AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 5 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 13 2018


  *🌎చరిత్రలో ఈరోజు/జనవరి13🌎*           
*⏱సంఘటనలు*⏱

*♦1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.*

*♦1879: 'లయన్స్‌క్లబ్' స్థాపకుడు మెల్విన్‌జోన్స్‌జన్మదినం. అమెరికాకు చెందిన ఈయన* 

*♦1917 అక్టోబరులో తన మిత్రులతో కలసి లయన్స్‌ క్లబ్‌ను స్థాపించారు. ఈ సంస్థకు సుమారు 160 దేశాల్లో 40 వేల శాఖలు ఉన్నాయి*

*♦1915: ఇటలీలోని అవెజ్జానో అనే ప్రాంతంలో సంభవించిన భూకంపంలో దాదాపు 29,800 మంది మరణించారు.*

*♦1943 : ఎడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాడు*

*❤జననాలు*❤

*🔥1879: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపికుడు.*

*🔥1917: నల్లా రెడ్డి నాయుడు, ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. (మ.1982)జి సైదేశ్వర రావు*

*🔥1919: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996)*

*🔥1938: శివకుమార్ శర్మ, ప్రముఖ సంతూర్ వాద్య సంగీత విధ్వాంసుడు.*

*🔥1940: అంబటి బ్రాహ్మణయ్య, ప్రముఖ రాజకీయ వేత్త.*

*🔥1949: రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు.*

*🍃మరణాలు*🍃

*🌷1977: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (జ.1914)*

*🌷2014: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (జ.1927)*

*🌷2016: అద్దేపల్లి రామమోహనరావు తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)*

*🌷2016: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్ మరియు గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)*

*🌷2017: అంగర సూర్యారావు, ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. (జ.1927)*
********
#*వివేకానందం*

అరచేతిలో ప్రపంచం 
అర్రుచాచే ఛాంచల్యం
ఆవిరులవుతున్న 
ఆలోచనా పటిమ

దేశానికి దశ దిశ 
అయిన యువత
నేడు అరచేతి‌ 
ఆనందం ఆరగిస్తోంది
తినే సామర్థ్యం కన్నా 
ఆరగించుకొనే ఆరాటముతో 
అజీర్తి పాలవుతోంది

ఏకాగ్రతకు లేవు సాధనలు
ఏకరువుకు లేదు సమయాలు
ఎక్కడ అవకాశమో అక్కడే నిస్తేజం
ఎండగడుతోంది యువతనే 
అచేతనం జేసి

గురు భక్తి 
గణనీయంగా తగ్గింది
గురువుల‌ అవసరాలు 
కనుమరుగవుతోంది
గురువుచే పొందని 
జ్ఞానం గుప్పెడు మెతుకులివ్వొచ్చు
గురువు ప్రబోధమునొంది 
మెతుకుల పరమార్ధం
తెలియవచ్చు

విశ్వవేదికలపై సనాతన 
ధర్మాన్ని వెలుగెత్తిన చాటిన
నరేంద్రుని అగుడుజాడలు 
అవసరమే అగత్యమే
పరమహంస రామకృష్ణ 
మదిమెచ్చిన శిష్యరికం
తర తరాలకు 
స్ఫూర్తి దాయకం ఆదర్శనీయం
☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘
*స్వామి వివేకానంద జయంతి*
శుభాకాంక్షలతో 🙏🙏🙏

*🌼☘సందేహాలు -- సమాధానాలు🌼☘*

🍥ప్రశ్న:
నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి??

*🌼జవాబు:*
*FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.*
********
🍥ప్రశ్న:
డైస్ నాన్ కాలం అంటే ఏమిటి??

*🌼జవాబు:*
*FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.*
*FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.*
*******
🍥ప్రశ్న:
అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా??

*🌼జవాబు:*
*టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.*
*కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహి0సలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.*
******
🍥ప్రశ్న:
నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి  తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా??

*🌼జవాబు:*
*చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.*
*******
🍥ప్రశ్న:
EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా??

*🌼జవాబు:*
*EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.*
*కానీ వ్యక్తిగత కారణాల తో eol ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా eol కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.*
*******
🍥ప్రశ్న:
నేను HM గా పనిచేస్తున్నాను.అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.పరిస్థితి ఏమిటి??

*🌼జవాబు:*
*FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది.కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు.ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి.SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.*
*******
🍥ప్రశ్న:
నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..???

*🌼జవాబు:*
*మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.*

No comments:

Post a Comment