ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2013 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం
ఆర్థిక వ్యవహారాలు
జనవరి 2013 ఎకానమీ
2013లో భారత్ వద్ధి రేటు 5.9 శాతం
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు 2013లో 5.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదిక పేర్కొంది. 2014లో ఈ రేటు 6.4 శాతంగా ఉంటుందని కూడా తెలిపింది.
జీఈపీ నివేదిక
భారత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం కారణంగా దక్షిణాసియా వద్ధి రేటు బలహీనపడిందని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక వద్ధి అవకాశాలు (జీఈపీ) నివేదిక పేర్కొంది. జీఈపీ నివేదిక ప్రకారం దక్షిణాసియాలో వద్ధి రేటు 2011లో 7.4 శాతం ఉండగా.. 2012 లో 5.4 శాతానికి తగ్గింది. భారత్‌లో మందగమనంతో పాటు గ్లోబల్ డిమాండ్ తగ్గడం, పెట్టుబడుల రాక క్షీణించడం.. విద్యుత్ కోతలు, విధానాల్లో అనిశ్చితి, బలహీన రుతుపవనాలు తదితర ప్రాంతీయ అంశాలు కూడా వద్ధి రేటు తగ్గడానికి కారణమని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 2013లో ప్రాంతీయంగా జీడీపీ 5.7శాతం మేర.. 2015 నాటికి 6.7 శాతం మేర పెరగగలదని వివరించింది. భారత్‌లో సంస్కరణలు, పెట్టుబడుల కార్యకలాపాలు పుంజుకోవడం మొదలైన అంశాలు ఇందుకు తోడ్పడగలవని వివరించింది.
14వ ఆర్థిక సంఘం ఏర్పాటు
రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా 14వ ఆర్థిక సంఘాన్ని జనవరి 2న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో అభిజిత్ సేన్ (ప్రణాళికా సంఘం సభ్యుడు), సుష్మా నాథ్ (కేంద్ర మాజీ ఫైనాన్స్ సెక్రటరీ), ఎ.గోవిందరావు (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ), సుదీప్తా ముడ్లే (నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ మాజీ తాత్కాలిక చైర్మన్), అజయ్ నాథ్‌జా సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సంఘం కార్యకలాపాలు 2013 ఏప్రిల్ 1 నుంచి మొదలవుతాయి. ఆర్థిక సంఘం ఐదేళ్లకోసారి ఏర్పాటవుతుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయాల పంపకాల వ్యవహారాలతోపాటు తరచూ మారే ప్రభుత్వ విధానాల వల్ల విద్యుత్, నీరు, రవాణా వంటి ప్రజావసరాల వ్యవస్థల ధరలపై అధిక ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన చర్యలను ఆర్థిక సంఘం సూచిస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ, సబ్సిడీలు తదితర అంశాలను కూడా పరిశీలిస్తుంది.
ఆర్థిక వ్యవహారాలు
ఫిబ్రవరి 2013 ఎకానమీ
2013-14 రైల్వే బడ్జెట్
2013-14 రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ఫిబ్రవరి 26న పార్లమెంట్‌కు సమర్పించారు.
ముఖ్యాంశాలు :
స్థూల ట్రాఫిక్ వసూళ్లు - రూ.1,43,740 కోట్లునిర్వహణ వ్యయం - రూ. 1,26,000 కోట్లునికర ఆదాయం - రూ. 19,400 కోట్లుఆపరేటింగ్ రేషియో 87.8 శాతంసరుకు రవాణా చార్జీలు 5.8 శాతం పెంపు57 రైళ్లు పొడిగింపు. 24 రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు.కొత్తగా 67 ఎక్స్‌ప్రెస్, 26 ప్యాసింజర్ రైళ్లు.2013-14లో 1.52 లక్షల ఉద్యోగాల భర్తీ.రైల్వేటారిఫ్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు.22 కొత్త రైళ్లు.1,047 మిలియన్ టన్నుల సరకు రవాణా.సికింద్రాబాద్‌లో ఇండియన్ రైల్వే ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు.విజయవాడతో సహా ఆరుచోట్ల రైల్‌నీర్ బాట్లింగ్ ప్లాంట్లు.కర్నూల్‌లో రూ.110 కోట్లతో రైల్వే వర్క్‌షాప్‌ఏర్పాటు.కాజీపేటలో రూ.50కోట్లతో నైపుణ్య శిక్షణా కేంద్రం. దేశవ్యాప్తంగా 25చోట్ల ఇలాంటికేంద్రాలు ఏర్పాటు.విశాఖపట్నంలో ఢిల్లీ తరహాలో టూరిస్ట్ సెంటర్.ఐదేళ్ల కాలానికి (2014-2024) కార్పోరేట్ సేఫ్టీప్లాన్ ఏర్పాటు.సోలార్, విండ్ ఎనర్జీ వినియోగానికి రైల్వే ఎనర్జీ మేనేజ్‌మెంట్ కంపెనీ ఏర్పాటు.బోగీల్లో నిప్పు పొగను గుర్తించే వ్యవస్థలు.రైళ్ల భద్రత హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు.4 కంపెనీల మహిళా రైల్వేభద్రతాఫోర్స్ (ఆర్.పి.ఎ.ఎఫ్).ఆర్‌పీఎఫ్‌లో 10 శాతం ఉద్యోగాలు మహిళలతో భర్తీ చేయాలని నిర్ణయం.
2012-13లో జీడీపీ వద్ధి రేటు 5 శాతంగా అంచనా
2012-13లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌ఓ) ముందస్తు అంచనాల్లో ఫిబ్రవరి 7న తెలిపింది. 10 ఏళ్లల్లో కనిష్ట వద్ధి రేటు ఇది. తయారీ, వ్యవసాయం, సేవల రంగాల పనితీరు వద్ధి రేటు తగ్గడానికి కారణమని సీఎస్‌ఓ తెలిపింది. గతేడాది (2011-12) వద్ధి రేటు 6.2 శాతం పోల్చితే వద్ధి రేటు బాగా తగ్గిపోయింది.
వ్యవసాయం, అటవీ, మత్స్య శాఖల వద్ధి 3.6 శాతం (2011-12) నుంచి 1.8 శాతానికి (2012-13) తగ్గుతుందని,తయారీ రంగంలో 2.7 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గొచ్చని,విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాలో 6.5 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గొచ్చని,వాణిజ్య, హోటళ్లు, రవాణా, సమాచార రంగాల్లో వద్ధి 7 శాతం నుంచి 5.2 శాతానికి,ఆర్థిక బీమా, రియాల్టీ, వ్యాపార సేవల్లో వద్ధి 11.7 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గొచ్చని సీఎస్‌ఓ అంచనా వేసింది.ఐదు శాతం వద్ధితో మొత్తం జీడీపీ విలువ ’ 52,43,582 కోట్ల నుంచి ’ 55,03,476 కోట్లకు పెరగనుంది.నెలకు తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం 11.7 శాతం వద్ధితో 2012-13లో ’ 5,729కి పెరగనుంది. ఇది 2011-12లో ’ 5,130.వార్షిక తలసరి ఆదాయం ’ 61,560 నుంచి ’ 62,748కు చేరుకోనుంది. ఈ వద్ధి రేటు 13.7 శాతం నుంచి 11.7 శాతానికి తగ్గనుంది.జీడీపీ వద్ధి రేటు 6.2 శాతం
2011-12 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటును 6.2 శాతంగా (గతంలో దీన్ని 6.5 శాతంగా పేర్కొంది) కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్‌ఓ) అంచనా వేసింది. తాజా అంచనాలను జనవరి 31న విడుదల చేసింది. దీంతోపాటు అంతకుముందు రెండేళ్ల జీడీపీ వద్ధి గణాంకాలను కూడా సవరించింది. దీని ప్రకారం 2010-11 లో వద్ధిరేటు 8.4 శాతం నుంచి 9.3 శాతానికి పెరిగింది. స్థిర ధరల ప్రకారం (2004-05 ఆధారంగా) 2011-12లో జీడీపీ విలువను రూ.52,43,582 కోట్లుగా సీఎస్‌ఓ పేర్కొంది. అంతక్రితం ఏడాది జీడీపీ విలువ రూ.49,39,006 కోట్లు. అంటే 6.2 శాతం వద్ధి నమోదైంది. కాగా, ప్రస్తుత ధరల ప్రకారం.. 2011-12లో జీడీపీ విలువ రూ.83,53,495 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది విలువ రూ.72,66,967 కోట్లతో పోల్చితే 15 శాతం పెరిగింది. 2010-11లో ఈ వద్ధి 19 శాతంగా ఉంది.
తలసరి నెల ఆదాయం రూ.5,130
భారతీయుల జీవన ప్రమాణాన్ని లెక్కించే సగటు నెలవారీ తలసరి ఆదాయం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం వద్ధితో రూ.5,130కు పెరిగిందని కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌ఓ) పేర్కొంది. 2010-11లో ఇది రూ.4,513. కాగా, ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2011-12లో వార్షిక తలసరి ఆదాయాన్ని రూ. 61,564గా సీఎస్‌ఓ అంచనా వేసింది. 2010-11లో రూ. 54,151తో (వద్ధి 17.1 శాతం) పోల్చితే గతేడాది తలసరి ఆదాయం 13.7 శాతం పెరిగింది. వాస్తవ ప్రాతిపదికన (2004-05 నాటి ధరల ప్రకారం) 2011-12లో తలసరి ఆదాయం రూ.36,342 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 4.7 శాతం పెరిగింది. 2010-11లో తలసరి ఆదాయంలో వద్ధి 7.2 శాతం. కాగా, ప్రస్తుత ధరల ప్రకారం స్థూల దేశీయ పొదుపు (జీడీఎస్) రూ. 27,65,791 కోట్లు. 2010-11లో రూ.26,51,934 కోట్లతో పోల్చితే (34 శాతం వద్ధి) గతేడాది జీడీఎస్ వద్ధి రేటు 30.8 శాతానికే పరిమితమైంది.
ఆర్థిక వ్యవహారాలు
మార్చి 2013 ఎకానమీ
రెపో రేటు 0.25 శాతం తగ్గింపు
రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ)మధ్యంతర త్రెమాసిక పరపతి విధాన సమీక్షలో మార్చి 19న రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు (బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు) 7.75 శాతం నుంచి 7.50 శాతానికి తగ్గింది. రెపో రేటు తగ్గింపునకు అనుగుణంగా రివర్స్ రెపో రేటు(బ్యాంకులు ఉంచిన నిధులుపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు) 0.25 శాతం తగ్గి 6.75 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. నగదు నిల్వ నిష్పత్తి (ిసీఆర్ ఆర్)ను యధాతథంగా 4 శాతంగా కొనసాగించింది.
ఆంధ్రప్రదేశ్ సామాజిక సర్వే 2012-13
ప్రధానాంశాలు:
2012-13 ఆర్థిక సంవత్సరం ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2004-05 స్థిర ధరల్లో
పారిశ్రామిక వద్ధి రేటు: 0.73 శాతంవ్యవసాయ వద్ధి రేటు: 1.96 శాతం.రాష్ట్ర స్థూల ఉత్పతి: రూ. 4,26,470 కోట్లు.తలసరి ఆదాయం: రూ.77,277 (ఇది 2011-12లో రూ.68,970).ఆహార ధాన్యాల ఉత్పత్తి: 170.78 లక్షల టన్నులు (2011-12లో 184.02 లక్షల టన్నులు).శిశుమరణాలు: 2011లో ప్రతి 1000కి 43కు తగ్గాయి (2001లో ప్రతి 1000కి 66).2011లో జననాల రేటు ప్రతి 1000 మందికి 17.5గాను మరణాల రేటు 7.5గాను ఉంది.ఫురుషుల జీవిత కాలం 66.9 సంవత్సరాలు. ఇది మహిళల్లో 70.9 సంవత్సరాలుగా ఉంది.సరాసరి భూకమతాల పరిమాణం: 2010-11 నాటికి 1.08 హెక్టార్లకు తగ్గింది (ఇది 2005-06లో 1.20 హెక్టార్లుగా ఉండేది).2012-13లో ఆహార ధాన్యాలు పండించే విస్తీర్ణం 66.32 లక్షల హెక్టార్లు ( ఇది 2011-12లో 72.89 లక్షల హెక్టార్లు).దేశంలో సుగంధ ద్రవ్యాల, పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, పూల ఉత్పత్తిలో మూడోస్థానం లో, నిమ్మ, పపయా, ఆయిల్ పాం, టొమోటోల ఉత్పత్తిలో మొదటి స్థానంలో, మామిడి, జీడి మామిడిలో రెండోస్థానం,అరటిఉత్పత్తిలో నాలుగోస్థానంలో ఉంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్
2013-14 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మార్చి 18న శాసనసభకు సమర్పించారు. వివరాలు..
బడ్జెట్ మొత్తం: రూ. 1,61,348 కోట్లు
ప్రణాళికేతర వ్యయం:రూ. 1,01,926 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ. 59,422 కోట్లు
ద్రవ్యలోటు: రూ. 24,487 కోట్లు
రెవెన్యూ రాబడి: రూ.1,27,772.19 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.1,26,749.41 కోట్లు
మొత్తం అప్పులు: రూ. 1,79,637 కోట్లు
వ్యవసాయానికి కార్యాచరణ ప్రణాళిక:
రాష్ట్రంలో తొలిసారి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ శాసన సభకు సమర్పించారు. వివరాలు..
కార్యాచరణ ప్రణాళిక వ్యయం: రూ.98,940.54 కోట్లు
ఉచిత విద్యుత్: రూ. 3,621.99 కోట్లు
సహకార శాఖ: రూ. 197.40 కోట్లు
రైతులకు రుణాలు: రూ. 59,918 కోట్లు
2013-14 కేంద్ర బడ్జెట్
2013-14 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫిబ్రవరి 28న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఇది ఎనిమిదోసారి. తద్వారా ఆయన.. అత్యధిక బడ్జెట్లు సమర్పించిన రెండో ఆర్థిక మంత్రిగా ఘనత సాధించారు. ఈ జాబితాలో పది బడ్జెట్లతో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తొలి స్థానంలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా, వై.బి. చవాన్, సి.డి. దేశ్‌ముఖ్‌లు ఏడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టగా.. ప్రధాని మన్మోహన్‌సింగ్, టి.టి.కష్ణమాచారిలు ఆర్థిక మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆరు బడ్జెట్‌లు సమర్పించారు. మొత్తమ్మీద స్వతంత్ర భారతావనిలో ఇది 82వ బడ్జెట్. వీటిలో 66 సాధారణ వార్షిక బడ్జెట్‌లు కాగా, 12 తాత్కాలిక బడ్జెట్‌లు, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన నాలుగు మినీ బడ్జెట్‌లు ఉన్నాయి.
ముఖ్యాంశాలు:బడ్జెట్ వ్యయం: రూ. 16,65,297 కోట్లురెవెన్యూ వసూళ్లు: రూ.10,56,331 కోట్లుమూల ధన వసూళ్లు: రూ.6,08, 967 కోట్లుప్రణాళికా వ్యయం: రూ. 5,55,322 కోట్లుప్రణాళికేతర వ్యయం: రూ. 11,09,975 కోట్లురెవెన్యూ లోటు: రూ. 3,79,838 కోట్లుద్రవ్య లోటు: రూ. 5,42,499 కోట్లుప్రాథమిక లోటు: రూ. 1,71,814 కోట్లువివిధ రంగాలకు కేటాయింపులు:రక్షణ వ్యయం: రూ. 2,03,672 కోట్లుగ్రామీణాభివద్ధి: రూ. 80,194 కోట్లువ్యవసాయం: రూ. 27,049 కోట్లువిద్య: రూ. 65, 867 కోట్లుశాస్త్ర సాంకేతిక రంగం: రూ. 6,275 కోట్లుఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: రూ. 37,330 కోట్లు2012-13 ఆర్థిక సర్వే
2012-13 ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫిబ్రవరి 27న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు:
వచ్చే ఆర్థిక సంవత్సరం (2013-14)లో 6.1-6.7 శాతం మేర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందనేది సర్వే అంచనా. అయితే, ఈ ఏడాది (2012-13) వద్ధిరేటు 5 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. ఇది దశాబ్దపు కనిష్టస్థాయి కావడం గమనార్హం.
ప్రభుత్వ సబ్సిడీల భారం అంతకంతకూ పెరుగుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. సబ్సిడీల బిల్లు ఈ ఏడాది (2012-13)లో రూ.1.79 లక్షల కోట్లకు చేరుకోనుందని సర్వే పేర్కొంది. ఇందులో చమురు సబ్సిడీ (రూ.43,580 కోట్లు), ఆహార సబ్సిడీ (రూ.75,000 కోట్లు), ఎరువుల సబ్సిడీ (రూ.60,974 కోట్లు)గా ఉండొచ్చని అంచనా.
సర్వే ముఖ్యాంశాలు:
దిగుమతుల తగ్గింపుపై దష్టి, కరెంట్ అకౌంట్ లోటు తగ్గించేందుకు మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు ధరల నిర్ణయం2013-14లో జీడీపీలో విత్త లోటు లక్ష్యం 4.8 శాతం2016-17 నాటికి విత్తలోటు లక్ష్యం 3 శాతంరెవెన్యూ బాగా తగ్గడంతో 2012-13లో నిర్దేశించిన 5.3 శాతం విత్తలోటును చేరుకోలేకపోవడం2013 నాటికి 6.2-6.6 శాతానికి తగ్గనున్న ద్రవ్యోల్బణం2012-13లో పారిశ్రామిక ఉత్పత్తిలో వద్ధి 3 శాతంవ్యవసాయ వద్ధిని మెరుగుపరిచేందుకు స్థిరమైన విధానాలు ఆవశ్యకం.
ఆర్థిక వ్యవహారాలు
ఏప్రిల్ 2013 ఎకానమీ
వద్ధిరేటు 6.4 శాతంగా ిపీఎంఇఏసీ అంచనా
2013-14లో వద్ధిరేటు 6.4 శాతంగా ఉంటుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ిపీఎంఇఏసీ) తన ఆర్థిక సమీ క్షలో తెలిపింది. 2012-13 ఆర్థిక సమీక్షను పీఎంఇఏసీ చైర్మన్ సి.రంగరాజన్ ఏప్రిల్ 23న విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2013-14) వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వద్ధి రేటు 3.5 శాతంగా ఉండగలదని ఆర్థిక సలహా మండలి పేర్కొంది. పరిశ్రమలు 4.9 శాతం, సేవల రంగాల్లో 7.7 శాతం వద్ధిరేటు నమోదు కాగలదని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2013-14లో 36 బిలియన్ డాలర్లు రావచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలు ’ 2,57,654 కోట్ల నుంచి ’ 2,31,084 కోట్లకు తగ్గొచ్చని పేర్కొంది.
ఆర్థిక వ్యవహారాలు
మే 2013 ఎకానమీ
ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదిక
భారత్ స్థూల దేశీయోత్పత్తి 2013లో కేవలం 3.75 శాతమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. క్రితం అంచనాలు (ఏప్రిల్‌లో) 5.7 శాతం. బలహీన డిమాండ్, తయారీ, సేవల రంగాల పేలవ పనితీరు అంచనాల కోతకు కారణమని తన తాజా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికలో సంస్థ పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి కఠిన ద్రవ్య విధానం అనుసరించాల్సి రావాల్సిన దేశాల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ విశ్లేషించింది. కాగా 2014లో వద్ధిరేటు అంచనాను సైతం ఇంతకు ముందు ఉన్న 6.2 శాతం నుంచి 5 శాతానికి కుదించింది. సరఫరాల సమస్య కొంత కుదుటపడటం, ఎగుమతులు మెరుగుపడటం వల్ల 2013 కంటే 2014లో వద్ధి కొంత మెరుగుపడవచ్చని వివరించింది.
2013-14లో వృద్ధి 5.3 శాతంగా పీఎంఏసీ అంచనా
2013-14 ఆర్థిక అంచనాల నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఏసీ) సెప్టెంబర్ 13న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.3 శాతంగా పేర్కొంది. దీన్ని ఏప్రిల్‌లో 6.4 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగం 4.8 శాతం, పారిశ్రామిక రంగం 2.7 శాతం వృద్ధి చెందుతాయని పేర్కొంది. సేవల రంగంలో వృద్ధి 6.6 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇది 2012-13లో 7 శాతం. మార్చి చివరి నాటికి ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉంటుందని వివరించింది. వాణిజ్య లోటు 185 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. ఆందోళన కలిగిస్తున్న కరెంట్ అకౌంట్ లోటు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని పేర్కొంది. ఇది జీడీపీలో 3.8 శాతం. విత్తలోటును జీడీపీలో 4.8 శాతంగా ఉంచడం ఒక సవాలుగా పీఎంఏసీ పేర్కొంది.
క్రిమీలేయర్ ఆదాయ పరిమితి రూ.6 లక్షలకు పెంపు
క్రిమీలేయర్ (సంపన్న శ్రేణి) వార్షిక ఆదాయ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచాలని కేంద్ర కేబినెట్ మే 16న నిర్ణయించింది. ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లు పొందేవారికి ఇది వర్తిస్తుంది. ఓబీసీలకు కేంద్ర విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) పెరుగుదల ఆధారంగా ఆదాయ పరిమితిని పెంచారు. నాలుగేళ్లకోసారి క్రిమీలేయర్ ఆదాయ పరిమితిని సవరిస్తారు.
మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్‌డీఐలకు సుప్రీం కోర్టు సమర్థన
మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) సుప్రీంకోర్టు మే 1న సమర్థించింది. ఎఫ్‌డీఐలను అనుమతించడంలో విధానపరమైన లోపాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగ విరుద్ధంగా, నిబంధనలకు వ్యతిరేకంగా, ఏకపక్షంగా, హేతుబద్ధతకు విరుద్ధంగా ఉంటే తప్ప ప్రభుత్వం విధాన పరమైన అంశాల్లో జోక్యం చేసుకోదని పేర్కొంది. మల్టీబ్రాండ్ రిటైల్ వ్యాపారంలో 51 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం 2012 సెప్టెంబర్ 14న నిర్ణయించింది. ఇప్పటికే సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది.
0.25 శాతం తగ్గిన రెపోరేటు
రిజర్వు బ్యాంకు వార్షిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మే 3న జరిగింది. ఈ సమీక్షలో రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో 7.50 శాతం ఉన్న రెపోరేటు 7.25 శాతానికి తగ్గింది. బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీరేటును ‘రెపోరేటు’ అంటారు. బ్యాంకులు తమ వద్ద ఉంచిన నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటు ‘రివర్స్ రెపోరేటు’ను కూడా 6.5 నుంచి 6.25 శాతానికి తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను 4 శాతంగా కొనసాగించింది. 2013-14లో జీడీపీ వద్ధి రేటు 5.7 శాతంగా, ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉండొచ్చని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది.
వద్ధి అంచనాకు ప్రపంచ బ్యాంక్ కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) భారత్ వద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ ఏప్రిల్ 30న కుదించింది. ఆరు నెలల క్రితం 7 శాతంగా ఉన్న అంచనాలను 6.1 శాతానికి తగ్గించింది. సాధారణ వర్షపాతం నమోదయినప్పటికీ వ్యవసాయ రంగం వద్ధి రేటు 2 శాతానికి పరిమితం కావచ్చన్న అభిప్రాయం తాజా తగ్గింపునకు ఒక కారణం. ఇంతక్రితం ఈ అంచనా 2.7 శాతం. దీనితోపాటు దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిస్థితుల ప్రాతిపదికన తాజా అంచనాలకు వచ్చినట్లు ప్రపంచబ్యాంక్ సీనియర్ కంట్రీ ఎకనమిస్ట్ డీనీస్ మద్విదాస్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం వద్ధి 6.7 శాతానికి మెరుగుపడవచ్చని అంచనావేసింది.
ఏడీబీ వార్షిక సదస్సు
ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 46వ వార్షిక సదస్సు మే 4 నుంచి 5 వరకు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరంతోపాటు పలు దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పాల్గొన్నారు. రానున్న మూడేళ్లలో భారత్‌కు 600 కోట్ల డాలర్ల రుణాన్ని అందించనున్నట్లు ఏడీడీ ఈ సందర్భంగా ప్రకటించింది.
ఆర్థిక వ్యవహారాలు
అక్టోబరు 2013 ఎకానమీ
భారత్ వృద్ధి 4.7 శాతం: ప్రపంచ బ్యాంక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) భారత్ వృద్ధి రేటు కేవలం 4.7 శాతమేనని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను తమ తాజా ‘భారత్ వృద్ధి అప్‌డేట్’ నివేదిక కుదించినట్లు బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా వ్యవహారాలు) మార్టిన్ రామ్ ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వద్ధిరేటు 6.2 శాతం ఉంటుందన్నది బ్యాంక్ తాజా అంచనా అని కూడా వెల్లడించారు. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతం. 2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ 5 శాతం వృద్ధి సాధించింది. గత దశాబ్ద కాలంలో వృద్ధి సగటు 8 శాతం. భారత్ వృద్ధి 2013-14లో బలహీనం కావడానికి మొదటి త్రై మాసికంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వ్యవస్థ (4.4 శాతం వృద్ధి) పేలవ పనితీరు కారణమని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది.
ఆర్థిక వ్యవహారాలు
నవంబరు 2013 ఎకానమీ
0.25 శాతం వడ్డీరే టు పెంచిన రిజర్వ్ బ్యాంక్
రిజర్వ్ బ్యాంక్ రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను అక్టోబర్ 29న 0.25 శాతం పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకులు రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే రేటు (రెపోరేటు) 7.50 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. ధరలను అదుపు చేసే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ, వాహన, కార్పొరేట్ రుణాలు భారం కానున్నాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటును తగ్గించింది. దీంతో ఈ రేటు 8.75 శాతానికి తగ్గింది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత సమస్య తలెత్తకుండా ఉంటుంది.
వృద్ధిరేటును 5.5 శాతం నుంచి 5 శాతానికి కుదించింది.నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో మార్పు చేయకుండా 4 శాతంగానే కొనసాగించింది.

No comments:
Post a Comment