https://www.aimsdaretosuccess.blogspot.com
Aparnika Reddy Institute of Mathematics & Sciences [AIMS] DARE TO SUCCESS MADE IN INDIA YOUTUBE CHANNEL: JUST TYPE "AIMS DARE TO SUCCESS" OR CLICK https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1 Website: www.aimsdaretosuccess.blogspot.com Gmail: aimsdaretosuccess@gmail.com Telegram Channel: https://t.me/AIMSDARETOSUCCESS It is a Honey to the Students as well as Faculty To get AIMS Q free study material please add my number 9440345996 in your all groups
AIMS DARE TO SUCCESS MADE IN INDIA
Sunday 21 April 2024
Saturday 20 April 2024
Sunday 31 December 2023
Tuesday 5 April 2022
ఉద్యోగాలతో అగచాట్లు Employees Problems
https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1
https://youtube.com/channel/UCBPyEEzKavVtUwzWqOn6NnQ?sub_confirmation=1
పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!
*ఉద్యోగాలతో అగచాట్లు*
*1) కరోన కాలంలో 5 లక్షల కంపెనీలు మూత పడ్డాయని కేంద్రం చెబుతుంది.*
*2) ఎన్నో చిన్న, చితక విద్యా సంస్థలు మూతపడి ఎందరో టీచర్స్, లెక్చరర్స్ రోడ్డున పడ్డారు.*
*3) ఒక రంగంలో ఉపాధి కోల్పోయిన కొన్ని లక్షల మంది వేరొక రంగాలకు తరలిపోయారు.*
*4) చాలా మంది ఉద్యోగుల ముందు తీసుకుంటున్న జీతం కంటే తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు.*
*5) కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కారణంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మొత్తం కనుమరుగు అయ్యాయి.*
*6) రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్న ఆదాయం అంత సంక్షేమ పథకాలకు ఖర్చు చెయ్యడం వల్ల, ఆదాయ వనరులు లేక, ప్రభుత్వ ఉద్యోగాలు తీసే అవకాశం లేదు.*
*7) 3 కిలోమీటర్లు ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని ఆ దగ్గరలో ఉన్న పెద్ద ప్రభుత్వ విద్యా సంస్థలలో కలపడం వల్ల ఉపాధ్యాయులు DSC తీసే అవకాశం లేదు.*
*8) ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలలో పని ఎక్కువ, జీతం తక్కువ.*
*9) సెలవు రోజుల్లో కూడా పని చేయక తప్పడం లేదు.*
*10) సంవత్సరానికి 1000 రూపాయలు కూడా ఇంక్రిమెంట్ వేసే అవకాశం లేదు.*
*11) దానిలో మరల ESI, PF కోతలు విధిస్తారు.*
*12) కార్పొరేట్ లో అడ్మిషన్లు టార్చర్.*
*13) దేని కోసం అయ్యిన ప్రశ్నిస్తే, చెప్ప చెయ్యకుండా తీసివేసే అవకాశాలు. భయపడుతూ బ్రతకడం.*
*14) కరోన కాలంలో ఉద్యోగాలు తీసివేత, జీతాలు భారీ కోత.*
*15) ప్రభుత్వ ఉద్యోగాలలో పెన్షన్ విధానం రద్దు కావడంతో తర్వాత వారి మీద ఆధారపడే వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.*
*16) 10వేలు జీతం గల ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం.*
*17) ప్రతి సంవత్సరం లక్షల మంది చదువుకుని, ఉద్యోగుల కోసం రోడ్డున పడుతున్నారు.*
*18) వీరు అతి తక్కువ జీతానికైనా జాయిన్ అవ్వడం వల్ల సీనియర్ ఉద్యోగుల జీతాలు తగ్గించడం లేదా జాబ్ నుంచి తీసివెయ్యడం జరుగుతుంది. సీనియర్స్ గౌరవం లేదు.*
*19) కొన్ని సంస్థలలో ఉద్యోగులు 12 గంటలు కూడా పని చేస్తున్నారు.*
*20) కొన్ని సంస్థలలో ఉద్యోగులతో అన్ని చేయిస్తున్నారు.*
*ఇలా చెప్పుకుంటే వెళ్ళితే ఉద్యోగుల అగచాట్లుతో ఉద్యోగులబలి అనే పేరుతో 10 సినిమాలు తీయవచ్చు*
*ఇట్లు మీ శ్రేయోభిలాషి తల్లపురెడ్డి. వెంకట కృష్ణారుణ రెడ్డి*
Friday 1 April 2022
Happy UGADHI శుభక్రుత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
💐🌷🌹🌺🌸🌾🌻
🙏🙏🙏
*మామిడి పువ్వు పూతకొచ్చింది🌳*
*కోయిల గొంతు కూత కూసింది🦜*
*వేప కొమ్మకు పూవు పూసింది🌿*
*పసిడి బెల్లం తోడు వచ్చింది🧆*
*గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది🍃*
*ఉగాది పండుగ రానే వచ్చింది*
*మీకు మీ కుటుంబ సభ్యులకు*
*శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*
🎄🌲🌴🌳🎍🪴🌱🎋
**శు*భాశీస్సులు అందించి. *భ*వితకు బాటలు వేసి. *కృ*త నిశ్చయాన్ని కలిగించి. *తు*ది వరకు క్షేమాన్ని కలిగించే.* నామ సంవత్సరాదికి ఇవే మా స్వాగతాంజలి.......🪔🪔🪔....*మీకు,మీ కుటుంబ సభ్యుల కి, శ్రేయోభిలాషులు అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నది మీ శ్రేయోభిలాషి తల్లపురెడ్డి. వెంకట కృష్ణారుణ రెడ్డి*
🌹🌹🌹...............................🥭🥭🥭🌶️🌶️🌶️🍃🍃🍃🌳🌳🌳🍲🍲🍲
*ఆ దేవుడు మన అందరికి 3 తరాల వరకు మంచి ఆరోగ్యం, మంచి ఆదాయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.*
Thursday 20 January 2022
కరోన Corona
*అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.*
*'వైరస్' వల్ల వస్తున్నది'*
*'మరి వైరస్ అందర్నీ కాటేయడం లేదేంటి?'*
*'ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'*
*'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా ?'*
*'గాలిలో వస్తోంది'*
*అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?*
*రోగ నిరోధక శక్తి లేనివాడికి వస్తోంది*
*'రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతోంది?*
*'తెలియదు'*
*ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం.*
*'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'*
*మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్న వాడికి ఎందుకని రావడం లేదు?*
*నో ఆన్సర్*
*'మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ అంటించుకున్నాడు'*
*మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్న వాడికి ఎందుకని రాలేదు?'*
*మళ్ళీ నో ఆన్సర్*
*'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'*
*'రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?'*
*మళ్ళీ నో ఆన్సర్*
*చివరకు ఇలా జవాబు వస్తుంది.*
*కాయకష్టం చేసేవాళ్లకు రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు*
*ఏతావాతా తేలిందేమిటి?* *ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు. ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు*
*ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో చెప్పారు.*
*వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడ నుభవిస్తాడు? మంచి చెప్పినా ఎవడూ వినడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు.*
*ఇప్పుడు విషయంలో కొద్దాం.*
*నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని తెలిసింది గనుక.*
*నేనమెరికాలో ఉన్నపుడు ఒక విషయం గ్రహించాను. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ.*
*ఎందుకని?*
*వినండి మరి.*
*స్టోర్స్ లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది. దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసెసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది?*
*ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.*
*చనిపోయిన దేహాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి?*
*ఈరోజుల్లో, ఏ పూటకా పూట, ఏ రోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు?*
*చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంట మీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు.*
*సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు.*
*ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యదానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.*
*జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు ెలుసా?*
*ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్ స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు.*
*ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?*
*ప్రతిరోజూ చెమటపట్టేలా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు?*
*ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్మువ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాది పాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి.*
*మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?*
*అసలు కనీస వ్యాయామ మంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు.*
*పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ ఉండటం.*
*టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం.*
*లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం. ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?*
*"ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం.*
*అక్కడకూడా డబ్బులు పారేసి పెద్దఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం.*
*అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం.*
*దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.*
*వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను.*
*ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనం మీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ.*
*బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే.*
*సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు vari arogyamnu vare నాశనం అవుతున్నారు.*
*అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా?*
*మనకు ఓవెన్లెందుకు? అవసరమా?*
*మనకు జొమాటోలెందుకు? అవసరమా?*
*రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా?* *అర్ధరాత్రిళ్ళు, తెల్లవారు ఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా?*
*ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజమైన, ప్రకృతి విరుద్ధమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?*
*పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా? ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.*
*ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలేబాగుంది' అనుకుంటూ బ్రతుకుతున్న ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.*
*ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?*
*మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులున్నాయి.*
*బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు.*
*ఏ ఒక్కటీ కాదనలేని వాస్తవం. ఈ మెసేజ్ వల్ల కొందరైనా, కొంతైనా మారాలని, కనీసం మారే ప్రయత్నం చెయ్యాలని ఆశిద్దాం 👍*
Friday 14 January 2022
Off line Antava Online Antava Baby
మన పల్లెలు మనకు నేర్పిన జీవిత పాఠాలు
😘మన పల్లెలు మనకు నేర్పిన జీవిత పాఠాలు..🥰
😊పొలం గట్లపై నడిపించి, తడబడకుండా నిలదొక్కుకోవటం నేర్పింది.
👉 అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు పాడై పోతే, నష్టాలకు నిలదొక్కుకునే స్థైర్యం నేర్పింది.
🙏వాగు పక్కన నీటి చెలిమలు తీయించి,
శోధించే తత్వం నేర్పింది.
👉సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,
అన్వేషణ నేర్పింది.
👏తుమ్మ ముల్లు, పల్లేరు గాయల గుచ్ఛులతో,
జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.
👏వేరుశనగ కాయ కొట్టించి, సోలెడు పల్లీలు తీయించి, ఐదు పైసల సంపాదన నేర్పింది.
🐂ఆవులతో, 🐃గేదెలతో, 🐓కోళ్లతో స్నేహం🐔 చేయించి,
😘ప్రాణికోటి పై బాధ్యత పెంచింది,
ప్రేమతత్వాన్ని నేర్పింది.
👏రాగడి మట్టితో బండి గిర్రలు చేయించి,
మొక్కజొన్న సొప్ప బండ్లకు తొడిగించి,
పనితనం నేర్పింది.
👉వేలాడే పిచ్చుక గూళ్ళు, చెట్ల కొమ్మల పంగల మధ్య కొంగ గూళ్ళు చూపించి
బొమ్మరిల్లు కట్టించి, చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పింది.🕊️
🙋బతుకమ్మ తంగేడు, గానుగు పూల కోసం,
తెల్లవారుతూనే పొలం బాట పట్టించి,
ఇంటి ఆడబిడ్డల బాధ్యతను నేర్పింది.
🤗పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే,
నల్లాలం ఆకు పసరు పోయించి,
చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది.
👌చెట్టుమీద మామిడికాయ
గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది.
👉నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి, జీవితమంటే బరువు కాదు,
బాధ్యత అని నేర్పింది.
👉బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి,
బాలన్స్ గా బరువు లాగటం నేర్పింది.
😘ఇంటి ముంగిటకు అతిథి దేవతలు
హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,
ఉన్న దాంట్లో కొంత పంచుకునే గుణం నేర్పింది,
👉ఇసుకలో పిట్ట గూళ్ళు కట్టించి,
ఒక ఇంటి వాడివి కావాలి అనే స్పృహను నింపింది.
👏పచ్చపచ్చని నిగనిగలాడే మోదుగాకుల విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే ఒద్దికను నేర్పింది.
😋మోదుగాకులు తెంపించి, ఎండబెట్టించి,
కట్టలు కట్టించి, విస్తరాకులు కుట్టించి,
అతిథులకు ఎంగిలి కాని పాత్రల్లో భోజనం వడ్డించడం నేర్పింది.
😊ఉన్న ఒక్క పిప్పర్మెంట్ ను, అంగీ బట్ట వేసి, కొరికి ముక్కలు చేసి, కాకి ఎంగిలి పేరుతో దోస్తులతో పంచుకోవటం నేర్పింది.
👉ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేగ్గాయలు తెంపే ఓర్పును నేర్పింది.
🤗ఎండా కాలంలో తుమ్మ చెట్ల బంక సేకరణ,
స్వయం సంపాదన ధోరణి నేర్పింది.
💕గోరింటాకు ని తెంపించి, దంచించి, చేతులకు అద్దించి, వికసించడం చూపించింది.
🤗వాయిలి బరిగెలతో, సుతిలి దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ మెళకువలు నేర్పింది.
😘అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయినమ్మా, తాతయ్యా వరుసలతో, ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.
🙏ధైర్యంగా బ్రతికే పాఠాలను నేర్పిన
మా ఊరుకు పల్లెకు మేము జీవితాంతం బుుణపడి ఉంటాం.
😘నేను గ్రామం లో (పల్లెలో) పుట్టి పెరిగాను అని చెప్పటానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా......
Friday 23 April 2021
తెలుగు జోక్స్ Telugu Jokes 😂😂😂😂😂😂
AIMS Q FREE Study Materials
https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1
https://t.me/AIMSDARETOSUCCESS
www.aimsdaretosuccess.blogspot.com
😂😂😂😂😂😂తెలుగు జోక్స్ Telugu Jokes 😂😂😂😂😂😂
🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒
నిన్న రాత్రి కరెంట్ పోయిందని కొవ్వొత్తి🕯️ వెలిగించా...
కొంచెం సేపు తరువాత, కరెంట్💡 వచ్చింది కదా అని ఉఫ్ ఉప్ అని మూడుసార్లు ఊదాను... ఎంత ఊదినా కొవ్వొత్తి🕯️ ఆరలేదు...
ఒక్కసారిగా ఉద్రిక్తతకు లోనయ్యాను... "ఓరి బాబోయ్... Oxigen💨 levels పడిపోయాయా" అని...?
కిచెన్ లోనుండి హాల్ లోకి వచ్చిన మా ఆవిడ🤦♀️ " ముందు మూతికి ఉన్న మాస్క్ తీయండి మహాప్రభో"....👩🍳 అంది....😜