*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 27🌎*
*◼నవంబర్ 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 331వ రోజు (లీపు సంవత్సరములో 332వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 34 రోజులు మిగిలినవి.*◼
*⏱సంఘటనలు*⏱
*♦1919: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి.*
*♦1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం.*
*❤జననాలు*❤
*🔥1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744)*
*🔥1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956)*
*🔥1907: హరి వంశ రాయ్ బచ్చన్, ప్రముఖ హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003)*
*🔥1919: కంచర్ల సుగుణమణి ప్రముఖ సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి (మ.2017)*
*🔥1935: ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.*
*🔥1940: బ్రూస్ లీ, ప్రపంచ ప్రసిద్ధ యుద్ధ వీరుడు. (మ.1973)*
*🔥1942: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి*
*🔥1950: పోపూరి లలిత కుమారి (ఓల్గా) ప్రముఖ తెలుగు రచయిత్రి.*
*🔥1953: బప్పీలహరి, ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు*.
*🔥1986: సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.*
*🍃మరణాలు*🍃
*🌷1938: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1938)*
*🌷1939: చర్ల నారాయణ శాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత మరియు విమర్శకుడు. (జ.1881)*
*🌷1974: శీరిపి ఆంజనేయులు, ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)*
*🌷1993: భావరాజు నరసింహారావు, ప్రముఖ నాటక రచయిత, ప్రచురణకర్త మరియు నటుడు. (జ.1914)*
*🌷2008: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931)*
*🌷2013: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933)*
ఈ రోజు జికె
*1) డయాఫ్టర్ దేనికి సంబంధించింది?*
*జ:- లెన్స్ పవర్‌కు సంబంధించింది. ఒక మీటర్ ఫోకల్ లెంగ్త్ ఉన్న లెన్స్ ను ఒక డయాఫ్టర్ అంటారు.*
*2) సంపూర్ణాంతర పరావర్తనంతో ఏమి కనిపిస్తాయి?*
*జ: ఎడారుల్లో ఎండమావులు, నీళ్లమీద పడిన నూనె బిందువులు విస్తరించి సప్తవర్ణ కాంతి ఏర్పడడం*
*3) మయోపియాలో ఏమి కనిపించవు?*
*జ: దూరపు వస్తువులు*
*4) . దృష్టి దోషం నివారించడానికి ఎటువంటి లెన్స్ ఉపయోగించాలి?*
*జ: కాంకేవ్ లెన్స్*
*5) దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించని దృష్టి దోషాన్ని ఏమంటారు?జి సైదేశ్వర రావు*
*జ: హైపర్ మెట్రోపియా. దీనిని నివారించడానికి కాంకెవ్ లెన్స్ వాడాలి.*
*6) మిర్రర్ ఫార్ములా ఏది?*
*జ: -1/v+1/u=1/f (v = ఇమేజ్ దూరం, u = ఆబ్జెక్ట్ దూరం, f = ఫోకల్ లెంగ్త్)*
*7) శూన్యంలో కాంతి వేగం ఎంత?*
*జ: 310 8 మీ/సె*
*8) . కీబుల్ లాంజో ప్రత్యేకత ఏమిటి?*
*జ: నేషనల్ ఫ్లోటింగ్ పార్క్*
*9) అండర్ గ్రౌండ్ నది ఏది?*
*జ: ప్యూర్టో ప్రిన్సెస్సా సబ్ టెర్రయిన్ నది*
*10) కిబో, మావెంజీ, షిరా అనే వల్కనిక్ కోన్స్ ఉన్న పర్వతం ఏది?*
*జ: కిలిమంజారో పర్వతం*
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏
*❤సుభాషిత వాక్కు*
*"కళ్ళు మసకగా కనిపిస్తే కళ్లని శుభ్రం చేసుకుంటేసరిపోతుంది కానీ అందరు తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవలసింది......అంతరంగాన్ని."*
*"When you see yourself in others, it is impossible to hurt anyone else."*
*🔥మంచి పద్యం*
*ప్రగతి మొదటి మెట్టు ప్రథమ చక్రము తోడ*
*నాగరికత పెరుగునాంది యయ్యె*
*చరిత గతిని మార్చె చక్రమురాకడ*
*వాస్తవంబు వేము వారి మాట*
*🌹భావం*:-
*మానవ నాగరికతను, చరిత్రగతిని మార్చినది చక్రము*
*🔹నేటి జీ కె:*
1) *అంతర్జాతీయ న్యాయస్థానంలో మరోసారి సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?*
జ) *జస్టిస్ దల్వీర్ భండారీ* *( 2వ సారి)*
2) *జింబాబ్వే దేశo ఏ సo!!లో స్వాతంత్ర్యo* పొందింది?
జ) *1980*
3) *'భవాణిసాగర్ డ్యామ్' ఏ రాష్ట్రంలో ఉంది?*
జ) *తమిళనాడు*
4) *రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు అర్హతలు ఉన్నాయని చెప్పిన నివేదిక ఏది ?*
జ) *నంద గోపాల్ కమిటీ నివేదిక*
5) *జర్నీ ఆఫ్ హైదరబాద్ సిటీ పోలీస్ పుస్తకాన్ని రాసింది?*
జ) *నూపురు కుమార్*
*సాహితీ కోచింగ్ సెంటర్, విజయనగరం*. ******************.
*విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా భామ*
ఇంటర్నెట్‌డెస్క్: *విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా భామ డెమి-లేహ్ నెల్ పీటర్స్* ఎంపికయ్యారు. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఆదివారం తుది పోటీలు నిర్వహించగా.. ఇందులో *డెమి విశ్వసుందరి కిరీటాన్ని* కైవసం చేసుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఓ దక్షిణాఫ్రికా అమ్మాయి ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. *1978లో దక్షిణాఫ్రికా చివరిసారిగా విశ్వసుందరి* గౌరవాన్ని అందుకుంది.
మొత్తం 92 మంది అమ్మాయిలు ఈ పోటీల్లో పాల్గొనగా.. వారందరినీ దాటి *డెమి తొలిస్థానం* దక్కించుకున్నారు. *కొలంబియాకు చెందిన లారా గొంజాలెజ్* తొలి రన్నరప్‌గా, *జమైకాకు చెందిన డెవీనా బెన్నెత్ రెండో రన్నరప్‌గా* నిలిచారు. 22ఏళ్ల డెమి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కాగా.. మానుషి చిల్లర్ రూపంలో ఇటీవల ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్న *భారత్ ఈ పోటీల్లో 10వ స్థానం* దక్కించుకుంది. *భారత్‌కు చెందిన శ్రద్ధ శశిధర్ టాప్ 10గా* ఉన్నారు
****************
*సాహితీ కోచింగ్ సెంటర్, విజయనగరం*
*📝🖊నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా... భారత రాజ్యాంగము గురించి కొన్ని వాస్తవాలు...🖊📝*
1) భారత రాజ్యాంగము ఎప్పుడు అమలులోకి వచ్చింది?
*జ:-జనవరి 26, 1950.*
2) భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల సంఖ్య?
*జ: 395.*
3) భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినది?
*జ: ఐవర్ జెన్నింగ్స్.*
4) భారత రాజ్యాంగము యొక్క చిహ్నం?
*జ: ఏనుగు.*
5) భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం?
*జ: పూర్ణస్వరాజ్ దినం.*
6) భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎందులో వివరించబడ్డాయి?
*జ: పీఠిక (ప్రియాంబుల్).*
7) భారత రాజ్యాంగమును ఎవరు రచించారు?
*జ: భారత రాజ్యాంగ పరిషత్తు.*
8) భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు?
*జ: రాజేంద్రప్రసాద్.*
9) భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత?
*జ: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము.*
10).భారత రాజ్యాంగము ఏ రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది?
*జ: నవంబరు 26, 1949.*
11) అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నాడు?
*జ:- రాజ్యాంగ పరిహారపు హక్కు.*
12) రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు?
*జ: ఒక్కసారి.*
13) భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో ప్రారంభమౌతుంది?
*జ: భారత ప్రజలమైన మేము......*
14) రాజ్యాంగ సభ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
*జ:;సచ్చిదానంద సిన్హా.*
15) రాజ్యాంగంలోని తొలి ప్రకరణ దేన్ని తెలుపుతుంది?
*జ: భారతదేశము రాష్ట్రాల సమాఖ్య అని.*
16) భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయింది?
*జ: రూ.63,70,729/-.*
17)రాజ్యాంగంలో గుర్తించబడిన బాషలు ఏ షెడ్యూల్డ్‌లో చేర్చబడ్డాయి?
*జ: 8వ షెడ్యూల్డ్.*
18) భారత రాజ్యాంగంలో చిన్నది మరియు విలువైన ప్రకరణ..?
*జ:-21 (జీవించే హక్కు).*
19) రాజ్యాంగం అమలులోకి రాకముందు పార్లమెంటును ఏమని పిల్చేవారు...?
*జ: ప్రొవిజనల్ పార్లమెంటు.*
20) భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపన అనే భావన ఏ భాగంలో ఉంది...?
*జ:-ఆదేశిక సూత్రాలు.*
🎯అవయవదానంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ🎯
అవయవదానంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇందుకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్‌సప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) అవార్డును ప్రకటించింది. నవంబర్ 27న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’సందర్భంగా ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు.
తమిళనాడును దాటేసి..
తమిళనాడు జనాభా 8 కోట్లు కాగా.. తెలంగాణ జనాభా 3.5 కోట్లు. తమిళనాడులో గత 11 ఏళ్లలో 5,367 అవయవాలను సేకరించి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తెలంగాణలోని నిమ్స్ జీవన్‌దాన్ ఆధ్వర్యంలో 2013 నుంచి 2017 అక్టోబర్ వరకు 414 మంది దాతల నుంచి 1,675 అవయవాలను సేకరించారు. గతేడాది వరకు రెండోస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి తొలిస్థానంలో నిలిచింది. కేరళ ఇప్పటివరకు 701 అవయవాలు సేకరించి మూడోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
*🏏🔥కోహ్లీ దెబ్బకు కరిగిపోతున్న రికార్డులు!*🔥
*🏏భారత్-శ్రీలంక మధ్య ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 239 పరుగులతో ఘన విజయం సాధించింది.*
*🏏జట్టు విజయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. డబుల్ సెంచరీ సాధించి భారత్ భారీ ఆధిక్యం సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు.*
*ఈ టెస్ట్‌లో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా కోహ్లీ ఖాతాలో బోలెడన్ని రికార్డులు వచ్చి చేరాయి. అవేంటో ఓసారి చూద్దాం..*
*🏏కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు (12) సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 11 సెంచరీలతో సునీల్ గవాస్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు.*
*🏏కెప్టెన్‌గా ఐదో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు.*
*🏏భారత జట్టుకు సారథ్యం వహించిన ఎంఏకే పటౌడీ, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ ఒక్కో డబుల్ సెంచరీ చేశారు.*
*🏏ఈ క్రమంలో ఐదు డబుల్ సెంచరీల రాహుల్ ద్రవిడ్ రికార్డును సమం చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లు ఆరు డబుల్ సెంచరీలు సాధించారు.*
*🏏కోహ్లీ ఐదు డబుల్ సెంచరీలు ఒకే క్యాలెండర్ ఇయర్‌లో సాధించనవి కావడం విశేషం.*
*🏏 2016-17లో కోహ్లీ విండీస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లండ్‌పై 235, 2017లో బంగ్లాదేశ్‌పై 204, శ్రీలంకపై 213 పరుగులు సాధించాడు.*
*🏏కెప్టెన్‌గా అత్యధిక సెంచరీ (12) సాధించనవారి జాబితాలో కోహ్లీ 13వ స్థానంలో ఉన్నాడు.*
*🏏కోహ్లీ ఇప్పటి వరకు తన కెరీర్‌లో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 99 ఇన్నింగ్స్‌లలో 22 సెంచరీలు సాధించాడు.దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడు గ్రేమ్ స్మిత్ 41( 368 ఇన్నింగ్స్‌లలో), ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ 41 (376 ఇన్నింగ్స్‌లలో) సెంచరీలతో ముందున్నారు.*
*🏏ఒకే క్యాలెండర్ ఇయర్‌లో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 10 సెంచరీలు సాధించి జాబితాలో తొలి స్థానాన్ని ఆక్రమించాడు.*
*🏏ఇప్పటి వరకు ఈ రికార్డు రికీ పాంటింగ్ 9 సెంచరీలు (2005-06లో), గ్రేమ్ స్మిత్ 9 సెంచరీలు (2005లో)ల పేరుపై ఉంది.*
*🔥జనరల్_నాలెడ్జ్🔥*
*1. ఎస్టోనియా రాజధాని?*
*☑టల్లిన్*
*2 అమ్నెస్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం?*
*జ: లండన్*
*3. ఇంటర్నేషనల్ వెయిట్ ట్రైనింగ్ హెడ్క్వార్టర్స్ ?*
*జ: బుడాపెస్ట్*
*4. 2018 కామన్వెల్త్ గేమ్స్?*
*జ: ఆస్ట్రేలియా*
*5. పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ కమిటీ ?*
*జ:-Y.M. deosthle*
*6. ప్రభుత్వ రంగ విలీనం పై కమిటీ ?*
*జ: అరుణ్ జైట్లీ*
*7. ప్రపంచ ఆర్ధిక దృష్టి నివేదిక ప్రచురించింది?*
*జ:-IMF*
*8. ప్రపంచ వ్యాపార నివేదిక ?*
*జ:-ప్రపంచ బ్యాంకు*
*9. U17 ఫుట్ బాల్ విజేత ?*
*జ: ఇంగ్లాండ్*
*10. పెంచ్ జాతీయ ఉద్యానవనం ?*
*జ: మధ్యప్రదేశ్*
*11. ప్రపంచ బహుపది( Polynomial)రోజు*
*జ: 12 వ నవంబర్*
*12. దుషవార్ ఆనకట్ట*
*జ: మహానది*
*🔥లోక్‌సభ~ఏర్పాటు~స్పీకరు🔥*
*♦1950 జనవరి 26 న రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52 లో జరిగాయి. మొదటి ఎన్నికైన లోక్‌సభ ఏప్రిల్, 1952 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి వివిధ లోక్‌సభల వివరాలు ఇలా ఉన్నాయి:*
*●మొదటి లోక్‌సభ -ఏప్రిల్ 1952- జి.వి.మావలాంకర్.*
*●రెండవ లోక్‌సభ-ఏప్రిల్ 1957-మాడభూషి అనంతశయనం అయ్యంగారు*
*●మూడవ లోక్‌సభ-ఏప్రిల్ 1962-సర్దార్ హుకం సింగ్*
*●నాలుగవ లోక్‌సభ-మార్చి 1967-నీలం సంజీవరెడ్డి, జి.ఎస్.ధిల్లాన్*
*●ఐదవ లోక్‌సభ-మార్చి 1971-జి.ఎస్.ధిల్లాన్, బలిరాం భగత్*
*●ఆరవ లోక్‌సభ-మార్చి 1977-కె.ఎస్.హెగ్డే*
*●ఏడవ లోక్‌సభ-జనవరి 1980-బలరాం జాఖర్*
*●ఎనిమిదవ లోక్‌సభ-డిసెంబర్ 1984-బలరాం జాఖర్*
*జి సైదేశ్వర రావు*
*●తొమ్మిదవ లోక్‌సభ-డిసెంబర్ 1989-రబీ రే*
*●పదవ లోక్‌సభ-జూన్ 1991-శివరాజ్ పాటిల్*
*●పదకొండవ లోక్‌సభ -మే 1996-పి.ఎ.సంగ్మా*
*●పన్నెండవ లోక్‌సభ-మార్చి 1998-గంటి మోహనచంద్ర బాలయోగి*
*●పదమూడవ లోక్‌సభ-అక్టోబర్ 1999-గంటి మోహనచంద్ర బాలయోగి, మనోహర్ జోషి*
*●పదునాల్గవ లోక్‌సభ-మే 2004-సోమనాథ్ చటర్జీ*
*●పదహేనో లోక్‌సభ-మే 2009-మీరా కుమార్*
*●పదహరో లోక్‌సభ-5 జూన్, 2014 -సుమిత్రా మహాజన్ (ప్రస్తుతం)*
ఈ రోజు జికె
*1) డయాఫ్టర్ దేనికి సంబంధించింది?*
*జ:- లెన్స్ పవర్‌కు సంబంధించింది. ఒక మీటర్ ఫోకల్ లెంగ్త్ ఉన్న లెన్స్ ను ఒక డయాఫ్టర్ అంటారు.*
*2) సంపూర్ణాంతర పరావర్తనంతో ఏమి కనిపిస్తాయి?*
*జ: ఎడారుల్లో ఎండమావులు, నీళ్లమీద పడిన నూనె బిందువులు విస్తరించి సప్తవర్ణ కాంతి ఏర్పడడం*
*3) మయోపియాలో ఏమి కనిపించవు?*
*జ: దూరపు వస్తువులు*
*4) . దృష్టి దోషం నివారించడానికి ఎటువంటి లెన్స్ ఉపయోగించాలి?*
*జ: కాంకేవ్ లెన్స్*
*5) దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించని దృష్టి దోషాన్ని ఏమంటారు?జి సైదేశ్వర రావు*
*జ: హైపర్ మెట్రోపియా. దీనిని నివారించడానికి కాంకెవ్ లెన్స్ వాడాలి.*
*6) మిర్రర్ ఫార్ములా ఏది?*
*జ: -1/v+1/u=1/f (v = ఇమేజ్ దూరం, u = ఆబ్జెక్ట్ దూరం, f = ఫోకల్ లెంగ్త్)*
*7) శూన్యంలో కాంతి వేగం ఎంత?*
*జ: 310 8 మీ/సె*
*8) . కీబుల్ లాంజో ప్రత్యేకత ఏమిటి?*
*జ: నేషనల్ ఫ్లోటింగ్ పార్క్*
*9) అండర్ గ్రౌండ్ నది ఏది?*
*జ: ప్యూర్టో ప్రిన్సెస్సా సబ్ టెర్రయిన్ నది*
*10) కిబో, మావెంజీ, షిరా అనే వల్కనిక్ కోన్స్ ఉన్న పర్వతం ఏది?*
*జ: కిలిమంజారో పర్వతం*
ఈ రోజు జికె
*1) వరి ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో గల రాష్ట్రం?*
*వెస్ట్ బెంగాల్*
*సన్ సిటిగా పిలువబడే నగరం?*
*జోథ్ పూర్*
*విస్తీర్ణపరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రం?*
*రాజస్థాన్*
*లాండ్ అఫ్ టేంపుల్స్ గా పిలువబడే రాష్ట్రం?*
*తమిళనాడు*
*భారతదేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం?*
*గుజరాత్*
*మిల్క్ సిటిగా ఏ నగరాన్ని పిలుస్తారు?*
*ఆనంద్*
*బౌద్దమతానికి ఊయలగా పేరుగాంచిన రాష్ట్రం?*
*బీహార్*
*ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛను సౌకర్యం కల్పించిన మొదటి రాష్ట్రం?*
*ఒడిశా*
*భారతదేశంలో ఎక్కువ జీవవైవిధ్యం గల రాష్ట్రం?*
*కేరళ*
*పంచనదుల భూమి అని ఏ రాష్ట్రన్ని పిలుస్తారు?*
*పంజాబ్*
*హరితవిప్లవం తొలిసారిగా వచ్చిన రెండురాష్ట్రాలు?*
*హర్యానా, పంజాబ్*
*మనదేశంలో ప్లాస్టిక్ బ్యాగ్గులను నిషేధించిన తొలి రాష్ట్రం?*
*హిమాచల్ ప్రదేశ్*
*గోల్డెన్ సిటిగా ఏ నగరాన్ని పిలుస్తారు?*
*కాంచిపురం*
*భారతదేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం?*
*అరుణాచెల్ ప్రదేశ్*
*ఆరెంజ్ సిటిగా పిలువబడే నగరం?*
*నాగ్ పూర్*
*వృక్షశాస్త్రవేత్తల స్వర్గంగా పిలువబడే రాష్ట్రం?*
*సిక్కిం*
*ఇంగ్లీషు అధికారభాషగా గల రాష్ట్రం?*
*నాగాలాండ్*
*పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1979 సంవత్సరంలోనే చేసిన రాష్ట్రం?*
*జమ్మూ కాశ్మీర్*
*టూరిస్ట్ ప్యారడైజ్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?*
*గోవా*
*రైలుమార్గాలు లేని రాష్ట్రం ?*
*మేఘాలయ*
*ఆభరణాల భూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?*
*మణిపూర్*
No comments:
Post a Comment