AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 5 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 15 2018


*💐మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు💐*

*🌍చరిత్రలో ఈ రోజు జనవరి 15⃣

*🔍సంఘటనలు🔍*

🔖1943: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం 'ద పెంటగాన్‌' (అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) నిర్మాణం పూర్తయింది.

🔖భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు (కె.ఎం.కరియప్ప) ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం.

🔖1966: భారత వాయుసేన (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్) కు సైన్యంతో సమాన హోదా లభించింది.

🔖1967: భానుప్రియ, తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు

🔖1970: బోయింగ్ 747 విడుదలయ్యింది

💐1988: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో భారత లెగ్‌స్పిన్నర్‌ నరేంద్ర హిర్వాణి తానాడిన తొలిటెస్టులోనే 16వికెట్లు (16/136, 8/61 మరియు 8-75) తీసుకొని రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ ఛేదించలేదు.

🔖2001: జిమ్మీ వేల్స్‌, లారీ సాంగర్‌లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు.

🔖2008: స్టీవ్ జాబ్స్ మ్యాక్‌బుక్ ఎయిర్ని విడుదల చేసారు

*🎂జననాలు💐*
=======================

💐1887: త్రిపురనేని రామస్వామి, ప్రముఖ సంఘసంస్కర్త. (మ.1943)

💐1915: చాగంటి సోమయాజులు, ఈయన రాసిన చాలా కథలు హింది, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళ, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. (మ.1994)

💐1921: బాబాసాహెబ్ భోసలే, భారత దేశము, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

💐1929: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు,

💐1934: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)

💐1952: జనువాడ రామస్వామి, హృదయాలను సూటిగా తాకే శిల్ప విన్యాసంతో వచన కవితలు రచించే కొద్దిమంది కవులలో ఒకరు, పుస్తకాలు మస్తిష్కానికి పదునుపెట్టే ఆకురాళ్లు’ అని చెప్పిన వ్యక్తి

💐1956: మాయావతి, రాజకీయవేత్తి, భారత దేశము

💐1960: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు మరియు చిత్రలేఖనోపాధ్యాయుడు. (మ.2017)

💐1960: తిలక్ రాజ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు

💐1966: శైలజామిత్ర, తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివింది. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసింది, వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించింది.

*🍂మరణాలు🍂*

🌷1940: వాడుక భాష ఉద్యమ పిత, గిడుగు రామమూర్తి

🌷1941: న్యాపతి సుబ్బారావు, స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు [జననము. 1856]

🌷1998: పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా. [జ.1898]

🌷2012: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (జ.1913)

◆జాతీయ దినాలు◆

📌వరల్డ్ రిలిజియన్ దినోత్సవం, 

📌సైనిక దినోత్సవం.
@@@@@@@$$
*విశ్వంలో ఓ చిన్న మాట*

*రెక్కలు వచ్చాక ఎగరటం తప్పుకాదు*

కానీ 

*ఆ రెక్కలకు జీవం పోసిన వారిని వదిలేసి ఎగిరిపోవటం పెద్దతప్పు*
@@@@@@@
*🔥కంప్యూటర్🔥*

*♦దేశంలో అతివేగవంతమైన మొదటి మల్టి- పెటాఫ్లాప్స్ (పీఎఫ్) సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్‌ను పుణెలోని ఐఐటీఎంలో ప్రారంభించారు. ప్రత్యూష్ అంటే సూర్యుడు అని అర్థం. ఈ కంప్యూటర్ ద్వారా దేశంలోని వాతావరణ విషయాలను, తుఫాన్లు, వాయుగుండాలను ముందుగానే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రుతుపవనాలను, వాతావరణంలో చోటుచేసుకొనే అనూహ్య వాతావరణ మార్పులను, తుఫాన్లు, సునామీ, భూకంపాలను, గాలి నాణ్యతను, కాంతి, సముద్ర పరిస్థితులను, వరదలు, కరువు తదితరాలను గతం కంటే వేగంగా, కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు.*

*🔥ప్రత్యూష్ ప్రత్యేకతలు🔥*

*🔹వాతావరణ పరిశోధనలకు వినియోగించే కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెటాఫ్లాప్స్ (పీఎఫ్ - ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్)లో కొలుస్తారు. ప్రస్తుతం దేశంలో 1.0 పీఎఫ్ సామర్థ్యం మాత్రమే ఉంది.*

*🔹-ప్రత్యూష్ అనే సూపర్‌కంప్యూటర్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్‌సైన్సెస్ పరిధిలో ఏర్పాటుచేశారు. దీని సామర్థ్యం 6.8 పీఎఫ్. ఒకటి పుణెలో, రెండోది ప్రత్యూష్‌తో పుణెలోని ఐఐటీఎం సామర్థ్యం 4.0 పీఎఫ్, నోయిడాలోని ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్‌లో 2.8 పీఎఫ్ సామర్థ్యం ఉంటుంది.జి సైదేశ్వర రావు*

*🔹-పెరిగిన సామర్థ్యంతో దేశంలో వాతావరణ పరిశోధనల్లో ఉన్న కంప్యూటర్ సామర్థ్యం 6.8 పీఎఫ్‌కు చేరనుంది.*

*🔹ప్రపంచంలో మనకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న దేశాల్లో యూకే, జపాన్, యూఎస్ ఉన్నాయి. దీంతో భారత్ నాల్గో స్థానానికి చేరుకున్నది. ఇప్పటివరకు 7వ స్థానంలో ఉండేది.*

*♦ప్రత్యేకతలు:*

*🔹-8,600 కంప్యూటర్లకు ఉన్నంత స్టోరేజీ సామర్థ్యం, 25,000 పర్సనల్ కంప్యూటర్లకు ఎంత ర్యామ్ అవసరమో అంత ర్యామ్ ప్రత్యూష్ సూపర్ కంప్యూటర్‌లో ఉంది.*

*🔹-దీనిలో అత్యాధునిక ఇంటెల్ గ్జెనాన్ ప్రాసెసర్లను ఇందులో వినియోగించారు. ప్రత్యూష్‌పై కేంద్రం రూ. 450 కోట్లు వెచ్చించింది.*

*🔹-ఈ సూపర్ కంప్యూటర్‌తో దేశంలోని వాతావరణ పరిస్థితుల అంచనాలో పెనుమార్పులు రానున్నాయి. సూర్యకాంతి, వేడి, వాతావరణంలో తేమశాతం, సముద్రాల్లో మార్పులు, రుతుపవనాలు తదితర అంశాలను వేగంగా కచ్చితంగా తెలుసుకొనే అవకాశం ఏర్పడనున్నది.*
@@@@@@@@
కరెంట్ అఫైర్స్

1)ఆగ్నేయ ఆసియా దేశాల సమైక్య బారత మొట్టమొదటి సంగీత ఉత్సవం ఎక్కడ జరిగింది?
*న్యూఢిల్లీలోని పురనా  ఖీలా*

2)మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు?
*2014 అక్టోబర్ 2*

3)స్వచ్ఛ దర్పం లో మొదటి స్థానం పొందిన జిల్లా ఏది?
*జగిత్యాల*

4)జాతీయ పట్టణ ప్రాంత జీవనోపాధి కల్పనలో మొదటి రెండు స్థానాలు పొందిన రాష్ట్రాలు ఏవి?
*Jharkhand ,తెలంగాణ*

5)ఎవరి జయంతిని సెప్టెంబరు 27న తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు?
*కొండా లక్ష్మణ్ బాపూజీ*

6)Ayush ఆసుపత్రిని ఎక్కడ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినది?
*అనంతగిరి*

7) తెలంగాణ లో తొలిసారిగా ఆ తరహా పరిశ్రమల పార్కును ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు?
*యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్*

8) మనదేశంలో అత్యుత్తమ స్వచ్ఛ స్థలంగా గుర్తింపు పొందిన ప్రాంతం ఏది?
*శ్రీ మీనాక్షి దేవాలయం తమిళనాడు*

9 ) దేశంలోనే తొలి ఎలక్ట్రికల్ బస్సును ఎక్కడ ప్రారంభించారు?
*హిమాచల్ ప్రదేశ్*

10) భారతదేశంలో సొంతగా రేబిస్ టీకాను తయారుచేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?
*కేరళ*

*******

కరెంట్ అఫైర్స్

1)OBC వర్గీకరణ కమిషన్ చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
*జస్టిస్ జి.రోహిణి*

2) తమిళనాడు ప్రస్తుత గవర్నర్ బన్వారి లాల్ పురోహిత్ అంతకుముందు ఏ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు?
*అస్సాం*

3) అస్సామ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు?
*జగదీష్ ముఖిని*

4) ప్రపంచంలో గంటకు 350 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది దాని పేరు ఏమిటి?
*పూక్సింగ్*

5) బీహార్ గవర్నర్ గా వున్న సత్యపాల్ మాలిక్ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత?
*బీజేపీ*

6) sbi నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
*రజనీష్ కుమార్*

7) భేటీ బచావో బేటి పడావో తెలంగాణ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు?
*రకుల్ ప్రీత్ సింగ్*

8) ఫోర్బ్ భారత ధనవంతుల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు?
*ముఖేష్ అంబానీ*

9) అంగారకుడి కక్ష్యలో మంగళయాన్ చేరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
*3*

10)FTII నూతన చైర్మన్ గాఎవరు నియమితులయ్యారు?
*అనుపమ్ ఖేర్*

********

*✍42వ రాజ్యాంగ సవరణ*

*✧ప్రవేశికకు చేసిన ఏకైక సవరణ: కేశవా నంద భారతి కేసు నేపథ్యంలో స్వరణ్‌సింగ్  కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలను చేర్చారు.*

*̀ㅁసామ్యవాదం అంటే సమసమాజ స్థాపన నిర్మించే ప్రక్రియ. సామ్యవాద విధానంలో ఉత్పత్తి శక్తులను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.*

*ㅁసమాజంలో పేరుకుపోయిన ఆర్థిక అసమా నతలను తగ్గిస్తూ సమసమాజ నిర్మాణానికి తోడ్పడే విధానం.*

*ㅁ లౌకిక రాజ్యం: అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ, ఏ మతాన్నీ అధికార మతంగా గుర్తించని రాజ్యం. ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది.*

*ㅁఐక్యత,సమగ్రత: ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందించి వారిలో ఐక్యతకు దోహదపడడం.*

*ㅁఅందుకే, సామ్యవాద సాధనకై 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు,1951లో భూ సంస్కరణల చట్టం రూపకల్పన, 1969లో 14 బ్యాంకుల జాతీయీకరణ, 1971లో రాజభరణాల రద్దు,1975లో 20 సూత్రాల  పథకం,1978లో ఆస్తి హక్కు తొలగింపు, 1980లో ఆరు బ్యాంకుల జాతీయీకరణ మొదలైనవి చేపట్టారు.*

*̀✧రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా? కాదా? అనే అంశంపై రాజ్యాంగంలో స్పష్టత లేదు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు 1960 బెరుబారి యూనియన్ కేసులో అంతర్భాగం కాదని తీర్పుని చ్చింది. 1973 కేశవానంద భారతి కేసులో, 1980 మినర్వా మిల్స్ కేసు లో అంతర్భాగమని తీర్పునిచ్చింది.*

*✧ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సురేష్ కట్టా న్యాయస్థానాలకు ఉన్న న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించింది. మొరార్జీ దేశా య్ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పునరుద్ధరించింది.*

*✍42వ సవరణ చట్టం (1976)*

*✽ ప్రవేశికను సవరించి సామ్యవాద, లౌకిక, సమానత అనే పదాలను చేర్చారు.*

*✽ రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారు.*

*✽ హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.*

*✽ లోక్‌సభ, శాసనసభ సభ్యుల పదవీకాలా న్ని ఆరేళ్లకు పెంచారు.*

*✽ నూతనంగా కింది ఆదేశక సూత్రాలను తెచ్చారు.అవి:*
1)సమాన న్యాయం, ఉచిత న్యాయ సలహాలు 39(ఎ)
2)యజమాన్యంలో శ్రామికులకు భాగస్వామ్యం కల్పించడం43(ఎ)
3)పర్యావరణ,వన్య ప్రాణుల సంరక్షణ 48(ఎ)
4)బాలల నిర్మాణం లో రాజ్యనిర్మాణ పాత్ర.

*✽ ప్రాధమిక విధులను 4(ఎ)భాగంలో 51(ఎ) ప్రకరణ లో చేర్చారు*

*✽ ప్రకరణలు 323(ఎ),323(బి)చేర్చి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేశారు*

*✽ ప్రకరణ74(1)ను సవరించి,రాష్ట్రపతి క్యాబినెట్ సలహా ను తప్పక పాటించాలి.*

*✽ రాష్ట్రపతి పాలనను 6నెలల నుండి 1సం"నికి పెంచారు.*

*✽ కోరం విధానాన్ని తొలిగించారు.*

*✽ 2001వరకు, MLA & MP పెంచకుండా చేసారు.*

*✽ అత్యవసర పరిస్థితి ప్రకరణ 352ను సవరించి ఏ ప్రాంతానికయిన విధించేలా చేసారు*

*✽ ప్రకరణ 368 కింద పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణను ఏ న్యాయ స్థానం ప్రశ్నించరాదు.*

*✧ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 అధికరణలు 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. ప్రస్తుతం 465 అధికరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.*

No comments:

Post a Comment