ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2014 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం
ఆర్థిక వ్యవహారాలు
జనవరి 2014 ఎకానమీ
ఈ ఏడాది భారత వృద్ధి 5.3 శాతం: ఐరాస
భారత్ వృద్ధి 2014లో 5.35 శాతంగా నమోదుకాగలదని ఐక్యరాజ్యసమితి-2014 ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు పేరుతో వెల్లడైన నివేదిక పేర్కొంది. 2015లో ఈ వృద్ధిరేటు 5.7 శాతానికి చేరుకోవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.
దావోస్‌లో 44వ ప్రపంచ ఆర్థిక ఫోరమ్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) 44వ ప్రపంచ ఆర్థిక సదస్సు జనవరి 21 నుంచి 25 వరకు ఐదురోజుల పాటు జరిగింది. మారుతున్న ప్రపంచం, సమాజం, రాజకీయాలు, వ్యాపా రం ప్రధాన అంశంగా ఈ సదస్సు సాగింది. ఇందులో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డెరైక్టర్ జనరల్ రొబర్టో అజవెడో హాజరయ్యారు. మన దేశం నుంచి ఆర్థికమంత్రి చిదంబరం, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(ట్యాపరింగ్) ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవహారాలు
ఫిబ్రవరి 2014 ఎకానమీ
17,63,214 కోట్లతో కేంద్ర మధ్యంతర బడ్జెట్
2014-15 సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్‌ను 2014 ఫిబ్రవరి 17న లోక్‌సభకు సమర్పించారు.
ముఖ్యాంశాలు:
మొత్తం బడ్జెట్: * 17,63,214 కోట్లు,
ప్రణాళికేతర వ్యయం: * 12,07,892 కోట్లు
ప్రణాళికా వ్యయం: * 5,55,322 కోట్లు
రెవెన్యూ లోటు: * 3,82,923 కోట్లు
ద్రవ్యలోటు: * 5,28,631 కోట్లు
ప్రాథమిక లోటు: * 1,01,620 కోట్లు
కార్లు, బైకులు, టీవీలు, ఫ్రిజ్‌లపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు2009 ఏప్రిల్ ముందు నాటి విద్యా రుణాలపై వడ్డీపై మారటోరియంసైన్యంలో ఒకే హోదాకు ఒకే పింఛను వర్తింపుశాస్త్ర, సాంకేతిక రంగాలకు తోడ్పడేందుకు రీసెర్‌చ ఫండింగ్ ఆర్గనైజేషన్
ప్రధాన కేటాయింపులు:
గ్రామీణాభివృద్ధి: * 82,200 కోట్లుమానవ వనరుల అభివృద్ధి: * 67,398 కోట్లుఆరోగ్యం కుటుంబ సంక్షేమం: * 33,725 కోట్లురక్షణ: * 2,24,000 కోట్లు, తాగునీరు, పారిశుధ్యం: * 15,260 కోట్లుఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ: * 2,46,397 కోట్లుఎస్సీ ఉప ప్రణాళిక: * 48,638 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక: * 30,726 కోట్లురైల్వేలకు బడ్జెట్ మద్దతు: * 29,000 కోట్లు2014-15 రైల్వే మధ్యంతర బడ్జెట్
రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే 2014-15 మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను 2014 ఫిబ్రవరి 12న లోక్‌సభలో సమర్పించారు.
73 కొత్త రైళ్లు ప్రకటించారు. ఇందులో జైహింద్ పేరుతో 17 ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు రెండు డబుల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రకటించారు. ఇవి కాచిగూడ-తిరుపతి, కాచిగూడ- గుంటూరు మధ్య నడుస్తాయి.రైల్వేల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రయాణ, రవాణా చార్జీలను సహేతుకంగా నిర్ణయించడంలో సలహా ఇచ్చేందుకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రైల్వే టారిఫ్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.రైల్వే నెట్‌వర్‌కలోకి మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.కొత్త లైన్లు, డబ్లింగ్‌ల కోసం 24 సర్వేలు చేపడతారు.బడ్జెట్ స్వరూపం: స్థూల ట్రాఫిక్ వసూళ్లు: 1,60,000 కోట్లునిర్వహణ వ్యయం: 1,44,199 కోట్లు, నికర ఆదాయం: 19,655 కోట్లుడివిడెండ్: 9,117 కోట్లు, నిర్వహణ నిష్పత్తి: 89.9 కోట్లుమొత్తం మిగులు: 12,728 కోట్లు
వృద్ధి రేటును తగ్గించిన కేంద్రం
2012-13లో జీడీపీ వృద్ధి 4.5 శాతంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇది దశాబ్దంలో అతి తక్కువ. గతంలో దీన్ని 5 శాతంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన అంచనాలను సీఎస్‌ఓ జనవరి 31న విడుదల చేసింది. వీటి మేరకు 2011-12లో జీడీపీ వృద్ధిని 6.7 శాతంగా సవరించింది. 2012-13లో జీడీపీ విలువ రూ.54.80 లక్ష కోట్లు కాగా 2011-12లో రూ. 52.50 కోట్లుగా తెలిపింది.
జింబాబ్వేలో చలామణిలోకి రుపాయి
జింబాబ్వేలో చలామణి అవుతున్న కరెన్సీ జాబితాలో భారత రూపాయికి చోటు దక్కింది. ఈ మేరకు రిజర్‌వ బ్యాంక్ ఆఫ్ జింబాంబ్వే జనవరి 29న ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. ఇప్పటికే బొట్సవానా పౌలా, బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్, యూరో, సౌత్ ఆఫ్రికన్ రాండ్, యూఎస్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, చైనీస్ యూవాన్, జపాన్ యెన్ చలామణిలో ఉన్నాయి.
ఆర్థిక వ్యవహారాలు
మార్చి 2014 ఎకానమీ
రాష్ట్రంలో మొదటి మహిళాబ్యాంక్ ఏర్పాటు
రాష్ట్రంలో భారతీయ మహిళా బ్యాంక్ మొదటి శాఖను హైదరాబాద్‌లో మార్చి 23న ఆ బ్యాంక్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ ప్రారంభించారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 20 శాఖలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇది 19వ మహిళా బ్యాంక్ శాఖ.
ఆర్థిక స్వేచ్ఛలో గుజరాత్ అగ్రస్థానం
ఆర్థికాంశాల స్వేచ్ఛకు సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాలో గుజరాత్‌కి అగ్రస్థానం దక్కింది. ఇదే విషయంలో అత్యంత వేగంగా స్కోరును మెరుగుపరుచుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ ఆర్థికవేత్తలు అశోక్ గులాటీ, బిబేక్ దేబ్రాయ్, లవీష్ భండారీ, జర్నలిస్ట్ స్వామినాథన్ అయ్యర్ రూపొందించిన ఈఎఫ్‌ఎస్‌ఐ-2013 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పాలనా యంత్రాంగం పరిమాణం, న్యాయ వ్యవస్థ, ప్రాపర్టీ హక్కులకు భద్రత, వ్యాపార, కార్మిక చట్టాల అమలు మొదలైన అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించారు. దీనిప్రకారం 2005లో అయిదో స్థానంలో ఉన్న గుజరాత్ ఆర్థిక స్వేచ్ఛతోపాటు వేగంగా పరిస్థితులను మెరుగు పరచుకునే విషయంలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.
ఆర్థిక వ్యవహారాలు
ఏప్రిల్ 2014 ఎకానమీ
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా అరవింద్
కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా అరవింద్ మాయారాం ఏప్రిల్ 15న నియమితులయ్యారు. ఈయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మార్చి 31న పదవీ విరమణ చేసిన సుమిత్ బోస్ స్థానంలో అరవింద్ బాధ్యతలు చేపట్టారు.
దేశంలో రెండు నూతన బ్యాంకులు
దేశంలో మరో రెండు నూతన బ్యాంకుల ఏర్పాటుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 2న సూత్రప్రాయమైన అనుమతిని మంజూరు చేసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐడీఎఫ్‌సీ, మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌లకు నూతన బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్‌బీఐ ఆమోదించింది. కొత్త బ్యాంకులకు లెసైన్సుల మంజూరు ప్రక్రియ చేపట్టవచ్చునంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ ఈ చర్య తీసుకుంది.
సన్‌ఫార్మాచేతికి ర్యాన్‌బాక్సీ
అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మాస్యూటికల్స్.. మరో దిగ్గజ కంపెనీ ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్‌ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఏప్రిల్ 7న ఇరు కంపెనీలు సంయుక్తంగా ప్రకటించాయి. పూర్తిగా స్టాక్స్ కేటాయింపు రూపంలో జరిగిన ఈ ఒప్పందం విలువ 320 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ.19,200 కోట్లు.
భారత వృద్ధిని అంచనావేసిన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఏప్రిల్ 8న విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2014లో 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ రేటును 2013లో 4.4 శాతం, 2012లో 4.7 శాతంగా పేర్కొంది. 2015-16 వృద్ధిని 6.4 శాతంగా ఉంటుందని తెలిపింది. ఇది లా ఉండగా.. 2014-15లో భారత వృద్ధిరేటు 5.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఏప్రిల్ 9న విడుదల చేసిన సౌత్ ఏసియా ఎకనమిక్ ఫోకస్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. బలపడుతున్న రూపాయి మారకపు విలువ, పలు భారీస్థాయి పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం లభించడంతో వృద్ధి రేటులో అనుకూలత చోటుచేసుకుందని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లు తెలిపాయి.
ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి ప్రకటన
2014 సంవత్సరపు మొదటి ద్వైమాసిక పరపతి విధానాన్ని రిజర్వ్‌బ్యాంక్ ఏప్రిల్ 1న ప్రకటించింది. స్వల్ప కాలానికి బ్యాంకులు తమ వద్ద ఉంచే నిధులపై రిజర్వ్‌బ్యాంక్ చెల్లించే వడ్డీరేటు (రెపోరేటు)ను 8 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిర్దిష్ట మొత్తానికి చెందిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని 4 శాతంగానే ఉంచింది. 2014-16లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 5.6శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. ఈ ఏడాదిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి తక్కువగా ఉంటుందని అంచనావేసింది. తదుపరి సమీక్షను జూన్ 30న ప్రకటిస్తుంది.
ఆర్థిక వ్యవహారాలు
మే 2014 ఎకానమీ
ఎన్‌ఎండీసీకి డీఅండ్ బీ అవార్డు
మైనింగ్ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ ప్రతిష్టాత్మకమైన డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ -మణప్పురం 2014 అవార్డును కైవసం చేసుకొంది.
నల్లధనం వెలికితీతకు ప్రత్యేక దర్యాప్తు బృందం
విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి, స్వదేశానికి తెచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మే 27న ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 29 లోపు సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బృందానికి చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.షా, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ వ్యవహరిస్తారు. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి, సీబీఐ, ఇంటెలిజన్స్ బ్యూరో, ఎన్ ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డెరైక్టర్‌తో పాటు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ చైర్మన్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తారు.
సైయంట్‌గా మారిన ఇన్ఫోటెక్
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోటెక్‌ను సైయంట్‌గా మార్చుతున్నట్లు మే 7న సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మెహన్‌రెడ్డి ప్రకటించారు. సైన్స్, క్లయింట్, ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రై జెస్‌ల సమ్మేళనమే సైయంట్‌గా అభివర్ణించారు. ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రై జెస్‌ను 1991లో స్థాపించారు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.4వేల కోట్లు.
జంతువులపై పరీక్షలు జరిపిన కాస్మోటిక్స్ దిగుమతుల నిషేధం
జంతువులపై పరీక్షలు జరిపిన సౌందర్య పదార్ధాల (కాస్మోటిక్స్) దిగుమతిపై నిషేధం విధించే ముసాయిదా నోటిఫికేషన్‌ను భారత్ జారీచేసింది. ఈ నిషేధం అమలు జరిగితే జంతువులను హింసించని కాస్మోటిక్ జోన్‌గా భారత్ నిలుస్తుంది. జంతువులమీద పరీక్షలు జరిపే కాస్మోటిక్స్‌పై భారత్‌లో ఇప్పటికే నిషేధం ఉంది. ఈ పరీక్షలు విదేశాల్లో నిర్వహించి దిగుమతి అయ్యే వాటిపై కూడా నిషేధం విధించాలని భారత్ నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయాన్ని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ స్వాగతించింది. ఈ సంస్థ జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించని భారత్ అనే ప్రచారాన్ని చేపట్టింది. ఇజ్రాయెల్ కూడా జంతువులపై పరీక్షలు జరిపిన కాస్మోటిక్స్‌ను నిషేధించింది.
భారత సొంత చెల్లింపు వ్యవస్థ రుపే ఆవిష్కరణ
వీసా, మాస్టర్ కార్డ్‌ల లాంటి చెల్లింపులకు ఉపయోగించే రూపే కార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మే 8న ఆవిష్కరించారు. భారత సొంత చె ల్లింపుల గేట్‌వే రుపేను నేషనల్ సిమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలో ఏడో చెల్లింపు విధానం. రుపే కార్డును ఏటీఎం, మర్చంట్ అవుట్‌లెట్‌లు, బ్యాంకులలో క్లియరింగ్, సెటిల్‌మెంట్ లావాదేవీలలో ఉపయోగపడుతుంది.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
2011లో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ప్రపంచ బ్యాంకుకు చెందిన ఇంటర్నేషనల్ కంపారిజన్ ప్రోగ్రాం ఏప్రిల్ 30న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మూడో స్థానంలో ఉన్న జపాన్‌ను భారత్ వెనక్కి నెట్టింది. అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండో స్థానంలో నిలిచాయి.
ఆర్థిక వ్యవహారాలు
జూన్ 2014 ఎకానమీ
స్టార్ అలయెన్స్‌లో ఎయిరిండియా
అంతర్జాతీయ విమాన యాన సంస్థల కూటమి స్టార్ అలయెన్స్‌లో ఎయిరిండియా భాగస్వామి అయింది. దీంతో ఈ అలయెన్స్‌లో చేరిన తొలి భారతీయ విమానయాన కంపెనీగా ఎయిరిండియా ఆవిర్భవించింది. లండన్‌లో ఏర్పాటు చేసిన స్టార్ అలయెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశం ఎయిరిండియాను చేర్చుకోవడానికి అనుకూలంగా ఓటు వేసింది. ఈ సభ్యత్వం కోసం భారత్ ఏడేళ్లు ఎదురుచూసింది. యునెటైడ్(అమెరికా), సింగపూర్ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎయిర్ చైనా, ఎయిర్‌కెనడా, స్విస్, ఆస్ట్రియా, ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్‌తోపాటు ప్రసిద్ధి చెందిన 27 సంస్థలకు అలయెన్స్‌లో సభ్యత్వం ఉంది. తాజాగా చేరిన భారత్ 28వ సభ్య దేశం.
ఇంజనీర్స్ ఇండియాకు నవరత్న హోదా
ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌కు ప్రతిష్ఠాత్మక నవరత్న హోదా లభించింది. దీనివల్ల సంస్థ దేశీయంగా, అంతర్జాతీయంగా, ఆర్థికంగా, నిర్వహణాపరంగా మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అలాగే నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్టర్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ)కి కూడా నవరత్న హోదా లభించింది. ఈ రెండు కంపెనీలతో నవరత్న హోదా పొందిన వాటి జాబితా 16 కు చేరింది.
పీఎస్‌యూల్లో 25 శాతం వాటా ప్రజలకే: సెబీ
ప్రభుత్వ యాజమాన్యంలోని నమోదిత కంపెనీలన్నింటిలో ప్రజలకు కనీసం 25 శాతం షేర్లు (మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్-ఎంపీఎస్) ఉండాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిర్దేశించింది. ఈ మేరకు ఆ వాటాలను మూడు సంవత్సరాలలో విక్రయించాలని జూన్ 19న న్యూఢిల్లీలో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉన్న 36 ప్రభుత్వ రంగ సంస్థలలో షేర్ల విక్రయానికి వీలు కలిగింది. తద్వారా సుమారు రూ. 60 వేల కోట్ల వరకు ప్రభుత్వం సమీకరించడానికి వీలవుతుందని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా వివరించారు.
విక్రమాదిత్య జాతికి అంకితం
దేశంలో అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 14న గోవాలో జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధనౌక పొడవు 282 మీటర్లు, బరువు 44,500 టన్నులు. ఇది 20 అంతస్తుల ఎత్తు మూడు ఫుట్‌బాల్ కోర్టులంత సైజు అంత ఉంటుంది. 45 రోజులపాటు పూర్తిగా సముద్రంలోనే గడిపే సామర్థ్యం దీని సొంతం. గతేడాది దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు.
దేశంలో 1.75 లక్షల మంది లక్షాధికారులు
మనదేశంలో 2013 నాటికి 1.75 లక్షల మంది లక్షాధికారుల కుటుంబాలు ఉన్నట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తన 14వ వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఉన్న జాబితాలో మనదేశం 15వ స్థానంలో నిలిచింది. ‘రైడింగ్ ఏ వేవ్ ఆఫ్ గ్రోత్: గ్లోబల్ వెల్త్ 2014’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఆ సంస్థ పలు విషయాలు వెల్లడించింది. 2013లో ప్రపంచ ప్రైవేటు ఆర్థిక సంపద 14.6 శాతం మేర పెరిగి 152 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నట్టు వివరించింది. లక్షాధికారుల కుటుంబాలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో 2012లో 16వ స్థానంలో ఉన్న భారత్.. 2013కి వచ్చేసరికి ఒక స్థానం మెరుగుపరుచుకుందని పేర్కొంది. 2018 నాటికి భారతదేశం ఏడో సంపన్న దేశంగా నిలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2012లో 1.37 కోట్ల మిలియనీర్ కుటుంబాలు ఉండగా, ఆ సంఖ్య 2013లో 1.63 కోట్లకు చేరుకుంది. అమెరికాలో అత్యధికంగా 71 లక్షల మిలియనీర్ కుటుంబాలున్నాయి. చైనాలో 2012లో 15 లక్షల లక్షాధికారి కుటుంబాలు ఉండగా, 2013లో ఆ సంఖ్య 24 లక్షలకు చేరుకుంది.
భారత ఆర్థిక వ్యవ స్థపై ప్రపంచ బ్యాంకు అంచనా
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.5 శాతం వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. గతేడాది 4.7 శాతం వృద్ధి సాధించింది. వచ్చే ఏడాది 6.3 శాతం, 2016లో 6.6 శాతం వృద్ధి రేటును భారత్ సాధించే అవకాశం ఉంది’ అని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఆర్థికాభివృద్ధి విషయంలో వర్ధమాన దేశాలకు నిరాశ ఎదురవుతుందని ఆ దేశాలు ఈ సంవత్సరం 5.3 శాతం పురోగతి సాధిస్తాయని గత జనవరిలో వేసిన అంచనాను బ్యాంక్ ప్రస్తుతం 4.8 శాతానికి కుదించింది. ఈ దేశాలు వచ్చే ఏడాది 5.4 శాతం, 2016లో 5.5 శాతం వృద్ధి సాధించవచ్చని తెలిపింది. చైనా ప్రభుత్వ యత్నాలు సఫలమైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7.6 శాతం విస్తరిస్తుందని అంచనా వేసింది. ఆసియా దేశాల్లో వృద్ధి రేట్లు తక్కువ స్థాయిలో ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది గడిచేకొద్దీ ప్రపంచ ఆర్థిక పురోగతి జోరందుకుంటుంది. గ్లోబల్ ఎకానమీ ఈ ఏడాది 2.8 శాతం, వచ్చే ఏడాది 3.4 శాతం, 2016లో 3.5 శాతం వృద్ధిచెందుతుంది.
ఆర్థిక వ్యవహారాలు
జూలై 2014 ఎకానమీ
మానవాభివృద్ధిలో భారత్‌ది 135 వ స్థానం
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) మానవాభివృద్ధి నివేదిక-2013ను జూలై 24న విడుదల చేసింది. ఇందులో 187 దేశాల జాబితాలో భారత్ 135వ స్థానంలో నిలిచింది. కాగా తొలి మూడు స్థానాల్లో నార్వే, ఆస్ట్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి. భారత్ హెచ్‌డీఐ (మానవాభివృద్ధి సూచీ) విలువ 0.586. మానవ జీవన ప్రమాణాల అభివృద్ధి విషయంలో భారత్ మధ్యస్థ కేటగిరీలో ఉందని పేర్కొంది. 1980-2013 మధ్య కాలంలో భారత్‌లో హెచ్‌డీఐ విలువ 0.369 నుంచి 0.586కు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఆరోగ్యకరమైన దీర్ఘ ఆయుః ప్రమాణం, జ్ఞాన సముపార్జనకు అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణం అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 220 కోట్లకు పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. ఇందులో 80 కోట్ల మంది పేదరికం అంచున ఉన్నారు.
జూన్‌లో 5.4 శాతానికి తగ్గిన ద్రవ్యోల్బణం
వార్షిక టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 5.4 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 6.01గా ఉండేదని జూలై 14న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. వినియోగధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 8.23 శాతం నుంచి 7.31 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం గత 30 నెలలో కనిష్ట స్థాయికి చేరింది. కూరగాయలతో పాటు కొన్ని ఆహార ఉత్పత్తుల ధరల తగ్గుదలే దీనికి కారణం.
కేంద్ర బడ్జెట్ 2014-15
2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 17,94,892 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ జులై 10న లోక్‌సభకు సమర్పించారు. అందరితో కలిసి... అందరి వికాసానికి (సబ్‌కా సాత్-సబ్‌కా వికాస్) నినాదంతో రూపొందించిన బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు... ప్రణాళిక వ్యయం రూ.5,75, 000 , ప్రణాళికేతర వ్యయం రూ.12,19, 892 కోట్లు, మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 17,94, 892 కోట్లు. 2014-15లో ద్రవ్యలోటు లక్ష్యం జీడీపీలో 4.1శాతం. ఇది 2015-16లో 3.6శాతంగా మార్చాలి. వచ్చే మూడు నాలుగేళ్లలో వృద్ధి రేటు అంచనా 7 నుంచి 8 ళాతం. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడుల పరిమితి రక్షణ, బీమా రంగాల్లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంపు. వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంపు సీనియర్ సిటిజన్లకు పరిమితి రూ. 3లక్షలు.
ఆర్థిక సర్వే 2013-14
ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2013-14 ఆర్థిక సర్వేను జూలై 9న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ముఖ్యాం శాలు.. జీడీపీ వృద్ధిరేటు 2014-15లో 5.4-5.9 శాతంగా ఉండవచ్చు. ఇది 2015-16లో ఏడు నుంచి ఎనిమిది శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2014-15లో కరెంట్ ఖాతాలోటును జీడీపీలో 2.1 శాతానికి పరిమితం చేయాలి. 2014లో ద్రవ్యోల్బణం సాధారణంగా ఉంటుందని అంచనా.
రైల్వే బడ్జెట్ 2014-15
కేంద్ర రైల్వేశాఖమంత్రి సదానంద గౌడ జూలై 8న 2014-15 రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ విలువ అత్యధికంగా రూ. 65,445 కోట్లు. ఇది 2013-14 కంటే 10 శాతం ఎక్కువ. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు ..కొత్తగా 58 రైళ్లు, 11 రైళ్లు ప్రయాణ దూరం పొడిగింపు, రూ.60 వేల కోట్లతో అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు, మెట్రో నగరాలను కలుపుతూ హైస్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ, కొత్తగా ఈ-టికెటింగ్ రిజర్వేషన్ వ్యవస్థ , ప్రధాన స్టేషన్లు, ఎంపిక చేసిన రైళ్లలో వైఫై సేవలు, రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతితోపాటు ప్రతి ఆరు నెలలకు రైలు ఛార్జీల సవరణ.
నిత్యావసర జాబితాలో ఉల్లి, బంగాళాదుంప
ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం 1955 కిందకు తెచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జూలై 2న ఆమోదం తెలిపింది. తద్వారా ఉల్లి, బంగాళాదుంపల లభ్యతను పెంచేందుకు, వాటి ధరలను నియంత్రించేందుకు వీలవుతుంది.
విశాఖ ఉక్కుకు పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్
విశాఖ ఉక్కును పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో 2012-13 సంవత్సరానికి ఈ పురస్కారం లభించింది.
ఆర్థిక వ్యవహారాలు ఆగష్టు 2014 ఎకానమీ
రూ. 1,11, 824 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
రాష్ట్ర విభజన తర్వాత తొలి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 20న 2014-15 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: మొత్తం బడ్జెట్: రూ. 1,11,824 కోట్లు, ప్రణాళికేతర వ్యయం: రూ.85,151 కోట్లు, ప్రణాళికా వ్యయం: రూ. 26,673 కోట్లు, మొత్తం రెవెన్యూ వసూళ్లు: రూ. 92,078 కోట్లు, మొత్తం రె వెన్యూ వ్యయం: రూ. 98, 142 కోట్లు, రెవెన్యూ లోటు: రూ.6,064 కోట్లు. అదే విధంగా 2014-15 సంవత్సరానికి రూ. 13,110 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయశాఖ మంత్రి పి.పుల్లారావు ఆగస్టు 22న శాసనసభకు సమర్పించారు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ. 6,736 కోట్లుకాగా, ప్రణాళికేతర వ్యయం రూ.6,373.95 కోట్లు.
ఆంధ్రప్రదేశ్ 2013-14 ఆర్థిక సర్వే
2013-14 సామాజిక, ఆర్థిక సర్వేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 20న శాసనసభకు సమర్పించింది. ముఖ్యాంశాలు: రాష్ట్ర మొత్తం జనాభా: 4.94 కోట్లు. ఇది దేశ జనాభాలో 4.08 శాతం. అధిక జనాభాగల రాష్ట్రాల్లో పదో స్థానం. పురుషులు: 2.47 కోట్లు (50.1 శాతం), మహిళలు: 2.46 కోట్లు (49.9 శాతం), గ్రామీణ జనాభా: 70.42 శాతం. పట్టణ జనాభా: 29.58 శాతం. స్త్రీ, పురుష నిష్పత్తి: 996: 1000, అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల జిల్లా: విజయనగరం (1,019), తలసరి ఆదాయం: రూ.76,041, అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా: విశాఖపట్టణం (రూ. 1,13,860), అతి తక్కువ తలసరి ఆదాయం గల జిల్లా: శ్రీకాకుళం (రూ.53,203), జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం వాటా: 2013-14లో 23.33 శాతం. ఇది 2004-05లో 29.85 శాతం. సేవారంగం వాటా: 2013-14 లో 55.96 శాతం. ఇది 2004-05లో 48.54 శాతం.
అత్యంత విలువైన భారత బ్రాండ్ టాటా
దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూపు నిలిచింది. రూ. 1,26,000 కోట్లతో టాప్ 100 భారత బ్రాండ్లలో అగ్రస్థానం సొంతం చేసుకొంది. రెండు, మూడు స్థానాల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ నిలిచాయి. ఈ వివరాలను కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా తన వార్షిక సర్వేలో వెల్లడించింది. వంద కంపెనీల మొత్తం బ్రాండ్ విలువ 92.6 బిలియన్ డాలర్లు కాగా అందులో అయిదో వంతు టాటా గ్రూపుదే కావడం విశేషం.
అత్యంత ధనికుల దేశాల్లో భారత్‌కు ఎనిమిదో స్థానం
అత్యంత ధనవంతులున్న దేశాల్లో ప్రపంచంలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో 14,800 మంది కుబేరులున్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం అమెరికా, చైనా, జర్మనీ దేశాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 2,700 మంది కుబేరులతో అత్యధిక ధనవంతులున్న తొలి 25 నగరాల్లో ముంబయికి చోటు దక్కింది. 15,400 మంది ధనవంతులతో హాంకాంగ్ అగ్రస్థానంలో నిలిచింది.
వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 5న ప్రకటించిన పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రాధాన్యతినిస్తూ రెపోరేటును 8 శాతం, రివర్స్ రెపోరేటు 7 శాతం , సీఆర్‌ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో- నగదు నిల్వల నిష్పత్తి) ని 4 శాతం వద్దనే ఉంచింది. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్) ని అరశాతం తగ్గించింది. దీంతో ఇది 22.5 శాతం నుంచి 22 శాతానికి చేరింది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 40 వేల కోట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును 5.5 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతానికి, 2016 నాటికి 6 శాతానికి పరిమితం చేయడం లక్ష్యంగా పేర్కొంది.
ఆర్థిక వ్యవహారాలు సెప్టెంబరు 2014 ఎకానమీ
పిల్లల సొంత బ్యాంకు ఖాతాలకు అనుమతి
చిన్నపిల్లలు సొంతంగా బ్యాంకు ఖాతాలను నడిపేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు సెప్టెంబర్ 24న అనుమతించాయి. పదేళ్లు వయసు దాటిన వారికి ఈ సదుపాయాన్ని కల్పించారు.
ఆంధ్రాబ్యాంక్ కిసాన్‌వాణి
వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని రైతులకు అందించే లక్ష్యంతో కిసాన్‌వాణి సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇఫ్కో అనుబంధ సంస్థ ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్‌తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే తన 2000వ ఏటీఎం కేంద్రాన్ని హైదరాబాద్‌లోని పంజాగుట్టలో సెప్టెంబర్ 22న బ్యాంకు చైర్మన్, ఎండీ సీవీఆర్ రాజేంద్రన్ ప్రారంభించారు.
పీఎస్‌యూల వాటా విక్రయం
ప్రభుత్వ రంగ సంస్థలు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్‌జీసీ), కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)లలో వాటాలను విక్రయించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సెప్టెంబర్ 10న ఆమోదం తెలిపింది. ఈ మూడు కంపెనీల్లో వాటాల విక్రయం వల్ల రూ. 43,800 కోట్లు సమకూరనున్నాయి.
7.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.8 శాతంగా నమోదైంది. ఇది జూలైలో 7.96 శాతంగా ఉన్నట్లు సెప్టెంబర్ 12న విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. కాగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. ఇది గత ఐదేళ్లలో అతి తక్కువ స్థాయికి చేరింది. ఉల్లి, కూరగాయలతోపాటు ఆహారోత్పత్తుల ధరలు భారీగా తగ్గడం వల్ల మొత్తం ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైంది.
జన్-ధన్ యోజన ప్రారంభం
దేశంలో అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 28న న్యూఢిల్లీలో ప్రారంభించారు. కార్యక్రమం కింద తొలిరోజే 1.5 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు కల్పించారు. ఈ పథకం కింద 2015 జనవరి 26లోగా 7.5 కోట్ల మందికి బ్యాంకు ఖాతా సౌకర్యాలు కల్పిస్తారు.
ఆర్థిక వ్యవహారాలు అక్టోబరు 2014 ఎకానమీ
2014-15లో భారత వృద్ధి రేటు 5.6 శాతం: ప్రపంచ బ్యాంకు
2014-15లో భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంటుందని ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్ పేరుతో అక్టోబరు 27న విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. వేగవంతమైన సంస్కరణలు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు చేపట్టడం వల్ల 5.6 శాతం వృద్ధికి అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ వృద్ధి రేటు 2015-16లో 6.4 శాతం, 2016-17లో 7 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.
డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేత
డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్రం అక్టోబరు 18న నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ నుంచి అంతర్జాతీయ ధరలకనుగుణంగా డీజిల్ ధరలు ఉంటాయి. ఇటీవల ముడి చమురు ధరలు తగ్గడంతో అక్టోబరు 18న డీజిల్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడం వల్ల ప్రభుత్వం కానీ, చమురు సంస్థలు కానీ ఇకపై ఎటువంటి రాయితీ అందించవు. 2010లో పెట్రోల్‌పై ప్రభుత్వం ధరల నియంత్రణ ఎత్తివేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధరలు కొనసాగుతున్నాయి.
ఆర్థిక పరిస్థితిలో హైదరాబాద్‌కు ఏఏ రేటింగ్
దేశంలో ఆరో పెద్ద నగరంగా పేరొందిన హైదరాబాద్ ఆర్థిక పరిస్థితిలోనూ బలమైందిగా రేటింగ్ సాధించింది. దేశ వ్యాప్తం గా పది నగరాలు ఏఏ (అఅ) రేటింగ్‌లో ఉండగా దక్షిణ భారతం నుంచి ఒక్క హైదరాబాద్ మాత్రమే ఉండటం విశేషం. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆయా నగరాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఒక్కో నగరానికి ఏఏఏ (అఅఅ) నుంచి సీ(ఇ) వరకు రేటింగ్ ఇస్తుంది. ఏఏఏ రేటింగ్ ఏ నగరానికీ దక్కలేదు. ఏఏ రేటింగ్‌లో హైదరాబాద్‌తోపాటు గ్రేటర్ ముంబై, నవీ ముంబై, నాసిక్, సూరత్, పుణే, న్యూఢిల్లీ, ఢిల్లీ, పింప్రి-చించ్వాడ్, థానే ఉన్నాయి.
పాలసీరేట్లు యథాతథంగా ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష
ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో సెప్టెంబర్ 30న రిజ ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రే ట్లను మార్పు చేయకుండా కొనసాగించింది. స్వల్పకాలిక రుణ రేటు (రెపో రేటు)ను 8 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తిని(సీఆర్‌ఆర్) 4శాతంగా, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియా(ఎస్‌ఆల్‌ఆర్)- 22 శాతంగా కొనసాగించింది. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవడం వరుసగా ఇది నాలుగో సారి. అంచనాల స్థాయికి ద్రవ్యోల్బణం తగ్గేవరకు రేట్ల తగ్గింపు ఉండదని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు 5.5శాతంగా,2015 -16లో 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
ఆర్థిక వ్యవహారాలు నవంబరు 2014 ఎకానమీ
కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ప్రాజెక్టు అనుమతి, స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం-(టీఎస్-టీపాస్) బిల్లు- 2014 పేరుతో బిల్లును నవంబరు 25న మంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి, పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం, ఒకే చోట పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం, పరిశ్రమలు వేగంగా ఉత్పత్తి చేపట్టడం అనే లక్ష్యాలతో కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. భారీ పరిశ్రమలకు 15 రోజుల్లో, మధ్య తరహా పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. జిల్లా స్థాయిలో నెలరోజుల్లో అనుమతులు మంజూరు చేస్తారు.
తెలంగాణ తొలి బడ్జెట్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నవంబరు 5న శాసనసభకు సమర్పించారు. మొత్తం రూ. 1,00,637 కోట్ల బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం రూ. 48,640 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు. ప్రధాన రంగాలకు కేటాయింపుల వివరాలు... గ్రామీణాభివృద్ధి: రూ.7,579.45 కోట్లు, సాగునీరు: రూ. 6,500 కోట్లు. వ్యవసాయ, అనుబంధ రంగం: రూ. 3,061.71 కోట్లు. విద్య: రూ. 3,663.26 కోట్లు. వైద్యం: రూ. 2,282.86 కోట్లు.
తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే -2014
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం: 1,14,840 చ.కి.మీ, జనాభా (2011 నాటికి): 3.51 కోట్లు, రాష్ట్ర స్థూల ఆదాయం (జీఎస్‌డీపీ): రూ. 3,78,963 కోట్లు, తలసరి ఆదాయం: రూ. 93,151, జీఎస్‌డీపీలో సాగురంగం వాటా: 17 శాతం, పారిశ్రామిక రంగం వాటా: 27శాతం, సేవారంగం వాటా: 56 శాతం, అక్షరాస్యత: 66.46 శాతం, పట్టణ జనాభా: 39 శాతం, అడవుల విస్తీర్ణం: 28.89 శాతం, సాగునీటి సౌకర్యం: 31.64 లక్షల హెక్టార్లు.
కాకినాడలో తొలి మహిళా బ్యాంకు
ఆంధ్రప్రదేశ్‌లో తొలి భారతీయ మహిళా బ్యాంకును తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో నవంబరు 1న ఆ బ్యాంకు సీఎండీ ఉషా అనంత సుబ్రమణ్యన్ ప్రారంభించారు.
ఆర్థిక వ్యవహారాలు డిసెంబరు 2014 ఎకానమీ
దేశంలో అతిపెద్ద సంస్థ.. ‘ఇండియన్ ఆయిల్’
2014కు సంబంధించి దేశంలో అధిక ఆదాయం పొందుతున్న సంస్థలతో రూపొందించిన ‘ఫార్చ్యూన్ 500 జాబితా’ను ఫార్చ్యూన్ ఇండియా డిసెంబర్ 14న విడుదల చేసింది. రూ.5,00,973 కోట్ల ఆదాయంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రథమ స్థానంలో నిలిచింది. రూ.4,44,021 కోట్లతో రిలయన్స్ రెండో స్థానం, రూ.2,67,718 కోట్లతో భారత్ పెట్రోలియం మూడో స్థానం సాధించాయి. రూ.2,36,502 కోట్లతో టాటా మోటార్స్ ఐదో స్థానంలో నిలిచింది.
సున్నాకు చేరిన టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఈ ఏడాది నవంబర్‌లో సున్నాగా నమోదైంది. అంటే 2013 నవంబర్‌లో ఉన్న స్థాయిలోనే 2014 నవంబర్‌లో కూడా టోకు ధరలు ఉన్నట్లు. గత ఐదున్నరేళ్లలో ఇదే కనిష్టం. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇంధన, ఆహార ఉత్పత్తులు, తయారీ వస్తువుల ధరల తగ్గుదల వల్ల టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు సున్నా స్థాయికి చేరింది.
తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా నిరంజన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నియమితులయ్యారు. దీనికి సంబంధించి డిసెంబర్ 15న ఉత్వర్వులు జారీఅయ్యాయి.
ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష
రిజర్వ్‌బ్యాంకు డిసెంబరు 2న ప్రకటించిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా యథావిథిగా కొనసాగించింది. దీంతో రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపోరేటు 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగుతాయి. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్) ఇప్పుడున్న 22 శాతం వద్దే కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

No comments:
Post a Comment