AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 7 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 19 2018


*🌎చరిత్రలో ఈ రోజు/జనవరి 19*🌎

*⏱సంఘటనలు⏱*

* *♦1793: ప్రెంచి దేశపు రాజు లూయిస్-16 (Louis XVI) కు మరణ దండన విధించాలని తీర్మానించారు*

*♦1942: బర్మా పై జపాన్ సేనల దాడి*

*♦1966: ఇందిరా గాంధీ భారతదేశానికి మూడవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు*

*♦1983: గ్రాఫికల్యూజర్‌ఇంటర్‌ఫేస్‌ నూమౌస్‌నూకలిగి ఉన్న తొలి పర్సనల్‌ కంప్యూటర్ 'ఆపిల్‌ లిసా'ను ఆపిల్‌ కంప్యూటర్స్ సంస్థ విడుదల చేసింది.*

*♦1883 : ప్రప్రథమంగా పైనుండి తీగలు గల విద్యుత్ వ్యవస్థ థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా తయారు చేయబడి రోసెల్లీ, న్యూజెర్సీలో ప్రారంభించబడింది.*

*♦1975 :హిమాచల్ ప్రదేశ్లో భయంకర భూకంపం.*

*♦2006 : NASA ద్వారా ప్లూటో గ్రహం పైకి "New Horizons probe" మొట్టమొదట ప్రయోగింపబడింది*.

*♦2012 : మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది*

*❣జననాలు*❣

*🌷1736 : ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం. (d. 1819)*

*🌷1904: బెహరా కమలమ్మ, 'కమల' అను నామధేయంతో పిలవబడి, తమ ఆరాధ్య దేవత అయిన "తనుమధ్యాంబ"*

*🌷1918: వావిలాల సోమయాజులు, తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు*

*🌷1920: బాలాంత్రపు రజనీకాంత రావు, బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు*

*🌷1920: ఐక్యరాజ్య సమితిమాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్జననం*

*🌷1954: సి.హెచ్.మోహనరావు, రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు*

*🌷1946 : అమెరికా గాయని, పాటల రచయిత, రచయిత, బహుళ పరికరాల వాద్యకారిణి, నటి మరియు దాత డాలీ పార్టన్ జననం.*

*🌷1965: జీవా, ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు*

*🌷1597: ఉదయపూర్ రాజు రాణా ప్రతాప్ సింగ్*

*🌷1905 : భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్మరణం. (b. 1817)*

*🌷1973: మల్లాది వేంకట కృష్ణశర్మ, పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు.జి సైదేశ్వర రావు*

*🌷1990: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (జ.1931)*

*🌷1995 : కొండూరు వీరరాఘవాచార్యులు ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. (జ.1912)*

*🌷2016: అరూన్ టికేకర్ సీనియర్‌ పాత్రికేయుడు, విద్యావేత్త.*

*🌷2016: యలమంచిలి హనుమంతరావు, ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938)*

*🌷2016: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903)*
🏧🏧🏧🏧🏧🏧
☘☘☘☘☘☘☘☘☘☘☘

        అవసరం తీరిపోయాక నిన్ను
         వదిలి వెళ్ళే స్నేహితులు.....
       సంపద ఉన్నప్పుడే నీతో ఉండే బంధువులు.....
      డబ్బులు ఉన్నప్పుడే మాత్రమే నీతో
         ప్రేమ నటించే  బంధం...
      ఇలాంటి వారితో జీవించే  
                      బదులు 
             అనాధగా జీవించడం మేలు

              మిత్రులందరికి

                  🌸🙏🏻Good morning 🙏🏻🌸

☘☘☘☘☘☘☘☘☘☘☘
______*నవరత్నాలు*__________

*కెంపు ముత్యం పగడం పచ్చ పుష్యరాగం వజ్రం నీలం గోమేధికం వైఢుర్యాలు.*

*కెంపు :*
మానసిక సమస్యలు, హృద్రోగం, కంటి వ్యాధులతో బాధపడేవారు, అధిక వ్యయం పేదరికంతో ఇక్కట్ల పాలవుతున్నవారు ఎరుపు రంగు కెంపు రత్నంతో ఉంగరం చేయించుకొని ఆదివారం రోజు ఉదయం పూట ధరించాలి.

*ముత్యం:*
వివాహ వాంఛితులు, కళల్లో పురోగతి కోరేవారు, కుటుంబ సౌఖ్యాన్ని ఆశిస్తున్నవారు ముత్యం పొదిగిన ఉంగరాన్ని సోమవారంనాడు ధరించాలి.

*పగడం:*
శతృపీడ నివారణ, రాజకీయాలు, వాణిజ్య రంగాల్లో పురోగతి, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల నుంచి ఉపశమనం కోసం పగడపు ఉంగరాన్ని ధరించాలి.

*పచ్చ:*
స్థిర చిత్తం, విద్యలో అభివృద్ధి, వ్యాపార పురోభివృద్ధి, నరాల వ్యాధి నుంచి విముక్తికి బుధవారం రోజున పచ్చ రాయి ఉంగరాన్ని పెట్టుకోవాలి.

*పుష్యరాగం:*
ఆథ్యాత్మిక వికాసం, సూక్ష్మ జ్ఞానం కోసం పుష్యరాగ ఉంగరం ధరించాలి. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారికీ ఇది ఉపశమనాన్ని ఇస్తుంది.

*వజ్రం:*
సంగీత కళలు, మంత్ర శాస్త్రంపై ఆసక్తి గలవారు వజ్రపుటుంగరాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. పాలనాపరమైన వ్యూహరచనలు చేసేవారు, ఇతరులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించేవారికీ వజ్రం ఉపకరిస్తుంది.

*నీలం:*
దారిద్ర్య బాధతో సతమతమవుతున్న వారు నీల రత్నం గల ఉంగరాన్ని ధరించాలి. కీళ్లకు సంబంధించిన సమస్యలున్నవారు ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.

*గోమేధికం:*
చిత్త చాంచల్యం నుంచి బయటపడేందుకు, వ్యాపారాల్లో లాభార్జనకు, శత్రువులను జయించేందుకు గోమేధికం పొదిగిన ఉంగరాన్ని ధరించాలి.

*వైఢుర్యం:*
సంతాన లోపాన్ని అధిగమించేందుకు, విష జంతు బాధ నుంచి విముక్తి పొందేందుకు, కార్య సాఫల్యం కోసం వైఢూర్యం గల ఉంగరాన్ని పెట్టుకోవాలి.
⛪🏧🏧🏧🏧🏧
🔲 సూక్తులు

▪దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.

▪దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.

▪దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.

▪ద్వేషం కంటే కూడా ప్రేమ అన్నది చాలా శక్తివంతమైనది.

▪ద్వేషాన్ని పోషించే వారిని ద్వేషం హతం చేస్తుంది.

▪ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.
🏧🏧🏧🏧🏧🏧
*🍁🌼పింఛను పథకం ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.🌼🍁*

జాతీయ పింఛను పథకం ఖాతాదారులకు శుభవార్త. ఈ ఖాతాదారులు తాము జమ చేసిన నగదులో కొంత మొత్తాన్ని ఇకపై మూడేళ్ల తర్వాతే తీసుకునేలా నిబంధనలను సవరించారు. 

ఈ మేరకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) ఓ నోటీసులో పేర్కొంది. 

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఖాతాదారులు 10ఏళ్లు పూర్తయిన తర్వాతే తమ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. 

అయితే ఈ నిబంధనలను మూడేళ్లకు సవరించారు. మూడేళ్లు పూర్తయిన తర్వాత తమ డబ్బును తీసుకోవచ్చు. 

అయితే అది 25శాతం మాత్రమే. అంతకంటే మించి తీసుకోడానికి వీలుండదు.

పిల్లల చదువు, వివాహాలు, ఇంటి నిర్మాణాలు, కేన్సర్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌, అవయవాల మార్పిడి వంటి అత్యవసర అవసరాలకు మాత్రమే ఈ డబ్బును తీసుకోడానికి వీలుంటుంది. 

‘అంతకు ముందు పాక్షిక విత్‌డ్రాలను పదేళ్ల తర్వాతే అనుమతించేవాళ్లం. అయితే ఆ సమయాన్ని తగ్గించాలని ఖాతాదారుల నుంచి డిమాండ్లు రావడంతో మూడేళ్లకు తగ్గించాం. 

అయితే కొన్ని అత్యవసర అవసరాలకు మాత్రమే ఈ పాక్షిక విత్‌డ్రాలు చేసుకోవాలి’ అని పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్మన్‌ హేమంత్‌ సూచించారు. 

ప్రజల అవసరార్థం ఇటీవల ఈ పథకంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. 2015-16 బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకంపై రూ.50వేల వరకు అదనపు ట్యాక్స్‌ బెనిఫిట్‌ కల్పించింది. 

అంతేగాక.. ఖాతాదారుల గరిష్ఠ వయసును కూడా 60ఏళ్ల నుంచి 65ఏళ్లకు పెంచింది.
🏧🏧🏧🏧🏧🏧
 *🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*♦మంచి మాట*♦
               
*"నిన్ను విమర్శించిన ప్రతివాడు నీ వ్యతిరేఖ వర్గమే అనుకుంటే నువ్వు మూర్ఖుడివి. ప్రతి విమర్శలో మూడో కోణం కూడా ఉంటుందని ఆలోచించగలిగితే నువ్వు ఆలోచనాపరుడివి."*

*"A successful individual typically sets his next goal somewhat but not too much above his last achievement."*

 *🌷మంచి పద్యం*🌷

*నీరులేక యున్న నిలువవు ప్రాణాలు*
*నీటి వలన పెరిగె నేటి నరుడు*
*నీటి కొరకు జరుగు నిజముగ యుద్ధాలు*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:* 

*ఓ వేము ! నీరే సర్వాధారము. నీటి వల్లనే నాగరికత పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ నీటి కోసమే యుద్ధాలు తప్పనిసరి పరిస్థితి.*

  *♦నేటి జీ కె♦*

*ప్రముఖుల సమాధులు(ఘాట్) లు*

 *జవహర్లాల్ నెహ్రూ _శాంతి వనం*

 *ఇందిరాగాంధీ  _శక్తిస్థల్*

 *రాజీవ్ గాంధీ  _వీరభూమి*

 *మహాత్మా గాంధీ  _రాజ్ ఘాట్*

 *చరణ్ సింగ్  _కిసాన్ ఘాట్*

 *మొరార్జీ దేశాయ్ _అభయ్ ఘాట్*

 *అంబేద్కర్  _చైత్ర భూమి*

 *జైల్ సింగ్  _ఏక్తాస్థల్*

 *బాబు జగ్జీవన్ రామ్ _సమతాస్తల్*

 *లాల్బహదూర్ శాస్తి  _విజయ్ ఘాట్*

 *కృష్ణకాంత్  _నిగంబోది ఘాట్*

 *గుల్జారీలాల్ నందా  _నారాయణ్ ఘాట్*

 *దేవిలాల్  _సంఘర్ష్ స్థల్*

 *ఎన్టీఆర్  _బుద్దపూర్ణిమ*

 *పి.వి.నరసింహారావు _జ్ఞానభూమి*
🏧🏧🏧🏧🏧🏧
*✍నేటి మన టీ వి క్లాస్సెస్*

*తేదీ*:-- *19--01--2018* 
*శుక్ర వారము*

*********************************

*తరగతి*:- *10 వ*

*సబ్జెక్టు*:- *ఇంగ్లీష్*

*విషయం:-* *డిస్కోర్స్ అండ్ బయోగ్రఫీ ప్రొపైల్*

*సమయం*:- *10.30 ని,,ల నుండి*

          ★★★★★★★

*తరగతి*:- *9 వ*

*సబ్జెక్టు*:- *ఇంగ్లీష్*

*విషయం*:-  *ద ట్రైల్ - II*

*సమయం*:- *11.30ని,,

          ★★★★★★★

*తరగతి*:- *8 వ*

*సబ్జెక్టు*:- *జీవశాస్త్రం*

*విషయం*:- *గాలి కాలుష్యం - II*

*సమయం*:- *2.00pm

          ★★★★★★★

*తరగతి*:- *7 వ*

*సబ్జెక్టు*:- *గణితం*

*విషయం*:- *క్వాడ్రిలేటరలు — I* 

*సమయం*:- *2.45 pm 

          ★★★★★★★

*తరగతి*:- *6 వ*

*సబ్జెక్టు*: *సామాన్యశాస్త్రం*

*విషయం*:- *నేల మన జీవనము - II*

*సమయం*:- *3.40 pm
          ★★★★★★★
🏧🏧🏧🏧🏧🏧
*✍ఫిబ్రవరి 28న సైన్స్ టీచర్ల సదస్సు*

*❇ రాష్ట్రంలోని సైన్స్ టీచర్లతో వచ్చే నెల 28న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నామని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్ పాఠాలు మరింత ప్రభావవంతంగా బోధించడానికి ఉపయోగపడే విధంగా సదస్సును నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
 *_✍రాజ్‌భవన్ స్కూల్ టీచర్ల సామూహిక సెలవులు.._*

*❇ఖైరతాబాద్ : తల్లిదండ్రులు, విద్యార్థుల ఎదుట ఉపాధ్యాయులను అవమానపర్చిన కలెక్టర్ వైఖరికి-నిరసనగా నేటి నుంచి రాజ్‌భవన్ పాఠశాల ఉపాధ్యాయులు నిరవదిక క్యాజువల్ లీవ్‌లు పెడుతున్నారని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.*

 *❇గురువారం సాయంత్రం రాజ్‌భవన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. సంజీవ రావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వహదుల్లా హుస్సేనీ, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు నర్సింహం, వీరాచారి, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రావు, జిల్లా అధ్యక్షుడు రవీందర్‌లు మాట్లాడుతూ రాజ్‌భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అవమానకరంగా మాట్లాడరని, తల్లిదండ్రులు, విద్యార్థులు అనడంతో తాము తీవ్రంగా బాధపడ్డామని తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
🙏         _*శుభోదయం*_    🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" భయం తలుపు తట్టినపుడు ఆత్మ విశ్వాసం తలుపు తీయాలి. అపుడు భయం జడుసుకుని పారిపోతుంది. "

           _*-మార్టిన్ లూథర్ కింగ్*_
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" అన్ని బాధలు కొంతకాలందాకే!
మరొక కష్టమో, బాధనో వచ్చేదాకే!
ప్రతి కష్టం నుండి ఓ అనుభవాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగిపో!

         💦🐬🐥🐳💦

No comments:

Post a Comment