AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 13 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 11

               
*🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 11🌎*                                                            *◼డిసెంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 345వ రోజు (లీపు సంవత్సరములో 346వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 20 రోజులు మిగిలినవి.*◼

*⏱సంఘటనలు*⏱

*♦1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.*
*♦1911: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.*

*♦1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.*

*♦1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది*.

*♦1965: హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్‌ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు*.

*♦1967: పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది*

*❤జననాలు* ❤

*🔥1882: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (మ.1921)*

*🔥1896: గ్రంధి మంగరాజు, ప్రముఖ సినిమా పంపిణీదారుడు మరియు నిర్మాత*.

*🔥1931: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990)*

*🔥1934: సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.*

*🔥1935: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.*

*🔥1948: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008)జి సైదేశ్వర రావు*

*🔥1967: మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత*

*🔥1969: విశ్వనాథన్ ఆనంద్, భారత ప్రముఖ చదరంగ క్రీడాకాకారుడు.*

*🍃మరణాలు*🍃

*🌷1756: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (జ.1694)*

*🌷1783: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734)*

*🌷2004: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ ప్రముఖ గాయని. (జ.1916)*

*🌷2011: మల్లెమాల సుందర రామిరెడ్డి, ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. (జ.1924)*

*🌷2013: శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు* 🇮🇳

 *🔹అంతర్జాతీయ పర్వతదినము.*

*🔹యూనిసెఫ్ దినోత్సవం*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

 *▪సుభాషిత వాక్కు*

*"చచ్చాక వినపడని డప్పు ఎంత గొప్పగా వుంటే ఏంటి.?*
*బతికుండగా వినియోగించని డబ్బు ఎంత కుప్పగా ఉంటే ఏంటి.?"*

*"Like success, failure is many things to many people. With positive mental attitude, failure is a learning experience, a rung on the ladder, and a plateau at which to get your thoughts in order to prepare to try. again.”*

 *🔹మంచి పద్యం*

*మనము నందు ఇరులు మట్టు బెట్టు కొనుము*
*విద్య నేర్చి మనము విజ్ఞతెరిగి*
*స్వస్తి పలుక వలము సర్వమూఢ ములను*
*వాస్తవంబు వేము వారి మాట*

*❗భావం*:-

*విద్య నేర్చిన యెడల విజ్ఞత పెరిగి అజ్ఞానాందకసరం తొలగును. మూఢాచారాలకు స్వస్తి పలుకును.*

*♦నేటి జీ కె:*♦

1) *2017 ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(GES) నవంబర్ 28 నుండి 30 వరకు ఎక్కడ జరిగాయి?*

 *హైదరాబాద్ లో*

2) *GES సదస్సుల పరంపరలో ఇది ఎన్నవది?*

 *8వది.*

3) *2017 సదస్సు నినాదం ఏమిటి?*

 *Women first prosperity for all*

*4) ఏ *రోబోట్ మీట నొక్కి భారత ప్రధాని మోదీ మరియూ  యువాంకా ట్రంప్ లు ఈ సమావేశాన్ని సంయుక్తంగా ప్రారంభించారు?*

 *MITRA*

5) *GES-17 స్టర్టప్ ఆలోచనల పోటీలో విజేతగా నిలిచింది ఎవరు?*

 *అజైతా షా, ఫ్రాంటియన్ మార్కెట్స్(భారత్)*

*🔥వైద్య విధాన ప‌రిష‌త్‌లో 3,943 పోస్టులు🔥*

*♦తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌లో 3వేల 943 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌లోని వివిధ ఆస్పత్రుల్లో ఆయా పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుంది. వివిధ కేట‌గిరీల్లో పోస్టుల వివ‌రాల‌ను కూడా జీవోలో ప్ర‌క‌టించారు.*
*♦సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు మంత్రి ల‌క్ష్మారెడ్డి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో  ఆధునిక వ‌స‌తులు పెంచ‌డం, కొత్త‌గా హాస్పిట‌ల్స్ ని నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో అప్‌గ్రేడ్ చేయ‌డం, కేసీఆర్ కిట్ల ప‌థ‌కం వంటి అనేక స్టెప్స్ తీసుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేషంట్ల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో ఇప్ప‌టి వరకు కొంత వరకు ఉన్న కొరత తాజాగా చేప‌ట్టే నియామ‌కాల‌తో తీరుతుంద‌న్నారు. భారీ ఎత్తున‌ డాక్ట‌ర్లు, సిబ్బంది వ‌స్తార‌న్నారు. ఈ నియామ‌కాలతో ప్ర‌భుత్వ ఆస్పత్రుకు వచ్చే రోగుల‌కు మెరుగైన‌, నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించ‌డానికి వీలవుతుంద‌న్నారు మంత్రి లక్ష్మారెడ్డి.*

*♦వివిధ కేటగిరీల్లో పోస్టుల వివ‌రాలు…*

*🌺డాక్ట‌ర్లు…*

*♦సివిల్ స‌ర్జ‌న్‌/సివిల్ స‌ర్జ‌న్ ఆర్ఎంఓ -483, డిప్యూటీ సివిల్ స‌ర్జ‌న్ -685,సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ -1,191,డెంట‌ల్ సివిల్ స‌ర్జ‌న్ -12, డిప్యూటీ డెంట‌ల్ స‌ర్జ‌న్ -16,డెంట‌ల్‌ అసిస్టెంట్ స‌ర్జ‌న్ -10,🍒*

*🔥ఇత‌ర సిబ్బంది…*

*🌳అసిస్టెంట్ డైరెక్ట‌ర్  (అడ్మిన్‌) ఎల్‌.ఎస్‌. (గ్రేడ్‌-1) -02,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ /ఎల‌్‌.ఎస్‌.( గ్రేడ్‌-2) -16, సూప‌రింటెండెంట్ /సెక్ష‌న్ ఆఫీస‌ర్ -32,సీనియ‌ర్  అసిస్టెంట్ -30,జూనియ‌ర్ అసిస్టెంట్ -56,ఫార్మ‌సీ సూప‌ర్ వైజ‌ర్ -01, ఫార్మ‌సిస్ట్ గ్రేడ్‌-1 06, ఫార్మ‌సిస్ట్ (గ్రేడ్‌-2) -52, ల్యాబ్ టెక్నీషియ‌న్ -152, హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్ -09. చీఫ్ రేడియోగ్రాఫ‌ర్-07, రేడియోగ్రాఫ‌ర్ -33, డార్క్ రూమ్ అసిస్టెంట్ -36, ఫిజియోథెర‌పిస్ట్ -45, రిఫ్రాక్ష‌నిస్ట్ -34, జూనియ‌ర్ అన‌లిస్ట్ -44, ఆప్తాల‌మిస్ట్ అసిస్టెంట్ -22, ఆడియోమెట్రీ టెక్నీషియ‌న్ -01, న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ (గ్రేడ్‌-1) -28, న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ (గ్రేడ్‌-2) -38,హెడ్ న‌ర్స్‌-162,స్టాఫ్ న‌ర్స్ -565,మిడ్‌వైవ్స్ -126,ఎఎన్ఎం/ఎంపిహెచ్ఎ (ఎఫ్‌) -49.🏀*

*🎾తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌లో  పోస్టులు రావ‌డం ప‌ట్ల వివిధ వైద్య సంఘాలు హ‌ర్షం వ్యక్తం చేశాయి. ఈ పోస్టుల నియామ‌కాలు పూర్త‌యితే డాక్టర్లు, సిబ్బంది కొర‌త  తీరడంతో పాటు … రోగుల‌కు మంచి వైద్యం అందించ‌డానికి వీల‌వుతుంద‌న్నారు. డాక్టర్లు, సిబ్బంది పై కూడా కొంత భారం త‌గ్గుతుంద‌న్నారు.🎾*


No comments:

Post a Comment