AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 29 December 2024

ఆశావాదికి కష్టాలు కనిపించవు

 🦚🌻🌹💎💜🦢🌈


🍁ఆశావాదికి కష్టాలు కనిపించవు. కేవలం అవకాశాలే కనిపిస్తాయి. మొక్కకు భూమి కింద రాయి తగిలినా కూడా తడి తగిలే దాకా వేళ్లను విస్తరిస్తూనే ఉంటుంది. ఆశావాది కూడా అంతే...


సృష్టిలో అన్ని జీవుల కన్నా తెలివైన జీవి మనిషే. కానీ ఏ జీవి కూడా ఓడిపోవాలని అనుకోవు. పరిస్థితులు కలిసి రాకపోతే ఏ జీవీ ఆత్మహత్యలు చేసుకోవు.


కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే... మనిషి మాత్రం ఈ పనులన్నీ చేస్తాడు. ఓడిపోతే తీవ్ర నిరాశకు లోనవుతాడు కానీ ఇతర జంతువులు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే అవన్నీ ఆశావాదులే.


అందుకే ఇతర జంతువుల్లో నిరాశ కనిపించదు. ఒకచోట పడితే మరో చోటకు వెళ్లి ప్రయత్నిస్తాయి. ఇతర జీవులు కానీ మనిషి ఓటమి ఎదురైతే చాలు తీవ్రంగా నిరాశ పడిపోతాడు.


రేపు మరో అవకాశం వస్తుందనే విషయాన్ని మరిచిపోతాడు. అందుకే మనుషులంతా ఆశావాదులుగా మారాలి. ఆశావాదాన్ని ఆశ్రయించిన వారికి నిరాశ ఎదురవదు.


ఈరోజు ఓటమి ఎదురైతే రేపు గెలుపు దక్కుతుందని ఆశపడండి. అదే మీ ఆయుష్షును పెంచుతుంది. ఆశీర్వాదం ఎంత బలీయమైనదంటే చివరి శ్వాస వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచే శక్తి దానికి ఉంది...☝️


 🦚🌻🌹🦢💎💜🌈

No comments:

Post a Comment