AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 1 January 2018

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 31

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅డిసెంబరు 31*🌅*🏞సంఘటనలు*🏞

2010: ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190.

*🌻🌻జననాలు*🌻🌻

1870: ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (మ.2017)

1907: కొత్త సత్యనారాయణ చౌదరి, ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974)

1918: పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, ప్రముఖ సాహితీవేత్త.

1928: కొంగర జగ్గయ్య, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.2004)

1937: ఆంథోనీ హాప్కిన్స్, నటుడు.

1947: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవులలో ఒకడిగా ప్రసిద్ధుడు. (మ.2009)

1953: ఆర్.నారాయణమూర్తి, విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు.

1964: విన్‌స్టన్ బెంజిమన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1965: లక్ష్మణ్ శివరామకృష్ణన్, భారత క్రికెట్ జట్టు  మాజీ క్రీడాకారుడు.

1977: సుచేతా కడేత్కర్, సాహసయాత్రికురాలు. ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటింది.

1979: మలింగ బండార, శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు.

1988: వడ్ల అనిల్ కుమార్ చారి, సింగీతం గ్రామ నివాసి.

*🌹🌹మరణాలు*🌹🌹

1900: బుడ్డా వెంగళరెడ్డి,

1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840)

1965: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి.(జ.1893)

2004: గెరాల్డ్ డిబ్రూ, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

*🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*

🔻వరల్డ్ స్పిరిట్యువల్ డే.

*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  31, డిసెంబర్ 2017*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : త్రయోదశి
(నిన్న రాత్రి 6 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 25 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి
(నిన్న రాత్రి 8 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 51 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : తైతిల
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 46 ని॥ నుంచి నిన్న తెల్లవారుజాము 0 గం॥ 10 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు సాయంత్రం 3 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 25 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(సాయంత్రం 4 గం॥ 22 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 6 ని॥ వరకు)
రాహుకాలం :
(సాయంత్రం 4 గం॥ 27 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 50 ని॥ వరకు)
గుళికకాలం :
(సాయంత్రం 3 గం॥ 4 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 27 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 40 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : వృషభము

*🤘 నేటి సుభాషితం🤘*

*మధుర వాక్కు కోపాన్ని చల్లబరుస్తుంది. కటిన వాక్కు రెచ్చగొడుతుంది.*

🔲 సూక్తులు

🔺నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.

🔺నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.

🔺నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.

🔺నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. 

🔺నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.

🔺నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను

☘ *ఒక మంచిమాట*☘

చూసే వాళ్ళు చుట్టూ లేకున్నా సరే, 

పుష్పం వికసించక మానదు. 

నీపని నువ్వు నిశ్శబ్దం గా చేసుకుంటూ వెళ్ళు,

నిన్ను ఇష్టపడే వాళ్లు
దారి వెతుక్కుంటూ వస్తారు...

*💟🌳🌹 BE POSITIVE 🌹🌳💟*

        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" నమ్మకం " అనేది ఒక చిన్న పదం దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి ఒక జీవిత కాలం కావాలి..!
       --------------------------
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
      ---------------------------
" లోహం చల్లబడిన తర్వాత ఎన్ని దెబ్బలు కొట్టినా కావాలనుకొన్న రూపంలోకి మలచలేం 
వచ్చిన అవకాశాన్ని గుర్తించక చేజార్చుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలెం. "

*💎 నేటి ఆణిముత్యం 💎*

ఇద్దఱు గూడుక యొక చో
నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి యా 
యొద్దకు జనగూడదు తన
పెద్దతనంబెల్ల నణఁగ బెట్టు గుమారీ! 
  
*భావం:*

ఓ కుమారీ!ఇద్దరు మాట్లాడుకొనునపుడు మద్యలో దూరి కల్పించుకొనరాదు.అట్టి స్థలమునకు బోగూడదు.వెళ్ళినచో తన గొప్పదనమెల్ల జెడిపోవును.

*✍🏼 నేటి కథ ✍🏼*

*గువ్వ కథ*

ఒక ఊర్లో గువ్వంట. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముల్లు గుచ్చుకుందంట. ఆ గువ్వ ఒక పిల్లోడి దగ్గరకుపోయి "మనవడా! మనవడా! నా కాలిలో ముల్లు తీస్తావారా?" అని అడిగిందంట.

" నేను తీయను. నన్ను అవ్వ కొడుతుంది- పో " అన్నాడట వాడు.

"అట్లనా!" అని, ఆ గువ్వ అవ్వ దగ్గరకి పోయి, "అవ్వా! అవ్వా! నా కాలి ముల్లు తీస్తావా అవ్వా?", అని అడిగిందట.

"నన్ను తాత కొడతాడు. నేను రాలేను- పో" అని అవ్వ చెప్పిందంట.

"సరేలె"మ్మని, ఆ గువ్వ తాత దగ్గరకు పోయిందంట. పోయి, "తాతా! తాతా! నా కాల్లోంచి ముల్లు తీస్తావా తాతా?" అని అడిగిందట.

"నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్టా!" అని తాత అన్నాడట.

"సరే"నని ఆవుదగ్గరికెళ్లి, "ఆవూ! ఆవూ! నా కాలి ముల్లు తీస్తావా, ఆవూ?" అని అడిగిందట గువ్వ.

అప్పుడు ఆవు, "నన్ను దూడ కొడుతుంది" అని చెప్పిందట.

"సరే అయితే. నేను దూడని అడుగుతాను ఉండు" అని దూడ దగ్గరికెళ్లి, "దూడా! దూడా! నా కాల్లో ముల్లు తీస్తావా దూడా?" అని అడిగిందంట గువ్వ.

దూడేమో, "ఊ...నేను తేనీగతో ఆడుకోవాలమ్మా! లేకపోతే అది నన్ను తిట్టదూ?" అని చెప్పిందట.
"ఐతే నేను తేనీగను అడుగుతాలే" అని తేనీగ దగ్గరికెళ్లి తన గోడు చెప్పుకున్నదట గువ్వ.

"అయ్యో పాపం! నీ కాళ్లో గుచ్చుకున్న ముల్లును తీసెయ్యించడానికే ఇంత కథ నడిచిందా? ఉండు, నేను చూసుకుంటానుగానీ" అని, అది వెళ్లి దూడను కుట్టిందట. దూడ పోయి ఆవును కుమ్మిందట. ఆవుపోయి తాతను గుద్దిందంట. తాత పోయి అవ్వను కొట్టాడంట. అవ్వ పోయి మనవడ్ని వేళ్లతో పొడిచిందంట. మనవడు పోయి గువ్వ కాల్లో ఇరుక్కున్న ముల్లును తీసేశాడట.

ముల్లు బాధ పోయిన గువ్వ తేనీగకు ధన్యవాదాలు తెలుపుకుని ఎగిరిపోయిందంట!! 

*📖 మన ఇతిహాసాలు 📓*

*దుర్వాసుడు*

దూర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

*అంబరీషుని కథ*

భాగవతంలో వచ్చే అంబరీషుని కథ చాలా ప్రాచుర్యం పొందింది. అంబరీషుడు గొప్ప విష్ణుభక్తుడు. సత్యసంధుడు. ఆయన ఒకసారి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి నారాయణుని మెప్పించి సుదర్శన చక్రాన్నే వరంగా పొందుతాడు. దానివల్ల ఆయన రాజ్యం సంపద, శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. రాజ్యానికి రక్షణ కవచంగా కూడా ఉంది. ఒక సారి అంబరీషుడు ద్వాదశి వ్రతం నిర్వహించాడు. ఈ వ్రతం ప్రకారం ఆయన ఏకాదశి ప్రారంభం కాగానే ఉపవాసం ప్రారంభించి, ద్వాదశి రోజున ముగించి ప్రజలందరికీ భోజనం పెట్టాల్సి ఉంటుంది.

*మహాభారతంలో*

మహాభారతంలో దుర్వాసుడు ఆయనను తమ భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి, అతిథిగా ఆదరించిన వారికి వరాలు అనుగ్రహిస్తుంటాడు. వాటిలో ముఖ్యమైన ఘట్టం కుంతీదేవి బాల్యంలో జరిగింది. కుంతీ చిన్నతనంలో తన పెంపుడు తండ్రియైన కుంతీభోజుడి దగ్గర పెరుగుతుంటుంది. ఒకసారి దుర్వాసుడు ఆయన దగ్గరకు అతిథిగా వస్తాడు. ఆయన దుర్వాసునికి మర్యాదలు చేయవలసిన బాధ్యత కుంతీ దేవికి అప్పజెపుతాడు. ఆమె దుర్వాసుడు ఎలాంటి కష్టాలు పెట్టినా ఓర్చుకుని బాగా సేవలు చేస్తుంది. దుర్వాసుడు అందుకు సంతుష్టుడవుతాడు. ఆయన తిరిగి వెళ్ళేటపుడు ఆమెకు అథర్వణ వేదం లోని దేవతా ఉపాసనా మంత్రాలను కొన్నింటిని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించే వరం సంపాదిస్తుంది. దీని సాయంతోనే ఆమె ముగ్గురు పాండవులను సంతానంగా పొందుతుంది. పెళ్ళి కాక మునుపే సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుని సంతానంగా పొందుతుంది. కానీ అవివాహిత కావడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బిడ్డను నదిలో వదిలి వేస్తుంది.

*✅ తెలుసుకుందాం ✅*

*🐟చేపలు వినలేవా?*🐠

✳చేపలు శబ్దాలు చేయలేవని, వినలేవనే విషయాలు నిజం కాదు. అవి ఒక దానితో మరొకటి క్లిక్‌, క్లిక్‌ అనే శబ్దాలతోనూ, బొంగురుపోయిన గుర్‌, గుర్‌ అనే శబ్దాలతోను సంకేతాలు పంపించుకుంటాయి. మగ చేపలు గాలిని నింపుకునే సంచుల చుట్టూ ప్రత్యేకమైన కండరాలు ఉంటాయి. ఈ కండరాలను కుంచించడం ద్వారా అవి డ్రమ్ములను వాయించినపుడు వచ్చే శబ్దాలను అతి తక్కువ తీవ్రతలో ఉత్పన్నం చేయగలవు. చేపలు ఒకదానితో మరొకటి మాట్లాడుకోవాలనుకుంటే, గాలిని పీల్చుకుని ఆ గాలిని వ్యర్థ పదార్థాలను విసర్జించే మార్గం ద్వారా వెలువరిస్తూ శబ్దాలను చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేపలు 1.7 నుంచి 2.2 కిలో హెర్ట్జ్‌ పౌనఃపున్యం ఉండే శబ్దాలను వెలువరించగలవు. ఒక్కో శబ్దాన్ని 8 సెకండ్ల వరకు పట్టి ఉంచగలవు. అలా శబ్దాలు చేయగల శక్తి గల చేపలకు వినికిడి శక్తి ఉండటం సహజం. అవి గాలిని నింపుకొనే సంచికి అనుసంధానమై ఉండే లోపలి చెవి ద్వారా వినగలవు. ఆ చెవి శబ్దాలు వినడంలో కర్ణభేరి లాగా పనిచేస్తుంది.

*🅾ప్రీ ప్రైమరీ ప్రవేశాలకు షెడ్యూల్ వెల్లడి*

హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలో ప్రీ ప్రైమరీ ప్రవేశాలకు ప్రభుత్వం షెడ్యూల్ను ప్రకటించింది.

 నర్సరీ, ఎల్కేజీ, ఒకటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

ప్రైవేటు పాఠశాలలు జనవరి 2న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయాలని.. జనవరి 3 నుంచి 8 వరకు దరఖాస్తులు స్వీకరించాలని.. జనవరి 11న తల్లిదండ్రుల సమక్షంలో ప్రవేశాలు ఖరారు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

🔵హైదరాబాద్లో బ్లూవేల్ కలకలం*

🏀 హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న బ్లూవేల్ భూతం హైదరాబాద్కు పాకింది. ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజేంద్ర నగర్ సన్సిటీలోని మిఫుల్ టౌన్ విల్లాకు చెందిన వరుణ్(19) బ్లూవేల్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ బిట్స్పిలానీలో రెండో సంత్సరం చదువుతున్న వరుణ్ సెలవుల కారణంగా వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. గత మూడు రోజుల నుంచి తన రూమ్ నుంచి బయటకు రాకుండా బ్లూవేల్ గేమ్ ఆడుతున్నాడు. అయితే కుమారుడి ప్రవర్తను గమనించిన తల్లి పరిస్థితిని గురించి వరుణ్ తండ్రికి వివరించింది. విషయం తెలుసుకున్న వరుణ్ తండ్రి ఇంట్లో ఇంటర్నెట్ను తీసేయించాడు. దీంతో మనస్థాపానికి గురైన వరుణ్ తలకు ప్లాస్టిక్ కవర్, ఊపరి ఆడకుండా కొంతకు తాడుతో గట్టిగా బిగించుకుని గతరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే రోజు మొత్తం వరుణ్ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వరుణ్ గదిని తనిఖీ చేయగా విగతజీవుడిగా పడిఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వరుణ్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బ్లూవేల్ గేమ్ కారణంగానే వరుణ్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో వరుణ్ గేమ్స్ ఆడిన లాప్టాప్, మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం అనంతరం వరుణ్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

*🚫పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్*

-సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ అఫిలియేషన్ స్కూళ్లకే వర్తింపు..

-జనవరి 2 నుంచి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం

-3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు.. 8వ తేదీ తుదిగడువు..

-త్వరలో స్టేట్ సిలబస్ స్కూళ్లకు అడ్మిషన్ నోటిఫికేషన్

 🛑తెలంగాణ: రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ అఫిలియేషన్ పొందిన ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. వచ్చే జనవరి 2 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో విడుదలచేశారు. విద్యాహక్కు చట్ట ప్రకారం అన్నిరకాల ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలను కల్పించాల్సి ఉన్నదని, ఇందుకు క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయొద్దని చట్టంలో పేర్కొన్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఫీజులు వసూలు చేసినట్టు ఫిర్యాదులొస్తే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ డైరెక్టర్ జీ కిషన్ హెచ్చరించారు. రాష్ట్రస్థాయిలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.

*🅾ప్రవేశాల షెడ్యూల్ వివరాలు:*

-2018 జనవరి 2న పాఠశాలవారీగా వెబ్సైట్లో ప్రవేశాల నోటిఫికేషన్ జారీ

-జనవరి 3న స్కూళ్లవారీగా ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం

-జనవరి 8వ తేదీ ఆన్లైన్ దరఖాస్తులకు తుది గడువు

-జనవరి 9, 10 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన

-జనవరి 11న ర్యాండమ్ పద్ధతిలో అడ్మిషన్ల ఖరారు

-జనవరి 12న స్కూల్ వెబ్సైట్లో ఖరారైన ప్రవేశాల జాబితా⛔

*🛑రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి*

-మరో ముగ్గురు ఉపాధ్యాయులకు తీవ్రగాయాలు

మాల్: విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందగా మరో ముగ్గురు ఉపాధ్యాయులకు తీవ్రగాయాలయ్యాయి. 

ఈ ఘటన *నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గేట్* సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నాగభూషణ్రావు కథనం ప్రకారం.. చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి పంచాయతీలోని బోజ్యా తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీరామ్ రమేశ్(32) తన కారులో హైదరాబాద్ నుంచి విధులకు వస్తున్నారు. అదే కారులో మండలంలోని తక్కెళ్లపల్లి, దేన్యాతండా పాఠశాలల్లో పనిచేస్తున్న రాధారాణి, సుమతి, సుమలత కూడా విధులకు వస్తుండగా పోలేపల్లి గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ఘటనలో శ్రీరాంరమేశ్కు బలమైన గాయాలు కావడంతో 108 లో తరలిస్తుండగా మృతిచెందారు.
గాయపడ్డ వారు చికిత్స పొందుతున్నారు.🛑✴✴✴

*🚩పిటిషనర్లను పరీక్షలకు అనుమతించాలి🌴*

 ♦టీఆర్టీ కటాఫ్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు

 హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) పోస్టుల అర్హతల విషయంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో కటాఫ్ మార్కులపై జీవో 25లోని నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌తోపాటు పలువురు డీఎడ్ అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌లో కనీస మార్కుల నిబంధనలు విధించడంతో తమకు అవకాశం లేకుండా పోతున్నదంటూ వందమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

2007కు పూర్వం ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థులకు కనీసమార్కులు 45 శాతం, తదనంతరం 50 శాతం విధించడంతో టీఆర్టీలో అవకాశం లేకుండా పోతున్నదంటూ ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ల టీఆర్టీ దరఖాస్తులను స్వీకరించడంతోపాటు 2018 ఫిబ్రవరిలో నిర్వహించే టీఆర్టీ పరీక్షలకు అనుమతించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ల టీఆర్టీ పరీక్ష ఫలితాలను మాత్రం ప్రకటించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ఈ రోజు జి కె

1)👉 స్టీఫెన్ హాకింగ్ ఏ దేశానికి చెందిన ప్రముఖ ఆధునిక శాస్త్రవేత్త?
A: *ఇంగ్లాండ్*

2)👉 "రామప్ప దేవాలయం" ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు  అర్హతలున్నాయని చెప్పి నివేధిక ఇచ్చిన కమిటీ ఏది?
A': *నందగోపాల్ కమిటీ నివేదిక*

3)👉 భారతదేశంలో  సూర్యుడు  అస్తమించే రాష్ట్రం ఏది?
A: *గుజరాత్*

4)👉  "ఢిల్లీ సుల్తానుల"లో నిరక్షరాసుడు ఎవరు?
A: *అల్లావుద్ధీన్ ఖిల్జీ*

5)👉 జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు ఎవరు?
A: *పాలబెర్గ్*
               🍃✌🌺

🔲ప్రశ్న: నున్నటి చదునైన ప్రదేశాల్లో కూడా ఉడుము సులభంగా పరుగెత్తడమే కాకుండా గట్టిగా పట్టుకుని ఉండగలదు. ఇదెలా సాధ్యం?

జవాబు: ఉడుములు వరానిడే కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమొడొ డ్రాగన్. ఈ కుటుంబంలో ఉన్న ఒకే ప్రజాతి వరానస్.ఉడుము గాజులాంటి నున్నటి తలాలపై కూడా నిట్టనిలువుగా పరుగెత్త గలదు. పైకప్పులను గట్టిగా పట్టుకుని స్థిరంగా ఉండగలదు. వాటి పాదాల కింద ఉండే ప్రత్యేకమైన మెత్తలే (pads) ఇందుకు కారణం. వీటిపై లక్షలాది వెంట్రుకలు, వేలాది బొడిపెలు (bulges) ఉంటాయి. ఈ సూక్ష్మ వెంట్రుకల రాపిడి వల్ల దుర్బల స్థిర విద్యుత్‌ బలాలు (weak electrostatic forces) ఉత్పన్నమై అవి తలానికి అంటుకుని పోతాయి. ఒకో బొడిపె అతుక్కునే బలం (adhesive force) తక్కువే అయినా, వేలాది బొడిపెల వల్ల ఉత్పన్నమయ్యే బలం ఎక్కువవడంతో ఉడుము గట్టి పట్టును కలిగి ఉంటుంది. ఇలా దాని నాలుగు పాదాల వల్ల కలిగే బలం వల్ల దాదాపు 140 కిలోల బరువును కూడా లాగుతూ నిలువుగా ఎగబాకగలదు. అందుకే పూర్వం సైనికులు ఉడుముల నడుములకు తాళ్లను కట్టి వాటిని పట్టుకుని కోట గోడలను ఎక్కేవారు. 'ఉడుము పట్టు' వ్యవహారికంగా మారడానికి ఇదే కారణం.

ఈ రోజు జి కె

1)👉 గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ రూపానీ ఏ నియోజకవర్గం నుండి గెలిచారు?
A: *రాజ్ కోట్ వెస్ట్*

2)👉 ఇటీవల మెట్రోమార్గం సదుపాయం కల్పించబడిన  "నోయిడా పట్టణం" ఏ రాష్ట్రంలో కలదు?
A: *ఉత్తర ప్రదేశ్*

3)👉దేశంలోనే తొలిసారిగా "ఏసీ సబర్బన్ రైలు" ఏ నగరంలోకి  అందుబాటులోకి వచ్చింది?
A: *ముంబాయి*

4)👉 ఎవరు  రచించిన ఆత్మకథను వెన్న వల్లభరావు విరామమెరుగని పయణం గా తెలుగులో  అనువదించారు?
A: *అజీత్ కౌర్*

5)👉 హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో భాజపా ముఖ్యమంత్రి  అభ్యర్థిగా ఉండి ఓడిపోయింది ఎవరు?
A: *ప్రేమ్ కుమార్ ధుమాల్*
                 🍃✌🌺
*🔥SGT ఇంగ్లీష్ మిడీయం పోస్ట్ కి అప్లై చేయడానికి అర్హతలు*🔥

*1) 👉SSC లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఇంగ్లీష్ మిడీయం లో చదివి ఉండాలి*

*OR*

*2) 👉SSC లో 1ST లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిన అయి ఉండాలి*

*OR*

*3)👉తెలుగు మీడియం ఇంటర్మీడియట్ పార్ట్ 1 ఇంగ్లీష్ అయిన అయి ఉండాలి*

*OR*

*4)👉తెలుగు మీడియం ఇంటర్మీడియట్ 2nd లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిన అయి ఉండాలి*

*OR*

*5)👉తెలుగు మీడియం డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అయిన అయి ఉండాలి*

*NOTE*

*ప్రతి యొక్క తెలుగు మీడియం అభ్యర్థి పైన చెప్పిన అర్హత లలో ఎదో ఒకటి  కచ్చితంగా కలిగి ఉంటాడు .ఎక్కువ మంది  అబ్యర్డులు 3వ పాయిట్ కలిగి ఉంటారు*

*🔥TS TRT*🔥

*♦TRT కి అప్లై చేసిన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది జిల్లా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు .వారి యొక్క అప్లికేషన్ లు తిరస్కరించబడతాయి అని TSPSC తెలిపింది.వీరి కోసం జనవరి 7 నుండి 10 వరకు మరో సారి ఎడిట్ ఆప్షన్ ఇవ్వనుంది.*

*డీఈడీ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట*

🔳  *ఇంటర్‌ కనీస అర్హత మార్కులు లేవన్న కారణంతో ఉపాధ్యాయ నియామకపు పరీక్ష (టీఆర్‌టీ)కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖ లు చేసిన పలువురు డీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరటనిచ్చింది.* 

🔳  *ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండా దర ఖాస్తులను స్వీకరించి, టీఆర్‌టీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.* 

🔳  *తాము ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పిటిషనర్ల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దంది.*

🔳  *ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.* 

🔳  *2007 తర్వాత డీఈడీ చేసిన అభ్యర్థుల్లో ఓపెన్‌ కేటగిరీవారు ఇంటర్‌లో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఇతరులు 45% మార్కు లు సాధించి ఉంటేనే ఎస్‌జీటీ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు*. 

🔳  *ఇంటర్‌లో కనీస మార్కులు లేవని పలువురు టీఆర్‌టీ అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు.*    

🛑 🏫 *కోర్టుకు చెప్పకుండా అడ్మిషన్లు ఆమోదించం*🏫🛑

🔊 *హైకోర్టుకు విద్యాశాఖ వెల్లడి*

🌎 *హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):* 

🔳  *గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏడు డీఈడీ కాలేజీల్లో జరిగిన అడ్మిషన్లను కోర్టుకు చెప్పకుండా అమోదించబోమని ఏపీ విద్యాశాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపా రు*. 

🔳  *ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న హైకోర్టు... వ్యాజ్యాన్ని ఎందుకు విచారణకు స్వీకరించరాదో చెప్పాలంటూ ఏపీ ప్రభుత్వానికి, అభియోగాలు ఎదుర్కొంటున్న డీఈడీ కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను సంక్రాతి సెలవు ల తర్వాతకు వాయిదా వేసింది.*

🔳 *గుంటూరు జిల్లా వినుకొండ లోని ఎస్‌.ఆర్‌.డీఈడీ, జీఎస్‌ఆర్‌ డీఈడీ కాలేజీ(బాలికలు), సలామ్‌ డీఈడీ కాలేజీ, అమరావతి డీఈడీ కాలేజీ, ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని ఎస్‌ఆర్‌ డీఈడీ కాలేజీ, షారోన్‌ డీఈడీ కాలేజీ, పశ్చిమగోదావరి జిల్లా ఆత్రేయపురం లోని మహాత్మాగాంధీ డీఈడీ కాలేజీల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ ఎన్‌.మాధవరావు, మరికొందరు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు*. 

🔳  *ఈ వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం మరోసారి విచారించింది.*

*పీజీటీ ఫలితాల వెల్లడి*

 గురుకులాల్లో 475 పీజీటీ గణితం, జీవశాస్త్రము, సాంఘికశాస్త్రము మరియు ఫిజికల్ సైన్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ  వెల్లడించింది. 👇

*🔥ట్రాన్స్‌కోలో 1,604 కొలువులు🔥*

*♦నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో)లో 1,604 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటన వెలువడనుంది. 330 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), 174 సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), 1,100 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో ప్రకటన జారీ చేయనుంది. గురువారం విద్యుత్‌ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో సమావేశమైన సంస్థ పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.*

*♦330 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల్లో 250 ఎలక్ట్రికల్, 49 సివిల్, 31 టెలికాం విభాగాల పోస్టులు ఉండనున్నాయి. ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఏఈ పోస్టులకు, ఎలక్ట్రికల్‌ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక వయోపరిమితి సడలింపు నిబంధనలను విద్యుత్‌ ఉద్యోగాల భర్తీలోనూ అమలు చేయనున్నట్లు ప్రభాకర్‌రావు తెలిపారు.*

*♦తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో ప్రస్తుతం ఖాళీలు లేవని, కాబట్టి జెన్‌కో నుంచి నియామక ప్రకటన ఉండదని పేర్కొన్నారు. కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)ల నుంచి కూడా జేఎల్‌ఎం, ఏఈ, సబ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో వేర్వేరు ప్రకటనలు జారీ కానున్నాయి.*

No comments:

Post a Comment