*🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 15🌎*
*◼డిసెంబర్ 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 349వ రోజు (లీపు సంవత్సరములో 350వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 16 రోజులు మిగిలినవి.*◼
*⏱సంఘటనలు*⏱
*♦1952: ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు.*
*❤జననాలు* ❤
*💚1914: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు.*
*💚1925:ఎస్.వి.భుజంగరాయశర్మ కవి, విమర్శకుడు, నాటక రచయిత. (మ.1997)*
*💚1933: వాసిరెడ్డి సీతాదేవి, ప్రసిద్ధ రచయిత్రి. (మ.2007)**
*💚1933: బాపు, ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.2014)*
*💚1939: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (మ.1975)*
*💚1945: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత మరియు దర్శకుడు (మ.2017)జి సైదేశ్వర రావు*
*💚1960: మధు యాస్కీ గౌడ్, ఆంధ్ర ప్రదేశ్ లోని నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.*
*💚1966: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్.*
*🍃మరణాలు*🍃
*🌷1950: సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి.*
*🌷1952: పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి.*
*🌷1974: కొత్త సత్యనారాయణ చౌదరి, ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907)*
*🌷1985: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (జ.1900)*
*🌷2014: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు. (జ.1974)*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹ఇంటర్నేషనల్ టీ డే.*
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏
*🔹సుభాషిత వాక్కు*
*"ఊసరవేల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు."*
*"Good Behaviour doesn't have any Monetary Value. But, it has the Power to Purchase Millions of Hearts."*
*▪మంచి పద్యం*
*రాజు పూజ నొందు రాజ్యముండు వరకు*
*ధనికునికిల యశము ధనము ఉన్న*
*చదువు కున్న పొందు సతతంబు గౌరవం*
*వాస్తవంబు వేము వారి మాట*
*❗భావం*:-
*రాజ్య పూజ్య మనేది రాజ్యమున్నంత వరకే, ధనము ఉన్నంత వరకే ధనికునికి గౌరవం. కానీ చదువు సర్వత్రా గౌరవం పొందును.*
♦ *నేటి జీ కె:*♦
1) *భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని ఏమంటారు?*
*జ: భూభ్రమణం*
2) *భూమి పడమర నుంచి తూర్పునకు గంటకు దాదాపు ఎన్ని కిమీ వేగంతో తిరుగుతుంది ?*
*జ: 1610 కి.మీ*
3) *భూమి ఒక భ్రమణం చేయుటకు పట్టు కాలం ఎంత ?*
*జ: 23 గంటల 56 నిమిషాల 4.092 సెకన్లు*
4) *భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి యొక్క కేంద్రం గుండా పోయే రేఖను ఏమంటారు?*
*జ: అక్షం*
5) *భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన కక్స్యా మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుటను ఏమంటారు ?*
*జ: భూ పరిభ్రమణం*
6) *భూమి ఒక పరిభ్రమణం చేయుటకు పట్టు కాలం ఎంత ?*
*జ: 365 రోజుల 6 గంటల 10 సెకన్లు (365 1/4రోజులు)*
6) *ఏడాదికి సాధరణంగా 365 రోజులుగా చెబుతారు. మరి మిగిలిన 6 గంటలను ఎలా లెక్కిస్తారు ?*
*జ: వాటిని 4 సంవత్సరాలకోసారి లెక్కించి.. లీపు సంవత్సరంగా 365లను పిలుస్తారు.*
7) *భూమ్మీద రాత్రి, పగలు సమయాల్లో తేడాలు, రుతువులు ఏర్పడటానికి కారణం ఏంటి ?*
*జ: భూ పరిభ్రమణం*
8) *భూమి సూర్యునికి అతి దగ్గరగా వచ్చే స్థితిని ఏమంటారు?*
*జ: పరిహేళి లేదా రవినీచ (147 మిలియన్ కిమీ)*
9) *పరిహేళి ఎప్పుడు సంభవిస్తుంది?*
*జ: జనవరి 3*
10) *సూర్యుడు భూమికి దూరంగా వెళితే దాన్ని ఏమంటారు ?*
*జ: అపహేళి లేదా రవి ఉచ్ఛ (జులై 4) (152 మిలియన్ కిమీ)*
11) *ఏడాదిలో ఏ రెండు రోజులు పగలు, రాత్రిళ్ళు సమానంగా ఉంటాయి ?*
*జ: మార్చి 21, సెప్టెంబర్ 23*
ఈ రోజు జికె
*1. ప్రసారభారతి నూతన చైర్మన్‌గా తిరిగి ఎన్నికైనారు?*
*జ:-సూర్యప్రకాశ్*
*2.ఇన్పోసిస్ నూతన సిఇవో ఎవరు?*
*జ:; సలీం ఎస్.పరేభ*
*3. లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్?*
*జ- స్నేహలత శ్రీవాత్సవా*
*4.ఎయిర్ ఇండియా నూతన చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్?*
*జ: ప్రదీప్ సింగ్ ఖరోలా*
*5. మిస్ సుప్రా ఇంటర్నేషనల్ 2017 ఎవరు?*
*జ: - జెన్నికీమ్*
*6. దక్షిణాసియా సాహిత్యానికి అందించే డిఎస్‌సి (ప్రైజ్ 2017) ఎంపికైన అనుద్ అరుద్ ప్రగాశం పుస్తకం?*
*జ: -ది స్పిరిట్ ఆఫ్ ఎ బ్రీఫ్ మ్యారేజ్*
*7.నవంబర్ 30న గ్రీన్ యూనివర్సిటి బిల్లు ఆమోదించిన రాష్ట్రం?*
*జ: - పశ్చిమ బంగ్లా*
*8.టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్ని 2017 విజేత?*
*జ: సత్తికోం తామ్మసిన్*
*9.ప్రపంచ హకీలీగ్ స్వర్ణపతక విజేత?*
*జ: - ఆస్ట్రేలియా*
*10. ప్రపంచ హాకీలీగ్ రజత పతక విజేత?*
*జ- అర్జెంటీనా*
*కరంట్ అఫైర్స్*
1) ప్రపంచ తెలుగు మహా సభలు ఎక్కడ జరుగును ? *హైదరాబాద్ L B స్టేడియం.*
2)ప్రపంచ తెలుగు మహా సభలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగును
- *15 నుండి 19 వరకు.*
3) ప్రపంచ తెలుగు మహా సభలను ప్రారంభించేది - *ఉపరాష్ట్రపతి*
(ప్రపంచ తెలుగు మహా సభల ముగింపు చేసేది ఎవరు - *రాష్ట్రపతి*)
4) తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎవరు - *అయాచితం శ్రీధర్.*
5) తెలంగాణ సాంస్ర్కుతిక శాఖా కార్యదర్శి ఎవరు - *బుర్ర వెంకటేశం.*
6) తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ ఎవరు - *నందిని సిధా రెడ్డి*
7)తెలంగాణ అధికార బాషా సంఘం అధ్యక్షుడు ఎవరు - *దేవులపల్లి ప్రభాకర్.*
8) తెలుగు విశ్వా విద్యాలయం V C ఎవరు -
*SV సత్యనారాయణ*.
9) తెలంగాణ పురపాలక శాఖ పట్టణాలలో నిరుద్యోగ నిపుణులకు ఉపాధి కల్పించేందుకు అభివృద్ధి చేసిన అప్ ఏది
*-అర్బన్ జీనీ*.
10)అర్బన్ జీనీ ట్యాగ్ లైన్ - *మీ ఇంటి ముంగిట సేవలు.*
11) దూరదర్శన్ యాదగిరి ఛానల్ హెడ్ గా ఎవరు నియమించపడ్డారు *- విజయ భగవాన్*
12)తెలంగాణ లో కొమురవెల్లి బ్రమ్మోత్సవాలు ఎప్పటి నుండి మెదలగును -
*డిసెంబర్ 17 నుండి మార్చ్ 11 వరకు జరుగును.*
13) భారత CBRE చైర్మన్ - *అన్షుమన్ మెగజైన్*
No comments:
Post a Comment