరుగని భారతీయులు విశ్వసిస్తున్నారు.27 శాతం మంది పటిష్ట నాయకత్వాన్ని కోరుకోగా, 53 శాతం మంది సైనిక పాలనే మేలంటున్నారు.50 ఏళ్లకు పైబడిన వాళ్లలో మాత్రం అత్యధికులు సైనికపాలనకు తాము వ్యతిరేకమంటున్నారు.కేంద్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసముందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఏకంగా 85 శాతం మంది చెప్పారు.పార్లమెంటు, న్యాయస్థానాల జోక్యం లేకుండా.. శక్తిమంతమైన నాయకుడు నిర్ణయాలు తీసుకునే పాలనా విధానం మెరుగ్గా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి పాలన మంచిది కాదని 71 శాతం మంది పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్యూ రీసెర్చ్ సర్వే - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 17 
ఎవరు : ప్యూ రీసెర్చ్ 
ఎక్కడ : 38 దేశాల్లో 
ఎందుకు : దేశాల్లో పాలన తీరు, ప్రభుత్వాలపై ప్రజల విశ్వాసంపై 

48వ గవర్నర్ల సదస్సు 
48వ గవర్నర్ల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 12న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ పాల్గొన్నారు. 27 మంది గవర్నర్లు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులు హాజరయ్యారు. ‘నవ భారత్-2022’ లక్ష్యాలైన వసతులు, ప్రజాసేవ, రాష్ట్రాల్లో ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధిపై సదస్సులో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

బెంగళూరులో తల్లిపాల నిధి 
శిశువులకు తల్లి పాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందించేందుకు తల్లి పాల నిధిని బెంగళూరులోని మదర్ థెరిసా రోడ్డులో అక్టోబర్ 9న అందుబాటులోకి తెచ్చారు.

జమిలి ఎన్నికలకు సిద్ధం: ఎన్నికల సంఘం
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించేందుకు 2018 సెప్టెంబరు నాటికి సిద్ధంగా ఉంటామని ఎన్నికల కమిషన్ (ఈసీ) అక్టోబర్ 4న పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఏమేం కావాలో తెలపాలని కేంద్రం ఈసీని అడిగింది. దీంతో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు), వీవీపీఏటీ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రాల కొనుగోలుకు నిధులు కావాలని ఈసీ కోరగా ఆ మేరకు వీవీపీఏటీ యంత్రాల కొనుగోలు కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కొనుగోలు కోసం రూ.12 వేల కోట్లు కేంద్రం మంజూరు చేసింది. దీంతో అవసరమైన సామాగ్రితో వచ్చే సెప్టెంబర్ నాటికి జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంటామని ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ తెలిపారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధం
ఎప్పుడు : 2018 సెప్టెంబర్
ఎవరు : ఎన్నికల సంఘం

పర్యాటక ప్రచారానికి పర్యటన్ పర్వ్
దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్రం అక్టోబర్ 4న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పర్యాటక శాఖ పర్యటన్ పర్వ్’ పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు పాల్గొంటాయి. 20 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంతో పాటు, పర్యాటక రంగం ప్రయోజనాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పర్యాటక ప్రచారానికి కొత్త కార్యక్రమం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ
ఎందుకు : ప్రముఖ పర్యాటక స్థలాలకు ప్రాచుర్యం కల్పించేందుకు

సైబర్ వేధింపుల బాధితుల్లో ముంబైది మొదటి స్థానం
ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్న బాధితుల సంఖ్యలో ముంబై అగ్రస్థానంలో ఉందని నార్టన్ బై సెమాంటిక్ అక్టోబర్ 5న వెల్లడించింది. ఈ జాబితాలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. కంప్యూటర్ భద్రత సాఫ్ట్‌వేర్ తయారు చేసే ఈ సంస్థ ఆన్‌లైన్ వేధింపుల తీరుతెన్నులపై ఇటీవల ఓ అధ్యయనం జరిపింది. దేశంలోని ప్రతి 10 మంది ఆన్‌లైన్ వినియోగదారుల్లో 8 మంది ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించింది.
సైబర్ వేధింపుల బాధితులు

ముంబై

51%

ఢిల్లీ

47%

హైదరాబాద్

46%

క్విక్ రివ్యూ: 
ఏమిటి : సైబర్ వేధింపుల బాధితుల సంఖ్యలో అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : ముంబై
ఎవరు : నార్టన్ బై సెమాంటిక్ అనే కంప్యూటర్ భద్రత సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ

గాంధీజీ హత్య కేసులో అమికస్ క్యూరీ నియామకం
మహాత్మా గాంధీ హత్య కేసును పునర్విచారించేందుకు సుప్రీంకోర్టు అక్టోబర్ 6న అంగీకరించింది. ఈ మేరకు మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమిస్తున్నట్లు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది.
గాంధీ హత్యపై పునర్విచారణ జరపాలంటూ అభినవ భారత్ సంస్థ ట్రస్టీ డా.పంకజ్ ఫడ్నీస్ పిటిషన్ దాఖలు చేశారు. 1949లో గాడ్సేతో పాటు నారాయణ్ ఆప్టేల పిటిషన్లను తూర్పు పంజాబ్ హైకోర్టు తిరస్కరించిన అనంతరం ఈ కేసును సుప్రీం కోర్టు అసలు విచారించనేలేదని, 1966లో ఏర్పాటు చేసిన జేఎల్ కపూర్ కమిషన్ తన నివేదికను అత్యున్నత ధర్మాసనానికి సమర్పించలేదని ఫడ్నీస్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమికస్ క్యూరీని నియమించిన సుప్రీంకోర్టు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : అమరేందర్ శరణ్
ఎందుకు : గాంధీజీ హత్య కేసును పునర్విచారించేందుకు

అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రంగా బుడ్గె బుడ్గె 
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు నెలల కాలంలో దేశంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సాధించిన 25 విద్యుత్ కేంద్రాలకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో జైపూర్‌లోని బుడ్గె బుడ్గె థర్మల్ విద్యుత్ కేంద్రం తొలి స్థానంలో నిలిచింది. గత ఆగస్టులో ఈ కేంద్రం అత్యధికంగా 98.43 శాతం పీఎల్‌ఎఫ్‌తో రికార్డు సాధించింది. తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 86.87 శాతం పీఎల్‌ఎఫ్‌తో జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. అది మినహా తెలుగు రాష్ట్రాల నుంచి మరే విద్యుత్ కేంద్రం టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది. రామగుండంలో ఎన్టీపీసీకి చెందిన సూపర్ విద్యుత్ కేంద్రం ఒక్కటే 82.04 శాతం పీఎల్‌ఎఫ్‌తో 19వ ర్యాంకు సాధించి 25 విద్యుత్ కేంద్రాల జాబితాలో చోటు సంపాదించింది. 
ఒక విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే.. ఓ ఏడాది కాలంలో ఆ విద్యుత్ కేంద్రం సాధించిన ఉత్పత్తి శాతాన్ని పీఎల్‌ఎఫ్‌గా పరిగణిస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన విద్యుత్ కేంద్రాలు నష్టాల బాట పట్టకుండా ఉండాలంటే ఏటా మెరుగైన పీఎల్‌ఎఫ్ సాధించాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితా 
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : తొలి స్థానంలో జైపూర్‌లోని బుడ్గె బుడ్గె కేంద్రం 

ఢిల్లీలో టపాసుల అమ్మకాలపై తాత్కాలిక నిషేధం
ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో నవంబర్ 1 వరకు టపాసులు అమ్మడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. దీంతోపాటే టపాసులు విక్రయించే వ్యాపారులకు జారీ చేసిన తాత్కాలిక లెసైన్సులను కూడా రద్దు చేస్తున్నామని, అక్టోబర్ 9 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తూ జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 1 తర్వాత బాణసంచా అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తామని, టపాసుల విక్రయాలకు అనుమతి ఇస్తామని ధర్మాసనంలోని మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ అశోక్ భూషణ్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టపాసుల అమ్మకాలపై తాత్కాలిక నిషేధం 
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : సుప్రీం కోర్టు 
ఎక్కడ : ఢిల్లీలో 

గోధ్రా’ దోషులకు శిక్ష తగ్గింపు
గోధ్రా రైలు దగ్ధం కేసులో దోషులకు శిక్ష తగ్గిస్తూ గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరణ శిక్ష పడిన 11 మంది దోషులకు ఆ శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ అక్టోబర్ 9న తీర్పునిచ్చింది. అలాగే జీవిత ఖైదు పడిన మరో 20 మందికి అదే శిక్షను ఖరారు చేసింది. ఆ ఘటన సమయంలో శాంతి భద్రతలను సరిగా పరిరక్షించలేకపోయారంటూ రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ గోధ్రా ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం అందజేయాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అనంత్ ఎస్ డేవ్, జస్టిస్ జీఆర్ ఉద్వానీ ఆదేశాలు జారీ చేశారు. 
2002, ఫిబ్రవరి 27న సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలులో అయోధ్య నుంచి వస్తున్న ప్రయాణికులపై కొందరు ఆందోళనకారులు గోధ్రా స్టేషన్‌లో దాడిచేశారు. ఎస్-6 కోచ్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మృతిచెందారు. వీరిలో చాలా మంది కరసేవకులు ఉన్నారు. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో సుమారు 1,200 మంది మరణించారు. ఈ మారణహోమంపై విచారణ జరిపేందుకు అప్పటి గుజరాత్ ప్రభుత్వం జస్టిస్ నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గోధ్రా ఘటన వెనుక కుట్ర దాగి ఉందని విచారణలో కమిషన్ తేల్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోధ్రా అల్లర్ల కేసులో దోషులకు శిక్ష తగ్గింపు 
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : గుజరాత్ హైకోర్టు

విపత్తు నిర్వహణ’ తప్పనిసరి
ఉగ్రదాడులు, భూకంపాల వంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరును విద్యార్థులకు బోధించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) అన్ని వర్సిటీలకు సూచించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ కోర్సును తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

పోటీతత్వ సూచీలో భారత్‌కు 40వ స్థానం
 అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 40వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం దిగజారింది. మొత్తం 137 దేశాలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రూపొందించిన అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (Global Competetive index) ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానాన్ని స్విట్జర్లాండ్ సాధించింది. ఈ జాబితాలో పొరుగు దేశం చైనా 27వ ర్యాంకులో ఉండగా, భారత్ 39వ ర్యాంకు నుంచి 40వ స్థానానికి పడిపోయింది. 
12 విభాగాల్లో ఆయా దేశాల పనితీరు ప్రాతిపదికగా వాటి ర్యాంకులను డబ్ల్యూఈఎఫ్ నిర్ణయిస్తుంది. దీని ప్రకారం .. ఇన్‌ఫ్రా విభాగంలో భారత్ 66వ ర్యాంకు, ఉన్నత విద్య.. శిక్షణలో 75వ స్థానాన్ని దక్కించుకుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : వరల్డ్ ఎకనామిక్ ఫోరం 
ఎక్కడ : 40వ స్థానంలో భారత్ 

జాతీయ అంతర్గత భద్రతా పథకానికి కేబినెట్ ఆమోదం 
దేశంలో శాంతిభద్రతల వ్యవస్థను మెరుగుపరచడానికి.. పోలీసు బలగాలను ఆధునీకరించడానికి.. ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాటానికి ఉద్దేశించిన భారీ అంతర్గత భద్రతా పథకానికి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 27న ఆమోదం తెలిపింది. ఈ మేరకు పోలీసు బలగాలను ఆధునికీకరించేందుకు ‘మాడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ (MPF)’ పేరిట 2017-18 నుంచి 2019-20 వరకు మూడేళ్ల పాటు రూ.25,060 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. అలాగే... మొబైల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. 
ఎంపీఎప్ పథకం వివరాలు...

పథకం మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.18,636 కోట్లు కాగా.. రాష్ట్రాల వాటా రూ.6,424 కోట్లుగా ఉంటుంది.ఎంపీఎఫ్ పథకంలో భాగంగా అంతర్గత భద్రత కోసం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.10,132 కోట్లు వెచ్చిస్తారు.పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధునాతనమైన ఫోరెన్సిక్ సైన్‌‌స లేబొరేటరీని ఏర్పాటు చేస్తారు. జైపూర్ లోని సర్దార్ పటేల్ గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ, కౌంటర్ టైజమ్‌ను, అలాగే గాంధీనగర్‌లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్‌‌స యూనివర్సిటీని ఆధునీకరిస్తారు.క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎంపీఎస్ పథకానికి ఆమోదం 
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : పోలీసు బలగాలను ఆధునికీకరించేందుకు 

కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసు పెంపు 
కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ సెప్టెంబర్ 27న నిర్ణయం తీసుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో పనిచేస్తున్న వారికిఇది వర్తిస్తుంది. ప్రస్తుతం కేంద్ర వైద్యుల రిటైర్మెం ట్ వయసు కొన్ని విభాగాల్లో 60 ఏళ్లుగా, మరికొన్నింటిలో 62 ఏళ్లుగా ఉంది. దీంతో వివిధ విభాగాల్లోని 1,445 మంది వైద్యులకు లబ్ధి చేకూరనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంపు
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : ఆయుష్ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో పనిచేస్తున్న వైద్యులకు 

వైద్యులకూ ఆధార్ తరహా ఐడీ
డిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా వైద్యులకు ఆధార్ తరహాలో యునిక్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ (యూపీఆర్‌ఎన్) ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 28న ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారు వైద్యులుగా ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇందువల్ల ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన వారికి ఆ రాష్ట్రంలో కేటాయించే నంబర్.. మరో రాష్ట్రంలో మరొకరికి కూడా ఉంటుంది. ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒకే నంబర్‌పై పదుల సంఖ్యలో వైద్యులు ఉంటున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఎంసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఎంసీఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి్య యూపీఆర్‌ఎన్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వైద్యులకు ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు సంఖ్య 
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 
ఎక్కడ : దేశవ్యాప్తంగా

ప్రైవేటుతో పంచాయతీల అనుసంధానం
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు దాదాపు కోటి మందికిపైగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గ్రామ పంచాయతీలను ప్రైవేటు సంస్థలకు అనుసంధానిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) చురుగ్గా ఉండి బ్యాంకు ఖాతాలు, మౌలిక సదుపాయాలు ఉన్న 50,000 పంచాయతీలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. మిషన్ అంత్యోదయ పథకం కింద చేపడుతున్న ఈ చర్యల్లో భాగంగా ప్రైవేటు కంపెనీలకు ఎలాంటి సబ్సిడీలు, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించబోదని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జిత్ సిన్హా చెప్పారు. 
ఈ విధానంలో కేంద్రం కేవలం పంచాయతీలకు, ప్రైవేటు సంస్థలకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుంది. వేర్వేరు గ్రామాల్లో వ్యాపారాలకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించి ఆ వివరాలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో పంచుకుంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రైవేటు సంస్థలతో గ్రామ పంచాయతీల అనుసంధానం 
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు 

గన్ లెసైన్సుల్లో యూపీ టాప్
ఎక్కువ మంది పౌరులు తుపాకీ లెసైన్సులు పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. యూపీలో 12.77 లక్షల మందికి గన్ లెసైన్సు ఉంది. వేర్పాటువాదంతో సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్‌లో 3.69 లక్షల మంది గన్ లెసైన్సు పొందారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 33,69,444 మంది గన్ లెసైన్సులు సంపాదించారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తమ వ్యక్తిగత భద్రతను కారణంగా చూపి యూపీలో ఎక్కువ మంది లెసైన్సులు పొందారు. పంజాబ్‌లో 3,59,349 మంది, మధ్యప్రదేశ్‌లో 2,47,130 మంది, హరియాణాలో 1,41,926 మంది గన్ లెసైన్సులు పొందారు. అత్యంత తక్కువగా దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరో 125 మంది గన్ లెసైన్సులు సంపాదించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో గన్ లెసైన్సులు 33,69,444
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర హోంశాఖ 

ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రోహిణి 
ఓబీసీ రిజర్వేషన్ల వ ర్గీకరణ కమిషన్ చైర్ పర్సన్‌గా ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2న ఏర్పాటు చేసింది. 
కమిషన్‌లో సభ్యులుగా డాక్టర్ జేకే బాలాజీ, ఆంథ్రోపాలజికల్ సర్వే ఇండియా డెరైక్టర్, భారత రిజిస్ట్రార్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఉంటారు. ఈ కమిషన్‌కు సామాజిక న్యాయశాఖలో జాయింట్ సెక్రెటరీ హోదా అధికారి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిషన్ 12 వారాల్లో ఓబీసీ వర్గీకరణపై రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాలి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రోహిణి 
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

మధుమేహంలో పుదుచ్చెరి ఫస్ట్
దేశంలో మధుమేహం (షుగర్/డయాబెటిస్)తో బాధపడుతున్నవారు పుదుచ్చెరిలో ఎక్కువ మంది ఉన్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) తెలిపింది. రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఉండగా తెలుగు రాష్ట్రాలు 5వ స్థానంలో నిలిచాయి. 

‘దివ్యాంగ్ సారథి’ ప్రారంభం
దివ్యాంగులకు అనేక అంశాల్లో ఉపకరించే దివ్యాంగ్ సారథి అనే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లట్ సెప్టెంబర్ 26న ప్రారంభించారు. ఈ యాప్.. దివ్యాంగుల సంక్షేమ పథకాలు, ఉపకారవేతనాలు, సంస్థాగత మద్దతు వ్యవస్థల వివరాలను అందిస్తుంది. దివ్యాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ సమాచారం మొత్తం ఈ యాప్ ద్వారాపొందొచ్చు. ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా పని చేస్తుంది. 

కర్ణాటకలో మూఢనమ్మకాల నిషేధ చట్టానికి తీర్మానం
కర్ణాటకలో మూఢ నమ్మకాల నిషేధ చట్టం తేవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సెప్టెం

బర్ 27న జరిగిన కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

అక్టోబరు 2017 ఎకానమీఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ 2018
ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ - 2018లో భారత్ 100వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాది ఇదే ర్యాంకింగ్స్‌లో 130వ స్థానంలో భారత్ ఈసారి 30 స్థానాలు మెరుగుపరుచుకుంది. ‘డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణలు’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేసింది. పన్నులు, లెసైన్సింగ్ వ్యవస్థలో సంస్కరణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, దివాలా సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాల్లో భారత్ వేగంగా పురోగమించడం ఈ ర్యాంక్ మెరుగుదలకు దోహదపడింది. 
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...
2003 నుంచి భారత్ దాదాపు 37 సంస్కరణాత్మక చర్యలను తీసుకువచ్చింది. అందులో సగానికి సగం సంస్కరణలు మంచి ఫలితాలను అందించాయి. ప్రత్యేకించి గడచిన నాలుగేళ్లలో ఈ సంస్కరణల అమలు తీరు బాగుంది. ర్యాంకింగ్ మెరుగుదలలో ఇది ఎంతగానో దోహదపడింది.
ఈ ఏడాది తమ ర్యాంకులను భారీగా పెంచుకున్న 10 దేశాల్లో భారత్ ఒకటి.
భారత్ 100 ర్యాంక్ క్లబ్‌లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇలాంటి భారీ రికార్డు నమోదుచేసిన అతిపెద్ద దేశం భారత్ కావడమూ మరో విశేషం. భారత్ తన స్కోర్‌ను 4.71 పాయింట్ల మేర పెంచుకుని 60.76 పాయింట్లకు చేరింది.
గత రెండేళ్లుగా భారత్ ర్యాంక్ 130గా ఉంది. 2014లో దేశం ర్యాంక్ 142.

న్యూజిలాండ్ టాప్..
సులువైన వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. తరువాతి నాలుగు స్థానాల్లో సింగపూర్ (2), డెన్మార్క్ (3), దక్షిణ కొరియా (4), హాంకాంగ్ (5) నిలిచాయి. అమెరికా 6వ స్థానం, బ్రిటన్ 7వ స్థానంలో నిలిచాయి. ఇక బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో రష్యా అగ్ర స్థానంలో 35వ ర్యాంక్ పొందింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణల నివేదిక
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ప్రపంచ బ్యాంకు 
ఎక్కడ : 100వ ర్యాంకులో భారత్

దేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్ ‘గూగుల్’
 Current Affairs టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్.. భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మారుతీ సుజుకీ, యాపిల్ ఉన్నాయి. గ్లోబల్ కమ్యూనికేషన్‌‌స సంస్థ ‘కొహ్న్ - వోల్ఫ్’ ఈ విషయాలను వెల్లడించింది. సోనీ, యూట్యూబ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ వంటి బ్రాండ్‌‌స టాప్-10లో స్థానం పొందాయి. దాదాపు 67 శాతం మంది వినియోగదారులు వారి కొనుగోళ్లలో బ్రాండ్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే.. అమెజాన్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఉంది. దీని తర్వాతి స్థానంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పేపాల్ వంటి సంస్థలు ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ - గూగుల్ 
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : కోహ్న్ - వోల్ఫ్ సంస్థ 

ఆర్‌కామ్-సిస్టెమా డీల్‌కు డాట్ అంగీకారం
రిలయన్‌‌స కమ్యూనికేషన్‌‌సతో (ఆర్‌కామ్) సిస్టెమా శ్యామ్(ఎస్‌ఎస్‌టీఎల్) విలీనానికి టెలికం విభాగం (డాట్) తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సిస్టెమా శ్యామ్ వైర్‌లెస్ వ్యాపార విలీనానికి డాట్ అంగీకారం లభించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. విలీన ఒప్పందం ప్రకారం.. ఎస్‌ఎస్‌టీఎల్‌కు సంబంధించిన వైర్‌లెస్ బిజినెస్ అసెట్స్ అన్నీ ఆర్‌కామ్ పరిధిలోకి వస్తాయి. విలీనానం తరం ఆర్‌కామ్‌లో సిస్టెమాకు 10 శాతం వాటా వస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆర్‌కామ్ - సిస్టెమో(ఎస్‌ఎస్‌టీఎల్) డీల్‌కు ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : టెలికం విభాగం (డాట్)

జాతీయ రహదారుల నిర్మాణానికి 7 లక్షల కోట్లు 
ప్రతిష్టాత్మక భారత్‌మాల ప్రాజెక్టు, ఇతర జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ. 7 లక్షల కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ భారీ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపింది. 
భారత్ మాల 
భారత్‌మాల ప్రాజెక్టులో దేశ సరిహద్దులతోపాటుగా కోస్తా, ఇతర ప్రాంతాలను కలుపుతూ (దాదాపు 50 వేల కిలోమీటర్లు) జాతీయ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును కలుపుకుని ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 83,677 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించాలని మోదీ ప్రభుత్వం సంకల్పిస్తోంది. భారత్‌మాల ప్రాజెక్టుల తొలి దశలో 20 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. భారత్‌మాల ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు 10 లక్షల కోట్లు ఖర్చవుతాయని కేంద్రం అంచనా వేసింది. 2021-22 నాటికి ఈ ప్రతిపాదిత భారత్‌మాల ప్రాజెక్టు పనులను ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్, మోర్త్, రాష్ట్రాల పీడబ్ల్యూడీ శాఖల సహకారంతో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 
ఎకనమిక్ కారిడార్‌ల అభివృద్ధి 
కేబినెట్ ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో కార్గోలు వేగవంతంగా చేరేలా ఎకనమిక్ కారిడార్‌ల అభివృద్ధి కూడా ఉంది. ఈ ఎకనమిక్ కారిడార్లలో ముంబై-కొచ్చిన్-కన్యాకుమారి, బెంగళూరు-మంగళూరు, హైదరాబాద్-పణజీ, సంబల్‌పూర్-రాంచీ వంటి 44 ప్రాజెక్టులున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 7 లక్షల కోట్లు 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : భారత్ మాల, ఎకనమిక్ కారిడార్ల అభివృద్ధి పథకంలో భాగంగా 

పీఎస్‌బీ బ్యాంకులకు 2 ఏళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు 
మొండిబకాయిలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా రూ. 2.11 లక్షల కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు వెల్లడించింది. ఇందులో రూ. 1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో రానుండగా, బడ్జెట్ కేటాయింపుల రూపంలో రూ. 18,139 కోట్లు, ఆయా బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా మరో రూ. 58,000 కోట్లు సమకూరనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ మేరకు మూలధనం సమకూర్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అక్టోబర్ 24న వెల్లడించారు. ఉపాధి కల్పించే చిన్న, మధ్య స్థాయి సంస్థల రంగానికి ఊతమిచ్చేందుకు, ఆర్థిక వ్యవస్థలో పీఎస్‌బీలు కీలకపాత్ర పోషించేందుకు మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. 
బ్యాంకింగ్ రంగంలో 2015 మార్చి నాటికి రూ. 2.75 లక్షల కోట్లుగా ఉన్న నిరర్ధక ఆస్తులు 2017 జూన్ నాటికి రూ.7.33 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ఇందులో 12 సంస్థలు కట్టాల్సినదే రూ.1.75 లక్షల కోట్ల మేర ఉంది. ఈ కేసులు ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఉన్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు మూలధనంగా ఇవ్వాలని నిర్ణయం 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

2017లో భారత్ వృద్ధి రేటు 7 శాతం : ప్రపంచబ్యాంక్ 
 Current Affairs ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2017-18)ంలో భారత్ వృద్ధి రేటు 7 శాతానికే పరిమితం కాగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇది 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన దక్షిణాసియా ఆర్థిక స్థితిగతుల నివేదికలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యలు ఇందుకు కారణమని వెల్లడించింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక.. తయారీ, సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇక అంతర్గతంగా అడ్డంకుల కారణంగా ప్రైవేట్ పెట్టుబడులు మందగించాయని, ఇది దేశ వృద్ధి అవకాశాలపై మరింతగా ఒత్తిడి పెంచగలదని హెచ్చరించింది. అయితే, ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల మధ్య సమతౌల్యత ఉండేలా తగు విధానాలు పాటిస్తే 2018లో వృద్ధి కొంత మెరుగుపడి 7.3 శాతం స్థాయికి చేరగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 6.7 శాతానికి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది. 
2017-18లో వృద్ధికి కోత ఇలా..
సంస్థ

తాజా అంచనా

గత అంచనా

ఏడీబీ

7%

7.4%

ఓఈసీడీ

6.7%

7.3%

ఐఎంఎఫ్

6.7%

7.2%

ప్రపంచబ్యాంకు

7%

7.2%

ఆర్‌బీఐ

6.7%

7.3%

క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7 శాతంగా అంచనా 
ఎప్పుడు : 2017-18లో 
ఎవరు : ప్రపంచ బ్యాంకు 
ఎందుకు : పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యల కారణంగా 

ఎయిర్‌టెల్ చేతికి టాటా టెలీ సర్వీసెస్ 
రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్ మొబైల్ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ అక్టోబర్ 12న ప్రకటించింది. తద్వారా.. నవంబర్ 1 నుంచి టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్‌ఎల్), టాటా టెలీ మహారాష్ట్ర (టీటీఎంఎల్) సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు టాటా టెలీ నుంచి ఎయిర్‌టెల్‌కి బదిలీ అవుతారు. అయితే ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్‌టెల్ ఎలాంటి నగదూ చెల్లించటం లేదు. ఈ మేరకు ‘‘ఇది పూర్తిగా రుణ రహిత, నగదురహిత డీల్‌గా ఉంటుంది’’ అని ఇరు సంస్థలు వేర్వేరుగా ఇచ్చిన ప్రకటనల్లో వెల్లడించాయి. 
అయితే, టాటా సంస్థ స్పెక్ట్రమ్‌కోసం టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో దాదాపు 20% (సుమారు రూ.1,500-2,000 కోట్లు) బాధ్యత మాత్రమే ఎయిర్‌టెల్ తీసుకుంటుంది. సుమారు రూ. 31,000 కోట్ల పైచిలుకు పేరుకుపోయిన టాటా టెలీ రుణాలను టాటా సన్‌‌స తీరుస్తుంది. తాజా ఒప్పందంతో ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లకు చేరనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎయిర్‌టెల్‌లో విలీనం కానున్న టాటా టెలీసర్వీసెస్ 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎందుకు : రుణభారం కారణంగా

రెపో రేటు యథాతథం
 Current Affairs ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో అక్టోబర్ 4న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) సమావేశంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటు యథాతథంగా ఉండటంతో పాటు రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉండనుంది. అలాగే వృద్ధి రేటును 7.3% నుంచి 6.7%కి ఆర్‌బీఐ పరిమితం చేసింది. ద్రవ్యోల్బణాన్ని గతంలో 4 శాతం నుంచి 4.5 శాతంగా అంచనా వేసిన ఆర్‌బీఐ దీనిని 4.2-4.6 శాతం శ్రేణికి పెంచింది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్‌ఎల్‌ఆర్)ను 20% నుంచి 19.5%కి తగ్గించింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన మొత్తమే ఎస్‌ఎల్‌ఆర్.
పాలసీ ముఖ్యాంశాలు
రెపో రేటు 6 శాతంగా యథాతథం
రివర్స్ రెపో 5.75 శాతంగా కొనసాగింపు
వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 6.7 శాతానికి కోత
ద్రవ్యోల్బణం ద్వితీయార్ధంలో 4.2-4.6% శ్రేణిలో ఉంటుందని అంచనా
తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5-6 న ఉంటుందని సూచన
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రెపో రేటు యథాతథం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

27 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వివిధ శ్లాబుల్లో ఉన్న 27 వస్తువుల పన్నురేట్లు తగ్గాయి. ఈ మేరకు అక్టోబర్ 6న జరిగిన జీఎస్టీ మండలి 22వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే కోటిన్నర లోపు వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థలు ప్రతినెలా కాకుండా మూడు నెలలకోసారి పన్ను చెల్లింపుతో పాటు రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఇప్పటి వరకు కాంపోజిషన్ పథకంలో చేరేందుకు రూ.75 లక్షల టర్నోవర్ కలిగిన సంస్థలను అనుమతిస్తుండగా, ఆ పరిమితిని కోటి రూపాయలకు పెంచారు. 
సవరించిన జీఎస్టీ పన్ను రేట్లు
వస్తువు

పాత పన్నురేటు

సవరించిన రేటు

బ్రాండెడ్ కాని నమ్‌కీన్

12 శాతం

5 శాతం

ఆయుర్వేద ఔషధాలు

12 శాతం

5 శాతం

ముక్కలుగా కోసి ఎండబెట్టిన మామిడికాయలు

12 శాతం

5 శాతం

ఖాఖ్రా ఆహార పదార్థం (గుజరాత్, రాజస్తాన్‌లలో ప్రసిద్ధి)

12 శాతం

5 శాతం

ICDSకింద పాఠశాలలకు ఇచ్చే ఆహార పొట్లాలు

12 శాతం

5 శాతం

జరీ, ఇమిటేషన్ జ్యువెలరీ ఆహార పదార్థాల తయారీ, ప్రింటింగ్

12 శాతం

5 శాతం

ప్రభుత్వ కాంట్రాక్టులు(ఎక్కువ మంది కార్మికులు అవసరం)

12 శాతం

5 శాతం

మనుషులు తయారుచేసే నూలు

18 శాతం

12 శాతం

స్టేషనరీ వస్తువులు

18 శాతం

12 శాతం

నేలపై పరిచే బండలు(గ్రానైట్, మార్బుల్ మినహా)

18 శాతం

12 శాతం

నీటి పంపులు, డీజిల్ ఇంజిన్ల విడిభాగాలు

28 శాతం

18 శాతం

ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ-వేస్ట్)

28 శాతం

5 శాతం

క్విక్ రివ్యూ:
ఏమిటి : 27 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : జీఎస్టీ మండలి
ఎందుకు : వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు

కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు
దేశంలో సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వరల్డ్ పోస్ట్ డేను పురస్కరించి అక్టోబర్ 9న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశంలో ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మొదట 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించనున్నామని చెప్పారు. అలాగే.. తపాలా శాఖ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు

బంబార్డియర్, స్పైస్‌జెట్ భారీ డీల్
 Current Affairs కెనడాకు చెందిన బంబార్డియర్.. దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సుమారు రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాలను బంబార్డియర్ సరఫరా చేయనుంది. తొలుత 25 విమానాలను స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తుండగా, మరో 25 విమానాలను కొనుగోలు చేసే హక్కులను కలిగి ఉంటుంది. వీటి సరఫరా అనంతరం 90 సీట్ల టర్బో ప్రాప్ విమానాలను నడిపే ప్రపంచంలో తొలి విమానయాన సంస్థగా స్పైస్‌జెట్ నిలుస్తుంది. అయితే, ఇందుకు నియంత్రణ సంస్థల ధ్రువీకరణ రావాల్సి ఉందని బంబార్డియర్ తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బంబార్డియర్, స్పైస్‌జెట్ భారీ డీల్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎందుకు : రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాల సరఫరా కోసం 

భారత రుణ భారం 485.8 బిలియన్ డాలర్లు 
భారత విదేశీ రుణ భారం ఈ ఏడాది జూన్ ముగిసే నాటికి 485.5 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికం ముగింపు(మార్చి నెలాంతంలో 472 బిలియన్ డాలర్లు) పోల్చితే 3 శాతం మేర ఈ భారం పెరిగిందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ డెట్ విభాగంలోకి భారీగా రావడం.. త్రైమాసికంలో విదేశీ రుణం 3 శాతం పెరగడానికి కారణమని వివరించింది. జీడీపీ నిష్పత్తిలో విదేశీ రుణం 20.3 శాతంగా ఉందని తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ విదేశీ రుణ భారం 485.8 బిలియన్ డాలర్లు 
ఎప్పుడు : 2017 జూన్ నాటికి
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా

పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ‘ఎక్సైజ్’ సుంకం తగ్గింపు 
లీటర్ డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు అక్టోబర్ 3న కేంద్ర ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ.2 చొప్పున తగ్గాయి. ఈ ధరలు అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం ఇదే తొలిసారి. తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.26 వేల కోట్లు లోటు ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 ఎక్సైజ్ సుంకం తగ్గింపు
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

భారత వృద్ధి రేటును తగ్గించిన ఏడీబీ
2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) తగ్గించింది. జూలైతో పోల్చితే 0.4 శాతం తగ్గించి ఏడు శాతానికి పరిమితం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ వృద్ధి అంచనాలను 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఆసియా అభివృద్ధి అంచనాలపై సెప్టెంబర్ 25న నివేదికను విడుదల చేసింది.

¤¤¤ఆర్థిక వ్యవహారాలు
అక్టోబరు  2017 సైన్స్ & టెక్నాలజీ 2018 మార్చిలో చంద్రయాన్-2 
 ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్ మిషన్.. చంద్రయాన్-2పై కేంద్ర అంతరిక్ష, అణు, ఇంధనశాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. చంద్రయాన్-2 ప్రయోగం 2018 మార్చిలో ఉంటుందని ప్రకటించారు. జీఎస్‌ఎల్వీ ఎంకే-2 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరుగుతుంది. 
ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుని ఉపరితలంపై సంచరించగల ఒక మోటార్ జెడ్ రోబోట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి ఒక రోవర్ చంద్రుడిపై చక్రాలతో నడుస్తూ మృత్తిక, రాళ్ళ నమూనాలను సేకరించి వాటి రసాయన విశ్లేషణలను జరిపి, చంద్రుడి చుట్టూ ఎత్తయిన కక్ష్యలో పరిభ్రమించే చంద్రయాన్-2కు అందిస్తుంది. చంద్రయాన్-2 నుంచి సమాచారం గ్రౌండ్‌స్టేషన్‌లోని యాంటెనా అందుకుంటుంది. 2020 కల్లా చంద్రుడిపైకి ఒక మానవ సహిత ప్రయోగాన్ని చేపట్టాలని కూడా ఇస్రో భావిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చంద్రయాన్ - 2
ఎప్పుడు : 2018లో 
ఎవరు : ఇస్రో 
ఎందుకు : చంద్రుడి ఉపరితల వాతావరణాన్ని పరిశోధించేందుకు 

చైనాలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభం
ప్రపంచంలోనే తొలి పర్యావరణహిత, హైడ్రోజన్‌తో నడిచే ట్రామ్‌ను చైనా అక్టోబర్ 27న ప్రారంభించింది. దీని ద్వారా నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్‌‌సలోని తంగ్షన్‌లో కమర్షియల్ సర్వీసులను అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ట్రామ్‌లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్‌ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న ట్రామ్ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభం 
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎక్కడ : చైనాలో 
ఎందుకు : ప్రజా రవాణా కోసం 

‘డెత్ జోన్’లోకి వెళ్లే డ్రోన్లను పరీక్షించిన చైనా
ఎక్కువ ఎత్తుకు వెళ్లే గూఢచార డ్రోన్‌ను చైనా విజయవంతంగా పరీక్షించింది. క్రికెట్ బ్యాట్ సైజులో ఉండే ఈ డ్రోన్ రక్షణ రంగంలో ఎంతగానో సహాయపడనుంది. సముద్రమట్టానికి 20 కిలోమీటర్ల ఎత్తు పైనుంచి అంతరిక్ష సమీప ప్రాంతం ప్రారంభమవుతుంది. అక్కడ గాలి పలుచగా ఉండటం, చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో ఆ జోన్‌ను డ్రోన్లకు ‘డెత్ జోన్’గా పరిగణించేవారు. తక్కువ గాలి ఉండటంతో అక్కడ డ్రోన్ ఎగరడం సాధ్యం కాదు. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డ్రోన్‌లోని బ్యాటరీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు విఫలమయ్యే ప్రమాదముంది. అయితే చైనా తయారు చేసిన ఈ డ్రోన్ ఆ పరిస్థితులను తట్టుకుంటుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎక్కువ ఎత్తుకు వెళ్లే డ్రోన్లను పరీక్షించిన చైనా 
ఎప్పుడు : అక్టోబర్ 31 
ఎందుకు : గూఢచర్యం కోసం

రోబోలకు అనువైన ‘చర్మం’
 మనుషుల రోజువారీ పనులను చేసేందుకుగాను రోబోలకు దానికనుగుణంగా ఉండే చర్మాన్ని పరిశోధకులు రూపొందించారు. ఈ చర్మాన్ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ)కి చెందిన 45 మంది ప్రొఫెసర్లు తయారు చేసినట్లు యూడబ్ల్యూ ప్రొఫెసర్ జోనాథన్ పోస్నర్ తెలిపారు. ఈ చర్మాన్ని తొడిగిన రోబోలు మనుషుల రోజువారీ పనులను తేలికగా, ఆటంకాలు లేకుండా చేసేస్తాయని చెప్పారు. వస్తువుల స్వభావాలను బట్టి ఈ చర్మం రోబోలకు సంకేతాలు అందిస్తుందని, దానికి తగ్గట్లుగా రోబో పనిచేస్తుందని పోస్నర్ తెలిపారు. ఈ చర్మం అక్టోబర్ నెలాఖరు నుంచి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రోబోలకు అనువైన చర్మాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు 
ఎప్పుడు : అక్టోబర్ 18 
ఎవరు : యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ 
ఎందుకు : మనుషుల రోజువారీ పనులను చేసేందుకుగాను 

అంతరిక్ష కేంద్రంలో ‘అలమర’
అంతరిక్ష కేంద్రంలోకి అత్యాధునిక అలమర (వస్తువులు దాచి ఉంచుకునే పెట్టె)ను శాస్త్రవేత్తలు త్వరలో తీసుకువెళ్లనున్నారు. హెచ్‌టీవీ-7గా పిలిచే ఈ అలమరను 2018 చివరి కల్లా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశపెట్టనున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెల్లడించింది. సైంటిస్టులు అంతరిక్ష కేంద్రంపైకి పరిశోధనలకు అవసరమయ్యే పరికరాలను తీసుకువెళుతుంటారు. అయితే అక్కడ మరిన్ని వస్తువులు దాయడానికి వీలుగా ఆధునిక పరికరాలతో అలమరను తయారు చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది అలమరలను పొందుపరిచే వీలున్నట్లు నాసా వెల్లడించింది. ఈ అలమరలను బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్నట్లు తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతరిక్ష కేంద్రంలోకి హెచ్‌టీవీ - 7 అలమర 
ఎప్పుడు : 2018 చివరి నాటికి 
ఎవరు : నాసా 
ఎందుకు : పరిశోధనలకు కావాల్సిన వస్తువులను దాయడానికి 

95% ప్లాస్టిక్ వ్యర్థాలకు పది నదులే కారణం 
ప్రపంచ వ్యాప్తంగా కేవలం పది నదుల ద్వారానే 88-95 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయని తేలింది. ఈ జాబితాలో గంగా, సింధు సహా 8 నదులు ఆసియాలో ఉండగా, మరో రెండు నదులు ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నాయి. సరైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు పాటించకపోవడంతో ఏటా 5 ట్రిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ సముద్రంలో చేరుతోందని ఈ పరిశోధనలో పాల్గొన్న జర్మనీకి చెందిన శాస్త్రవేత్త డా.క్రిస్టియన్ ష్మిత్ తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా 57 నదుల్లో, 79 చోట్ల నమూనాలు సేకరించామన్నారు. 
ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌లో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్‌‌స, వియత్నాం, శ్రీలంకల వాటాయే 50 శాతానికిపైగా ఉంటుందన్నారు. 
వ్యర్థాలను చేరవేస్తున్న తొలి 10 నదులు: 
యాంగ్జీ, సింధు, యెల్లో రివర్, హైహీ (ఆసియా); నైలు (ఆఫ్రికా); గంగా, పెరల్, అముర్ (ఆసియా); నైజర్ (ఆఫ్రికా), మెకాంగ్ (ఆసియా). 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 95% ప్లాస్టిక్ వ్యర్థాలకు పది నదులే కారణం 
ఎప్పుడు : అక్టోబర్ 18 
ఎవరు : జర్మనీ శాస్త్రవేత్త డా.క్రిస్టియన్ ష్మిత్

భూమికి సమీపంగా ‘2012 టీసీ4’ ఉల్క 
శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగానే ‘2012 టీసీ4’ ఉల్క భూమికి సమీపంగా దూసుకెళ్లింది. అంటార్కిటికా మీదుగా అక్టోబర్ 12న ఈ శకలం భూమిని దాటుకుంటూ వెళ్లిపోయింది. ఐదేళ్ల క్రితం అమెరికాలోని హవాయి హలియకల అబ్జర్వేటరీలోని పాన్-స్టార్స్ టెలిస్కోప్ ద్వారా ‘2012 టీసీ4’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత ఈ శకలం సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అదృశ్యమైంది. మళ్లీ ఈ ఏడాది జూలైలో చంద్రుని కక్ష్యలో కనిపించింది. 
భూమికి ఎంత దగ్గరగా..
యాభై నుంచి వంద అడుగుల పరిమాణంలో ఉన్న ఈ శకలం గంటకు దాదాపు 16,000 మైళ్ల వేగంతో అంటే సెకనుకు 4.5 మైళ్ల వేగంతో అంటార్కిటికాకు 27 వేల మైళ్ల ఎత్తు నుంచి దూసుకెళ్లింది. ఇది ఎంతో దూరంలో ఉంది కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంతరిక్ష ప్రమాణాల ప్రకారం భూమి-చంద్రుడి మధ్యలో ఎనిమిదో వంతు దూరంలోనే ఉన్నట్లుగా భావించాలి. 
ఎదుర్కోగలమా ? 
భూమిపై పడే ఉల్క లేదా గ్రహ శకలాన్ని ఉపగ్రహంతో పేల్చేసే సామర్థ్యం మనకుంది. 2004లో ‘డీప్ ఇంపాక్ట్’ మిషన్ సందర్భంగా నాసా అదే చేసింది. ఇటువంటి ఉల్కలను గురి చూసి కొట్టడం కొంత కష్టం. పెద్ద పరిమాణంలో ఉన్న శకలాన్ని గుర్తించడంతో పాటు సరిగ్గా మధ్యలో రాకెట్‌తో ఢీకొట్టించడమన్నది కొంతమేర సవాలుగా నిలిచినప్పటికీ, 100 నుంచి 200 మీటర్ల వైశాల్యమున్న శకలాల్ని మాత్రం పేల్చేసేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధంగానే ఉన్నాయని శాస్త్రవేత్త డెట్‌లెఫ్ చెప్పారు. 

ఒంగోలు జాతి వృద్ధి కోసం టెస్ట్‌ట్యూబ్ విధానం
ఒంగోలు జాతి ఆవుల సంతతిని పెంచేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం పిండ మార్పిడి ప్రక్రియ(ఐవీఎఫ్) ద్వారా టెస్ట్ ట్యూబ్ దూడలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందుకుగానూ దేశవ్యాప్తంగా 15 లేబొరేటరీలను ఎంపిక చేయగా.. అందులో గుంటూరు జిల్లా లాం ఫాంలోని పిండోత్పత్తి జీవసాంకేతిక ప్రయోగశాల కూడా చోటు దక్కించుకుంది. 
ఐవీఎఫ్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. రాష్ట్రంలో 2.5 లక్షల వరకు ఆవులుంటాయని అంచనా. వీటిలో అనుకూలమైన వాటిని ఎంపిక చేసి, సమాచారం అందిస్తే.. పిండ మార్పిడి చేస్తారు. 
ఒంగోలు జాతి సంరక్షణ ఎందుకు?
ఒంగోలు జాతి ప్రపంచంలోనే పేరెన్నికగన్న పశువులు. ఇవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా అధికం. ఒక ఈత కాలంలో 2,500 లీటర్ల వరకు పాలిస్తాయి. ఇది గుర్తించిన బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో తదితర దేశాలు మన దేశం నుంచి వీటిని దిగుమతి చేసుకోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో మన దేశంలో ఒకప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఒంగోలు జాతి పశువుల సంఖ్య.. క్రమేపీ తగ్గిపోయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం వీటిని సంరక్షించాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఒంగోల్ జాతి ఆవుల వృద్ధి కోసం టెస్ట్‌ట్యూబ్ విధానం 
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 15 పరిశోధనశాలల్లో 

అంతరిక్ష రేడియేషన్‌పై నాసా కొత్త సాంకేతికత 
భూమి నుంచి అంగారకుడికి చేరుకోవడంలో ముఖ్యమైన అడ్డంకి అంతరిక్ష రేడియేషన్‌ను అడ్డుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్త సాంకేతికతను రూపొందిస్తోంది. దీంతో అంగారకుడిపైకి సురక్షితంగా, విజయవంతంగా చేరుకునే వీలు కలుగనుంది. భూమిపై రేడియేషన్ కన్నా అంతరిక్ష రేడియేషన్ చాలా ప్రమాదకరమైనదని నాసా పేర్కొంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) రక్షిత భూఅయస్కాంత క్షేత్రంలోనే ఉన్నప్పటికీ అక్కడి వ్యోమగాములు భూమిపై కన్నా పది రెట్ల ఎక్కువ రేడియేషన్‌కు గురవుతున్నారని చెప్పింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతరిక్ష రేడియేషన్‌ను అడ్డుకునేందుకు కొత్త సాంకేతికత రూపకల్పనపై దృష్టి 
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : నాసా 

నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ కిల్తాన్ 
సముద్రపు అడుగు భాగం లో ఉన్న సబ్‌మెరైన్లనైనా గుర్తించి, మట్టుపెట్టే అధునాత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్.. భారత నౌకాదళంలో చేరింది. ఈ మేరకు అక్టోబర్ 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డులో యుద్ధ నౌకను ప్రారంభించారు. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 
ప్రాజెక్టు-28 కింద నిర్మించ తలపెట్టిన నాలుగు యాంటీ సబ్‌మెరెన్ యుద్దనౌకల్లో ఐఎన్‌ఎస్ కిల్తాన్ మూడోది. ఐఎన్‌ఎస్ కమోర్తా, ఐఎన్‌ఎస్ కద్మత్ నౌకలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో నాలుగో యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరత్తి కూడా సిద్ధం కానుంది. 1971లో ఇండో పాక్ యుద్ధ సమయంలో నిరుపమాన సేవలందించిన యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్‌ను 1987లో డీ కమిషన్ చేశారు. మళ్లీ ఇదే పేరుతో నౌకను సిద్ధం చేశారు. 
కిల్తాన్ ప్రత్యేకతలు 
ఐఎన్‌ఎస్ కిల్తాన్.. ఐఎన్‌ఎస్ కమోర్తా కంటే శక్తిమంతమైంది. తొలిసారి పూర్తిస్థాయి కార్బన్ ఫైబర్ కాంపొజిట్ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు.అన్ని ప్రధాన ఆయుధాల్ని, సెన్సార్లను సముద్రపు జలాల్లో ట్రయల్ రన్ నిర్వహించి.. షిప్ యార్డ్ ద్వారా నౌకాదళానికి అప్పగిస్తున్న మొదటి యుద్ధ నౌక.సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం వల్ల సముద్ర జలాల్లో వెళ్తున్నప్పుడు సబ్ మెరైన్‌లు సైతం దీని ధ్వనితరంగాలను కనిపెట్టడం దాదాపు అసాధ్యం.109 మీటర్ల పొడవు, 3,500 టన్నుల బరువున్న ఐఎన్‌ఎస్ కిల్తాన్ 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. నిరాటంకంగా 3,450 నాటికల్ మైళ్లు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం.భారీ టార్పెడోలు, ఏఎస్‌డబ్ల్యూ రాకెట్లు, 76 మిమీ క్యారిబర్ మీడియం రేంజ్ తుపాకీలు, క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ కలిగిన 2 మల్టీ బ్యారెల్ తుపాకీలున్న సెన్సార్ సూట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.మిస్సైల్ డెకోయ్ రాకెట్లు, ఎలక్ట్రానిక్ సపోర్ట్ మేజర్ వ్యవస్థ, ఎయిర్ సర్వైవలెన్‌‌స రాడార్ వ్యవస్థతో పాటు ఏఎస్‌డబ్ల్యూ హెలికాప్టర్ కూడా ఇందులో ఉంటుంది.క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఎన్‌ఎస్ కిల్తాన్ జలప్రవేశం 
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ 
ఎక్కడ : విశాఖపట్నం 
ఎందుకు : ప్రాజెక్టు - 28లో భాగంగా 

ఏపీ పరిధిలోని నల్లమలలో 45 పెద్ద పులులు
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ నుంచి కర్నూలు జిల్లా ఆత్మకూరు వరకు సుమారు 3.50 లక్షల చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో 45 పెద్ద పులులు ఉన్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. నల్లమలలో పులుల సంరక్షణ కోసం గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలో 24 బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి 120 మంది గిరిజన యువకులను ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చి ముఖ్యమైన ప్రాంతంలో కాపలాగా ఏర్పాటు చేశారు. వీరికి వైర్‌లెస్ వాకీ టాకీలు అందించి, పులులు సంచరించే ముఖ్య ప్రాంతాల వద్ద, చెట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. వారం రోజుల క్రితం పులులను లెక్కించటంతో 45 లెక్క తేలినట్లు మార్కాపురం డీఎఫ్‌ఓ జయచంద్రారెడ్డి అక్టోబర్ 14న వెల్లడించారు. చిరుత పులులు సుమారు 100 వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏపీ పరిధిలోని నల్లమలలో 45 పెద్ద పులులు 
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : ఏపీ అటవీశాఖ

తొమ్మిదో గ్రహం ‘ప్లానెట్ 9’ ఉండొచ్చు: నాసా
ఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని గ్రహమైన ‘ప్లానెట్ 9’ఉందని, బహుశా భూమి ద్రవ్యరాశి కన్నా 10 రెట్లు, సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఉన్న దూరం కన్నా 20 రెట్ల దూరం ఉండొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మన సౌర కుటుంబంలో ఆచూకీ తెలియకుండా పోయిన ‘సూపర్ ఎర్త్’ఈ ప్లానెట్ 9 కావొచ్చని భావిస్తున్నారు. ప్లానెట్ 9 భూమి ద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉన్నా.. యురేనస్, నెప్ట్యూన్ కన్నా తక్కువగా ఉందని వివరించారు. 
ప్లానెట్ 9 ఉందనడానికి 5 రకాల రుజువులు ఉన్నాయని గుర్తించినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ కొన్‌స్టాంటిన్ బాటీజిన్ తెలిపారు. ప్లానెట్ 9 మన సౌర కుటుంబం దిశగా దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట వంగి ఉండొచ్చని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి ఎలిజబెత్ బెయిలీ పేర్కొన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్లానెట్ - 9 ఉండొచ్చని వెల్లడి 
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : నాసా 

ఎన్‌ఆర్‌ఓఎల్-52 ఉపగ్రహాన్ని ప్రయోగించిన యూఎస్ 
రహస్య గూఢచర్య ఉపగ్రహం ఎన్‌ఆర్‌ఓఎల్-52 ను అమెరికా అట్లాస్ - 5 రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కానవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం దేని కోసం పనిచేస్తుంది తదితర వివరాలను అమెరికా ప్రకటించలేదు. అయితే.. ఇది క్షిపణులకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు, అణు పేలుళ్ల గుర్తింపు, ఫోటోలతో నిఘా, రాఢార్ మేనేజింగ్ వంటి పనుల్ని నిర్వహిస్తుందని సమాచారం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎన్‌ఆర్‌ఓఎల్-52 ఉపగ్ర హ ప్రయోగం 
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : అమెరికా

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ఆదిత్య-ఎల్ 1
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నద్ధమవుతోంది. ఇందుకోసం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. భారత ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతిరావడంతో 2018-19లో దీనిని ప్రయోగించే అవకాశం ఉంది. 
బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలో ఆదిత్య-ఎల్1ను తయారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉపగ్రహంలో యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలను (పేలోడ్‌‌స) అమర్చి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు-1 (ఎల్-1)లోకి చేరుస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడ్ని నిరంతరం పరిశీలించడానికి వీలవుతుంది. 
సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్య గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ (అంటే 999726.85 డిగ్రీల సెల్సియస్) వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడంలేదు. దీంతో సౌర గోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై ఆదిత్య-ఎల్1 ద్వారా పరిశోధనలు చేయడానికి ఇస్రో నడుం బిగించింది. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు కాంతి మండలం (ఫొటోస్ఫియర్), వర్ణ మండలాలను (క్రోమోస్ఫియర్) అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు. వచ్చే ఏడాదికల్లా దీనిని సిద్ధం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆదిత్య - ఎల్ 1ను రూపొందించనున్న ఇస్రో 
ఎక్కడ : బెంగళూరులో 
ఎందుకు : సూర్యుడిపై పరిశోధనలకు

రక్తదానం ప్రోత్సాహానికి ఫేస్‌బుక్‌లో సౌకర్యం 
 రక్తదాతలతో ప్రజలు, బ్లడ్ బ్యాంక్‌లు, ఆస్పత్రులు సులువుగా అనుసంధానమయ్యేలా తన వెబ్‌సైట్లో ఫేస్‌బుక్ కొత్త సదుపాయాన్ని పొందుపరిచింది. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సదుపాయం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. రక్తం అసవరమున్న వారు ఒక ప్రత్యేక మెసేజ్‌లో బ్లడ్ గ్రూప్, ఆస్పత్రి పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాల్ని పొందుపరిచి పోస్ట్ చేయాలి. వెంటనే ఫేస్‌బుక్ సమీపంలోని రక్తదాతల వివరాల్ని సేకరించి వారికి అందచేస్తుంది. అలాగే ఖాతాదారుల న్యూస్ ఫీడ్‌లో రక్తదాతగా నమోదు చేయించుకోవాలని కూడా మెసేజ్‌ను ప్రదర్శిస్తుంది. తొలుత ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో దీన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రక్తదాన ప్రోత్సాహానికి ప్రత్యేక సౌకర్యం 
ఎప్పుడు : సెప్టెంబర్ 28 
ఎవరు : ఫేస్‌బుక్ 
ఎక్కడ : భారత్‌లో 

గురుత్వ తరంగాలను మళ్లీ గుర్తించిన శాస్త్రవేత్తలు 
విశ్వంలో జనించి కోట్లాది కాంతి సంవత్సరాలు ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాలను నాలుగోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణ బిలాలు ఢీకొన్న సమయంలో ఈ శక్తిమంతమైన తరంగాలు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ తరంగాలను అమెరికాలోని వాషింగ్టన్, లూసియానాల్లోని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లు, యూరప్‌లోని ఇటలీలో ఏర్పాటు చేసిన విర్గో అబ్జర్వేటరీ తొలిసారి సంయుక్తంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రెండు కృష్ణబిలాలు ఢీకొన్న అనంతరం ఏర్పడ్డ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 53 రెట్లు ఎక్కువ. 
ఎప్పుడు కనుగొన్నారు 
ఈ తరంగాలను 2015 సెప్టెంబర్‌లో తొలిసారి, అదే ఏడాది డిసెంబర్‌లో రెండోసారి గుర్తించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో మూడోసారి గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. తాజాగా ఆగస్ట్ 14న లిగో శాస్త్రవేత్తలు, యూరప్‌కు చెందిన విర్గో పరిశోధకులతో సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. 
భారతీయుల కీలక పాత్ర 
గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లిగో ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 13 కేంద్రాల్లో 67 మంది భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు లిగో-ఇండియాకు నేతృత్వం వహిస్తున్న సంజీవ్ దురంధర్ తెలిపారు. సీఎంఐ-చెన్నై, ఐసీటీఎస్- బెంగళూరు, ఐఐఎస్‌ఇఆర్-కోల్‌కతా, ఐఐఎస్‌ఇఆర్-తిరువ నంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్‌ఆర్‌సీఏటీ ఇండోర్, టీఐఎఫ్‌ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ తదితర చోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 4వ సారి గురుత్వాకర్షణ తరంగాల గుర్తింపు 
ఎవరు : లిగో శాస్త్రవేత్తలు, యూరప్‌కు చెందిన విర్గో పరిశోధకులు 
ఎక్కడ : భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో 

చైనా సైన్యంలోకి జే - 20 యుద్ధ విమానం 
శత్రువుల రాడార్లకు చిక్కకుండా దాడిచేసే సామర్థ్యం కలిగిన స్టెల్త్ ఫైటర్ జే-20 అనే యుద్ధ విమానాన్ని చైనా సైన్యంలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దీని సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఇప్పటిదాకా పలు రకాల పరీక్షలు నిర్వహించినట్లు చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. జే-20 చైనా దేశపు నాలుగోతరం యుద్ధవిమానం. 2011లో దీనిని తొలిసారిగా పరీక్షించారు. మరోవైపు ఈ విమానాలను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ ఆసక్తి కనబరుస్తోంది. 

అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అమెరికా, రష్యా ఒప్పందం 
చంద్ర మండల కక్ష్యలో తొలి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో సహకారానికి అమెరికా, రష్యా సెప్టెంబర్ 27న ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంగారకుడిపైకి మానవులను పంపడం, అంతరిక్ష పరిశోధనలను మరింత లోతుగా ర్వహించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ ఒడంబడిక చేసుకున్నారు. అంతరిక్ష కేంద్రాన్ని నాసా సారథ్యంలో ఏర్పాటు చేస్తారు. 

ప్రపంచంలోనే తొలి ఉభయచర సముద్ర డ్రోన్ 
ప్రపంచంలోనే తొలి మానవ రహిత ఉభయచర విమాన డ్రోన్‌ను చైనా తయారుచేసింది. ఇది జలాంతర్గాములను గుర్తించడంతోపాటు దీవులకు సరుకులను చేరవేయగలదు. షాంఘైలోని యూవీఎన్ ఇంటలిజెన్స్ సిస్టమ్స్ అనే ప్రైవేట్ సంస్థ ఈ వైమానిక వాహనాన్ని రూపొందించింది. యూ650 వాహనాల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఆ కంపెనీ సెప్టెంబర్ 25న ప్రకటించింది. 

అంగారకుడిపై సౌర తుపాను 
అంగారక గ్రహంపై సెప్టెంబర్ 11న బలమైన సౌర తుపాను సంభవించినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తుపాను వల్ల గ్రహంపై రేడియేషన్ స్థాయిలు రెట్టింపయ్యాయని తెలిపారు. తుపాను సమయంలో ఏర్పడిన కాంతి పుంజం నాసా ప్రయోగించిన మావెన్ ఆర్బిటర్ గతంలో పరిశీలించిన కాంతి పుంజాల కన్నా 25 రెట్లు ప్రకాశవంతమైందని వివరించారు. మావెన్ ఆర్బిటర్ 2014 నుంచి అంగారక గ్రహం వాతావరణానికి, సౌర గాలులకు మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తోంది.

■అక్టోబర్ 2017 అవార్డ్స్
ఏపీ ఓబీఎంఎస్‌కు నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డు
కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించే ‘నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డ్-2017’కు ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం (ఏపీ ఓబీఎంఎస్) అప్లికేషన్ ఎంపికైంది. ఈ - గవర్నెన్‌‌సలో ఉత్తమ కంప్యూటర్ అప్లికేషన్‌కు ఈ అవార్డు అందజేస్తారు. ప్రస్తుతం ఓబీఎంఎస్‌కు ఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని కార్పొరేషన్ల సమాచారాన్ని ఓబీఎంఎస్‌లో పొందుపరుస్తారు. లబ్ధిదారుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. లబ్ధిదారుడు యూనిట్‌ను ఎలా ఉపయోగించుకుంటున్నాడు, బ్యాంకు లోన్ ప్రతినెలా చెల్లిస్తున్నాడా లేదా అనే వివరాలు కూడా పొందిపరిచే విధంగా యాప్‌ను అప్‌డేట్ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏపీ ఓబీఎంఎస్‌కు నిహిలెంట్ ఈ గవర్నెన్‌‌స అవార్డు - 2017
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా 
ఎందుకు : ఈ - గవర్నెన్‌‌సలో ఉత్తమ కంప్యూటర్ అప్లికేషన్‌కు గాను 

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ఐపీపీఏఐ అవార్డు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)కు ఇన్నోవేషన్ కేటగిరీలో ‘ఐపీపీఏఐ పవర్ అవార్డు- 2017‘ లభించింది. అక్టోబర్ 28న కర్ణాటకలోని బెల్గామ్‌లో 18వ రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ఐపీపీఏఐ అవార్డు 
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎక్కడ : 18వ రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ సదస్సు

గిరీష్ కర్నాడ్‌కు టాటా లిట్ లైఫ్‌టైమ్ అవార్డు
 ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీష్ కర్నాడ్‌ను 2017 సంవత్సరానికి గానూ టాటా లిటరేచర్ లైవ్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ ద ఫెర్ఫార్మింగ్ ఆర్‌‌ట్స (ఎన్‌సీపీఏ)లో నవంబర్ 19న జరగనున్న సాహిత్య వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాటా లిట్ లైఫ్ టైమ్ అవార్డు - 2017
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : గిరీష్ కర్నాడ్

జార్జ్ శాండర్స్‌కు బుకర్ ప్రైజ్
 అమెరికా రచయిత జార్జ్ శాండర్స్ (58) ఈ ఏడాది మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. శాండర్స్ రచించిన ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవలకు ఈ అవార్డును ప్రకటించారు. పురస్కారం కింద ఆయన 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందుకుంటారు. దివంగత అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కొడుకు విల్లీ 11 ఏళ్లకే టైఫాయిడ్ వ్యాధిబారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. లింకన్ జీవితంలోని ఆ విషాదంనాటి సంఘటనల సమాహారమే ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవల. ఈ నవల కథనం ఆద్యంతం వాస్తవిక కోణంలో ఎంతో అద్భుతంగా ఉందని బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతల మండలి చైర్మన్ లోలా పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మేన్ బుకర్ ప్రైజ్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : విజేత అమెరికా రచయిత జార్జ్ శాండర్స్ 
ఎందుకు : ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవలకు గాను 

భారత సంతతి బాలికకు యువ శాస్త్రవేత్త అవార్డు
అమెరికాలో అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా పదకొండేళ్ల గీతాంజలిరావు అనే భారత సంతతి బాలిక అవార్డు సాధించింది. కొలరాడో ప్రాంతంలో నివసించే గీతాంజలి నీటిలో సీసం కాలుష్యాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఓ సెన్సర్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్’లో ప్రథమ స్థానం దక్కింది. రెండేళ్ల కింద మిషిగన్ ప్రాంతంలోని ఫ్లింట్ వద్ద నీటి కాలుష్యంతో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనతో కలత చెందిన గీతాంజలి.. కాలుష్య నివారణకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత సంతతి బాలిక గీతాంజలిరావుకి యువ శాస్త్రవేత్త అవార్డు 
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎక్కడ : అమెరికా
ఎందుకు : డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ పోటీల్లో 

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు ఐపీపీఐ పురస్కారం
తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)కు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐపీపీఐ) పురస్కారం లభించింది. సౌరవిద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో యాజమాన్య పద్ధతుల అమలు, ఎల్‌ఈడీ లైట్ల పంపిణీ, పంపిణీ వ్యవస్థలో హెచ్‌వీడీ ఎస్ పద్ధతి అమలు, పంపిణీ నష్టాల తగ్గింపునకు తీసుకున్న చర్యలకు ఈ పురస్కారం లభించినట్లు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అక్టోబర్ 22న పేర్కొంది.

ఎన్‌ఐఎన్ డెరైక్టర్‌కు ‘ప్రొఫెసర్ నేవిన్ స్క్రీమ్‌షా’ అవార్డు 
ఆహార పదార్థాలపై చేసిన నిరంతర పరిశోధనలకు హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ ఎల్.లోంగోవాకు అంతర్జాతీయ అవార్డు లభించింది. ఆహార పదార్థాలు, పోషక విలువలపై పరిశోధనలు సాగిస్తున్న వారికి రోమ్‌కు చెందిన ఇన్‌ఫుడ్‌‌స, ఎఫ్‌ఏఓ సంస్థలు ‘ప్రొఫెసర్ నేవిన్ స్క్రీమ్‌షా’అవార్డు పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి. ఈ ఏడాది ఈ అవార్డుకు లోంగోవా ఎన్నికయ్యారు. ఆహార పదార్థాల భద్రత బయోడైవర్సిటీ అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎన్‌ఐఎన్ డెరైక్టర్ ఎల్.లోంగోవాకు ‘ప్రొఫెసర్ నేవిన్ స్క్రీమ్‌షా’ అవార్డు 
ఎప్పుడు : అక్టోబర్ 12 
ఎవరు : ఇన్‌ఫుడ్స్, ఎఫ్‌ఐఓ సంస్థలు, రోమ్ 

గ్రామీ అవార్డుల రేసులో ‘అనంత’ ఆల్బమ్
 ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ విడుదల చేసిన ‘అనంత వాల్యూమ్-1 మెస్ట్రోస్ ఆఫ్ ఇండియా’ శాస్త్రీయ సంగీత ఆల్బమ్ 60వ గ్రామీ అవార్డుల ‘వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్’ పోటీకి ఎంపికైంది. ప్రసిద్ధ ఘటం విద్వాంసుడు పండిట్ విక్కు వినాయక్ రామ్ ఆధ్వర్యంలో మూడు తరాలకు చెందిన విద్వాంసులు పండిట్ విక్కు వినాయక్ రామ్, సెల్వగణేశ్ స్వామినాథన్‌ల సహకారంతో సిద్ధాంత్ భాటియా స్వరపరచిన ‘గురుస్తోత్రం’ అనే పాట గాత్రవాద్య విభాగంలో పోటీకి ఎంపికైనట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆల్బమ్ 30 మంది సంగీత దిగ్గజాల గాత్ర, స్వర సహకారంతో 300 నిమిషాల నిడివితో ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ సంగీత సంకలనంగా నిలిచింది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ బాలల విద్య, సంక్షేమ పథకాలకు వినియోగించనుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 60వ గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన భారతీయ ఆల్బమ్ 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : ‘అనంత వాల్యూమ్-1 మెస్ట్రోస్ ఆఫ్ ఇండియా’ 

ఆక్టా ఉత్తమ ఆసియా చిత్రం రేసులో దంగల్, పింక్, కసవ్
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ అకాడమి ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ ఆర్ట్స్(ఆక్టా) అందించే ఉత్తమ ఆసియా చిత్రం అవార్డుకు భారత్ నుంచి మరాఠీ చిత్రం ‘కసవ్-టర్టల్’, హిందీ చిత్రాలు ‘దంగల్’ ‘పింక్’ నామినేట్ అయ్యారుు. చైనా నుంచి ‘అవర్ టైమ్ విల్ కమ్’ ‘ఐయామ్ నాట్ మేడమ్ బోవరీ’ ‘ఉల్ఫ్ వారియర్-2’ ఫిలిప్పైన్‌‌స నుంచి ‘బర్డ్ షాట్’ దక్షిణ కొరియా నుంచి ‘ట్రైన్ టు బుసాన్’ జపాన్‌కు చెందిన ‘యువర్ నేమ్’ చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో డిసెంబర్ 6న జరిగే ఏడవ ఆక్టా ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. విజేతలను ఎంపిక చేసే జ్యూరీకి ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డ్ విజేత రస్సెల్ క్రోవ్ నేతృత్వం వహిస్తుండగా, భారత్‌కు చెందిన అనుపమ్ ఖేర్, షబానా అజ్మీ జ్యూరీ సభ్యులుగా వ్యవహరిం చనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆక్టా ఆసియా ఉత్తమ చిత్రం నామినేషన్స్ 
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : భారత్ నుంచి నామినేట్ అయిన మరాఠీ చిత్రం ‘కసవ్-టర్టల్’, హిందీ చిత్రాలు ‘దంగల్’ ‘పింక్’ 

గంగానది ప్రక్షాళనకు ఎన్‌జేఎస్‌కు బీ ఇన్‌స్పైర్డ్ పురస్కారం
గంగానది పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఎన్‌జేఎస్ సంస్థను సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. వారణాసిలోని గంగానదిలో వ్యర్థాలను తొలగిస్తూ, జీవావరణాన్ని కాపాడుతున్న పుణేకు చెందిన ఎన్‌జేఎస్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను బీ ఇన్‌స్పైర్డ్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ఈ సంస్థ ఎన్‌జేస్ కన్సల్‌టెంట్స్ ఆఫ్ జపాన్, ఇండియాకు చెందిన ఐసీఆర్‌ఏ , టాటా కన్సెల్టింగ్ సంస్థలతో కలిసి గంగానది ప్రక్షాళన ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుంచి 400 సంస్థలు పోటీపడగా ఎన్‌జేఎస్ పురస్కారాన్ని గెలుచుకుంది. 
గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.496.90కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులో భాగంగా నీటి నాణ్యతను పెంచడం, నదిలోని జీవావరణాన్ని కాపాడడం, నది మరింత కాలుష్యానికి గురికాకుండా చూడడం కోసం ఎన్‌జేఎస్ పనిచేస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎన్‌జేస్ సంస్థ బీ ఇన్స్‌పైర్డ్ అవార్డు 
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : సింగపూర్ 
ఎందుకు : గంగానది ప్రక్షాళనకు కృషి చేస్తున్నందుకు గాను 

టీఎం కృష్ణకు ఇందిరా గాంధీ అవార్డు
కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణ 2015-16 సంవత్సరానికి ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్థంతి రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఈ అవార్డును అందజేస్తారు. 2016లో టీఎం కృష్ణ రామన్ మెగ్‌సెసె అవార్డు అందుకున్నారు. కర్ణాటక సంగీత విద్వాంసుడిగానే కాకుండా.. ఒక సామాజిక కార్యకర్తగా సంగీత రంగంలో కులాల అడ్డుగోడల్ని కూల్చేసి అందరికీ భాగస్వామ్యం కల్పించేందుకు కృషిచేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డు 2015-16 
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : టీఎం కృష్ణ 

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జాతికి అంకితం
అక్టోబర్ 17న రెండవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి జిల్లాలో ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మూడేళ్ల కాలంలో దేశంలో 65కు పైగా ఆయుష్ ఆస్పత్రులను అభివృద్ధి చేశామని వెల్లడించారు. 
తొలిసారిగా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని 2016లో నిర్వహించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జాతికి అంకితం 
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీలో 

సుప్రీం ధర్మాసనానికి ‘యాక్సెస్ నౌ’ అవార్డు 
డిజిటల్ హక్కుల కోసం పోరాడుతున్న యాక్సెస్ నౌ అనే అంతర్జాతీయ సంస్థ ఏటా ప్రదానం చేసే గౌరవ పురస్కారానికి ఈసారి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎంపికైంది. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆగస్టు 24న చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. దీంతో ధర్మాసనంలోని సభ్యులకు ‘హీరోస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ కమ్యూనికేషన్స్ సర్వైలెన్స్’ అనే గౌరవ పురస్కారం లభించింది.

అణువుల అధ్యయనానికి కెమిస్ట్రీ నోబెల్
 అతి సూక్ష్మమైన అణువులను ఫొటోలు తీసే కొత్త పద్ధతిని కనుగొన్నందుకు గాను జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లకు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు దక్కింది. ఈ మేరకు అవార్డుల కమిటీ అక్టోబర్ 4న స్టాక్‌హోంలో జరిగిన కార్యక్రమంలో 2017 సంవత్సరానికి విజేతలను ప్రకటించింది. వీరు ఎలక్ట్రాన్ కిరణాలతో అణువుల మెరుగైన ఫొటోలు తీసేందుకు ‘క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ’ అనే పద్ధతిని కనుగొన్నారు. దీంతో ఎంతో సులువుగా జీవ అణువుల త్రీడీ చిత్రాలను తీయవచ్చు. తద్వారా సూక్ష్మమైన కణ నిర్మాణాలను, వైరస్‌లను, ప్రొటీన్లను అధ్యయనం చేయొచ్చు. ఇటీవల బ్రెజిల్‌లో సంచలనం సృష్టించిన జికా వైరస్‌ను ప్రపంచానికి చూపించేందుకు, అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో సంబంధం ఉన్న ఎంజైమ్‌ను గుర్తించేందుకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ విధానాన్నే ఉపయోగించారు.
జోయాకిమ్ ఫ్రాంక్: జర్మనీకి చెందిన 77 ఏళ్ల ఫ్రాంక్ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
రిచర్డ్ హెండర్సన్: స్కాట్‌లాండ్‌కు చెందిన 72 ఏళ్ల హెండర్సన్ కేంబ్రిడ్‌‌జలోని ఎంఆర్‌సీ మాలిక్యులార్ బయాలజీ లేబొరేటరీలో పనిచేస్తున్నారు. 1990లోనే ఓ ప్రోటీన్ త్రీడీ చిత్రాన్ని తయారు చేశారు.
జాక్వెస్ డుబోషే: స్విట్జర్లాండ్‌కు చెందిన 75 ఏళ్ల జాక్వెస్ యూనివర్సిటీ ఆఫ్ లౌసానే బయోఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. 1980లో నీటిని అతి వేగంగా చల్లబర్చడం వల్ల ద్రవస్థితిలో ఉండగానే గడ్డ కట్టేలా ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు.
క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ ఎలా పనిచేస్తుంది?
క్రయో అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత. పరిశీలించాల్సిన పదార్థాన్ని శూన్యంలో ఉంచడం.. దానిపైకి శక్తిమంతమైన ఎలక్ట్రాన్ కిరణాలను ప్రసారం చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. సాధారణ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా 2డీ చిత్రాలను మాత్రమే తీయవచ్చు. అవి చాలా అస్పష్టంగా ఉంటాయి. కానీ 1990లో రిచర్డ్ హెండర్సన్ ఎలక్ట్రాన్ కిరణాల శక్తిని గణనీయంగా తగ్గించడం ద్వారా ఏడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ల స్పష్టత ఉన్న చిత్రాలను తీయగలిగారు. పదార్థాలను శీతల నైట్రోజన్‌లో ఉంచడం ద్వారా స్పష్టత మరింత పెరిగింది. దీంతో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌కు కొన్ని మార్పులు చేసి జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్‌లు స్పష్టమైన అణు చిత్రాలు తీయగలిగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017 సంవత్సరానికి రసాయన శాస్త్ర నోబెల్ ప్రకటన
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్
ఎందుకు : అతి సూక్ష్మమైన అణువులను ఫొటోలు తీసేందుకు క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పద్ధతిని కనుగొన్నందుకు

దీపా మాలిక్‌కు ఎంజీ మెహతా అవార్డు
రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మాలిక్‌కు ఎంజీ మెహతా హ్యూమన్ స్పిరిట్ అవార్డు దక్కింది. ఈ మేరకు నవంబర్‌లో ఆమెకు ఈ అవార్డుని అందచేస్తామని రత్ననిధి ట్రస్టు చీఫ్ రాజీవ్ మెహతా అక్టోబర్ 4న తెలిపారు. 
మహేంద్రభాయ్ మెహతా జ్ఞాపకార్థం రత్ననిధి ట్రస్టు ఈ అవార్డుని నెలకొల్పింది. అవార్డు కింద రూ.లక్ష నగదు బహుమతితోపాటు ప్రతిమను అందచేస్తారు. ఎవరెస్టును అధిరోహించిన అరుణిమా సిన్హా, పారాలింపిక్ సైక్లిస్టు ఆదిత్య మెహతాలు ఇదివరకే ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎంజీ మెహతా అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : పారా అథ్లెట్ దీపా మాలిక్

కజువో ఇషిగురోకు సాహిత్య నోబెల్
బ్రిటన్ నవలా రచయిత కజువో ఇషిగురో ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యాడు. ‘The Remains of the Day’ నవలకు గాను ఇషిగురోను సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ అక్టోబర్ 5న ప్రకటించింది. ఈ నవలకు 1989లో మాన్ బుకర్ ప్రైజ్ కూడా లభించింది. డిసెంబర్ 10న స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో సాహిత్య పురస్కారంతో పాటు 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) గ్రహీతకు అందజేయనున్నారు. నోబెల్ సాహిత్య పురస్కారం పొందిన 114వ రచయిత ఇషిగురో.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాగసాకీలో పరిస్థితులపై ఇషిగురో 1982లో ‘ద పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ (తొలి నవల), 1986లో ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ వరల్డ్’ అనే నవలను రచించారు. 2005లో ‘నెవర్ లెట్ మీ గో’అనే సైన్‌‌స ఫిక్షన్, 2015లో ద బరీడ్ జెయింట్ ను రచించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017 నోబెల్ సాహిత్య పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : స్టాక్‌హోం
ఎవరు : కజువో ఇషిగురో
ఎందుకు : The Remains of the Day నవలకు

గౌరీ లంకేశ్‌కు పొలిట్‌కోవస్కయా అవార్డు
బెంగళూరుకు చెందిన పాత్రికేయురాలు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేశ్‌కు రష్యా ప్రభుత్వం అన్నా పొలిట్‌కోవస్కయా అవార్డు (మరణానంతరం)ను ప్రకటించింది. తద్వారా ఈ అవార్డు పొందిన తొలి భారతీయురాలిగా లంకేశ్ నిలిచారు. ఈ అవార్డును ఇటీవల హత్యకు గురైన గౌరీ లంకేశ్, పాకిస్తాన్ హక్కుల కార్యకర్త గులాలాయ్ ఇస్మాయిల్‌లకు సంయుక్తంగా ప్రకటించారు.
చెచెన్యాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై కథనాలు ప్రచురించినందుకు ప్రముఖ జర్నలిస్టు పొలిట్‌కోవస్కయాను 2006లో మాస్కోలో హత్య చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా ఆమె పేరిటే ఈ అవార్డును నెలకొల్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అన్నా పొలిట్‌కోవస్కయా అవార్డు 2017
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : రష్యా
ఎవరు : గౌరీ లంకేష్ (భారత్), గులాలాయ్ ఇస్మాయిల్ (పాకిస్తాన్)

అణ్వస్త్ర నిర్మూలన ఉద్యమానికి నోబెల్ శాంతి బహుమతి
అణ్వాయుధాలను నిర్మూలించేందుకు విశేష కృషిచేస్తున్న International Campaign to Abolish Nuclear Weapons-ICAN (అణ్వాస్త్రాల నిర్మూలనకు అంతర్జాతీయ ఉద్యమం) కు 2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. ‘‘ICAN అనేది ఒక ఉద్యమ సంస్థ. ఇది అణ్వాయుధాల నివారణకు ప్రపంచ దేశాలు సహకరించుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తోందని’’ నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్‌వుమన్ బెరిట్ రీస్-అండర్సన్ అక్టోబర్ 6న ప్రకటించారు. ఈ సంస్థకు 1.1 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభించనుంది.
ICAN చరిత్ర
మందుపాతరలపై నిషేధం కోరుతూ వచ్చిన స్వచ్ఛంద ఉద్యమం మూలంగా 1997లో వాటిని నిషేధిస్తూ అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. దీని నుంచి స్ఫూర్తి పొందిన అంతర్జాతీయ డాక్టర్ల సంఘం (అణుయుద్ధ నివారణకు పనిచేస్తుంది) అణ్వాయుధ నిర్మూలనను కోరుతూ ఉద్యమాన్ని తీసుకురావాలని తీర్మానించింది. ఫలితంగా 2007 ఏప్రిల్ 30న ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన సమావేశాలతో ICAN ఏర్పాటైంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ICAN లో 101 దేశాల నుంచి 468 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి బీట్రిస్ ఫిన్ 2014 జూలై నుంచి దీనికి కార్యనిర్వాహక డెరైక్టర్‌గా ఉన్నారు. ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్‌మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్, డిసార్మమెంట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ అనే మూడు సంస్థలు భారత్ నుంచి ICAN లో భాగస్వాములుగా ఉన్నాయి.
ఐ కెన్, రెడ్‌క్రాస్ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న సంస్థలు అణ్వస్త్ర నిరోధానికి దశాబ్దకాలంగా కృషి చేస్తున్నాయి. దీంతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని 2016 అక్టోబర్ 27న ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2017లో జూలై ఏడో తేదీన ‘అణ్వాయుధ నిషేధ ఒప్పందం (Treaty on the Prohibition of Nuclear Weapons-TPNW)’ ఐరాస సాధారణ సభ ఆమోదం పొందింది. కనీసం 50 దేశాలు తమ చట్టసభల్లో ఆమోదిస్తే ఒప్పందం అమలులోకి వస్తుంది. అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, తయారుచేయడం, కలిగి ఉండటం, సాంకేతికతను బదలాయించడం, నిల్వచేయడాన్ని TPNW నిషేధిస్తుంది. అణ్వస్త్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్‌‌స, బ్రిటన్, భారత్, పాకిస్తాన్, ఉత్తరకొరియాలు TPNW పై ఓటింగ్‌లో పాల్గొనలేదు. మొత్తం మీద ఓ ప్రజా ఉద్యమం ద్వారా ఐరాసలో 122 దేశాలతో అనుకూల ఓటు వేయించిన ICAN కృషికి ‘నోబెల్ బహుమతి’తో తగిన గుర్తింపు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నోబెల్ శాంతి బహుమతి-2017
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : International Campaign to Abolish Nuclear Weapons-ICAN
ఎందుకు : అణ్వాయుధాలను నిర్మూలించేందుకు చేస్తున్న విశేష కృషికి 

నిషా డిసిల్వాకు SOAR అవార్డు
క్యాన్సర్ రోగుల జీవితకాలాన్ని పెంచే పరిశోధనకుగాను భారత సంతతికి చెందిన నిషా డిసిల్వాకు ప్రతిష్టాత్మక సస్టేయినింగ్ అవుట్‌స్టాండింగ్ ఎచివ్‌మెంట్ అవార్డు (SOAR) దక్కింది. ఒక జీవకణం నుంచి మరో జీవకణానికి వ్యాపించే క్యాన్సర్ కణాల రవాణాను నియంత్రించడం ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చని అమె ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అవార్డు కింద 8.1 మిలియన్ డాలర్ల(సుమారు రూ.52 కోట్లు) నగదుతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తారు.
మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తగా కొనసాగుతున్న డిసిల్వా.. కాన్సర్ కణాల నియంత్రణపై పరిశోధనలు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సస్టేయినింగ్ అవుట్‌స్టాండింగ్ ఎచివ్‌మెంట్ అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : న్యూయార్క్
ఎవరు : నిషా డిసిల్వా
ఎందుకు : క్యాన్సర్ రోగుల జీవితకాలాన్ని పెంచే పరిశోధనకు

ప్రముఖ ఎకనమిస్ట్ రిచర్డ్ థేలర్‌కు ఆర్థిక నోబెల్ 
ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల సమన్వయంపై విశేష కృషి చేసిన ప్రముఖ ఎకనమిస్ట్ రిచర్డ్ థేలర్(72)ను ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు వరించింది. ఈ అవార్డుతోపాటు 1.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7.2 కోట్లు) ప్రైజ్‌మనీని ఆయన అందుకోనున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు ఎప్పుడూ పూర్తిగా హేతుబద్ధతపైననే ఆధారపడవని, మానవ సంబంధాల లోతైన ప్రభావం వాటిపై ఎక్కువగానే ఉంటుందని నిర్ధారించేలా ఆయన పరిశోధనలు సాగాయి. 
అమెరికాకు చెందిన రిచర్డ్ థేలర్.. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తనకిష్టమైన ‘బిహేవియరల్ ఎకనమిక్స్’లో ఆయన విసృ్తత పరిశోధనలు చేశారు. ఆ దృగ్విషయాన్ని ప్రతిపాదించిన తొలివ్యక్తిగా నిలిచారు. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు లేదా బృందాలు తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాల్లో వారి మనస్తత్వం, వారికి సంబంధించిన సామాజిక, వ్యక్తిగత అంశాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఎకనమిక్స్, సైకాలజీల మధ్య దూరాన్ని చెరిపేసి, వాటి మధ్య నెలకొన్న సంబంధాన్ని చూపే ప్రయత్నం చేశారు. అందుకే నోబెల్ జ్యూరీ.. ‘వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలు, మనస్తత్వ శాస్త్రాల మధ్య సమన్వయాన్ని సాధించిన తొలి శాస్త్రవేత్త’గా థేలర్‌ను గుర్తించింది. ఆర్థిక శాస్త్రానికి మరింత మానవీయతను సమకూర్చిన వ్యక్తిగా ఆయనను ప్రశంసించింది. 
నడ్జ్ థీయరీ.. 
సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి బిహేవియరల్ ఎకనమిక్స్‌ను సాధనంగా చూపిన థేలర్ సిద్ధాంతం ‘నడ్‌‌జ థీయరీ’గా పాపులర్ అయింది. ‘నడ్‌‌జ’ అనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకాన్ని కూడా ఆయన మరొకరితో కలసి రాశారు. థేలర్ ప్రతిపాదించిన మరో సిద్ధాంతం ‘మెంటల్ అకౌంటింగ్’. వినియోగదారులు తమ ఆదాయ, ఖర్చులను మనస్సులోనే లెక్కలేసుకుని, నిర్ణయాలను సులభతరం చేసుకుంటారని వివరించేదే ఆ సిద్ధాంతం. పరిమిత హేతుబద్ధత, స్వీయ నియంత్రణ లేకపోవడం, సామాజిక ప్రాధాన్యతలు.. వ్యక్తుల ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను ఆయన సమగ్రంగా విశ్లేషించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆర్థిక నోబెల్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 9 
ఎవరు : ప్రముఖ ఆర్థికవేత్త రిచర్డ్ థేలర్ 
ఎందుకు : ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల సమన్వయంపై విశేష కృషికిగాను

వైద్యశాస్త్రంలో ముగ్గురు యూఎస్ శాస్త్రవేత్తలకు నోబెల్
 2017 సంవత్సరానికి గాను వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలను వరించింది. రోజులో 24 గంటల్లో మారుతున్న సమయానికి అనుగుణంగా మనుషులు, జంతువులు, వృక్షాల కణజాలంలో సంభవిస్తున్న మార్పుల(ఇంటర్నల్ బయాలాజికల్ క్లాక్)ను కనుగొన్నందుకు గాను శాస్త్రవేత్తలు జెఫ్రీ సీ హాల్, మైఖేల్ రోస్‌బాష్, మైఖేల్ డబ్ల్యూ యంగ్‌లు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు స్వీడన్ స్టాక్‌హోమ్‌లోని కారోలిన్స్‌కా ఇనిస్టిట్యూట్‌లో జరిగిన నోబెల్ కమిటీ సమావేశంలో 108వ నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అవార్డు కింద ప్రకటించిన 9 మిలియన్‌ల స్వీడిష్ క్రోనార్స్‌ను ముగ్గురు శాస్త్రవేత్తలకు పంచుతారు.
శాస్త్రవేత్త జెఫ్రీ సీ హాల్ మసాచ్యుసెట్స్‌లోని బ్రాండీస్ విశ్వవిద్యాలయంలో చాలా కాలం ప్రొఫెసర్, పరిశోధకుడిగా పనిచేశారు. శాస్త్రవేత్త రోష్‌బాస్ ఇదే విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా ఉన్నారు. శాస్త్రవేత్త మైఖేల్ యంగ్ న్యూయార్క్‌లోని రాఖేఫెల్లర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
ఏమిటీ పరిశోధన ?
భూమిపై మానవులతో పాటు వృక్షాలు, అనేక జంతు జాతులు భూ భ్రమణం ఆధారంగా వాటి శరీరాల కణజాలాన్ని నియంత్రిస్తున్నాయన్న విషయాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తిండి, నిద్ర, పని వేళలకు అనుగుణంగా శరీరంలో జరిగే మార్పులను గుర్తించారు. ఈ సైకిల్‌కు వ్యతిరేకంగా శరీరం వ్యవహరిస్తే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చారు.
మానవుడి జీవక్రమ రహస్య ఛేదన, వైద్యశాస్త్రంలో వీరి పరిశోధనలను కీలక పురోగతిగా గుర్తించిన నోబెల్ కమిటీ.. ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.
నోబెల్ చరిత్ర
సైన్స్, లిటరేచర్, పీస్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఏటా నోబెల్ బహుమతులను అందజేస్తారు. డైనమైట్‌ను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట స్వీడిష్ అకాడమీ 1901 నుంచి ఈ అవార్డులను ఇస్తోంది. భారత్ నుంచి తొలిసారిగా 1913లో రవీంద్రనాథ్ ఠాగోర్ లిటరేచర్ విభాగంలో నోబెల్ బహుమతి పొందారు. 1930లో సీవీ రామన్(ఫిజిక్స్), 1979లో మదర్ థెరెసా(పీస్), 1998లో అమర్త్యసేన్ (ఎకనామిక్ స్టడీస్), 2014లో కైలాశ్ సత్యర్థి(పీస్) భారత్ నుంచి నోబెల్ బహుమతి పొందారు. 

సీఎన్‌ఆర్ రావుకు వాన్ హిప్పెల్ అవార్డు 
ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ సీ.ఎన్.ఆర్. రావు ప్రతిష్టాత్మక వాన్ హిప్పెల్-2017 పురస్కారానికి ఎంపికయ్యారు. నోవల్ ఫంక్షనల్ మెటీరియల్స్ అభివృద్ధిలో (nanomaterials graphene, superconductivity, 2D materials and colossal magnetoresistance) కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇది.. భౌతిక పరిశోధనలో ప్రపంచంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వాన్ హిప్పెల్ - 2017 పురస్కారం 
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : భారతరత్న సీఎన్‌ఆర్ రావు 
ఎందుకు : భౌతిక పరిశోధనలో విశేష కృషికి గుర్తింపుగా 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు స్వచ్ఛత పురస్కారం 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖను స్వచ్ఛత అవార్డు వరించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తాగు నీటి సరఫరా, పరిశుభ్రత కార్యక్రమాలకుగాను ఈ పురస్కారం దక్కింది. స్వఛ్చభారత్ మిషన్ మూడో వార్షికోత్సవంలో భాగంగా అక్టోబర్ 2న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేశారు. ప్రభుత్వ కార్యాలయ్యాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. 
2017 సంవత్సరానికిగాను ఫిబ్రవరి 1-15 వరకు అన్ని మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు , కార్యాలయాల్లో కల్పిస్తున్న సదుపాయాలు పారిశుద్ధ్య సౌకర్యాల వంటి వాటిపై దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పరిశీలించి పురస్కారాలకు ఎంపిక చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. స్వచ్ఛత గురించి భారిస్థాయిలో ప్రచారం కల్పించడానికి ర్యాలీలు, వీధి ప్రదర్శనలు, పెయింటింగ్ పోటీలు వంటివి నిర్వహించడమేగాక, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాల విద్యార్థులతో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు స్వచ్ఛత పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ 
గురుత్వ తరంగాల ఉనికిని గుర్తించినందుకుగాను అమెరికాకు చెందిన ముగ్గురు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలైన రైనర్ వీస్, కిప్ థోర్న్, బారీ బారిష్‌లను నోబెల్ అవార్డు- 2017 వరించింది. తన సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ఈ గురుత్వ తరంగాల గురించి వందేళ్ల కిందటే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించారు. కృష్ణ బిలాలు ఒకదానికి మరొకటి ఢీకొనడం వంటి పరిణామాలు జరగడం వల్ల ఇవి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015లోనే వీటిని తొలిసారిగా గుర్తించినప్పటికీ 2016 ఫిబ్రవరిలో ప్రకటించారు. వీటిని గుర్తించేందుకు యూఎస్‌లోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)ను థోర్న్, వీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత బారిష్ ఈ ప్రాజెక్టుకు తుది రూపునిచ్చారు. దాదాపు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏర్పడ్డ గురుత్వ తరంగాలను వీరు తొలిసారిగా ప్రత్యక్షంగా గుర్తించగలిగారు. 
‘ఈ తరంగాలు భూమికి చేరేసరికి చాలా బలహీనమైపోతాయి. అయినా వాటిని గుర్తించడం ఖగోళ భౌతిక శాస్త్రంలో ఓ సంచలనం’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ హెడ్ గోరాన్ హన్సన్ అన్నారు. ఈ అంతు చిక్కని తరంగాలను 2015 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు గుర్తించగలిగారు. రెండు సార్లు ‘లిగో’ ను, ఇంకోసారి ఇటలీలో యురోపియన్ గ్రావి టేషనల్ అబ్జర్వేటరీ (విర్గో)ను ఉపయోగించారు. కృష్ణ బిలాలు ఎటువంటి కాంతినీ వెదజల్లవు. వీటిని కేవలం గురుత్వ తరంగాల ఆధారంగానే గుర్తించే వీలు కలుగుతుంది.
గురుత్వ తరంగాలు అంటే ఏంటి..
ఈ గురుత్వ తరంగాలు విశ్వంలో ఎక్కడ పుట్టినా ఏ రకమైన పదార్థంతోనూ సంబంధం లేకుండా ప్రవహిస్తుంటాయి. పైగా చాలా సూక్ష్మంగా ఉంటాయి. దీంతో వీటిని గుర్తించడం చాలా కష్టం. వీటిని ప్రత్యక్షంగా గుర్తించలేమని ఐన్‌స్టీన్ లాంటి శాస్త్రవేత్తే వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణబిలాల జంటను తీసుకుందాం. స్పేస్‌టైమ్‌లో ఇవి సృష్టించే గురుత్వ తరంగాలు.. భూమ్మీద 10 లక్షల కిలోమీటర్ల దూరాన్ని పరమాణు స్థాయికి తగ్గించేంత చిన్నగా ఉంటాయి. అయితే సుమారు 1,380 కోట్ల ఏళ్ల కింద రెండు భారీ కృష్ణబిలాలు ఢీ కొనడంతో అతిపెద్ద గురుత్వ తరంగాలు ఏర్పడ్డాయి. ఈ తరంగాలు విశ్వంలో అన్నివైపులా ప్రయాణిస్తుండగా 2015లో అమెరికాలో ఏర్పాటు చేసిన లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లో శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంత ప్రాముఖ్యం ఎందుకు?
గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించగలిగితే ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సుదూర నక్షత్రాలు, పాలపుంతలు, కృష్ణ బిలాల తాలూకు వివరాలను ఆయా ఖగోళ వస్తువులు సృష్టించే గురుత్వ తరంగాల సైజును బట్టి నిర్ధారించవచ్చు. లిగో ద్వారా గుర్తించిన గురుత్వ తరంగాలు విశ్వం ఏర్పడ్డ తొలినాళ్లలో ఏర్పడినవి కాబట్టి.. వీటి ఆధారంగా విశ్వం విస్తరిస్తోందా.. ఎంత వేగంతో విస్తరిస్తోంది.. వంటి విషయాలను అర్థం చేసుకోవచ్చు. 
ఎలా గుర్తించారు?
1974లో తొలిసారి ఈ గురుత్వ తరంగాలను పరోక్షంగా గుర్తించారు. ఒక న్యూట్రాన్ స్టార్ జంట ఓ భారీ ద్రవ్యరాశి చుట్టూ తిరుగుతూ.. క్రమేపీ చిన్నగా మారుతుండటం.. గురుత్వ తరంగాల ద్వారా కోల్పోయే శక్తికి తగ్గట్లు వాటి సైజు తగ్గుతుండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. గురుత్వ తరంగాల ఉనికికి ఇది పరోక్ష నిదర్శనమని తెలిపిన ఈ ప్రయోగాలకు 1993లో నోబెల్ అవార్డు దక్కింది. ఆ తర్వాత అమెరికాలో లిగో పేరుతో, ఇటలీలో విర్గో పేరుతో గురుత్వ తరంగాలను గుర్తించేందుకు రెండు ప్రయోగశాలలు ఏర్పాటుచేశారు. సుదూర ప్రయాణంలో గురుత్వ తరంగాల్లో వచ్చే సూక్ష్మమైన మార్పులను గుర్తిస్తుంది. ఒక లేజర్ కిరణాన్ని రెండుగా విడగొట్టి.. రెండు వైపులకు పంపించడం.. ఆ వైపున ఉన్న అద్దాల ద్వారా వీటిని మళ్లీ ఒక చోట(రెండుగా విడగొట్టిన చోటు)కు చేర్చడం ఈ ప్రయోగంలో జరిగే తంతు. రెండు లేజర్ కిరణాలు ఏకమయ్యే చోట ఆ కాంతి తాలూకు తరంగాలను గుర్తిస్తారు. సాధారణ పరిస్థితుల్లో వ్యతిరేక దిశల్లో ప్రయాణించే లేజర్ కిరణాలు ఏకమై ఎలాంటి సంకేతాలను చూపవు. గురుత్వ తరంగాల సమక్షంలో మాత్రం కొంచెం తేడాలు వస్తాయి. ఈ తేడాల ఆధారంగా గురుత్వ తరంగాల ఉనికిని శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా నిర్ధారించారు. 

ప్రయోగాల వెనుక భారతీయులు
గురుత్వ తరంగాలను గుర్తించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి కూడా ఉంది. గురుత్వ తరంగాలను గుర్తించేందుకు అధునాతనమైన ప్రయోగాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘ఇండిగో’ ప్రోగ్రాంలో బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సెన్సైస్‌కు చెందిన ప్రొఫెసర్ బాలా అయ్యర్ సాయమందించారు. ఐఐఎస్‌ఈఆర్- కోల్‌కతాకు చెందిన రాజేశ్ నాయక్, పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫ్రిజిక్స్‌కు చెందిన సంజీవ్ దురంధర్ కూడా ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. 

భారతీయ న్యాయవాదికి ‘స్వీడిష్’ అవార్డు
ప్రాథమిక హక్కుల పరిరక్షణలో విశేష కృషి చేసిన భారతీయ న్యాయవాది కొలిన్ గొన్సాల్వ్స్‌కు ప్రతిష్టాత్మక స్వీడిష్ రైట్ లైవ్లీ హుడ్ అవార్డు లభించింది. నోబెల్ పురస్కారంతో సమానంగా భావించే ఈ అవార్డు కింద 3 లక్షల అమెరికన్ డాలర్ల నగదు అందజేస్తారు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన కొలిన్ గత మూడు దశాబ్దాలుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా భారత్‌లోని అణగారిన, అట్టడుగు వర్గాల ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణకు పాటుపడుతున్నారు. ఈ అవార్డును ఆయన మరో ఇద్దరితో కలిసి పంచుకోనున్నారు.

🍂🌼🌼➖➖➖➖➖➖➖➖
*Current affairs*
➖➖➖➖➖➖➖➖🌼🌼🍂

1. Which was the focus country group in the New Delhi World Book Fair 2018?
a) European Union
b) United States of America
c) United Kingdom
d) United Arab Emirates

2. Who won the 2018 men’s singles Tata Open Maharashtra Tennis tournament?
a) Kevin Anderson
b) Gilles Simon
c) Yuki Bhambri
d) Benoit Paire

3. Which city hosted the Himalayan Hydro Expo 2018?
a) Darjeeling
b) Gangtok
c) Kathmandu
d) Imphal

4. Which country became the first to enforce equal pay for women and men?
a) Finland
b) Greenland
c) Ireland
d) Iceland

5. Which city will host World Sweet Festival (WSF-2018)?
a) Hyderabad
b) Lucknow
c) Chennai
d) New Delhi

6. The world’s largest known prime number was discovered by a volunteer for a prime-number hunting project. This prime number contains how many digits?
a) 20 Million
b) 23 Million
c) 25 Million
d) 32 Million

7. Who was appointed as the Secretary (Economic Relations) in the External Aairs Ministry?
a) Lokesh Chandra
b) Rambhau Mhalgi
c) TS Tirumurti
d) Kailash Sagar

8. The Khelo India logo reflecting the freshness, agility and vitality of New India was launched in which city?
a) Mumbai
b) Chennai
c) Hyderabad
d) New Delhi

9. The Trump administration proposed spending USD 18 billion over 10 years to signicantly extend the border wall with which country?
a) Mexico
b) Guatemala
c) Cuba
d) Belize

10. Scientists have observed less ozone depletion for the first time due to ban on which of the following things?
a) Plastic
b) Chlorine
c) Biogas
d) Pet Coke

 *Answers:*
1. a
2. b
3. c
4. d
5. a
6. b
7. c
8. d
9. a
10. b

            🍃🌸🤗🌸🍃
■అక్టోబర్ 2017 స్పోర్ట్స్

టెన్నిస్‌కు మార్టినా హింగిస్ వీడ్కోలు 
 స్విట్జర్లాండ్ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్‌వన్ మార్టినా హింగిస్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతోన్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ తన ఆఖరి టోర్నీ అని 37 ఏళ్ల హింగిస్ అక్టోబర్ 26న ప్రకటించింది. 23 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన హింగిస్ తన కెరీర్‌లో 5 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సహా మొత్తం 25 గ్రాండ్‌స్లామ్‌లు సాధించింది. 17 ఏళ్ల వయసులో అతి పిన్న వయసులో సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన హింగిస్... ప్రస్తుతం డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. గతంలో వేర్వేరు కారణాలతో రెండు సార్లు పదేళ్ల పాటు ఆటకు దూరమైన హింగిస్ 2013 నుంచి రెగ్యులర్‌గా డబుల్స్ ఆడుతోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ప్రపంచ నవంబర్ వన్ 
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : మార్టినా హింగిస్ 

అమెరికాలో గావస్కర్ గ్రౌండ్
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ పేరిట అమెరికాలో ఓ క్రికెట్ గ్రౌండ్ రూపుదిద్దుకుంది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లేలో కొత్తగా నిర్మించిన ఈ మైదానాన్ని స్వయంగా గావస్కరే ప్రారంభించారు. ఇటీవలే జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లూయిస్ విల్లే మేయర్ గ్రెగ్ ఫిష్చెర్ పాల్గొన్నారు. 42 జట్లు తలపడే ‘మిడ్‌వెస్ట్ క్రికెట్ లీగ్’లో ఈ మైదానం లూయిస్ విల్లే క్రికెట్ క్లబ్‌కు హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగపడుతుంది.

షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్, అమన్‌లకు పతకాలు 
సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్ దహియా, అమన్‌ప్రీత్ సింగ్ గురికి భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్‌లో సంగ్రామ్ రజత పతకం సాధించగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 
ఆరుగురు పాల్గొన్న డబుల్ ట్రాప్ ఫైనల్లో సంగ్రామ్ 76 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలువగా.. హు బిన్‌యువాన్ (చైనా-79 పాయింట్లు) ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నాడు. గాస్‌పరానీ దవీ (ఇటలీ-56 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ 45 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అమన్‌ప్రీత్ సింగ్ 202.2 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 

శ్రీకాంత్కు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. పారిస్‌లో అక్టోబర్ 29న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 21-14, 21-13తో 40వ ర్యాంకర్, క్వాలిఫయర్ కెంటా నిషిమోటో (జపాన్)పై గెలిచాడు. తద్వారా లిన్ డాన్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) తర్వాత ఒకే ఏడాది కనీసం నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతోపాటు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 
శ్రీకాంత్ 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గాడు. సింగపూర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది ఆరో సూపర్ సిరీస్ టైటిల్. విజేతకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 85 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కిడాంబి శ్రీకాంత్
ఎక్కడ : పారిస్

బోపన్న జంటకు ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ టైటిల్
ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న టైటిల్ సాధించాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అక్టోబర్ 29న జరిగిన ఫైనల్లో బోపన్న-పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)-సామ్ క్వెరీ (అమెరికా) జంటపై గెలిచింది.
బోపన్నకు ఈ ఏడాది ఇది మూడో డబుల్స్ టైటిల్ కాగా ఓవరాల్‌గా 16వ టైటిల్. విజేతకు 1,32,030 యూరోల (రూ. 9 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : బోపన్న-పాబ్లో క్యువాస్
ఎక్కడ : ఆస్ట్రియా రాజధాని వియన్నా

వియత్నాం ఓపెన్ టైటిల్ విజేత సాకేత్ మైనేని
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. అక్టోబర్ 29న హో చి మిన్ సిటీలో జరిగిన ఈ టోర్నీలో సాకేత్-విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) ద్వయం గో సొయెదా-బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంటపై విజయం సాధించింది. సాకేత్ కెరీర్‌లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వియత్నాం ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : సాకేత్ మైనేని-విజయ్ సుందర్ ప్రశాంత్
ఎక్కడ : హో చి మిన్ సిటీ, వియత్నాం

టీ20ల్లో మిల్లర్ వేగవంతమైన సెంచరీ
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో వంద పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్ లెవీ (న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో 100) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టీ20ల్లో వేగవంతమైన సెంచరీ
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ భారత్ కైవసం
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. అక్టోబర్ 29న జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కాయి. 
ఇదే మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 9000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా అతి తక్కువ కాలంలో (9 ఏళ్ల 72 రోజులు) 9 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ద్రవిడ్‌కు 9 ఏళ్ల 322 రోజులు, డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)కు 12 ఏళ్లు పట్టాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : భారత్

అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్
భారతదేశంలో తొలిసారి నిర్వహించిన ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. అక్టోబర్ 28న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5-2 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది. టోర్నీలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన స్పెయిన్ మళ్లీ రన్నరప్‌గా నిలిచింది. ఫాడెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ 2017లోనే అండర్-20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత 
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఇంగ్లండ్
ఎక్కడ : కోల్‌కతా

ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా పైరేట్స్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-5 విజేతగా పట్నా పైరేట్స్ నిలిచింది. అక్టోబర్ 28న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో 55-38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. తద్వారా వరుసగా మూడోసారి పీకేల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో ప్రదీప్ నర్వాల్‌ను పర్‌ఫెక్ట్ రైడర్ (రూ. 50 వేలు), బెస్ట్ డూ ఆర్ డై రైడర్ (రూ.50 వేలు), స్టార్ స్పోర్‌‌ట్స మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), లీగ్ టాప్ స్కోరర్ (రూ.10 లక్షలు), రైడర్ ఆఫ్ ద టోర్నీ (రూ. 10 లక్షలు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 15 లక్షలు) అవార్డులు వరించాయి. ఉత్తమ అరంగేట్ర ఆటగాడు అవార్డు సచిన్ (గుజరాత్; రూ. 10 లక్షలు), డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు సురేందర్ నాడా (హరియాణా; రూ. 10 లక్షలు)కు లభించాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-5 విజేత 
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : పట్నా పైరేట్స్
ఎక్కడ : చెన్నై

హామిల్టన్‌కు ఫార్ములావన్ ప్రపంచ టైటిల్
బ్రిటన్‌కు చెందిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగోసారి ఫార్ములావన్ ప్రంపంచ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. టైటిల్ కోసం సెబాస్టియన్ వెటెల్‌తో నెలకొన్న మెక్సికో గ్రాండ్ ప్రి పోటీలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ టైటిల్ గెలిచాడు. దీంతో వెటెల్ (ఫెరారీ టీమ్) మిగిలి ఉన్న రెండు గ్రాండ్‌ప్రి (బ్రెజిలియన్, అబుదాబి)లను గెలిచినా హామిల్టన్‌ను చేరుకోలేడు. తద్వారా 2017 ప్రపంచ టైటిల్ హామిల్టన్ వశమైంది.
తొలి సారి 2008లో మెక్‌లారెన్ తరఫున టైటిల్ గెలిచిన హామిల్టన్ తర్వాత మెర్సిడెస్‌తో చేరాడు. 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ గెలిచాడు. ఈ సీజన్‌లో అతను 9 రేసుల్లో గెలిచి 333 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వెటెల్ 277 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫార్ములావన్ ప్రపంచ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29 
ఎవరు : లూయిస్ హామిల్టన్

ఐసీసీ ర్యాంకుల్లో కోహ్లి, మిథాలీ రాజ్ టాప్
భారత క్రికెట్ కెప్టెన్లు విరాట్ కోహ్లి, మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానంలో ఉన్నారు.
అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 263 పరుగులు చేసిన కోహ్లి 889 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా 1998లో సచిన్ పేరిట ఉన్న 887 రేటింగ్ పాయింట్ల రికార్డును అధిగమించాడు. 
తాజా వన్డే బ్యాట్స్‌ఉమెన్ ర్యాంకింగ్‌‌సలో మిథాలీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 753 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. తదుపరి రెండు, మూడు ర్యాంకుల్లో ఎలైస్ పెర్రీ (ఆస్ట్రేలియా; 725), అమి శాటెర్త్‌వైట్ (న్యూజిలాండ్; 720) నిలిచారు.
న్యూజిలాండ్‌పై గెలిచినప్పటికీ భారత్ (119) 2 పాయింట్ల లోటుతో రెండో స్థానంలోనే ఉంది. దక్షిణాఫ్రికా (121) అగ్రస్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 30 
ఎవరు : విరాట్ కోహ్లీ

సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మనోజ్‌కు స్వర్ణం
విశాఖపట్నంలో ముగిసిన జాతీయ సీనియర్ ఎలైట్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మనోజ్ కుమార్ స్వర్ణపతకం గెలుచుకున్నాడు. అక్టోబర్ 30న జరిగిన 69 కేజీల విభాగం ఫైనల్లో మనోజ్ 4-1తో దుర్యోధన్‌సింగ్‌పై విజయం సాధించాడు.
60 కేజీల విభాగంలో శివ థాపా మనీశ్ చేతిలో ఓడిపోయి రజతం గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో మనోజ్ ‘బెస్ట్ బాక్సర్’గా నిలవగా.. మనీశ్ ‘మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్’ ఘనత దక్కించుకున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో ఎన్టీ లాల్‌బియాకిమా (మిజోరం)పై 3-2తో గెలిచి స్వర్ణపతకం సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : మనోజ్ కుమార్
ఎక్కడ : విశాఖపట్నం

కామన్వెల్త్ షూటింగ్‌లో హీనాకు స్వర్ణం
కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ హీనా సిద్ధూ స్వర్ణం సాధించింది. అక్టోబర్ 31న ప్రారంభమైన మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో హీనా 240.8 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గాలియాబొవిచ్ (238.2), క్రిస్టీ గిల్‌మెన్ (213.7) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. హీనా ఇటీవలే ఢిల్లీలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ పసిడి పతకాన్ని సాధించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : భారత షూటర్ హీనా సిద్ధూకు స్వర్ణం
ఎక్కడ : బ్రిస్బేన్, ఆస్ట్రేలియా 
ఎందుకు : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో

డెన్మార్క్ ఓపెన్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్
 డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. అక్టోబర్ 22న జరిగిన ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-10, 21-5తో ప్రపంచ 22వ ర్యాంకర్ లీ హున్ ఇల్ (దక్షిణ కొరియా)ను ఓడించి.. కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 58 వేలు)తోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లీ హున్ ఇల్‌కు 28,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 53 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
డెన్మార్క్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత ప్లేయర్‌కు లభించడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1980లో ప్రకాశ్ పదుకొనె ఈ టైటిల్‌ను సాధించగా... ఇపుడు శ్రీకాంత్ ఆయన సరసన నిలిచాడు. మహిళల సింగిల్‌లో మాత్రం 2012లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్‌ను సాధించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డెన్మార్క్ ఓపెన్ సూపర్ సీరీస్ ప్రీమియర్ టైటిల్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత కిడాంబి శ్రీకాంత్ 

హాకీ ఆసియా కప్ విజేత భారత్ 
సీనియర్ పురుషుల హాకీ ఆసియా కప్‌ని భారత్ గెలుచుకుంది. బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా అక్టోబర్ 22న జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత్ 2-1 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. తద్వారా పదేళ్ల తర్వాత కప్‌ను కైవసం చేసుకుంది. మొత్తంగా ఎనిమిదోసారి ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచి... 1982, 1985, 1989, 1994, 2013లలో రన్నరప్‌గా నిలిచింది. 
టోర్నీ అవార్డులు 
మ్యాన్ ఆఫ్ ద ఫైనల్: ఆకాశ్‌దీప్ సింగ్ (భారత్) 
గోల్ ఆఫ్ ద ఫైనల్: లలిత్ ఉపాధ్యాయ్ (భారత్) 
టోర్నీ బెస్ట్ గోల్: హర్మన్‌ప్రీత్ సింగ్ (భారత్) 
ప్రామిసింగ్ ప్లేయర్: అర్షద్ హుస్సేన్ (బంగ్లాదేశ్) 
బెస్ట్ గోల్‌కీపర్: ఆకాశ్ చిక్టే (భారత్) 
టాప్ స్కోరర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్ (భారత్-7 గోల్స్), ఫైజల్ సారి (మలేసియా-7 గోల్స్) 
బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: ఫైజల్ సారి (మలేసియా) 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హాకీ ఆసియా కప్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : విజేత భారత్ 
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్ 

హామిల్టన్‌కు అమెరికా గ్రాండ్ ప్రీ టైటిల్ 
ఫార్ములావన్ సీజన్‌లో భాగంగా జరిగిన అమెరికా గ్రాండ్‌ప్రి రేసులో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. అక్టోబర్ 23న జరిగిన ఈ రేసులో హామిల్టన్ నిర్ణీత 56 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 50.991 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ (ఫెరారీ), రైకోనెన్ (ఫెరారీ), వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), బొటాస్ (మెర్సిడెస్) వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఆరు, ఎనిమిది స్థానాలను సంపాదించారు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : విజేత లూయిస్ హామిల్టన్ 

యూరోపియన్ ఓపెన్‌లో దివిజ్ జంటకు టైటిల్ 
భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన కెరీర్‌లో మూడో ఏటీపీ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూరోపియన్ ఓపెన్ ట్రోఫీ టోర్నీలో తన భాగస్వామి స్కాట్ లిప్‌స్కీ (అమెరికా)తో కలిసి దివిజ్ శరణ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో దివిజ్ శరణ్-స్కాట్ లిప్‌స్కీ ద్వయం 6-4, 2-6, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)-జూలియో పెరాల్టా (చిలీ) జోడీపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన దివిజ్-లిప్‌స్కీ జంటకు 31,910 యూరోల (రూ. 24 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూరోపియన్ ఓపెన్ ట్రోఫీ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : దివిజ్ శరణ్-స్కాట్ లిప్‌స్కీకి డబుల్స్ టైటిల్ 
ఎక్కడ : బెల్జియం 

వరల్డ్ కప్ ఫైనల్స్ షూటింగ్‌లో జీతూ-హీనాకు స్వర్ణం 
ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షూటర్స్ జీతూ రాయ్ - హీనా సిద్ధూ ద్వయం పసిడి పతకాన్ని గెలుచుకుంది. అక్టోబర్ 24న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో జీతూ-హీనా జంట 483.4 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాన్ని మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు. గొబెర్‌విల్లీ-ఫౌకెట్ (ఫ్రాన్‌‌స-481.1 పాయింట్లు) జంట రజతం నెగ్గగా... యాంగ్ వీ-కాయ్ జియోజుయ్ (చైనా-418.2 పాయింట్లు) జోడీ కాంస్యం సాధించింది. మొత్తంగా ఈ ఏడాది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత్‌కు లభించిన మూడో స్వర్ణమిది. న్యూఢిల్లీ, గబాలాలలో జరిగిన ప్రపంచకప్ టోర్నీల్లో జీతూ-హీనా జంట పసిడి పతకాలు గెలిచింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్ 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో జీతూ - హీనాకు స్వర్ణం 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో 
పోర్చుగల్ జట్టు కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 2017 సంవత్సరానికి గాను ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ పురస్కారాన్ని గెల్చుకున్నాడు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో రొనాల్డో 48 మ్యాచ్‌లు ఆడి 44 గోల్స్ చేశాడు. అంతేకాకుండా రియల్ మాడ్రిడ్ జట్టుకు లా లీగా (స్పానిష్ లీగ్), చాంపియన్‌‌స లీగ్ టైటిల్స్‌ను అందించాడు. తన అద్భుత ప్రతిభతో వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచకప్‌కు పోర్చుగల్ అర్హత సాధించడంలో రొనాల్డో కీలకపాత్ర పోషించాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : క్రిస్టియానో రొనాల్డో 

గగన్‌జీత్‌కు మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్
మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను గగన్‌జీత్ భుల్లర్(భారత్) గెలుచుకున్నాడు. మకావ్‌లో అక్టోబర్ 22న ముగిసిన ట్రోఫీలో ఈ టైటిల్ సాధించాడు. భుల్లర్ ఈ టైటిల్ సాధించడం ఇది రెండోసారి. అజితేష్ సందూ (భారత్), అంగెలో క్యూయి(ఫిలిప్పీన్స్) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.

ఫుట్‌బాల్ ఆసియా కప్-2019కు భారత్ అర్హత 
 ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2019 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు భారత్ అర్హత సాధించింది. మకావుతో బెంగళూరులో అక్టోబర్ 11న జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో గెలిచింది. భారత్ తరఫున రౌలిన్ బోర్జెస్, కెప్టెన్ సునీల్ చెత్రి, జెజె లాల్‌పెకులువా ఒక్కో గోల్ చేశారు. 70వ నిమిషంలో మకావు ఆటగాడు లామ్ కా సెంగ్ సెల్ఫ్ గోల్ సాధించగా... 37వ నిమిషంలో నికొలస్ తరావు మకావుకు తొలి గోల్ అందించాడు. 2019 ఆసియా కప్ యూఏఈలో జరుగుతుంది. 2011 తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్ మరోసారి అర్హత పొందింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫుట్‌బాల్ ఆసియా కప్-2019కు భారత్ అర్హత 
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎక్కడ : యూఏఈలో జరగనున్న టోర్నీ

ఢిల్లీ హాఫ్ మారథాన్ ప్రచారకర్తగా ఎర్విన్ 
ఢిల్లీ హాఫ్ మారథాన్ పదో ఎడిషన్ ప్రచారకర్తగా నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత, అమెరికా దిగ్గజ స్విమ్మర్ ఆంటోనీ ఎర్విన్ నియమితులయ్యారు. ఒలింపిక్స్‌లో 50 మీ. ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో పతకం సాధించిన అత్యంత యువ ఆటగాడితోపాటు పెద్దవయస్కుడైన ఆటగాడిగా ఎర్విన్ ఘనత సాధించాడు. తొలుత 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఎర్విన్ తాజాగా ముగిసిన రియో ఒలింపిక్స్ (2016)లోనూ పతకం దక్కించుకున్నాడు. ఈక్రమంలో 36 ఏళ్ల వయసులో బంగారు పతకం సాధించిన ఆటగాడిగా ఎర్విన్.. సహచరుడు మైకేల్ ఫెల్‌‌ఫ్స రికార్డును సవరించాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఢిల్లీ హాఫ్ మారథాన్ ప్రచారకర్తగా ఎర్విన్ 
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ఎర్విన్ అమెరికా దిగ్గజ స్విమ్మర్

టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహణకు ఐసీసీ నిర్ణయం 
అంతర్జాతీయ క్రికెట్‌లో తొమ్మిది దేశాలతో టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి - ఐసీసీ అధికారికంగా నిర్ణయించింది. దీంతో పాటు కొత్తగా అంతర్జాతీయ వన్డే లీగ్‌ను కూడా జరుపుతామని ప్రకటించింది. ఇందులో 13 దేశాలు పాల్గొంటాయి. అయితే ఈ రెండు లీగ్‌లకు సంబంధించిన షెడ్యూల్, పాయింట్ల పద్ధతి, వేదికలను తర్వాత ప్రకటించనున్నారు. అక్టోబర్ 13న ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
కీలక నిర్ణయాలు.. 
టెస్టు లీగ్‌లో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటాయి. 2019 నుంచి రెండేళ్ల పాటు ఆరు సిరీస్‌లు ఆడతాయి. ఇందులో ఒక్కో జట్టు మూడు సిరీస్‌లు స్వదేశంలో... మూడింటిని విదేశాల్లో ఆడాల్సి ఉంటుంది. అన్ని మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు జరుగుతాయి.ప్రతీ జట్టు కనీసం రెండు టెస్టులు... గరిష్టంగా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. చివరగా రెండు జట్లు ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో తలపడతాయి.2020-2021లో జరిగే వన్డే లీగ్‌లో మొత్తం 13 దేశాలు పాల్గొంటాయి. ఇందులో 12 శాశ్వత సభ్య దేశాలు కాగా ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేత మరో జట్టుగా ఉంటుంది.2019లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు టాప్-10 సభ్య దేశాలు పరస్పర అంగీకారం మేరకు నాలుగు రోజుల టెస్టులను ప్రయోగాత్మకంగా జరుపుకోవచ్చు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టు తొలిసారిగా ఇందుకు వేదికయ్యే అవకాశాలున్నాయి.క్విక్ రివ్యూ: 
ఏమిటి : టెస్ట్ చాంపియన్‌షిప్ నిర్వహణకు నిర్ణయం 
ఎప్పుడు : అక్టోబర్ 13 
ఎవరు : ఐసీసీ 

ఫెడరర్‌కు షాంఘై మాస్టర్స్ సిరీస్ టైటిల్ 
షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో 36 ఏళ్ల స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ మేరకు తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో అక్టోబర్ 15న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫెడరర్ 6-4, 6-3తో విజయం సాధించాడు. తద్వారా సీజన్‌లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఫెడరర్ కెరీర్‌లో ఇది 94వ టైటిల్. 
ఈ విజయంతో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ (94) సరసన ఫెడరర్ సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అమెరికా స్టార్ జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సీరీస్ టోర్నమెంట్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 15 
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత రోజర్ ఫెడరర్ 
ఎక్కడ : చైనాలో 

హారిక జట్టుకు ‘యూరోపియన్’ టైటిల్ 
భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సభ్యురాలిగా ఉన్న బతూమి చెస్ క్లబ్ నోనా జట్టు ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 12 క్లబ్ జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హారిక బృందం 17.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. హారిక జట్టులో నానా జాగ్‌నిద్జె, నినో బతియాష్‌విలి, బేలా ఖొటెనాష్‌విలి, మెలియా సలోమి (జార్జియా) మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీలో హారిక తాను ఆడిన ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బతూమి చెస్ క్లబ్ నోనా జట్టుకి యూరోపియన్ చెస్ క్లబ్ టైటిల్ 
ఎప్పుడు : అక్టోబర్ 15 
ఎవరు : జట్టులో సభ్యురాలిగా భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 

తియాన్‌జిన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత షరపోవా 
రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో అక్టోబర్ 15న జరిగిన తియాన్‌జిన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో షరపోవా విజేతగా నిలిచింది. ఫైనల్లో 7-5, 7-6 (8/6)తో అర్యానా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది. గతేడాది డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్న షరపోవా ఈ ఏడాది ఏప్రిల్‌లో పునరాగమనం చేసింది. చివరిసారి షరపోవా 2015 మేలో రోమ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తియాన్‌జిన్ ఓపెన్ సూపర్ సీరీస్ టోర్నమెంట్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 15 
ఎవరు : మారియా షరపోవా 
ఎక్కడ : చైనాలో

భారత్‌లో వరల్డ్ రెజ్లింగ్ పోటీలు
 వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) పోటీలు 2017లో భారత్‌లో జరగనున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ పోటీల్లో భారత సంతతికి చెందిన కెనడా జాతీయుడు, ‘ద మాడర్న్ డే ఆఫ్ మహారాజా’గా ప్రసిద్ధి చెందిన జిందర్ మహల్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. పంజాబ్‌కు చెందిన యువరాజ్ సింగ్ దేశీ.. 2011లో జిందర్ మహల్ పేరుతో డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రఖ్యాతి గాంచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో జిందాల్ 50వ చాంపియన్ కాగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోటీలు
ఎప్పుడు : డిసెంబర్ 8, 9
ఎక్కడ : న్యూఢిల్లీ

అండర్-19 ప్రపంచకప్ ప్రచారకర్తగా అండర్సన్
ఐసీసీ 2018 అండర్-19 ప్రపంచకప్ ప్రచారకర్త (Ambassador)గా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్ అక్టోబర్ 5న నియమితుడయ్యాడు. ఈ టోర్నీని 2018 జనవరి 13-ఫిబ్రవరి 3 మధ్య న్యూజిలాండ్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు భారత్, ఆసీస్‌లు మూడుసార్లు కప్ నెగ్గగా.. పాక్ రెండుసార్లు, విండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు ఒక్కోసారి గెలిచాయి. మొత్తం 17 దేశాలు టోర్నమెంటులో పాల్గొననున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐసీసీ 2018 అండర్-19 ప్రపంచకప్ ప్రచారకర్త
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : న్యూజిలాండ్
ఎవరు : కోరీ అండర్సన్ (న్యూజిలాండ్)

గురు సాయిదత్‌కు బల్గేరియన్ ఇంటర్నేషనల్ టైటిల్
బల్గేరియన్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అగ్రశ్రేణి క్రీడాకారుడు గురుసాయిదత్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 8న జరిగిన ఫైనల్లో గురు 21-17, 21-16తో ముహమ్మద్ అలీ కర్ట్‌ను 35 నిమిషాల్లో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బల్గేరియన్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సీరీస్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత గురుసాయి దత్ 

చైనా ఓపెన్ విజేత నాదల్ 
చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 8న జరిగిన ఫైనల్లో నాదల్ 6-2, 6-1 తేడాతో నిక్ కిర్గియోస్‌ను ఓడించాడు. మొత్తంగా నాదల్ కెరీర్‌లో ఇది 75వ టైటిల్ కాగా ఈ సీజన్‌లో ఆరవది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా ఓపెన్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత రాఫెల్ నాదల్ 

హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్
జపాన్ గ్రాండ్ ప్రి రేసులో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్’ పొజిషన్‌తో ప్రధాన రేసును ఆరంభించిన హామిల్టన్ అందరికంటే వేగంగా 53 ల్యాపులను 1 గంటా 27ని.31.194 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ సీజన్‌లో అతనికిది ఎనిమిదో టైటిల్ కాగా డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ (306)... వెటెల్ (247) కంటే 59 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జపాన్ గ్రాండ్ ప్రీ రేసు - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : విజేత లూయిస్ హామిల్టన్ 

ఆసియా జూనియర్ చాంపియన్ సామియా
మయన్మార్‌లో జరిగిన ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన సామియా ఇమాద్ ఫారుఖీ చాంపియన్‌గా నిలిచింది. అక్టోబర్ 8న జరిగిన అండర్-15 మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సామియా (భారత్) 15-21, 21-17, 21-19తో విడ్జజా స్టెఫాని (ఇండోనేసియా)పై నెగ్గి పసిడి పతకాన్ని కై వసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ స్వర్ణంతో పాటు 3 కాంస్య పతకాలను సాధించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : అండర్ - 15 మహిళల సింగిల్స్ విజేత సామియా ఇమాద్ ఫారుఖి
ఎక్కడ : మయన్మార్‌లో

ప్రపంచ ఆర్చరీ యూత్ టోర్నీలో భారత జోడీకి స్వర్ణం 
ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన మిక్స్‌డ్ జోడి జెమ్సన్ సింగ్-అంకిత భకట్ రికర్వ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ జోడి ఫైనల్లో 6-2తో ఎర్డెమ్ ఇర్దినీవ్-స్వెత్లానా గొంబొయెవా (రష్యా) జంటపై గెలిచింది. ప్రపంచ ఆర్చరీ చరిత్రలో భారత మిక్స్‌డ్ టీమ్ సాధించిన నాలుగో స్వర్ణం ఇది. గతంలో దీపిక 2009, 2011లో సాధించింది. 2006లో పల్టొన్ హన్‌‌సడా కూడా టైటిల్ గెలిచింది. పురుషుల టీమ్ ఈవెంట్‌లో జెమ్సన్ సింగ్ మరో పతకం గెలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : రికర్వ్ ఈవెంట్‌లో భారత మిక్స్‌డ్ జోడి జెమ్సన్ సింగ్ - అంకిత భకట్‌కు స్వర్ణం 
ఎక్కడ : అర్జెంటీనా

పీబీఎల్ మూడో సీజన్ వేలం 
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్ వేలం అక్టోబర్ 9న జరిగింది. ఇందులో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ హెచ్‌ఎస్ ప్రణయ్‌ను అత్యధికంగా రూ. 62 లక్షలకు సొంతం చేసుకుంది. గత సీజన్‌లో ప్రణయ్‌కు రూ. 25 లక్షలు మాత్రమే లభించాయి. ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా గత ఏడాది చెల్లించిన మొత్తానికి అదనంగా 25 శాతం ఇస్తూ స్టార్ ఆటగాళ్లను వివిధ జట్లు అట్టి పెట్టుకున్నాయి. 
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ రూ. 48.75 లక్షలకు సింధును, అవధ్ వారియర్స్ రూ. 41.25 లక్షలకు సైనా నెహ్వాల్‌ను కొనసాగించగా...పురుషుల టాప్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కోసం అవధ్ రూ. 56.10 లక్షలు వెచ్చించింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్ హంటర్స్ తమతోనే ఉంచుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్‌ను అతని పాత జట్టు బెంగళూరు బ్లాస్టర్స్ రూ. 50 లక్షలతో కొనసాగించగా...లీగ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన మహిళల వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ కోసం కూడా కొత్త టీమ్ అహ్మదాబాద్ రూ. 52 లక్షలు చెల్లించింది. 
పీబీఎల్ జట్లు

అవధ్

ముంబై

బెంగళూరు

హైదరాబాద్

అహ్మదాబాద్

ఢిల్లీ

నార్త్ ఈస్టర్న్

చెన్నై

అమల్లోకి ఐసీసీ కొత్త నిబంధనలు 
 అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రూపొందించిన కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చాయి. 2000 నుంచి ఇప్పటి వరకు అవసరాన్ని బట్టి ఐసీసీ క్రికెట్ నిబంధనల్లో ఆరు సార్లు మార్పుచేర్పులు చేసింది. 
కొత్త నిబంధనలు 
ఇప్పటి వరకు బ్యాట్స్‌మన్ ఒక్కసారి మైదానం వీడితే అతడిని వెనక్కి పిలవడానికి లేదు. అయితే అతను నాటౌట్‌గా తేలితే ఇకపై తర్వాతి బంతి వేసే లోపు మళ్లీ వెనక్కి పిలుచుకోవచ్చు. ‘హ్యాండిల్డ్ ద బాల్’ (వికెట్ల వైపు వెళ్లే బంతిని చేతితో ఆపడం) నిబంధనను పూర్తిగా తొలగించి దానిని ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’లోకి కలిపేశారు.బ్యాట్ పొడవు, వెడల్పులో ఎలాంటి పరిమితులు లేకపోయినా... బ్యాట్ మందం 67 మిల్లీ మీటర్లకు మించరాదు. అనుమానం వస్తే అంపైర్లు బ్యాట్ మందాన్ని పరికరంతో పరీక్షిస్తారు. ఇప్పటి వరకు వార్నర్ తదితరులు ఎక్కువ మందం కలిగిన భారీ బ్యాట్‌లు వాడుతున్నారు.ఐసీసీ లెవల్ 4 నిబంధన ప్రకారం మైదానంలో ఆటగాడు హద్దు మీరి దురుసుగా ప్రవర్తిస్తే అంపైర్ అతడిని మొత్తం మ్యాచ్‌లో ఆడకుండా తప్పించవచ్చు. ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేసినప్పుడు, బ్యాట్స్‌మన్ క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చి గార్డ్ తీసుకున్నప్పుడు చర్యలు తీసుకునే అధికారాన్ని అంపైర్లకు అప్పజెప్పారు.బౌండరీ వద్ద గాల్లోకి ఎగిరి ఫీల్డర్లు పట్టే క్యాచ్‌లు ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. బౌండరీ దాటి గాల్లోనే దాన్ని లోపలికి తోసి మళ్లీ వాటిని అందుకుంటున్నారు. అయితే ఇందులో మార్పు చేశారు. ఇకపై ఫీల్డర్ బంతిని తాకే సమయంలో కూడా అతను బౌండరీ లోపలే ఉండాలి. లేదంటే బౌండరీగా పరిగణిస్తారు.బౌలర్ బంతిని విసిరిన తర్వాత క్రీజులోకి చేరేలోపు రెండు సార్లు నేలను తాకితే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. పిచ్‌కు దూరంగా బంతి పడినా దానిని నోబాల్‌గానే ప్రకటిస్తారు. నోబాల్ కీపర్‌కు అందకుండా వెళ్లి బౌండరీని తాకితే బౌలర్ నోబాల్ మాత్రమే వేసినట్లు. బైస్‌ను అతని ఖాతాలో కలపరు.బ్యాట్స్‌మన్ షాట్ కొట్టిన తర్వాత బంతి ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగిలి వచ్చినా సరే... ఫీల్డర్ క్యాచ్ పడితే దానిని అవుట్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు అలా వస్తే అది నాటౌట్‌గా ఉండేది.బ్యాట్స్‌మన్ పరుగు పూర్తి చేసే సమయంలో ఫీల్డర్/కీపర్ వికెట్లు పడగొట్టడానికి ముందే అతని బ్యాట్‌గానీ, అతనుగానీ క్రీజులో చేరి... ఆ తర్వాత బ్యాట్ గాల్లోకి ఎగరడం లేదా బ్యాట్స్‌మన్ నియంత్రణ కోల్పోయినా అతను సురక్షితంగా క్రీజులో అడుగు పెట్టినట్లే లెక్క. దానిని రనౌట్‌గా పరిగణించరు.అంతర్జాతీయ టి20ల్లో కూడా అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)ను అమలు చేస్తారు. ఒక ఇన్నింగ్‌‌సలో ఒక రివ్యూకు అవకాశం ఉంటుంది. టెస్టుల్లో రివ్యూ చేసిన సమయంలో ‘అంపైర్ నిర్ణయం’ సరైనదిగా డీఆర్‌ఎస్ చూపించినప్పుడు జట్టు ఒక రివ్యూను కోల్పోదు. దీని వల్ల ఇకపై ఇన్నింగ్‌‌సకు 2 రివ్యూలు మాత్రమే ఉంటాయి. 80 ఓవర్ల తర్వాత అదనంగా మరో 2 రివ్యూలు చేరడం ఉండదు.

అండర్-14 ప్రపంచ చెస్ చాంపియన్ ధనుమూరి జిషిత 
ఉరుగ్వే రాజధాని మాంటివీడియోలో జరిగిన ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధనుమూరి జిషిత టైటిల్‌ను దక్కించుకుంది. నిర్ణీత 11 రౌండ్లకుగాను జిషిత తొమ్మిది పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయంతో జిషిత ఆంధ్రప్రదేశ్ నుంచి అండర్-14 బాలికల విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో కోనేరు హంపి (2000లో స్పెయిన్‌లో), ద్రోణవల్లి హారిక (2004లో గ్రీస్‌లో) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా భారత్ నుంచి ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆరో క్రీడాకారిణి జిషిత. హంపి, హారికలతోపాటు పద్మిని రౌత్ (2008లో), మహాలక్ష్మి (2012లో), వైశాలి (2015లో) కూడా టైటిల్స్‌ను సాధించారు. 
రన్నరప్‌గా అర్జున్ 
అండర్-14 ఓపెన్ విభాగంలో వరంగల్ జిల్లాకు చెందిన ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత 11 రౌండ్లు పూర్తయ్యాక అర్జున్ 9 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందాడు. అండర్-18 బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సాక్షి చిత్లాంగె ఎనిమిది పాయింట్లతో రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సాధించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : సెప్టంబర్ 27
ఎవరు : అండర్-14 బాలికల విజేత ధనుమూరి జిషిత
ఎక్కడ : మాంటివీడియో, ఉరుగ్వే

ఆసియా ఇండోర్ క్రీడల్లో 11వ స్థానంలో భారత్ 
తుర్క్‌మెనిస్తాన్‌లోని అష్గబాత్‌లో జరిగిన ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్ 9 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 40 పతకాలతో 11వ స్థానంలో నిలిచింది. 245 పతకాల(89 స్వర్ణాలు, 70 రజతాలు, 86 కాంస్యాల)తో తుర్క్‌మెనిస్తాన్ తొలి స్థానంలో నిలవగా.. 42 స్వర్ణాలు, 32 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి మొత్తం 97 పతకాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఐరాన్ 118 పతకాలతో మూడో స్థానంలో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా ఇండోర్ క్రీడలు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : 40 పతకాలతో 11వ స్థానంలో భారత్ 
ఎక్కడ : తుర్క్‌మెనిస్తాన్ 

ప్రపంచ బ్యాడ్మింటిన్ సమాఖ్య ర్యాంకింగ్స్ 
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సెప్టెంబర్ 28న ప్రకటించిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో భారత్ నుంచి తొలిసారి ఐదుగురు క్రీడాకారులు టాప్-20లో నిలిచారు. కిడాంబి శ్రీకాంత్ 9వ స్థానంలో, హెచ్‌ఎస్ ప్రణయ్ 15వ స్థానంలో, సాయిప్రణీత్ 17వ స్థానంలో, సమీర్ వర్మ 19వ స్థానంలో, అజయ్ జయరామ్ 20వ స్థానంలో ఉన్నారు. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో పీవీ సింధు రెండో స్థానంలో, సైనా నెహ్వాల్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు.

దులీప్ ట్రోఫీ విజేత ఇండియా ‘రెడ్’ 
దేశవాళీ క్రికెట్ సీజన్‌లో తొలి టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో ఇండియా ‘రెడ్’ జట్టు విజేతగా నిలిచింది. ఇండియా ‘బ్లూ’తో జరిగిన ఫైనల్లో ఇండియా ‘రెడ్’ 163 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్‌కు (130 పరుగులు; 11 వికెట్లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దులీప్ ట్రోఫీ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : విజేత ఇండియా రెడ్

మలేసియా గ్రాండ్ ప్రి విజేత వెర్‌స్టాపెన్
మలేసియా గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్(20) విజేతగా నిలిచాడు. నెదర్లాండ్‌‌సకు చెందిన ఈ డ్రైవర్ నిర్ణీత 56 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 30 నిమిషాల 01.290 సెకన్లలో ముగించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఆరో స్థానాన్ని సంపాదించగా... ఒకాన్ పదో స్థానాన్ని పొందాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మలేసియా గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 1 
ఎవరు : విజేత మాక్స్ వెర్‌స్టాపెన్

ఆసీస్‌తో వన్డే సీరీస్‌ను గెలుచుకున్న భారత్ 
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 4-1తో గెలుచుకుంది. అక్టోబర్ 1న జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 

చైనా, రష్యాపై ఐడబ్ల్యూఎఫ్ ఏడాది నిషేధం
బీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్‌లో చైనా, రష్యా వెయిట్‌లిఫ్టర్లకు నిర్వహించిన డోప్ టెస్టులను మళ్లీ పరీక్షించగా... కనీసం మూడు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. దాంతో ఈ రెండు దేశాలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఏడాదిపాటు నిషేధం విధించింది. ఫలితంగా ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న దేశాలు అర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, మాల్డొవా, కజకిస్తాన్, టర్కీ, ఉక్రెయిన్ సరసన చైనా, రష్యా కూడా చేరాయి. ఈ తొమ్మిది దేశాలు ఈ ఏడాది డిసెంబర్‌లో అమెరికాలో జరిగే ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాయి. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలకు కూడా చైనా లిఫ్టర్లు దూరం కానున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా, రష్యా వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్లపై ఏడాది నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ఐడబ్ల్యూఎఫ్ 
ఎందుకు : డోప్ టెస్టుల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినందుకు గాను

■అక్టోబర్ 2017 వ్యక్తులు

పాక్ మాజీ ప్రధాని షరీఫ్‌పై అరెస్టు వారంట్
అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అరెస్టు వారంట్ జారీ అయ్యింది. పనామా పేపర్ల కుంభకోణంతో పదవి కోల్పోయిన షరీఫ్‌ను అవినీతి ఆరోపణలపై అక్కడి అకౌంటబిలిటీ కోర్టు విచారణ చేస్తోంది. కోర్టు విచారణకు షరీష్ పలుమార్లు హాజరు కాకపోవడంతో అక్టోబర్ 26న ఆయనపై న్యాయస్థానం బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను జారీచేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నవాజ్ షరీఫ్‌పై అరెస్టు వారంట్ జారీ 
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎందుకు : పనామా పేపర్ల కుంభకోణం కేసు విచారణకు హాజరు కానందుకు 

మిస్ వర్జీనియాగా హిమాన్వి
 భారత సంతతికి చెందిన పనిదెపు హిమాన్వి(17)ని మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్ వరించింది. ఈ కిరీటాన్ని దక్కించుకున్న మొదటి ఇండియన్ అమెరికన్‌గా హిమాన్వి నిలిచింది. క్లిఫ్టన్లోని సెంట్రెవిల్లె హైస్కూల్లో చదువుకుంటున్న హిమాన్వి... 39 మంది యువతులతో పోటీపడి ఈ అందాల కిరీటాన్ని చేజిక్కించుకుంది. డౌన్ టౌన్ నార్ఫోక్‌లోని టైడ్ వాటర్ కమ్యూనిటీ కాలేజీలోని రోపర్ థియేటర్‌లో మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్‌ను హిమాన్వికి బహూకరించారు. మానసిక ఆరోగ్యం, డ్రగ్‌‌స, ఆల్కహాల్‌లపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హిమాన్వి తనవంతుగా కృషి చేస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ - 2018 
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : పనిదెపు హిమాన్వి

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో జెఫ్ బెజోస్‌కు అగ్రస్థానం
అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు సవరించిన జాబితాను బ్లూమ్‌బర్గ్ అక్టోబర్ 29న ప్రకటించింది. జాబితాలో బేజోస్ 9,380 కోట్ల డాలర్ల ఆస్తితో మొదటి స్థానంలో నిలవగా, 8,870 కోట్ల డాలర్ల సంపదతో బిల్‌గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు. బిల్‌గేట్స్ కంటే బేజోస్ ఆస్తి 510 కోట్ల డాలర్లు అధికం. ఈ జాబితాలో 2013 సంవత్సరం నుంచి బిల్‌గేట్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : జెఫ్ బెజోస్

బీసీసీఐ మాజీ జీఎం ఎంవీ శ్రీధర్ మృతి
భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్‌‌స), హైదరాబాద్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మాటూరి వెంకట శ్రీధర్ మృతి చెందారు. అక్టోబర్ 30న గుండెనొప్పితో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్ను మూశారు.
1966 ఆగస్టు 2న విజయవాడలో జన్మించిన ఎంవీ శ్రీధర్ హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1988లో హైదరాబాద్ రంజీ జట్టు తరఫున తొలిసారి ఆడారు. 2000లో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కెరీర్‌లో 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శ్రీధర్ 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో మొత్తం 6,701 పరుగులు సాధించారు.
2000 నుంచి 2006 వరకు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శిగా, 2010 నుంచి 2012 వరకు ఉపాధ్యక్షుడిగా, 2012 నుంచి 2014 వరకు కార్యదర్శిగా పనిచేశారు. 2010-2011 సీజన్‌లో హైదరాబాద్ రంజీ జట్టు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు. 2013లో బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్‌‌స జనరల్ మేనేజర్ (జీఎం)గా నియమితులై 2017 సెప్టెంబర్ 27 వరకు కొనసాగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీసీసీఐ మాజీ జీఎం, హైదరాబాద్ రంజీ మాజీ కెప్టెన్ మృతి
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : మాటూరి వెంకట శ్రీధర్ 
ఎక్కడ : హైదరాబాద్

ఎన్‌ఐఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మోదీ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి యోగేశ్ చందర్ మోదీ అక్టోబర్ 30న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో కొనసాగిన శరద్‌కుమార్ పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మోదీని నియమించింది. ఆయన 2021 మే 31 వరకు పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఐఏ చీఫ్ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 30 
ఎవరు : యోగేశ్ చందర్ మోదీ
ఎందుకు : శరద్‌కుమార్ పదవీకాలం ముగియడంతో

న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డెర్న్
న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డెర్న్ అక్టోబర్ 26న వెల్లింగ్టన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఈమె న్యూజిలాండ్‌కు మూడో మహిళా ప్రధాని కాగా, గత 150 ఏళ్లలో ప్రధానైన అతి పిన్న వయస్కురాలు.

కశ్మీర్ చర్చల దూతగా దినేశ్వర్ శర్మ
కశ్మీర్ సమస్యకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వ దూతగా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను నియమించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 24న ప్రకటించారు.

సొలిసిటర్ జనరల్ రంజిత్ రాజీనామా 
సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ అక్టోబర్ 20న తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రంజిత్ తన రాజీనామా లేఖను న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కార్యాలయానికి పంపారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన రంజిత్ మూడేళ్ల పాటు పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు. వాటిలో నోట్లరద్దు, కాలుష్యం పెరుగుదలకు సంబంధించిన కేసులున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ రాజీనామా 
ఎప్పుడు : అక్టోబర్ 20 
ఎందుకు : వ్యక్తిగత కారణాలతో

సీబీఐ ప్రత్యేక డెరైక్టర్‌గా రాకేశ్ ఆస్థానా 
 నిఘా, భద్రత, దర్యాప్తు విభాగాల్లో అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 22న కీలక మార్పులు చేసింది. ఐపీఎస్ అధికారులు రాకేశ్ ఆస్థానాను సీబీఐ ప్రత్యేక డెరైక్టర్‌గా, గుర్బాచన్ సింగ్‌ను ఇంటెలిజెన్‌‌స బ్యూరో ప్రత్యేక డెరైక్టర్‌గా, సుదీప్ లఖ్తాకియాను సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజేశ్ రంజన్, ఏపీ మహేశ్వరిలకు బీఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక డెరైక్టర్ జనరళ్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.

కశ్మీర్‌పై చర్చలకు మధ్యవర్తిగా ఐబీ మాజీ డెరైక్టర్ 
జమ్మూ కశ్మీర్‌లో శాంతి స్థాపనలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆ రాష్ట్రంలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్‌‌స బ్యూరో(ఐబీ) మాజీ డెరైక్టర్ దినేశ్వర్ శర్మకు అప్పగించింది. ఈ మేరకు అక్టోబర్ 23న హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరాలు వెల్లడించారు. 
1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన దినేశ్వర్ శర్మ 2014 నుంచి 2016 వరకూ ఇంటెలిజెన్‌‌స బ్యూరో డెరైక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కశ్మీర్‌లో శాంతి స్థాపన చర్చల మధ్యవర్తిగా ఐబీ మాజీ డెరైక్టర్ దినేశ్వర్ శర్మ 
ఎప్పుడు : అక్టోబర్ 23 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

పోస్టల్ బ్యాంక్ సీఈఓగా సురేష్ సేథీ
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)కు కొత్త సీఈవోగా సురేష్ సేథీ నియమితులయ్యారు. ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి సీఈవోగా పనిచేస్తున్న ఏపీ సింగ్ స్థానంలో సేథీ నియమితులయ్యారు. సేథీ వోడాఫోన్ ఎం- పెసాకు ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. సురేష్ సేథీకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల్లో 27 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పోస్టల్ బ్యాంక్ సీఈఓగా సురేష్ సేథీ 
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

చైనా మోస్ట్ పాపులర్ నేతగా జిన్‌పింగ్
ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రస్తుత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. జిన్‌పింగ్‌కు దిగ్గజ గౌరవాన్ని కల్పిస్తూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) అక్టోబర్ 24న తీర్మానం చేసింది. జిన్‌పింగ్ పేరును, ఆయన సిద్ధాంతాలను సీపీసీ రాజ్యాంగంలో చేరుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. తాజాగా సెంట్రల్ కమిటీకి ఎన్నికవడంతో రెండోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జిన్‌పింగ్‌కు లాంఛనమే. అయితే మావో తరహాలో మూడోసారి కూడా అధ్యక్ష పదవి చేపట్టేలా ఆయన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. 
కాంగ్రెస్ సమావేశాల చివరి రోజున జిన్‌పింగ్ సిద్ధాంతాలను రాజ్యాంగంలో చేరుస్తూ సీపీసీ ఆమోదం తెలిపింది. జిన్‌పింగ్‌కు ముఖ్యనేత(కోర్ లీడర్) స్థాయిని ప్రకటించింది. దీంతో ఇకపై పార్టీలోని నేతలందరికంటే అత్యున్నత స్థాయిలో జిన్‌పింగ్ ఉంటారు. ఇప్పటి వరకూ మావోతో పాటు మాజీ అధ్యక్షుడు డెంగ్ జియావోపింగ్ ఆలోచనలకు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగంలో చోటు దక్కింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మావో తర్వాత చైనా మోస్ట్ పాపులర్ లీడర్ 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : జిన్‌పింగ్ 
ఎక్కడ : చైనా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ సమావేశాల్లో తీర్మానం 

ప్రముఖ గాయని గిరిజా దేవి మృతి 
ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని గిరిజా దేవి (88) అక్టోబర్ 24న కోల్‌కతాలో కన్నుమూశారు. ‘క్వీన్ ఆఫ్ తుమ్రీ’గా ఆమె ప్రసిద్ధికెక్కారు. బనారస్ ఘరానాకు చెందిన ఈ గాయనికి 1972లో పద్మశ్రీ, 1989లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని గిరిజా దేవి మృతి 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : క్వీన్ ఆఫ్ తుమ్రీగా ప్రసిద్ధికెక్కిన గిరిజా దేవి 

మాల్టా పాత్రికేయురాలు గలిజియా హత్య
పనామా పత్రాలతోపాటు పలు పరిశోధనాత్మక కథనాలతో మాల్టాలో ప్రకంపనలు సృష్టించిన ప్రముఖ పాత్రికేయురాలు డాఫ్నే కరువానా గలిజియా(53) దారుణ హత్యకు గురయ్యారు. మాల్టాలోని బిద్నిజా ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బాంబుదాడికి గురైంది. ఈ ఘటనను ఆ దేశ ప్రధాని జోసెఫ్ మస్కట్ తీవ్రంగా ఖండించారు.

కృష్ణా బోర్డు కొత్త సభ్య కార్యదర్శిగా ఎ.పరమేశం 
సమీర్ చటర్జీ స్థానంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కొత్త సభ్య కార్యదర్శిగా పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్ అండ్ డిజైనింగ్ చీఫ్ ఇంజినీర్ ఎ.పరమేశం నియమితులయ్యారు. బోర్డు పక్షపాత ధోరణిని నిరసిస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ బోర్డు సభ్య కార్యదర్శి పదవి నుంచి సమీర్ చటర్జీని తొలగించింది. ఆయన స్థానంలో ఎ.పరమేశంను నియమించింది. అలాగే బోర్డులో కొత్తగా హరికేశ్ మీనాను సభ్యుడిగా నియమించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కృష్ణా బోర్డుకి కొత్త సభ్య కార్యదర్శి నియామకం 
ఎప్పుడు : అక్టోబర్ 11 
ఎవరు : ఎం.పరమేశం 
ఎందుకు : తెలంగాణ ఫిర్యాదుతో సమీర్ చటర్జీని తొలగించిన కేంద్రం 

లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ 
తెలంగాణ, ఏపీలకు లోకాయుక్తగా వ్యవహరిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి అక్టోబర్ 11న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు సన్మానం చేశారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో కొత్త లోకాయుక్త నియామకానికి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఉప లోకాయుక్త గంగిరెడ్డి లోకాయుక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలంగాణ, ఏపీ లోకాయుక్త పదవీ విర మణ 
ఎప్పుడు : అక్టోబర్ 11 
ఎవరు : జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి 

ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్ 
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్(62) పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అక్టోబర్ 11న ప్రకటించింది. 
ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా పనిచేసిన గజేంద్ర చౌహాన్ పదవీకాలం ముగిసిన 7 నెలల అనంతరం కేంద్రం అనుపమ్ ఖేర్‌ను చైర్మన్‌గా నియమించింది. ఖేర్ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్‌ఎస్‌డీ)లో డిగ్రీ పొందారు. 500 పైచిలుకు చిత్రాల్లో నటించారు. సినిమా, కళల రంగానికి అందించిన సేవలకు గానూ 2004లో పద్మశ్రీ, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్ 
ఎప్పుడు : అక్టోబర్ 11 
ఎవరు : కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ 

యూఎస్‌ఐబీసీ అధ్యక్షురాలిగా నిషా దేశాయ్ బిస్వాల్ 
యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ - USIBC అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అమెరికన్ నిషా దేశాయ్ బిస్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు యూస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ 11న ప్రకటించింది. నిషా బిస్వాల్.. 2013-2017 వరకు అమెరికా ప్రభుత్వంలో దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలోనే భారత్ - అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కోసం ఆమె విశేషంగా కృషి చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, వ్యాపార చర్చల్లో కీలక పాత్ర పోషించారు. 
భారత్, అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం యూస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్‌ను 1975లో ఏర్పాటు చేశారు. ఇందులో భారత్, అమెరికాలోని 350కిపైగా అత్యుత్తమ కంపెనీలు సభ్యత్వం కలిగి ఉంటాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూఎస్‌ఐబీసీకి అధ్యక్షురాలిగా నిషా దేశాయ్ బిస్వాల్ 
ఎప్పుడు : అక్టోబర్ 11 
ఎవరు : యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ 

ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చిన న్యాయస్థానం 
తొమ్మిదేళ్ల క్రితం సంచలన రేపిన ఆరుషి తల్వార్, పనిమనిషి హేమ్‌రాజ్ హత్య కేసుల్లో అలహాబాద్ హైకోర్టు అక్టోబర్ 12న కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో కింది కోర్టు దోషులుగా తేల్చిన ఆరుషి తల్లిదండ్రులు నుపుర్, రాజేశ్ తల్వార్‌లను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సమర్పించిన ఆధారాలు వారిద్దరిని దోషులుగా నిర్ధారించేందుకు సరిపోవని తేల్చింది. 
ఆరుషి, హేమ్‌రాజ్ హత్యకేసుల్లో 2013లో ఘజియాబాద్ సీబీఐ కోర్టు నుపుర్, రాజేశ్‌లకు జీవిత ఖైదు విధించింది. 

ప్రణబ్ పుస్తకం ‘కొలిషన్ ఇయర్స్’ ఆవిష్కరణ 
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘కొలిషన్ ఈయర్స్(సంకీర్ణ సంవత్సరాలు) 1996-2012’ పుస్తకావిష్కరణ అక్టోబర్ 13న జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్.. 2004లో ప్రధాని అయ్యేందుకు తనకన్నా, నాటి తన మంత్రివర్గ సహచరుడు ప్రణబ్ ముఖర్జీకే ఎక్కువ అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కొలిషన్ ఇయర్స్ పుస్తకావిష్కరణ 
ఎప్పుడు : అక్టోబర్ 13 
ఎవరు : రచయిత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 

భారత తొలి ఒలింపియన్ స్విమ్మర్ షంషేర్ ఖాన్ మృతి 
ఒలింపిక్స్ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన తొలి స్విమ్మర్ మెహబూబ్ షంషేర్ ఖాన్ అక్టోబర్ 15న గుంటూరులో కన్నుమూశారు. 87 ఏళ్ల షంషేర్ ఖాన్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం కైతేపల్లి గ్రామానికి చెందిన షంషేర్ ఖాన్ 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల బ్రెస్ట్‌ో్టక్ ్ర(హీట్స్‌లో ఐదో స్థానం), 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ (హీట్స్‌లో ఆరో స్థానం) ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. 
మరిన్ని వివరాలు... 
1930 ఆగస్టు 2వ తేదీన జన్మించిన షంషేర్ ఖాన్ ఎలాంటి కోచ్‌లు, సదుపాయాలు లేకుండానే కృష్ణానదిలో ఈత నేర్చుకున్నారు.16 సంవత్సరాల వయస్సులో 1946లో బెంగళూరులోని సదరన్ కమాండ్‌లో ఆర్మీలో చేరారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉండటంతో ఈతలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు.1954 నుంచి వరుసగా మూడుసార్లు సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచారు.మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆర్మీలో రకరకాల విధుల కారణంగా స్విమ్మింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. 1962లో ఆయన అసోంకు బదిలీ అయ్యారు. అక్కడ చైనా బోర్డర్ వరకు రోడ్డు వేసే పనిలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1973లో సుబేదార్ హోదాలో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక కొన్నేళ్ల పాటు సికింద్రాబాద్ ఆర్మీ క్యాంటీన్‌లో పనిచేసి స్వగ్రామానికి వచ్చారు.

క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో తొలి ఒలింపిక్ స్విమ్మర్ మృతి 
ఎప్పుడు : అక్టోబర్ 15 
ఎవరు : షంషేర్ ఖాన్ 
ఎక్కడ : గుంటూరు 

అంతర్జాతీయ విత్తన సలహామండలి అధ్యక్షునిగా కేశవులు 
అంతర్జాతీయ విత్తన సలహా మండలి అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కె.కేశవులు ఎంపికయ్యారు. ఈ సలహామండలిలో 8 మంది ఓఈసీడీ, ఇస్టా, ఐఎస్‌ఎఫ్ వంటి అంతర్జాతీయ విత్తన సంస్థల అధికారులు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ సలహా మండలి విత్తన పరిశ్రమ అవసరాలు, పరిశోధన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ విత్తన నాణ్యత, అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులు, నియమ నిబంధనల రూపకల్పన తదితర విషయాలలో కీలక పాత్ర పోషించనుంది. డాక్టర్ కేశవులు నియామకంతో దేశీయంగా విత్తన పరీక్షా కేంద్రాలను బలోపేతం చేయడం, విత్తన రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల మధ్య సమతుల్యత సాధించడం సులభతరమవుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ విత్తన సలహామండలి అధ్యక్షునిగా కేశవులు 
ఎప్పుడు : అక్టోబర్ 16 
ఎవరు : తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు 

శ్రీశాంత్‌పై నిషేధం కొనసాగుతుందన్న కేరళ హైకోర్టు 
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేస్ బౌలర్ శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన నిషేధం కొనసాగుతుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2013-ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో నిందితుడైన 34 ఏళ్ల శ్రీశాంత్ బోర్డు నిషేధాన్ని కోర్టులో సవాలు చేశాడు. ఆగస్టు 7న సింగిల్ జడ్జి బెంచ్ అతడిని నిర్దోషిగా తేల్చింది. అయితే దీనిపై బీసీసీఐ హైకోర్టుకు వెళ్లింది. అక్టోబర్ 17న ఈ కేసును చీఫ్ జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్, జస్టిస్ రాజా విజయరాఘవన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, నిషేధాన్ని కొనసాగిస్తూ బీసీసీఐకి అనుకూలంగా తీర్పునిచ్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : శ్రీశాంత్‌పై నిషేధం కొనసాగుతుందని తీర్పు 
ఎప్పుడు : అక్టోబర్ 17 
ఎవరు : కేరళ హైకోర్టు 
ఎందుకు : స్పాట్ ఫిక్సింగ్ కేసులో 

పాక్ క్రికెటర్ ఖలీద్ లతీఫ్‌పై ఐదేళ్ల నిషేధం 
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఖలీద్ లతీఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో పాటు రూ. 1 మిలియన్ (పాక్ కరెన్సీ) జరిమానా కూడా విధించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చెందిన అవినీతి వ్యతిరేక కోడ్‌లోని ఆరు నిబంధనలను లతీఫ్ అతిక్రమించినట్టు యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. దీంతో లతీఫ్‌పై పీసీబీ ఈ మేరకు చర్య తీసుకుంది. ఫిబ్రవరిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో లతీఫ్ స్పాట్ ఫిక్సంగ్‌కు పాల్పడినట్టు పీసీబీ విచారణకు ఆదేశించింది. అయితే ఈ నిషేధంపై అప్పీల్ చేసుకునేందుకు లతీఫ్‌కు 14 రోజుల గడువునిచ్చారు. ఇదే ఆరోపణలతో ఇంతకుముందే టెస్టు ఓపెనర్ షర్జీల్ ఖాన్‌పై కూడా ఐదేళ్ల నిషేధం విధించినా ఆ తర్వాత దాంట్లో సగం కాలాన్ని సస్పెండ్ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఖలీద్ లతీఫ్‌పై 5 ఏళ్ల నిషేధం 
ఎప్పుడు : అక్టోబర్ 17 
ఎవరు : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 
ఎందుకు : స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో

ఎస్‌బీఐ కొత్త చైర్మన్ రజనీష్ కుమార్
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్‌గా రజనీష్ కుమార్ (59) అక్టోబర్ 4న నియమితులయ్యారు. ఆక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. ప్రస్తుత చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానంలో రజనీష్‌ని నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది.
రజనీష్ 2015 మే 26న ఎస్‌బీఐ బోర్డులో చేరారు. ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీగా ఉన్నారు. అంతకు ముందు ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ, బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్ ఫైనాన్‌‌స అండ్ లీజింగ్ స్ట్రాటెజిక్ బిజినెస్ యూనిట్)గా, బ్రిటన్, కెనడా విభాగాల్లోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు. 
అరుంధతీ భట్టాచార్య తొలిసారిగా 2013లో బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఈ హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరుగుతున్న నేపథ్యంలో 2016 అక్టోబర్‌లో ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎస్‌బీఐ కొత్త చైర్మన్ నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రజనీష్ కుమార్
ఎందుకు : ప్రస్తుత చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలం ముగియడంతో

ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ తిరిగి ఎన్నికయ్యారు. అక్టోబర్ 5న ఆగ్రాలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో అఖిలేశ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి పదవీకాలాన్ని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచుతూ ఎస్పీ రాజ్యాంగాన్ని సవరించారు. దీంతో అఖిలేష్ ఈ పదవిలో ఐదేళ్లు కొనసాగుతారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : ఆగ్రా (ఉత్తరప్రదేశ్)
ఎవరు : అఖిలేష్ యాదవ్

భారత్‌లో అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ
ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ఇండియాలోని వంద మంది బిలియనీర్ల జాబితా-2017’లో రిలయన్‌‌స ఇండస్ట్రీస్ చీఫ్ ముకేష్ అంబానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు రూ.2.5 లక్షల కోట్ల (38 బిలియన్ డాలర్లు) నికర సంపద విలువతో వరుసగా పదోసారి మొదటిస్థానంలో నిలిచాడు. దీంతో ఆయన ఆసియాలోని టాప్-5 కుబేరుల్లో కూడా ఒకరిగా నిలిచారు. తాజా జాబితాలో ఉన్నవారి మొత్తం సంపద విలువ 26 శాతం వృద్ధితో రూ.31 లక్షల కోట్లకుపైగా (479 బిలియన్ డాలర్లు) పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది.
నివేదిక ముఖ్యాంశాలు

గతేడాది రెండో స్థానంలో ఉన్న దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా) ఈ సారి తొమ్మిదో స్థానానికి పడిపోయారు. ఆయన సంపద విలువ 12.1 బిలియన్ డాలర్లు.ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీకి 3.15 బిలియన్ డాలర్లతో 45వ స్థానం.అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీకి 11 బి. డాలర్లతో పదో స్థానం.ఆచార్య బాలకృష్ణకు (పతంజలి ఆయుర్వేద్) రూ.43,000 కోట్ల (6.55 బిలియన్ డాలర్లు)తో 48వ స్థానంనుస్లీ వాడియాకి (జాబితాలో కొత్తగా స్థానం పొందారు) 5.6 బిలియన్ డాలర్ల సంపదతో 25వ స్థానంవెటరన్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీకి 9.3 బిలియన్ డాలర్ల సంపదతో 12వ స్థానంఫ్యూచర్ గ్రూప్ కిశోర్ బియానీకి 2.75 బిలియన్ డాలర్లతో 55వ స్థానంఫోర్బ్స్ వంద మంది బిలియనీర్లలో ఏడుగురు మహిళలకు స్థానం
భారత్‌లో టాప్-10 ధనవంతులు

స్థానం

పేరు

సంపద

బిలియన్ డాలర్లు

రూపాయలు(కోట్లు)

1.

ముకేశ్ అంబానీ

38

2,48,102

2.

అజీమ్ ప్రేమ్ జీ

19

1,24,051

3.

హిందుజా సోదరులు

18.4

1,20,133

4.

లక్ష్మీ మిట్టల్

16.5

1,07,728

5.

పల్లోంజి మిస్త్రీ

16

1,04,464

6.

గోద్రేజ్ కుటుంబం

14.2

92,711

7.

శివ్ నాడార్

13.6

88,794

8.

కుమార బిర్లా

12. 6

82,265

9.

దిలీప్ సంఘ్వీ

12.1

79,000

10.

గౌతమ్ అదానీ

11

71,819

ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్లలో ఏడుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. వీరిలో ఒ.పి.జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ 7.5 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానంలో ఉన్నారు.

టాప్-100 లో మహిళా బిలియనీర్లు

స్థానం

పేరు

సంపద (బిలియన్ డాలర్లలో)

16

సావిత్రి జిందాల్

7.5

40

గుప్తా కుటుంబం

3.45

48

వినోద్ & అనిల్ రాయ్ గుప్తా

3.11

51

జైన్ కుటుంబం

3

63

అమాల్గమేషన్‌‌స గ్రూప్

2.5

71

లీనా తివారీ

2.19

72

కిరణ్ మజుందార్ షా

2.16

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్ల జాబితా 2017
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : భారత్
ఎవరు : ముకేశ్ అంబానీకే అగ్రస్థానం (వరుసగా పదోసారి)
ఎందుకు : రూ.2.5 లక్షల కోట్ల నికర సంపద విలువ కలిగినందుకు

అరుంధతీ భట్టాచార్య పదవీ విరమణ
ఎస్‌బీఐ చరిత్రలో తొలి మహిళా చైర్‌పర్సన్ అయిన అరుంధతీ భట్టాచార్య అక్టోబర్ 6న పదవీ విరమణ చేశారు. ఆమె 2013లో ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరుగుతున్న నేపథ్యంలో 2016 అక్టోబర్‌లో ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌బీఐ చైర్‌పర్సన్ పదవీ విరమణ
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : అరుంధతీ భట్టాచార్య

తమిళ హీరో జై డ్రైవింగ్ లెసైన్స్‌రద్దు 
తమిళ సినీ నటుడు జై డ్రైవింగ్ లెసైన్స్‌ను చెన్నైలోని సైదాపేట కోర్టు 6 నెలల పాటు రద్దు చేసింది. సెప్టెంబర్ 21న మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ అడయారు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గోడను ఢీకొన్న కేసులో ట్రాఫిక్ పోలీసులు జైపై చార్జిషీట్ దాఖలు చేశారు. అక్టోబర్ 3న కోర్టులో చార్జిషీట్ నకలును పొందిన జై ఆ తరువాత విచారణకు హాజరు కాకపోవడంతో మేజిస్ట్రేట్ అతనిపై అరెస్ట్ వారెంట్ జారీచేశారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు జై కోర్టులో అంగీకరించారు. సినిమాల్లోలా ప్రవర్తించరాదని జైకి హితవు పలికి రూ.5,200 అపరాధ రుసుము విధించిన కోర్టు ఆరు నెలల పాటు ఆయన డ్రైవింగ్ లెసైన్‌‌సను రద్దుచేసింది.

బీబీసీ శక్తిమంతమైన మహిళల్లో మిథాలీ రాజ్ 
 భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ‘బీబీసీ’ రూపొందించిన అత్యంత శక్తిమంతమైన భారత మహిళల జాబితాలో నిలిచింది. బీబీసీ విడుదల చేసిన ఈ టాప్-100 ప్రభావవంతమైన మహిళల్లో ఆమె స్థానం సంపాదించింది. భారత్‌కే చెందిన రచయిత్రి, యోగా గురువు ఐరా త్రీవేదీ, తీహార్ జైళ్లో పిల్లలకు పాఠాలు బోధిస్తున్న తులికా కిరణ్, ఎంబైబ్ సంస్థ సీఈవో అదితి అవస్థి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి మెహ్రూనిసా సిద్ధిఖీ, మహిళా ఉద్యమకారిణి డాక్టర్ ఊర్వసి సాహ్ని, బిజినెస్ ఎనలిస్ట్ నిత్యా తుమ్మలచెట్టి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 
అక్టోబర్‌లో ‘బీబీసీ 100 విమెన్ చాలెంజ్’ పేరుతో భారత్‌లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బీబీసీ శక్తిమంతమైన మహిళల జాబితా
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : జాబితాలో చోటు సంపాదించిన ఏడుగురు భారతీయ మహిళలు

ఫోర్బ్స్ అత్యధిక సంపాదకుల జాబితాలో ప్రియాంక
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ తారల్లో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా స్థానం దక్కించుకున్నారు. రూ.65.52కోట్ల పారితోషికం తీసుకుంటూ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన టాప్-10 జాబితాలో ప్రియాంకా ఎనిమిదో స్థానంలో నిలిచారు. ‘క్వాంటికో’ టీవీ షోతో పశ్చిమదేశాల్లో వినోద రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంకా.. ‘బేవాచ్’ సినిమాతో హాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. 
రూ.271.85కోట్ల ఆర్జనతో కొలంబియా నటి సోఫియా వెర్గారా వరుసగా ఆరో ఏడాదీ టాప్-10లో నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ నటి కేలీ కుకో రూ.170.39 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. గ్రేస్ అనాటమీ నటీమణి ఎలెన్ పోంపియో రూ.85 కోట్ల సంపాదనతో మూడో స్థానం దక్కించుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ నటుల జాబితాలో ప్రియాంకకు 8వ స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 27 
ఎవరు : ఫోర్బ్స్ మ్యాగజైన్ 

‘ప్లేబాయ్’ వ్యవస్థాపకుడు హెఫ్నర్ కన్నుమూత
ప్రముఖ మ్యాగజైన్ ‘ప్లేబాయ్’ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ మృతి చెందారు. సెప్టెంబర్ 28న స్వగృహంలో హెఫ్నర్ కన్నుమూసినట్లు ప్లేబాయ్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 1926 ఏప్రిల్ 9న షికాగోలో జన్మించిన హెఫ్నర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1944-1946 మధ్య) అమెరికా ఆర్మీకి సంబంధించిన పత్రికలో పనిచేశారు. ప్రత్యేకంగా పురుషుల కోసం ఉన్నతస్థాయిలో మ్యాగజైన్ ఉండాలన్న సంకల్పంతో 1953లో ప్లేబాయ్ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్లేబాయ్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు హ్యూ పెఫ్నర్ కన్నుమూత 
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎక్కడ : షికాగో

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం 
ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు నియమితుల య్యారు. తమిళనాడు, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, అండమాన్ నికోబార్ దీవులకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 1న నియమించారు. 

ప్రస్తుతం అసోం గవర్నర్‌గా ఉన్న బన్వారీలాల్ పురోహిత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు.అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న జగదీశ్ ముఖిని పురోహిత్ స్థానంలో అసోం గవర్నర్‌గా నియమించారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ మాలిక్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. బిహార్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ గంగా ప్రసాద్.. మేఘాలయ గవర్నర్‌గా, ఎన్‌ఎస్‌జీలో పని చేసిన రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, నేవీ స్టాఫ్ అడ్మైరల్ మాజీ చీఫ్ దేవేంద్ర కుమార్ జోషి.. అండమాన్, నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.బన్వారీలాల్ పురోహిత్: మహారాష్ట్రలోని విదర్భకు చెందిన వ్యక్తి. సామాజిక, రాజకీయ, విద్య, పారిశ్రామిక రంగాల్లో దశాబ్దాలుగా క్రీయాశీలకంగా ఉన్నారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో నాగ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించిన ‘ది హితవాద’ ఇంగ్లిష్ దినపత్రికను పునరుద్ధరించారు.
సత్యపాల్ మాలిక్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 1990 ఏప్రిల్ 21 నుంచి 1990 నవంబర్ 10 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్ గవర్నర్ పదవి ఈయనకు వరించింది. 
గంగా ప్రసాద్: 1994లో బిహార్ ఎమ్మెల్సీగా తొలిసారి ఎన్నికయ్యారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన మండలిలో విపక్ష నేతగా పని చేశారు.
జగదీశ్‌ముఖి: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఎమర్జెన్సీ సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీలోని జనక్‌పురి అసెంబ్లీ స్థానం నుంచి 7 సార్లు ఎన్నికయ్యారు. మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు.
దేవేంద్ర కుమార్ జోషి: 1974 ఏప్రిల్ 1న ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో చేరారు. నేషనల్ డిఫెన్‌‌స అకాడమీ పూర్వ విద్యార్థి. 2012 ఆగస్టు నుంచి 2014 ఫిబ్రవరి 26 వరకు నేవల్ స్టాఫ్ చీఫ్‌గా చేశారు. ఐఎన్‌ఎస్ సింధురత్నలో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం అందుకున్నారు.
బీడీ మిశ్రా: ఎన్‌ఎస్‌జీ (బ్లాక్ కాట్ కమాండోస్) కౌంటర్ హైజాక్ టాస్క్ ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు. 1993లో భారత విమానం హైజాక్ అయిన సమయంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొనేందుకు వలంటీర్‌గా ముందుకొచ్చారు. కౌంటర్ టైస్ట్ ఆపరేషన్‌‌సలో చురుకైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. 

డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డెరైక్టర్‌గా సౌమ్య 
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ కూతురు సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కార్యక్రమాల అమలు విభాగానికి డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (డీడీపీ-డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్)గా నియమితులయ్యారు. ఈ పదవి డబ్ల్యూహెచ్‌వోలో రెండో అత్యున్నతమైనది కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు డెరైక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల వైద్య నిపుణురాలు అయిన సౌమ్య క్షయ నిర్మూలనపై చేసిన పరిశోధనలతో గుర్తింపు పొందారు. గతంలో ఆమె చెన్నైలోని జాతీయ క్షయ పరిశోధనా సంస్థలో డెరైక్టర్‌గా పనిచేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డెరైక్టర్‌గా భారతీయ శాస్త్రవేత్త
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : సౌమ్య స్వామినాథన్ 

మధుకోడాపై ఈసీ మూడేళ్ల నిషేధం
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ఎన్నికల సంఘం సెప్టెంబర్ 27న అనర్హత వేటు వేసింది. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. ఎన్నికల ఖర్చులపై సరైన వివరాలు ఇవ్వని కారణంగా ఈ చర్యలు తీసుకుంది. మధుకోడా జార్ఖండ్ సీఎంగా 2006 నుంచి 2008 వరకు పనిచేశారు.

జానపద కళాకారుడు తండ భిక్షంకన్నుమూత
పాచీన కళారూపమైన తెర చీరల పండితుడు, జానపద కళాకారుడు తండ భిక్షం (101) అక్టోబర్ 1న మరణించారు. ఆయన.. కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. పలు తాళపత్ర గ్రంథాలు రాశారు. తెర చీరల ప్రదర్శనకు పేరు తెచ్చారు. 

బాలీవుడ్ నటుడు టామ్ ఆల్టర్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు టామ్ ఆల్టర్ (67).. సెప్టెంబర్ 29న ముంబైలో కన్నుమూశారు. అమెరికా సంతతికి చెందిన ఆయన ఇండియా షోబిజ్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2008లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

సూకీ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదా ఉపసంహరణ 
మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీకి గతంలో ప్రదానం చేసిన ఫ్రీడమ్ ఆఫ్ ఆక్సఫర్డ్ హోదాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆక్సఫర్డ్ సిటీ కౌన్సిల్ అక్టోబర్ 2న ప్రకటించింది. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడుల పట్ల ఆమె స్పందన సరిగ్గా లేదని పేర్కొన్న సంస్థ.. ఈ మేరకు గౌరవ హోదాను ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించింది. 
మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం అంగ్‌సాన్ సూకీ చేసిన పోరాటానికి గుర్తింపుగా ఆక్సఫర్డ్ సిటీ కౌన్సిల్ ఆమెకు 1997లో ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదాను ప్రదానం చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంగ్‌సాన్ సూకీ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదా ఉపసంహరణ 
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ సిటీ కౌన్సిల్

*🌷మధ్యతరగతి ప్రజలకు అతిపెద్ద ఊరట*

🌷మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో అతిపెద్ద ఊరట కల్పించబోతుంది. వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థికమంత్రిత్వ శాఖ పెంచబోతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం మాత్రమే కాక, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు తెలిసింది. 

🌷ప్రస్తుతం రూ.2,50,000గా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.3,00,000కు పెంచాలనే ప్రతిపాదనలు ఆర్థికమంత్రిత్వ శాఖ ముందుకొచ్చినట్టు పేర్కొన్నాయి.  పన్ను మినహాయింపును పెంచడంతో పాటు, శ్లాబులను సర్దుబాటు చేయడం మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా శాలరీ క్లాస్‌ వారికి ఎంతో మేలు చేకూరనుందని తెలుస్తోంది. 

🌷గతేడాది బడ్జెట్‌లో పన్ను శ్లాబులను మార్చనప్పటికీ, చిన్న పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరటనిస్తూ.. వార్షిక ఆదాయం రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు ఉన్నవారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. 

🌷ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం విధించాలని ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. అదేవిధంగా రూ.10-20 లక్షలున్న వారికి 20 శాతం, రూ.20 లక్షలు పైన ఆదాయమున్న వారికి 30 శాతం పన్ను రేటును విధించాలని చూస్తోంది.

🌷ద్రవ్యోల్బణం పెరగడంతో జీవన వ్యయాలు భారీగా పెరిగాయని, దీంతో మినహాయంపుల బేసిక్‌ పరిమితిని, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ రోజు జి కె

1)👉 వరల్డ్ ఆర్చెరీ చాంప్ ఎవరు?
A: *దక్షిణ కొరియా*

2)👉 ఫీఫా అండర్ 20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
A: *ఇంగ్లాండ్*

3)👉 ప్రపంచ హ్యాండ్ బాల్ (పు) విజేత ఎవరు?
A: *ఫ్రాన్స్*

4)👉 వాకర్ కప్ గోల్ఫ్ విజేత ఎవరు?
A: *అమెరికా*

5)👉 వరల్డ్ పోలో చాంప్ ఎవరు?
A: *అర్జెంటీనా*
                     
🏀⚽🎾🏀⚽🎾🏀⚽🏐

No comments:

Post a Comment