AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 1 December 2017

నవంబరు 2017 అంతర్జాతీయం

అంతర్జాతీయంఈజిప్టు మసీదులో బాంబు దాడిCurrent Affairs ఈజిప్ట్‌లోని అల్ అరిష్ పట్టణంలో ఉన్న మసీదుపై నవంబర్ 24న ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రార్థనలు చేసుకుంటున్న సూఫీ ముస్లింలపై బాంబులు, భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో దాదాపు 235 మంది మరణించగా 109 మంది గాయపడ్డారు. ఈజిప్టు చరిత్రలో ఇది అతిపెద్ద ఉగ్రదాడని ఈజిప్ట్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. 

మధ్యదరాలో 33 వేల మంది శరణార్థులు మృతిప్రపంచంలోని సరిహద్దుల్లో అత్యంత ప్రమాదకర, ప్రాణాంతక సరిహద్దుగా మధ్యదరా తీరాన్ని గుర్తించినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. యూరప్ దేశాలకు వచ్చేందుకు మధ్యదరాలో సాహస ప్రయాణం చేస్తూ 2000 నుంచి 2016 వరకు 33 వేల మంది జల సమాధి అయినట్లు 2017 నవంబర్ 24న ఓ ప్రకటనలో తెలిపింది. 
ఐఎస్‌ను నిర్మూలించామని ప్రకటించిన ఇరాన్ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూనీ 2017 నవంబర్ 21న ప్రకటించారు. తరచుగా ఉగ్ర దాడులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరాన్.. ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. నవంబర్ 18 నాటికి ఐఎస్‌ను నిర్మూలించామని ఇరాన్ సైన్యం ప్రకటించింది.

రోహింగ్యాలపై బంగ్లా, మయన్మార్ ఒప్పందంరోహింగ్యా శరణార్థులు స్వదేశానికి వచ్చేందుకు మయన్మార్ అంగీకరించింది. ఈ మేరకు మయన్మార్ రాజధాని నేపిదాలో 2017 నవంబర్ 23న మయన్మార్ నేత అంగ్‌సాన్ సూకీ, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ అలీ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. తమపై హింసాకాండతో మయన్మార్‌లోని రఖానే రాష్ర్టం నుంచి 6.20 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ వలస వచ్చారు.

జాతీయంబ్రిక్స్ టాప్-20 వర్సిటీల్లో నాలుగు భారతీయ విద్యాసంస్థలు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లోని టాప్-20 వర్సిటీల్లో భారత్‌కు చెందిన నాలుగు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక క్వాకరెల్లీ సైమండ్‌‌స(క్యూఎస్) సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ర్యాంకింగ్‌‌సలో ఐఐటీ బాంబే(9), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స-బెంగళూరు (10), ఐఐటీ ఢిల్లీ(15), ఐఐటీ మద్రాస్(18) నిలిచాయి. చైనాకు చెందిన సింఘువా వర్సిటీ, పెకింగ్ వర్సిటీ, ఫుడాన్ వర్సిటీలు జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్-10 విద్యాసంస్థల్లో చైనాకు చెందిన 8 విద్యాలయాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : బ్రిక్స్ టాప్-20 వర్సిటీల్లో నాలుగు భారత విద్యా సంస్థలు 
ఎప్పుడు : నవంబర్ 22 
ఎవరు : క్వాకరెల్లీ సైమండ్స్ 

ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో 920 ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. నవంబర్ 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో-బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 వన్‌స్టాప్ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఆమోదం తెలిపింది. విస్తృత పథకమైన ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017-20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం 
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా బాగా వెనకబడిన 115 జిల్లాల్లో
ఎందుకు : గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపు Current Affairs సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న అంగీకరించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపునకు అంగీకారం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్ 

దివాళా చట్టాన్ని సవరించిన కేంద్రంరుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్‌‌సకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. 
దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఐబీసీని గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఐబీసీలో పలు సవరణలు చేస్తూ ఆర్డినెన్‌‌స రూపొందించింది. ఈ ఆర్డినెన్‌‌స స్థానంలో సవరణలతో కూడిన చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లో మార్పులు 
ఎప్పుడు : నవంబర్ 22 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : రుణ ఎగవేతకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారానికి 

భారత అటవీ చట్టం ఆర్డినెన్‌‌సకు రాష్ట్రపతి ఆమోదం భారత అటవీ చట్టం-1927కు సవరణలు చేస్తూ కేంద్రం పంపిన ఆర్డినెన్‌‌సను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 23న ఆమోదించారు. తాజా సవరణల్లో అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగించారు. దీంతో అటవీ ప్రాంతం కాని చోట్ల పెరిగే వెదురు చెట్లను నరకడానికి, రవాణా చేయడానికి అనుమతులు అక్కర్లేదు. వెదురు చెట్ల సాగును పెంపొందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత అటవీ చట్టం-1927 సవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 23 
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 
ఎందుకు : అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగించేందుకు

న్యూఢిల్లీలో జాతీయ న్యాయ దినోత్సవ సదస్సు నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా నవంబర్ 25, 26 తేదీల్లో న్యూఢిల్లీలో సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబానికి చెందినవనీ, అవి మూడు ఒకదానినొకటి బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ఉద్ఘాటించారు. ఈ మూడు వ్యవస్థల మధ్య ఉండే సమన్వయమే రాజ్యాంగానికి వెన్నెముకని ఆయన పేర్కొన్నారు. సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. 
జాతీయ న్యాయ దినోత్సవాన్ని రాజ్యాంగ దినోత్సవంగాను నిర్వహిస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ న్యాయ దినోత్సవ సదస్సు 
ఎప్పుడు : నవంబర్ 25, 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని (జాతీయ న్యాయ దినోత్సవం) పురస్కరించుకొని 

హైదరాబాద్ చేరుకున్న షురువాత్’ బస్సు యాత్ర ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)-2017 నేపథ్యంలో రోడ్ టు జీఈఎస్’ పేరిట ప్రారంభించిన దేశవ్యాప్త షురువాత్’ బస్సు యాత్ర హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ఈ యాత్ర నవంబర్ 26న గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌కు చేరింది. నీతిఆయోగ్, యునెటైడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సంయుక్త ఆధ్వర్యంలో ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, సీఈవో గౌరీ ఈశ్వరన్, స్పెషల్ ప్రాజెక్ట్స్ లీడ్ క్షితిజ్ శరణ్ నేతృత్వంలో పది మంది సభ్యుల బృందం ఈ బస్సులో ప్రయాణం సాగిస్తోంది. ఐఐటీ ఢిల్లీలో ప్రారంభమైన ఈ షుర్వాత్ బస్సు ఐదు నగరాల్లో పర్యటిస్తూ హైదరాబాద్ చేరుకుంది. 14 రోజుల పర్యటనలో ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించి 500 వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను షురువాత్’ బస్సులోని బృందం సేకరించింది. వీటిలో అత్యుత్తమమైన ఆలోచనలకు ఫండింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

2030 నాటికి పట్టణాల్లోనే 40 శాతం జనాభా2030 నాటికి దేశం మొత్తం జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు 40 శాతం ఉంటారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అధ్యయన సంస్థ బ్రూకింగ్‌‌స ఇన్‌స్టిట్యూషన్ వెల్లడించింది. వచ్చే పదేళ్లలో భారత్, చైనా, ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్‌‌స దేశాల నుంచి దాదాపు 30 కోట్ల జనం గ్రామాలను విడిచి పట్టణాలకు వలస వెళతారని తెలిపింది.
మధ్యతరగతి జనాభా విషయంలో 2027 కల్లా ఇండియా చైనాను వెనక్కు నెట్టనుందని అంచనా. 2014-50 మధ్య కాలంలో చైనా, భారత్‌లలో కలిపి కొత్తగా 70 కోట్ల జనం పట్టణాలకు తరలిపోయి మధ్య ఆదాయవర్గంగా ఎదుగుతారని బ్రూకింగ్‌‌సకు చెందిన హోమీ ఖరాస్ అంచనా వేస్తున్నారు. ఆసియాలో 2016 నాటికి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలు 275. 2030 నాటికి వాటి సంఖ్య 354కు పెరుగుతుందని భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టణాల్లోనే 40 శాతం జనాభా
ఎప్పుడు : 2030
ఎవరు : బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్, అమెరికా
ఎక్కడ : భారత్
ఎందుకు : వలసల వల్ల మధ్యతరగతి జనాభా పెరగడంతో

నెట్ న్యూట్రాలిటీకి ట్రాయ్ మద్ధతువివక్ష లేని ఇంటర్నెట్ సేవలను అందించే నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది. సర్వీసు ప్రొవైడర్లు, టెలికం కంపెనీలు సహా ఏ సంస్థలైనా ఇంటర్నెట్ సేవలు అందించడంలో వివక్ష చూపడాన్ని నిషేధించాలని సూచించింది. ఈ మేరకు నెట్‌న్యూట్రాలిటీపై సిఫార్సుల నివేదికను ట్రాయ్ నవంబర్ 28న కేంద్రానికి అందచేసింది.
ట్రాయ్ సిఫార్సులు

  • టెలికం కంపెనీలు, ఐఎస్‌పీలు ఇంటర్నెట్ ద్వారా అందించే కంటెంట్, సర్వీసులకు విభిన్న డేటా చార్జీలు, ఉచిత సేవలు ఉండకూడదు.
  • ఆన్‌లైన్ వీడియోలను ఎక్కువ-తక్కువ స్పీడ్‌తో చూపకూడదు.
  • ఇంటర్నెట్ యాక్సెస్(సేవలు)లో వివక్షను నిరోధించేందుకు ప్రొవైడర్ల లెసెన్‌‌స నిబంధనలను మార్చాలి.
  • కంటెంట్‌ను అడ్డుకోవడం, స్పీడ్‌ను తగ్గించడం లేదా పెంచడం వంటివి వివక్షగా పరిగణించాలి.
  • ఈ వివక్షరహిత ఇంటర్నెట్ విధానం విషయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స (ఎలక్ట్రా నిక్ ఉపకరణాలను ఇంటర్నెట్‌తో అనుసంధానించడం) వంటి సేవల విషయంలో నిబంధనలు సడలించవచ్చు.
  • కొత్త నిబంధనల పర్యవేక్షణతోపాటు ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు టెలికం శాఖ ఒక బహుళపక్ష మండలిని ఏర్పాటు చేయాలి. దీనిలో టెలికం ఆపరేటర్లు, ఐఎస్‌పీలు, కంటెంట్ ప్రొవైడర్లు, సామాజిక సంస్థలు, వినియోగదారుల ప్రతినిధులకు చోటు కల్పించాలి.
  • టెలికం అపరేటర్లు తమ వెబ్ ట్రాఫిక్ నిర్వహణ విధానాలను ప్రకటించాలి. ప్రత్యేక సేవలు, కంటెంట్ ప్రొవైడర్లతో కుదుర్చుకునే ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలు వంటివన్నీ బహిర్గతపరచాలి.
నెట్ న్యూట్రాలిటీ అంటే?ఇంటర్నెట్ ద్వారా యూజర్లు చూసే, వాడుకునే కంటెంట్ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు (టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు ఇతరత్రా) వివక్ష చూపకుండా సమానత్వాన్ని పాటించడమే నెట్ న్యూట్రాలిటీ. అంటే కొన్ని వెబ్‌సైట్‌లకు డేటా చార్జీలు వసూలు చేయడం, కొన్నింటిని ఉచితంగా అందించడం లేదా కొన్నింటిని అధిక వేగం, కొన్నింటిని తక్కువ వేగంతో చూపించడం వంటి అసమానతలు నిరోధించడమే నెట్ న్యూట్రాలిటీ ప్రధానోద్దేశం.
రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ తన కంటెంట్‌ను ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించేందుకు ఇంటర్నెట్.ఆర్గ్ పేరుతో టెలికం ఆపరేటర్లతో ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా ఎయిర్‌టెల్ కూడా ‘ఎయిర్‌టెల్ జీరో’ ను ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెట్ న్యూట్రాలిటీకి ట్రాయ్ సిఫార్సులు 
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : నెట్ న్యూట్రాలిటీకి నియమ నిబంధనలు రూపొందించడానికి

ఆధార్ గడువు పొడిగింపునకు కేంద్రం రెడీ సంక్షేమ పథకాల లబ్దిదారులు తమ ఖాతాలతో ఆధార్‌సంఖ్యను అనుసంధానించుకోవడానికి మరింత గడువు దొరికింది. వచ్చే ఏడాది మార్చి దాకా ఈ గడువును పొడగిస్తున్నట్టు కేంద్రం నవంబర్ 27న సుప్రీంకోర్టుకు తెలిపింది. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందడానికి ప్రజలు తమ ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలన్న నిబంధనపై నవంబర్ 27న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 2018 మార్చి 31 వరకు వినియోగదారులు తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఈ ఏడాది డిసెంబరు 31 చివరి తేదీ కాగా మొబైల్ నంబర్లకు 2018 ఫిబ్రవరి 6 వరకు ఉంది. 

ఢిల్లీ రాష్ర్టం కాదని సుప్రీంకు తెలిపిన కేంద్రంకేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీకి ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ, రాజ్యాంగం ప్రకారం రాష్ర్టంగా పరిగణించలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రానేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్‌సింగ్ 2017 నవంబర్ 21న ఈ మేరకు వాదనలు వినిపించారు. 

సిక్కిం అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రతిపాదనసిక్కిం రాష్ర్ట శాసనసభ స్థానాల పెంపును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2017 నవంబర్ 23న ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 32 అసెంబ్లీ స్థానాలు 40కి చేరుతాయి. 1975లో సిక్కిం భారత్‌లో భాగమైన తర్వాత తొలిసారి ఆ రాష్ర్ట శాసనసభ స్థానాలు పెరుగుతున్నాయి. 

ద్వైపాక్షికంస్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతుCurrent Affairs స్వతంత్ర పాలస్తీనా కోసం ఆ దేశ ప్రజలు చేస్తున్న పోరాటానికి భారత్ మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’ సందర్భంగా ఐరాసకు ఆయన ఓ సందేశం పంపారు. ఇజ్రాయెల్‌తో పాటు శాంతియుతంగా జీవనం సాగించే స్వతంత్ర, సార్వభౌమ, సుస్థిర పాలస్తీనా కల త్వరలోనే నిజం అవ్వాలని భారత్ ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 1979 నుంచి ఏటా నవంబర్ 29ని ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’గా నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్ సందర్భంగా
ఎందుకు : శాంతియుత, స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా ఏర్పాటు కోసం

ఉగ్రపోరులో సహకారానికి రష్యా అంగీకారం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక ఒప్పందంపై భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రష్యా అంతర్గత మంత్రి కోలోకొత్సేవ్‌లు సంతకం చేశారు. తద్వారా 1993లో భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. రష్యా పర్యటనలో భాగంగా నవంబర్ 27న రష్యా మంత్రితో రాజ్‌నాథ్ పలు అంశాలపై చర్చలు జరిపారు. సమాచార మార్పిడి విసృ్తతం చేయడంతో పాటు డేటాబేస్, పోలీసు, దర్యాప్తు విభాగాలకు శిక్షణలో సహకారానికి కూడా భారత్, రష్యాలు అంగీకరించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉగ్రవాదంపై పోరులో సహకారం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : భారత్, రష్యా

ప్రాంతీయంగోదావరి-కావేరీ నదుల అనుసంధానానికి ప్రణాళిక గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబర్ 23న చెప్పారు. మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించిందని ఆయన వివరించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తామని.. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణించి.. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని తెలిపారు. అలాగే.. చెన్నై - బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామని ప్రకటించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక కోసం ముఖ్యమంత్రులతో సమావేశ నిర్వహణ
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ 
ఎందుకు : గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు

పళని-పన్నీర్‌లకు ‘రెండాకుల’ గుర్తు కేటాయింపుఅన్నాడీఎంకే పార్టీ అధికారిక చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నవంబర్ 23న నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల్లో అత్యధికులు పళనికే మద్దతు ఇస్తున్నందున ఆ వర్గానికే గుర్తు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెండాకుల గుర్తును పళని వర్గానికి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. రెండాకుల గుర్తు కోసం ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ, దినకరన్ తీవ్రంగా పోరాడారు. 
ఇది రెండోసారి..!అన్నా డీఎంకే పార్టీ ఎన్నికల చిహ్నంగా రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) పునరుద్ధరించడం ఇది రెండోసారి. ఒక పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రెండుసార్లు నిలిపివేసి మళ్లీ కేటాయించడం ఏఐఏడీఎంకే విషయంలోనే జరిగింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : పళనిస్వామి - పన్నీర్ సెల్వం వర్గానికి రెండాకుల గుర్తు 
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం 
ఎక్కడ : తమిళనాడు, పుదుచ్చేరి

కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ స్టేజ్ - 2 అనుమతులు ఇచ్చింది. దీంతో.. అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లు, టన్నెళ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూముల బదలాయింపు.. ఆ భూముల్లో నిర్దేశించిన మేర తిరిగి మొక్కల పెంపకానికి సంబంధించి ప్రభుత్వం రూ.722.30 కోట్లు మంజూరు చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది. డిసెంబర్ నాటికి పర్యావరణ తుది అనుమతులు వచ్చే అవకాశముంది. 
రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లోని సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతోపాటు 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా రూ.80,499.71 కోట్ల వ్యయ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుకు స్టేజ్ - 2 అటవీ అనుమతులు 
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : కేంద్ర అటవీశాఖ 

ఏపీలో సునామీ మెగా మాక్ డ్రిల్ సునామీల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది కోస్తా జిల్లాల్లో నవంబర్ 24న మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ విపత్తుల శాఖ, రాష్ట్ర విపత్తుల శాఖ, ఇన్కొయిస్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సునామీ వస్తున్నట్టుగా ఇన్కొయిస్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, రాష్ట్ర విపత్తుల శాఖ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ 9 కోస్తా జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మాక్ ఎక్సర్‌సైజ్ చేపట్టారు. 
కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ మెగా మాక్ డ్రిల్ జరిగింది. 

అవయవదానంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అవయవదానంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇందుకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్‌‌సప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) ఈ అవార్డును ప్రకటించింది. నవంబర్ 27న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’ సందర్భంగా ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు. 
తమిళనాడును దాటేసి.. తమిళనాడు జనాభా 8 కోట్లు కాగా.. తెలంగాణ జనాభా 3.5 కోట్లు. తమిళనాడులో గత 11 ఏళ్లలో 5,367 అవయవాలను సేకరించి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తెలంగాణలోని నిమ్స్ జీవన్‌దాన్ ఆధ్వర్యంలో 2013 నుంచి 2017 అక్టోబర్ వరకు 414 మంది దాతల నుంచి 1,675 అవయవాలను సేకరించారు. గతేడాది వరకు రెండోస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి తొలిస్థానంలో నిలిచింది. కేరళ ఇప్పటివరకు 701 అవయవాలు సేకరించి మూడోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అవయవదానంలో దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ రాష్ట్రం 
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్‌‌సప్లాంటేషన్ ఆర్గనైజేషన్

మధ్యప్రదేశ్‌లో చిన్నారులపై రేప్‌కు మరణశిక్షమధ్యప్రదేశ్‌లో ఇటీవల అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా చట్టం రూపకల్పనకు అంగీకరించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో నవంబర్ 26న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష 
ఎప్పుడు : నవంబర్ 26 
ఎవరు : మధ్యప్రదేశ్ ప్రభుత్వం 
ఎక్కడ : మధ్యప్రదేశ్‌లో 

హైదరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుభారత్‌లో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017 నవంబర్ 28న హైదరాబాద్‌లో ప్రారంభమయింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రారంభించారు.
బెంగళూరుకు చెందిన కంపెనీ తయారు చేసిన ‘మిత్ర’ రోబో సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వాగతోపన్యాసం చేయగా మోదీ, ఇవాంకా సదస్సును ఆరంభించి మాట్లాడారు. అంనతరం ‘బీ ద చేంజ్.. విమెన్‌‌స ఎంట్రప్రెన్యురల్ లీడర్‌షిప్’ అంశంపై పలువురు చర్చించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్
ఎక్కడ : హైదరాబాద్

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభంహైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో కలసి నవంబర్ 28న ప్రారంభించారు. అనంతరం మెట్రో పైలాన్, మెట్రో జర్నీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘టి-సవారీ’ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. తర్వాత మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ అక్కడి నుంచి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు(జీఈఎస్) జరిగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)కి బయల్దేరి వెళ్లారు.
మెట్రో తొలిదశలో నాగోల్-అమీర్‌పేట్ (17 కి.మీ), మియాపూర్-అమీర్‌పేట్ (13 కి.మీ) మొత్తంగా 30 కి.మీ. మార్గంలో రవాణా సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లున్నాయి. మెట్రో రైలులో ప్రయాణించేందుకు స్మార్ట్‌కార్డు నెబ్యులా, టికెట్, టోకెన్‌లను ప్రవేశపెట్టారు.
మెట్రో రైలు ప్రారంభంలో లోకో పైలట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేపరాల గ్రీష్మ ఉన్నారు. దీంతో ఆమె దేశంలోనే మెట్రో తొలి మహిళా లోకోపైలట్‌గా రికార్డులకెక్కారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మియాపూర్, హైదరాబాద్

దేశంలోనే తొలిసారి చెన్నైలో జీఐఎస్ సర్వేదేశంలోనే తొలిసారిగా చెన్నైలో భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) మ్యాపింగ్ సర్వే 2017 నవంబర్ 21న ప్రారంభించారు. రెండు డ్రోన్లతో 120 రోజుల్లో నగరంలోని రహదారులు మొదలు వీధి దీపాల వరకు అన్ని వివరాలను ఈ సర్వేలో నమోదు చేస్తారు. 

ఆర్థికం15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నవంబర్ 22న నిర్ణయించింది. ఈ సంఘం పన్నుల ఆదాయ వనరులను మదింపు వేసి వాటిని కేంద్రం, రాష్ట్రాల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలన్న విధానాన్ని రూపొందిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు కాలానికి అమల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు నిర్ణయం 
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్ 

ఐటీ చట్టాల సమీక్షకు అత్యున్నత స్థాయి కమిటీఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్ లిఖించడం, ముసాయిదా రూపకల్పన ఈ కమిటీ కర్తవ్యం. ఆరు నెలల్లో కమిటీ ఈ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంది. 
కన్వీనర్‌గా అరవింద్ మోదీ ఆరుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీ సభ్యులు (లెజిస్లేషన్) అరవింద్‌మోదీ కన్వీనర్‌గా ఉంటారు. గిరీష్ అహూజా (చార్డెడ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ పార్ట్నర్) మాన్సీ కేడియా (కన్సల్టెంట్, ఐసీఆర్‌ఐఈఆర్) కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కమిటీకి శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం పన్ను వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది? అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలు ఏమిటి? దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉండాలి? వంటి అంశాలను తన కర్తవ్య నిర్వహణలో కమిటీ పరిశీలిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీ చట్టాల సమీక్షకు అరవింద్ మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ 
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో హైక్ జట్టు Current Affairs దేశీ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘హైక్’ తాజాగా తన యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైక్ యూజర్లు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన మర్చంట్, యుటిలిటీ పేమెంట్ సర్వీసులు పొందొచ్చు. 2012లో ప్రారంభమైన హైక్‌కు ప్రస్తుతం 10 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో హైక్ జట్టు 
ఎప్పుడు : నవంబర్ 22 
ఎందుకు : యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు

న్యూఢిల్లీలో సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సుప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ తీవ్రమవుతోన్న సైబర్ ముప్పుని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో నవంబర్ 23, 24 తేదీల్లో 5వ సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సు (Global conference on cyber space) జరిగింది. ఈ సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమాచార మార్పిడి, సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలకు ఇంటర్నెట్ ఆటస్థలంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించారు. కార్యక్రమంలో శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్ 
ఎప్పుడు : నవంబర్ 23, 24
ఎక్కడ : న్యూఢిల్లీ

దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పథకం ప్రారంభం తపాలా బిళ్లల సేకరణ చేసేవారికి కేంద్రప్రభుత్వం ఉపకార వేతనం (స్కాలర్‌షిప్) అందించనుంది. పోస్టాఫీసుల వైపు విద్యార్థులను మళ్లించేందుకు వారిలో తపాలాబిళ్లల సేకరణ అలవాటును పెంచాలని నిర్ణయించింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరిమిత సంఖ్యలో ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఎంపికై న వారికి రూ.ఆరు వేల ఆర్థిక సాయం అందుతుంది. దీన్ని ప్రతి మూడు నెలలకు రూ.1,500 చొప్పున తపాలాశాఖ చెల్లిస్తుంది. ఈ మేరకు దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో స్పర్శ్ (ఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్)ను స్కాలర్‌షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీగా పేర్కొంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పథకం ప్రారంభం 
ఎప్పుడు : నవంబర్ 23 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : తపాలా బిళ్లల సేకరణకు విద్యార్థులకు ఉపకార వేతనం ఇచ్చేందుకు 

సామాజిక సేవకు సునీల్ మిట్టల్ 7,000 కోట్ల విరాళంప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి ఇస్తామని ప్రతిన బూనింది. ఈ మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలో మిట్టల్ కుటుంబ సభ్యులకు ఉన్న మూడు శాతం వాటా కూడా విరాళంలో భాగమే. ఈ మొత్తాన్ని తమ కుటుంబం తరఫున ఏర్పాటు చేసిన భారతీ ఫౌండేషన్ కార్యక్రమాల కోసం ఇవ్వనున్నట్టు సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. తన సోదరులు రాకేశ్, రాజన్‌తో కలసి ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతిభావంతులైన నిరుపేదలకు ఉచితంగా విద్యనందించేందుకు సత్యభారతి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మిట్టల్ చెప్పారు. ఉత్తర భారతంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ 2021 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. విరాళంలో అధిక భాగం యూనివర్సిటీ ప్రాజెక్టుపైనే వెచ్చించనున్నామని, కొంత మేర ఇప్పటికే నిర్వహిస్తున్న సత్యభారతి స్కూళ్ల విస్తరణకు వినియోగిస్తామని చెప్పారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : సామాజిక సేవకు రూ. 7,000 కోట్ల విరాళం 
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం 

సీఎస్‌ఆర్ కింద వెయ్యి గ్రామాల అభివృద్ధి : హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వెయి్య గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించింది. ఈ మేరకు 16 రాష్ట్రాల పరిధిలోని వెయి్య గ్రామాల్లో పది లక్షల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించనుంది. హోలిస్టిక్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(హెచ్‌ఆర్‌డీపీ)లో భాగంగా రెండున్నరేళ్ల కాలంలో 750 వెనకబడిన గ్రామాలకు సాధికారత కల్పించామని బ్యాంకు పేర్కొంది. హెచ్‌ఆర్‌డీపీలో భాగంగా విద్య, నీరు, పారిశుద్ధ్యం, అందరికీ బ్యాంకింగ్ సేవలు తదితర రంగాల్లో మెరుగుదలకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వచ్చే ఆర్థిక సంవత్సరంలో సీఎస్‌ఆర్ కింద వెయ్యి గ్రామాల అభివృద్ధి 
ఎప్పుడు : నవంబర్ 23 
ఎవరు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 

ఎస్‌బీఐ ‘యోనో’ యాప్‌ను ఆవిష్కరించిన అరుణ్ జైట్లీ డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా యోనో (యూ నీడ్ ఓన్లీ వన్) పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 24న ఈ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్ దాకా ఈ యాప్ ద్వారా నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించేందుకు 60 పైగా ఈ-కామర్స్ సంస్థలతో ఎస్‌బీఐ చేతులు కలిపింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : యెనో యాప్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఎస్‌బీఐ
ఎందుకు : డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు 

భారత్ రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించిన ఎస్ అండ్ పీ భారత్‌కు ఇస్తున్న రేటింగ్ ‘బీబీబీ-మైనస్‌ను’ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ఇదే విధంగా కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ‘స్టేబుల్ అవుట్‌లుక్’ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది. పటిష్ట వృద్ధి ధోరణి రెండేళ్లు కొనసాగుతుందని కూడా ఎస్ అండ్ పీ అంచనావేసింది. అతి తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వానికున్న భారీ రుణం ప్రాతిపదికన యథాతథ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సూచించింది.
2007 వరకూ ఎస్‌అండ్‌పీ భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్’గా ఉండేది. ఇది అతి దిగువ స్థాయి గ్రేడ్. ఈ రేటింగ్‌కు ఎస్‌అండ్‌పీ 2007 జనవరిలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను చేర్చింది. 2009లో అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చిన సంస్థ, మళ్లీ 2010లో స్టేబుల్ హోదా ఇచ్చింది. 2012లో మళ్లీ నెగటివ్ అవుట్‌లుక్‌కు మార్చిన ఎస్‌అండ్‌పీ... మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టాక మళ్లీ ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇచ్చింది. ఇదే రేటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు ‘బీబీబీ-మైనస్’ రేటింగ్ కొనసాగింపు 
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : స్టాండర్డ్ అండ్ పూర్ 

మహిళా సాధికారతకు అమెజాన్ ‘సహేలి’మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ‘సహేలి’ అనే కార్యక్రమాన్ని నవంబర్ 28న ఆవిష్కరించింది. మహిళలు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్‌‌స, గృహాలంకరణ ఉత్పత్తులు విక్రయించేందుకు వీలుగా సహేలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సబ్సిడీతో రెఫరల్ ఫీజు, ఉత్పత్తుల ఉచిత చిత్రీకరణ, ఖాతా నిర్వహణకు మహిళా వ్యాపారులకు తోడ్పాటునిస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ వుమెన్ అసోసియేషన్, ఇంపల్స్ సోషల్ ఎంటర్‌ప్రైస్ సహకారంతో అమెజాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా సాధికారతకు సహేలి కార్యక్రమం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : అమెజాన్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించడానికి

పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రారంభంపేటీఎం పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 28న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టెక్నాలజీ దేశ బ్యాంకింగ్ రూపురేఖలను మార్చేసి నగదు స్థానాన్ని భర్తీ చేస్తోందన్నారు. ఈ బ్యాంక్ కార్యకలాపాలను 2017 మేలో ప్రయోగాత్మకంగా చేపట్టగా, ఇప్పుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ సంస్థ కనీస బ్యాలెన్‌‌సలేని, ఉచిత ఆన్‌లైన్ లావాదేవీలను ఆఫర్ చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : పేటీఎం

సైన్స్ అండ్ టెక్నాలజీసుఖోయ్ నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం 
Current Affairs వాయు సేనలో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ప్రవేశపెట్టేందుకు గొప్ప ముందడుగు పడింది. ఇది వరకే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన ఈ క్షిపణిని నవంబర్ 22న యుద్ధ విమానం సుఖోయ్-30 నుంచి తొలిసారి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తన సమర్థతను చాటుకున్నట్లయింది.
బ్రోహ్మోస్ తరగతికి చెందిన క్షిపణిని ప్రయోగించిన తొలి వాయుసేన తమదేనని ఐఏఎఫ్ ప్రకటించింది. బ్రహ్మోస్, సుఖోయ్-30ల కాంబినేషన్ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొంది. 
ఎక్కడి నుంచైనా ప్రయోగం..భూమిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన...ఇలా త్రివిధ దళాల్లో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువుగా ఉండే సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. బ్రహ్మోస్. మూడు చోట్ల నుంచి ప్రయోగానికి అనువుగా ఉండేలా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈ క్షిపణిలో మార్పులు చేసింది. రష్యాకు చెందిన పీ-700 ఒనిక్ సూపర్‌సోనిక్ క్షిపణి ఆధారంగా మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)-రష్యా ఎన్‌పీఓఎంలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధిచేశాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్‌గా నామకరణం చేశారు. 
బ్రహ్మోస్ ప్రత్యేకతలు.. 

  • 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ధ్వనివేగం కంటే మూడురెట్ల అధిక వేగంతో కచ్చితంగా ఛేదించగలదు.
  • ఆర్మీ, నౌకాదళం ఉపయోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు 3 టన్నులు కాగా, వాయుసేన ప్రయోగించే క్షిపణి మాత్రం 2.5 టన్నులే ఉంటుంది. అయినా సుఖోయ్-30 యుద్ధ విమానం మోసే అత్యధిక బరువున్న క్షిపణి ఇదే.
  • సుఖోయ్ యుద్ధవిమానం ఒకసారికి ఒక క్షిపణినే తీసుకెళ్లగలదు.
  • బ్రహ్మోస్‌ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి యుద్ధనౌకలు క్షిపణులను ప్రయోగించేలోగానే బ్రహ్మోస్ ఆ నౌకలను ధ్వంసం చేస్తుంది.
  • క్షిపణిని ప్రయోగించిన వెంటనే సుఖోయ్ విమానం తిరుగు ప్రయాణమవుతుంది.
  • ప్రస్తుతం ప్రపంచంలోని ఏ యుద్ధనౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు.
  • ప్రస్తుతం 290 కిలో మీటర్లుగా ఉన్న లక్షిత దూరాన్ని 450 కిలోమీటర్లకు పెంచేందుకు బ్రహ్మోస్ క్షిపణుల రూపురేఖలు, సాంకేతికతలో మార్పులు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు.
  • క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశంతో ఈ క్షిపణుల పరిధిని పెంచడం సులువు కానుంది.
  • మరో 40 సుఖోయ్-30 యుద్ధ విమానాలు బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగలిగేలా వాటికి అవసరమైన మార్పులు చేయడంతోపాటు ఇంకో 272 విమానాలు సమకూర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది.

ఉమంగ్ యాప్‌ను ప్రారంభించిన ప్రధానిఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను కేంద్రం తెచ్చింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందొచ్చని అధికారులు చెప్పారు. 
ఈ యాప్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు సులభంగా చేయొచ్చు. అంతేకాకుండా ఆధార్, డిజిలాకర్, భారత్ బిల్ పేమేంట్, ఈపీఎఫ్‌వో, కొత్త పాన్‌కు దరఖాస్తు తదితర సేవలనూ పొందొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ తెలుగుతో పాటు 12 భారతీయ భాషల్లో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా మాత్రమే పనిచేసే ఈ యాప్.. ఇంటర్నెట్ అవసరం లేని ఫీచర్‌ఫోన్‌లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమంగ్ యాప్ ప్రారంభం 
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ 
ఎందుకు : ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా

న్యూజిలాండ్‌లో తొలి వర్చువల్ రాజకీయ నేత ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ను న్యూజిలాండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిక్ గెర్రిట్‌సెన్(49) రూపొందించారు. ఫేస్‌బుక్ మెసెంజర్‌తో పాటు తన హోమ్‌పేజ్‌లో ఉన్న సర్వేల సాయంతో విషయాల్ని నేర్చుకునే శామ్.. ప్రపంచవ్యాప్తంగా విద్య, వలసలు, ఇళ్లు సహా పలు అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తుంది. శామ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉందనీ దాని రూపకర్త నిక్ తెలిపారు. 2020లో న్యూజిలాండ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ అభ్యర్థిగా పోటీపడేలా శామ్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కృత్రిమ మేధ ఉన్న రోబోలు ఎన్నికల్లో పోటీచేయడంపై నిషేధం ఉంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌‌స)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ 
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : నిక్ గెర్రిట్‌సెన్
ఎక్కడ : న్యూజిలాండ్ 

అటకామా ఎడారిలో హెచ్‌ఐవీకి మందుభూమ్మీద అత్యంత ఎత్తయిన, పొడి వాతావరణం కలిగిన అటకామా ఎడారి (చిలీ) లో ఎయిడ్‌‌స చికిత్సలో ఉపయోగపడే సూక్ష్మజీవులను కనుగొన్నట్లు బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ పరిశోధకులు గుడ్‌ఫెల్లో చెప్పారు. సముద్ర మట్టానికి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తు గల ప్రాంతం నుంచి సేకరించిన మట్టిలో ఈ సూక్ష్మజీవులున్నాయని తెలిపారు. పర్యావరణ వ్యవస్థలో కీలకమైన యాక్టినోబ్యాక్టీరియా జాతి హెచ్‌ఐవీ వైరస్‌ను పునరుత్పత్తి చేసే ఎంజైమ్‌ను నిరోధించడంలో సహకరిస్తుందని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 సూక్ష్మజీవుల నుంచి హెచ్‌ఐవీ కి మందు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ పరిశోధకులు
ఎక్కడ : అటకామా ఎడారి, చిలీ

రక్తకణం సైజులో రోబోల తయారీరక్తకణాల సైజులో ఉండే రోబోలను తయారుచేశామని హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రోబోలు శరీరంలోని చిన్న చిన్న అవయవభాగాల్లోకి చొచ్చుకుపోయి, అక్కడ ఉన్న సమస్యను నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అత్యంత సూక్ష్మపరిమాణంలో ఉన్న శైవలాలతో రూపొందించిన ఈ రోబోల లోపలి పొరల్లో అయస్కాంతాన్ని పూతగా పూశారు. దీంతో రోబో మన శరీరంలో ఎక్కడ ఉన్నా.. చర్మంపై నుంచి స్పష్టంగా తెలుసుకోవచ్చు. వీటిని ఎలుకల్లో ప్రవేశపెట్టి పరీక్షించగా.. అవి రక్తం, జీర్ణరసాలలో అనుకున్న సమయానికే కరిగిపోయాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మత్స్య సంపదను గుర్తించే ‘సముద్ర’ పరిశోధన కేంద్ర సముద్ర మత్స్య సంపద పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలిసి సముద్ర జలాల్లో పెద్దఎత్తున చేపలు లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించే ‘సముద్ర’ ప్రాజెక్టును ప్రారంభించింది. సముద్రంలో మార్పులను విశ్లేషిస్తూ, మత్స్య సంపద లభ్యతపై అంచనాలు రూపొందించే ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ డెరైక్టర్ ఎ.గోపాల కృష్ణన్ తెలిపారు.

క్రీడలుదివిజ్ జోడికి బెంగళూరు ఓపెన్ డబుల్స్ టైటిల్ Current Affairs భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నవంబర్ 24న జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)-ఎల్గిన్ (రష్యా) జోడి 6-3, 6-0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్-మాటెజ్ సబనోవ్‌పై విజయం సాధించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరు ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : డబుల్స్ విజేత దివిజ్ శరణ్(భారత్), ఎల్గిన్(రష్యా)

నాగల్‌కు బెంగళూరు ఓపెన్ సింగిల్స్ టైటిల్ భారత ఆటగాడు సుమీత్ నాగల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. బెంగళూరు ఓపెన్ లో నవంబర్ 25న జరిగిన ఫైనల్లో అతను 6-3, 3-6, 6-2తో జే క్లార్క్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ట్రోఫీతో పాటు అతను రూ. 9.36 లక్షల (14,400 డాలర్లు) ప్రైజ్‌మనీని, 100 ర్యాంకింగ్ పాయింట్లను అందుకున్నాడు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరు ఓపెన్ - 2017 
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత సుమీత్ నాగల్ 

హాంకాంగ్ ఓపెన్ రన్నరప్‌గా పీవీ సింధు బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో భారత స్టార్ పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. నవంబర్ 26న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 18-21, 18-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 30,000 డాలర్ల (రూ. 19 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 15,200 డాలర్ల (రూ. 9 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం సింధుకిది రెండోసారి. ఈ సంవత్సరం సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాంకాంగ్ ఓపెన్ - 2017 
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : మహిళల సింగిల్స్ టైటిల్ విజేత తై జు యింగ్, రన్నరప్‌గా పీవీ సింధు 

ప్రపంచ యూత్ మహిళల బాక్సింగ్ చాంప్ భారత్ ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ చేరిన ఐదుగురు బాక్సర్లూ విజేతలుగా నిలిచి తొలిసారి భారత్‌ను ఓవరాల్ చాంపియన్‌గా నిలబెట్టారు. ఐదు స్వర్ణాలతోపాటు రెండు కాంస్యాలు నెగ్గిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించారు. నీతు (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బొరో (64 కేజీలు)లు నవంబర్ 26న జరిగిన టైటిల్ పోరులో పసిడి సాధించారు. 

గోపీ థోనకల్‌కు ఆసియా మారథాన్ టైటిల్ ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత మారథాన్ రన్నర్ గోపీ థోనకల్ స్వర్ణ పతకం సాధించాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో కేరళకు చెందిన గోపీ చాంపియన్‌గా నిలిచాడు. 42.195 కి.మీ. దూరాన్ని గోపీ 2 గంటల 15 నిమిషాల 48 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా పురుషుల విభాగంలో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ రన్నర్‌గా గుర్తింపు పొందాడు. ఆండ్రే పెట్రోవ్ (ఉజ్బెకిస్తాన్-2గం:15ని:51 సెకన్లు) రజతం... బ్యాంబలేవ్ సెవీన్వ్ర్‌డాన్ (మంగోలియా-2గం:16ని:14 సెకన్లు) కాంస్యం గెలిచారు. ఓవరాల్‌గా ఆసియా మారథాన్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయ రన్నర్‌గా గోపీ నిలిచాడు. గతంలో మహిళల విభాగంలో ఆశ అగర్వాల్ (1985లో), సునీత గోదర (1992లో) మాత్రమే స్వర్ణాలు గెలిచారు. 1988 వరకు ఈ మారథాన్ రేసు ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఉండేది. 1988 నుంచి ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వేరు చేసి ఈ మారథాన్ రేసును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ - 2017 
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : పురుషుల విభాగంలో టైటిల్ విజేత గోపీ థోనకల్ (భారత్)

బొటాస్‌కు ‘అబుదాబి’ టైటిల్ఫార్ములావన్ సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను బొటాస్ గంటా 34 నిమిషాల 14.062 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఎస్తెబన్ ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. 
నిర్ణీత 20 రేసులు ముగిశాక హామిల్టన్ 363 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకోగా... 317 పాయింట్లతో వెటెల్ రన్నరప్‌గా... 305 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. 668 పాయింట్లతో మెర్సిడెస్ జట్టు ప్రపంచ కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించగా... 187 పాయింట్లతో ఫోర్స్ ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అబుదాబి గ్రాండ్ ప్రీ - 2017 
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : విజేత బొటాస్ 

ప్రపంచ స్నూకర్ టైటిల్ విజేత..పంకజ్ భారత క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్‌‌డ్స, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ (32) కెరీర్‌లో 18వ ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దోహా లో 2017 నవంబర్ 27న ముగిసిన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో అమీర్ నర్థోష్ (ఇరాన్)ను ఓడించి పంకజ్ ఛాంపియన్‌గా నిలిచాడు.
బెంగళూరుకు చెందిన పంకజ్ గతంలో ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్; 2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్; 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... మూడు సార్లు ప్రపంచ స్నూకర్ (2017, 2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ స్నూకర్ టైటిల్ విజేత
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : పంకజ్ అద్వానీ

ఫ్రాన్స్ కు డేవిస్ కప్ టైటిల్డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. పారిస్‌లో 2017 నవంబర్ 26న ముగిసిన ఫైనల్లో బెల్జియంను 3-2 తేడాతో ఫ్రాన్‌‌స ఓడించింది. ఫ్రాన్‌‌సకిది పదో డేవిస్ కప్ టైటిల్. 

వార్తల్లో వ్యక్తులుతొలి మహిళా నేవీ పైలట్‌గా సుభాంగి స్వరూప్Current Affairs భారత నావికా దళంలో మొట్టమొదటిసారిగా ఓ మహిళ పెలైట్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాంగి స్వరూప్ ఎంపికయ్యారు. మరో ముగ్గురు మహిళా అధికారులను కూడా నావికాదళం ఎంపిక చేసింది. వీరు.. న్యూఢిల్లీకి చెందిన ఆస్తా సెహ్‌గల్, పుదుచ్చేరికి చెందిన ఎ. రూప, కేరళకు చెందిన ఎస్.శక్తిమాయ. నావికాదళంలోని నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టొరేట్ (NAI) విభాగంలో ఈ ముగ్గురూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేరళలోని కన్ననూర్ జిల్లాలో ఉన్న ఇండియన్ నావల్ అకాడెమీలో ఈ నలుగురు మహిళలు నావల్ ఓరియంటేషన్ పూర్తి చేసుకున్నారు. ఉమెన్ పైలట్‌గా సుభాంగి స్వరూప్ హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మహిళా నేవీ పైలట్ 
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : సుభాంగి స్వరూప్ 

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలతలోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స్నేహలతా శ్రీవాస్తవ నవంబర్ 28న నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలవనుంది. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా స్థానంలో స్నేహలత డిసెంబర్ 1న బాధ్యతలు చేపడతారు. ఈమె పదవీ కాలం 2018 డిసెంబర్ 30న ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్ నియామకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : స్నేహలతా శ్రీవాస్తవ
ఎందుకు : అనూప్ మిశ్రా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో

‘కొలిమి రవ్వలు’ పుస్తకం ఆవిష్కరణఇటీవల హత్యకు గురైన కర్ణాటకకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నవంబర్ 28న ఆవిష్కరించారు. గౌరీ లంకేశ్ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గౌరీ లంకేశ్ పుస్తకం కొలిమి రవ్వలు ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రకాశ్ రాజ్

ఎయిరిండియా కొత్త సీఎండీ ప్రదీప్ సింగ్ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ కొత్త సీఎండీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నవంబర్ 28న నియమితులయ్యారు. ఈయన 1985 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రదీప్‌సింగ్ 2015 ఫిబ్రవరి నుంచి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. అలాగే కర్ణాటక అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ చైర్మన్‌గా, కర్నాటక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ నుంచి ప్రదీప్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిరిండియా కొత్త సీఎండీ నియామకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రదీప్ సింగ్
ఎందుకు : ప్రస్తుత సీఎండీ రాజీవ్ బన్సాల్ స్థానంలో

విశ్వసుందరిగా డెమి-లేహ్ నెల్ పీటర్స్దక్షిణాఫ్రికా యువతి డెమి-లేహ్‌సెల్ పీటర్‌‌స(22) విశ్వసుందరిగా ఎంపికయ్యారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో 2017 నవంబర్ 26న జరిగిన తుది పోటీల్లో డెమి ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన శ్రద్ధ శశిధర్ 10వ స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విశ్వ సుందరి 2017 విజేత
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డెమీలే-నెల్ పీటర్స్
ఎక్కడ : లాస్ వేగాస్

15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఎన్‌కే సింగ్ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్ 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నవంబర్ 27న నియమితులయ్యారు. రుణ స్థాయిలు, నగదు నిల్వలు, కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్‌టీ ప్రభావం వంటి అంశాలను 15వ ఫైనాన్స్ కమిషన్ సమీక్షించి అక్టోబర్ 2019 నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. ఈ కమీషన్ 2020 ఏప్రిల్ 1 నుంచీ ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి తగినసిఫార్సులు చేస్తుంది.
కమీషన్‌లో మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరి, నీతీ ఆయోగ్ సభ్యులు రమేష్ చాంద్, జార్జిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనూప్ సింగ్‌లు సభ్యులుగా ఉంటారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకు సంబంధించిన 14వ ఫైనాన్స్ కమిషన్ 2013 జనవరి 2న ఏర్పాటయింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఎన్‌కే సింగ్

అవార్డులుఅనిల్ దవే, చంద్ర భూషణ్‌లకు ఓజోన్ అవార్డు Current Affairs కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) డిప్యూటీ డెరైక్టర్ చంద్ర భూషణ్‌లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులు అందుకున్నారు. రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు. దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్‌కు భాగస్వామ్య అవార్డు లభించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అనిల్ దవే, చంద్ర భూషణ్‌లకు ఓజోన్ అవార్డు 
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : పర్యావరణ కార్యక్రమంలో భాగంగా 

రాజ్‌కుమార్ కు ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుభారత్ తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన న్యూటన్ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల (ఏపీఎస్‌ఏ) కార్యక్రమంలో ఈ చిత్రం రెండు అవార్డులను దక్కించుకుంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌రావు ఉత్తమ నటుడిగా, మయాంక్ తివారీ, అమిత్ మసూర్కర్‌లు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలుగా ఎంపికయ్యారు. 
హీరో రాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన న్యూటన్ ఆస్కార్ రేసులో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఎంపికైంది. న్యూటన్ చిత్రంను చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కథతో బ్లాక్ కామెడీ తరహా సినిమాగా తీశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడి అవార్డు 
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్
ఎందుకు : న్యూటన్ చిత్రంలో నటనకు గాను 

డా. రామారెడ్డికి అమిత్ బోరా ఆరేషన్ అవార్డుఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్యులు, బీసీరాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డికి ‘డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు’ లభించింది. 2017 ఏడాదికిగానూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సైకియాట్రి(ఐఏపీపీ) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. నవంబర్ 23 నుంచి 26 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఐఏపీపీ 18వ వార్షిక సమావేశాల్లో రామారెడ్డికి అవార్డును ప్రదానం చేశారు.
అకాల మరణం పొందిన యువ మానసిక వైద్యుడు అమిత్ బోరా పేరు మీదుగా ఆయన తల్లిదండ్రులు ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డాక్టర్ కర్రి రామారెడ్డి

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 3


*🌎చరిత్రలో ఈరోజు/  డిసెంబరు 03🌎*
            
    *◼డిసెంబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 337వ రోజు (లీపు సంవత్సరములో338వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 28 రోజులు మిగిలినవి.*◼

*⏱సంఘటనలు⏱*

*♦2007: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.*


*♦1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.*

*♦1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.*

*❤జననాలు❤*

*🔥1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)*

*🔥1889: ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908)*

*🔥1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత.*

*🍃మరణాలు🍃*

*🌷1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)*

*🌷1968: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)*

*🌷1979: ధ్యాన్ చంద్, ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)*

*🌷1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)*

*🌷2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)*

*🌷2011: దేవానంద్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)*

*🔥జాతీయ దినాలు*🇮🇳

*♦ప్రపంచ వికలాంగులు దినోత్సవం*

భార‌త‌దేశ చ‌రిత్ర, సంస్కృతి - వార‌స‌త్వం.

1*'యంగ్ బెంగాల్' ఉద్యమ స్థపకుడు ఎవరు?

 హెన్రీ వివియన్డెరోజియో                                           
2. 1920లో 'అఖిల భారత ట్రేడ్ యూనియన్కాంగ్రెస్‌'ను స్థాపించిందెవరు?

 ఎన్.ఎం.జోషి                                                                   
3. గాంధీని 'జాతిపిత'గా మొదట సంబోధించిననాయకుడు?

 సుభాష్ చంద్రబోస్                                                          
4. 'చీకటి గది' ఉదంతం గురించి పేర్కొన్న వ్యక్తిఎవరు?

 హాల్‌వెల్                                                                                    
5. 'కుకా' ఉద్యమ స్థాపకుడు?

 భగత్ జవహర్‌మల్                                     
6. గాంధీజీ పాదయాత్రతో సంబంధం ఉన్న 'దండి' గ్రామం గుజరాత్‌లోని ఏ జిల్లాలో ఉంది?

నౌసారి

7. గడ్కరీలు ఏ ప్రాంతంలో బ్రిటిష్ వారికివ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు?

మహారాష్ట్ర

8. రాజారామ్మోహన్ రాయ్ ఆలోచనలనువ్యతిరేకించి ధర్మసభ సంస్థను స్థాపించిన వ్యక్తి?

రాధాకాంత్‌దేవ్ 

9. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపకుడుఎవరు?

కోల్బర్ట్

10. ఏ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు 'ఇప్పుడుభారతదేశం మనదే' అని పేర్కొన్నారు?

రెండో ఆంగ్లో మరాఠాయుద్ధం

11. 1948లో విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచడానికి ప్రభుత్వం నియమించిన కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు?

ఎస్ రాధాకృష్ణన్

12. విషప్రయోగం వల్ల మరణించిన మతసంస్కరణ ఉద్యమకారుడు?

స్వామిదయానందసరస్వతి 

13. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడు ఎవరు?

ఎమ్.ఎన్.రాయ్

14. అలీపూర్ కుట్రకేసులో నిందితుడైన అరబిందోఘోష్ తరఫున వాదించిన న్యాయవాది ఎవరు?

చిత్తరంజన్ దాస్

15. పరిపాలన సక్రమంగా జరగడం లేదన్నకారణంతో మైసూరును బ్రిటిష్ సామ్రాజ్యంలోవిలీనం చేసిన గవర్నర్ జనరల్?

విలియం బెంటింక్

16. 1857 తిరుగుబాటు సమయంలోతిరుబాటుదారుల చేతిలో మరణించినఆంగ్లేయ అధికారి ఎవరు?

హెన్రీ లారెన్స్, జనరల్ఓనీల్ 

17. 'దక్షిణేశ్వర యోగి'గా పేరుగాంచిన వ్యక్తిఎవరు?

రామకృష్ణ పరమహంస

18. భారతదేశంలో పొగాకు పంటను ప్రవేశపెట్టినవిదేశీయులెవరు?

పోర్చుగీసు

19. 'నాయర్ సర్వీస్' సొసైటీ స్థాపకుడు ఎవరు?

మన్నత్ పద్మనాభ పిళ్లై

20. భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడుఏర్పాటైంది?

1773

21. 1857 తిరుగుబాటు సమయంలో దిల్లీనిబ్రిటిషర్ల ఆధీనంలోకి తెచ్చినవారెవరు?

జాన్ నికల్సన్                                             

22. 1857 తిరుగుబాటు సమయంలో దిల్లీలోతిరుగుబాటుదారులకు నాయకత్వం వహించినవారెవరు?

భక్త్‌ఖాన్                                     

23. మహారాష్ట్ర సోక్రటీస్‌గా పేరుగాంచిన జాతీయనాయకుడు ఎవరు?

ఎం.జి.రనడే
                                    
24. 'నీల్‌దర్పణ్' నాటక రచయిత?

దీన్‌బంధుమిత్ర.                            

25. 'కస్పరస్' పత్రిక సంపాదకుడు ఎవరు?

హెన్రీ వివియన్డెరోజియో.                      

26. కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ప్రధానమంత్రి?

రామ్‌సే మెక్‌డొనాల్డ్                                 

27. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?

విలియం బెంటింక్.                          

28. 'హరిజన్ సేవక్ సంఘ్' స్థాపకుడు ఎవరు?

మహాత్మాగాంధీ.                              

29. 1857 తిరుగుబాటును 'జాతీయతిరుగుబాటు'గా అంగీకరించిన ఆంగ్లేయుడుఎవరు?

 బెంజమన్ డి జ్రేలి                                                                                                          30. మాంటేగ్ ప్రకటనను 'సూర్యుడు లేనిసూర్యోదయం'గా పేర్కొన్న జాతీయనాయకుడు ఎవరు?

 బాలగంగాధర్ తిలక్.

నవంబరు 2017 జాతీయం

నవంబరు 2017 జాతీయం 
ఢిల్లీలో పేపర్ పరిశ్రమల అంతర్జాతీయ సమ్మేళనంCurrent Affairs పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ నవంబర్ 1న ఢిల్లీలో ప్రారంభించారు. సదస్సులో 22 దేశాల నుంచి ప్రముఖ సంస్థలు పొల్గొని పేపర్ తయారీలో ఆయా సంస్థలు అనుసరిస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించాయి. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనం
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : పేపర్ తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి

తొమ్మిది ప్రధాన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన తొమ్మిది కీలకమైన బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. వీటిలో పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ అమెండ్‌మెంట్ బిల్లు, గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తదితరాలు ఉన్నట్లు రాష్ట్రపతిభవన్ వర్గాలు నవంబర్ 5న వెల్లడించాయి. గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నిర్బంధ ఖైదీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. దీంతో కీలక కేసుల్లో శిక్ష పడిన ఖైదీల రక్షణ, వారిని కోర్టులకు తీసుకొచ్చే ఇబ్బందులు పోలీసులకు ఉండవు. 

అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పునరుద్ధరణ 2016లో ఏర్పాటైన అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పదవీ కాలం ముగియడంతో దాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర హోం శాఖ అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైంది. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, తావర్‌చంద్ గెహ్లట్; పంజాబ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. 

భారతీయ కిచిడీకి గిన్నిస్ రికార్డు భారతీయుల సంప్రదాయ వంటకాల్లో ఒకటైన కిచిడీ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. ఢిల్లీలో నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ ఉత్సవంలో నవంబర్ 4న దాదాపు 918 కేజీల కిచిడీని తయారుచేసి చరిత్ర సృష్టించారు. అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ, సంజీవ్ కపూర్ అనే పాకశాస్త్ర ప్రవీణుడి నేతృత్వంలో 50 మంది బృందం ఈ కిచిడీని తయారుచేసింది. 

లడఖ్‌లో అత్యంత ఎత్తయిన రహదారి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈశాన్య ప్రాంతంలోని ఇండో-చైనా సరిహద్దులోని చిసూమ్లే, డెమ్‌చోక్ గ్రామాలను కలుపుతూ 86 కి.మీ. పొడవుగల రోడ్డును భూ ఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో నిర్మించింది. 
వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 10 నుంచి 20 డిగ్రీలు ఉంటుంది. ఎత్తయిన ప్రాంతం కావడంతో ఆక్సిజన్ స్థాయి మిగతా ప్రాంతాలతో పోలిస్తే 50 శాతం తక్కువగా ఉంటుంది. తద్వారా ఇక్కడ పనిచేసేవారు ప్రతి పది నిమిషాలకు ఓసారి ఆక్సిజన్ కోసం కిందకు వెళ్లాల్సి వచ్చేది. చాలామంది జ్ఞాపక శక్తి లోపం, కంటిచూపు మందగించడం, అధిక రక్తపోటు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని రహదారి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ హిమాంక్ అధికారి డీఎమ్ పుర్విమత్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలో అత్యంత ఎత్తై రహదారి 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 
ఎక్కడ : లడఖ్, జమ్మూకాశ్మీర్ 

ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ పరికరం తప్పనిసరి డిసెంబర్ 1 నుంచి విక్రయించే కొత్త ఫోర్ వీలర్ వాహనాలన్నింటికి ‘ఫాస్టాగ్’ పరికరం తప్పనిసరిగా అమర్చాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నవంబర్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. 
వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చే ఈ డివైజ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని ఆయా వాహనదారుల సేవింగ్‌‌స ఖాతా లేదా ప్రీపెయిడ్ ఖాతాకు అనుసంధానం చేస్తారు. టోల్ గేట్ల నుంచి ప్రయాణించేటప్పుడు ఈ ఫాస్టాగ్‌లలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 370 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ విధానం అమల్లో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి 
ఎప్పుడు : డిసెంబర్ 1 
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ 
ఎందుకు : టోల్‌గేట్ల దగ్గర చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడం కోసం 

ఎత్తయిన వంతెనకు ఇండియన్ రైల్వే శ్రీకారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెన నిర్మాణ పనులను భారత్‌కు చెందిన కొంకణ్ రైల్వే నవంబర్ 6న ప్రారంభించింది. దీన్ని కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇది కుతుబ్ మినార్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా దీనిని ప్రారంభించారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,005 కోట్లు. 1,315 మీటర్ల పొడవుగల వంతెన నిర్మాణానికి 25 వేల మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉపయోగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణం ప్రారంభం 
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కొంకణ్ రైల్వే (భారతీయ రైల్వే)
ఎక్కడ : కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై
ఎందుకు : ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 1


*🌎చరిత్రలో ఈరోజు/  డిసెంబరు 01🌎*
*▪డిసెంబర్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 335వ రోజు (లీపు సంవత్సరములో 336వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 30 రోజులు మిగిలినవి.◾*

*🕘సంఘటనలు🕘*

*🌻1963: నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది.*

*🌻1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడింది.*

*🌻1965: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం.జి సైదేశ్వర రావు*

*🌻2006: 15వ ఆసియా క్రీడలు దోహాలో ప్రారంభమయ్యాయి.*

*❤జననాలు❤*

*🔹1699: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి (మ.1719).*

*🔹1908: నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జనన (మ.1985).*

*🔹1918: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991)జి సైదేశ్వర రావు*

*🔹1954: మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.*

*🔹1944: డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.*

*🔹1980: ముహమ్మద్ కైఫ్, భారత క్రికెట్ క్రీడాకారుడు.*

*🍃మరణాలు*🍃

1995: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (జ.1947)*

*🌹2002: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు మరియు రచయిత.(జ.1924)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*

*♦2003: ప్రపంచ ఎయిడ్స్ దినం.*

*♦నాగాలాండ్ దినోత్సవం.*

*♦సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం.*

*♦మయన్మార్ జాతీయ దినం.*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*❗సుభాషిత వాక్కు*❗

*"ఎదుటి వారికి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది ఎదుటివారిది కాదు."*

*"Life is very short to argue and fight. Count your blessings, value your friends and move on with your head held high and a smile for everyone."*

    *🌷మంచి పద్యం*

*దొంగ స్వామిజీలు దోపిడీదారులు*
*కాషాయంబు కట్ట కాడుస్వామి*
*భక్తి ముసుగులోన బురిడీలు కొట్టించు*
*వాస్తవంబు వేము వారి మాట*

*❗భావం*:-

*భక్తి ముసుగులో కాషాయ వస్త్రాలు కట్టి స్వామిజీలుగా నటిస్తూ ప్రజలను వంచించుచున్నారు.*

*🔹నేటి జీ కె🔹*

*👉1) హైదరబాద్ లో మొదలైన మొదటి మెట్రో రైలు ను నడిపిన మహిళా డ్రైవర్లు ఎవరు?*

*జ) కే సింధూజ(వరంగల్)*
*బి వెన్నెల(మహబూబ్  నగర్)*
*ఎస్ సుప్రియ( నిజమాబాద్)*

*👉2) ప్రపంచ పారిశ్రామిక సదస్సు ప్రారంభోత్సవo లో *ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన రోబో పేరు?*

జ) *మిత్రా1*

*👉3) *ఎయిరిండియా కొత్త CMD ఎవరు?*

జ) *ప్రదీప్ సింగ్ ఖరోల*

*👉4) మొదట మెట్రో రైలు భారత్ లో ఏ నగరంలో ప్రారంభమైనది?*

జ) *కలకత్తా(1984)*

👉5) *సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఏది?*

జ) *అంకనూర్ ( నిజమాబాద్)*

*✅ తెలుసుకుందాం ✅*

*⭕చంద్రునిపై నీరుండడం నిజమేనా?*

✳చంద్రునిపై నీరుందని ఇస్రో శాస్త్రజ్ఞులు ప్రకటించారంటే, అక్కడ నీరు సముద్రాలు, కాలువల రూపంలో ఉందని కాదు. నీటికి సంబంధించిన హైడ్రాక్సైల్‌ (హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల సమ్మేళనం) అణువులను మాత్రమే చంద్రయాన్‌లోని ఒక పరికరమైన 'మూన్‌ మినరాలజీ మాపర్‌' ద్వారా గుర్తించారు. 

ఆ విధంగా జాబిలిపై జలం ఆనవాళ్లు ఉండటానికి ఒక కారణం చంద్రుని ఉపరితలాన్ని 3.9 బిలియన్‌ సంవత్సరాల క్రితం క్రమం తప్పకుండా ఢీకొన్న తోక చుక్కలు (comets), ఉల్కలు (meteorites) కావచ్చు. ఇవి తమలో ఉన్న నీటిని అక్కడ వదలి ఉండాలి. ఆ నీటిలో చాలావరకు ఆవిరయిపోగా ఇపుడు గర్తించిన నీటి ఆనవాళ్లు మిగిలిన నీటికి సంబంధించినవి. 

మరోకారణం, చంద్రుని ఉపరితలాన్ని అతి వేగంగా తాకుతున్న సూర్యుని నుంచి వీచే అతి శక్తిమంతమైన గాలుల (solar winds) లోని ప్రోటాన్లు. ఈ ప్రోటాన్లు, అందులో ఉండే హైడ్రోజన్‌ అయాన్లు చంద్రుని ఉపరితలాన్ని అత్యంత వేగంతో అంటే, సెకనుకు 100 కిలోమీటర్లు వేగంతో ఢీకొంటున్నాయి. సూర్యుని ఉపరితలంలోని నేలలో, రాళ్లలో 40 శాతం ఆక్సిజన్‌ ఉంది. సూర్యుని నుంచి వేగంగా వచ్చిన ప్రోటాన్ల అభిఘాతాల (collisions) వల్ల చంద్ర శిలలు, నేలలోని ఆక్సిజన్‌ విడుదలై ప్రోటాన్లలోని హైడ్రోజన్‌తో కలిసి నీటికి సంబంధించిన హైడ్రాక్సైల్‌ అణువులను చంద్రునినపై ఏర్పరిచి ఉండవచ్చు. 

ఈ నీటికి సంబంధించిన అణువులు ధృవాల దగ్గర ఎక్కువగా ఉన్నాయని, అక్కడ నుంచి 10 డిగ్రీలమేర ఉత్తర, దక్షిణ దిశలకు చంద్రుని నేలలో వ్యాపించాయని చంద్రయాన్‌-1 ప్రయోగం నిర్ధరించింది. ఒకటన్ను చంద్రుని మట్టిలో ఒకలీటరు నీరు ఉండవచ్చని శాస్త్రజ్ఞుల అంచనా. 

మన దేశానికి చెందిన ఇస్రో ప్రయోగం చంద్రుని భూమిలో ఒక సెంటీమీటరు లోతులో ఉండే నీటి ఆనవాళ్లను కనుగొనగా, అమెరికాలోని 'నాసా' జరిపిన ప్రయోగం ఇంకా లోతుగా ఉండే ప్రదేశంలో నీటి జాడలను అన్వేషిస్తోంది.

ఈ రోజు జికె 

*1) చైనాలో ఇటీవల ప్రారంభించబడిన వేగవంతమైన బుల్లెట్టు  రైలుపేరేమిటి?*

A: *ఫక్సింగ్.*

*2) ఇటీవల మరణించిన "దేశ బందు గుప్తా" ఏ రంగంలో ప్రసిద్ధుడు?*

A: *ఔషదరంగం.*

*3) "రాయల్ సొసైటీ-2017" పురస్కారం పొందిన భారతీయుడు ఎవరు?*

A: *పీసపాటి వెంకటేశ్వర్లు.*

*4) మహిళా వన్డే క్రికెట్ లో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన బ్యాట్స్ విమెన్ గా రికార్డు సృష్టించిన భారతీయ క్రికెటర్ ఎవరు?*

A: *మిథాలీరాజ్*

*5) తెలంగాణ మీడియా  అకాడమీ పేరు "MATS గా మార్చారు. దీని పూర్తి రూపం ఏమిటి?*

A: *మీడియా  అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్.*

 *6) ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2017 థీమ్:?*

*జ:  ప్రకృతితో ప్రజలను మమేకం చేయడం*

*6) యుద్ధ్ అభ్యాస్-2017 పేరుతో ఇటీవల ఏ రెండు దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించాయి-?జి సైదేశ్వర రావు*

*జ:- భారత్, అమెరికా*

*7) ఏ సంవత్సరంలోగా భారత్‌ను తట్టు రహిత దేశంగా మార్చాలని WHO లక్ష్యంగా పెట్టుకుంది-?*

*జ: 2022*

*8) 2017 సంవత్సరానికి కాళోజీ నారాయణరావుకు ఎంపికైంది-?*

*జ:; సీతారాం*

*9) హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎవరు నిర్మించారు-?*

*జ:; నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా*

*10) భారత్‌లో రోజూవారీ కూలీపై ఆధారపడిన వారి శాతం అధికంగా ఉన్న రాష్ట్రం- ?*

*జ: తమిళనాడు.*

*🔥జనరల్ సైన్స్~కాంతి🔥*

1. మానవ నేత్రం ఏ కటకంలా పని చేస్తుంది?
1) కుంభాకార కటకం✅
2) పుటాకార కటకం
3) సమతల గాజు పలక
4) కుంభాకార దర్పణం

2. అతినీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
1) గెలీలియో 
2) రాంట్ జెన్
3) రిట్టర్✅
4) గేబర్

3. కండరాల నొప్పి, పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు?
1) అతినీలలోహిత కిరణాలు
2) రేడియో తరంగాలు
3) x కిరణాలు
4) పరారుణ కిరణాలు✅

4. నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?
1) లేజర్ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు✅
3) మైక్రో తరంగాలు
4) రేడియో తరంగాలు

5. వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?
1) సరళ సూక్ష్మదర్శిని 
2) సంయుక్త సూక్ష్మదర్శిని
3) ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ✅
4) సాధారణ మైక్రోస్కోప్

6. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు?
1) మైక్రో తరంగాలు✅
2) రేడియో తరంగాలు
3) గామా కిరణాలు
4) x- కిరణాలు 
7.కిందివాటిలో కనిష్ట తరంగదైర్ఘ్యం ఉన్న కిరణాలు?
1) పరారుణ కిరణాలు 
2) అతినీలలోహిత కిరణాలు
3) సాధారణ కాంతి కిరణాలు
4) x - కిరణాలు ✅

8. అతినీలలోహిత కిరణాల ఉనికిని గుర్తించ డానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారుచేసిన కటకాలను వాడతారు?
1) పెరైక్స్ గాజు
2) సోడా గాజు
3) క్వార్ట్జ్ గాజు✅
4) ఫ్లింట్ గాజు

9. లేజర్ కిరణాల లక్షణం కానిది?
1) శక్తి ✅
2) ఏకవర్ణీయత
3) దిశానియత
 4) తీవ్రత

10. నిషాచర దృష్టిలో ఉపయోగించే కిరణాలు ఏవి?
1) అతినీలలోహిత కిరణాలు
2) సాధారణ కాంతి కిరణాలు
3) పరారుణ కిరణాలు✅
4) లేజర్ కిరణాలు

11. లేజర్ కిరణాల లక్షణం కానిది?
1) శక్తి ✅
2) సంబద్ధత
3) ఏకవర్ణీయత
4) దిశనీయత

12. కింది వాటిలో పరారుణ కిరణాల అనువర్తనం కానిది?
1) రాకెట్, క్షిపణుల్లో మార్గనిర్దేశక కిరణాలుగా ఉపయోగపడుతుంది.
2) రహస్య సంకేతాల ప్రసారానికి వినియోగిస్తారు.
3) మురిగిన కోడిగుడ్ల నుంచి మంచివాటిని గుర్తించడానికి వాడతారు✅.
4) పొగమంచులో స్పష్టంగా ఫొటోలు తీయడానికి ఉపయోగిస్తారు.

13. కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్ర పటలంలా పనిచేస్తుంది?
1) కటకం
2) ఫిల్మ్✅
3) ద్వారం
4) ఫ్లాష్

14. సముద్రం నీలి రంగులో కనిపించడానికి కారణం?
1) ఎక్కువ లోతు
2) కాంతి పరావర్తనం✅
3) నీరు నీలిరంగులో ఉంటుంది
4) ఊర్థ్వ పొర మాత్రమే

15. సబ్బు బుడగలో వివిధ రంగులు ఏర్పడటానికి కారణం?
1) వ్యతికరణం✅
2) బహుళ వక్రీభవనం, ధ్రువణం
3) వక్రీభవనం, ధ్రువణం
4) ధ్రువణం, వ్యతికరణం

16.షేవింగ్ చేయడానికి ఎలాంటి దర్పణం ఉపయోగిస్తారు?
1) పుటాకార✅
2) సమతల
3) కుంభాకార
4) ఏదీకాదు

17. దంత వైద్యులు ఉపయోగించే దర్పణం?
1) పుటాకార దర్పణం✅
2) కుంభాకార దర్పణం
3) సమతల దర్పణం
4) స్తూపాకార దర్పణం

18.టీవీ రిమోట్ కంట్రోల్లో ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
1) పరారుణ కిరణాలు✅
2) అతినీలలోహిత కిరణాలు
3) గామా కిరణాలు
4) రాడార్ కిరణాలు

19. కాంతి.. ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు?
1) వ్యతికరణం
2) కాంతి వివర్తనం✅
3) పరావర్తనం
4) వక్రీభవనం

20. వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు?
1) అతినీలలోహిత కాంతి✅      
2) పరారుణ కాంతి
3) మైక్రో తరంగాలు      
4) గామా తరంగాలు

21. కింది వాటిలో వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం?
1) పరావర్తనం
2) వ్యతికరణం
3) సంపూర్ణాంతర పరావర్తనం✅
4) వివర్తనం

22.కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగా  పనిచేసే పరికరం?
1) సూక్ష్మదర్శిని 
2) కెమెరా✅
3) లాంథర్
4) ప్రొజెక్టర్

23. హోలోగ్రఫీ అనేది దేన్ని తెలియజేస్తుంది?
1) ఏకతల ఫొటోగ్రఫీ
2) ద్విమితీయ ఫొటోగ్రఫీ
3) త్రిమితీయ ఫొటోగ్రఫీ✅
4) సమకోణ ఫొటోగ్రఫీ

24. వాహనాల్లో డ్రైవర్ల పక్కన అమర్చే దర్పణం?
1) పుటాకార
2) కుంభాకార✅ 
3) స్తూపాకార
4) సమతల 

25. కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి?
1) అనుదైర్ఘ్య
2) తిర్యక్✅
3) యాంత్రిక
4) స్థావర

26. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? 
1) న్యూటన్✅
2) గెలీలియో
3) మాక్స్ ప్లాంక్
4) రూథర్ఫర్డ్

27. రామన్ ఫలితం దేనికి సంబంధించింది?
1) ధ్వని
2) విద్యుత్
3) అయస్కాంతత్వం 
4) కాంతి✅
.
28. మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది?
1) ప్రోటాన్
2) ఫోటాన్✅
3) ఎలక్ట్రాన్
4) అయాన్

29. కింది వాటిలో సూర్యుడికి సంబంధించి సరైంది?
1) మధ్యతరహా నక్షత్రం
2) ఉత్తమ నలుపు వస్తువు
3) స్వయం ప్రకాశ వస్తువు
4) పైవన్నీ✅

30. అతి నీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
1) రిట్టర్✅
2) హెర్శ్సల్
3) మాక్స్ ప్లాంక్
4) రాంట్జెన్

*🔥జనరల్_సైన్స్🔥*

*1) ఆస్ట్రిచ్ అండం అనేది?*

*జ:;జంతు రాజ్యంలో అతిపెద్ద కణం*

*2) నాడీ కణం అనేది ?*

*జ: జంతు రాజ్యంలో అతి పొడవైన కణం ?*

*3) నాస్టాక్ కణం అనేది ?*

*జ: కేంద్రక పూర్వ కణం*

*4) శుక్ర కణం అనేది ?*

*జ: జంతు రాజ్యంలో అతి చిన్నదైన కణం*

*5) బేసోఫిల్స్ అనేవి ?* 

*జ: అతి తక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు*

*6) న్యూట్రోఫిల్స్ అనేవి ?*

*జ: అతి ఎక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్తకణాలు*

*7) మోనోసైట్స్ అనేవి ?*

*జ: అతి పెద్ద తెల్ల రక్త కణాలు*
*జి సైదేశ్వర రావు*
*8) లింఫోసైట్స్  అనేవి ?*

*జ: అతి చిన్న తెల్ల రక్త కణాలు*

*9) మానవునిలో పాల దంతాల సంఖ్య - ?*

*జ: 20*

*10) మానవునిలో శాశ్వత దంతాల సంఖ్య -?*

*జ: 32*

*11) మానవునిలో క్రోమోజోముల సంఖ్య -?*

*జ: 46*

*12) మానవునికి ఎముకల సంఖ్య -?*

*జ: 206*

*13) నేల పై ఉండే అతి పెద్ద క్షీరదం ?* 

*జ: ఆఫ్రికా ఏనుగు*

*14) దంతాలు లేని క్షీరదం ?*

*జ: పాంగోలిన్*

*15) ఎత్తైన క్షీరదం ఏదీ ?*

*జ: జీరాఫీ*

ఈ రోజు జికె 

: Q. DNA మ‌రియు ప్రోటీనుల‌తో నిర్మిత‌మైన‌ది?

1. క్రొమాటిన్2. మైట్రోకాండ్రియా3. లైసోసోమ్‌లు4. రైబోసోమ్‌లుAnswer: క్రొమాటిన్

*పాత ప్రశ్నలు*

Q. భారతదేశ స్థలాకృతి చిత్రాలను తయారుచేసే సంస్థ ఏది?

1. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా2. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా3. సర్వే ఆఫ్ ఇండియా4. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియాAnswer: సర్వే ఆఫ్ ఇండియా

Q. విలువైన రత్నం'కెంపు'లో అల్యూమినియం ట్రైఆక్సైడ్‌తో పాటు స్పల్పంగా ఉండే పదార్థం ఏది?

1. సిల్వర్2. మాంగనీస్3. క్రోమియం4. కోబాల్ట్Answer: క్రోమియం

Q. నాగార్జునకొండలో బయల్పడిన అశ్వమేథ వేదిక ఎవరిది?

1. రుద్రపురుషదత్తుడు2. వీరపురుషదత్తుడు3. శాంతమూలుడు4. భదంతానందుడుAnswer: శాంతమూలుడు
: Q. ఇక్ష్వాకుల రాజధాని ఏది?

1. వేల్పూరు2. విజయపురి3. కోటి లింగాల4. కొండాపూర్Answer: విజయపురి

Q. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది?

1. న్యూయార్క్2. జెనీవా3. లండన్4. హేగ్Answer: హేగ్

Q. తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ను ఆక్రమించిన సంవత్సరం?

1. 14352. 15433. 14534. 1456Answer: 1453

Q. క‌ణాంగాల‌లో ముఖ్యమైన‌ది?

1. కేంద్రకము2. రైబోసోమ్‌3. గాల్జీసంక్లిష్టము4. అంత‌ర్జీవ ద్రవ్యజాల‌ముAnswer: కేంద్రకము

Q. భూమిపై ఉన్న చిన్న ఖండం-

1. యూరప్2. దక్షిణ అమెరికా3. అంటార్కిటికా4. ఆస్ట్రేలియాAnswer: ఆస్ట్రేలియా

Q. చంద్రయాన్ - 1లో ఉన్న కింది ఏ పరికరం ఉపగ్రహం నుంచి విడిపోయి చంద్రుడిపైకి చేరింది?

1. టెర్రెయిన్ మ్యాపింగ్ కెమెరా2. ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటరు3. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్4. రేడియేషన్ డోస్ మానిటర్Answer: మూన్ ఇంపాక్ట్ ప్రోబ్

Q. జీవుల‌న్నిటికి --------- ప్రధాన‌మైన‌ మూలం.

1. క‌ణం2. ఆహారం3. నీరు4. గాలిAnswer: క‌ణం

Q. పిర్ పంజాల్ ప‌ర్వత‌శ్రేణి యీ రాష్ట్రంలో ఉంది :

1. మేఘాల‌య2. అరుణాచ‌ల్ ప్రదేశ్3. జ‌మ్ము కాశ్మీర్4. హిమాచ‌ల్ ప్రదేశ్‌Answer: జ‌మ్ము కాశ్మీర్

Q. అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది?

1. వెండి2. ఇనుము3. బంగారం4. అల్యూమినియంAnswer: వెండి

Q. కిందివాటిలో ఏది ఒకే మూలకాన్ని కలిగి ఉంటుంది?

1. వజ్రం2. గాజు3. మార్బెల్4. ఇసుకAnswer: వజ్రం

Q. మొదటి అటామిక్ బాంబు రూపకర్త ఎవరు?

1. ఇ.ఫెర్మి2. ఒపెన్‌హైమర్3. ఇ.టెల్లర్4. ఒ.హాన్Answer: ఒ.హాన్

Q. ఏనుగు సగటు జీవిత కాలం ఎన్నేళ్లు?

1. 572. 103. 334. 22Answer: 57

Q. లోక్‌సభకు పోటీచేయడానికి కనీస వయసు ఎంత?

1. 252. 303. 214. 35Answer: 25

Q. ఇస్రో సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2008, అక్టోబరు 22న పీఎస్ఎల్వీ - సీ11 ద్వారా ప్రయోగించిన ఉప్రగహం పేరేంటి?

1. చంద్రయాన్ - 12. రిశాట్ - 23. అనుశాట్4. ఓషన్‌శాట్ - 2Answer: చంద్రయాన్ - 1

Q. ప్రపంచంలో అత్యధిక వేగంతో నడిచే రైలు ఉన్న దేశమేది?

1. అమెరికా2. ఇంగ్లండ్3. ఫ్రాన్స్4. జపాన్Answer: జపాన్

Q. ఇండియన్ మూన్‌మిషన్ - 1లో భాగంగా ప్రయోగించిన ఉపగ్రహంలో భారతదేశానికి చెందిన ఎన్ని పరికరాలు అమర్చారు?

1. 52. 113. 74. 9Answer: 5

Q. హుగ్లీని పోర్చుగీసు వారి నుంచి ఆక్రమించిన మొగలు చక్రవర్తి ఎవరు?

1. అక్బర్2. జహంగీర్3. షాజహాన్4. ఔరంగజేబుAnswer: షాజహాన్

Q. జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రంలోని గీతలు ఎన్ని?

1. 242. 143. 184. 22Answer: 24

Q. చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలో ఉంచడానికి ఇస్రో ఉపయోగించిన వాహక నౌక ఏది?

1. పీఎస్ఎల్వీ-సీ92. పీఎస్ఎల్వీ-సీ103. పీఎస్ఎల్వీ-సీ114. పీఎస్ఎల్వీ-సీ12Answer: పీఎస్ఎల్వీ-సీ11

Q. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి అధికంగా చేస్తున్న జిల్లా ఏది?

1. ఖమ్మం2. వరంగల్3. ఆదిలాబాద్4. కరీంనగర్Answer: ఖమ్మం

Q. హిందూ నాగరికతను ఎవరు ఆరంభించారు?

1. మంగోలాయిడ్స్2. ద్రవిడులు3. ఆర్యులు4. పై అందరూAnswer: ఆర్యులు

Q. నీతి ఆయోగ్ (జాతీయ ప్రణాళిక సంఘం) అధ్యక్షుడు ఎవరు?

1. రాష్ట్రపతి2. ప్రధానమంత్రి3. స్పీకరు4. ఉప రాష్ట్రపతిAnswer: ప్రధానమంత్రి

Q. పొడవుగా, గొలుసులా ఉండే దీవుల సముదాయాన్ని ఏమంటారు?

1. ఒంటె వీపు2. ఆర్చిపెలాగో3. విల్సన్4. ఏదీకాదుAnswer: ఆర్చిపెలాగో

Q. ఇస్రో జీఎస్ఎల్వీ - ఎఫ్1 ద్వారా 2004, సెప్టెంబరు 20న కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన ఉపగ్రహం ఏది?

1. ఎడ్యుశాట్2. మెగాట్రాపిక్స్3. జీశాట్ - 64. మార్స్‌మిషన్Answer: ఎడ్యుశాట్

Q. యునెస్కో (UNESCO) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1. జెనీవా2. న్యూయార్క్3. ప్యారిస్4. లండన్Answer: ప్యారిస్

Q. ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ వాహక నౌకల్లో మొదట విజయవంతమైంది ఏది?

1. జీఎస్ఎల్వీ -డీ12. జీఎస్ఎల్వీ - డీ23. జీఎస్ఎల్వీ - సీ14. జీఎస్ఎల్వీ - సీ2Answer: జీఎస్ఎల్వీ - డీ2

Q. 2013 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక భాషా సమ్మాన్ పురస్కారాన్ని సాహిత్య అకాడమీ ఎవరికి ప్రకటించింది?

1. ఆర్. మోహన్‌దాస్2. కె. మీనాక్షీ సుందరం3.

 ఎల్. పార్వతీశం4. జి. జీవేశ్వర్Answer: కె. మీనాక్షీ సుందరం

Q. శీతలీకరణ బోగీ కలిగిన దేశంలోనే మొట్టమొదటి డెము (డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్- DEMU) రైలును ఎక్కడ ప్రారంభించారు?

1. విశాఖపట్నం2. కోల్‌కతా3. ముంబయి4. కొచ్చిAnswer: కొచ్చి

Q. ఆస్ట్రోనాట్‌కు కనిపించే విశ్వం ఏ రంగులో ఉంటుంది?

1. తెలుపు2. నలుపు3. నీలం4. వెండిAnswer: నలుపు

Q. టీ, కాఫీల్లో ఉండే ముఖ్యమైన ఉత్ప్రేరకం ఏది?

1. నికోటిన్2. క్లోరోఫిల్3. కెఫిన్4. ఆస్పిరిన్Answer: కెఫిన్

Q. న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైన తొలి భారత సంతతి మహిళ ఎవరు?

1. రేణు మల్హోత్రా2. కీర్తి కన్నన్3. శ్వేతా శేఖర్4. రాజ రాజేశ్వరిAnswer: రాజ రాజేశ్వరి

Q. ప్రతిష్ఠాత్మక 'సిల్క్‌రోడ్' రహదారుల ప్రాజెక్టు ఏ దేశానికి చెందింది?

1. జపాన్2. అమెరికా3. జర్మనీ4. చైనాAnswer: చైనా

Q. అండర్ - 20 ఫిఫా ప్రపంచకప్ 2015 విజేత .......

1. సెర్బియా2. న్యూజిలాండ్3. బ్రెజిల్4. రష్యాAnswer: సెర్బియా

Q. అరుదైన 'బౌద్ధ బ్రహ్మ' విగ్రహం ఇటీవల తెలంగాణలోని ఏ జిల్లాలో బయటపడింది?

1. నల్గొండ2. రంగారెడ్డి3. కరీంనగర్4. మహబూబ్‌నగర్Answer: కరీంనగర్

Q. 'భారత్‌లో సామాజిక వేదికలు 2014' నివేదిక ప్రకారం ఏప్రిల్ 2014 నాటికి వివిధ సామాజిక వేదికల్లో ఖాతాలు కలిగిన భారతీయుల సంఖ్య ఎంత?

1. 12.3 కోట్లు2. 14.3 కోట్లు3. 16.3 కోట్లు4. 11.3 కోట్లుAnswer: 14.3 కోట్లు

Q. 2015 ఆగస్టులో పెట్రోలియం పైప్‌లైన్ నిర్మాణం కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకరించింది?

1. శ్రీలంక2. బంగ్లాదేశ్3. నేపాల్4. పాకిస్థాన్Answer: నేపాల్

Q. 'రెపా' పురస్కారాన్ని 2015కు గాను ఏ రాష్ట్రం గెలుచుకుంది?

1. తెలంగాణ2. కేరళ3. కర్ణాటక4. తమిళనాడుAnswer: తెలంగాణ

Q. 'ఎడ్యుకేషన్ ఆఫ్ ముస్లిమ్స్; యాన్ ఇస్లామిక్ పర్‌స్పెక్టివ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్- ఇండియన్ కాంటెస్ట్' పుస్తక రచయిత ఎవరు?

1. జహంగీర్ ఖాన్2. పి.ఎల్. కాంతారావు3. అహ్మద్ సుభాగ్4. జె.ఎస్. రాజ్‌పుత్Answer: జె.ఎస్. రాజ్‌పుత్

Q. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక 'మ్యూజియం ఆఫ్ ది మూవింగ్' ఇటీవల ఏ భారతీయ సినీ ప్రముఖుడి గౌరవసూచకంగా ప్రత్యేక చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసింది?

1. అమితాబ్ బచ్చన్2. మణిరత్నం3. షారుక్ ఖాన్4. పై ముగ్గురూAnswer: మణిరత్నం

Q. మద్యపాన నిషేధాన్ని ప్రపథమంగా విధించిన మొగల్ చక్రవర్తి ఎవరు?

1. బాబర్2. అక్బర్3. హుమయూన్4. జహంగీర్Answer: జహంగీర్

Q. ప్రాచీన కాలం నుంచి విశేష ప్రాచుర్యం పొందిన హస్తకళ?

1. చేనేత2. లోహకళ3. వజ్రాల పరిశ్రమ4. కొయ్యబొమ్మలుAnswer: చేనేత

Q. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు?

1. గవర్నర్2. స్పీకర్3. రాష్ట్రపతి4. గవర్నర్ స్పీకరును సంప్రదించిAnswer: గవర్నర్

Q. కేంద్ర ప్రభుత్వం ఈ-పర్యాటక వీసా పథకాన్ని ఇటీవల ఏ దేశానికి విస్తరించింది?


1. చైనా2. హాంకాంగ్3. మకావు4. పై మూడూAnswer: పై మూడూ.