AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 18 February 2018

ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2017 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2017 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఆర్థిక వ్యవహారాలు జనవరి 2017 ఎకానమీ
2016-17 భారత వృద్ధిరేటు 6.8 శాతం: ఫిక్కీ
2016-17లో భారత్ ఆర్థిక వృద్ధి 6.8 శాతంగా నమోదవుతుందని పారిశ్రామిక మండలి (FICCI) ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. 2016 డిసెంబర్- 2017 జనవరి మధ్య కాలంలో వివిధ రంగాల నిపుణుల అంచనాలతో ఫిక్కీ ఈ నివేదిక రూపొందించింది. 
అధ్యయనంలోని ముఖ్యాంశాలు2016-17 ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.1 శాతంగా నమోదవుతుందని కేంద్రం పేర్కొనగా ఫిక్కీ మాత్రం 6.8 శాతంగానే అంచనా వేసింది.2016-17లో వ్యవసాయ రంగం కొంత మెరుగ్గా ఉండే అవకాశం. సేవలు, పారిశ్రామిక రంగాల వృద్ధి 8.5 శాతం, 5.7 శాతంగా నమోదయ్యే అవకాశం.


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభం 
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB ప్రయోగాత్మక సేవలు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్, జార్ఖండ్ రాజధాని రాంచీలో జనవరి 30న తపాలా శాఖ ఈ సేవలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి IPPB సిద్ధిపేటలో ప్రారంభం కానుంది. ఈ బ్యాంకు రూ. 25 వేల లోపు డిపాజిట్లపై 4.5 శాతం, రూ.25 వేల-రూ.50 వేల మధ్య డిపాజిట్లపై 5 శాతం, రూ.50 నుంచి లక్ష లోపు డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ ఇవ్వనుంది. 

2016-17 కేంద్ర ఆర్థిక సర్వే
2016-17 ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైందని పేర్కొన్న ఆయన జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 0.3 శాతంగా ఉంటుందని చెప్పారు.
నోట్ల రద్దు కారణంగా ఆర్థిక ప్రగతి 0.25 నుంచి 0.5 శాతం మేర తగ్గిందని సర్వే పేర్కొంది. పెద్దనోట్ల రద్దు వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయని సర్వే తేల్చింది.
సర్వేలోని ముఖ్యాంశాలు

2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా.2016-17 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి 4.1 శాతం. 2015-16 కన్నా ఇది 1.2 శాతం ఎక్కువ.2016-17లో 7.4 శాతం నుంచి 5.2 శాతానికి మందగించిన పారిశ్రామిక ఉత్పత్తి.2016-17లో సేవల రంగం వృద్ధి 8.8 శాతందేశీయ వ్యవస్థలో నల్లధనం రూ. 3 లక్షల కోట్ల నుంచి రూ. 7.3 లక్షల కోట్లుగా అంచనా.రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచననల్లధనం స్వచ్ఛంద వెల్లడికి ఉద్దేశించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(PMGKY) ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అంచనా.జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి తగినంతగా లేకపోవడమే కాకుండా కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరం.బ్యాంకింగ్‌లో మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ రంగంలోనే ఒక అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ రీహెబిలిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచన.


సార్వత్రిక కనీస ఆదాయం
దేశంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సార్వత్రిక కనీస ఆదాయం-UBI అనే కొత్త ఆలోచనను ఆర్థిక సర్వే పేర్కొన్నారు. నగదు బదిలీ ద్వారా పేదలకు కనీస ఆదాయం తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవడమే యూబీఐ లక్ష్యం. ఈ విధానం ప్రకారం ప్రస్తుతం వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న రాయితీలను పూర్తిగా రద్దు చేసి వాటిని బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా ప్రజలకు అందిస్తారు. 
యూబీఐ లక్ష్యాలు, ప్రయోజనాలు

ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం సార్వత్రిక కనీస ఆదాయం-UBI పథకం దేశంలో పేదరికాన్ని 0.5 శాతం మేర తగ్గిస్తుంది.పథకం అమలుకి అయ్యే వ్యయం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 4 నుంచి 5 శాతం.ఆహారం, పెట్రోలియం, ఎరువులు తదితర అంశాల్లో ప్రస్తుతం మధ్య తరగితికి ఇస్తున్న రాయితీల విలువ జీడీపీలో 3 శాతం.టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం 1947లో దేశ జనాభాలో 70 శాతం పేదరికం ఉంటే, 2011-12 నాటికి 22 శాతానికి తగ్గింది.ఇప్పటికే ఫిన్లాండ్ దేశంలో పైలట్ ప్రాతిపదికన ఈ తరహా పథకం అమలవుతోంది.


స్వచ్ఛ ధన్ అభియాన్ ప్రారంభం 
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన అనుమానాస్పద డిపాజిట్లను గుర్తించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు జనవరి 31న ఐటీ శాఖ స్వచ్ఛ ధన్ అభియాన్ ప్రాజెక్టును మొదలుపెట్టింది. దీని ప్రకారం రూ. 5 లక్షలకు మించి అనుమానాస్పద డిపాజిట్లు చేసిన 18 లక్షల మందిని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఆదాయ వివరాలతో కూడిన వివరణలు కోరుతూ వారందరికీ ఈ మెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు పంపనున్నారు.

పంట రుణాలపై రూ.660 కోట్ల వడ్డీ మాఫీ 
సహకార బ్యాంకుల నుంచి 2016, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలపై 2016, నవంబర్, డిసెంబర్‌లకు కేంద్రం రూ.660.50 కోట్ల వడ్డీని మాఫీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జనవరి 24న జరిగిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్, డిసెంబర్‌లకు సంబంధించి వడ్డీని చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు 
ప్రభుత్వ నేతలు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులతో కూడిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 47వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 17-20 వరకు జరిగింది. దీన్ని ‘బాధ్యతాయుత-సత్వరం స్పందించే నాయకత్వం’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగో పారిశ్రామిక విప్లవానికి సన్నద్ధం అయ్యేందుకు వీలుగా సరికొత్త నాయకత్వ నమూనా, పెట్టుబడిదారీ విధానంలో సంస్కరణలు లాంటి అంశాలపై 400కు పైగా చర్చా కార్యక్రమాలు జరిగాయి. వీటిలో సామాజిక సమ్మిళితం, మానవాభివృద్ధికి వ్యూహాలు లాంటివి చర్చకు వచ్చాయి. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ శ్వాబ్ ఉపన్యాసంతో ప్రారంభమైన ఈ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో 1200 మంది సీఈవోలు, 50 మంది ప్రభుత్వాధినేతలు ఉన్నారు.

‘వర్షిత’ పింఛన్ పథకానికి కేబినెట్ ఆమోదం
వృద్ధుల సామాజిక భద్రత కోసం రూపొందించిన వర్షిత పెన్షన్ బీమా యోజన-2017 పథకానికి కేంద్రమంత్రి మండలి జనవరి 24న ఆమోదం తెలిపింది. ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో అమలయ్యే ఈ పథకం కింద పదేళ్లపాటు ఎనిమిది శాతం వడ్డీతో బీమా లభిస్తుంది. ఈ పథకం 60 లేదా అంతకుమించిన వయసు కలిగినవారికి వర్తిస్తుంది.

వృద్ధిరేటు అంచనాను 7 శాతానికికుదించిన వరల్డ్ బ్యాంక్
2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని ప్రపంచ బ్యాంక్ జనవరి 11న 7 శాతానికి కుదించింది. గతంలో వృద్ధిరేటును 7.6 శాతంగా అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ వృద్ధిరేటు అంచనా.. ఇటీవల కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) అంచనా(7.1 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కాగా, వృద్ధిరేటు మందగమనానికి రూ.500, రూ.1000 నోట్ల రద్దే కారణమని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. అయితే ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ఫలితంగా రానున్న సంవత్సరాల్లో వృద్ధిరేటు 7.6 శాతం నుంచి 7.8 శాతానికి చేరుకుంటుందని అభిప్రాయపడింది.

3.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2016, డిసెంబర్‌లో 3.39 శాతానికి చేరింది. ఇది 2015, డిసెంబర్‌లో -1.06 శాతంగా నమోదైంది. అంతర్జాతీయంగా, దేశీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో డబ్ల్యూపీఐలో పెరుగుదల చోటుచేసుకుంది. ఇది 2016, నవంబర్‌లో 3.15 శాతంగా నమోదైంది.

భారత జీడీపీ వృద్ధిరేటును 6.6 శాతంగా పేర్కొన్న ఐఎంఎఫ్
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2016-17) భారత జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దుతో తాత్కాలికంగా ఏర్పడిన ప్రభావం వల్ల వృద్ధిరేటు తగ్గుతుందని జనవరి 16న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతంలో వృద్ధిరేటును ఐఎంఎఫ్ 7.6 శాతంగా అంచనా వేసింది. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సర వృద్ధిరేటును 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. 2018-19లో వృద్ధిరేటును 7.7 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చైనా వృద్ధిరేటు 6.7 శాతంగా, 2017లో 6.5 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.

సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్‌కు 60వ స్థానం
ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) జనవరి 16న విడుదల చేసిన సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్‌కు 60వ స్థానం దక్కింది. ఈ సూచీలో లిథువేనియా మొదటి స్థానంలో నిలవగా, అజర్‌బైజాన్, హంగేరీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రష్యా 13వ స్థానంలో, చైనా 15వ స్థానంలో, పాకిస్తాన్ 52వ స్థానంలో ఉన్నాయి. స్థూల జాతీయోత్పత్తితోపాటు వృద్ధి, అభివృద్ధి, సమానత్వం, సుస్థిరత వంటి 12 అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఈ సూచీని రూపొందించారు.

ప్రతిభా పాటవాల సూచీలో భారత్‌కు 92వ ర్యాంక్ దక్కింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సూచీలో భారత్ గతేడాది 89వ స్థానంలో ఉంది.

దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ బ్యాంక్ కార్యకలాపాలు
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ మేరకు జనవరి 12న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో వీటిని అధికారికంగా ప్రారంభించారు. గతేడాది నవంబర్‌లో రాజస్తాన్‌లో బ్యాంకింగ్ సేవలు మొదలు పెట్టిన ఎయిర్‌టెల్ ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి విస్తరించింది. ఖాతాదారుడి ఫోన్ నంబర్‌నే అకౌంటు నంబర్ కాగా పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై ఏడాదికి 7.25 శాతం వడ్డీ చెల్లిస్తారు. 

ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 17 శాతం
2017 ప్రపంచ స్థూల ఉత్పత్తి-జీడీపీలో భారత్ వాటా 17% చేరుతుందని ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ-పీడబ్ల్యూసీకు చెందిన ‘గ్లోబల్ ఎకనమిక్ వాచ్’ నివేదిక పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తున్న భారత్ 2016లో 7.5 శాతానికిపైగా వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది.

2017-18లో భారత్‌లో పెరగనున్న నిరుద్యోగం
భారత్‌లో 2017-18 మధ్యకాలంలో నిరుద్యోగం స్వల్పంగా పెరగొచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు యునెటైడ్ నేషన్స్ ఐఎల్‌ఓ తాజాగా 2017 వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషియల్ ఔట్‌లుక్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు

భారత్‌లో నిరుద్యోగులు 1.77 కోట్ల నుంచి 1.78 కోట్లకు, వచ్చే ఏడాది 1.8 కోట్లకు పెరగొచ్చని అంచనా. 2017-18లో నిరుద్యోగ రేటు 3.4 శాతంగా కొనసాగుతుంది.గతేడాది దక్షిణాసియా ప్రాంతంలో జరిగిన మొత్తం ఉపాధి సృష్టిలో (1.34 కోట్ల ఉద్యోగాలు) అధిక భాగం భారత్‌దే.అంతర్జాతీయ నిరుద్యోగ రేటు 2017లో 5.8%కి పెరగొచ్చని అంచనా. ఇది గతేడాది 5.7 శాతంగా ఉంది.2017లో వర్ధమాన దేశాల్లో నిరుద్యోగం పెరిగితే (5.6% నుంచి 5.7%కి), అభివృద్ధి చెందిన దేశాల్లో తగ్గుతుందని (6.3% నుంచి 6.2%కి) అంచనా.
జూలై 1 నుంచి జీఎస్టీ అమలు
దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం కోసం ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 2017 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ మండలి అధ్యక్షుడు అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీని ప్రకారం వార్షిక టర్నోవర్ రూ. 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థలు, పన్ను చెల్లింపుదారులపై 90 శాతం నియంత్రణ రాష్ట్రాలకు దఖలు పడనుంది. 10 శాతం హక్కులు కేంద్రానికి ఉంటాయి. రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్రం, రాష్ట్రాలు 50:50 హక్కులు కలిగి ఉంటాయి.

దేశంలో తొలి అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్ ప్రారంభం
భారత తొలి అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఐఎన్‌ఎక్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9న ప్రారంభించారు. గుజరాత్‌లో మూడురోజుల పాటు జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2017లో భాగంగా ఐఎన్‌ఎక్స్‌ను బీఎస్‌ఈ ప్రారంభించింది. జనవరి 16 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ఐఎన్‌ఎక్స్ రోజుకు 22 గంటలు పనిచేస్తుంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ప్రవాస భారతీయులు, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లో పాల్గొనవచ్చు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో దాదాపు రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 21,190 పైచిలుకు అవగాహన ఒప్పందాల(ఎంవోయూ) లక్ష్యాన్ని గుజరాత్ నిర్దేశించుకుంది.

2016-17లో వృద్ధి అంచనా 7.1 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారత్ వృద్ధిరేటు మందగమనంలో ఉండనున్నట్లు గణాంకాల శాఖ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని అంచనా.

డిజిటల్ చెల్లింపులపై వాటల్ కమిటీ సిఫార్సులు
నగదు రూపంలో లావాదేవీలను గణనీయంగా తగ్గించి, డిజిటల్ చెల్లింపులకు ఊపు తెచ్చేందుకు వీలుగా ప్రోత్సాహకాలను ప్రకటించాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, నీతి ఆయోగ్ ముఖ్య సలహాదారు రతన్ పి.వాటల్ నేతృత్వంలోని డిజిటల్ చెల్లింపుల కమిటీ సిఫార్సు చేసింది. డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన అంశాల కోసం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు డిసెంబర్ 27న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది.

కోటి దాటిన డిజిధన్ అభియాన్ శిక్షణదారులు
డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంచే కార్యక్రమం డిజిధన్ అభియాన్‌లో కేవలం 20 రోజుల్లోనే సుమారు కోటి మందికిపైగా గ్రామీణులు చేరారని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ డిసెంబర్ 28న తెలిపారు. 476 జిల్లా లు, 2782 బ్లాకుల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 15 లక్షల మంది ఇందులో పేర్లు నమోదు చేసుకున్నారు.

2022 నాటికి పేదలందరికి పక్కా ఇళ్లు
2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంలో 2019 నాటికి కోటి ఇళ్లను నిర్మించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 లక్షల ఇళ్ల (నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువ) ను కేంద్రప్రభుత్వం నిర్మించి ఇచ్చింది.

ఈ-వ్యాలెట్ యాప్ ‘భీమ్’ను ఆవిష్కరించిన మోదీ
డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలు సులభతరం చేయడానికి అనువుగా డిసెంబర్ 30న ‘భీమ్’(భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ - BHIM) యాప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ కర్త, డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ పేరిట దీనిని రూపొందించారు. ఈ యాప్‌ను ఇంటర్నెట్ అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ లేదా ఫీచర్ ఫోన్‌లో ఉపయోగించవచ్చు.

‘మాతృత్వ ప్రయోజన పథకం’ ప్రారంభం
గర్భిణులు, బాలింతలకు సరైన పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన ‘మాతృత్వ ప్రయోజన పథకం’ను (Pregnancy Aid Scheme) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ జనవరి 3న మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆస్పత్రి ఖర్చులు, టీకాలు, పోషకాహారం కోసం పథకం కింద రూ.6,000 నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మూడు విడతలుగా జమచేస్తారు. ఇందుకయ్యే వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో చెల్లిస్తాయి.

ఆర్థిక వ్యవహారాలు ఫిబ్రవరి 2017 ఎకానమీ
దేశంలోనే ధనిక నగరంగా ముంబై
 దేశ ఆర్థిక రాజధాని ముంబై దేశంలోనే ధనిక నగరంగా నిలిచింది. 46,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లకు ముంబై నివాస స్థలంగా ఉంది. ముంబైలో మొత్తం సంపద 820 బిలియన్ డాలర్లుగా ఉందని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక తెలిపింది. సంపద పరంగా ముంబై తర్వాత స్థానాల్లో వరుసగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. ఢిల్లీలో 23,000 మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉన్నారు. మొత్తం సంపద 450 బిలియన్ డాలర్లు. బెంగళూరులో 7,700 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద 320 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో 9,000 మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద 310 బిలియన్ డాలర్లు. దేశంలో మొత్తం సంపద 6.2 లక్షల కోట్ల డాలర్లు కాగా, 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు.
టాప్-5 సంపన్న నగరాల జాబితా 

నగరం

మిలియనీర్లు

బిలియనీర్లు

సంపద విలువ (లక్షల కోట్లలో)

ముంబై

45,000

28

53.3

ఢిల్లీ

22,000

18

29.2

బెంగళూరు

7,500

8

20.8

హైదరాబాద్

8,200

7

20.1

కోల్‌కతా

8,600

10

-


దీన్‌దయాళ్ అధ్యయన కేంద్రాలకు యూజీసీ ఆమోదం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుపై విశ్వవిద్యాలయాల్లో అధ్యయన కేంద్రాలను స్థాపించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC అంగీకరించింది. ఈ మేరకు వీటి ఏర్పాటు కోసం ఫిబ్రవరి 22న అనుమతులు జారీ చేసింది. ఈ కేంద్రాల ద్వారా దీన్ దయాళ్ రచనలు, సిద్ధాంతాలపై పరిశోధనలు చేయనున్నారు. దేశంలో 20 ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను నెలకొల్పేందుకు ప్రతిపాదించిన మార్గదర్శకాలకూ యూజీసీ ఆమోదం లభించింది. 

శుద్ధి కేంద్రాలు లేకపోతే పరిశ్రమలు మూతే: సుప్రీంకోర్టు 
పరిశ్రమల వ్యర్థాలు నీటి వనరుల్లో కలవకుండా ప్రాథమిక వ్యర్థాల శుద్ధి కేంద్రాలు(PETP) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 22న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 3 నెలల లోపు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయని పరిశ్రమలను మూసివేయాలని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డు(PCB) లను ఆదేశించింది. పట్టణాలు, నగరాల్లో 3 ఏళ్లలోగా కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు-CEPTలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచించింది. 

టెలినార్ ఇండియాను కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్
టెలికం రంగంలో అగ్రగామిగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ టెలినార్ ఇండియాను కొనుగోలు చేసింది. ఈ మేరకు 7 సర్కిళ్లలో టెలినార్ కార్యకలాపాలను కొనుగోలు చేస్తూ ఫిబ్రవరి 23న ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఎయిర్‌టెల్ టెలినార్‌కు నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులూ చేయదు. ఆ కంపెనీ భవిష్యత్తులో స్పెక్ట్రం లెసైన్‌‌స కోసం చెల్లించాల్సిన ఫీజులు, మొబైల్ టవర్ల అద్దెలు అన్నీ కలుపుకొని రూ.1,600 కోట్లను ఎయిర్‌టెల్ భరిస్తుంది. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి 12 నెలల సమయం పడుతుంది. 

ప్రస్తుతం 7 సర్కిళ్లలో కలిపి టెలీనార్‌కు 4.4 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఎయిర్‌టెల్‌కు ప్రస్తుతం 26.9 కోట్ల మంది వినియోగదారులు ఉండగా ఒప్పందం అమల్లోకి వస్తే ఆ సంఖ్య 30 కోట్లను మించనుంది. 

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16
2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-4) నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గత పదేళల్లో దేశంలో శిశుమరణాల రేటు-IMR గణనీయంగా తగ్గింది. 2005-06లో ప్రతి వేయి మంది శిశువులకు 57 మంది చనిపోతుండగా 2015-16 నాటికి ఆ రేటు 41కి పడిపోయింది. దేశవ్యాప్తంగా 6 లక్షల గృహాలు, 7 లక్షల మంది మహిళలు, 1.3 లక్షల పురుషుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించారు. 

సర్వే వివరాలు 
త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, ఒడిశాల్లో 20 శాతానికి పైగా తగ్గిన శిశు మరణాల రేటు.జనన సమయంలో లింగ నిష్పత్తి (ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) జాతీయ స్థాయిలో 914 నుంచి 919కి పెరిగింది. ఈ జాబితాలో కేరళ(1047), మేఘాలయ(1009), ఛత్తీస్‌గఢ్(977) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 38.7 శాతం నుంచి 78.9 శాతానికి పెరిగింది.7 శాతం తగ్గిన తక్కువ బరువున్న పిల్లల సంఖ్య.6-59 నెలల మధ్యనున్న పిల్లల్లో 69 శాతం నుంచి 59 శాతానికి తగ్గిన అనీమియా.2005-06లో(NFHS-3) 8.5 శాతంగా ఉన్న జాతీయ సగటు సిజేరియన్ శస్త్ర చికిత్సలు 2015-16 నాటికి 17.2 శాతానికి పెరిగాయి. ప్రైవేట్ రంగంలో ఇవి 2005-06లో 27.7 శాతంగా ఉండగా 2015-16 నాటికి 40 శాతానికి చేరాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ చికిత్సలు 2015-16 కాలానికి 15.2 శాతం నుంచి 11.9 శాతానికి పడిపోయాయి.
2016-17లో భారత్ వృద్ధి 7.1 శాతం : సీఎస్‌వో
2016-17లో భారత వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల శాఖ-CSO అంచనా వేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత్ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. 
2016-17 సీఎస్‌వో అంచనాలు 
అక్టోబర్- డిసెంబర్ మధ్య కాలంలో తయారీ రంగంలో 8.3 శాతం వృద్ధి. జూలై-సెప్టెంబర్‌లో ఇది 6.9 శాతంగా ఉంది. మొత్తంగా 2016-17లో తయారీ రంగం వృద్ధి 10.6 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గుతుందని అంచనా.మూడో త్రైమాసికంలో 6 శాతంగా వ్యవసాయరంగం వృద్ధి. మొత్తంగా 2016-17లో ఇది 4.4 శాతంగా ఉండొచ్చని అంచనా.ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.113.58 లక్షల కోట్ల నుంచి రూ.121.65 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.7.8 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గనున్న స్థూల విలువ ఆధారిత (GVA) వాస్తవిక జీడీపీ రేటు.తలసరి ఆదాయం 10.2 శాతం పెరుగుదలతో రూ.94,178 నుంచి రూ.1,03,818 చేరుతుందని అంచనా.2014-15లో భారత్ జీడీపీ వృద్ధి 7.2 శాతం కాగా, 2015-16లో ఈ రేటు 7.9 శాతంగా ఉంది.
జీఎస్టీ పరిహార చట్టానికి అంగీకారం
వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో రాష్ట్రాలకు జరిగే నష్టానికి పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టంపై జీఎస్టీ మండలి సమావేశంలో అంగీకారం కుదిరింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 18న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ మండలి పదో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జనవరిలో 3.17 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం
కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు తగ్గడంతో 2017 జనవరిలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) గణనీయంగా తగ్గి 3.17 శాతంగా నమోదైంది. ఇది దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయి. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర గణాంక, పథకాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 10న విడుదల చేసింది. కాగా, సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2016, జనవరిలో 5.69 శాతంగా, డిసెంబర్‌లో 3.41 శాతంగా నమోదైంది. 

జనవరిలో 5.25 శాతంగా టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీ) ఆధారిత ద్రవ్యోల్బణం మరింత పెరిగి జనవరిలో 5.25 శాతానికి చేరింది. ఇది గత డిసెంబర్‌లో 3.39 శా తం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరి 14న వాణిజ్య మంత్రిత్వశాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం చమురు, విద్యుత్ రంగాల్లో ధరలు రెండింతలయ్యాయి. కాగా, డబ్ల్యూపీఐ 2016, జనవరిలో మైనస్ 1.107 శాతంగా ఉండటం గమనార్హం. 

2021కి 55 బిలియన్ డాలర్లకు చేరనున్న ఈ-కామర్స్ 
2021 నాటికి భారత ఈ-కామర్స్ మార్కెట్ విలువ 50 నుంచి 55 బిలియన్ డాలర్లకు చేరుతుందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లు వెల్లడించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 15న విడుదల చేసిన నివేదికలో ప్రస్తుతం ఈ-కామర్స్ మార్కెట్ విలువ 6-8 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నాయి. 2025 నాటికి ఈ రంగంలో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విస్తరణ గరిష్టంగా 38-42 శాతంగా ఉండొచ్చని అంచనా. 

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి కేబినెట్ ఆమోదం 
భారతీయ స్టేట్ బ్యాంక్-SBIలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 15న ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి తుది అనుమతులు జారీ చేసిన కేబినెట్ భారతీయ మహిళా బ్యాంకు విలీనం విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు.
ఈ విలీనంతో 22,500 శాఖలు, 58,000 ఏటీఎంలు, రూ.37 లక్షల కోట్ల విలువైన ఆస్తులతో ఎస్‌బీఐ అంతర్జాతీయంగా అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా అవతరిస్తుంది. విలీనం వల్ల తొలి ఏడాదిలోనే రూ.1,000 కోట్ల మేర నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లు ఇంతకముందే ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. 
కొత్తగా విలీనం అయ్యే బ్యాంకులుస్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాస్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్


ఏప్రిల్ 1 నుంచి డెబిట్ కార్డుపై ఎండీఆర్ చార్జీలు తగ్గింపు
డెబిట్ కార్డులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు-MDRను తగ్గించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ మేరకు ఫిబ్రవరి 16న ముసాయిదాను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. MDR అనేది డెబిట్ కార్డు లావాదేవీల విలువపై దుకాణాదారుల నుంచి వసూలు చేసే చార్జీ. 
MDRపై ఆర్బీఐ ప్రతిపాదనలు

వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు, ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యాపారులు (విద్యా సంస్థలు, మ్యూచువల్ ఫండ్‌‌స, ఇన్సూ రెన్‌‌స, యుటిలిటీలు), ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెబిట్ కార్డు లావాదేవీలకు 0.40 శాతం ఛార్జి.డిజిటల్ విధానంలో (క్యూఆర్‌కోడ్) లావాదేవీ జరిగితే 0.30 శాతం ఛార్జి.వర్తకులను 4 కేటగిరీలుగా పేర్కొన్న ఆర్బీఐ. కేటగిరి 1- వార్షికంగా రూ.20 లక్షల్లోపు టర్నోవర్ కలిగిన వారు. కేటగిరి 2- వార్షికంగా రూ.20 లక్షలకు మించిన టర్నోవర్ కలిగిన వారు. కేటగిరి 3- ప్రభుత్వ లావాదేవీలు. కేటగిరి 4- ప్రత్యేక కేటగిరీ వర్తకులు.ప్రభుత్వ లావాదేవీల్లో రూ.1,000 వరకు లావాదేవీపై ఫ్లాట్‌గా రూ.5 చార్జీ. రూ.1,001 నుంచి రూ.2,000 వరకు ఫ్లాట్‌గా రూ.10 చార్జీ. రూ.2,001కి పైన విలువగల లావాదేవీలపై మొత్తం లావాదేవీ విలువలో చార్జీ 0.50% మించరాదు. ఛార్జి గరిష్ట పరిమితి రూ.250.‘కన్వీనియెన్‌‌స లేదా సేవా చార్జీని కస్టమర్లు చెల్లించ్సాలిన అవసరం లేదని’ పేర్కొంటూ వ్యాపారులు బోర్డులు పెట్టాలి. ఈ బాధ్యత బ్యాంకులదే.


ఆభరణాల కొనుగోలు రూ.2 లక్షలు దాటితే పన్ను
ఆభరణాల కొనుగోళ్లలో 2 లక్షలకు మించిన నగదు లావాదేవీలకు ఒక శాతం మూలం వద్ద పన్ను కోత (టీసీఎస్) విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ 2017-18 బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించడంతో టీసీఎస్ విధింపునకు ఉన్న రూ.5 లక్షల పరిమితిని రూ.2 లక్షలకు తగ్గించాలని ఆర్థిక బిల్లు 2017లో పేర్కొన్నారు.

సైబర్ స్వచ్ఛత కేంద్ర పథకం ప్రారంభం
సైబర్ దాడుల నుంచి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం "సైబర్ స్వచ్ఛత కేంద్ర" (Cyber Swachhata Kendra or cyber hygiene centre) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఉచిత యాంటీ వైరస్ టూల్స్‌ను ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి తెచ్చింది. www.cyberswachhtakendra.gov.in వెబ్‌సైట్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లని సి-డాక్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 58 ఐఎస్‌పీలు, 13 బ్యాంకులు ఈ వ్యవస్థను ఉపయోగించుకోవడానికి ముందుకొచ్చాయి.
‘సైబర్ స్వచ్ఛత కేంద్ర’ ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో కేంద్రం రూ.90 కోట్లు వెచ్చించనుంది. 2017 జూన్ నాటికి ఏర్పాటు చేయనున్న నేషనల్ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్-NCCC కి రూ.900 కోట్లు కేటాయించారు.

హైదరాబాద్‌లో వరల్డ్ ఎండో 2017 సదస్సు 
హైదరాబాద్ HICCలో ఫిబ్రవరి 16న వరల్డ్ ఎండో 2017 సదస్సు ప్రారంభమైంది. వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సులో 68 దేశాలకు చెందిన 3,500 మంది వైద్యులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వర్‌రెడ్డి వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

డిజిటల్ అక్షరాస్యతకు PMGDISHA
ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్- PMGDISHA కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి 8న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా 6 కోట్ల మంది గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ అక్షరాస్యత అందిస్తారు. దీని అమలు కోసం రూ.2,351 కోట్లు ప్రతిపాదించిన కేంద్రం 2019 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష
ఫిబ్రవరి 8న జరిగిన ఆర్బీఐ పాలసీ విధాన సమీక్షలో పరిపతి విధాన కమిటీ (MPC) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. నోట్ల రద్దు, ద్రవ్యోల్బణం, ఉత్పత్తి-సరఫరాల పరిస్థితిపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నందునే పరిపతి విధానంలో మార్పులు చేయలేదని ఆర్బీఐ పేర్కొంది. తదుపరి విధాన సమీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరుగుతుంది. 

సమీక్ష ముఖ్యాంశాలు 

ప్రస్తుతం క్యాష్ రిజర్వ్ రేషియో-CRR 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉంది.బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై 6.25 శాతం(రెపో రేటు) వడ్డీ రేటు కొనసాగనుంది.2016-17 వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గింపు. 2017-18లో ఇది 7.4 శాతానికి చేరుతుందని అంచనా.2017-18 తొలి 6 నెలల్లో 4-4.5 శాతం మధ్య ఉండనున్న ద్రవ్యోల్బణం . ఆ తర్వాత ఆరు నెలల్లో 4.5- 5 శాతంగా అంచనా.
రేషన్‌కు ఆధార్ తప్పనిసరి చేసిన కేంద్రం
 రేషన్ దుకాణాల్లో సరుకులు పొందడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆధార్ చట్టం కింద ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ప్రస్తుత లబ్ధిదారులంతా రేషన్ కార్డులను ఆధార్‌తో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లేని లబ్ధిదారులు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకూ దేశంలో 72 శాతం రేషన్ కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమైనందున ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది.

తపాలాశాఖతో నేషనల్ కెరీర్ సర్వీస్ అనుసంధానం
దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్మిక శాఖ ప్రారంభించిన నేషనల్ కెరీర్ సర్వీస్-NCS పథకం తపాలా శాఖతో అనుసంధానమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, భారత తపాలాశాఖ కార్యదర్శి బి.వి.సుధాకర్‌ల సమక్షంలో ఫిబ్రవరి 12న రెండు శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తపాలా కార్యాలయాల్లో ఏర్పాటయ్యే NCS కేంద్రాల్లో ఉద్యోగార్థులు తమ విద్యా వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ సమాచారంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. ఈ సేవలు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యాయి. 

నవీ ముంబయి ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న జీవీకే
నవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును జీవీకే గ్రూపు దక్కించుకుంది. ఈ మేరకు గుత్తేదారు బాధ్యతలు జీవీకేకు అప్పగిస్తున్నట్లు సిటీ అండ్ ఇండ్రస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-సిడ్కీ ఫిబ్రవరి 13న ప్రకటించింది. 

రూ.16,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీవీకే, జీఎంఆర్ సంస్థలు పోటీపడ్డాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్-PPP మోడల్‌లో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆదాయంలో 12.60 శాతం వాటా ఇవ్వడానికి జీవీకే ముందుకు రాగా, జీఎంఆర్ 10.44 శాతం ఆఫర్ చేసింది. ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను జీవీకే... ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులను జీఎంఆర్ నిర్వహిస్తున్నాయి. 

పోస్టల్ బ్యాంకుకు రూ. 500 కోట్లు 
2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ వెలువరిచిన కేంద్రం కేటాయింపుల్లో రూ.125 కోట్లు మూలధనం, రూ.375 కోట్లు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అని వివరించింది. 

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-ఐపీపీబీ ఇటీవలే రాయ్‌పూర్, రాంచీల్లో సేవలు ప్రారంభించింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 బ్రాంచీల ఏర్పాటు చేయనుంది.

కేంద్ర బడ్జెట్ 2017-18 
 నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న 2017-18 వార్షిక ఆర్థిక ప్రణాళికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మార్పు, శక్తిమంతం, స్వచ్ఛ భారత్ (TEC-Transfrom, Energise, Clean India) నినాదంతో రూ.21,46,735 కోట్ల విలువైన బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచారు. పెద్ద నోట్ల రద్దు చర్య నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ, డిజిటల్ లావాదేవీలను పెంపొందించడం, గ్రామాల్లోనూ దీనిని ప్రోత్సహించడంపై జైట్లీ దృష్టి సారించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం నుంచి డిజిటలీకరణ మౌలిక సదుపాయాలను విస్తరించడం వరకూ అనేక నిర్ణయాలు వివరించారు. 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి తొలిసారి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపి ప్రవేశపెట్టారు. 
2017-18 బడ్జెట్ హైలెట్స్
మొత్తం బడ్జెట్ రూ.21,46,735 కోట్లుపథకాల వ్యయం రూ.9,45,078 కోట్లుఇతర వ్యయం రూ. 12,01,657 కోట్లురూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్ను 5 శాతానికి తగ్గింపు.రిబేట్ (పన్ను తిరిగి చెల్లింపు) రూ.5,000 నుంచి రూ. 2,500కు తగ్గింపు.రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు ఆదాయంపై 20 శాతం పన్ను.పన్ను ఆదాయం రూ.50 లక్షలు దాటితే 10 శాతం సర్‌చార్జీ.రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలపై కార్పొరేట్ పన్ను 30 నుంచి 25 శాతానికి తగ్గింపు.రూ.3 లక్షలకు పైబడిన అన్ని నగదు లావాదేవీల నిషేధం.2017-18లో వ్యవసాయ వృద్ధి లక్ష్యం 4.1 శాతం. రుణాల మంజూరు లక్ష్యం రూ.10 లక్షల కోట్లు. 5 ఏళ్లలో రైతుల ఆదాయం రెండింతలయ్యేలా చర్యలు.రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం.రైల్వేలకు రూ. 1.31 లక్షల కోట్లు కేటాయింపు.IRCTC ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై సర్వీసు చార్జీల ఎత్తివేత.చెక్ బౌన్‌‌స కేసులకు సంబంధించి ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్’కు సవరణలు.దేశం విడిచి పారిపోయిన ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణలు.LNG (గ్యాస్)పై కస్టమ్స్ పన్ను 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింపు.వయోవృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్య కార్డులు. కనీసం 8 శాతం రాబడినిచ్చే వర్షిత పింఛన్ పథకం ఏర్పాటుPOS పరికరాలపై సుంకం రద్దు. మార్చికల్లా 10 లక్షల పీఓఎస్‌ల కొనుగోలు.2017-18 లో 2.50 లక్షల డిజిటల్ లావాదేవీల లక్ష్యం.దేశంలో ఇంటర్నెట్ విస్తృతి కోసం భారత్ నెట్‌కు రూ. 10 వేల కోట్లు నిధులు.గ్రామీణుల కోసం కొత్తగా ‘డిజి గావ్’ ప్రారంభం2018 మే నాటికి దేశంలోని 100 శాతం గ్రామాలకు విద్యుత్.పేదలకు 2019 నాటికి కోటి గృహాల నిర్మాణంFDIల ప్రోత్సాహకానికి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు-FIPB రద్దుడిజిటల్ పేమెంట్ల పర్యవేక్షణకు ‘పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు’ ఏర్పాటుస్థిరాస్తులపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్‌‌స పన్ను గడువు మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు2017-18లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.8 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 8.3 శాతం పెరుగుతాయని అంచనా.2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆహారం, ఎరువులు, పెట్రో ఉత్పత్తులు తదితరాలపై రాయితీల అంచనా రూ. 2,40,338 కోట్లు. చక్కెరపై రాయితీ ఎత్తివేత.ప్రభుత్వ బ్యాంకులకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు2017-18లో రూ.72 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహాయింపు. రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి క్యాపిటల్ గెయిన్స్ రద్దు.శాఖలు, పథకాల వారీ కేటాయింపులు 
మౌలిక వసతుల కల్పనకు రూ.3.96 లక్షల కోట్లు.రక్షణ రంగానికి రూ.2,74,114 కోట్లు.హోంశాఖకు రూ. రూ.83 వేల కోట్లు.మహిళా శిశు సంక్షేమానికి రూ.1.84 లక్షల కోట్లు.వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.87 లక్షల కోట్లుఎస్సీ సంక్షేమానికి రూ. 52,393 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.31,920 కోట్లు, మైనారిటీ వ్యవహారాలకు రూ.4,195 కోట్లు.వైద్యం, ఆరోగ్యానికి రూ.47,352 కోట్లుగ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,07,758 కోట్లు. ( అత్యధికంగా ఉపాధి హామీకి రూ.48 వేల కోట్లు. పథకం ప్రవేశపెట్టిన తర్వాత కేటాయింపుల్లో ఇదే అత్యధికం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMYAకు రూ.23 వేల కోట్లు. రూ. 20 వేల కోట్ల గృహ రుణాలు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన-PMGSYకు రూ. 19 వేల కోట్లు)స్వచ్ఛ భారత్‌కు రూ.13,948 కోట్లు.శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ.37,435 కోట్లు.పర్యాటక రంగానికి రూ. 1,840 కోట్లు.జాతీయ రహదారులకు రూ. 64 వేల కోట్లు.రవాణాశాఖకు రూ.1,24,373 కోట్లు.పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.46,356 కోట్లు. ఉన్నత విద్యకు రూ.33,329 కోట్లు.ద్రవ్యలోటు, రెవెన్యూలోటు లక్ష్యాలు 
2017-18లో ద్రవ్యలోటు లక్ష్యం 3.2 శాతం.2018-19లో ద్రవ్యలోటుని 3 శాతంగా కొనసాగిస్తామని హామీ.2016-17లో ద్రవ్యలోటు 3.5 శాతం.2016-17లో రెవెన్యూ లోటు 2.1 శాతం2017-18లో రెవెన్యూ లోటు 1.9 శాతంరైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు: 2017-18 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల్లో మూలధన, అభివృద్ధి వ్యయాన్ని రూ.1,31,000 కోట్లుగా (గత బడ్జెట్‌లో కంటే రూ.10 వేల కోట్లు అదనం) ప్రతిపాదించారు. ఇందులో రూ.55 వేల కోట్లను ప్రభుత్వం బడ్జెట్ నుంచి సమకూరుస్తుంది. 2016-17లో ఇచ్చిన బడ్జెట్ మద్దతు కంటే ఇది రూ.10 వేల కోట్లు ఎక్కువ. 2020 నాటికి బ్రాడ్‌గేజ్ మార్గాల్లో గేట్లు ఏర్పాటు చేస్తారు. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే రైలు టిక్కెట్లపై సేవా పన్నును రద్దు చేశారు. 25 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించేందుకు 2017-18 బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. దేశీయ అవసరాలకు అనుగుణంగా నూతన మెట్రో రైలు విధానాన్ని ప్రవేశపెడతారు.

పన్నుల్లో రాష్ట్రాల వాటా రూ. 6,74,565 కోట్లు 
2017-18 బడ్జెట్ ప్రకారం వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయంలో రూ.6,74,565 కోట్లు రాష్ట్రాలకు దక్కనున్నాయి. ఇలా సమకూరే మొత్తంలో రాష్ట్రాలకు 42 శాతం కేటాయించలన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం ఈ కేటాయింపులు చేసింది. 
అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,21,406 కోట్లు దక్కాయి. మొత్తం కేటాయింపుల్లో ఇది 17.94 శాతం.రూ.2,477 కోట్లతో సిక్కింకు అన్ని రాష్ట్రాలకన్నా తక్కువ వాటా దక్కింది.ఆంధ్రప్రదేశ్‌కు రూ.29,138 కోట్ల్లు(4.3 శాతం), తెలంగాణకు రూ.16,505 కోట్లు (2.43శాతం) అందనున్నాయి.
2017-18లో భారత వృద్ధి రేటు 7.1 శాతం: హెచ్‌ఎస్‌బీసీ 
2017-18లో భారత స్థూల దేశీయోత్పత్తి-GDP రేటు 7.1 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ HSBC పేర్కొంది. వచ్చే సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధ్యయనంతో ఆ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. 2016-17 వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

ముల్కనూరు డెయిరీకి ఉత్తమ సొసైటీ అవార్డు 
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ స్వకృషి డెయిరీకి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ-NDDB ఉత్తమ సహకార సంఘం అవార్డు లభించింది. ఫిబ్రవరి 2న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో డెయిరీ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల భాగస్వామ్యంతో 2002లో ప్రారంభమైన ఈ డెయిరీ మూడు సార్లు ఐఎస్‌వో గుర్తింపు పొందింది. 

నగదు బదిలీతో రూ.21 వేల కోట్లు ఆదా 
ప్రత్యక్ష నగదు బదిలీ పథకం-PAHAL (ప్రత్యక్ష హస్తాంతరిత్ లాభ్) ద్వారా 3.3 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను అరికట్టామని ఫిబ్రవరి 7న కేంద్రం ప్రకటించింది. తద్వారా ప్రభుత్వానికి రెండేళ్లలో రూ. 21 వేల కోట్ల రాయితీ ఆదా అయిందని వివరించింది. 2014లో ప్రారంభించిన పాహల్ విధానం ద్వారా ఇప్పటి వరకూ 17.6 కోట్ల మంది వినియోగదారులకు రాయితీ కింద రూ.40 వేల కోట్లు బదిలీ చేసినట్లు వెల్లడించింది. పహల్ పథకం ప్రపంచంలో అత్యధిక మందికి లబ్ధి చేకూరుస్తున్న విధానంగా ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు సంపాదించింది.

ఆర్థిక వ్యవహారాలు మార్చి 2017 ఎకానమీ
పర్యావరణంలో కలుస్తోన్న 80 శాతం వ్యర్థ జలాలు 
ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా పర్యావరణంలో కలుస్తున్నాయని వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2017 వెల్లడించింది. ఈ మేరకు మార్చి 22న అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి నీటి విభాగం వేస్ట్ వాటర్ - ద అన్‌టాప్డ్ రిసోర్స్ 2017 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. అభివృద్ధి చెందని దేశాల్లో ఇది 95 శాతం ఉందని పేర్కొంది. 
నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది, ఏడాదికి కనీసం ఒక నెల పాటైనా నీటి కొరత ఉండే ప్రాంతాల్లో నివసిస్తోండగా ఆ జనాభాలో సగం మంది భారత్, చైనాల్లోనే ఉన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 36 దేశాలు తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2017 
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎందుకు : నీటి సంరక్షణ కోసం

మానవాభివృద్ధి సూచీలో 131వ స్థానంలో భారత్ 
యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ (మానవాభివృద్ధి సూచీ)ను ఐరాస మార్చి 21న విడుదల చేసింది. మొత్తం 188 దేశాలు (2015 గణాంకాల)తో రూపొందించిన ఈ జాబితాలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్, కెన్యా, మయన్మార్, నేపాల్ వంటి వాటితో కూడిన మధ్యస్థ మానవ అభివృద్ధి దేశాల సరసనే భారత్ ఉంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందిన భారత్ 2014 నివేదికలోనూ 131వ స్థానంలోనే ఉంది. 
నివేదిక ముఖ్యాంశాలు 
2010లో భారత్ మానవాభివృద్ధి సూచీ శ్రేణి విలువ 0.580గా ఉండగా 2015లో ఇది 0.624కు పెరిగింది.దేశంలో ప్రజల జీవనకాలం 68.3 సంవత్సరాలు.తలసరి స్థూల జాతీయ ఆదాయం రూ.3,70,672అవకాశాలు ఎంచుకునే స్వేచ్ఛపై 78 శాతం పురుషులు, 72 శాతం మంది స్త్రీలు సంతృప్తిగా ఉన్నారు.మొత్తం జీవనకాలం సంతృప్తి విషయంలో 4.3 (1 - 10 కొలమానంలో) స్థానంలో భారత్.జీవ ప్రమాణాల విషయంలో సంతృప్తి వ్యక్తం చేసిన 63 శాతం మంది ప్రజలు.క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస మానవాభివృద్ధి సూచీ (2015) 
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : 131వ స్థానంలో భారత్ 

6.55 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో మరింత పెరిగి 39 నెలల గరిష్టానికి చేరింది. 2017 జనవరిలో 5.25 శాతం ఉండగా ఫిబ్రవరిలో 6.55 శాతానికి చేరింది. ఆహార, ఆయిల్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు ఫిబ్రవరిలో 2.69 శాతం పెరిగాయి. ఆయిల్ ధరలు జనవరిలో 18.14 శాతం ఉండగా, ఫిబ్రవరిలో 21.02 శాతానికి పెరిగాయి.ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు తాజా గణాంకాలను 2017 మార్చి 14న విడుదల చేశాయి.

ఈఏపీఐ 2017లో భారత్‌కు 87వ స్థానం 
ప్రపంచ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫామెన్స్ ఇండెక్స్(ఈఏపీఐ) 2017 సూచీలో భారత్ 87వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) మార్చి 22న ఓ నివేదిక విడుదల చేసింది. మొత్తం 127 దేశాలతో కూడిన ఈ జాబితాలో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో నిలవగా బహ్రెయిన్ చివరి స్థానంలో ఉంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫామెన్స్ ఇండెక్స్ 2017
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : ప్రపంచ ఆర్థిక ఫోరమ్ 
ఎక్కడ : 87వ స్థానంలో భారత్ 

2019-20 నాటికి కోటి టన్నుల సామర్థ్యం గల గోదాములు
 దేశంలో 2019-20 నాటికి కోటి టన్నుల సామర్థ్యం గల అత్యాధునిక గోదాములు(Silos) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా చేపట్టనున్న ఈ నిర్మాణాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) పద్దతిలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్మించనుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోటి టన్నుల సామర్థ్యం గల సిలోస్ నిర్మాణం
ఎప్పుడు : 2019-20 నాటికి
ఎవరు : భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)
ఎందుకు : ఆహార ధాన్యాల నిల్వ కోసం 

వందజిల్లాల్లో టీబీ నిర్మూలన కార్యక్రమాలు 
క్షయ (టీబీ) నిర్మూలనకు జాతీయ వ్యూహాత్మక విధానం అవలంబించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు క్షయ వార్షిక నివేదిక 2017ను మార్చి 24న విడుదల చేసింది. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేసేందుకు దేశవ్యాప్తంగా 100 జిల్లాలను గుర్తించింది. 
ఈ నివేదిక ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా 17.5 లక్షల టీబీ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 24 శాతం. కాగా ప్రపంచ టీబీ కేసుల్లో 60 శాతం భారత్, చైనా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, దక్షిణాఫిక్రా దేశాల్లోనే నమోదవుతున్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్షయ వార్షిక నివేదిక 2017 
ఎప్పుడు : మార్చి 24 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

గోధుమ, కందిపప్పు దిగుమతిపై 10% పన్ను 
విదేశాల నుంచి దిగుమతి అయ్యే గోధుమ, కందిపప్పులపై 10 శాతం పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్చి 28న నిర్ణయం తీసుకుంది. 2017లో దేశీయంగా ఈ రెండు పంటల దిగుబడి భారీగా ఉండనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ధరలు పడిపోయి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోధుమ, కందిపప్పు దిగుమతిపై 10% పన్ను 
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : దేశంలో రైతుల పంటకు ధరలు పడిపోకుండా ఉండేందుకు

జీఎస్టీ అనుబంధ బిల్లులకు కేబినెట్ ఆమోదం 
వస్తు, సేవల పన్ను అమలులో భాగంగా కేంద్ర కేబినెట్ మార్చి 20న నాలుగు అనుబంధ చట్టాలకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర వస్తు సేవల పన్ను బిల్లు 2017 (సీజీఎస్టీ), సమీకృత వస్తు, సేవల పన్ను బిల్లు 2017 (ఐజీఎస్టీ), కేంద్రపాలిత ప్రాంత వస్తు సేవల పన్ను బిల్లు 2017 (యూటీజీఎస్టీ), వస్తుసేవల పన్ను (రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లోక్‌సభ సమావేశాల్లో వీటిని ద్రవ్య బిల్లులుగా ప్రవేశపెడతారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు కానుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ అనుబంధ బిల్లులకు కేబినెట్ ఆమోదం 
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

ఎస్‌బీఐలో మహిళా బ్యాంకు విలీనానికి కేబినెట్ ఆమోదం 
 ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంకు (బీఎంబీ) వీలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్చి 20న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఎస్‌బీఐలో బీఎంబీ విలీనానికి అంగీకారం తెలిపింది. ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు ఏప్రిల్ 1న విలీనం అవుతున్నాయి. ఆ రోజు నుంచి అనుబంధ బ్యాంకుల శాఖలను ఎస్‌బీఐ బ్రాంచీలుగా, వినియోగదారులను ఎస్బీఐ వినియోగదారులుగా పరిగణిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌బీఐలో మహిళా బ్యాంకు విలీనానికి కేబినెట్ ఆమోదం 
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐ కిందకు తెచ్చేందుకు 

సంతోష సూచిలో 122వ స్థానంలో భారత్
సంతోషకర దేశాల జాబితాలో భారత్ 122వ స్థానంలో నిలిచింది. మార్చి 20న అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి 155 దేశాలతో విడుదల చేసిన వరల్డ్ హేపినెస్ రిపోర్ట్ -2017 నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ప్రజల తలసరి ఆదాయం, సాంఘిక భద్రత, ఆరోగ్యకర జీవితం, నచ్చింది ఎన్నుకోవడంలో ఉండే స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిపై జాగరూకత ఆధారంగా జాబితాను రూపొందించారు.
2014-15 నివేదిక ప్రకారం భారత్ స్థానం 118 కాగా ఇప్పుడు నాలుగు స్థానాలు తగ్గి చైనా, పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకంజలో నిలిచింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ హేపినెస్ రిపోర్ట్ - 2017
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎక్కడ : 122వ స్థానంలో భారత్ 

ఐడియా-వొడాఫోన్ విలీనానికి కుదిరిన అంగీకారం 
బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఇండియా, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా సెల్యులార్ విలీనానికి రెండు సంస్థల మధ్య అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపాదనకు మార్చి 20న సమావేశమైన డెరైక్టర్ల బోర్డులు ఆమోదముద్ర వేశాయని ఇరు గ్రూప్‌లు ప్రకటించాయి.
విలీనం ద్వారా ఏర్పాటయే కొత్త కంపెనీ ఆదాయ మార్కెట్ వాటా, కస్టమర్ల సంఖ్య పరంగా ( 40 కోట్లు) దేశీయంగా అగ్రగామి టెల్కోగా అవతరించనుంది. ఇందులో వొడాఫోన్‌కు 45.1 శాతం, ఐడియాకు 26 శాతం వాటా ఉండనుంది. మిగతాది ఇన్వెస్టర్ల చేతిలో ఉంటుంది. పూర్తిగా షేర్ల రూపంలో కుదిరిన ఈ డీల్ రెండేళ్లలోపు పూర్తికావచ్చని భావిస్తున్నారు. కొత్త కంపెనీ ఛైర్మన్‌గా కుమార మంగళం బిర్లా వ్యవహరించనున్నారు. 

2 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై జరిమానా
రూ.2 లక్షలకుపై బడిన నగదు లావాదేవీలపై వంద శాతం జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒకేసారి 40 చట్టాలకు సవరణలతో కూడిన ఫైనాన్స్ బిల్లుని మార్చి 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2017-18 ఆర్థిక బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ.3 లక్షలుగా పేర్కొన్న కేంద్రం తాజాగా దీనిని రెండు లక్షలకు తగ్గించింది. 
ఆర్థిక బిల్లుకు చేసిన మరో సవరణ ప్రకారం జూలై 1 నుంచి పాన్ దరఖాస్తుకు, ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు ఆధార్ సంఖ్య వివరాలను తప్పనిసరి చేశా రు. దీంతో పాన్ కలిగి ఉన్న వారు జూన్ 1 నుంచి తమ ఆధార్ వివరాలను నిర్దేశించిన పద్ధతిలో అధికారులకు తెలియజేయాలి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 40 సవరణలతో ఫైనాన్స్ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : రూ.2 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై జరిమానా విధించడం సహా మరికొన్ని మార్పులు 

2.41 లక్షల కోట్లకు మీడియా, వినోద వ్యాపారం: ఫిక్కీ
2021 నాటికి దేశీయ మీడియా, వినోద రంగం వ్యాపారం విలువ రూ.2.41 లక్షల కోట్లకు చేరుతుందని ఫిక్కీ, కేపీఎంజీ సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు మార్చి 21న ముంబైలో జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ సదస్సులో అధ్యయన నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం ఈ రంగంలో వచ్చే నాలుగేళ్ల పాటు వార్షికంగా 13.9 శాతం చొప్పున వృద్ధి నమోదు కానుంది. 
2016-17లో మీడియా, వినోద రంగంలో వృద్ధి

ఈ కాలంలో టెలివిజన్ పరిశ్రమలో వృద్ధి 8.5 శాతం.ప్రింట్ మీడియా ఆదాయ వృద్ధి 7 శాతం.సినిమాల ఆదాయంలో వృద్ధి 3 శాతం.డిజిటల్ ప్రకటనల్లో వృద్ధి 28 శాతం. మొత్తం ప్రకటనల ఆదాయంలో 15% ఈ విభాగం సొంతం చేసుకుంది.యానిమేషన్ విభాగంలో 16.4 శాతం వృద్ధి నమోదు.క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు మీడియా, వినోద వ్యాపారం 
ఎప్పుడు : మార్చి 21 
ఎవరు : ఫిక్కీ, కేపీఎంజీ

2016-17 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లలో వృద్ధి 
 2016-17 ఆర్థిక సంవత్సరంలో గడచిన 11 నెలల్లో పరోక్ష పన్నుల వసూళ్లు 22.2 శాతం వృద్ధి సాధించాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్ల విషయంలో ఈ రేటు 11 శాతంగా ఉంది. ఈ మేరకు మార్చి 10న పన్నుల గణాంకాలు వెల్లడయ్యాయి. 
గణాంకాల్లో ముఖ్యాంశాలు 
ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు మొత్తంగా రూ.13.89 లక్షల కోట్లు. 2016-17 బడ్జెట్ సవరించిన అంచనాల లక్ష్యం (రూ.16.99 లక్షల కోట్లు)లో ఇది 81.5 శాతం.ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. స్థూలంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) 11.9 శాతంవృద్ధి సాధించగా, వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) విషయంలో ఈ వృద్ధిరేటు 20.8 శాతంగా ఉంది.పరోక్ష పన్ను వసూళ్లు రూ.7.72 లక్షల కోట్లు. తయారీ రంగం క్రియాశీలతకు సూచికయిన ఎక్సైజ్ సుంకాల వసూళ్లు 36.2 శాతం వృద్ధితో రూ.3.45 లక్షల కోట్లకు చేరాయి. సేవల విభాగం పన్ను వసూళ్లు కూడా 20.8 శాతం పెరిగి రూ.2.21 లక్షలకు ఎగశాయి. ఇక కస్టమ్స్ సుంకాల వసూళ్లు 5.2 శాతం వృద్ధితో రూ.2.05 లక్షల కోట్లకు ఎగశాయి.
దేశంలో మొత్తం నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్లు
పెద్ద నోట్లరద్దు తరువాత దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్లని (మార్చి 3 నాటికి) కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నోట్ల వివరాలను మార్చి 10న పార్లమెంటు ముందు ఉంచారు. 2015-16 మార్చి 31 నాటికి రూ. 16.41 లక్షల కోట్లు విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని ఆయన వివరించారు. 
రూ.500 నోటు ముద్రణకు రూ.2.87నుంచి రూ.3.09ల ఖర్చుకాగా, రూ.2 వేల నోటుకు రూ.3.54 నుంచి రూ. 3.77ల ఖర్చు అవుతుంది. దేశం మొత్తం మీద నాలుగు ముద్రణాలయాలు ఉండగా రెండు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో రెండు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్లు
ఎప్పుడు : 2017 మార్చి 3 నాటికి 
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ

నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2017 
2017 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1.36 కోట్ల మంది మిలియనీర్లు ఉన్నారని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఈ మేరకు 2017 వెల్త్ రిపోర్ట్‌ను మార్చి 1న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం మిలియనీర్లలో 2 శాతం మంది భారత్‌లో ఉన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 2,024 మంది బిలియనీర్లు ఉండగా అందులో 5 శాతం మంది భారత్‌కు చెందిన వారు. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లోని 125 నగరాల్లో పెరుగుతున్న కుబేరుల సంఖ్యపై అధ్యయనం ఆధారంగా దీన్ని రూపొందించారు.

నివేదికలోని ఇతర వివరాలు
నికరంగా 30 మిలియన్ డాలర్లు పైగా సంపద ఉన్న వారిని UHNWIలుగా నైట్ ఫ్రాంక్ వర్గీకరించింది.అత్యంత సంపన్నుల సంఖ్య 2 ఏళ్లలో (2015,2016) 12 శాతం పెరిగింది.UHNWI (Ultra high net worth individuals )ల వృద్ధిలో గతేడాది ఆరు స్థానంలో నిలిచిన భారత్. ఇదే వేగం కొనసాగితే వచ్చే దశాబ్దకాలంలో మూడో స్థానానికి చేరే అవకాశం.అత్యధిక సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ముంబై నిలిచింది. ముంబైలో మొత్తం 1,340 మంది UHNWI ఉన్నారు. తర్వాత స్థానాల్లో ఢిల్లీ (680), కోల్‌కతా (280), హైదరాబాద్ (260 మంది) ఉన్నాయి.నగర సంపద సూచీలో టొరంటో, వాషింగ్టన్ డీసీ, మాస్కోలను అధిగమించి ముంబై 21వ స్థానం దక్కించుకుంది.
ఎస్‌బీఐలో సగటు నిల్వల లేకుంటే ఛార్జీల మోత 
 ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే ఇకపై ఛార్జీలు విధించాలని భారతీయ స్టేట్ బ్యాంక్-ఎస్‌బీఐ మార్చి 4న నిర్ణయించింది. ఇంతకుముందు అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2012లో నిలిపివేసిన ఎస్‌బీఐ.. తిరిగి 2017 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్‌‌స ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 జరిమానాతోపాటు సేవా రుసుము విధింపు ఉంటుంది. అలాగే సేవింగ్‌‌స ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే తమ బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ డిపాజిట్‌కు గాను రూ.50, దీనికి సేవా రుసుము కలిపి చెల్లించాలి. ఎస్‌బీఐ ఖాతాదారులు సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఐదు సార్లకు మించి నగదు డ్రా చేస్తే ఆపై ప్రతి లావాదేవికి రూ.10 ఛార్జి పడుతుంది. 

నగదు నిల్వలపై ప్రాంతాల వారీగా ఛార్జీలు (నెలవారీగా)
(సగటు నిల్వలు శాతాల వారీగా తగ్గితే)

ప్రాంతం

సగటు నిల్వ

50 %

50-75 %

75 %+

మెట్రోలు

రూ.5,000

రూ.50

రూ.75

రూ.100

అర్బన్

రూ.3,000

రూ.40

రూ.60

రూ.80

సెబీ అర్బన్

రూ.2,000

రూ.25

రూ.50

రూ.75

గ్రామీణ

రూ.1,000

రూ.20

రూ.30

రూ.50

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖాతాలో సగటు నిల్వలు లేకుంటే జరిమానా 
ఎప్పుడు : 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు 
ఎవరు : భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ)

హురుణ్ వెల్త్ రిపోర్ట్ 2017
దేశంలో 1 బిలియన్ డాలర్లు అంతకన్నా ఎక్కువ నికర సంపద కలిగిన బిలియనీర్ల సంఖ్య 143 నుంచి 132కు తగ్గిందని చైనా సంస్థ హురుణ్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ మేరకు మార్చి 7న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2017 అత్యంత ధనవంతుల జాబితాలో 11 మంది స్థానం కోల్పోయారు. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ (నికర సంపద విలువ 26 బిలియన్ డాలర్లు) కొనసాగుతున్నారు. దేశంలో స్వశక్తితో ఎదిగిన ఏకైక మహిళా బిలియనీర్‌గా కిరణ్ మజుందార్ షా నిలిచారు. 

నగరాల వారీగా ముంబైలో 42 మంది, ఢిల్లీలో 21 మంది, అహ్మదాబాద్‌లో 9 మంది బిలియనీర్లు ఉన్నారు. రాష్ట్రాల వారీగా మహా రాష్ట్రలో 51, ఢిల్లీలో 22, గుజరాత్‌లో 10, కర్ణాటకలో 9 మంది బిలియనీర్లు ఉన్నారు. 

భారత్‌లో అత్యంత సంపన్నులు 

స్థానం

పేరు

సంస్థ

నికర సంపద

1

ముకేశ్ అంబానీ

రిలయన్స్

26 బిలయన్ డాలర్లు

2

ఎస్‌పీ హిందూజా

హిందూజా

14 బిలయన్ డాలర్లు

3

దిలీప్ సంఘ్వీ

సన్‌ఫార్మా

14 బిలయన్ డాలర్లు

4

పల్లోంజీ మిస్త్రీ

టాటా సన్స్

12 బిలియన్ డాలర్లు

5

లక్ష్మీ మిట్టల్

ఎయిర్‌టెల్

12 బిలియన్ డాలర్లు

క్విక్ రివ్యూ:
ఏమిటి : హురుణ్ వెల్త్ రిపోర్ట్ 2017
ఎప్పుడు : మార్చి 7
ఎక్కడ :భారత్‌లో
ఎవరు :చైనా సంస్థ హురుణ్

ఆర్థిక వ్యవహారాలు ఏప్రిల్ 2017 ఎకానమీ
దేశవ్యాప్తంగా 21 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు
పర్యావరణం, ఇంధన సంరక్షణలో భాగంగా జాతీయ విద్యుత్ దీపాల పథకం కింద దేశవ్యాప్తంగా 21 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశామని కేంద్ర విద్యుత్ శాఖ ఏప్రిల్ 28న వెల్లడించింది. ఈ పథకం కింద రాజస్థాన్‌లో అత్యధికంగా 7,04,891 ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ 5,86,037 ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుతో రెండో స్థానంలో నిలిచింది. వీటి ఏర్పాటుతో 2.3 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల కాకుండా నిరోధించగలిగామని, 295 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించింది. 
జాతీయ విద్యుత్ దీపాల పథకాన్ని ప్రధాని మోదీ 2015 జనవరి 5న 100 పట్టణాల్లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశవ్యాప్తంగా 21 లక్షల ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు 
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : కేంద్ర విద్యుత్ శాఖ
ఎందుకు : జాతీయ విద్యుత్ దీపాల పథకంలో భాగంగా 

జీఎస్‌టీతో 8 శాతం పైన వృద్ధి : ఐఎంఎఫ్ 
2017 జూలై 1 నుంచి అమలు కానున్న జీఎస్‌టీ వల్ల భారత వృద్ధి మధ్యకాలంలో 8 శాతం పైగా నమోదుకావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్ ) అంచనా వేసింది. ఈ మేరకు ఏప్రిల్ 28న ఓ నివేదిక విడుదల చేసిన సంస్థ.. భారత్ 2016-17లో 6.8 శాతం, 2017-18లో 7.2 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్ ఎకానమీ అని ఐఎంఎఫ్ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్‌టీతో 8 శాతం పైన వృద్ధి
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : పన్నుల విధానంలో సంస్కరణలతో 

బుందేల్‌ఖండ్ నీటి సంరక్షణ పథకం ప్రారంభం 
తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సాగర్ జిల్లాలోని బాంద్రీలో ఏప్రిల్ 28న పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో వాన నీటి సంరక్షణ కోసం చిన్న నీటి కుంటలు, చెక్ డ్యాంలు, చెరువులను అభివృద్ధి చేస్తారు. తద్వారా భూగర్భ జలాలను పెంచుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీటి సంరక్షణ పథకం ప్రారంభం 
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : కేంద్రమంత్రి ఉమాభారతి 
ఎక్కడ : బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 
ఎందుకు : భుగర్భజలాలు పెంచేందుకు 

రాష్ట్రాలకు నేరుగా విదేశీ రుణం 
 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విదేశీ రుణ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోదం తెలిపినట్టు ఏప్రిల్ 19న ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ రుణ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నేరుగా అప్పు తీసుకునేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడతాయి. వీటికి కేంద్రం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రాలకు నేరుగా విదేశీ రుణ నిబంధనలకు ఆమోదం 
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : విదేశీ రుణ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు 

నీతి ఆయోగ్ విజన్ 2031 - 32 నివేదిక
2032కల్లా అందరికీ అందుబాటులో గృహాలు, ద్విచక్ర వాహనాలు లేదా కార్లు, విద్యుత్తు, ఎయిర్ కండీషనర్లు, డిజిటల్ కనెక్టివిటీని అందుబాటులోకి తేవాలని నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన విజన్ 2031 -32 నివేదికను ఏప్రిల్ 23న జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా వెల్లడించారు. 
కీలక ప్రతిపాదనలు 
2015-16లో 1.06 లక్షలుగా ఉన్న ఒక్కొక్కరి తలసరి ఆదాయాన్ని మూడింతలు పెంచి 2031-32 కల్లా రూ. 3.14 లక్షలకు చేర్చాలి.స్థూల దేశీయోత్పత్తిని రూ. 137 లక్షల కోట్ల నుంచి రూ. 469 లక్షల కోట్లకు పెంచాలి.2031 - 32 నాటి కి పూర్తి అక్షరాస్యత గల సమాజాన్ని ఏర్పాటు చేయాలి.ప్రపంచ స్థాయి సౌకర్యాల నుంచి ఆరోగ్య సంరక్షణ వరకూ అన్నీ ప్రజలకు అందించాలి.

క్విక్ రివ్యూ:
ఏమిటి : విజన్ 2031 - 32 
ఎప్పుడు : ఏప్రిల్ 23 
ఎవరు : నీతి ఆయోగ్ 
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : దేశంలో జీవన ప్రమాణాలు పెంచేందుకు

2017-18లో భారత వృద్ధి రేటు 7.2 శాతం : ప్రపంచ బ్యాంకు 
2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు “Globalization Backlash” పేరుతో ఏప్రిల్ 17న నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2016-17లో 6.8 శాతంగా నమోదైన భారత వృద్ధి రేటు 2017-18లో 7.2 శాతానికి చేరుతుందని.. 2018-19 నాటికి ఇది 7.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని తెలిపింది. 
దక్షిణాసియా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7.2 శాతంగా భారత్ వృద్ధి రేటు
ఎప్పుడు : 2017-18లో 
ఎవరు : ప్రపంచ బ్యాంకు 
ఎక్కడ : Globalization Backlash నివేదికలో

2017లో భారత వృద్ధి రేటు 7.2 శాతం : ఐఎంఎఫ్
 2017 సంవత్సరానికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 7.2 శాతంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. డీమోనిటైజేషన్ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల వృద్ధి రేటును కుదిస్తున్నట్లు తాజా వార్షిక ప్రపంచ ఆర్థిక విశ్లేషణ (డబ్ల్యఈఓ)లో వెల్లడించింది.
మరో వైపు 2016లో 3.1 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 2017లో 3.5 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇది 2018లో 3.6 శాతానికి చేరుతుందనీ తెలిపింది. ఇక చైనా వృద్ధి రేటు 2017లో 6.6 శాతంగా ఉంటుందని పేర్కొన్న ఐఎంఎఫ్, 2018లో ఇది 6.2 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ది రేటు 7.2 శాతానికి కుదింపు 
ఎప్పుడు : 2017 సంవత్సరానికి
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
ఎందుకు : డీమోనిటైజేషన్ కారణంగా

5 నగరాల్లో రోజూ పెట్రోల్ ధర మార్పు
అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మే 1 నుంచి రోజూ మారనున్నాయి. ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విధానాన్ని మొదట విశాఖపట్నం, ఉదయ్‌పూర్, జంషెడ్‌పూర్, చండీగఢ్, పుదుచ్చేరి నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. 

మార్చిలో 5.7% తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 5.7 శాతానికి తగ్గింది. కూరగాయలు, పప్పుదినుసులు వంటి ఆహార వస్తువుల ధరలు పెరిగినప్పటికీ డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటంతో తయారీ వస్తువులు, చమురు ధరలు తగ్గాయి. దాంతో టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా తగ్గింది.

కార్పొరేట్ అవినీతిలో 9వ స్థానంలో భారత్ 
 వ్యాపారాల నిర్వహణలో అవినీతి, లంచగొండితనం విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిల్చింది. ఈ మేరకు కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఏప్రిల్ 6న యూరప్, మధ్యప్రాచ్యం, భారత్, ఆఫ్రికా (ఈఎంఈఐఏ) ఫ్రాడ్ సర్వే 2017ను విడుదల చేసింది. 41 దేశాలతో కూడిన ఈ జాబితాలో ఉక్రెయిన్ తొలిస్థానంలో ఉండగా సెప్రస్, గ్రీస్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈఎంఈఐఏ ఫ్రాడ్ సర్వే 2017
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : ఈవై సంస్థ 
ఎక్కడ : యూరప్, మధ్యప్రాచ్యం, భారత్, ఆఫ్రికాలో 

రివర్స్ రెపో రేటు 0.25 శాతం పెంపు 
ఏప్రిల్ 6న జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటుని 6.25 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. రివర్స్ రెపో రేటుని మాత్రం 0.25 శాతం పెంచింది. దీంతో రివర్స్ రెపో రేటు 6 శాతానికి చేరింది.
(రివర్స్ రెపో - బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసే నిధులకు లభించే వడ్డీ రేటు) 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 తొలి పరపతి విధాన సమీక్ష
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : ఆర్బీఐ 

2020కి భారత ఇంటర్నెట్ వ్యాపారం 250 బిలియన్ డాలర్లు : బీసీజీ
2020 నాటికి భారత ఇంటర్నెట్ ఎకానమీ 250 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.16,25,000 కోట్లు) చేరనుంది. ఈ మేరకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టీఐఈ) ఏప్రిల్ 7న నివేదిక విడుదల చేశాయి. భారత్‌లో ప్రస్తుత ఇంటర్నెట్ వ్యాపారం 100 - 130 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. 
ప్రస్తుతం భారత్ 39.1 కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 2020 నాటికల్లా ఈ సంఖ్య 65 కోట్లకు చేరనుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 నాటికి ఇంటర్నెట్ వ్యాపారం 250 బిలియన్ డాలర్లు
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : బీసీజీ - టీఐఈ
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : మొబైల్ నెట్ వినియోగం, ఆన్‌లైన్ యూజర్లు పెరుగుతున్నందున 

పర్యాటకంలో భారత్‌కు 40వ ర్యాంకు 
ప్రపంచ ప్రయాణ, పర్యాటక పోటీతత్వ జాబితా - 2017 ( Travel and Tourism Competitive Index )లో భారత్ 40వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఏప్రిల్ 6న నివేదికను విడుదల చేసింది. 2016లో దేశంలో పర్యాటక అభివృద్ధి సమాచారం ఆధారంగా భారత్‌కు ఈ ర్యాంకు కేటాయించినట్లు సంస్థ పేర్కొంది. 
పర్యాటకంగా 2013 ర్యాంకింగ్స్‌లో 65వ స్థానంలో నిలిచిన భారత్ 2015లో 52వ స్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటిటివ్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ప్రపంచ ఆర్థిక ఫోరమ్ 
ఎక్కడ : భారత్‌కు 40వ ర్యాంకు 

మూడేళ్లలో రూ.1.37 లక్షల కోట్ల పన్ను ఎగవేత 
గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం రూ.1.37 లక్షల కోట్ల పన్ను ఎగవేతలను ఆదాయ పన్ను విభాగం గుర్తించింది. ఏప్రిల్ 7న ఈ వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఈ సమయంలో పన్నుల ఎగవేతకు సంబంధించి 2,814 కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 1.37 లక్షల కోట్ల పన్నుల ఎగవేతలు 
ఎప్పుడు : గత మూడేళ్లలో 
ఎవరు : కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా

జీఎస్టీ బిల్లులకి లోక్‌సభ ఆమోదం 
 జీఎస్టీ (Goods and Service Tax)కి సంబంధించిన 4 అనుబంధ బిల్లులకు మార్చి 29న లోక్‌సభ ఆమోదం తెలిపింది. 7 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం సెంట్రల్ జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ) -2017, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ)-2017, యూనియన్ టెరిటరీ జీఎస్టీ బిల్లు (యూటీజీఎస్టీ)-2017, జీఎస్టీ పరిహార బిల్లు (రాష్ట్రాలకు)-2017లను లోక్‌సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో అసలు జీఎస్టీ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలతో కూడిన సమగ్ర విశ్లేషణ మీకోసం... 
జీఎస్టీ అంటే... 
దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ అమలు కోసం, పన్నుపై పన్ను వేసే పద్ధతిని నిర్మూలించే ఉద్దేశంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వస్తువులు లేదా సేవల సరఫరాపై విధించే సమగ్ర పన్ను. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో జీఎస్‌టీ లేదా వ్యాట్ అమలవుతోంది. అమలు విషయానికొస్తే ఒక వస్తువు వినియోగదారుడిని చేరాలంటే ముడిసరుకు నుంచి తయారీ, హోల్‌సేల్, రిటైల్ ఇలా పలు దశలుంటాయి. సేవల విషయంలోనూ అంతే. ప్రతి దశలోనూ కొంత విలువ జోడిస్తారు. అందువల్ల ఈ దశలన్నింటిలో పన్ను వసూలవుతుంది. కొన్నిసార్లు పన్నుపై పన్ను వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో ఈ పన్నులన్నీ రద్దయి ఒకే పన్ను అమలవుతుంది. కేంద్ర ఎకై ్సజ్ సుంకం, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్), వినోద, విలాస, ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ స్థానంలో.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఒక్కటే ఉంటుంది. ఒక్క జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మినహా దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ వర్తిస్తుంది. 
సీజీఎస్టీ బిల్లు

వస్తువులు, సేవల అంతర్రాష్ట్ర సరఫరాలపై కేంద్రం విధించే సీజీఎస్టీ- జమ్మూ, కాశ్మీర్ మినహా మొత్తం దేశానికి వర్తిస్తుంది.షెడ్యూల్ 1 రెడ్‌విత్ 7 ప్రకారం, ఒక ఏడాదిలో ఒక యజమాని ఒక ఉద్యోగికి రూ.50,000లోపు ఇచ్చే బహుమతి వస్తు, సేవల సరఫరాగా పరిగణించరాదు.షెడ్యూల్ 3 ప్రకారం, కొన్ని కార్యకలాపాలను వస్తు, సేవలుగా పరిగణించరాదు. ఇందులో లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లిగ్ మినహా ఇతర ఆర్థిక క్లెయిమ్‌లు ఉన్నాయి. దేశంలో విదేశీ దౌత్య బృందం సేవలూ ఇదే కోవకు వస్తాయి. భవన నిర్మాణం, భూ అమ్మకాలు ఈ పరిధిలో ఉన్నాయి.ఆల్కాహాలిక్ లిక్కర్ సరఫరాల మినహా ఇతర అంతర్రాష్ట్ర వస్తుసేవల సరఫరాలకు సీజీఎస్టీ వర్తిస్తుంది.సీజీఎస్టీ రేట్ పరిమితిని 14 శాతం నుంచి 20 శాతానికి పెంపు.జీఎస్టీ మండలి సిఫారసులపై ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి పెట్రోలియం క్రూడ్, హైస్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డీ), పెట్రోల్, నేచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్)ల సరఫరాలపై సీజీఎస్టీ అమలవుతుంది.జీఎస్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌తో ఎటువంటి సంబంధం లేకుండా, వస్తు, సేవలకు సంబంధించి సమగ్రమైన రికార్డులను ట్రాన్‌‌స పోర్టర్ కలిగి ఉండాలి. వార్షిక రిటర్న్స్ సమర్పించిన తేదీ నుంచి 72 నెలల లోపు అకౌంట్, రికార్డ్ పుస్తకాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించడానికి గడువు ఇంతకుముందు 60 నెలలుగా ఉండేది.


ఐజీఎస్టీ బిల్లు...
జీఎస్‌టీలోని ప్రధాన మూడు భాగాల్లో (సీజీఎస్‌టీ, ఐటీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ) ఇంటిగ్రేటెడ్ వస్తు, సేవల పన్ను ఒకటి. ఒకదేశం-ఒకే పన్ను భావనకు ఇదే మూలం. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వస్తు, సేవల రవాణా సందర్భంలో ఐజీఎస్‌టీని కేంద్రం వసూలు చేస్తుంది. అధికారులు స్థిరీకరించిన రేట్ల ప్రకారం, ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్రాలు పంచుకుంటాయి. ఇది కూడా సీఎస్‌ఎస్‌టీ తరహాలోనే జమ్మూకాశ్మీర్‌కు కాకుండా మొత్తం దేశానికి వర్తిస్తుంది. పరిమితిని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. ఆల్కాహాలిక్ లిక్కర్‌పై ఐజీఎస్‌టీ ఉండదు. 

యూటీజీఎస్టీ బిల్లు
యూటీజీఎస్‌టీ(కేంద్ర పాలిత ప్రాంతం జీఎస్టీ)... కేంద్ర పాలిత ప్రాంతాల్లో వస్తువులు, సేవలపై పన్ను వసూళ్లకు యూటీజీఎస్టీ నిబంధనలు వర్తిస్తాయి. అసెంబ్లీలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే యూటీజీఎస్టీ అమలవుతుంది. ఢిల్లీ, పుదుచ్చేరిలకు అసెంబ్లీలు ఉన్నందుకు ఆ రెండూ చోట్ల మాత్రం ఎస్‌జీఎస్‌టీ అమలవుతుంది. రాష్ట్రాలకు ఎస్‌జీఎస్టీ అమలవుతున్నందుకు కేంద్ర పాలిత ప్రాంతాల కోసం అతి తక్కువ సమయంలో యూటీజీఎస్టీని రూపొందించారు. ఎస్‌జీఎస్టీలోని నిబంధనలే దాదాపుగా యూటీజీఎస్టీలో పొందుపర్చారు. 

రాష్ట్రాలకు పరిహార బిల్లు
జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే నష్టం భర్తీ కోసం పరిహార చట్టాన్ని రూపొందించారు. నష్టాల భర్తీ కోసం రాష్ట్రాలకు మొదటి సంవత్సరం రూ. 50 వేల కోట్లు చెల్లించాల్సి రావచ్చని కేంద్రం అంచనా వేసింది. ఈ మొత్తంలో రూ. 26 వేల కోట్లను క్లీన్ ఎన్విరాన్‌మెంట్ సెస్సుగా వసూలు చేస్తారు. ఇక మిగతా రూ. 24 వేల కోట్లను పొగాకు, విలాసవంతమైన కార్లు, పాన్ మసాల, కొన్ని శీతల పానీయాలపై అదనపు పన్ను ద్వారా సేకరిస్తారు. జీఎస్టీ అమలు తేదీ నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తారు. రెండు నెలలకోసారి రాష్ట్రాలకు చెల్లింపులు చేస్తారు. ఐదేళ్ల అనంతరం పరిహార నిధిలో మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ అనుబంధ బిల్లులకి లోక్‌సభ ఆమోదం 
ఎప్పుడు : మార్చి 29
ఎందుకు : దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం కోసం 

2016-17లో కేంద్ర పన్నుల వసూళ్లు రూ.17.10 లక్షల కోట్లు 
2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వసూళ్లు రూ.17.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 4న వెల్లడించింది. 2017 ఫిబ్రవరిలో బడ్జెట్ సందర్భంగా రూ.16.97 లక్షల కోట్ల పన్ను వసూళ్లను అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వం సవరించిన లక్ష్యాన్ని పేర్కొంది. కానీ పన్నుల వసూళ్లు అంతకు మించి వసూలయ్యాయి. 2015-16తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2016-17లో కేంద్ర పన్నుల వసూళ్లు రూ.17.10 లక్షల కోట్లు 
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ 

ప్రసూతి చట్టం-2016కు రాష్ట్రపతి ఆమోదం 
ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం-2016కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 29న ఆమోదముద్ర వేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న 18 లక్షల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చట్టం ద్వారా ప్రపంచంలో ప్రసూతి సెలవులు ఎక్కువ ఇచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. కొత్త చట్టం ప్రకారం 50 లేదా అంత కంటే ఎక్కువ మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థలు వారి పిల్లల కోసం కచ్చితంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రసూతి చట్టం-2016కు రాష్ట్రపతి ఆమోదం 
ఎప్పుడు : మార్చి 29
ఎందుకు : ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచేందుకు 

ఐటీ రిటర్న్స్ దాఖలుకు కొత్తగా ఐటీఆర్ 1 ఫామ్
ఐటీ రిటర్న్స్‌ను సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఒకే ఒక్క పేజీతో కూడిన ఐటీఆర్ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 31న నోటిఫై చేసింది. ప్రస్తుతం ఉన్న ఏడు పేజీల ఐటీఆర్ పత్రం స్థానంలో ఆదాయపన్ను శాఖ కొత్తగా ఫామ్-1 సహజ్‌ను తీసుకొచ్చింది.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జీతం పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ల జీతాలను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గవర్నర్, డిప్యూటీ గవర్నర్‌ల మూల వేతనాలు ఏకంగా 100 శాతం మేర పెరిగాయి. తాజా పెంపుతో ఉర్జిత్ పటేల్.. నెలకు రూ.2.50 లక్షల జీతం అందుకోనుండగా.. డిప్యూటీ గవర్నర్‌లు రూ.2.25 లక్షలు పొందనున్నారు. 

అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించిన ఎస్‌బీఐ
భారతీయ స్టేట్ బ్యాంకు-ఎస్‌బీఐలో ఆరు అనుబంధ బ్యాంకులు (స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, భారతీయ మహిళా బ్యాంకు) ఏప్రిల్ 1న విలీనమయ్యాయి. దీంతో ఎస్‌బీఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు చేరింది. ఈ ప్రక్రియతో దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ శాఖల సంఖ్య 24 వేలకు చేరగా సంస్థ ఆధ్వర్యంలోని ఏటీఎంల సంఖ్య 59 వేలకు పెరిగింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌బీఐలో విలీనమైన అనుబంధ బ్యాంకులు 
ఎప్పుడు : ఏప్రిల్ 1 
ఎవరు : భారతీయ స్టేట్ బ్యాంకు 

విద్యుత్‌లో నికర ఎగుమతులు నమోదు చేసిన భారత్ 
ఇన్నాళ్లూ విద్యుత్ దిగుమతిపై అధికంగా ఆధారపడిన భారత్ మొదటిసారి నికర ఎగుమతి దారుగా నిలిచింది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశాలకు భారత్ 5,798 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఎగుమతి చేయడం ద్వారా ఈ గుర్తింపు పొందిందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మార్చి 29న వెల్లడించింది. మొత్తంగా గత మూడేళ్లలో భారత్ నుంచి విద్యుత్ ఎగుమతులు నేపాల్‌కు 2.5 రెట్లు, బంగ్లాదేశ్‌కు 2.8 రెట్లు పెరిగాయి. 
భూటాన్ నుంచి భారత్ సగటున ఏటా 5,000 - 5,500 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకుంటోంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యుత్‌లో నికర ఎగుమతులు నమోదు చేసిన భారత్ 
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 

3 ఉక్కు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ 
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) ఆధ్వర్యంలోని విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్, భద్రావతి, సేలమ్ స్టీల్ ప్లాంట్ అండ్ సహా అనుబంధ సంస్థల్లో కేంద్రం పెట్టుబడులు ఉపసంహరించింది. ఈ మేరకు మార్చి 29న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 3 ఉక్కు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ 
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : నష్టాలతో 

స్వయం సేవక బృందాలతో బ్యాంకింగ్ సేవలు 
స్వయం సేవక బృందాల (Self Help Groups - SHG) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఒడిశా గుర్తింపు పొందింది. ఈ మేరకు కార్యక్రమం అమలు కోసం ఒడిశా ప్రభుత్వం తరపున ఒడిశా లైవ్‌లీహుడ్ మిషన్(ఓఎల్‌ఎమ్) సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్-ఎస్‌బీఐతో మార్చి 29న ఒప్పందం కుదుర్చుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వయం సేవక బృందాలతో బ్యాంకింగ్ సేవలు 
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : ఒడిశా ప్రభుత్వం 
ఎందుకు : మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు

ఆర్థిక వ్యవహారాలు మే 2017 ఎకానమీ
భారత్‌లోకి రూ.3.99 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు
 ప్రపంచంలో అత్యధికంగా విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షిస్తున్న దేశంగా భారత్ వరుసగా రెండో ఏడాదీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ మేరకు 2016వ సంవత్సరంలో 62.3 బిలియన్ డాలర్ల (రూ.3.99 లక్షల కోట్లు సుమారు) ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. ఫైనాన్షియల్ టైమ్స్‌కు చెందిన ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్‌‌స విభాగం ‘ఎఫ్‌డీఐ 2017’ నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. 
ఈ నివేదిక ప్రకారం ఎఫ్‌డీలను రాబట్టడంలో చైనా, అమెరికాలు భారత్ వెనుకనే నిలిచాయి. గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా భారత్ వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నదని, చైనా అమెరికాల కంటే ముందు నిలిచిందని నివేదిక స్పష్టం చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లోకి ఎఫ్‌డీఐలు 62.3 బిలియన్ డాలర్లు 
ఎప్పుడు : 2016లో 
ఎవరు : ఎఫ్‌డీఐ - 2017 నివేదిక, ఫైనాన్షియల్ టైమ్స్ 

చందా కొచర్ వేతనం రూ. 7.85 కోట్లు
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ అధిపతి చందా కొచర్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7.85 కోట్ల వేతనం అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 64 శాతం అధికం. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం ఆమె మూలవేతనం 15 శాతం పెరిగి రూ. 2.67 కోట్లకు చేరింది. రోజువారీగా చూస్తే కొచర్ రోజుకు.. రూ. 2.18 లక్షల వేతనం అందుకుంటున్నారు. అలాగే 2016-17లో ఆమె రూ. 2.2 కోట్ల బోనస్ పొందారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : చందా కొచర్ వేతనం రూ.7.85 కోట్లు 
ఎప్పుడు : 2016-17 ఆర్థిక సంవత్సరంలో 
ఎవరు : ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో

అత్యంత లాభదాయక పీఎస్‌యూగా ఐఓసీ
దేశంలో అత్యంత లాభదాయక ప్రభుత్వ రంగ కంపెనీగా (పీఎస్‌యూ) పెట్రో మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఆవిర్భవించింది. టర్నోవర్‌కు సంబంధించి అతిపెద్ద కంపెనీగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఐఓసీ నికరలాభం 2017 మార్చితో ముగిసిన ఏడాదిలో 70 శాతం వృద్ధితో రూ. 19,106 కోట్లకు చేరింది. దీంతో లాభాల విషయంలో చమురు ఉత్పాదక దిగ్గజం ఓఎన్‌జీసీని ఐఓసీ అధిగమించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ రూ. 17,900 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ నికరలాభం రూ. 16,140 కోట్లుకాగా, ఐఓసీ నికరలాభం రూ. 11,242 కోట్లు మాత్రమే. 
ప్రైవేటు రంగ కంపెనీల్లో అత్యధిక లాభదాయక కంపెనీగా రిలయన్‌‌స ఇండస్ట్రీస్ వరుసగా మూడో ఏడాది నిలిచింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 29,901 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. తర్వాతి స్థానంలో రూ.26,357 కోట్ల లాభంతో టీసీఎస్ ఉంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో లాభదాయక సంస్థలు
ఎప్పుడు : మే 25
ఎవరు : పీఎస్‌యూ - ఐఓసీ, ప్రైవేటులో రిలియన్స్

2017-18లో భారత వృద్ధి రేటు 7.2 శాతం 
భారత ఆర్థిక వ్యవస్థ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అలాగే 2019-20 నాటికి 7.7 శాతం వృద్ధి రేటుకు చేరుకుంటుందని వివరించింది. ఈ మేరకు మే 29న ‘ఇండియా డెవలప్‌మెంట్ రిపోర్ట్’ను విడుదల చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా 
ఎప్పుడు : 2017-18 ఆర్థిక సంవత్సరంలో 
ఎవరు : ప్రపంచ బ్యాంకు

జీఎస్టీ పన్ను రేట్లు ఖరారు
జీఎస్టీ అమలులో భాగంగా వస్తువులు, సేవలపై పన్ను రేట్లను జీఎస్టీ మండలి ఖరారు చేసింది. విద్య, వైద్యం వంటి సేవల్ని పన్ను పరిధి నుంచి పూర్తిగా మినహాయించగా.. మిగతా సేవల్ని 5%, 12%, 18%, 28% పన్ను శ్లాబుల్లోకి చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శ్రీనగర్‌లో రెండు రోజుల పాటు (మే 18 - 19) భేటీ అయిన జీఎస్టీ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో జూలై 1 నుంచి టెలికం, బ్యాంకింగ్, బీమా సేవలు ప్రియం కానున్నాయి. బంగారంపై రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు.
ఏ ఏ వస్తువలపై ఎంత పన్ను..
ప్రస్తుతం కొబ్బరినూనె, సబ్బులు, టూత్ పేస్టులపై 22 నుంచి 24 శాతం పన్ను వసూలు చేస్తుండగా వాటిని 18 శాతం శ్లాబులో చేర్చారు. బొగ్గుపై ప్రస్తుతం వసూలు చేస్తోన్న 11.69 శాతం పన్నుకు బదులు జీఎస్టీ అమల్లోకి వస్తే 5 శాతమే వసూలు చేస్తారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి చవకై వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రాణాల్ని కాపాడే మందుల్ని 5 శాతం పరిధిలో.. కేపిటల్ గూడ్‌‌స(ఇతర వస్తువుల తయారీకి వాడే యంత్రాలు, భవనాలు వంటివి) ఇండస్ట్రియల్ ఇంటర్మీడియరీస్‌లను 18% పరిధిలో చేర్చారు. ప్రస్తుతం వీటిపై 28% పన్ను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నట్లే పాలు, పెరుగుపై ఎలాంటి పన్ను ఉండదు. స్వీట్లపై మాత్రం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. రోజువాడే పంచదార, టీ, కాఫీ, వంట నూనెలపై 5 శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది. గోధుమలు, వరిని పన్ను పరిధి నుంచి మినహాయించారు. ప్రస్తుతం వీటిపై కొన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న వ్యాట్ కూడా రద్దయితే ధరలు మరింత తగ్గే అవకాశముంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్‌పై ప్రస్తుతం 32 శాతం పన్ను ఉండగా... వాటిని 28% శ్లాబులోకి చేర్చారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్స్‌ను 28% పన్ను శ్రేణిలో చేర్చారు.
ఏఏ సేవలపై ఎంత పన్ను..రవాణా రంగం(రైల్వేలు, విమాన ప్రయాణం)పై 5 శాతం జీఎస్టీ.. వీటి ప్రధాన ఇంధనమైన పెట్రోలియంను ఇంకా జీఎస్టీ పరిధిలోకి తేనందున 5 శాతం శ్లాబులో చేర్చారు.విమాన ప్రయాణంలో ఎకానమీ క్లాస్‌పై 5 శాతం, బిజినెస్ క్లాస్‌పై 12 శాతం పన్ను వసూలు. ఏసీ రైలు ప్రయాణంపై 5 శాతం పన్ను.నాన్ ఏసీ హోటల్స్‌పై 12 శాతం.ఏసీ హోటల్స్, మద్యం సరఫరా చేసే ఏసీ హోటల్స్‌పై 18 శాతం ఏడాదికి రూ. 50 లక్షలు, అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న రెస్టారెంట్లపై 5 శాతం జీఎస్టీ.హోటల్స్, లాడ్జిల్లో రోజువారీ టారిఫ్ రూ.1000 కంటే తక్కువ ఉంటే పన్ను ఉండదు. రూ.2500-5000 మధ్య టారిఫ్‌కు 18 శాతం, విలాసవంతమైన, ఐదు నక్షత్రాల హోటల్స్‌పై 28 శాతంరేస్ క్లబ్బుల్లో బెట్టింగ్‌లు, సినిమాలపై 28 శాతం(ప్రస్తుతం సినిమాలపై చాలా రాష్ట్రాల్లో 40-45 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను తగ్గించడం వల్ల సినిమా టికెట్ల ధరలు తగ్గే అవకాశముంది)టెలికంపై 18 శాతం(ప్రస్తుతం ఫోన్ బిల్లు చెల్లింపులపై 15 శాతం వసూలు), ఆర్థిక సేవలపై(బ్యాంకింగ్, బీమా) 18 శాతం(ప్రస్తుతం వీటిపై 15 శాతం పన్ను వసూలు చేస్తున్నారు).ఈ కామర్స్ వెబ్‌సైట్లు(ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటివి) సప్లయిర్స్‌కు నగదు చెల్లించకముందే 1 శాతం పన్ను ముందుగానే వసూలు చేయాలి.క్యాబ్ అగ్రిగేటర్స్ (ఒలా, ఉబెర్) సేవలపై 5 శాతం.. ప్రస్తుతం 6 శాతం పన్ను చెల్లిస్తున్నాయి.వర్క్ కాంట్రాక్టులపై 12 శాతంవార్తాపత్రికల్లో ప్రకటనల కోసం స్థలాన్ని అమ్మితే 5 శాతం పన్ను (ప్రస్తుతం ఎలాంటి పన్ను వసూలు చేయడం లేదు).మినహాయింపు
విద్య, వైద్యం, మెట్రో, లోకల్, రైళ్లలో ప్రయాణం, తీర్థయాత్రలు, హజ్‌యాత్రలు
28 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేవి
శీతల పానీయాలు, చూయింగ్ గమ్స్, వైట్ చాకొలెట్స్, చాకొలెట్స్, కోకో చాకొలెట్స్, వేఫర్ చాకొలెట్స్, ఇన్‌స్టంట్ కాఫీ, కస్టర్డ్ పౌడర్, విద్యార్థులు వాడే రంగులు, పెయింట్స్, వార్నిష్‌లు, పెర్‌ఫ్యూమ్స్, సౌందర్య ఉత్పత్తులు, సన్‌స్క్రీన్స్, షాంపూలు, హెయిర్ డైలు, షేవింగ్ లోషన్‌‌స, డియోడరంట్స్, బాణాసంచా, వాష్ బేసిన్‌‌స, కృత్రిమ ఫర్ ఉత్పత్తులు, కృత్రిమ పువ్వులు, విగ్గులు, రేజర్ బ్లేడ్‌లు, వంటకు వాడే కత్తులు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్టోరేజ్ వాటర్ హీటర్స్, ఫొటోకాపీ యంత్రాలు, ఫ్యాక్స్ యంత్రాలు, ఇన్సులేటెడ్ కాపర్ తీగ, వాచీలు, రివాల్వర్లు, పిస్టల్స్, సిగరెట్ లైటర్లు, బెట్టింగ్, సినిమా హాళ్లు, పరిమళ ద్రవ్యాలు, ఉన్ని మొదలైనవి.
18 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేవి
హెల్మెట్లు, ఎల్పీజీ స్టవ్‌లు, అణు రియాక్టర్లు, గడియారాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, ప్లాస్టిక్ బటన్లు, వెన్న, జున్ను, కండెన్‌‌సడ్ మిల్క్, మద్యం లెసైన్సు ఉన్న ఏసీ రెస్టారెంట్లు, టెలికం, ఆర్థిక సేవలు
12 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేవి
మొబైల్ ఫోన్లు, ఫౌంటేన్ పెన్ ఇంకు, టూత్ పౌడర్, అగరవత్తులు, పాల సీసా, బ్రెయిలీ పేపర్, రంగులేసే పుస్తకాలు, గొడుగులు, పెన్సిల్ షార్ప్‌నర్, ట్రాక్టర్లు, సైకిళ్లు, కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు, వంటపాత్రలు, క్రీడా సామగ్రి, ఫిషింగ్ రాడ్లు, దువ్వెనలు, పెన్సిళ్లు, పెయింటింగ్‌లు, పండ్ల రసాలు, మాంసం, ఏసీ లేని రెస్టారెంట్లు
5 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేవి
టీ, కాఫీ(ఇన్‌స్టంట్ కానిది), వేరుశనగ, చేపలు, కిరోసిన్ లాంతరు, బయో గ్యాస్ ప్లాంట్, పవన విద్యుత్, కేన్ షుగర్, బీట్ షుగర్, రవాణా సేవలు, రూ.50లక్షల టర్నోవర్ గల రెస్టారెంట్లు, ఓలా, ఉబర్ 
పన్ను రేట్లపై మరిన్ని వివరాలు..కార్లను 28 శాతం పన్ను రేటులో ఉంచగా.. నాలుగు మీటర్ల పొడవు కంటే తక్కువ ఉండే చిన్నకార్లు, 1200సీసీ పెట్రోల్ ఇంజిన్ కెపాసిటీ కార్లపై 1% సెస్సు. చిన్న డీజిల్ కార్లు, 1500సీసీ కంటే తక్కువ ఇంజిన్ కార్లపై 3% సెస్సు విధిస్తారు. మధ్యతరహా కార్లు, ఎస్‌యూవీ, ఖరీదైన కార్లపై 15% సెస్సు. 1500సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉన్న విలాసవంతమైన కార్లపై 15% సెస్సు.నిమ్మరసం, ఎరేటెడ్ డ్రింక్స్‌పై 28 శాతం పన్నుతో పాటు 12% సెస్సు,350సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉన్న మోటార్‌సైకిళ్లపై 28 శాతం పన్నుతో పాటు 3% సెస్సు అదనం. ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్, ఖరీదైన పడవలపైనా అదే పన్ను రేటు.పొగాకు, పొగాకు ఉత్పత్తులపై 28 శాతం పన్నుతో పాటు 61 నుంచి 204 శాతం వరకూ సెస్సు విధిస్తారు. ఇక పైప్స్, సిగరెట్స్ కోసం వాడే పొగాకు పదార్థాలపై 290 శాతం పన్ను. 65ఎంఎం పొడవు మించని ఫిల్టర్, నాన్ ఫిల్టర్ సిగరెట్లపై 5% సెస్సు, ఒక్కోదానిపై రూ.1.59 అదనం. 65ఎంఎం నుంచి 70 ఎంఎం పొడవు మించని నాన్‌ఫిల్టర్ సిగరెట్లపై 5% సెస్సు, రూ.2.87అదనం, ఫిల్టర్ సిగరెట్లపై 5% సెస్సు, రూ.2.12 అదనం. బ్రాండెడ్ గుట్కాలపై 72% సెస్సు (వీటన్నింటిని 28 శాతం పన్ను జాబితాలో చేర్చారు).

సీబీఈసీ స్థానంలో సీబీఐసీ ఏర్పాటు 
జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్‌ అండ్ కస్టమ్స్’(సీబీఈసీ) స్థానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ను తీసుకువస్తున్నారు. 2017 జూన్ 1 లోగా ఇది ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్రంలోని డెరైక్టర్ జనరల్ ఆఫ్ హెచ్‌ఆర్‌డీ మే 17న కీలక నిర్ణయం తీసుకుంది. 
సీబీఐసీలో ఛైర్మన్‌తో పాటు జీఎస్టీ అండ్ సెంట్రల్ ట్యాక్స్, ఐటీ లీగల్, ఇన్వెస్టిగేషన్, ట్యాక్స్ పాలసీ, కస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ విజిలెన్‌‌స విభాగాలకు చెందిన ఆరుగురు కీలక సభ్యులుగా ఉంటారు. దీని ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 21 జీఎస్‌టీ జోన్‌లు, 102 జీఎస్‌టీ పన్ను చెల్లింపు సర్వీస్ కమిషనరేట్లు ఉంటాయి. వీటితో పాటు 14 జీఎస్‌టీ సబ్ కమిషనరేట్లు, 768 డివిజన్లు, 3969 రేంజి కార్యాలయాలు, 49 జీఎస్‌టీ ఆడిట్ కమిషనరేట్లు, 50 జీఎస్‌టీ అప్పీల్ కమిషనరేట్లు, 11 కస్టమ్స్ జోన్లు, 60 కస్టమ్స్ కమిషనరేట్లు, 10 కస్టమ్స్ అప్పీల్లు కస్టమ్స్ కమిషనరేట్లు సీబీఐసీ పరిధిలోనే ఉంటాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీబీఈసీ స్థానంలో సీబీఐసీ 
ఎప్పుడు : మే 17
ఎవరు : డెరైక్టర్ జనరల్ ఆఫ్ హెచ్‌ఆర్‌డీ
ఎందుకు : జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో 

ఎమ్మెస్పీపై నీతి ఆయోగ్ ప్రతిపాదనలు 
పంటలకు కనీస మద్దతు ధరలు అమలు చేసే విధానంలో నూతన విధానాలను నీతి ఆయోగ్ కేంద్రానికి ప్రతిపాదించింది. మూడేళ్ల కార్యాచరణ ముసాయిదాలో భాగంగా ఏప్రిల్ 23న జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ ముసాయిదాను చర్చకు పెట్టింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సంస్కరణలు తేవాలని సిఫారసు చేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యానవన పంటలు, పాడి, పౌల్ట్రీ, చేపలు, పందుల పెంపకం తదితర అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు సాగునీటిని అందించే కార్యక్రమాలను విసృ్తతంగా అమలుచేయాలని పేర్కొంది. వీటన్నింటితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం (ఏఎంసీ)లో మార్పులు తేవాలని పేర్కొంది. 
రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు అమ్ముకునేలా తగిన హక్కులు కల్పించడం, కొనుగోలుదారులు రైతుల ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసేలా వీలుకల్పించటం, ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావటం, కాంట్రాక్టు సేద్యాన్ని విసృ్తతపరిచేందుకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించడం వంటి నూతన విధానాలు అవలంబించాలని నీతి ఆయోగ్ పేర్కొంది.
సిఫారసులు

ఎమ్మెస్పీ విధానంలో పంటల సాగు నమూనా దెబ్బతినకుండా ఉండేందుకు ధరల కొరత చెల్లింపు విధానం (ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్-పీడీపీ) అమలు చేయాలి.అవసరాల ఆధారంగా ధాన్య సేకరణకు ఎమ్మెస్పీ విధానం అమలు చేస్తూనే కొత్త విధానం అమలులో భాగంగా నిర్దిష్ట పంటలపై రైతులకు సరైన ధర రానప్పుడు ఆ మేరకు నష్టాన్ని భర్తీ చేయాలి. దీనిని నేరుగా రైతుకు అందజేయాలి.గిట్టుబాటు ధర రానప్పుడు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ విధానంలో ఆయా పంటలను సేకరించాలి.ప్రస్తుతం ఉన్న కౌలు చట్టాల వల్ల రైతులు తమ భూములను కౌలుకు ఇవ్వకుండా అలాగే వదిలేస్తున్నారు. కొత్త కౌలు చట్టాలు తేవడం ద్వారా కౌలుదారులు, భూయజమానుల హక్కులను పరిరక్షిస్తూ ఆయా భూములను సాగులోకి తేవచ్చు.ఈ నూతన విధానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని రానున్న మూడేళ్లలో అమలు చేసే అవకాశం ఉంది.

లాన్సెట్ ఆరోగ్య సర్వేలో భారత్‌కు 154వ ర్యాంకు 
వైద్య సదుపాయాల లభ్యత, నాణ్యతలో లక్ష్యాలను అందుకోవడంలో వెనకబడ్డ భారత్ 154వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు 195 దేశాల్లో నిర్వహించిన Global Burden of Disease study నివేదికను లాన్సెట్ జర్నల్ మే 18న ప్రచురించింది. గత 25 ఏళ్లలో వైద్య రంగం ఎంతో పురోగతి సాధించినప్పటికీ లక్ష్యాలను అందుకోవడంలో భారత్ విఫలమైందని పేర్కొంది. ఈ సర్వేలో 32 రకాల నివారించదగ్గ వ్యాధుల్ని అరికట్టడంతో పాటు 1990 నుంచి వైద్య సదుపాయాల మెరుగుదలపై ర్యాంకులు కేటాయించారు. 
జాబితాలో తొలి 3 స్థానాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, నార్వే నిలవగా అమెరికా తొలిసారి 30వ స్థానానికి దిగజారింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆరోగ్య సర్వేలో భారత్‌కు 154వ ర్యాంకు 
ఎప్పుడు : మే 18
ఎవరు : లాన్సెట్ జర్నల్ 

2016-17లో భారత్‌కు 60.08 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు 
2016-17లో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) విలువ 60.08 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ మేరకు మే 19న ప్రకటించిన కేంద్ర వాణి జ్య, పరిశ్రమల శాఖ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణ వల్లే ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. 2015-16లో ఈ మొత్తం 55.06 బిలియన్ డాలర్లుగా ఉంది. 
ఎఫ్‌డీఐల ప్రవాహానికి వీలు కల్పించేందుకు గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం 21 రంగాలకు సంబంధించిన 87 నిబంధనల్లో మార్పులు చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లోకి 60.08 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు
ఎప్పుడు : 2016 -17లో 
ఎవరు : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 

WTO ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 24వ స్థానం
2014, 2015 సంవత్సరాలకు గాను ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) మే 19న ప్రకటించిన సవరించిన ర్యాంకింగ్స్‌లో భారత్ 24వ స్థానంలో నిలిచింది. ఇదే సంవత్సరాలకు గాను గతంలో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 41, 40 ర్యాంకింగ్స్‌లో ఉన్న భారత్ తాజాగా జాబితాలో 16 స్థానాలు మెరుగుపరుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పర్యాటక ర్యాంకింగ్స్‌లో 24వ స్థానంలో భారత్ 
ఎప్పుడు : 2014, 2015 సంవత్సరాలకు గాను 
ఎవరు : యూఎన్ డబ్ల్యూటీఓ

రైతుల కోసం బీవోబీ ప్రత్యేక డెబిట్ కార్డులు
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇఫ్కో సంయుక్తంగా రైతుల కోసం కో-బ్రాండెడ్ డెబిట్ కార్డులను మే 23న ఆవిష్కరించాయి. వీటికి ఒక నెల వరకు వడ్డీ లేకుండా రూ.2,500 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. 30 రోజులు దాటిన తర్వాత ఓవర్‌డ్రాఫ్ట్‌కు 8.60% వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. రైతుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను పెంచడానికి ఈ కార్డులను తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో రెండు లక్షల కో-బ్రాండెడ్ కార్డులను జారీ చేస్తామని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఈ స్కీమ్ విజయవంతమైతే ఓవర్‌డ్రాఫ్ట్ లిమిట్‌ను మరింత పెంచుతామని పేర్కొన్నాయి. 
రైతులు ఈ సౌలభ్యాన్ని పొందాలంటే ఆధార్ నెంబర్ ఇచ్చి, రూ.100 డిపాజిట్‌తో ‘బరోడా ఇఫ్కో కృషి సేవింగ్ బ్యాంక్ అకౌంట్’ను తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లకు మినిమమ్ బ్యాలెన్‌‌స అవసరం లేదు. క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ డెబిట్ కార్డులు 
ఎప్పుడు : మే 23
ఎవరు : బీవోబీ, ఇఫ్కో

10 లక్షల ఈ-టోల్ ట్యాగ్‌‌స జారీ లక్ష్యం: ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (2018 మార్చికి) 10 లక్షల ఎలక్ట్రానిక్ టోలింగ్ ట్యాగ్‌‌సను జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎలక్ట్రానిక్ టోలింగ్ ట్యాగ్‌‌సను ఫాస్టాగ్‌లుగా పరిగణిస్తామని ప్రకటించింది. వాహనదారులు నేషనల్ హైవేలపై వెళ్లేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద ఆగి, ఫీజు కట్టే ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఫాస్టాగ్‌లను తీసుకొచ్చింది. 
ఫాస్టాగ్‌‌స విధానం
రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ(ఆర్‌ఎఫ్‌ఐడీ) ఆధారంగా ఫాస్టాగ్‌లను రూపొందిస్తారు. వీటిని వాహన అద్దంపై అతికించుకుంటే చాలు.. వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు. గేట్ చార్జీలు ఎలక్ట్రానిక్ విధానంలో ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతాయి. ఈ ట్యాగ్‌‌సను తర్వాత డబ్బులతో నింపుకోవచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 2016 ఏప్రిల్‌లో ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 360కుపైగా టోల్ ప్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 లక్షల ఈ టోల్ టాగ్స్ జారీ 
ఎప్పుడు : 2018 మార్చి నాటికి 
ఎవరు : ఎస్‌బీఐ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు 

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభం
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మే 23న పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. తమ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. కనీస బ్యాలెన్స్ నిబంధనలు, ఆన్‌లైన్ లావాదేవీలకు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్ మొదలైనవి) ఫీజులు ఉండవని పేర్కొంది. 
ఎయిర్‌టెల్, ఇండియా పోస్ట్ తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన సంస్థల్లో పేటీఎం మూడోది. కస్టమరు ఖాతాలో రూ.25,000 డిపాజిట్లు దాటితే రూ. 250 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ప్రారంభం
ఎప్పుడు : మే 23 
ఎవరు : పేటీఎం 
ఎక్కడ : న్యూఢిల్లీ

2050 నాటికి ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులు 
2050 నాటికి భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏళ్లకు పైబడిన వారు ఉంటారని పెన్షన్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించాయి. ఈ మేరకు మే 15న దేశ వయోజనుల ఆర్థిక భద్రత అంశంపై నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం ప్రస్తుతం దేశ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 8.9 శాతంగా ఉండగా.. 2050 నాటికి ఇది 19.4 శాతానికి పెరగనుంది. అలాగే ప్రస్తుతం జనాభాలో 0.9 శాతంగా ఉన్న 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2050 నాటికి 2.8 శాతానికి పెరగనుంది. 
దేశంలో ప్రస్తుతం ప్రతి పన్నెండు మందిలో ఒకరు అరవైలలో ఉన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశ వయోజనుల ఆర్థిక భద్రత నివేదిక
ఎప్పుడు : మే 15
ఎవరు : పీఎఫ్‌ఆర్‌డీఏ, క్రిసిల్

2018లో భారత్ వృద్ధి 8 శాతం: ఐరాస
2018లో భారత వృద్ధి రేటు 8 శాతానికి చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై 2017 మధ్యంతర సమీక్షను మే 16న విడుదల చేసింది. 2017 జనవరిలో విడుదల చేసిన మొదటి నివేదికలో ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7.9 శాతంగా ఉంటుందని పేర్కొన్న ఐరాస.. మధ్యంతర సమీక్షలో దాన్ని సవరించి 7.3 శాతంగా పేర్కొంది. 
ప్రపంచ వృద్ధి 2017లో 2.7 శాతంగా ఉంటే, ఇది వచ్చే ఏడాది 2.9 శాతంగా ఉండే వీలుందని ఐరాస పేర్కొంది. చైనా ప్రస్తుత, వచ్చే సంవత్సరాల్లో 6.5 శాతం వృద్ధి సాధిస్తుందని వివరించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు 8 శాతం
ఎప్పుడు : 2018లో 
ఎవరు : ఐరాస 

100 జిల్లాల్లో తొలి దశ ఎన్‌సీడీ స్క్రీనింగ్ 
రక్తపోటు, మధుమేహం, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్, దంత క్షయం వ్యాధుల గుర్తింపు, నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం మే 16న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి దశలో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్ల లోపు వారికి ఈ ఐదు వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసి, అవగాహన కల్పిస్తారు. ఈ వ్యాధులపై దశలవారీగా 50 కోట్ల మందికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు కేంద్ర ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌సీడీ గుర్తింపు, నివారణ కార్యక్రమం 
ఎప్పుడు : మే 16
ఎవరు : కేంద్ర ఆరోగ్య శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 

విద్యుద్దీకరణలో భారత్‌కు 26వ ర్యాంకు 
ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన విద్యుద్దీకరణ ర్యాంకింగ్స్‌లో భారత్ 26వ స్థానంలో నిలిచింది. 2014 నివేదికలో 99వ స్థానంలో ఉన్న భారత్ ఈ సారి గణనీయమైన పురోగతి సాధించింది. మూడేళ్ల క్రితం దేశంలో విద్యుత్ సదుపాయం లేని గ్రామాల సంఖ్య 18,452గా ఉంది. గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కోసం 2015లో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన (DDUGJY)ను ప్రారంభించిన కేంద్రం రెండేళ్ల కాలంలో 13 వేల గ్రామాలను విద్యుత్ వ్యవస్థతో అనుసంధానం చేసింది. 
2022 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ఈ పథకం లక్ష్యం. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యుద్దీకరణలో 26వ స్థానంలో భారత్ 
ఎప్పుడు : మే 16
ఎవరు : ప్రపంచ బ్యాంకు 

2030 నాటికి మలేరియా రహిత భారత్
దేశంలో మలేరియా వ్యాధిగ్రస్తుల సంఖ్యతో పాటు మలేరియా మరణాలు కూడా గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో కనీసం 15 రాష్ట్రాల్లో మలేరియాను సమూలంగా నిర్మూలించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దేశంలోని 70 శాతం ప్రాంతాలు ఈ వ్యాధి నుంచి విముక్తి పొందాయని, 2030 నాటికి మిగిలిన 30 శాతం ప్రాంతాలను కూడా మలేరియా రహితం చేయనున్నట్లు జాతీయ క్రిమికారక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం సంచాలకులు ఏసీ ధరియావార్ మే 14న వెల్లడించారు.

2017-18లో భారత్ వృద్ధి 7.4 శాతం : ఏడీబీ
 భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్ -2018 మార్చి)లో 7.4 శాతంగా ఉంటుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. ఈ మేరకు మే 3న ఓ నివేదిక విడుదల చేసిన సంస్థ 2018-19లో వృద్ధి రేటు 7.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), దివాలా పన్ను దేశంలో వ్యాపార సానుకూల వాతావరణ సృష్టికి దోహదపడతాయని విశ్లేషించింది. 
ఏడీబీ 50వ వార్షిక సమావేశం మే 4 నుంచి 7 వరకు జపాన్‌లోని యొకోహమాలో జరిగింది. దీనికి వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజర య్యారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి 7.4 శాతంగా అంచనా 
ఎప్పుడు : 2017-18 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : ఏడీబీ

భారత్‌లోకి 50 లక్షల కోట్ల నల్లధనం
భారత దేశంలోకి 2005 నుంచి 2014 మధ్య దాదాపు 770 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50 లక్షల కోట్లు) నల్లధనం వచ్చిందని అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్‌ఐ) వెల్లడించింది. అదే సమయంలో 165 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) నగదు దేశం నుంచి అక్రమంగా వెళ్లిపోయినట్లు జీఎఫ్‌ఐ పేర్కొంది. ఈ మేరకు ‘illicit financial flows to and from developing countries 2005-2014’ అనే శీర్షికతో రూపొందించిన నివేదికను మే 3న విడుదల చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లోకి 50 లక్షల కోట్ల నల్లధనం
ఎప్పుడు : 2005 - 2014 మధ్య కాలంలో
ఎవరు : గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ

బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్‌‌సకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 5న ఆమోద ముద్ర వేశారు. దీని ద్వారా మొండి బకాయిల (ఎన్‌పీఏల) వసూలుకు సంబంధించి ఆర్‌బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలు లభిస్తాయి. తద్వారా రుణ ఎగవేత దారుల విషయంలో ‘ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంక్రప్టసీ కోడ్ 2016’ నిబంధనల కింద దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని ఏ బ్యాంకునైనా ఆర్‌బీఐ ఆదేశించగలదు. 
కాగా దేశీయ బ్యాంకింగ్ రంగంలో 2016 డిసెంబర్ నాటికి మొత్తం ఎన్‌పీఏలు రూ.7లక్షల కోట్లను దాటాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం
ఎప్పుడు : మే 5
ఎవరు : రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీ 
ఎందుకు : మొండి బకాయిల వసూళ్లపై ఆర్బీఐకి మరిన్ని అధికారాలు 

7 ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు
ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్తగా మేనేజింగ్ డెరైక్టర్లను, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మే 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ వీరి నియామకాలకు ఆమోదం తెలిపింది. 
నియామక వివరాలు 

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న రాజ్‌కిరణ్ రాయ్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం మూడేళ్లు.కార్పొరేషన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న సునీల్ మెహతా తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఉన్న ఉషా అనంత సుబ్రమణియన్ తాజాగా అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈమె 2018, ఆగస్ట్ 31 వరకు పదవిలో కొనసాగనున్నారు.ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న సుబ్రమణియ కుమార్ అదే బ్యాంక్ ఎండీ, సీఈవోగా 2019 జూన్ 30 వరకూ పదవిలో కొనసాగనున్నారు.కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న దీనబంధు మొహపత్ర ఇకపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారు.సిండికేట్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఎం.ఒ.రెగో నియమితులయ్యారు. ఈయన ఇప్పటిదాకా బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్నారు.ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న ఆర్.ఎ.శంకర నారాయణన్ ఇకపై విజయా బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించనున్నారు.క్విక్ రివ్యూ:
ఏమిటి : 7 ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు 
ఎప్పుడు : మే 5 
ఎవరు : కేబినెట్ నియామకాల కమిటీ 

372.73 బిలియన్ డాలర్లకు చేరిన భారత్ ఫారెక్స్ నిల్వలు 
భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు ఏప్రిల్ 28తో ముగిసిన వారంలో 1.594 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 372.73 బిలియన్ డాలర్ల ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరాయి. దీనికి ఫారిన్ కరెన్సీ అసెట్స్ పెరుగుదల బాగా దోహదపడింది. ఇవి 1.569 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 349.05 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఈ మేరకు ఆర్‌బీఐ మే 5న తాజా గణాంకాలను వెల్లడించింది. 
ఇక బంగారం నిల్వలు స్థిరంగా 19.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఫారెక్స్ నిల్వలు @ 372.73 బిలియన్ డాలర్లు
ఎప్పుడు : మే 5 
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 

2017లో 7.1 శాతంగా భారత్ వృద్ధి రేటు : ఐరాస 
భారత వృద్ధి రేటు 2017లో 7.1 శాతంగా, 2018లో 7.5 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ మేరకు మే 8న ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి మౌలిక రంగంపై వ్యయాలు దోహదపడతాయని పేర్కొన్న సంస్థ దీనితోపాటు వినియోగంలో మెరుగుదల వృద్ధికి బాటలు వేస్తుందని విశ్లేషించింది.
2017లో ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంటే, 2018లో ఇది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్‌బీఐ లక్ష్యం 4.5-5 శాతం శ్రేణికన్నా ఇది అధికం. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017, 2018లో భారత వృద్ధిపై అంచనా 
ఎప్పుడు : మే 8
ఎవరు : ఐక్యరాజ్య సమితి 

పోస్టాఫీసుల్లో నగదు రహిత సేవలకు ఎస్‌బీఐతో ఒప్పందం
అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లోనూ నగదు రహిత సేవలను అందించేందుకు తపాలా శాఖ ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వెయ్యి పోస్టాఫీసులను గుర్తించిన తపాలా శాఖ వీటిలో దశలవారీగా ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ సేల్ ( పీవోఎస్ ) మేషీన్లను ఏర్పాటు చేయనుంది. 
తెలంగాణ పోస్టల్ సర్కిల్ అధికారులు తొలి విడతగా సికింద్రాబాద్, వరంగల్ హెడ్ పోస్టాఫీసుల్లో పీవోఎస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సర్కిల్ అధికారులు వచ్చే రెండునెలల్లో 25 ప్రధాన పోస్టాఫీసుల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా సేవలను వేగవంతం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోస్టాఫీసుల్లో డిజిటల్ సేవలకు ఎస్‌బీఐతో ఒప్పందం
ఎవరు : భారత తపాలాశాఖ
ఎందుకు : సేవలను నగదు రహితంగా మార్చేందుకు 
ఎక్కడ : దేశవ్యాప్తంగా వెయ్యి శాఖల్లో 

2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 273 మిలియన్ టన్నులు
సమృద్ధిగా కురిసిన వర్షాల కారణంగా 2016 - 17 పంటకాలంలో ( జూలై - జూన్) రికార్డు స్థాయిలో 273.38 టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మే 9న పంట ఉత్పత్తులపై ముందస్తు అంచనాలను విడుదల చేసింది. 
కేంద్రం అంచనాలు 

పంట

ఉత్పత్తి (మిలియన్ టన్నుల్లో)

వరి

109.15

గోధుమ

97.44

పప్పు ధాన్యాలు

22.40

తృణ ధాన్యాలు

44.39


30వ ఆసియాన్ సదస్సు
30వ ఆగ్నేయాసియా (ఆసియాన్) దేశాల సదస్సు ఏప్రిల్ 30న మనీలాలో ముగిసింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షత వహించిన ఈ సదస్సును ‘పార్ట్నరింగ్ ఫర్ చేంజ్, ఎంగేజింగ్ ద వరల్డ్’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఆసియాన్ సభ్య దేశాలైన బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంలు ఈ సదస్సులో పాల్గొన్నాయి.

‘ఒక ఐపీ- రెండు ఆస్పత్రులు’ పథకం ప్రారంభం
వలస కార్మికుల కోసం ‘ఒక ఐపీ (Insured Person)- రెండు ఆస్పత్రులు’(Two Dispensaries) పథకాన్ని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ మే 1న (కార్మిక దినోత్సవం) ప్రారంభించారు. ప్రస్తుతం బీమా తీసుకున్న వ్యక్తి తన కోసం, తన కుటుంబం కోసం ఒక ఆస్పత్రినే ఎంచుకునే వీలుండగా ఈ పథకం కింద తన కోసం ఒక ఆస్పత్రిని, కుటుంబం కోసం మరో ఆస్పత్రిని ఎంచుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒక ఐపీ- రెండు ఆస్పత్రులు’ పథకం
ఎప్పుడు : మే 1
ఎవరు : కేంద్ర కార్మిక శాఖ
ఎందుకు : బీమా ఉన్న వ్యక్తి, అతని కుటుంబం వేరు వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి

పారిశ్రామిక ఉత్పత్తి సూచీకి కొత్త బేస్ ఇయర్
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)కి కొత్త బేస్ ఇయర్ రానుంది. ఈ మేరకు 2011-12 బేస్ ఇయర్‌తో మే 9వ తేదీన కొత్త ఐఐపీ సిరీస్ ప్రారంభం కానుంది. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలకు మరింత పారదర్శకత చేకూరనుంది. ప్రస్తుతం ఐఐపీకి 2004-05 బేస్ ఇయర్‌గా ఉంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఇప్పటికే కొత్త బేస్ ఇయర్‌ను వినియోగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పారిశ్రామిక ఉత్పత్తి సూచీకి కొత్త బేస్ ఇయర్
ఎప్పుడు : మే 9
ఎందుకు : పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల్లో పారదర్శకత కోసం

ఆర్థిక వ్యవహారాలు జూన్ 2017 ఎకానమీ
అంతర్జాతీయ బానిసత్వ సూచీ - 2016
 2016 నాటికి భారత్‌లో ‘ఆధునిక బానిసత్వం’లో మగ్గుతున్న వారి సంఖ్య 1.83 కోట్లని వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ రూపొందించిన అంతర్జాతీయ బానిసత్వ సూచీ - 2016 వెల్లడించింది. 2014 నుంచి ఈ సంఖ్య 41 లక్షలు పెరిగిందని.. గత రెండేళ్లలో ప్రతి రోజూ 5,616 మంది భారతీయులు బానిసలుగా మారారని తెలిపింది.
నివేదిక ముఖ్యాంశాలు
2014 నాటికి బానిసత్వ పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజల సంఖ్య విషయంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరకొరియా, ఉజ్‌బెకిస్థాన్, కాంబోడియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.ఆధునిక బానిసత్వం విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లోనే అతి ఎక్కువ మంది ప్రజలు ఈ మోడరన్ స్లేవరీలో మగ్గుతున్నారు.ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే 46 శాతం మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో 83 శాతం మంది మగవారు కాగా, 17 శాతం మంది ఆడవారు.బలవంతపు లేదా బాల్య వివాహాలు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇండోనేసియాలోనే అత్యధికం.దేశంలో సగటున ప్రతి వంద మందిలో 51 మంది వెట్టి కార్మికులుగా, బలవంతపు బిచ్చగాళ్లుగా, బలవంతపు పెళ్లిళ్లు, కమర్షియల్ సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.
స్కిల్ ఇండియాకు ప్రపంచ బ్యాంకు రుణం
యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా పథకానికి రూ.1,600 (250 మిలియన్ డాలర్లు) కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలోనూ స్వల్పకాలిక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ (3-12 నెలలు లేదా 600 గంటలు)కు ప్రోత్సాహం అందించేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆరేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి 88 లక్షల మంది యువత నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకుని.. మెరుగైన అవకాశాలను.. మెరుగైన వేతనాన్ని పొందుతారని అంచనా వేసింది. 
కాగా, 2022 నాటికి దేశంలోని 24 కీలక రంగాల్లో 10.9 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుందని అధికార గణాంకాలు అంచనా వేస్తున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్కిల్ ఇండియాకు రూ.1,600 కోట్ల రుణం 
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: ప్రపంచ బ్యాంకు 
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు 

అమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలంగాణ అమ్మాయి
అమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సింధూజ రెడ్డి చోటు దక్కించుకుంది. ఇటీవలే ఐసీసీ గుర్తింపు పొందిన ఈ జట్టులో సింధూజ వికెట్ కీపర్‌గా వ్యవహరించనుంది. ఆగస్టులో స్కాట్లాండ్‌లో జరిగే 2020 ప్రపంచకప్ టి20 క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. గతంలో సింధూజ హైదరాబాద్ మహిళల అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇటీవలే వివాహం చేసుకున్న ఆమె అమెరికాలో నివసిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలంగాణ అమ్మాయి 
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: సింధూజ రెడ్డి 

ఏపీలో వంద కోట్లతో ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్‌లో వంద కోట్ల రూపాయల నిధితో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జూన్ 27న ప్రపంచ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్పొరేషన్ లోగోను ఆవిష్కరించారు. అమరావతిలో ఎంఎస్‌ఎంఈ కార్పొరేట్ భవన నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయిస్తామని.. పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు ఇక పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రూ. వంద కోట్లతో ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ 
ఎప్పుడు : జూన్ 27
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎవరు: ఏపీ సీఎం చంద్రబాబు 
ఎందుకు : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం

2016-17లో కరెంట్ అకౌంట్ లోటు 0.7 శాతం 
కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 2016-17 ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే క్యాడ్ 0.7 శాతంగా నమోదయి్యంది. 2015-16లో ఈ రేటు 1.1 శాతంగా ఉంది. విలువ రూపంలో ఇది 130 బిలియన్ డాలర్ల నుంచి 112 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఏ, ఈసీబీ మినహా ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకనిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. జీడీపీతో పోల్చిచూసి, ఎంత తక్కువ ఉంటే, ఆర్థిక వ్యవస్థకు అంత సానుకూలమైనదిగా దీనిని పరిగణిస్తారు. భారత్ ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసమైన వాణిజ్య లోటు తగ్గడం- మొత్తంగా 2016-17లో క్యాడ్ తగ్గడానికి కారణమని ఆర్‌బీఐ జూన్ 15న విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో మాత్రం క్యాడ్ 0.6% పెరిగింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కరెంట్ అకౌంట్ లోటు 0.7 శాతం
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 

గ్రామీణ డిజిటల్ అక్షరాస్యతకు ‘కోడ్ ఉన్నతి’
యువత, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ సంయుక్తంగా ‘కోడ్ ఉన్నతి’ పేరుతో ఒక కొత్త సామాజిక బాధ్యత ప్రాజెక్టును ప్రారంభించాయి. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతలో ఉద్యోగ నైపుణ్యానికి అవసరమైన కంప్యూటర్ విద్యపై శిక్షణ ఇవ్వనున్నాయి. దీని కోసం ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌తోపాటు నిపుణులను అందిస్తే.. ఎల్‌అండ్‌టీ, ఐటీసీ చారిటబుల్ ట్రస్ట్‌లు మారుమూల గ్రామలకు వెళ్లి కోడ్ ఉన్నతి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. 
కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో 100 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే రాజస్తాన్‌లో 33, మహారాష్ట్రలో 3 కేంద్రాలు ప్రారంభించామని, 2018లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలురాష్ట్రాల్లో ప్రారంభించనున్నట్టు ఎస్‌ఏపీ ఇండియా తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కోడ్ ఉన్నతి కార్యక్రమం 
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ
ఎందుకు : యువతలో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి

ఐసీటీ సర్వీసుల ఎగుమతుల్లో భారత్ టాప్
ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సర్వీసుల ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. భారత్ చాలా అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచింది. అలాగే మరికొన్ని వాటిల్లో అంత మంచి ర్యాంక్‌లను సాధించలేకపోయింది. 
వివిధ కేటగిరీల్లో భారత్ ర్యాంకులు 

కేటగిరీ

ర్యాంకు

గాడ్యుయేట్స్ ఇన్ సైన్‌‌స అండ్ ఇంజినీరింగ్

10

ఇ-పార్టిసిపేషన్‌లో

27

గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీస్

14

గవర్నమెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్

33

జనరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

32

సృజనాత్మక వస్తువుల ఎగుమతులు

18

ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేమెంట్స్

29

రాజకీయ స్థిరత్వం, భద్రత

106

వ్యాపార పరిస్థితుల్లో

121

ఎడ్యుకేషన్

114

క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐసీటీ ఎగుమతుల ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ఐక్యరాజ్య సమితి 

జూన్ 30న పార్లమెంట్‌లో జీఎస్టీ ప్రారంభ కార్యక్రమం 
ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ. 130 లక్షల కోట్లుగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖల్ని మార్చేసే ఈ కొత్త పన్ను వ్యవస్థ ప్రారంభోత్సవం కోసం పార్లమెంట్ సెంట్రల్ హాలును వేదికగా ఎంచుకుంది. జీఎస్టీ అమల్లోకి రానున్న జూన్ 30 అర్ధరాత్రి సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వేళ 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ పేరిట సెంట్రల్ హాల్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసేలా ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 
జూన్ 30 రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం.. అర్ధరాత్రి జీఎస్టీ అమల్లోకి వచ్చే వరకూ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 12 గంటలు కాగానే పెద్ద గంటను మోగించి జీఎస్టీ అమలును ప్రకటిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జీఎస్టీ ప్రారంభ కార్యక్రమం
ఎప్పుడు : జూన్ 30
ఎక్కడ : పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో 
ఎందుకు : జీఎస్టీ చట్టం అమలు అందరికీ గుర్తుండేలా

2017 ఖరీఫ్ కు మద్దతు ధర పెంపు
2017 ఖరీఫ్ సీజన్‌లో 18 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను కేంద్ర ప్రభుత్వం జూన్ 20న పెంచింది. వరి క్వింటాలుకు రూ.80 లు, ఇతర పప్పు ధాన్యాల పంటలకు క్వింటాలుకు రూ. 400 వరకు పెంచింది. దీంతో కామన్ గ్రేడ్ రకం వరికి రూ.1,550, ఏ గ్రేడ్ రకం వరికి రూ.1,590 లు కనీస మద్దతు ధరగా ఉన్నాయి. పప్పు దాన్యాల మద్దతు ధర క్వింటాలుకు రూ.5,050 నుంచి రూ.5,450కు పెరిగింది. 
పెరిగిన మద్ధతు ధరలు (రూ.లలో) 

ధాన్యం

2016-17

2017 ఖరీఫ్

పెంపు

వరి (కామన్ గ్రేడ్)

1470

1550

80

వరి (ఎ గ్రేడ్)

1510

1590

80

పప్పుధాన్యాలు

5050

5450

400

మినప్పప్పు

5000

5400

400

పెసరపప్పు

5225

5575

350

పత్తి

3860

4020

160

సోయాబీన్

2775

3050

275

వేరుశనగ

4220

4450

230

ద్దుతిరుగుడు

3950

4100

150

సజ్జ

1330

1425

95

జొన్న

1650

1725

75

రాగి

1725

1900

175

క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

జీఎంఆర్ చేతికి గ్రీస్ ఎయిర్‌పోర్ట్
గ్రీస్‌లోని క్రీతి నగరంలో ఉన్న హిరాక్లియో విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టును జీఎంఆర్ గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్‌‌ట్స దక్కించుకుంది. ఇన్‌ఫ్రా దిగ్గజం టెర్నా భాగస్వామ్యంతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. నిర్మాణం పూర్తయ్యాక ఎయిర్‌పోర్ట్ నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ చేపడుతుంది. కన్సెషన్ పీరియడ్ 35 ఏళ్లు. హిరాక్లియో గ్రీస్‌లో రెండో అతిపెద్ద విమాశ్రయం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హిరాక్లియో విమానాశ్రయం కాంట్రాక్ట్ 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : గ్రీస్‌లో 
ఎవరు : జీఎంఆర్ 

ఐడీబీఐ ఎన్‌పీఏల విక్రయ లక్ష్యం 5 వేల కోట్లు 
భారీగా ఎన్‌పీఏల్లో కూరుకుపోయిన ఐడీబీఐ బ్యాంక్.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల ఎన్‌పీఏలను (నికర నిరర్ధక ఆస్తుల) విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆధ్వర్యంలో 150 మంది ఉద్యోగులతో కలిసి నిరర్ధక ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. కార్పొరేట్, రిటైల్ విభాగాల్లో ప్రతి ఎన్‌పీఏను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వీరి బాధ్యత. 
2017 మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు రూ.44 వేల కోట్లు కాగా.. ఇందులో నికర ఎన్‌పీఏల విలువ రూ.28 వేల కోట్లు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎన్‌పీఏల విక్రయ లక్ష్యం రూ. 5 వేల కోట్లు 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : ఐడీబీఐ 

జూలై 1 నుంచి ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ తప్పనిసరి
జూలై 1 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) కార్డు కోసం దరఖాస్తు చేసే వారు ఆధార్‌ను సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో సందేహాల నివృత్తికి ‘తీర్పు ప్రభావం’ పేరిట మూడు అంశాలతో కూడిన ప్రకటనను సీబీడీటీ జూన్ 10న విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే సుప్రీం తాత్కాలిక మినహాయింపునిచ్చిందని, వారి పాన్‌కార్డుల్ని రద్దుచేయమని స్పష్టం చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జూలై 1 నుంచి ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 

66 వస్తువులపై జీఎస్టీ పన్ను తగ్గింపు
సామాన్యులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం పడకుండా 66 వస్తువులపై జీఎస్టీ మండలి పన్నుకోత విధించింది. జీఎస్టీ శ్లాబుల వర్గీకరణపై 133 పరిశ్రమలతోపాటు సమాజంలోని వివిధ వర్గాలనుంచి వచ్చిన డిమాండ్లు, వినతులకు అనుగుణంగా రేట్ల విధానంలో మార్పు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జూన్ 11న సమావేశమైన జీఎస్టీ మండలి చిరువ్యాపారులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంది.
జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, వస్త్ర, ఎగుమతులు, సమాచార సాంకేతికత, రవాణా, చమురు, గ్యాస్ వంటి రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు 18 రంగాల గ్రూపులను కేంద్రం ఏర్పాటు చేసింది. 
చిన్న, మధ్య తరహా వ్యాపారులకు మేలురూ.100 రూగపాయల్లోపల సినిమా టికెట్ల ధరలను గతంలో ఉన్న 28 శాతం నుంచి తొలగించి 18 శాతం శ్లాబులోకి చేర్చారు. రూ.100 పైనున్న టికెట్లపై ధరలు ఇటీవల నిర్ణయించిన రేటు (28 శాతం)తోనే కొనసాగనున్నాయి.పచ్చళ్లు, ఆవాలు, మురబ్బా వంటి వాటిని 12 శాతం (గతంలో 18 శాతంలో ఉండేవి)లోకి చేర్చగా.. జీడిపప్పును 12 నుంచి 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.ఏడాదికి 75 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్ యజమానులు (గత పరిమితి రూ.50 లక్షల టర్నోవర్) కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకుని వరుసగా 1, 2, 5 శాతం రేట్లతో పన్ను చెల్లించాలని నిర్ణయించారు.తగ్గనున్న ఇన్సులిన్, స్కూలు బ్యాగులుచిన్న పిల్లల డ్రాయింగ్ పుస్తకాలను 12 శాతం నుంచి పన్నురహిత వస్తువుల్లోకి చేర్చగా.. స్కూలు బ్యాగులు 18 శాతంలోకి వచ్చాయి.కంప్యూటర్ ప్రింటర్లు గతంలో ఉన్న 28 శాతం నుంచి 18 శాతంలోకి వచ్చాయి.ఇన్సులిన్, అగర్‌బత్తీలు ఐదుశాతంలోకి.. కాటుక 28 నుంచి 18 శాతంలోకి వచ్చాయి.వజ్రాలు, తోలు, వస్త్ర, ఆభరణ, ప్రింటింగ్ పరిశ్రమలపై పన్నురేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.ట్రాక్టర్ విడిభాగాలు, ప్లాస్టిక్ టార్పలిన్‌లపై పన్ను 18 శాతానికి తగ్గింపు.జూన్ 18న జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లాటరీ పన్నులు, ఈ-వే బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నారు. హైబ్రిడ్ కార్లపై జీఎస్టీ సమీక్ష విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక స్పందించాలని మండలి నిర్ణయించింది.క్విక్ రివ్యూ: 
ఏమిటి : 66 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు 
ఎప్పుడు : జూన్ 11 
ఎవరు : జీఎస్టీ మండలి 

త్వరలో కొత్త రూ.500 నోట్లు
మహాత్మా గాంధీ సిరీస్‌లోనే ముద్రించిన కొత్తరకం 500 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ జూన్ 13న ప్రకటించింది. వీటిలో ‘రెండు నంబర్ ప్యానెళ్లలో ‘ఏ’ అక్షరం, ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం, వెనక వైపు ముద్రిత సంవత్సరం ‘2017’ ఉంటాయి. ఈ నోట్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్ల మాదిరిగానే ఉండనున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కొత్త సిరీస్‌తో రూ.500 నోట్లు 
ఎప్పుడు : త్వరలో 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

మొండి బకాయిలపై దివాలా చట్టం కింద చర్యలు
మొండి బకాయిలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. కింగ్‌ఫిషర్ గ్రూపు అధినేత విజయ్ మాల్యాపై ఇప్పటికే బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో దాదాపు లక్షల కోట్లు ఎగ్గొట్టిన మరో 12 మందిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా జూన్ 13న బ్యాంకుల్ని ఆదేశించింది. 
దేశవ్యాప్తంగా మొత్తం బ్యాంకులిచ్చిన బకాయిల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు మొండి బకాయిలుగా మారగా.. అందులో 25 శాతం, అంటే దాదాపు రూ.2 లక్షల కోట్లను ఎగవేసింది కేవలం ఈ 12 మందే. అయితే ఈ 12 మంది పేర్లు మాత్రం ఆర్‌బీఐ వెల్లడించలేదు. నిరర్ధక ఆస్తులుగా మారిన రూ.8 లక్షల కోట్లలో 75 శాతం, అంటే రూ. 6 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చినవే. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 12 ఎన్‌పీఏలపై దివాలా చట్టం కింద చర్యలు 
ఎప్పుడు : జూన్ 13 
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 
ఎందుకు : రుణాలు ఎగవేసినందుకు 

కస్టమర్ సర్వీసులో 12 బ్యాంకులే ఉత్తమం 
దేశంలోని 51 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నాయి. బ్యాంకింగ్ కోడ్‌‌స అండ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) జూన్ 13న విడుదల చేసిన 2016-17 వార్షిక నివేదికలో ఈ 12 బ్యాంకులు హై రేటింగ్‌ను పొందాయి. ఇందులో ఉన్న ఒకే ఒక ప్రభుత్వ బ్యాంక్ ‘ఐడీబీఐ’ కాగా మిగతావన్నీ ప్రైవేట్, విదేశీ బ్యాంకులే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకుల స్కోర్ సగటున 77గా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కోర్ 78గా నమోదయి్యంది. 
బీసీఎస్‌బీఐ అనేది ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ. మంచి బ్యాంకింగ్ విధానాలను ప్రోత్సహించడం, పారదర్శకత పెంపొందించడం, కార్యాచరణ ప్రమాణాల మెరుగుదల వంటి పలు అంశాల సాధనే బీసీఎస్‌బీఐ ప్రధాన లక్ష్యం. 
‘హై’ రేటింగ్ పొందిన బ్యాంకులుఆర్‌బీఎల్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్డీసీబీ బ్యాంక్ఇండస్‌ఇండ్ బ్యాంక్కొటక్ మహీంద్రా బ్యాంక్ఐసీఐసీఐ బ్యాంక్యస్ బ్యాంక్స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుసిటీ బ్యాంక్‌క్విక్ రివ్యూ: 
ఏమిటి : బీసీఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ రిపోర్ట్ 
ఎప్పుడు : 2016-17
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎవరు : హై రేటింగ్ పొందిన 12 బ్యాంకులు 
ఎందుకు : ఖాతాదారులకు అందించే సేవలకు గాను 

2017-18కి మారనున్న జీడీపీ బేస్ ఇయర్
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించిన బేస్ ఇయర్ ప్రస్తుత 2011-12 నుంచి త్వరలో 2017-18కి మారనుంది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ జూన్ 13న వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న గృహ వినియోగ వ్యయంపై సర్వే, దేశంలో కార్మిక శక్తికి సంబంధించి గణాంకాల సేకరణ 2018తో పూర్తవుతాయని.. అటు తర్వాత జీడీపీకి సంబంధించి బేస్ ఇయర్ మారుతుందని చెప్పారు. 
గణాంకాల మంత్రిత్వశాఖ నేతృత్వంలోని కేంద్ర గణాంకాల కార్యాలయం 2015 మొదట్లోనే జీడీపీ బేస్ ఇయర్‌ను 2004-05 నుంచి 2011-12కు మార్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల బేస్ ఇయర్‌ను 2017 మే నెలలో 2004-05 నుంచి 2011-12కు మార్చారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మారనున్న జీడీపీ బేస్ ఇయర్ 
ఎప్పుడు : 2011-12 నుంచి 2017-18కి 
ఎవరు : కేంద్ర గణాంకాల శాఖ

రైతులకు కేంద్రం వడ్డీ రాయితీ కొనసాగింపు
స్వల్పకాలిక రుణాలు తీసుకునే రైతులకు వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల వరకు రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణానికి 7 శాతం వడ్డీ కాగా.. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులు 4 శాతం (3 శాతం సబ్సిడీ) వడ్డీ చెల్లించే పథకాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జూన్ 14న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పథకం కోసం రూ.20,339 కోట్లను కేటా యిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతులు సకాలంలో రుణాన్ని చెల్లించలేకపోతే.. వారికి మొదటి ఏడాది వడ్డీపై 2 శాతం సబ్సిడీ అందించనున్నారు. అలాగే పంటను నిల్వ ఉంచుకునేందుకు ఆరు నెలల కాలానికి తీసుకునే రుణాలను 7 శాతానికే అందజేయనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రైతులకు స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కొనసాగింపు
ఎప్పుడు : జూన్ 14 
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : సకాలంలో రుణాలు చే ల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ 

మధ్యప్రదేశ్ రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లాలో ఇటీవల రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతుల రుణాన్ని మాఫీ చేయాలని కోరుతూ జూన్ 6న మంద్ సౌర్ జిల్లాలోని రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పోలీసు కాల్పుల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం 
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 
ఎక్కడ : మధ్యప్రదేశ్ 

వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. 2017-18 రెండో ద్వైమాసిక పరపతి సమీక్ష నిర్ణయాలను జూన్ 8న ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ రెపో రేటును వరుసగా నాలుగో సారి యథాతథం(6.25 శాతం)గా ఉంచింది. రివర్స్ రెపో రేటును 6 శాతంగా కొనసాగించింది. సీపీఐ ద్రవ్యోల్బణ మధ్య కాలిక లక్ష్య సాధనకే వడ్డీ రేట్లను మార్చలేదని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పరపతి సమీక్షలో వడ్డీరేట్లు యథాతథం 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

2016-17లో భారత్ వృద్ధి 7.1 శాతం
 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మూడేళ్ల కనిష్ఠ స్థాయి 7.1 శాతంగా నమోదయింది. జీడీపీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న సేవల రంగం, అలాగే 15 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితనాన్ని కనబరిచాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక గణాంకాలను మే 31న విడుదల చేసింది. 
కేంద్ర గణాంకాల్లో ముఖ్యాంశాలు 
- 2015-16లో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం. 2014-15లో 7.5 శాతం. 
- 2016-17లో వ్యవసాయ రంగం మాత్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. 0.7 శాతం క్షీణత నుంచి 4.9 శాతం వృద్ధి బాటకు ఈ రంగం మళ్లింది. నాల్గవ త్రైమాసికంలో కూడా వ్యవసాయ రంగం వృద్ధి 1.5% నుంచి 5.2%కి చేరింది. 
- స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు నాల్గవ త్రైమాసికంలో భారీగా 5.6 శాతానికి పడిపోయింది. ఈ రేటు 2015 జనవరి-మార్చిలో 8.7 శాతంగా ఉంది. 
- డీమోనిటైజేషన్ కాలంలో నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్చి త్రైమాసికంలో ఈ రంగంలో వృద్ధిలేకపోగా -3.7%కి క్షీణించింది. 2015-16 ఇదే కాలంలో దీని వృద్ధి రేటు 6%. 
- తయారీ రంగంలో వృద్ధి రేటు 10.8 శాతం నంచి 7.9 శాతానికి పడిపోయింది. 
- మైనింగ్, క్వారీయింగ్ రంగంలో క్షీణత - 10.5 శాతం నుంచి -1.8 శాతానికి చేరింది. 
- పెట్టుబడులకు సూచికగా ఉన్న స్థూల స్థిర మూలధన కల్పన రూ.40.03 లక్షల కోట్ల నుంచి రూ.41.18 లక్షల కోట్లకు చేరింది. 
నెరవేరిన ద్రవ్యలోటు లక్ష్యం..
2016-17 ఆర్థిక సంవత్సరం కేంద్రం ద్రవ్యలోటు (వచ్చే ఆదాయం- చేసే వ్యయం మధ్య వ్యత్యాసం) లక్ష్యాన్ని సాధించింది. జీడీపీలో 3.5 శాతం ద్రవ్యోలోటును కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. విలువ రూపంలో ఇది రూ.5.35 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి కట్టడి చేయాలన్నది లక్ష్యం. 
తలసరి ఆదాయం 9.7 % వృద్ధి
2015-16తో పోల్చిచూస్తే, 2016-17లో తలసరి ఆదాయం 9.7% పెరిగింది. ఈ విలువ రూ.94,130 నుంచి రూ.1,03,219 కి చేరింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7.1 శాతంగా నమోదైన భారత వృద్ధి రేటు 
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్లు 5 వేల కోట్లు 
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అథియా జూన్ 1న ప్రకటించారు.
నల్లధనం వెల్లడికి అవకాశమిస్తూ ప్రభుత్వం 2017 డిసెంబరు 17న ఈ పథకాన్ని ప్రారంభించింది. లెక్కల్లోకి రాని ఆదాయంను ఈ పథకం కింద ప్రకటించి, ఆ డబ్బును ప్రభుత్వం వద్ద జమ చేయాలి. అందులో 50 శాతాన్ని ప్రభుత్వం పన్ను, సర్‌చార్జీ, జరిమానా కింద వసూలు చేస్తుంది. మరో 25 శాతం ధనాన్ని వడ్డీ లేకుండా ప్రభుత్వం వద్ద కచ్చితంగా నాలుగేళ్లపాటు జమ చేయాలి. ఈ పథకం కింద అక్రమాదాయ వెల్లడికి గడువు 2017 మార్చి 31తో ముగిసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్లు రూ. 5 వేల కోట్లు 
ఎప్పుడు : జూన్ 1 నాటికి 
ఎవరు : కేంద్ర రెవెన్యూ శాఖ 

వస్తు, సేవల పన్నురేట్లు ఖరారు 
జీఎస్టీ (వస్తు సేవల పన్ను) పరిధిలోకి రానున్న మరికొన్ని వస్తువులు, సేవలను పన్ను శ్లాబులను జూన్ 3న జీఎస్టీ మండలి ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ బంగారంపై 3శాతం పన్నును ఖరారు చేసింది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా (2 నుంచి 2.5 శాతం) పన్నువసూలు చేస్తున్నారు. సానబెట్టని వజ్రాలపై 0.25 శాతం పన్ను విధించింది.
తగ్గనున్న బిస్కెట్లు, పాదరక్షల ధర
రూ.1000 లోపలున్న దుస్తులు, బిస్కట్లు, చెప్పులు మొదలైనవాటి ధర స్వల్పంగా తగ్గనుంది. ప్రస్తుతానికి కిలో వందరూపాలయకు తక్కువగా ఉన్న బిస్కెట్లపై 20.6 శాతం, అంతకన్నా ఎక్కువ ధర ఉన్న వాటిపై 23.11 శాతం పన్నుభారం పడుతుండగా.. జీఎస్టీలో అన్ని రకాల బిస్కెట్లపై పన్నును 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. 9.5శాతం పన్ను ఉన్న రూ.500లోపు పాదరక్షలపై 5 శాతం, అంతకన్నా ఎక్కువ ధర కలిగిన పాదరక్షలపై 23.1 నుంచి 29.58 శాతం ఉన్న పన్నును 18 శాతంగా నిర్ణయించారు. 
తునికాకును 18 శాతం, బీడీలను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. సిల్క్, జనపనార వస్త్రాలకు పన్నునుంచి పూర్తి మినహాయింపునివ్వగా.. కాటన్, ఇతర రకాల దారాలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అయితే చేతితో నేసిన దారాలు, పోగులు మాత్రం 18 శాతం పరిధిలోకి రానున్నాయి. సౌర పానెళ్ల పరికరాలపై 5 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. వ్యవసాయ పరికరాలను జీఎస్టీ మండలి 5, 12 శాతం పన్ను శ్లాబుల్లోకి చేర్చింది. 
ఏ వస్తువుకు ఎంత పన్ను?
పన్నులేనివి: 
ఖాదీ దారం, గాంధీ టోపీ, భారత జాతీయ పతాకం, జనపనార, తాజా మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, పాలు, మజ్జిగ, పెరుగు, తేనె, తాజా పళ్లు, తాజా కూరగాయలు, గోధుమపిండి, శెనగ పిండి, బ్రెడ్, ప్రసాదం, ఉప్పు, బొట్టు బిళ్లలు, సింధూరం, స్టాంపులు, జ్యుడిషియల్ పేపర్స్, వార్తాపత్రికలు, గాజులు, చేనేత, రూ.వెయి్యకన్నా తక్కువ చార్జీ ఉన్న లాడ్జీలు, విభూతి, రుద్రాక్షలు వంటి పూజా సామగ్రి.
5 శాతం పరిధిలోకి: 
ముక్కలుగా కోసిన చేపలు, రూ. 1000 కన్నా తక్కువ ధర, దుస్తులు, శీతలీకరించిన కూరగాయలు, పిజ్జా బ్రెడ్, రస్క్, సగ్గుబియ్యం, లైఫ్‌బోట్లు, రైల్వే, విమాన రవాణా సేవలు, చిన్న రెస్టారెంట్లు. బ్లాంకెట్లు, ప్రయాణపు దుప్పట్లు, కర్టెన్లు, పరుపు కవర్లకు వాడే లినెన్, టాయిలెట్, వంటగదుల్లో వాడే లినెన్, నాప్కిన్లు, దోమతెరలు, సంచులు, బ్యాగులు, లైఫ్ జాకెట్ల ధర రూ. వెయి్య లోపు ఉంటే 5 శాతం పన్ను. రూ. వెయి్య దాటితే 12 శాతం పన్ను. అగ్గిపెట్టెలు, ప్యాక్ చేసిన సేంద్రియ ఎరువులపై 5 శాతం.
12 శాతం పరిధిలోకి:
రూ.1000 కన్నా ఎక్కువ ధర గల దుస్తులు, శీతలీకరించిన మాంస ఉత్పత్తులు, వెన్న, చీజ్, జంతువుల కొవ్వు, భుటియా, నమ్‌కీన్, కలరింగ్-చిత్రాల పుస్తకాలు, గొడుగులు, కుట్టు మిషన్లు, నాన్-ఏసీ హోటళ్లు, బిజినెస్ క్లాస్ విమానం టికెట్లు, ఎరువులు, వర్క్ కాంట్రాక్టులు
18 శాతం పరిధిలోకి:
పాస్తా, కార్న్‌ఫ్లేక్స్, పేస్ట్రీలు, కేకులు, నిల్వఉంచిన కూరగాయలు, జామ్, సాస్‌లు, సూప్‌లు, ఇన్‌స్టంట్ ఫుడ్ మిక్స్‌లు, ఎన్వలప్‌లు, ప్రింటెడ్ సర్క్యూట్‌లు, కెమెరాలు, స్పీకర్లు, మానిటర్లు , మద్యం సరఫరా చేసే ఏసీ హోటళ్లు, టెలికాం సేవలు, ఐటీ సేవలు, ఆర్థిక సేవలు
28 శాతం పరిధిలోకి:
మొలాసిస్, కోకోవా లేని చాక్‌లేట్స్, చాకలేట్ పూతపూసిన వేఫర్స్, ఆఫ్టర్ షేవ్ లోషన్, వాల్‌పేపర్, సెరామిక్ టైల్స్, వాటర్ హీటర్, డిష్‌వాషర్, త్రాసు, వ్యాక్యూమ్ క్లీనర్, షేవర్స్, వ్యక్తిగత అవసరాల కోసం విమాన సేవలు, 5-స్టార్ హోటళ్లు, రేస్‌క్లబ్ బెట్టింగుల, సినిమాలు మొదలైనవి. 
ఐజీఎస్టీ నుంచి మినహాయింపు
రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తు, సేవలపై కేంద్రం విధించే సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) నుంచి మినహాయిపు ఉన్న వివరా లను పన్ను శాఖ తన వెబ్‌సైట్లో వెల్లడించింది. ధార్మిక సంస్థలు పేదలకు పంచడానికి విదేశాల నుంచి అందుకునే ఆహారం, ఔషధాలు, వస్త్రాలు, దుప్పట్లపై పన్ను ఉండదు. బాధితుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ దిగుమతి చేసుకునే మందులు, భోపాల్ లీక్ గ్యాస్ బాధితుల చికిత్సకు అవసరమయ్యే వైద్య పరికరాలపై పన్ను వేయరు. ప్రజానిధులతో నడిచే పరిశోధన సంస్థలు, వర్సిటీలు, ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లేబొరేటరీలు, ప్రాంతీయ కేన్సర్ సెంటర్లు తదితర సంస్థలు వాడే పరిశోధన పరికరాలపైనా పన్ను ఉండదు. 
2019కి జీడీపీలో 2 శాతానికి రుణమాఫీ
2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో రైతు రుణమాఫీలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతానికి చేరుకుంటాయని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్’ నివేదిక వెల్లడించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల మాదిరే అన్ని రాష్ట్రాలూ రైతుల రుణాలను మాఫీ చేస్తాయనీ, ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులు తీసుకున్న అప్పుల విలువ 2019 నాటికి 40 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,60,000 కోట్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదిక తెలిపింది. మార్కెట్‌పై ప్రభావాన్ని పరిమితం చేస్తూనే రుణమాఫీకి నిధులు సమకూర్చుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘ఉదయ్’ తరహా బాండ్లను జారీ చేయాల్సి ఉంటుందని సూచించింది. 
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే రూ.30 వేల కోట్ల విలువైన (జీడీపీలో 0.2 శాతం) రైతు రుణాలను, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.36 వేల కోట్ల విలువైన (జీడీపీలో 0.3%) రుణాలను మాఫీ చేశాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2019కి జీడీపీలో 2 శాతానికి రుణమాఫీ
ఎక్కడ : భారత్‌లో 
ఎవరు : బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ 

2017లో భారత్ వృద్ధి 7.2 శాతం : ప్రపంచబ్యాంకు 
2017లో భారత్ వృద్ధి 7.2 శాతానికి చేరుతుందని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2016లో మాదిరిగానే 2017లో కూడా వృద్ధి 6.8 శాతంగానే ఉంటుందని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు.. తాజాగా వెలువరించిన ‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’లో అంచనాలని సవరించింది. అలాగే డీమోనిటైజేషన్ ప్రభావం నుంచి భారత్ బయటపడుతోందని.. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాతుందని తాము భావిస్తున్నట్లు ప్రకటించింది. 2018లో 7.5 శాతం, 2019లో 7.7 శాతం మేర భారత్ వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017లో భారత్ వృద్ధి 7.2 శాతం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రపంచ బ్యాంకు

ఎయిర్‌టెల్-టెలీనార్ విలీనానికి సీసీఐ ఓకే
భారతీ ఎయిర్‌టెల్, టెలీనార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జూన్ 5న అనుమతి ఇచ్చింది. విలీనంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌టెల్, టెలీనార్ ఒప్పందానికి వచ్చాయి. ఇందులో భాగంగా టెలీనార్ ఇండియాకు చెందిన ఏపీ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ (తూర్పు,పశ్చిమ) సర్కిళ్లలోని కార్యకలాపాలు, ఆస్తులన్నీ ఎయిర్‌టెల్ సొంతం అవుతాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎయిర్‌టెల్ - టెలీనార్ విలీనానికి అనుమతి 
ఎప్పుడు : జూన్ 5
ఎక్కడ : కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా

ఆర్థిక వ్యవహారాలు జూలై 2017 ఎకానమీ
గ్యాస్‌పై నెలకు రూ.4 పెంపు : కేంద్రం
 సబ్సిడీపై అందించే వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరలను ఇక నుంచి ప్రతి నెలా పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నెలకు రూ.4 చొప్పున పెంచాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించినట్లు వెల్లడించింది. 2018 మార్చి కల్లా ఎల్‌పీజీపై అన్ని సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31న లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు లేదా మార్చి 2018 వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గ్యాస్ సిలిండర్లపై ప్రతినెలా రూ.4 పెంపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాయితీ గ్యాస్‌పై ప్రతి నెల రూ. 4 పెంపు 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : ఎల్పీజీపై అన్ని రాయితీలను తొలగించే చర్యల్లో భాగంగా 

బ్యాంకు ఖాతా నంబరు పోర్టబిలిటీకి ఆర్‌బీఐ సూచన 
మొబైల్ నంబరు పోర్టబిలిటీ తరహాలోనే బ్యాంకు అకౌంటు నంబరు పోర్టబిలిటీ అమలు చేసే దిశగా బ్యాంకులు కసరత్తు చేయాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా సూచించారు. మరింత పోటీతత్వంతో పనిచేసేందుకు, ఖాతాదారులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ అంబుడ్‌‌సమన్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ముంద్రా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆర్‌బీఐ జూలై 31న ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్యాంకు ఖాతా నంబర్ పోర్టబిలిటీపై బ్యాంకులకు సూచన 
ఎప్పుడు : జూలై 31 
ఎవరు : ఆర్‌బీఐ 
ఎందుకు : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు 

వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ‘ఈ-రకం’
వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లో అమ్మేందుకు ఉపకరించే ఈ-రకం అనే పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న ప్రారంభించింది. ప్రభుత్వ వేలందారు ఎంఎస్‌టీసీ, కేంద్ర గిడ్డంగుల సంస్థకు చెందిన సీఆర్‌డబ్ల్యూసీలు సంయుక్తంగా ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్‌తో కలసి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ‘ఈ-రకం’ పోర్టల్ 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు: వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లో అమ్మేందుకు

బ్యాంకులకు 2.4 లక్షల కోట్ల హెయిర్ కట్: క్రిసిల్
భారీగా పేరుకుపోయిన 50 మొండి బకాయిలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు సుమారు రూ.2.4 లక్షల కోట్లు (60 శాతం) వదులుకోవాల్సి (హెయిర్‌కట్) రావొచ్చని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. మెటల్స్, నిర్మాణ, విద్యుత్ రంగాలకు చెందిన ఈ బకాయిలు బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకున్న మొత్తం రూ.8 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్లో దాదాపు సగం. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు అప్పులిచ్చిన బ్యాంకులు ఆయా సంస్థల ఆస్తుల్ని విక్రయించుకున్నా వాటికి 40% మొత్తమే దక్కుతుందని తెలిపింది.

2017లో భారత్ వృద్ధి రేటు 7.4 శాతం: ఏడీబీ
 గతంలో అంచనా వేసిన 7.4% వృద్ధి రేటు సాధన దిశగా భారత్ ముందుకెళుతోందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదే రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. అటు ఆసియా ప్రాంత వృద్ధి రేటు అంచనాలను మాత్రం గతంలో ప్రకటించిన 5.7% నుంచి 5.9%కి పెంచుతున్నట్లు తెలిపింది. ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) 2017 నివేదికకు అనుబంధ నివేదికలో వర్ధమాన ఆసియా దేశాలకు సంబంధించి అంచనాలను ఈ మేరకు సవరించింది. 
2018లో వర్ధమాన ఆసియా వృద్ధిని 5.7% నుంచి 5.8%కి పెంచింది. ఇక 2017-18లో భారత వృద్ధి 7.4% ఉండగలదని, 2018-19లో 7.6%కి పెరగగలదని ఏడీబీ తెలిపింది. మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాల నిర్వహణ సులభతరం కావడానికి, వృద్ధికి ఊతమివ్వడానికి వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) దోహదపడగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017-18లో భారత్ వృద్ధి రేటు 7.4 శాతం 
ఎప్పుడు : జూలై 20
ఎవరు : ఏడీబీ

ఏటీఎంలో ఐసీఐసీఐ పర్సనల్ లోన్స్
ఐసీఐసీఐ బ్యాంకు రుణ మంజూరు ప్రక్రియను సరళతరం చేస్తూ ఏటీఎంల ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను తక్షణం అందించే విధానాన్ని ప్రారంభించింది. వేతన అకౌంట్ కలిగి ఉన్న వారికి ఈ అవకాశం కల్పించింది. క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలు అందించే సిబిల్ స్కోర్ సమాచారం ఆధారంగా ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్‌కు అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వీరికి ఏటీఎంలో లావాదేవీ నిర్వహించిన తర్వాత స్క్రీన్‌పై రుణ అర్హతకు సంబంధించిన ఒక మేసేజ్ కనిపిస్తుంది. రుణం తీసుకోవాలని భావిస్తే ఐదేళ్ల కాలపరిమితితో రూ.15 లక్షల వరకు మొత్తాన్ని పొందొచ్చు. ఇది కస్టమర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పై రుణ వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏటీఎంలో పర్సనల్ లోన్స్ 
ఎప్పుడు : జూలై 20 
ఎవరు : ఐసీఐసీఐ బ్యాంకు 
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వేతన ఖాతాదారుల కోసం 

రిలయన్స్ జియో నుంచి ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్ 
రిలయన్స్ జియో నుంచి ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్ అందిస్తామని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. జూలై 22న ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ ఏజీఎం సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. 
జియో ఫోన్‌ను ముకేశ్ అంబానీ ‘ఇంటెలిజెంట్ ఫోన్’గా అభివర్ణించారు. అంతేకాదు ‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్’ అనేది జియో ఫోన్ నినాదం. ఈ ఫోన్ పొందేందుకు వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని మూడేళ్ల తర్వాత(36 నెలలు) తిరిగి ఇస్తారు. జీవిత కాలం పాటు వాయిస్ కాలింగ్ ఉచితం. నెలకు రూ.153 చొప్పున టారిఫ్‌ను చెల్లిస్తే... అపరిమిత డేటా సేవలను పొందొచ్చు. ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా ఈ ఫోన్‌లను ప్రవేశపెడతామని ముకేశ్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉచితంగా జియో 4జీ ఫీచర్ ఫోన్ 
ఎప్పుడు : జూలై 21
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

2016లో 18 లక్షల హెచ్‌ఐవీ కేసులు నమోదు 
ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్‌‌స వ్యాధితో మరణించేవారి సంఖ్య తగ్గుతున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ ఎయిడ్స్’ విభాగం తెలిపింది. 2005లో దాదాపు 19 లక్షల మంది ఈ వ్యాధితో మరణించగా.. 2016 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు తగ్గిందని తన నివేదికలో వెల్లడించింది. చాలామంది వ్యాధిగ్రస్తులకు చికిత్స అందుబాటులోకి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. గతేడాది కొత్తగా 18 లక్షల హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయినట్లు పేర్కొంది. 
ఒక్క 2016లోనే 1.95 కోట్ల మందికి యాంటీ రెట్రోవైరల్ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మైఖేల్ సిడిబే తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7.61 కోట్ల మందికి హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ సోకగా.. దాదాపు 3.5 కోట్ల మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలు ఇన్ఫెక్షన్ అదుపులో గణనీయమైన పురోగతి సాధించినట్లు వివరించారు. 2010 నుంచి ఈ ప్రాంతంలో ఎయిడ్స్ మరణాలు 42 శాతం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. 
కాగా 2016లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా నమోదైన 95 శాతం హెచ్‌ఐవీ కేసులు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోని 10 దేశాల నుంచే ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఈ పది దేశాల్లో భారత్, చైనా, పాకిస్తాన్ ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూఎన్ ఎయిడ్‌‌స రిపోర్ట్ - 2017
ఎప్పుడు : జూలై 19
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

వయ వందన యోజన పథకం ప్రారంభం 
వయోవృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన’ (పీఎంవీవీవై) పేరుతో ఎల్‌ఐసీ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జూలై 21న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దీన్ని తీసుకోవచ్చు. 60 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు వర్తించే ఈ పథకంలో 10 ఏళ్ల పాటు 8 శాతం వార్షిక రిటర్నులు లభిస్తాయి. వడ్డీ ఆదాయాన్ని ప్రతి నెల, లేదా 3 నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి పొందే వీలుంటుంది. ఈ సంవత్సరం మే 4న ప్రారంభమైన ఈ పెన్షన్ పథకంలో 2018 మే 3వ తేదీ వరకు చేరవచ్చు. ఈ పథకానికి జీఎస్టీ వర్తించదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వయ వందన యోజన పథకం ప్రారంభం 
ఎప్పుడు : జూలై 21
ఎవరు : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : వయో వృద్ధుల కోసం 

భారత వృద్ధి అంచనా యథాతథం
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18)లో భారత వృద్ధి రేటు అంచనాను యథాతథంగా(7.2 శాతంగా) కొనసాగించింది. ఇది 2018-19లో 7.7 శాతానికి చేరుతుందని జూలై 24న విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో) అప్‌డేట్ నివేదికలో పేర్కొంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ రెండేళ్లు భారత వృద్ధిరేటు చైనా కంటే అధికంగానే ఉండనుంది. చైనా వృద్ధి 2017లో 6.7 శాతంగా, 2018లో 6.4 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ గతంలో ప్రకటించింది. గతంలో ప్రకటించిన అంచనాలను తాజా నివేదికలో ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచింది. అయితే భారత వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా ఉంచినప్పటికీ.. చైనాను మించగలదని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాలతో గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.1 శాతానికే పరిమితమైంది. అయితే ఇది ఊహించిన దానికంటే అధికమని ఐఎంఎఫ్ పేర్కొంది.

ఉడాన్ సేవలు ప్రారంభించనున్న మరో రెండు ఎయిర్‌లైన్స్ 
ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీము కింద త్వరలో మరో రెండు సంస్థలు ప్రాంతీయ విమానయాన సేవలు (ఆర్‌సీఎస్) ప్రారంభించనున్నాయి. ఇందుకోసం విమానాలను సమకూర్చుకున్నట్లు ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్.. కేంద్రానికి తెలియజేశాయి. సెప్టెంబర్ ఆఖరు నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నట్లు ఈ సంస్థలు తెలిపాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. 
ఆర్‌సీఎస్ కింద మొత్తం 128 రూట్లు గుర్తించిన కేంద్రం విమానయాన సేవలకు అయిదు సంస్థలను ఎంపిక చేసింది. అలయన్స్‌ ఎయిర్, స్పైస్‌జెట్, టర్బోమేఘా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కొత్తగా రాబోయే ఎయిర్ ఒడిషాకి 50 రూట్లు, ఎయిర్ డెక్కన్‌కి 34 రూట్లు దక్కాయి. రెండు సంస్థలు 19 సీట్ల సామర్థ్యం ఉండే ఆరు బీచ్‌క్రాఫ్ట్ బీ-1900డి విమానాలను సమకూర్చుకున్నాయి. 
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విమాన సేవలను విస్తరించేలా.. కేంద్రం గంట పాటు ప్రయాణం ఉండే రూట్లలో టికెట్ చార్జీలు గరిష్టంగా రూ. 2,500కి పరిమితం చేసింది. విమానయాన సంస్థలు తమ విమానాల సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం ఈ స్కీము కింద కేటాయించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉడాన్ సేవలు ప్రారంభించనున్న మరో రెండు ఎయిర్‌లైన్స్ 
ఎప్పుడు : జూలై 12
ఎవరు : ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్

జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22
జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22ను కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా జూలై 12న ఆవిష్కరించారు. 2027 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. ఈ సారి ప్రణాళికల అమలులో భాగంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలపై అధిక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. 
2030 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ (NFME)ని 2016లో ప్రారంభించింది. 
2017-22 ప్రణాళికలుమలేరియా వ్యాప్తిని గుర్తించే వ్యవస్థల బలోపేతంమలేరియా వేగంగా వ్యాప్తి చెందకుండా గుర్తించిన వెంటనే నిర్మూలించే వ్యవస్థల ఏర్పాటుLong Lasting Impregnated Nets ద్వారా మలేరియా నివారణపై అవగాహనదోమల నివారణకు వ్యవస్థల బలోపేతం

క్విక్ రివ్యూ: 
ఏమిటి : జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22
ఎప్పుడు : జూలై 12
ఎవరు : కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ 
ఎందుకు : మలేరియా నిర్మూలన కోసం

ఆరోగ్య ఖర్చులపై ఐసీఆర్‌డబ్ల్యూ సర్వే 
దేశంలో రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు, కౌమార దశలోనే ప్రసవాలకు అడ్డుకట్టవేస్తే ఆరోగ్య సంబంధిత వ్యయాల్లో రూ.33,500 కోట్లు ఆదా అవుతాయని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ పరిశోధక సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ (ఐసీఆర్‌డబ్ల్యూ) సర్వే వెల్లడించింది. ఈ మొత్తం 2017-18 కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధుల(రూ.33,329 కోట్లు)తో సమానం. అలాగే... 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో బాల్య వివాహాలు, కౌమార దశలోనే ప్రసవాలను నియంత్రించడం వల్ల రూ.1.14 లక్షల కోట్లు ఆదా అవుతాయని తెలిపింది. ఇందులో భారత్ నుంచి ఆదా అయ్యే మొత్తం సుమారు రూ.65,000 కోట్లు(62 శాతం) అని పేర్కొంది. 
మొత్తంగా 106 దేశాల్లో బాల్య వివాహాలను తగ్గించడం వల్ల 2030 నాటికి ఏటా రూ.37 లక్షల కోట్లు ఆదా అవుతాయని వెల్లడించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో ఆరోగ్య ఖర్చులపై సర్వే 
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్

2.5 కోట్లకు చేరిన ఉజ్వల లబ్ధిదారులు
పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ అందించే ఉద్దేశంతో 2016 మేలో కేంద్రం ప్రారంభించిన ఉజ్వల ఎల్‌పీజీ పథకం 2.5 కోట్ల మందికి చేరువైంది. బెంగాల్‌కు చెందిన ఓ మహిళకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 15న ఇచ్చిన కనెక్షన్‌తో లబ్ధిదారుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉజ్వల లబ్ధ్దిదారులు 2.5 కోట్లు 
ఎప్పుడు : జూలై 15
ఎవరు : కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

జూన్‌లో 0.90 శాతంగా నమోదైనటోకు ద్రవ్యోల్బణం
కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 8 నెలల కనిష్టానికి చేరింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.90 శాతంగా నమోదైంది.

రూ.2కే స్పైస్ జెట్‌ను దక్కించుకున్న అజయ్ సింగ్ 
 రెండున్నరేళ్ల క్రితం మూసివేతకు సిద్ధంగా ఉన్న చౌక టికెట్ల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ మళ్లీ తన చేతుల్లోకి తీసుకొని అభివృద్ధి చేశాడు. అయితే... మారన్‌ల నుంచి కొనుగోలు చేసేందుకు అజయ్ సింగ్ చెల్లించింది కేవలం రెండు రూపాయలే. స్పైస్‌జెట్‌లో 58.46% వాటాలను ఆయన కేవలం రూ.2కే దక్కించుకున్నారు. దేశీ కార్పొరేట్ చరిత్రలో ఏ లిస్టెడ్ కంపెనీ కూడా ఇలాంటి ధరకు అమ్ముడవలేదు. 
2015 జనవరిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తయిపోయిన ఈ డీల్‌కు.. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సింగ్‌కు వెసులుబాటు లభించింది. అప్పట్లో ఇది బయటకు కూడా రాలేదు. అప్పట్లో స్పైస్‌జెట్ షేరు ధర రూ. 21.8గా ఉండేది. దాని ప్రకారం చూస్తే ప్రమోటర్ మారన్ వాటా విలువ రూ.765 కోట్లు. కానీ దీన్ని సింగ్ అత్యంత చౌకగా రెండే రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం షేరు ధర రూ. 125కి చేరింది. అంటే స్పైస్‌జెట్‌లో సింగ్ వాటాల విలువ ప్రస్తుతం సుమారు రూ.4,400 కోట్ల మేర ఉంటుంది.
బయట పడిందిలా..
అప్పట్లో డీల్ విలువ గురించి ఇటు సింగ్, స్పైస్‌జెట్, అటు మారన్ ఎవరూ కూడా బైటపెట్టలేదు. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతి విషయమూ ఇన్వెస్టర్లకు తెలిసి తీరాల్సిందే అనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ వివరాలు వెల్లడించాలని ఆదేశించలేదు. ఆ విధంగా అసలు డీల్ విలువ ఎంతనేది ఎవ్వరికీ తెలియకుండా ఒక లిస్టెడ్ కంపెనీ చేతులు మారిపోయింది. ప్రస్తుతం డీల్ నిబంధనలను సింగ్ గౌరవించడం లేదంటూ మారన్ న్యాయపోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ఈ సమాచారం బయటికొచ్చింది. ఈ వివరాల ప్రకారం స్పైస్‌జెట్ యాజమాన్య హక్కులు కేవలం 14 రోజుల్లో మారన్, కాల్ ఎయిర్‌వేస్ నుంచి సింగ్ చేతికి వచ్చాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రూ. 2కే స్పైస్ జెట్ కొనుగోలు 
ఎప్పుడు : 2015లో 
ఎవరు : అజయ్ సింగ్ 

జీఎస్‌టీ సందేహాల నివృత్తికి యాప్
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లపై వినియోగదారుల సందేహాల్ని నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘జీఎస్‌టీ రేట్స్ ఫైండర్’ (GST Rates Finder) పేరుతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) రూపొందించిన ఈ యాప్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ జూలై 9న ప్రారంభించారు. దీని ద్వారా ఏయే వస్తువులపై ఎంత పన్ను విధిస్తున్నారన్న పూర్తి సమాచారాన్ని వినియోగదారులు తెలుసుకోవచ్చు. అలాగే సేవలపై పన్ను రేట్లు కూడా లభ్యమవుతాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : GST Rates Finder
ఎప్పుడు : జూలై 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : జీఎస్‌టీపై సందేహాల నివృత్తికి

చేనేత కార్మికుల జనాభా సేకరణ ప్రారంభం
చేనేత కార్మికుల వాస్తవ పరిస్థితిని తెలుసుకుని, వారి సంక్షేమం కోసం విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం నాలుగో జాతీయ చేనేత జనాభా లెక్కల సేకరణను జూలై 8న ప్రారంభించింది. చేనేత అనుబంధ కార్మికుల వివరాలను కూడా సేకరించనున్న ఈ ప్రక్రియలో కార్మికులకు ఫొటో గుర్తింపు కార్డులు అందజేస్తారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఈ కార్డులు అర్హత కల్పిస్తాయి. ఈ ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తికానుంది. 
2009-10 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 43.31 లక్షల మంది నేత కార్మికులు ఉన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చేనేత కార్మికుల జనాభా సేకరణ ప్రారంభం
ఎప్పుడు : జూలై 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : వాస్తవ పరిస్థితిని తెలుసుకుని, వారి సంక్షేమం కోసం విధానాలు రూపొందించేందుకు

2026 నాటికి పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి భారత్ 
మరో దశాబ్ద కాలానికి భారత్ పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి చేరుకుంటుందని అమెరికాకు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) నివేదిక వెల్లడించింది. 2026 నాటికి భారత్ పాల ఉత్పత్తిలో మిగతా దేశాలకంటే ముందు వరుసలో నిలుస్తుందని నివేదికలో పేర్కొంది. పదేళ్లలో ప్రపంచ జనాభా 730 నుంచి 820 కోట్లకు పెరుగుతుందని, భారత్, ఆఫ్రికా దేశాల్లో 56 శాతం జనాభావృద్ధి నమోదవుతుందని నివేదిక వెల్లడించింది. అంటే.. భారతదేశ జనాభా 130 కోట్ల నుంచి దాదాపు 150 కోట్లకు పెరగవచ్చని అంచనా వేసింది. చైనా జనాభాను మించి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొంది. మానవ వనరులే పెట్టుబడిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయిలో భారత్, మరికొన్ని ఆఫ్రికా దేశాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తాని నివేదికలో అభిప్రాయపడింది. అంతేకాక ఆహార ఉత్పత్తులతోపాటు ఇతర అవసరాల కోసం ఈ దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతుందని, వీటిని నెరవేర్చేందుకు తీసుకునే చర్యల ఫలితంగా ఎన్నో రంగాల్లో ఈ దేశాలు ముందంజలో నిలుస్తాయని నివేదిక ద్వారా తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2026 నాటికి పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి భారత్
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

పాన్‌తో ఆధార్‌ను జతచేయడం తప్పనిసరి
 జూలై 1 నుంచి పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)తో ఆధార్ కార్డును తప్పనిసరిగా జతచేయాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం జూన్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పాన్ కార్డుకు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్‌ను గానీ, లేదా ఆధార్‌లో నమోదు చేసుకున్నట్లు ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను గానీ తప్పనిసరిగా అనుసంధానించాలి. ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసే సమయంలోగానీ, బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసే సమయంలో గానీ పాన్, ఆధార్‌లు తప్పనిసరిగా అనుసంధానించాల్సిందే. వ్యక్తుల ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండేందుకు గాను ఈ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాన్‌తో ఆధార్ జతచేయడం తప్పనిసరి 
ఎప్పుడు : జూలై 1 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం 

ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం 
భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు జూన్ 28న కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. 
ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. 2012లో యూపీఏ సర్కారు రూ.30,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీతో దీన్ని తాత్కాలికంగా ఆదుకుంది. మరోవైపు ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని నీతి ఆయోగ్ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం 
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : నష్టాల్లో ఉన్న సంస్థ నుంచి వాటాల ఉపసంహరణ కోసం

వస్తు, సేవల పన్ను విధానం ప్రారంభం 
ఒక దేశం ఒకే పన్ను నినాదంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రారంభమైంది. దేశ చరిత్రలో అత్యంత కీలక సంస్కరణగా నిలిచిపోయే ఈ పన్నును జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఇది ఏ ఒక్క పార్టీ, ఒక్క ప్రభుత్వం ఘనత కాదని, భవ్య భారతం కోసం సమష్టిగా చేసిన కృషి ఫలితమని ప్రధాని ఉద్ఘాటించారు. జీఎస్టీని ‘ఉత్తమమైన, సరళమైన పన్ను’గా అభివర్ణించారు. దేశ ప్రజాస్వామ్య పరిణతికి జీఎస్టీ ఓ సాధికార రూపమని రాష్ట్రపతి పేర్కొన్నారు. 
ఎరువులపై 5 శాతం జీఎస్టీ
జీఎస్టీ అమలుకు కొద్ది గంటల ముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై రైతులకు సంబంధించిన రెండు అంశాలపై పన్నురేటును తగ్గించింది. గతంలో 12 శాతం పరిధిలో ఉన్న ఎరువులను 5 శాతం పరిధిలోకి.. 28 శాతంగా ఉన్న ట్రాక్టర్ల విడిభాగాలను 18 శాతంలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. 
18 సమావేశాలు..
2016 సెప్టెంబర్ 23న జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి సమావేశమైంది. ఆనాటి నుంచి నేటి వరకు 18 సార్లు ఈ మండలి సమావేశమైంది. విసృ్తతమైన అంశాలపై కూలంకశంగా చర్చించి 5, 12, 18, 28 శాతం పన్ను పరిధిని నిర్ణయించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జీఎస్టీ అమలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్ హాల్ 
ఎందుకు : దేశంలో ఏకీకృత పన్నుల కోసం

2018 నాటికి 10.2 శాతానికి ఎన్‌పీఏలు : ఆర్‌బీఐ 
2017 మార్చి నాటికి 9.6 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 2018 మార్చి నాటికి 10.2 శాతానికి చేరే అవకాశం ఉందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంచనా వేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ జూన్ 30న తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 
నివేదికలోని ముఖ్యాంశాలు..

నికర మొండిబకాయిల (ఎన్‌ఎన్‌పీఏ) రేషియో 2016 సెప్టెంబర్‌లో 5.4 శాతం ఉంటే, 2017 మార్చినాటికి ఈ రేటు 5.5 శాతానికి పెరిగింది.ఒత్తిడిలో ఉన్న రుణ నిష్పత్తి (స్ట్రెస్డ్ అడ్వాన్సెస్ రేషియో) మాత్రం 12 శాతం నుంచి 12.3 శాతానికి ఎగసింది. వ్యవసాయం, సేవలు, రిటైల్ రంగాల్లో ఈ తరహా రుణ నిష్పత్తి తగ్గితే, పారిశ్రామిక రంగం విషయంలో మాత్రం 22.3 శాతం నుంచి 23 శాతానికి చేరింది.ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం-ద్రవ్యలోటు 2016-17లో 3.5 శాతంగా ఉంటే, ఇది 2017-18లో 3.2 శాతానికి తగ్గుతుందని అంచనా.

క్విక్ రివ్యూ: 
ఏమిటి : 10.2 శాతానికి ఎన్‌పీఏలు 
ఎప్పుడు : 2018 నాటికి 
ఎవరు : ఆర్‌బీఐ 
ఎక్కడ : భారత్‌లో 

2016-17లో 55 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు 
2016-17 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు 55 శాతం పెరిగాయని నీతి ఆయోగ్ జూలై 3న వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ విధానం మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్‌లో 500, 1000 రూపాయిల నోట్లు రద్దు చేయటంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. 
2011-12 నుంచి 2015-16 మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపులు ఏటా సగటున 28 శాతం మేర పురోగతి నమోదు చేశాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 55 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు 
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : నీతి ఆయోగ్ 
ఎక్కడ : భారత్‌లో

ఆర్థిక వ్యవహారాలు ఆగష్టు 2017 ఎకానమీ
చైనా టాంపర్డ్ గ్లాస్‌లపై దిగుమతి నిరోధక సుంకం
చైనా నుంచి దిగుమతి అయ్యే టాంపర్డ్ గ్లాస్‌ల (మొబైల్ స్క్రీన్ సేవర్) పై భారత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు దిగుమతి నిరోధక సుంకం (యాంటీ డంపింగ్ డ్యూటీ) విధించింది. టన్ను టాంపర్డ్ గ్లాస్‌లపై 52.85 డాలర్ల నుంచి 136.21 డాలర్ల వరకు పన్ను విధింపు వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ శాఖ ఆగస్టు 21న నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా టాంపర్డ్ గ్లాస్‌లపై 5 ఏళ్లపాటు దిగుమతి నిరోధక సుంకం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 

త్వరలో చెలామణిలోకి రూ.200 నోట్లు 
మొదటిసారిగా రూ.200 నోట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. చిన్నపాటి లావాదేవీలకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు వీలైనంత త్వరగా వీటిని వాడుకలోకి తీసుకురావాలని రిజర్వుబ్యాంకును ఆదేశించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. రూ.2000 నోట్లు కూడా ఆశించిన స్థాయిలో తిరిగి బ్యాంకులకు చేరకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు ఆర్బీఐ గుర్తించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : త్వరలో రూ.200 నోట్లు 
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : చిన్న నోట్ల కొరత తీర్చేందుకు 

ఎయిరిండియా ఆస్తుల విక్రయం ప్రారంభం 
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా... దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఎయిరిండియాకు దేశమంతటా ఆస్తులున్న నేపథ్యంలో... వాటిని విక్రయించి సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్ ప్రాంతాల్లో సంస్థకు ఉన్న 27 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్లాట్లు, స్థలాలు, ఆఫీసు భవంతులను అమ్మకానికి పెట్టారు. ఈ విక్రయం ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమకూరుతాయని సంస్థ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ ఆస్తులకు ఈ-వేలం నిర్వహించనుండగా.. బిడ్ల దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్ 6గా నిర్ణయించారు. 
2017 మార్చి ఆఖరుకి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ.48,879 కోట్లు. గతేడాది కంపెనీ నికర నష్టం రూ. 3,643 కోట్లకు తగ్గగా.. నిర్వహణ లాభం రూ. 300 కోట్లుగా నమోదైంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎయిరిండియా ఆస్తుల విక్రయం ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 24 
ఎవరు : కేంద్ర పౌరవిమానయాన శాఖ 
ఎందుకు : సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని 

నీతి ఆయోగ్ 3 ఏళ్ల సమగ్ర ప్రణాళిక 
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతానికి పైగా నమోదవడానికి పుష్కలంగా అవకాశాలున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోని మొత్తం 125 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాలు సమకూర్చేలా ఉండాలని సూచించింది. ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ‘మూడేళ్ల సమగ్ర ప్రణాళిక- 2017-18 నుంచి 2019-20’ని ఆగస్టు 24న ఆవిష్కరించింది. నల్లధనం, అవినీతి నిరోధం, పన్ను పరిధి పెంపు, సివిల్ సర్వీసులు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణ వంటి కీలక అంశాలపై సూచనలు ఇందులో ఉన్నాయి. 
ప్రణాళికలోని ముఖ్యాంశాలు
- వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో పేదరిక నిర్మూలన భారీగా జరిగే వీలుంది. 
-కేంద్ర ప్రభుత్వ వ్యయాల విషయంలో భవిష్యత్ ప్రాధాన్యతపై దృష్టి ఉండాలి. అధిక ప్రాధాన్యతా రంగాలకు అదనపు కేటాయింపులు జరగాలి. ఇది వృద్ధి ప్రోత్సాహానికి దారితీస్తుంది. 
-2019-20 నాటికి అధిక నిధులను విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రక్షణ, రైల్వేలు, రోడ్లు అభివృద్ధికి కేటాయించాలి. 
- సామాజిక రంగం విషయంలో విద్య, వైద్య రంగాలు మెరుగుపడాలి. మానవ వనరుల నైపుణ్యతలో పురోగతి ఉండాలి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 3 ఏళ్ల సమగ్ర ప్రణాళిక 
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : నీతి ఆయోగ్ 
ఎందుకు : ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి

లక్ష్యాన్ని దాటిన తొలి జీఎస్‌టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు తొలి నెల జూలైలో లక్ష్యాలను అధిగమించాయి. ఈ వసూళ్ల మొత్తం రూ.92,283 కోట్లని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 29న వెల్లడించారు. అలాగే.. 59.57 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ విధానం కింద రిజిస్టర్ కాగా వీరిలో ఇప్పటివరకూ 64.4 శాతం మంది నుంచి మాత్రమే పన్ను వసూళ్లు జరిగాయి. 
జూలైలో జీఎస్‌టీ ద్వారా మొత్తం రూ.91,000 కోట్లు మాత్రమే లభిస్తాయని వార్షిక బడ్జెట్ అంచనా వేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జీఎస్‌టీ జూలై నెల వసూళ్లు రూ.92,283 కోట్లు 
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ

2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 27.56 కోట్ల టన్నులు
 2016-17లో దేశంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 16న విడుదల చేసిన నాలుగో అంచనాల నివేదిక మొత్తం 27.56 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. అందులో 11.01 కోట్ల టన్నుల వరి పండింది. ఇక పప్పుధాన్యాలు 2.29 కోట్ల టన్నులు, పత్తి 2.29 కోట్ల టన్నులు ఉత్పత్తి అయింది. 2015-16లో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.01 కోట్ల టన్నులు కాగా, ఈసారి 55 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయినట్లు వెల్లడించింది. వరి ఈసారి 61 లక్షల టన్నులు అధిక ఉత్పత్తి జరిగింది. ఇక పత్తి 2015-16లో 1.63 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2016-17లో అదనంగా 66 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆహార ధాన్యాల ఉత్పత్తి 27.56 కోట్ల టన్నులు 
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

మెట్రో రైలు పాలసీ - 2017
దేశవ్యాప్తంగా మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయడానికి కేంద్రం నూతన మెట్రో రైలు విధానం 2017 ని ఆమోదించింది. ప్రైవేట్ రంగంతో పాటు ఇతర మార్గాలైన వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ (VCF), బాండ్ల జారీతో నిధులు సేకరించేందుకు ఇందులో చర్యలు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 16న ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం తాము చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే రాష్ట్రాలు ప్రైవేట్ సంస్థలతో జట్టుకట్టడం తప్పనిసరి చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి, వ్యయం తగ్గింపునకు ఈ విధానంలో ప్రాధాన్యమిచ్చారు. మెట్రో ప్రాజెక్టుల అమలుకు ఏకీకృత నిబంధనలను రూపొందించడంతో పాటు, నిధుల సేకరణకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 
మెట్రో రైలు పాలసీ-2017 ముఖ్యాంశాలునిధుల డిమాండ్‌ను తట్టుకోవాలంటే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి.మొత్తం ప్రాజెక్టులో లేదా అనుబంధ విభాగాలైన చార్జీల వసూలు, నిర్వహణలో ప్రైవేట్ సంస్థ పాలుపంచుకోవాలి.ప్రైవేట్ రంగంలోని వనరులు, నిపుణత, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవడానికే ఈ నిర్ణయం.స్టేషన్‌లో వాణిజ్య ఆస్తుల అభివృద్ధి, స్థలాల లీజులు, వాణిజ్య ప్రకటనల ద్వారా లభించే ఆదాయానికి సంబంధించి తీసుకునే చర్యలను రాష్ట్రాలు తమ ప్రాజెక్టు రిపోర్టులో సవివరంగా తెలియజేయాలి.సమయానుగుణంగా చార్జీలను సవరించేలా నిబంధనల మార్పునకు, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం కల్పించారు.కేంద్రం నుంచి నిధులు పొందే మార్గాలు: వయబిలిటీ గ్యాప్ ఫండ్, కేంద్ర గ్రాంట్లు (ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం), 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈక్విటీ షేరింగ్. 
విద్యా సెస్‌తో నిధి: సెకండరీ, ఉన్నత విద్య ద్వారా సమకూరే సెస్ నిధులతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘మాధ్యమిక్ అండ్ ఉచ్చతర్ శిక్షా కోశ్’(ముస్క్)గా పిలిచే ఈ నిధి మానవ వనరుల శాఖ నిర్వహణలో కొనసాగుతుంది. ముస్క్ నిధులను మాధ్యమిక, ఉన్నత విద్య పథకాలకు వెచ్చిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మెట్రో రైలు పాలసీ - 2017
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసేందుకు 

ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ‘జీఎస్టీ’ మద్దతు 
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికోసం పదేళ్లపాటు రూ.27,413 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ కన్నా ముందు ఆయా రాష్ట్రాలకు సెంట్రల్ ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉండేది. ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి వచ్చిన కారణంగా.. ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఆ మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో ఆగస్టు 16న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. జూలై 1, 2017 నుంచి మార్చి 31, 2027 వరకు ఇది వర్తిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక పాలసీ-2007ను సిక్కింతో పాటు ప్రత్యేక హోదా పొందుతున్న జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ కేంద్రం అమలు చేస్తోంది. ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లో పరిశ్రమల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తొలి పదేళ్ల పాటు ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా 4,284 పరిశ్రమలకు ప్రత్యక్ష నగదు సరఫరా ద్వారా రీఫండ్ జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రత్యేక హోదా రాష్ట్రాలకు పదేళ్లపాటు రూ.27, 413 కోట్లు 
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : జీఎస్టీ అమల్లో భాగంగా

22 క్యారెట్లకు పైబడిన బంగారం ఎగుమతులపై నిషేధం
22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతులున్నాయని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో తెలిపింది. 22 క్యారెట్లలోపు స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తులను ఎగుమతి చేసే వారికే ప్రోత్సాహకాలు లభిస్తాయని పేర్కొంది. కొందరు ఎగుమతిదారులు 22 క్యారెట్లకుపైన స్వచ్ఛతగల బంగారం ఉత్పత్తులకు కొంత విలువను జోడించి ఎగుమతి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు పొందుతున్నారని జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 22 క్యారెట్లు పైబడిన స్వచ్ఛత బంగారం ఎగుమతిపై నిషేధం 
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు

వ్యవసాయ రుణాలకు ఆధార్ తప్పనిసరి 
2017-18లో కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీతో స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఆగస్టు 16న నిర్ణయం తీసుకుంది. 
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ పథకం కింద రైతులు బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. ఈ రుణంపై బ్యాంకులు 7 శాతం వడ్డీ విధిస్తుండగా.. ఇందులో 2 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. వాయిదా చెల్లింపులు క్రమంగా తప్పకుండా చెల్లించే వారికి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ వ్యవసాయ రుణాలకు ఆధార్ తప్పనిసరి 
ఎప్పుడు : ఆగస్టు 16 
ఎవరు : భారతీయ రిజర్వు బ్యాంకు 

త్వరలో కొత్త 50 రూపాయల నోట్లు
ఆర్‌బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను చెలామణిలోకి తీసుకురానుంది. ఇవి నీలి రంగులో (ఫ్లోరోసెంట్ బ్లూ) ఉంటాయి. వీటిపై ఒకవైపు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్ భారత్ లోగో.. మరొకవైపు మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం ఉంటాయి. కొత్త నోట్లు మార్కెట్‌లోకి వచ్చినా పాత రూ.50 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : త్వరలో కొత్త 50 రూపాయల నోటు 
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 
ఎందుకు : భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా 

అమెరికా నుంచి తొలిసారిగా ముడి చమురు దిగుమతి
ప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత్ తొలిసారిగా అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. మొదటి దఫా రవాణా ఆగస్టు 8-14 మధ్య మొదలైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొనుగోలు చేసిన ఈ చమురు సెప్టెంబర్‌లో భారత్‌కు చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఇరు దేశాలు ఇంధన రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించడంతో చమురు కొనుగోలు మొదలైంది. ఇందులో భాగంగా ఐఓసీ అమెరికా నుంచి 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. దీంతో అగ్ర రాజ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, తైవాన్ ఇప్పటికే అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్).. ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించడంతో ధరలు పెరిగాయి. దీంతో మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయి.

ఫోర్బ్స్ సృజనాత్మక కంపెనీల్లో మూడు దేశీ సంస్థలు
 నూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచంలోనే 100 అత్యుత్తమ సృజనాత్మక కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ లిస్టులో హిందుస్తాన్ లీవర్ (హెచ్‌యూఎల్), ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. హెచ్‌యూఎల్ క్రితం సారి 31వ స్థానంలో ఉండగా ఈసారి ఏడో స్థానానికి, ఏషియన్ పెయింట్స్ 18వ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకాయి. ఎయిర్‌టెల్ కొత్తగా 78వ ర్యాంకుతో జాబితాలో చోటు దక్కించుకుంది. టీసీఎస్, సన్ ఫార్మా, లార్సన్ అండ్ టూబ్రో గతేడాది జాబితాలో ఉన్నప్పటికీ ఈసారి స్థానం లభించలేదు. దీంతో లిస్టులో భారతీయ సంస్థల సంఖ్య అయిదు నుంచి మూడుకి తగ్గింది. 
2017 జాబితాలో తొలిస్థానంలో సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్, రెండో స్థానంలో టెస్లా మోటర్స్, మూడో స్థానంలో అమెజాన్‌డాట్‌కామ్ ఉన్నాయి. కనీసం 10 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల సంస్థలకు ఇందులో చోటు ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 100 ఇన్నోవెటివ్ కంపెనీస్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఫోర్బ్స్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

2017-18 ఆర్థిక సర్వే రెండో ఎడిషన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల మేరకు గరిష్ట వృద్ధి రేటు నమోదు కష్టమేనని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన ఆర్థిక సర్వే రెండో ఎడిషన్‌ను ఆగస్టు 11న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5 శాతం మధ్య నమోదవుతుందని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించిన ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 7.5 శాతం వృద్ధి రేటు అసాధ్యమేనని పేర్కొంది. ఆర్థిక రంగం పుంజుకునేందుకు మరిన్ని రేట్ల కోతలు అవసరమని అభిప్రాయపడింది. ఆర్బీఐ మధ్య కాలిక లక్ష్యమైన 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి విలువ బలపడడం, రైతుల రుణాల మాఫీ, విద్యుత్, టెలికం రంగ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, కొత్త పన్ను వ్యవస్థ జీఎస్టీకి మారడం వంటి అంశాలను సవాళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్క రైతుల రుణ మాఫీయే జీడీపీ వృద్ధిని 0.7 శాతం వరకు తగ్గించేస్తుందని అంచనా వేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే బాట అనుసరిస్తే మొత్తం భారం రూ.2.7 లక్షల కోట్లుగా ఉంటుందని, ఇది ఆర్థిక వృద్ధిని వెనక్కి లాగేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు రైతుల రుణాలను రద్దు చేశాయి. 
ఆర్థిక సర్వే ప్రధానాంశాలు
2017-18లో జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతానికి దిగొస్తుంది. 2016-17లో 3.5%.రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి వరకు 4 శాతంలోపే ఉండొచ్చు.పాలసీ రేట్లను 25-75 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలు.డీమోనిటైజేషన్ తర్వాత కొత్తగా 5.4 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తోడయ్యారు.క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017-18 ఆర్థిక సర్వే రెండో ఎడిషన్ 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

నదుల్లో 15-20% మధ్య ప్రవాహాలు తప్పనిసరి
దేశవ్యాప్తంగా నదుల్లో 15 నుంచి 20 శాతం మధ్య నీటి ప్రవాహాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జీవనోపాధికి, పర్యావరణ పరిరక్షణ చర్యల నిమిత్తం నదుల్లో కొంత లోతు మేర స్వచ్ఛమైన నీటిని లభ్యమయ్యేలా 15 నుంచి 20 శాతం నదుల ప్రవాహాలు ఉండేలా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలకు ఏ రాష్ట్రమైనా కట్టుబడి ఉండటం సాధ్యం కాకపోతే ఆ రాష్ట్రం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను కలవొచ్చని సూచించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నదుల్లో 15 నుంచి 20 శాతం ప్రవాహాలు తప్పనిసరి 
ఎప్పుడు : ఆగస్టు 14 
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణకు 

2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు
2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవారాలంటే.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రూ.6.4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయడింది. ఈ మేరకు ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబ ఆదాయం రూ.96,703గా ఉంది. దీన్ని 2022-23 నాటికి రూ.2,19,724లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ
ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై తీసుకునే వడ్డీరేటు - రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. అదే విధంగా బ్యాంకులు తమ వద్ద స్వల్పకాలికంగా ఉంచే అదనపు నిధులకు సంబంధించి చెల్లించే రేటు- రివర్స్ రెపోను కూడా పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 5.75 శాతానికి తగ్గింది. దాదాపు పది నెలల నుంచీ ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలతో రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్‌బీఐ, ప్రస్తుతం ఈ భయాలు తగ్గడంతో రెపో రేటు పావుశాతం తగ్గించినట్లుగా వివరించింది. వృద్ధికి ఇది భరోసా కల్పిస్తున్న అంశంగా పేర్కొంది. 
తగ్గనున్న ఈఎంఐ భారం 
రెపో తగ్గింపు ద్వారా లభిస్తున్న ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. తాజా నిర్ణయం వల్ల గృహ, ఆటో, కార్పొరేట్ల నెలవారీ రుణ పునః చెల్లింపుల (ఈఎంఐ) భారం కొంత తగ్గుతుంది. 
మరిన్ని ముఖ్యాంశాలు.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా 7.3 శాతంగా కొనసాగింపు.బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తం- 4 శాతం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎటువంటి మార్పు లేదు.6.25 శాతానికి దిగివచ్చిన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్), బ్యాంక్ రేటు.ప్ల్లస్ 2 లేదా మైనస్ 2 శ్రేణితో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం లక్ష్యాలను కొనసాగించడంపై దృష్టి.2017 జూలై 28కి 392.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు.ఆర్‌బీఐ తదుపరి పరపతి విధాన సమీక్ష 2017 అక్టోబర్ 3, 4 తేదీల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక సమావేశం) జరుగుతుంది.క్విక్ రివ్యూ: 
ఏమిటి : రెపో రేటు పావు శాతం తగ్గింపు
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రిజర్వు బ్యాంకు 
ఎక్కడ : ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో 

కేంద్రం నుంచి కొత్త ఈటీఎఫ్ ‘భారత్-22’
‘భారత్-22’ పేరుతో కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, బేస్ మెటల్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్లతో భారత్-22ను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 4న ప్రకటించారు. ఈ 22 షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వానికి వ్యూహాత్మక వాటా కలిగిన ప్రైవేటు కంపెనీలు వున్నాయి. ఎస్‌యూయూటీఐ (గతంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగం) ద్వారా ప్రభుత్వానికి ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీల్లో వ్యూహాత్మక వాటా వుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేసి, మూడు విడతలుగా ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 8,500 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. 
భారత్-22 జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పీఎస్‌యూ బ్యాంకుల్ని భారత్-22లో చేర్చారు. 
మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లే.. ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలుచేయడం ద్వారా 22 బ్లూచిప్ కంపెనీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ప్రభుత్వం తొలుత ప్రవేశపెట్టిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా ఇదే తరహాలో ఇన్వెస్టర్ల నుంచి 3 దశలుగా రూ. 8,506 కోట్లు సమీకరించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కొత్త ఈటీఎఫ్ భారత్ - 22
ఎప్పుడు : ఆగస్టు 4 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

11.4 లక్షల పాన్‌కార్డులు డీయాక్టివేట్ 
దేశవాప్తంగా 11.4 లక్షల పాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం క్రియారహితం (డీయాక్టివేట్) చేసింది. అందులో కొన్నింటిని రద్దు కూడా చేసింది. ఆగస్టు 31లోపు ప్రతి పౌరుడు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఆలోపు ఆధార్ నంబరుతో అనుససంధానం చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ గతంలోనే సూచించింది. 
డీయాక్టివ్ అయిన పాన్‌కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఐటీ విభాగం ఇ- ఫిల్లింగ్ వెబ్‌సైట్‌ని సందర్శించండి. అందులో ’Know Your Pan’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ పేజీ వస్తుంది. అందులో నక్షత్రం గుర్తు ఉన్న ఖాళీలు అన్నీ జాగ్రత్తగా పూర్తిచేసి సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 11.4 లక్షల పాన్‌కార్డులు డియాక్టివేట్ 
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : పాన్‌కార్డుల సమాచారం వడపోతలో భాగంగా 

ఐటీ రిటర్నుల్లో 25 శాతం వృద్ధి
పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016-17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించింది. 
వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుండా) అడ్వాన్స్‌ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నాటికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐటీ రిటర్నుల్లో 25 శాతం వృద్ధి 
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : కేంద్ర ఆదాయ పన్నుల విభాగం 
ఎందుకు : పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలతో

ఆర్థిక వ్యవహారాలు సెప్టెంబరు 2017 ఎకానమీ
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పెంపు
 దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాల(ఎంఐజీ)కు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద అందిస్తున్న రూ.2.60 లక్షల వడ్డీ సబ్సిడీ గడువును 2019 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ప్రధాని మోదీ ప్రారంభించిన రుణ అనుసంధానిత సబ్సిడీ పథకానికి(సీఎల్‌ఎస్‌ఎస్) తుదిగడువు ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుండటంతో ప్రభుత్వం మరో 15 నెలలు పొడిగించింది. 
2022 నాటికి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ సొంతిళ్లు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. రూ.6-12 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలు 20 ఏళ్ల కాలపరిమితితో రూ.9 లక్షల వరకు తీసుకునే రుణాలపై కేంద్రం ప్రస్తుతం సీఎల్‌ఎస్‌ఎస్ కింద 4% సబ్సిడీని అందిస్తోంది. వార్షికాదాయం రూ.12-18 లక్షలు ఉండే మధ్య తరగతి కుటుంబాలకు 3% వడ్డీ సబ్సిడీని అందిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పెంపు
ఎప్పుడు : 2019 వరకు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి నిర్మాణం కోసం 

"సౌభాగ్య" పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకాన్ని (ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన) ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రూ. 16,320 కోట్లతో డిసెంబర్ 2018 నాటికి దేశంలో విద్యుత్ సదుపాయం లేని కుటుంబాలకు కనెక్షన్లను అందచేస్తారు. 
‘సౌభాగ్య’ పథకం వివరాలు 
ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 16,320 కోట్లు..గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణకు రూ. 14,025 కోట్లుపట్టణాల్లో విద్యుదీకరణకు రూ. 2,295 కోట్లుఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రాలు 10 శాతం నిధులు సమకూరుస్తాయి. మిగతా మొత్తం రుణాల రూపంలో సేకరిస్తారు.సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్‌ఈసీసీ)- 2011 సమాచారం ఆధారంగా ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఎస్‌ఈసీసీ కిందకు రాని వారికి కూడా విద్యుత్ కనెక్షన్లు లేకపోతే ఈ సదుపాయం కల్పిస్తారు. అయితే వారి నుంచి 500 రూపాయల్ని 10 వాయిదాల్లో విద్యుత్ బిల్లుల ద్వారా డిస్కంలు వసూలు చేస్తాయి.గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్‌ఈసీ) ఈ పథకానికి దేశమంతా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

క్విక్ రివ్యూ: 
ఏమిటి : సౌభాగ్య పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎందుకు : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు

బాలకార్మిక రహిత సమాజానికి ‘పెన్సిల్’
బాల కార్మిక వ్యవస్థ రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ‘పెన్సిల్’ అనే పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 26న ఆవిష్కరించారు. ప్లాట్‌ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ దీని పూర్తి పేరు. బాలకార్మిక వ్యవస్థ రహిత సమాజ స్థాపనకు కేంద్రం, రాష్ట్రం, జిల్లా యంత్రాంగం, పౌరుల భాగస్వాములయ్యేందుకు ఈ ఫోరం వేదిక అవుతుందని రాజ్‌నాథ్ తెలిపారు. చైల్డ్ ట్రాకింగ్ వ్యవస్థ, ఫిర్యాదు విభాగం, జిల్లా యంత్రాంగ సమన్వయం, తదితర వ్యవస్థలు ఇందులో ఉంటాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పెన్సిల్ పోర్టల్ ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు

బ్రాండ్జ్ ఇండియా నివేదికలో హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 
 దేశంలోని గొప్ప బ్రాండ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నంబర్ 1 గా తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ మేరకు దేశంలో అత్యంత విలువైన మొదటి 50 బ్రాండ్ల వివరాలను ‘బ్రాండ్‌‌జ ఇండియా టాప్ 50’ పేరుతో ప్రకటనల సంస్థ డబ్ల్యూపీపీ, పరిశోధనా సంస్థ కంటార్ మిల్‌వర్డ్ బ్రౌన్ సంస్థలు సెప్టెంబర్ 14న ప్రకటించాయి. 
ఈ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని నాలుగేళ్ల నుంచి కాపాడుకుంటు వస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ.. 2014 నుంచి తన బ్రాండ్ విలువను 9.4 బిలియన్ డాలర్ల నుంచి 18 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. కాగా కొత్తగా జాబితాలో 7 సంస్థలకు చోటు దక్కింది. టెలికంలోకి కొత్తగా ప్రవేశం చేసిన రిలయన్‌‌స జియో 11వ స్థానం సంపాదించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్రాండ్జ్ ఇండియా టాప్ 50 
ఎప్పుడు : సెప్టెంబర్ 13 
ఎవరు : మొదటి స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ 
ఎక్కడ : భారత్‌లో 

జీవనకాల గరిష్ఠానికి విదేశీ మారక నిల్వలు 
విదేశీ మారక నిల్వలు జీవిత కాల గరిష్ఠానికి చేరాయి. గత వారం నిల్వలు 398.122 బిలయన్ డాలర్లతో పోలిస్తే, ఈ వారం 2.604 బిలియన్ డాలర్లు పెరిగి 400.726 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15న తాజా గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం విదేశీ కరెన్సీ ఆస్తులు 2.568 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 376.209 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల్లో మార్పులు లేకుండా 20.691 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 
విదేశీ మారక నిల్వలు 400 బిలియన్ డాలర్లకు చేరడం వల్ల, ఏడాది పాటు మన దిగుమతులకు సరిపోతాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 400.726 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారక నిల్వలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 15 
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 

10 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 
భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. 7 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా అవతరించి జపాన్, జర్మనీలను అధిగమించి ముందుకు వెళుతుందని అంచనా వేసింది. అదే సమయంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 6 లక్షల కోట్ల డాలర్లు, జపాన్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 
2015-16 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2.3 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 17 
ఎవరు : హెచ్‌ఎస్‌బీసీ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

బీపీసీఎల్‌కు మహారత్న హోదా 
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 12న ‘మహారత్న’ హోదా ప్రకటించింది. నవరత్న కంపెనీ అయి ఉండి గత మూడేళ్లలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తూ రూ.25,000 కోట్లకుపైగా సగటు వార్షిక టర్నోవర్ నమోదు చేసిన వాటికి ఈ హోదా ఇస్తారు. గత మూడేళ్లలో రూ.15,000 కోట్ల సగటు నికర విలువ, రూ.5000 కోట్ల సగటు వార్షిక నికర లాభం ఆర్జించి ఉండాలి. మహారత్న హోదా వచ్చిన ప్రభుత్వ కంపెనీలకు రూ.1000-5000 కోట్ల వరకు పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవ డానికి స్వేచ్ఛ ఉంటుంది. నవరత్న హోదా ఉన్నవాటికి ఈ పరిమితి రూ.1000 కోట్లు. 

సుస్థిర ఆరోగ్య లక్ష్యాల సాధనలో128వ స్థానం 
ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని ఆరోగ్య సంబంధ గమ్యాలను చేరుకోవడంలో భారత్ వెనకబడుతోందని ‘ది లాన్సెట్’ వైద్య పత్రిక సెప్టెంబర్ 12న తెలిపింది. ఈ లక్ష్యాలను 2030లోగా చేరుకోవాలి. ఈ దిశగా సాధించిన ప్రగతిలో వాయు కాలుష్యం, పారిశుద్ధ్యం, హెపటైటిస్-బి, పిల్లల్లో పోషకాహార లోపం వంటి అంశాల్లో బాగా వెనకబడిందని వివరించింది. 1990-2014లోని ధోరణులను విశ్లేషిస్తూ వాషింగ్టన్ వర్సిటీ అనుబంధ సంస్థ జరిపిన అధ్యయన ఫలితాలను ‘ది లాన్సెట్’ పేర్కొంది. 180 దేశాలకు సంబంధించి 2030 నాటికి ఉండబోయే పరిస్థితిపై అంచనాలు రూపొందించింది.

ఉద్యోగ కల్పనకు నీతిఆయోగ్ టాస్క్‌ఫోర్స్ 
దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ దీనికి నేతృత్వం వహిస్తారు. పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పెంచడం, సంఘటిత రంగంలో సవాళ్లను అధిగమించడం ద్వారా ఉద్యోగ అవకాశాల పెంపుదలపై నిపుణులతో కూడిన ఈ టాస్‌్టఫోర్స్ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉద్యోగ కల్పనకు నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చేందుకు 

2020 నాటికి తట్టు రహిత దేశంగా భారత్ 
భారత్‌తో పాటు ఆగ్నేయాసియాలోని మరో నాలుగు దేశాలను(బంగ్లాదేశ్, మయన్మార్, తైమూర్, ఇండోనేషియా) 2020 నాటికి తట్టు(మీసెల్స్) రహిత ప్రాంతాలుగా మార్చాలని ప్రపంచ ఆరోగ్యో సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అలాగే.. 2018 నాటికి ఈ దేశాల్లోని 400 మిలియన్ల చిన్నారులకు తట్టు నిరోధక టికాలను సరఫరా చేయనుంది. 
డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం వైరస్ కారణంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా యేటా 1,34,200 మంది చిన్నారులు మరణిస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తట్టు రహిత దేశంగా భారత్
ఎప్పుడు : 2020 నాటికి 
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ 

ప్రత్యేక సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ విభాగం
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన మొబైల్ టవర్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ సెప్టెంబర్ 12న ఆమోదముద్ర వేసింది. దేశీయంగా ప్రస్తుతం 4,42,000 మొబైల్ టవర్స్ ఉండగా, వీటిలో బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందినవి 66,000 పైచిలుకు ఉన్నాయి. టవర్స్ విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని టెల్కోలకు అద్దెకివ్వడం ద్వారా కొత్త కంపెనీ మరింత ఆదాయం ఆర్జించగలిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రత్యేక సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ విభాగం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్ 

పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ' స్కూల్ చలో అభియాన్'
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్కూల్ చలో అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుంది. సెప్టెంబర్ 8న 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో పాల్గొన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్.. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా పాఠశాలలకు దూరంగా ఉన్న 70లక్షల నుంచి 80 లక్షల మంది చిన్నారులను బడుల్లో చేర్పిస్తారు.

రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగొచ్చాయి : ఆర్‌బీఐ 
 నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ.1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99% బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికను ఆగస్టు 30న విడుదల చేసిన ఆర్‌బీఐ.. నోట్ల రద్దు తదనంతర ఫలితాలను ఇందులో వివరించింది. 
నివేదికలోని ముఖ్యాంశాలు..

రూ. 15.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లలో రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయి. అంటే, కేవలం రూ. 16, 050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదు.నిర్ణయం అనంతరం రూ. 1000 నోట్లలో 98.6% నోట్లు బ్యాంకుల్లో జమకాగా కేవలం 1.4% మాత్రమే తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోనికి రాలేదు.కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు భారీగా పెరిగింది. 2015-16లో రూ. 3,421 కోట్లు ఖర్చు కాగా, 2016-17లో అది రెండింతలు దాటి రూ. 7,965 కోట్లకు చేరింది.చలామణిలో ఉన్న నగదు విలువ 2017 మార్చి నాటికి 13.1 లక్షల కోట్లు. గత సంవత్సరం కన్నా ఇది 20.2% తక్కువ.ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3%గా ఉంటుంది.క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్యాంకులకు తిరిగొచ్చిన 99 శాతం రద్దయిన నోట్లు 
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా

2017-18 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతం
2017-18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్, క్యూ1) వృద్ధి కేవలం 5.7%గా నమోదయింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి- మార్చి మధ్య 4.6% కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తరవాత అత్యంత తక్కువ ఇదే. ఈ మేరకు ఆర్థిక వృద్ధి రేటు గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం(CSO) ఆగస్టు 31న విడుదల చేసింది. జీవీఏ(గ్రాస్ వాల్యూ యాడెడ్) 5.6 శాతంగా నమోదైందని వెల్లడించింది. 
గతేడాది ఇదే కాలంలో 7.9 శాతం వృద్ధి రేటు నమోదైంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017-18 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతం 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : కేంద్ర గణాంకాల కార్యాలయం 

ఆధార్-పాన్ అనుసంధానం గడువు పెంపు 
ఆధార్-పాన్ అనుసంధానం గడువుని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పొడగించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు 31న ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు రిటర్న్స్ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌కు, ఆడిట్ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్ 31 వరకు గడువునిచ్చింది.
పన్ను చెల్లింపుదారులు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు ఆగస్ట్ 31తో ముగిసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆధార్ - పాన్ అనుసంధానం గడువు పెంపు 
ఎప్పుడు : డిసెంబర్ 31 వరకు 
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 

వ్యవసాయ పథకాల్లో మహిళా రైతులకు 30 శాతం నిధులు
వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే మహిళా రైతుల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. మహిళా స్వయం సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా వారిని ఆదుకోవాలని భావిస్తోంది. అలాగే.. 2016లో నిర్ణయించిన విధంగా ఏటా అక్టోబర్ 15వ తేదీని మహిళా రైతు దినోత్సవంగా పాటించాలని స్పష్టంచేసింది. 
దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన మహిళల్లో 80 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారేనని జాతీయ నమూనా సర్వే తేల్చింది. ఆ 80 శాతం మందిలో 33 శాతం మహిళలు వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. 48 శాతం మంది వ్యవసాయ సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి కలిగిన మహిళా రైతులున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వ్యవసాయ పథకాల్లో మహిళా రైతులకు 30 శాతం నిధులు
ఎప్పుడు : సెప్టెంబర్ 2 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

ఆర్థిక వ్యవహారాలు అక్టోబరు 2017 ఎకానమీ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ 2018
ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ - 2018లో భారత్ 100వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాది ఇదే ర్యాంకింగ్స్‌లో 130వ స్థానంలో భారత్ ఈసారి 30 స్థానాలు మెరుగుపరుచుకుంది. ‘డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణలు’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేసింది. పన్నులు, లెసైన్సింగ్ వ్యవస్థలో సంస్కరణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, దివాలా సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాల్లో భారత్ వేగంగా పురోగమించడం ఈ ర్యాంక్ మెరుగుదలకు దోహదపడింది. 
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...
2003 నుంచి భారత్ దాదాపు 37 సంస్కరణాత్మక చర్యలను తీసుకువచ్చింది. అందులో సగానికి సగం సంస్కరణలు మంచి ఫలితాలను అందించాయి. ప్రత్యేకించి గడచిన నాలుగేళ్లలో ఈ సంస్కరణల అమలు తీరు బాగుంది. ర్యాంకింగ్ మెరుగుదలలో ఇది ఎంతగానో దోహదపడింది.ఈ ఏడాది తమ ర్యాంకులను భారీగా పెంచుకున్న 10 దేశాల్లో భారత్ ఒకటి.భారత్ 100 ర్యాంక్ క్లబ్‌లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇలాంటి భారీ రికార్డు నమోదుచేసిన అతిపెద్ద దేశం భారత్ కావడమూ మరో విశేషం. భారత్ తన స్కోర్‌ను 4.71 పాయింట్ల మేర పెంచుకుని 60.76 పాయింట్లకు చేరింది.గత రెండేళ్లుగా భారత్ ర్యాంక్ 130గా ఉంది. 2014లో దేశం ర్యాంక్ 142.


న్యూజిలాండ్ టాప్..
సులువైన వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. తరువాతి నాలుగు స్థానాల్లో సింగపూర్ (2), డెన్మార్క్ (3), దక్షిణ కొరియా (4), హాంకాంగ్ (5) నిలిచాయి. అమెరికా 6వ స్థానం, బ్రిటన్ 7వ స్థానంలో నిలిచాయి. ఇక బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో రష్యా అగ్ర స్థానంలో 35వ ర్యాంక్ పొందింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణల నివేదిక
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ప్రపంచ బ్యాంకు 
ఎక్కడ : 100వ ర్యాంకులో భారత్

దేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్ ‘గూగుల్’
 టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్.. భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మారుతీ సుజుకీ, యాపిల్ ఉన్నాయి. గ్లోబల్ కమ్యూనికేషన్‌‌స సంస్థ ‘కొహ్న్ - వోల్ఫ్’ ఈ విషయాలను వెల్లడించింది. సోనీ, యూట్యూబ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ వంటి బ్రాండ్‌‌స టాప్-10లో స్థానం పొందాయి. దాదాపు 67 శాతం మంది వినియోగదారులు వారి కొనుగోళ్లలో బ్రాండ్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే.. అమెజాన్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఉంది. దీని తర్వాతి స్థానంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పేపాల్ వంటి సంస్థలు ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ - గూగుల్ 
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : కోహ్న్ - వోల్ఫ్ సంస్థ 

ఆర్‌కామ్-సిస్టెమా డీల్‌కు డాట్ అంగీకారం
రిలయన్‌‌స కమ్యూనికేషన్‌‌సతో (ఆర్‌కామ్) సిస్టెమా శ్యామ్(ఎస్‌ఎస్‌టీఎల్) విలీనానికి టెలికం విభాగం (డాట్) తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సిస్టెమా శ్యామ్ వైర్‌లెస్ వ్యాపార విలీనానికి డాట్ అంగీకారం లభించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. విలీన ఒప్పందం ప్రకారం.. ఎస్‌ఎస్‌టీఎల్‌కు సంబంధించిన వైర్‌లెస్ బిజినెస్ అసెట్స్ అన్నీ ఆర్‌కామ్ పరిధిలోకి వస్తాయి. విలీనానం తరం ఆర్‌కామ్‌లో సిస్టెమాకు 10 శాతం వాటా వస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆర్‌కామ్ - సిస్టెమో(ఎస్‌ఎస్‌టీఎల్) డీల్‌కు ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : టెలికం విభాగం (డాట్)

జాతీయ రహదారుల నిర్మాణానికి 7 లక్షల కోట్లు 
ప్రతిష్టాత్మక భారత్‌మాల ప్రాజెక్టు, ఇతర జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ. 7 లక్షల కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ భారీ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపింది. 
భారత్ మాల 
భారత్‌మాల ప్రాజెక్టులో దేశ సరిహద్దులతోపాటుగా కోస్తా, ఇతర ప్రాంతాలను కలుపుతూ (దాదాపు 50 వేల కిలోమీటర్లు) జాతీయ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును కలుపుకుని ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 83,677 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించాలని మోదీ ప్రభుత్వం సంకల్పిస్తోంది. భారత్‌మాల ప్రాజెక్టుల తొలి దశలో 20 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. భారత్‌మాల ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు 10 లక్షల కోట్లు ఖర్చవుతాయని కేంద్రం అంచనా వేసింది. 2021-22 నాటికి ఈ ప్రతిపాదిత భారత్‌మాల ప్రాజెక్టు పనులను ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్, మోర్త్, రాష్ట్రాల పీడబ్ల్యూడీ శాఖల సహకారంతో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 
ఎకనమిక్ కారిడార్‌ల అభివృద్ధి 
కేబినెట్ ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో కార్గోలు వేగవంతంగా చేరేలా ఎకనమిక్ కారిడార్‌ల అభివృద్ధి కూడా ఉంది. ఈ ఎకనమిక్ కారిడార్లలో ముంబై-కొచ్చిన్-కన్యాకుమారి, బెంగళూరు-మంగళూరు, హైదరాబాద్-పణజీ, సంబల్‌పూర్-రాంచీ వంటి 44 ప్రాజెక్టులున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 7 లక్షల కోట్లు 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : భారత్ మాల, ఎకనమిక్ కారిడార్ల అభివృద్ధి పథకంలో భాగంగా 

పీఎస్‌బీ బ్యాంకులకు 2 ఏళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు 
మొండిబకాయిలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా రూ. 2.11 లక్షల కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు వెల్లడించింది. ఇందులో రూ. 1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో రానుండగా, బడ్జెట్ కేటాయింపుల రూపంలో రూ. 18,139 కోట్లు, ఆయా బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా మరో రూ. 58,000 కోట్లు సమకూరనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ మేరకు మూలధనం సమకూర్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అక్టోబర్ 24న వెల్లడించారు. ఉపాధి కల్పించే చిన్న, మధ్య స్థాయి సంస్థల రంగానికి ఊతమిచ్చేందుకు, ఆర్థిక వ్యవస్థలో పీఎస్‌బీలు కీలకపాత్ర పోషించేందుకు మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. 
బ్యాంకింగ్ రంగంలో 2015 మార్చి నాటికి రూ. 2.75 లక్షల కోట్లుగా ఉన్న నిరర్ధక ఆస్తులు 2017 జూన్ నాటికి రూ.7.33 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ఇందులో 12 సంస్థలు కట్టాల్సినదే రూ.1.75 లక్షల కోట్ల మేర ఉంది. ఈ కేసులు ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఉన్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు మూలధనంగా ఇవ్వాలని నిర్ణయం 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

2017లో భారత్ వృద్ధి రేటు 7 శాతం : ప్రపంచబ్యాంక్ 
 ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2017-18)ంలో భారత్ వృద్ధి రేటు 7 శాతానికే పరిమితం కాగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇది 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన దక్షిణాసియా ఆర్థిక స్థితిగతుల నివేదికలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యలు ఇందుకు కారణమని వెల్లడించింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక.. తయారీ, సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇక అంతర్గతంగా అడ్డంకుల కారణంగా ప్రైవేట్ పెట్టుబడులు మందగించాయని, ఇది దేశ వృద్ధి అవకాశాలపై మరింతగా ఒత్తిడి పెంచగలదని హెచ్చరించింది. అయితే, ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల మధ్య సమతౌల్యత ఉండేలా తగు విధానాలు పాటిస్తే 2018లో వృద్ధి కొంత మెరుగుపడి 7.3 శాతం స్థాయికి చేరగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 6.7 శాతానికి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది. 
2017-18లో వృద్ధికి కోత ఇలా..

సంస్థ

తాజా అంచనా

గత అంచనా

ఏడీబీ

7%

7.4%

ఓఈసీడీ

6.7%

7.3%

ఐఎంఎఫ్

6.7%

7.2%

ప్రపంచబ్యాంకు

7%

7.2%

ఆర్‌బీఐ

6.7%

7.3%

క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7 శాతంగా అంచనా 
ఎప్పుడు : 2017-18లో 
ఎవరు : ప్రపంచ బ్యాంకు 
ఎందుకు : పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యల కారణంగా 

ఎయిర్‌టెల్ చేతికి టాటా టెలీ సర్వీసెస్ 
రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్ మొబైల్ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ అక్టోబర్ 12న ప్రకటించింది. తద్వారా.. నవంబర్ 1 నుంచి టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్‌ఎల్), టాటా టెలీ మహారాష్ట్ర (టీటీఎంఎల్) సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు టాటా టెలీ నుంచి ఎయిర్‌టెల్‌కి బదిలీ అవుతారు. అయితే ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్‌టెల్ ఎలాంటి నగదూ చెల్లించటం లేదు. ఈ మేరకు ‘‘ఇది పూర్తిగా రుణ రహిత, నగదురహిత డీల్‌గా ఉంటుంది’’ అని ఇరు సంస్థలు వేర్వేరుగా ఇచ్చిన ప్రకటనల్లో వెల్లడించాయి. 
అయితే, టాటా సంస్థ స్పెక్ట్రమ్‌కోసం టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో దాదాపు 20% (సుమారు రూ.1,500-2,000 కోట్లు) బాధ్యత మాత్రమే ఎయిర్‌టెల్ తీసుకుంటుంది. సుమారు రూ. 31,000 కోట్ల పైచిలుకు పేరుకుపోయిన టాటా టెలీ రుణాలను టాటా సన్‌‌స తీరుస్తుంది. తాజా ఒప్పందంతో ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లకు చేరనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎయిర్‌టెల్‌లో విలీనం కానున్న టాటా టెలీసర్వీసెస్ 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎందుకు : రుణభారం కారణంగా

రెపో రేటు యథాతథం
 ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో అక్టోబర్ 4న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) సమావేశంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటు యథాతథంగా ఉండటంతో పాటు రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉండనుంది. అలాగే వృద్ధి రేటును 7.3% నుంచి 6.7%కి ఆర్‌బీఐ పరిమితం చేసింది. ద్రవ్యోల్బణాన్ని గతంలో 4 శాతం నుంచి 4.5 శాతంగా అంచనా వేసిన ఆర్‌బీఐ దీనిని 4.2-4.6 శాతం శ్రేణికి పెంచింది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్‌ఎల్‌ఆర్)ను 20% నుంచి 19.5%కి తగ్గించింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన మొత్తమే ఎస్‌ఎల్‌ఆర్.
పాలసీ ముఖ్యాంశాలు
రెపో రేటు 6 శాతంగా యథాతథం
రివర్స్ రెపో 5.75 శాతంగా కొనసాగింపు
వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 6.7 శాతానికి కోత
ద్రవ్యోల్బణం ద్వితీయార్ధంలో 4.2-4.6% శ్రేణిలో ఉంటుందని అంచనా
తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5-6 న ఉంటుందని సూచన
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రెపో రేటు యథాతథం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

27 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వివిధ శ్లాబుల్లో ఉన్న 27 వస్తువుల పన్నురేట్లు తగ్గాయి. ఈ మేరకు అక్టోబర్ 6న జరిగిన జీఎస్టీ మండలి 22వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే కోటిన్నర లోపు వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థలు ప్రతినెలా కాకుండా మూడు నెలలకోసారి పన్ను చెల్లింపుతో పాటు రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఇప్పటి వరకు కాంపోజిషన్ పథకంలో చేరేందుకు రూ.75 లక్షల టర్నోవర్ కలిగిన సంస్థలను అనుమతిస్తుండగా, ఆ పరిమితిని కోటి రూపాయలకు పెంచారు. 
సవరించిన జీఎస్టీ పన్ను రేట్లు

వస్తువు

పాత పన్నురేటు

సవరించిన రేటు

బ్రాండెడ్ కాని నమ్‌కీన్

12 శాతం

5 శాతం

ఆయుర్వేద ఔషధాలు

12 శాతం

5 శాతం

ముక్కలుగా కోసి ఎండబెట్టిన మామిడికాయలు

12 శాతం

5 శాతం

ఖాఖ్రా ఆహార పదార్థం (గుజరాత్, రాజస్తాన్‌లలో ప్రసిద్ధి)

12 శాతం

5 శాతం

ICDSకింద పాఠశాలలకు ఇచ్చే ఆహార పొట్లాలు

12 శాతం

5 శాతం

జరీ, ఇమిటేషన్ జ్యువెలరీ ఆహార పదార్థాల తయారీ, ప్రింటింగ్

12 శాతం

5 శాతం

ప్రభుత్వ కాంట్రాక్టులు(ఎక్కువ మంది కార్మికులు అవసరం)

12 శాతం

5 శాతం

మనుషులు తయారుచేసే నూలు

18 శాతం

12 శాతం

స్టేషనరీ వస్తువులు

18 శాతం

12 శాతం

నేలపై పరిచే బండలు(గ్రానైట్, మార్బుల్ మినహా)

18 శాతం

12 శాతం

నీటి పంపులు, డీజిల్ ఇంజిన్ల విడిభాగాలు

28 శాతం

18 శాతం

ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ-వేస్ట్)

28 శాతం

5 శాతం

క్విక్ రివ్యూ:
ఏమిటి : 27 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : జీఎస్టీ మండలి
ఎందుకు : వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు

కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు
దేశంలో సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వరల్డ్ పోస్ట్ డేను పురస్కరించి అక్టోబర్ 9న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశంలో ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మొదట 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించనున్నామని చెప్పారు. అలాగే.. తపాలా శాఖ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు

బంబార్డియర్, స్పైస్‌జెట్ భారీ డీల్
 కెనడాకు చెందిన బంబార్డియర్.. దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సుమారు రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాలను బంబార్డియర్ సరఫరా చేయనుంది. తొలుత 25 విమానాలను స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తుండగా, మరో 25 విమానాలను కొనుగోలు చేసే హక్కులను కలిగి ఉంటుంది. వీటి సరఫరా అనంతరం 90 సీట్ల టర్బో ప్రాప్ విమానాలను నడిపే ప్రపంచంలో తొలి విమానయాన సంస్థగా స్పైస్‌జెట్ నిలుస్తుంది. అయితే, ఇందుకు నియంత్రణ సంస్థల ధ్రువీకరణ రావాల్సి ఉందని బంబార్డియర్ తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బంబార్డియర్, స్పైస్‌జెట్ భారీ డీల్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎందుకు : రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాల సరఫరా కోసం 

భారత రుణ భారం 485.8 బిలియన్ డాలర్లు 
భారత విదేశీ రుణ భారం ఈ ఏడాది జూన్ ముగిసే నాటికి 485.5 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికం ముగింపు(మార్చి నెలాంతంలో 472 బిలియన్ డాలర్లు) పోల్చితే 3 శాతం మేర ఈ భారం పెరిగిందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ డెట్ విభాగంలోకి భారీగా రావడం.. త్రైమాసికంలో విదేశీ రుణం 3 శాతం పెరగడానికి కారణమని వివరించింది. జీడీపీ నిష్పత్తిలో విదేశీ రుణం 20.3 శాతంగా ఉందని తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ విదేశీ రుణ భారం 485.8 బిలియన్ డాలర్లు 
ఎప్పుడు : 2017 జూన్ నాటికి
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా

పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ‘ఎక్సైజ్’ సుంకం తగ్గింపు 
లీటర్ డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు అక్టోబర్ 3న కేంద్ర ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ.2 చొప్పున తగ్గాయి. ఈ ధరలు అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం ఇదే తొలిసారి. తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.26 వేల కోట్లు లోటు ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 ఎక్సైజ్ సుంకం తగ్గింపు
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

భారత వృద్ధి రేటును తగ్గించిన ఏడీబీ
2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) తగ్గించింది. జూలైతో పోల్చితే 0.4 శాతం తగ్గించి ఏడు శాతానికి పరిమితం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ వృద్ధి అంచనాలను 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఆసియా అభివృద్ధి అంచనాలపై సెప్టెంబర్ 25న నివేదికను విడుదల చేసింది.

ఆర్థిక వ్యవహారాలు నవంబరు 2017 ఎకానమీ
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పేరు మార్పు
వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) పథకంను రఫ్తార్ (వ్యవసాయం, అనుబంధ రంగాల పునరుత్తేజానికి లాభసాటి విధానాలు - Remunerative Approaches for Agriculture and Allied sector Rejuvenation -RAFTAAR) గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో నవంబర్ 1న జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ పథకానికి కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో (ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో 90:10) నిధులను సమకూరుస్తాయి. వార్షిక వ్యయంలో 50 శాతం నిధులను వ్యవసాయ మౌలిక వసతులు, ఆస్తుల కల్పన, 30 శాతం వాల్యూ అడిషన్ అనుసంధానిత ఉత్పత్తి ప్రాజెక్టులు, 20 శాతం స్థానిక అవసరాలకు అనుగుణంగా వెచ్చిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పేరు రఫ్తార్ గా మార్పు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా

వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో 68,000 కోట్ల ఎంవోయూలు
 న్యూఢిల్లీలో నవంబర్ 3న ప్రారంభమైన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2017’ సదస్సు తొలిరోజు రూ.68,000 కోట్ల విలువైన 13 ఒప్పందాలు కుదిరాయి. దేశీయ ఆహార, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీసీ, పెప్సికో, హెర్షీ, పతంజలి, కోకకోలా తదితర కంపెనీలు తమ ప్రణాళికలు వెల్లడించాయి.
మొదటిరోజు సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ వ్యాపార సులభతర నిర్వహణ సూచీలో 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్ 2017లో 100వ స్థానానికి చేరుకోవడం గొప్ప పురోగతిగా అభివర్ణించారు. గత మూడేళ్లలో చేపట్టిన సంస్కరణలే ఇందుకు కారణమని తెలిపారు.
ఒప్పందాల ముఖ్యాంశాలు
ఐటీసీ రూ.10,000 కోట్ల రూపాయలతో 20 సమగ్ర ఆహార ప్రాసెసింగ్, లాజిస్టిక్ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది.పతంజలి రూ.10,000 కోట్ల రూపాయిలను పెట్టుబడులుగా పెట్టనుంది.పెప్సికో ఐదేళ్లలో 2 బిలియన్ డాలర్లు (రూ.12,800 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తుంది.అమెరికాకు చెందిన చాక్లెట్ తయారీ సంస్థ హెర్షీ ఐదేళ్లలో 50 మిలియన్ డాలర్లు (రూ.320 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో రూ.68,000 కోట్ల ఒప్పందాలు
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ఐటీసీ, పెప్సికో, హెర్షీ, పతంజలి, కోకకోలా తదితర కంపెనీలు
ఎక్కడ : భారత్‌లో

ఎన్‌పీఎస్ గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు
న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో చేరేందుకు గరిష్ట వయోపరిమితిని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ పెంచింది. ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుంచి 65 కు పెంచుతూ నవంబర్ 1న ప్రకటన విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌పీఎస్ గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలకు పెంపు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ 
ఎందుకు : పథకంను మరింత విస్తరింపచేయడానికి

లింగ వ్యత్యాస సూచీలో భారత్‌కు 108 వ ర్యాంక్
ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ (Global Gender Gap Index) 2017లో భారత్ 108వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే ఈ సారి 21 స్థానాలు దిగజారింది. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 144 దేశాల్లో ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, రాజకీయాల్లో మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. రాజకీయ సాధికారత, ఆయుః ప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడమే భారత్ ర్యాకింగ్‌లో వెనకబడటానికి ప్రధాన కారణం అని డబ్ల్యూఈఎఫ్ వివరించింది.
జాబితాలో ఐస్‌లాండ్ తొలి స్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో నార్వే(2), ఫిన్‌లాండ్(3), రువాండా(4), స్వీడన్(5) ఉన్నాయి. 
నివేదిక ముఖ్యాంశాలు:

మొత్తం జాబితాలో భారత ర్యాంక్ 108పనిచేసే చోట లింగ వ్యత్యాసం, మహిళలకు వేతన చెల్లింపుల్లో 136వ స్థానంఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల్లో 139వ స్థానంఆరోగ్యం, అస్తిత్వం విషయంలో 141వ స్థానంభారత్ లింగ వ్యత్యాసాన్ని 67% పూరించింది. ఇది బంగ్లాదేశ్, చైనాలతో పోల్చితే తక్కువేప్రపంచ వ్యాప్తంగా 68 శాతం లింగ వ్యత్యాసాన్ని పూరించారు. 2016లో ఇది 68.3 శాతంగా ఉంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ లింగ వ్యతాస సూచీ 2017 
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : ప్రపంచ ఆర్థిక ఫోరం
ఎక్కడ : భారత్‌కు 108వ ర్యాంక్
ఎందుకు : రాజకీయ సాధికారత, ఆయుఃప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడం వల్ల

విదేశాల్లోని భారతీయులకు పీఎఫ్ సౌకర్యం
విదేశాల్లో పనిచేసే భారతీయులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో చేరే అవకాశాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ నవంబర్ 3న తెలిపారు. దీని కోసం కేంద్రం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో చేరాలంటే ఆయా దేశాల్లో వారు పొందుతున్న సోషల్ సెక్యూరిటీ పథకాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. పీఎఫ్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ)ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశాల్లోని భారతీయులకు పీఎఫ్ సౌకర్యం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : కేంద్ర ప్రావిడెంట్ ఫండ్

35 వేల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు
నోట్ల రద్దు తర్వాత సుమారు 35 వేల కంపెనీలు బ్యాంకుల్లో రూ.17 వేల కోట్లకు పైగా అక్రమంగా డిపాజిట్ చేశాయని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 5న వెల్లడించింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆ కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. అలాగే 3.09 లక్షల మంది డెరైక్టర్లపై అనర్హత వేటు వేసినట్లు పేర్కొంది. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు 2016 నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 35 వేల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : నోట్ల రద్దు తర్వాత అక్రమ డిపాజిట్లు చేసినందుకు

ఓడరేవుల అభివృద్ధికి ‘సాగరమాల’ 
ప్రతిష్ఠాత్మక సాగరమాల కార్యక్రమంలో భాగంగా తీరప్రాంత ఓడ రేవుల పథకం కింద రూ.2,302 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో 47 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ నవంబర్ 3న వెల్లడించింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌లో 12; ఏపీ, గోవాల్లో 10 చొప్పున; కర్ణాటకలో 6; కేరళ, తమిళనాడుల్లో మూడు చొప్పున; గుజరాత్‌లో 2; పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రాజెక్టు ఉన్నాయి. ఇందులో రూ.1,075 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులను ఇప్పటికే మంజూరు చేశారు. నౌకాయాన శాఖ ఈ పథకం పరిధిని విస్తరించడంతోపాటు అమలు గడువును 2020 మార్చి 31 వరకు పొడిగించింది.

ఆర్థిక వ్యవహారాలు డిసెంబరు 2017
టెక్స్‌టైల్స్ నైపుణ్యాభివృద్ధికి రూ.1300 కోట్లు Current Affairsవ్యవస్థీకృత టెక్స్‌టైల్స్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన పెంచేందుకు రూ.1300 కోట్ల వ్యయంతో కొత్త పథకానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ‘స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్’ పేరిట టెక్స్‌టైల్స్ రంగంలోని వేర్వేరు విభాగాల్లో 10 మంది లక్షల మందిని సుశిక్షితులుగా తీర్చిదిద్ది సర్టిఫికెట్లు ఇస్తారు. వారిలో కనీసం 70 శాతం మందికి స్థిర వేతనంతో కూడిన ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘టెక్స్‌టైల్స్’లో నైపుణ్యాభివృద్ధికి ‘స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్’ 
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : టెక్స్‌టైల్స్ రంగంలోని వేర్వేరు విభాగాల్లో 10 మంది లక్షల మందిని సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు 

దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు దేశంలో వ్యక్తిగత ఆదాయం రూ.కోటికి పైగా ఉన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తమకు మొత్తం మీద రూ.కోటి, అంతకు మించి ఆదాయం ఉందంటూ 59,830 మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. వీరు ప్రకటించిన ఉమ్మడి ఆదాయం రూ.1.54 లక్షల కోట్లు. ఆదాయపన్ను శాఖ ఈ గణాంకాలను డిసెంబర్ 20న విడుదల చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటికిపైగా ఆదాయం ఉందంటూ రిటర్నులు వేసిన వ్యక్తుల సంఖ్య 48,417 కాగా, వీరి ఉమ్మడి ఆదాయం రూ.2.05 లక్షల కోట్లు. అంటే ఏడాది తిరిగేసరికి ఆదాయ లెక్కలు చూపించిన కోటీశ్వరుల సంఖ్య పెరగ్గా, వీరి ఉమ్మడి ఆదాయం మాత్రం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థభారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2030 నాటికి 6.5-7 ట్రిలియన్ డాలర్ల (6.5-7 లక్షల కోట్ల డాలర్లు) శ్రేణికి చేరే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ డిసెంబర్ 21న పేర్కొన్నారు. 2035-40 నాటికి ఈ విలువ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 2.1 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఏడవది. ఇక తలసరి ఆదాయం సైతం 2030 నాటికి 4,000 డాలర్లకు (ప్రసుతం 1,709 డాలర్లు)చేరే అవకాశం ఉందని స్కోచ్ సదస్సులో పాల్గొన్న వివేక్ దేబ్రాయ్ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థ 
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ 

దేశీ ఈ-కామర్స్ మార్కెట్ - 50 బిలియన్ డాలర్లుదేశీ ఈ-కామర్స్ మార్కెట్ వచ్చే ఏడాది 50 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. ఇంటర్నెట్ వినియోగం, ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు తోడ్పడనుంది. దేశీ డిజిటల్ కామర్స్ మార్కెట్ ప్రస్తుతం 38.5 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచామ్-కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2013లో 13.6 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ-కామర్స్ మార్కెట్ 2015లో 19.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొబైల్స్.. ఇంటర్నెట్ వినియోగం, ఎం-కామర్స్ అమ్మకాలు పెరగడం, రవాణా.. చెల్లింపులకోసం అత్యాధునిక ఆప్షన్‌‌స అందుబాటులో ఉండటం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మొదలైనవి ఈ-కామర్స్ అసాధారణ వృద్ధికి ఊతమిస్తున్నాయని నివేదిక వివరించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 50 బిలియన్ డాలర్ల స్థాయికి దేశీ ఈ - కామర్స్ మార్కెట్ 
ఎప్పుడు : 2018 నాటికి 
ఎవరు : అసోచామ్-డెలాయిట్ నివేదిక

ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 జిల్లాల గుర్తింపుCurrent Affairsదేశవ్యాప్తంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 జిల్లాలను నీతి ఆయోగ్ గుర్తించింది. వెనుకబాటుతనం, పేదరికం, తీవ్రవాద ప్రాబల్యంతో పాటు అక్షరాస్యత, ఆరోగ్య ప్రమాణాలు, విద్య, తాగునీరు, విద్యుత్ వసతి వంటి కీలకమైన మౌలిక వసతులను ప్రామాణికంగా తీసుకుని ఈ జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో 35 జిల్లాలు వామపక్ష తీవ్రవాదం సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2022 న్యూ ఇండియా లక్ష్య సాధన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో జిల్లాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది.
ఈ జాబితాలో తెలంగాణ నుంచి జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్నం, వైఎస్‌ఆర్ కడప జిల్లాలు స్థానం పొందాయి.
రాష్ట్రాల వారీగా గుర్తించిన జిల్లాల జాబితా కోసం క్లిక్ చేయండి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 వెనుకబడిన జిల్లాల గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు

2018 జూన్ నుంచి ఈ-వే బిల్లింగ్ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా కోసం 2018 జూన్ 1 నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు లేదా ఈ-వే బిల్లు వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకుంది. ఐటీ నెట్‌వర్క్ సంసిద్ధతపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా 2018 జూన్ 1 నుంచి ఈ-వే బిల్లింగ్ వ్యవస్థను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా జరిగిన 24వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అడ్డంకులు మొదలైన అంశాలపై చర్చించిన అనంతరం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 16 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణాకు ఈ-వే బిల్లులను వినియోగించడం ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరి అని స్పష్టం చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ - వే బిల్లింగ్ 
ఎప్పుడు : 2018 జూన్ 1 నుంచి 
ఎవరు : జీఎస్టీ మండలి 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలకు ఊతమివ్వడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందులో భాగంగా రోడ్ ట్యాక్స్ తగ్గింపు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశ జీడీపీ వృద్ధి, ఉపాధి కల్పనలో ఆటోమొబైల్ రంగం కీలకపాత్ర పోషించడం కొనసాగేలా తోడ్పాటు అందించనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంలో ఆటోమొబైల్స్, బ్యాటరీల తయారీ హబ్‌గా మారాలని పరిశ్రమల సమాఖ్య అసోచాం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

4.88 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణంనవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.88 శాతంగా నమోదైంది. ఇది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం కంటే అధికం. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్రం డిసెంబర్ 12న విడుదల చేసింది.
3.93 శాతంగా టోకు ధరల ద్రవ్యోల్బణంనవంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.93 శాతంగా నమోదైంది. కాగా, గత ఎనిమిది నెలల కాలంలో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి.

డీబీటీ భారత్ వెబ్‌సైట్ ఆవిష్కరణCurrent Affairs కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు ‘డీబీటీ భారత్’ పేరుతో కేంద్రం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) పద్ధతిలో అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారులు, ప్రభుత్వానికి మిగిలిన ఆదాయం తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో డీబీటీ సెల్‌లు ఏర్పాటు చేసింది.
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటం వల్ల కేంద్రానికి తొలి ఏడాదిలోనే రూ.29 వేల కోట్లు ఆదా అయింది. దీంతో ఇతర పథకాలైన వృద్ధాప్య పింఛన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉపాధి శిక్షణ, ఉపాధి హామీ నిధులు, అంగన్ వాడీ పథకాల్లో సబ్సిడీని నేరుగా వినియోగదారులకే అందిస్తోంది. డీబీటీతో 2016-17లో రూ.57,029 కోట్లు ఆదా అయినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 395 కేంద్ర పథకాలు అమలవుతున్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీబీటీ భారత్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : లబ్ధిదారుల వివరాల్లో పారదర్శకత కోసం

వృద్ధి రేటును 6.7 శాతానికి కుదించిన ఏడీబీభారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఈ అంచనాను ఇంతకు ముందు 7 శాతంగా పేర్కొన్న ఏడీబీ.. డీమోనిటైజేషన్, జీఎస్‌టీ తొలి దశ ప్రతికూలాంశాలు, రుతుపవనాలు, వ్యవసాయంపై సంబంధిత ప్రభావం వంటి అంశాలను కారణంగా చూపుతూ వృద్ధి అంచనాలను తగ్గించింది. 2018-19 వృద్ధి అంచనాలను కూడా 7.4 శాతం నుంచి 7.3 శాతానికి కుదించింది. క్రూడ్ ధరల పెరుగుదల, ప్రైవేటు పెట్టుబడులు తక్కువగా వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. 2017-18 ద్రవ్యోల్బణం ఇంతకు ముందు ఉన్న 4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గించింది.
భారత వృద్ధిరేటుపై వివిధ సంస్థల అంచనాలు

  • ప్రపంచబ్యాంక్ 2017-18 వృద్ధి అంచనాను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019-20 నాటికి 7.4 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది.
  • 2017-18కి ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) వృద్ధి అంచనా 6.7 శాతం.
  • ఫిచ్ రేటింగ్స్ కూడా 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. 2018-19కి 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది.
  • మూడీస్ 2017-18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
  • 2017-20 మధ్య సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్స్ విశ్లేషించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత్ వృద్ధి రేటు 6.7 శాతానికి కుదింపు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంక్
ఎందుకు : డీమోనిటైజేషన్, జీఎస్‌టీ ప్రతికూలాంశాలు, వ్యవసాయంపై రుతుపవనాల ప్రభావం

7.2 బిలియన్ డాలర్లకు క్యాడ్2017-18 రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) భారత కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 7.2 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇదే త్రైమాసికం జీడీపీ విలువలో ఇది 1.2 శాతం. గతేడాది ఇదే త్రైమాసికంలో క్యాడ్ విలువ 3.4 బిలియన్లు మాత్రమే. అప్పటి త్రైమాసిక జీడీపీ విలువలో ఇది 0.6 శాతం.
దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం నుంచి దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్యాన్ని తీసేస్తే మిగిలే నికర విలువను కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అంటారు. వీటి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి వచ్చే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) మినహాయిస్తారు. ఒకదేశ ఎగుమతుల విలువ కన్నా- దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడమే (వాణిజ్యలోటు) ఆ దేశ క్యాడ్ పెరుగుదలకు ప్రధాన కారణం. 2017-18 మొదటి 6 నెలల కాలంలో భారత్ వాణిజ్యలోటు 49.4 బిలియన్ డాలర్ల నుంచి 74.8 బిలియన్ డాలర్లకు పెరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7.2 బిలియన్ డాలర్లు పెరిగిన క్యాడ్
ఎప్పుడు : 2017-18 రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)
ఎందుకు : దిగుమతుల విలువ ఎక్కువగా ఉండటం వల్ల

రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతంCurrent Affairs పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్), వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలానికి వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్రీయ గణాంకాల విభాగం (సీఎస్‌ఓ) నివేదిక నవంబర్ 30న ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతంతో పోలిస్తే క్యూ2లో ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనబర్చింది.
నివేదిక ముఖ్యాంశాలు
  • క్యూ2లో తయారీ రంగం 7 శాతం వృద్ధి నమోదు చేయగా సేవల రంగం వృద్ధి 7.1 శాతానికి పెరిగింది.
  • మైనింగ్ రంగంలో వృద్ధి రేటు 5.5 శాతంగా నమోదైంది.
  • నిర్మాణ రంగం 2.6 శాతం; ఫైనాన్షియల్, బీమా, రియల్ ఎస్టేట్ ఇతర ప్రొఫెషనల్ సేవల రంగానికి సంబంధించి 5.7 శాతం వృద్ధి నమోదైంది.
  • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతరత్రా విభాగాల వృద్ధి రేటు 6 శాతంగా ఉంది.
  • వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల రంగం క్యూ2లో 1.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
  • స్థూల విలువ ఆధారిత(గ్రాస్ వేల్యూ యాడెడ్-జీవీఏ) వృద్ధి రేటు జూలై-సెప్టెంబర్ కాలంలో 6.1 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 6.8% కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 5.6 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం
ఎప్పుడు : జులై - సెప్టెంబర్
ఎవరు : కేంద్ర గణాంకాల విభాగం

రూపాయి నోటుకి వందేళ్లు పూర్తిభారత కాగితపు కరెన్సీలో అతి తక్కువ విలువ కలిగిన రూపాయి నోటు నవంబర్ 30 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నోటును 1917 నవంబర్ 30న అప్పటి ప్రభుత్వం బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది.
మొదట నోటును ముద్రించినపుడు ఒక్క రూపాయికి 10 గ్రాముల వెండి నాణెం విలువ ఉండేది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.390. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయుధాల విడిభాగాల తయారీకి రూపాయి వెండి నాణేలను కరిగించడంతో రూపాయి నోట్లను ముద్రించాల్సి వచ్చింది.
రూపాయి నోటు - ఆసక్తికర అంశాలు

  • 1917 నవంబర్ 30న అప్పటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జి-5 బొమ్మతో విడుదల చేశారు. 1926లో దాన్ని ఉపసంహరించారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా కింగ్‌జార్జి-6 బొమ్మతో మళ్లీ ప్రవేశ పెట్టారు.
  • రూపాయి నోటును ఉస్మానియా, హైదరాబాద్ రాష్ట్రంలో 1919, 1943, 1946లలో విడుదల చేశారు.
  • 1949లో 4 సింహాలు, అశోక చక్రం బొమ్మలతో కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టారు.
  • అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్‌కే మీనన్ సంతకంతో వెలువడ్డ కొత్త డిజైన్ నోట్లు పాకిస్తాన్‌లోనూ చెలామణి కాగా 1949లో రద్దు చేశారు.
  • భారత్ గణతంత్ర దేశంగా మారిన తర్వాత విడుదల చేసిన అన్ని ఒక్క రూపాయి నోట్లపై దేశ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాలు ఉండగా, మిగతా అన్ని కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంతకాలున్నాయి.
  • రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వం అని ముద్రిస్తుండగా, మిగతా కరెన్సీ నోట్లపై భారతీయ రిజర్వ్‌బ్యాంక్ అని ముద్రించి ఉంటుంది.
  • 1969లో గాంధీజీ శతజయంతి సందర్భంగా ఆయన బొమ్మతో ఉన్న రూపాయి నోటు విడుదలైంది.
  • ఉత్పత్తి ఖర్చు బాగా పెరగడంతో 1995లో రూపాయి డిజైన్‌ను ఉపసంహరించారు. 2016లో పునర్ ముద్రణను ఆర్‌బీఐ మొదలుపెట్టింది.
  • 2017లో కొత్త టెలిస్కోపిక్ సిరీస్‌తో రూపాయి నోటును ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : బ్రిటిష్ ప్రభుత్వం

జాతీయ పోషకాహార మిషన్ ఏర్పాటుకు ఆమోదంఆరోగ్యవంతమైన దేశ నిర్మాణమే లక్ష్యంగా జాతీయ పోషకాహార మిషన్ (ఎన్‌ఎన్‌ఎం)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా తక్కువ బరువుతో జన్మించడం, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను ఆరోగ్యవంతులను చేయడానికి పలు పథకాలను అమలు చేస్తారు. దీని కోసం బడ్జెట్‌లో రూ.9,046 కోట్లు కేటాయించారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38.4 శాతం మంది (పిల్లలు, మహిళలు) రకరకాల పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. దీనిని 2022 నాటికి 25 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న బాలికలు, మహిళల సంఖ్యను ఏటా 3 శాతం తగ్గిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పోషకాహార మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : పోషకాహార లోపంతో బాధ, తక్కువ బరువుతో జన్మిస్తున్న పిల్లల సంఖ్యను ఏటా రెండు శాతం తగ్గించేందుకు 

భారతవృద్ధి రేటును 6.7 శాతానికి తగ్గించిన ఫిచ్ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును 6.9 నుంచి 6.7 శాతానికి తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఇందుకు కారణం దేశంలో ఆర్థిక రికవరీ బాగా నెమ్మదిగా ఉందని ఫిచ్ తన తాజా గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో (జీఈఓ) పేర్కొంది.
మొదటి త్రైమాసికంలో వృద్ధి మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతానికి పడిపోగా, రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) ఈ రేటు 6.3 శాతానికి పెరిగింది. ఇటీవల మూడీస్ భారత్ రేటింగ్‌ను ‘బీబీబీ మైనస్’ స్థాయి నుంచి ‘బీబీబీ 2’ స్థాయికి పెంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు 6.9 నుంచి 6.7 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ఫిచ్ రేటింగ్ సంస్థ
ఎందుకు : ఆర్థిక రికవరీ నెమ్మదిగా ఉండటం వల్ల

విదేశీ వాణిజ్య విధానంలో మార్పులుఎగుమతుల బలోపేతమే లక్ష్యంగా విదేశీ వాణిజ్య విధానానికి (ఎఫ్‌టీపీ) కేంద్ర ప్రభుత్వం మరిన్ని పోత్సాహకాలను జతచేసింది. ఈ మేరకు 2015-20 వాణిజ్య విధానాన్ని మధ్యంతరంగా సమీక్షించిన కేంద్రం డిసెంబర్ 5న ఎఫ్‌టీపీని విడుదల చేసింది.
ఎఫ్‌టీపీ ప్రధానాంశాలు

  • సరుకుల ఎగుమతి పథకం (ఎంఈఐఎస్) ప్రోత్సాహకాలను రెడీమేడ్ గార్మెంట్స్‌పై 2 శాతం పెంచారు. దీంతో ఎంఈఐఎస్ వార్షిక బడ్జెట్ 34 శాతం పెరిగి రూ.8,450 కోట్లకు చేరింది.
  • సేవల ఎగుమతుల పథకం (ఎస్‌ఈఐఎస్) కింద ప్రోత్సాహకాలను 2 శాతం పెంచి బడ్జెట్ రూ.1,140 కోట్లు చేశారు.
  • సెజ్‌లకు సరఫరా చేసే వస్తు, సేవలను జీఎస్టీ కింద సున్నా రేటుగా పరిగణిస్తారు.
  • డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్ చెల్లుబాటు కాలాన్ని 18 నెలల నుంచి 24 నెలలకు పెంచారు.
  • లాజిస్టిక్స్‌ను ప్రోత్సహించేందుకు గాను నూతన విభాగం ఏర్పాటు
  • డేటా ఆధారిత విధాన చర్యలకు డీజీఎఫ్‌టీ పేరుతో అనలైటిక్స్ డివిజన్ ఏర్పాటు
  • విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు నూతన విధానం.
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ఎగుమతులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ఉపాధి కల్పన
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశీ వాణిజ్య విధానంలో మరిన్ని ప్రోత్సాహకాలు
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఎగుమతులను ప్రోత్సహించడానికి

ప్రభుత్వ రుణ భారం 65 లక్షల కోట్లుకేంద్ర ప్రభుత్వ రుణ భారం 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 2.53 శాతం పెరిగింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.64,03,138 కోట్లున్న ప్రభుత్వ రుణం, సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి రూ.65,65,652 కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వ రుణ నిర్వహణ విభాగం ప్రకటించింది. మొత్తం రుణ భారంలో అంతర్గత రుణ వాటా 93 శాతం. ఇందులో మార్కెట్ బాండ్ల వాటా 82.6 శాతం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 65 లక్షల కోట్లు దాటిన ప్రభుత్వ రుణ భారం
ఎప్పుడు : డిసెంబర్ 5 (2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో)
ఎక్కడ : కేంద్రంలో

ఆర్‌బీఐ పాలసీ రేట్లు యథాతథంఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన డిసెంబర్ 6న జరిగిన ఎంపీసీ సమావేశం రెపో రేటును 6 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగా కొనసాగిస్తూ తాజా నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి ద్రవ్యోల్బణం 4.3-4.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
ముఖ్యాంశాలు
రెపో రేటు 6 శాతం.
రివర్స్ రెపో రేటు 5.75 శాతం.
2017-18 జీడీపీ వృద్ధి అంచనా 6.7 శాతం
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ పాలసీ రేట్లు యథాతథం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ

No comments:

Post a Comment