AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday 21 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 22


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 22🌎* 
                                                           *◼నవంబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 326వ రోజు (లీపు సంవత్సరములో 327వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 39 రోజులు మిగిలినవి.*◼

    *⏱సంఘటనలు*⏱ 

*♦1956: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్లో ప్రారంభమయ్యాయి*

*♦1965: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.డి.పి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం - ఐక్యరాజ్యసమితి ఆభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైనది.*

*♦1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.*

*♦1980: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరించాడు.*

*♦1988: బాబా ఆమ్టేకు ఐరాస మానవహక్కుల సంఘం పురస్కారం లభించింది.*

*♦1997: హైదరాబాదులో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు*.

    *❤జననాలు ❤*

*🔥1830: ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి. (మ.1858)*

*🔥1907: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (మ.1997)*

*🔥1913: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (మ.1988)*

*🔥1933: నీరుకొండ హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన కవి. (మ.2016)*

*🔥1967: బోరిస్ బెకర్, జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు.*

*🔥1970: మర్వన్ ఆటపట్టు, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్.*

          *🍃మరణాలు*🍃 

*🌷1963: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (జ.1917)*

*🌷2006: అసీమా చటర్జీ, ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (జ.1917)*

*🌷2016: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ప్రముఖ వాగ్గేయకారుడు. (జ.1930)*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

   *🔥సుభాషిత వాక్కు*🔥

*"దారిలో నది అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి ,  చేసే పనిలో అడ్డంకులొస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం."*

*A True Feeling is one when*
 *We Smile with Tears in Eyes &*
*Pain in Hear *
*When our  Loved One Tells us Sorry After Hurting us......*
*That's A Wonderful Feeling!*

  *♦మంచి పద్యం*
   
*సజ్జనులగు వారి సంఖ్య తక్కువగుచు*
*చెడ్డవారి సంఖ్య చెదల వలెను*
*మంచి వినుటలేదు మహినందు జనములు*
*వాస్తవంబు వేమువారి మాట*

*భావం*:-

*నేడు లోకంలో మంచిమాట వినని వారి సంఖ్య చెద పురుగుల వలె లెక్కకు మించి ఉండగా, సజ్జనుల సంఖ్య స్వల్పముగా ఉన్నది*

  *🔹నేటి జీ.కె*

*భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 29*

* *కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7*.*

*ఉత్తరాంచల్(27వది),జార్ఖండ్(28వది),(2000 నవంబరు నెల),తెలంగాణ (29వది)(2014, జూన్ 2న)*
*కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు*

*1. చండీగఢ్ - చండీగఢ్*

*2. ఢిల్లీ - ఢిల్లీ*

*3.పాండిచ్చేరి - పాండిచ్చేరి*

*4. దాద్రానగర్‌హవేలి - సిల్వస్సా* 

*5. లక్షదీవులు - కవరత*్తి 

*6. అండమాన్ నికోబార్ దీవులు - పోర్ట్‌బ్లెయిర్*

*7. డయ్యూ, డామన్ - డామన్.*

ఈ రోజు జికె 

*1) సముద్ర తీరంలోని ఇసుక నుంచి ఏ ఖనిజాలు లభిస్తాయి?*

*జ: మోనోజైట్‌, ఇలిమినైట్‌, జిర్కాన్‌*

*2) భారతదేశంలో అత్యధికంగా చమురు లభిస్తున్న ప్రాంతం ఏది?*

*జ: బాంబే హై*

*3) విద్యుత్‌ ప్రవాహంలో ఎలాంటి నిరోధకతను చూపనిగుణాన్ని ఏమంటారు?*

*జ: సూపర్‌ కండక్టివిటి*

*4) సౌరశక్తిని కేంద్రీకరించి శక్తిని ఉత్పత్తి చేయడానికి వాడే దర్పణం ఏది?*

*జ: పుటాకార దర్పణం*

*5) పరావర్తన సూత్రం ఆధారంగా పనిచేసే పరికరాలేవి?జి సైదేశ్వర రావు*

*జ: పెరిస్కోప్‌, బైనాక్యులర్‌*

*6) బుల్లెట్‌ ప్రూఫ్‌ కవచాన్ని దేనితో తయారు చేస్తారు?*

*జ: జాకాల్‌ అనే మిశ్రమంతో*

*7) రాతికుష్టును కలిగించేది, తాజ్‌ మహల్‌ రంగు మారడానికి కారణ మయ్యేది, పేపర్‌, తోలును నష్ట పరిచే వాయువు?*

*జ: సల్ఫర్‌ డైఆక్సైడ్‌*

*8) సూపర్‌బగ్‌ అని ఏ బ్యాక్టీరియాను పిలుస్తారు (చమురు తెట్టలను విచ్ఛిన్నం చేస్తుంది)?*

*జ: సూడోమోనాస్‌ ప్యూటిడా*

*9) పవన విద్యుదుత్పత్తిలో అగ్రస్థానం లో ఉన్న రాష్ట్రం ఏది?*

*జ: తమిళనాడు*

*10) నీటిలోతును కొలవడానికిఉప యోగించే ప్రమాణం ఏది?*

*జ: ఫాథమ్‌*

No comments:

Post a Comment