అన్ని ప్రవేశ పరీక్షల కోసం జికె బిట్స్ 5
1. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అరవింద్ పనగరియా
2) రాజీవ్ కుమార్
3) శశికాంత్ శర్మ
4) రంజిత్ పటేల్
1) అరవింద్ పనగరియా
2) రాజీవ్ కుమార్
3) శశికాంత్ శర్మ
4) రంజిత్ పటేల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ ఆర్థిక వేత్త టీకే రాజీవ్ కుమార్‌ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయనకన్నా ముందు ఈ పదవిలో ఉన్న అరవింద్ పనగరియా ఆగస్టు 1న రాజీనామా చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసింది. దీనికి భారత ప్రధాని చైర్మన్ గా ఉంటారు.
- సమాధానం: 2
2. న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా ఇటీవల నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు ?
1) ప్రియాంకా చోప్రా
2) లారాదత్తా
3) ఐశ్వర్యారాయ్
4) కృతి సనన్
1) ప్రియాంకా చోప్రా
2) లారాదత్తా
3) ఐశ్వర్యారాయ్
4) కృతి సనన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బాలీవుడ్ నటి కృతిసనన్ ఇటీవల న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. భారత్, న్యూజిలాండ్ మధ్య విద్య సంబంధాల బలోపేతం కోసం ఆమె కృషి చేస్తారు. న్యూజిలాండ్ విద్యా సంస్థల్లో చేరేలా విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రచారం కల్పిస్తారు.
- సమాధానం: 4
3. ఇస్రో చరిత్రలో తొలిసారిగా ప్రైవేట్ సంస్థతో కలిసి రూపొందించిన ఉపగ్రహం ఏది ?
1) irnss -1h
2) irnss - 1a
3) irnss - 1b
4) irnss - 1c
1) irnss -1h
2) irnss - 1a
3) irnss - 1b
4) irnss - 1c
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి pslv c 39 రాకెట్ ద్వారా irnss -1h ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. అయితే ప్రయోగం నాలుగో దశలో ఉపగ్రహం హీట్ షీల్డ్ తెరుచుకోకపోవడంతో ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఇస్రో చరిత్రలో తొలిసారిగా బెంగళూరులోని ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ సంస్థతో కలిసి ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. ఇందులో 25 శాతం అభివృద్ధి పనులను ఆ సంస్థ చేపట్టింది. ఈ ప్రయోగానికి మందు వరకు ప్రైవేటు సంస్థలు ఇస్రోకు కేవలం ప్రయోగాల్లో పరికరాల సరఫరాకు మాత్రమే పరిమితమయ్యేవి.
- సమాధానం: 1
4. భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఇటీవల ఎవరు నియమితులైయ్యారు ?
1) రాజీవ్ మహర్షి
2) నసీం జైదీ
3) అచల్ కుమార్ జ్యోతి
4) సునీల్ అరోరా
1) రాజీవ్ మహర్షి
2) నసీం జైదీ
3) అచల్ కుమార్ జ్యోతి
4) సునీల్ అరోరా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సమాచార, ప్రసారాల శాఖ మాజీ కార్యదర్శి సునీల్ అరోరాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది. ఆయన ఈ పదవిలో నాలుగేళ్లు ఉంటారు. 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. భారత ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల అధికారితో కలిపి ముగ్గురు కమిషనర్లు ఉంటారు. ప్రస్తుత భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అచల్ కుమార్ జ్యోతి.
- సమాధానం: 4
5. తదుపరి కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులైన రాజీవ్ మహర్షి ఏ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ?
1) మధ్యప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) రాజస్తాన్
4) గుజరాత్
1) మధ్యప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) రాజస్తాన్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: తదుపరి కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా నియమితులైన రాజీవ్ మహర్షి రాజస్తాన్ క్యాడర్ చెందిన 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుత కాగ్ శశికాంత్ శర్మ పదవీ కాలం 2017 సెప్టెంబర్ 25తో ముగుస్తుంది. ఆ తర్వాత రాజీవ్ మహర్షి కాగ్ గా బాధ్యతలు చేపడతారు.
కాగ్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ప్రకారం ఏర్పడిన రాజ్యాంగ కార్యాలయం. కాగ్ ని రాష్ట్రపతి నియమిస్తారు. కాగ్ పదవీకాలం 6 ఏళ్లు లేదా 65 ఏళ్లు. ఇందులో ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది. కాగ్ నిబంధనలు, విధులను పేర్కొంటూ ప్రత్యేక చట్టాన్ని 1953లో తీసుకొచ్చారు. 1971లో ఈ చట్టంలో కొన్ని సవరణలు చేశారు.
- సమాధానం: 3
6. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన గోవిందోభాగ్ రకం వరి ఏ రాష్ట్రంలో పండుతుంది ?
1) ఆంధ్రప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్
3) పంజాబ్
4) అసోం
1) ఆంధ్రప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్
3) పంజాబ్
4) అసోం
- View Answer
- సమాధానం: 2
వివరణ: గోవిందోభాగ్ రకం వరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ జిల్లాలో పండుతుంది. ఈ వరికి ఇటీవల ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స రిజిస్ట్రీ జీఐ ట్యాగ్ ఇచ్చింది. ఉత్పత్తి, తయారీలో ఒక ప్రాంతంలో ప్రాముఖ్యత పొందిన ఉత్పత్తులకు ఈ హోదా లభిస్తుంది.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స ఆఫ్ గూడ్స (రిజిస్ట్రేషన్స అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ - 1999.. భారత్‌లో 2003 సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 2004-05లో డార్జిలింగ్ టీ భారత్ లో తొలి జీఐ ట్యాగ్ పొందింది. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 300 ఉత్పత్తులు, పంటలు, వస్తువులకు ఈ ట్యాగ్ లభించింది.
- సమాధానం: 2
7. ఇటీవల స్మార్ట్ అగ్రికల్చర్ కాన్ క్లేవ్ ఎక్కడ జరిగింది ?
1) బెంగళూరు
2) కోల్కత్తా
3) న్యూఢిల్లీ
4) హైదరాబాద్
1) బెంగళూరు
2) కోల్కత్తా
3) న్యూఢిల్లీ
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్మార్ట్ అగ్రికల్చర్ సమావేశం ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, యూకేకు చెందిన బయోటెక్నాలజీ అండ్ బయోలాజికల్ సెన్సైస్ రీసర్చ్ కౌన్సిల్, రీసర్చ్ కౌన్సిల్స్ యూకే ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా దేశంలో ప్రత్యేక వ్యవసాయ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ పద్ధతులను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి అధిక ఉత్పత్తులు సాధించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
- సమాధానం: 3
8. జాతీయ పౌష్టికాహార వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 1 - 7
2) సెప్టెంబర్ 8- 15
3) జూలై 1 - 7
4) ఆగస్టు 1 - 7
1) సెప్టెంబర్ 1 - 7
2) సెప్టెంబర్ 8- 15
3) జూలై 1 - 7
4) ఆగస్టు 1 - 7
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ పౌష్టికాహార వారోత్సవాలను ఏటా సెప్టెంబర్ 1 - 7 వరకు నిర్వహిస్తారు. కేంద్ర మహిళా శిశు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఆహార, పౌష్టికాహార బోర్డు ఈ వారోత్సవాలను నిర్వహిస్తుంది. మంచి ఆరోగ్య కోసం మంచి ఆహారం అనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
2017 Theme : Optimal infant and young child feeding practices: Better child health.
- సమాధానం: 1
9. ప్రపంచంలో తక్కువ స్థాయిలో శుద్ధి చేసిన తొలి యురేనియం బ్యాంకుని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) కజకిస్తాన్
2) ఇరాన్
3) దక్షిణ కొరియా
4) ఉజ్బెకిస్తాన్
1) కజకిస్తాన్
2) ఇరాన్
3) దక్షిణ కొరియా
4) ఉజ్బెకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూఎన్ న్యూక్లియర్ నిఘా సంస్థ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కలిసి ప్రపంచంలో తొలి లో ఎన్రిచ్డ్ యురేనియం బ్యాంకుని కజకిస్తాన్‌లోని ఓస్కేమెన్లో ప్రారంభించాయి. ప్రపంచంలో ఏ దేశం ఆధీనంలో లేని తొలి యురేనియం బ్యాంకు కూడా ఇదే. ఈ బ్యాంకులో దాదాపు 90 టన్నుల లో ఎన్ రిచ్డ్ యురేనియం నిల్వలు ఉంటాయి. అసాధారణ పరిస్థితులలో తమ అణు కర్మాగారాలలో ఇంధన సరఫరా ఆగిపోయినప్పుడు ఐఏఈఏ సభ్య దేశాలు ఈ బ్యాంకు నుంచి యురేనియం నిల్వలను పొందవచ్చు. దీన్ని విద్యుత్ ఉత్పత్తి కోసమే వాడాల్సి ఉంటుంది.
- సమాధానం: 1
10. భారత్ కు చెందిన అదానీ గ్రూప్ రక్షణ ఉత్పత్తుల కోసం ఇటీవల ఏ దేశానికి చెందిన రక్షణ, ఏరోస్పేస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది ?
1) స్వీడన్
2) స్విట్జర్లాండ్
3) జర్మనీ
4) జపాన్
1) స్వీడన్
2) స్విట్జర్లాండ్
3) జర్మనీ
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్వీడన్‌కు చెందిన సాబ్ కంపెనీతో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంలో భారత్‌లో సింగిల్ ఇంజిన్ ఫైటర్ జెట్స్‌ను తయారు చేస్తాయి. ఈ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు.
- సమాధానం: 1
11. ఐ డూ వాట్ ఐ డూ పుస్తక రచయిత ఎవరు ?
1) ఉర్జిత్ పటేల్
2) రఘురామ్ రాజన్
3) అమర్త్యసేన్
4) శశిథరూర్
1) ఉర్జిత్ పటేల్
2) రఘురామ్ రాజన్
3) అమర్త్యసేన్
4) శశిథరూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐ డూ వాట్ ఐ డూ పుస్తకాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రచించారు. ఆర్బీఐ గవర్నర్‌గా తన అనుభవాలను వివరిస్తూ ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. రాజన్ 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 23వ గవర్నర్‌గా ఉన్నారు.
- సమాధానం: 2
12. ఇటీవల ఏ దేశం ప్లాస్టిక్ బ్యాగుల నియంత్రణకు ప్రపంచంలో కెల్లా అతి కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది ?
1) భారత్
2) అమెరికా
3) కెన్యా
4) ఫ్రాన్స్
1) భారత్
2) అమెరికా
3) కెన్యా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బ్యాగులను నిషేధిస్తూ కెన్యా ప్రపంచంలో కెల్లా కఠినమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కెన్యాలో ప్లాస్టిక్ బ్యాగుల తయారీ, విక్రయం, వినియోగం పూర్తిగా నిషిద్ధం. నిబంధనలను అతిక్రమించిన వారు 4 ఏళ్ల జైలు శిక్ష లేదా 40 వేల డాలర్ల జరిమానా చెల్లించాలి.
కెన్యా కన్నా ముందే ఆఫ్రికా ఖండంలోని ఇతర 9 దేశాలు ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించాయి. ఆసియాలో ఈ చర్యలు చేపట్టిన తొలి దేశం బంగ్లాదేశ్.
- సమాధానం: 3
13. The CIAPM & DIPP జియోగ్రాఫికల్ ఇండికేషన్స ప్రమోషన్ కోసం ఇటీవల ప్రారంభించిన సోషల్ మీడియా క్యాంపెయిన్ హాష్ ట్యాగ్ ఏంటి ?
1) #talkipforpromotion
2) #letstalk
3) #letstalkip
4) #letsgetonip
1) #talkipforpromotion
2) #letstalk
3) #letstalkip
4) #letsgetonip
- View Answer
- సమాధానం: 3
వివరణ: The cell for IPR Promotions and Management & CIAPM భారత జియోగ్రాఫికల్ ఇండికేషన్స ప్రమోషన్ కోసం #letstalkip హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇంటలెక్చ్యుల్ ప్రాపర్టీ రైట్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. CIAPM డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్టియ్రల్ పాలసీ అండ్ ప్రమోషన్ - DIPP, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
- సమాధానం: 3
14. 2017 సంవత్సరానికిగాను ప్రకటించిన యునెస్కో అక్షరాస్యత పురస్కారాలలో కన్ ఫ్యూషియస్ ప్రైజ్ ఫర్ లిటరసీ అవార్డును పొందిన సంస్థ ఏది ?
1) అడల్ట్ టికో ప్రోగ్రామ్
2) సిటిజన్స్ ఫౌండేషన్
3) ఫున్ ద్జా ప్రాజెక్టు
4) పైవన్నీ
1) అడల్ట్ టికో ప్రోగ్రామ్
2) సిటిజన్స్ ఫౌండేషన్
3) ఫున్ ద్జా ప్రాజెక్టు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ అక్షరాస్యతకు ఉత్తమంగా, నవ కల్పనలతో కృషి చేసినవారికి యునెస్కో ఏటా సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇటీవల 51వ లిటరసీ డేను పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో కన్ ఫ్యూషియస్ ప్రైజ్ ఫర్ లిటరసీ అవార్డుని కొలంబియాకు చెందిన అడల్ట్ టికో ప్రోగ్రామ్, పాకిస్తాన్‌కు చెందిన సిటిజన్స ఫౌండేషన్, దక్షిణ కొరియాకు చెందిన ఫున్ ద్జా ప్రాజెక్టులకు లభించింది.
అవార్డుల్లో భాగంగా యునెస్కో ప్రదానం చేసే సెంటర్ ఫర్ ది స్డడీస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఫెర్మారెన్స అవార్డుకు జోర్డాన్‌కు చెందిన ఉయ్ లవ్ రీడింగ్ ప్రాజెక్టు దక్కించుకుంది. అవార్డు గ్రహీతలకు మెడల్ తో పాటు రూ. 12.8 లక్షల ప్రైజ్ మనీ అందజేస్తారు. ఈ అవార్డును 1967 నుంచి అందజేస్తున్నారు.
- సమాధానం: 4
15. భారత్ లో జరగనున్న ఫిఫా అండర్ - 17 ప్రపంచ అధికారిక గీతానికి సంగీతం అందించింది ఎవరు ?
1) ఏఆర్ రహమాన్
2) దేవీశ్రీప్రసాద్
3) తమన్
4) ప్రీతమ్
1) ఏఆర్ రహమాన్
2) దేవీశ్రీప్రసాద్
3) తమన్
4) ప్రీతమ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫిఫా అండర్ 17 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అధికారిక పాటని స్థానిక నిర్వహణ కమిటీ, సోనీ పిక్చర్స్ రూపొందించాయి. కర్కే దిఖ్ లా దే గోల్ అనే పల్లవితో ప్రారంభయ్యే ఈ పాటని ప్రముఖ గీత రచయిత అమితాబ్ భట్టాచార్య రచించారు. సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించారు.
- సమాధానం: 4
16. విద్యుత్ ఆదా కోసం ఇటీవల మలేషియాలోని మెలాకలో ప్రారంభించిన పథకం పేరు ఏమిటి ?
1) ఉజ్వల
2) ఉజాలా
3) శక్తి
4) ఉదయ్
1) ఉజ్వల
2) ఉజాలా
3) శక్తి
4) ఉదయ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మలేషియాలోని మెలాకలో భారత కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని ది ఎనర్జీ ఎఫిషీయన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా మెలాకాలోని ప్రతి ఇంటికి 9 వాట్ల ఎల్ ఈ డీ 10 బల్బులను 10 మలేషియా రింగిట్ లకే పంపిణీ చేస్తారు.
భారత్‌లో ఈ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభత్వం 2015 మే 1న ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులను అందించి విద్యుత్ వాడకాన్ని తగ్గించాలన్నది ఈ స్కీమ్ లక్ష్యం.
- సమాధానం: 1
17. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సులో ప్రవేశపెట్టిన మయన్మార్ వ్యతిరేక తీర్మానానికి మద్దతు తెలపని దేశం ఏది ?
1) బంగ్లాదేశ్
2) ఇండోనేషియా
3) చైనా
4) భారత్
1) బంగ్లాదేశ్
2) ఇండోనేషియా
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఇందులో రోహింగ్యా ముస్లింల సమస్య విషయంలో మయన్మార్ వైఖరిని తప్పుపడుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆధ్వర్యంలోని భారత్ బృందం ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించలేదు.
- సమాధానం: 4
18. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత అవినీతి ఉన్న దేశం ఏది ?
1) పాకిస్తాన్
2) మయన్మార్
3) థాయ్‌లాండ్
4) భారత్
1) పాకిస్తాన్
2) మయన్మార్
3) థాయ్‌లాండ్
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, యాంటీ కరెప్షన్ గ్లోబల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అవినీతిపై నివేదిక రూపొందించింది. ఇటీవల ఈ నివేదికను విడుదల చేసిన ఫోర్బ్స్.. ఆసియాలో అత్యంత అవినీతి ఉన్న దేశం భారత్ అని తేల్చింది. ఈ నివేదిక ప్రకారం భారత్ 69 శాతం అవినీతితో ఆసియాలో తొలి స్థానంలో ఉంది. 65 శాతంతో వియత్నాం రెండు, 41 శాతంతో థాయ్‌లాండ్ మూడు, 40 శాతంతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
పాఠశాలలు, ఆస్పత్రులు, గుర్తింపు పత్రాల జారీ, పోలీసు, వినియోగ సేవలు పొందేందుకు లంచం అడుగుతున్న తీరుని అధ్యయనం చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించారు.
- సమాధానం: 4
19. దేశంలోని ఏ రాష్ట్రం రోహింగ్యా శరణార్థుల పిల్లలకు గుర్తింపు కార్డులు ఇవ్వనుంది ?
1) అసోం
2) పశ్చిమ బెంగాల్
3) ఒడిశా
4) బిహార్
1) అసోం
2) పశ్చిమ బెంగాల్
3) ఒడిశా
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మయన్మార్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చి పశ్చిమ బెంగాల్లో ఉంటున్న రోహింగ్యాల పిల్లలకు ఐరాస గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. వీటిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దేశంలో 16,500 మంది రోహింగ్యా శరణార్థులు నమోదయ్యారని ఐరాస లెక్కలు చెబుతున్నాయి. రోహింగ్య శరణార్థులకు భారత ప్రభుత్వం దీర్ఘకాలిక విసాలు జారీ చేస్తుంది. ఇవి వారు ఉద్యోగాలు పొందేందుకు, పౌరు సేవలు పొందేందుకు ఉపయోగపడతాయి.
- సమాధానం: 2
20. ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏ దేశాల్లో సుస్థిరాభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1.4 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది ?
1) పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, కజకిస్తాన్
2) భారత్, చైనా, రష్యా
3) శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్
4) థాయ్ లాండ్, మయన్మార్, ఫిలిప్పీన్స్
1) పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, కజకిస్తాన్
2) భారత్, చైనా, రష్యా
3) శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్
4) థాయ్ లాండ్, మయన్మార్, ఫిలిప్పీన్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు - ఎన్డీబీ భారత్, చైనా, రష్యాలో సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1.4 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇందులో భారత్ వాటా 470 మిలియన్ డాలర్లు. ఈ నిధులతో మధ్యప్రదేశ్‌లోని బహుళ గ్రామీణ తాగు నీటి సరఫరా పథకాన్ని చేపడతారు.
న్యూ డెవలప్మెంట్ బ్యాంకుని బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేశాయి. దీన్నే బ్రిక్స్ బ్యాంకు అని కూడా అంటారు. చైనాలోని షాంఘైలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. బ్యాంకు తొలి ప్రాంతీయ కార్యాలయాన్ని దక్షిణాఫ్రికాలోని జోహన్నస్ బర్గ్‌లో ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 2
21. ఇటీవల సీబీఎస్ఈ బోర్డు చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది ?
1) రాజేశ్ కుమార్ చతుర్వేది
2) అనితా కర్వాల్
3) మేఘనా నాథ్
4) సునీల్ అరోరా
1) రాజేశ్ కుమార్ చతుర్వేది
2) అనితా కర్వాల్
3) మేఘనా నాథ్
4) సునీల్ అరోరా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1998 బ్యాచ్ గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనితా కర్వాల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న రాజేశ్ కుమార్ చతుర్వేదిని జాతీయ స్కిల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ డెరైక్టర్ జనరల్‌గా నియమించింది.
- సమాధానం: 2
22. భారత దేశ రక్షణ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులైన నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
వివరణ: నిర్మలా సీతారామన్ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ అప్పగించారు. దీంతో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణ శాఖను చేపట్టిన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు. పునర్వ్యవస్థీకరణకు ముందు నిర్మలా సీతారామన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నారు.
- సమాధానం: 3
23. ఏ బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై తొలిసారి చర్చ జరిగింది ?
1) 9వ బ్రిక్స్ సదస్సు
2) 8వ బ్రిక్స్ సదస్సు
3) 7వ బ్రిక్స్ సదస్సు
4) 6వ బ్రిక్స్ సదస్సు
1) 9వ బ్రిక్స్ సదస్సు
2) 8వ బ్రిక్స్ సదస్సు
3) 7వ బ్రిక్స్ సదస్సు
4) 6వ బ్రిక్స్ సదస్సు
- View Answer
- సమాధానం: 1
వివరణ: చైనాలోని జియామెన్‌లో సెప్టెంబర్ 3 - 5 వరకు 9వ బ్రిక్స్ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా ముందుకెళ్లాలని సభ్య దేశాలు తీర్మానించాయి. బ్రిక్స్ దేశాలు - బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా
- సమాధానం: 1
24. బ్రిక్స్ దేశాలకు ప్రత్యేక రేటింగ్ ఏజెన్సీ ఉండాలని ప్రతిపాదించిన నేత ఎవరు ?
1) జిన్ పింగ్
2) వ్లాదిమిర్ పుతిన్
3) మైకెల్ టెమర్
4) నరేంద్ర మోదీ
1) జిన్ పింగ్
2) వ్లాదిమిర్ పుతిన్
3) మైకెల్ టెమర్
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: చైనాలోని జియామెన్ లో జరిగిన 9వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల కోసం ప్రత్యేకంగా బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. సదస్సులోని ప్లీనరీ సెషన్ లో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ సూచన చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా సీఆర్ఏ మార్కెట్లో ఎస్ అండ్ పీ, మూడీస్, ఫిచ్ సంస్థల ఆధిపత్యమే కొనసాగుతుంది. ఈ మూడు సంస్థలు అమెరికావే.
- సమాధానం: 4
25. మహేంద్ర సింగ్ ధోని ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓ బ్యాట్స్ మెన్ ను స్టంపింగ్ చేయడం ద్వారా వన్డేల్లో వంద స్టింపింగ్ల మార్కుని అందుకున్నాడు ?
1) ఆస్ట్రేలియా
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) ఇంగ్లండ్
1) ఆస్ట్రేలియా
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సీరీస్‌లో భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని వంద స్టంపింగ్ల మార్కుని చేరుకున్నాడు. శ్రీలంక ఆటగాడు అకిల ధనుంజయను అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డుని నమోదు చేశాడు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర 99 స్టంపింగ్ లతో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉండగా ఇప్పుడు ధోని ఆ స్థానాన్ని సాధించాడు.
- సమాధానం: 3
26. ఇటలీ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) లూయిస్ హామిల్టన్
2) సెబాస్టియన్ వెటెల్
3) బొటాస్
4) ఒకాన్ ఆరో
1) లూయిస్ హామిల్టన్
2) సెబాస్టియన్ వెటెల్
3) బొటాస్
4) ఒకాన్ ఆరో
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటలీలో జరిగిన గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసులో మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తొలి స్థానంలో నిలిచి టైటిల్‌ను గెలుచుకున్నాడు. మెర్సిడిస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానంలో, ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు.
- సమాధానం: 1
27. ఇటీవల జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్ ఎవరు ?
1) గౌరవ్ బిధురి
2) అఖిల్ కుమార్
3) మేరీ కోమ్
4) దేవేంద్రొ సింగ్
1) గౌరవ్ బిధురి
2) అఖిల్ కుమార్
3) మేరీ కోమ్
4) దేవేంద్రొ సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన 19వ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించిన భారత బాక్సర్ గౌరవ్ బిధురి కాంస్య పతకం సాధించాడు. దీంతో విజేందర్ - 2009, వికాస్ క్రిష్ణన్ - 2011, శివ థాపా - 2015 తర్వాత భారత్ నుంచి ఈ టోర్నీలో పతకం సాధించిన నాలుగో బాక్సర్‌గా గౌరవ్ నిలిచాడు.
- సమాధానం: 1
28. ఇటీవల ఏ దేశం హైడ్రోజన్ బాంబుని పరీక్షించింది ?
1) దక్షిణ కొరియా
2) ఉత్తర కొరియా
3) జపాన్
4) అమెరికా
1) దక్షిణ కొరియా
2) ఉత్తర కొరియా
3) జపాన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ద్వారా హైడ్రోజన్ బాంబుని విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఇది ఉత్తర కొరియా జరిపిన ఆరవ న్యూక్లియర్ పరీక్ష. గతేడాది సెప్టెంబర్‌లో జరిపిన ఐదో ప్రయోగం కన్నా ఆరో ప్రయోగం 5 నుంచి 6 రెట్లు శక్తిమంతమైందని దక్షిణ కొరియా వెల్లడించింది.
- సమాధానం: 2
29. ఇంటర్నేషన్ డే ఆఫ్ చారిటీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 5
2) సెప్టెంబర్ 6
3) సెప్టెంబర్ 7
4) సెప్టెంబర్ 8
1) సెప్టెంబర్ 5
2) సెప్టెంబర్ 6
3) సెప్టెంబర్ 7
4) సెప్టెంబర్ 8
- View Answer
- సమాధానం: 1
వివరణ: సెప్టెంబర్ 5న మదర్ థె రెసా వర్ధంతిని పురస్కరించుకొని ఏటా ఈ రోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 5న ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని 2012 డిసెంబర్ 17న తీర్మానించింది. దీంతో 2013 నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మదర్ థెరెసా 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు.
- సమాధానం: 1
30. ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టం - 1958 ప్రకారం ఇటీవల ఏ రాష్ట్రాన్ని మరో ఆరు నెలల పాటు డిస్టర్బ్ డ్ ఏరియాగా ప్రకటించారు ?
1) అస్సాం
2) నాగాలాండ్
3) మణిపూర్
4) మిజోరం
1) అస్సాం
2) నాగాలాండ్
3) మణిపూర్
4) మిజోరం
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 ఆగస్టు 31 తర్వాత మరో ఆరు నెలల పాటు అసోం రాష్ట్రాన్ని డిస్టర్బడ్ ఏరియాగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ చట్టం అసోం రాష్ట్రంలో 1990 నుంచి అమల్లో ఉంది. గతేడాది ఆ రాష్ట్రంలో 75 హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇందులో 33 మంది చనిపోయారు. ఉల్ఫా ఉగ్రవాదులు, ఎన్డీ ఎఫ్బీ గ్రూపుల వల్ల రాష్ట్రంలో వరుసగా హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
- సమాధానం: 1
31. భారత్‌లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీని ఇటీవల ప్రారంభించిన సంస్థ ఏది ?
1) భారత ఆహార సంస్థ
2) నీతి ఆయోగ్
3) సీబీఎస్ఈ
4) మహిళా, శిశు సంక్షేమ శాఖ
1) భారత ఆహార సంస్థ
2) నీతి ఆయోగ్
3) సీబీఎస్ఈ
4) మహిళా, శిశు సంక్షేమ శాఖ
- View Answer
- సమాధానం: 2
వివరణ: పోషకాహార లోప రహిత భారత్‌ను సాధించేందుకు నీతి ఆయోగ్ నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీని ప్రారంభించింది. హరితవిప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, పద్మశ్రీ హెచ్ సుదర్శన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 2
32. ప్లస్ అలియన్స ప్రైజ్ - 2017కు ఎంపికైంది ఎవరు ?
1) ఎన్ ఆర్ నారాయణమూర్తి
2) అజీమ్ ప్రేమ్ జీ
3) ముకేశ్ అంబానీ
4) చందా కొచ్చర్
1) ఎన్ ఆర్ నారాయణమూర్తి
2) అజీమ్ ప్రేమ్ జీ
3) ముకేశ్ అంబానీ
4) చందా కొచ్చర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్లస్ అలియన్స ప్రైజ్‌ని 2016 ఫిబ్రవరిలో ప్రారంభించారు. రీసర్చ్ ఇన్నోవేషన్, విద్యా ఆవిష్కరణ, గ్లోబల్ లీడర్ షిప్, గ్లోబల్ ఇన్నవేషన్ అంశాల్లో ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. 2017 సంవత్సరానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణమూర్తి ప్లస్ అలియన్స నుంచి గ్లోబల్ లీడర్ షిప్ విభాగంలో ఈ అవార్డును అందుకున్నారు. ముంబైకు చెందిన శాస్త్రవేత్త వీణా సహజ్ వాల్లా ది న్యూ సైన్స ఆఫ్ గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టుకు గాను రీసర్చ్ ఇన్నోవేషన్ విభాగంలో అవార్డుని అందుకున్నారు.
- సమాధానం: 1
33. ఇటీవల గురుగ్రామ్ నగరంలో వెయ్యి ఈ - రిక్షాలను ఏ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించారు ?
1) స్మార్ట్ - ఈ
2) స్మార్ట్ - ఆర్
3) స్మార్ట్ - ఏ
4) స్మార్ట్ - ఎం
1) స్మార్ట్ - ఈ
2) స్మార్ట్ - ఆర్
3) స్మార్ట్ - ఏ
4) స్మార్ట్ - ఎం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రయాణికులను మెట్రో స్టేషన్ల వరకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ - ఈ కార్యక్రమం కింద వచ్చే నాలుగేళ్లలో ఉపాధి లేని యువతకు లక్ష ఈ - రిక్షాలను అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం స్మార్ట్ - ఈ, హర్యానా ప్రభుత్వం, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా గురుగ్రామ్ నగరంలో తొలి విడతగా వెయ్యి ఈ - రిక్షాలను ఇటీవల ప్రారంభించారు.
- సమాధానం: 1
34. ఇటీవల ఏ దేశాలకు చెందిన సంస్థలు బాలిక, మహిళా విద్యకు కృషి చేసినందుకు గాను యునెస్కో ప్రైజ్‌ను గెలుచుకున్నాయి ?
1) భారత్, చైనా
2) అఫ్గనిస్తాన్, కజకిస్తాన్
3) థాయ్‌లాండ్, పెరూ
4) జపాన్, రష్యా
1) భారత్, చైనా
2) అఫ్గనిస్తాన్, కజకిస్తాన్
3) థాయ్‌లాండ్, పెరూ
4) జపాన్, రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బాలికా, మహిళా విద్య కోసం కృషి చేసినందుకుగాను రెండు సంస్థలకు ఇటీవల యునెస్కో - 2017 ప్రైజ్‌ను ప్రకటించారు. థాయ్‌లాండ్‌కు చెందిన ది డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ డాటర్స్ అండ్ కమ్యూనిటీస్ సెంటర్ ఇన్ ద గ్రేటర్ మెకాంగ్ సబ్ రీజియన్ - డీఈపీడీసీ - జీఎంఎస్, పెరూకు చెందిన మొబైల్ మేక్ టెక్ బస్ లేబ్స్ , మినీ అకడామీ ఆప్ సైన్స అండ్ టెక్నాలజీ సంస్థలు ఈ ప్రైజ్ ను అందుకున్నాయి. అవార్డు కింద 50 వేల డాలర్ల నగదు బహుమతి అందజేశారు.
- సమాధానం: 2
35. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరి కోసం ప్రత్యేకంగా దీక్ష పోర్టల్ ను ప్రారంభించింది ?
1) ఉపాధ్యాయులు
2) పాత్రికేయులు
3) క్రీడాకారులు
4) శాస్త్రవేత్తలు
1) ఉపాధ్యాయులు
2) పాత్రికేయులు
3) క్రీడాకారులు
4) శాస్త్రవేత్తలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: టీచర్లకు ప్రత్యేత డిజిటల్ వేదికను ఏర్పాటు చేసేందుకు disksha.gov.in అనే పోర్టల్‌ను కేంద్ర హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఉపాధ్యాయ శిక్షణ కోసం నమోదు అయినప్పటి నుంచి ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసే వరకు టీచర్ల జీవన శైలికి సంబంధించిన పూర్తి సమాచారంతో, విలువైన సలహాలు, సూచనలతో పోర్టల్‌ను రూపొందించారు.
- సమాధానం: 1
36. ఇటీవల రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం రద్దయిన 15.44 లక్షల విలువైన నోట్లలో ఎన్ని లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగివచ్చాయి ?
1) రూ. 15. 44 లక్షల కోట్లు
2) రూ. 15. 28 లక్షల కోట్లు
3) రూ. 15 లక్షల కోట్లు
4) రూ. 14 లక్షల కోట్లు
1) రూ. 15. 44 లక్షల కోట్లు
2) రూ. 15. 28 లక్షల కోట్లు
3) రూ. 15 లక్షల కోట్లు
4) రూ. 14 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ. 1000, రూ.500 నోట్లలో రద్దు అనంతరం 99 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరికి వచ్చాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016-17 వార్షిక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం రద్దయిన రూ.15.44 లక్షల విలువైన నోట్లలో.. రూ.15.28 లక్షల విలువైన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. కేవలం రూ.16,050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకులకు రాలేదు.
- సమాధానం: 2
37. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాల్లో ఎంత శాతం నిధులను మహిళా రైతుల కోసం కేటాయించాలని ఇటీవల నిర్ణయించడం జరిగింది ?
1) 25 శాతం
2) 30 శాతం
3) 35 శాతం
4) 40 శాతం
1) 25 శాతం
2) 30 శాతం
3) 35 శాతం
4) 40 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో ఆర్థిక స్వాతంత్ర్యం కలిగిన మహిళలల్లో 80 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు.
- సమాధానం: 2
38. వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ ప్రసార, డిజిటల్ హక్కులని స్టార్ ఇండియా ఎంత మొత్తానికి దక్కించుకుంది ?
1) రూ.13,347.50 కోట్లు
2) రూ. 14,347.50 కోట్లు
3) రూ. 15,347.50 కోట్లు
4) రూ.16,347.50 కోట్లు
1) రూ.13,347.50 కోట్లు
2) రూ. 14,347.50 కోట్లు
3) రూ. 15,347.50 కోట్లు
4) రూ.16,347.50 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐదేళ్లపాటు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కులని సోనీతో పోటీ పడి స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం 2018 నుంచి 2022 వరకు ఉంటుంది.
- సమాధానం: 4
39. తీర ప్రాంత కోత కారణంగా ఇటీవల ఏ కేంద్ర పాలిత ప్రాంత పరిధిలోని పారాలి వన్ దీవి పూర్తిగా కనుమరుగైంది ?
1) లక్షద్వీప్
2) అండమాన్ అండ్ నికోబార్
3) డామ్ అండ్ డయూ
4) దివిసీమ
1) లక్షద్వీప్
2) అండమాన్ అండ్ నికోబార్
3) డామ్ అండ్ డయూ
4) దివిసీమ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆర్ ఎం హిదయతుల్లా కోస్టల్ ఏరోషన్ అనే అంశంపై అధ్యయనానికి గాను కేరళలోని కాలికట్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ అందుకున్నారు. ఆయన జరిపిన అధ్యయనం ప్రకారం లక్షద్వీప్ పరిధిలో గోల్డ్ చైన్ ఆఫ్ ఐలాండ్స లోని పారాలి 1 దీవి తీర ప్రాంత కోత కారణంగా పూర్తిగా కనుమరుగైంది.
- సమాధానం: 2
40. స్లినెక్స్ - 2017 పేరుతో ఇటీవల ఏ రెండు దేశాలు సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి ?
1) భారత్, శ్రీలంక
2) భూటాన్, శ్రీలంక
3) చైనా, శ్రీలంక
4) బంగ్లాదేశ్, శ్రీలంక
1) భారత్, శ్రీలంక
2) భూటాన్, శ్రీలంక
3) చైనా, శ్రీలంక
4) బంగ్లాదేశ్, శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, శ్రీలంక దేశాల నౌకాదళ సిబ్బంది మధ్య సంబంధాల బలోపేతం కోసం స్లినెక్స్ పేరుతో సంయుక్త నౌకా విన్యాసాలు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 14 వరకు విశాఖపట్నంలో జరిగాయి. 2005 నుంచి రెండు దేశాలు ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.
- సమాధానం: 1
41. ఇటీవల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాల మధ్య ఎన్ని కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయి ?
1) రూ. 3 వేల కోట్లు
2) రూ. 4 వేల కోట్లు
3) రూ. 5 వేల కోట్లు
4) రూ.6 వేల కోట్లు
1) రూ. 3 వేల కోట్లు
2) రూ. 4 వేల కోట్లు
3) రూ. 5 వేల కోట్లు
4) రూ.6 వేల కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాల మధ్య రూ. 3వేల కోట్ల విలువైన ఆరు ఒప్పందాలు కుదిరాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గనులు, రవాణా, సాంకేతికత, వైద్యం, విద్య, ఆక్వాకల్చర్ రంగాల్లో పశ్చిమ ఆస్ట్రేలియా పెట్టుబడులు పెడుతుంది.
- సమాధానం: 1
42. తెలంగాణలో వెయ్యి ఎకరాల లోపు వ్యవసాయ భూములు ఉన్న గ్రామాల సంఖ్య ఎంత ?
1) 5,976
2) 4,976
3) 3,976
4) 6,976
1) 5,976
2) 4,976
3) 3,976
4) 6,976
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన రైతు సమగ్ర సర్వే నివేదికవివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 45.1 లక్షల మంది రైతుల వద్ద 1.24 కోట్ల ఎకరాలు భూమి ఉంది.
- సమాధానం: 1
43. ఇటీవల అర్జున అవార్డులు అందుకున్న క్రీడాకారుల్లో ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది ?
1) జ్యోతి సురేఖ వెన్నెం
2) చతేశ్వర పుజారా
3) వరుణ్ భాటి
4) ప్రకాశ్ నన్జప్పా
1) జ్యోతి సురేఖ వెన్నెం
2) చతేశ్వర పుజారా
3) వరుణ్ భాటి
4) ప్రకాశ్ నన్జప్పా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్రశ్రేణి ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖ ఇటీవల భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకుంది. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు కోటి రూపాయల నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, విజయవాడలో 500 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించింది.
- సమాధానం: 1
44. స్కోచ్ సంస్థ 2017 సంవత్సరానికి గాను ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
1) కె.తారకరామారావు
2) నారా లోకేష్
3) ప్రియాంక్ ఎం ఖర్గే
4) ప్రియా దత్
1) కె.తారకరామారావు
2) నారా లోకేష్
3) ప్రియాంక్ ఎం ఖర్గే
4) ప్రియా దత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్కోచ్ సంస్థ 2017 సంవత్సరానికిగాను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావుకి ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. స్కోచ్ సంస్థ 2003 నుంచి వివిధ రాష్ట్రాల పరిపాలనను అంచనా వేస్తూ స్మార్ట్ గవర్నెన్స్ అవార్డులను అందజేస్తుంది.
- సమాధానం: 1
45. మిస్ ఇండియా దక్షిణాఫ్రికా గాటెంగ్ - 2017 అందాల పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు ?
1) అడ్డేపల్లి శ్రీశుభ
2) ప్రియాంక వర్షి
3) వనిత నానో
4) పరిణీతి చౌహాన్
1) అడ్డేపల్లి శ్రీశుభ
2) ప్రియాంక వర్షి
3) వనిత నానో
4) పరిణీతి చౌహాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అడ్డేపల్లి శ్రీశుభ మిస్ ఇండియా దక్షిణాఫ్రికా కిరీటాన్ని సొంతం చేసుకుంది. భారతీయ సంతతికి చెందిన యువతి ఈ పోటీల్లో నెగ్గడం ఇది రెండోసారి.
- సమాధానం: 1
46. ఇటీవల ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఎన్నికై న వివేక్ గోయంకా ఏ గ్రూప్ సంస్థలకు మేనేజింగ్ డెరైక్టర్ గా ఉన్నారు ?
1) ది హిందూ
2) మలయాల మనోరమ
3)ఎక్స్‌ప్రెస్ గ్రూప్
4) టైమ్స్ ఆఫ్ ఇండియా
1) ది హిందూ
2) మలయాల మనోరమ
3)ఎక్స్‌ప్రెస్ గ్రూప్
4) టైమ్స్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఎక్స్‌ప్రెస్ గ్రూప్ మేనేజింగ్ డెరైక్టర్ వివేక్ గోయంకా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రియద్ మాథ్యూ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. పీటీఐ వైస్ చైర్మన్‌గా ది హిందూ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్ రామ్ ఎన్నికయ్యారు.
- సమాధానం: 3
47. ఇటీవల ఏ బ్యాంకుని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డొమస్టిక్ సిస్టమేటికల్లి ఇంపార్టెంట్ బ్యాంకు (D-SIB) జాబితాలో చేర్చింది ?
1) హెచ్డీఎఫ్సీ
2) బ్యాంక్ఆఫ్ ఇండియా
3) యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా
4) సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా
1) హెచ్డీఎఫ్సీ
2) బ్యాంక్ఆఫ్ ఇండియా
3) యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా
4) సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీని ఇండియా డొమస్టిక్ సిస్టమేటికల్లి ఇంపార్ట్‌మెంట్ బ్యాంకుగా ప్రకటించింది. వ్యాపార నిర్వహణలో వైఫల్యానికి తావులేకండా అత్యంత బలంగా ఉన్న బ్యాంకులకు ఈ హోదా ఇస్తారు. బ్యాంకుల ఆస్తులు విలువ దేశ జీడీపీలో 2 శాతంకన్నా ఎక్కువ ఉంటే ఈ గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులకు ఈ గుర్తింపు లభించింది.
- సమాధానం: 1
48. సూర్యరశ్మి, నీటిని ఉపయోగించి హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే కృత్రిమ ఆకుని ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు ?
1) సీఎస్ఐఆర్
2) ఇస్రో
3) ఇక్రిశాట్
4) సీసీఎంబీ
1) సీఎస్ఐఆర్
2) ఇస్రో
3) ఇక్రిశాట్
4) సీసీఎంబీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: సూర్యరశ్మి, నీటి ద్వారా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే కృత్రిమ ఆకుని పూణెలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియ్రల్ రీసర్చ్, నేషనల్ కెమికల్ లాబోరేటరీ శాస్త్రవేత్తలు రూపొందించారు. తాము తయారు చేసిన ఆకు 23 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం ఉంటుందని.. దీని ద్వారా గంటకు 6 లీటర్ల హైడ్రోజన్ ఇంధనం ఉత్పత్తి అవుతుందని సీఎస్ఐఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ చిన్నకొండ గోపీనాథ్ వెల్లడించారు.
- సమాధానం: 1
49. ఆస్ట్రేలియా బాస్కెట్ బాల్ టీమ్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తొలి భారతీయ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఎవరు ?
1) అమ్ జ్యోత్ సింగ్
2) యద్విందర్ సింగ్
3) అమ్రిత్ పాల్ సింగ్
4) విశెష్ బ్రిగువంశి
1) అమ్ జ్యోత్ సింగ్
2) యద్విందర్ సింగ్
3) అమ్రిత్ పాల్ సింగ్
4) విశెష్ బ్రిగువంశి
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత బాస్కెట్ బాల్ టీమ్ కెప్టెన్ అమ్రిత్ పాల్ సింగ్‌తో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కింగ్స బాస్కెట్ బాల్ జట్టు ఇటీవల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. దీంతో.. ఆస్ట్రేలియా బాస్కెట్ బాల్ టీమ్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తొలి భారతీయ ప్లేయర్ గా అమ్రిత్ పాల్ సింగ్ నిలిచాడు.
- సమాధానం: 3
50. ఇటీవల హాకీ ఇండియా హాకీ కోచ్ పదవి నుంచి ఎవరిని తొలగించింది ?
1) రోలంట్ ఓల్ట్స్‌మన్
2) హర్బిందర్ సింగ్
3) డేవిడ్ జాన్
4) ధన్ రాజ్ పిళ్లె
1) రోలంట్ ఓల్ట్స్‌మన్
2) హర్బిందర్ సింగ్
3) డేవిడ్ జాన్
4) ధన్ రాజ్ పిళ్లె
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత హాకీ జట్టు కోచ్ పదవి నుంచి నెదర్లాండ్స్ కు చెందిన రోలంట్ ఓల్ట్స్‌మన్ ను హాకీ ఇండియా తొలగించింది. రెండేళ్లుగా హాకీ జట్టు పర్ఫార్మెన్స్ బాగా లేకపోవటంతో ఆయనను పదవి నుంచి తొలగించారు. గత 10 ఏళ్లలో హాకీ ఇండియా జట్టు కోచ్ పదవి నుంచి కోచ్‌ను తప్పించడం ఇది ఆరోసారి.
- సమాధానం: 1
అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 2
1. యుద్ధ్ అభ్యాస్- 2017 పేరుతో ఇటీవల ఏ రెండు దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించాయి ?
1) భారత్, అమెరికా
2) భారత్, రష్యా
3) భారత్, జపాన్
4) భారత్, శ్రీలంక
1) భారత్, అమెరికా
2) భారత్, రష్యా
3) భారత్, జపాన్
4) భారత్, శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, అమెరికా సంయుక్తంగా యుద్ధ్ అభ్యాస్- 2017 పేరుతో సెప్టెంబర్ 14 నుంచి 27 వరకు సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అమెరికాలోని వాషింగ్టన్ లూయి స్మెక్కార్బేలో ఈ విన్యాసాలు జరిగాయి. ఈ సారి నిర్వహించిన సైనిక విన్యాసాలు 13వ ఎడిషన్.
- సమాధానం: 1
2. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో అతిపెద్ద ఫుల్ ఫిల్మెంట్ సెంటర్నుఎక్కడ ప్రారంభించింది ?
1) బెంగళూరు
2) కోల్కత్తా
3) ముంబయి
4) హైదరాబాద్
1) బెంగళూరు
2) కోల్కత్తా
3) ముంబయి
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ భారత్‌లో అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. శంషాబాద్ విమానాశ్రయంలో దీన్ని ఏర్పాటు చేసింది. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్లను ప్రాసెస్ చేసి.. వస్తువులను డెలివర్ చేసేవే ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు.
- సమాధానం: 4
3. ఏ సంవత్సరం లోగా భారత్‌ను తట్టు రహిత దేశంగా మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది ?
1) 2020
2) 2022
3) 2024
4) 2026
1) 2020
2) 2022
3) 2024
4) 2026
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్‌తో పాటు ఆగ్నేయాసియాలోని బంగ్లాదేశ్, మయన్మార్, తైమూర్, ఇండోనేషియా దేశాలను 2022 నాటికి తట్టు రహిత దేశాలుగా మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా దేశాల్లో తట్టు నిర్మూలన కోసం చేపట్టే కార్యక్రమాలకు మొత్తంగా 800 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని లెక్క కట్టింది.
- సమాధానం: 2
4. చౌక ధరల దుకాణాల్లో రేషన్ నిల్వలు, లొకేషన్ వివరాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ - రేషన్ ఆప్‌ని ఎవరు రూపొందించారు ?
1) సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
2) నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్
3) మైక్రోసాఫ్ట్
4) గూగుల్
1) సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
2) నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్
3) మైక్రోసాఫ్ట్
4) గూగుల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల లొకేషన్, రేషన్ నిల్వలు సమాచారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ - రేషన్ ఆప్‌ని ఆవిష్కరించింది. దీన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్- ఎన్ఐసీ దీన్ని రూపొందించింది.
- సమాధానం: 2
5. ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే దేశంలో తొలి ఆహార భద్రత సంస్థను ఎక్కడ ఏర్పాటు చేసింది ?
1) హైదరాబాద్
2) ఛండీగడ్
3) బెంగళూరు
4) మనేసర్
1) హైదరాబాద్
2) ఛండీగడ్
3) బెంగళూరు
4) మనేసర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేస్లే ఇండియా సంయుక్తంగా దేశంలో తొలి నేస్లే ఫుడ్‌సేఫ్టీ ఇనిస్టిట్యూట్‌ని మనేసర్‌లో ఏర్పాటు చేశాయి. నేస్లే రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ , నెస్లే రీసర్చ్ సెంటర్ ఇన్ లాసన్నే స్విట్జర్లాండ్ సంస్థలతో కలిసి ఇది పనిచేస్తుంది. భారత్‌లో ఆహార భద్రత వాతవరణాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది.
- సమాధానం: 4
6. భారత దేశంలో తొలి హైపర్‌లూప్ ప్రాజెక్టుని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలోనే తొలి హైపర్‌లూప్ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించనున్నారు. రాష్ట్రంలోని విజయవాడ - అమరావతి మధ్య దీన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పొర్టేషన్ టెక్నాలజీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పూర్తయితే విజయవాడ నుంచి అమరావతికి 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
- సమాధానం: 3
7. తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరానికి కాళోజీ నారాయణరావు అవార్డుని ఎవరికి ప్రకటించింది ?
1) సీతారాం
2) అంద్శై
3) చంద్రబోస్
4) సుద్దాల అశోక్ తేజ
1) సీతారాం
2) అంద్శై
3) చంద్రబోస్
4) సుద్దాల అశోక్ తేజ
- View Answer
- సమాధానం: 1
వివరణ: సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కాళోజి నారాయణరావు పురస్కారాన్ని కవి సీతారాంకు అందజేసింది. అవార్డు కింద రూ.1,01,116 నగదు అందించింది. కాళోజీ అవార్డుని 2016లో ప్రముఖ రచయిత, గాయకుడు గోరేటి వెంకన్న, 2015లో రచయిత అమ్మంగి వేణుగోపాల్ అందుకున్నారు.
- సమాధానం: 1
8. ప్రధాన మంత్రి ముద్రా యోజనలో భాగంగా ఎన్ని ఉద్యోగాలు కల్పించడం జరిగిందని థింక్ టేంక్ స్కోచ్ నివేదిక వెల్లడించింది ?
1) 5.5 కోట్లు
2) 4.5 కోట్లు
3) 3.5 కోట్లు
4) 2.5 కోట్లు
1) 5.5 కోట్లు
2) 4.5 కోట్లు
3) 3.5 కోట్లు
4) 2.5 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: చిన్న వ్యాపారులకు రుణ సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజనను 2015 ఏప్రిల్ 8న ప్రారంభించింది. ఈ పథకం అమలుపై థింక్ టేంక్ స్కోచ్ ఇటీవల నివేదిక విడుదల చేసింది. పథకం కింద ఇప్పటి వరకు రూ.3.42 లక్షల కోట్ల రుణాలను అందజేసినట్లు పేర్కొంది. వీటి ద్వారా 5.5 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని వెల్లడించింది.
- సమాధానం: 1
9. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5.5 లక్షల గ్రామాలకు 2019 మార్చి నాటికి ఎంత స్పీడ్‌తో కూడిన వైఫై కనెక్షన్లను ఏర్పాటు చేయనుంది ?
1) 1 జీబీపీఎస్
2) 100 ఎంబీపీఎస్
3) 500 ఎంబీపీఎస్
4) 50 ఎంబీపీఎస్
1) 1 జీబీపీఎస్
2) 100 ఎంబీపీఎస్
3) 500 ఎంబీపీఎస్
4) 50 ఎంబీపీఎస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2019 నాటికి దేశంలోని 5.5 లక్షల గ్రామాల్లో 1 జీబీపీఎస్ వేగంతో కూడిన వైఫై సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 3 వేల 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. 2017 సెప్టెంబర్ 6 నాటికి దేశంలోని 33,430 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
- సమాధానం: 1
10. ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) సంజయ్ దత్
2) ఎస్ ఎస్ రాజమౌళి
3) కీరవాణి
4) కరణ్ జోహార్
1) సంజయ్ దత్
2) ఎస్ ఎస్ రాజమౌళి
3) కీరవాణి
4) కరణ్ జోహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2006లో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుని స్థాపించింది. మొదటి అవార్డుని దేవ్ ఆనంద్కి అందజేసింది. 2017 సంవత్సరానికి ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ అవార్డుకి ఎంపికయ్యారు. సినిమా రంగానికి విశేష సేవలు చేసిన వారికి ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తారు.
- సమాధానం: 2
11. 2018 విద్యా సంవత్సరంలో కనీసం 70 లక్షల మంది విద్యార్థులను బడుల్లో చేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమం పేరు ఏమిటి ?
1) చలో స్కూల్
2) రోడ్ టూ స్కూల్
3) స్కూల్ చలో అభియాన్
4) పడే హమారే దేశ్కే బచ్చే
1) చలో స్కూల్
2) రోడ్ టూ స్కూల్
3) స్కూల్ చలో అభియాన్
4) పడే హమారే దేశ్కే బచ్చే
- View Answer
- సమాధానం: 3
వివరణ: వచ్చే విద్యా సంవత్సరం స్కూల్ చలో అభియాన్‌ను చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బడికి దూరంగా ఉన్న, మధ్యలో చదువులు మానేసిన కనీసం 70 నుంచి 80 లక్షల మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తారు.
- సమాధానం: 3
12. భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన మూడో తరం నాగ్ క్షిపణిని తయారు చేసింది ఎవరు ?
1) డీఆర్డీవో
2) హెచ్ఏఎల్
3) బీహెచ్ఈఎల్
4) నేషన ల్ డిఫెన్స్ అకాడమీ
1) డీఆర్డీవో
2) హెచ్ఏఎల్
3) బీహెచ్ఈఎల్
4) నేషన ల్ డిఫెన్స్ అకాడమీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: మూడో తరం యాంటీ - ట్యాంక్ గెడైడ్ మిసైల్ - ఏటీజీఎం నాగ్‌ను రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా సుమారు 3 బిలియన్ డాలర్ల వ్యయంతో వీటిని అభివృద్ధి చేశారు. ఇటీవల ఈ క్షిపణిని రాజస్తాన్ ఎడారిలో విజయవంతంగా పరీక్షించారు. 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది నాశనం చేయగలదు.
- సమాధానం: 1
13. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్ ఎవరు ?
1) బెన్ స్టోక్స్
2) జేమ్స్ ఆండర్సన్
3) స్టువర్ట్ బ్రాడ్
4) మాంటి పనేసర్
1) బెన్ స్టోక్స్
2) జేమ్స్ ఆండర్సన్
3) స్టువర్ట్ బ్రాడ్
4) మాంటి పనేసర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన తొలి ఇంగ్లీష్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్టు క్రికెట్లో ఈ ఘనతను అందుకున్న ఆరో బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో టెస్ట్ సీరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్ ఓపెన్ర్ బ్రాత్ వెయిట్‌ను అవుట్ చేసి ఈ రికార్డుని అందుకున్నాడు.
- సమాధానం: 2
14. ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానామిక్ యూనియన్ ఇటీవల టెన్జింగ్ నార్గే, ఎడ్ముండ్ హిల్లరీ పేర్లను ఏ గ్రహంపై పర్వతాలకు పెట్టింది ?
1) సేటర్న్
2) ప్లూటో
3) మెర్క్యురీ
4) జూపిటర్
1) సేటర్న్
2) ప్లూటో
3) మెర్క్యురీ
4) జూపిటర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్, నేపాల్‌కు చెందిన టెన్జింగ్ నార్గే, న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్ముండ్ హిల్లరీ 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి భద్రంగా తిరిగొచ్చిన తొలి వ్యక్తులుగా రికార్డు సృష్టించారు. వీరి గౌరవార్థం ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానామిక్ యూనియన్ ప్లూటో గ్రహంపై ఉన్న రెండు పర్వతాలకు టెన్జింగ్ మాంట్స్, హిల్లరీ మాంట్స్ పేర్లు పెట్టింది. వీరితో పాటు మరో 12 మంది పేర్లను ప్లూటో గ్రహంపై ఉన్న ఇతర పర్వతాలకు పెట్టారు. ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానామిక్ యూనియన్ను 1919లో స్థాపించారు.
- సమాధానం: 2
15. దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థకు మహారత్న హోదా ఇవ్వాలని ఇటీవల నిర్ణయించారు ?
1) భారత్ పెట్రోలియం కార్పొరేషన్
2) హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్
3) గోవా షిప్‌యార్డు
4) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
1) భారత్ పెట్రోలియం కార్పొరేషన్
2) హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్
3) గోవా షిప్‌యార్డు
4) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రస్తుతం నవరత్న హోదాతో ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు మహారత్న హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీంతో.. ఈ హోదా పొందిన 8వ సంస్థగా బీపీసీఎల్ నిలవనుంది. ఇంతకముందు బీహెచ్ఈఎల్, కోల్ఇండియా, గెయిల్, ఐవోసీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సెయిల్ సంస్థలకు మహారత్న హోదా దక్కింది. ఏదైనా సంస్థ మహారత్న హోదా పొందాలంటే.. నవరత్న హోదాతో పాటు 3 ఏళ్ల సగటు టర్నోవర్ రూ.25 వేల కోట్లు ఉండాలి. అలాగే 3 ఏళ్ల సగటు ఆదాయం రూ. 5 వేల కోట్లు ఉండాలి. స్టాక్‌ఎక్సేంజ్‌లో నమోదై ఉండాలి.
- సమాధానం: 1
16. ఏ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గాలి నుంచి అతి చవకై న, స్వచ్ఛమైన మీథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నారు ?
1) కార్డిఫ్ యూనివర్సిటీ
2) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
3) ఢిల్లీ యూనివర్సిటీ
4) కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
1) కార్డిఫ్ యూనివర్సిటీ
2) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
3) ఢిల్లీ యూనివర్సిటీ
4) కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గాలిలోని ఆక్సిజన్ ద్వారా మీథేన్ నుంచి మీథనాల్ను ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నారు. ఈ విధానం ద్వారా ఎలాంటి కాలుష్య కారకాలు ఉత్పత్తి కావు. మీథనాల్ వాహనాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం.
- సమాధానం: 1
17. సౌత్ ఆసియాన్ బాస్కెట్ బాల్ అండర్- 16 టైటిల్‌ను ఏ దేశం గెలుచుకుంది ?
1) భారత్
2) భూటాన్
3) శ్రీలంక
4) నేపాల్
1) భారత్
2) భూటాన్
3) శ్రీలంక
4) నేపాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2వ సౌత్ ఆసియాన్ బాస్కెట్ బాల్అండర్- 16 చాంపియన్షిప్ని నేపాల్‌లో నిర్వహించారు. ఈ టోర్నీ ఫైనల్లో భూటాన్ ఓడించి భారత్ విజేతగా నిలిచింది. దీంతో.. మలేషియాలో జరగనున్న ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ అండర్ - 16కు అర్హత సాధించింది.
- సమాధానం: 1
18. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానం ముసాయిదాను ఏ దేశం ప్రవేశపెట్టింది ?
1) దక్షిణ కొరియా
2) జపాన్
3) అమెరికా
4) రష్యా
1) దక్షిణ కొరియా
2) జపాన్
3) అమెరికా
4) రష్యా
- View Answer
- సమాధానం: 3
వివరణ: వరస క్షిపణి పరీక్షలు, అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తు ఆందోళన కలిగిస్తున్న ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాలంటూ ఐరాసలో అమెరికా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఐరాస ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో.. ఉత్తర కొరియా ఇంధన దిగుమతులు, వస్త్రాల ఎగుమతి, విదేశీ లేబర్ కాంట్రాక్ట్‌లు, విదేశాలతో జాయింట్ ప్రాజెక్టులపై నిషేధం విధించినట్లయింది.
- సమాధానం: 3
19. భారత్ ఎప్పటిలోగా దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ?
1) 2020
2) 2025
3) 2030
4) 2035
1) 2020
2) 2025
3) 2030
4) 2035
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2025 లోగా దేశంలో క్షయ వ్యాధిని(టీబీ)ని పూర్తిగా నిర్మూలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని చేరడంలో సహాయ సహకారాలను అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ టీబీ రిపోర్ట్ ప్రకారం 2015లో భారత్‌లో 28 లక్షల టీబీ కేసులు నమోదయ్యాయి.
- సమాధానం: 2
20. భారత్- ఆఫ్గనిస్తాన్ 2వ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) కాబుల్
3) ముంబయి
4) కాందహార్
1) న్యూఢిల్లీ
2) కాబుల్
3) ముంబయి
4) కాందహార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్- ఆఫ్గనిస్తాన్ 2వ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇందులో భాగంగా ఆఫ్గనిస్తాన్‌లో రక్షణ వ్యవస్థ పటిష్టతతో పాటు కొత్తగా 116 అత్యున్నత స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
- సమాధానం: 1
21. భారత మహిళా నావికులు ‘నావికా సాగర్ పరిక్రమ‘ పేరుతో ఏ నౌకతో ప్రపంచ యాత్ర చేపట్టారు ?
1) ఐఎన్ఎ విరాట్
2) ఐఎన్ఎస్ తరిణి
3) ఐఎన్ఎస్ భరిణి
4) ఐఎన్ఎస్ మంథని
1) ఐఎన్ఎ విరాట్
2) ఐఎన్ఎస్ తరిణి
3) ఐఎన్ఎస్ భరిణి
4) ఐఎన్ఎస్ మంథని
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత మహిళా నావికలు నావికా సాగర్ పరిక్రమ పేరుతో గోవాలోని పణాజీ నుంచి ప్రపంచ యాత్ర ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ తరిణి లో 165 రోజుల పాటు ఈ సాహస యాత్ర సాగుతుంది. మహిళా నావికులు - లెఫ్టినెంట్ కమాండర్ జోషి, లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జమ్వాల్, లెఫ్టినెంట్ కమాండర్ స్వాతి, లెఫ్టినెంట్ కమాండర్ బోయపాటి ఐశ్వర్య, లెఫ్టినెంట్ కమాండర్ విజయా దేవి, లెఫ్టినెంట్ కమాండర్ పాయల్ గుప్తా.
- సమాధానం: 2
22. గ్లోబల్ ఫైనాన్సియల్ సెంటర్స్ ఇండెక్స్ - 2017 నివేదికలో తొలి స్థానంలో ఏ నగరం ఉంది ?
1) లండన్
2) న్యూయార్క్
3) సింగపూర్
4) హాంగ్‌కాంగ్
1) లండన్
2) న్యూయార్క్
3) సింగపూర్
4) హాంగ్‌కాంగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జెడ్, ఝెన్, చైనా డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ గ్లోబల్ ఫైనాన్సియల్ సెంటర్స్ ఇండెక్స్ - 2017ను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా 92 ఆర్థిక నగరాలతో ఈ జాబితాను తయారు చేసింది. ఇందులో లండన్ తొలి స్థానంలో, రెండో స్థానంలో న్యూయార్క్, మూడో స్థానంలో సింగపూర్, నాలుగో స్థానంలో హాంగ్‌కాంగ్ ఉన్నాయి. ఈ జాబితాలో భారత నగరం ముంబై 60వ స్థానంలో ఉంది.
- సమాధానం: 1
23. పట్టుపురుగులు, పట్టు రంగంపై పరిశోధన, అభివృద్ధి కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) స్పెయిన్
2) బెలారస్
3) జపాన్
4) నేపాల్
1) స్పెయిన్
2) బెలారస్
3) జపాన్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పట్టు పురుగులు, పట్టు పరిశ్రమలపై పరిశోధన, అభివృద్ధి కోసం భారత్ జపాన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌కు చెందిన సెంట్రల్ సిల్క్ బోర్డ్.. జపాన్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆగ్రో బయోలాజికల్ సంస్థలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లోని వాతావరణ పరిస్థితులకు తగిన Psolific bivoltine hybrids of silkwormను అభివృద్ధి చేస్తారు.
- సమాధానం: 3
24. ఇటీవల భారత్‌లో పర్యటించిన బెలారస్ దేశ అధ్యక్షుడు ఎవరు ?
1) ఏజీ ల్యూకాశెంకో
2) మికోలా స్టాట్కెవిచ్
3) రూవెన్రివిలిన్
4) బెంజామిన్నెతన్యాహూ
1) ఏజీ ల్యూకాశెంకో
2) మికోలా స్టాట్కెవిచ్
3) రూవెన్రివిలిన్
4) బెంజామిన్నెతన్యాహూ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఏజీ ల్యూకాశెంకో 23 ఏళ్లుగా బెలారస్ దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీ, చమురు, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, క్రీడల రంగాల్లో 10 ఒప్పందాలు కుదిరాయి.
- సమాధానం: 1
25. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ తొలిసారి ప్రవేశపెట్టిన జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికై న క్రీడాకారుడు ఎవరు ?
1) పుల్లెల గోపీచంద్
2) పీవీ సింధు
3) ప్రకాశ్ పడుకోన్
4) సైనా నెహ్వాల్
1) పుల్లెల గోపీచంద్
2) పీవీ సింధు
3) ప్రకాశ్ పడుకోన్
4) సైనా నెహ్వాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ - బాయ్ 2017లో తొలిసారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రారంభించింది. తొలి అవార్డుని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్‌కు ప్రకటించింది. ఆయన 1980లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించారు. 1972లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, 1982లో పద్మశ్రీ అందుకున్నారు.
- సమాధానం: 3
26. మార్కోని సొసైటీ అందించే ప్రతిష్టాత్మక పాల్ బెరన్ యంగ్ స్కాలర్షిప్ పురస్కారం - 2017కు ఎవరిని ఎంపిక చేశారు ?
1) సాహిల్దోషి
2) మానస మెండు
3) రమేశ్‌వర్మ
4) ఆనంద తీర్థ సురేశ్
1) సాహిల్దోషి
2) మానస మెండు
3) రమేశ్‌వర్మ
4) ఆనంద తీర్థ సురేశ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మార్కోని సొసైటీ అందించే ప్రతిష్టాత్మక పాల్ బెరన్ యంగ్ స్కాలర్షిప్ పురస్కారానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఆనంద తీర్థ సురేశ్ ఎంపికయ్యారు. బేసిక్ ఫోన్లలోను వేగంగా సమాచారాన్ని తెలుసుకునే సాంకేతిక విధానాన్ని రూపొందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. దీని కింద 4 వేల అమెరికన్ డాలర్ల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు. రేడియోను కనుగొన్న శాస్త్రవేత్త మార్కోని జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
- సమాధానం: 4
27. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 6
2) సెప్టెంబర్ 7
3) సెప్టెంబర్ 8
4) సెప్టెంబర్ 9
1) సెప్టెంబర్ 6
2) సెప్టెంబర్ 7
3) సెప్టెంబర్ 8
4) సెప్టెంబర్ 9
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2018 Theme : Literacy in digital world.
ఈ ఏడాది 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యత కోసం కృషి చేసిన వారికి పారిస్ లోని యునెస్కో కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తారు. 1966లో యునెస్కో తొలిసారి ఏటా సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది.
- సమాధానం: 3
28. నదుల అనుసంధానం కోసం ఏ రాష్ట్రానికి వచ్చే రెండేళ్లలో 60 వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
వివరణ: మహారాష్ట్రలో నీటి ఎద్దడిని ఎదుర్కునేందుకు ఆ రాష్ట్రానికి వచ్చే రెండేళ్లలో 60 వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ నిధులతో నదుల అనుసంధానం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
- సమాధానం: 4
29. యూఎస్ ఓపెన్ - 2017లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) రాఫెల్ నాదల్
2) కెవిన్ ఆండర్సన్
3) రోజర్ ఫెదరర్
4) నోవాక్ జకోవిచ్
1) రాఫెల్ నాదల్
2) కెవిన్ ఆండర్సన్
3) రోజర్ ఫెదరర్
4) నోవాక్ జకోవిచ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూఎస్ ఓపెన్ - 2017 పురుషుల సింగిల్స్ ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ఆండర్సన్ను ఓడించి స్పెయిన్ దిగ్గజం రాఫెన్ నాదల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నాదల్ కెరీర్లో ఇది 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికాకు చెందిన మాడిసన్ కీవ్‌ను ఓడించి అమెరికాకే చెందిన స్లోన్ స్టీఫెన్‌స దక్కించుకుంది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను జామీ ముర్రే, మార్టినా హింగీస్ జంట గెలుచుకుంది.
- సమాధానం: 1
30. తెలంగాణలోని ఏ పట్టణంలో నేషనల్ రూర్బన్ మిషన్ కింద మోడల్ కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నారు ?
1) అసిఫాబాద్
2) వరంగల్
3) సూర్యాపేట్
4) మంచిర్యాల
1) అసిఫాబాద్
2) వరంగల్
3) సూర్యాపేట్
4) మంచిర్యాల
- View Answer
- సమాధానం: 1
వివరణ: పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, రద్దీ నియంత్రణ కోసం నేషనల్ రూర్బన్ మిషన్ కింద తెలంగాణలోని ఆసిఫాబాద్ లో రూ. 2.3 కోట్ల కేంద్ర నిధులతో మోడల్ మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. మూడు నెలల్లో మార్కెట్‌ను అందుబాటులోకి తేనున్నారు.
- సమాధానం: 1
31. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఇటీవల విడుదల చేసిన హ్యూమన్ కేపటిల్ ఇండెక్స్ - 2017లో భారత్ ఏ స్థానంలో ఉంది ?
1) 130
2) 103
3) 113
4) 123
1) 130
2) 103
3) 113
4) 123
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ ఎకనమిక్ ఫోరమ్ ఏటా హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. ఈ ఏడాదిగాను 130 దేశాలతో విడుదల చేసిన నివేదికలో భారత్ 103వ స్థానంలో ఉంది. గతేడాది ఇదే నివేదికలో భారత్ 105వ స్థానంలో ఉంది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక(70), నేపాల్(98), మయన్మార్ (89) స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో నార్వే తొలి స్థానంలో, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, డెన్మార్క్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 2
32. 2028 ఒలింపిక్స్ ఏ నగరంలో జరగనున్నాయి ?
1) బ్రెజిల్
2) న్యూఢిల్లీ
3) లాస్ ఏంజెల్స్
4) పారిస్
1) బ్రెజిల్
2) న్యూఢిల్లీ
3) లాస్ ఏంజెల్స్
4) పారిస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2028 ఒలింపిక్స్‌కు ఆతిథ్య నగరంగా లాస్ ఏంజెల్స్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఖరారు చేసింది. అలాగే 2024 ఒలింపిక్స్ పారిస్‌లో, 2020 ఒలింపిక్స్ టోక్యోలో జరగనున్నాయి.
- సమాధానం: 3
33. ఇటీవల ఏ దేశం చక్మా, హజోంగ్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వనున్నట్లు ప్రకటించింది ?
1) భారత్
2) బంగ్లాదేశ్
3) మయన్మార్
4) శ్రీలంక
1) భారత్
2) బంగ్లాదేశ్
3) మయన్మార్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1960ల్లో తూర్పు పాకిస్తాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వలస వచ్చిన చక్మా, హజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థానికుల హక్కులకు, ప్రయోజనాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం దేశంలో వీరి సంఖ్య లక్ష వరకు ఉంటుంది. చక్మాలు బౌద్ధులు కాగా హజోంగ్ లు హిందువులు.
- సమాధానం: 1
34. దేశంలో మొదటి అత్యాధునిక హోమియోపతి వైరాలజీ ల్యాబ్ ఎక్కడ ఏర్పాటైంది ?
1) బెంగళూరు
2) కేరళ
3) కోల్కత్తా
4) హైదరాబాద్
1) బెంగళూరు
2) కేరళ
3) కోల్కత్తా
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కోల్‌కత్తాలోని డాక్టర్ అంజలి చటర్జీ హోమియోపతి రీజనల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో దేశంలో మొదటి హోమియోపతి వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. వైరల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు కొత్త ఔషధాలు, కొత్త సాంకేతిక విధానాలపై ఇందులో పరిశోధన జరిపి కొత్త ఆవిష్కరణలు చేస్తారు.
- సమాధానం: 3
35. ఎవరి జ్ఞాపకార్థం భారతీయ రిజర్వు బ్యాంక్ వంద రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేసింది ?
1) ఎంజీ రామచంద్రన్
2) జయలలిత
3) ఎన్టీ రామారావు
4) జయశంకర్
1) ఎంజీ రామచంద్రన్
2) జయలలిత
3) ఎన్టీ రామారావు
4) జయశంకర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతరత్న అవార్డీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతిని పురస్కరించుకొని త్వరలో వంద రూపాయల నాణేలను కేంద్ర ప్రభుత్వం ముద్రించనుంది. వాటిపై ఎంజీఆర్ ముఖ చిత్రంతో పాటు డాక్టర్ ఎంజీఆర్ బర్త్ సెంటినరీ అని రాసి ఉంటుంది. ఎంజీ రామచంద్రన్ తమిళనాడులోని అధికార పార్టీ అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) పార్టీ వ్యవస్థాపకులు.
- సమాధానం: 1
36. మహా సముద్రాల ప్రత్యేక రాయబారిగా ఐరాస ఎవరిని నియమించింది ?
1) జీయన్ మైఖెల్ కౌస్టీయ్
2) ఏడ్రియన్ గ్రేనియర్
3) బోయన్ స్లాట్
4) పీటర్ థామ్సన్
1) జీయన్ మైఖెల్ కౌస్టీయ్
2) ఏడ్రియన్ గ్రేనియర్
3) బోయన్ స్లాట్
4) పీటర్ థామ్సన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవి నుంచి ఇటీవల దిగిపోయిన పీటర్ థామ్స్న్ను మహా సముద్రాల తొలి ప్రత్యేక రాయబారిగా ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియా గుటెరస్ నియమించారు. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన తొలి యూఎన్ ఓషన్స కాన్ఫరెన్సలో పీటర్ థామ్సన్ కీలక పాత్ర పోషించారు. ఈ సమావేశంలో 193 ఐరాస సభ్య దేశాలు మహా సముద్రాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానించాయి.
- సమాధానం: 4
37. సింగపూర్ అధ్యక్షురాలిగా ఎన్నికై న తొలి మహిళ ఎవరు ?
1) హలీమా యాకూబ్
2) లిమ్ హీ హ్వా
3) అమీ ఖోర్
4) ఇంద్రాని రాజాహ్
1) హలీమా యాకూబ్
2) లిమ్ హీ హ్వా
3) అమీ ఖోర్
4) ఇంద్రాని రాజాహ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: సింగపూర్ అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన హలీమా యాకూబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నలుగురు ప్రత్యర్థులు అర్హత ప్రమాణాలు అందుకోవడంలో విఫలం కావడం వల్ల వారి నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఓటింగ్ లేకుండా ఆమె ఎన్నికయ్యారు.
- సమాధానం: 1
38. 36వ జాతీయ క్రీడలు ఏ నగరంలో జరగనున్నారుు ?
1) గోవా
2) బెంగళూరు
3) భువనేశ్వర్
4) హైదరాబాద్
1) గోవా
2) బెంగళూరు
3) భువనేశ్వర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 36వ జాతీయ క్రీడలను గోవాలో నిర్వహించాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్‌లో ఈ క్రీడలు జరుగుతాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను 1924లో ఏర్పాటు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో ఇండియన్ ఒలింపిక్ క్రీడలను నిర్వహించారు. అప్పటి నుంచి 1940 వరకు ఏటా ఈ క్రీడలను నిర్వహించారు. 1940 నుంచి పేరు మార్చి జాతీయ క్రీడలుగా నిర్వహిస్తున్నారు.
ఒలింపిక్స్ నిబంధనలకు అనుగుణంగా దేశంలో తొలి ఆధునిక జాతీయ క్రీడలను 1985లో నిర్వహించారు.
- సమాధానం: 1
39. జాతీయ హిందీ దివస్‌ను ఏ రోజున నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 11
2) సెప్టెంబర్ 12
3) సెప్టెంబర్ 13
4) సెప్టెంబర్ 14
1) సెప్టెంబర్ 11
2) సెప్టెంబర్ 12
3) సెప్టెంబర్ 13
4) సెప్టెంబర్ 14
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగ అసెంబ్లీ హిందీని పరిపాలన భాషగా అడాప్ట్ చేసుకుంది. భారత రాజ్యాంగం దీన్ని ఆమోదించింది. దీంతో ఏటా సెప్టెంబర్ 14న జాతీయ హిందీ దివస్ గా నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 1
40. వాతావరణ హిత వనరుల వినియోగాన్ని ప్రమోట్ చేసేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఇటీవల ప్రారంభించిన కేంపెయిన్ ఏది ?
1) వుడ్ ఈజ్ గుడ్
2) స్టీల్ ఈజ్ గుడ్
3) ప్లాస్టిక్ ఈజ్ గుడ్
4) ఐరన్ ఈజ్ గుడ్
1) వుడ్ ఈజ్ గుడ్
2) స్టీల్ ఈజ్ గుడ్
3) ప్లాస్టిక్ ఈజ్ గుడ్
4) ఐరన్ ఈజ్ గుడ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పర్యావరణం, అటవీ పరిరక్షణ కోసం న్యూఢిల్లీలో Sustainable land scapes and forest ecosystems : theory to practice పేరుతో సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి హర్షవర్దన్.. వుడ్ ఈజ్ గుడ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. స్టీల్, ప్లాస్టిక్ ఉత్పత్తుల వల్ల కాలుష్యం ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా చెక్క, కలపతో చేసిన వస్తవులను వినియోగించాలన్నది ఈ క్యాంపెయన్ ముఖ్య ఉద్దేశం.
- సమాధానం: 1
41. వెనిస్ చిత్రోత్సవంలో గోల్డెన్ లైవ్ అవార్డుని పొందిన చిత్రం ఏది ?
1) లా లా ల్యాండ్
2) ది మూన్ లైట్
3) ది షేప్ ఆఫ్ వాటర్
4) కింగ్ కాంగ్ రిటర్నస్
1) లా లా ల్యాండ్
2) ది మూన్ లైట్
3) ది షేప్ ఆఫ్ వాటర్
4) కింగ్ కాంగ్ రిటర్నస్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 74వ వెనిస్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ది షేప్ ఆప్ వాటర్ చిత్రం గోల్డెన్ లైవ్ అవార్డుని దక్కించుకుంది. అమెరికాకు చెందిన దర్శకుడు గుల్లెర్మో డెల్ టోరో చిత్రానికి దర్శకత్వం వహించారు. ఉత్తమ నటుడు పురస్కారాన్ని కమెల్ ఎల్ భాషా, ఉత్తమ నటి అవార్డుని చార్ లోటె రాంప్లింగ్(బ్రిటన్) దక్కించుకున్నారు.
- సమాధానం: 3
42. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్యను పెంచుకునేందుకు ఆస్ట్రేలియా ఎవరిని ప్రచాకర్తగా నియమించింది ?
1) పరిణీతి చోప్రా
2) ప్రియాంకా చోప్రా
3) దీపికా పడుకోన్
4) కత్రినా కై ఫ్
1) పరిణీతి చోప్రా
2) ప్రియాంకా చోప్రా
3) దీపికా పడుకోన్
4) కత్రినా కై ఫ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతీయ పర్యాటకలను తమ దేశానికి ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను ప్రచారకర్తగా నియమించుకుంది. ఆమె ఫ్రెండ్ ఆఫ్ ఆస్ట్రేలియా కాన్సెప్ట్ ను ప్రచారం చేస్తుంది.
- సమాధానం: 1
43. కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ - 2017లో బెస్ట్ లిఫ్టర్ అవార్డుని దక్కించుకున్న అథ్లెట్ ఎవరు ?
1) పర్దీప్ సింగ్
2) సతీశ్ కుమార్
3) ధర్మేంద్ర సింగ్
4) రాగల వెంకట రాహుల్
1) పర్దీప్ సింగ్
2) సతీశ్ కుమార్
3) ధర్మేంద్ర సింగ్
4) రాగల వెంకట రాహుల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ - 2017 పోటీలు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగాయి. ఈ పోటీల్లో సీనియర్ పురుషులు, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ రాగల వెంకట రాహుల్ బెల్ట్ లిఫ్టర్ అవార్డుని దక్కించుకున్నాడు. మీరాబాయి చానుకి సీనియర్ మహిళల కేటగిరీలో, దీపికా లాథెర్ కు యూత్ బాలుర విభాగంలో అవార్డులు లభించాయి. ఈ టోర్నీలో భారత లిఫ్టర్లు 34 రికార్డులు నెలకొల్పారు.
- సమాధానం: 4
44. అంతర్జాతీయ ఇన్నోవేషన్ ఫెయిర్- 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) ఢిల్లీ
2) బీజింగ్
3) విశాఖపట్నం
4) కొలంబో
1) ఢిల్లీ
2) బీజింగ్
3) విశాఖపట్నం
4) కొలంబో
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు విశాఖపట్నంలో అంతర్జాతీయ ఇన్నవేషన్ ఫెయిర్ - 2017ను నిర్వహించారు. ఆసియాన్ అండ్ పసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్సఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్నోవేటర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఫెయిర్ ను నిర్వహించాయి.
- సమాధానం: 3
45. దేశంలో పాల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1) ఉత్తరప్రదేశ్
2) రాజస్తాన్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
1) ఉత్తరప్రదేశ్
2) రాజస్తాన్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల విడుదల చేసిన 2016-17 పాల ఉత్పత్తి గణాంకాల ప్రకారం దేశంలో పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో రాజస్తాన్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
- సమాధానం: 1
46. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రాసెస్డ్ ఆలివ్ టీ తయారీని భారత్ లోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1) ఢిల్లీ
2) పంజాబ్
3) రాజస్తాన్
4) అస్సాం
1) ఢిల్లీ
2) పంజాబ్
3) రాజస్తాన్
4) అస్సాం
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాజస్తాన్‌లో ఉత్పత్తి అయ్యే ఆలివ్ ఆకుల నుంచి ఆలివ్ టీ తయారీని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రారంభించారు. ఈ తరహా టీని తయారు చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. Olitia గా పిలిచే ఈ టీ తయారీ కోసం ఒలిటియా ఫుడ్స్ ఫ్రైవేట్ లిమిటెడ్, రాజస్తాన్ ప్రభుత్వం మధ్య 2016లో జరిగిన రాజస్తాన్ అగ్రిటెక్ మీట్ లో ఒప్పందం కుదిరింది.
- సమాధానం: 3
47. అడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తమ సాహస పర్యాటక రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎంపికైంది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) గుజరాత్
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రతిష్టాత్మక అడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ సాహస పర్యాటక రాష్ట్రంగా ప్రకటించింది. సాహస క్రీడలు, సాహసోపేతమైన ప్రయాణం, వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నందుకు గాను రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది.
- సమాధానం: 2
48. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స - 2018లో తొలి స్థానంలో ఉన్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది ?
1) యునెటైడ్ కింగ్డమ్
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) కెనడా
1) యునెటైడ్ కింగ్డమ్
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) కెనడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ - 2018లో యూకేలోని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ తొలి స్థానంలో ఉంది. అదే దేశంలోని కేంబ్రిడ్జ్ యూనివర్సీటీ రెండో స్థానంలో, అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,102 యూనివర్సిటీలకు ర్యాంకింగ్స ఇవ్వగా భారత్‌లోని 42 యూనివర్సిటీలు, సాంకేతిక విద్యాసంస్థలు ఇందులో ర్యాంకు పొందాయి. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ సెన్సైస్ 25-300 మధ్య ర్యాంకులో ఉంది.
- సమాధానం: 1
49. సుందర్బన్ అడవుల్లో జీవ వైవిధ్య సమాచారంతో కూడిన తొలి నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది ?
1) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) మెటరోలాజిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
3) వైడ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
4) ఇండియన్ యానిమల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్
1) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) మెటరోలాజిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
3) వైడ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
4) ఇండియన్ యానిమల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇండియన్ సుందర్బన్ అడవుల్లోని జీవ వైవిధ్యం సమాచారంతో కూడిన తొలి జాబితాను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించింది. పశ్చిమబెంగాల్ లోని 9,630 చదరపు కిలోమీటర్ల మేర ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో 2,626 జంతు జాతులు ఉన్నాయి. వీటిలో బెంగాల్ పులి, గ్యాంగ్ టిక్ డాల్ఫిన్, గ్రే అండ్ మార్ష్ మంగూస్, వైల్డ్ రీసస్ కోతి తదితర జంతువులు ఉన్నాయి. భారత్‌లో జంతువుల సమాచార సేకరణ, క్రోడీకరణ కోసం 1916లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
50. ఇటీవల ఏ రాష్ట్రం అంతరించిపోతున్న మూషిక జింకల సంరక్షణకు చర్యలు చేపట్టి వాటిని తిరిగి అడవిలో వదిలిపెట్టింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అంతరించిపోతున్న మూషిక జింకల సంరక్షణకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక పద్ధతుల ద్వారా వాటి సంఖ్యను పెంచి ఇటీవల 8 మూషిక జింకలను నల్లమల అడవుల్లో వదిలి పెట్టింది.
- సమాధానం: 1
అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 3
1. ఏ దేశ ఆర్థిక సహాయంతో భారత దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుని నిర్మించనున్నారు ?
1) జపాన్
2) రష్యా
3) చైనా
4) ఇజ్రాయెల్
1) జపాన్
2) రష్యా
3) చైనా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జపాన్ ఆర్థిక సహాయంతో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుని ముంబయి - అహ్మదాబాద్ నగరాల మధ్య నిర్మించనున్నారు. దీనికి సెప్టెంబర్ 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్ లో శంకుస్థాపన చేశారు. మొత్తం 508 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టుని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం లక్ష పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇందులో 88 వేల కోట్ల రూపాయలను జపాన్ 0.1 శాతం వడ్డీకి రుణంగా అందిస్తుంది. ఈ మొత్తాన్ని 50 సంవత్సరాల్లో తీర్చాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంబయి నుంచి అహ్మదాబాద్ కు కేవలం 2 గంటల 58 నిమిషాల్లో చేరుకోవచ్చు.
- సమాధానం: 1
2. ప్రతిష్టాత్మక కంటెయినర్ టర్మినల్ ఆఫ్ ది ఇయర్ - 2017 పురస్కారానికి ఎంపికై న పోర్ట్ ఏది ?
1) పోర్ట్ ఆఫ్ చెన్నై
2) జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్
3) ముంద్రా పోర్ట్
4) కోల్ కత్తా పోర్ట్
1) పోర్ట్ ఆఫ్ చెన్నై
2) జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్
3) ముంద్రా పోర్ట్
4) కోల్ కత్తా పోర్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రతిష్టాత్మక గేట్ వే అవార్డులు - 2017లో జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్ టర్మినల్ కంటెయినర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ కంటెయినర్ల చేరవేత, రిసీవ్ చేసుకునే సదుపాయాలను ఏర్పాటు చేసినందుకు గాను ఈ పోర్ట్‌కి పురస్కారం లభించింది.సముద్ర సంబంధిత రంగంలో అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులు, కంపెనీలకు గేట్ వే మీడియా ఏటా గేట్ వే అవార్డులను ప్రదానం చేస్తుంది.
- సమాధానం: 2
3. ఇటీవల ఏ స్పేస్ క్రాఫ్ట్ శనిగ్రహంపై 20 ఏళ్ల ప్రస్థానాన్ని ముగించుకొని నిర్వీర్యమైంది ?
1) క్యూరియాసిటీ రోవర్
2) స్పేస్ షటిల్
3) కస్సీని
4) ప్రాజెక్ట్ కన్సెల్టేషన్
1) క్యూరియాసిటీ రోవర్
2) స్పేస్ షటిల్
3) కస్సీని
4) ప్రాజెక్ట్ కన్సెల్టేషన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సాటర్న్ (శనిగ్రహం)కి సంబంధించిన వివరాలను, విశేషాలను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1997 అక్టోబర్‌లో కస్సీని అంతరిక్ష నౌకను ప్రయోగించింది. 2017 సెప్టెంబర్ 15తో సాటర్నపై ఈ నౌక 20 ఏళ్ల ప్రస్థానాన్ని ముగించుకొంది. దీంతో నాసా శాస్త్రవేత్తలు కస్సీనిని శనిగ్రహ వాతావరణంలోకి పంపి దానికదే మండిపోయేలా చేశారు. జూలై 2004 నుంచి 2017 సెప్టెంబర్ వరకు కస్సీని 4.5 లక్షల చిత్రాలను, 635 గిగాబైట్ల సమాచారాన్ని పంపించింది.
- సమాధానం: 3
4. భారత్ - పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్స్ ఒడంబడికపై అత్యున్నత స్థాయి చర్చలు ఇటీవల ఎక్కడ జరిగాయి ?
1) ఢిల్లీ
2) కరాచీ
3) వాషింగ్టన్
4) లాహోర్
1) ఢిల్లీ
2) కరాచీ
3) వాషింగ్టన్
4) లాహోర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండస్ వాటర్స్ ఒడంబడికలోని సాంకేతిక వివాదాల పరిష్కారం కోసం భారత్ - పాకిస్తాన్ల మధ్య అత్యున్నత స్థాయి చర్చలు రెండు రోజుల పాటు అమెరికాలోని వాషింగ్టన్లో జరిగాయి. రెండు దేశాల ప్రయోజనాల రక్షణ కోసం అనుసరించాల్సిన విధానాలపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చించారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. కాగా భారత్ చేపట్టనున్న కిషన్ గంగ, రట్లే ప్రాజెక్టులని పాకిస్తాన్ వ్యతిరేకించింది. జీలం, చీనాబ్ నదులపై జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఈ ఏడాది ఆగస్టులోనే ప్రపంచ బ్యాంకు కొన్ని షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
భారత్ - పాకిస్తాన్ల మధ్య ఇండస్ వాటర్స్ ఒడంబడికపై 1960 సెప్టెంబర్ 19న కరాచీలో అప్పటి భారత ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని ఆయూబ్ ఖాన్ సంతకం చేశారు.
- సమాధానం: 3
5. రోహింగ్యా శరణార్థుల కోసం ఆపరేషన్ ఇన్సానియాత్ను ఏ దేశం ప్రారంభించింది ?
1) మయన్మార్
2) బంగ్లాదేశ్
3) చైనా
4) భారత్
1) మయన్మార్
2) బంగ్లాదేశ్
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మయన్మార్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశం నుంచి బంగ్లాదేశ్‌కు భారీగా వస్తోన్న రోహింగ్యా ముస్లిం శరణార్థులకు సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ ఇన్సానియాత్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని కింద ఆహారం, నిత్యావసర వస్తువులు సరఫరా చేసింది.
- సమాధానం: 4
6. Unstoppable : My life so far పుస్తక రచయిత ఎవరు ?
1) సెరెనా విలియమ్స్
2) సానియా మీర్జా
3) మారియా షరపోవా
4) స్టెఫీగ్రాఫ్
1) సెరెనా విలియమ్స్
2) సానియా మీర్జా
3) మారియా షరపోవా
4) స్టెఫీగ్రాఫ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: Unstoppable : My life so far పుస్తకాన్ని రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా రచించారు. టెన్నిస్‌లో అగ్రస్థానానికి చేరుకున్న క్రమాన్ని ఆమె పుస్తకంలో వివరించారు. వ్యక్తిగత వివరాలను ప్రస్తావించారు.
- సమాధానం: 3
7. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 15
2) సెప్టెంబర్ 16
3) సెప్టెంబర్ 17
4) సెప్టెంబర్ 18
1) సెప్టెంబర్ 15
2) సెప్టెంబర్ 16
3) సెప్టెంబర్ 17
4) సెప్టెంబర్ 18
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఏటా సెప్టెంబర్ 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొనేందుకు వివాదాల నివారణ వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఈ దినోత్సవాన్ని నిర్వహించడం వెనుక ముఖ్య ఉద్దేశం.
2017 Theme : Democracy and conflict prevention
- సమాధానం: 1
8.అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) ఎథిక్స్ కమిషన్ చైర్మన్‌గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
1) బాన్ కీ మూన్
2) ఆంటోనియా గుటై
3) యూస్సఫో దియాఝె
4) రాజేంద్ర శర్మ
1) బాన్ కీ మూన్
2) ఆంటోనియా గుటై
3) యూస్సఫో దియాఝె
4) రాజేంద్ర శర్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐవోసీ ఎథిక్స్ కమిషన్ చైర్మన్‌గా యూస్సఫో దియాఝె పదవీకాలం ముగియటంతో ఆయన స్థానంలో ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ ఎన్నికయ్యారు. ఈయన 4 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. బాన్ కీ మూన్ 2007 జనవరి నుంచి 2016 డిసెంబర్ వరకు ఐరాస 8వ సెక్రెటరీ జనరల్‌గా పనిచేశారు.
- సమాధానం: 1
9. దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ఏ గ్రామంలో ప్రారంభించారు ?
1) సిరిసిల్ల
2) పుట్టంగండి
3) గజ్వేల్
4) ఈశ్వరీ గంజ్
1) సిరిసిల్ల
2) పుట్టంగండి
3) గజ్వేల్
4) ఈశ్వరీ గంజ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా స్వచ్ఛత హీ సేవ ప్రచార కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఈశ్వరీ గంజ్ గ్రామంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ ఊరిని బహిరంగ మల విసర్జన రహితం (ODF)గామార్చేందుకు గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించారు. ఇందుకోసం కృషి చేసిన వారిని రాష్ట్రపతి సన్మానించారు.
- సమాధానం: 4
10. కొరియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) పీవీ సింధు
2) నోజోమి ఓకుహారా
3) సైనా నెహ్వాల్
4) దీపికా పల్ల్లికల్
1) పీవీ సింధు
2) నోజోమి ఓకుహారా
3) సైనా నెహ్వాల్
4) దీపికా పల్ల్లికల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నెమెంట్ దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగింది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కై వసం చేసుకుంది. ఫైనల్లో జపాన్‌కు చెందిన నోజోమి ఓకుహారాను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. విజేతగా నిలిచిన సింధుకు 45 వేల డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. మొత్తంగా సింధు కెరీర్లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. 2016లో చైనా ఓపెన్ సూపర్ సిరిస్ ప్రీమియర్ టైటిల్ , 2017లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లను సింధు గెలుచుకుంది.
- సమాధానం: 1
11. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 16
2) సెప్టెంబర్ 18
3) సెప్టెంబర్ 20
4) సెప్టెంబర్ 22
1) సెప్టెంబర్ 16
2) సెప్టెంబర్ 18
3) సెప్టెంబర్ 20
4) సెప్టెంబర్ 22
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియాల్ ప్రోటోకాల్‌పై ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16న సంతకం చేశాయి. ఇందుకు అనుగుణంగా ఐరాస సాధారణ అసెంబ్లీ 1994లో ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని తీర్మానించింది.
- సమాధానం: 1
12. 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు ?
1) మార్షల్ అర్జన్ సింగ్
2) ఓం ప్రకాశ్ మెహ్రా
3) హృషికేశ్ మూల్గావ్ కర్
4) దిల్బాగ్ సింగ్
1) మార్షల్ అర్జన్ సింగ్
2) ఓం ప్రకాశ్ మెహ్రా
3) హృషికేశ్ మూల్గావ్ కర్
4) దిల్బాగ్ సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1965 భారత్ - పాక్ యుద్ధ వీరుడు, భారత వాయు సేన - ఐఏఎఫ్ మార్షల్ అర్జన్ సింగ్ ఇటీవల ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన 1964 నుంచి 1969 వరకు ఐఎఎఫ్ చీఫ్‌గా ఉన్నారు. ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ స్థాయి నుంచి ఫైవ్ స్టార్ ర్యాంకుకు ప్రమోటైన ఏకైక అధికారి అర్జన్ సింగ్. 1965 భారత్ - పాక్ యుద్ధంలో పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ గ్రాండ్ స్లామ్‌ను తిప్పికొట్టడంలో అర్జన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత దౌత్యవేత్తగా భారత్ కు సేవలందించారు.
- సమాధానం: 1
13. పెరూ అధ్యక్షుడు ఇటీవల ఎవరిని ఆ దేశ ప్రధానిగా నియమించారు ?
1) ఫెర్నాండో జావలా
2) అల్బర్టో ఫ్యూజిమోరో
3) ఓల్లాంటా హుమాలా
4) మెర్సిడిస్ ఆరోజ్ ఫెర్నాండేజ్
1) ఫెర్నాండో జావలా
2) అల్బర్టో ఫ్యూజిమోరో
3) ఓల్లాంటా హుమాలా
4) మెర్సిడిస్ ఆరోజ్ ఫెర్నాండేజ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పెరూ కాంగ్రెస్‌లో ఇటీవల జరిగిన అవిశ్వాస ఓటింగ్‌లో ఫెర్నాండో జావలా ఓడిపోయారు. దీంతో ఆయన పదవి నుంచి దిగిపోయారు. ఆయన స్థానంలో పెరూ అధ్యక్షుడు పెడ్రో పబ్‌లో కుస్ జింక్సీ.. మెర్సిడీస్ ఆరోజ్ ఫెర్నాండేజ్‌ను ప్రధాన మంత్రిగా నియమించారు. ఆమె 2006 నుంచి 2011 వరకు పెరూ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
- సమాధానం: 4
14. అత్యున్నత స్థాయి సౌకర్యాలతో నైపుణ్య నగరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది ?
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) అస్సాం
1) తెలంగాణ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) అస్సాం
- View Answer
- సమాధానం: 4
వివరణ: 10 వేల సీట్ల శిక్షణ సామర్థ్యంతో నైపుణ్య నగరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సింగపూర్‌లోని నైపుణ్య శిక్షణ సంస్థ సహాయంతో దీన్ని ఏర్పాటు చేయనుంది. అస్సాంలో పోలీసులకు లొంగిపోయిన మిలిటెంట్లకు ఈ ప్రోగ్రాం ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.
- సమాధానం: 4
15. జాతీయ దర్యాప్తు సంస్థ -NIA కొత్త డెరైక్టర్ జనరల్‌గా కేంద్రం ఇటీవల ఎవరిని నియమించింది ?
1) వైసీ మోదీ
2) శరద్ కుమార్
3) ఎన్ ఆర్ వాసన్
4) రంజన్ కుమార్
1) వైసీ మోదీ
2) శరద్ కుమార్
3) ఎన్ ఆర్ వాసన్
4) రంజన్ కుమార్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ దర్యాప్తు సంస్థ.. ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కేసులని దర్యాప్తు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను 2009లో ఏర్పాటు చేసింది. ఎన్ఐఏ డెరైక్టర్ జనరల్‌గా శరద్ కుమార్ పదవీకాలం అక్టోబర్ 30తో ముగుస్తుండటంతో ఆయన స్థానంలో వైసీ మోదీని కేంద్ర ప్రభుత్వం డెరైక్టర్ జనరల్‌గా నియమించింది.
- సమాధానం: 1
16. డిజిటల్ పేమెంట్స్ కోసం గూగుల్ సంస్థ ఇటీవల ఏ యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది ?
1) తేజ్
2) పేజ్
3) పేయూ మనీ
4) ఫోన్ పే
1) తేజ్
2) పేజ్
3) పేయూ మనీ
4) ఫోన్ పే
- View Answer
- సమాధానం: 1
వివరణ: డిజిటల్ పేమెంట్స్ కోసం గూగుల్ సంస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్ - యూపీఐ ఆధారిత తేజ్ యాప్‌ని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ యాప్‌ని న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. దేశంలోని 7 ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
- సమాధానం: 1
17. మధ్య ప్రాచ్య దేశాల్లో అమెరికా తన తొలి శాశ్వత సైనిక స్థావరాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేసింది ?
1) ఇరాన్
2) టర్కీ
3) ఇజ్రాయెల్
4) సౌదీ అరేబియా
1) ఇరాన్
2) టర్కీ
3) ఇజ్రాయెల్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ సైనిక దళాలు సంయుక్తంగా ఇజ్రాయెల్‌లో యూఎస్ శాశ్వత సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశాయి. మధ్య ప్రాచ్య దేశాల్లో అమెరికా శాశ్వత సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అమెరికా - ఇజ్రాయెల్ మంచి దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాయి.
- సమాధానం: 3
18. దేశంలో కుటుంబ సంక్షేమ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది ?
1) పశ్చిమ బెంగాల్
2) త్రిపుర
3) అస్సాం
4) మధ్యప్రదేశ్
1) పశ్చిమ బెంగాల్
2) త్రిపుర
3) అస్సాం
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భార్య, భర్తల మధ్య వివాద పరిష్కారం కోసం త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కుటుంబ సంక్షేమ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసింది. భర్త, అతడి కుటుంబ సభ్యులపై భార్య ఇచ్చే ఫిర్యాదులో వాస్తవాలని తేల్చేందుకు అన్ని రాష్ట్రాల్లో ఈ తరహా కమిటీలను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా త్రిపురలో ఇవి ఏర్పాటయ్యాయి.
- సమాధానం: 2
19. ఏ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో పౌష్టికాహార లోపంపై తొలి జాతీయ సమావేశం జరిగింది ?
1) మహిళా శిశు అభివృద్ధి శాఖ
2) వైద్య, ఆరోగ్య శాఖ
3) ఆహార మంత్రిత్వశాఖ
4) హోంశాఖ
1) మహిళా శిశు అభివృద్ధి శాఖ
2) వైద్య, ఆరోగ్య శాఖ
3) ఆహార మంత్రిత్వశాఖ
4) హోంశాఖ
- View Answer
- సమాధానం: 1
వివరణ: పోషకాహార లోపంపై దేశంలో తొలి జాతీయ సమావేశం మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగింది. 2022 నాటికి దేశంలో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. నీతి ఆయోగ్, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 4 (NFHS- 4) నివేదికల ఆధారంగా దేశవ్యాప్తంగా 119 జిల్లాల్లో పౌష్టికాహార లోపం ఉన్నట్లు మంత్రిత్వశాఖ గుర్తించింది. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలయ్యేలా చూడాలని అధికారులకు నిర్దేశించారు.
- సమాధానం: 1
20. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పేదరిక రేఖకు దిగవనున్న పిల్లలకు నగదుకు బదులు పుస్తకాలు, స్కూల్ యూనిఫాం ఇవ్వాలని ఏ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది ?
1) ఛత్తీస్గడ్ హైకోర్టు
2) గుజరాత్ హైకోర్టు
3) మధ్యప్రదేశ్ హైకోర్టు
4) ముంబయి హైకోర్టు
1) ఛత్తీస్గడ్ హైకోర్టు
2) గుజరాత్ హైకోర్టు
3) మధ్యప్రదేశ్ హైకోర్టు
4) ముంబయి హైకోర్టు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పేదరిక రేఖకు దిగవున్న పిల్లలకు నగదుకు బదులు పుస్తకాలు, స్కూల్ యూనిఫారం సహా ఇతర స్టేషనరీ వస్తువులను ఉచితంగా ఇవ్వాలని ఛత్తీస్ గడ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- సమాధానం: 1
21. స్వాతంత్య్ర సమరయోధుల గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ‘‘ షాహీద్ గ్రామ్ వికాస్ యోజన’’ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
1) ఛత్తీస్‌గఢ్
2) జార్ఖండ్
3) ఉత్తరాఖండ్
4) బిహార్
1) ఛత్తీస్‌గఢ్
2) జార్ఖండ్
3) ఉత్తరాఖండ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: షాహీద్ గ్రామ్ వికాస యోజనను జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జార్ఖండ్ గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిస్రా ముండా పుట్టిన ఊరు - ఉలిహటు గ్రామంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల గ్రామాలను అభివృద్ధి చేస్తారు. ఆయా గ్రామాల్లో కనీస సౌకర్యాలను కల్పిస్తారు.
- సమాధానం: 2
22. సశస్త్ర సీమా బల్ - SSB డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది ?
1) వైసీ మోదీ
2) రజనీకాంత్ మిశ్రా
3) కుశల్ యాదవ్ కుమార్
4) రమేశ్ చంద్రగుప్త
1) వైసీ మోదీ
2) రజనీకాంత్ మిశ్రా
3) కుశల్ యాదవ్ కుమార్
4) రమేశ్ చంద్రగుప్త
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇండో - నేపాల్ సరిహద్దుల్లో గస్తీ కాసే సశస్త్ర సీమా బల్ - ఎస్ఎస్బీ డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రజినీకాంత్ మిశ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 1984 ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
- సమాధానం: 2
23. డబ్ల్యూపీపీ, కంటార్ మిల్ వర్డ్ బ్రౌన్ సంస్థలు ఇటీవల విడుదల చేసిన బ్రాండ్‌జ ఇండియా టాప్ - 50లో తొలిస్థానంలో ఏ సంస్థ ఉంది ?
1) ఎస్బీఐ
2) హెచ్డీఎఫ్సీ
3) రిలయన్స జియో
4) జాన్సన్ అండ్ జాన్సన్
1) ఎస్బీఐ
2) హెచ్డీఎఫ్సీ
3) రిలయన్స జియో
4) జాన్సన్ అండ్ జాన్సన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: డబ్ల్యూపీపీ, కంటార్ మిల్ వర్డ్ బ్రౌన్ సంస్థలు ఏటా బ్రాండ్‌జ ఇండియా టాప్ - 50 జాబితాను విడుదల చేస్తాయి. ఇందులో హెచ్డీఎఫ్సీ వరుసగా నాలుగోసారి తొలి స్థానంలో నిలిచింది. ఈ సంస్థ 2014 నుంచి తన బ్రాండ్ విలువను 9.4 బిలియన్ డాలర్ల నుంచి 18 బిలియన్ డాలర్లకు పెంచుకుంది.
- సమాధానం: 2
24. ది లాన్సెట్ వైద్య పత్రిక ఇటీవల విడుదల చేసిన ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన నివేదికలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
1) 128
2) 118
3) 138
4) 108
1) 128
2) 118
3) 138
4) 108
- View Answer
- సమాధానం: 1
వివరణ: ది లాన్సెట్ నివేదిక ప్రకారం ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ 128వ స్థానంలో ఉంది. 1994 - 2014లోని ధోరణులను విశ్లేషిస్తూ వాషింగ్టన్ వర్సిటీ అనుబంధ సంస్థ జరిపిన ఫలితాలను లాన్సెట్ విడుదల చేసింది. దీని ప్రకారం ఆరోగ్య సంబంధ గమ్యాలను చేరుకోవడంలో భారత్ వెనకబడుతోంది. ఈ లక్ష్యాలను 2030 లోగా చేరుకోవాలి. ఈ దిశగా సాధించిన ప్రగతిలో వాయు కాలుష్యం, పారిశుద్ధ్యం, హెపటైటిస్ - బి, పిల్లల్లో పోషకాహార లోపం వంటి అంశాల్లో బాగా వెనకబడింది.
- సమాధానం: 1
25. దేశంలోనే తొలిసారిగా ఏ సంస్థ డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది ?
1) టాటా మోటార్స్
2) స్వరాజ్
3) బజాజ్ ఆటో
4) మహింద్రా అండ్ మహీంద్రా
1) టాటా మోటార్స్
2) స్వరాజ్
3) బజాజ్ ఆటో
4) మహింద్రా అండ్ మహీంద్రా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహింద్రా అండ్ మహింద్రా దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. వచ్చే ఏడాది దశల వారీగా ఈ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. చెన్నైలోని మహింద్రా రీసెర్చ్ వ్యాలీలో ఈ ట్రాక్టర్లను అభివృద్ధి చేశారు.
- సమాధానం: 4
26. భారత వాయుసేన ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అస్త్ర ఏ రకానికి చెందిన క్షిపణి ?
1) ఎయిర్ టు ఎయిర్ మిసైల్
2) సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్
3) సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్
4) సర్ఫేస్ టు వాటర్ మిసైల్
1) ఎయిర్ టు ఎయిర్ మిసైల్
2) సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్
3) సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్
4) సర్ఫేస్ టు వాటర్ మిసైల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అస్త్ర గగనతలంలో సుదూర లక్ష్యాలను ఛేదిస్తుంది. దీన్నే బీవీఆర్‌ఏఏఎమ్ క్షిపణిగా పిలుస్తారు. డీఆర్డీవో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణి పరీక్షలను భారత వాయుసేన ఇటీవల విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని చాందీపూర్ లో ఈ క్షిపణి పరీక్షలు జరిగాయి.
- సమాధానం: 1
27. భారత విదేశీ మారక నిల్వలు ఇటీవల ఎన్ని బిలియన్ డాలర్ల మార్క్‌ని అందుకున్నాయి ?
1) 400 బిలియన్ డాలర్లు
2) 300 బిలియన్ డాలర్లు
3) 200 బిలియన్ డాలర్లు
4) 100 బిలియన్ డాలర్లు
1) 400 బిలియన్ డాలర్లు
2) 300 బిలియన్ డాలర్లు
3) 200 బిలియన్ డాలర్లు
4) 100 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడంతో చరిత్రలో తొలిసారి భారత విదేశీ మారక నిల్వలు 400 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ప్రపంచ దేశాల్లో అత్యధిక విదేశీ మారక నిల్వలు ఉన్న దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో నిలిచింది. చైనా(3,053 బిలియన్ డాలర్లు), జపాన్ (1,188 బిలియన్ డాలర్లు), స్విట్జర్లాండ్( 743 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా(489 బలియన్ డాలర్లు) , తైవాన్(441 బిలియన్ డాలర్లు) తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 1
28. ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ - iucn ఇటీవల ఏ జంతువుని పూర్తిగా అంతరించిపోతున్న జాబితా నుంచి ప్రమాదంలో ఉన్న జంతువుల జాబితాలోకి మార్చింది ?
1) బెంగాల్ టైగర్
2) ఆఫ్రికన్ ఏనుగు
3) స్నో లెపర్డ్
4) పోలార్ బియర్
1) బెంగాల్ టైగర్
2) ఆఫ్రికన్ ఏనుగు
3) స్నో లెపర్డ్
4) పోలార్ బియర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ స్నో లెపర్డ్ పరిరక్షణ స్థాయిని అంతరించిపోతున్న(Endangered) జాబితా నుంచి ప్రమాదంలో(vulnerable) ఉన్న జంతువుల జాబితాలోకి మార్చింది. 1972లో ఈ రకం చిరుతను అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చారు. దీని పరిరక్షణ కోసం చేపట్టిన చర్యల ఫలితంగా ఇటీవల వీటి సంఖ్య పెరగడంతో స్థాయిని తగ్గించారు. ఏవైనా జంతువులు 2500 కన్న తక్కువగా ఉంటే.. వాటిని ఎండేంజర్డ్ జాబితాలో చేరుస్తారు. 2500 నుంచి పదివేల లోపు ఉంటే ప్రమాదంలో ఉన్న జంతువులుగా పరిగణిస్తారు. స్నో లెపర్డ్ మధ్య, దక్షిణ ఆసియా హిమాలయ పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది.
- సమాధానం: 4
29. ప్రపంచంలో రెండవ అతిపెద్ద కాంక్రీట్ గ్రావిటీ డ్యాం ఏది ?
1) గ్రాండ్ కోయ్ లీ డ్యాం
2) నాగార్జునసాగర్ డ్యాం
3) సర్దార్ సరోవర్ డ్యాం
4) హిరాకుద్ డ్యాం
1) గ్రాండ్ కోయ్ లీ డ్యాం
2) నాగార్జునసాగర్ డ్యాం
3) సర్దార్ సరోవర్ డ్యాం
4) హిరాకుద్ డ్యాం
- View Answer
- సమాధానం: 3
వివరణ: గుజరాత్‌లోని దభోయ్ సమీపంలో కెవాదియా వద్ద నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ఆనకట్టని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జాతికి అంకితం చేశారు. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కాంక్రీట్ గ్రావిటీ డ్యాంగా గుర్తింపు పొందింది. అమెరికాలోని గ్రాండ్ కోయ్ లీ డ్యాం అతి పెద్ద కాంక్రీట్ డ్యాం. సర్దార్ సరోవర్ ఆనకట్టు ఎత్తు 138.3 మీటర్లు. పొడవు 1.2 కిలోమీటర్లు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాలకు ఈ ఆనకట్ట తాగు, సాగు నీటిని అందిస్తుంది.
- సమాధానం: 3
30. ఇటీవల ఎవరి 101వ జయంతిని పురస్కరించుకొని రూ.100, రూ.10 స్మారక నాణేలను విడుదల చేశారు ?
1) ఎం ఎస్ సుబ్బలక్ష్మీ
2) అసిమా చటర్జీ
3) నానాజీ దేశ్ ముఖ్
4) మార్గరెట్
1) ఎం ఎస్ సుబ్బలక్ష్మీ
2) అసిమా చటర్జీ
3) నానాజీ దేశ్ ముఖ్
4) మార్గరెట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రముఖ కర్ణాటిక్ సంగీత విధ్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి 101వ జయంతిని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆమె పేరిట రూ. 100, రూ.10 స్మారక నాణేలను విడుదల చేశారు. సుబ్బలక్ష్మీ భారత రత్న అవార్డు పొందారు. ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 2016లో ఆమె వందవ జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.
- సమాధానం: 1
31. పద్మ భూషణ్ అవార్డు కోసం బీసీసీఐ ఇటీవల నామినేట్ చేసిన ఏకై క క్రికెటర్ ఎవరు ?
1) విరాట్ కోహ్లీ
2) ఎం ఎస్ ధోని
3) యువరాజ్ సింగ్
4) చటేశ్వర పుజారా
1) విరాట్ కోహ్లీ
2) ఎం ఎస్ ధోని
3) యువరాజ్ సింగ్
4) చటేశ్వర పుజారా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బీసీసీఐ మహేంద్ర సింగ్ ధోని పేరుని భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కోసం నామినేట్ చేసింది. భారత క్రికెట్‌కు ధోని అందించిన సేవలకుగాను ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ధోని కెప్టెన్సీలోనే భారత క్రికెట్ జట్టు టీ20 (2007), వన్డే (2011) ప్రపంచకప్‌లను గెలుచుకుంది.
- సమాధానం: 2
32. ఖేలో ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేసిన అథ్లెట్లకు ఎంత మొత్తంతో కూడిన వార్షిక స్కాలర్షిప్ను అందిస్తారు ?
1) 5 లక్షల రూపాయాలు
2) 4 లక్షల రూపాయలు
3) 6 లక్షల రూపాయలు
4) 3 లక్షల రూపాయలు
1) 5 లక్షల రూపాయాలు
2) 4 లక్షల రూపాయలు
3) 6 లక్షల రూపాయలు
4) 3 లక్షల రూపాయలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: గ్రామీణ స్థారుు నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన వసతులు, సౌకర్యాలు అందించేందుకు సరికొత్తగా రూపొందించిన ఖేలో ఇండియా కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా వెయ్యి మంది అథ్లెట్లను ఎంపిక చేస్తారు. వారికి ఏటా 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ అందజేస్తారు. 2017-18 నుంచి 2019 -2020 వరకు ఈ కార్యక్రమం అమలు కోసం 1,756 కోట్ల రూపాయలు వెచ్చిస్తారు.
- సమాధానం: 1
33. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 17
2) సెప్టెంబర్ 19
3) సెప్టెంబర్ 21
4) సెప్టెంబర్ 23
1) సెప్టెంబర్ 17
2) సెప్టెంబర్ 19
3) సెప్టెంబర్ 21
4) సెప్టెంబర్ 23
- View Answer
- సమాధానం: 3
వివరణ: వివాదాలు, ఘర్షణలను తగ్గించి సమాజంలో శాంతి స్థాపన కోసం కృషి చేసిన వారి సేవలను గుర్తిస్తు ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం ఐరాస సాధారణ అసెంబ్లీ 1981లో తీర్మానం చేసింది. 1982 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 21ని కాల్పుల విరమణ దినోత్సవంగాను జరుపుతారు.
- సమాధానం: 3
34. భారత్‌లో తొలి ఎలక్టిక్ర్ బస్సు సేవలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1) హిమాచల్ ప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
1) హిమాచల్ ప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: హిమాచల్‌ప్రదేశ్ లోని రోహ్తంగ్ పాస్‌లో తొలి ఎలక్టిక్ర్ బస్సు సేవలను ఆ రాష్ట్ర ఆర్టీసీ ప్రారంభించింది. ఇవి మనాలి నుంచి రోహ్‌తంగ మధ్య తిరుగుతాయి. డీజిల్, పెట్రోల్ వాహనాలతో విడుదలవుతున్న కర్బణ ఉద్గారాల వల్ల హిమాలయ పర్వతాలపై మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీన్ని నివారించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యావరణ హిత బస్సులను ప్రవేశపెట్టింది. గోల్డ్ స్టోన్ కంపెనీ ఈ బస్సులను రూపొందించింది.
- సమాధానం: 1
35. వస్త్ర - 2017 ప్రదర్శన ఎక్కడ జరిగింది ?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) విశాఖపట్నం
4) జైపూర్
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) విశాఖపట్నం
4) జైపూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: 6వ అంతర్జాతీయ టెక్స్టైల్ అండ్ అప్పారల్ ఫెయిర్ - 2017 (వస్త్ర -2017) రాజస్తాన్ లోని జైపూర్ లో జరిగింది. రాజస్తాన్ ప్రభుత్వం, ఫిక్కీ సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహించాయి. 13 రాష్ట్రాలు, 50 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.
- సమాధానం: 4
36. ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పొర్టేషన్ సిస్టం - ఐటీఎస్ కోసం నీతిఆయోగ్ ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) వరల్డ్ రోడ్ అసోసియేషన్
2) ఇంటర్నేషనల్ రోడ్ ఫేడరేషన్
3) గ్లోబల్ రోడ్ సేఫ్టీ పార్టనర్ షిప్
4) ఇంటర్నేషనల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ యూనియన్
1) వరల్డ్ రోడ్ అసోసియేషన్
2) ఇంటర్నేషనల్ రోడ్ ఫేడరేషన్
3) గ్లోబల్ రోడ్ సేఫ్టీ పార్టనర్ షిప్
4) ఇంటర్నేషనల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ యూనియన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో ఇంటెలిజెంట్ ట్రాన్సపోర్టేషన్ కోసం నీతి ఆయోగ్ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ సంస్థతో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశంలో ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన అన్ని విభాగాలను, విదేశీ కంపెనీలను ఒకే వ్యవస్థ కిందకు తెస్తారు. అలాగే ఐటీఎస్ పాలసీ రూపొందించేందుకు ఓ సాంకేతిక వేదికను ఏర్పాటు చేస్తారు. ఇందులో ట్రాఫిక్, పార్కింగ్, ట్రాఫిక్ నిబంధనల నిర్వహణ తదితర అంశాల ఉంటాయి. స్విట్జర్లాండ్ లోని జెనీవా కేంద్రంగా ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ పనిచేస్తుంది.
- సమాధానం: 2
37. ప్రాజెక్టు - 75 లో భాగంగా భారత్ఇటీవల నిర్మించిన జలాంతర్గామి ఏది ?
1) INS ARIHANT
2) INS CHAKRA
3) INS KALAVARI
4) INS SINDHUGOSH
1) INS ARIHANT
2) INS CHAKRA
3) INS KALAVARI
4) INS SINDHUGOSH
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐఎన్ఎస్ కలవరిని మహారాష్ట్రలోని ముంబయి మజగాన్ డాక్లో నిర్మించారు. ఇటీవల ఈ జలాంతర్గామిని భారత నేవీకి అప్పగించారు. ప్రాజెక్టు - 75 లో భాగంగా భారత్ ఈ జలాంతర్గామిని నిర్మించింది. ఇలాంటివి మొత్తం 6 స్కార్పియన్ జలాంతర్గాములను నిర్మించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం.
- సమాధానం: 3
38. ఎవరి జ్ఞాపకార్థం భారత్‌లో జాతీయ ఇంజినీర్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ?
1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
2) సర్ సీ వీ రామన్
3) సర్ అర్థర్ కాటన్
4) నవాబ్ అలీ జంగ్
1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
2) సర్ సీ వీ రామన్
3) సర్ అర్థర్ కాటన్
4) నవాబ్ అలీ జంగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని దేశంలో ఏటా సెప్టెంబర్ 15న జాతీయ ఇంజినీర్స్ డేను నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో మంద్య జిల్లాలోని కృష్ణరాజా సాగార జలాశయం నిర్మాణానికి ఆయన చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లో వరద భద్రతా వ్యవస్థను ఆయనే రూపొందించారు.
- సమాధానం: 1
39. అణ్వస్ర ఆయుధాలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన ఒడంబడికపై సంతకం చేసిన తొలి దేశం ఏది ?
1) భారత్
2) అమెరికా
3) బ్రెజిల్
4) ఉత్తర కొరియా
1) భారత్
2) అమెరికా
3) బ్రెజిల్
4) ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: అణ్వాయుధాల ఉత్పత్తి, ప్రయోగం, పరిశోధన, కొనుగోలు, విక్రయం, నిల్వలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది జూలై 7న న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 122 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. నెదర్లాండ్స్ వ్యతిరేకించింది. ఈ తీర్మానం ఆధారంగా రూపొందించిన ఒడంబడికపై బ్రెజిల్ తొలి సంతకం చేసింది. అనంతరం 50కిపైగా దేశాలు దీనిపై సంతకం చేశాయి. ప్రపంచంలో అణు ఆయుధాలు కలిగి ఉన్న దేశాలు అమెరికా, యూకే, ఫ్రాన్స, భారత్, పాకిస్తాన్, చైనా, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్‌లు ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నాయి.
- సమాధానం: 3
40. ఇటీవల ఏ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తెలంగాణ
4) తమిళనాడు
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తెలంగాణ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: రైతు పెట్టుబడి పథకాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుగా రైతుల భూముల వివరాలు పక్కాగా తేల్చాలని నిర్ణరుయించింది. ఇందులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించింది.
- సమాధానం: 3
41. జాతీయ హరిత ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ల ఆధ్వర్యంలో ప్రాంతీయ పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది ?
1) విశాఖపట్నం
2) హైదరాబాద్
3) విజయవాడ
4) వరంగల్
1) విశాఖపట్నం
2) హైదరాబాద్
3) విజయవాడ
4) వరంగల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ హరిత ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు విశాఖపట్నంలో సంయుక్తంగా ప్రాంతీయ పర్యావరణ సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
- సమాధానం: 1
42. తెలంగాణ సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్‌గా ప్రభుత్వం ఎవరిని నియమించింది ?
1) ఎస్. రాజా సదరాం
2) టంకశాల అశోక్
3) మల్లేపల్లి లక్ష్మయ్య
4) గోరటి వెంకన్న
1) ఎస్. రాజా సదరాం
2) టంకశాల అశోక్
3) మల్లేపల్లి లక్ష్మయ్య
4) గోరటి వెంకన్న
- View Answer
- సమాధానం: 1
వివరణ: సుదీర్ఘకాలం అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఎస్. రాజా సదరాంను రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్‌గా నియమించింది. కమిషనర్‌గా సీనియర్ పాత్రికేయులు బుద్ధా మురళిని నియమించింది. వీరు ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.
- సమాధానం: 1
43. ఆంధ్రప్రదేశ్‌ను ఎప్పటిలోగా బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1) 2018
2) 2019
3) 2020
4) 2021
1) 2018
2) 2019
3) 2020
4) 2021
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల విజయవాడులో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. 2018 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ఓడీఎఫ్ రాష్ట్రంగా ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
- సమాధానం: 1
44. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సంచార వైద్యశాల టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి ?
1) 108
2) 104
3) 1962
4) 143
1) 108
2) 104
3) 1962
4) 143
- View Answer
- సమాధానం: 3
వివరణ: పశువుల అనారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సంచార పశు వైద్యశాలలను ప్రారంభించింది. తొలిదశలో 100 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. 1962 టోల్ ఫ్రీ నెంబర్‌కు రైతులు ఫోన్ చేసి సమస్యను వివరిస్తే 30 నిమిషాల్లో చేరుకునేలా 100 గ్రామీణ అసెంబ్లీ నియోజికవర్గాల్లో ఈ వాహనాలు అందుబాటులో ఉంటారుు.
- సమాధానం: 3
45. సింగపూర్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) రికియార్డో
2) వాల్టెరి బొటాస్
3) సెబాస్టియన్ వెటల్
4) లూయిస్ హామిల్టన్
1) రికియార్డో
2) వాల్టెరి బొటాస్
3) సెబాస్టియన్ వెటల్
4) లూయిస్ హామిల్టన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సింగపూర్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ రేసు టైటిల్ ని లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. హామిల్టన్ మెర్సిడీస్ జట్టు డ్రైవర్. రెడ్ బుల్ డ్రైవర్ రికియార్డో రెండో స్థానంలో నిలిచాడు. మెర్సిడిస్ జట్టుకే చెందిన వాల్టెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచాడు.
- సమాధానం: 4
46. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల సైన్యంలోని ఏ విభాగంలో నిఘా విభాగాన్ని ప్రారంభించారు ?
1) సీఆర్పీఎఫ్
2) ఎస్ఎస్బీ
3) బీఎస్ ఎఫ్
4) ఏదీ కాదు
1) సీఆర్పీఎఫ్
2) ఎస్ఎస్బీ
3) బీఎస్ ఎఫ్
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశ సరిహద్దు రక్షణలో సశస్త్ర సీమా బల్ - ఎస్ఎస్బీ కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర సాయుధ బలగాల్లో ఎస్ఎస్బీ ఒకటి. ఈ విభాగంలోని దళాలు భూటాన్, నేపాల్ వెంట ఉన్న భారత సరిహద్దులో గస్తీ కాస్తారు.
- సమాధానం: 2
47. 69వ వార్షిక ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డులు - 2017లో ఔట్ స్టాండింగ్ డ్రామా సిరీస్ అవార్డుని ఏ ప్రోగ్రామ్ దక్కించుకుంది ?
1) బిగ్ లిటిల్ లైస్
2) ద వాయిస్
3) వీప్
4) ద హాండ్ మెయిడ్స్ టేల్
1) బిగ్ లిటిల్ లైస్
2) ద వాయిస్
3) వీప్
4) ద హాండ్ మెయిడ్స్ టేల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 69వ వార్షిక ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. ఈ అవార్డుల్లో తొలిసారి వెబ్ టెలివిజన్ సిరీస్ ద హాండ్ మెయిడ్స్ టేల్ ఔట్ స్టాండింగ్ డ్రామా సిరీస్ పురస్కారాన్ని దక్కించుకుంది. ద వీప్కి ఔట్ స్టాండింగ్ కామెడీ సిరీస్ అవార్డు, బిగ్ లిటిల్ లైస్కి ఔట్ స్టాండింగ్ లిమిటెడ్ సిరీస్ అవార్డు, ది వాయిస్‌కి ఔట్ స్టాండింగ్ రియాల్టీ - కాంపిటిషన్ ప్రోగ్రామ్ అవార్డు లభించింది.
- సమాధానం: 3
48. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర మిషన్ 1 మిలియన్ కార్యక్రమాన్ని దేనికి మద్దతుగా చేపట్టింది ?
1) ఫిఫా అండర్ -17 ప్రపంచ కప్
2) పర్యావరణ హితం
3) స్వచ్ఛ భారత్
4) నదుల సంరక్షణ
1) ఫిఫా అండర్ -17 ప్రపంచ కప్
2) పర్యావరణ హితం
3) స్వచ్ఛ భారత్
4) నదుల సంరక్షణ
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో తొలిసారి జరుగతున్న ఫిఫా అండర్ 17 ప్రపంచ కప్‌కు మద్దతుగా మహారాష్ట్ర ప్రభుత్వం మిషన్ 1 మిలియన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు ఫుట్ బాల్ ఆడారు. ఫుట్ బాల్ పై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడం, విద్యార్థులను క్రీడలు ఆడేలాగా ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
- సమాధానం: 1
49. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో తొలిసారి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ దేశంపై సైనిక చర్య ప్రారంభిస్తామని హెచ్చరించారు ?
1) ఉత్తర కొరియా
2) దక్షిణ కొరియా
3) పాకిస్తాన్
4) సిరియా
1) ఉత్తర కొరియా
2) దక్షిణ కొరియా
3) పాకిస్తాన్
4) సిరియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలపై అమెరికా సహా ఇతర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్య సమితి సైతం ఉత్తర కొరియాపై ఆర్థిక అంక్షలు విధించింది. ఐరాస సర్వప్రతినిధి సమావేశంలో తొలిసారి ప్రసంగించిన యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర కొరియాపై సైనిక చర్య ప్రారంభించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు.
- సమాధానం: 1
50. ఎవరి శతజయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో సహకార సమ్మేళన్ నిర్వహించారు ?
1) లక్ష్మణ్ మాధవ్ రావ్ ఇనామ్ దార్
2) ఎం జీ రామచంద్రన్
3) కృష్ణమకాంత్
4) ఎవరూ కాదు
1) లక్ష్మణ్ మాధవ్ రావ్ ఇనామ్ దార్
2) ఎం జీ రామచంద్రన్
3) కృష్ణమకాంత్
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహారాష్ట్ర సహకార నేత లక్ష్మణ్ మాధవ్ రావ్ ఇనామ్ దార్ శతయంతి సందర్భంగా సెప్టంబర్ 21న న్యూఢిల్లీలో సహకార సమ్మేళన్ నిర్వహించారు. ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు. 1979లో ముంబై కేంద్రంగా సహకార భారతిని స్థాపించిన ఇనామ్ దార్ సహకార సంఘాల ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు.
- సమాధానం: 1
అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 4
1. దీన్ దయాళ్ హస్తకళా వర్తక కేంద్రాన్ని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు ?
1) వారణాసి
2) అహ్మదాబాద్
3) సూరత్
4) పోచంపల్లి
1) వారణాసి
2) అహ్మదాబాద్
3) సూరత్
4) పోచంపల్లి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ హస్తకళా వర్తక కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నేత కార్మికులు, హస్త కళా నిపుణులు తమ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించుకునేందుకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుంది. వారణాసి పర్యటనలో ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొన్న ప్రధాని మొత్తంగా వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామాయణంపై తపాలా బిళ్లలను విడుదల చేశారు. వారణాసి - గుజరాత్ మధ్య నడిచే మహానామా ఎక్స్ ప్రెస్ రైలుని ప్రారంభించారు.
- సమాధానం: 1
2. నీతి ఆయోగ్ సాథ్ (SATH) కార్యక్రమంలో భాగంగా దేశంలోని ఏ రాష్ట్రాలను ఆరోగ్య రంగంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతారు ?
1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు
2) అస్సాం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక
3) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా
4) బిహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్
1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు
2) అస్సాం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక
3) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా
4) బిహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని సాథ్(Sustainable action for transforming human capital) కార్యక్రమాన్ని సెప్టెంబర్ 23న అస్సాంలోని గౌహతిలో ప్రారంభించారు. ఇందులో భాగంగా అస్సాం రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడంలో నీతి ఆయోగ్ సహకరిస్తుంది. సాథ్ ద్వారాఅస్సాం,ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను ఆరోగ్య రంగంలో దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం నీతి ఆయోగ్ ఆయా రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేస్తుంది.
- సమాధానం: 2
3. అంతర్జాతీయ సంస్థ FTSEతో కలిసి తొలి భారతీయ బాండ్ ఇండెక్స్ సిరీస్ ను ఏ బ్యాంకు ప్రారంభించింది ?
1) ఐసీఐసీఐ
2) హెచ్డీఎఫ్సీ
3) ఎస్బీఐ
4) బ్యాంక్ ఆఫ్ ఇండియా
1) ఐసీఐసీఐ
2) హెచ్డీఎఫ్సీ
3) ఎస్బీఐ
4) బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారతీయ స్టేట్ బ్యాంకు - ఎస్బీఐ అంతర్జాతీయ ఇండెక్స్, డాటా ప్రొవైడర్ సంస్థ ఎఫ్టీఎస్ఈ సంస్థతో కలిసి భారత తొలి బాండ్ ఇండెక్స్ సిరీస్‌ను లండన్ స్టాక్ ఎక్సేంజ్‌లో ప్రారంభించింది. ఇది కేవలం విదేశీ పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించిన పథకం. భారత బాండ్ మార్కెట్ విలువ 1.7 ట్రిలియన్ డాలర్లు.
- సమాధానం: 3
4. భారత్ ఏ దేశ సహాయంతో బంగ్లాదేశ్‌లో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1) అమెరికా
2) ఇజ్రాయెల్
3) జపాన్
4) రష్యా
1) అమెరికా
2) ఇజ్రాయెల్
3) జపాన్
4) రష్యా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 61వ సాధారణ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో భారత్ తరపున పాల్గొన్న అటామిక్ కమిషన్ చైర్మన్ శేఖర్ బసు భారత ప్రభుత్వం రష్యాతో కలిసి బంగ్లాదేశ్‌లో రోప్పూర్ అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తుందని ప్రకటించారు. భారత్ దేశం వెలుపల చేపడుతున్న తొలి అణు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఇదే.
- సమాధానం: 4
5. ప్రళయ్ సహాయం పేరుతో బహుళ సంస్థల ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ డెమో విన్యాసాలను ఏ నగరంలో నిర్వహించారు ?
1) విశాఖపట్నం
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) చెన్నై
1) విశాఖపట్నం
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రకృతి విపత్తులు, మానవ విధ్వంసం, వరదలు తదితర విపత్తులను ఎదుర్కునేందుకు బహుళ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రళయ్ సహాయం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ మాక్‌డ్రిల్‌ను తెలంగాణ ప్రభుత్వం, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్ సంయుక్తంగా నిర్వహించాయి. వరద బాధితులను తరలించే విన్యాసంలో భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ - 17 హెలికాప్టర్లు, అడ్వాన్సడ్ లైట్ హెలికాప్టర్లు, చేతక్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి.
- సమాధానం: 3
6. గ్రామాల్లో ఎల్పీజీ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరేమిటి ?
1) ప్రధాన మంత్రి ఎల్పీజీ పంచాయత్ పథకం
2) ప్రధాన మంత్రి గ్యాస్ అడ్వైస్ పథకం
3) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
4) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
1) ప్రధాన మంత్రి ఎల్పీజీ పంచాయత్ పథకం
2) ప్రధాన మంత్రి గ్యాస్ అడ్వైస్ పథకం
3) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
4) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
- View Answer
- సమాధానం: 1
వివరణ: గ్రామాల్లో ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఎల్పీజీ పంచాయత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా మోతా ఇష్నాపూర్ గ్రామంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ పథకంలో బాగంగా ఎల్పీజీ వినియోగం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తారు.
- సమాధానం: 1
7. పదార్థ పరిశోధనలో ప్రదానం చేసే ప్రతిష్టాత్మక వాన్ హిప్పెల్ అవార్డు - 2017కు ఎంపికై న ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త ఎవరు ?
1) ప్రొఫెసర్ సీఎన్ ఆర్ రావు
2) విఎస్ ఆర్ అరుణాచలం
3) అమిత్ గోయల్
4) కే. జార్జ్ థామస్
1) ప్రొఫెసర్ సీఎన్ ఆర్ రావు
2) విఎస్ ఆర్ అరుణాచలం
3) అమిత్ గోయల్
4) కే. జార్జ్ థామస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: వాన్ హిప్పెల్ అవార్డు - 2017కు ప్రముఖ భారత శాస్త్రవేత్త, భారతరత్న, ఆచార్య సీఎన్ఆర్ రావు ఎంపికయ్యారు. ఆయన ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఆసియా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. నానో మెటీరియల్స్, గ్రాఫీన్, సూపర్ కండక్టివిటీ, 2డీ మెటీరియల్స్ పరిశోధనలో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. రావు 2014లో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి భారతరత్న పురస్కారం అందుకున్నారు.
వాన్ హిప్పెల్ అవార్డుని మెటీరియల్స్ రిసెర్చ్ సొసైటీ అందజేస్తుంది. ఇందులో 90 దేశాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. డై ఎలక్టిక్స్ర్ సెమీకండక్టర్స్‌లో అనేక పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త వాన్ హిప్పెల్ పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
8. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ?
1) ఫ్లిప్ కార్ట్
2) ఆమెజాన్
3) స్నాప్ డీల్
4) టాటా ఆన్ లైన్
1) ఫ్లిప్ కార్ట్
2) ఆమెజాన్
3) స్నాప్ డీల్
4) టాటా ఆన్ లైన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించి వారి ఆదాయం పెంచేందుకు ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను 1987లో ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ సంస్థ ఆమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లోని హస్తకళల ఉత్పత్తులను ఆమెజాన్ ఆన్లైన్ పోర్టల్‌లో విక్రయానికి ఉంచుతారు.
- సమాధానం: 2
9. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏర్పాటు చేసిన ఆర్థిక సలహా మండలికి ఎవరిని అధ్యక్షుడిగా నియమించారు ?
1) రంగరాజన్
2) కౌశిక్ బసు
3) అభిజిత్ బెనర్జీ
4) బిబెక్ డెబ్రాయ్
1) రంగరాజన్
2) కౌశిక్ బసు
3) అభిజిత్ బెనర్జీ
4) బిబెక్ డెబ్రాయ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆర్థిక అంశాలపై ప్రధానమంత్రికి సలహాలు ఇచ్చేందుకు నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ బిబెక్ డెబ్రాయ్ నేతృత్వంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి (EAC - PM)ని ఏర్పాటు చేశారు. డాక్టర్ సుర్జిత్ భళ్లా, డాక్టర్ రిథిన్ రాయ్, డాక్టర్ అషిమా గోయల్, రతన్ వతల్ ఇందులో సభ్యులుగా ఉంటారు.
- సమాధానం: 4
10. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సౌభాగ్య పథకం ఉద్దేశం ఏమిటి ?
1) ఆడపిల్లల చదువు
2) మహిళలకు ఆర్థిక స్వావలంబన
3) గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్
4) మహిళలకు బీమా
1) ఆడపిల్లల చదువు
2) మహిళలకు ఆర్థిక స్వావలంబన
3) గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్
4) మహిళలకు బీమా
- View Answer
- సమాధానం: 4
వివరణ: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన సౌభాగ్య పథకం - ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ. 16,230 కోట్లతో 2018 నాటికి దేశంలో విద్యుత్ సదుపాయం లేని కుటుంబాలకు కనెక్షన్లు ఇస్తారు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా, రాష్ట్రాలు 10 శాతం వాటా నిధులు భరిస్తాయి. మిగతా మొత్తం రుణాల రూపంలో సేకరిస్తారు. బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా, ఏపీఎల్ కుటుంబాలకు 500 రూపాయలకు కనెక్షన్ ఇస్తారు. వీటిని కూడా పది ఇన్స్టాల్మెంట్లలో చెల్లించవచ్చు.
- సమాధానం: 4
11. ప్రపంచ న్యుక్లియర్ ఇండస్ట్రీ స్టేటస్ నివేదిక - 2017 ప్రకారం నిర్వహణలో ఉన్న అణు రియాక్టర్ల అంశంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
1) 1
2) 3
3) 6
4) 9
1) 1
2) 3
3) 6
4) 9
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ న్యూక్లియర్ ఇండస్ట్రీ స్టేటస్ నివేదిక - 2017 ప్రకారం నిర్వహణలో ఉన్న ఆరు అణు రియాక్టర్లతో భారత్ 3వ స్థానంలో ఉంది. 20 అణు రియాక్టర్లతో చైనా ఈ నివేదికలో తొలి స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా అణు విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుందని, కొన్ని దేశాల్లో అణు రియాక్టర్లు మూతపడుతుండగా, మరికొన్ని దేశాల్లో ప్రతిపాదిత రియాక్టర్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం ఉంటోందని నివేదిక పేర్కొంది. అలాగే 2013 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 63 రియాక్టర్లు నిర్మాణంలో ఉండగా 2017 జూన్ నాటికి వాటి సంఖ్య 53కు పడిపోయిందని తెలిపింది.
- సమాధానం: 2
12. ద్రుజ్బా(DRUZBA)- 2017 సైనిక విన్యాసాలను ఇటీవల ఏ దేశాలు నిర్వహించాయి ?
1) భారత్ - రష్యా
2) పాకిస్తాన్ - రష్యా
3) పాకిస్తాన్ - చైనా
4) రష్యా - చైనా
1) భారత్ - రష్యా
2) పాకిస్తాన్ - రష్యా
3) పాకిస్తాన్ - చైనా
4) రష్యా - చైనా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2వ ద్రుజ్బా ( DRUZBA ) - 2017 సైనిక విన్యాసాలను పాకిస్తాన్ - రష్యా నిర్వహించాయి. రష్యాలోని మిన్రాల్నే వోడిలో ఈ సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయి. రక్షణ రంగంలో సత్సంబంధాల కోసం రెండు దేశాలు వీటిని చేపట్టాయి.
- సమాధానం: 2
13. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC) అథ్లెట్స్ ఫోరమ్‌లో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (AIBA) ప్రతినిధిగా ఎంపికై న తొలి మహిళా బాక్సర్ ఎవరు ?
1) పింకీ రాణి
2) సరితా దేవి
3) సర్జుబాలా దేవి
4) మేరీ కోమ్
1) పింకీ రాణి
2) సరితా దేవి
3) సర్జుబాలా దేవి
4) మేరీ కోమ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐదుసార్లు ప్రపంచ మహిళా చాంపియన్ అయిన భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అథ్లెట్స్ ఫోరమ్‌లో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రతినిధిగా పాల్గొననుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ గా గుర్తింపు పొందింది. మేరీ కోమ్ 2016లో ఐబా లెజెండ్స అవార్డు అందుకుంది. ఆమె ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.
- సమాధానం: 4
14. UNHCR ప్రదానం చేసే ప్రతిష్టాత్మక నన్సెన్ రెఫ్యూజీ అవార్డు - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) జిన్నా ముస్తఫా
2) కై లాశ్ సత్యార్థి
3) బాన్ కీ మూన్
4) కాన్ స్టాంటినోస్ మిట్రాగాస్
1) జిన్నా ముస్తఫా
2) కై లాశ్ సత్యార్థి
3) బాన్ కీ మూన్
4) కాన్ స్టాంటినోస్ మిట్రాగాస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: నైజీరియాకు చెందిన సామాజిక వేత్త జిన్నా ముస్తఫా యూఎన్‌హెచ్‌సీఆర్ నుంచి నన్సెన్ రెఫ్యూజీ అవార్డు - 2017కు ఎంపికయ్యారు. బోకోహారం బాధితులను చైతన్య పరచడం, బాలల హక్కుల సంరక్షణ కోసం చేసిన కృషికిగాను ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. చిన్నారులను, ముఖ్యంగా బాలికలను మానవ బాంబులుగా ఉపయోగించి విధ్వంసం సృష్టించే నైజీరీయా తీవ్రవాద సంస్థే బోకో హారం.
శరణార్థులు, నిర్వాసితుల సహాయం కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు యూఎన్ హేచ్సీఆర్ 1954 నుంచి ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. నార్వేకు చెందిన నోబెల్ శాంతి బహుమతి విజేత ఫ్రిడోఫ్ నన్సెన్ పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
15. ఆస్కార్ - 2017 అవార్డుల కోసం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి ఎంపికై న చిత్రం ఏది ?
1) కసావ్
2) దంగల్
3) న్యూటన్
4) బాహుబలి - 2
1) కసావ్
2) దంగల్
3) న్యూటన్
4) బాహుబలి - 2
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి న్యూటన్ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఫిలిం ఫేడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న తెలుగు నిర్మాత సీవీ రెడ్డి నేతృత్వంలోని కమిటీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసేంది. రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల దాడుల బెదిరింపులకు బెదరకుండా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించిన ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కథే న్యూటన్ చిత్రం.
- సమాధానం: 3
16. భారత నౌకదళంలో ఇటీవల చేరిన వాటర్ జెట్ ఫాస్ట్ ఎటాక్ క్రాఫ్ట్ సిరీస్‌లోని యుద్ధ నౌక ఏది ?
1) INS Chennai
2) INS Trishul
3) INS Tarasa
4) INS Vikramaditya
1) INS Chennai
2) INS Trishul
3) INS Tarasa
4) INS Vikramaditya
- View Answer
- సమాధానం: 3
వివరణ: INS Tarasa వాటర్ జెట్ ఫాస్ట్ ఎటాక్ క్రాఫ్ట్ సిరీస్‌లోని నాలుగో యుద్ధ నౌక. దీన్నే టీ 94 అని కూడా అంటారు. ఈ యుద్ధ నౌక ఇటీవలే భారత నౌకదళంలో చేరింది. పశ్చిమ బెంగాల్‌లోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మించింది.
- సమాధానం: 3
17. దేశంలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు తీసుకొచ్చిన పోర్టల్ ఏది ?
1) PENCIL
2) No Child Labour
3) NCLP
4) Child Labour free
1) PENCIL
2) No Child Labour
3) NCLP
4) Child Labour free
- View Answer
- సమాధానం: 1
వివరణ: బాల కార్మిక వ్యవస్థను దేశంలో పూర్తిగా నిర్మూలించేందుకు PENCIL( Platform for Effective enforcement for no child labour) అనే పోర్టల్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. చైల్డ్ ట్రాకింగ్, ఫిర్యాదు విభాగం, జిల్లా యంత్రాంగం సమన్వయం, తదితర వ్యవస్థలు ఇందులో ఉంటాయి.
- సమాధానం: 1
18. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 23
2) సెప్టెంబర్ 25
3) సెప్టెంబర్ 27
4) సెప్టెంబర్ 29
1) సెప్టెంబర్ 23
2) సెప్టెంబర్ 25
3) సెప్టెంబర్ 27
4) సెప్టెంబర్ 29
- View Answer
- సమాధానం: 3
వివరణ: అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాముఖ్యతపై అవగాహన పెంచేందుకు ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ టూరిజం అవార్డులను ప్రదానం చేశారు. ఇన్ క్రెడిబుల్ 2.0 క్యాంపెయిన్ ను ప్రారంభించారు.
- సమాధానం: 3
19. దేశంలోని ఏ పోర్టుకి ఇటీవల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పేరు పెట్టారు ?
1) కండ్లా పోర్ట్ ట్రస్ట్
2) ముంబై పోర్ట్ ట్రస్ట్
3) చెన్నై పోర్ట్ ట్రస్ట్
4) కోచి పోర్ట్ ట్రస్ట్
1) కండ్లా పోర్ట్ ట్రస్ట్
2) ముంబై పోర్ట్ ట్రస్ట్
3) చెన్నై పోర్ట్ ట్రస్ట్
4) కోచి పోర్ట్ ట్రస్ట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 ప్రారంభంలో గుజరాత్‌లోని కండ్లా పోర్ట్‌లో 933 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ పోర్ట్‌కి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పేరు పెట్టాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 ప్రకారం ఉన్న అధికారాల మేరకు షిప్పింగ్ మంత్రిత్వశాఖ కండ్లా పోర్ట్ ట్రస్ట్ పేరుని పండిట్ ఉపాధ్యాయ పోర్ట్ ట్రస్ట్‌గా మార్చింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పోర్ట్‌కు ఆయన పేరు పెట్టారు. కండ్లా పోర్ట్ సరకు నిర్వహణ పరంగా దేశంలోనే అతిపెద్దది.
- సమాధానం: 1
20. ప్రపంచ పోటీతత్వ సూచీ (గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్) - 2017 - 18లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) 39
2) 40
3) 50
4) 60
1) 39
2) 40
3) 50
4) 60
- View Answer
- సమాధానం: 2
వివరణ: Global Competetive indexను ప్రపంచ ఆర్థిక ఫోరమ్ విడుదల చేస్తుంది. 2017-18 సంవత్సరానికి గాను విడుదల చేసిన 137 దేశాలతో కూడిన ర్యాంకింగ్‌సలో భారత్ 40వ స్థానంలో నిలిచింది. 2016-17లో భారత్ 39వ స్థానంలో ఉంది. తాజా నివేదికలో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో, అమెరికా రెండో స్థానంలో, సింగపూర్ మూడో స్థానంలో ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక సేవలు, ఆర్థిక రంగంలో దేశాల పురోగతిని పరిగణలోకి తీసుకొని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఈ ర్యాంకింగ్స ను ఇస్తుంది.
- సమాధానం: 2
21. భారత్ ఏ దేశానికి పోలీస్ శిక్షణలో సాంకేతిక సహాయం అందించనుంది ?
1) బంగ్లాదేశ్
2) భూటాన్
3) మయన్మార్
4) ఆఫ్గనిస్తాన్
1) బంగ్లాదేశ్
2) భూటాన్
3) మయన్మార్
4) ఆఫ్గనిస్తాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పోలీస్ శిక్షణలో సాంకేతిక సహాయం కోసం భారత్-ఆఫ్గనిస్తాన్ మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. అవసరమైతే మరో 5 ఏళ్ల పాటు దీన్ని పొడగించవచ్చు. ఇందులో భాగంగా ఆఫ్గనిస్తాన్ జాతీయ పోలీస్ అభివృద్ధి, సాంకేతిక వ్యవస్థలను సమకూర్చుకోవడంలో భారత్ సహాయం చేస్తుంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భారత్ - ఆఫ్గనిస్తాన్ 2011లోనే ఒప్పందం చేసుకున్నాయి.
- సమాధానం: 4
22. దేశంలో అంతర్గత భద్రతను మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని కోట్ల రూపాయలతో పోలీస్ మోడర్నైజేషన్ పథకానికి ఆమోదం తెలిపింది ?
1) రూ.25 వేల కోట్లు
2) రూ.20 వేల కోట్లు
3) రూ.15 వేల కోట్లు
4) రూ.30 వేల కోట్లు
1) రూ.25 వేల కోట్లు
2) రూ.20 వేల కోట్లు
3) రూ.15 వేల కోట్లు
4) రూ.30 వేల కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో శాంతిభద్రతల వ్యవస్థను మెరుగు పరిచేందుకు, పోలీసు బలగాలను ఆధునీకరించేందుకు, ఉగ్రవాదంపై సమర్థంగా పోరాటానికి ఉద్దేశించిన భారీ అంతర్గత పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ (MPF) పేరిట 2017 నుంచి 2020 వరకు మూడేళ్ల పాటు 25 వేల కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించారు. పథకంలో కేంద్రం వాటా 18వేల 636 కోట్లు కాగా రాష్ట్రాల వాటా 6 వేల 424 కోట్లుగా ఉంటుంది. ఎంపీఎఫ్ పథకంలో భాగంగా జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో 10,132 కోట్లు వెచ్చిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధునాతనమైన ఫోరెన్సిక్ సైన్స లేబోరేటరీని ఏర్పాటు చేస్తారు.
- సమాధానం: 1
23. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA)కి ఎవరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు ?
1) రాష్ట్రపతి
2) ఉపరాష్ట్రపతి
3) ప్రధానమంత్రి
4) లోక్‌సభ స్పీకర్
1) రాష్ట్రపతి
2) ఉపరాష్ట్రపతి
3) ప్రధానమంత్రి
4) లోక్‌సభ స్పీకర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ప్రకృతి, మానవ విధ్వంసాల సమయంలో సహాయ కార్యక్రమాలకు ఈ సంస్థ సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ద్వారా 2005లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల ఎన్డీఎమ్ఏ 13వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సెప్టెంబర్ 28న న్యూఢిల్లీలో నిర్వహించారు.
- సమాధానం: 3
24. ఆసియా అభివృద్ధి బ్యాంకు - ADB 2018 నుంచి 2022 వరకు భారత్ కు ఇచ్చే వార్షిక రుణాన్ని ఎంతకు పెంచింది ?
1) 2.6 బిలియన్ డాలర్లు
2) 3 బిలియన్ డాలర్లు
3) 4 బిలియన్ డాలర్లు
4) 5 బిలియన్ డాలర్లు
1) 2.6 బిలియన్ డాలర్లు
2) 3 బిలియన్ డాలర్లు
3) 4 బిలియన్ డాలర్లు
4) 5 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్ లో ఆర్థికాభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏటా ఇచ్చే వార్షిక రుణాన్ని 4 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించింది. 2018 నుంచి 2022 వరకు ఏటా 4 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించనుంది. 2012 - 2016 మధ్య ఏడీబీ భారత్‌కు ఏటా సగటున 2.6 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. భారత్ లో ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, సేవల రంగం విస్తృతి, వాతావరణ మార్పుల కోసం ఏడీబీ ఈ రుణాన్ని ఇస్తుంది. ఆసియాలో సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకును 1966 డిసెంబర్ 19న ఏర్పాటు చేశారు. దీని కేంద్ర కార్యాలయం ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఉంది.
- సమాధానం: 3
25. విశ్వంలో జనించి కోట్లాది కాంతి సంవత్సరాలు ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాలను ఎన్నోసారి గుర్తించినట్లు ఇటీవల శాస్త్రవేత్తలు ప్రకటించారు ?
1) మొదటిసారి
2) రెండోసారి
3) మూడోసారి
4) నాలుగోసారి
1) మొదటిసారి
2) రెండోసారి
3) మూడోసారి
4) నాలుగోసారి
- View Answer
- సమాధానం: 4
వివరణ: విశ్వంలో గురుత్వాకర్షణ తరంగాలను నాలుగోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణబిలాలు ఢీకొన్న సమయంలో శక్తివంతమైన తరంగాలు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ తరంగాలను అమెరికాలోని వాషింగ్టన్, లూసియానాల్లోని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషన్ అబ్జర్వేటరీ (లిగో), యూరప్‌లోని విర్గో అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు తొలిసారి సంయుక్తంగా గుర్తించినట్లు ప్రకటించారు. ఈ తరంగాలను 2015లో తొలిసారి, అదే ఏడాది డిసెంబర్లో రెండోసారి, 2017 జనవరిలో మూడోసారి, 2017 సెప్టెంబర్‌లో నాలుగోసారి గుర్తించారు.
- సమాధానం: 4
26. ప్రపంచ మేరిటైమ్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 23
2) సెప్టెంబర్ 25
3) సెప్టెంబర్ 27
4) సెప్టెంబర్ 29
1) సెప్టెంబర్ 23
2) సెప్టెంబర్ 25
3) సెప్టెంబర్ 27
4) సెప్టెంబర్ 29
- View Answer
- సమాధానం: 4
వివరణ: సముద్ర ప్రయాణం, సరకు రవాణాలో భద్రత, సముద్ర పర్యావరణం, సముద్ర రంగంలో అభివృద్ధిపై అవగాహన పెంచేందుకు ఏటా సెప్టంబర్ 29న ప్రపంచ మేరిటైమ్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1978 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 4
27. అంతర్జాలంలో అసభ్యకర భాషకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు ?
1) టీకే విశ్వనాథన్
2) జస్టిస్ శ్రీకృష్ణ
3) జస్టిస్ శ్రీ కే పవన్
4) ఆమోల్ రవీంద్ర
1) టీకే విశ్వనాథన్
2) జస్టిస్ శ్రీకృష్ణ
3) జస్టిస్ శ్రీ కే పవన్
4) ఆమోల్ రవీంద్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాలంలో అసభ్యకర భాష అంశం సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. ఇందుకు సంబంధించి ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66Aను సుప్రీంకోర్టు... శ్రేయా సింఘాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య 2000 నాటి కేసులో రద్దు చేసింది. కంప్యూటర్ లేదా ఇతర సమాచార వ్యాప్తి పరికరాల ద్వారా అసభ్య సందేశాలను పంపే వారిని శిక్షించేందుకు ఉద్దేశించిన నిబంధన ఇది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై న్యాయమంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి టీకే విశ్వనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల తమ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ తరహా ఫిర్యాదులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో సైబర్ క్రై మ్ కో ఆర్డినేటర్స్, ప్రతి జిల్లాల్లో సైబర్ క్రై మ్ సెల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
- సమాధానం: 1
28. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు 10 వేల ఎలక్టిక్ ్రవాహనాల సరఫరా కాంట్రాక్ట్‌ని ఏ సంస్థ దక్కించుకుంది ?
1) మహీంద్రా అండ్ మహీంద్రా
2) నిస్సాన్
3) టాటా
4) అశోక్ లేలాండ్
1) మహీంద్రా అండ్ మహీంద్రా
2) నిస్సాన్
3) టాటా
4) అశోక్ లేలాండ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అంతర్జాతీయ కాంపెటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఈఈఎస్ఎల్ ఈ కాంట్రాక్ట్‌ను టాటా సంస్థకు అప్పగించింది. దీని విలువ రూ.10.16 లక్షల కోట్లు. కాంట్రాక్ట్ లో భాగంగా 2017 నవంబర్‌లో టాటా సంస్థ తొలుత 500 ఎలక్టిక్ర్కార్లను సరఫరా చేస్తుంది. మిగిలిన 9,500 వాహనాలను దశలవారీగా అందిస్తుంది. 2030 నాటికి దేశంలో కర్బన ఉద్గారాల విడుదలను 37 శాతం తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థలో ఈ ఎలక్టిక్ర్ వాహనాలను ప్రవేశపెడుతుంది.
- సమాధానం: 3
29. తమిళనాడు గవర్నర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ప్రొఫెసర్ జగదీశ్ ముఖీ
2) సత్యపాల్ మాలిక్
3) విద్యాసాగర్ రావు
4) బన్వరిలాల్ పురోహిత్
1) ప్రొఫెసర్ జగదీశ్ ముఖీ
2) సత్యపాల్ మాలిక్
3) విద్యాసాగర్ రావు
4) బన్వరిలాల్ పురోహిత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించారు. తమిళనాడు గవర్నర్ గా బన్వరిలాల్ పురోహిత్, బిహార్‌కు సత్య పాల్ మాలిక్, అరుణాచల్ ప్రదేశ్‌కి బీడీ మిశ్రా, అస్సాంకు ప్రొ. జగదీశ్ ముఖీ గవర్నర్లుగా నియమితులయ్యారు. అండమాన్ అండ్ నికోబార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ గా దేవేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు.
- సమాధానం: 4
30. ఇటీవల ఖోరం షాహ్ర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది ?
1) ఇరాక్
2) ఇరాన్
3) ఇండియా
4) ఉత్తర కొరియా
1) ఇరాక్
2) ఇరాన్
3) ఇండియా
4) ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇరాన్ సెప్టెంబర్ 23న మధ్య శ్రేణి ఖోరం షాహ్ర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది 2 వేల కిలోమీటర్ల దూరంలోపు ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. బహుళ సంఖ్యలో వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ఇరాన్ శత్రుదేశాలైన ఇరాక్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా,గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. 2015 అణు పరీక్షల నిషేధ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ జరిపిన పరీక్షపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.
- సమాధానం: 2
31. పాకిస్తాన్ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన యాంటి - షిప్ క్షిపణిని ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు ?
1) నౌకలు
2) యుద్ధ ట్యాంకులు
3) యుద్ధ విమానాలు
4) హెలికాప్టర్లు
1) నౌకలు
2) యుద్ధ ట్యాంకులు
3) యుద్ధ విమానాలు
4) హెలికాప్టర్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: గగనతలం నుంచి సముద్ర ఉపరితలంపైకి ప్రయోగించే యాంటి - షిప్ క్షిపణిని పాకిస్తాన్ నౌకదళం విజయవంతంగా పరీక్షించింది. దీని కోసం సీ కింగ్ హెలికాప్టర్లను వినియోగించింది.
- సమాధానం: 4
32. కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఇటీవల ఏ క్రీడాకారిణి పేరుని భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ కోసం ప్రతిపాదించింది ?
1) సైనా నెహ్వాల్
2) పీవీ సింధు
3) హర్మన్ ప్రీత్ కౌర్
4) మిథాలీరాజ్
1) సైనా నెహ్వాల్
2) పీవీ సింధు
3) హర్మన్ ప్రీత్ కౌర్
4) మిథాలీరాజ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరుని క్రీడా మంత్రిత్వశాఖ పద్మభూషణ్ కోసం ప్రతిపాదించింది. 2015లోనే సింధు పద్మశ్రీ పురస్కారం అందుకుంది. సింధు ఇటీవల కొరియా ఓపన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకుంది.
- సమాధానం: 2
33. జపాన్ ఓపన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుపొందారు ?
1) కరోలినా మరిన్
2) పీవీ సింధు
3) నోజోమి ఓకుహారా
4) సైనా నెహ్వాల్
1) కరోలినా మరిన్
2) పీవీ సింధు
3) నోజోమి ఓకుహారా
4) సైనా నెహ్వాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జపాన్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మరిన్ గెలుచుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన హే బింగ్ జియావోను ఓడించి టైటిల్ సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్ ను లీ చోంగ్ వీని ఓడించి అక్సెల్ సన్ గెలుచుకున్నాడు.
- సమాధానం: 1
34. ఆసియా ఇండోర్ క్రీడల్లో బిలియర్డ్స్‌లో స్వర్ణం సాధించిన ప్లేయర్ ఎవరు ?
1) చైతన్యాసకున్
2) సౌరవ్ కొఠారి
3) పంకజ్ అద్వానీ
4) అశోక్ శాండిల్యా
1) చైతన్యాసకున్
2) సౌరవ్ కొఠారి
3) పంకజ్ అద్వానీ
4) అశోక్ శాండిల్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత బిలియర్డ్స్ ప్లేయర్ సౌరవ్ కొఠారి ప్రపంచ మాజీ చాంపియన్ చైతన్యా సకున్ ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రీడల్లో క్యూ స్పోర్ట్స విభాగంలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం.
- సమాధానం: 2
35. స్వీడన్ ఏటా అందించే ప్రతిష్టాత్మక అవార్డు రైట్ లైవ్లీ హుడ్ కు ఎంపికై న భారత్ కు చెందిన ప్రముఖ న్యాయవాది ఎవరు ?
1) కోలిన్ గొన్జాల్వేస్
2) రామ్ జెఠ్మాలనీ
3) నారీమన్
4) అరుణ్ జైట్లీ
1) కోలిన్ గొన్జాల్వేస్
2) రామ్ జెఠ్మాలనీ
3) నారీమన్
4) అరుణ్ జైట్లీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కోలిన్ గొన్జాల్వేస్ స్వీడన్ దేశం అందించే ప్రతిష్టాత్మక రైట్ లైవ్లీ హుడ్ అవార్డుకు ఎంపికయ్యారు. గొన్జాల్వేస్ మానవ హక్కుల రక్షణ కోసం ఎంతో పాటుపడ్డారు. ఈ క్రమంలో హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్ అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. గొన్జాల్వేస్తోపాటు అజెర్ బైజాన్ కు చెందిన ఖదిజా ఇస్మాయెలోవా, అమెరికాకు చెందిన రాబర్ట్ బిలోట్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
- సమాధానం: 1
36. Hit Refresh పుస్తక రచయిత ఎవరు ?
1) మార్క్ జుకెర్ బర్గ్
2) అరుంధతి భట్టాచార్య
3) సత్య నాదెళ్ల
4) సుందర్ పిచాయ్
1) మార్క్ జుకెర్ బర్గ్
2) అరుంధతి భట్టాచార్య
3) సత్య నాదెళ్ల
4) సుందర్ పిచాయ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: హిట్ రిఫ్రెష్ పేరుతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల రచించిన పుస్తకాన్ని అమెరికాలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ - 2017 సదస్సులో ఆవిష్కరించారు.
- సమాధానం: 3
37. దేశీయ దిగ్గజ ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి సంస్థ - ఓన్జీసీ చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) శశి శంకర్
2) దినేశ్ కే ష్రాఫ్
3) అరవింద్ సుబ్రహ్మణ్యం
4) శశికాంత్ శర్మ
1) శశి శంకర్
2) దినేశ్ కే ష్రాఫ్
3) అరవింద్ సుబ్రహ్మణ్యం
4) శశికాంత్ శర్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఓన్జీసీ చైర్మన్‌గా దినేశ్ కె ష్రాఫ్ స్థానంలో శశి శంకర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో 2021 వరకు కొనసాగుతారు.
- సమాధానం: 1
38. హెచ్‌టీసీ స్మార్ట్ ఫోన్ వ్యాపారంలో కొంత భాగాన్ని ఏ సంస్థ కొనుగోలు చేయనుంది ?
1) సామ్ సంగ్
2) ఆపిల్
3) షియోమీ
4) గూగుల్
1) సామ్ సంగ్
2) ఆపిల్
3) షియోమీ
4) గూగుల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: తైవాన్‌కు చెందిన హ్యాండ్ సెట్స్ తయారీ సంస్థ హెచ్‌టీసీ తమ స్మార్ట్ ఫోన్ వ్యాపారంలో కొంత భాగాన్ని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కి విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 1.1 బిలియన్ డాలర్లు. 2018 తొలి నాళ్లలో ఈ డీల్ పూర్తవుతుంది.
- సమాధానం: 4
39. ఇటీవల ఏ దేశ పార్లమెంట్‌ను ఆకస్మికంగా రద్దు చేశారు ?
1) జపాన్
2) ఇరాన్
3) ఉత్తర కొరియా
4) ఇజ్రాయెల్
1) జపాన్
2) ఇరాన్
3) ఉత్తర కొరియా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జపాన్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ ప్రధాని షింజో అబే సెప్టెంబర్ 28న ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణం, కొత్త పన్ను విధానం అమలు నేపథ్యంలో పార్లమెంట్‌పై పూర్తి పట్టుకోసం షింజో అబే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. జపాన్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
- సమాధానం: 1
40. మహిళలను డ్రైవింగ్‌కు అనుమతిస్త్తూ ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?
1) పాకిస్తాన్
2) సౌదీ అరేబియా
3) ఇరాన్
4) సిరియా
1) పాకిస్తాన్
2) సౌదీ అరేబియా
3) ఇరాన్
4) సిరియా
- View Answer
- సమాధానం: 2
వివరణ: సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ దేశ రాచ కుటుంబం నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు 2018 జూన్ నుంచి అమల్లోకి వస్తాయి. డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేత కోసం సౌదీలో మహిళలు, హక్కుల కార్యకర్తలు దశాబ్దాల పాటు ఉద్యమించారు.
- సమాధానం: 2
41. బీబీసీ టాప్ - 100 ప్రభావితమైన మహిళల జాబితాలో చోటు సంపాదించిన భారత మహిళ ఎవరు ?
1) మిథాలీ రాజ్
2) హర్మన్ ప్రీత్ కౌర్
3) కంగనా రనౌత్
4) సోనియా గాంధీ
1) మిథాలీ రాజ్
2) హర్మన్ ప్రీత్ కౌర్
3) కంగనా రనౌత్
4) సోనియా గాంధీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: బీబీసీ టాప్ - 100 ప్రభావితమైన మహిళల జాబితాలో ఏడుగురు భారతీయ మహిళల స్థానం సంపాదించారు. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, యోగా గురువు ఐరా త్రివేదీ, తీహార్ జైళ్లో పిల్లలకు పాఠాలు బోధిస్తున్న తులికా కిరణ్, ఎంబైబ్ సంస్థ సీఈవో అదితి అవస్థి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి మెహ్రూన్నీసా సిద్ధిఖీ, మహిళా ఉద్యమకారిణి ఊర్వసి సాహ్నీ, బిజినెస్ ఎనలిస్ట్ నిత్యా తుమ్మలచెట్టి ఈ జాబితాలో చోటు సంపాదించారు.
- సమాధానం: 1
42. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలో అత్యధిక పారితోషకం పొందుతున్న టీవీ నటుల జాబితాలో చోటు సంపాదించిన భారతీయ నటి ఎవరు ?
1) కత్రినా కై ఫ్
2) దీపికా పడుకోన్
3) ప్రియాంకా చోప్రా
4) ఐశ్వర్యా రాయ్
1) కత్రినా కై ఫ్
2) దీపికా పడుకోన్
3) ప్రియాంకా చోప్రా
4) ఐశ్వర్యా రాయ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ నివేదికలో ప్రియాంకా చోప్రా 8వ స్థానంలో నిలిచారు. క్వాంటికో టీవీ షోకుగాను రూ.65.52 కోట్ల పారితోషకంతో టాప్ 10లో స్థానం పొందారు. ఈ జాబితాలో కొలంబియా నటి సోఫియా వెర్గరా తొలి స్థానంలో, కేలీ కుకో రెండో స్థానంలో, ఎలెన్ పోంపియో మూడో స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 3
43. ఏ దేశం ఎవరెస్ట్ ఎత్తుని మళ్లీ లెక్కించనున్నట్లు ప్రకటించింది ?
1) భారత్
2) చైనా
3) మయన్మార్
4) నేపాల్
1) భారత్
2) చైనా
3) మయన్మార్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచంలో ఎత్రైన శిఖరం ఎవరెస్ట్‌ను తిరిగి లెక్కిస్తామని నేపాల్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2015లో హిమాలయాల్లో సంభవించిన భూకంపంతో ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా భారత సర్వే విభాగం 1955లో ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లుగా నిర్ధారించింది.
- సమాధానం: 4
44. ఫార్చ్యూన్ సంస్థ ఇటీవల విడుదల చేసిన అమెరికా వెలుపల అత్యంత శకిమంతమైన మహిళల జాబితాలో స్థానం పొందిన మహిళా వ్యాపారవేత్తలు ఎవరు ?
1) చందా కొచ్చర్
2) అరుంధతీ భట్టాచార్య
3) అర్చనా హింగోరాణి
4) ఇంద్రా నూయీ
1) చందా కొచ్చర్
2) అరుంధతీ భట్టాచార్య
3) అర్చనా హింగోరాణి
4) ఇంద్రా నూయీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫార్చ్యూన్ విడుదల చేసిన అమెరికా వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారత్‌కు చెందిన చందా కొచ్చర్, శిఖా శర్మ స్థానం సంపాదించారు. చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ కాగా శిఖా శర్మ యాక్సిస్ బ్యాంకు ఎండీ, సీఈవో. బాన్కో శాంటాన్డర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బొటిన్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. అమెరికాలో శక్తిమంతమైన మహిళల పేరుతో విడుదల చేసిన మరో జాబితాలో పెప్సీకో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ రెండో స్థానంలో నిలిచారు. జనరల్ మోటార్స్ చైర్మన్, సీఈవో మేరి బర్రా తొలి స్థానంలో ఉన్నారు.
- సమాధానం: 1
45. న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్‌ను టైస్తాన్గా సంభోదించిన భారత ప్రతినిధి ఈనాం గంభీర్ ఏ పదవిలో ఉన్నారు ?
1) విదేశాంగ కార్యదర్శి
2) యూఎస్‌లో భారత అంబాసిడర్
3) ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి
4) ఎన్ఐఏ అధికారి
1) విదేశాంగ కార్యదర్శి
2) యూఎస్‌లో భారత అంబాసిడర్
3) ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి
4) ఎన్ఐఏ అధికారి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈనాం గంభీర్ ఐరాసలో భారత శాశ్వత బృందం తొలి కార్యదర్శి. 2005 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం యూఎన్‌లో భారత భద్రత కౌన్సిల్ సంస్కరణలు, కౌంటర్ టైజం, సైబర్ సెక్యురిటీ ఇష్యూస్ అంశాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ఈనాం గంభీర్ పాకిస్తాన్‌ను టైస్తాన్ అని సంబోధించారు.
- సమాధానం: 3
46. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో ఎన్నో స్థానంలో ఉంది ?
1) 1వ స్థానం
2) 5వ స్థానం
3) 7వ స్థానం
4) 9వ స్థానం
1) 1వ స్థానం
2) 5వ స్థానం
3) 7వ స్థానం
4) 9వ స్థానం
- View Answer
- సమాధానం: 4
వివరణ: తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఉందని కలెక్టర్ల సదస్సులో ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1,55,000 రూపాయలుగా పేర్కొంది.
- సమాధానం: 4
47. తెలుగు బిగ్ బాస్ సీజన్ - 1 విజేతగా ఎవరు నిలిచారు ?
1) శివబాలాజీ
2) నవదీప్
3) హరితేజ
4) ఆదర్శ్
1) శివబాలాజీ
2) నవదీప్
3) హరితేజ
4) ఆదర్శ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలుగు బిగ్ బాస్ సీజన్ - 1లో నటుడు శివబాలాజీ 3.37 కోట్ల ఓట్లతో విజేతగా నిలిచాడు. నటుడు ఆదర్శ్ రన్నరప్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన శివబాలాజీ రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ - 1కి ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు.
- సమాధానం: 1
48. ప్రైవేటు భాగస్వామ్యంతో చేపలు, సముద్ర ఉత్పత్తుల యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?
1) తమిళనాడు
2) పశ్చిమ బెంగాల్
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
1) తమిళనాడు
2) పశ్చిమ బెంగాల్
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లో చేపలు, సముద్ర ఉత్పత్తుల యూనివర్సిటీని ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భీమవరం, అమలాపురంలలో 200 ఎకరాల్లో ఈ వర్సీటిని నెలకొల్పుతారు. ఇందులో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు 51 శాతం కాగా ప్రభుత్వం 49 శాతం గ్రాంటుగా ఇస్తుంది.
- సమాధానం: 3
49. తెలంగాణలో ఆయుష్ ఆస్పత్రిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1) అనంతగిరి
2) భద్రాచలం
3) ములుగు
4) కాళేశ్వరం
1) అనంతగిరి
2) భద్రాచలం
3) ములుగు
4) కాళేశ్వరం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఔషధ మొక్కలకు నిలయమైన అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వికారాబాద్‌కు సమీపంలో ఉంది. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 6 కోట్లు మంజూరు చేసింది.
- సమాధానం: 1
50. రైళ్ల ప్రయాణంలో భద్రత కోసం ఏ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది ?
1) సర్వే ఆఫ్ ఇండియా
2) ఇస్రో
3) డీఆర్డీవో
4) బీహెచ్ఈఎల్
1) సర్వే ఆఫ్ ఇండియా
2) ఇస్రో
3) డీఆర్డీవో
4) బీహెచ్ఈఎల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రైళ్ల ప్రయణాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు డివైజ్ సేఫ్టీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. ఇందుకోసం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)తో కలిసి పనిచేయనున్నట్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రైల్ నెట్ వర్క్‌ను ప్రమాదరహితంగా మార్చేందుకు స్పేస్ టెక్నాలజీని వాడుకుంటామని తెలిపారు.
- సమాధానం: 2
No comments:
Post a Comment