AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday 21 November 2017

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2013

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2013
‘బీవో5’ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత్ జనవరి 27న విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ‘బీవో5’ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో ఇప్పటివరకు గగనతలం, భూతలం నుంచే అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న భారత్ ఇకపై సముద్ర గర్భం నుంచీ న్యూక్లియర్ మిస్సెళ్లను ఎక్కుపెట్టే సామర్థ్యాన్ని సమకూర్చుకున్నట్లెంది. జలాంతర్గామి(సబ్ మెరైన్) నుంచి ప్రయోగించేలా భారత్ పూర్తిస్థాయిలో అభివద్ధి చేసిన తొలి అంతర్‌జల అణ్వస్త్ర క్షిపణి ఇదే. 1,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌సహా అతికొద్ది దేశాలకు మాత్రమే జలాంతర్గాముల నుంచి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. తాజా విజయంతో భారత్ కూడా వాటి సరసన చేరింది. సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ (ఎస్‌ఎల్‌బీఎం) విభాగంలోకి వచ్చే ‘బీవో5’ను హైదరాబాద్‌లో డీఆర్‌డీఓకు చెందిన డీఆర్‌డీఎల్ (రక్షణ పరిశోధన, అభివద్ధి ప్రయోగశాల) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. తాజా పరీక్షతో ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’ అణ్వస్త్ర జలాంతర్గామితో సహా నావికాదళానికి చెందిన ఇతర వేదికల నుంచీ ప్రయోగించేందుకు ఈ క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైంది. 

హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు
హైదరాబాద్‌లో పదో బయో ఆసియా సదస్సు జనవరి 28 నుంచి 30 వరకు జరిగింది. ఇందులో 45 దేశాల నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ రంగంలో అత్యున్నత కషి చేసిన వారికి ఏటా ఇచ్చే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులను ఈ సారి కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.కె. భాన్, ఫైజర్ ఫార్మా కంపెనీకి చెందిన ఫ్రీడా లూయిస్‌లకు ప్రదానం చేశారు.

నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ సరయు
అతి పెద్ద గస్తీ నౌక ‘ఐఎన్‌ఎస్ సరయు’ను నౌకాదళంలో ఎయిర్ మార్షల్ పి.కె. రాయ్ గోవాలోని వాస్కోలో జనవరి 21న ప్రవేశ పెట్టారు. సరయును గోవా షిప్ యార్డ్ లిమిటెడ్(జీఎస్‌ఎల్) రూపొందించింది. 105 మీటర్ల పొడవున్న ఈ నౌక జీఎస్‌ఎల్ నిర్మిస్తున్న నాలుగు కొత్త తరహా నౌకల్లో ఒకటి. అత్యాధునిక నావిగేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలు ఇందులో ఉంటాయి.

పాలపుంతలో భూమి వంటి 1700 కోట్ల గ్రహాలు
పాలపుంత గెలాక్సీలో భూమి పరిమాణంలో ఉన్న గ్రహాలు దాదాపు 1700 కోట్ల వరకు ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తలు జనవరి 9న తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహాలను కనుగొన్నారు. పాలపుంత గెలాక్సీలో కనీసం 100 కోట్ల నక్షత్రాలు ఉన్నందు వల్ల 1700 కోట్ల వరకు గ్రహాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. పాలపుంతలోని నాలుగో వంతు నక్షత్రాలకు భూమి కంటే 1.25నుంచి 2 రెట్లు పెద్ద గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

విశ్వంలో అతిపెద్ద స్పెరల్ గెలాక్సీ గుర్తింపు
స్పెరల్ గెలాక్సీలో అతి పెద్దదైన ‘ఎన్‌జీసీ 6872’ అనే స్పెరల్ గెలాక్సీని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మనకు 21.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. 

‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
భారత నావికాదళం అమ్ములపొదిలోని బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని జనవరి 9న విజయవంతంగా పరీక్షించారు. విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ఈ పరీక్షను నిర్వహించారు. బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించడం ఇది 34వ సారి. తాజాగా పరీక్షించిన క్షిపణి 290 కి.మీ. శ్రేణికి చెందింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను భారత నేవీలో 2005లో ప్రవేశపెట్టారు. 

ఇంటర్‌నెట్‌: 30
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే కీలక సమాచార వ్యవస్థ ‘ఇంటర్‌నెట్’ ఆవిర్భవించి 2013, జనవరి 1 నాటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంటర్‌నెట్‌ను 1983, జనవరి 1న అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ సూట్ (ఐపీఎస్) సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ‘ఆర్పానెట్’ నెట్‌వర్క్ ప్రకారం ఇంటర్‌నెట్ 1983, జనవరి 1న అధికారికంగా ప్రారంభమైంది. కంప్యూటర్లను అనుసంధానం చేసే ‘ఆర్పానెట్’ అనే ఈ కొత్త పద్ధతే తర్వాత ‘వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)’ నాందికి మార్గం సుగమం చేసింది. తొలుత మిలటరీ అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా 1960లలో వేల్స్ శాస్త్రవేత్త డొనాల్డ్ డెవీస్ పలు నెట్‌వర్క్ డిజైన్లను రూపొందించారు. వీటి ఆధారంగానే తర్వాత ఆర్పానెట్‌కు రూపకల్పన జరిగింది. కొత్త ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ కోసం పాత వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా లోపరహిత ‘ఆర్పానెట్’ వ్యవస్థకు రూపకల్పన ప్రక్రియ 1983, జనవరి 1న పూర్తె ఇంటర్‌నెట్ ఆవిర్భవించింది. 

100వ సైన్స్ కాంగ్రెస్
100వ సైన్స్ కాంగ్రెస్‌ను కోల్‌కతాలో జనవరి 3న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ‘భారత్ భవిష్యత్ తీర్చిదిద్దేందుకు శాస్త్రం’ అనే ఇతివత్తంతో ఈ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘భారత శాస్త్ర సాంకేతిక నవకల్పన విధానం-2013’ ను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. 2020 నాటికి ప్రపంచంలో శాస్త్ర రంగంలో శక్తిమంతమైన దేశాల్లో తొలి ఐదింటిలో భారత్‌ను నిలబెట్టాలనే లక్ష్యం దిశగా.. నవీకరణలపై దృష్టి పెట్టడం, పరిశోధక సంస్థల ఏర్పాటు, మహిళా శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించడం, జీడీపీలో పరిశోధన-అభివృద్ధి వ్యయాన్ని రెండు శాతానికి పెంచడం వంటివి ఈ విధానం లక్ష్యాలు.

లక్ష్య పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లక్ష్య క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిషాలోని గోపాలపూర్‌లో జనవరి 7న ఈ పరీక్ష నిర్వహించారు. 25 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణి 100కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.

నౌకాదళంలో తర్కాష్
రష్యా నిర్మించిన బ్రహ్మోస్ ఆయుధాలతో కూడిన ‘ఐ.ఎన్.ఎస్. తర్కాష్’ను 2012 డిసెంబర్ 27న ముంబైలో నౌకా దళంలో చేర్చారు. రష్యా నుంచి మన దేశం కొనుగోలు చేసే మూడు యుద్ధ నౌకల్లో తర్కాష్ రెండోది. మొదటి యుద్ధ నౌక ఐ.ఎన్.ఎస్. తేగ్‌ను 2012 జూన్‌లో నౌకా దళంలో చేర్చారు. మూడో యుద్ధ నౌక ఐ.ఎన్.ఎస్. త్రిఖండ్ 2013 మధ్య కాలంలో భారత్ చేరుతుంది.

No comments:

Post a Comment