*🌏 చరిత్రలో ఈరోజు 🌎*
*🌅డిసెంబరు 29*🌅*🏞సంఘటనలు*🏞
1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్ సేనలు బఫెలో, న్యూయార్క్ నగరాలను తగలబెట్టాయి.
1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్ ఏర్పాటయింది. ( 1953 డిసెంబర్ 22 అని ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10)
1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.
*🌻🌻జననాలు*🌻🌻
1808: ఆండ్రూ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1901: పింగళి నాగేంద్రరావు, ప్రముఖ సినీ రచయిత.
1910: రోనాల్డ్ కోస్ ప్రముఖ ఆర్థికవేత్త.
1930: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012)
1942: రాజేష్ ఖన్నా హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయ వేత్త. (మ.2012)
1960: డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
*🌹🌹మరణాలు*🌹🌹
1994: కువెంపు, కన్నడ రచయిత మరియు కవి మరణం (జ.1904)
2014: బైరిశెట్టి భాస్కరరావు, ప్రముఖ సినీ దర్శకుడు. (జ.1936)
2016: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (జ.1937)
*🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷
🔻ఐర్లాండ్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం.
🔻మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం.
🙏 *శుభోదయం* 🙏
--------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
-------------------------
" కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మరిచిపోవచ్చు కానీ మనసుకి నచ్చిన వారిని మరణం వరకు మారువలేం. "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
" ఒకడు డబ్బు సంపాదించడం మొదలుపెట్టి నీతో మాట్లాడడం మానేశాడు అంటే వాడికి పొగరు పెరిగింది అని కాదు, వాడి లైఫ్ లో వాడు బిజీ అయ్యాడు అని అర్ధం. "
*🤘 నేటి సుభాషితం🤘*
*మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్దిమంతుడితో విరోధం మంచిది.*
*🗓 నేటి పంచాంగం 🗓*
*తేది : 29, డిసెంబర్ 2017*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ఏకాదశి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 49 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 52 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : వణిజ
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 9 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 58 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు రాత్రి 6 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 53 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 41 ని॥ వరకు)(ఉదయం 12 గం॥ 39 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 23 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 10 గం॥ 53 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 16 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 8 గం॥ 7 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 30 ని॥ వరకు)
యమగండం :
(సాయంత్రం 3 గం॥ 3 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 26 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మేషము
*💎 నేటి ఆణిముత్యం 💎*
ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వే
ఱోక్కరు డస్ధి నిచ్చొనిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్క నిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరో కీర్తి కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయన మంత్రి భాస్కరా!
*భావము :*
ఒకడు మాంసమిచ్చెను. మరొకడు చర్మము కోసి ఇచ్చెను. వేరొకడు వెన్నెముక తీసి ఇచ్చెను. ఇంకొకడు ప్రాణములే ఇచ్చెను. వీరిలో ఒక్కరైనా, వాటిని తాము బ్రతుకలేక ఇచ్చారో, కీర్తి కోసం ఇచ్చారో గ్రహించు, ఓ రాయన మంత్రి!
*✍🏼 నేటి కథ ✍🏼*
*నోటిలో కొంగ*
బ్రాహ్మణుడొకడు ఒకనాడు ఒక పొలంగుండా నడుస్తూ ఇంటికి పోతున్నాడు. దారిలో అకస్మాత్తుగా అతనికి ఒక దగ్గు పొర వచ్చింది. దగ్గీ, దగ్గీ చివరికతను గట్టిగా నేలమీద ఉమ్మాడు. అయితే చూడగా, అతను ఉమ్మిన కళ్లెలో తెల్లటి ఈక ముక్క ఒకటి కనబడింది! అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు అతనికి.
ఇంకొంత సేపట్లో అతనికి ఇక కంగారు మొదలైంది. తను కొంగ ఈకను ఉమ్మాడన్న సంగతి అతని ఆలోచనను వదలకుండా వెంటబడింది. త్వరలో అది ఇక భరింపరానంత స్థాయికి చేరుకున్నది!
ఇంటికి చేరుకోగానే అతను భార్యను పిలిచి, "నన్ను ఒక సంగతి చాలా బాధిస్తున్నది. దాన్ని నేను ఎవరికో ఒకరికి చెప్పుకోవలసిందే- లేకపోతే నా తల పగిలిపోతుంది. నీకు నేను ఆ సంగతి చెప్తాను- అయితే దాన్ని ఇక వేరే ఎవ్వరికీ చెప్పనని ముందుగా మాట ఇస్తావా?" అని అడిగాడు.
"ఓ! నిర్భయంగా చెప్పు. నేను ఒక్క చీమకు కూడా తెలీనివ్వనని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను" అన్నది భార్య. అప్పుడతను నిశ్చింతగా, తన ఉమ్మిలో కనబడ్డ తెల్లటి ఈక గురించి చెప్పాడు భార్యకు. అయితే, భార్య మాటైతే ఇచ్చింది కానీ, ఇంత పెద్ద విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాయటం ఆమె వల్ల కాలేదు. ఆమె ఆలోచనల నిండా తెల్లటి ఈకలే మరి!
అందుకని, పొరుగింటి సుబ్బమ్మ కనబడగానే బ్రాహ్మణుడి భార్య ఆమెకు దగ్గరగా వెళ్లి- "నా మనసంతా ఒక రహస్యంతో నిండి పోయి ఉంది. నేను ఆగలేక పోతున్నాను. నీకు ఆ రహస్యం చెప్పేస్తాను- అయితే ముందు నాకు ఓ మాట ఇస్తావా? దాన్ని నువ్వు వేరే ఎవ్వరికీ చెప్పకూడదు- ఎవ్వరికీ తెలీనివ్వనని నేను మా వారికి మాట ఇచ్చాను, మరి!" అన్నది.
పొరుగింటి సుబ్బమ్మ ఒప్పుకున్నది. "నెను రహస్యాల్ని ఎంత చక్కగా కాపాడతానో నీకు తెలీదా? నేను చీమక్కూడా తెలీనివ్వను- చెప్పు!" అన్నదామె ఉత్సాహంగా.
"ఎవ్వరికీ చెప్పవు కదా?"
"నీకంత అపనమ్మకమైతే చెప్పకు. నేనెన్నడైనా నీ రహస్యాన్ని ఇతరులకు చెప్పానా?"
"సరే, సరే. చెప్పేస్తాను నీకు. నువ్వు మంచి స్నేహితురాలివని నాకు తెలుసు. నువ్వెవ్వరికీ చెప్పవు. మా ఆయన ఇంటికి వస్తూ పొలాన్ని దాటుతుండగా ఏమైందో తెలుసా? ఆయన ఏమి ఉమ్మేశాడో తెలుసా? ఆయన.. ఆయన ఉమ్మి నిండా కొంగ ఈకలు! ఎన్ని ఈకలో! ఆయనకు ఏమౌతోందో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం చాలా భయం వేస్తున్నది!"
"అయ్యో నువ్వేమీ ఆందోళన పడకు. ఒక్కోసారి అలాంటివి జరుగుతూనే ఉంటాయి. మళ్లీ అన్నీ సర్దుకుంటాయి. కానీ, దాన్ని గురించి ఎవ్వరికీ తెలీకపోవడమే మంచిది. ఊరికే అందరూ పుకార్లు రేపుతారు, లేకుంటే".
కానీ ఆ రహస్యాన్ని ఐదు నిమిషాలపాటు దాచుకోవటం కూడా ఆమె వల్ల కాలేదు. అది ఆమెలోంచి తన్నుకొని బయటికి వచ్చేస్తున్నట్లు అనిపించిందామెకు. హడావిడిగా ఆమె ఇంకా ఇంటికి పరిగెత్తుతూ ఉండగానే 'తనకిప్పుడు ఎవరు కనబడతారో, వాళ్లకి ఈ రహస్యం చెప్తే ఎలా స్పందిస్తారో' అన్న ఊహ ఆమెను తబ్బిబ్బు పరిచింది. ఆమెకో మిత్రురాలు కనబడగానే ఆమె ఇక ఆపుకోలేక బయటికి కక్కేసింది.
"ఎవ్వరికీ చెప్పనని మాట ఇవ్వు ! నేను ఆమె రహస్యాన్ని కాపాడతానని బ్రహ్మణుడి భార్యతో ప్రమాణం చేశాను. ఇవ్వాళ ఏం జరిగిందో తెలుసా? పూజారిగారు పొలంలోంచి పోతూ పూర్తి కొంగనొకదాన్ని కక్కుకున్నారట! బ్రాహ్మణులు శాకాహారులేనని నేను అనుకునేదాన్ని. కానీ మనకేం తెలుసు, నిజానికి?" అన్నదామె. "పూర్తి కొంగనా? అంత పెద్ద పక్షి! ఎలా కక్కుకున్నాడబ్బా!? వింత మనిషే! కానీ- నేను ఎవ్వరికీ తెలీనివ్వనులే., నన్ను నమ్ము."
ఎంతో సేపు కాలేదు, వేరే ఒకాయనకు ఎవరో చెప్పగా తెలిసింది- పండితుడి నోట్లోంచి రెక్కలల్లార్చుకుంటూ అనేక కొంగలు వెలువడ్డాయని!
ఇక ఆరోజు సాయంత్రానికల్లా పట్టణమంతా తెల్సిపోయింది అందరికీ- పండితుడి నోట్లోంచి కొంగల గుంపులూ, బాతుల మందలూ, ఇంకా రకరకాల పెద్దపెద్ద పక్షులన్నీ ఎగురుకుంటూ బయటికి వస్తున్నాయని! చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా ఆ సంగతి ప్రచారమైంది- దాంతో గ్రామాలకు గ్రామాలే ఎద్దుల బండ్లు వేసుకొని ఈ భయంకర ఘటనను చూసేందుకు పండితుడుండే ఊరికి తరలి వచ్చాయి. ఇదేదో నిజంగా అద్భుతం గదా, మరి? - రకరకాల పక్షులు, అన్ని రంగులవీ, అన్ని సైజులవీ,- కొన్ని సుదూర పక్షులు కూడా- పండితుడి నోట్లోంచి ఊడిపడి, ఆకాశాన్ని కప్పేస్తున్నాయట!
బ్రాహ్మణుడికి పిచ్చెక్కినట్లయింది. అతను అందరి నుండీ పారిపోయి కొండమీద, ఓ చెట్టు తొర్రలో దాక్కున్నాడు. ఈ పుకారు పూర్తిగా సద్దుమణిగి, ఇంకోటి తలెత్తేంత వరకూ బయట తిరిగే సాహసం చెయ్యలేదు!
ఈ రోజు జికె
1)👉 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లలో అత్యధిక సెంచరీలు సాధించిన భారతీయ క్రికెటర్ ఎవరు?
A: *రోహిత్ శర్మ*
2)👉ఇటీవల వార్తల్లోకి వచ్చిన బనస్ నది ఏ నదికి ఉపనది?
A: *చంబల్ నదికి*
3)👉 ప్రధాన మంత్రి మోడీచే ఆగ్నేయాషియా దేశాల గేట్ వే గా అభివర్ణించబడి రాష్ట్రం ఏది?
A: *మిజోరాం*
4)👉 దేశంలో ఉత్తమ గ్రామ పంచయితీలుగా తొలి రెండు స్థానాలలో నిలిచిన పంచాయితీలు ఏవి?
A: *తెల్లాపూర్(తెలంగాణ), పరపట్ల(AP)*
5)👉 ఇటీవల ప్రకటించిన సాహిత్య అకాడెమీ అవార్డులు-2017 లో దేవిప్రియ(ఖ్వాజా హుస్సేన్) రచించిన ఏ కవితా సంకలనానికి తెలుగు భాష తరుపున పురస్కారం లభించింది?
A: *గాలిరంగు*
*తెలంగాణ న్యూస్*
*🌷ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు*
హైదరాబాద్: *రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం కోసం వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.*
*మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి.*
*మే 9న ఈసెట్*
*మే 17న ఐసెట్*
*మే 20న పీఈసెట్*
*మే 25న లాసెట్*
*మే 25న పీజీఈసెట్*
*మే 26న పీజీ లాసెట్*
*మే 31న ఎడ్సెట్ నిర్వహించనున్నారు.*
*ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యత జేఎన్టీయూహెచ్కు అప్పగించారు.*
*లాసెట్, పీజీలాసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ను ఓయూ నిర్వహించనుంది.*
*ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ యూనివర్సిటీకి అప్పగించారు.*
*పీజీసెట్ నిర్వహణ బాధ్యత మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అప్పగించారు.*
*🖊📝తెలుగు పెడగాగి🖊📝*
1)ఆంధ్ర పంచ కావ్యాలలో ఒకటిగా పేరెన్నిక గన్నది?
జ.పాండు రంగ మహత్యం
2)పూర్వ పదార్థము ప్రధానంగా కలది
జ.అవ్యాయీ భావ సమాసం
3)" పుడమి శునకము మీద బొలయు నెం డోకటే " ఈ వాక్యంలో " ఒకటే " అనునది దీనిని తెలియజేస్తుంది.
జ.నిష్చయార్థకం
4)" పుండరీకము " పదం యొక్క నానార్థములు
జ.తెల్ల తామర , పులి
5)ప్రాచీన కావ్య భాష కు ఈ నాటికీ ప్రమాణంగా భావించే వ్యాకరణ గ్రంథం
జ.బాల వ్యారణం
6)" ఒక విద్య యందు పూర్తి ప్రజ్ఞ వుండుట " అనే అర్థానిచ్చే జాతీయం
జ.అందే వేసిన చేయి
7)" చేయెత్తి జై కొట్టు తెలుగోడా " గేయ రచయిత
జ.వేముల పల్లి కృష్ణ
8)ప్రతి పాదం లో " మ,స,జ,స,త,త,గ " అనే గణములు గల వృత్తము
జ.శార్దూలము
9)" ప్రత్యేకము " పదమును విడదీసి వ్రాయగా
జ.ప్రతి+ ఏకము
10)" సమరోత్సాహము " పదం లోని సమాసం
జ.సప్తమి తత్పురుష
11)" ఐ,ఔ,అర్ " లను ఏమంటారు
జ.వృద్దులు
12)క్రింది వానిలో దంత్యములు
జ.త, థ,ద, ధ,న
13)" కవి సార్వభౌమ " అనే బిరుదు గల కవీంద్రుడు
జ.శ్రీ నాథుడు
14)పురుషులను ,వాని విశేషణములను తెలుపు పదములు
జ.మహద్వాచకములు
15)కృత్యధార భోధన వల్ల ప్రయోజనం
జ.ప్రత్యక్షానుభవం కలుగుతుంది
16)ఈ భోధన వల్ల విద్యార్థుల్లో సాహిత్య అభిరుచి కలుగుతుంది
జ.పద్య భోధన
17)విద్యార్థుల్లో లిఖిత రచనాశక్తి ని పెంపొందించు నది
జ.పత్రికా నిర్వహణ
18)పఠన ము నేర్పించుటకు శ్రేష్ఠ మైన పద్దతి
జ.పద పద్దతి
19)నిర్దిష్టమైన భాషణమునకు మూలం
జ.శ్రవణం
20)వాస్తవ జీవనం తో బడి జీవితాన్ని మేళవింప చేయునవి
జ.క్షేత్ర పర్యటనలు
December 29 is the 363rd day of the year (364th in leap years) in the Gregorian calendar. There are two days remaining until the end of the year. This date is slightly more likely to fall on a Tuesday, Thursday or Saturday (58 in 400 years each) than on Sunday or Monday (57), and slightly less likely to occur on a Wednesday or Friday (56).
Events
875 - Charles the Bald, King of the Franks, is crowned as Holy Roman Emperor Charles II.
1170 - Thomas Becket, Archbishop of Canterbury, is assassinated inside Canterbury Cathedral by followers of King Henry II; he subsequently becomes a saint and martyr in the Anglican Communion and the Catholic Church.
1427 - The Ming army begins its withdraw from Hanoi, ending the Chinese domination of Đại Việt.
1503 - The Battle of Garigliano (1503) was fought between a Spanish army under Gonzalo Fernández de Córdoba and a French army commanded by Ludovico II, Marquess of Saluzzo
1508 - Portuguese forces under the command of Francisco de Almeida attack Khambhat at the Battle of Dabul.
1778 - American Revolutionary War: Three thousand British soldiers under the command of Lieutenant Colonel Archibald Campbell capture Savannah, Georgia.
1812 - The USS Constitution under the command of Captain William Bainbridge, captures the HMS Java off the coast of Brazil after a three-hour battle.
1835 - The Treaty of New Echota is signed, ceding all the lands of the Cherokee east of the Mississippi River to the United States.
1845 - In accordance with International Boundary delimitation, the United States annexes the Republic of Texas, following the manifest destiny doctrine. The Republic of Texas, which had been independent since the Texas Revolution of 1836, is thereupon admitted as the 28th U.S. state.
1851 - The first American YMCA opens in Boston, Massachusetts.
1860 - The launch of HMS Warrior, with her combination of screw propeller, iron hull and iron armour, renders all previous warships obsolete.
1874 - The military coup of Gen. Martinez Campos in Sagunto ends the failed First Spanish Republic and the monarchy is restored as Prince Alfonso is proclaimed King of Spain.
1876 - The Ashtabula River railroad disaster occurs, leaving 64 injured and 92 dead at Ashtabula, Ohio.
1890 - Wounded Knee Massacre on Pine Ridge Indian Reservation, 300 Lakota killed by the United States 7th Cavalry Regiment.
1911 - Mongolia gains independence from the Qing dynasty, enthroning 9th Jebtsundamba Khutughtu as Khagan of Mongolia.
1911 - Sun Yat-sen becomes the provisional President of the Republic of China; he formally takes office on January 1, 1912.
1916 - A Portrait of the Artist as a Young Man, the first novel by James Joyce, was first published as a book by an American publishing house B. W. Huebschis after it had been serialized in The Egoist (1914-15).
1930 - Sir Muhammad Iqbal's presidential address in Allahabad introduces the two-nation theory and outlines a vision for the creation of Pakistan.
1934 - Japan renounces the Washington Naval Treaty of 1922 and the London Naval Treaty of 1930.
1937 - The Irish Free State is replaced by a new state called Ireland with the adoption of a new constitution.
1940 - World War II: In the Second Great Fire of London, the Luftwaffe fire-bombs London, England, killing almost 200 civilians.
1949 - KC2XAK of Bridgeport, Connecticut becomes the first Ultra high frequency (UHF) television station to operate a daily schedule.
1972 - Eastern Air Lines Flight 401 (a Lockheed L-1011 TriStar) crashes in the Florida Everglades on approach to Miami International Airport, Florida, killing 101 of the 176 people onboard.
1975 - A bomb explodes at LaGuardia Airport in New York City, killing 11 people and injuring 74.
1989 - Czech writer, philosopher and dissident Václav Havel is elected the first post-communist President of Czechoslovakia.
1992 - Fernando Collor de Mello, president of Brazil, tries to resign amidst corruption charges, but is then impeached.
1996 - Guatemala and leaders of Guatemalan National Revolutionary Unity sign a peace accord ending a 36-ye
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏
*🔹సుభాషిత వాక్కు*
*"జీవితానికి చేటు తెచ్చేవి నాలుగు!*
*" నేను -నాది" "నీవు -నీది"*
*వీటిని మరచిపోవాలి.*
*"The mind is a powerful force.*
_It can enslave us or empower us. It can plunge us into the depths of misery or take us to the heights of ecstasy_.
*Learn to use the power wisely.*
*♦మంచి పద్యం*
*ఆలికన్న అమ్మ అపురూపమైనది*
*అవని కన్న మిన్న అమ్మ ప్రేమ*
*అమ్మ పేరుకన్న అమృతము లేదురా*
*వాస్తవంబు వేమువారి మాట*
*❗భావం:-*
*భార్య కన్న మాతృమూర్తి అపురూపమైనది. అమ్మ ప్రేమకు అంతము లేదు. అమ్మ పేరుకన్నా అమృతము మరొకటి లేదు.*
*♦నేటి జీ కె*♦
*ఖండాలు ఎత్తైన శిఖరాలు*
*ఆసియా -- ఎవరెస్ట్*
*ఆఫ్రికా -- కిలిమంజారో*
*ఉత్తర అమెరికా — మెకిన్లి*
*దక్షిణ అమెరికా — అకన్ కాగ్వా*
*ఆస్ట్రేలియా — కోషియాష్కో*
*ఐరోపా — ఎల్ బ్రజ్*
*అంటార్కిటికా — విన్సన్ మాసిఫ్*
*📚✍హడావుడి చేశారు చల్లగా జారుకున్న అధికారులు*
*28 December 2017, 11:10 pm*
*💥ప్రజాశక్తి - అవనిగడ్డ*
🌻గత రెండు రోజుల నుంచి అవనిగడ్డ ప్రగతి విద్యాసంస్థలపై ఐటి శాఖ దాడులతో దివిసీమలో ఉత్కంఠత రేపిన అధికారులు గురువారం తెల్లవారు జామున గుట్టుచప్పుడు కాకుండా చల్లగా జారుకున్నారు. బుధవారం ఉదయం 10గంటల నుంచి ప్రగతి విద్యాసంస్థల కార్యాలయం, సంస్థ డైరెక్టర్ సనకా పూర్ణచంద్రరావు ఇంటిపై దాడులు నిర్వహించారు. అవి రెండు రోజులపాటు రాత్రింబవళ్ళు కొనసాగగా మీడియానుమాత్రం పరిసరాలకు కూడా రానివ్వలేదు.
🌻ఎంతో ఉత్కంఠత రేపిన ఈ సంఘటన దివిసీమకు మొట్టమొదటి సంఘటన కావడంతో ప్రజలంతా ఏం జరుగుతుందోననే ఆసక్తితో ఎదురుచూశారు. ఈ దాడుల నేపథ్యంలో విద్యార్థులు మూడు పూటల క్లాసులు కోల్పోయారు.
🌻ఈ దాడులుపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఐటి అధికారులను కలిసి వివరాలు సేకరించే ప్రయత్నంచేసినప్పటికీ అవి నెరవేరకపోగా తాము ఎటువంటి వివరాలు వెల్లడించే అధికారంలేదని, తమ సంస్థ డైరెక్టర్ మాత్రమే ఈ వివరాలు వెల్లడిస్తారని అధికారులు చెప్పారు. అయినప్పటికీ సమాచారంకోసం వేచిచూసిన మీడియా ప్రతినిధులకు నిరాశే మిగిలింది. అయితే ఇంతకీ ఐటి అధికారులు దాడులుచేసి ఏం సాధించారనేది వేల మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న.
🌻 ఇది కేవలం తమకు ముడుపులు ముట్టచెప్పలేదనే అక్కసుతో అధికారపార్టీలో ఉన్న కొందరు నాయకులు దాడులు చేయించారని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు కాసులకోసమే దాడులుచేశారు తప్ప ఇది మరొకటి కాదంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
🌻గతంలో కూడా రెండుసార్లు ఈ సంస్థపై దాడులుచేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈసారిమాత్రం పెద్ద ఎత్తున సిబ్బంది వచ్చి రెండు రోజులపాటు దాడులపేరుతో హడావుడిచేసి కొండను తవ్వి కనీసం ఎలుకనైనా పట్టారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. కేవలం అభివృద్ధి చెందుతున్న విద్యాసంస్థను అప్రతిష్టపాలుజేయటానికే ఇదంతా జరుగుతుందనే చర్చకూడా కొనసాగుతోంది. లేకపోతే ఐటి అధికారులు రెండు రోజులపాటు నిర్వహించిన దాడుల్లో వారి దృష్టికి వచ్చిన లోపాలను వెల్లడించకపోవడమే ఈ అనుమానాలకు కారణంగా చెప్పుకోవచ్చు.
🌻కాగాసంస్థ నిర్వాహకుల నుంచి దాడులకు సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించకపోగా తెల్లవారు జామున 4గంటలకు అధికారులు, సిబ్బంది అవనిగడ్డ నుంచి వెళ్ళిపోవటంతో ఇంకా దీనిపై ప్రజల్లో మాత్రం అనేక అనుమానాలు, అపోహలు కొనసాగుతూనే ఉన్నాయి.
*♦-ముడుపులకోసమే దాడులు చేయించారా?*
🌻25 సంవత్సరాల క్రితం అవనిగడ్డలో ప్రగతి ట్యుటోరియల్ పేరుతో ప్రారంభమైన ప్రగతి విద్యాసంస్థలు దినదినప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి ప్రధాన శిక్షణా సంస్థగా వెలుగొందుతోంది. ఇది కార్పొరేట్ సంస్థగా కాకుండా ఒక సామాన్యమైన విద్యాసంస్థగానే కొనసాగుతూ ఇప్పటివరకు వేలాది మంది ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేందుకు శిక్షణ ఇచ్చి వారి జీవితాలకు భరోసా ఇచ్చిన సంస్థగా ఉభయ రాష్ట్రాల్లో పేరుప్రఖ్యాతలు గడించింది.
🌻 ప్రగతి విద్యాసంస్థల వల్ల దివిసీమకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. విద్యారంగంలో అవనిగడ్డ ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రగతి విద్యాసంస్థలకు ప్రభుత్వాలు డిఎస్సీ ప్రకటించినప్పుడల్లా రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు అవనిగడ్డకు వచ్చి అరకొర సౌకర్యాలతోనే శిక్షణ పొంది ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే సంకల్పంతో ఇక్కడ శిక్షణ పొందితే తప్పకుండా ఉద్యోగం వస్తుందనే నమ్మకం కూడా ఈ ప్రాంతానికి రావటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇతర ఉద్యోగాల్లో రిక్రూట్‌మెంట్ పడిపోవడంతో పాటు ఇంటర్వ్యూల్లో అవినీతికి ఎక్కువ తావుండే ఉద్యోగాలలో సామాన్యులు అటువైపు ఆసక్తిచూపక కేవలం ప్రతిభపైనే ఆధారపడి మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం సంపాదించొచ్చుననే ఆశతో ఉపాధ్యాయ వృత్తివైపు యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
🌻 వేలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణకు తరలివచ్చి తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. వారికి ఉత్తమ శిక్షణ ఇచ్చే కేంద్రంగా అవనిగడ్డ ప్రగతి కనబడటంతో ఎక్కువ మంది అందులో చెరేందుకే ఆసక్తిచూపుతున్నారు. దీంతో రెండు ప్రభుత్వాలు ఒకేసారి డిఎస్సి, టెట్ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలచేయటంతో ఒక్కసారిగా వేలాది మంది ఎన్నడూలేని విధంగా అవనిగడ్డకు తరలివచ్చారు. కొందరు అధికార పార్టీ నాయకుల దృష్టికూడా ప్రగతిపై పడినట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో ముడుపులు కోరినట్లు కూడా సమాచారం.
🌻 ఇందుకు సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రరావు విముఖత చూపారని, అందువల్లే ఆయనను ఏదోరకంగా దెబ్బకొట్టాలనే సంకల్పంతో ఈ దాడులు చేయించారంటూ బాహాటంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యారంగాన్ని తిమింగలాల్లా మింగేస్తూ వేలాది మంది తల్లిదండ్రుల రక్తాన్ని, చెమటను ఫీజుల రూపంలో పిండుకుంటున్నా, ఆ విద్యాసంస్థల్లో విద్యార్థులపై కొనసాగిస్తున్న అణచివేతకు తట్టుకోలేక విద్యార్థులు సీరియల్‌గా ఆత్మహత్యలు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి.
🌻 జీవితంపై ఆశతో ఇక్కడ శిక్షణ పొందితే ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో సామాన్యమైన ఫీజులతో వేలాది మందికి శిక్షణ ఇస్తున్న విద్యాసంస్థపై దాడులకు పూనుకోవడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను తమ సంస్థల్లో చేర్చుకునేందుకు కల్లబొల్లి కబుర్లుచెప్పి తల్లిదండ్రులను మభ్యపెట్టి సంస్థల్లో చేర్చుకునేందుకు తీసుకువెళతారని, కానీ ప్రగతి విద్యాసంస్థ మాత్రం శిక్షణ ప్రారంభ తేదీని మాత్రమే ప్రకటించగానే వేలాదిమంది విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
🌻 సీట్లులేవు, ఖాళీలేవని సంస్థ ప్రతినిధులు మొత్తుకున్నా వినకుండా తాము ఇక్కడే ఉండి శిక్షణ పొందుతామంటూ బీష్మించుకుని కూర్చునే వందలాది మంది అభ్యర్థులు ఇక్కడ కనిపిస్తారు. ఈ స్థాయిలో అభ్యర్థులు అవనిగడ్డ ప్రాంతానికి శిక్షణ కోసం వస్తే గ్రామంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలు తక్కువగా ఉండగా ప్రభుత్వం పూనుకుని ప్రత్యేక దృష్టిసారించి వేలాది మంది అభ్యర్థులకు శానిటేషన్, డ్రెయినేజీ సమస్య లేకుండా చేయటంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
🌻దానిపై ఏమాత్రం ప్రభుత్వం, అధికారులు దృష్టిసారించిన పరిస్థితి కనిపించదు. తమకు శక్తిలేదు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి కూడా చేయూతనిచ్చి శిక్షణ ఇస్తున్న సంస్థగా గుర్తింపు పొందగా దిక్కులేనివారిని సైతం చేరదీసి వారి జీవితాలకు భరోసా ఇస్తున్న సంస్థగా కూడా ప్రగతి విద్యాసంస్థలు దివిసీమలో గుర్తింపు పొందుతున్నాయి. అలాంటి విద్యాసంస్థలపై ఐటి అధికారులు దాడులపేరుతో కలకలంసృష్టించటం దివిసీమలో సంచలనంగానే మిగిలిపోయింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*✍కరంట్ అఫైర్స్...*
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనీసా సయ్యద్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది.25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో అనీసా (హరియాణా) 33 పాయింట్లతో జాతీయ రికార్డును తిరగరాయడంతో పాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. శీతల్ శివాజీ థోరాట్, రాహీ సర్ణోబత్‌లు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 33 పాయింట్లతో అనీసా జాతీయ రికార్డు
ఎక్కడ : తిరువనంతపురం, కేరళ
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
సంప్రదాయ టెస్టుకు కాస్త భిన్ననంగా నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, జింబాబ్వేల మధ్య జరిగింది.దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ వేదికగా డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ డే అండ్ నైట్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. బలమైన దక్షిణాఫ్రికా చేతిలో ఇన్నింగ్‌స, 120 పరుగులతో జింబాబ్వే ఓడిపోయింది.
1972-73 తర్వాత ఐదు రోజులు కాకుండా ఒక టెస్టు నాలుగు రోజుల్లో జరగనుండటం ఇదే తొలిసారి. అంతకంటే ముందు ఆరు రోజులు, కొన్ని సార్లయితే మూడు నుంచి పది రోజుల టెస్టులు కూడా జరిగాయి. 1938-39లో చివరిసారిగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య డర్బన్‌లో జరిగిన పది రోజుల టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 1972 సీజన్ తర్వాత టెస్టు ప్రామాణికంగా ఐదు రోజుల ఆటైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంప్రదాయ టెస్ట్‌కు భిన్నంగా నాలుగు రోజుల డే అండ్ నైట్ టెస్ట్
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : దక్షిణాఫ్రికా - జింబాబ్వే
ఎక్కడ : పోర్ట్ ఎలిజబెత్, దక్షిణాఫ్రికా ఎందుకు : టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు.ప్రస్తుత డీజీపీ సాంబశివరావు డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాలకొండయ్య 2018 జనవరి 1వ తేదీన డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మాలకొండయ్య
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ చోటు దక్కించుకున్నారు.విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు బెటర్ ఇండియా ఏటా టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాను విడుదల చేస్తుంది. తాజా జాబితాలో తొలి, రెండు స్థానాల్లో మనీశ్‌శంకర్ శర్మ, ఆర్.శ్రీలేఖ ఉండగా.. మూడో స్థానంలో మహేశ్ భగవత్ ఉన్నారు.
అక్రమ రవాణా బారి నుంచి చాలామంది మహిళలు, పిల్లలను రక్షించినందుకు మహేశ్ భగవత్‌కు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ట్రాఫికింగ్ ఇన్ పర్సన్‌స రిపోర్ట్ హీరోస్ అవార్డు-2017ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెటర్ ఇండియా టాప్-10 ఐపీఎస్ ఆఫీసర్స్
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మూడో స్థానంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు.వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితమిచ్చారు. దీంతోపాటు రియల్‌టైమ్‌లో పరిపాలనను పర్యవేక్షించే డ్రోన్లు, సీసీటీవీ సర్వెయలెన్‌స ప్రాజెక్టుతోపాటు మారుమూల ప్రాంతాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ఎఫ్‌ఎస్‌ఓసీ ప్రాజెక్టును సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు ద్వారా పౌర జీవనం నాణ్యంగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పించేందుకు
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ (52) డిసెంబర్ 27న ప్రమాణస్వీకారం చేశారు.షిమ్లాలోని రిడ్‌జ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సీఎంతోపాటుగా మరో 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్‌కే అడ్వాణీతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గానూ బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జైరామ్ ఠాకూర్
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది.మొబైల్ ద్వారా కొత్తగా ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచేవారిని ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరుతోంది. ‘ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వండి’ అని ఫేస్‌బుక్‌లో ఓ ప్రాంప్ట్ వస్తోంది. దీంతోపాటు ‘మీ పేరేంటి? ఆధార్ కార్డులోని అసలు పేరు ఇవ్వడం ద్వారా స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలరు. నకిలీల బెడద తగ్గుతుంది’ అన్న సందేశం తెరపై ప్రత్యక్షమవుతోంది. రెడిట్, ట్వీటర్ వాడుతున్న కొందరు యూజర్లు దీన్ని గుర్తించారు. అయితే.. వినియోగదారులు ఆధార్‌లోని తమ పేర్లను ఇవ్వాలన్నది ఐచ్ఛికమే. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం మణిపూర్‌కు తరలిపోయింది. కోల్‌కతాలో డిసెంబర్ 27న సమావేశమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు ఏడు విశ్వవిద్యాలయాలు సమావేశాల నిర్వహణకు పోటీ పడ్డాయి. చివరికి మణిపూర్ విశ్వవిద్యాలయానికి ఈ అవకాశం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా తాము ఈ సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపినప్పటికీ, అందుకు అసోసియేషన్ తిరస్కరించింది. 105వ ఇంటర్నేషనల్ సైన్‌స కాంగ్రెస్ 2018 మార్చి 18 నుంచి 22 వరకు ఇంఫాల్‌లోని మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది.
ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం 2017 జనవరి మూడు నుంచి ఏడు వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ సైన్‌స కాంగ్రెస్ జరగాల్సి ఉంది. అయితే.. భద్రతా కారణాలతో సదస్సు నిర్వహణ బాధ్యతల నుంచి ఉస్మానియా తప్పుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
ఎప్పుడు : 2018, మార్చి 18 - 22
ఎక్కడ : మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంఫాల్
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ)’ శతాబ్ది ఉత్సవాల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు.గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబు, బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనిస్, ఐఈఏ కాన్ఫరెన్‌స అధ్యక్షుడు, సి.రంగరాజన్, భారత 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ అసోషియేషన్ అధ్యక్షుడు కౌశిక్ బసు, ఐఈఏ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ థోరట్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. 'ట్రాకింగ్ ది ఇండియన్ ఎకానమీ' పేరుతో డాక్టర్ సి. రంగరాజన్ రచించిన పుస్తక తొలి కాపీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాలు

ఎక్కడ : బైబిల్ మిషన్ ప్రాంగణం, ఏఎన్‌యూ
🍃🌷🤗🌷🍃
I once asked a very successful woman to share her secret with me. She smiled and said to me.. "I started succeeding when I started leaving small fights for small fighters. I stopped fighting those who gossiped about me...I stopped fighting for a cheating partner...I stopped fighting for attention...I stopped fighting to meet public expectation of me...I left such fights for those who have nothing else to fight...And I started fighting for my vision, my dreams, my ideas and my destiny. The day I gave up on small fights is the day I started becoming successful."
Some fights are not worth your time.
Choose what you fight for wisely.
Let's be wise and let's pick our battles
Slang of the Day
*💥24/7*
✍🏾Definition :
All the time; always available; without a break
🔺Example
1) In New York City, a lot of stores are open 24/7.
2) I had to move because my neighbors played loud dance music 24/7.
📌Etymology
Some convenience stores are open 24 hours a day, 7 days a week. The phrase is used for anything that is always (or nearly always) available.
➰Synonyms
around the clock
━━━━━━━━━━━
#Slang_of_the_day
*Idiom of the Day*
💥to beat a dead horse.
✍🏾Definition:
to keep on doing something after there is no point in doing so
❗️Examples:
🔺You're just beating a dead horse. He's never going to change his mind.
🔺I finally realized that I was beating a dead horse. Nothing I could say was going to make any difference.
🔺Relying on new or existing manufacturing jobs to save the day down the road isn't just beating a dead horse, it's laying down beside it.
🔺I also think that we may have reached the point of beating a dead horse ... so with thanks and love to all, I now respectfully close this thread.
📝Explanation:
The word beat in this idiom means hit. An alternative expression is to flog a dead horse. (Hitting a dead horse is not going to make it move!)
━━━━━━━━━
#Idiom_of_the_Day
*Phrasal Verb of the Day*
💥drive away
Meaning:
✍🏾to cause someone or something to leave a place
〰For example:
🔴drive sb/sth away
🔺The government's strict new laws on currency trading will drive foreign investors away.
⚫️drive away sb/sth
▪️The farmers are using automatic air guns to drive away the birds.
━━━━━━━━━━━
#Phrasal_Verb_of_the_Day

No comments:
Post a Comment